శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
రథాల విడి భాగాల విక్రయానికి..
మత్స్యజీవి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని సంస్కృతి అపురూపం. భగవంతుడు ఆశీనుడైన రథం తాడు తాకిన జన్మ చరితార్థం అవుతుందని విశ్వసిస్తారు. యాత్ర సమయంలో రథం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో యాత్ర తర్వాత అంత కంటే అధికంగా ప్రాధాన్యత కూడగట్టుకోవడం విశేషం. ఔత్సాహిక భక్తులు రథాల విడి భాగాల్ని కొనుగోలు చేసి నిర్ధారిత ప్రాంగణాల్లో అత్యంత పవిత్రంగా పదిలపరుస్తారు. నిత్యం ఈ విడి భాగాలకు నియమ నిష్టలతో పూజలు నిర్వహిస్తారు. శ్రీ మందిరం పాలక వర్గం (ఎస్‌జేటీఏ) వార్షిక రథ యాత్రలో వినియోగించిన రథాల విడి భాగాలు విక్రయించేందుకు తాజా ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) జారీ చేసింది. ఈ నేపథ్యంలో రథాల విడి భాగాల సవరించిన ధరల జాబితాను విడుదల చేసింది. విడి భాగాల్లో రథ చక్రాలకు విశేష ఆదరణ ఉంటుంది. ప్రధానంగా శ్రీ జగన్నాథ స్వామి నంది ఘోష్ రథం చక్రాలపై భక్తులు అధికంగా మక్కువ కనబరుస్తారు. తాజా ఎస్‌ఓపీ ప్రకారం శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథ చక్రం ధర ఒక్కొక్కటి రూ. 3 లక్షలుగా నిర్ధారించారు. బలభద్రుని తాళ ధ్వజం ఒక్కో చక్రం ధర రూ. 2 లక్షలు, సుభద్ర దేవి దర్ప దళనం ఒక్కో చక్రం ధర రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు.
రథాలపై విడి భాగాలకు ధరలు నిర్ధారించారు. వాటిలో ఒక్కో ప్రభ ధర రూ. 25,000 కాగా ఇతర విడి భాగాల ధర ఒక్కొక్కటి రూ.15,000గా ప్రకటించారు. మూడు రథాల పూర్తి రథ చక్రాల సెట్‌ను కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 6 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.
సకాలంలో దాఖలు చేయాలి
ఆసక్తి గల రథాల విడి భాగాల కొనుగోలుదారులు ఈ ఏడాది సెప్టెంబర్ నెల 15 లోపు ఆలయ పాలక వర్గానికి (ఎస్‌జేటీఏ) దరఖాస్తు దాఖలు చేయాలి. దానితో పాటు రూ.1,000 దరఖాస్తు రుసుం చెల్లించాలి. తాజా నిబంధనల మేరకు కొనుగోలు కోసం ఎంపికై న దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం చేరదీస్తారు. ఈ సమాచారం అందిన ఒక వారం లోపు పూర్తి మొత్తాన్ని సూచించిన ఖాతాలో జమ చేయాలి. నిర్ణీత సమయంలోపు ఎంపికై న దరఖాస్తుదారుడు మొత్తాన్ని డిపాజిట్ చేయలేని పరిస్థితుల్లో తదుపరి అర్హత కలిగిన దరఖాస్తుదారుని పరిగణనలోకి తీసుకుని కొనుగోలు అవకాశం కల్పిస్తారు. ఈ వ్యవహారంలో పాదర్శకతకు పెద్ద పీట వేస్తున్నట్లు పాలక వర్గం ప్రకటించింది.
సాధారణంగా స్టార్ హోటళ్లు, కార్పొరేటు ఆస్పత్రులు, విమానాశ్రయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పేరొందిన వర్గాలు, మఠాలు, ప్రముఖ దేవస్థానాలు పూరీ శ్రీ జగన్నాథుని రథం విడి భాగాల్ని ఉత్సాహంతో కొనుగోలు చేసి ఆలయ పాలక వర్గం నిబంధనలకు కట్టుబడి ఉంటామని వాంగ్మూలం ముందస్తుగా దాఖలు చేయాల్సి ఉంది. స్వామి వినియోగించిన ప్రతి సామగ్రి, వస్తువు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ క్రమంలో రథాల విడి భాగాలు కొనుగోలు చేసిన వర్గాలు నిర్ధారిత స్థలంలో అత్యంత పవిత్రంగా పదిలపరచి నిత్యం ధూపదీపారాధన నిర్వహించాల్సి ఉంటుంది.
న్యూస్‌రీల్
సర్వం సిద్ధం
సర్వం సిద్ధం
సర్వం సిద్ధం