
కాగిత రహిత పాలనకు ప్రాధాన్యం
భువనేశ్వర్: ప్రజా సేవల రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతో డిజిటల్ కార్యకలాపాలు అభివృద్ధి పరచి క్రమంగా కాగిత రహిత కార్యకలాపాలకు ప్రాధాన్యత కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు – ప్రజా ఫిర్యాదుల విభాగం సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సుపరిపాలన పద్ధతులపై సమావేశం గురువారం స్థానిక లోక్ సేవా భవన్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హాజరయ్యారు. డిజిటల్ అధికారిక కార్యకలాపాల్లో రాష్ట్రం సాధించిన పురోగతితో కాగిత రహిత బడ్జెట్, సాంకేతికత ఆధారిత ఫిర్యాదుల పరిష్కారం వరకు వివిధ కార్యకలాపాల్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి వివరించారు. 2047 నాటికి వికసిత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా సంస్కరణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. అధికార పెత్తనానికి తెర దించి ప్రజా స్పందన పాలనకు పట్టం గట్టే రీతిలో సంస్కరణలు చేపడతున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు దేశం నలు మూలల నుంచి హాజరైన 400 మందికిపైగా ప్రతినిధుల చర్చలు, సలహాలు, సంప్రదింపులతో ప్రజా సుపరిపాలనలో ఉత్తమ పద్ధతులు, ఆధునిక పాలన విధానా ఆవిష్కరణల ఈ సమావేశం లక్ష్యంగా పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి