breaking news
Movies
-
బెస్ట్ ఎంటర్టైనర్ వెంకటేశ్... యాక్టర్ నాగచైతన్య
సైమా అవార్డుల వేడుక (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్–2026) బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో జరిగింది. తొలి రోజు తెలుగు, కన్నడ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేయగా, రెండో రోజు తమిళ, మలయాళ భాషల చిత్రాల్లో ప్రతిభ చూపిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌కు అవార్డుల ప్రదానం జరిగింది. తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) సినిమా ఆరు విభాగాల్లో అవార్డులు సాధించింది. నాలుగు విభాగాల్లో ‘మిరాయ్’ సినిమాకు అవార్డులు లభించాయి. బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు వెంకటేశ్‌కి, ‘తండేల్’ సినిమాలోని నటన నాగచైతన్యకు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకువస్తే, ‘మిరాయ్’ చిత్రానికిగానూ తేజ సజ్జాకు క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. ఉత్తమ చిత్రంగా ‘మిరాయ్’ నిలవగా, ఉత్తమ దర్శకుడి అవార్డును ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకుగానూ అనిల్ రావిపూడి అందుకున్నారు. క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డు నటి ఐశ్వర్యా రాజేష్ (‘సంక్రాంతికి వస్తున్నాం’)కు లభించింది. 2025లో విడుదలైన దక్షిణాది సినిమాలకు అవార్డులను ప్రదానం చేశారు. -
వెండితెర వినాయకుడు
గణ నాయకుడు ఘనంగా వచ్చేశాడు. ఎక్కడ చూసినా ఈ నాయకుడి పూజకు వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గణేశుడు వెండితెరపైకి కూడా నాయకుడిగా వచ్చాడు. వినాయకుడిపై పలు చిత్రాల్లో వచ్చిన పాపులర్ పాటలు కూడా చాలా ఉన్నాయి. ఈ వినాయక చవితి సందర్భంగా వెండితెర వి‘నాయకుడు’, పాటల గురించి తెలుసుకుందాం. వినాయక చవితి (1957) శమంతకోపాఖ్యానం నేపథ్యంలో దర్శకుడు సముద్రాల రాఘవాచార్య తెరకెక్కించిన చిత్రం ‘వినాయక చవితి’. ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి తదితరులు ప్రధాన తారలుగా నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే... వినాయక చవితి నాడు శ్రీకృష్ణు్ణడు పాలలో చంద్రుడిని చూస్తాడు. దీంతో శమంతక మణిని దొంగలించాడనే అపవాదు పడుతుంది. వినాయక వ్రతం చేసి కృష్ణుడు ఆ అపవాదు నుంచి ఎలా బయటపడ్డాడనేది ఈ సినిమాలో చూపించారు. వినాయకుడిని పూజించే సంప్రదాయం వెనక ఉన్న పురాణ విశ్వాసాలను గుర్తు చేస్తూ సాగిన ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. శ్రీ వినాయక విజయము (1979) వినాయకుని జన్మ వృత్తాంతంతో రూపొందిన అద్భుత చిత్రం ‘శ్రీ వినాయక విజయము’. శివపార్వతులుగా కృష్ణంరాజు, వాణిశ్రీ, గణేశుడిగా ఎంజీవీ మదన్‌గోపాల్ నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. స్నానానికి వెళ్లేటప్పుడు నలుగు పిండితో బాలుణ్ణి చేసి, గుమ్మం దగ్గర కాపలాగా పెడుతుంది పార్వతీ దేవి. ఆ బాలుడు గుమ్మం దగ్గర నిలబడి ఎవర్నీ లోపలికి రానివ్వడు. అయితే స్వయంగా పరమశివుడే రావడం, ఆయన్ను కూడా ఈ బాలుడు అడ్డుకోవడం, ఆ తర్వాత అతని తలకి ఏనుగు తల రావడం... ఆ బాలుడు గణపతిగా మారడం, గణాధిపతిగా ఆయనకు స్థానం లభించడం, మూషికాసురుని సంహారం వంటి ఘట్టాలతో ‘శ్రీ వినాయక విజయము’ రూపొందింది. దేవుళ్ళు (2000) కోడిరామకృష్ణ తెరకెక్కించిన సూపర్‌హిట్ సినిమా ‘దేవుళ్ళు’. పృథ్వీరాజ్, రాశీ, మాస్టర్ నందన్, బేబీ నిత్య లీడ్ రోల్స్‌లో నటించిన ఈ ఆధ్యాత్మిక చిత్రానికి మంచి ఆదరణ లభించింది. కథ రీత్యా... విడాకులు తీసు కోవాలనుకుంటున్న తమ తల్లిదండ్రులను (పృథ్వీ, రాశీ) తిరిగి ఒక్కటి చేయాలనే సంకల్పంతో ఇద్దరు పిల్లలు (నందన్, బేబీ) వారి నానమ్మ మొక్కులను నెరవేర్చడానికి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు. విఘ్న నివారకుడైన కాణిపాక వినాయకుని దర్శనంతోనే ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో వినాయక స్వామి నేపథ్యాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రాశస్త్యంతో ముడిపెట్టారు కోడి రామకృష్ణ. భక్తుల ఇష్ట కామ్యాలను తీర్చే కాణిపాక గణపతి లీలలను చూపించారు. ‘దేవుళ్ళు’ సినిమాలో వచ్చే ఈ వినాయక స్వామి ఎపిసోడ్ కథకు కీలకంగా ఉంటుంది. ఈ చిత్రంలో వినాయకుడి పాత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చక్కగా ఒదిగిపోయారు.ఇలా చెప్పుకుంటే ‘వినాయకుడు’ ప్రధానాంశంగా, వినాయకుడి ప్రస్తావన ఉన్న చిత్రాలు చాలా ఉన్నాయి. సినిమాల్లో వినాయకుడి పాటలు ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా నటించిన ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ (1973) సినిమాలోని ‘దేవుడు చేసిన మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్లారా.. పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఉంటుంది. వెంకటేశ్ ‘కూలీ నెం.1’ (1991)లో ‘దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా... దయుంచయ్యా దేవా.. పాట వినాయక చవితి పండగ మండపాల్లో వినిపించకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. ‘దేవుళ్లు’ (2000) లోని ‘జయ జయ శుభకర వినాయకా... శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయకా... పాట చాలా పాపులర్. చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ (2005) చిత్రంలో ‘జై జై గణేశా.. జై కొడత గణేశా.. జయములివ్వు బొజ్జ గణేశా.. పాట బాగా పాపులర్. మహేశ్‌బాబు ‘పోకిరి’ (2006) లోని ‘జగడమే.. పాటలో బిట్ సాంగ్లా వినిపించే ‘గణపతి బ΄్పా మోరియా..’ మాస్ లెవల్లో ఉంటుంది. రామ్ ‘గణేష్’ (2009) చిత్రంలోని ‘రాజా మహరాజా’ వినాయకుడి పాటగానే వినిపిస్తుంది. బాలకృష్ణ ‘డిక్టేటర్’ (2016)లో ‘గం గం గం గం గం గం గణేశా... గౌరీ తనయా సర్వేశా... పాట గణనాథుణ్ణి కీర్తిస్తుంది. నాగార్జున, నాని హీరోలుగా నటించిన ‘దేవదాస్’ (2018)లో ‘లక లక లకుమీకర లంబోదర... జగజగ జగదోద్ధార విఘ్నేశ్వర’ అని సాగే పాట ఉంది. ‘ఏడాదికోసారి మాకై దిగి రారా... లోకంలో లోపాలు పాపాలన్నీ తుడిచెయ్రా... వెళుతూ వెళుతూ అట్టా గంగమ్మలో కలిపెయ్రా’ అంటూ సాగే ఈ పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలోనే ఉంటుంది. -
ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ సీజన్-10లో ఆదివారం ఎపిసోడ్ సందడిగా సాగింది. వినాయక చవితి సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు పండగ శుభాకాంక్షలు తెలిపి షోను ప్రారంభించారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ.. అవసరమైన చోట క్లాస్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో బ్లాక్ కీతో హౌస్‌లో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చారు. ఇక రెండో వీకెండ్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి ఓ లుక్కేద్దాం..ఇంగ్లీష్‌పై నాగార్జున అసంతృప్తిహౌస్లో కొందరు కంటెస్టెంట్లు ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడటంపై నాగార్జున స్పందించారు. హౌస్‌లో జరిగే విషయాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలంటే వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ రాని ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలుగు సరిగా మాట్లాడటం రాకపోయినా ప్రయత్నిస్తున్న దేబ్జానీని ఈ సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు.దేబ్జానీకి ఫుల్ క్రేజ్.. రోహిత్‌కు వార్నింగ్కంటెస్టెంట్ల మనసులో ఎవరు ఉన్నారు? ఎవరు దూరంగా అనిపిస్తున్నారు? తెలుసుకునేందుకు నాగార్జున ఓ ఆసక్తికరమైన టాస్క్‌ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కంటెస్టెంట్లు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. ఎక్కువమంది దేబ్జానీ పేరును ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ‘నువ్వు చాలా పాపులర్ అయిపోతున్నావు’ అంటూ ఆమెతో సరదాగా అన్నారు. మరోవైపు రోహిత్ పేరును ద్వేషిస్తున్నట్లు తెలపడంతో రోహిత్‌ను హౌస్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని నాగార్జున సూచించారు.ఎక్కువ మంది చదివింది: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుబ్లాక్ కీతో అసలు ట్విస్ట్ఆదివారం ఎపిసోడ్లో బ్లాక్ కీతో బిగ్‌బాస్ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. నాగార్జున తీసుకొచ్చిన బ్లాక్ కీని ఎవరికి ఇస్తే.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కీ పవర్ పనిచేయకుండా పోతుందని తెలిపారు. దీంతో ఆ బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కంటెస్టెంట్ల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరిలో ఎక్కువమంది సృష్టి పేరు చెప్పారు. చివరికి బ్లాక్ కీని సృష్టికి ఇవ్వాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటనఇదే సమయంలో ఇప్పటివరకు మ్యాజిక్ కీ లేని నలుగురు కంటెస్టెంట్లకు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు బ్లాక్ బాక్స్‌ను సొంతం చేసుకునేందుకు నిర్వహించిన టాస్క్‌లో సుదీర్ విజయం సాధించాడు. దీంతో సృష్టి తన దగ్గర ఉన్న బ్లాక్ కీని సుదీర్‌కు అందించింది. ఇక సుదీర్ చేతికి చేరిన ఈ బ్లాక్ కీతో హౌస్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఎలిమినేషన్లో ట్విస్ట్..ఈ ఎపిసోడ్లో హౌస్‌మేట్స్‌గా అమన్, ముకేశ్, సృష్టి, నరేశ్లన ఎంపిక చేశారు. ఇప్పటివరకు హౌస్మేట్స్కానీ సుదీర్, వర్షిణి, కృష్ణుడుని యాక్టివిటీ రూంలోకి పంపించారు. ‘ మీ ముగ్గురులో హౌస్మేట్స్ ఎవరు.. ఎలిమినేట్ ఎవరు అవుతారో అక్కడ ఉన్న డోర్స్ తెరిస్తే తెలుస్తుంది’ అని నాగార్జున వాళ్లకి తెలిపాడు. ఇక్కడ ఓ మ్యాజిక్ జరిగింది అంతా సుదీర్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నారు. కానీ ఈ ముగ్గురూ హౌస్మేట్స్గానే ఎంపికయ్యారు.ముకేశ్ కళ్లపై నాగార్జున కామెంట్ముకేశ్ కళ్లను గమనించిన నాగార్జున.. ‘నీ కళ్లు చాలా బాగున్నాయి’ అంటూ ప్రశంసించారు. దీనికి ముకేశ్ థ్యాంక్యూ చెప్పాడు. ‘మీరు చెబుతుంటే నమ్మాలని అనిపిస్తుంది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున సరదాగా ‘ఏంటి.. దేబ్జానీ చెబితే అర్థం కాలేదా?’ అంటూ నవ్వించారు. దీంతో పక్కనే ఉన్న దేబ్జానీ ‘నేను నిజంగానే చెప్పా సార్’ అంటూ బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్సినిమా టాస్క్..కంటెస్టెంట్ల కోసం నాగార్జున సినిమా టాస్క్ నిర్వహించారు. నరేశ్‌ను రెండు టీమ్‌లుగా విభజించమని చెప్పడంతో అతడు ఏ, బీ టీమ్‌లుగా విభజించాడు. ఈ పోటీలో కృష్ణుడు టీమ్ విజయం సాధించింది. విజేతలకు స్వీట్ బాక్స్‌లను అందించారు. ఆ సమయంలో దేబ్జానీ రాత్రిపూట తనకు కాఫీ కావాలని నాగార్జునను కోరింది. అయితే కాఫీ కావాలంటే ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పాలని నాగార్జున కండిషన్ పెట్టారు.ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్దేబ్జానీ తన సీక్రెట్ చెబుతూ.. తాను ఆరో తరగతి రెండుసార్లు చదవాల్సి వచ్చిందని, తొలిసారి ఆరో తరగతిలో ఫెయిల్ అయ్యానని చెప్పింది. అయితే ఈ సీక్రెట్‌తో బిగ్‌బాస్ సంతృప్తి చెందలేదని నాగార్జున చెప్పడంతో మరో సీక్రెట్ బయటపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ముకేశ్ అంటే తనకు చాలా ఇష్టమని దేబ్జానీ చెప్పింది. ముకేశ్ అందరితో పులహారి కలుపుతాడని కానీ తన దగ్గరకు మాత్రం రావడం లేదని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ సీక్రెట్‌తో నాగార్జున ఆమెకు కాఫీని సాంక్షన్ చేశారు.రెండో వీకెండ్.. ప్రేక్షకుల చేతుల్లోనే!ఇక ఎపిసోడ్ చివర్లో వచ్చే వీకెండ్ ఎలా ఉండబోతుందో తెలిపే ఓ క్లిప్‌ను చూపించారు. ‘నెక్ట్స్ వీకెండ్ అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది’ అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్‌లో మరో ఆసక్తికరమైన పరిణామానికి తెరలేచినట్లైంది. అసలు వచ్చే వారం ప్రేక్షకుల చేతుల్లో ఉండబోయేది ఏంటి? ఎవరి గేమ్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది? అనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.ఇదీ చదవండి: బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో త్రివిక్రమ్ ప్లానేంటి? -
బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో పరిస్థితేంటి?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. సెప్టెంబరు 18న కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేసింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి యావత్ భారతీయ సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిదీ ఈ చిత్రం. చిన్న సినిమాగా మొదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ మూవీని తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబరు 18న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది. మరి అక్కడ సంచలనం సృష్టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.కంటెంట్ బలంగా..సాధారణంగా ప్రేక్షకులకు కంటెంట్ బలంగా ఉంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆదరించడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా వైవిధ్యమైన కథాంశం, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉంటే సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. ‘హనుమాన్ అంశ్’ విషయంలోనూ ఇదే ప్లస్ పాయింట్‌గా మారుతుందా లేదో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్ఎంతవరకు ప్రభావం చూపుతుందని..అయితే తెలుగు మార్కెట్ పూర్తిగా భిన్నం. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమయంలో.. ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమా ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. మరోవైపు త్రివిక్రమ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటంతో సినిమాకు అదనపు క్రేజ్ వస్తోంది.కేవలం వసూళ్లను చూసి సినిమాపై అంచనాలు పెట్టుకోవడం ఒక ఎత్తయితే.. తెలుగు నేటివిటీకి సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది అసలు పరీక్ష. హిందీలో ప్రేక్షకులను మెప్పించిన అంశాలు తెలుగులోనూ వర్కౌట్ అయితే ‘హనుమాన్ అంశ్’ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏషనాగుల పాటకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే..ఆదర్శ కుటుంబం..మరోవైపు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టీజర్ విడుదల చేశారు. టీజర్‌లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ స్పెషల్ మూమెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.‘రణబాలి’లో జయమ్మ పాత్రలో నటిస్తున్న రష్మిక తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు. ఇంజ్యూరీ నుంచి కోలుకున్న తర్వాత ఆమె తిరిగి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. తాజాగా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసిన సందర్భంగా చిత్రబృందం ఆమెకు వీడ్కోలు పలికింది. ఈ సమయంలో రష్మికను అభినందించేందుకు విజయ్ దేవరకొండ కూడా సెట్‌కు వచ్చారు. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..షూటింగ్ పూర్తయిన సందర్భంగా..రష్మిక షూటింగ్ పూర్తయిన సందర్భంగా విజయ్ ఆమెను ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఈ స్పెషల్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన జంటను ఇలా చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.బ్రిటిష్ పాలన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇదీ చదవండి: ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు It's a wrap for Jayamma ✨We will dearly miss you on sets, @iamRashmika ❤️The much loved #EndhayyaSaami out very soon.#RanabaaliTeaser TRENDING #1 on YouTube 🔥▶️https://t.co/tqKGJM7RdG#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th pic.twitter.com/qHX008QMkF— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026 -
ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు
రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. గత నెల మూడో వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేసింది. చిన్నాపెద్దా అని తేడాలేకుండా పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లి సినిమా చూశారు. ఈ సినిమాని చూసిన పలువురు ఇప్పటికే ప్రశంసలు కురింపించారు. ఆ తరహాలోనే 'ఇరుముడి' విడుదలైన సమయంలో సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని చిరంజీవి, రామ్‌చరణ్‌లు అభినందించారు. తాజాగా ‘ఇరుముడి’ టీమ్‌ని స్వయంగా కలిసి మరో సారి శుభాకాంక్షలు తెలిపారు. రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ నిర్మాతలు నవీన్ , వై. రవి శంకర్ లతో ఈ సమావేశంలో ఉన్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అడుతోంది. ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన A special moment of celebration ❤️🔥Megastar @KChiruTweets Garu & Mega Power Star @AlwaysRamCharan Garu met Mass Maharaja @RaviTeja_offl Garu and the team of #Irumudi to celebrate the film’s massive success ✨❤️Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI /… pic.twitter.com/qncXARM9eY— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026 -
‘ప్రాణం పెట్టి తీసిన సినిమా ‘పిఠాపురంలో అలా మొదలైంది’
‘ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో... అలా మొదలైంది’ అని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పిఠాపురంలో అలా మొదలైంది’. దర్శకుడు చంద్ర మహేష్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ క్రమంలో శనివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ .. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాకి మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. సినిమా బాగా వచ్చింది’ అని తెలిపారు. సుమన్ మాట్లాడుతూ .. చంద్ర మహేష్‌తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలన్నారు. ‘ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్ టు చంద్రమహేష్. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఒక సీనియర్ నటుడుగా మీ అందరికీ చెబుతున్నా.. మంచి సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడండి’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు. -
ఏషనాగుల పాటకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే..
నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ అభిమానులను అలరించాయి. ముఖ్యంగా ఆయా షేర్, ఏషనాగుల సాగ్స్ ఎలాంటి రికార్స్ సృష్టించారో చెప్పనవసరంలేదు. ఒక్క ఏషనాగుల సాంగే విడుదలైన కొద్ది రోజులకే 52 మిలియన్ వ్యూస్ దాటింది. మరి ఈ పాటలు పాడిన సింగర్‌కు ఎంత పారితోషకం ఇచ్చుంటారని సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.రూ. 5 లక్షల పారితోషికం ఇచ్చారా..ఈ పాటలను పాడింది సింగర్ జంగి రెడ్డి అని విషయం తెలిసిందే.. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులు ఇస్తూ తన రెమ్యునరేషన్ కోసం వెల్లడించారు. ‘ ఆ పాటల ద్వారా లభించిన విజయం , ప్రజాదరణ ముందు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ చాలా చిన్నది. పాటల సక్సెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. రూ. 5 లక్షల పారితోషికం ఇచ్చారా అని అడిగిన ప్రశ్నకు ‘అంత స్థాయిలో పారితోషికం ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అయితే నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుట్రైలర్ లేకుండానే సినిమా..కాగా ఈ చిత్రం సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్‌కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. -
అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగు
తెరపై మాస్ హీరోగా అభిమానులను అలరించే రామ్ పోతినేని.. నిజ జీవితంలోనూ తన మంచి మనసును చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ అభిమాని గురించి తెలుసుకుని గతంలో అండగా నిలిచిన ఆయన.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్న 18 ఏళ్ల శశి చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని గతంలో చెప్పాడు. తాజాగా ఆమె కుటుంబానికి అవసరమైన వస్తువులను పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మంచానికే పరిమితం..తూర్పుగోదావరి జిల్లా దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశి కొంతకాలంగా తీవ్రమైన అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి కారణంగా ఆమె మతిస్థిమితం కోల్పోయి చాలా ఏళ్లుగా మంచానికే పరిమితమైంది. ఆమె పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా రామ్ తెలుసుకున్నారు.ఇదీ చదవండి: 'సైమా'లో మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్రామ్ అంటే ఎంతో అభిమానం..శశికి.. రామ్ పోతినేని అంటే ఎంతో అభిమానం. రామ్ ఫొటోలు చూస్తే ఆమె స్పందిస్తుందని.. ఆయనను చూపిస్తే అన్నం కూడా తింటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామ్.. శశితో వీడియో కాల్లో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పడంతో పాటు చికిత్సకు అవసరమైన ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోఅప్పుడు ఇచ్చిన మాటను రామ్ ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. శశికి అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు, పౌష్టికాహారాన్ని ఆమె కుటుంబానికి పంపించారు. తన కళ్లజోడును కూడా శశికి బహుమతిగా పంపంచారు.( 'ఇరుముడి' సూపర్ క్యూట్ సాంగ్.. ఫుల్ వీడియో రిలీజ్)అభిమానుల ద్వారా అందజేతరామ్ పంపించిన వస్తువులను ఆయన అభిమానులు శశి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా శశి కుటుంబ సభ్యులు రామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభిమాని కష్టాల్లో ఉందని తెలుసుకుని స్పందించడమే కాకుండా.. ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలుస్తున్న రామ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెరపై హీరోగా కనిపించే రామ్.. నిజ జీవితంలోనూ ‘రియల్ హీరో’ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. A fan girl’s dream came true ❤️🔥From a surprise video call to standing by her with regular support for medicines & groceries… and today, a special gift from her favourite hero @ramsayz 🥹❤️For a fan, he’s not just a HERO… he’s a beautiful memory for life 🫶🔥#RamPothineni pic.twitter.com/UuXnn2JpSN— RAPO Fan Trends (@RAPOFanTrends) September 13, 2026 -
'సైమా'లో మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్
2026 సంవత్సరానికిగానూ సైమా అవార్డ్స్ వేడుక.. బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దక్షిణాది సినీ తారలు హాజరై సందడి చేశారు. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ చూపించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డ్స్ అందుకున్నాడు. అయితే తెలుగు నుంచి మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఫుల్ డామినేషన్ చూపించాయి.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)‘మిరాయ్’లో నటనకుగానూ తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నాడు. ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డుని ‘సంక్రాంతికి వస్తున్నాం’లో చేసిన ఐశ్వర్య రాజేశ్ దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం), ఉత్తమ హాస్యనటుడిగా బుల్లిరాజు రేవంత్ నిలిచారు. ‘కాంతార: చాప్టర్1’లో నటనకుగానూ రిషబ్‌శెట్టి ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నాడు.ఉత్తమ నటుడు - తేజ సజ్జా (మిరాయ్)ఉత్తమ నటి - ఐశ్వర్య రాజేశ్ (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ దర్శకుడు - అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)ఎంటర్టైనింగ్ ఇయర్ ఆఫ్ ది ఫిల్మ్ - (సంక్రాంతికి వస్తున్నాం)బెస్ట్ ఎంటర్టైనర్ - వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ సహాయ నటుడు - సత్యదేవ్ (కింగ్డమ్)ఉత్తమ సహాయ నటి - శ్రద్ధా శ్రీనాథ్ (డాకు మహారాజ్)ఉత్తమ హాస్య నటుడు - బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ సినిమాటోగ్రఫీ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)ఉత్తమ నేపథ్య గాయకుడు - రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ నేపథ్య గాయని - సమీరా భరద్వాజ్ (కోర్ట్)ఉత్తమ నటుడు (పరిచయ) - హర్ష్ రోషన్ (కోర్ట్)ఉత్తమ నటి (పరిచయ) - శ్రీదేవి (కోర్ట్)ఉత్తమ నటి (పరిచయ) - సాక్షి మడోల్కర్ (మోగ్లీ)ఉత్తమ గేయ రచయిత - పూర్ణా చారి (కోర్ట్)(ఇదీ చదవండి: ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ) -
త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్
తమిళ హీరో విజయ్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. కానీ చిన్న గ్యాప్ తీసుకుని లండన్ వెళ్లారు. అక్కడే సిల్వర్‌స్టోన్‌లో హీరో అజిత్ పాల్గొన్న రేసింగ్ ఈవెంట్‌ని వీక్షించారు. రేసింగ్ అనంతరం విజయ్-అజిత్ హగ్ చేసుకున్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అదే టైంలో విజయ్-త్రిష కలిసున్న ఫొటోలు, వీడియోలు కూడా కనిపించాయి.(ఇదీ చదవండి: ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ)సీఎం కాకముందు వరకు పలు సందర్భాల్లో త్రిష-విజయ్ జంటగా కనిపించారు. కానీ తర్వాత వీళ్లిద్దరి గురించి పెద్దగా వార్తలు రాలేదు. మరోవైపు విజయ్ భార్య సంగీత.. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఇప్పుడు విజయ్, త్రిష కలిసి రేసింగ్ ఈవెంట్ చూసేందుకు లండన్ వెళ్లారు. కాకపోతే త్రిష తన పక్కకు రాగానే విజయ్ ముఖం తిప్పుకోవడం ఇప్పుడు ట్విటర్లో హాట్ టాపిక్ అయిపోయింది.ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేశారు. ఈయన చివరి సినిమా 'జన నాయగన్'.. రెండు నెలల క్రితం రిలీజైంది. ఇక త్రిష కెరీర్ విషయానికొస్తే ఈమె తెలుగులో చేసిన 'విశ్వంభర' విడుదల కావాల్సి ఉంది. మరోవైపు తమిళంలో వరస మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు విజయ్ తప్పుకొన్న పెరంబూర్ స్థానంలో జరిగే ఉపఎన్నికల్లో ఈమె పోటీ చేస్తుందన్నారు గానీ ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావట్లేదు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)Thalapathy Vijay didn't expected her entry ? He looks UNCOMFORTABLE right after the moment trisha entered the frame 👀#Thalapathy #Vijay #Ajithkumar #TVK pic.twitter.com/2lDJpW5hnP— Gokul (@ItzGokulVJ) September 12, 2026 -
'ఇరుముడి' సూపర్ క్యూట్ సాంగ్.. ఫుల్ వీడియో రిలీజ్
రవితేజ 'ఇరుముడి' మూవీ రిలీజై మూడు వారాలు అయిపోయినా సరే ఇప్పటికీ అద్భుతంగా ప్రదర్శితమవుతోంది. మరోవైపు సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది. ఈ శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇదలా ఉండగానే ఇందులో సూపర్ క్యూట్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: చెప్పులతో పోస్టర్లపై కొట్టారు.. గలీజ్ మాటలు మాట్లాడారు: వైష్ణవి చైతన్య)'ఇరుముడి'లో అయ్యప్ప స్వామి నేపథ్యంతో పాటు తండ్రి-కూతురు ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. తండ్రిగా రవితేజ, కూతురిగా నక్షత్ర మంచి యాక్టింగ్ చేశారు. వీళ్ల మధ్య, కుటుంబ అనుబంధాన్ని చూపించేలా 'యాలాలో యాలాలో' అనే సాంగ్ సినిమాలో ఉంది. ఇప్పుడు దీని ఫుల్ వీడియోని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇప్పటికే మల్లెపూల పల్లకి, ఇరుముడి కట్టు, కార్తీకమాసం పాటలకు సంబంధించిన వీడియోలు వదిలారు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన) -
ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ
వీకెండ్ వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి మొదలైపోతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో ఆడుకోవడంతో పాటు వారమంతా జరిగిన సంగతుల గురించి మాట్లాడుతారు. అలా ఈ సీజన్లో తొలివారం జరిగిన చాలా విషయాల గురించి ఆదివారం మాట్లాడుకున్నారు. మిగతా వాటి సంగతేమో గానీ దేబ్జానీ, ముకేశ్ 'కళ్ల' కహానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది.(ఇదీ చదవండి: తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!)మీ మనసుకు ఎవరు దగ్గరయ్యారు? ఎవరు దూరమయ్యారు? అని చెప్పాలని నాగ్ అడగ్గా.. రామ్ ప్రసాద్, నరేశ్, ముకేశ్ తోటి కంటెస్టెంట్స్ పేర్లు చెప్పారు. అయితే హౌస్‌లో వాతావరణం సీరియస్‌గా ఉండేసరికి ముకేశ్, నీ కళ్లు బాగున్నాయని నాగ్ అనడంతో అందరూ నవ్వేశారు. మీరు అన్నందుకు థ్యాంక్యూ సర్ అని ముకేశ్ అనగానే కౌంటర్ ఇచ్చిన నాగ్.. నేను అంటే ఓకే గానీ దేబ్జానీ అంటే మాత్రం ఒప్పుకోవా అని ప్రశ్నించారు.టాపిక్ తనవైపు డైవర్ట్ అయ్యేసరికి దేబ్జానీ తన మనసులో మాట బయటపెట్టింది. నాకు నిజంగా నీ కళ్లు బాగుందనిపించింది కాబట్టి చెప్పాను అని ముకేశ్‌ని చూస్తూ దేబ్జానీ చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ముకేశ్ చాలా ఇష్టం. కానీ చెప్పలేకపోతున్నాను. ఇటు సైడ్ పులిహోర చేస్తున్నాడు. అటు సైడు కూడా చేస్తున్నాడు. నా దగ్గర రావట్లేదు సర్ అని గోముగా అడిగింది. త్వరలో దేబ్జానీ-ముకేశ్ మధ్య బంధం మొదలవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?) -
చెప్పులతో పోస్టర్లపై కొట్టారు.. గలీజ్ మాటలు మాట్లాడారు
షార్ట్ ఫిల్మ్ నటిగా మొదలై తెలుగు సినిమాల్లో హీరోయిన్ అయ్యేంతవరకు వచ్చిన వైష్ణవి చైతన్య.. రీసెంట్గా 'ఎపిక్' మూవీతో థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వైష్ణవికి 'బేబి' రిలీజ్ తర్వాత ఎదురైన నెగిటివిటీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ అప్పుడు తాను ఎలాంటి మానసిక వేదన అనుభవించానో బయటపెట్టింది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)''బేబి' నాకు ఓవర్‌నైట్ వచ్చిన సక్సెస్ కాదు. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, క్యారెక్టర్ రోల్స్ ఇలా చాలా చేసుకుంటూ ఇక్కడివరకు వచ్చాను. అయితే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది నోటికి వచ్చినట్టు గలీజ్ మాటలు మాట్లాడారు. చెప్పులు తీసుకుని పోస్టర్లపై కొట్టారు. మంచిగా అనిపించలేదు. మస్తు బాధ అయింది. మూవీ ఇంత సక్సెస్ అయిందని ఎంజాయ్ చేయాలా? లేదా నేను చేసినదంతా దీని కోసమా అని బాధపడాలా అనే జోన్లోకి వెళ్లిపోయినా. కొన్నాళ్లకు దాని గురించి పట్టించుకోవడం మానేసి పాజిటివ్ అంశాలపై ఫోకస్ చేయడం మొదలుపెట్టా' అని వైష్ణవి చైతన్య బాధపడుతూ తన బాధని చెప్పుకొచ్చింది.2023లో రిలీజైన 'బేబి' సినిమాతో వైష్ణవి చైతన్య పేరు మార్మోగిపోయింది. ఇందులో ఈమె యాక్టింగ్, కొన్ని సీన్స్ చూసి చాలామంది ఈమెని తిట్టుకున్నారు. విపరీతమైన ట్రోలింగ్ కూడా చేశారు. ఇప్పటికీ ఈమె పేరు చెబితే 'బేబి'నే చాలామందికి గుర్తొస్తుంది. అలాంటిది చిత్రం హిట్ అయినా సరే అంతలా బాధపడిందని లేటెస్ట్ ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది.(ఇదీ చదవండి: పైలెట్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ హీరోయిన్)Actress #VaishnaviChaitanya about Negativity She Faced After Baby Release:Baby చూసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారంట… చెప్పులు తీసుకుని పోస్టర్లపై కొడుతున్నారు… గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు… మంచిగా అనిపించలేదు. మస్తు బాధ అయింది.BABY ఇంత సక్సెస్ అయిందని ENJOY చేయాలా…… pic.twitter.com/NBft9OEhgv— cinee worldd (@Cinee_Worldd) September 12, 2026 -
పైలెట్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి
తెలుగు సినిమాతోనే హీరోయిన్గా పరిచయమైన మలయాళ బ్యూటీ ఐశ్వర్య పెళ్లి చేసుకుంది. పైలెట్ అవినాష్ సోమశేఖరన్తో కొత్త జీవితం మొదలుపెట్టింది. రీసెంట్‌గానే వీళ్లిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఐశ్వర్య దేవన్ తన ఇన్ స్టాలో పంచుకుంది. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)కేరళకు చెందిన ఐశ్వర్య దేవన్.. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. 2011లో రిలీజైన 'కెరటం' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలు చేసింది. ధనుష్ అనేకుడు, పృథ్వీరాజ్ సుకుమారన్ 'సింహాసనం'లోనూ నటించి ఆకట్టుకుంది. చివరగా అయితే 2018లో వచ్చిన 'కాశీ ఇన్ సెర్చ్ ఆఫ్ గంగా' అనే హిందీ మూవీలో కనిపించింది.2017లో ‘ఫెమినా మిస్ ఇండియా మహారాష్ట్ర’ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఐశ్వర్య దేవన్.. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంది. వారం క్రితం కేరళకు చెందిన పైలెట్ అవినాష్ సోమశేఖరన్ని పెళ్లాడి కొత్త జీవితం మొదలుపెట్టింది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన) View this post on Instagram A post shared by Aishwarya Devan (@aishwaryadevan) -
'సీక్రెట్ సోల్జర్.. కొత్త అనుభూతినిచ్చే స్పై డ్రామా సినిమా'
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలని పెంచింది. ఈ శుక్రవారమే అంటే సెప్టెంబర్ 18న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిహాల్, సూర్య శ్రీనివాస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)'చైనా పీస్’గా మొదలైన ప్రయాణం ‘సీక్రెట్ సోల్జర్’గా ఎలా మారింది?‘చైనా పీస్’ పేరుతోనే టీజర్ రిలీజ్ చేశాం. అలాగే రెండు పాటలు కూడా విడుదల చేశాం. అదే పేరుతో చాలా మార్కెటింగ్ చేశాం. మార్చిలో సినిమా రిలీజ్ చేద్దామని సెన్సార్‌కు పంపించాం. సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. రివ్యూ కమిటీలు, ఈబీసీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్.. ఇలా అన్ని స్థాయిలు దాటుకుని లిస్ట్ పంపించారు. అందులో మొదటి పాయింట్.. టైటిల్ ‘చైనా పీస్’ ఉండకూడదు. ఈ కథ ఆలోచన, ఉద్దేశంతో ఆలోచించుకుని ‘సీక్రెట్ సోల్జర్’ అయితే బాగుంటుందని ఆ టైటిల్ పెట్టాం.సెన్సార్‌లో దాదాపు 8 నెలలు ఈ సినిమా ఉన్నప్పటికీ, మేం ఏ ఆలోచనతో సినిమా తీశామో.. ఆ ఆలోచన విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. మా డైరెక్టర్ విశ్వనాథ్ చాలా కష్టపడ్డారు. కంటెంట్ విషయంలో తగ్గించడానికి ఎక్కడా కూడా రాజీ పడలేదు. విజువల్స్ పరంగా చాలా చిన్న కట్స్ మాత్రమే వచ్చాయి. ఇండియాకి సంబధించిన ఓ కీలక సమాచారం లీకవుతుంది. ఆ సంఘటనకి నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యని పరిష్కరించగలిగారా లేదా? అనేది స్టోరీ లైన్. స్నేహం, దేశభక్తి ఈ రెండు ఎమోషన్స్‌తో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇందులో అలాంటి ఒక కొత్త ఎమోషన్‌ను ఆడియన్స్ చూడబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు.(ఇదీ చదవండి: నా అందానికి సీక్రెట్ అదే: హీరోయిన్ శ్రియ) -
థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో అద్భుతమైన హిట్ అయి వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమా 'ఇరుముడి'. రవితేజ హీరోగా చేసిన ఈ చిత్రం ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయింది. రిలీజై దాదాపు మూడు వారాలు దాటిపోయినా సరే ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అలా బిగ్ స్క్రీన్స్‌పై ఉండగానే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించారు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో విశేషాదరణ దక్కించుకుంటోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ శుక్రవారం(సెప్టెంబరు 18) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు.'ఇరుముడి' విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీలేరు దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరిలో త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణి (బేబీ నక్షత్ర)తో కలిసి జీవిస్తుంటాడు. త్రినాథ్ అయ్యప్ప స్వామి భక్తుడు. అందుకు తగ్గట్లే ప్రతి ఏడాది మాల వేస్తుంటాడు. మరోవైపు ఊళ్లో ఓ రౌడీ గ్యాంగ్ బాగా రెచ్చిపోతుంటుంది. జనాలను ఇబ్బంది పెట్టడం, స్కూల్‌కి వెళ్లే అమ్మాయిలను వేధించడం వాళ్ల పని.త్రినాథ్ దీక్షలో లేనప్పుడు మందు కొడుతూ ఉంటాడు. అదే టైంలో ఊళ్లోని రౌడీలతో గొడవలకు దిగుతుంటాడు. అయితే త్రినాథ్ కూతురు మణికి గాయత్రి విషయంలో ఏదో తేడా జరుగుతోందని అనుమానం వస్తుంది. గాయత్రి.. గురుస్వామి (సాయి కుమార్) కూతురు. ఈ విషయం తన నాన్నకు చెప్పాలని మణి ప్రయత్నించినా చెప్పలేకపోతుంది. ఓ రోజు రాత్రి గాయత్రి అర్ధరాత్రి దాటినా ఇంటికి రాదు. అసలు ఆమెకు ఏమైంది? త్రినాథ్ ఆమెను వెతికి పట్టుకుంటాడా? ఆ రౌడీలకు తగిన బుద్ధి చెబుతాడా? లేదంటే కథలో ఇంకేదైనా పెద్ద ట్విస్ట్ ఉందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు) -
నా అందానికి సీక్రెట్ అదే: హీరోయిన్ శ్రియ
నటి, ఒకప్పటి హీరోయిన్ శ్రియని చూస్తుంటే అందానికి వయసుతో పని ఉండదా? అనే సందేహం కలుగుతుంది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం అంటే 2001లో 'ఇష్టం' అనే తెలుగు మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సంతోషం, నేనున్నాను తదితర చిత్రాలతో అలరించింది. 2003లో తమిళంలోకి వెళ్లింది. విజయ్, ధనుష్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఇక 2018లో ఆండ్రీ కొచ్చీవ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈమె.. అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తోంది.(ఇదీ చదవండి: పాక్ సినిమాలో 'సలార్' ఫైట్ కాపీ? వీడియో వైరల్)44 ఏళ్ల వయసులోనూ అందంగా కనిపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియ.. తన సౌందర్య రహస్యం గురించి చెప్పింది. నేను మనసులో ఏదీ దాసుకోను. ఏది అనిపిస్తే అది చెబుతాను . ఏ విషయంలోనూ దాపరికాలు లేకుండా మాట్లాడటమే నా బ్యూటీకి కారణమని భావిస్తున్నా. ప్రకృతి, భగవంతుడు ప్రసాదించిన అందాన్ని నేను కాపాడుకుంటున్నానని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?) -
కాకా ధూమ్ ధమాకా...
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, వీకే నరేశ్, అఖిల్ ఉడ్డెమారి నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కాకా ధూమ్...’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను జంగి రెడ్డి పాడారు. సురేష్ బొబ్బిలి ర్యాప్ వోకల్స్ అందించారు. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ చేశారు. ‘కాకా ధూమ్ ధమాకా, లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక, అరే బాపు రచ్చ లేపు, ఈడ గుమ్మిగూడాక, మూడు ముళ్ల సంబరాల ఢోలు బాజా కొట్టు...’ అంటూ ఈ పాట సాగుతుంది. -
దేవుడు వరమందిస్తే...!
