
సింగుపుటిలో ఉచిత వైద్య శిబిరం
రాయగడ: సదరు సమితి సింగుపుటి గ్రామంలో స్థానిక సత్యసాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ కుమార్, జిల్లా అదనపు ముఖ్యవైద్యాధికారి డాక్టర్ మమత చౌదరి, డాక్టర్ ఎల్‌ఎన్ సాహు సుమారు 87 మందికి వివిధ వైద్య పరీక్షలను నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కొంతమందికి నేత్ర శస్త్రచికిత్స అవసరం ఉందని గుర్తించారు. వారిని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు తరలించి సమితి ద్వారా ఉచితంగా ఆపరేషన్లను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.