
వివాహిత అనుమానాస్పద మృతి
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి చంచారగుడ గ్రామంలో అను బ్రెకబడక (23) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు ఇది హత్యేనంటూ బిసంకటక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి భర్త మకర కడ్రకను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చంచరగుడలో నివాసముంటున్న అను బ్రెకబడక, మకర కడ్రకలు దంపతులు. శుక్రవారం తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చికిత్స కోసం బిసంకటక్ ఆస్పత్రికి తరలించాడు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. కాగా మృతురాలి మెడకు గాయాలు కనిపించడంతో అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఇదిలాఉండగా గత ఐదేళ్ల క్రితం జిల్లాలోని చంద్రపూర్ సమితి కర్డాపంగ గ్రామానికి చెందిన సంతోష్ బ్రెకబడ కూతురుతో చంచారగుడ గ్రామానికి చెందిన మకర కడ్రకతో వివాహం జరిగింది. కొన్నాళ్లు సాఫీగా సాగుతున్న వీరి వైవాహిక జీవితంతో రెండేళ్లుగా తనను భర్త మానసికంగా హింసిస్తున్నట్లు అను తన తల్లిదండ్రులతో చెబుతుండేది. ఈక్రమంతో తన కూతురు మృతి చెందిన సమాచారం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న అనంతరం తన కూతురుది హత్యేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరింగింది.
హత్యేనని కన్నవారి ఆరోపణ
పోలీసులకు ఫిర్యాదు