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం మైథాలజీ , డివోషనల్ బ్యాక్‌డ్రాప్ సినిమాల ట్రెండ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన తెలుగు సినిమా ‘ఇరుముడి’, సూర్య తమిళ సినిమా ‘కరుప్పు’, బాలీవుడ్ సినిమా ‘హను మాన్ అంశ్’, యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ చిత్రాల సక్సెస్‌ను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మైథలాజీ అండ్ డివోషనల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఏంటి? దేవుడు వరం అందిస్తే... తమకు హిట్ కావాలన్నట్లుగా ఏయే హీరోలు ఈ జానర్లో సినిమాలు చేస్తున్నారు? అన్న అంశాలపై మీరూ ఓ లుక్ వేయండి.భూలోకం టు సత్యలోకం బ్రహ్మదేవుడి సత్యలోకం ఎలా ఉండబోతుందనేది వెండితెరపై ‘విశ్వంభర’ సినిమాలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విశ్వంభర’. ఈ మైథాలజీ అంశాలతో కూడిన ఈ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. కథ రీత్యా... పధ్నాలుగు లోకాలు దాటుకుని సత్యలోకంలో ఉన్న హీరోయిన్ను హీరో ఎలా భూలోకానికి తిరిగి తీసుకు వస్తాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో దొరబాబు అనే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, కథలో భాగంగా దొరబాబు పాత్రకు ఐదుగురు సిస్టర్స్ ఉంటారనే ప్రచారం సాగుతోంది. సురభి, రమ్య పసుపులేటి వంటి నటీమణులు ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక వీఎఫ్ఎక్స్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఈ పనులు కూడా తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఈ ఏడాది అక్టోబరులో దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగింది. కానీ ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ కాకపోవచ్చని, వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి తొలి వారంలో (జనవరి 9న విడుదల అని ఫిల్మ్‌నగర్ టాక్) తెరకు రావొచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే వచ్చే సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘కాకా’ జనవరి 13న రిలీజ్‌కి షెడ్యూల్ అయ్యింది. దీంతో వచ్చే సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ అవుతుందా? లేక ముందుగా అనుకున్నట్లుగా ‘కాకా’నే సంక్రాంతికి థియేటర్స్‌లో సందడి చేస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. రామాయణం ఆధారంగా వారణాసి మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ అడ్వెంచరస్ యాక్షన్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయిందని ఈ చిత్రదర్శకుడు రాజమౌళి ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ‘వారణాసి’ సినిమా ప్రధాన కథాంశం తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. కానీ ఈ సినిమా కథనంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్, మైథాలజీ అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలోని ఓ 30 నిమిషాల సీక్వెన్స్‌లో రాముడు పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణంలోని ఓ ప్రధాన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ సీక్వెన్స్‌ను తెరకెక్కించినట్లుగా రాజమౌళి అండ్ టీమ్ ఆల్రెడీ పేర్కొంది. దీంతో రాముడి గెటప్‌లో మహేశ్‌బాబు ఎలా ఉండబోతున్నారు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇంకా ఈ మైథాలజీ సీక్వెన్స్ ‘వారణాసి’ సినిమాకు ఎంత హైలైట్‌గా ఉండబోతుంది? అన్న అంచనాలు కూడా ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేశ్‌బాబు క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని తెలిసింది. రుద్రగా, రాముడిగా మహేశ్‌బాబు కనిపించనున్నారు. ఈ రెండు పాత్రల్లోనే కాకుండా మరో మూడు డిఫరెంట్ గెటప్స్‌లో మహేశ్‌బాబు కనిపిస్తారని, థియేటర్స్‌లో ఇవి ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇంకా ఈ చిత్రంలోని మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శివభక్తుడి పాత్రలో ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారని తెలిసింది. ఇక ప్రపంచ సంరక్షణ కోసం కాలాతీతంగా సాహసోపేతమైన ప్రయాణం చేసే ఓ వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో ‘వారణాసి’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. తొలిసారిగా... ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని ఓ సన్నివేశంలో విజయ్ దేవరకొండ అర్జునుడు పాత్రలో కనిపిస్తే, ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. అలాంటి విజయ్ దేవరకొండనే మెయిన్ హీరోగా ఓ మైథాలజీ డ్రామా వస్తే ఆయన అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అందుకే ఈ తరహా సినిమాను త్వరలోనే సెట్స్‌కు తీసుకుని వెళ్లనున్నారు విజయ్ దేవరకొండ. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌పై సరైన స్పష్టత రావాల్సి ఉంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ చిత్రాలతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమాల రిలీజ్ తర్వాత శౌర్యువ్ సినిమాను విజయ్ సెట్స్‌కు తీసుకువెళ్తారని ఊహించవచ్చు. ఇటు జై హనుమాన్ – అటు మహాకాళి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో (పీవీసీయూ) భాగంగా రూపొందిన ‘హను–మాన్’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో సినిమా ‘జై హను మాన్’. ‘కాంతార’ ఫేమ్ కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కథనం ప్రధానంగా లార్డ్ హనుమాన్ నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇందులో రానా, బాలీవుడ్ నటి వామికా గబ్బి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రంలోని రాముడు పాత్రలో ఓ టాప్ టాలీవుడ్ స్టార్ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ‘జై హనుమాన్’ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అలాగే ఈ ‘పీవీసీయూ’ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న మరో మైథాలజీ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘మహాకాళి’. ‘ది ఎండ్ బిగిన్స్’ అనేది ఈ సినిమా క్యాప్షన్. భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రేయా రెడ్డి, రోహిత్ సరాఫ్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ‘శుక్రాచార్య వార్ క్రై’ పేరిట ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అసురుల గురువు శుక్రాచార్యుడి నాయకత్వంలో జరిగే ఈ పోరాటం మరింత పెద్ద యుద్ధానికి దారి తీస్తున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా, పూజ అపర్ణ కొల్లూరు దర్శ కత్వంలో ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై రివాజ్ దుగ్గల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ ఖన్నా, అమ్మవారి పాత్రలో శ్రియా రెడ్డి నటిస్తున్నారని ఇటీవల విడుదలైన, గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఈ ‘మహాకాళి’ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వడ్డీ కాసులవాడు మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న డివోషనల్ ఫిల్మ్ ‘వడ్డీ కాసులవాడ’. ఈ చిత్రంలో రవి మోహన్ (‘జయం’ రవి) వెంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తున్నారు. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఓ మధ్యతరగతి యువకుడి పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏటీవీ సమర్పణలో కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం ఈ సినిమాకు సహ–నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇలా మైథాలజీ అండ్ డివోషనల్ అంశాలు మిళితమైన మరికొన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.దేవ సేనాపతి ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి యాక్షన్ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండోసారి సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. లార్డ్ కుమారస్వామి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఈ సినిమా అనౌన్స్మెంట్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. కొంత కాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోని ‘డ్రాగన్’ సినిమాతో ఇటు ఎన్టీఆర్, వెంకటేశ్ హీరోగా చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో అటు త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు.‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబరు నెలలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్‌తో తాను చేయబోయే సినిమాతో త్రివిక్రమ్ మరింత బిజీ అవుతారని ఊహించవచ్చు. అంతే కాదు... ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కోసం ‘దేవ సేనాపతి’, ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించిందట యూనిట్. ఈ చిత్రం 2028లో థియేటర్స్‌లోకి రావొచ్చనే ఊహాగానాలు కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.భక్తి నేపథ్యంలో కూడిన సినిమాలకు ఇటీవలి కాలంలో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోందని తెలుస్తోంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందినప్పటికీ ఈ సినిమాకు కాస్త డివోషనల్ టచ్ ఉంది. అయ్యప్పస్వామి బ్యాక్‌డ్రాప్‌ని కథలో కన్విన్సింగ్‌గా మిళితం చేయడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతోంది. ⇒ సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’గా రిలీజైంది). ఈ సినిమా వీరభద్రుడి స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ⇒ జస్ట్ రూ. 2 కోట్లతో తీసిన హిందీ సినిమా ‘హనుమాన్ అంశ్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి, ట్రేడ్ వర్గీయులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోగ్రాఫికల్ డివోషనల్ సినిమాకు డా. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. రాగిణి ఎస్, నమ్రత జి. సింగ్, అనుప్రియ ఎ. నగర్, డా. విశాల్ చతుర్వేది నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. త్రివిక్రమ్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థ ఈ సినిమాను తెలుగులో ఈ నెల 18న రిలీజ్ చేస్తోంది.⇒ నయనతార నటించిన మైథాలజీ అండ్ డివోషనల్ ఫిల్మ్ ‘ముక్కుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘మహాదేవి’) ఈ దీపావళికి రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది. సుందర్.సి ఈ సినిమాకు దర్శకుడు. ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.మైథాలజీ, భక్తి నేపథ్యంలో లైవ్ యాక్షన్ సినిమాలే కాకుండా, యానిమేషన్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్‌ను సాధిస్తున్నాయి. ‘మహావతార్ సినిమాటిక్’ యూనివర్స్ నుంచి ఇప్పటికే వచ్చిన యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ 2025లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ యూనివర్స్ నుంచి రెండో భాగంగా ‘మహావతార్ పరశురామ్’ 2027లో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. మొత్తం ఏడు సినిమాలు ఈ యూనివర్స్ నుంచి రిలీజ్ కానున్నాయి. అశ్విన్ కుమార్ ఈ యానిమేషన్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. రెండు సంవత్సరాలకొకసారి ఈ యూనివర్స్ నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుందని, అప్పట్లో మేకర్స్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ⇒ ‘బాహుబలి’ ఎంతటి బ్లాక్‌బస్టర్ సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అనే యూనిమేషన్ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం వచ్చే ఏడాది రానుంది. స్వర్గలోకాధిపతి ఇంద్రుడికి, బాహుబలికి మధ్య వైరం ఎలా మొదలైంది? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘బాహుబలి’ని మైథాలజీ వరల్డ్‌లోకి రాజమౌళి తీసుకువచ్చారు. రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ యానిమేషన్ సినిమాను నిర్మిస్తుండగా, ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యూనిమేషన్ మూవీలోని బాహుబలి పాత్రకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వనుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ⇒ ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్లో ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. లార్డ్ హనుమాన్ ఆధారంగా ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై మరోమారు సరైన అప్డేట్ రావాల్సి ఉంది. ⇒ భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ యానిమేషన్ సినిమాను తీస్తున్నారని, కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారని, త్వరలోనే ఈ అంశంపై ఓ అప్డేట్ రానుందనే ప్రచారం సాగుతోంది. ఇలా మైథాలజీ, భక్తిభావంతో కూడిన మరికొన్ని యూనిమేషన్ సినిమాల రూపకల్పనకు తెలుగు దర్శక– నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. – ముసిమి శివాంజనేయులు -
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
‘‘మా ‘అత్తమ్మ’, మా ‘నాన్న’... మా ఇంటికి పిల్లర్స్’’ అంటున్నారు రష్మికా మందన్నా. మామగారిని నాన్న అని పిలుస్తారామె. ‘దేవరకొండ’ ఇంటి కోడలిగా రష్మిక తొలి వినాయక చవితి పండగని జరుపుకోనున్నారు. మరి... పండగ ప్లాన్ ఏంటి? అంటే... ‘‘మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలను కుంటున్నాను’’ అన్నారు రష్మిక. ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన పలు వేడుకల్లో రష్మిక పాల్గొన్నారు. ఇప్పుడు ‘దేవరకొండ రష్మిక’గా పండగ చేసుకోవడం ఓ స్పెషల్ ఫీలింగ్ అన్నారామె. వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ‘దేవరకొండ రష్మిక’ చెప్పిన విశేషాలు...→ మీ ఇంట్లో పండగ ప్లాన్‌లో ఎవరి భాగం ఎక్కువ?అంతా మా అత్తమ్మే. ఇంట్లో ప్రతిదీ తనే ప్లాన్ చేస్తారు. నేను ఆమె చేసేవన్నీ జస్ట్ అలా ఎంజాయ్ చేస్తాను. నేననే కాదు... ఇంట్లో మేం అందరం బాధ్యత అంతా పూర్తిగా అత్తమ్మకే వదిలేస్తాం. అయితే డైట్ విషయంలో మేమంతా చాలా జాగ్రత్తగా ఉంటాం. బహుశా పండగ రోజు కూడా డైట్ నియమాలను పాటిస్తామేమో. మేం డైట్ పాటించినా, పాటించకపోయినా, ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా... ఇంట్లో ఏమేం చేయాలో అన్నీ మా అత్తమ్మే చూసుకుంటారు. → మీరు, మీ భర్త... మీ ఇద్దరిలో ఎవరికి భక్తి ఎక్కువ? ఇద్దరికీ... నేను ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు వర్క్ మీద వెళ్లేటప్పుడు పూజ చేసుకుని వెళతాను. విజయ్ కూడా చేస్తుంటారు. మేం ఇద్దరం గుడికి కూడా బాగా వెళుతుంటాం. భక్తి తాలూకు ఆ అనుభూతిని ఇద్దరం ఆస్వాదిస్తాం. → పండగకు ఇంటిని అలంకరించే విషయం కూడా మీ అత్తమ్మ చెప్పినట్లేనా? అంతే... ఇంట్లో ఎలాంటి సందడి నెలకొన్నా మా అత్తమ్మకే థ్యాంక్స్ చె΄్పాలి. మా అత్తమ్మ మా ఇంటికి ‘సూర్య రశ్మి’లాంటివారు. ఇంటిని అలంకరించడం, పిండి వంటలు చేయడం నుంచి పూజ చేయడం వరకూ అన్నీ ఆమే చేస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు మేం ఎంజాయ్ చేస్తాం. → మరి... పండగ వేడుకల్లో మీ మామయ్యగారు, మరిది (ఆనంద్ దేవరకొండ) భాగస్వామ్యమో? విజ్జు (విజయ్ దేవరకొండ), నాన్న, నా, ఆనంద్... మా అందరి భాగస్వామ్యం ఈక్వల్‌గా ఉంటుంది.. అయితే ఇంటి సారథి మాత్రం కచ్చితంగా అత్తమ్మే. మేం నలుగురం ఆమె మాట వింటాం... చెప్పినది చెప్పినట్లు నిజాయితీగా చేస్తాం. ఎందుకంటే మేం మా పనుల్లో మునిగిపోతాం... ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటాం. సో... ఇంట్లో మమ్మల్ని నిలకడగా ఉంచేది మా అత్తమ్మే. అసలు ఆవిడ పనులను ఎంత బాగా చేస్తారంటే... మెచ్చుకోవాలనిపిస్తుంటుంది. అంత బాధ్యతగా ఇంటిని పట్టించుకుంటారు కాబట్టే అత్తమ్మ ఏం చెబితే అది నమ్మి చేసేస్తాం. → ఇప్పుడు దేవరకొండ ఇంటి కోడలిగా పండగలో పాలుపంచుకోబోతున్నారు... ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు ఆ ఇంటి పూజల్లో పాల్గొన్నారా? పండగలప్పుడు, పూజలప్పుడు మా అత్తమ్మ దగ్గరవాళ్లందర్నీ పిలుస్తారు. ఈ ఇంటి ఆనవాయితీ అది. అలా నన్ను కూడా పిలిచేవారు. నన్ను సొంత మనిషిలా అనుకునేవారు. సో... ‘రష్మిక’లా ఈ ఇంటి వేడుకల్లో నేను చాలాసార్లు పాల్గొన్నాను. → ‘మిస్ రష్మిక’గా వెళ్లినప్పుడు ఇప్పుడు ‘మిసెస్ విజయ్’గా ఆ ఇంట్లో ఉంటున్న మీకు కనిపించిన తేడా? నిజాయితీగా చె΄్పాలంటే... ఏ తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదు. ఒప్పుడు ఓ ఫ్రెండ్‌లా నన్ను ఇంటికి పిలిచేవారు. ఇప్పుడు విజ్జు భార్యగా ఆ ఇంట్లో ఉన్నాను. వ్యక్తులుగా మాలో ఏ మార్పూ లేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే... ఆ కుటుంబ సభ్యురాలిగా ఉండటం అనే అనుభూతి వేరు. ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో దక్కే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం.→ ఎప్పుడైనా వినాయకుడి బొమ్మను గీశారా?నాకు బొమ్మలు గీయడం అస్సలు రాదు, కానీ రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. వినాయకుడి బొమ్మ గీసే అవకాశం ఎప్పుడూ రాలేదు. నాక్కూడా గీయాలనిపించలేదు. ఎందుకంటే నేను ఆ రూపానికి న్యాయం చేయలేనని నా ఫీలింగ్. అందుకే అసలు ప్రయత్నం కూడా చేయకూడదనుకున్నాను. కానీ రెండు సంవత్సరాల క్రితం ఎవరో నన్ను మట్టితో వినాయకుణ్ణి తయారు చేయమని అడిగితే కాదన లేక ప్రయత్నం చేశాను. నాకు చేతనైనంతలో బాగానే చేశాను.→ పెళ్లి వేడుకల్లో మీరు కట్టుకున్న చీరలన్నీ బాగున్నాయి... మరి... పండగ రోజు ఏం ప్లాన్ చేస్తున్నారు? కచ్చితంగా చీర కట్టుకుంటాను. ఈ పండగ జరుపుకోవడానికి వర్క్ నుంచి నాకు కొన్ని గంటలైనా బ్రేక్ దొరికితే బాగుండు అను కుంటున్నాను. ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ మెటీరియల్ శారీ కట్టుకోవాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలా ఉన్నాయి... అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది కట్టుకుంటాను.→ ఇటీవల విజయ్ ‘సీడ్ గణేశా’కి ప్రాధాన్యం ఇవ్వాలంటూ మట్టి వినాయకుడితో దిగిన ఫొటో బయటకు వచ్చింది... అవును... మా ఇంట్లో మేం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం. రాబోయే తరాలకు సుర క్షితమైన పర్యావరణం ఉండాలి కదా. అందుకు మా వంతు కృషి చేస్తాం. అందుకే ‘ఎకో ఫ్రెండ్లీ’ వినాయకుడిని ఇంటికి తీసుకు వస్తున్నాం. మేమే కాదు... అందరం ఎకో ఫ్రెండ్లీగా పండగ చేసుకుందాం.– డి.జి. భవాని -
తలా అజిత్‌తో సీఎం విజయ్.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ట్రీట్!
తమిళనాడు సీఎం, హీరో విజయ్.. స్టార్ హీరో అజిత్ కుమార్‌ను లండన్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ ట్రాక్‌లో కలిశారు. ప్రస్తుతం ‘మిచెలిన్ లీ మ్యాన్స్ కప్’లో పాల్గొంటున్న అజిత్‌ను విజయ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండేది. వీరిద్దరి అభిమానుల మధ్య రైవల్రీ కూడా ఉన్నప్పటికీ.. వీరి తాజా భేటీ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లగా.. అక్కడే అజిత్‌తో ఈ అరుదైన కలయిక చోటుచేసుకుంది. ఒకరిని ఒకరు చూసిన వెంటనే ఆనందంతో విజయ్ పరుగెడుతూ వెళ్లి అజిత్‌ను ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకరు రాజకీయ నాయకుడిగా, మరొకరు సినీ రంగంతో పాటు మోటార్ స్పోర్ట్స్‌లో రాణిస్తున్నారు. ఇలా ఇద్దరూ తమ తమ రంగాల్లో సరికొత్త ప్రయాణం సాగిస్తున్న వేళ జరిగిన ఈ భేటీపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.The way Thalapathy Vijay Hugged Ajith Kumar & AK welcomed @actorvijay ❤️ What an incredible Moment !!! An WHOLESOME Video !!! https://t.co/5IxWCYarp0— Let's X OTT GLOBAL (@LetsXOtt) September 12, 2026 -
బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్-10లో తొలి వీకెండ్ ఎపిసోడ్ శనివారం గ్రాండ్‌గా సాగింది. ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించారు. తప్పులు చేసినవారిని ప్రశ్నిస్తూనే.. బాగా ఆడినవారిని అభినందించారు. తనదైన పంచ్‌లు, సరదా సంభాషణలతో హౌస్‌లో నవ్వులు పూయించారు.ముందుగా కంటెస్టెంట్లతో మాట్లాడేందుకు వచ్చిన నాగార్జున కాసేపు సీరియస్‌గా కనిపించడంతో హౌస్మేట్స్ కాస్త భయపడ్డారు. ఆ తర్వాత నవ్వుతూ వారిని పలకరించారు. దీంతో ‘అలా చూడకండి సార్.. భయంగా ఉంది’ అంటూ కంటెస్టెంట్లు చెప్పగా.. నరేశ్ కూడా అదే మాట అనడంతో ‘నీకు కూడా భయం వేసిందా నరేశ్?’ అంటూ నాగార్జున నవ్వులు పూయించారు.రాంప్రసాద్, నరేశ్ రివ్యూలపై..ఇక రాంప్రసాద్, నరేశ్ కలిసి హౌస్‌లో ఎవరు ఎలా ఆడుతున్నారనే విషయంపై సరదాగా రివ్యూలు ఇచ్చారు. ఈ రివ్యూలను నాగార్జున టీవీలో వీక్షించారు. అనంతరం ఇద్దరినీ అభినందించారు. అయితే రాంప్రసాద్‌తో పోలిస్తే నరేశ్ తన అభిప్రాయాలను మరింత హార్ట్‌ఫుల్‌గా చెప్పాడని పేర్కొన్నారు.‘అసలు ఆట ఇప్పుడే మొదలైంది’అగ్నిపరీక్ష తర్వాత అసలైన మహాపరీక్ష మొదలవుతుందని బిగ్‌బాస్ ముందే చెప్పిన విషయాన్ని నాగార్జున గుర్తుచేశారు. 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. వారిలో కొందరు ఇప్పటికే హౌస్‌మేట్స్‌గా మారారని, మరికొందరు ఎలిమినేట్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్‌లో ఉన్నారని చెప్పారు. అదే సమయంలో చరణ్, చైత్రలు ఇంకా సీక్రెట్ రూమ్‌లో ఉన్నారా? అనే అనుమానం కంటెస్టెంట్లలో ఉందని గుర్తించిన నాగార్జున.. వారితో మాట్లాడించారు. దీంతో హౌస్మేట్స్ డౌట్స్‌కు క్లారిటీ ఇచ్చారు.( ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్)షాలినీకి చరణ్ ధైర్యంచరణ్కు నాగార్జున ఓ ప్రత్యేక అవకాశం ఇచ్చారు. హౌస్‌లో ఉన్న ఒకరితో మాట్లాడొచ్చని చెప్పారు. దీంతో చరణ్ షాలినీతో మాట్లాడాడు. ‘నువ్వు బాగా ఆడుతున్నావు.. అలాగే ఆడు’ అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత చైత్రకు కూడా ఇదే అవకాశం ఇచ్చారు. ఆమె ముకేశ్‌తో మాట్లాడింది. ‘నువ్వు చెప్పిన మాట విని ఉంటే బాగుండేది’ అంటూ చైత్ర చెప్పింది. అనంతరం రోహిత్ ఆటతీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: ‘స్పిరిట్‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’ముగ్గురికి మిల్క్షేక్లుముగ్గురు హౌస్మేట్స్ రోహిత్, రాంప్రసాద్, టెంపర్ వంశీ బాగా ఆడుతున్నారని మెచ్చుకున్న బిగ్‌బాస్.. వారికి మిల్క్‌షేక్‌లు పంపించా. అయితే వారు తాగిన గ్లాసులను నాగార్జునే కడిగారు. దీనిపై నాగార్జున మాట్లాడుతూ.. ‘ఏ పని చిన్నది కాదు.. ఏ పని తక్కువది కాదు. అలాంటి ఆలోచన ఉంటే ఇక్కడ ఉండొద్దు’ అంటూ క్లాస్ తీసుకున్నారు. అనంతరం మిగిలిన 11 మంది ఇంకా రిస్క్‌లోనే ఉన్నారని నాగార్జున తెలిపారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు.త్రిగుణ్, రోహిత్ తీరు అసహనం..ఆ తర్వాత ముకేశ్, త్రిగుణ్, వర్షిణిలను గార్డెన్ ఏరియాలోని పసుపు లైన్ దగ్గర నిల్చోమని బిగ్‌బాస్ ఆదేశించారు. వీరిలో ఒకరు ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం హౌస్‌మేట్‌గా మారబోతున్నారని నాగార్జున తెలిపారు. చివరికి నాలుగో హౌస్‌మేట్‌గా త్రిగుణ్ ఎంపికయ్యాడు. రోహిత్, త్రిగుణ్ ప్రవర్తనపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. రోహిత్‌కు క్షమాపణ చెప్పాలని త్రిగుణ్‌ను ఆదేశించారు. అంతేకాదు.. స్విమ్మింగ్ పూల్ చుట్టూ టైర్‌ను చేతితో ఎత్తుకుని తిరగాలని పనిష్మెంట్ ఇచ్చారు. ‘ఎంగిలి కప్పులు కడగాలి’ అనే మాట విషయంలోనూ రోహిత్‌కు క్షమాపణలు చెప్పాలని సూచించారు. అలాగే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయకపోవడంపై రోహిత్‌ను నాగార్జున ప్రశ్నించారు. ఇకపై బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను అందరూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమితదేబ్జానీకి నాగార్జున ప్రశంసలుహౌస్లో తెలుగులో మాట్లాడుతున్న దేబ్జానీని నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. బాగా ఆడుతున్నావంటూ ప్రశంసించారు. మరోవైపు రాంప్రసాద్ నవ్వించాలనే ప్రయత్నంలో కొన్ని పదాలు ఉపయోగిస్తున్న తీరును కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. ఇకపై రాంప్రసాద్ అలా మాట్లాడకుండా చూసుకునే బాధ్యతను నరేశ్ తీసుకోవాలని సరదాగా చెప్పారు.షాలినీ చేసిన ఓ కామెంట్ నేపథ్యంలో రాంప్రసాద్‌ను అతడి మొదటి సంపాదన ఎంత అని నాగార్జున అడిగారు. దానికి రాంప్రసాద్ తన మొదటి సంపాదన రూ.500 అని చెప్పాడు. అనంతరం షాలినీకి సారీ చెప్పడం కోసం 500 సార్లు sorry అని రాయాలని రాంప్రసాద్‌కు పనిష్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా బేబ్జానీ సరదాగా స్పందిస్తూ.. ‘నీ మొదటి సంపాదన రూ.20 అని చెప్పాల్సింది’ అంటూ నవ్వులు పూయించింది.పోటీ మరింత ఆసక్తికరంగా..ఆ తర్వాత కంటెస్టెంట్ల మనసులోని మాట తెలుసుకునేందుకు నాగార్జున ప్రయత్నించారు. మీకు నచ్చిన ఒకరి పేరు, నచ్చని ఒకరి పేరు చెప్పాలంటూ అడగడంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివర్లో మరో కీలక ప్రకటన చేశారు. లాస్ట్ హౌస్‌మేట్‌గా దేబ్జానీ ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో తొలి వీకెండ్లోనే బిగ్‌బాస్ హౌస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో రిస్క్‌లో ఉన్న వారిలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు? అన్నది ఉత్కంఠగా మారింది. -
‘స్పిరిట్‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’
సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా సోదరుడు, భద్రకాళి పిక్చర్స్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ‘రొమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలపై మాట్లాడిన ప్రణయ్.. రివ్యూవర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.‘రివ్యూ చేయడం చాలా ఈజీ’..సినిమా రివ్యూ చేయడం చాలా సులభమైన పని అని ప్రణయ్ అభిప్రాయపడ్డారు. దాదాపు 90 శాతం సినిమాలు లేదా 10లో 9 సినిమాలు విడుదలైన తర్వాత విఫలమవుతుంటాయని.. వాటిని రివ్యూ చేయడం సులభమేనని అన్నారు. చివరికి ప్రేక్షకుల తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్‘స్పిరిట్’తో చూస్తాం!ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘రొమాంచకం’ చిన్న సినిమా కాబట్టి దానిపై రివ్యూవర్లు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ సినిమా విషయంలో చేసినట్లే పెద్ద సినిమా అయిన ‘స్పిరిట్’ విషయంలోనూ చేయగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘స్పిరిట్’ విడుదలైనప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!తాము ఆ సినిమా ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నామని చెప్పారు. దీంతో ప్రణయ్ రెడ్డి వంగా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాత ప్రణయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్
తమిళ పండితుడు, ప్రముఖ నటుడు, టీవీ వ్యాఖ్యాత సోలమన్ పప్పయ్య (90) కన్నుమూశారు. మదురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యం తీవ్రం కావడానికి కొద్దిరోజుల ముందు వినాయక చవితి సందర్భంగా ప్రసారం కానున్న ప్రత్యేక పట్టిమండ్రం కార్యక్రమాన్ని ఆయన రికార్డు చేశారు.రజినీకాంత్ సంతాపంతమిళ భాష, సాహిత్యంపై విశేష సేవలు అందించిన సోలమన్ పప్పయ్య.. ‘పట్టిమండ్రం’ను పండితుల చర్చా వేదిక నుంచి సామాన్యుల ఇళ్లలోకి తీసుకెళ్లిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన మృతిపై సూపర్‌స్టార్ రజినీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు.అనుకోకుండా సినిమాల్లోకి.. సోలమన్ పప్పయ్యకు నటనపై ప్రత్యేక ఆసక్తి లేదు. అయితే ఆయన విలక్షణమైన గొంతు, హావభావాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ దర్శకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ‘మాప్పిళ్లై’, ‘పుదు వరుషం’ చిత్రాల్లో కనిపించిన ఆయనకు దర్శకుడు శంకర్ మరిన్ని అవకాశాలు ఇచ్చారు.ఇదీ చదవండి:పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమిత1999లో వచ్చిన ‘ముదల్వన్’లో నటించిన పప్పయ్య.. ఆ తర్వాత ‘బాయ్స్’, ‘ఎస్ మేడమ్’ చిత్రాల్లోనూ కనిపించారు. అయితే రజినీకాంత్హీరోగా తెరకెక్కిన ‘శివాజీ: ది బాస్’ ఆయన సినీ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో థొండైమాన్ పాత్రలో రజినీకాంత్‌తో కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.200కు పైగా అవకాశాలు..‘శివాజీ’ విజయం తర్వాత సోలమన్ పప్పయ్యకు ఏకంగా 200కు పైగా సినిమా అవకాశాలు వచ్చినట్లు సమాచారం. అయితే ఆయన ఒక్క అవకాశాన్నీ అంగీకరించలేదు. తన అసలు రంగమైన తమిళ సాహిత్యం, పట్టిమండ్రానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.‘శివాజీ’లోని అంగవై, సంగవై పాత్రలకు సంబంధించిన కామెడీ సన్నివేశంపై ఆయన తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశారట. అంగవై, సంగవై పేర్లు తమిళ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నవని, వాటిని అలాంటి హాస్య సన్నివేశానికి ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారట. ఈ కారణంగానే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!పద్మశ్రీతో గౌరవం..తమిళ భాష, సాహిత్యం, ప్రజా చైతన్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం 2000లో సోలమన్ పప్పయ్యను ‘కలైమామణి’ పురస్కారంతో సత్కరించింది. 2021లో 85 ఏళ్ల వయసులో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందించింది. ఆరు దశాబ్దాలకు పైగా తమిళ భాష కోసం సేవలందించిన ఆయన మృతి తమిళ సాహితీ, సాంస్కృతిక రంగానికి తీరని లోటుగా మారింది. -
ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!
బిగ్‌బాస్ సీజన్-10లో తొలి వీకెండ్ ఎపిసోడ్‌కు రంగం సిద్ధమైంది. వారమంతా హౌస్‌లో కంటెస్టెంట్ల ఆటతీరు, గొడవలు, టాస్కులతో సందడి నెలకొనగా.. వీకెండ్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతో మరింత ఆసక్తి పెరగనుంది. కంటెస్టెంట్లు చేసిన తప్పులను ప్రశ్నించడంతో పాటు.. బాగా ఆడినవారిని అభినందిస్తూ నాగార్జున తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయనున్నారు.ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమితఊహించని సర్ప్రైజ్ఈ వారం హౌస్‌లో అన్ని అంశాల్లోనూ తమ ఆటతో ఆకట్టుకున్న కంటెస్టెంట్లుగా రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీలు నిలిచారు. వారి ఆటతీరును నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాదు.. ఈ ముగ్గురికి ఊహించని సర్ప్రైజ్ కూడా ఇచ్చారు.వారు తాగిన మిల్క్‌షేక్ గ్లాసులను స్వయంగా నాగార్జున కడగడం ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్లను ప్రోత్సహించేలా ఆయన చేసిన ఈ పని చూసి హౌస్మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. దీంతో తొలి వీకెండ్ ఎపిసోడ్లో రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీలకు నాగార్జున ఇచ్చిన ఈ ప్రత్యేక గౌరవం హైలైట్‌గా నిలిచింది. -
అందుకే ‘శ్రీలత’ పాటని తెలంగాణ స్టైల్ లో కంపోజ్ చేయలేదు
‘శ్రీలత..’ పాట కోసం డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే సినిమాలోని కథలో భాగమవుతూ, ప్రమోషన్ కు కూడా ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాం. పాటలో క్యాచీ లిరిక్స్ కూడా కుదిరాయి. ప్రజలు ఈ పాటను ఓన్ చేసుకునేలా ఉండాలని డిజైన్ చేసి ముందే రిలీజ్ చేశాం.ఈ పాటకు ట్యూన్, లిరిక్స్ ఒకే రోజులో ఫైనల్ అయ్యాయి. పాట అందరికీ రీచ్ అవ్వాలనే కంప్లీట్ గా తెలంగాణ ఫోక్ స్టైల్ లో కంపోజ్ చేయలేదు. చరణం మెలొడియస్ గా ఉండేలా ట్యూన్ డిజైన్ చేశాను’ అని అన్నారు సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి. ప్రియదర్శి, ఫోక్ డాన్సర్ నాగదుర్గ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. బన్నీవాస్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘శ్రీలత..’పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, లిరిక్ రైటర్ అలరాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. .సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. 'శ్రీలత..' పాట మా ఫ్యామిలీ మెంబర్స్ కు బాగా నచ్చింది. వాళ్లు ఫోన్స్ చేసి పాట బాగుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మా సాంగ్ కు రెస్పాన్స్ బాగుంది. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్ , ఇద్దరు సింగర్స్ పాడిన విధానం తమను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ పాటలో నేను నటించాను. ఈ ఆలోచన బన్నీ వాస్ గారిది. మీరు ఇన్ని సాంగ్స్ కు మ్యూజిక్ చేశారు. మీరు ఎవరో ప్రేక్షకులకు తెలియాలి కదా అని ఈ సాంగ్ లో నేను కూడా నటించేలా చేశారు. నేను ప్రజలకు తెలియాలి అనే ఆలోచన నాలో కూడా ఉండేది. అందుకే ఒక ప్రైవేట్ సాంగ్ నేనే పర్ ఫార్మ్ చేస్తూ చేయాలని కూడా అనుకున్నాను. పాటలో నటించడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ పాటలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. లిరిక్ రైటర్ అలరాజు అన్న డైరెక్టర్ వంశీరెడ్డి అన్నకు ఫ్రెండ్. నాకు కూడా అలరాజు అన్న తెలుసు. ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో ఐడియా ఉంది. ఈ పాటలో తెలంగాణ వారికి వాడుకలో ఉన్న, సుపరిచితమైన కొన్ని పదాలతో పాట రాశాడు. అవి పాటకు అందాన్ని తీసుకురావడమే కాదు త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా చేశాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటకు కనెక్ట్ అయ్యారు. పాట బాగుందని కాల్ చేసిన చెబుతున్నారు.లిరిక్ రైటర్ అలరాజు మాట్లాడుతూ.. ‘ఈ పాట రాసేప్పుడు డైరెక్టర్ వంశీ రెడ్డి ..‘కథతో సంబంధం లేకుండా ఈ పాట అందరికీ నచ్చేలా ఉండాలి. సినిమా చూశాక ఇంకా శ్రోతలకు కనెక్ట్ కావాలి’అని చెప్పారు. మీరు ఇప్పుడు ఆడియో వింటుంటే నచ్చుతుంది. కానీ సినిమాలో చూసినప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా ఈ పాటను ఇష్టపడతారు. హీరో హీరోయిన్స్ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో వచ్చే సాంగ్ ఇది. శ్రీలత అలకకు కారణం ఏంటి, శ్రీనివాస్ ఏం చెప్పి ఆమెను బుజ్జగించాడు అనే నేపథ్యంతో ఈ సాంగ్ రూపకల్పన చేశారు. రెగ్యులర్ ఎక్స్ ప్రెషన్స్ కాకుండా ఈ పాట సాహిత్యం కొత్తగా రాసేందుకు ప్రయత్నించాను. టైటిల్ రివీల్ చేసేందుకు ముందగానే ఈ పాట ఫైనల్ అయ్యింది. ఈ పాటలోని పదాలను పూర్తిగా ఫోక్ స్టైల్ లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశాను. ఒక పెద్ద మూవీకి వర్క్ చేస్తున్నానే ప్రెషర్ నాపై ఉండేది కానీ వాళ్లు ఇచ్చిన ఇన్ పుట్స్ వల్ల కంఫర్ట్ గా లిరిక్స్ రాశాను. శ్రీలత పాట నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇడుపుకాయితం గీత రచయితగా నా బతుకు మార్చిన కాగితం అనుకుంటాను’ అన్నారు. -
నవ్వులు పూయిస్తున్న ‘హ్యాపీ జర్నీ’ ట్రైలర్
అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన్యతనిస్తూ రూపొందుతోంది. ఈ సినిమా సెప్టెంబరు 18న విడుదల కానుంది. ఈమేకు ఈ చిత్రం నుంచి ట్రైలర్ శనివారం విడుదల చేశారు. వయసుతో సంబంధంలేకుండా అన్నపూర్ణమ్మ చేసిన యాక్టింగ్ ఆకట్టుకుంటోది. కామిడీ పంచ్‌లు కూడా బాగా పేలాయి. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రంల్లో నటిస్తున్నారు. -
సినిమాల్లో అవకాశం అంటూ మోసం.. రోడ్డెక్కిన బాధితులు
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్షల్లో వసూలు చేసి మోసానికి ఒడిగట్టిన ఘటన హైదరాబాద్‌లో కలకలం సృష్టించింది. ఈమేరకు తమకు న్యాయం చేయాలంటూ భాదితులు అంబర్పేట్ శివం రోడ్డులోని సినిమా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంతమేర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.సినిమాలో అవకాశం ఇప్పిస్తామంటూ తమ దగ్గర రూ.లక్షల్లో డబ్బులు వసూళు చేసినట్లు బాధితులు తెలిపారు. తీరా అడిగే సరికి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని వారంతా వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇప్పించాలని వారంతా కోరారు. శివకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: డీ10 విన్నర్ రాజు పై కేసు.. Victims protest at the residence of film distributor Shivakumar Goud.They alleged that Shivakumar had collected lakhs of rupees from several individuals by promising to secure film offers for them. pic.twitter.com/sQCOa6f0IC— Shakeel Yasar Ullah (@yasarullah) September 12, 2026 -
టీవీ షో డీ10 విన్నర్ రాజు పై కేసు.. యువతిని వేధించాడంటూ ఆరోపణలు
డీ10 టీవీ షో విన్నర్ రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ యువతిని లైంగికంగా వేధించాడంటూ ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఈ నెల 9న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు రాజును అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే రాజుపై కేసు నమోదు చేసిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్నిరోజులుగా గోప్యంగా ఉంచినట్లు సమాచారం.డీ10 టీవీ షో ద్వారా రాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షో విన్నర్‌గా నిలిచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్
బిగ్‌బాస్ సీజన్10లో అగ్ని పరీక్ష తర్వాత మొదలవుతుంది అసలైన మహాపరీక్ష అని ముందే చెప్పినట్టుగానే బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు అసలు ఆట మొదలైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. కేవలం ముగ్గురు మాత్రమే హౌస్‌మేట్స్‌గా మారారు. మరో ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్‌లో కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!అయితే ఎలిమినేట్ అయిన ఇద్దరినీ బిగ్‌బాస్ ఇంకా సీక్రెట్ రూమ్‌లోనే ఉంచాడని పలువురు కంటెస్టెంట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున.. చరణ్, చైత్రలతో ఫోన్లో మాట్లాడి.. వాళ్లు తమ ఇంటి దగ్గరే ఉన్నారని కన్ఫామ్ చేయించారు. దీంతో ఇక ఎలిమినేషన్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని వారికి క్లారిటీ ఇచ్చారు. కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్..ఈ క్రమంలో నాగార్జున కూడాడఇచ్చాడు. ఆటలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. గేమ్‌లో ఎవరు నిర్లక్ష్యం చేసినా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో 11 మంది రిస్క్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు తమ గేమ్‌ను మరింత పదును పెడతారో చూడాలి. -
'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. తాజాగా టీజర్ విడుదల చేసి థియేటర్లలోకి వచ్చే విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.టీజర్ విషయానికొస్తే.. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాషణలతో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం – AK47’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ చమత్కారమైన రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్‌లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమిత
ఒకప్పుడు తన అందం, గ్లామర్‌తో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకున్న ఆమె ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యులో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భారతీయ వివాహ సంప్రదాయాలు, మహిళలపై రుద్దుతున్న ఆచారాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మగవాళ్లకు లేని కొన్ని నిబంధనలు ఆడవాళ్లకు మాత్రమే ఎందుకని ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?మగవాళ్లూ ఈ పనులు చేయచ్చు కాదా..‘పెళ్లి అనేది ఇద్దరిదీ.. మరి తాళి ఆడవాళ్లే ఎందుకు కట్టుకోవాలి. మహిళలే బొట్టు ఎందుకు పెట్టికోవాలి. అన్ని సంప్రదాయాలు వాళ్లే ఎందుకు పాటించాలని అందరూ అంటారు. వివాహానికి సంబంధించిన సంప్రదాయాలు ఇద్దరికీ సమానంగా ఉండాలి. మగవాళ్లు కూడా ఈ పనులు చేయచ్చు కదా. భర్త కోసం ఉపవాసం చేయాలని ఎక్కడైనా ఉందా. అలాంటిదేమీ లేదు కదా. అన్ని నిబంధనలు మహిళలకే ఎందుకు? ఇవన్నీ మనం సృష్టించుకున్నవే తప్పా ఏ గ్రంథంలోనూ ఇలాంటివి లేవు’ అని నమిత అభిప్రాయ పడ్డారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..సొంతం సినిమాతో.7 ఏళ్ల వయసులో మిస్ సూరత్‌గా ఎంపికన నిమితను ఈ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో థర్డ్ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి ‘బిల్లా’, ‘సింహా’వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బొట్టు అనే చిత్రంలో నటించి చివరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. 2017లో తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. -
‘ఇరుముడి’ థీమ్‌తో బోజ్జ గణపయ్య.. వీడియో వైరల్
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. గణనాథుడి విగ్రహాలు సరికొత్త రూపాల్లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటుంటాయి. ట్రెండ్‌కు తగ్గట్టుగా విభిన్న ఆకారాల్లో విగ్రహాలను తయారు చేయడం ఆనవాయితీగా మారింది. అంతేకాదు.. బ్లాక్‌బస్టర్ సినిమాల థీమ్‌లను కూడా వినాయకుడి విగ్రహాల్లో ప్రతిబింబిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా థీమ్‌తో గణేశుడి విగ్రహాలు సందడి చేసిన సంగతి తెలిసిందే. హీరోల రూపాల్లోనూ విగ్రహాలు దర్శనమిస్తూ నెట్టింట వైరల్‌గా మారుతుంటాయి. ఇప్పుడు తాజాగా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థీమ్‌తో రూపొందించిన వినాయకుడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహాన్ని వైజాగ్‌లో తయారు చేశారు.శివుడు, పార్వతి కలిసి వినాయకుడికి ఇరుమడి కడుతున్నట్లుగా ఉన్న ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక ఇరుముడి సినిమా విషయానికొస్తే.. రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్స్‌లో రిలీజై..తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. విడుదలైన రెండు వారాలకే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. మూడో వారం ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 225 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిర కీలక పాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. #IRUMUDI Effect 🤌👌Chudataniki Chala Bagundi 🛐స్వామియే శరణం అయ్యప్ప 🙏 pic.twitter.com/digPReR1ER— Hari SaaHo (@HariSaaho19) September 12, 2026 -
పాక్ సినిమాలో 'సలార్' ఫైట్ కాపీ? వీడియో వైరల్
పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా 'సలార్'. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించేసరికి ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదల విషయంలో పలుమార్లు వాయిదా పడటంతో ఎందుకనో థియేటర్లలో సరిగా ఫెర్ఫార్మ్ చేయలేదు. కానీ తర్వాత కాలంలో ఓటీటీ, టీవీలో ప్రసారమైన తర్వాత విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో 'సలార్' గురించి వినిపిస్తూనే ఉంటుంది.కానీ రీసెంట్గా కొన్నిరోజుల నుంచి 'సలార్' ఫైట్ సీన్‌ని పాకిస్తాన్‌కి చెందిన ఓ సినిమాలో కాపీ కొట్టారని చెప్పి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు. పాక్‌కి చెందిన హసీబ్ బిలాల్ అనే ఇన్ఫ్లుయెన్సర్.. ఏఐ ఉపయోగించి 'సలార్' స్ఫూర్తిగా తన ప్రతిరూపంలో వీడియో సృష్టించి దానిని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. చూడటానికి ఇది రియల్‌గా ఉండేసరికి చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' చేస్తున్నాడు. మరి వీళ్లు ఈ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత 'సలార్ 2' కోసం కలుస్తారేమో చూడాలి? దీని కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త గట్టిగానే ఎదురుచూస్తున్నారు.What's going on in pakistan 😂#prabhas #salaar #prashanthneel #SpiritMovie pic.twitter.com/Ja8HbVt7RL— Rishika nayak (@karthiknayak897) September 7, 2026 -
67 ఏళ్ల వయసులో గర్భవతి.. నిజమే అని చెప్పమన్నా : నటి
ట్రోల్స్‌కి కాదేది అనర్హం అన్నట్లుగా మారిపోయింది నేటి సోషల్ మీడియా పరిస్థితి. ముఖ్యంగా సినీ తారల విషయంలో ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. వారి సినిమాలు, నటన మాత్రమే కాదు.. నడక, మాట తీరు, శరీరాకృతి, దుస్తులు ఇలా ప్రతీ విషయాన్నీ టార్గెట్ చేస్తూ బాడీ షేమింగ్‌కు దిగుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఇలాంటి ట్రోలింగ్‌కు గురయ్యారు. చీర కట్టుకున్న సమయంలో ఆమె పొట్ట కాస్త ఎక్కువ కనిపించడంతో గర్భవతి అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ ఘటనపై తాజాగా స్పందించిన నీనా గుప్తా.. ట్రోలర్స్‌కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.గర్భవతి అనే చెప్పమన్నా.. తాజాగా జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ న్యూస్ 18తో నీనా గుప్తా మాట్లాడుతూ.. బాడీ షేమింగ్‌పై స్పందించారు. ‘ట్రోలింగ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎలా ఉన్నా ట్రోలింగ్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ మధ్య నేను చీరకట్టుకొని ఓ ఫంక్షన్‌కి వెళ్లా. చీర కాస్త బరువుగా ఉండడంతో సర్దుకునే క్రమంలో నా పొట్ట కాస్త లావుగా కనిపించింది. దాంతో 67 ఏళ్ల వయసులో గర్భవతి అయ్యారని ట్రోల్ చేశారు. (ఇదీ చదవండి: రోజుకి రెండే చపాతీలు తింటా.. ఇదే నా డైట్)బాడీ షేమింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇవన్నీ నా టీమ్ నా దగ్గరకు తీసుకోచ్చారు. చూసి నవ్వుకొని.. ‘నేను నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్పండి’ అని నా టీమ్‌కి చెప్పా. బాడీ షేమింగ్ ఎదుర్కొంటున్నవాళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే.. ‘లావుగా అయిందని అంటే.. ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పండి’ అని ఆమె అన్నారు. అలాగే ‘పెళ్లి ఎప్పుడు?’ అని వ్యక్తిగత ప్రశ్నలు అడిగే వారిని ఎలా ఎదుర్కొంటారని అడగ్గా.. ‘నేను మీపై ఆధారపడి బతకడం లేదు కదా? మీ సమస్య ఏంటి? ఇంతకీ మీకు పెళ్లి అయిందా? అని తిరిగి ప్రశ్నిస్తానని నీనా చెప్పుకొచ్చింది.వెండితెర పైనే కాకుండా బుల్లితెర వేదిక గానూ ప్రేక్షకులను అలరించారు నటి నీనా గుప్తా. ‘ఇష్క్’, ‘ఎలోన్’, ‘ముల్క్’, ‘83’, ‘డయల్ 100’, ‘గుడ్‌బై’ వంటి చిత్రాల్లో నీనా కీలక పాత్రలు పోషించారు. సినిమాల్లో రాణిస్తోన్న తరుణంలోనే ఆమె ధారావాహికల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్‌సిరీస్‌లోనూ నటించారు. ఆమె నటించిన కామెడీ-డ్రామా సిరీస్ ' చుంబక్' సెప్టెంబర్ 11న విడుదలైంది. -
నాలుగు కొత్త సినిమాల రివ్యూస్.. ఏది ఎలా ఉంది?
