'ఇతరుల జీవితాల్లోకి చూడడమే వారి పని'.. త్రిష వ్యవహారంపై ఖుష్బు కామెంట్స్ | Khushbu Sundar backs Trisha over public appearance with Vijay | Sakshi
Sakshi News home page

Khushboo: 'అదొక రకమైన వికృత ఆనందం'.. త్రిష రూమర్స్‌పై ఖుష్బు

Mar 17 2026 12:01 PM | Updated on Mar 17 2026 3:27 PM

Khushbu Sundar backs Trisha over public appearance with Vijay

కోలీవుడ్‌లో విజయ్- త్రిష వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత అందరి దృష్టి ఒక్కసారిగా త్రిషపై పడింది. అంతేకాకుండా వీరిద్దరు జంటగా ఓ వివాహా వేడుకకు హాజరు కావడంతో మరించ చర్చకు దారితీసింది. ఆ తర్వాత తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్‌ త్రిషను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారు. అతని కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత క్షమాపణలు కోరాడు. 

అయితే తాజాగా విజయ్, త్రిషలపై వస్తోన్న వార్తలపై నటి ఖుష్బూ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె త్రిష గురించి మాట్లాడారు.  ఆమె చాలా హుందాగా ఉంటుందని తెలిపారు. త్రిష గురించి తెలియనివారు చేసే కామెంట్స్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారికి మనం స్పందించాల్సిన పనిలేదని తెలిపారు. నాకు త్రిష గురించి బాగా తెలుసని.. తను చాలా సెన్సిటివ్‌ పర్సన్‌ అని ఖుష్బూ వెల్లడించారు. దురదృష్టవశాత్తూ మనం తుమ్మినా కూడా నిందించే రోజుల్లో ఉన్నామని అన్నారు. తనకు తెలిసిన వారిలో  త్రిష అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి అని ఖుష్బూ తెలిపారు. పెళ్లికి కలిసి వెళ్లడం అనేది వారి వ్యక్తిగతమని.. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆమె అన్నారు.

ఖుష్బూ మాట్లాడుతూ.. 'దురదృష్టవశాత్తు మనం తుమ్మినా కూడా నిందను మరొకరిపై వేయాలనుకునే కాలంలో ఉన్నాం. నాకు తెలిసినంత వరకు త్రిష అత్యంత హుందాగా ఉండే మహిళ. అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి. కొందరు తమ సమస్యలను పట్టించుకోకుండా.. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ఆనందించే వ్యక్తులు ఉంటారు. ఇతరులపై కామెంట్స్ చేస్తూ ఒక రకమైన వికృత ఆనందాన్ని పొందుతారు. వారిలో 99.9 శాతం మంది ఎవరో కూడా మనకు తెలియదు. ఎవరైనా సరే ఇతరులు చేసే వ్యాఖ్యలకు మనం బాధ్యులు కాదు. వాటికి స్పందిస్తూ మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఎయిర్‌పోర్టుల్లో ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కల్చర్ ముంబయిలో మాత్రమే ఉండేదని.. కానీ  దురదృష్టవశాత్తు ఇప్పుడు చెన్నైకి కూడా పాకిపోయింది" అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement