
నిరసనల ప్రకంపన
భువనేశ్వర్: విద్యార్థి, యువజనం, మహిళలు, విపక్ష వర్గాల ధర్నాలు, నిరసనలతో బాలాసోర్ ప్రకంపిస్తోంది. స్థానిక ఫకీర్ మోహన్ కళాశాలలో చదువుకుంటున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి భువనేశ్వర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో మృత్యు పోరాటం చేస్తోంది. దీనిపై ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్, కాంగ్రెస్ విద్యార్థి, యువజన, మహిళా వర్గాలు నిరవధికంగా నిరసన ప్రదర్శిస్తున్నాయి. నగరంలో ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన ఊరేగింపులు, కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్ దిష్టి బొమ్మలు దహించారు. ఆత్మహత్యాయత్నంపై నిరసనలు తీవ్రమవుతున్నాయి. సోమవారం బిజూ జనతా దళ్, కాంగ్రెస్ నాయకులు బాలాసోర్‌ను సందర్శించారు. బీజేడీ నాయకులు ప్రతాప్ జెనా, బ్యోమకేష్ రాయ్, దేవి త్రిపాఠి, జ్యోతి పాణిగ్రాహి తదితరుల బృందం బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీఐజీకి వినతి పత్రం సమర్పించారు.

నిరసనల ప్రకంపన