ప్రతివారాంతంలో కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజవుతూనే ఉంటాయి. ఈ వారం అలా స్ట్రెయిట్, డబ్బింగ్ రూపంలో నాలుగైదు మూవీస్ విడుదలయ్యాయి. వీటిలో కార్తీ 'సర్దార్ 2', ఆనంద్-వైష్ణవి 'ఎపిక్', సుహాస్ 'మండాడి', సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' చిత్రాలున్నాయి. ఇంతకీ ఇవెలా ఉన్నాయి? వీటి రివ్యూలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ'బేబి' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'ఎపిక్'. 90స్ వెబ్ సిరీస్‌లోని చిన్న పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయి.. పై చదువుల కోసం లండన్ వెళ్లి ఓ అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్‌తో తీశారు. బోల్డ్ సీన్స్, రొమాన్స్ కాస్త ఎక్కువగానే దట్టించారు. అయితే స్టోరీ పెద్దగా లేకపోవడంతో చాలామంది ప్రేక్షకులకు ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కొన్నిచోట్ల ఎమోషన్ పర్లేదనిపించింది.పూర్తి రివ్యూ: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ2022లో వచ్చిన 'సర్దార్' సినిమాకు సీక్వెల్ 'సర్దార్ 2'ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తీశారు. కార్తీ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నప్పటికీ మిగిలిన విషయాలు పెద్దగా అలరించలేదు. ఎస్జే సూర్య విలనిజం కాస్త బోర్ కొట్టించగా.. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ గ్లామర్ సరిపోలేదు. పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి భాగాన్ని తీసినంత ఎంగేజింగ్‌గా దీనిని తీయలేకపోయారు.పూర్తి రివ్యూ: ‘సర్దార్ 2’ మూవీ రివ్యూతెలుగు నటుడు సుహాస్ చేసిన తమిళ చిత్రం 'మండాడి'. సూరి హీరో కాగా సుహాస్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించాడు. సముద్రంలోని బోట్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఇది తీశారు. తెరపై కష్టం బాగా కనిపించింది. కథాకథనాలు పర్లేదనిపించాయి. ప్రస్తుతానికైతే తెలుగులో ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ కనిపిస్తున్నాయి.పూర్తి రివ్యూ: మండాడి మూవీ రివ్యూసుమంత్ హీరోగా చేసిన డివోషనల్ థ్రిల్లర్ సినిమా 'మహేంద్ర గిరి వారాహి'. సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేశ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఓ ఊరు, రాజకుటుంబం, ఓ శాపం, 33 ఏళ్ల వయసొచ్చేసరికి రాజకుటుంబంలోని పురుషులు చనిపోవడం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తీశారు. ఈ రహస్యం వెనకున్న నిజాన్ని బయటకు తీసే యూట్యూబర్‌గా సుమంత్ చేశాడు. ఈ మూవీ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.పూర్తి రివ్యూ: ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ -
రోజుకి రెండే చపాతీలు తింటా.. ఇదే నా డైట్
ఒకప్పుడు రోజంతా కష్టపడి కడుపు నిండా తినేవాళ్లు. పెద్దగా ఇబ్బందులు లేకుండానే ఏళ్లకు ఏళ్లకు ఆరోగ్యంగా బతికేసేవాళ్లు. కానీ ప్రస్తుతం ఏం తిన్నా గానీ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్ అని లెక్కలేసుకుంటున్నారు. మరికొందరైతే రోజుకి ఒకటి రెండుసార్లు అది కూడా చాలా తక్కువ మొత్తంలో తింటున్నవాళ్లు కూడా ఉన్నారు. అలా ఇప్పుడు చాలామంది రకరకాల డైట్స్ పాటిస్తున్నారు. ఇవన్నీ పక్కనబెడితే సలార్, కేజీఎఫ్ సినిమాల సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్.. తన రోజువారీ డైట్ గురించి చెప్పి షాకిచ్చాడు.(ఇదీ చదవండి: ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?)రవి బస్రూర్ సంగీతమందించిన లేటెస్ట్ సినిమా 'టాక్సిక్'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది గానీ అస్సలు ఆడలేదు. దీని ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ సంగీత దర్శకుడు.. తను ప్రతిరోజూ రెండు చపాతీలు, షాహీ పన్నీర్ కర్రీ మాత్రమే తింటానని మరేం తిననని అన్నాడు. కావాల్సినంత నీరు తాగి, కంటినిండా నిద్రపోతానని చెప్పాడు. ఇలా చేయడానికి కారణం కూడా చెప్పాడు.హిమాలయాల్లో ఉండే చాలామంది ఎలాంటి ఆహారం తీసుకోకుండానే 15-20 ఏళ్లు బతుకుతున్నారని.. తన డైట్‌కి గల కారణాన్ని చెప్పుకొచ్చాడు. అయితే రవి బస్రూర్కి సాధ్యమైన ఈ డైట్ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మన శరీరానికి ఆకుకూరలు, కూరగాయలు, అన్నం, పప్పలు, మాంసకృత్తులు ఇలా చాలా కావాల్సి ఉంటుంది. ఏవి అందకపోయినా సరే పోషకాహార లోపం వచ్చే అవకాశముంటుంది. మరి ఇలాంటివేం తినకపోయినా సరే 'సలార్' సంగీత దర్శకుడు ఎలా మేనేజ్ చేస్తున్నాడనేది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న.స్వతహాగా స్వర్ణకారుడు అయిన రవి బస్రూర్.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన 'కేజీఎఫ్' సినిమాతో వెలుగులోకి వచ్చాడు. ప్రభాస్ 'సలార్'కి కూడా మ్యూజిక్ కంపోజ్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నీల్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న 'డ్రాగన్'కి ఇతడే సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ప్రశాంత్ నీల్ నిర్మాతగా హారర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?
'బేబి' సినిమాతో మూడేళ్ల క్రితం హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా మూవీ 'ఎపిక్'. గతంలో వచ్చిన #90స్ వెబ్ సిరీస్‌లోని పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయిన తర్వాత ప్రేమలో పడితే అనే స్టోరీతో దీన్ని తీశారు. నిన్న(సెప్టెంబరు 11) థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి చాలావరకు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం తొలిరోజు బాగానే వచ్చాయి.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన 'ఎపిక్' సినిమాకు తొలిరోజు(ప్రీమియర్లతో కలిపి) మన దేశంలో రూ.2.10 కోట్ల నెట్ వసూళ్లు రాగా ఓవర్సీస్తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి మొత్తగా రూ. 5 కోట్ల వరకు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తొలిరోజు టాక్ నెగిటివ్‌గా ఉన్న నేపథ్యంలో వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది చూడాలి?పైచదువుల కోసం యూకే వెళ్లిన ఓ తెలంగాణ పల్లెటూరి కుర్రాడు.. ఓ మోడ్రన్ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే వాళ్లు ఎంతవరకు హద్దులు దాటేశారు. ఈ క్రమంలోనే ఏమేం తెలుసుకున్నారు? తదితర అంశాలతో ఈ సినిమా తీశారు. అయితే ఎమోషన్స్ గానీ అటు లవ్ యాంగిల్ గానీ సరిగా వర్కౌట్ కాలేదని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. మరికొందరు మాత్రం తమకు నచ్చిందని అంటున్నారు. ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు.ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ -
సెప్టెంబర్ 25న అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎన్కోర్
మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్. మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ నెల 25న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఇది థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈసారి ‘ఎండ్‌గేమ్’ని 4DX, MX4D, SCREEN X, డాల్బీ విజన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులు చూడొచ్చు.ఇదీ చదవండి: నాకు ఈగో లేదు.. ఆ రూమర్స్ పట్టించుకోవద్దు: శ్రీలీలముఖ్యంగా ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను కూడా చూపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.‘ఎండ్‌గేమ్’ కథలో థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనమవుతుంది. మిగిలిన సూపర్ హీరోలు ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. చివరికి తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతని పునరుద్ధరించేందుకు థానోస్‌తో తలపడాల్సి వస్తుంది. కెవిన్ ఫైజ్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు? -
బిగ్‌బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?
సాధారణంగా బిగ్‌బాస్‌లో ఏ సీజన్ అయినా సరే ప్రారంభంలో కాస్త నిదానంగా ఉంటుంది. ఒకటి రెండు వారాలు పూర్తయిన తర్వాత గొడవలు, ఎలిమినేషన్లతో హీట్ పెరుగుతుంది. కానీ రీసెంట్గా మొదలైన తెలుగు బిగ్‌బాస్ 10లో ఊహించని ట్విస్టులు షాకిస్తున్నాయి. ఇంతకీ ఐదో రోజైన శుక్రవారం(సెప్టెంబరు 11) అసలేం జరిగింది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు)సింపుల్.. టఫ్ టాస్క్చరణ్ ఎలిమినేట్ కావడంతో గురువారం ఎపిసోడ్ పూర్తయింది. తమ స్నేహితుడు ఇలా అర్థాంతరంగా హౌస్ వీడి బయటకెళ్లిపోయేసరికి సృష్టి బాధపడింది. మరోవైపు ఝాన్సీ గేమ్ గురించి మాట్లాడుకున్న అమన్, రోహిత్, సృష్టి, షాలిని.. మనతో ఉంటే వాళ్లు టార్గెట్ చేస్తారని తెలివిగా ఆమె వాళ్ల వైపు వెళ్లిపోయిందని అనుకున్నారు. కట్ చేస్తే సులభమైన టాస్క్ కోసం ఏడుగురు, కష్టమైన టాస్క్ కోసం ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని బిగ్‌బాస్ చెప్పాడు. త్రిగుణ్, ముఖేశ్, కృష్ణుడు మేం ఆడమని చెప్పేయగా.. హై రిస్క్‌లో ఉన్న కారణంగా చైత్రని ఆడొద్దని ఆదేశించాడు. దీంతో మిగతావాళ్లంతా మాట్లాడుకుని సుధీర్, వర్షిణిని కష్టమైన టాస్క్ కోసం.. రాంప్రసాద్, ఝాన్సీ, నరేశ్, సృష్టి, అమన్, షాలిని, దేబ్జానీ సింపుల్ టాస్క్‌కి సెలక్ట్ అయ్యారు.ట్రయాంగిల్ లవ్ స్టోరీ?రోహిత్ తనతో మాట్లాడటం లేదని సృష్టి, అమన్‌తో చెప్పేసరికి.. ఇతడీ విషయం రోహిత్‌కి చెబుతాడు. దీంతో రోహిత్ వెళ్లి సృష్టితో మాట్లాడతాడు. ఇదంతా చూసిన షాలిని.. తన వల్లే సృష్టికి రోహిత్ దూరమైపోతున్నాడేమోనని తెగ బాధపడిపోయింది. ఇదంతా చూస్తుంటే వీళ్ల ముగ్గురి మధ్య లవ్ స్టోరీ లాంటిది ఏమైనా మొదలవుతుందేమోనని అనిపిస్తోంది. మరోవైపు కర్చీఫ్ వేసి పరుగెత్తి వచ్చి కూర్చునే సింపుల్ టాస్క్‌లో రాంప్రసాద్ విజేతగా నిలిచాడు. గేమ్‌లో గెలిచినందుకు ఒకరిని హై రిస్క్‌లో పెట్టాలని అనగా అమన్ పేరు చెప్పుకొచ్చాడు.సుధీర్-వర్షిణి దొందుకు దొందేకష్టమైన టాస్క్ కోసం ఎంపికైన సుధీర్, వర్షిణిని లోపలికి పిలిచిన బిగ్‌బాస్.. ఓ కేక్ స్మాష్ చేసి దీనిని ఒకరు చేశారంటే మరొకరు చేశారని కంటెస్టెంట్స్ అందరినీ నమ్మించాలని.. ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్లు సేవ్ అవుతారని అన్నాడు. అయితే ఈ టాస్క్ సరిగా ఆడలేక లోపల జరిగిన విషయాన్ని వర్షిణి, ముకేశ్‌కి చెప్పేయడంతో గేమ్ ఆడిన సుధీర్, వర్షిణి ఇద్దరూ కూడా హై రిస్క్ జోన్లోకి వెళ్లారని బిగ్‌బాస్ అల్టిమేటం జారీ చేశాడు.చైత్ర ఎలిమినేట్ఇక మహాపరీక్షలో భాగంగా హై రిస్క్‌లోకి వచ్చిన చైత్ర, వర్షిణి, సుధీర్, అమన్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పిన బిగ్‌బాస్.. నలుగురూ మిగిలిన వాళ్లలో ఒక్కొక్కరికి ఓటు వేయాలని చెప్పాడు. దీంతో వర్షిణి, చైత్ర పేరు.. అమన్ కూడా చైత్ర పేరు.. సుధీర్ కూడా చైత్ర పేరు చెప్పాడు. ఇక చైత్ర, సుధీర్ ఎలిమినేట్ అవ్వాలని చెప్పింది. చైత్రకు మూడు ఓట్లు వచ్చినందుకు చైత్ర ఎలిమినేట్ అయింది. ఏంటి బిగ్‌బాస్ ఇది నాలుగు రోజుల్లో ఇద్దరినీ తీసుకెళ్లిపోతారా అని రాంప్రసాద్ కామెడీ చేశాడు. ఇలా ఐదోరోజు ఎపిసోడ్ ముగిసింది. వారం కాకుండానే ఇద్దరిని ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్.. వీకెండ్లో ఇంకెలాంటి ట్విస్టులు ఇస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్‌బాస్ జంటకు మరో కూతురు) -
రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు
భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన పురాణ గాథలకు సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ మరోసారి సరికొత్త రూపం ఇవ్వబోతోంది. ఒకప్పుడు ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి సీరియళ్లతో దేశ టీవీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన సాగర్ కుటుంబం.. ఇప్పుడు వెండితెరపై మరింత భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ పేరుతో లైవ్-యాక్షన్ సినిమాటిక్ సాగా రూపుదిద్దుకుంటోంది. మొత్తం ఏడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.శ్రీమద్భాగవత మహాపురాణం విస్తృతమైన కథా ప్రపంచాన్ని కలిగి ఉంది. ఇంతటి విస్తారమైన కథని ఒకే సినిమాలో చెప్పడం కంటే ఏడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను మరింత పెంచుతోంది. ‘విష్ణురథ’ ఈ ఏడు భాగాల ప్రయాణానికి తొలి అధ్యాయం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామానంద్ సాగర్ కుటుంబానికి చెందిన ఈ తదుపరి తరం దర్శకులు ఇప్పుడు కుటుంబ వారసత్వాన్ని కొత్త తరహా సినిమా భాషతో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించారు. -
నాకు ఈగో లేదు.. ఆ రూమర్స్ పట్టించుకోవద్దు
సినిమా ఇండస్ట్రీలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అలా హీరోయిన్ శ్రీలీల కూడా విమర్శలని ఎదుర్కొంటూనే ఉంది. శాండిల్‌వుడ్ నుంచి టాలీవుడ్ వయా కోలీవుడ్, బాలీవుడ్ అని పరుగులు పెడుతోందీ భామ. తెలుగులో క్రేజీ హీరోయిన్ స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌లో ఆ స్థాయి కోసం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'పరాశక్తి' మూవీతో తమిళ ప్రేక్షకులను అలరించిన ఈ భామ ప్రస్తుతం ధనుష్ సరసన 'ఓం' చిత్రంలో నటిస్తోంది. నవంబర్ 26న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.ఇదీ చదవండి: నా ముఖమే అంతా.. 'ప్యారడైజ్' దర్శకుడి ట్వీట్అసలు విషయానికొస్తే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీలీల.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇరు రాష్ట్రాల ప్రేక్షకులని ప్రేమిస్తున్నాను. అయితే నాతో సమంగా నటించే నటుడో, నటినో లేరని నేను గర్వపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నాకు అలాంటి అహంకారం లేదు. నేనెవరి దగ్గర ఈగో ప్రదర్శించలేదు. అందరినీ గౌరవించే మనస్తత్వం నాది. కాబట్టి అనవసర పుకార్లని ఎవరూ నమ్మకండి. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా దృష్టి నటనపైనే. అది మినహా నా మనసులో మరేదీ లేదు అని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు -
నా ముఖమే అంతా.. 'ప్యారడైజ్' దర్శకుడి ట్వీట్
మరో రెండు వారాల్లో నాని హీరోగా చేసిన 'ప్యారడైజ్' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మార్చి, ఆగస్టు అని చెప్పి రెండుసార్లు వాయిదా పడింది. ఈసారి కూడా అలానే జరగొచ్చు అని పుకార్లు వస్తున్న నేపథ్యంలో హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టారు. రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో మరో ఆసక్తికర సంఘటన కూడా జరిగింది.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!'ప్యారడైజ్' సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. గతంలో ఇతడు నానితో 'దసరా' తీశాడు. ఇప్పుడు ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే ఎప్పుడు చూసినా గానీ శ్రీకాంత్ సీరియస్‌గా ఫేస్ పెట్టి కనిపిస్తుంటాడు. పెద్దగా నవ్విన సందర్భాలు కూడా లేవు. ఎవరో ఈ విషయమై కామెంట్ చేయగా.. దీనికి రిప్లై ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు. 'నా ముఖమే అంతా' అని ఓ మీమ్ ఫొటోని పోస్ట్ చేసి సమాధానమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.పీరియాడికల్ సినిమాగా తీసిన 'ప్యారడైజ్'లో ప్రధానంగా తల్లికొడుకుల ఎమోషన్ ఉండనుందని హీరో నాని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ట్రైలర్ లాంటిది ఏం లేకుండానే చిత్రం థియేటర్లలోకి రానుందని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అంచనాలు ఎక్కువగా ఉన్న ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? దీని తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవితో మూవీ కమిట్ అయ్యాడు.ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు😂♥️#TheParadiseWillRiseFromSept24 https://t.co/pw00Bli9v0 pic.twitter.com/Sb3obcARmG— Nani (@NameisNani) September 11, 2026 -
స్కిన్‌కేర్ రంగంలోకి విజయ్ దేవరకొండ
హైదరాబాద్: యువ హీరో విజయ్ దేవరకొండ చర్మ సంరక్షణ ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టారు. ‘అన్‌హైప్’ అనే కొత్త స్కిన్‌కేర్ బ్రాండ్‌కు ఆయన సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు. భారతీయ యువత అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయంగా రూపొందించిన స్కిన్‌కేర్ ఉత్పత్తులను అందుబాటు ధరలో ఈ బ్రాండ్ అందిస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నో బీఎస్.. ఓన్లీ వాట్ వర్క్స్’ అనే నినాదంతో 18–30 ఏళ్ల యువత లక్ష్యంగా అన్‌హైప్ ఉత్పత్తులు ఉంటాయి. ఈ బ్రాండ్ కింద .. ఒక్కో దానిలో మూడు ఉత్పత్తులు చొప్పున రెండు ‘వీడీ సిగ్నేచర్ రొటీన్స్’ ఉంటాయి. ఒక్కో రొటీన్ ధర రూ. 1,299గా ఉంటుంది. -
అమ్మతనం కెరీర్‌కి అడ్డంకి కాదు: పరిణితీ చోప్రా
‘‘తల్లయిన హీరోయిన్లకు గతంలో అవకాశాలు చాలా తక్కువగా వచ్చేవి. హీరోయిన్గా చాన్స్‌లు వచ్చేవి కాదు. కానీ, ప్రస్తుతం అలా కాదు... పెళ్లయ్యాక, తల్లయ్యాక కూడా కథానాయికల సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. నటించాలనే ఆసక్తి ఉన్నంతకాలం అమ్మతనం కెరీర్‌కు అడ్డంకిగా మారదు’’ అని పరిణితీ చోప్రా తెలిపారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘షఖ్: ట్రస్ట్ నో వన్’. ఈ నెల 24 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా పరిణితీ చోప్రా మాట్లాడుతూ–‘‘పెళ్లి, పిల్లలు తర్వాత అవకాశాలు అందుకునే విషయంలో గతంలో ఒక తరం నటీమణులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తల్లయిన మహిళలను లీడ్ రోల్స్‌లో చూడడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. నాటి ప్రేక్షకులు, పరిశ్రమ ఆలోచనా విధానం వల్ల ఒక తరం నటీమణులు కెరీర్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. బిడ్డకు జన్మనివ్వడం జీవితంలో అందమైన విషయం. ఆ కారణం వల్ల పని కోల్పోవాల్సి వస్తే బాధగా ఉంటుంది. ఇప్పుడు తల్లులైన హీరోయిన్ల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుండటం వల్లే రచయితలు, దర్శకులు వారికి తగ్గ కథలను సిద్ధం చేస్తున్నారు. ఆలియా, దీపికా, ప్రియాంకా చోప్రా వంటి వారు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే కెరీర్‌ను ముందుకు తీసుకెళుతుండటం సంతోషం. నటిగా నేను కూడా ఒకే తరహా పాత్రలు కాకుండా నాకు సరిపోయే వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే... పొలిటీషియన్ రాఘవ్ చద్దాని 2023లో పరిణితి పెళ్లి చేసుకున్నారు. వీరికి నీర్ అనే కుమారుడు ఉన్నారు. -
పుట్టినరోజు ప్రత్యేకం
‘బింబిసార, సర్, విరూపాక్ష’ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరోయిన్ సంయుక్త. సెప్టెంబరు 11న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె నటిస్తున్న ఐదు సినిమాల అప్డేట్స్ని పంచుకున్నారు మేకర్స్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’లో సంయుక్త కథానాయికగా నటించారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ సెట్ ఫొటోలు విడుదల చేశారు. కాగా రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాపో 23’ (వర్కింగ్ టైటిల్). కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలియజేసింది యూనిట్. అదే విధంగా సంయుక్త లీడ్ రోల్లో యోగేష్ కేఎమ్‌సీ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్న ‘ది బ్లాక్‌గోల్డ్’ చిత్రంలోని కొత్త పోస్టర్, సంయుక్త నటిస్తున్న ‘స్వయంభు, హైందవ’ సినిమాల నుంచి కూడా పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్. -
ఒకప్పుడు స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలకే కాదు.. కొత్త హీరోలకు కూడా ఓ కొత్త ఇమేజ్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన సినిమా వస్తుందంటే కథ కంటే ముందు హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డైలాగులు ఎలా పేలబోతున్నాయి? అనే ఆసక్తి ఉండేది. ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’, ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మాస్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!పూర్వ వైభవం ఎప్పుడు వస్తుంది?ముఖ్యంగా మహేశ్‌బాబు కెరీర్లో ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి మరోసారి మాస్ పల్స్ తనకు ఎంత బాగా తెలుసో చూపించారు. అయితే కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దీంతో పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఏంటి? మళ్లీ ఆయన పూర్వ వైభవం ఎప్పుడు వస్తుంది? అనే చర్చ మొదలైంది.మళ్లీ ఆ పూరి కనిపిస్తారా..?పూరి జగన్నాథ్ కెరీర్లో ఎత్తుపల్లాలు కొత్తేమీ కాదు. పూరి సినిమాలు వరుసగా కనిపించకపోవడంతో ఆయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్’ అనే యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారైనా పూరి పూర్వ వైభవం చూపిస్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..? -
15 ఏళ్లుగా మూసి ఉన్న భవనం.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?
హారర్ సినిమాలంటేనే భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠ రేపే ట్విస్టులు గుర్తుకొస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో హారర్ జానర్లో సరికొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అలాంటి ఓ విభిన్నమైన హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమే ‘418’. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం మిస్టరీ, భయానక వాతావరణంతో ఆసక్తిని పెంచుతోంది.సెప్టెంబర్ 18న విడుదల..సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా.. వెంకీ జీజీ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ముందుగా జూలై 31న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదీ చదవండి: బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్‌లో భారీ నష్టం -
బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్‌లో భారీ నష్టం
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజైంది. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. అయితే ఆ జోరు ఒక్కరోజుకే పరిమితమైంది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకోవడంతో ఈ సినిమా కలెక్షన్లు ఎంత రాబెట్టిందని ప్రస్తుతం అనే చర్చ జరుగుతోంది.తొలిరోజే రూ.100 కోట్లకు పైగా..ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ‘టాక్సిక్’ తొలి రోజే ఇండియాలో రూ.101 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.145 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఇండియాలో కేవలం రూ.37 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 10 నాటికి ‘టాక్సిక్’ ఇండియాలో రూ.247 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.339 కోట్లుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!భారీ నష్టాలు?‘టాక్సిక్’ సినిమా నిర్మాణానికి రూ.500 కోట్లకు పైగే ఖర్చయిందనే వార్తలు వచ్చాయి. కనీసం రూ.500 కోట్ల బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకున్నా.. ప్రస్తుత నెట్ వసూళ్లతో పోలిస్తే భారీగానే నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘టాక్సిక్’కు సంబంధించిన ప్రస్తుత ట్రేడ్ అంచనాలను పరిశీలిస్తే.. నష్టాల పరంగా ‘ఆదిపురుష్’ను కూడా అధిగమించినట్లు తెలుస్తోంది.కాగా ‘టాక్సిక్’లో యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విడుదలకు ముందే వివాదాలు, ఆసక్తికర ప్రచారం లభించాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, మహిళలను చూపించిన తీరు చర్చనీయాంశంగా మారాయి. సీబీఎఫ్సీ ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. -
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!
నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..?తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం..‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్‌కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది. -
శ్రీలత.. ‘ఇడుపు కాయితం’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్
వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. నిర్మాత బన్నీ వాస్, డైరెక్టర్ సుకుమార్ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. నాగదుర్గ హీరోయిన్. ఈ సినిమా నుంచి ‘శ్రీలత’ సాంగ్‌ను రిలీజ్ చేశారు.'శ్రీలత..' సాంగ్ లో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నాగదుర్గ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. సురేశ్ బొబ్బిలి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు అలరాజు సాహిత్యం అందించారు. శంకర్ బాబు కందుకూరి, మోహన్ భోగరాజు ఆలపించారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ సెప్టెంబరు 18న థియేటర్స్‌లో విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘హనుమాన్ అంశ్2’, ‘హనుమాన్ అంశ్3’ కూడా తీస్తున్నట్లు నిర్మాత నమ్రతా సింగ్ తెలిపారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. Trivikram Bringing #HanumanAnsh In Telugu pic.twitter.com/5HM8kglTSj— Aakashavaani (@TheAakashavaani) September 11, 2026 -
‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై క్లారిటీ.. వైరల్‌గా నానీ వీడియో!
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాను సెప్టెంబరు 24న థియేటర్లలోకి తీసుకున్నట్టు చిత్రబృందం తెలిపింది. విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని ఇటీవలే మళ్లీ ప్రకటించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.హాయ్ నాన్న ప్రమోషన్స్‌లో..ఈ నేపథ్యంలో గతంలో ‘హాయ్ నాన్న’సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నానీ కేసీఆర్ స్టైల్లో మాట్లాడుతూ కాసేపు అలరించాడు. ఇప్పుడీ వీడయో ‘ది ప్యారడైజ్’ మూవీ ఎట్టి పరిస్థితిల్లో అనుకున్న సమయానికే వస్తుందని చెప్తూ అభిమానులు వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..‘తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉంది. అలాంటిది ఏం జరగదిక్కడ. సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో అనుకున్న సమయానికే వస్తుంది. ఆ రోజు థియేటర్ల దగ్గర దావత్ చేసుకోవాలి’ అని నాని కేసీఆర్ స్టైల్లో చెప్పి నవ్వులు పూయించాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. Trailer cut has already been done and it is all set to air. The news of NO TRAILER is just a speculation. Team hasn't confirmed it yet either. #TheParadise pic.twitter.com/x04iEv8KAX— The Cine Gossips (@TheCineGossips) September 11, 2026 -
ఈ ఇద్దరి స్టార్ హీరోలు ఒకే స్కూల్.. ఎక్కడంటే..?
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్దార్2. ఇటేవలే వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదల కావడంతో కార్తీ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తి చదువుకున్న స్కూల్ డేస్ కోసం ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఇద్దరూ చెన్నైలో..సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కార్తి.. ఇద్దరూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలు . వీరికి కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల పరంగా వీరిద్దరి ప్రయాణం వేర్వేరు అయినా స్కూల్ డేస్ లో వీరిద్దరికీ మంచి అనుభందం ఉందని మీకు తెలుసా.. మహేశ్‌బాబు, కార్తీ ఇద్దరూ చెన్నైలోని సెయింట బేడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. ఆ టైంలో మహేశ్‌బాబుకి కార్తి రెండు సంవత్సరాల జూనియర్. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్‌మీడియాలో వార్తను తెగ వైరల్ చేస్తున్నారు. ( ‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?)కలిసి నటిస్తారా..ఇద్దరు స్టార్ హీరోలకు ఉన్న ఈ కామన్ కనెక్షన్ అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సినిమాల పరంగా కాకుండా బయట కూడా మంచి స్నేహితులు కావడంతో వీళ్లకాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..మహేశ్‌బాబు విషయానికి వస్తే.. దర్శకధీరుడు రాజమౌళి , సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుత్ను చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. . ప్రియంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా మహేశ్ బాబు.. రుద్ర, శ్రీరాముడిగా కనిపించనున్నాడు. 2027 ఏప్రిల్ 7 నాటికి థియేటర్లలతో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
80s ఫొటో ట్రెండా బాస్.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 80s నాటి లుక్స్‌తో ఉన్న ఫొటోలే కనిపిస్తున్నాయి. పాతకాలం నాటి హెయిర్‌స్టైల్, డ్రెస్సింగ్, ఫిల్మ్ కెమెరా లుక్‌తో తమ తమ ఫొటోలను మార్చుకుంటూ నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ అభిమాన హీరో, హీరోయిన్‌తో కలిసి పక్కపక్కనే ఉన్నట్లుగా ఫొటో క్రియేట్ చేసి అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఎంత సరదాగా ఉందో.. అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.APK ఫైల్స్ ఓపెన్ చేయద్దు.. కొంతమందికి ఈ ఫొటోలు ఎలా చేయాలో తెలియక ప్రామిట్ కోసం సోషల్‌మీడియాలోని వ్యక్తులను నమ్మివాళ్ల చేతిలో బలైపోతున్నారట. దీనికి కారణం సైబర్ నేరగాళ్లు పంపిన APK ఫైల్స్ ఓపెన్ చేయడమేనట. ఈ ట్రెడ్ క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ( లోకేశ్ , అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా BMW కార్లు!)ఫొటో అప్లోడ్ చేసే ముందు ఇదీ చూడండి..AI టూల్స్‌లో ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు, అభిమాన హీరోల ఫోటోలు అని వచ్చిన ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు అవి నిజమా కాదా అని తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.‘1980ల ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నెటిజన్లు సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అభిమాన హీరోల ఫొటోలని సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫేక్ యాప్స్, ఏపీకే ఫైళ్లను పంపిసూత మోసాలకు పాల్పడుతున్నారు. చాట్‌జీపీటీ పేరుతోనూ నకిలీ యాప్స్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పద లింకులు తెరవకూడదు’ అని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: (బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?) -
హెచ్‌పీవీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవగాహన
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ) ఆధ్వర్యంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్ అవేర్నెస్ ఈవెంట్స్‌కు ఏఏఎఫ్ఏ మద్దతుగా నిలిచింది.3 లక్షల మందికి పైగా..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమం ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా యువతులకు చేరువైందని, సామాజిక బాధ్యత ఉన్న అల్లు అర్జున్ అభిమానులంతా సమష్టి కృషితో ఈ ఘనతను సాధించామనీ అభిమానులు పేర్కొన్నారు. గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులంతా ఒక్కటవడం చాలా ఆనందంగా ఉందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఇదీ చదవండి: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
హలో డార్లింగ్.. ప్రభాస్‌కి కేటీఆర్ 'ప్రాంక్ కాల్'
ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఊహించని ఫోన్ కాల్‌తో అవాక్కయ్యాడు. ఇది కూడా బీఆర్ఎస్ నేత కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చేసరికి కాస్త తికమక పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి ప్రాంక్ కాల్ గోల?మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 'ది అండర్ 18 వరల్డ్' అనే యూత్ టాక్ షో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. అక్కడున్న పిల్లలు.. కేటీఆర్‌కు ఓ ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరారు. మీ వ్యక్తిగత మొబైల్ నుంచి ఎవరైనా స్టార్ హీరోకు కాల్ చేయాలని అడగ్గా.. ప్రభాస్‌కు కాల్ చేశారు. ప్రభాస్ కూడా వెంటనే స్పందించి 'గుడ్ ఈవెనింగ్ సార్' అని పలకరించారు. కానీ కేటీఆర్ బదులుగా పక్కనే కూర్చున్న ఒక పాప ఫోన్ అందుకుంది. చాలా అమాయకంగా నటిస్తూ.. "సార్, నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మొబైల్ దొరికింది. ఇందులో చూస్తే మీ నెంబర్ కనిపించింది.. ఇంతకీ నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా?" అని ప్రశ్నించింది.కేటీఆర్ నంబర్ నుంచి తనకు ఫోన్ రావడం, తీరా చూస్తే గుర్తుతెలియని చిన్నారి వాయిస్ వినిపించేసరికి ప్రభాస్‌కు ఏం అర్థం కాలేదు. దీంతో వెంటనే కాల్ కట్ చేసేశాడు. ప్రభాస్ రియాక్షన్ చూసి కేటీఆర్ సరదాగా నవ్వుతూ తలపట్టుకున్నారు. తర్వాత స్వయంగా కేటీఆర్ మళ్లీ ప్రభాస్‌కి కాల్ కలిపారు. ప్రభాస్ లైన్లోకి రాగానే అసలు విషయం చెప్పారు.తాను ‘ది అండర్ 18 వరల్డ్’ పాడ్‌కాస్ట్ షోలో ఉన్నానని, అక్కడున్న పిల్లల కోరిక మేరకు సరదాగా ఈ ప్రాంక్ చేశామని వివరించారు. అసలు విషయం తెలుసుకున్న ప్రభాస్ పగలబడి నవ్వుతూ వారితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.When kids pranked Prabhas from KTR’s phone, pretending they found it on the road! Too cute. 😀🥰#Prabhas #KTR #PrabhasFans pic.twitter.com/ib7FSWUmV9— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) September 11, 2026 -
‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సుమంత్.. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఒకప్పుడు పక్కా మాస్ కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అక్కినేని హీరో.. ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. కథలో కొత్తదనం, పాత్రలో వైవిధ్యం ఉంటేనే సినిమాకు ఓకే చెబుతున్న సుమంత్.. తాజాగా ‘మహేంద్రగిరి వారాహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐశ్వర్య రాజేష్, సిద్ధు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘మహేంద్రగిరి వారాహి’తో సుమంత్ ఈసారి ఎలాంటి అనుభూతిని అందించాడు? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మహేంద్రగిరి రాజవంశస్థులకు ఓ శాపం ఉంటుంది. ఆ వంశంలో పుట్టిన ప్రతి మగబిడ్డ 33వ పుట్టినరోజున మరణిస్తాడు. ఈ శాపం 200 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంటుంది. అలా 1993లో ఆ వంశంలో పుట్టిన రాజేంద్ర వర్మ(సిద్దు జొన్నలగడ్డ)మరణిస్తాడు. ఇక ఈ సారి రాజేంద్రవర్మ అల్లుడు, ఆ రాజవంశానికి వారసుడు నరేంద్ర వర్మ(వంశీ చాగంటి) కూడా మరణిస్తాడని పూజారులు చెప్తారు. కథలో ఇదో భాగం.. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్ సిద్ధు అలియాస్ సిద్ధార్థ్(సుమంత్)..దెయ్యాలు, దేవుళ్ల పేరుతో కొంతమంది జనాలను మోసం చేస్తున్నారనేది ఆధారాలతో బయటపెడుతుంటాడు. అతని పెరెంట్స్‌తో పాటు అన్నయ్య రాజీవ్(కమల్ కామరాజు) కూడా దేవుడిని నమ్ముతాడు. పెళ్లి దోషం పోయేందుకు మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఆలయంలో పూజలు చేయమని చెప్పడంతో, రాజీవ్ తన బర్త్‌డే రోజు ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో నరేంద్ర వర్మ కూడా ఆలయానికి వస్తాడు. మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో గుడి ముందే ఉండే దున్నపోతు ఇద్దరినీ పొడిచి చంపేస్తుంది. సరిగ్గా 33వ పుట్టిన రోజు నాడే ఇది జరుగుతుంది. తన అన్న మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు సిద్ధు. ఈ క్రమంలో మహేంద్రగిరి రాజవంశం శాపం వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. అదేంటి? రాజవంశస్తులకు శాపం ఉంటే.. రాజీవ్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అసలు 200 ఏళ్ల క్రితం ఆ శాపం ఎలా వచ్చింది? ఇప్పుడు జరుగుతున్న మరణాలకు నిజంగా అమ్మవారి శాపమే కారణమా లేదా దాని వెనుక ఎవరైనా ఉన్నారా? సిద్ధార్థ్ రీసెర్చ్‌లో తెలిసిన అసలు నిజాలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక వంశానికి అమ్మవారి శాపం అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ‘మురారి’. ఆ తర్వాత ఇలాంటి శాపాలు, దేవుడి కథతో చాలా సినిమాలే వచ్చాయి. `మహేంద్రగిరి వారాహి` కూడా అలాంటి కథే. రాజవంశానికి శాపం ఉండడంతో 33 ఏళ్లకే చనిపోవడం.. దీనికి వెనుక ఒక కారణం ఉండడం.. హీరో రీసెర్చ్ చేసి అసలు కారణం తెలుసుకోవడం..చివరకు శాప విమోచనం.. కథ సుఖాంతం.. ఇదే మహేంద్రగిరి వారాహి చిత్రం కథ. ఇలాంటి కథలను మంచి ట్విస్టులతో, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో తెరపై చూపిస్తే ఆసక్తి కలుగుతుంది. మహేంద్రగిరి వారాహిలో అది మిస్ అయింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో మాత్రం కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలోనే శాపం బ్యాక్‌స్టోరీ చెబుతారు. అది కథపై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ తర్వాత కథనం రొటీన్‌గానే సాగుతుంది. యూట్యూబర్‌గా హీరో పరిచయం.. దెయ్యాలు, దేవుడు లేడని చెబుతూ చేసే యూట్యూబ్ వీడియోలు.. ఇవన్నీ రొటీన్‌గానే సాగుతాయి. మహేంద్రగిరి రాజవంశస్తులు శాఫ విమోచనం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆసక్తికరంగా సాగుతాయి. హీరో ప్యామిలీ మహేంద్రగిరి ఆలయం వద్దకు వచ్చిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. చావుల వెనుక ఉన్న అసలు నిజాన్ని కనుక్కునేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషనే సెకండాఫ్ కథ. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితియార్థం కొంత ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని సీన్లు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. అమ్మవారి సంబంధించిన సీన్లు బాగుంటాయి. అయితే స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. సిద్ధార్థ్ పాత్రకి సుమంత్ న్యాయం చేశాడు. ఫస్టాప్‌లో నార్మల్ యూట్యూబర్‌గా కనిపించడంతో అతని పాత్ర అంత ఇంపాక్ట్ చూపదు. కానీ సెండాఫ్లో మాత్రం బాగా నటించాడు.అయితే ఇప్పటికే ఆయన ఈ తరహా పాత్రలు చేయడంతో కొత్తగా అనిపించదు. ఇక రాజేంద్ర వర్మగా సిద్ధు జొన్నలగడ్డ తెరపై కాసేపు కనిపించి మెప్పించాడు. ఐశ్వర్య రాజేష్ పాత్ర కాసేపు సర్ప్రైజ్ చేస్తుంది. కమల్ కామరాజు పాత్ర నిడివి కూడా తక్కువే. పూజారి పాత్రకి బ్రహ్మానందం న్యాయం చేశాడు. ఆయన పాత్ర ఇచ్చే ట్విస్టు ఆకట్టుకుంటుంది. రాజీవ్ కనకాల మంజు భార్గవి, మీనాక్షి గోస్వామితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అనూప్ రూబెన్స్ పాటలు, నేపథ్య సంగీతం ఓకే.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
తెలుగు బిగ్‌బాస్ 10వ సీజన్ మొదలై నాలుగు రోజులే అయింది. ఇంతలోనే ఓవైపు గొడవలతో హౌస్ హీటెక్కిపోతుంటే మరోవైపు వరస ఎలిమినేషన్లు షాకిస్తున్నాయి. సామాన్యుల కోసం పెట్టిన అగ్నిపరీక్ష పోటీలో గెలిచి ఆదివారం హౌస్‌లోకి అడుగుపెట్టిన చరణ్.. గురువారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయాడు. ఇదలా ఉండగానే లేడీ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిందనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)ఈసారి 16 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లలో 10 మంది సెలబ్రిటీలు కాగా మిగిలిన 6గురు అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్. వీళ్లని ప్రస్తుతం బ్లూ, రెడ్ టీమ్స్‌గా విభజించి గేమ్స్ పెడుతున్న బిగ్‌బాస్.. అలా హై రిస్క్ జోన్లోకి వచ్చి తక్కువ ఓట్లు పొందిన చరణ్‌ని బయటకు సాగనంపేశాడు. తాజా ఎపిసోడ్లో భాగంగా హై రిస్క్ జోన్లోకి కామరన్స్ నుంచి అమన్.. సెలబ్రిటీల నుంచి సుధీర్, చైత్ర వచ్చినట్లు తెలుస్తోంది.వీళ్ల ముగ్గురిలో ఈసారి సీరియల్ నటి చైత్రకు తక్కువ మంది సపోర్ట్ చేయడంతో ఈమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇక్కడ ఎలిమినేషన్ అంటే పూర్తిగా బయటకొచ్చేసినట్లు కాదు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఇవ్వబోతున్న బిగ్‌బాస్.. మిడ్ వీక్ బయటకొచ్చిన చరణ్, చైత్రని మళ్లీ హౌస్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. తర్వాత వీళ్లిద్దరి మధ్య పోటీపెట్టి వీళ్లలో ఒకరిని ఈ ఆదివారం నిజంగానే ఎలిమినేట్ చేయనున్నారు. మరి ఆ దురదృష్టవంతులు ఎవరనేది చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు) -
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి ఎపిక్, మారెమ్మ, మహేంద్ర గిరి వారాహి, మండాడి, సర్దార్ 2 సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో దేనికి కూడా సూపర్ హిట్ అనే టాక్ రాలేదు. వీటిని చూసిన చాలామంది ఓకే పర్లేదని అంటున్నారు. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో పలు తెలుగు హిట్ సినిమాలతో పాటు డబ్బింగ్‌లు కూడా ఉన్నాయి.ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్', విశాల్ 'మకుటం', మహారాజా హాస్టల్, పంచనామా, కట్టాలన్, వరవు లాంటి చిత్రాలు, సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (సెప్టెంబరు 11)అమెజాన్ ప్రైమ్మకుటం -తెలుగు డబ్బింగ్ సినిమామహారాజ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీమ్యాజిక్ మష్రూమ్స్ - మలయాళ చిత్రంఅచ్యుత అవతారం - మలయాళ సినిమాడియోల్ బాంద్ 2 - మరాఠీ చిత్రంసల్మోఖ్జీ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సినిమారక్కసపురదోళ్ - కన్నడ మూవీద రివల్యూషనరీస్ - తెలుగు డబ్బింగ్ సిరీస్నెట్ఫ్లిక్స్విశ్వనాథ్ అండ్ సన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాగో టీమ్ - స్పానిష్ మూవీచుంబక్ - హిందీ సిరీస్కాల్ మై ఏజెంట్! ద మూవీ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్ద పేపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్అలీబాబా ఔర్ 40 భూత్ - హిందీ సిరీస్ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్వన్ నైట్ వోయెజ్ - జపనీస్ సిరీస్లిబాంగ్ లిబు - మలేషియన్ మూవీజంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ - హిందీ సిరీస్ (సెప్టెంబరు 12)జీ5పంచనామా - తెలుగు సిరీస్ఘమసాన్ - హిందీ సిరీస్అద్కిట్టా - మరాఠీ మూవీఆహాకట్టాలన్ - తెలుగు డబ్బింగ్ సినిమావరవు - తెలుగు డబ్బింగ్ మూవీవెంజన్స్ - తమిళ చిత్రంసన్ నెక్స్ట్వివాహ్ - మలయాళ సినిమాలయన్స్ గేట్ ప్లేహంగ్రీ - తెలుగు డబ్బింగ్ మూవీ -
'కోర్ట్' శ్రీదేవి రొమాంటిక్ లవ్ స్టోరీ
'కోర్ట్' సినిమాతో సక్సెస్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. ఆ వెంటనే 'బ్యాండు మేళం' అనే మూవీ చేసింది. ఇది అస్సలు వర్కౌట్ కాలేదు. అయితే 'కోర్ట్' హిట్ అయ్యేసరికి ఈమెకు తమిళంలో అవకాశం వచ్చింది. అలా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేసింది. ఆ చిత్రమే 'హైకూ'. ఇప్పుడు దీని రిలీజ్ డేట్ ప్రకటించారు.ఏగన్ హీరోగా చేసిన ఈ సినిమాలో శ్రీదేవితో పాటు మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ హీరోయిన్గా చేసింది. యువరాజ్ చిన్నస్వామి దర్శకుడు. సిద్దు కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేసి వచ్చే నెల 23న మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. -
ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. భార్య ఆర్తితో విడాకుల వ్యవహారమే దీనికి కారణం. మరోవైపు గాయని కెనీషాతో ఇతడి రిలేషన్ గురించి సాగుతున్న ప్రచారం కూడా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. ఈ విషయమై దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న కెనీషా.. ఒక దశలో తమిళనాడు వదిలి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ చైన్నె వచ్చింది.ఇప్పటివరకు గాయనిగా ఉన్న ఈమె.. ఇప్పుడు సంగీత దర్శకురాలిగా మారింది. అది కూడా రవి మోహన్ దర్శక నిర్మాతగా చేస్తున్న 'యాన్ ఆర్డినరీ మ్యాన్' సినిమా కోసమే. ఈ మూవీలో యోగి బాబు హీరో. ఈ చిత్రంతోనే కెనీషా సంగీత దర్శకురాలిగా పరిచయమవుతుండటం విశేషం. దీని గురించి స్పందించిన కెనీషా.. సరైన సమయంలో సరైన అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పుకొచ్చింది.తొలుత ఈ సినిమాలో భాగం కాకూడదని అనుకున్నాను. రవి మోహన్ చెప్పిన యాన్ ఆర్డినరీ మ్యాన్ స్టోరీ ఆర్టినరీనే అయినా అందులో విషయం మాత్రం ఎక్స్ట్రార్డినరి. ఈ చిత్ర కథనం ఇంప్రెస్ చేసింది. అందుకే సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. దీనికి సంగీతమందించడం చాలా బాధ్యతతో కూడుకున్నది. చాలా రీసెర్చ్ చేసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లు కెనీషా చెప్పుకొచ్చింది. -
బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ మొదలై నాలుగు రోజులు అయిపోయింది. మహాపరీక్ష పేరుతో ఇప్పటికే హోరాహోరీ పోటీ నడుస్తోంది. మరి నాలుగో రోజైన గురువారం(సెప్టెంబరు 10) ఎపిసోడ్లో అసలేం జరిగింది? ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి. మిడ్ వీక్‌లోనే చరణ్ ఎలిమినేట్ అయిపోవడం, అతడి చివరి మాటలు ఎలా సాగాయనేది ఈ హైలైట్స్‌లో చూద్దాం.బ్లాక్ షీప్ ఎవరు?మహాపరీక్ష పేరుతో జరుగుతున్న పోటీ కోసం కంటెస్టెంట్స్ బ్లూ, రెడీ టీమ్స్‌గా విడిపోయారు. తాజా ఎపిసోడ్లో చెరో బృందం నుంచి ఇద్దరిని నిల్చోమని బిగ్‌బాస్ చెప్పగా బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేశ్.. రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ వచ్చారు. మీ టీమ్‌లో మీరు ఎవరిని హై రిస్క్‌లో పెట్టాలనుకుంటున్నారో చెప్పమని అడగడంతో.. త్రిగుణ్, ముఖేశ్... కృష్ణుడిని, రోహిత్, వంశీ.. చైత్ర పేరు చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పిన బిగ్‌బాస్.. ఈ నలుగురు కంటెస్టెంట్స్‌ని బయటకు పంపి 'హూ ఈజ్ ది బ్లాక్ షిప్' గేమ్ ఆడించారు. ఇందులో బ్లూ టీమ్ గెలిచింది.షాలినీ- చైత్ర మాటల వార్అయితే ఈ గేమ్‌లో బ్లూ టీమ్ సరిగా ఆడలేదని రెడ్ టీమ్‌కి చెందిన రోహిత్ ప్రశ్నించగా.. కృష్ణుడి పేరు బ్లూ టీమ్ సరిగా రాయకపోవడంతో ఓడిపోయారు. చైత్ర పేరుని రెడ్ టీమ్ సరిగా రాసి టాస్క్‌లో గెలిచారు. అలా రోహిత్, వంశీ పర్మినెంట్ హౌస్మెట్స్ అయిపోయారు. ఈ సందర్భంగా షాలినీ.. ఏదైనా పాట పెట్టమని బిగ్‌బాస్‌ని అడిగింది. చైత్ర ఓవైపు హై రిస్క్‌లో ఉంటే డ్యాన్సులు కావాలా అని రాంప్రసాద్ అడగడంతో షాలినీ-చైత్ర మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఇద్దరూ మాటమాట అనుకున్నారు. చివరకు షాలిని ఏడ్చేసింది. దీంతో అంతా వెళ్లి ఆమెని ఓదార్చారు.త్రిగుణ్ వర్సెస్ రోహిత్కిచెన్లో గిన్నెలు తోమలేదని త్రిగుణ్‌ని రోహిత్ పిలిచి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఒకరికిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. అగ్రిపరీక్ష నుంచి చీప్‌గా వచ్చేశారు, నీ బాడీ మొత్తం మత్తు పదార్ధాలతో తయారైంది అని త్రిగుణ్, రోహిత్‌ని తక్కువ చేసి మాట్లాడాడు. రోహిత్‌ని డొల్లరాజా డొల్లరాజా అని పాట కూడా పాడి త్రిగుణ్ ఉడికించాడు.చరణ్ ఎలిమినేట్హై రిస్క్‌లో ఉన్న రాంప్రసాద్, చైత్ర, చరణ్‌ని పిలిచిన బిగ్‌బాస్.. ముగ్గురు మాట్లాడుకొని ఒకరు నామినేట్ అవ్వకుండా హై రిస్క్‌లో ఉంటూనే ఇంట్లో ఉంటారు అది ఎవరో మీరు నిర్ణయించుకోండి అని ఆదేశిస్తాడు. దీంతో చైత్ర లోపల ఉండాలని చరణ్.. రాం ప్రసాద్ లోపల ఉండాలని చైత్ర.. చైత్ర ఉండాలని రాం ప్రసాద్ చెప్పారు. దీంతో చైత్ర ఇంట్లోకి వెళ్లిపోయింది. మిగిలిన రాంప్రసాద్, చరణ్‌లో ఎవరు ఇంట్లో ఉండకూడదో వాళ్ల ముఖంపై పెయింట్ పూసి చెప్పాలని బిగ్‌బాస్.. మిగిలిన కంటెస్టెంట్స్‌ని ఆదేశించాడు. ఈ ప్రొసెస్‌లో తక్కువ ఓట్లు పడిన చరణ్.. మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు.కన్నీళ్లు తెప్పించిన చరణ్ఎలిమినేట్ అయిన తర్వాత మాట్లాడిన చరణ్ తెగ ఎమోషనల్ అయిపోయాడు. నేను వెళ్లిపోతానని కాదు గానీ జరిగింది నాకు నచ్చలేదు. నలుగురు అగ్నిపరీక్ష వాళ్లు నాకు ఓటేశారు. ఝాన్సీ నాకు ఓటు వేయలేదు. థ్యాంక్స్ ఇది గ్రూప్ గేమ్ కాదని నిరూపించినందుకు. నన్ను రాంప్రసాద్ అన్నని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ నేను కొంచెం తక్కువగా కనిపిస్తా. మా టీమ్ నా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. వాళ్లు నన్ను బలి పశువుని చేయలేదు అని భావోద్వేగానికి గురయ్యాడు. అలా నాలుగో రోజు ఆట ముగిసింది. -
ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఎపిక్నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి తదితరులుదర్శకత్వం: ఆదిత్య హాసన్సంగీతం: హేషమ్ వాహబ్సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్నిర్మాత: నాగవంశీవిడుదల తేదీ: 2026 సెప్టెంబరు 11‘బేబీ’తర్వాత ఇటు వైష్ణవి చైతన్య, అటు ఆనంద్ దేవరకొండ ఇద్దరూ బీజీ అయిపోయారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకోలేకపోయారు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఇద్దరు కలిసి జంటగా ‘ఎపిక్’ మూవీలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో నేడు(సెప్టెంబర్ 11 ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే?ఓటీటీలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన ‘#90స్’వెబ్ సిరీస్ లోని తమ్ముడు పాత్ర జీవితానికి సంబంధించిన కథ ఇది. ఆదిత్య(ఆనంద్ దేవరకొండ) పెద్దయ్యాక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అయితే ఇంట్లో వాళ్లు మాత్రం పైచదువుల కోసం లండన్ వెళ్లాలని ఒత్తిడి చేస్తారు. ప్లాన్ బిలో భాగంగా ఆదిత్య లండన్ వెళ్తాడు. అక్కడ కాలేజీలో తెలుగమ్మాయి కడలి(వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. తొలి రోజే ఇద్దరూ బాగా దగ్గరవుతారు. ప్రేమ, పెళ్లి వద్దనుకొని సహజీవనం ప్రారంభిస్తారు. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు ఉన్న వీరి సహజీవనం ఎలా కొనసాగింది? పెళ్లి వద్దనుకొని లండన్ వచ్చిన కడలి.. ఆదిత్యతో బంధాన్ని ఎలా సాగించింది? వీరి బంధం సహజీవనానికే పరిమితం అయిందా లేదా ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిందా? ప్రతి విషయంలోనూ ఇతరులపై ఆధారపడే ఆదిత్య.. ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?కొన్ని సినిమా కథలు చాలా సింపుల్‌గా ఉంటాయి కానీ తెరపై చూస్తుంటే మాత్రం ఎంటర్టైన్ అవుతాం. ఎపిక్ కూడా అలాంటి సినిమానే. ఒక యువకుడు హైదరాబాద్ నుంచి యూకే వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది ఈ సినిమా కథ. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ పాయింట్ యూత్‌తో యూత్‌ని ఆకట్టుకునేలా సినిమా తీయొచ్చు. ఆదిత్య హాసన్ అదే చేశాడు. యువతరానికి నచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అవి వర్కౌట్ అయ్యాయి కానీ మిగతా చోట్ల చాలా వరకు రొటీన్‌గా, లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. కడలి పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా సరిగా లేదు. మొదట్లో ఆ పాత్రను చాలా మెచ్యూర్డ్‌గా పరిచయం చేసి ఆ తర్వాత సాధారణ అమ్మాయిలాగే చూపించారు. ఆమె నేపథ్యం ఒకలా.. లండన్‌లో ఆమె ప్రవర్తించే తీరు మరోలా ఉంటుంది. ఆదిత్య, కడలి మధ్య ఉన్న బంధం ప్రేమేనా లేదా ఇంకా వేరేదా అనేది క్లారిటీ ఉండదు. పరిచయం అయిన తొలి రోజే కడలి మెచ్యూర్డ్ అమ్మాయి..ఆదిత్య రూమ్‌కి వెళ్లడం..ముద్దులు పెట్టుకోవడం..ఆ తర్వాత వెంటనే హద్దులు దాటడం అనేది కన్విన్సింగ్‌గా అనిపించదు. అయితే ఆయా సన్నివేశాలు మాత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. అలా అని దర్శకుడు తెరపై రొమాన్స్ మాత్రమే చూపించలేదు. సింపుల్ కథే అయినా అందులో చాలా మంచి విషయాలు చర్చించాడు కూడా. ప్రస్తుతం సమాజంలో ఉన్న కులాల పట్టింపు, అమ్మాయిల ఎదుర్కొనే శారీరక సమస్యలు..లాంటి అంశాలను పైపైన చూపిస్తూనే ఆలోచింపజేశాడు.ఫస్టాఫ్ మొత్తం ఫుల్ రొమాంటిక్‌గా, యూత్‌ని ఆకట్టుకునే సన్నివేశాలతో కొనసాగతుంది. ఆదిత్య, కడలి పరిచయం అవ్వడం.. సహజీవనం కొనసాగించడం.. మధ్య మధ్యలో మిడిల్ క్లాస్ కష్టాలను చూపిస్తూ ప్రథమార్థం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. ఇద్దరి సహజీవనం కాస్త ప్రేమగా మారడం..ఆదిత్య గందరగోళానికి లోనై స్నేహితుడితో మాట్లాడడం.. అతను చెప్పినట్లుగా ఫాలో అవ్వడం ఇలా కథ మొత్తం అక్కడక్కడే తిరుగుతుంది. దీంతో సెకండాఫ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ముగింపు కూడా గొప్పగా ఉండదు.ఎవరెలా చేశారు?ఇక నటన విషయానికి వస్తే ఆనంద్, వైష్ణవి అనగానే 'బేబి' సినిమా గుర్తొస్తుంది. ఆ ఇమేజ్ నుంచి బయటపడి కొత్తగా కనిపించారు. ఆనంద్ తన పాత్రలో సహజంగా అనిపించగా, వైష్ణవి మోడ్రన్ అమ్మాయి పాత్రలో కాన్ఫిడెంట్‌గా నటించింది. శివాజీ, వాసుకి తమ పాత్రలకు న్యాయం చేశారు. కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి అక్కడక్కడా నవ్వించారు. సాంకేతిక అంశాలకొస్తే హేషమ్ అబ్దుల్ వాహబ్ నేపథ్య సంగీతం బాగుంది. అజీమ్ మహమ్మద్ కెమెరా పనితనం, యూకే లొకేషన్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. నిర్మాణ విలువలు అదిరిపోయాయనని చెప్పొచ్చు.-అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
పిల్లలు లేకపోయినా పర్లేదనుకున్నాం.. కానీ
సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి, పిల్లల్ని కనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కెరీర్ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఈ విషయాల్ని కాస్త ఆలస్యంగానే ప్లాన్ చేస్తుంటారు. అయితే తన ప్రెగ్నెన్సీ మాత్రం అనుకోకుండానే జరిగిందని హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదంతా బయటపెట్టింది.'నాకు ప్రెగ్నెన్సీ రావడం పెద్ద సర్ప్రైజ్. గర్భం దాలుస్తానని అస్సలు ఊహించలేదు. మా ఇంటి బంగారం సినిమాలోని తస్సాదియ్యా పాట షూటింగ్ చేస్తున్న టైంలో నాకు కాస్త నీరసంగా అనిపించింది. డాక్టర్ దగ్గరకెళ్తే నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే నేను,రాజ్.. పిల్లల కోసం ప్లాన్ చేయలేదు. పెళ్లికి ముందే ఈ సంగతి మాట్లాడుకున్నాం''ఒకానొక టైంలో నేను, రాజ్ ఇద్దరం పిల్లలు లేకపోయినా పర్లేదని అనుకున్నాం. నాకు ఓకే. రాజ్ కూడా ఓకే అని అన్నాడు. కానీ ఇలా ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకోలేదు. ఇది నాకు ఆశ్చర్యకరమైన విషయం' అని సామ్ చెప్పుకొచ్చింది. మగ-ఆడబిడ్డ ఎవరు పుట్టినా సరే వాళ్ల కోసం షాపింగ్ చేసేసింది. ఏం పేరు పెట్టాలనేది కూడా ముందే నిర్ణయించుకున్నామని కూడా సమంత చెప్పింది.గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. గతేడాది డిసెంబరులో 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడిమోరుని వివాహం చేసుకుంది. ఈ ఏడాది 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని అందుకుంది. దీని రిలీజ్ టైంలో సామ్ ప్రెగ్నెంట్ అయిందనే సంగతి బయటకొచ్చింది. ఈ డిసెంబరులోనే బిడ్డ పుట్టే అవకాశముందని తెలుస్తోంది. -
మాస్ ధమ్
శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘చకోర’. దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో డా. చింతాడ హేమారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రసంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ధమ్ ధమ్... అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా మెహర్ బాబా కొరియోగ్రఫీ చేశారు. అభిఖ్య తనికెళ్ళ ఈ పాటను పాడారు. ‘‘ఈ మాస్ సాంగ్ యువతను ఊర్రూతలూగించేలా ఉంది’’ అని పాటను విడుదల చేసిన సంగీతదర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ అన్నారు. అక్టోబరు 8న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
భావోద్వేగాల కళ్యాణం కమనీయం
ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి డైరెక్టర్ వీవీ వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘కళ్యాణం కమనీయం జీవితం’ సినిమా చిన్నదే గానీ తీసిన వాళ్లు చిన్నవాళ్లు కాదు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి’’ అన్నారు పైలా ప్రసాద్ రావు. ‘‘ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించిన క్లీన్ మూవీ ఇది’’ అని కిషోర్ గుండాల పేర్కొన్నారు. ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అని రవి లోకిరెడ్డి తెలిపారు. -
ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది: రవితేజ
‘‘కెరీర్లో యావరేజ్ సినిమాలు, హిట్స్, ఫ్లాప్స్... ఇలా చాలా ఉంటాయి. కానీ...‘ఇరుముడి’ సినిమా యాక్టర్‌గా నాకు విపరీతమైన సంతృప్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సోల్ జీవీ ప్రకాష్ మ్యూజిక్. నిర్మాత నవీన్ ప్రతిరోజూ ఫోన్ చేసి, కలెక్షన్స్ చెబుతుండేవారు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వారి సంతోషాన్ని నాతో పంచుకునేవారు’’ అని రవితేజ అన్నారు. రవితేజ హీరోగా నటించిన సినిమా ‘ఇరుముడి’. ప్రియా భవానీశంకర్ హీరోయిన్ గా నటించగా, సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం గత నెల 21న విడుదలైంది. గురువారం జరిగిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఇరుముడి’ సినిమా అంటే శివ నిర్వాణ. ఆయనకు ఈ సక్సెస్ క్రెడిట్ దక్కుతుంది. మా అమ్మాయి మోక్షు అండ్ టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పారు. శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘రవన్నగారితో సినిమా అంటే... దర్శకులు అనిల్, బాబీ, గోపీచంద్గార్లు గుర్తుకు వస్తారు. రవన్న డైరెక్టర్స్ లీగ్‌లో నేను చేరడం హ్యాపీగా ఉంది. నా భార్య భాగ్య ఈ సినిమా విషయంలో మీకు ఏది నచ్చితే అది చేయమని చెప్పింది. అదే చేశాను. ఈ సినిమాతో భరించలేనంత సంతోషాన్ని నా హార్ట్ తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి ఓ పెద్దావిడ ఒంటరిగా ఈ ‘ఇరుముడి’ సినిమా చూసేందుకు థియేటర్స్‌కు వెళ్లారు. ఆ వీడియోను రవన్నకు పంపాను. తెలుగు రాష్ట్రాలు మా ‘ఇరుముడి’ని ఓన్ చేసుకున్నాయి. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సంతోషంగా ఉండాలనే సినిమాలు తీస్తాను’’ అని అన్నారు.నవీన్ ఎర్నేని మాట్లాడుతూ – ‘‘ఇరుముడి’ నిర్మించే అవకాశం మాకు లభించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. సినిమాకు పూనకం వస్తే బ్లాక్‌బస్టర్ అని, ఆడియన్స్ కు పూనకం వస్తే ‘ఇరుముడి’ సినిమా అని నా స్నేహితుడు ఒకరు నాతో అన్నారు’’ అని చెప్పారు.వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు–సాంకేతిక నిపుణులు మా మైత్రీ ఫ్యామిలీలో యాడ్ అయ్యారు. ‘ఇరుముడి’ మా బ్యానర్లో కీరిటం లాంటిది. ఈ కీరిటంలో రవన్న, శివ నిర్వాణ వంటి వజ్రాలు ఉన్నాయి’’ అని చెప్పారు.ఈ వేడుకలో ‘ఇరుముడి’ టీమ్‌కి చెందిన సాయికుమార్, నక్షత్ర, జీవీ ప్రకాష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూనిట్ సభ్యులకు షీల్డులను ప్రదానం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ‘ఇరుముడి’ ఘనవిజయం పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు. దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, రచయిత బీవీఎస్ రవి, రచయిత–దర్శక–నిర్మాత కోన వెంకట్, నిర్మాత సాహు గారపాటి ‘ఇరుముడి’ ఘనవిజయం సాధించినందుకు యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. -
వృషకర్మ ఫిక్స్
నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘‘మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో నాగ చైతన్య వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: రాగుల్ హెరియన్. -
భలే మంచి పని చేశావ్ తారా..!
సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా అభిమానుల తాకిడి ఉంటుందని తెలిసిందే. అందులోనూ ప్రత్యేకించి సినిమా హీరో, హీరోయిన్లు అయితే ఫ్యాన్స్ జోష్ మామూలుగా ఉండదు. ఇక వారు ఎక్కడికి వెళ్లినా కవర్ చేసేందుకు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పోటీ పడుతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు మొబైల్ ఫోన్లతో సెలబ్రిటీల వీడియోలు తీసేందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు... సెలబ్రిటీ కారు దిగింది మొదలు లోపలికి వెళ్లి, తిరిగి కారు ఎక్కేవరకు వారిని వెంబడిస్తుంటారు. ఇలాంటి వ్యవహారాలు ఒక్కోసారి సెలబ్రిటీలకు విసుగు పుట్టిస్తుంటాయి. తాజాగా హీరోయిన్ తారా సుతారియాకి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే... తారా సుతారియా ముంబైలోని బాంద్రాలో ఓ ప్రదేశానికి వెళుతుండగా ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. లోపలికి వెళుతుండగా మొబైల్ ఫోన్ పట్టుకుని అతి సమీపంలోకి వచ్చి వీడియో తీస్తున్న ఓ వ్యక్తి ఫోన్‌ను పక్కకు నెట్టేసి, లోపలికి వెళ్లారామె. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తారా సుతారియా తన వ్యక్తిగత భద్రతను కాపాడుకోవడానికి తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అంటూ పలువురు నెటిజన్లు తమ కామెంట్స్‌తో ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ‘‘భలే మంచి పని చేశావ్ తారా... ఇలా మీద మీదకు వచ్చి ముఖానికి దగ్గరగా ఫోన్ పెట్టి, ఫొటో తీయడం ఏ మాత్రం సరికాదు’’ అంటూ కామెంట్స్ షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే... ఇటీవల విడుదలైన ‘టాక్సిక్’లో కీలక పాత్ర చేసిన తారా సుతారియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. -
తొలిసారి కొడుకు ఫొటో రివీల్ చేసిన వరుణ్ తేజ్, లావణ్య
టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడు వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి సోషల్ మీడియాలో పంచుకున్నారు. వాయువ్ తొలి పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటోను షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2025 సెప్టెంబర్‌లో వరుణ్–లావణ్య దంపతులకు కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. అనంతరం తమ బిడ్డకు ‘వాయువ్ తేజ్’ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు.కుమారుడి ఫొటోను షేర్ చేసిన వరుణ్ తేజ్.. “నా ప్రపంచాన్నే మార్చేశావు” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ‘నా ప్రియమైన వాయువ్ తేజ్.. నా ప్రపంచాన్ని సాధ్యమైనంత అందంగా మార్చేశావు. నిన్ను తొలిసారి కళ్లారా చూడకముందే నీతో ప్రేమలో పడిపోయాను. నీ తండ్రిగా ఉండటం నా జీవితంలోనే అత్యంత అందమైన విషయం’ అంటూ వరుణ్ తేజ్ భావోద్వేగ పోస్ట్ చేశాడు.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారి 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని ప్రైవేట్‌గా ఉంచిన ఈ జంట 2023లోకుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇదీ చదవండి: ‘డిసి’ సక్సెస్.. లోకేశ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిఫ్ట్స్ My dear boy, you changed my world in the best way possible. I fell in love with you even before I laid my eyes on you for the first time. Being your father is the most beautiful part of my life.Happy 1st birthday, Vaayuv.I love you, always.❤️😘 pic.twitter.com/nUfXCuBJXF— Varun Tej Konidela (@IAmVarunTej) September 10, 2026 -
‘విద్యార్థులపై ఒత్తిడి నివారణే లక్ష్యం’
హైదరాబాద్‌లో ‘జై గౌరీపుత్ర గణేశా’ చిత్రబృందం సందడి చేసింది. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రీవ్యూ హాల్లో ఘనంగా విడుదల చేసింది. విద్యార్థులపై పెరుగుతున్న విద్యా ఒత్తిడి, దాని కారణంగా ఎదురవుతున్న మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణ వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది.చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్లో విద్యార్థుల జీవితాల్లో ఎదురయ్యే ఒత్తిడి, మానసిక సంఘర్షణలను చూపించడంతో పాటు వాటి నుంచి బయటపడేందుకు అవసరమైన సందేశాన్ని అందించేలా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. -
లోకేశ్ , అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ఏకంగా BMW కార్లు!
‘డిసీ’ బ్లాక్‌బస్టర్ విజయంతో చిత్ర బృందంపై నిర్మాత కళానిధి మారన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్లను అభినందించారు. వీరికి సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించి సర్ప్రైజ్ చేశారు. ఈ మేరకు కార్ల తాళాలను స్వయంగా అందజేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తొలిసారి హీరోగా చేసిన సినిమా 'డిసి'. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించాడు. వామిక గబ్బి హీరోయిన్. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన విజయం సాధించింది. వసూళ్ల పరంగా దుమ్మురేపింది. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం సన్ నెక్ట్ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలో అలరిస్తోంది. Mr. Kalanithi Maran congratulated and presented the keys to brand-new BMW cars to Arun Matheswaran, Lokesh Kanagaraj and Anirudh, for the success of Blockbuster #DC! 💥@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #DCMegaBlockbuster pic.twitter.com/QOgmCA6ZqI— Sun Pictures (@sunpictures) September 10, 2026 -
సెప్టెంబర్ 18న థియేటర్లలోకి ‘మిస్సింగ్ మేఘన’
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.ఫస్ట్ కాపీ మూవీస్, కేడీ అండ్ కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ధృవన్ సంగీతం అందిస్తున్నారు. కాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేశారు. -
‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్స్‌గా రానున్న ‘హనుమాన్ అంశ్2’, ‘హనుమాన్ అంశ్3’పై ఆసక్తి పెరిగింది. పార్ట్2లో పలువురు ప్రముఖులు నటించనున్నారని వస్తున్న వార్తలపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ పేర్లు తెరపైకి వచ్చాయి.నిర్మాత ఏమన్నారంటే..‘హనుమాన్ అంశ్2’లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అతిథి పాత్రల్లో కనిపిస్తారా? అనే ప్రశ్నకు నిర్మాత నమ్రతా సింగ్ ఆసక్తికరంగా స్పందించారు. కొందరు సెలబ్రిటీలను ఇప్పటికే సంప్రదించినట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికే పార్ట్2 కథ పలువరి సెలబ్రిటీలకు తెలుసునని తెలిపారు. అయితే విరాట్, అనుష్క ఇద్దరూ సినిమాలో నటించేందుకు అంగీకరించారా లేదా అని మాత్రం ఆమె స్పష్టంగా తెలపలేదు.చదవండి: సమంత ఎంగేజ్మెంట్ రింగ్ ఇంత ఖరీదా..? డిజైనర్ ఎవరంటే.?కాగా విరాట్-అనుష్కలకు నీమ్ కరోలి బాబాపై ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట పలు సందర్భాల్లో కైంచీ ధామ్‌ను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే ‘హనుమాన్ అంశ్’లో వీరిద్దరినీ భాగం చేయాలనే ఆలోచన ఆసక్తిని కలిగిస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మూడు భాగాలుగా..ఇక ‘హనుమాన్ అంశ్’ను మొదటి నుంచే మూడు భాగాలుగా తెరకెక్కించాలని భావించినట్లు నిర్మాత తెలిపారు. ‘తొలి భాగంలో నీమ్ కరోలి బాబా ప్రారంభ జీవితం నుంచి కైంచీ ధామ్( ఆధ్యాత్మిక ఆశ్రమం) వరకు చూపించాం. రెండో భాగం కైంచీ ధామ్, అక్కడి భారతీయ భక్తుల కథలపై తెరకెక్కిస్తాం. మూడో భాగంలో బాబా ఆధ్యాత్మిక ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందనే అంశాన్ని చూపించబోతున్నాం’ అని తెలిపారు. అయితే విరాట్-అనుష్కలు ఇందులో కనిపిస్తారా? లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.ఇదీ చదవండి: బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా? -
వీళ్ల ఎంగేజ్మెంట్ రింగ్ ఇంత ఖరీదా..? డిజైనర్ ఎవరంటే.?
