
ప్రభుత్వ కార్యాలయంలో దొంగలు
కొరాపుట్: శుక్రవారం ఉదయం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ పట్టణంలో ప్రభుత్వ తహసీల్దార్ కార్యాలయంలో దొంగతనం జరిగింది. దొంగలు కార్యాలయంలోకి ప్రవేశించి ట్రెజరీ బీరువా పగలు కొట్టడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. వెళ్లేటప్పుడు సీసీ కెమెరా పుటేజీ ఉన్న డీవీఆర్ తీసుకెళ్లిపోయారు. ఈ కార్యాల యం పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఉండడం గమనార్హం.
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి
కొరాపుట్: బైక్ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. శుక్రవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం నుంచి కొసాగుమడ వెళ్లే మార్గంలో బెహరా గుడి వద్ద బైక్ అదుపు తప్పి విద్యు త్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కుసిమి గ్రామానికి చెందిన ఖగుపతి పూజారి (25) అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్ మీద ఉన్న మరో వ్యక్తి రూపు బొత్ర తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రజలు ఈ సమాచారం పోలీ సులకు అందించారు. వెంటనే బాధితుడిని నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శాకంబరిగా..
కొరాపుట్: కన్యకా పరమేశ్వరి అమ్మవారు శుక్రవారం శాకంబరిగా దర్శనమిచ్చారు. శుక్రవా రం జయపూర్ పట్టణంలోని మహారాణీ పేట లో గల వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఏటా ఆషాడ మాసంలో అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూరగాయ లు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే అమ్మవారికి ధాన్యంతో అభిషేకం నిర్వహించారు.
బూరగాంలో కలకలం
టెక్కలి : బూరగాం గ్రామంలో శుక్రవారం కలకలం రేగింది. ఓ ఇంటికీ నిత్యం కొంతమంది యువతీ యువకులు వస్తూ పోతుంటారని, ఓ మహిళ చీకటి వ్యవహారం నిర్వహిస్తోందంటూ స్థానికులు ఇంటికి ఇరువైపులా తాళాలు వేసి నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న ఏఎస్‌ఐ కేశవరావు, సిబ్బంది గ్రామానికి చేరుకుని మహిళతో పాటు ఇంట్లో నిర్బంధించిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, గ్రామస్తులు నిర్బంధించిన వారంతా తనకు తెలిసినవారేనని ఆ మహిళ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కాశీబుగ్గలో ఎస్పీ గ్రీవెన్స్
కాశీబుగ్గ: కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సివిల్, కుటుంబ కలహాలు, ఆస్తి, కొట్లాట, మిస్సింగ్, చీటింగ్ తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించారు.

ప్రభుత్వ కార్యాలయంలో దొంగలు

ప్రభుత్వ కార్యాలయంలో దొంగలు

ప్రభుత్వ కార్యాలయంలో దొంగలు