
జయపూర్ సమితి చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం
కొరాపుట్: జయపూర్ సమితి చైర్మన్ తిలోత్తమ ముదలిపై అవిశ్వాస తీర్మానం కోసం సభ్యులు విజ్ఞప్తి చేశారు. బుధవారం జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం సస్యరెడ్డికి లేఖ అందజేశారు. ప్రస్తుత చైర్మన్‌కి బదులు ఆమె భర్త సమితి కార్యాలయంలో అధికారం చెలాయిస్తున్నారన్నారు. మిగతా సమితి సభ్యులు, సర్పంచ్‌లను పట్టించుకోవడం లేదన్నారు. మూడు సంవత్సరాలుగా ఏ కమిటీని పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వ నిర్మాణాల నిధులు దుర్వినియెగం అవుతున్నాయన్నారు. వాటిపై పర్యవేక్షణ లేదన్నారు. సమితి వైస్ చైర్మన్ గణేష్ ప్రసాద్ పాడీ, 16 మంది సర్పంచ్‌లు, 19 మంది సమితి సభ్యులు సంతకాలు చేసిన లేఖను అందజేశారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుకువెళ్తామని వారికి వివరించారు.