సమంత కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇస్తూ.. తన ప్రగ్నెన్సీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ అభిమానులతో పంచుకుంటూ ఏదో సందర్భంలో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’తో మాట్లాడిన సమంత.. తన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. దీంతో సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సమంత ధరించిన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఎక్కువ మంది చదివింది: బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?‘ఈ రింగ్ ఎంపికలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మొత్తం రాజ్ చూసుకున్నాడు. ఆయన్నే అడగాలి. రాజ్ ప్రపోజ్ చేసిన సమయంలోనే తొలిసారి ఆ రింగ్‌ను చూశాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఉంగరాన్ని గ్రీస్‌కు చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్ రూపొందించారని మాత్రం నాకు తెలుసు. అని సమంత తెలిపింది. అయితే దీనిని ఏథెన్స్కు చెందిన థియోడోరోస్ సవోపౌలోస్ రూపొందించినట్లు తెలుస్తోంది. సమంత రింగ్ ధరించిన ఫొటోను ఆయన కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.విలువ ఎంతంటే..అయితే ఇప్పుడు ఆ రింగ్ ఖరీదు ఎంత ఉంటుందనే చర్చ. లొజెంజ్ కట్ డైమండ్‌తో రూపొందించిన ఈ రింగ్ విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందట. ఇందులో ఎనిమిది పోర్ట్రెయిట్ కట్ వజ్రాలు పూల రేకుల మాదిరిగా అమర్చినట్లు తెలుస్తోంది. అయితే పోర్ట్రెయిట్ కట్ వజ్రాలకు భారతీయ ఆభరణాల చరిత్రతోనూ మంచి అనుబంధం ఉంది. మొఘల్ కాలంలో ఈ తరహా డిజైన్లు దొరికేవని చెబుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి అరుదైన డిజైన్లను రూపొందించేవారి సంఖ్య కూడా తక్కువేనట. కాగా సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇదీ చదవండి: హీరోయిన్ ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక -
బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?
బిగ్‌బాస్ తెలుగు 10లో కామనర్‌గా అడుగుపెట్ని షాలిని తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతకముందు ‘అగ్నిపరీక్ష2’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి తన మాటలతో ఆట తీరుతో మెప్పిస్తోంది. అయితే ఎప్పుడూ యాక్టివ్‌గా, కానిఫడెంట్గా కనిపించే షాలిని జీవితంలో ఓ విషాద కథ ఉన్నట్లు మీలో ఎంతమందికి తెలుసు..? ఆమె జీవతంలో జరిగిన కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవే ఏంటో తెలుసుకుందాం రండి!ఇదీ చదవండి: Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్లో ప్రచారం.. కంటెస్టెంట్‌పై ఫిర్యాదు8 ఏళ్ల వయసులోనే తల్లి మృతి..షాలిని తన వ్యక్తిగత జీవితం గురించా మాట్లాడుతూ.. ‘8ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు తండ్రి కూడా మృతి చెందారు. చిన్నతనంలోనే ఇలా జరగడంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఈ విషయాన్ని అగ్ని పరీక్షలో పాల్గొన్న చెప్పాలని అనిపించలేదు. ఎందుకంటే ఈవిషయాలన్నీ చెప్పా ప్రేక్షకుల నుంచి సానుభూతి పొందడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు’ అని షాలిని తెలిపారు.కామనర్‌గా బిగ్‌బాస్‌లోకి..సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షాలిని రీల్స్, ఫొటోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2’లో పాల్గొని తన ఆట తీరుతో మెయిన్ షోకు అర్హత సాధించింది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 10లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో షాలిని గేమ్‌పై ఆసక్తి పెరుగుతోంది. అగ్నిపరీక్షలో తనపై వచ్చిన అభిప్రాయాలను దాటి.. బిగ్‌బాస్ 10లో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదీ చదవండి: ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక.. -
ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక..
కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టి వరుస అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆషిక రంగనాథ్. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పుడు తమిళం, తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ప్రస్తుతం సర్ధార్2 సినిమాతో అటు తమిళ ప్రేక్షకులకూ, ఇటు తెలుగు వారికీ పలకరించింది. మరి సినిమా అవకాశాలపై ఆమె మనసులో మాట ఏంటో తెలుసా? ఆమె మాటల్లోనే..ఇదీ చదవండి: ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‘ హీరోయిన్గా అవకాశాలు రావడం ఒక ఎత్తైతే వచ్చిన ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపంచాలనేదే నా కోరిక. స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కంటే.. తన ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెరవడం ముఖ్యం. అందుకే కథ విన్నప్పుడు పాత్ర ఎలా ఉంటుంది?. ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అని పరిశీలించిన తర్వాతే సినిమాలకు ఓకే చెప్తా.చిత్ర సీమలో అడుగుపెట్టిన 2నుంచి 3 సంవత్సరాలకే తెలుగులో అవకాశాలు వచ్చాయి. కానీ అప్పుడు అంత ఐడియా లేదు. ఇవి మంచి ప్రాజెక్ట్‌లా కాదా అని. అందువల్లే కొంచం లేట్ అయింది. 2023లో వచ్చిన అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను.తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనేదే నా కోరిక. మంచి కథలు, బలమైన పాత్రలు వస్తే భాషతో సంబంధం లేకుండా నటించేందుకు సిద్ధం. హీరోయిన్ కేవలం అందంతో కాకుండా నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలనేదే లక్ష్యం. (బిగ్‌బాస్‌లో హైరిస్క్ టెన్షన్.. వేడెక్కిన వాతావరణం..)సర్దార్2 నా కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. చాలా మంది హీరోలతో చేసనప్పటికీ కార్తీ సార్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభం. సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం తెరపై కనిపిస్తాయి. తెలుగులో నాకు నచ్చిన చిత్రాల్లో అలా వైకంఠపురం, సీతారామం సినిమాలు ఇష్టం. ఈ చిత్రాల్లో సాంగ్స్ ఇప్పటికీ ఇంట్లో వింటుంటాను.‘ అని ఆషిక గతంలో పలు ఇంటర్వ్యులో తెలిపారు. ఇదీ చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
బిగ్‌బాస్‌లో హైరిస్క్ టెన్షన్.. వేడెక్కిన వాతావరణం..
బిగ్‌బాస్ ఇంట్లో మరోసారి హైరిస్క్ టెన్షన్ మొదలైంది. మహాపరీక్షలో భాగంగా రోహిత్, టెంపర్ వంశీ, ముకేశ్, త్రిగుణ్‌లకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో విజయం సాధించిన ఇద్దరికి హౌస్‌మేట్‌గా మారే అవకాశం కల్పించడంతో పాటు.. హైరిస్క్ జోన్లోకి ఒకరిని పంపాల్సి ఉంటుందని చెప్పాడు.విజయం కోసం ఒకరిని హైరిస్క్‌లోకి పంపే వ్యక్తి పేరును ఇచ్చిన స్లాట్‌లో సరిగ్గా అమర్చాలని బిగ్‌బాస్ సూచించాడు. ఈ టాస్క్‌లో ముకేశ్, త్రిగుణ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ కృష్ణుడిని హైరిస్క్‌లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే కృష్ణుడు పేరును అసంపూర్తిగా అమర్చడంతో.. ఆ పేరును పరిగణనలోకి తీసుకోబోమని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. ఇదీ చదవండి: విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!మరోవైపు రోహిత్, వంశీలు చైత్ర పేరును హైరిస్క్ కోసం సూచించారు. ఇదే సమయంలో షాలినీ డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం హౌస్‌లో కొత్త వివాదానికి దారితీసింది. చైత్రను హైరిస్క్‌లోకి నెట్టినందుకే షాలినీ ఇలా సంబరాలు చేసుకుంటోందంటూ బ్లూ టీమ్ సభ్యులు ఆమెతో వాదించారు.దీంతో చైత్ర, షాలినీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా స్పందించడంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ గొడవ ఎక్కడివరకు వెళ్లిందనేది ఎపిసోడ్లో ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
‘సర్దార్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సర్దార్ 2నటీనటులు: కార్తి, ఎస్.జే. సూర్య, మాళవిక మోహన్, ఆశికా రంగనాథ్, యోగిబాబు, రజిషా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్నిర్మాత: ఎస్. లక్ష్మణ్ కుమార్దర్శకత్వం: పీఎస్ మిత్రన్సంగీతం: సామ్ సి.ఎస్‌ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టివిడుదల తేది: సెప్టెంబర్ 10, 2026కార్తి..పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం మనవాడిగానే చూస్తారు. ఊపిరి, సత్యం సుందరం లాంటి చిత్రాలతో ఆయనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఆయన చిత్రాలన్నీ ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం సర్దార్ 2. 2022లో వచ్చిన బ్లాక్ బస్టక్ మూవీ ‘సర్దార్’కి కొనసాగింపు ఇది.నేడు(సెప్టెంబర్ 10) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ‘సర్దార్’ముంగింపే ఈ చిత్రానికి ప్రారంభం. ఇన్స్పెక్టర్ నుంచి రా ఏజెంట్‌గా మారిన విజయ్ ప్రకాశ్(కార్తి).. రా చీఫ్ మనోజ్ బొమ్మై (ఆశిష్ విద్యార్థి)కి తెలియకుండా ఓ రహస్య ఆపరేషన్ చేపడతాడు. అందులో భాగంగా మాజీ రా ఏజెంట్ వాల్రస్ (అచ్యుత్ కుమార్)ని కలుస్తారు. అయితే అప్పటికే ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ బ్లాక్ డగ్గర్ (ఎస్.జె.సూర్య) మనుషులను అతనిపై దాడి చేస్తారు. చనిపోయే ముందు , విజయ్ కు తన దగ్గర ఉన్న ఓ 'కీ'ని ఇస్తాడు. అలాంటి మరో కీని మరో రా ఏజెంట్ (మాళవిక మోహనన్) తన కూతురు ఫైజా (ఆషిష్ రంగనాథ్)కు ఇస్తుంది. డి.ఆర్.డి.వో. ఛీఫ్ టైగర్ హరిశ్చంద్ర (బాబు ఆంటోనీ) దగ్గర ఇంకో కీ ఉందదే విషయం తెలుస్తుంది. దానిని సంపాదిస్తే.. ఓ భారీ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని రక్షించొచ్చు అని విజయ్ భావిస్తాడు.(చదవండి: మండాడి మూవీ రివ్యూ)అయితే విజయ్ కంటే ముందే బ్లాక్ డగ్గర్ ఆ 'కీ'ని సొంతం చేసుకుని, ఈ దేశాన్ని నాశనం చేయడానికి సిద్థమవుతాడు. సరిగ్గా అదే సమయంలో రంగంలోకి దిగుతాడు సర్దార్(కార్తి). ప్రభుత్వం దృష్టిలో చైనాలో చనిపోయిన సర్ధార్ తిరిగి ఎలా వచ్చాడు? బ్లాక్ డగ్గర్ మిషన్ ఏంటి? మూడు ‘కీ’ల వెనుక ఉన్న రహస్య కథేంటి? బ్లాక్ దగ్గర్ మిషన్‌ని అడ్డుకునేందుకు తన కొడుకు విజయ్‌తో కలిసి సర్దార్ చేసిన సాహసాలేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘సర్దార్’లో నీటి సమస్యను, వన్‌లైన్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ ద్వారా జరిగే కుట్రను చూపించిన దర్శకుడు.. సీక్వెల్లో యాంటి బయాటిక్ మందుల్ని మితిమీరి వాడటం వల్ల జరగబోయే అనర్థాల్ని చూపించాడు. అయితే పార్ట్ 1 మాదిరి ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో మాత్రం దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. కథ, కథనం రొటీన్‌గా ఉంటూ.. చాలా వరకు సర్దార్ సినిమాతో పాటు పలు స్పె యాక్షన్ సినిమాలను గుర్తుకు చేస్తాయి. తర్వాత ఏ జరుగుతుందన్న ఉత్కంఠ కూడా రేకెత్తించదు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కథను పక్కకు పెట్టి ఎక్కువగా స్టైలీష్ మీదే దృష్టిపెట్టాడు దర్శకుడు . ఫస్టాఫ్ అంతా డోకు బయోవెపన్ చుట్టే తిరుగుతుంది. దాన్ని తెరిచేందుకు మూడు తాళాలు అవసరం..వాటి కోసం హీరో ఒకవైపు.. విలన్ మరోవైపు ప్రయత్నాలు చేస్తారు. ఆయా సీన్లను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దితే బాగుండేది. కానీ చాలా సింపుల్‌గా, సాగదీతగా ఆ సన్నివేశాలు సాగుతాయి. ఒకానొక దశలో చిరాకు కలిగిస్తాయి కూడా. అలాగే సర్దార్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సిల్లీగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో అయినా కథనం ఉత్కంఠభరితంగా సాగుతుందా అని ఆశించిన ప్రేక్షకుడికి.. కాసేపటికే నిరాశ తప్పదు. కోటలో ఉన్న ప్రమాద కర ఆయుదాన్ని వెతికిపట్టుకునేందుకు తండ్రి,కొడుకులు ప్రయత్నించడం.. బ్లాక్ డగ్గర్ దాన్ని స్వాధీనం చేసుకొని దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించడం.. చివరిలో తండ్రి కొడుకులు కలిసి ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడం.. సెకండాఫ్ అంతా ఇలానే సాగుతుంది. చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉండడం.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడంతో సెకండాఫ్ మరింత చిరాకు పెట్టిస్తుంది. ఇక చివరిలో పార్ట్ 3 కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. అయితే అది తెరపైకి వస్తుందా లేదా అనేది చూడాలి. ఎవరెలా చేశారంటే.. కార్తి నటన గురించి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఇందులో కూడా తండ్రి కొడుకులుగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలను పోషించి మెప్పించాడు. అయితే కథ, కథనం బలంగా లేకపోవడంతో కార్తి పడిన కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయిపోయింది. ఇక విలన్‌గా ఎస్.జే సూర్య నటన చాలావరకు అతిగా అనిపించింది. అయితే తెరపై మాత్రం స్టైలీష్‌గా కనిపించాడు. మాళవిక మోహన్, ఆశికా రంగనాథ్, నాజర్, అచ్యుత్ కుమార్, ఆషిష్ విద్యార్థి యోగిబాబుతో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. సామ్ సీఎస్ బీజీఎం పర్వాలేదు. చాలా వరకు హలీవుడ్ సినిమాలను ఇమిటేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులో ఒకే ఒక పాట ఉంది. అది కూడా అంతగా ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. వాటికి ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సిందే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!
ఇటీవలే ప్రకృతిపై బాధ్యతను చాటేలా రూపొందించిన ‘సీడ్ గణేశ’ ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు సంబంధించిన ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ బాటలో విజయ్ దేవరకొండ చేరారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆయనకు ఇచ్చిన విత్తన గణపతిని ఆయనకు అందజేసింది. ఈ మేరకు ఈ వినాయక చవితిని పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించుకోవాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. ‘నగరం కలుషితం కాకుండా మట్టి లేదా విత్తన గణపతిని పూజిద్దాం. దీంతో మొక్కలు పెరుగుతాయి’ అని విజయ్ సూచించారు. మొక్కగా ఎదుగుతాయి..‘కెమెకిల్స్తో కూడిన కలర్స్‌తో వినాయకుడి విగ్రహాలను నిమర్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినండంతో పాటు పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో నా మిత్రుడు తెలంగాణ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్థాలు, విత్తనాలతో ‘సీడ్ గణేశ’ విగ్రహాలను రూపొందించారు. పూజ అనంతరం ఈ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అనంతరం సరైన విధంగా నీరు పోస్తూ సంరక్షిస్తే.. అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఇలా వినాయకుడిని పూజించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’ అని ఈ విగ్రహాల ప్రాముఖ్యతను గతంలో మెగాస్టార్ చిరంజీవి వివరించారు. Actor Vijay Deverakonda received a Seed Ganesha (Vittana Ganapati) from Green India Challenge team and appealed to all to celebrate Ganesh Chaturthi with eco-friendly Matti Ganapati and Vittana Ganapati.“Use safe clay and seed idols so we don’t pollute our city. After the… pic.twitter.com/NBHq2unlkK— Milagro Movies (@MilagroMovies) September 10, 2026 -
Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్లో ప్రచారం.. కంటెస్టెంట్‌పై ఫిర్యాదు
బిగ్‌బాస్ తెలుగు10 రియాలిటీ షోకు సంబంధించిన ఓటు ప్రచారంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఓ కంటెస్టెంట్‌కు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారంటూ ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డికి, కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రికి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.18 ఏళ్లు నిండిన వారికే..‘నల్గొండ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మమేకమైనట్లు కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ పాఠశాలలు విద్య కోసమే తప్పా రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారం కోసం కాదు. ఇది విద్యా వాతావరణాన్ని భంగపరచడం, పిల్లల భద్రతకు ప్రశ్నార్థకం చేయడమే. భవిష్యత్తులో పాఠశాలల్లో ఇలాంటి ప్రచారాలు జరగకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలి’ అని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారికే బిగ్ బాస్ రియాలిటీ షో ఓటింగ్ కి అర్హులను చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: వర్షిణికి వాష్‌రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష? -
మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: మండాడినటీనటులు: సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులునిర్మాణ సంస్థ: ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్నిర్మాత:ఎల్రెడ్ కుమార్దర్శకుడు: మతిమారన్ పుగళేందిసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్సినిమాటోగ్రఫీ:ఎస్.ఆర్. కథిర్ఎడిటింగ్: ప్రదీప్ ఇ.రాఘవ్విడుదల తేది: సెప్టెంబర్ 10, 2024వైవిధ్యమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలుగు నటుడు సుహాస్ నటించిన తొలి తమిళ సినిమా మండాడి. ఇందులో ఆయన విలన్ పాత్రను పోషించగా.. కోలీవుడ్ యాక్టర్ సూరి హీరోగా నటించాడు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో టాలీవుడ్‌లోనూ ‘మండాడి’పై హైప్ క్రియేట్ అయింది. మరి మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేటంటంటే.. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు. ఈ సారి టీమ్‌లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్‌ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు. రాజీ కోసం మల్లేష్‌ని తీసుకొని కళింగపట్నం వస్తాడు కాళి. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన ఆ ఊరిలోకి అడుగుపెడతాడు. రాజీలో భాగంగా పడవ పోటీలకు దిగుతారు. అందులో ఎవరు గెలిస్తే వాళ్లు కళింగపట్నానికి అధికారిక జట్టు, ఓడిపోయిన వాళ్లు పోర్ట్ ని వదిలివెళ్లిపోవాల్సి ఉంటుందని కండీషన్ పెడతారు. మరి ఈ పోటీలో కాళి తన కళింగ వారియర్స్ టీమ్‌ని ఎలా గెలిపించాడు? కాళిని ఓడించేందుకు పులి చేసిన కుట్రలు ఏంటి? అసలు కాళి ఊరి వదిలివెళ్లిపోవడానికి గల కారణం ఏంటి? ఎప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న కాళి, పులి ఇప్పుడు బద్ద శత్రువులుగా ఎలా మారారు? ఈ కథలో ఏంజిల్(మహిమా నంబియార్), మునయ్య(సత్యరాజ్)పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పడవ పోటీల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇది. దానికి స్నేహబంధాన్ని, పల్లెటూరి ఎమోషన్ని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సముద్రంలో పడవల పోటీ అనే పాయింట్ కొత్తగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న కథ, సన్నివేశాలన్నీ రొటీన్‌గానే ఉన్నాయి. హీరో, విలన్ ఒకప్పుడు స్నేహితులుగా ఉండడం.. ఓ కారణంగా విడిపోయి బద్ద శత్రువులుగా మారడం.. చివరకు ఇద్దరి మధ్య పోటీ జరగడం..హీరో గెలవడం.. ఇలాంటి నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ చిత్రం నేపథ్యం కూడా ఇలానే సాగుతుంది. ముగింపులో వచ్చే పడవ పోటీ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. అయితే సినిమా ప్రారంభం అయిన కాసేపటికే ప్లాష్‌బ్యాక్ స్టోరీతో పాటు క్లైమాక్స్ కూడా ఊహించొచ్చు. అయినప్పటికీ ఒకటి రెండు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ కథనం చాలా వరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అసలు కథ ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. హీరో హైదరాబాద్ నుంచి కళింగపట్నం వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. పంచాయితీ పెట్టడం.. పడవల పోటీకి రెడీ అవ్వడం ఇవన్నీ రొటీన్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్ పూర్తిగా ఊహించొచ్చు. అయితే కథను ఊహించినా..కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే పడవల పోటీ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అలాగే ప్లాష్‌బ్యాక్‌లో సాగే కాళీ, ఏంజల్ ప్రేమ సన్నివేశాలు, కోచ్ ముని జట్టుని నడిపించే తీరు.. ఎమోషన్ కూడా ఆకట్టుకుంటుంది. ఫస్టాప్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. ముఖ్యంగా పడవ పోటీలకు సంబంధించిన సన్నివేశాలే ఈ సినిమాకు ప్రధానబలం అని చెప్పొచ్చు. ఎవరెలా చేశారంటే.. కాళి పాత్రకి సూరి పూర్తి న్యాయం చేశాడు. ఎలాంటి ఎలివేషన్స్, హంగులు లేకుండా చాలా సింపుల్‌గా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. దానికి తగ్గట్లుగానే సూరి నటించాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక సుహాస్ విలన్‌గా మెప్పించాడు. తెరపై కొత్త గెటప్‌లో కనిపిస్తూనే.. మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఏంజల్గా మహిమా నంబియార్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. చక్కగా నటించింది. ఇక సత్యరాజ్ కూడా మంచి పాత్రను పోషించాడు. కోచ్ మునయ్య పాత్రలో ఒదిగిపోయాడు. మల్లేష్ పాత్ర పోషించిన నటుడితో పాటు మిగిలినవారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం కథను ఎలివేట్ చేసేలా ఉంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రపీ బాగుంది. సముద్రపు సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఎవరూ ముందుకు రాలేదు.. శృతిహాసన్ పోరాడి గెలిచారు!
ఇండియన్ సినిమాలో అతి తక్కువ మంది బోల్డ్ అండ్ బ్యూటీ హీరోయిన్లలో నటి శృతిహాసన్ ఒకరిని చెప్పవచ్చు. ఈమె ఫెయిర్ నెస్, డేరింగ్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. నటి వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసినా, ఆ తరువాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు కమలహాసన్ పుత్ర రత్నం ఈ బహుముఖ ప్రతిభావంతురాలు శృతిహాసన్. గాయనిగా, సంగీత దర్శకురాలిగా, కథానాయకిగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ బ్యూటీ బహుభాషా కథానాయకి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే ఈమె సంచలన నటి ఏ విషయంలోనైనా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు.. చూస్తారు అని ఎదురు చూడటం శృతిహాసన్ నైజం కాదు. ఇందుకు చిన్న ఉదాహరణ ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాని వల్ల ప్రయోజనం ఎంత కలుగుతుందో, అదే స్థాయిలో దు్రష్పచారం జరుగుతోందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎక్కువగా సాధింపులకు గురౌతున్నారు. ఇక సినిమా రంగంలో కథానాయికలు డీఫేమ్ చర్యలతో మానసిక వేదనకు గురౌతున్నారు. తమ ప్రమేయం లేకుండానే తమ రూపాలు, వ్యాఖ్యలను మార్పింగ్ చేస్తున్నారు. దీంతో మనోవేదనకు గురౌతున్న పలువురు నటీమణులు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారే కానీ ఎవరూ కార్యాచరణకు ముందడుగు వేయడం లేదు. అయితే నటి శృతిహాసన్ మాత్రం ధైర్యంగా ముందడుగు వేసి ఏఐ టెక్నాలజీతో మహిళలను డీఫేమ్ చేస్తున్న వారికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి గెలిచారు. ఏఐ టెక్నాలజీతో అక్రమాలకు పాల్పడే చర్యలపై ఇటీవల ముంబై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు నటి శృతిహాసన్ చాలా మందికి రోల్ మోడల్ అయిపోయారు. సినీ ఇండస్ట్రీలో చాలా మందికి మార్గదర్శిగా నిలిచారని ప్రశంసలను అందుకున్నారు. -
ఉంటే మరింత మెరిసేవాళ్లు!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచం మొత్తం మీద సంవత్సరానికి దాదాపు 20 లక్షల మంది ఆత్మహత్య చేసుకుని మరణిస్తున్నారు. మన దేశంలో సుమారు రెండు లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేవలం బలహీన మనస్కులే ఆత్మహత్య చేసుకుంటారనేది అపోహ మాత్రమే. ప్రపంచాన్ని తన నియంతృత్వ పోకడలతో గడగడలాడించిన ‘హిట్లర్’ మొదలుకొని ఇటీవల త్రిపుర రాష్ట్ర పోలీస్ అధినేత లాంటి ఎందరో దేశాధినేతలు, అధికారులు, సైంటిస్టులు, సినీ తారలు చివరకు ఈ విధంగానే తనువు చాలించారు. ముఖ్యంగా సినిమా తారల గురించి చెప్పాలంటే... సిల్వర్ స్క్రీన్ పై ఎంతో పేరు తెచ్చుకున్న నటీనటులు కొందరు చివరకు ఇలాగే ఆత్మహత్యలకు పాల్పడ్డారు.హాలీవుడ్‌ను ఒకప్పుడు ఒక ఊపు ఊపిన మార్లిన్ మన్రో చివరకు నిద్ర మాత్రలు మింగి మరణించింది. వ్యక్తిగత జీవితంలో మూడు వివాహాలు, విడాకులు, అనేక ప్రేమ వ్యవహారాలు నడిపిన మార్లిన్ జీవితం అర్ధాంతరంగానే ఆత్మహత్యతో ముగిసింది. బాలీవుడ్ విషయానికొస్తే... ‘మొగల్ ఏ ఆజమ్’ హీరోయిన్ మధుబాల... ప్రేమనాథ్, దిలీప్ కుమార్ల మధ్య ట్రయాంగిల్ లవ్‌లో విరక్తితో అర్ధాంతరంగా మరణించింది. సుమంగళిగా మరణించాలన్న ఆమె చివరి కోరికను కిషోర్ కుమార్ నెరవేర్చాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు గురుదత్... అటు భార్య గీతాదత్ ఇటు తాను ప్రేమలో పడ్డ వహీదా రెహమాన్ మధ్య నలిగిపోయి, చివరికి లవ్ ఫెయిల్యూర్ భరించలేక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. స్మితా పాటిల్, దివ్య భారతి, మోనాల్, ప్రత్యూష బెనర్జీ, జియా ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి వారు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇటు సౌత్‌లో శోభ, ఫటాఫట్ జయలక్ష్మి, సిల్క్ స్మిత, ఉదయ్ కిరణ్, రంగనాథ్.. లాంటి ఎందరో తారలు బలవన్మరణానికి పాల్పడిన వారే. సినీ రంగంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారిలోఎక్కువగా ప్రేమ, పెళ్లి, విడాకులు, ఆర్థిక, కుటుంబ సమస్యలు, అవకాశాలు తగ్గిపోవడం లాంటి కారణాలతోనే జీవితాన్ని ముగించారు. హీరోల కంటే హీరోయిన్లలోనే ఆత్మహత్యలు ఎక్కువ... హీరోలకు ఏదైనా సమస్య వస్తే దాంట్లోంచి బయటపడేందుకు ఉన్నన్ని మార్గాలు హీరోయిన్లకు లేకపోవడమే అందుకు ఒక కారణం. ఇంకో ముఖ్య కారణం ఏంటంటే హీరోయిన్లకు 35 ఏళ్లు వచ్చే వరకే మంచి అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత అవకాశాలు తగ్గుతుంటాయి. చాలామంది హీరోయిన్లకు నటనే జీవనాధారం. కానీ హీరోలు నటనతో పాటు రియల్ ఎస్టేట్, హోటల్స్, థియేటర్లు, స్టూడియోలు లాంటి వ్యాపారాలతో అధికంగా నిలదొక్కుకోగల్గుతారు. సక్సెస్‌తో స్ట్రెస్: చిత్ర సీమలోని వారికి ఫెయిల్యూర్ కంటే సక్సెస్‌తోనే స్ట్రెస్ ఎక్కువ. ముందు సినిమా సూపర్ డూపర్ హిట్ అయి, తదుపరి సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే చాలా సందర్భాల్లో వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. అలాగే తారలకు నిజ జీవితంలో తగినంత స్వేచ్ఛ ఉండదు. కొందరు గాడ్ ఫాదర్ గుప్పెట్లో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే కొందరి తారల జీవితాలు బంగారు పంజరంలోని చిలకలా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఒంటరితనం, అభద్రత, తనను తానుగా ప్రేమించే వారి కోసం పడే తపన, గుర్తింపు కోసం పడే ఆరాటం కూడా వారి నైరాశ్యానికి తోడవుతాయి. అవమానం భరించలేక: సినిమా ప్రపంచంలో తరచుగా పార్టీలు, మద్యానికి, మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడటం, తద్వారా మానసికంగా మరింత బలహీనపడి చివరకు దయనీయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడతారు. కొందరు తారలు ఉన్నదంతా ఖర్చు పెట్టో లేక ఒక సినిమా తీసి అది అట్టర్ ఫ్లాప్ అయి ఆర్థికంగా దివాళా తీసో దాని నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితంలో ఏ చిన్న ఒడుదుడుకులు వచ్చినా అది పెద్ద సంచలనంగా మారి, ఆ అవమానాన్ని భరించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొందరైతే చిన్నా–చితక అవకాశాలతో రాజీ పడలేక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. తొలి దశలోనే చికిత్స అవసరం: తారలకు నటనతో పాటు ఆత్మవిశ్వాసం, ఈ రంగుల ప్రపంచంలో బతక నేర్చే మెళకువలు, ఆటుపోట్లను సమానంగా తీసుకునే మనోబలం, స్క్రీన్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకొనే మేధస్సు, ఆర్థిక, ప్రేమ, వివాహ విషయాలలో ఆచితూచి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొనే ప్రజ్ఞ చాలా అవసరం. ఆ మధ్య డిప్రెషన్‌కు లోనైన దీపికా పదుకోన్ సైకియాట్రిస్టును సంప్రదించి చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకొని తనలా మరెవ్వరూ బాధపడకూడని ‘లివ్, లవ్ అండ్ లాఫ్’ అనే ఎన్జీఓను స్థాపించి చాలామందికి సేవ చేస్తోంది. మనోవేదనకు గురైన తారలు తొలి దశలోనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి తగిన వైద్యం, కౌన్సిలింగ్ చేయించుకోవడం అవసరం. ఒకనాడు తాము ఒక వెలుగు వెలిగిన రంగుల ప్రపంచం, చివరకు బ్లాక్ అండ్ వైట్‌గా మారితే తట్టుకోలేక అర్ధాంతరంగా తనువు చాలించిన సినీ తారల ట్రాజెడీ కథలు ప్రస్తుతం సినీ రంగంలో ఉన్నవారికి ఒక కనువిప్పుగా ఉండాలని ఈ ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం నాడు ఆశిద్దాం.ఈ సమయం దాటిపోతుంది→ ఆత్మహత్య భావాలతో బాధపడేవారు తమలో తామే కుంగిపోకుండా తమలోని మనోవేదనను ఆత్మీయులతో పంచుకుంటే వారి బాధ చాలావరకు తగ్గుతుంది.→ అలాంటివారికి జీవితంలోని సమస్యలకు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదని, ధైర్యంగా ముందుకెళ్లేందుకు ఇతర ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని తెలియజెప్పాలి. → మనసుకు తగిలిన గాయాన్ని మాన్పేందుకు ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అంటే మంచి మాటలతో సాంత్వన కలిగించడం, వారిని ఆ సంఘటన లేదా షాక్ నుంచి బయటకు వచ్చేలా వారి దృష్టి మళ్లించడం, నీకు నేనున్నాను లేదా మేమంతా నీకు అండగా ఉన్నామనే భరోసా కలిగించడం అవసరం. → ఎవరికైనా జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలుండవు. సముద్రంలోని అలల్లాగా కష్టాలు మనల్ని పలకరించి మళ్లీ వెనక్కి వెళతాయని చెప్పాలి. → గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా ‘ఈ సమయం దాటిపోతుంది’ అనే సూక్తిని ఆ కష్ట సమయంలో గుర్తు చేసుకుంటే ఆత్మహత్య భావాలనుంచి బయట పడే అవకాశం ఉంది. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రముఖ మానసిక వైద్యులు, రచయిత, విజయవాడ email:indlas2@gmail.com -
Bigg Boss 10 : వర్షిణికి వాష్‌రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆట రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య పోటీతో పాటు గ్రూపులుగా చర్చలు, బాధ్యతల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. మూడో రోజు ఎపిసోడ్లో హైరిస్క్ జోన్, కొత్త కెప్టెన్ ఎంపిక, ఇంటి పనుల పంపకం, మానిటరింగ్ విషయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం సాగింది. మరోవైపు తనకు లభించిన ప్రత్యేక పవర్ ని షాలిని ఉపయోగించుకుంది. ఇంతకీ మూడో రోజు ఏం జరిగింది?. అసలు వర్షిణి శాశ్వతంగా వాష్‌రూమ్ కడగాల్సిన అవసరం ఏం వచ్చింది.? నిన్న జరిగిన ఎపిసోడ్ పై ఒక లక్కేద్దాం రండి..!రెండు టీమ్‌లకు షాక్.. హైరిస్క్‌లోకి ఇద్దరు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో బ్లూ, రెడ్ టీమ్‌లు ఆశించిన స్థాయిలో రాణించలేదని బిగ్‌బాస్ ప్రకటించాడు. రెండు టీమ్‌లు విఫలమైనందుకు చెరో కంటెస్టెంట్‌ను హైరిస్క్‌లో పెట్టాలని ఆదేశించాడు. బ్లూ టీమ్ నుంచి రామ్ ప్రసాద్ స్వయంగా ముందుకొచ్చాడు. తనను హైరిస్క్‌లో పెట్టాలని టీమ్ సభ్యులకు చెప్పాడు. రెడ్ టీమ్‌లో మాత్రం చరణ్, షాలినీలలో ఒకరిని ఎంపిక చేయాలని చర్చ జరిగింది. చివరకు టీమ్ సభ్యుల నిర్ణయంతో మేరకు చరణ్ హైరిస్క్‌లోకి వెళ్లాడు.కెప్టెన్సీ బాధ్యతలో మార్పు..హైరిస్క్‌లోకి వెళ్లిన రాంప్రసాద్, చరణ్‌లు రెండు టీమ్‌లకు సంబంధించిన కొన్ని హక్కులను కోల్పోయారు. దీంతో బ్లూ టీమ్ కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది. కొత్త కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే చర్చలో ముఖేశ్, త్రిగుణ్ పేర్లు వినిపించినప్పటికీ.. ఇక్కడో మ్యాజిక్ జరిగింది. రాంప్రసాద్ ప్రతిపాదనతో దేబ్జానీకి అవకాశం దక్కింది. టీమ్ సభ్యుల అంగీకారంతో ఆమె బ్లూ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.పనుల పంపకంలో వివాదం..ఇంటి పనుల విషయంలోనూ కంటెస్టెంట్ల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. వంట పూర్తయ్యే వరకు పాత్రలు శుభ్రం చేసే వ్యక్తి కిచెన్ దగ్గరే ఉండాలంటూ త్రిగుణ్, వర్ష, సుధీర్.. రోహిత్‌కు సూచించారు. అయితే తాను ఎప్పుడూ అక్కడే ఉండటం సాధ్యం కాదని, అవసరమైనప్పుడు పిలిస్తే వచ్చి పని చేస్తానని రోహిత్ చెప్పాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ రెండు టీమ్‌లకు మరో బాధ్యత అప్పగించాడు. ఒక టీమ్ ఇంటి పనులు చేయాలని, మరో టీమ్ వాటిని పర్యవేక్షించాలని చెప్పాడు. దీంతో ఏ టీమ్ ఏ బాధ్యత తీసుకోవాలనే దానిపై చర్చ మొదలైంది.రోహిత్ విషయంలో రచ్చ..బ్లూ టీమ్ తరఫున దేబ్జానీ.. తమ టీమ్ ఇంటి పనులు చేస్తుందని, రెడ్ టీమ్ మానిటరింగ్ బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది. అయితే రోహిత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాము కూడా అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరాడు.మాటామాటా పెరగడంతో..రోహిత్ మాటలపై వర్ష, త్రిగుణ్, కృష్ణుడు స్పందించడంతో వాతావరణం వేడెక్కింది. మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుధీర్‌తోనూ రోహిత్‌కు గొడవ జరిగింది. తన పని తాను చేయాల్సి ఉండగా సుధీర్ ఎందుకు చేశాడంటూ రోహిత్ ప్రశ్నించాడు. ఈ సమయంలో త్రిగుణ్ జోక్యం చేసుకోవడంతో ‘నీకు సంబంధం లేని విషయంలో ఎందుకు కలుగజేసుకుంటున్నావు?’ అంటూ రోహిత్ ఘాటుగా స్పందించాడు.ఎవరికి ఏ పని?చివరకు దేబ్జానీ ఇంటి పనులను కంటెస్టెంట్లకు విభజించింది. వంశీకి కుకింగ్ బాధ్యత అప్పగించి, అతనికి సహాయంగా ఝాన్సీని నియమించింది. దేబ్జానీ మానిటర్‌గా వ్యవహరించనుంది. షాలినికి వాష్‌రూమ్, అమన్‌కు లాండ్రీ, సృష్టికి హౌస్ క్లీనింగ్ బాధ్యతలు దక్కాయి. సుధీర్‌కు మానిటరింగ్ బాధ్యత, రోహిత్‌కు అంట్లు తోమే పని అప్పగించి.. అతడిని త్రిగుణ్ పర్యవేక్షించాలని నిర్ణయించారు. చైత్రకు హౌస్ క్లీనింగ్ బాధ్యత ఇచ్చారు. వర్షిణికి వాష్‌రూమ్ బాధ్యత..ఇక ఎపిసోడ్లో షాలిని తనకు లభించిన ప్రత్యేక పవర్ ని ఉపయోగించుకోవడం మరో హైలైట్‌గా నిలిచింది. తనకు కేటాయించిన వాష్‌రూమ్ క్లీనింగ్ బాధ్యతను వర్షిణికి అప్పగించింది. దీంతో వర్షిణి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంతకాలం వాష్‌రూమ్ బాధ్యత ఆమెనే చేయాలి. వర్షిణి నవ్వుతూ తనకు ఇచ్చిన బాధ్యతను స్వీకరించింది.30 సెకన్ల ఛాలెంజ్..అంట్లు తోముతున్న రోహిత్‌ను పర్యవేక్షించే బాధ్యత త్రిగుణ్‌కు దక్కడంతో ఇద్దరి మధ్య మరోసారి వివాదం మొదలైంది. త్రిగుణ్ పిలవగానే ‘30 సెకన్లలో వస్తా’ అన్న రోహిత్.. ఆలస్యం చేసాడు. నిజానికి ఇక్కడ రోహిత్ కావాలనే అలా చేశాడు .త్రిగుణ్ ఈ విషయాన్ని బిగ్‌బాస్ దృష్టికి తీసుకెళ్లాడు.అంతటితో ఆగకుండా రోహిత్ పని చేస్తున్న విధానంపై త్రిగుణ్ సూచనలు చేయడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది. ‘ఇలా చేయాలి.. అలా చేయాలి’ అంటూ తనను మానిటర్ చేయడంపై రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘నేను ఇంట్లోని వాళ్లను కాదు.. నిన్నే మానిటర్ చేస్తున్నా’ అంటూ త్రిగుణ్ కౌంటర్ ఇచ్చాడు. ఇలా మూడో రోజుకే బిగ్‌బాస్ హౌస్‌లో ఆధిపత్య పోరు, పనుల విషయంలో విభేదాలు బయటపడటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత వేడెక్కేలా కనిపిస్తోంది. -
TVK నినాదాలతో దద్దరిల్లిన ‘సిగ్మా’ ఈవెంట్.. సీఎం విజయ్ తనయుడి రియాక్షన్
తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుక తమిళనాడులోని సేలంలో ఘనంగా జరిగింది. తెలుగు నటుడు సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈవెంట్లో జేసన్ సంజయ్ ప్రసంగిస్తుండగా అభిమానులు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) నినాదాలతో హోరెత్తించారు. 'మా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు' అని సంజయ్ అనగానే అభిమానుల కేరింతలు మరింత పెరిగాయి. దీంతో కాసేపు ప్రసంగాన్ని ఆపిన సంజయ్ చిరునవ్వుతో థంబ్స్ అప్ చూపిస్తూ స్పందించారు.కొంతకాలం క్రితం సీఎం విజయ్, సంజయ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ పలు రూమర్లు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వేడుకలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. సంజయ్ తన తండ్రి విజయ్ నటించిన ‘తిరుమలై’ తాను థియేటర్లో చూసిన తొలి సినిమా అని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తనకు 3 ఏళ్ళు అని చెప్తూ నవ్వుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తాను దర్శకుడిగా మారుతున్న విషయం మొదటగా తన తల్లికి ఫోన్ చేసినట్లు తెలిపారు. ఈ చిత్ర హీరో సందీప్ కిషన్ సైతం విజయ్ను తమ సినిమాకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. దానికి సంజయ్ కూడా చిరునవ్వుతో మద్దతు తెలిపారు. దీంతో తండ్రి, కొడుకుల మధ్య విబేధాలపై వస్తున్న ప్రచారానికి ఈ వేడుకలోని సంజయ్ స్పందన కొంత స్పష్టత ఇచ్చినట్టయింది.ఇక ‘సిగ్మా’ హీస్ట్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంపత్ రాజ్, శివ్ పండిట్, యోగ్ జేపీ, షీలా రాజ్‌కుమార్, రాజు సుందరం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
డాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. రఘు మాస్టర్, సుమలతతో చర్చలు
లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై కీలక సమావేశం జరిగింది. జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్, సుమలత దేవితో పాటు ఇరువర్గాలతో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు జాయింట్ కమిషనర్ ఎదుట ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తమకు అన్యాయం జరిగిందని..సుమలత అధ్యక్షురాలిగా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా ఆమె కార్యవర్గంలోని కొంతమంది రాజీనామా చేశారని జాయింట్ కమిషనర్ తెలిపారు. ఖాళీ అయిన స్థానాలకు సుమలత ఉప ఎన్నికలు నిర్వహించడంతో.. ఇప్పటికే ఎన్నికైన తమకు అన్యాయం జరిగిందని కొందరు ఆరోపించినట్లు చెప్పారు. తమవైపే మెజారిటీ సభ్యులు ఉన్నారని రఘు మాస్టర్ పేర్కొన్నారు.ఫెడరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని..ఈ వివాదాన్ని 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ సమక్షంలో పరిష్కరించుకోవాలని జాయింట్ కమిషనర్ సూచించారు. వివాదం కొనసాగితే యూనియన్ రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని డాన్సర్లు కోరుతున్నారని రఘు మాస్టర్ తెలిపారు. సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఫెడరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. -
సినిమాలో బోల్డ్ సీన్స్.. హీరోయిన్‌కు భరోసా
'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో ఛాన్స్మిస్.. రాజకుమారి పరిస్థితి ఇంత దారుణమా?అయితే ఈ ఈవెంట్లో డైరెక్టర్ ఆదిత్య హీసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ ఈ మూవీలో కొన్ని బోల్డ్ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ వైష్ణవి నర్వస్‌గా ఫీల్ అయింది. ఈ విషయంలో ఆమెకు ఒకటే చెప్తున్నా.. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి నెగిటివిటీ వచ్చానా సపోర్ట్‌గా ఉంటా. బాధ్యత తీసుకుంటా’ అని తెలిపారు. కాగా ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఇటీవల బోల్ట్ సీన్స్‌పై విమర్శలు ఎక్కువ అవుతుండడంతో గతంలో బేబీ మూవీలోని ఆమె పాత్రపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది. Director #AdityaHaasan about the BOLD SCENES in #EPIC :“Vaishnavi is a SUPERSTAR.If there is any NEGATIVITY after the release regarding her BOLD SCENES, let it come to me first.I will take FULL RESPONSIBILITY for it.” pic.twitter.com/i2668WUK4n— Rangasthalam (@RangasthalamIN) September 8, 2026 -
‘సీక్రెట్ సోల్జర్’ నుంచి సాంగ్ రిలీజ్
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. ఈ సినిమా సెప్టెంబరు 18న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ను కంపోజ్ చేసి అలపించిన తీరు ఆకట్టుకుంది. రెహమాన్ అందించిన సాహిత్యం పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. -
బిగ్‌బాస్‌లో ఛాన్స్మిస్.. రాజకుమారి పరిస్థితి ఇదా..?
బిగ్‌బాస్ సీజన్ 10 తెలుగులో బిగ్‌బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ రాజకుమారి దయాన. కామన్ మ్యాన్ కేటగిరీలో పోటీ చేసిన ఆమె.. తనదైన ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో వెనకడుగు వేయకుండా పోరాడిన తీరు.. జడ్జీలతో పాటు ఆడియన్స్‌ను కూడా మెప్పించింది. దీంతో బిగ్‌బాస్ మెయిన్ హౌస్‌లో ఆమెకు చోటు ఖాయమని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ఆ అవకాశం దక్కలేదు. ( ఇదీ చదవండి: ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్)పిల్లలతో ఉన్న ఓ వీడియో..ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ అవకాశం కోసం తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను బయటపెట్టారంటూ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ‘సింపతీ స్టార్’ అంటూ విమర్శలు చేయడంపై రాజకుమారి దయాన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలతో ఉన్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తాను ఎదుర్కొంటున్న బాధను చెప్పుకొచ్చారు.‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా..‘హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసరికి నా పిల్లల పరిస్థితి చూసి చాలా బాధేసింది. ‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా నన్ను పొడుచుకు తిన్నారు. నేను ఏం తప్పు చేశాను? నాకే అర్థం కావట్లేదు అండి. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కానీ నా గురించి మాట్లాడిన మాటలు, నాపై వేసిన నిందలు అన్నీ వింటుంటే… ఒక మనిషిగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదు కదా. నేను కూడా ఒక మనిషినే అండి. నాకూ బాధ ఉంటుంది… నాకూ కన్నీళ్లు వస్తాయి. ఒక్కసారి నా పరిస్థితిని కూడా ఆలోచించండి’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by rajakumari_dayana 46 (@rajakumari_dayana) -
దీపావళి బరిలో సూర్య.. సినిమా ఇదే..
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయంతో జోరుమీదున్న సూర్య.. మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు జితు మాధవన్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘సీన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నజ్రియా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన జితు మాధవన్.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. సూర్య, నజ్రియా జోడీ ఎలా అలరిస్తుందో చూడాలి.ఇదీ చదవండి: ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్ -
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ నటి.. వరుడు ఎవరో తెలుసా..?
తమిళ నటి నివేదితా సతీశ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఫొటోగ్రఫర్, వ్యాపారవేత్త సుహైబ్ మహమ్మద్‌తో నిశ్చితార్థం అయిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం.’ అంటూ క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. (మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను)ఈ వేడుకలో నివేదితా సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. నివేదితా షేర్ చేసిన ఈ ఫొటోలకు గాయత్రి శంకర్, ఆండ్రియా జెర్మియా, సంయుక్తా, ఎస్తర్ అనిల్, ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.హలో సినిమాతో..అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన హలో (2017) సినిమా ద్వారా నివేదితా సతీష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె హీరోయిన్ ప్రియా స్నేహితురాలు కవితగా కనిపించారు. ధనుష్ హీరోగా నటించిన ఈ తమిళ పీరియాడిక్ యాక్షన్ చిత్రం కెప్టెన్ మిల్లర్(2024). తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది ఇందులో ఆమె 'తేన్పాసియార్' (యాక్షన్ రోల్) అనే కీలక పాత్రను పోషించారు. దీంతో పాటు పలు తమిళ చిత్రాలు, ఓటీటీ సిరీస్‌ల్లోనూ నటించారు. (రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్) -
ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా తనను బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) కార్యక్రమానికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ షో 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా రాసిన బ్లాగ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ అవుతారా? కొనసాగించడం కష్టంగా మారుతోందికార్యక్రమానికి వచ్చే కొందరు కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాల్లోని విషాదకర ఘటనలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అమితాబ్ పేర్కొన్నారు. వాళ్లు పడిన బాధలను పంచుకుంటున్నప్పుడు నా భావోద్వేగాలను అదుపు చేసుకోవడం నాకు కష్టంగా ఉంటోంది. హోస్ట్‌గానూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం కష్టంగా మారుతోంది. ఇక నేను రిటైర్ కావాలనుకుంటున్నా.. ఇప్పటికే ఆలస్యమైంది.’ అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. దీంతో అమితాబ్ ఇక KBC నుంచి తప్పుకోనున్నారా? అనే చర్చ మొదలైంది.ఇదీ చదవండి: మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను2000లో ప్రారంభమైన KBCకి తొలి సీజన్ నుంచి అమితాబ్ బచ్చనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మూడో సీజన్‌కు మాత్రం షారుక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గతంలోనూ అమితాబ్ KBC నుంచి తప్పుకోనున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. అవి నిజం కాలేదు. ఇప్పుడు కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ( విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..) -
ఉత్కంఠను పెంచుతున్న అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం3’ ట్రైలర్
మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు ‘దృశ్యం 3’ రాబోతోంది. మలయాళంలో మోహన్‌లాల్ కీలక పాత్రలో విడుదలైన ‘దృశ్యం3’ ఈ సారి హిందీలోనూ విడుదలకానుంది. ఈమేరకు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్, కీలక పాత్రలో అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో ‘దృశ్యం3’ని తెరకెక్కించారు. టబు,ప్రకాశ్ రాజ్, శ్రియతో పాటు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?ఈ చిత్రం గాంధీ జయంతి రోజు(అక్టోబరు 2)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు. మలయాళంలో విడుదలైన ‘దృశ్యం3’కి పూర్తి భిన్నమైన క్లైమాక్స్‌తో ఈ సిరీస్‌ను ముగించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకే దృశ్యం: ది కన్‌క్లూజన్ అనే టైటిల్‌తో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో కనిపించిన ఆసక్తికర సన్నివేశాలు, ట్విస్టులు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. -
విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈరోజు టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం.కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘పంచనామా’ సిద్ధమైంది. మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది.ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత, నటి ఉదయభాను చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఎక్కువ మంది చదివింది: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ ?స్వయం కృషితో ఎదిగా..చిన్న వయసు నుంచే మైక్ పట్టుకుని స్వయం కృషితో ఎదిగానని ఆమె తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒంటరిగానే నిలబడ్డానని చెప్పారు. ‘ఎవరికి టాలెంట్ ఉన్నా.. ఏ డోర్ మూసుకుపోయినా.. ఉదయభాను ప్రొడక్షన్స్ ఉందని మర్చిపోవద్దు. ఎవరి దగ్గర సత్తా ఉన్నా.. ఈ ప్రొడక్షన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని ఉదయభాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇదీ చదవండి: ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉంటుందంటే?x.com/FilmyFocus/status/2097604851358457984?s=20 -
కళ్యాణం కమనీయం జీవితం పెద్ద విజయం సాధించాలి: వి.వి. వినాయక్
ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఈ సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా పాల్గొన్నారు.డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ఈ సినిమా చిన్నదే గానీ సినిమా తీసిన వాళ్లు చిన్న వాళ్లు కాదు. ఈ చిత్రంతో ఒక కొత్త దర్శకుడికి అవకాశం కల్పించినందుకు ప్రొడ్యూసర్స్ ప్రసాదరావు, కిషోర్ కి మా డైరెక్టర్స్ అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నా. మా సత్యనారాయణ రెడ్డి గారికి మంచి మిత్రులు రాజవంశీ ఈ సినిమాను చూసి నచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి. అలాగే ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి మూవీలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరు, గుర్తింపు రావాలి. ఈ సినిమా సక్సెస్ తో ప్రొడ్యూసర్స్ గారికి మరిన్ని మూవీస్ చేసే బలం చేకూరాలని కోరుకుంటున్నా’ అన్నారు.హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ - ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఒక జంట తమ బంధాన్ని విడిపోకుండా చూసుకోవాలి అనే మంచి పాయింట్ తో మా సినిమాను డైరెక్టర్ రవి గారు తెరకెక్కించారు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే క్లీన్ మూవీ ఇది. మంచి కథ, కథనం, మ్యూజిక్, పర్ ఫార్మెన్స్ లు, టెక్నికల్ గా క్వాలిటీ అన్నీ మా సినిమాలో చూస్తారు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మా మూవీ టీమ్ అందరికీ థ్యాంక్స్. ఈ నెల 18న థియేటర్స్ లో మా సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా’అన్నారు.హీరోయిన్ సాహితీ అవంచ మాట్లాడుతూ..రైటర్ అరవింద్ గారు ఇచ్చిన ఒక మంచి ఐడియాతో మా మూవీ స్టార్ట్ అయ్యింది. ఆ పాయింట్ ను మా డైరెక్టర్ రవి లోకిరెడ్డి బ్యూటిఫుల్ మూవీగా రూపొందించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సినిమాను నమ్మి స్ట్రాంగ్ గా నిలబడిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్లు మా లాంటి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. ఇలాంటి మంచి మూవీలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. మంచి కథ ఉంటే చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా మీ ఆదరణ పొందుతుంది. ఈ నెల 18న థియేటర్స్ కు రండి. మీరు తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. అన్నారు. -
బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?
ఈరోజు బిగ్‌బాస్10 హౌస్‌లో హైరిస్క్ జోన్ టాస్క్ ఉత్కంఠ రేపనుంది. రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హైరిస్క్‌లో పెట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. హైరిస్క్‌లో ఉన్నవారు ఈ వారంలో ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.ఎలాంటి వాదనలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండానే బ్లూ టీమ్ నుంచి రాంప్రసాద్ హైరిస్క్ జోన్లోకి వెళ్లేందుకు అంగీకరించాడు. అందుకు కారణం ఏంటని అడగగా.. శనివారం చెప్తా అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో తమ టీమ్ తరఫున రాంప్రసాద్‌ను హైరిస్క్‌లో పెడుతున్నట్లు నరేశ్ బిగ్‌బాస్‌కు తెలిపాడు.ఎమోషనల్ వాతావరణం..ఇక రెడ్ టీమ్ నుంచి చరణ్‌ను యూనానిమస్‌గా ఎంపిక చేసినట్లు రోహిత్ ప్రకటించాడు. అయితే అంతకుముందే త్రిగుణ్.. రోహిత్ హైరిస్క్‌లోకి వెళ్లడని టీమ్ సభ్యులతో చెప్పడం ఆసక్తికరంగా మారింది. చివరకు రోహిత్ కాకుండా చరణ్ హైరిస్క్ జోన్లోకి వెళ్లాడు.ఇదీ చదవండి: సందీప్‌రెడ్డికి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్మరోవైపు.. ‘హైరిస్క్‌లో ఉంటాను.. అక్కడి నుంచి ఎలాగైనా బయటికి వస్తా అంటూ రాంప్రసాద్ బిగ్‌బాస్ ముందు ఎమోషనల్ అయ్యాడు. చరణ్‌తో రోహిత్ మాట్లాడుతూ.. ‘ఒక్కరు నీకు సపోర్ట్ చేసినా.. నీ కోసం నేను పోరాడేవాడిని’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణం నెలకొంది. మరి ఈరోజు జరగబోతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కువమంది చదివింది: ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మరీ వెక్కిరించాడు: ఐశ్వర్య లక్ష్మి -
సందీప్‌రెడ్డికి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. ఆ సినిమా తర్వాత ఇటు విజయ్, అటు సందీప్..ఇద్దరు కెరీర్ పరంగా బిజీ అయ్యారు. సందీప్ అయితే యానిమల్ చిత్రం పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అయినా కూడా ఇద్దరి మధ్య స్నేహ బంధం అలానే కొనసాగుతుంది. ఇటీవల సందీప్ నిర్మించిన ‘రోమాంచకం’ చిత్రానికి విజయ్ అండగా నిలిచాడు. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొని సందీప్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఇక తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ నటించిన ‘ఎపిక్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో గెస్ట్‌గా వచ్చాడు సందీప్. ఇదే ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. ఇలా విజయ్, సందీప్ మరోసారి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ తన అభిమాన డైరెక్టర్‌కి ఒక ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఇచ్చిన వాచ్ ని సందీప్ రెడ్డి వంగ వెంటనే పెట్టుకోవడం చూసి వీళ్ళిద్దరికి ఒకరి ఉంటే ఒకరు ఎంత ఇష్టమో అని ఆ వీడియోని చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.#VijayDeverakonda gifted a brand new watch to #SandeepReddyVanga ! their bonding ❤️ https://t.co/56uF21Sgey pic.twitter.com/eFcfW46wGc— Rajesh Manne (@rajeshmanne1) September 8, 2026 -
ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మరీ వెక్కిరించాడు..చాలా బాధపడ్డా: ఐశ్వర్య లక్ష్మి
సినీ తారలపై ట్రోల్స్ రావడం కామన్. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ట్రోల్స్ వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అవకాశాలు చేజారేలా చేస్తాయి. నటి ఐశ్వర్య లక్ష్మి విషయంలోనూ ఇదే జరిగిందట. ‘కింగ్ ఆఫ్ కోథా’ సినిమా తర్వాత తనపై వచ్చిన ట్రోల్స్, విమర్శలు తనను ఎంతగానో ఇబ్బంది పెట్టాయని.. చివరకు కొన్ని అవకాశాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తాజాగా వెల్లడించారు.దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘కింగ్ ఆఫ్ కోథా’లో ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలో కనిపించారు. అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2023లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమాతో పాటు నటీనటులపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ‘కింగ్ ఆఫ్ కోథా’ పరాజయం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. సినిమా విడుదల తర్వాత మలయాళ చిత్రపరిశ్రమలో తనకు అవకాశాలు ఇవ్వడానికి కొందరు భయపడినట్లు అనిపించిందని చెప్పారు.‘2023లో భారీ అంచనాల మధ్య ‘కింగ్ ఆఫ్ కోథా’ విడుదలైంది. కానీ సినిమా తర్వాత మలయాళ చిత్రపరిశ్రమ నాకు అవకాశాలు ఇవ్వడానికి భయపడినట్లు అనిపించింది. కేవలం నన్ను మాత్రమే కాదు.. దుల్కర్‌తో పాటు చిత్ర బృందం మొత్తాన్ని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. నా నటన, డైలాగ్ డెలివరీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కొన్నిసార్లు వారు చెప్పింది నిజమేనేమో అని నాకూ అనిపించేది.సినిమాలో తాను దుల్కర్‌ను ‘రాజువెట్టా’ అని పిలిచిన విధానాన్ని కూడా నెటిజన్లు ట్రోల్ చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. ‘హలో మమ్మీ’ సినిమా షూటింగ్ సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తనను పిలిచి ఆ విషయాన్ని వెక్కిరించారని, అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పారు. అంతేకాదు.. ట్రోలింగ్ ప్రభావం తనకు వచ్చిన అవకాశాలపైనా పడిందని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. విమర్శలకు భయపడి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.‘‘దుల్కర్‌తో కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. కానీ ట్రోలింగ్ దెబ్బకు భయపడి ఆ అవకాశాన్ని వదులుకున్నాను. నేను నటిస్తే దారుణంగా విమర్శలు వస్తాయని.. అది చివరకు మీకే సమస్య కావచ్చని చెప్పి ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాను. ‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రోల్స్ నన్ను అంతగా ప్రభావితం చేశాయి’ అని ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు.సినిమా ఫలితం, తనపై వచ్చిన విమర్శలు తన మానసిక ధైర్యాన్ని కూడా దెబ్బతీశాయని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్ .. ‘అమ్ములు ’లుక్ రిలీజ్
హార్ట్ ఆఫ్ కాకా అంటే ఎవరో తెలుసా? అమ్ములు. ఈ అమ్ములు ఎవరో కాదు నటి అనస్వర రాజన్. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’లో అనస్వర రాజన్ చేస్తున్న పాత్ర పేరు అమ్ములు, నివేతా పేతురాజ్, సునీల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు చిరంజీవి. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో మెడికల్ స్టూడెంట్ అమ్ములు రోల్లో అనస్వర రాజన్ నటిస్తున్నారని మంగళవారం (సెప్టెంబరు 8) ఆమె పుట్టినరోజు సందర్భంగా వెల్లడించి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ‘హార్ట్ ఆఫ్ కాకా’ అని పేర్కొన్నారు. వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. Happy Birthday to the'HEART OF KAAKA', Ammulu Paapa, #AnaswaraRajan 🤍#KAAKA Shoot in progress..Worldwide Grand Release on January 13th, 2027 🔥 pic.twitter.com/BOCBm6kSZg— Kaaka (@KaakaMovie) September 8, 2026 -
Bigg Boss 10: రోహిత్ కళ్లు నెత్తికెక్కాయి...అతన్ని కిందకు దింపాలి.. వర్షిణి ఫైర్
బిగ్‌బాస్ 10 రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ‘మహాపరీక్ష’లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కూల్‌గా, కామ్‌గా ఉంటాడనుకున్న కృష్ణుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. మరోవైపు రోహిత్‌పై యాంకర్ వర్షిణి చేసిన సంచలన వ్యాఖ్యలు హౌస్‌లో హీట్ పెంచాయి. ఇక సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే బ్యాగ్ టాస్క్ నుంచి నామినేషన్స్, ప్రొటెక్టివ్ బాస్ టాస్క్ వరకు మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.సైన్యం కోసం బ్యాగ్ టాస్క్హౌస్మేట్స్ అంతా కలిసి తమ లీడర్లుగా రామ్‌ప్రసాద్, రోహిత్‌లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 12 మంది ఇంటిసభ్యులకు నాయకులకు సైన్యంగా నిలబడేందుకు బిగ్‌బాస్ ఓ బ్యాగ్ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో కొన్ని బ్యాగ్‌లను ఉంచి.. వాటిలో ఉన్న బ్యాడ్జ్‌ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. బ్యాగ్ అందుకున్న సైనికుడు దాన్ని తన నాయకుడికి ఇవ్వాలి. ఆ బ్యాగ్‌లో ఉన్న బ్యాడ్జ్‌ల ఆధారంగా నాయకులు తమ టీమ్‌లోకి సభ్యులను తీసుకోవాల్సి ఉంటుంది.మొదట ముఖేష్ గౌడ బ్యాగ్ తీసుకుని రామ్‌ప్రసాద్‌కు ఇవ్వగా.. అందులోని తొలి బ్లూ బ్యాడ్జ్‌ను త్రిగుణ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ అమన్‌కు రెడ్ బ్యాడ్జ్ ఇచ్చాడు. అనంతరం టెంపర్ వంశీకి మరో రెడ్ బ్యాడ్జ్ ఇచ్చి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత శాలినిని కూడా తన జట్టులోకి తీసుకున్నాడు. అలా రామ్ ప్రసాద్.. త్రిగుణ్, ముఖేష్, సుధీర్, నరేష్, దేబ్జాని, చరణ్, వర్షిణి, చైత్రతో.. రోహిత్.. వంశీ, శాలిని, వంశీ, సృష్టి, ఝాన్సీ, కృష్ణుడుతో టీమ్స్‌ని ఫామ్ చేసుకున్నారు. అయితే వర్షిణిని రాంప్రసాద్ ముందుగా తన టీమ్‌లోకి తీసుకోలేదు. రోహిత్ తనకున్న ఆప్షన్‌తో ఆమెను రాంప్రసాద్ టీమ్‌లోకి పంపాడు. దీంతో వర్షిణి..రాంప్రసాద్ పై అలక పూనింది. ‘నన్ను ఎందుకు పిక్ చేసుకోలేదు? నాకెందుకు బ్యాడ్జ్ ఇవ్వలేదు?’ అని అతన్ని నిలదీసింది.దీనికి రామ్‌ప్రసాద్ స్పందిస్తూ.. ‘రోహిత్ నిన్ను ఖచ్చితంగా తీసుకోడు అనే నమ్మకం ఉంది. అందుకే నిన్ను చివరి వరకు తీసుకోలేదు’ అని చెప్పాడు.గ్రూప్ గేమ్‌పై వర్షిణి, చరణ్ మధ్య డిస్కషన్ఇక వర్షిణి, ఆర్జే చరణ్ మధ్య గ్రూప్ గేమ్ అంశంపై చర్చ జరిగింది. ‘గ్రూప్’ అని అనడం తనకు నచ్చలేదని చరణ్ చెప్పగా.. ‘గ్రూప్‌గా ఆడుతున్నప్పుడు గ్రూప్ గేమ్ అనకపోతే ఏమంటాం?’ అంటూ వర్షిణి రివర్స్ కౌంటర్ ఇచ్చింది.అంతేకాదు.. ‘మీరంతా కలిసే ఉంటున్నారు. కానీ మీతో ఝాన్సీ ఎందుకు కలవడం లేదు?’ అని చరణ్‌ను ప్రశ్నించింది. దీనికి చరణ్ తనకు అలా అనిపించడం లేదని చెప్పగా.. ‘నాకు కనిపిస్తుంది’ అంటూ వర్షిణి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.రోహిత్ తోపులా ఫీలవుతున్నాడుఅనంతరం బిగ్‌బాస్ బ్లూ టీమ్ సభ్యులకు ఓ కీలక టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులుగా ఉండేందుకు అనర్హులు అనిపించే ఒక్కొక్కరి పేరును చెప్పాలని సూచించాడు.ఈ సందర్భంగా వర్షిణి అనూహ్యంగా రోహిత్ పేరును చెప్పింది. అంతేకాదు.. అతని గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అగ్నిపరీక్షలో రోహిత్‌ను చూసినప్పుడు అతనితో మంచి వైబ్ ఉంటుందని అనుకున్నానని చెప్పింది. కానీ హౌస్‌లోకి వచ్చిన తర్వాత అతని యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందని విమర్శించింది. రోహిత్ తనను తాను పెద్ద తోపులా ఫీల్ అవుతున్నాడని.. ‘నా అంతటోడు లేడు, నేనే పెద్ద దేవుడ్ని’ అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడని వ్యాఖ్యానించింది. అతను గేమ్‌లో ఓడిపోయినప్పటికీ.. తన తప్పును అంగీకరించకుండా ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు.. త్రిగుణ్ ‘గ్రూప్’ అని అనగానే రోహిత్ ట్రిగ్గర్ అయ్యాడని వర్షిణి చెప్పింది. ‘దొంగను దొంగ అంటే ఎంత కోపం వస్తుందో.. సార్గారిని గ్రూప్ అనగానే అంత కోపం వచ్చింది. అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చేలోపే రోహిత్ కళ్లు నెత్తికెక్కాయి. అది రియాలిటీ కాదు. అతనికి రియాలిటీ ఏంటో తెలియాలి. అతన్ని కిందకు దింపాలి’ అంటూ కాస్త సీరియస్‌గానే మాట్లాడింది.రోహిత్‌పై కృష్ణుడు ఫైర్..ఆ తర్వాత నామినేషన్ బాధ్యత రెడ్ టీమ్‌కు వచ్చింది. బ్లూ టీమ్ సభ్యుల్లో హౌస్‌మేట్స్‌గా మారేందుకు ఎవరు అనర్హులో చెప్పే బాధ్యతను బిగ్‌బాస్ రోహిత్‌కు అప్పగించాడు.రోహిత్ వరుసగా కృష్ణుడు, రామ్‌ప్రసాద్, వర్షిణి, త్రిగుణ్, దేబ్జానిలను అనర్హులుగా ప్రకటించాడు. దీంతో కృష్ణుడు రోహిత్‌పై ఫైర్ అయ్యాడు. ‘కీ తనకు ఇచ్చారని కుళ్లుబోతుతనం.. సుపీరియారిటీ కాంప్లెక్స్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే రోహిత్ మాత్రం నవ్వుతూ నిలబడిపోయాడు. రామ్‌ప్రసాద్, వర్షిణి సైతం రోహిత్‌పై మండిపడ్డారు.‘ప్రొటెక్టివ్ బాస్’ టాస్క్‌లో ఫౌల్ గేమ్ఆ తర్వాత నామినేట్ అయిన పది మంది సభ్యులకు బిగ్‌బాస్ ‘ప్రొటెక్టివ్ బాస్’ టాస్క్ ఇచ్చాడు. ఇందులో డిఫెండర్లను కిల్ చేస్తూ బాస్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో బ్లూ టీమ్ అటాకర్స్‌గా, రెడ్ టీమ్ డిఫెండర్స్‌గా టాస్క్ ప్రారంభమైంది. ఈ క్రమంలో త్రిగుణ్ ఫౌల్ గేమ్ ఆడాడని రోహిత్ ఆరోపించాడు. మొత్తంగా చూస్తే బిగ్‌బాస్ 10 రెండో రోజు ఎపిసోడ్లో మాటల యుద్ధం మాత్రం బాగానే కనిపించింది. ముఖ్యంగా రోహిత్‌పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కృష్ణుడు కూడా ఊహించని విధంగా ఫైర్ అవుతూ కనిపించాడు.అయితే టాస్క్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎపిసోడ్లో పెద్దగా పస లేదనిపించింది. -
రష్మీ.. మమకారం
పెంపుడు జంతువులు ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానమని, వాటి పరిరక్షణ చాలా అవసరమని నటి రష్మీ గౌతమ్ అన్నారు. మంగళవారం శ్రీనగర్‌కాలనీలో ‘ది ఎనిమల్ ప్లేస్’ పేరిట ఏర్పాటు చేసిన వెటర్నరీ క్లినిక్‌ను ఆమె ప్రారంభించారు. పెంపుడు జంతువులు మానసిక ప్రశాంతత, సంతోషాన్ని అందిస్తాయన్నారు. పెంపుడు జంతువుల కోసం అత్యాధునిక చికిత్సలు, సేవలను అందిస్తున్నామని డాక్టర్ సలీం మస్కటీ, డాక్టర్ మార్షా గాబ్రియేల్ పేర్కొన్నారు. -హైదరాబాద్ -
‘పిఠాపురంలో… అలా మొదలైంది’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘‘ప్రేమ, హాస్యం, సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి అంశాలతో పాటు యువతకు ఒక మంచి సందేశాన్ని అందించేలా ‘పిఠాపురంలో అలా మొదలైంది’ సినిమాను రూపొందించాం’’ అని మహేష్ చంద్ర తెలిపారు. ఆయన దర్శకత్వంలో పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పిఠాపురంలో అలా మొదలైంది’. చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా పతాకాలపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అలాగే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోందని కూడా పేర్కొన్నారు. ‘‘ఇరుముడి, విశ్వనాథ్ అండ్ సన్స్, మా ఇంటి బంగారం’ సినిమాల తరహాలోనే మా సినిమా కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలి΄ారు. -
హాలీవుడ్ చిత్రాలను రీచ్ అవ్వాలనే ప్రయత్నమే ఈ చిత్రం: కార్తీ
కార్తీ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం సర్ధార్ – 2. ఈయన 2022లో నటించిన సర్ధార్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దానికి ఫ్రీక్వెల్, సీక్వెల్ చిత్రం సర్ధార్ 2 అని నటుడు కార్తీ పేర్కొన్నారు. పీఎస్.మిత్రన్ కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్, ఐవీవై ఎంటర్టైన్ మెంట్ సంస్థలపై ఎస్.లక్ష్మణన్, ఇషాన్ సక్సేనా కలిసి నిర్మించిన ఈ భారీ స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంలో నటుడు ఎస్ జే.సూర్య,నటి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్, రజీషా విజయన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జార్జ్ సీ.విలియంస్ ఛాయాగ్రహణం, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన సర్ధార్ –2 చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది.ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ సర్ధార్ 2 చిత్రం చాలా ముఖ్యమైనది. ఇది సర్ధార్ చిత్రానికి ప్రీక్వెల్, సీక్వెల్ గా ఉంటుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం. హాలీవుడ్ చిత్రాలను రీచ్ అవ్వాలనే ప్రయత్నమే ఈ చిత్రం. యాక్షన్ సన్నివేశాలు, వీఎఫ్ ఎక్స్ సన్నివేశాల కోసం యూనిట్ వర్గాలు చాలా శ్రమించారు. కార్లు, ట్రైన్ చేజింగ్ వంటి సన్నివేశాల కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ చాలా కష్టపడ్డారు. దర్శకుడు మిత్రన్ అయితే షూటింగ్ పూర్తి అయిన తరువాత ఏడాది పాటు చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపైనే దష్టి పెట్టారు. నటి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్ పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వారు యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించారు. చిత్ర జనరంజకంగా వచ్చింది అని నటుడు కార్తీ పేర్కొన్నారు. -
హబ్‌లో జోరు.. హుషారు
కథ డిమాండ్ చేస్తే చాలు.. తమ సినిమాల షూటింగ్స్ కోసం దేశ విదేశాలు చుట్టేస్తుంటారు మేకర్స్. పైగా తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా పరిధి దాటి అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటుతోంది. అందుకే కాబోలు స్వదేశంతో పాటు బడ్జెట్ ఎక్కువ అయినా విదేశాల్లోనూ షూటింగ్స్‌కి ఏమాత్రం వెనకాడటం లేదు. పలు సినిమాల చిత్రీకరణలు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంటే మరికొన్ని మూవీస్ షూటింగ్స్ విదేశాల్లోనూ జరుగుతున్నాయి.అయితే మెజారిటీ సినిమాలు మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ హబ్‌గా చెప్పుకునే హైదరాబాద్‌లోనే జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్‌లు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, గోపీచంద్, శర్వానంద్, శ్రీ విష్ణు... వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. మరి... ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం. కాలేజ్‌లో కాకా... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ఈ సినిమాకి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్, సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ కాలేజ్‌లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ బాబీ. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని సరికొత్త తరహా పాత్రలో చూపించనున్నారట ఆయన. ‘‘చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసిన ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రకటన నుంచే ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, మాస్ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్‌లో చూపించిన విధానం, పవర్ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ కలిసి గ్లింప్స్‌ను ఆసక్తికరంగా మార్చాయి. మిడిల్ క్లాస్ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్‌తో కనిపించగా, యంగ్ వెర్షన్లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్‌తో గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటాయి. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్...’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్‌కు మరింత స్వాగ్‌ను జోడించింది. సంక్రాంతి సందర్భంగా ‘కాకా’ సినిమాని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అజీజ్ నగర్లో... వరుస పాన్ ఇండియన్ మూవీస్‌తో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఏకకాలంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారాయన. ఓ వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్న ప్రభాస్.. మరోవైపు ‘ఫౌజీ’ మూవీలో నటిస్తున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ‘ఫౌజీ’ని రూపొందిస్తున్నాం. ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్‌లో కనిపించనున్నారు ప్రభాస్. డిసెంబరు 3న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, విడుదల చేసిన ప్రభాస్ సరికొత్త పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఓ యోధుడిలా, రక్తంతో తడిసిన దుస్తులు, శరీరమంతా గాయాలతో, చుట్టూ నేలకూలిన సైనికుల మధ్య తుపాకీని పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్న ప్రభాస్ లుక్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంషాబాద్‌లో... మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ‘‘సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘వారణాసి’ నుంచి మహేశ్ రెండు స్పెషల్ స్టిల్స్‌ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండు స్టిల్స్ చూస్తే ‘వారణాసి’ సినిమా సోల్, రుద్ర పాత్ర తీరు అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. శతాబ్దాలను దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ వ్యక్తి ప్రయాణంగా సాగే ఇతిహాసం ఇది. ఇందులో ఒక వ్యక్తి అసాధారణ ప్రయాణం అతడిని భారతదేశంలోని పవిత్ర జలాల నుంచి భూమి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు, 120 దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ‘వారణాసి’లో శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్‌లో విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ చిత్రం ద్వారా ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ‘‘విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ‘సింగ’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న ‘సింగ’ టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను రివీల్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించేలా వెంకట్ ఒక గ్రిప్పింగ్ కథని సిద్ధం చేశారు. ఈ మూవీ నుంచి గడ్డం, మీసం, చెవిపోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్‌లో రిలీజ్ చేసిన గోపీచంద్ లుక్ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్‌గా నిలిచింది. టైటిల్ టీజర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో రూపొందింది. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్ దర్శకుడిగా హీరోను ఎంత పవర్ఫుల్ మాస్ లుక్‌లో చూపించారో ఈ గ్లింప్స్‌తోనే నిరూపించారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. కెమెరామెన్ షామ్‌దత్. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన సినీ అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ముచ్చింతల్‌లో... శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ముఖ్యమైన నటీనటులు పాల్గొంటున్నారట. ‘‘పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘భోగి’. శర్వానంద్–సంపత్ నందిల కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన, లెన్తీ యాక్షన్ షెడ్యూల్‌ను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్‌తో కూడిన ప్రదేశాల్లో తెరకెక్కించాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రూపొందించిన ఈ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రంలోని శర్వానంద్ రగ్డ్, గ్రాండ్ స్కేల్ విజన్‌కు ప్రశంసలు లభించాయి. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమా పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్ లుక్కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాని ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాయిదా పడింది. శంకర్‌పల్లిలో... హీరో శ్రీ విష్ణు–డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్æ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. ఈ మూవీలో రెబ్బా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. అనిల్ సుంకర, రాజేష్ దండ నిర్మించిన ఈ మూవీ 2023 జూన్ 28న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తి వినోదాలు అందించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.‘సామజ వరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిషోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెకక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపిస్తుందని యూనిట్ పేర్కొంది. ఆర్ఎఫ్సీలో... తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్ర ఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024 జనవరి 12న విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆంజనేయస్వామి పాత్రను ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషభ్ శెట్టి పోషిస్తున్నారు.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హంపీలోని అంజనాద్రి బెట్టలో ఆరంభం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ వర్మ. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అన్న నేపథ్యంలో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. ‘హనుమాన్’లో హనుమంత్గా నటించిన తేజ సజ్జా ‘జై హనుమాన్’లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్ర పోషించనున్నారట.సంబరాల జోరు ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. సాయిదుర్గా తేజ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు రూపొందిస్తున్నారట రోహిత్ కేపీ. ‘‘ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది’’ అని యూనిట్ పేర్కొంది.ఇదిలా ఉంటే... పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని సినిమాల చిత్రీకరణలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
ఎపిక్‌తో బిగ్ బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం: విజయ్ దేవరకొండ
‘‘ఆదిత్య హాసన్ తీసిన ‘90స్’ వెబ్ సిరీస్ చూశాక తను సినిమా చేస్తే కచ్చితంగా చూడాలనిపించింది. తన దర్శకత్వంలో ‘ఎపిక్’ మూవీలో నటించడం ఆనంద్ అదృష్టం. ఆనంద్ సినిమాల ఎంపిక, కెరీర్ పట్ల చాలా గర్వపడుతున్నాను. ఆనంద్ ఫిల్మోగ్రఫీలో ‘ఎపిక్’ లాంటి మరో మంచి చిత్రం చేరుతుంది. వైష్ణవి బ్రిలియంట్ పెర్ఫార్మర్. సెప్టెంబరు 11న ‘ఎపిక్’తో బిగ్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘ఎపిక్–ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘సెప్టెంబరు 11న ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ ఉంది. అక్టోబరు 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా ఉంది. నవంబరులో దేవరకొండ రష్మిక ‘మైసా’ ఉంది... కాబట్టి నాన్‌స్టాప్‌గా మిమ్మల్ని (ఫ్యాన్స్) కలుస్తూనే ఉంటాను. తెలుగు సినిమాకి ఇది గొప్ప సంవత్సరం. నాన్‌స్టాప్‌గా ఫిల్మ్స్ వస్తున్నాయి... ప్రేక్షకులు చూస్తున్నారు.. హిట్స్ అవుతున్నాయి. రెండు రోజుల్లో ‘ఎపిక్’ వస్తుంది. ఆ తర్వాత నాని ‘ది ప్యారడైజ్’, ఆ తర్వాత ‘రణబాలి, మైసా’, తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ మూవీస్ వస్తున్నాయి. డిసెంబరులో ‘ఫౌజి’ మూవీ, బాలయ్యగారి ‘దాదా’ వస్తున్నాయి. ఈ ఏడాది ముగింపు సాలిడ్‌గా ఉండబోతోంది. రవితేజ అన్న ‘ఇరుముడి’ సూపర్‌గా ఉంది’’ అని చెప్పారు. మరో ముఖ్య అతిథి సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – ‘‘అర్జున్ రెడ్డి’ టైమ్‌లో నేను, విజయ్ కాలిఫోర్నియా వెళ్లాం. అప్పుడు ఆనంద్ ‘అర్జున్ రెడ్డి’ చర్చల్లో పాల్గొన్నాడు. ఐటీ జాబ్ చేస్తున్నాడు కానీ సినిమా అంటే మాకు ఉన్నంత పిచ్చి ఉందేంటీ అనుకున్నాను. సడన్‌గా ‘దొరసాని’ సినిమాతో హీరో అయ్యాడు. ‘ఎపిక్’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘కింగ్డమ్’ మూవీలో ‘అన్నా అంటే నేæ...’ పాట మా అన్న విజయ్, నా బంధానికి సరి΄ోయేలా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళుతుంటారు. మా ఫ్యామిలీలో విజయ్ అన్న అలాగ. ఇక ‘ఎపిక్’ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అని చెప్పారు.మనల్ని మనం నమ్మాలి: వైష్ణవీ చైతన్యమంగళవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ‘ఎపిక్’ మూవీ గురించి వైష్ణవీ చైతన్య మాట్లాడుతూ– ‘‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’లో కడలి అనే పాత్ర చేశాను. తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూనే, తన జీవితాన్ని కడలి ఎలా ముందుకు నడిపించింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది. గతంలో నేను ఏదైనా విషయం బయటకు మాట్లాడాలంటే కాస్త భయపడేదాన్ని. అయితే కడలి పాత్ర ద్వారా ముందు మనల్ని మనం నమ్మాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మనల్ని మనం నమ్మినప్పుడే ఇతరులు మనల్ని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో సమయంలో వారి కోసం వారు నిలబడాలని నేర్చుకున్నాను. ఈ సినిమా పరంగా పెద్ద చాలెంజ్ ఏంటంటే నేను కర్లీ హెయిర్‌తో కనిపించడమే. షూటింగ్ ఉందంటే... అందరికంటే ముందుగానే నేను నా హెయిర్‌ని సెట్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం సితార బ్యానర్లో నితిన్‌గారితో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
ఒకే జానర్‌కు ఫిక్స్ కాలేదు: సుమంత్
‘‘ఒక నటుడిగా ఇప్పటివరకూ విభిన్నమైన జానర్స్‌లో డిఫరెంట్ పాత్రలు చేశాను. ఒకే జానర్లో సినిమాలు చేయాలని ఎప్పుడూ ఫిక్స్ కాలేదు. హీరో పాత్రలు చేయడంతో పాటు బలమైన సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ కూడా చేశాను. ఇప్పుడు కూడా విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ఆ క్యారెక్టర్స్‌లో డెప్త్ ఉండాలి’’ అని సుమంత్ చెప్పారు. సుమంత్, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో సిద్ధు జొన్నలగడ్డ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో సుమంత్ చెప్పిన విశేషాలు...⇒ ‘మహేంద్రగిరి వారాహి’లో యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మూఢనమ్మకాల గురించి చర్చించే క్యారెక్టర్లో నటించాను. ఇదొక డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ ఇందులో ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీక్వెన్స్, వాణిజ్యపరమైన అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ఒక వంశంలోని వ్యక్తులు 33 ఏళ్ల వయసు దాటిన తర్వాత చనిపోవడం అనే పాయింట్ మా సినిమా ట్రైలర్లో కనిపించింది. ఈ పాయింట్ ‘మురారి’ సినిమాను కూడా గుర్తు చేస్తున్నప్పటికీ మా ‘మహేంద్రగిరి వారాహి’ కథ, స్క్రీన్‌ప్లే చాలా భిన్నంగా ఉంటాయి.⇒ దర్శకుడు సంతోష్ ఈ సినిమా కంటే ముందు నాకు వేరే కథ చెప్పాడు. కానీ ఆ కథ నచ్చలేదు. ఆ తర్వాత ‘మహేంద్రగిరి వారాహి’ కథ చెప్పగా నచ్చింది. వేదాలు, పురాణాల పట్ల మంచి అవగాహన ఉన్న సంతోష్‌కి ఇది సరైన సబ్జెక్ట్ అనిపించింది. ఈ చిత్రం ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి. ముందు ఈ సినిమాను ఇంత బిగ్ స్కేల్లో తీస్తారని అనుకోలేదు. షూటింగ్ 60 శాతం పూర్తయిన తర్వాత నిర్మాత లక్ష్మణ్‌గారు మాకు తోడయ్యారు. ఈ సినిమాలోని ఓ సీరియస్ కీ రోల్‌ను సిద్ధు జొన్నలగడ్డ చేశాడు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గారి రీ–రికార్డింగ్, మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.⇒ ప్రస్తుతం మైథాలజీ ట్రెండ్ నడుస్తోందని ఈ సినిమా చేయలేదు. ‘కార్తికేయ 2, ‘కాంతార’ సినిమాల కంటే ముందే ఈ సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేయించాం. కాకపోతే ఆ సమయంలో మా సినిమా మేకింగ్‌కు సరైన నిర్మాత సహకారం లేదు. ఏడాది ఆ తర్వాత మధుగారు, ఆ తర్వాత లక్ష్మణ్‌గారు ఈ సినిమా ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ⇒ ఇటీవల జరిగిన మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అఖిల్ గురించి సరదాగా మాట్లాడాను. తనని అయ్యగారు అని పిలుస్తుంటారట. అక్కినేనిగారి అందరి మనవళ్లలో నేనే పెద్దవాడిని. పెద్దవాడిని కాబట్టి అయ్యగారు అంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో సరదాగా అన్నాను. అది ట్రెండ్ అయ్యిందని మా వాళ్ళు నాకు చెప్పారు. -
రంగ్–ఎ–సినిమా ప్రారంభం
జమ్ము కశ్మీర్లో తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 10 వరకు నాలుగు రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ జమ్ము కశ్మీర్ (ఐఎఫ్‌ఎఫ్‌జేకే) వేడుక జరుగుతుంది. సెప్టెంబరు 7న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ చిత్రోత్సవాలను శ్రీనగర్‌లో ప్రారంభించారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) సహకారంతో జమ్ము కాశ్మీర్ ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (డీఐపీఆర్) విభాగం ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ‘రంగ్–ఎ–సినిమా’ అనేది ఈ ఫిల్మ్ ఫెస్టివల్ థీమ్. ఉత్తమ చిత్రానికి రూ. 25లక్షల రివార్డు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధానంగా తొమ్మిది అవార్డులను అందించనున్నారు. ఈ అవార్డుల కోసం రూ. 96 లక్షల ప్రైజ్ మనీని కేటాయించగా, ఉత్తమ చిత్రానికి రూ. 25 లక్షల నగదును అందించనున్నారు నిర్వాహకులు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్–డైరెక్టర్ సంతోష్ శివన్ జ్యూరీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘‘దాదాపు 80కి పైగా దేశాలకు చెందిన 1100 సినిమాలను పరిశీలించి, 41 దేశాలకు సంబంధించిన 135 చిత్రాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు షార్ట్ లిస్ట్ చేశాం. భారతదేశం నుంచి 64 సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. టర్కీ, జర్మనీ, రష్యా, సౌత్ కొరియా, తైవాన్ వంటి విదేశీ చిత్రాలను కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తాం’’ అని ఫిల్మ్‌ఫెస్టివల్ నిర్వాహక ప్రతినిధుల్లో ఒకరు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ పనోరమా, భారత్ పనోరమా, సినిమా ఆఫ్ ది వరల్డ్... ఇలా ఏడు విభాగాల్లో ఈ 135 సినిమాలను ప్రదర్శించనున్నారు. జమ్ము కశ్మీర్‌లోని అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని, పర్యాటక రంగ ప్రాధాన్యతను ప్రపంచ దేశాల చలనచిత్ర నిర్మాతలకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పరిచయం చేయడం ద్వారా ఫిల్మ్ టూరిజంను ప్రోత్సహించడం అనేది ఈ ఫిల్మ్‌ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. డెడ్ డాగ్‌తో ప్రారంభం లెబనాన్ దేశానికి చెందిన ‘డెడ్ డాగ్’ సినిమాతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. లేడీ డైరెక్టర్ సారా ఫ్రాన్సిస్ తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఐదా, వాలిద్ భార్యాభర్తలు. వృత్తి రీత్యా వాలిద్ విదేశాల్లో ఉంటాడు. భార్య తన సొంతూరులో ఉంటుంది. అయితే వాలిద్ ఎవరికీ చెప్పకుండా స్వదేశంలోని తన పాత ఇంటికి వస్తాడు. కానీ అక్కడికి వెళ్లి తన భర్త వాలిద్‌కు ఐదా సర్ప్రైజ్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ దంపతులు ఆ ఇంట్లోనే నాలుగు రోజులు ఉండాల్సి వస్తుంది. కానీ సుదీర్ఘకాలం దూరంగా ఉండటం వల్ల ఈ దంపతుల మధ్య ఏర్పడిన భావోద్వేగ దూరం, ఒకరిపై ఒకరికి ఉన్న అపనమ్మకాలు ఈ నాలుగు రోజుల్లో ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని వాలిద్ తన భార్యకు చెప్పడు. తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న ‘పెట్ డాగ్’ చని΄ోయిందనే నిజాన్ని ఐదా తన భర్తకు చెప్పకుండా దాచడానికి ప్రయత్నిస్తుంది. మరి... ఆ తర్వాత ఏం జరిగింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇక తొలి రోజు ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్, నటుడు తహా షా బదు షా, దర్శకుడు విధు వినోద్ చోప్రా తదితర ప్రముఖులు చిత్రోత్సవాలకు హాజరయ్యారు. -
60 అడుగుల ఎత్తు నుంచి దూకిన మాళవిక మోహనన్
హీరోయిన్ మాళవిక మోహనన్ ‘సర్దార్-2’ సినిమాలో యాక్షన్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఆమె ఏకంగా 60 అడుగుల ఎత్తు నుంచి తాడు సహాయంతో డైవ్ చేసిందట. అయితే అది నిజంగా కాదు, సినిమా కోసమే.విమానం నుంచి దూకుతున్న అనుభూతి కలిగేలా షూటింగ్లో భారీ బ్లోయర్లను ఏర్పాటు చేశారని మాళవిక తెలిపింది. అంత ఎత్తు నుంచి కిందకు వస్తూనే శరీర భంగిమను కాపాడుకోవడంతో పాటు డైలాగ్ కూడా చెప్పాల్సి వచ్చిందట. కెరీర్లో తాను చేసిన అత్యంత క్రేజీయెస్ట్ సీన్ ఇదేనని చెప్పుకొచ్చింది. ఎంత పక్కా జాగ్రత్తలు తీసుకొని చేసినప్పటికీ అంత ఎత్తు నుంచి కాస్త కిందకు జారాలంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది. కానీ హీరోయిన్ మాళవిక మాత్రం ఎంజాయ్ చేశానని చెబుతోంది.ఇక హీరో కార్తీ, తనకు ఒక కామన్ పాయింట్ ఉందని మాళవిక తెలిపింది. ఇద్దరికీ భోజనం కంటే అల్పాహారం, స్నాక్స్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పింది.పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్ 2’. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య విలన్ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. -
‘మా అన్నలో బాగా నచ్చిన క్వాలిటీ ఇదే..’
