సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ రాజ్’. ఈ చిత్రంలో శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించారు. దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన రాజా ఇళంజెళియన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జైవర్ద నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పీ ద్వారా ఈ నెల 27న ఈ ‘హ్యాపీ రాజ్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.
మంగళవారం ఈ చిత్రంలోని ‘అద్దిరా లెక్క..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పక్షిలాగా ఉండే నన్ను చెట్టు లాగా మార్చింది రా... సాదాసీదా పిల్లోణ్ణి నేను... మహాస్మార్టుగా చేసేసిందిరా..’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ స్వరకల్పనలో ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా, గోవింద్ ప్రసాద్ ఆలపించారు.


