సినిమాల్లో ఈ మధ్య హింస పెరిగిపోతోంది. రక్తపాతం, వయలెన్స్ లాంటి వాటిని కాస్త ఎక్కువగానే చొప్పిస్తున్నారు. ఇది సమాజంపై చూపి ప్రభావం చూపే చాలానే ఉండొచ్చు. ఇప్పుడు దీనికి తోడు పాటలు కూడా హద్దులు దాటేస్తున్నాయి. రీసెంట్‌గా అలా నోరా ఫతేహి డ్యాన్స్ చేసిన ఓ గీతం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది. సోషల్ మీడియాలో లెక్కకు మించిన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాటపై కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా)
కన్నడ హీరో ధ్రువ సర్జా లేటెస్ట్ మూవీ 'కేడీ:ది డెవిల్'. ఎప్పటినుంచో సెట్స్ మీదున్న ఈ చిత్రం విడుదలకు నానా తంటాలు పడుతోంది. సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. త్వరలో రిలీజ్ చేద్దామనుకుని రీసెంట్‌గానే 'సర్కే చునర్' అని సాగే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఈ పాట సాహిత్యానికి సంబంధించి దక్షిణాదిలో ఓ దశ వరకు రాశారు. హిందీలో మాత్రం డబుల్ మీనింగ్ వచ్చేలా పచ్చిబూతులు రాసేశారు. దీనికి తోడు డ్యాన్స్ కూడా అసభ్యంగా ఉండేసరికి వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.
ఈ పాటపై ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. స్పందించిన కేంద్రం.. అన్ని చోట్ల నుంచి పాటని తొలగించాలని సెన్సార్ అధికారుల్ని ఆదేశించింది. సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో ఈ తరహా అభ్యంతరకర కంటెంట్ పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఇప్పటికే హిందీ వెర్షన్ పాటని యూట్యూబ్ నుంచి తొలగించేశారు.
పాన్ ఇండియా మూవీగా తీసిన 'కేడీ ది డెవిల్'ని.. రీసెంట్ టైంలో 'జన నాయగణ్'తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విజయ్ సినిమా రిలీజ్ నిరవధిక వాయిదా పడేసరికి సతమవుతున్న ఈ నిర్మాణ సంస్థకు 'టాక్సిక్' వాయిదా మరో దెబ్బ కాగా.. ఇప్పుడు ఈ పాటపై కూడా సర్వత్రా విమర్శలు, కేంద్రం సీరియస్ కావడం లాంటివి మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి.
(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)


