ఏదీ భద్రత
ఏదీ ప్రమాదాల నివారణ.. నిరంతర నిఘా..
హైవే రోడ్లపై ఇసుక, కంకర, ఊక, ఆయిల్ మరే ఇతర లోడులైనా ఒరిగిపడిపోయినప్పుడు వాటిని తక్షణమే క్లియర్ చేయాల్సిన బాధ్యత కన్సష్‌నర్లది (రోడ్డు కాంట్రాక్టర్లది). ఒకవేళ వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యి ఆగినా, ప్రమాదాలకు గురై ఎక్కువ సేపు నిలిచినా చుట్టూరా రేడియం స్టిక్కర్లు అంటించాలి. ఆ ప్రదేశంలో సూచీ బారికేడ్లు పెట్టాలి. కన్సస్‌నర్లు బాధ్యత విస్మరిస్తే ఇలాంటి ఒకట్రెండు నిర్లక్ష్యాలను చూసి ఎన్‌హెచ్‌ఐ వారు రెండు నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ మించితే వారిని తొలగిస్తారు.
పబ్లిక్ ఏం చేయాలి..
రోడ్లపై ఇటువంటి దృశ్యాలు కనిపించినప్పుడు 1033 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.
ఎచ్చెర్ల / శ్రీకాకుళం క్రైమ్: రహదారి భద్రత మనందరి బాధ్యత. చక్కటి నినాదం. కానీ భద్రత పాటిస్తున్నదెవరు? అంత బాధ్యతగా మెలుగుతున్నదెవరు. పై వాక్యాలకు నిదర్శనం ఈ చిత్రం. ఎచ్చెర్ల మండలంలోని కొయ్యరాళ్లు జంక్షన్‌లో సర్వీస్ రోడ్‌లోకి ఎంటరయ్యే ప్రదేశం ఇది. చూడండి ఎంత ఇసుక రోడ్డు మీద ఒలిగిపోయిందో.. ఈ ఇసుక కారణంగా గురువారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు చాలా మంది వాహనాలు ఇక్కడ అదుపుతప్పి స్కిడ్ అయ్యాయి కూడా. ఇసుకను తరలించే వాహనదారులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. రహదారి బాధ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు కంట పడలేదో.. పడినా ఫిర్యాదు రాలేదు కదా అని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో.. వాహనదారులకు మాత్రం చుక్కలు కనబడ్డాయి.
ప్రమాదాలకు ఆస్కారమైన.. వాహనాల రాకపోకలు అధికంగా సాగే జాతీయ రహదారిపై నిరంతరం సేవలందించే హైవే పెట్రోల్ సిబ్బంది దృష్టి కూడా ఈ ప్రాంతంపై పడలేదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటూ ప్రమాదాల కట్టడికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పే వీరెవరి కంటినీ శుక్రవారం ఉదయం నుంచి ఈ ఇసుక రేణువు తాకలేదు.
వాహనాల నుంచి ఇసుక జారిపోతున్నా పట్టించుకోని వైనం
జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడే ఇసుక మేటలు
ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఇసుక వాహనాల నిర్వాహకులు
ప్రమాదాలకు ఆలవాలంగా మారిన హైవే కటింగ్ పాయింట్లు
చిత్రం చెప్పిన కథ
ఇదేనా బాధ్యత..!
ఇదేనా బాధ్యత..!
ఇదేనా బాధ్యత..!
ఇదేనా బాధ్యత..!