
కిశోర్, విద్యా చట్టాలపై అవగాహన
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ ఆధ్వర్యంలో జయపురంలోని సరస్వతీ శిశు విద్యామందిర అరవిందనగర్ ప్రాంగణంలో సోమవారం కిశోర్ న్యాయ చట్టం 2015 (శిశు సంరక్షణ, భద్రత చట్టం) బాధ్యతాయుత విద్యా చట్టాలపై చైతన్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రదీకరణ జిల్లా అధ్యక్షులు, జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి సూచన మేరకు నిర్వహించిన శిబిరంలో జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ.. కిశోర్ న్యాయ చట్టం గురించి వివరించారు. అలాగే బాల బాలికలు చదువుకునేందుకు నిర్బంధవిద్యా చట్టాలు కల్పించాయని, అలాగనే నేరాలు చేసే మైనర్ బాల బాలికలకు భద్రత, రక్షణ కల్పించి వారు చదువుకొనేందుకు కావాల్సిన వనరులపై అవగాహన కల్పించారు. పోస్కో ప్రత్యేక న్యాయ స్థానం ప్రభుత్వ న్యాయవాది డాక్టర్ గాయిత్రీ దేవి, శిశు కళ్యాణ కమిటీ కొరాపుట్ అధ్యక్షులు గాయిత్రీ పాత్రో, పీఓఐసీ కొరాపుట్ రిషభ నాయిక్, జయపురం పట్టణ పోలీసు ఏఎస్‌ఐ సత్యబాది నాయిక్, సరస్వతీ విద్యామందిర్ పారాబెడ అధ్యాపకులు డాక్టర్ రమణీరంజన్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9, 10 తరగతుల విద్యార్థులకు విజ్ఞాన ప్రతిభపై పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు.

కిశోర్, విద్యా చట్టాలపై అవగాహన

కిశోర్, విద్యా చట్టాలపై అవగాహన