విజయ్- త్రిష ఎపిసోడ్‌పై మరో కొత్త పుకారు! | Thalapathy Vijay and Trisha Krishnan to marry soon | Sakshi
Sakshi News home page

విజయ్- త్రిష ఎపిసోడ్‌పై మరో కొత్త పుకారు!

Mar 17 2026 1:35 PM | Updated on Mar 18 2026 12:49 PM

Thalapathy Vijay and Trisha Krishnan to marry soon

కోలీవుడ్‌లో విజయ్- త్రిష ఎపిసోడ్‌ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.

అయితే అందరూ ‍అనుకుంటున్నట్లుగానే  ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్‌ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని ‍అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు.  అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్‌ ఉమా కృష్ణన్‌ ఆ వీడియోను లైక్‌ కొట్టింది.

ఈ రీల్‌కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్‌ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్‌కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్‌ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్‌కు లైక్స్‌ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.

త్వరలోనే విజయతో పెళ్లి.. హింట్ ఇచ్చిన త్రిష తల్లి

Advertisement
 
Advertisement
Advertisement