
దయితరిదాస్ బాబా కన్నుమూత
కొరాపుట్: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో వేలాది అలేఖ్ మతస్తుల గురువు దయితరి దాస్ బాబా (80) తుదిశ్వాస విడిచారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి దండాముండా గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఘరియాబంద్ జిల్లా ఉర్మల్ అటవీ ప్రాంతంలోని ఆశ్రమంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఒడిశాలోని కలహండి, నబరంగ్‌పూర్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఛత్తీస్‌గఢ్ తరలివెళ్లారు. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు వ్యసనాలు వదిలి ఆధ్యాత్మిక భావజాలంలోకి అడుగు పెట్టడానికి బాబా ఎంతగానో కృషి చేశారు. అంతిమ యాత్రకు నబరంగ్‌పూర్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి తదితరులు హాజరయ్యారు.

దయితరిదాస్ బాబా కన్నుమూత