
‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి’
రాయగడ: జిల్లాలోని గుణుపూర్, రాయగడలో గల సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ల ద్వారా జిల్లాలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి బుధవారం సమీక్ష జరిగింది. కలెక్టర్ ఫరూల్ పట్వారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, డీఎఫ్‌ఓ అన్నా సాహేబ్ అహలే ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలక్టర్ పట్వారి మా ట్లాడుతూ జిల్లాలో గల రెండు ఐటిడిఏ పరిధుల్లొ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి సంబంధిత శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెండింగుల్లో ఉ న్న ప్రాజెక్టు పనులను త్వరిత గతిన పూర్తి చేయా లని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు జిల్లాలో గల ఆదివాసీ, హరిజన విద్యార్థులు చదువుకుంటున్న సంక్షేమ శాఖ పరిధుల్లోని హాస్టళ్లు, పాఠశాలల్లో రక్షణ కరువైందని ఆరోపించారు. సీసీ కెమెరాలు పెట్టాలని డిమాండ్ చేశారు.