అనిరుధ్‌తో జట్టుకట్టిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా | Universal Music India Tie Up With Anirudh Ravichander | Sakshi
Sakshi News home page

అనిరుధ్‌తో జట్టుకట్టిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా

Mar 17 2026 7:34 PM | Updated on Mar 17 2026 7:51 PM

Universal Music India Tie Up With Anirudh Ravichander

యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్‌నకు చెందిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా.. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇటీవల ప్రారంభించిన స్వతంత్ర రికార్డ్ లేబుల్ అల్బుక్వెర్క్ రికార్డ్స్‌తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, అల్బుక్వెర్క్ రికార్డ్స్, అనిరుధ్ రూపొందించే  పాప్, హిప్-హాప్ సంగీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ లేబుల్ ద్వారా విడుదలయ్యే తొలి సంగీత ప్రాజెక్ట్‌లో అనిరుధ్ పాల్గొనగా, వచ్చే నెల ప్రారంభంలో దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)

2012లో అరంగేట్రం చేసిన అనిరుధ్.. 'వై దిస్ కొలవెరి డి' ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించాడు. తర్వాత విడుదలైన తన 770కి పైగా పాటల ద్వారా మొత్తం 13 బిలియన్‌కు పైగా ఆడియో స్ట్రీమ్స్ సాధించాడు. దీంతో మొత్తం స్ట్రీమ్స్ పరంగా స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ పొందిన దక్షిణ భారతీయ కళాకారుడిగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తమిళ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (ఓఎస్టీ) రంగంలో ఎక్కువగా కోరుకునే సంగీత దర్శకుల్లో ఇతడొకరు. హుకుమ్, వాతీ కమింగ్, అరబిక్ కుతు, మోనికా, ఏ23 థీమ్, ఆజా రాజా, అయా షేర్ తదితర గ్లోబల్ హిట్లు ఇతడి ఖాతాలో ఉన్నాయి.

(ఇదీ చదవండి: బూతు పాటపై కేంద్రం సీరియస్)

Advertisement
 
Advertisement
Advertisement