
● నడకయాతన
రాయగడ జిల్లాలోని మునిగుడ సమితి నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న మునిఖోల్ పంచాయతీ పరిధిలోని 14 గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామాల్లో నివసించేవారు అందరూ డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలే. డొంగిరియా ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం డొంగిరియా కొంధొ డవలప్‌మెంట్ ఏజెన్సీ (డీకేడీఏ) పేరిట ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. డొంగిరియాలు నివసించే గ్రామాలను అభివృద్ధి చేయడం, మౌలిక సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అయితే ప్రతీ ఏడాది రూ.కోట్లలో నిధులు విడుదలవుతున్నా, ఆయా గ్రామాల్లో అభివృద్ధి జాడలు కనిపించడం లేదు. అసలే వర్షాకాలం కావడంతో రహదారులు బురదమయంగా మారాయి. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాలకు రహదారుల సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతున్నారు. – రాయగడ