
గజపతిలో అధికారుల పర్యటన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కేంద్ర పౌరసరఫరాలు, క్యాంప్ సంక్షేమ సంచాలకులు సునీల్ సచ్‌దేవ్, జాతీయ ఆహార భద్రత చట్ట కేంద్రీయ ప్రాజెక్టుల మానిటరింగ్ అధికారి సచిన్ కుమార్, ఆకాంక్ష బ్లాకులు గుమ్మా, ఆర్.ఉదయగిరిలో బుధవారం పర్యటించారు. వారితో సబ్ కలెక్టర్ అనుప్ పండా, అదనపు జిల్లా పౌరసరఫరాల అధికారిని స్నేహాసినీ బెహరా, ఆర్.ఉదయగిరి బీడీఓ. నారీమన్ ఖర్సల్, తాహాసిల్దార్లు వున్నారు. ఆకాంక్ష మండళాలు ఆర్.ఉదయగిరి, గుమ్మా సమితుల్లో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలను వారు సమీక్షించారు. కేంద్ర పౌరసరఫరాలు, సంక్షేమ శాఖ డైరక్టర్ సునీల్ సచ్‌దేవ్, సచిన్ కుమార్ తొలుత ఆర్.ఉదయగిరి బ్లాక్ అబార్ సింగి, శవరపల్లి గ్రామపంచాయతీలలో పథకాలను లబ్ధిదారులకు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. గుమ్మా బ్లాక్‌లో రాగిడి, తరబ పంచాయతీల్లో అమలు జరుగుతున్న కేంద్ర పథకాలు రేషన్ డిపోల వద్దకు వెళ్లి పి.డి.ఎస్.బియ్యం నాణ్యతను తనిఖీలు చేశారు. అనంతరం పర్లాకిమిడిలో ఆర్.ఉదయగిరి ప్రాంతీయ నియంత్రణ బజార్ కమిటీ గోడౌన్‌లో బియ్యం స్టోరేజీ, రేషన్ బియ్యం బస్తాల స్టాక్‌ను తనిఖీలు చేపట్టారు. తర్వాత కలెక్టరేట్‌కు చేరుకుని పాలనాధికారి బిజయకుమార్ దాస్‌తో ఇద్దరు కేంద్ర అధికారులు కలిసి పర్యటన విశేషాలను మాట్లాడారు. గజపతి జిల్లాలో ప్రాథమిక విధ్య, ఆరోగ్యం, పౌరసరఫరాలు, జనవనరులు మౌలిక సమస్యలపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రజలకు అందాల్సిన పీఎం జనమణ యోజనా పథకం, మన్‌రేగా, స్వచ్ఛభారత్ అభియాన్, ప్యాక్ప్ గుమ్మా, కేంద్ర ఆయుష్మాన్ భారత్ పథకాలు అమలుపై చర్చించారు. తిరిగి ఇద్దరు కేంద్ర అధికారులు భుభనేశ్వర్ పయనమయ్యారు.

గజపతిలో అధికారుల పర్యటన

గజపతిలో అధికారుల పర్యటన

గజపతిలో అధికారుల పర్యటన