
● మరమ్మతులు ప్రారంభం
రాయగడ: స్థానిక మెయిన్ మార్కెట్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం, రాణిగుడఫారానికి అనుసంధానించే రైల్వే అండర్ గ్రౌండ్ రోడ్డు మరామ్మతు పనులను రైల్వే శాఖ బుధవారం నుంచి ప్రారంభించింది. గత కొద్దిరోజులుగా ఈ మార్గంలో రహదారి పూర్తిగా అధ్వానంగా మారడంతో పాటు అండర్ గ్రౌండ్ కింద గుంతలు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. సమస్యలు వివిధ పత్రికల్లో ప్రచురితమవ్వడంతో రైల్వేశాఖ అధికారులు స్పందించారు. ప్రస్తు తం ఈ మార్గంలో మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఈనెల 28 వరకు పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. దీంతో వాహనాలు ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నాయి. అయితే ఫ్‌లై ఓవర్‌పై వాహన రాకపోకల వలన రద్దీ ఏర్పడింది.