సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాతృభూమి’. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సల్మాన్ సైనికాధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘చాంద్ దేఖ్ లేనా..’ పాట టీజర్‌ను రిలీజ్ చేసి, త్వరలోనే పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.
హిమేష్ రేష్మియా స్వరపరచిన ఈ పాటకు సమీర్ అంజాన్ సాహిత్యం అందించగా, నిహాల్ టౌరో–అంకోనా ముఖర్జీ పాడారు. ఈ సినిమాకు తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే టైటిల్‌ను అనుకుని, ఇటీవల ‘మాతృభూమి’గా మార్చారు. అలాగే ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడిందని, ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావొచ్చని బాలీవుడ్ టాక్.


