
చుక్కల్ని తాకిన కాయగూరల ధరలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రముఖ కూరగాయల హోల్ సేల్ అంగడి కటక్ ఛత్రబజార్‌లో నిత్య అవసర కాయగూరల ధరలు గణనీయంగా పెరిగాయి. వినియోగదారులు సతమతం అవుతున్నారు.
గురువారం నాటికి ఈ అంగడిలో
పలు కాయగూరల కిలో ధరలు (రూ.)
ప్రభుత్వానికి లొంగిపొండి
● మీ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం
● మావోయిస్టులకు పోలీసు యంత్రాంగం పిలుపు
రాయగడ: ఆయుధాలను వీడి మీరంతా ప్రభుత్వానికి లొంగిపోవాలని, కుటుంబ సభ్యులకు అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్, బస్టాండు తదితర ప్రాంతాల్లో బ్యానర్లను ఏర్పాటు చేసింది. గురువారం నాడు మునిగుడలో కనిపించిన ఈ బ్యానర్లు హల్ చల్ సృష్టించాయి. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం తరఫున ఉండేందుకు ఇల్లు, ఆర్థిక సాయంతో పాటు పిల్లల భవిష్యత్ కోసం ఆర్థిక సాయం చేస్తామన్నారు. అందువల్ల మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని బ్యానర్లలో పేర్కొన్నారు.
అక్రమ అరెస్టులు ఆపాలి
శ్రీకాకుళం: సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేస్తూ పౌరుల జీవనానికి, స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోందని అంతర్జాతీయ మానవహక్కుల సంఘం స్టేట్ సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతి నాయుడు గురువారం తెలిపారు. సోషల్ మీడియా అరెస్టులపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారిచేసినా ప్రభుత్వం పాటించట్లేదన్నారు. జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అరాచకాలు ఎక్కువయ్యాయని, ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్ చేశారు.
రెండు లారీలు ఢీ
రణస్థలం: పతివాడపాలెంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొట్టుకున్నట్లు జె.ఆర్.పురం పోలీసులు తెలిపారు. విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో క్లీనర్, డ్రైవర్లు స్వల్పగాయాలతో బయటపడ్డారని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
డిజిగ్నేషన్ మార్చాలని వినతి
ఎచ్చెర్ల: తమకు గెస్ట్ ఫ్యాకల్టీ పేరిట డిజిగ్నేషన్ ఇచ్చి అన్యాయం చేశారని, తమ డిజిగ్నేషన్‌ను కాంట్రాక్ట్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మార్చాలని కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లు రెడ్డి లక్ష్మణరావు, వై.నారాయణరావు, పి.నవీన్ కోరారు. ఈ మేరకు గురువారం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటీ) డైరెక్టర్ కేవీజీడీ బాలాజీకు వినతిపత్రం అందించారు. 2018కి ముందు, తర్వాత రిక్రూట్‌మెంట్ అయినవారికి రూ.40 వేలు జీతం ఇస్తున్నామ, తమకు మాత్రం రూ.25 వేలకే పరిమితం చేశారన్నారు. ఈ విషయమై అనేకసార్లు వినతిపత్రం అందించినా ఇప్పటివరకూ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను చాన్సలర్ మధుమూర్తి, రిజిస్ట్రార్ అమరేంద్రల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు కోరారు.
గిరి ప్రదర్శనకు వెళ్లి వస్తూ..
నరసన్నపేట: మాకివలసలో గ్రామానికి చెందిన రావాడ ఉదయకుమార్ (28) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం సింహాచలం గిరి ప్రదర్శనకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామం వస్తుండగా భోగాపురం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఉదయకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. విషయం తెలియడంతో తండ్రి రమణయ్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉదయ్‌కుమార్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంతలోలో మృతి చెందడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.
పీ–4 విధానంపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పీ4 (ప్రభుత్వం–ప్రైవేటు–ప్రజలు– భాగస్వామ్యం) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పథ్విరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బంగాళాదుంపలు 20
ఉల్లిపాయలు 25
దోసకాయలు 20
పొటల్స్ 30
బెండకాయలు 40
బరబటీలు 30
వంకాయలు 70
క్యారెట్ 30