
అమృత్ భారత్ స్టేషన్ పనుల పరిశీలన
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అమృత్ భారత్ స్టేషన్ పనుల అభివృద్ధిని స్థానిక మండల రైల్వే అధికారి (డీఆర్‌ఎం) హెచ్.ఎస్.బజ్వా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఖుర్దా రోడ్ నుంచి బరంపురం వరకు ప్రయాణికుల సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, భద్రత అంశాల్ని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. దారి పొడవునా పలు స్టేషన్లలో ఆకస్మికంగా క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించారు. బరంపురం, బలుగాంవ్, ఇచ్ఛాపురం, ఛత్రపూర్ స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పనుల పురోగతిని సమీక్షించారు.
నలుగురు వైద్యులు సస్పెన్షన్
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో నలుగురు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రం సామాజిక ఆరోగ్య అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా ముఖ్యవైద్యాధికారి, డీపీహెచ్‌వో డాక్టర్ మహామ్మద్ ముబారక్ అలీ గురువారం తెలిపారు. మోహనా బ్లాక్‌లో పాణిగండ, రాయిపంక, బుదులి, ఆర్.ఉదయగిరిలోని శియ్యాళిలోట్టి గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ హెల్త్ అధికారులు తరచూ విధులకు గైర్హాజరవుతున్నట్టు ప్రజలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ చేసివారిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం వారి స్థానంలో ప్రత్యేక సూపర్‌వైజర్ టీం గిరిజన గ్రామాల్లో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు.

అమృత్ భారత్ స్టేషన్ పనుల పరిశీలన