'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన అందుకుంది. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చదవండి: ‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్ఇవే నేర్చుకున్నా..‘విజయ్ దేవరకొండలో మీకు నచ్చిన అంశం ఏంటి’ అని యాంకర్ సుమ ఆనంద్ దేవరకొండను అడిగారు. ఆయన బదులుగా.. ‘మా అన్న దేనికీ భయపడరు. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అసలు ఆయన భయంతోనే బతకరు అదే మా అన్నయ్య నుంచి నేర్చుకున్నా’ అని ఆనంద్ దేవరకొండ చెప్పారు. దీంతో అక్కడ ఉన్న విజయ్‌దేవరకొండ అభిమానులు సంబరపడ్డారు. రణబాలి టీజర్..కాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. ఈ సినిమా అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో రేపు (సెప్టెంబర్ 9) టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. Brothers Bonding 🥰Ma anna #VijayDeverakonda దేనికీ భయపడడు. ఎలాంటి పరిస్థితినైనా Face చేస్తాడు, Attack చేస్తాడు.”:- Hero #AnandDeverakonda #EPIC pic.twitter.com/NI0NAgOfSf— Milagro Movies (@MilagroMovies) September 8, 2026 -
బేబీ బంప్‌తో దీపికా
బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె మరోసారి తమ కుమార్తె దువాను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. దువా రెండో పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు రాబోతున్న విషయాన్ని కూడా వెల్లడించారు.ఇదీ చదవండి: దీపావళి బరిలో నయనతార కొత్త సినిమా!‘మా చిన్నారి దువా.. నిన్ను ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్’ అంటూ రణ్వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దువాను చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఈ స్టార్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్కాగా.. రణ్వీర్, దీపికా 2024లో తల్లిదండ్రులయ్యారు. తమ కుమార్తెకు ‘దువా’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో దువా త్వరలో అక్క కానుంది. -
‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. అయితే ఈసారి బిగ్‌బాస్10లో నామినేషన్స్ ప్రక్రియకు ముందే ఓ కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇకపై తనను నామినేట్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడుఊహించలేరు..‘రేపటి నుంచి నేను ఎవరినైనా నామినేట్ చేయాలంటే మీరు ఊహించలేరు. ఇది ఒక రీజనా అని అడిగితే.. అఫ్కోర్స్ అని చెబుతా. మీరు చాలా తెలివైన వాళ్లని అనుకుంటున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆడండి. నాతో మాత్రం పెట్టుకోవద్దు. నామినేషన్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి’ అంటూ హెచ్చరించాడు.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్ఒకసారి మాట్లాడుకోండి..అంతేకాదు.. రెడ్ గ్రూప్‌లో ఉన్న ఎనిమిది మంది సభ్యులు పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించాడు. తమలో కనీసం ముగ్గురైనా తన మాట కరెక్ట్ కాదని చెబుతారని వ్యాఖ్యానించాడు. దీంతో అసలు అతడు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నాడు? ఎవరిని నామినేట్ చేయబోతున్నాడు? అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే టాస్కులు, టీమ్‌ల మధ్య గొడవలతో వేడెక్కిన బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వార్నింగ్ మరింత మంట రాజేసేలా కనిపిస్తోంది. నామినేషన్స్‌లో తనను టార్గెట్ చేస్తే తాను కూడా ఊహించని విధంగా స్పందిస్తానని చెప్పడంతో.. రాబోయే ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. A sweet warning from Auto. Top5 contestant?#BiggBossTelugu10 pic.twitter.com/tML4F3H640— AnantapurBO (@AnantapurBO) September 8, 2026 -
దీపావళి బరిలో నయనతార కొత్త సినిమా!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్-2’. ‘మూకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ‘మహాశక్తి’ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార మరోసారి దేవతగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన నయనతార ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇదీ చదవండి: దారులు ఏవైనా.. వసూళ్లు మాత్రం అదుర్స్.. ఎంతంటే?ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం వేగాంగా చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో రెజీనా, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ దర్శకుడు సుందర్.సి తెరకెక్కిస్తున్నారు. -
జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఈ మార్పు గమనించారా?
భారతీయ సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వం పక్షాన అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డులు చరిత్రలో తొలిసారిగా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాయి. ఇక నుంచి నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానాన్ని దేశరాజధాని ఢిల్లీకే పరిమితం చేయకుండా, దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వేదికను మార్చాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1954లో తొలి జాతీయ అవార్డుల నాటి నుంచి ఇప్పటి వరకు అనేక దశాబ్దాలుగా ఢిల్లీ వేదికగానే సాగుతూ వచ్చిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం అలా తొలిసారిగా ఈ ఏడాది వేదిక మార్చుకుంది. గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్ (కేవడియా)లో ఈ సెప్టెంబర్ 22న తాజా అవార్డుల ప్రదానం జరగనుంది.ఏటేటా రాష్ట్రపతి చేతుల మీదుగా సాగే ఈ ప్రదానోత్సవం... ఈసారీ అదే సంప్రదాయాన్ని కొనసాగించనుంది. ఈ నెల ద్వితీయార్ధంలో గుజరాత్ పర్యటనలో ఉండనున్న భారత రాష్ట్రపతి ఈ 72వ జాతీయ అవార్డులను విజేతలకు అక్కడే అందజేయనున్నారు. 2024వ సంవత్సరానికి గాను నేషనల్ అవార్డు విజేతల పేర్లను మొన్న జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే.నర్మదా తీరంలో ఏర్పాటుచేసిన వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)తో గుజరాత్‌లోని ఏక్తా నగర్ కొంతకాలంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గుజరాత్ పర్యటనలో భాగంగా ఏక్తా నగర్‌ను సైతం రాష్ట్రపతి సందర్శించనున్నారు. అక్కడే ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. సర్వసాధారణంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏటా జరిగే ఉత్సవానికి భిన్నంగా ఈసారి మరింత కన్నులపండుగగా కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.ఇప్పటికి ఏడు దశాబ్దాల పైగా ఏటా ఇస్తున్న ఈ అవార్డుల్లో ఫీచర్ ఫిల్ములు, నాన్ – ఫీచర్ ఫిల్ములు, భారతీయ సినిమాపై అత్యుత్తమ రచనలనే ప్రధాన విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తారు. 2024వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు గాను అందించనున్న తాజా 72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’ ఎంపికైంది. ఉత్తమ నటిగా యామీ గౌతమ్ (చిత్రం: ‘ఆర్టికల్ 370’), ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్మూట్టి (చిత్రం: ‘భ్రమయుగం’), కార్తీక్ ఆర్యన్ (చిత్రం: ‘చందు ఛాంపియన్’)లు సంయక్తంగా విజేతలయ్యారు. ఈసారి నాన్ ఫీచర్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్‌కు రావడం విశేషం. ఇప్పుడు సరిగ్గా అదే ప్రాంతంలో జాతీయ అవార్డుల ప్రదానం జరగడం గమనార్హం.ఇదీ చదవండి: ఏపీలో చిరంజీవి కుమార్తెకు కీలక పదవి!వివిధ విభాగాల్లో మన తెలుగు సినిమాలు ‘కల్కి 2898 ఏడీ’, ‘పుష్ప-2’తో పాటు ‘అమరన్’, ‘భూల్ భులయ్యా-3’, ‘స్త్రీ-2’ తదితర చిత్రాలు సైతం అవార్డులు స్వీకరించనున్నాయి. అవార్డు ప్రదానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ నటీనటులు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు గుజరాత్‌కు రానుండడం విశేషం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు, మరాఠీ, గఢ్వాలీ సహా వేర్వేరు భాషల్లో రూపొందించిన ఫిల్ములు అవార్డులను అందుకోనున్నాయి. సంథాలీ భాషలో రూపొందిన ఓ ఫిల్ముకు తొలిసారిగా నాన్ – ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కడం విశేషం. -
దారులు ఏవైనా.. వసూళ్లు మాత్రం అదుర్స్.. ఎంతంటే?
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రెండు సినిమాల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకటి ఇప్పటికే ఓటీటీలో భారీ ఆదరణ పొందిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన ‘మిర్జాపూర్: ది మూవీ’ కాగా.. మరొకటి పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి క్రమంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘హనుమాన్ అంశ్’. ఈ రెండు సినిమాలు విజయవంతమైనప్పటికీ వాటి బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. మూడు రోజుల్లోనే రూ.90 కోట్లకు..గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవికిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాక్నిల్క్ గణాంకాల ప్రకారం తొలి రోజే ఈ చిత్రం సుమారు రూ.25.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే భారత్‌లో రూ.93.75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.నెమ్మదిగా మొదలై.. భారీ వసూళ్లు‘హనుమాన్ అంశ్’ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరస ప్రధాన చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. తొలివారం కేవలం రూ.1.08 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో వారంలోనూ రూ.0.40 కోట్లకే పరిమితమైంది. అయితే మూడో వారం నుంచి సినిమా వసూళ్లు జోరు అందుకున్నాయి.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్మూడో వారంలో రూ.10.40 కోట్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాతి వారాల్లోనూ జోరు కొనసాగించింది. 29వ రోజుకు భారత్‌లో రూ.82.88 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఐదో శనివారం ఏకంగా రూ.16.50 కోట్లు, 31వ రోజు రూ.22.75 కోట్లు వసూలు చేసింది. దీంతో 31 రోజుల్లోనే రూ.122.13 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకుంది. 32వ రోజు నాటికి ఈ మొత్తం సుమారు రూ.122.53 కోట్లకు చేరినట్లు సాక్నిల్క్ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ( వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్)ప్రేక్షకుల ఆదరణతో..‘మిర్జాపూర్: ది మూవీ’ ఫ్రాంచైజీ క్రేజ్‌తో విడుదలైన వెంటనే భారీ ఓపెనింగ్ సాధించింది. మరోవైపు ‘హనుమాన్ అంశ్’ మొదట్లో తక్కువ వసూళ్లు సాధించినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా మంచి వసూళ్లు సాధించింది. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయానికి ఒక్కో సినిమాది ఒక్కో దారి అని ఈ రెండు చిత్రాలు నిరూపిస్తున్నాయి. -
‘బతుకమ్మ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి’
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను యువ ఫిలిం మేకర్స్ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండీ జి. ముకుందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, సెట్విన్ మాజీ చైర్మన్ గిరిధర్‌రెడ్డితో కలిసి మంత్రి ఛాలెంజ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్విజయవంతం చేయాలని..మంత్రి మాట్లాడుతూ.. షార్ట్‌ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఛాలెంజ్ చక్కటి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. యువ ఫిలిం మేకర్స్, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. -
‘బేబీ’ గుర్తుకు రాకపోతే విజయం సాధించినట్టే: వైష్ణవి చైతన్య
‘బేబీ’ తర్వాత ఆనంద్, నేను ఛాలెంజింగ్‌గా తీసుకొని ‘ఎపిక్’ చేశాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘బేబీ’ గుర్తుకురాకపోతే మేము విజయం సాధించినట్టే. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది’ అన్నారు తెలుగు బ్యూటీ వైష్ణవి చైతన్య. బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వైష్ణవి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మనం ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ, ప్రతి లవ్ స్టోరీలోనూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఎపిక్ లో కూడా ఆ ప్రత్యేకత ఉంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యూకేకి చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్ లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణల మీద నడిచే సినిమా. అమ్మాయి జీవితాన్ని ఒకలా చూస్తుంది. అబ్బాయి ఒకలా చూస్తాడు. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు? వీరిద్దరి ఆలోచనలు ఏంటి? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాలో హంగామా ఉండదు. హత్తుకునేలా ఉంటుంది.→ ఇందులో ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. క్లారిటీ ఉన్న అమ్మాయి.→ కడలి పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ, కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. బయటకు రాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది.→ కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. ఎపిక్ ఎంచుకోవడానికి కారణమదే.→ దర్శకుడు ఆదిత్యతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆయన జీవితాన్ని చాలా లోతుగా గమనిస్తుంటారు. జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, అందులో ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంటారు. ఎపిక్ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. ఆదిత్య, కడలి పాత్రల మధ్య జరిగే చిన్న విషయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూపిస్తారు. ఆదిత్య యూనిక్ డైరెక్టర్. నాకు బాగా ఇష్టమైన దర్శకులలో ఆయన ఒకరు.→ నేను ఏదైనా విషయం బయట మాట్లాడాలంటే కాస్త భయపడుతుంటాను. కడలి పాత్ర ద్వారా నేనొక విషయం నేర్చుకున్నాను. ముందు మనల్ని మనం నమ్మాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి.→ అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉన్న సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే.. ఒక సముద్రం లాంటి అమ్మాయి, తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూ.. తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించింది అనేది ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది.→ ఈ సినిమాలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడతాం కాబట్టి, 90s వెబ్ సిరీస్ అంత క్లీన్ ఎంటర్టైనర్ లా ఉండకపోవచ్చు. కానీ, దర్శకుడు ఆదిత్య ఈ సినిమాకి ఏది అవసరమో అది చూపిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడొచ్చు.→ కొత్త సినిమా విషయాలకొస్తే.. సితార బ్యానర్ లో నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళ్ లో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. -
చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్
కొన్ని సినిమాలు కథ, కథనంతోనే కాదు.. పాటలతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలా పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ప్రభాస్, త్రిష జంటగా నటించిన ‘పౌర్ణమి’ ఒకటి. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ‘భరత వేదముగ’ పాటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.ఇదీ చదవండి: వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్ఆకట్టుకునేలా..తాజాగా ఈ పాటకు ఓ చైనా యువతి అద్భుతంగా నాట్యం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మీరా వాంగ్ అనే యువతి షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన దుస్తులు ధరించి ‘భరత వేదముగ’ పాటకు ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు. ఆమె హావభావాలు, నృత్య భంగిమలు ఆకట్టుకునేలా ఉండటంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తెలుగు సినిమా పాటకు చైనా యువతి ఇంత అందంగా నాట్యం చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంగీతం సరిహద్దులు దాటి ఆకట్టుకుంటోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఏపీలో చిరంజీవి కూమార్తె సుస్మితకు పదవి A Chinese woman performed the iconic #Pournami song in Shanghai yesterday! ❤️#Prabhas #Trisha pic.twitter.com/u0U42dO503— Milagro Movies (@MilagroMovies) September 8, 2026 -
వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్
బిగ్‌బాస్ సీజన్ 10లో హౌస్‌మేట్‌గా మారేందుకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద రచ్చ మొదలైంది. రెడ్, బ్లూ టీమ్ సభ్యుల ఫొటోలను పెట్టి.. హౌస్‌మేట్‌గా మారేందుకు అర్హత లేని ఐదుగురి ఫొటోలపై కారణాలు చెబుతూ స్టార్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.రాంప్రసాద్, వర్షిణి ఎం చెప్పారంటే..బ్లూ టీమ్ నుంచి వర్షిణి, రాంప్రసాద్ కలిసి రోహిత్, చరణ్ ఫొటోలపై స్టార్ చేశారు. అగ్నిపరీక్షలో రోహిత్‌ను పదేపదే లేపి పైకి కూర్చోబెట్టారని.. అంతేతప్ప అతనికి అంత సీన్ లేదని వర్షిణి చెప్పింది. అగ్నిపరీక్షలో రోహిత్ 100 శాతం ఇచ్చాడని అనుకుంటే.. హౌస్‌లో మాత్రం 10 శాతం కూడా చరణ్ లేడని రాంప్రసాద్ వ్యాఖ్యానించాడు.మరోవైపు దేబ్జానీ.. షాలినీ ఫొటోపై స్టార్ చేసింది. షాలినీకే అంతా తెలుసన్నట్లు వ్యవహరించడం తనకు నచ్చలేదని చెప్పింది. అలాగే సృష్టి, అమన్ కూడా హౌస్‌మేట్‌గా ఉండేందుకు అర్హులు కాదంటూ బ్లూ టీమ్ సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.రెడ్ టీమ్‌వాళ్ల వాదనలు ఇవీ..ఇదే టాస్క్‌ను రెడ్ టీమ్‌కు కూడా బిగ్‌బాస్ ఇచ్చాడు. అయితే ఈసారి కూడా అందరి ముందే కారణాలు చెప్పాలని ఆదేశించాడు. దీంతో రోహిత్ రంగంలోకి దిగాడు. రాంప్రసాద్, వర్షిణి, వినాయకుడు (కృష్ణుడు), దేబ్జానీ, త్రిగుణ్ ఫొటోలపై స్టార్ చేశాడు. వీళ్లు కూడా హౌస్‌మేట్‌గా పనికిరారని చెబుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లు టాస్క్‌లో రూల్స్ అన్నీ బ్రేక్ చేశారని, ఎదుటివాళ్లు చెప్పేది వినే ఓపిక కూడా లేదని రోహిత్ ఆరోపించాడు. ఊరికే ఓవర్ డామినేషన్ చేస్తారని, పనికిరాని వాదనలు చేస్తారని విమర్శించాడు. రోహిత్ మాటలకు వర్షిణి వెకిలిగా నవ్వడంతో వాతావరణం మరింత వేడెక్కింది.రోహిత్‌కి గట్టి కౌంటర్..అక్కడితో ఆగని వినాయకుడు (కృష్ణుడు).. రోహిత్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. తాను 100 శాతం ఇవ్వలేదని ఎలా అంటావంటూ ప్రశ్నించాడు. ‘యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ ఏ లీడర్.. నువ్వు ఎలా ఉండాలో మాకు చెబుతున్నావు. నువ్వు రాజు.. మేము నీ సైనికులమా?’ అంటూ రోహిత్‌పై తీవ్రంగా మండిపడ్డాడు.ఇప్పటికే టాస్క్ విషయంలో రెండు టీమ్‌ల మధ్య పోటీ తారస్థాయికి చేరగా.. రోహిత్, వినాయకుడి మధ్య మాటల యుద్ధం మరింత ఆసక్తిని పెంచింది. ప్రోమో చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్లో బిగ్‌బాస్ హౌస్‌లో పెద్ద వార్ జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుంది? ఎవరు వెనక్కి తగ్గుతారు? హౌస్‌మేట్‌గా మారే అవకాశం ఎవరికి దక్కుతుంది? తెలియాలంటే ఈరోజు రాత్రి 9.30 గంటల వరకు వేచి చూడాల్సిందే! -
ఏపీలో చిరంజీవి కూమార్తె సుస్మితకు పదవి
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు, ఫ్యాషన్ డిజైనర్, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్‌లో పదవి దక్కింది. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమె నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారికంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై సూచనలు చేయడం, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యం కావడం వంటి అంశాల్లో సుస్మిత కొణిదెల తన సేవలను అందించనున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే మెగా కుటుంబానికి ఓ పదవిని ఇచ్చింది. తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా చిరంజీవి సతీమణి సురేఖను నియమించిన సంగతి తెలిసిందే.ఇక సుస్మిత విషయానికొస్తే.. ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం సినీ నిర్మాతగా రాణిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. తన తండ్రి చిరంజీవిని హీరోగా పెట్టి ఆమె నిర్మించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి విడుదలై విజయాన్ని అందుకుంది. -
ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు రెడీ అయింది. సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ కథేంటంటే.. సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్‌కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. -
‘దురంధర్’ రేంజ్లో ‘అరసన్’.. శింబు మాటలతో పెరిగిన అంచనాలు!
తమిళ హీరో శింబు నటిస్తున్న తాజా చిత్రం అరసన్. వెట్రిమారన్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. నటి ప్రియాంక మోహన్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా నటి ఆండ్రియా, సముద్రఖని, కిశోర్ తదితరులు ముఖ్య పాత్ర లు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్స్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరచాలి. ముఖ్యంగా నటుడు శింబు గెటప్స్ ఆసక్తని రేకెత్తిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు అరసన్ చిత్రం గురించి ఎక్కడా మాట్లాడని నటుడు శింబు తొలి సారిగా ఇటీవల ఒక వేదికపై స్పందించారు. ఆయ న పేర్కొంటూ అరసన్ చిన్న చిత్రం కాదు. ఇందులో నేను చిన్న వయసు నుంచి పలు వయసుల గెటప్స్‌లో కనిపిస్తాను. హిందీలో దురంధర్ చిత్రం ఎంత ప్రభావం చూపిందో, తమిళంలో అరసన్ చిత్రం అంతగా ప్రభావం చూపుతుంది. దర్శకుడు వెట్రిమారన్ పూర్తిగా దృష్టి పెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. పలు యదార్థ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నామని శింబు పేర్కొన్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు శింబు చెప్పా రు. అరసన్ చిత్రం కచ్చితంగా తమిళ సినిమా ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో ఆయన అభిమానులు తమ ఖుషీ అవుతున్నారు. -
Bigg boss 10 : బిగ్‌బాస్ ఇంట్లో తొలిరోజే రచ్చ.. ‘నాయకుడి’ కోసం పెద్ద గొడవ!
