
రాష్ట్ర పర్యటనలో అస్సోం అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్
భువనేశ్వర్: అస్సోం అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ సభ్యులు రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఈ బృందం రాష్ట్ర శాసన సభ స్పీకర్ సురమా పాఽఢిని కలిశారు. రామేంద్ర నారాయణ్ కలిత ఆధ్వర్యంలో విచ్చేసిన అస్సోం ప్రతినిధి బృందానికి రాష్ట్ర శాసన సభ పనితీరు, రాష్ట్ర అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ యొక్క వివిధ కార్యకలాపాలను చైర్మన్ పద్మలోచన పండా, ఇతర సభ్యులు వివరించారు. అలాగే అస్సోంలో ఈ కమిటి కార్యకలాపాల్ని తెలుసుకున్నారు. సమగ్రంగా ఉభయ వర్గాల మధ్య సంతృప్తికర చర్చలు కొనసాగాయి. రాష్ట్రంలో 4 ఫైనాన్స్ కమిటీలు, అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిటీతో సహా 10 సలహా కమిటీలు, 12 శాసన సభ కమిటీలతో పలు తాత్కాలిక కమిటీలు ఒడిశా అసెంబ్లీలో చురుగ్గా పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసన సభ కార్యదర్శి సత్యబ్రత్ రౌత్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.