
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
జయపురం: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని సత్యసాయి భజన మండలి సభ్యులు అన్నారు. దీనిలో భాగంగా బొరిగుమ్మ సమితి దుర్లగుడలోని షిరిడీ సాయి మందిర ప్రాంగణంలో మొక్కలను శుక్రవారం నాటారు. కార్యక్రమంలో భజన మండలి కన్వీనర్ శరత్ దాస్, ఎస్.సాయి, శివ మహంతి, కృష్ణచంద్ర పండ, బాలమ్మ, అనూరాధ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బొరిగుమ్మ సమితి బెణగాం ప్రాజెక్టు ఉన్నత పాఠశాల పరిసరాల్లో వివిధ రకాల మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఆర్‌సీసీ ప్రఫుల్ల కుమార్ నాయిక్, హెచ్‌ఎం శ్రీకాంత కుమార్ పండ తదితరులు పాల్గొన్నారు.