ఈ స్థాయికి హ్యాపీ: రాశీ ఖన్నా | Raashi Khanna about Ustad Bhagat Singh movie | Sakshi
Sakshi News home page

ఈ స్థాయికి హ్యాపీ: రాశీ ఖన్నా

Mar 18 2026 2:03 AM | Updated on Mar 18 2026 2:03 AM

Raashi Khanna about Ustad Bhagat Singh movie

‘‘చిత్ర పరిశ్రమలో నాకెలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నప్పటికీ ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఏ స్థాయి నుంచి వచ్చాను? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను? అన్నది చూసుకుంటే సంతోషంగా ఉంటుంది. దాదాపు 13 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇన్నేళ్ల నా కెరీర్‌ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను’’ అని హీరోయిన్‌ రాశీ ఖన్నా చెప్పా రు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’.

హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా,  శ్రీలీల హీరోయిన్లు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా  రాశీ ఖన్నా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లో నా పాత్ర పేరు శ్లోక. చాలా మోడ్రన్‌ అమ్మాయి. మంచి క్యారెక్టరైజేషన్‌ ఉన్న క్యారెక్టర్‌ ఇది. ఈ మూవీలో నాకు ఒక మాస్‌ సాంగ్‌ ఉంది.

నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం కాబట్టి, ఆ పాట చిత్రీకరణని చాలా ఎంజాయ్‌ చేశాను. తెలుగువారి పండగైన ఉగాదికి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా వస్తోంది. ఈ మూవీ చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి థియేటర్‌లో చూడొచ్చు. ప్రస్తుతం హిందీలో అక్షయ్‌ కుమార్‌గారితో ఒక సినిమా, అలాగే ‘ఫర్జీ 2’ షో చేస్తున్నాను. అమెజాన్‌ సిరీస్‌లో ఒక పంజాబీ పోలీస్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. అందులో నా డైలాగ్స్‌ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్‌లో ‘రౌడీ అండ్‌ కో’ మూవీలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కథలు వింటున్నాను’’ అని చెప్పా రు.  

Advertisement
 
Advertisement
Advertisement