బిగ్‌బాస్ అంటేనే ఆటలు, టాస్కులు, గొడవలు, అరుపులు.. షో మొదలైన తొలి రోజే ఇవన్నీ కనిపించాయి. ఒకవైపు ‘మ్యాజికల్ కీస్’ కోసం పోటీ.. మరోవైపు హౌస్మేట్స్ హోదా కోసం ‘మహా పరీక్ష’. ఇక టీమ్ లీడర్ల ఎంపిక దగ్గరికి వచ్చేసరికి సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా హౌస్ రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపించింది. మాటల యుద్ధంతో హౌస్‌లో వేడి వాతావరణం నెలకొంది. ఇంతకీ తొలిరోజు ఏం జరిగింది? ఎవరి చేతికి ఎలాంటి పవర్స్ వచ్చాయి? ఎవరు ఏ టీమ్‌కు నాయకులుగా నిలిచారు? తొలిరోజు హైలెట్స్‌పై ఓ లుక్కేయండి..మరో ఇద్దరి చేతికి మ్యాజికల్ కీస్!బిగ్‌బాస్ ఇంట్లో మొత్తం 16 మంది ఉండగా.. ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు మ్యాజికల్ కీస్‌ను సొంతం చేసుకున్నారు. మరో ఇద్దరికి కీస్ రావాల్సి ఉండటంతో.. ఈ వారమంతా ‘మహా పరీక్ష’ ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. వచ్చే వారంలో చాలామంది ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని, ఇంకా ఎవరూ పూర్తి స్థాయి హౌస్మేట్స్ కాలేదని స్పష్టం చేశాడు. మ్యాజికల్ కీస్ సాధించిన ఎనిమిది మంది కలిసి మరో ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో త్రిగుణ్ వంశీ, కృష్ణుడు పేర్లను ప్రతిపాదించాడు. మరోవైపు షాలినీ రోహిత్ పేరును సూచించింది. కొద్దిసేపు చర్చ జరిగిన అనంతరం అందరూ కలిసి వంశీ, కృష్ణుడు పేర్లకు ఓటు వేశారు. దీంతో వారిద్దరూ కూడా మ్యాజికల్ కీస్‌ను దక్కించుకున్నారు.రోహిత్ టాస్క్ చేయలేదంటూ త్రిగుణ్ ఫైర్బిగ్బాస్ ఇచ్చిన వాటర్ కొట్టే టాస్క్‌ను రోహిత్ చేయలేదంటూ పలువురు కంటెస్టెంట్లు ప్రస్తావించారు. ఇదే విషయాన్ని త్రిగుణ్ కూడా పదేపదే ప్రస్తావిస్తూ తన వాదనను వినిపించాడు. అయితే తమ నిర్ణయం అందరికీ నచ్చకపోవడంపై దేబ్జానీ అసంతృప్తి వ్యక్తం చేసింది.‘మీ నిర్ణయం నాకు ఫెయిర్‌గా అనిపించలేదు’ అంటూ రాం ప్రసాద్‌తో దేబ్జానీ చెప్పింది. అయితే సెలెబ్రిటీ కేటగిరీలో ఉన్న ఇద్దరికే అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందంటూ సరదాగా నవ్వేసింది.వర్షిణితో అమన్ ఫ్లర్టింగ్..ఇక హౌస్‌లో కొన్ని సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. కిచెన్‌లో ఝాన్సీ, వర్షిణి టీ తయారు చేస్తుండగా.. అక్కడికి వచ్చిన అమన్ వర్షిణితో సరదాగా ఫ్లర్ట్ చేశాడు. వర్షిణి టీ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఆమెను పొగిడాడు. మరోవైపు బెడ్రూంలో రాం ప్రసాద్, నరేష్, దేబ్జానీ సరదాగా మాట్లాడుకున్నారు. రాం ప్రసాద్‌ను ‘రామన్న’ అంటూ పిలిచిన దేబ్జానీ.. ఇంట్లో జెన్యూన్ పర్సన్ నువ్వే అంటూ ప్రశంసించింది.త్రిగుణ్, షాలినీ మధ్య కిచెన్‌లో గొడవకిచెన్లో చపాతీలు చేస్తున్న త్రిగుణ్ వద్దకు వచ్చిన షాలినీ కర్రీ గురించి అడిగింది. అయితే ‘అది నా కేటగిరీ కాదు’ అని త్రిగుణ్ సమాధానం ఇచ్చాడు. ఆ మాటను షాలినీ తప్పుగా తీసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సాధారణంగా కూడా చెప్పొచ్చు కదా అంటూ షాలినీ ప్రశ్నించడంతో మాటామాటా పెరిగింది.నామినేషన్స్‌పై నరేష్, రాం ప్రసాద్ కామెడీమరోవైపు నామినేషన్స్ గురించి నరేష్, రాం ప్రసాద్ సరదాగా మాట్లాడుకున్నారు. గార్డెన్లో తిరుగుతూ ‘వాళ్లని చేద్దాం.. వీళ్లని చేద్దాం.. వద్దులే పాపం.. వాళ్లకి ఫ్యామిలీ ఉంది.. వీళ్లకి ఈ కష్టాలున్నాయి’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేసుకున్నారు. చివరికి మనిద్దరమే మిగిలాం.. ఒకరినొకరం నామినేట్ చేసుకుందాం అంటూ ఇద్దరూ నవ్వులు పూయించారు.ఒక్కొక్కరి చేతికి ఒక్కో పవర్మ్యాజికల్ కీస్ సొంతం చేసుకున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ బిగ్‌బాస్ పిలిచి.. వారి కీ ద్వారా లభించే పవర్ ఏంటో వివరించాడు. అయితే తమకు వచ్చిన పవర్ గురించి ఇతర కంటెస్టెంట్లతో చర్చించవద్దని వార్నింగ్ ఇచ్చాడు.ముందుగా త్రిగుణ్‌కు ‘టేక్ ఓవర్’ పవర్ వచ్చింది. అంటే తనకు నచ్చిన మరో కంటెస్టెంట్ పవర్‌ను తీసుకునే అవకాశం అతడికి లభించింది. ఝాన్సీకి ఓ పవర్ ఇచ్చి వీకెండ్ ప్రారంభం కావడానికి ముందు వీక్‌లో ఎప్పుడైన దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పాడు. ఎలిమినేషన్ భయం ఉంటే ఈ పవర్‌ని యూజ్ చేసుకొని సేవ్ కావచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ముఖేష్ గౌడ: ఇతరుల పవర్‌ను రివర్స్ చేసే అవకాశంవర్షిణి: ‘గ్రాబ్ ఎనీ విన్’ పవర్కృష్ణుడు: ‘స్వాప్’ పవర్షాలినీ: ఇంట్లోని ఒక డ్యూటీని అసైన్ చేసే పవర్శ్రిష్టి: ఒకరిని నేరుగా నామినేట్ చేసే పవర్రాం ప్రసాద్: ‘సేఫ్ షీల్డ్’.. నామినేషన్ నుంచి ఒకరిని కాపాడే అవకాశంనరేష్: నామినేషన్స్‌లో డబుల్ ఓట్స్ వేసే పవర్.. ఇలా మ్యూజికల్ కీస్ గెలుచుకున్న ఒక్కొక్కరికి ఒక్కో పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్కిచెన్, క్లీనింగ్ డ్యూటీల దగ్గర మళ్లీ గొడవఆ తర్వాత హౌస్‌లో కిచెన్, క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ వంటి పనులను విభజించే ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలోనూ త్రిగుణ్‌తో గొడవ జరిగింది.సుధీర్ డిష్ వాషింగ్ బాగా చేశాడని చెప్పడంతో.. ‘మేం చేయలేమా?’ అంటూ ముఖేష్, రోహిత్, సుధీర్, షాలినీ తదితరులు వాదనకు దిగారు. డ్యూటీలను ఎవరు ఎలా చేయాలనేది తామే నిర్ణయించుకుంటామని వారు స్పష్టం చేశారు.దేబ్జానీ బ్యాటరీని సరిగ్గా ధరించకపోవడంతో బిగ్‌బాస్ ఆమెను హెచ్చరించాడు. అయితే ‘ఎందుకు బిగ్‌బాస్.. క్యూట్‌గా చెప్పొచ్చు కదా’ అంటూ దేబ్జానీ సరదాగా స్పందించింది. చివరకు బిగ్‌బాస్‌కు సారీ చెప్పింది. దీనికి బిగ్‌బాస్ కూడా ఆసక్తికరంగా స్పందిస్తూ.. తాను స్కూల్ ప్రిన్సిపల్నో.. సాంటానో మున్ముందు తెలుస్తుందని చెప్పాడు.హౌస్‌మేట్ హోదా కోసం ‘మహా పరీక్ష’ఇక అసలు ఆట ఇక్కడే మొదలైంది. ‘హౌస్మేట్స్ హోదాను పొందడమే మీ లక్ష్యం. నామినేషన్లో లేకపోయినా అందరికీ ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. మహా పరీక్షలో గెలిచి హౌస్‌మేట్ హోదాను పొందాలి. ఎలిమినేషన్ మాత్రం కన్ఫామ్’ అంటూ బిగ్‌బాస్ కీలక ప్రకటన చేశాడు.అంతేకాకుండా 16 మంది రెండు టీమ్‌లుగా విడిపోయి.. హై రిస్క్ నుంచి నో రిస్క్ వైపు తీసుకెళ్లగల సత్తా ఉన్న ఇద్దరు నాయకులను ఎంచుకోవాలని సూచించాడు.లీడర్‌గా రోహిత్.. రాంప్రసాద్టీమ్ లీడర్ల ఎంపికలో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో దాదాపు అందరూ రోహిత్‌కు మద్దతు తెలిపారు. ఒక్క ఝాన్సీ మాత్రమే మినహాయింపు. మరోవైపు సెలెబ్రిటీ కంటెస్టెంట్లు రాం ప్రసాద్, త్రిగుణ్ పేర్లకు ఓటు వేశారు.అయితే త్రిగుణ్ మాత్రం రాం ప్రసాద్‌ను లీడర్‌గా ఉంచాలని సూచించాడు. అగ్నిపరీక్ష టీమ్ మొత్తం కలిసి రోహిత్‌కు ఓటు వేసిందని, వాళ్లంతా ఒక గ్రూప్‌గా ఉన్నారని త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. తాను మాత్రం ఝాన్సీకి ఓటు వేసినట్లు చెప్పాడు.త్రిగుణ్‌పై షాలినీ, శ్రిష్టి ఫైర్త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలతో షాలినీ, శ్రిష్టి, రోహిత్, చరణ్, అమన్ తదితరులు అతడిపై మాటల దాడికి దిగారు.‘మేం రోహిత్ ఆట చూశాం.. అందుకే అతడిని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు కూడా సెలెబ్రిటీలకే ఓట్లు వేసుకున్నారు కదా.. మరి మేం అలా అన్నామా?’ అంటూ షాలినీ, శ్రిష్టి ప్రశ్నించారు.దీంతో హౌస్‌లో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బిగ్‌బాస్ ఇంట్లో రెండు టీమ్‌లు ఏర్పడ్డాయి. బ్లూ టీమ్‌కు రాం ప్రసాద్, రెడ్ టీమ్‌కు రోహిత్ నాయకులుగా నిలిచారు. లీడర్ల ఎంపికతో తొలి రోజు ఎపిసోడ్ ముగిసింది.మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ తొలి రోజే ఆటకు కావాల్సిన మసాలా మొత్తం కనిపించింది. మ్యాజికల్ కీస్, కొత్త పవర్స్, నామినేషన్స్ చర్చలు, వ్యక్తిగత గొడవలు, సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా మారిన గ్రూప్ వార్.. ఇలా తొలిరోజే హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ‘మహా పరీక్ష’లో ఎవరు నెగ్గుతారు? ఎవరు హౌస్‌మేట్స్‌గా కొనసాగుతారు? ఎవరి ప్రయాణం మధ్యలోనే ముగుస్తుందో చూడాలి. -
గుర్తింపు కోసం అందాలు ఆరబోయను : కయాదు లోహర్
చేతిలో అవకాశాలు ఫుల్‌గా ఉన్న నటి కయాదు లోహర్. తమిళం తెలుగు మలయాళం అంటూ ఇప్పుడు దక్షిణాది సినిమాను చుట్టే స్తోందనే చెప్పాలి. ఈ బ్యూటీ నటించిన ఒక తెలుగు చిత్రం, ఒక మలయాళ చిత్రం ఒకే సారి విడుదల అవ్వడం విశేషం. అందులో ఒకటి జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించిన ఇమ్మార్టల్ కాగా, మరొకటి దుల్కర్ సల్మాన్‌తో జత కట్టిన ఐయామ్ గేమ్ చిత్రం. జీవి ప్రకాష్ కుమార్ కు జంటగా నటించిన ఇమ్మార్టల్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ఐయామ్ గేమ్ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్లొందనే విమర్శలను కయాదు లోహర్ ఎదుర్కొంటోంది. అయితే ఈ రెండు చిత్రాలు మిశ్రమ స్పందనతోనే ప్రదర్శింపబడుతున్నాయి. దీంతో డ్రాగన్ చిత్రం తరువాత ఈ అమ్మడికి సరైన సక్సెస్ రాలేదు. అయితే ఇటీవల విమర్శలను ఎదుర్కొంటోంది. బిజీగా ఉన్న నటికి విమర్శలు ఎదురవ్వడం సహజమే. కాగా తనపై వస్తున్న విమర్శలపై ఒక భేటీలో స్పందించిన ఈ భామ.. తాను ప్రస్తుతం సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నానని, ఒక్క రోజు కాల్ షిట్ను మాత్రమే ఐయామ్ గేమ్ చిత్ర ప్రమోషన్స్‌కు కేటాయించినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇమ్మార్టల్ చిత్ర ప్రమోషన్ లో పాల్గొనడానికి సమయం లేకపోయిందని పేర్కొంది. ఇకపోతే గ్లామర్ గురించి అడుగుతున్నారని, అయితే కథానాయికలు అనవసరంగా ఆట బొమ్మలుగా చూపించడానికి తాను వ్యతిరేకమని అన్నారు. అయితే కథకు తప్పని సరి అయితే, ఆ పాత్ర నమ్మదగినదిగా తనకు అనిపిస్తే హద్దులు మీరని గ్లామర్ కు సమ్మతిస్తానని పేర్కొంది. అంతే కానీ ఎవ రి దృష్టిలో పడాలనో అందాలారబోయనని కయాదు లోహర్ వెల్లడించారు. -
మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు: సుమంత్ ప్రభాస్
‘‘రోమాంచకం’ చేస్తున్నప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అంతే బాగా ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. మేము కోరుకున్నటే ఆడియన్స్ బాగా నవ్వుకుంటున్నారు. ఈ మూవీ వల్ల హీరో ప్రభాస్ అన్నని కలవడం సంతోషం. ఈ సినిమా నాకు అన్ని రకాలుగా చాలా ప్రత్యేకం. ఇంకా మా చిత్రం చూడని వారు థియేటర్లకు వెళ్లండి.. మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు’’ అని హీరో సుమంత్ ప్రభాస్ తెలి పారు. వేణుగో పాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల అయింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్ బస్టర్ ఈవెంట్లో డైరెక్టర్ వేణుగో పాల్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సందీప్, ప్రణయ్గార్లు ‘రోమాంచకం’కి అవకాశంతో పాటు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కుటుంబ ప్రేక్షకులంతా మా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ–‘‘రోమాంచకం’ సినిమా థియేటర్స్‌లో బాగా రన్ అవుతోంది. ఎక్కడా నవ్వులు తగ్గలేదు. మా మూవీకి 8.5 కోట్ల రూ పాయల కలెక్ష న్స్ వచ్చాయి’’ అని పేర్కొన్నారు. ‘‘థియేటర్స్‌కు వచ్చి ‘రోమాంచకం’ మూవీ చూడండి. మీకొక డిఫరెంట్ ఎక్స్‌పీరియ న్స్ ఇస్తుంది’’ అన్నారు డైరెక్టర్, యాక్టర్ అనుదీప్ కేవీ. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ రజిత, డైలాగ్ రైటర్ మీరక్, నటులు సోహాన్, నరేంద్ర రవి, వెంకటేష్ కాకుమాను మాట్లాడారు. -
జనవరిలో అల్లం బెల్లం
విజయ్ సేతుపతి, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమాకు ‘ఇంజి వెల్లం’(తెలుగులో అల్లం బెల్లం అని అర్థం) అనే టైటిల్ ఖరారైంది. ఈ రొమాంటిక్ డ్రామా సినిమాను సుభాస్కరన్ , మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా మేజర్ స్టోరీ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. -
నా కెరీర్లో సర్దార్ 2 చాలా ముఖ్యం: కార్తీ
‘‘నా కెరీర్లో ‘సర్దార్ 2’ కచ్చితంగా చాలా ముఖ్యమైన సినిమా. ఇలాంటి ఒక గూఢచారి పాత్ర దొరకడం నా అదృష్టం. ‘సర్దార్ 2’ సినిమా విజయంపై నాకు నమ్మకం ఉంది. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను’’ అని కార్తీ అన్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్ 2’. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య విలన్ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ–‘‘కమల్‌హాసన్‌గారికి ‘ఇండియన్’(తెలుగులో భారతీయుడు) సినిమా ఎలానో నాకు ‘సర్దార్’ అలాగ. ఈ మూవీ తెలుగులోనూ చాలా పెద్ద హిట్ అయింది. ఆ మూవీ చూడని వారు ఓ సారి ఓటీటీలో చూసి ‘సర్దార్ 2’ కి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్కి తెరకెక్కించిన మా నిర్మాతలు లక్ష్మణ్, వెంకటేశ్గార్లకు, విడుదల చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జునగారికి, సుప్రియగారికి, శ్రీధర్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ–‘‘కార్తీసర్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీస్‌లో ఆయన ‘ఆవారా, ఖైదీ, సర్దార్’ వంటి సినిమాలున్నాయి. ‘సర్దార్ 2’ ఘన విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో డైరెక్టర్స్ బోయ పాటి శ్రీను, కళ్యాణ్ శంకర్, అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, వై.రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, అనిల్ సుంకర, శ్రీధర్, హీరోయిన్లు మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, నటుడు ఎస్జే సూర్య మాట్లాడారు. -
ఆటా పాటా
వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. కీర్తీ సురేష్, కృతీ శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అర్చన, జీ స్టూడియోస్, సురేష్ ప్రోడక్షన్స్ సమర్పణలో సాహు గార పాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతోందని తెలిసింది. వెంకటేశ్, కల్యాణ్ రామ్‌లతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. అలాగే కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. -
RC17: సుకుమార్ కథ లాక్ చేశారా? ఇక చరణ్‌కు ఫైనల్ నెరేషన్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘RC17’పై ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ సినిమా ఫైనల్ స్క్రిప్ట్‌ను పూర్తి చేసి కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే రామ్ చరణ్‌కు ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నారట. నెరేషన్ పూర్తయిన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకోనున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 డిసెంబర్లో ‘RC17’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా స్క్రిప్టింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ పనుల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్‌తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందనే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అయితే చరణ్-రష్మికది ఫ్రెష్ కాంబో కాబట్టి ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది. ఇందులో భాగంగానే హీరోయిన్గా రష్మికని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్‌తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది.సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్‌తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది. -
‘‘సూపర్ హిట్ సినిమాలో హీరో పాత్రను వదులుకున్న నటుడు’’
నటుడు కరుణాస్ తన సినీ ప్రయాణంలో ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయిన ఓ నిర్ణయం గురించి వెల్లడించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అసురన్’లో తొలుత హీరో పాత్ర కోసం తనను సంప్రదించారని, అయితే తాను ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పారు. కథను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయాలంటే బలమైన హీరో ఇమేజ్ ఉన్న నటుడు అవసరమని తాను భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని కరుణాస్ తెలిపారు. ‘అసురన్’ సినిమా తెలుగులో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా 2021లో ‘‘నారప్ప’’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే.బిహైండ్వుడ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అసురన్’ సినిమా గురించి కరుణాస్ మాట్లాడుతూ.. “నా కొడుకుతో కలిసి ‘అసురన్’లో నటించాల్సి ఉంది. వెట్రిమారన్ నాతో ఈ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కథ చదివి వెంటనే ఆయనతో ‘సర్, ఇందులో హీరో నటిస్తేనే ఇది పనిచేస్తుంది. నేను నటించను’ అని చెప్పాను” అన్నారు.తనతోనే సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి వెట్రిమారన్ సిద్ధంగా ఉన్నారని, అయితే మరింత గుర్తింపు ఉన్న హీరోను ఎంపిక చేసుకోవడం సినిమాకు ప్రయోజనకరంగా ఉంటుందని తాను భావించానని ఆయన గుర్తుచేసుకున్నారు. కరుణాస్ తీసుకున్న నిర్ణయంతో చివరకు ధనుష్ ఆ పాత్రను పోషించే అవకాశం వచ్చింది.ఎందుకు అలా కోరారంటే..దర్శకుడితో జరిగిన సంభాషణను కరుణాస్ మరింతగా గుర్తుచేసుకున్నారు. “కథ అద్భుతంగా ఉందని, హీరో ఇమేజ్ ఉన్న వ్యక్తి ప్రధాన పాత్ర పోషిస్తే సినిమా వాణిజ్యపరంగా మరింత బాగా పనిచేస్తుందని చెప్పాను. సినిమా స్వభావాన్ని బట్టి నిర్ణయం తీసుకునే వ్యక్తిని నేను. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తుంటే, అలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు?” అని అన్నారు. కరుణాస్‌తో సినిమాను ఎలా చేయాలో తనకు తెలుసని దర్శకుడు హామీ ఇచ్చారని, అయినా తాను తీసుకున్న నిర్ణయంలో మార్పు చేయలేదని ఆయన తెలిపారు.జాతీయ పురస్కారం అందుకున్న ‘అసురన్’‘అసురన్’ 2019లో విడుదలైంది. ధనుష్, మంజు వారియర్, కెన్ కరుణాస్, పశుపతి నటించారు. సంగీతాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ అందించారు. రచయిత పూమణి రాసిన ‘వెక్కై’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కథ, నటీనటుల ప్రదర్శనలకు సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. అనంతరం 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. -
ఉద్యోగుల భవిష్యత్తు.. RGV హెచ్చరిక!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ దర్శకుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు, మానవ ఆలోచనా సామర్థ్యం ఎలా మారవచ్చనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీ అనేది మొదటి నుంచి మన జీవితాన్ని సులభతరం చేయడానికి వచ్చింది. శారీరక శ్రమను తగ్గించడం, సమయాన్ని ఆదా చేయడం, రోజువారీ విసుగు పుట్టించే పనులను మనకు దూరం చేయడం టెక్నాలజీ ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఏఐ కూడా అదే పని చేస్తోంది.అయితే.. ఈసారి ఏఐ కేవలం మన చేతులతో చేసే పనులను కాకుండా.. మనం మెదడుతో చేసే పనులను కూడా చేయడం మొదలుపెట్టింది. ఇది ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని వర్మ పేర్కొన్నారు.మనిషికి రెండు బలాలుమనిషికి ప్రధానంగా రెండు బలాలు ఉన్నాయని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఒకటి శారీరక శక్తి, అంటే.. కష్టపడి పనిచేయడానికి ఉపయోగించే కండరాల బలం. రెండోది మేధస్సు, అంటే.. ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, కొత్త విషయాలను సృష్టించడం.పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత యంత్రాలు మనుషులు చేసే అనేక శారీరక పనులను చేయడం ప్రారంభించాయి. ఫ్యాక్టరీల్లో యంత్రాలు రావడంతో మనిషి చేయాల్సిన శారీరక శ్రమ తగ్గింది. ఇప్పుడు ఏఐ రావడంతో మనిషి చేసే మేధోపరమైన పనులు కూడా ఆటోమేట్ అవుతున్నాయని చెప్పారు.ఉద్యోగాలు వాళ్ల చేతుల్లోకి!ఇప్పటికే ఏఐతో రాయడం, డిజైన్లు రూపొందించడం, డేటాను విశ్లేషించడం, కోడింగ్ చేయడం, కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం వంటి అనేక పనులు సాధ్యమవుతున్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత పెరిగితే.. కొన్ని ఉద్యోగాల్లో మనుషుల అవసరం భారీగా అవకాశం ఉంది. అందుకే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం కంటే, ఏఐని ఎవరైతే ఎక్కువ ఉపయోగిస్తున్నారో.. అలాంటి వాళ్ల చేతుల్లోకి ఉద్యోగాలు వెళ్ళిపోతాయని వర్మ వెల్లడించారు. పాత పద్దతులను అవలంబిస్తూ ముందుకు వెళ్లాలనుకునే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.చివరగా ''నువ్వు కోరుకునే విషయంలో జాగ్రత్తగా ఉండు.. అది నిజమైపోవచ్చు'' అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అంటే.. మనిషి ఎప్పుడూ శ్రమ తగ్గించుకోవాలని, ఎక్కువ ఖాళీ సమయం కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏఐ ఆ కోరికను నిజం చేసే దిశగా వెళ్తోంది. కానీ ఆ కోరిక నిజమైతే?.. మన ఉద్యోగాలు, మన అవసరం, చివరకు మనిషిగా మన ప్రత్యేకత ఏమిటనే ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.With A I , the first jobs to vanish will be of those who immediately don’t embrace it Technology has always been designed for our convenience , to save us from physical hardships and to save our time from wasting it on mundane tasks .. we all wish for more and more free time…— Ram Gopal Varma (@RGVzoomin) September 7, 2026 -
విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 9న టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఇదీ చదవండి: సాయిబాబాపై సినిమా.. రిలీజ్ డేట్ ఇదే..కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
నాని ది ప్యారడైజ్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. చదవండి: సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమఅయితే సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు రావడంతో మూవీ విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని చిత్ర బృందం మరోసారి ప్రకటించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబరు 24న రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేయనున్నారు. -
సాయిబాబాపై సినిమా.. రిలీజ్ డేట్ ఇదే..
సాయిబాబా జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తేరా సాయి’. పలాశ్ ముచ్చల్ దర్శకుడు. ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా సాయి బాబాగా కనిపించనున్నారు. ఈ సినిమా 2027 ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓకే సారి తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. షాయాజీ షిండే, మనోజ్ జోషి, అవికా గోర్ తదితరులు కీలకపాత్ర వహిస్తున్నారు.కాగా ఇప్పటికే ఈ తరహా చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. 2012లో వచ్చిన ‘షిర్డీ సాయి’ చిత్రంలో కింగ్ నాగార్జున బాబా పాత్రను పోషించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా.. -
సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమ
సుమంత్, ఐశ్వర్య రాజేష్ జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా అక్కినేని అఖిల్ వచ్చారు. ఈ వేడుకలో నటుడు బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.ఇదీ చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?ఓ సందేహం వస్తుందని..సినిమా గురించి మాట్లాడిన బ్రహ్మానందం.. చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరో సిద్ధు జొన్నలగడ్డను ప్రశంసించారు. సిద్ధును చూస్తున్నప్పుడు తనకు ఓ సందేహం వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. ‘అతను అందంగా ఉంటాడా.. లేక నేనా?’ అని అనిపిస్తుందని అన్నారు. ఆ తర్వాత తనదైన శైలిలో ‘నాకు నేనే సంతృప్తి పరుచుకుంటా’ అంటూ చమత్కరించారు.అనంతరం ఇదే విషయంపై యాంకర్ సుమను బ్రహ్మానందం సరదాగా ప్రశ్నించారు. దీనికి స్పందించిన సుమ.. ‘మీ గ్లామర్ ముందు నేనేం మాట్లాడగలను’ అంటూ నవ్వులు పూయించారు. ఆ వెంటనే ‘వారేవా ఏమి ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అంటూ పాట పాడారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై కాసేపు నవ్వుల సందడి నెలకొంది. ( తెరపైనా అదరగొడుతున్న ‘మిర్జాపూర్’.. కలెక్షన్లు ఎంతంటే.? ) #Brahmanandam : Suma... Nenu Andanga Untana? #Siddu Andanga Untada?@ItsSumaKanakala : Vaar evaa Ema Face... Achhu Herola Vundi Baasu! 🤣#MahendragiriVarahi pic.twitter.com/SJwz6H8J6R— Milagro Movies (@MilagroMovies) September 6, 2026 -
తెరపైనా అదరగొడుతున్న ‘మిర్జాపూర్’.. కలెక్షన్లు ఎంతంటే.?
పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవి కిషన్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మిర్జాపూర్:ది మూవీ’. ఓటీటీలో ‘మిర్జాపూర్’ వెబ్‌సిరీస్‌కు మంచి ఆదరణ రావడంతో అదే పేరుతో మరో కొత్త కథతో తెరపైకీ తీసుకొచ్చారు. ఇప్పుడీ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తొలి రోజు నుంచే మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. ఆదివారం మరింత జోరు చూపించింది. మూడో రోజు ఏకంగా రూ. 36 కోట్ల నెట్ వసూళ్లూ సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువమంది చదివింది: ‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులురూ.100 కోట్లకు చేరువలో..గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం రూ.25.75 కోట్లతో బోణీ కొట్టింది. శనివారం అదే జోరులో కలెక్షన్లు మరింత పెరిగి రూ. 32 కోట్లకు చేరాయి. ఆదివారం వచ్చే సరికి ఈ చిత్రం రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్లు సుమారు రూ. 93.75 కోట్లకు చేరాయి. ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేందుకు దాదాపు రూ.6 కోట్ల దూరంలోనే ఉంది.ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లుఈ చిత్రం.. ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. సాక్నిల్క్(గణాంకాల నివేదిక) ప్రకారం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.132.35 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇందులో దాదాపు రూ.20 కోట్లు ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చినట్లు సమాచారం. -
మలయాళం బిగ్‌బాస్‌లో ‘గంధర్వ’ హీరోయిన్
మిస్ కేరళ-2014 విజేతగా గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి సురేశ్.. తాజాగా ‘బిగ్‌బాస్ మలయాళం 8’లోకి అడుగుపెట్టారు. మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఆమె పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి.. సినిమాల నుంచి రియాలిటీ షో వైపు అడుగులు వేయడం విశేషం.మిస్ కేరళ టైటిల్ గెలుచుకున్న తర్వాత గాయత్రి సురేశ్ సినిమాల్లోకి ప్రవేశించారు. కుంచాకో బోబన్ సరసన నటించిన ‘జమ్నా ప్యారి’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం ‘కరింకున్నం 6ఎస్’, ‘ఒరే ముగమ్’, ‘ఒరు మెక్సికన్ అపరాథ’ తదితర మలయాళ చిత్రాల్లో నటించారు. కొంతకాలం బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన ఆమె.. తన కెరీర్‌కు కొంతకాలం విరామం ఇచ్చారు.తాజాగా ‘డిస్కో’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు గాయత్రి ప్రకటించారు. ఆంటోనీ పెపే, అర్జున్ అశోకన్, చెంబన్ వినోద్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గాయత్రి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ‘హీరో హీరోయిన్’, ‘నేను లేని నా ప్రేమ కథ’, ‘గంధర్వ’ తదితర చిత్రాల్లో నటించారు. ర్యాంప్ వాక్ మోడల్‌గా కూడా గుర్తింపు పొందిన గాయత్రి.. సోషల్ మీడియాలో తన ఫొటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంటారు.ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్ మలయాళం నాలుగో సీజన్‌కు ముందు గాయత్రి సురేశ్ షోలో పాల్గొంటారనే ప్రచారం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు తనను సంప్రదించిన విషయాన్ని అప్పట్లో ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే ఆ సీజన్లో తాను కంటెస్టెంట్‌గా పాల్గొనడం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే భవిష్యత్‌లో ఏదైనా సీజన్లో బిగ్‌బాస్ హౌస్‌లోకి రావచ్చని అప్పట్లో సంకేతాలు ఇచ్చారు. ఆమె అన్నట్టుగానే ఇప్పుడు బిగ్‌బాస్ మలయాళం 8లో గాయత్రి సురేశ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న గాయత్రి.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి ఆటతీరు కనబరుస్తారో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి బాక్సింగ్ దిగ్గజం.. వణికిపోతున్న పోటీదారులు! -
మమ్ముట్టి అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లు
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లు అందుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మేళా’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కాగా.. ధనుష్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ఓమ్’ నుంచి కూడా స్పెషల్ అప్డేట్ బయటికొచ్చింది. దీంతో మమ్ముట్టి అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదీ చదవండి: ‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులుసినిమా విషయానికి వస్తే..మమ్ముట్టి, దర్శకుడు నితీష్ సహదేవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మేళా’. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ బ్యానర్లో వస్తున్న తొమ్మిదో చిత్రమిది. ఈ చిత్రానికి అనురాజ్ ఓ.బి., నితీష్ సహదేవ్ కలిసి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. నితీశ్ సహదేవ్ గతంలో ‘ఫ్యామిలీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జులైలోనే ప్రారంభమైనట్లు సమాచారం.ఓమ్: ధనుష్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో..మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే 2019లో విడుదలైన యాత్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముమ్ముట్టి. మంచి విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా యాత్ర2ను 2024 ఫిబ్రవరి 8న విడుదల చేశారు. ఈ సినిమాలోనూ ప్రత్యేక పాత్రలో ముమ్ముట్టి కనిపించారు. ( స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?) -
బిగ్‌బాస్‌లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?
బిగ్‌బాస్ సీజన్ 10లో అసలు ఆట మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే హౌస్‌లో తొలినాళ్లలోనే విభేదాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం ఆసక్తిని పెంచుతోంది.బిగ్‌బాస్ సూచనల మేరకు..తొలి టాస్క్‌లో భాగంగా ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు కీలను సొంతం చేసుకున్నారు. మిగిలిన వారిలో మరో ఇద్దరికి ఆ రెండు కీలను ఎవరు ఇవ్వాలనేది నిర్ణయించుకోవాలని బిగ్‌బాస్ సూచించినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో ఎవరికి ఆ అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది.మరోవైపు కీల విషయంలో కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముకేశ్.. రాంప్రసాద్, త్రిగుణ్‌తో వాదిస్తున్నట్లు ప్రోమోలో కనిపించింది. ‘నాకు అన్నీ తెలిసినట్లు ముందే వెళ్లిపోవడానికి తొందరపడ్డారు’ అంటూ ముఖేశ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?మీతో ఆడితే గెలవచ్చు..ఇక త్రిగుణ్ మరో టీమ్‌తో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రోమోలో కనిపించాయి. ‘మీతో ఆడితే గెలవచ్చు’ అంటూ టెంపర్ వంశీని త్రిగుణ్ దూరం పెట్టినట్లుగా చూపించారు. దీంతో హౌస్‌లో గ్రూపులు ఏర్పడుతున్నాయా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఆ రెండు కీలను ఎవరికి ఇస్తారు? కీలక నిర్ణయం ఎవరికి అనుకూలంగా మారుతుంది? తెలియాలంటే ఈరోజు జగరబోయే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.ఇదీ చదవండి: టాలీవుడ్ 'చిన్న' హీరో.. బిగ్‌బాస్ 10లోకి వచ్చేశాడు View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులు
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఎక్కువమంది చదివింది: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?సంప్రదాయ వస్త్రధారణలో అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. తాజాగా ఈ సినిమాని చేసేందుకు ఓ పాఠశాల విద్యార్థులు ఢిల్లీలోని పీవీఆర్‌కు వెళ్లారు. సంప్రదాయ వస్త్రధారణలో పంచెకట్టుతో థియేటర్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇటీవలే ఈ సినిమా కోసం పడిన కష్టాలను డైరెక్టర్ విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’ हनुमान अंश ने सिनेमाघरों को सच में मंदिर बना दिया ❤️🚩PVR में गुरुकुल के युवा ब्रह्मचारियों ने जब #HanumanAnsh देखी, तो उनके चेहरों की चमक देखने लायक थी। 🙏यह सिर्फ फिल्म नहीं, हमारी संस्कृति, संस्कार और प्रभु हनुमान की भक्ति से जुड़ने का अनुभव है। 🇮🇳🚩#आ_गया_है_अवतार pic.twitter.com/fNVGglsGrh— Divya Singh (@DivyaSi51590883) September 7, 2026 -
51 ఏళ్ల హీరోయిన్‌తో టీమిండియా స్టార్ డేటింగ్?!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. వరుస గాయాల కారణంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతడు చాన్నాళ్లుగా పునరావాసం పొందుతున్నాడు. ఈ క్రమంలో ముంబై నుంచి కొంతకాలం పాటు బెంగళూరుకు పూర్తిగా మకాం మార్చాడనే వార్తలు వచ్చాయి.ముందుగా నటాషాఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించిన ఈ బరోడా ప్లేయర్.. పెళ్లికి ముందే తండ్రయ్యాడు. ఆ తర్వాత కుమారుడు అగస్త్య సమక్షంలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో హార్దిక్- నటాషా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం మహీకతో రిలేషన్షిప్అయితే, కొంతకాలానికే తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు హార్దిక్- నటాషా ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో హార్దిక్ అభిమానులు నటాషాపై సోషల్ మీడియా వేదికగా విద్వేష విషం చిమ్మారు. డబ్బు కోసమే ప్రేమ, పిల్లాడు, పెళ్లి అంటూ ఆమెను అవమానించారు.ఇక నటాషాతో విడిపోయిన కొన్ని నెలల వ్యవధిలోనే మరో మోడల్ మహీక శర్మతో ప్రేమలో ఉన్నట్లు హార్దిక్ పాండ్యా ప్రకటించాడు. ఇద్దరూ వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు విడుదల చేశాడు. దీంతో నటాషాపై కాస్త ట్రోలింగ్ తగ్గి.. ఈసారి మహీకను టార్గెట్ చేశారు చాలామంది. అయినా వీరి బంధం ఇప్పటి వరకైతే సజావుగా కొనసాగుతోంది.51 ఏళ్ల హీరోయిన్‌తో డేటింగ్ అంటూఇలాంటి తరుణంలో 32 ఏళ్ల హార్దిక్ పాండ్యా... తాజాగా 51 ఏళ్ల బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వదంతులు వ్యాపించాయి. తాజ్ మహల్ ప్యాలెస్‌లో హార్దిక్- అమీషా కలిసి కనిపించడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.The way Ameesha Patel put her hand on Hardik Pandya’s shoulder during the party at a hotel in Bengaluru. 👀All the Reddit rumours seem to be coming true. pic.twitter.com/VJ7945fHus— Sonu (@Cricket_live247) September 5, 2026నిజమే రొమాంటిక్‌గానే చేయి వేశానుఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా యూజర్.. ‘‘హార్దిక్ పాండ్యా భుజం మీద అమీషా పటేల్ చేయి వేసిన తీరు చూస్తుంటే రెడిట్ రూమర్లు నిజమే అనిపిస్తోంది’’ అంటూ వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే అర్థంలో కామెంట్ చేశాడు. ఇందుకు అమీషా పటేల్ గట్టిగానే బదులిచ్చింది.సదరు యూజర్ పోస్టును తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘అవును అది నిజమే యార్!! (వ్యంగ్యంగా).. నేను రొమాంటిక్‌గానే అతడిపై చేయి వేశాను కదా!.. నాకు తెలిసి నీతో కనీసం ఒక్క అమ్మాయి కూడా స్నేహం చేసి ఉండదేమో!..ఇలాంటి చెత్త పోస్ట్ చేసేముందు కనీసం ఒక్క అమ్మాయితోనైనా స్నేహం పెంచుకో.. అప్పుడే నీకు అన్నీ అర్థమవుతాయి’’ అంటూ అమీషా పటేల్ ఘాటుగా స్పందించింది. తద్వారా తాము స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేసింది.చదవండి: ‘అందమైన సాయంత్రం.. చెన్నైలో మాకు మరో కుటుంబం’ -
స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 10వ సీజన్ నిన్న (ఆదివారం) గ్రాండ్‌గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేశాడు. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్ నుంచి 6 మంది హౌస్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ ఆ ఇద్దరి కంటెస్టెట్లపైనే పడింది. వాళ్లే రాంప్రసాద్, నరేశ్‌లు. బుల్లితెరపై తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన నరేశ్, రాంప్రసాద్ మంచి స్నేహితులు. ఇప్పుడు వీరిద్దరూ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. బయట మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ.. హౌస్‌లో మాత్రం ఎలా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.బిగ్‌బాస్ విషయానికి వస్తే..బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత సంబంధాల కంటే ఆటకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. టాస్కులు, నామినేషన్లు, కెప్టెన్సీ పోటీలు వంటి అంశాలు హౌస్మేట్స్ మధ్య విభేదాలకు కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలో నరేశ్, రాంప్రసాద్ మధ్య స్నేహం ఆటను ఎంతవరకు ప్రభావితం చేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి ఉంటే హౌస్‌లో మంచి కామెడీ పండే అవకాశం ఉంది. ఒకరి బలహీనతలు, మరొకరి ప్లస్ పాయింట్లు ఇద్దరికీ బాగా తెలుసు కాబట్టి.. వారి మధ్య సంభాషణలు, సరదా పంచ్‌లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారొచ్చు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: హాట్ టాపిక్‌గా నాగార్జున రెమ్యునరేషన్భేదాభిప్రాయాలు రావడం..అయితే బిగ్‌బాస్ అంటేనే అనూహ్య పరిణామాలకు కేరాఫ్. ఒక టాస్క్‌లో పోటీ పడటం, నామినేషన్ సమయంలో ఒకరిపై మరొకరు అభిప్రాయం చెప్పాల్సి రావడం, ఇంట్లో నిర్ణయాల విషయంలో భేదాభిప్రాయాలు రావడం.. ఇలా ఏదైనా వారి మధ్య చిన్నపాటి మనస్పర్థకు దారితీయొచ్చు.ఇదీ చదవండి: శారీరక లోపం వరమైతే.. బిగ్‌బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్ఒకవేళ గొడవ జరిగితే?ఇదే ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. బయట మంచి స్నేహితులైన వీరిద్దరూ హౌస్‌లో గొడవ పడితే.. ఆ తర్వాత వెంటనే కలిసిపోతారా? లేక ఆట కోసం తమ స్నేహాన్ని పక్కన పెడతారా? అన్నది చూడాలి. ముఖ్యంగా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉండటంతో.. వాదన జరిగితే అది మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే వీరిద్దరి స్నేహమే హౌస్‌లో బలంగా మారుతుందా? లేక బిగ్‌బాస్ ఆట వారి స్నేహానికి పరీక్షగా నిలుస్తుందా? అనేది బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా? -
నిర్మాతల సంక్షేమమే మా లక్ష్యం
లక్డీకాపూల్: చిన్న నిర్మాతల సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, త్వరలో ప్రకటిస్తామని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) అధ్యక్షుడు సి. కల్యాణ్ వెల్లడించారు. చిన్న నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో దాదాపు 95 శాతం మంది నిర్మాతలు మద్దతు ఇవ్వడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. నిర్మాతల సంక్షేమమే తమ లక్ష్యం అని, వారికి లోటు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్మాతలందరూ ఒకే తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. గత రెండున్నరేళ్లుగా అందరూ కలిసి ముందుకు రాలేకపోయారని, ఇకపై కలిసి పని చేయాలని సి. కల్యాణ్ అన్నారు. ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో మొత్తం 1,168 ఓట్లకు గాను 643 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సి. కల్యాణ్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా మోహన్ వడ్లపట్ల, కేఎల్ దామోదర్ ప్రసాద్, కోశాధికారిగా చదలవాడ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు కానుమిల్లి, టి. రామసత్యనారాయణ గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పద్మిని నాగులపల్లి, రవిశంకర్ యలమంచిలి, సునీల్ నారంగ్, మోహన్ గౌడ్, కృష్ణప్రసాద్ శివలెంక, డీవీవీ దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, డీఎస్ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు వజ్జా, జె. పుల్లారావు, బాపిరాజు బల్లిపాడు, రామకృష్ణ గౌడ్, నయీమ్ అహ్మద్ ఎస్.కె., కె. నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యారు. -
బుల్‌తో ఫైట్
గత ఏడాది నవంబరులో జరిగిన ‘వారణాసి’ ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్‌ని గుర్తు చేసుకుంటే... ఆ వేడుకలో మహేశ్‌బాబు ఒక మెకానికల్ బుల్‌పై కూర్చుని వేదిక మీదకు వచ్చిన విషయం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... బుల్‌తో ఫైట్ చేయడానికి మహేశ్‌బాబు సిద్ధం అవుతున్నారట. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్‌లో మహేశ్‌బాబు పాత్రకు సంబంధించిన ఎలివేషన్ షాట్లో బుల్ విజువల్ కూడా కనిపించింది. ఇప్పుడు ఈ ఫైట్ చిత్రీకరణ కోసమే హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ని రూపొందించారని సమాచారం. ఈ ఫైట్ షూట్‌కి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నారట చిత్రదర్శకుడు రాజమౌళి. ఈ వారంలో ఈ ఫైట్ చిత్రీకరణను ఆరంభించనున్నారని తెలిసింది. ‘వారణాసి’ సినిమాకి హైలైట్స్‌గా నిలిచేవాటిలో ఈ ఫైట్ది ప్రముఖ స్థానం అని టాక్. ఇక పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
మహేంద్రగిరి వారాహి పెద్ద హిట్ కాబోతోంది
‘‘చిన్నప్పట్నుంచి నేను అమ్మ, నాన్నలతో కొన్ని విషయాలను చెప్పలేకపోయేవాణ్ణి. అలాంటప్పుడు ప్రతి ఫోన్‌కాల్ సుమంత్ అన్నకే వెళ్లేది. ఒక్కసారి కూడా ఆయన కాదనలేదు. ఈ రోజు నేను ఆయన సినిమా ఫంక్షన్‌కు వచ్చి, మాట్లాడటం హ్యాపీగా ఉంది. సుమంత్‌గారు నాకు స్పెషల్ బ్రదర్’’ అని అక్కినేని అఖిల్ అన్నారు. సుమంత్ హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్యా రాజేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, బిగ్ టికెట్‌ను లాంచ్ చేసిన అఖిల్ మాట్లాడుతూ– ‘‘సిద్ధుగారు హీరోగా సినిమాలు చేస్తూనే, కంటెంట్ ఉన్న ఈ తరహా సినిమాలో కూడా భాగమైనందుకు అభినందిస్తున్నాను. ఈ సినిమా కోసం దర్శకుడు సంతోష్ ప్రాణం పెట్టారు. ‘మహేంద్రగిరి వారాహి’ చాలా పెద్ద హిట్ కాబోతోంది. ఈ సినిమా సక్సెస్మీట్కు నన్ను పిలవాలని అడుగుతున్నాను. ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించిన లక్ష్మణ్, మధుగార్లకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. సుమంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం దాదాపు 150 థియేటర్స్‌లో వారాహి విగ్రహాలను పెట్టడం జరిగింది. గతంలో ‘అమ్మోరు’ సినిమాకు ఇలా చేశారట. ఈ సినిమా విషయంలో ఎప్పట్నుంచో ఒక డివోషనల్ వైబ్‌ను ఫీలవుతున్నాను. ఏదో శక్తి మా వెనకాల ఉందనిపిస్తోంది. సెప్టెంబరు 11న మా కష్టార్జితాన్ని థియేటర్స్‌లో మీరు చూడబోతున్నారు. ఇక ‘లెనిన్’తో తన సత్తా ఏంటో అఖిల్ నిరూపించాడు’’ అని తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘నేను యాక్టర్‌గా స్ట్రగుల్ అయినప్పట్నుంచి నిర్మాత మధుగారు నాకు తెలుసు. మధుగారి వల్ల ఈ మూవీలో భాగమయ్యాను’’ అని అన్నారు. సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మిన సుమంత్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలోని రాజేంద్రవర్మ పాత్ర కోసం సిద్ధుగారిని అ్రపోచ్ అయినప్పుడు, ఆయన కథ నచ్చి, చేశారు. ఈ సినిమాతో నిర్మాతలకు ఒక మంచి హిట్ ఇచ్చి, వారి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను’’ అని చెప్పారు. మధు కాలిపు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం సుమంత్‌గారితో రెండున్నరేళ్లుగా జర్నీ చేస్తున్నాం. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన సిద్ధుకు రుణపడి ఉంటాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ చేశాను’’ అన్నారు బ్రహ్మానందం. -
‘గుప్పెడంత మనసు' రిషి సర్.. బిగ్‌బాస్ 10లోకి ఆగయా
ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్( ముకేశ్ గౌడ) వచ్చేశాడు. చివరి కంటెస్టెంట్‌గా లోపల అడుగుపెట్టేశాడు.రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్‌బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్‌గా 10వ సీజన్లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుంది. -
నటిగా మొదలుపెట్టి యాంకర్‌గా ఫేమస్ అయి.. ఎట్టకేలకు 'బిగ్‌బాస్'లోకి..
ప్రతిసారి 'బిగ్‌బాస్'లోకి గ్లామరస్ యాంకర్స్‌ని తీసుకొస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాతో హౌస్‌లోకి వచ్చిన బ్యూటీ వర్షిణి. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈమె పేరు వినిపించేది. కానీ చివరలో తూచ్ ఈమె లేదని తేలేది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇకపోతే వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్‌లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్‌బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్‌తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్‌తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి?


