రిలీజ్‌కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..! | Ranveer Singh's Dhurandhar The Revenge is making history in global pre sales | Sakshi
Sakshi News home page

Ranveer Singh: దురంధర్‌-2 క్రేజ్‌.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!

Mar 17 2026 11:18 AM | Updated on Mar 17 2026 3:37 PM

Ranveer Singh's Dhurandhar The Revenge is making history in global pre sales

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. కాంతార-2, ఛావా సినిమాలను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దురంధర్‌ ది రివెంజ్‌ పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు..

ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది. ప్రీమియర్‌ షోలు, మొదటి రోజు  అడ్వాన్స్  బుకింగ్స్‌తో కలిసి ఏకంగా రూ.123 కోట్లు వసూలు చేసింది. రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డులతో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. మరిన్ని షోల బుకింగ్‌లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నందున.. రాబోయే రెండు రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.

దేశవ్యాప్తంగా మార్చి 18న 'ధురందర్ 2' ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్స్ ద్వారా రూ.38.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్‌తో ఓజీ, బాహుబలి-2 ప్రీమియర్ షోల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇండియాలో మొదటి రోజు 13 వేల షోల ద్వారా ఈ చిత్రం రూ. 24.50 కోట్ల దేశీయ వసూళ్లు రాబట్టింది. ప్రీ సేల్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో  సుమారు రూ. 60 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రీ బిజినెస్‌ రూ. 123 కోట్లకు చేరుకుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement