
బైక్‌ల చోరీకి పాల్పడిన నిందితుల అరెస్టు
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లను అపహరించిన ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వన్‌టౌన్‌లో ఎస్పీ వకుల్ జిందల్ విలేకరుల ముందు ఇద్దరు నిందితులను ప్రవేశ పెట్టారు.ఈ కేసుకు సంబంధించి ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ విజయనగరంలోని వీటీ అగ్రహారం బీసీ కాలనీకి చెందిన ఉప్పడాల రాము అలియాస్ డీజే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ముద్దాడపేటకు చెందిన ముద్దాడ నవీన్ అలియాస్ టైసన్ (19)తో కలిసి 11రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్స్, 2 యమహా మోటార్ సైకిళ్లను మారుతాళాలతో దొంగిలించారన్నారు. తరచూ విజయనగరం వన్ టౌన్, టూటౌన్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్స్ చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని వాటికి కారకులైన నిందితులను అరెస్టు చేసేందుకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు బైక్ దొంగతనాలపై తన సిబ్బందితో నిఘా పెట్టారన్నారు. ఈ క్రమంలోనే వీటీ అగ్రహారం బీసీ కాలనీలో నివాసం ఉంటున్న (ఎ1) ఉప్పడాల రాము అలియాస్ డీజేను అరెస్టు చేశామని తెలిపారు. గతంలో కూడా ఉప్పడాల రాము అలియాస్ డీజేపై బైక్ చోరీలకు పాల్పడినట్లు పలు కేసులున్నాయన్నారు. నిందితుడు రాము ఇటీవల జైలు నుంచి విడుదలైన తరువాత మళ్లీ బైక్ చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. ఎ1 ఉప్పడాల రాము నుంచి 7 మోటార్ సైకిల్స్‌ను, ఎ2 ముద్దాడ నవీన్ నుంచి 6 మోటార్ సైకిళ్లు రికవరీ చేశామని చెప్పారు. రికవరీ చేసిన బైక్‌లను కోర్టు ఆదేశాలతో బాధితులకు తిరిగి అందించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ ఈ సందర్భగా స్పష్టం చేశారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆధ్వర్యంలో పని చేసిన వన్ టౌన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు, హెచ్‌సీ ఎ.రమణారావు, కానిస్టేబుల్స్ ఎన్.గౌరీశంకర్, పి.శివశంకర్, టి.శ్రీనివాస్, పి.మంజులను ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.