
‘బీజేపీ ఎమ్మెల్యేను అరెస్టు చేయాలి’
భువనేశ్వర్: రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతా దళ్ మధ్య రోజుకో వివాదం సంచలనం రేపుతోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంతోష్ ఖటువాను వెంటనే అరెస్టు చేయాలని విపక్ష బీజేపీ మహిళా నాయకులు వీధికి ఎక్కారు. నగరంలో నడి రోడ్డు మీద గురువారం భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేని అరెస్టు చేసేందుకు సాక్ష్యాధారాలతో కూడిన ఫిర్యాదుని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరలక్ యోగేష్ బహదూర్ ఖురానియాకు ఆందోళనకారుల ప్రతినిధి బృందం అందజేసింది. వివాదాస్పద ఎమ్మెల్యే సాక్ష్యాధారాలు తారుమారు చేయకుండా కస్టడీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేవారు.
ఎమ్మెల్యే వ్యతిరేకంగా వన్యప్రాణుల (ఏనుగులు) వేట, లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రతినిధి బృందం డీజీపీని అభ్యర్థించింది. ఆయన వ్యతిరేకంగా పలు పత్రికల్లో ప్రచురిత వార్త కాపీలు, ఆడియో క్లిప్‌లు మరియు తేలిపాల్ గ్రామంలో వన్య ప్రాణుల అక్రమ వేట, దంతాల అక్రమ రవాణా సంబంధిత సాక్ష్యాల్ని డీజీపీకి దాఖలు చేశారు.
ఈ నెల 2న ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో మీడియాతో జరిగిన సంభాషణలో బిజూ జనతా దళ్ నాయకురాలు డాక్టర్ లేఖశ్రీ సామంత సింఘార్ తనను వేశ్యగా అభివర్ణించి, సెక్స్ రాకెట్ నడిపారని సంతోష్ ఖటువా చేసిన అసభ్యకరమైన, లైంగికపరమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను డీజీపీకి దాఖలు చేసిన ఫిర్యాదులో సవివరంగా వివరించారు. ఈ అభ్యంతరకర చేష్టలతో తీవ్ర మానసిక వేదన మరియు ప్రతిష్టకు హాని కలుగుతుందని ప్రభావిత డాక్టర్ లేఖశ్రీ సామంత సింఘార్ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులు, ప్రతీకార చర్యల ప్రమాదం దృష్ట్యా డాక్టర్ లేఖశ్రీ సామంత సింఘార్ ఆమెతో కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరారు.