పాముకాటుతో బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో బాలిక మృతి

Jul 10 2025 6:57 AM | Updated on Jul 10 2025 6:57 AM

పాముక

పాముకాటుతో బాలిక మృతి

కవిటి: మండలంలోని పాత శిలగాం పూడివీధికి చెందిన గొనప షన్విత(11) అనే బాలిక పాముకాటుతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి ఇంట్లో పడుకొని ఉన్న సమయంలో పాము కాటు వేసింది. దీంతో బాలిక ఉదయం లేచిన తర్వాత విపరీతంగా వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితికి వెళ్లడంతో సోంపేట ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యమందించారు. పరిస్థితి విషమించడంతో బాలిక చికిత్స పొందుతూనే మంగళవారం మృతి చెందింది. శిలగాం ఉన్నత పాఠశాలలో బాలిక ఆరో తరగతి చదువుతోంది.

రోడ్డు ప్రమాదంలో కార్యదర్శికి గాయాలు

మెళియాపుట్టి: మండలంలోని చాపర గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న చింతల అప్పారావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని స్వగ్రామం కొరసవాడకు వెళ్లే క్రమంలో ఒడిశా రామసాగరం గ్రామం వద్ద ఆయన ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయారు. దీంతో అక్కడే ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు 108కు సమాచారం అందించారు. అక్కడి నుంచి ఒడిశా పర్లాఖిమిడి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం తరలించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.

పాముల సయ్యాట

కొత్తూరు: మండల కేంద్రంలోని ఎన్‌ఎన్‌ కాలనీలో మంగళవారం రాత్రి పాములు సయ్యాటాడుతూ కనిపించాయి. కాలనీలోని ప్రజలంతా ఆసక్తిగా గమనించారు. అయితే ప్రజలు సంచరిస్తున్న ప్రాంతాల్లో ఇటువంటి ఘటన జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

గంజాయితో ఇద్దరు యువకులు అరెస్టు

కాశీబుగ్గ : పలాస రైల్వేస్టేషన్‌ సమీపంలో ఇద్దరు వ్యక్తులు సుమారు నాలుగు కేజీల గంజాయి తరలిస్తూ కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. తమిళనాడు రాష్ట్రం చైన్నెకు చెందిన రామ్మూర్తి దినేష్‌కార్తీక్‌ ఒడిశాలో 4 కేజీల గంజాయి కొనుగోలు చేసి తిరిగి చైన్నె వెళ్లేందుకు పలాస రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న క్రమంలో కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. కటక్‌కు చెందిన చిత్తరాంజన్‌ దాస్‌ అనే వ్యక్తి పర్లాకిమిడిలో 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కటక్‌ వెళ్లేందుకు పలాస రైల్వే స్టేషన్‌ వెళ్తున్న క్రమంలో కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరి నుంచి 6 కేజీల గంజాయి, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనపరచుకున్న పోలీసులు కేసు నమోదుచేసి ఇరువురిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ వెల్లడించారు.

బరితెగించిన ఆక్రమణదారులు

సంతబొమ్మాళి: మండలంలోని పోతునాయుడుపేట గ్రామంలో ఆక్రమణదారులు బరితెగించారు. సాగునీటి కాలువ, రోడ్డుకు మధ్య ఉన్న సుమారు 30 సెంట్లు స్థలం కబ్జా చేశారు. ఆక్రమించిన స్థలంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వేసిన తాగునీటి బోరును పీకేసి ఆనవాలు లేకుండా చేశారు. దీంతో తాగునీటికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆక్రమణదారులను గ్రామస్తులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడడంతో భయపడి ఫిర్యాదు కూడా చేయలేదు. దీంతో పాటు రోడ్డుకు అనుకొని ఉన్న బెర్ముతో పాటు సాగునీటి కాలువ గట్టును కూడా ఆక్రమించి మట్టిని వేసి కబ్జా చేశారు. ఆక్రమించిన స్థలంలో విద్యుత్‌ స్తంభాలు ఉండడంతో అవి కూడా తొలగించమని సంబంధిత కాంట్రాక్టర్‌తో ఆక్రమణదారులు గొడవపడిన సంఘటనలు ఉన్నాయి. ఆక్రమించిన స్థలంలోని 11 సెంట్లును వేరొక వ్యక్తికి ఆక్రమణదారులు అమ్మి తప్పుడు సర్వే నంబర్‌తో రిజిస్టేషన్‌ చేయించారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తహసీల్దార్‌ హేమసుందర్‌ను దీనిపై వివరాలు అడుగగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పాముకాటుతో బాలిక మృతి 1
1/4

పాముకాటుతో బాలిక మృతి

పాముకాటుతో బాలిక మృతి 2
2/4

పాముకాటుతో బాలిక మృతి

పాముకాటుతో బాలిక మృతి 3
3/4

పాముకాటుతో బాలిక మృతి

పాముకాటుతో బాలిక మృతి 4
4/4

పాముకాటుతో బాలిక మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement