iran
-
ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్లో ఉందో తెలసిందే హార్బూజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్ పట్ల సముచితంగా ఇరాన్ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్‌లో ఉన్న విష్ణు దేవాలయం ఉన్న వీడియోని నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్‌లో రాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్ షేర్ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. ఆలయ చరిత్రచారిత్రక కథనాలు, యూట్యూబ్‌లోని వివిధ ట్రావెల్ వ్లాగ్‌ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్‌లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు నిదర్శనం ఈ కట్టడం. స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్‌లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్‌ను విడిచిపెట్టారు. ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్‌లోని సిస్తాన్ , బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్‌లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.ఆ ఆలయంలో పాటలు..ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
ఇరాన్ సంచలన నిర్ణయం
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కీలకమైన వాణిజ్య మార్గం హర్ముజ్ మూసివేతతో పలు దేశాలు సంక్షోభాలతో అల్లలాడిపోతున్నాయి. ఇరాన్‌కు మరో ఆప్షన్ లేదని.. చర్చలకు దిగి రావాల్సిందేనని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ మరో కీలక బలహీనతపై దృష్టి సారించింది.. హర్ముజ్ జలసంధి కిందుగా సాగుతున్న అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ మార్గాలు.. ఈ యుద్ధంలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. టెహ్రాన్ వర్గాలు తాజాగా ప్రకటించిన ప్రణాళికనే ఇందుకు కారణం. దీని ప్రకారం.. హర్ముజ్ కింద నుంచి వెళ్తున్న అండర్ మైన్ సీ కేబుల్స్కుగానూ ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ బలంగా భావిస్తోందట!. ‘‘జలసంధి గూండా పలు నెట్వర్క్ కేబుల్స్ వెళ్తున్నాయి. అయితే.. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఈ మార్గాల వినియోగానికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సహకరించకపోతే డేటా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చు’’ అని ఇరాన్ హెచ్చరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. కేబుళ్ల మరమ్మత్తులు, నిర్వహణ హక్కులు కూడా ఇరాన్ కంపెనీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా ఒకటి కథనం ప్రచురించింది. దీంతో ఇరాన్ మూమాలు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం లేదన్న చర్చ జోరందుకుంది.అదే గనుక జరిగితే..ప్రపంచ ఇంటర్నెట్, డేటా ట్రాఫిక్‌లో 95% పైగా ఈ సముద్రపు మార్గాల ద్వారానే జరుగుతుంది. హర్ముజ్ జలసంధి గుండా అనేక అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాలు వెళ్తాయి. భద్రతా కారణాల వల్ల ఎక్కువ భాగం ఒమన్ వైపు ఉన్నప్పటికీ.. ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జి ఇంటర్నేషనల్ అనే రెండు ప్రధాన మార్గాలు మాత్రం ఇరాన్ జలప్రాంతాల గుండా సాగుతున్నాయి. వీటికి నష్టం కలిగితే బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, సైనిక కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ లావాదేవీలు అన్నీ ప్రభావితమవుతాయి. ఇరాన్ అండర్ సీ మైన్ కేబుల్స్‌పై దృష్టి పెడితే.. ఇరాన్ పొరుగు దేశాలు, భారత్, తూర్పు ఆఫ్రికా, యూరప్–ఆసియా మధ్య ఆర్థిక లావాదేవీలు అన్నీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్‌ల నుంచి యూరప్ వరకు కనెక్టివిటీ దెబ్బతింటే, ఫైనాన్షియల్ ట్రేడింగ్, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్లు, క్రాస్-బోర్డర్ పేమెంట్లు అన్నీ ఆలస్యమవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా, పెద్ద స్థాయి అంతరాయం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా మరమ్మత్తులు కూడా సవాలే. ఎందుకంటే రిపేర్ షిప్‌లు ఒకేచోట నిలిచి పని చేయాలి. ఆ సమయంలో ఇరాన్ అడ్డుకుంటే అది అసాధ్యం కాదు..నిజానికి.. యుద్ధ ప్రారంభ సమయంలోనే అండర్ సీ కేబుల్స్ అంశం తెర మీదకు వచ్చింది. వీటిని కత్తిరించడం ద్వారా ఇరాన్ ‘డిజిటల్ వార్’ జరపొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు జలసంధిలో నౌకల నుంచి మాత్రమే కాదు.. ఈ కేబుల్స్‌పైనా ఫీజులు వసూలు చేసే యోచన చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ చట్టంఇరాన్ మీడియా ప్రకారం, 1982లోని ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ప్రకారం తీరరాష్ట్రాలకు తమ జలప్రాంతాల్లో కనెక్టివిటీ మార్గాలపై షరతులు విధించే హక్కు ఉంది. ఇరాన్ ఆ ఒప్పందంపై సంతకం చేసినా.. ఇంకా ఆమోదించలేదు. సుయాజ్ కాలువలో ఈజిప్ట్ వసూలు చేసే ఫీజులను ఉదాహరణగా చూపుతున్నా.. హోర్ముజ్ సహజ జలసంధి కావడం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే.. చమురు తర్వాత ఇప్పుడు డేటా కూడా ఇరాన్ చేతిలో బందీ అవుతుందా? అనే ఆందోళన అంతర్జాతీయంగా పెరుగుతోంది. హర్ముజ్ జలసంధి కింద ఉన్న ఈ మార్గాలు కత్తిరించబడినా? లేదంటే పన్నులు విధించబడినా.. ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి ఇది మరో పెద్ద దెబ్బ కానుంది. -
పశ్చిమాసియా, క్రూడ్‌పై కన్ను!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే భారీగా ఎగబాకిన క్రూడ్ ధరలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మన సూచీలకు కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘తుపాను ముందు ప్రశాంతత’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్‌తో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు మొదలయ్యాయి. హార్మూజ్ జలసంధిలో అడ్డంకుల కారణంగా క్రూడాయిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 109 డాలర్లకు ఎగబాకింది. ఈ రెండు అంశాలపైనే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారిస్తారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు సెగ కారణంగా రోజుకో సరికొత్త కనిష్టాలకు పడిపోతున్న రూపాయి, మరోపక్క, ద్రవ్యల్బణం భారీగా పెరిగిపోవడం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ‘అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, క్రూడ్ ధరలపై దాని ప్రభావం, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా రిస్క్ సెంటిమెంట్‌ను మార్కెట్ వర్గాలు నిశింతంగా గమనిస్తాయి. సమీప కాలంలో మార్కెట్లకు ఇంధన ధరలు, రూపాయి కదలికలే కీలకం’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. భారీ ఒడిదుడుకులు... ‘ఇరాన్–అమెరికా ఉద్రిక్తలపైనే అందరి కళ్లూ ఉన్నాయి. దీనిపైనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆధారపడి ఉంది. ఈ నేథ్యంలో చర్చల పురోగతి, క్రూడ్ రేట్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చు’ అని ఎన్రిచ్ మనీ సీఈఓ ఆర్. పోన్ముడి పేర్కొన్నారు. రూపాయిపై ఫోకస్... యుద్ధ భయాలకు తోడు, పెట్రో ధరల పెంపు, ప్రధాని పొదుపు చర్యల ప్రభావంతో గతవారం రూపాయి మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. డాలరు మారకంలో ఏకంగా 96 స్థాయిని కూడా దాటేసి, కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి జారిపోయింది. క్రూడ్ ధరలు మరింత ఎగబాకితే రూపాయి క్షీణత కొనసాగవచ్చని, ఇది మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపుందని పోన్ముడి తెలిపారు. గణాంకాలు, ఫలితాలపైనా దృష్టి... అమెరికా, చైనా, భారత్‌లలో విడుదలయ్యే కీలక స్థూల ఆర్థిక గణంకాలు, అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశ వివరాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. క్యూ4 ఫలితాల సీజన్ చివరి దశ నేపథ్యంలో రంగాల వారీగా స్టాక్స్‌లో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. ఈ వారం ఐఓసీ, బీపీసీఎల్, గెయిల్, ఎన్టీపీసీ తదితర ఫలితాలు ఉన్నాయి.గతవారమిలా... ప్రధాని పొదుపు పిలుపు ఎఫెక్ట్‌తో పాటు క్రూడ్ ధరల జోరు, రూపాయి పతనం వంటి ప్రతికూలతలతో గత వారం మార్కె ట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2,090 పాయింట్లు (2.7%) పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 533 పాయింట్లు (2.2%) క్షీణించింది.తిరోగమనంలోనే విదేశీ ఇన్వెస్టర్లు... భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడ్ సెగలు, రూపాయి పతన ప్రభావంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన మార్కెట్లో అమ్మకాల జోరు మరింత పెంచారు. వరుసగా మూడో నెలలోనూ రివర్స్‌గేర్‌లోనే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.27,048 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది మొత్తం రూ.2,2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించినట్లు ఎన్ఎస్డీఎల్ డేటా వెల్లడించింది. 2025 మొత్తం ఏడాదిలో నికర విక్రయాలు రూ.1.66 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాదిæ దీనికి రెట్టింపు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయనేది మార్కెట్ వర్గాలు అంచనా.సాంకేతికంగా చూస్తే... ఈ వారం కూడా దేశీ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో నిఫ్టీ పడితే, 23,500 వద్ద తొలి మద్దతు, 23100 స్థాయిలో రెండో మద్దతు ఉండొచ్చు. పెరిగితే 23,800 వద్ద తక్షణ నిరోధం ఉంటుంది. దానిపైన నిలదొక్కుకుంటే 24,000–24,100 వరకు పెరగవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
తుపానుకు ముందు ప్రశాంతత
వాషింగ్టన్: ఇరాన్‌ను ఎలాగైనా తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై కొన్ని రోజులుగా సైనిక చర్యలు చేపట్టకపోవడాన్ని ‘తుపానుకు ముందు ప్రశాంతత’గా ట్రంప్ అభివరి్ణంచారు. ఇరాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వైమానిక దాడులను పునఃప్రారంభించేందుకు ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. కృత్రిమ మేధతో సృష్టించిన ఒక ఫొటోను ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఈ ఫొటోలో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడం(మాగా) అని రాసి ఉన్న టోపీని ట్రంప్ ధరించారు. నావికాదళ అడ్మిరల్ ట్రంప్‌కు వెనకాల నిలబడి ఉన్నారు. వెనక ఆకాశం ఉరుములు మెరుపులతో భీకరంగా ఉంది. ఈ ఫొటోను పోస్ట్‌చేసి ట్రంప్ పరోక్షంగా ఇరాన్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారని యుద్ధరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాంతికి షరతులే అడ్డంకిపశ్చిమాసియాలో శాంతి సాధనకు ఓ వైపు కృషి జరుగుతుంటే మరోవైపు అవరోధాలు ఎదురవుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన పర్వం కొనసాగుతోంది. తమ షరతులకు అంగీకరిస్తే శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ అమెరికా కొత్తగా ఐదు షరతులను తెరమీదకు తెచ్చింది. వాటికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అమెరికా పలుమార్లు తేల్చిచెప్పింది. ఇరాన్ వద్దనున్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు అప్పగించాలని చర్చల సందర్భంగా ట్రంప్ సర్కార్ షరతు విధించింది. మరో షరతు ఏమిటంటే.. ఇరాన్ అణు కర్మాగారాల్లో కేవలం ఒక సముదాయం మాత్రమే పనిచేస్తూ ఉండాలి. మిగిలినవి మూసివేయాలి. క్షిపణి నిల్వలను గణనీయంగా తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఇన్నాళ్లూ అమెరికా ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, అందుకు తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కానీ, అమెరికా ఒప్పుకోవడం లేదు. యుద్ధాన్ని ముగించడానికి అంకితభావంతో చర్చలు జరపాలన్న ప్రతిపాదనకు అమెరికా నిర్దిష్ట హామీని ఇవ్వడంలో విఫలమైందని ఇరాన్ మీడియా ఆదివారం వెల్లడించింది. -
పశ్చిమాసియా యుద్ధం.. ఇరాన్‌కు అమెరికా ఐదు షరతులు
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరాన్‌కు అమెరికా ఐదు కీలక షరతులను విధించింది. వాటిలో ప్రధానంగా 400 కిలోల యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్లో ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గత ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోం. విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయదు. అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగింపుపై చర్చలు జరగాలి అని స్పష్టం చేసింది.ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదులుగా, ఇరాన్ తన షరతులను ప్రకటించింది. లెబనాన్ సహా అన్ని యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగించాలి. అన్ని ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభించిన నిధులను విడుదల చేయాలి. యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని తెలిపింది.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్‌లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించి, దాన్ని శాంతి పేరుతో మరింత పెంచడం అమెరికా-ఇజ్రాయెల్‌ల పాత పద్ధతి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించకపోతే ఆ దేశ చెల్లింపు దారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌ను తీవ్రంగా కుదిపేశాయి. ప్రతిగా, ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాలను అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింది. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా, శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యం కాలేదు. ఇరాన్ సైన్యం అమెరికా మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని పునరుద్ఘాటించింది. -
ఈ టైమ్ తుపాన్ ముందు ఉన్న ప్రశాంతత.. ఇక విధ్వంసమే..?
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఈ సారి శాంతి ఒప్పందంపై సంతకం చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు నడుస్తున్న కాలం తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతగా పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో ఒక ఏఐ జనరేటెడ్ పిక్‌తో వార్నింగ్ ఇచ్చారు.ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ చాలా బాగుందని ఆయన చాలా గొప్ప మనిషని కొనియాడారు. తైవాన్ విషయంలోనే అమెరికా మద్దతు ఉండదని చెప్పకనే చెప్పారు. అయితే గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో మరోసారి ఇరాన్‌పై విరుచుకుపడుతూ మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ఒకవేళ ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకుండా, హర్ముజ్ జలసంధి విషయంలో తన దూకుడు వైఖరిని కొనసాగిస్తే, చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న శాంతికాలం తుపానుకు ముందు ప్రశాంతతగా గుర్తుంచుకోవాలి" అని అన్నారు. అయితే ఇరాన్‌పై తిరిగి వైమానిక దాడులను ప్రారంభించడానికి పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని ట్రంప్ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి.మరోవైపు ఇరాన్ సైతం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఏ దాడికైనా గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇదివరకే తేల్చిచెప్పారు. మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రపంచ క్రమాన్ని పునర్నిర్మిస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా పేర్కొన్నారు.కాగా హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు "టోల్ టాక్స్" స్థానంలో "సర్వీస్ ఛార్జ్"ను ప్రవేశపెట్టి, అక్కడ ఒక కొత్త నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరాన్ ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య సీజ్ఫైర్ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా మీడియా ప్రచురించింది. టెహ్రాన్‌పై మరోసారి వైమానిక దాడులకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.ట్రంప్ చైనా పర్యటన ముగించుకొని ప్రయాణంలో ఇరాన్ ప్రతిపాదించిన శాంతియుత ఒప్పందాని ఆయన తోసిపడేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. "నేను దానిని చూశాను, మొదటి వాక్యం నచ్చకపోతే నేను దానిని పక్కన పడేస్తాను" అని ఆయన అన్నట్లు తెలిపాయి.పశ్చిమాసియాలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు ఈ విషయమై మీడియాతో మాట్లాడారాని అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు మరోసారి సంయుక్తంగా అమెరికాపై దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయనితెలిపినట్లు పేర్కొన్నాయి. కాగా ఇరాన్ అణ్వాయుధ రహిత దేశంగా ఉండాలని అమెరికా, చైనా సంయుక్తంగా అంగీకరించాయిని ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరవాలని సంయుక్త ప్రకటన చేసినట్లు ANI నివేదిక పేర్కొంది.చైనా రాగం పాడిన ట్రంప్చైనా పర్యటన తిరుగు ప్రయాణంలో ట్రంప్ చైనా రాగం పాడారు. "మేము అక్కడ చాలా బాగా గడిపాము అది ఒక అద్భుతమైన కాలం. అధ్యక్షుడు షీ ఒక అద్భుతమైన వ్యక్తి. జిన్‌పింగ్, తాను తైవాన్ గురించి చాలా మాట్లాడుకున్నాము అన్నారు. అదే విధంగా ఇరాన్ గురించి చాలా చర్చించాము ఈ రెండు విషయాలపై మాకు చాలా మంచి అవగాహన ఉందని నేను భావిస్తున్నాను". అన్నారు.కాగా ఇరు దేశాల చర్చలలో చైనాకు తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశంగా నిలిచింది. బీజింగ్ తన భూభాగంగా చెప్పుకుంటున్న ఈ స్వయం పరిపాలన ద్వీపం విషయంలో ఉన్న విభేదాలు అమెరికా, చైనాల మధ్య ఘర్షణలకు లేదా సంఘర్షణలకు దారితీయవచ్చని జిన్‌పింగ్ వ్యక్తిగతంగా ట్రంప్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది. -
శాంతికి భారత్ కీలకం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ మరింత కీలకపాత్ర పోషించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ కోరారు. ఇరాన్‌కు సంబంధించినంత వరకు ఎలాంటి సైనికపరమైన పరిష్కారం లేదని స్పష్టం చేశారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధి అంశం ఇప్పుడు చాలా సంక్లిష్టంగా మారిందంటూ వ్యాఖ్యానించిన ఆయన.. హార్మూజ్ గుండా అన్ని రకాల నౌకల స్వేచ్ఛాయానానికి అవసరమైన సాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని తాము కోరుకోవడం లేదన్నారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులు మినహా మరో మార్గం లేనే లేదని పేర్కొన్నారు. -
ఇరాన్ సమాంతర శక్తి కేంద్రం
దాదాపుగా అన్ని దేశాల విషయంలో ఎన్నికైన ప్రభుత్వం, అధ్యక్షుడు, సైన్యం, పార్లమెంట్ వంటి వ్యవస్థలే ప్రధాన అధికార కేంద్రాలుగా కనిపిస్తాయి. కానీ ఇరాన్ విషయంలో పరిస్థితి కొంత భిన్నం. అక్కడ బాహ్యప్రపంచానికి కనిపించే ప్రభుత్వ వ్యవస్థలతో పాటు, మరొక సమాంతర శక్తి కీలక పాత్ర పోషిస్తోంది. అదే ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్జీసీ). పర్షియన్ భాషలో దీనిని ‘సెపాహ్–ఎ పాస్దారాన్–ఎ ఎంగెలాబ్–ఎ ఇస్లామీ’ అని పిలుస్తారు. దీని అర్థం ఇస్లామిక్ విప్లవ పరిరక్షక దళం. పేరుకు ఇది భద్రతా సంస్థ మాత్రమే. కాలక్రమేణా ఇరాన్ రాజకీయ ముఖచిత్రం, విదే శాంగ వ్యూహం, సామాజిక నియంత్రణ, ప్రాంతీయ వ్యూహాత్మక కార్యకలాపాలు వంటి అనేక రంగాలను ప్రభావితం చేసే కేంద్రంగా పరిణమించింది. అందుకే పశ్చిమ దేశాల విశ్లేషణల్లో ఐఆర్జీసీని ‘దేశంలో మరో దేశం’గా అభివర్ణిస్తుంటారు.1979 విప్లవంతో మొదలు...ఈ సంస్థ ఆవిర్భావాన్ని ఆకళింపు చేసుకోవాలంటే 1979 ఇరాన్ విప్లవాన్ని పరిశీలించాలి. అప్పటివరకు ఇరాన్లో పాలన సాగించిన షా మహమ్మద్ రేజా పహ్లవి – పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికా–బ్రిటన్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. గణనీయ స్థాయి సహజ వనరులు కలిగిన ఇరాన్‌పై పాశ్చాత్య ప్రభావం పెరుగుతుండటం దేశంలో అసంతృప్తికి దారితీసింది. ఇస్లామిక్ వర్గాలు, జాతీయవాద శక్తులు, విద్యార్థులు, వామపక్షాలు ఐక్యంగా షా పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాయి. అప్పుడు మత పెద్దగా ఉన్న అయతుల్లా రుహొల్లా ఖొమేనీ నాయకత్వంలో జరిగిన విప్లవం షా పాలనకు చరమగీతం పాడింది. దాంతో, ఇస్లామిక్ రిపబ్లిక్కు అంకురార్పణ జరిగింది.కొత్త ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తాయి: విప్లవం ద్వారా ఏర్పడిన ఈ కొత్త వ్యవస్థను దీర్ఘకాలం ఎలా కాపాడాలి? పాత శక్తులు తిరిగి పుంజుకోకుండా ఎలా నిరోధించాలి? చమురు సంపదపై దృష్టి పెట్టిన పాశ్చాత్య దేశాల జోక్యాన్ని ఎలా ఎదు ర్కోవాలి? ముఖ్యంగా, కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ పాలనను అంత ర్గతంగా, బాహ్యంగా సవాలు చేసే శక్తులను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా, అప్పటి ప్రథమ సుప్రీం లీడర్ ఖొమేనీ నాయకత్వంలో ఐఆర్జీసీ పురుడు పోసుకుంది.ఇక్కడే ఇరాన్ సంప్రదాయ సైన్యం ‘ఆర్టేష్’ అంటే అగ్ని, ఐఆర్జీసీ మధ్య వైరుధ్యం కనిపిస్తుంది. ఇతర దేశాల సైన్యాల లాగానే ఆర్టేష్ విధులు దేశ సరిహద్దులను రక్షించడం, సాంప్రదాయ యుద్ధాలలో దేశాన్ని కాపాడటం. కానీ ఐఆర్జీసీ లక్ష్యం కేవలం భూభాగ పరిరక్షణ మాత్రమే కాదు, ఇస్లామిక్ విప్లవాన్నీ, దాని భావజాలాన్నీ కాపాడటం కూడా దీని ప్రధాన బాధ్యతగా నిర్దేశించ బడింది. అందువల్ల, బాహ్య శత్రువులతో పాటు అంతర్గత రాజ కీయ అస్థిరత, సామాజిక నిరసనల వంటి అంశాలను కూడా ఇది భద్రతా సమస్యలుగా పరిగణిస్తుంది. ఈ విస్తృత పాత్రే కాలక్రమేణా ఐఆర్‌జీసీకి ఎనలేని ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టింది.ప్రభుత్వం వర్సెస్ ఐఆర్జీసీఇరాన్ అధికార వ్యవస్థలో అత్యున్నత స్థానం ‘సుప్రీం లీడర్’ది. ఇది కేవలం రాజకీయ పదవి మాత్రమే కాదు; తొమ్మిది కోట్ల మంది ఇరానీయులను ఏకీకృతం చేయగల మతపరమైన అత్యున్నత అధి కార హోదా కూడా. ఖొమేనీ తర్వాత దశాబ్దాల పాటు అలీ ఖమేనీ ఆ పదవిలో తిరుగులేని అధికారం చలాయించారు. ప్రస్తుత ఉద్రి క్తతల నడుమ, అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆ బాధ్యత చేపట్టారు. ఐఆర్జీసీ నేరుగా సుప్రీం లీడర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఎన్నికైన అధ్యక్షుడు, పార్లమెంట్, మంత్రివర్గం వంటి వ్యవస్థలకు ఇది పూర్తిగా లోబడి ఉండదు. ఫలితంగా, ఒకవైపు ఎన్నికైన ప్రభుత్వం కొనసాగుతుండగా, మరోవైపు సుప్రీం లీడర్‌కు నేరుగా అనుసంధానమైన ఐఆర్జీసీ కూడా సమాంతరంగా పని చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండు వ్యవస్థల బాధ్యతల మధ్య స్పష్టమైన విభజన రేఖ లేకపోవడం బాహ్యప్రపంచాన్ని సందిగ్ధంలో పడేస్తుంది. ఈ ద్వంద్వ నిర్మాణమే ఇరాన్‌ను పశ్చిమాసియాలో ఇతర దేశాలకంటే భిన్నంగా నిలబెట్టింది.కాలక్రమేణా ఐఆర్జీసీ ఒక విస్తృత భద్రతా వ్యవస్థగా ఎదిగింది. దీనిలో భూసేన, నౌకాదళం, వైమానిక విభాగం, క్షిపణి వ్యవస్థలు, గూఢచార యంత్రాంగం, సైబర్ సామర్థ్యాలు వంటి అనేక విభాగాలు ఉన్నాయి. ‘ఖతమ్ అల్–అన్బియా’ వంటి కేంద్ర కమాండ్ వ్యవస్థలు సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తాయి. ఇందులో సుమారు 1–2 లక్షల సంఖ్యలో సిబ్బంది ఉన్నారని అంచనా. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే చమురు, నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా దీని అనుబంధ సంస్థల ప్రభావం గణనీయంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనేక మాజీ ఐఆర్జీసీ పదాధికారులు ఉత్తరోత్తరా ప్రభుత్వ వ్యవస్థలో కీలక పదవులు చేపట్టారు. పార్లమెంట్, మంత్రివర్గం, ప్రాంతీయ పరి పాలన, వ్యూహాత్మక సంస్థలు వంటి అనేక రంగాల్లో వీరి ప్రభావం విస్తరించింది.ఇరాన్ అంతర్గత భద్రతా వ్యవస్థలో ‘బసీజ్’ అనే అనుబంధ బలగం కీలక పాత్ర పోషిస్తుంది. ‘బసీజ్’ అంటే సమీకరణ అని అర్థం. ఇది సంప్రదాయ సైన్యం, పోలీసు, పారామిలిటరీ బలగాల వంటి వ్యవస్థీకృత విభాగం కాదు. విద్యార్థులు, కార్మికులు, ప్రభు త్వోద్యోగులు, వ్యాపారులు వంటి అనేక సామాజిక వర్గాలవారుఇందులో సభ్యులుగా ఉంటారు. అవసరమైనప్పుడు, ఐఆర్జీసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా సేవలందిస్తారు. ఇటీవలి సంవత్స రాల్లో ఇరాన్లో జరిగిన నిరసనల సమయంలో, బసీజ్ పాత్ర అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఉద్రిక్తతలను ఆపగలిగేది ఎవరు?ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న అంతర్జాతీయ వివాదాల్లో కూడా ఐఆర్జీసీ పేరు తరచూ వినిపిస్తుంది. యురేనియం శుద్ధి స్థాయులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థను అణు కేంద్రాల తనిఖీ లకు అనుమతించడంలో నియంత్రణలు, అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనా అనే అనుమానాలు– ఈ అన్ని చర్చల్లో ఐఆర్జీసీ కీలకంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఒక వైపు కొనసాగుతుండగా; భద్రతా–భావజాల వ్యవస్థగా ఐఆర్జీసీ సమాంతరంగా ప్రభావాన్ని, ప్రాభవాన్ని కొనసాగిస్తోంది. అధికారిక నిర్ణయాలు ప్రభుత్వం పేరుతో వెలువడినా; వాటి నేపథ్యాన్ని, దిశను ప్రభావితం చేయడంలో దీని పాత్ర స్పష్టం.ప్రస్తుతం ఇంకా పూర్తిగా సమసిపోని ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా ఉద్రిక్తతలను మరో మలుపు తిప్పగల సామర్థ్యం ఇరాన్ వ్యవస్థల్లో దేనికైనా ఉందంటే, అది ఐఆర్జీసీకేనని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ చర్చలు ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్‌కు ప్రతి నిధిత్వం వహించిన భారీ బృందంలో ఐఆర్జీసీ సభ్యుల పాత్రే కీల కంగా ఉందని వార్తలు వెలువడ్డాయి. హార్మూజ్ జలసంధి, దాని గుండా భారత్‌కు ప్రవహించే చమురు సరఫరాపై కూడా ప్రభావం చూపగల వ్యూహాత్మక స్థాయిలో ఐఆర్జీసీ నిలిచింది.వ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు, పశ్చిమాసియాలో పనిచేశారు. -
బ్రిక్స్: హర్ముజ్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: హర్ముజ్ జలసంధి దిగ్భందంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన వేళ బ్రిక్స్ సదస్సు వేదికగా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధి , ఎర్ర సముద్రం వంటి అంతర్జాతీయ జలమార్గాల ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగడం వాణిజ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని జైశంకర్ నొక్కి చెప్పారు.నిన్న మే15 (గురువారం) జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రసంగం చేశారు."శాంతి ఎవరికో ఒకరికే పరిమితం కాదు స్థిరత్వం అనేది కొందరికే పరిమితం కాకూడదు,శాంతి అనేది ముక్కలు ముక్కలుగా ఉండకూడదు" అంతర్జాతీయ సంబంధాల్లో ప్రతి దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలి, చర్చలు దౌత్యం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి " అని అన్నారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాకు ఆటంకాలు కలగకుండా చూడాలని, అలాగే ఏకపక్ష ఆంక్షల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి బ్రిక్స్ దేశాలు "ఆచరణాత్మక మార్గాలను" వెతకాలని భారత విదేశాంగ మంత్రి బ్రిక్స్ దేశాలకు సూచించారు. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో పరోక్షంగా ఇరాన్‌కు సూచనలు చేస్తూ జైశంకర్ ప్రసంగించారు. అయితే ఈ సదస్సులో ఇరాన్ ప్రతినిధిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాల్గొన్నారు.ఇరాన్ - UAE మధ్య వివాదంకాగా ఈసమావేశంలో ఇరాన్ , యూఏఈ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తమ దేశ మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేస్తోందని ఆరోపిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘనలను బ్రిక్స్ ఖండించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్ యుద్ధంపై బ్రిక్స్ దేశాలుఉమ్మడి ప్రకటనను విడుదల చేయలేకపోతున్నాయి.బ్రిక్స్ కూటమి2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE చేరగా.. 2025లో ఇండోనేషియా కూడా బ్రిక్స్‌లో చేరింది. ఇప్పుడు ఈ కూటమి ప్రపంచ జనాభాలో సుమారు 49.5% కి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ఇరాన్ యుద్ధంతో భగ్గుమంటున్న ముడిచమురు
(రమణమూర్తి మంథా): ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ఆగినా.. హార్మూజ్ జలసంధిలో మొదలైన చమురు సరఫరా సంక్షోభం ఇంకా మండుతూనే ఉంది. ఫలితం... అంతర్జాతీయంగా ముడి చమురు ధర బీభత్సంగా పెరుగుతోంది. బ్యారెల్ ధర 100 డాలర్లు దాటేసింది. ఈ ప్రభావం పెట్రోలు బంకులతో ఆగిపోదు. ప్రతి ఇంట్లోకీ చొరబడుతుంది. వాహనాలు లేనివారిక్కూడా కష్టాలు తప్పవు. ఎందుకంటే మనకు అవసరమైన ముడి చమురులో 85–90 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నదే. ధర పెరగటం వల్ల దిగుమతుల బిల్లు పెరిగి.. మన డాలర్ల నిల్వలు తరిగిపోతున్నాయి.దీంతో డాలర్ విలువ మరింత పెరుగుతూ రూపాయి పతనమవుతోంది. ఇదో వలయం. దీనిలో చిక్కి విలవిల్లాడుతున్న దేశాన్ని కాస్త గాడిన పెట్టడానికి బంగారం కొన్నాళ్లు కొనవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్క్‌ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. తనవంతుగా బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచేశారు. పెట్రో ధరలూ పెరగవచ్చన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ముడిచమురు సామాన్యుల జీవితంలో ఎలాంటి మార్పులు తేబోతున్నదో వివరించేదే ఈ ప్రత్యేక కథనం..అన్నింటిపై ప్రభాaవం..సామాన్యుడికి మొదట కనిపించేది పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటమే!. నిజానికి సంక్షోభం మొదలయ్యాక ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ భారాన్ని తామే మోస్తున్నాయి తప్ప జనంపై మోపలేదు. చమురు కంపెనీలు రోజుకు సుమారు రూ.1,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పూరీ చెప్పకనే చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అదే జరిగితే..అన్నిరకాల ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి..⇒ బైక్‌పై, కార్లపై ఆఫీసుకెళ్లేవారికి నెల ఖర్చు పెరుగుతుంది⇒ ఆటో, క్యాబ్ చార్జీలు పెరుగుతాయి⇒ బస్సు చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంటుందికూరగాయలు, నిత్యావసరాలు కూడా...డీజిల్ ధర పెరిగితే రైతు ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే.. ట్రాక్టర్లు డీజిల్‌పైనే నడుస్తాయి. బోర్లు, నీటి పంపులు ఇంధనంపై ఆధారపడతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. దీంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. పాల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. రవాణా ఖర్చు పెరగటమనేది ప్రతి వస్తువు ధరనూ ప్రభావితం చేస్తుంది. ఎల్పీజీ, హోటల్ బిల్లులు కూడా పెరుగుతాయిదేశానికి అవసరమైన ఎల్పీజీలో అత్యధిక భాగం దిగుమతుల ద్వారా వస్తున్నదే. సరఫరా ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్రం ఏకంగా 30 శాతానికి పైగా పెంచేసింది. ఇళ్లలో వాడే సాధారణ సిలిండర్లు ఇప్పటికీ ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా కావటం లేదు. ఈ గ్యాస్ ఇబ్బందులతో.. ఇప్పటికే చాలా టిఫిన్ సెంటర్లతో సహా రెస్టారెంట్లు, హోటళ్లు ధరలను పెంచేశాయి. ఇళ్లలో వండి సరఫరా చేసే హోమ్ కిచెన్లు కూడా మెనూను తగ్గించేయడంతో పాటు ధరలను స్వల్పంగా పెంచి ఈ ఇబ్బందిని తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విమాన టికెట్ల ధరలూ నింగిలోకి..విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కూడా క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది. కాబట్టి విమాన కంపెనీలు తమపై పడ్డ భారాన్ని అంతిమంగా ప్రయాణికుడిపైనే వేస్తాయి. ఫలితంగా ట్రావెల్ ప్యాకేజీలు ఖరీదవుతాయి. టూరిజం రంగంపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం వల్ల హోటల్ పరిశ్రమ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. కొన్ని ఎయిర్‌లైన్స్ ఇప్పటికే తాము విమానాలు నడిపే రూట్లను తగ్గించేశాయి. ధరలనూ పెంచవచ్చన్న సంకేతాలిస్తున్నాయి. రూపాయి విలువ పడిపోతుందికేంద్ర ప్రభుత్వం చమురును డాలర్లలో కొంటుంది. క్రూడ్ ధర పెరిగితే ఎక్కువ డాలర్లు అవసరం అవుతాయి. అప్పుడు ఉన్న డాలర్లను (ఫారెక్స్ నిల్వలు) వెచ్చించటంతో పాటు కొత్త డాలర్లు కొనాల్సి ఉంటుంది. డాలర్‌ను కొంటూ ఉంటే దాని విలువ పెరిగిపోతూ.. మనం వెచ్చించే రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు రూపాయి కనిష్ట స్థాయిలకు చేరటానికి ఇదే కారణం.ఈఎంఐలు పెరగొచ్చు!ముడిచమురు వల్ల అన్ని ధరలూ పెరిగితే... ద్రవ్యోల్బణం పెరిగినట్లే. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు దాన్ని నియంత్రించడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించకుండా జాగ్రత్తపడుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే తదనుగుణంగా హోమ్ లోన్ ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటుంది. పైపెచ్చు వ్యాపార రుణాలు ఖరీదవుతాయి. వినియోగం మందగిస్తుంది. ఇది మళ్లీ ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది. స్టాక్ మార్కెట్ షేక్చమురు ధరల కారణంగా సామాన్యులకు మాదిరిగానే కంపెనీలకూ ఖర్చులు పెరుగుతాయి. దీంతో లాభాలు తగ్గుతాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ సరిగ్గా లాభాలుండవేమోనన్న భయాలతో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. దీంతో షేర్లు పతనమవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే. నోట్: పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం, వాహనాల రద్దీ వంటి కారణాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు లేదా డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంది. బిహార్ దేశంలోనే అత్యంత తక్కువగా పెట్రోలు (3 లీటర్లు), డీజిల్(6 లీటర్లు) వినియోగిస్తోంది. కంపెనీలకు తిప్పలు చమురు ధరలు పెరిగితే ఎక్కువగా పెయింట్స్, సిమెంట్, కెమికల్స్, ఎయిర్‌లైన్స్, లాజిస్టిక్స్ రంగాలు దెబ్బతింటాయి. అయితే ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీలు, కొన్ని ఎగుమతి సంస్థలు లాభపడే అవకాశం ఉంది. కాకపోతే ఇలా లాభపడే సంస్థలతో పోలిస్తే ఇబ్బందిపడే సంస్థలే ఎక్కువ. ప్రభుత్వానికి ఇబ్బందులు..చమురు ధరలు పెరిగితే ప్రభుత్వానికి ఆప్షన్లు చాలా తక్కువ ఉంటాయి. అయితే ధరలు పెంచాలి..లేదంటే పన్నులు తగ్గించాలి. ఈ రెండూ కాదంటే చమురు కంపెనీల నష్టాల్ని తానే భరించాలి. ఈ మూడింట్లో ఏది చేసినా కష్టమే. ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చు. పన్నులు తగ్గించినా, కంపెనీల నష్టాలను తాను భరించినా తన ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు.ఉపశమనం కలిగిస్తున్న అంశాలివే...⇒ ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇది కొంత ఉపశమనం ఇస్తోంది.⇒ మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనింగ్ దేశాల్లో ఒకటి. అందుకే సరఫరా నిర్వహణలో కొంత వెసులుబాటు ఉంది.⇒ ప్రస్తుతానికి మన దేశానికున్న ఫారెక్స్ నిల్వలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి.సామాన్యులు చేయాల్సిందేంటి?⇒ అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి⇒ కుటుంబ బడ్జెట్‌ను ముందే ప్లాన్ చేసుకోవాలి⇒ ఈఎంఐల విషయంలో జాగ్రత్తగా ఉండాలి⇒ సిప్‌లు, బంగారం, డిఫెన్సివ్ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి⇒ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించుకోవాలి -
భారత్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి.. పర్యటన ఫలిస్తుందా..?
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత్ చేరుకున్నారు. ఈ రోజు (మే 14,15) తేదీలలో జరిగే బ్రిక్స్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అరాఘ్చీకి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు.ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మెుదలైన తర్వాత ఇరాన్ ప్రతినిధులు అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.ఈ సందర్భంగా ఆయన వినియోగించిన మినాబ్ 168 విమానం ఇప్పుడు చర్చానీయాంశమయ్యింది.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే యుద్దం ముగిసిందా అనే విషయంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. ఇటు ఇరాన్ అటు అమెరికా రెండు దేశాలు తగ్గేలా కనిపించడం లేదు. దీంతో యుద్ధం ముగింపుపై స్పష్టత వచ్చే అంశం కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన ఇప్పుడు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది.మినాబ్ 168 విమానంలో భారత్ చేరుకున్న అరాగ్చీఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మినాబ్ 168 అనే పేరు గల ఇరాన్ విమానంలో భారత్ చేరుకున్నారు. ఈ విమానానికి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రారంభంలో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాల మీద అమెరికా జరిపిన క్షిపణి దాడిలో 168 మంది బాలికలు మరణించారు. అమాయక పౌరులపై జరిగిన దాడులకు గుర్తుగా, ఆ విషాద ఘటనను ప్రతిబింబించేలా ఈ విమానానికి ఆ పేరు పెట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను ఎండగట్టడానికి ఇది చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై ఒత్తిడి తెస్తున్న ఇరాన్అయితే ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌పై ఇరాన్ గత కొంతకాలంగా ఇరాన్ ఒత్తిడి చేస్తూ వస్తుంది. అయితే కూటమిలో సభ్యదేశంగా ఉన్న యూఏఈపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో ఈ అంశంలో యుఏఈతో పాటు ఇతర సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగింది. ప్రస్తుత సమావేశంలో యుద్ధంపై ఉమ్మడి ప్రకటన వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.సమావేశ ప్రధాన లక్ష్యాలు"BRICS@20: స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం మరియు స్థిరత్వం" అనే థీమ్‌తో జరుగుతోంది. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు మరియు బహుపాక్షిక వ్యవస్థల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి. అయితే, సభ్య దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ కూటమి ఐక్యతకు పరీక్షగా మారాయి.#WATCH | Delhi: Foreign Minister of Iran, Syed Abbas Araghchi arrives in India for the BRICS Foreign Ministers’ Meeting. pic.twitter.com/l5c8DqzYLc— ANI (@ANI) May 13, 2026 -
హర్మూజ్ దాటే నౌకలకు సర్వీస్ ఛార్జీ
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై "సేవా రుసుము" (Service Fee) వసూలు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిదాబాది ధ్రువీకరించినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. నౌకల రాకపోకల పర్యవేక్షణ (Navigation), సహాయక చర్యల (Rescue Operations) వంటి సేవలకు ప్రతిఫలంగా ఈ రుసుములను వసూలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఎంపిక చేసిన నౌకలకే అనుమతిహర్మూజ్ జలసంధి గుండా అన్ని నౌకలను కాకుండా, ఎంపిక చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తామని ఘరిదాబాది పేర్కొన్నారు. నౌకలపై విధించే ఛార్జీల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను, పారదర్శకతను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత దేశ సహకారాన్ని ఇరాన్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.భారత్‌కు ప్రాధాన్యత"భారతదేశం మాకు అత్యంత స్నేహపూర్వక దేశం. ఇప్పటికే భారత్‌కు చెందిన 11 నౌకలకు అనుమతి ఇచ్చాము. మిగిలిన నౌకల అనుమతి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాము" అని ఆయన ఎన్డీటీవీతో చెప్పారు.ప్రాంతీయ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఇరాన్ కాల్పుల విరమణను కోరలేదని, అమెరికాయే ఆ ప్రతిపాదన తెచ్చిందని గరిదాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితి 'శాంతి లేదు - యుద్ధం లేదు' అన్నట్లుగా ఉంది. అందుకే ప్రారంభంలో మేము కాల్పుల విరమణను వ్యతిరేకించాం. అయితే దౌత్యపరమైన పరిష్కారం కోసం చివరికి చర్చలకు అంగీకరించాం," అని ఆయన వివరించారు. -
చైనా పర్యటనకు ట్రంప్.. ఇరాన్‌పై కొత్త వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, ప్రపంచ చమురు మార్కెట్ ఆందోళనలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఇరాన్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గురించి చైనాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఇరాన్ ఇంకా తమ కంట్రోల్‌నే ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యంగా తైవాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై ట్రంప్, జిన్‌పింగ్ మధ్య కీలక సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బలహీనమైన వాణిజ్య సంబంధాల కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపేందుకు ట్రంప్ మంగళవారం వైట్‌హౌస్ నుండి చైనా పర్యటనకు బయలుదేరారు. మూడు రోజుల పాటు ట్రంప్.. చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్బంగా తీవ్రమవుతున్న భౌగోళిక, రాజకీయ, వాణిజ్యపరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ అంతటా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా-చైనా సంబంధాలలో ఒక కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది.ఇక, ఈ పర్యటన సందర్భంగా ఇరాన్ వివాదం ప్రాముఖ్యతను తగ్గించి చూపడానికి అమెరికా అధికారులు ఇటీవలి రోజుల్లో ప్రయత్నిస్తుండగా, జిన్‌పింగ్‌తో తన చర్చలలో ఈ అంశం ఎంత ప్రముఖంగా ఉంటుందనే దానిపై ట్రంప్ మిశ్రమ సంకేతాలు ఇచ్చారు. బీజింగ్‌కు వెళ్లేందుకు మెరైన్ వన్ హెలికాప్టర్ ఎక్కే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ట్రంప్..‘మేము చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఇరాన్ వాటిలో ఒకటి అని నేను చెప్పను. ఎందుకంటే ఇరాన్ చాలా వరకు మా అదుపులోనే ఉంది. ఇరాన్ విషయంలో మాకు ఎలాంటి సహాయం అవసరమని నేను అనుకోవడం లేదు. శాంతియుతంగానైనా లేదా మరే విధంగానైనా, మేము దీనిని గెలుస్తాము. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం సహా మొత్తం యుద్ధ యంత్రాంగం పూర్తిగా ధ్వంసమైంది. వాళ్లు సరైన నిర్ణయం తీసుకుంటారు.. లేకపోతే మేం మిగతా పని పూర్తి చేస్తాం. దిగ్బంధనం 100 శాతం ప్రభావవంతంగా ఉంది. ఏదో ఒక విధంగా ఇది అమెరికాకు చాలా అనుకూలంగా మారుతుంది. ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా చమురు ఉత్పత్తి పెరుగుతుంది' అని ట్రంప్ తెలిపారు.నాటోపై ట్రంప్ అసంతృప్తిఈ సందర్భంగా నాటోపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు. 'నాటో నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. మాకు అవసరమైన సమయంలో నాటో మాతో లేదు. నిజానికి మాకు నాటో అవసరం లేదు. కానీ అవసరమైతే కూడా వాళ్లు ముందుకు రాలేదు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే మాత్రం కూటమి భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం ప్రపంచ భద్రతా వ్యవస్థలో కీలక అంశంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధానంగా సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు.President Donald J. Trump departs Washington D.C. for a historic visit to China! pic.twitter.com/8Qok0Xcqcd— The White House (@WhiteHouse) May 12, 2026చైనా పర్యటనలో ట్రంప్‌తో మస్క్, టిమ్ కుక్.. బీజింగ్‌తో కొత్త వ్యాపార ఒప్పందాల కోసం తన ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో, ట్రంప్ ఈ పర్యటనకు ఎలాన్ మస్క్, టిమ్ కుక్‌తో సహా పలువురు అగ్రశ్రేణి అమెరికన్ వ్యాపార నాయకులను తీసుకువచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో బోయింగ్ విమానాలు, అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన సరఫరాలకు సంబంధించిన కొనుగోళ్లను కూడా చైనా ప్రకటించే అవకాశం ఉంది. సుమారు 500 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్లు, డజన్ల కొద్దీ జీఈ-పవర్డ్ వైడ్‌బాడీ విమానాల కోసం ఒప్పందంపై బోయింగ్, చైనా అధికారులు చర్చిస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇది ఖరారైతే, 2017 తర్వాత చైనాకు ఇది మొదటి ప్రధాన బోయింగ్ ఆర్డర్ అవుతుంది. అలాగే విమానయాన చరిత్రలోనే అతిపెద్ద విమాన ఒప్పందంగా నిలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చైనా నుండి అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణాను అనుమతిస్తున్న వాణిజ్య సంధిని పొడిగించడంపై కూడా ఇరుపక్షాలు చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటనలో పొడిగింపునకు అంగీకారం కుదురుతుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు.తైవాన్, అమెరికా సంబంధాలపై.. ఇక, అంతకుముందు.. తైవాన్, ఇరాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై అమెరికా అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. తైవాన్ అంశం ట్రంప్, జిన్‌పింగ్ మధ్య గత కొన్ని సమావేశాల్లో కూడా చర్చకు వచ్చిన విషయమేనని తెలిపారు. అయినప్పటికీ అమెరికా పాలసీలో మార్పు చోటుచేసుకోలేదని, ఇకముందూ అలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. తైవాన్‌కు ఆయుధాల విక్రయాల విషయంలో కూడా అమెరికా తన మద్దతును కొనసాగిస్తోందని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ తొలి ఏడాదిలోనే గత ప్రభుత్వ నాలుగేళ్ల కాలంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో తైవాన్‌కు రక్షణ సామగ్రి విక్రయాలకు ఆమోదం లభించిందని వెల్లడించారు.ఇటీవల తైవాన్ ప్రభుత్వం అమెరికా సైనిక పరికరాల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. దాదాపు 780 బిలియన్ తైవాన్ డాలర్ల వ్యయ పరిమితితో ఈ బిల్లును ఆమోదించినట్లు సమాచారం. అయితే ఇందులో కొన్ని కీలక రక్షణ అంశాలకు నిధులు కేటాయించకపోవడం నిరాశ కలిగించిందని అమెరికా అధికారులు వ్యాఖ్యానించారు. మొదట ప్రతిపాదించిన పూర్తి ప్యాకేజీకి నిధులు కేటాయించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. -
పాక్ వైమానిక స్థావరంలో ఇరాన్ యుద్ధ విమానాలు
వాషింగ్టన్: పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య దౌత్య మధ్యవర్తిగా పాకిస్తాన్ ప్రదర్శించుకున్న తీరు అందరికీ తెలిసిందే. అయితే, ఈ సమయంలో ఇరాన్ సైనిక విమానాలను నిలిపి ఉంచడానికి పాకిస్తాన్ తన కీలక వైమానిక స్థావరాల్లో ఒకదానిలో అనుమతించిందని ఓ నివేదిక వెల్లడించింది. రావల్పిండికి కొద్ది దూరంలో ఉన్న నూర్ ఖాన్‌లోని పాకిస్తాన్ వైమానిక దళ స్థావరానికి ఇరాన్ అనేక కీలక రక్షణ ఆస్తులను తరలించిందని పేర్కొంది. అధికారికంగా కాల్పుల విరమణ ప్రయత్నాలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న సమయంలో, ఇరాన్ తన సైనిక, విమానయాన ఆస్తులను రక్షించుకోవడానికి ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మకంగా ముఖ్యమైన సైనిక స్థావరం ఆశ్రయాన్ని కల్పించింది.ఈ సైనిక పరికరాలలో, లాక్‌హీడ్ సంస్థ తయారు చేసిన సి–130 హెర్క్యులస్ వ్యూహాత్మక రవాణా విమానానికి చెందిన నిఘా, గూఢచార సేకరణ వేరియంట్ అయిన ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్సి–130 కూడా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఇరాన్–అమెరికా సంక్షోభ సమయంలో అమెరికాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే, ఇరాన్‌కు గానీ, దాని మిత్రదేశం, పాకిస్తాన్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయిన చైనాను గానీ దూరం చేసుకునే చర్యలకు పాక్ దూరంగా ఉండటాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇరాన్ వద్ద మిగిలి ఉన్న వైమానిక, సైనిక ఆస్తులను అమెరికా దాడుల నుంచి రక్షించుకోవడానికే ఈ తరలింపునకు కారణమై ఉంటుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. నివేదికపై తీవ్ర వ్యతిరేకత.. ఈ నివేదిక అమెరికాలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాక్ తటస్థతను అమెరికా చట్టసభ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహిత మిత్రుడు, సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ నివేదికపై ఎక్స్‌లో స్పందించారు. ఈ సంక్షోభంలో పాకిస్తాన్ దౌత్య పాత్రను పునఃసమీక్షించాలని పిలుపునిచ్చారు.‘ఈ నివేదిక కచ్చితమైనదైతే, ఇరాన్–అమెరికా మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇజ్రాయెల్‌పై పాకిస్తాన్ రక్షణ అధికారులు గతంలో చేసిన కొన్ని ప్రకటనలను గమనిస్తే, ఇది నిజమైనా నేను ఆశ్చర్యపోను’అని గ్రాహం పేర్కొన్నారు. అయితే, నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు సంబంధించిన ఆరోపణలను పాకిస్తాన్ సీనియర్ అధికారి ఖండించారు. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతంలో ఆ బేస్ ఉన్నందున అటువంటి కార్యకలాపాలు రహస్యంగా ఉండటం సాధ్యం కాదని తెలిపారు. కాబూల్‌లోనూ.. అంతేకాదు, ఇరాన్ పౌర విమానాలను పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ విమాన ప్రయాణాల్లో సైనిక విమానాలు ఉన్నాయో, లేదో స్పష్టంగా తెలియదని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే, ఘర్షణలు ప్రారంభం కావడానికి కొద్ది ముందే మహాన్ ఎయిర్ విమానం ఒకటి కాబూల్‌లో దిగిందని, ఇరాన్ గగనతలం మూసివేయడంతో అది అక్కడే ఉండిపోయిందని ఆఫ్ఘన్ పౌర విమానయాన అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడుల తర్వాత కాబూల్ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవచ్చనే భయాలు పెరగడంతో, ఆ విమానాన్ని ఇరాన్ సరిహద్దు సమీపంలోని హెరాత్ విమానాశ్రయానికి తరలించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇరాన్ విమానాలు ఉన్నాయన్న వార్తలను తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిడ్ తోసిపుచ్చారు. -
ఇరాన్‌కు ట్రంప్ ‘ఏఐ వార్నింగ్’..
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ మేఘాలను కమ్ముకొనేలా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన ఏఐ (కృత్రిమ మేధ) చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధ విమానాలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నట్లు ఉన్న ఈ కాల్పనిక చిత్రాలు మళ్లీ యుద్ధం తప్పదా? అన్న సంకేతాలను పంపుతున్నాయి.‘బింగ్.. బింగ్.. గాన్!’ట్రంప్ షేర్ చేసిన ఒక చిత్రంలో.. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ ఆయుధంతో ఇరాన్ జెండా ఉన్న విమానాన్ని గాలిలోనే పేల్చివేస్తున్నట్లు ఉంది. దీనికి "లేజర్స్: బింగ్, బింగ్, గాన్!!" అనే శీర్షికను ఆయన జోడించారు. మరో చిత్రంలో ఇరాన్‌కు చెందిన 'ఫాస్ట్ బోట్ల' సమూహంపై అమెరికా డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు చిత్రీకరించారు. దీనికి "బై బై, ఫాస్ట్ బోట్స్" అని క్యాప్షన్ ఇచ్చారు.‘లైఫ్ సపోర్ట్’పై కాల్పుల విరమణ!గల్ఫ్ రీజియన్‌లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక ఎంతో కాలం నిలవదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. చర్చల పునరుద్ధరణ కోసం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. "ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ‘లైఫ్ సపోర్ట్’ మీద ఉంది. తన ప్రియమైన వారు బతికే అవకాశం కేవలం ఒక శాతమే ఉందని డాక్టర్ చెప్పే పరిస్థితిలో ఆ ఒప్పందం ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.యుద్ధానికే మొగ్గు?హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మాటిమాటికీ మూసివేయడం, చర్చల పట్ల టెహ్రాన్ మొండి వైఖరితో ట్రంప్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా 'పూర్తి విజయం' సాధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్‌పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించే అంశాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ (CNN) కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా శాంతి ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. -
పర్షియన్ గల్ఫ్ లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ కు ట్రంప్.. నెతన్యాహు వార్నింగ్స్
-
రగిలిపోయిన ఇరాన్.. యూఏఈపై మిస్సైళ్ల వర్షం
అబుదాబి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో అనూహ్య మలుపు తిరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఇరాన్‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై గత నెలలో యూఏఈ రహస్యంగా దాడులు చేసినట్లు ఆ నివేదిక పేర్కొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.లావన్ ఐలాండ్ టార్గెట్‌గా దాడిగత నెలలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఐదు వారాల పాటు జరిపిన వైమానిక దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని కీలక ఇంధన కేంద్రమైన లావన్ ద్వీపంలోని రిఫైనరీపై యూఏఈ టార్గెట్ చేసి దాడి చేసింది. రోజుకు దాదాపు 60,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ కేంద్రం ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైనది. అయితే ఈ దాడిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అమెరికా మౌన మద్దతు.. గల్ఫ్ దేశాల ఎంట్రీయూఏఈ చేసిన ఈ దాడులకు అమెరికా తెరవెనుక మౌనంగా మద్దతు పలికినట్లు, గల్ఫ్ దేశాలు ఈ వివాదంలో విస్తృతంగా భాగస్వామ్యం కావడాన్ని స్వాగతించినట్లు నివేదిక పేర్కొంది. అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ, ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్లావన్ ద్వీపం ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. యూఏఈ, కువైట్‌లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అదే రోజు తమ ఇంధన, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసినట్లు యూఏఈ, కువైట్ కూడా ధృవీకరించాయి. ఒకే సమయంలో చోటుచేసుకున్న ఈ పరస్పర దాడుల వ్యవహారం ఆ ప్రాంతంలో నెలకొన్నయుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది.ఇది కూడా చదవండి: లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు! -
ఇరాన్ యుద్ధంలో పాక్ దొంగ నాటకాలు?
పశ్చిమాసియా యుద్ధంలో తమది శాంతిదూత పాత్ర అని పాకిస్తాన్ మొదటి నుంచి చెబుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ మాత్రం కేవలం మధ్యవర్తిగానే చూస్తున్నాయి. ఇజ్రాయెల్ అయితే ఓ అడుగు ముందుకేసి పాక్ పాత్రపై అనుమానాలు సైతం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఇప్పుడు సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.యుద్ధంలో ఇరాన్‌కు పాకిస్తాన్ సహాయం చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఇందుకోసం తన కీలక ఎయిర్‌బేస్ నూర్ ఖాన్‌ను ఇరాన్ సైనిక విమానాలకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చిందని ఓ సంచలనాత్మక కథనం తెరపైకి వచ్చింది. పైగా అమెరికా అధికారులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ ఓ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ ప్రారంభంలో కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్‌కు చెందిన కొన్ని సైనిక విమానాలను పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ (రావల్పిండి)కి తరలించిందని సమాచారం. వాటిలో ఒకటి RC-130 రికానైసెన్స్ విమానం కూడా ఉందని తెలుస్తోంది. ఈ తరలింపులు అమెరికా దాడుల నుంచి మిగిలిన ఇరాన్ సైనిక ఆస్తులను రక్షించడమే లక్ష్యమని అంచనా వేస్తున్నాం అని అధికారులు వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ కథనం పేర్కొంది.ఈ సమాచారం వెలుగులోకి రావడంతో ఇస్లామాబాద్ మధ్యవర్తి పాత్రపై కొత్త ప్రశ్నలు తలెత్తాయి. తాజా నివేదికపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్పందించారు. ‘‘ఈ సమాచారం నిజమైతే, పాకిస్తాన్ మధ్యవర్తి పాత్రను మళ్లీ సమీక్షించాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.ట్రంప్ ఊరుకుంటారా?ఇప్పటికే ఇరాన్ పంపిన ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించారు. దీంతో శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇరాన్‌కు సాయం తేలిందని ట్రంప్ భావిస్తే పాక్‌కు చిక్కులు తప్పకపోవచ్చనే విశ్లేషణ నడుస్తోంది. ఇరాన్–అమెరికా చర్చల్లో దాని పాత్రను తగ్గించే అవకాశమో లేదంటే ఆంక్షలు విధించడమో చేయొచ్చని భావిస్తున్నారు. పాక్–చైనా సన్నిహిత సంబంధాల కారణంగా.. ట్రంప్ దీనిని వ్యూహాత్మకంగా కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు.పాక్ వివరణ.. పాకిస్తాన్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. నూర్ ఖాన్ బేస్ నగర మధ్యలో ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో విమానాలు నిలిపితే ప్రజల కంటికి దూరంగా ఉంచడం అసాధ్యం అని ఓ సైనికాధికారి సీబీఎస్ న్యూస్‌కు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇరాన్ కొన్ని పౌర విమానాలను ఆఫ్ఘానిస్తాన్‌కు తరలించినట్లు కూడా ఆ కథనం పేర్కొంది. తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ వార్తలను కొట్టిపారేశారు. అయితే అఫ్గన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రం ఒక ఇరాన్ సివిలియన్ విమానం (మహాన్ ఎయిర్) కాబూల్‌లో నిలిచిందని.. తర్వాత హెరాత్‌కి తరలించబడిందని చెప్పారు.వ్యూహాత్మక సమీకరణాలుఇరాన్ యుద్ధంలో చైనా కూడా పాక్ తరహాలోనే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందా? అనే చర్చ జోరందుకుంది. ఒకవైపు చర్చలు జరగాలని అంటూనే.. మరోవైపు ఇరాన్‌తో ఉన్న వర్తక వాణిజ్య సంబంధాల దృష్ట్యా ఆయుధాల్ని సరఫరా చేస్తోందన్న ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది. అయితే.. పాకిస్తాన్ మాత్రం అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే.. ఇరాన్–చైనా అనుబంధాన్ని దూరం పెట్టకుండా జాగ్రత్త పడుతోంది.స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. 2020–2024 మధ్య పాకిస్తాన్ ప్రధాన ఆయుధ దిగుమతుల్లో 80% చైనా నుంచే వచ్చాయి. చైనా కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ప్రశంసించింది. అయితే.. ఇరాన్‌తో మాత్రం సంబంధాలు కొంతకాలంగా చెడిపోతూ వస్తున్నాయి. సరిహద్దు ఉగ్రవాదం, గ్యాస్ పైప్‌లైన్ వివాదాలు, సైనిక ఘర్షణలు ఇరాన్-పాక్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఇరాన్ పాక్ మధ్యవర్తిత్వంపై పూర్తి నమ్మకం చూపడం లేదు.నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ఆరోపణలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ వార్తలు దక్షిణాసియా భూభౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంలో పాక్ “శాంతిదూత” ఇమేజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఇరాన్ యుధ్ధం.. ప్రస్తుత పరిస్థితికాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ.. దాడులు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా నుంచి యుద్ధ పరిహారం, హర్ముజ్ జలసంధిపై సార్వభౌమాధికార గుర్తింపు, ఆంక్షల తొలగింపు వంటి డిమాండ్లు చేస్తోంది. ట్రంప్ ఈ ప్రతిపాదనలను “అంగీకరించలేనివి” అని తిరస్కరించారు. అణు ఒప్పందానికి దిగి రావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. -
కాల్పుల విరమణ గాల్లో దీపం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలవంతంగా కొనసాగిస్తున్నామని, అది గాల్లో దీపంలా తయారైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘కాల్పుల విరమణ సమర్థంగా అమలుకావట్లేదు. కాల్పుల విరమణ అనేది అత్యంత బలహీనంగా ఉంది. ఒక రకంగా అది ఐసీయూలో వెంటిలేటర్ మీద ప్రాణాధార వ్యవస్థ మీద నడుస్తోంది. అది ముగిసిపోయే అవకాశాలే చాలా ఎక్కువ’’అంటూ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చని ట్రంప్ పరోక్ష సంకేతాలిచ్చారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనలను వెనువెంటనే తిరస్కరించానని ట్రంప్ వెల్లడించారు. ‘స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేని ఇరాన్ నాయకత్వం మధ్యవర్తుల ద్వారా కొన్ని చెత్త ప్రతిపాదనలను తాజాగా నా ముందుకు తెచ్చింది. అందుకే వాటిని పూర్తిగా చదవకుండానే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించా. అవి నాకు అస్సలు నచ్చలేదు. ఆ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు’’అని అన్నారు. ఇరాన్ నాయకత్వ ఆలోచనా ధోరణిపై ట్రంప్ మాట్లాడారు. ‘‘ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకోవడం, మా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులతో నేను ఇబ్బంది పడతానని, ఏం చేయాలో తోచక పిచ్చెక్కుతుందని ఇరాన్ భావిస్తోంది. నాపై ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నారు. వాస్తవానికి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మేం విజయం సాధించబోతున్నాం. నా దగ్గర అద్భుతమైన ప్రణాళిక ఉంది. సైనికపరంగా ఇరాన్‌ను ఎప్పుడో ఓడించాం. వాళ్ల దగ్గర పరిమితస్థాయిలోనే సైనిక సంపత్తిఉంది. అదికూడా ఈ కాల్పుల విరమణ కాలంలో సమకూర్చుకున్నదే. ఈపాటి ఇరాన్ బలాన్ని మేం ఒక్కరోజులో సర్వనాశనం చేయగలం. అందుకు నా దగ్గర చక్కటి ప్లాన్ ఉంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించబోదు. వాస్తవానికి ఇరానియన్లు చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎలాంటి విపరీత ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలీదు’’అని అన్నారు. -
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు 'డిజిటల్' ఉరి!
టెహ్రాన్: యుద్ధం మిగిల్చిన గాయం ఒకవైపు.. డిజిటల్ దిగ్బంధనం చేస్తున్న విధ్వంసం మరోవైపు! ఇరాన్లో గత 73 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితికి నెట్టివేస్తోంది. క్షిపణుల మోత కంటే భయంకరంగా ఈ 'డిజిటల్ సీజ్' సామాన్యుల ఉపాధిని బలితీసుకుంటోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇరాన్ ప్రైవేట్ రంగాన్ని ఈ సుదీర్ఘ ఇంటర్నెట్ నిషేధం శ్మశానవాటికగా మారుస్తోంది.నిశ్శబ్ద భూకంపంఅంతర్జాతీయ ఇంటర్నెట్ వాచ్డాగ్ 'నెట్ బ్లాక్స్' (NetBlocks) తాజా నివేదిక ప్రకారం, ఆధునిక సమాజంలో ఇంత సుదీర్ఘకాలం జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ నిలిపివేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు సుమారు 2.6 బిలియన్ డాలర్ల (రూ. 21,000 కోట్లకు పైగా) ఆర్థిక నష్టం వాటిల్లింది. నేరుగా 10 లక్షల మంది, పరోక్షంగా మరో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రతిరోజూ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 80 మిలియన్ డాలర్ల మేర నష్టపోతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ ఛానెళ్లు 90% వరకు మూతపడ్డాయి.కుప్పకూలిన డిజిటల్ సామ్రాజ్యంఒకప్పుడు ఇరాన్ గర్వకారణంగా చెప్పుకునే 'డిజిటల్ ఎకానమీ' ఇప్పుడు ఆవిరవుతోంది. ఇరాన్ అమెజాన్‌గా పిలిచే 'డిజికాలా' వందలాది మందిని తొలగించగా, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 'కామ్వా' తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. "రెండు యుద్ధాలు, నెలల తరబడి ఇంటర్నెట్ బంద్ తర్వాత మేము నిలబడలేకపోతున్నాం" అని సంస్థ వ్యవస్థాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.పారిశ్రామిక రంగానికి పక్షవాతంసాంకేతిక రంగమే కాకుండా, పెట్రోకెమికల్, ఉక్కు, వస్త్ర పరిశ్రమలు సైతం కుదేలయ్యాయి. సరఫరా గొలుసు (Supply Chain) విచ్ఛిన్నం కావడంతో ముడి పదార్థాల దిగుమతి నిలిచిపోయింది. ఒక్క పశ్చిమ ఇరాన్ ఫ్యాక్టరీలోనే 700 మంది కార్మికులను ఇంటికి పంపించేశారు. దాదాపు 35 లక్షల మంది కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిందని పారిశ్రామిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.తప్పని తిప్పలు.. తెగనమ్ముకుంటున్న ఆస్తులుమధ్యతరగతి ఇరానియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉద్యోగాలు ఊడిపోవడంతో కనీస అవసరాల కోసం కార్లు, బంగారు ఆభరణాలను అమ్ముకుంటున్నట్లు బాధితులు వాపోతున్నారు. టెహ్రాన్‌కు చెందిన బాబాక్ అనే ప్రొడక్ట్ డిజైనర్ మాటల్లో చెప్పాలంటే.. "జీవితాంతం కష్టపడి నేర్చుకుని ఎదిగాను, కానీ ఇప్పుడు నా కళ్లముందే భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది."రాజకీయ చదరంగం.. ఆర్థిక బలిఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విఫలం కావాలని అమెరికా భావిస్తుండగా, ప్రభుత్వం మాత్రం లొంగే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. కానీ, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం, కరెన్సీ విలువ పాతాళానికి పడిపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. విదేశీ ప్లాట్‌ఫారమ్‌లు బంద్ కావడంతో ప్రజలను బలవంతంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండే దేశీయ యాప్‌ల వైపు మళ్లిస్తున్నారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ఇరాన్లో క్షిపణి దాడుల కన్నా 'డిజిటల్ ముట్టడి' వల్ల కలిగే నష్టం దీర్ఘకాలికంగా ఆ దేశ వెన్నుముకను విరిచేలా కనిపిస్తోంది. -
భారత్‌కు ఇరాన్ మంత్రి..! ఇంధన కొరత వేళ మనకెన్ని లాభాలంటే?
న్యూఢిల్లీ: ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం, భౌగోళిక-రాజకీయ ప్రాధాన్యం పెరిగిన సమయంలో ఆయన పర్యటన జరుగుతుంది. బ్రిక్స్ వేదికలో భారత్-ఇరాన్ మధ్య పెరుగుతున్న అనుబంధానికి దీన్ని సంకేతంగా భావిస్తున్నారు.ఇరాన్ 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో కలిసి బ్రిక్స్‌లో చేరింది. ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ కూడా ఈ వారం జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు ఇరానియన్ వర్గాలను ఉటంకిస్తూ గతంలో కథనాలు వచ్చాయి. భారత్ ఈ ఏడాది జనవరి 1న అధికారికంగా బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. బ్రెజిల్ నుంచి ఈ బాధ్యతలు భారత్ తీసుకుంది. 2012, 2016, 2021 తర్వాత భారత్ బ్రిక్స్‌కు నాలుగోసారి అధ్యక్షత వహిస్తోంది.రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారని రష్యా విదేశాంగ శాఖ ఏప్రిల్ 29న తెలిపింది. మే 14-15 తేదీల్లో లావ్రోవ్ భారత్‌లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ఎక్స్‌లో వెల్లడించింది. టాస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ పాలన బలోపేతం వంటి అవకాశాలపై చర్చలకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు.“మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే పూర్తి స్థాయి బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ హాజరవుతారు” అని ఆమె చెప్పారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం, ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ పాలన బలోపేత అవకాశాలపై చర్చలకు కీలక వేదికగా నిలుస్తుందని టాస్, జఖరోవాను ఉటంకిస్తూ తెలిపింది.ముఖ్యంగా ప్రపంచ మెజారిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. “ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు సన్నాహకాలలో వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది” అని ఆమె అన్నారు.ఇదిలా ఉండగా, బ్రిక్స్ మధ్యప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికా ఉప విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల సమావేశం ఏప్రిల్ 23-24 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. బ్రిక్స్‌లో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ, ప్రాంతీయ ప్రాధాన్య అంశాలు, రాజకీయ-ఆర్థిక పాలన అంశాలపై సంప్రదింపులు, సహకారానికి ఇది కీలక వేదికగా ఉంది. 2026 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్ “బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ” అనే అంశాన్ని మార్గదర్శకంగా తీసుకుంది. 2025లో రియో డీ జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రస్తావించిన ప్రజాకేంద్ర, మానవతా ప్రథమ విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.భారత్‌కు ఇది ఎందుకు కీలకం?ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష దేశంగా ఉన్న భారత్.. సభ్య దేశాల భిన్న అభిప్రాయాల మధ్య సమతుల్యత పాటించే అవకాశం ఉంది. సున్నితమైన భౌగోళిక-రాజకీయ అంశాలపై విభేదాలు తలెత్తకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా అంశాలపై సభ్య దేశాల మధ్య గతంలో ఏకాభిప్రాయం కుదరని సందర్భాలు ఉన్నాయి. ఇరాన్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా గల్ఫ్ భాగస్వామ్య దేశాలతో కూడా భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. దీంతో బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం సాధించడం దౌత్యపరంగా సున్నిత అంశంగా మారింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబీ పర్యటనకు వెళ్లే అవకాశముంది. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా అంతరాయాలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో అరాఘ్చీ పర్యటన సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఇరాన్, భారత్ నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌తో కూడా ఇరాన్ పలుమార్లు చర్చలు జరిపింది. గల్ఫ్ ఉద్రిక్తతల్లో ఏ సైనిక కూటమికీ మద్దతుగా నిలవకుండా భారత్ దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రాంతీయ స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రతపై భారత్ ప్రధాన దృష్టి పెట్టింది. -
ఏం ఆటలా?.. 47 ఏళ్లుగా అదే మోసమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఇరాన్ అమెరికాతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇరు దేశాలు తమ ప్రతిపాదనలను పరస్పరం తిరస్కరించుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం కావొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజాగా చేసిన మెసేజ్ సారాంశం ఇలా ఉంది.. ఇరాన్ 47 సంవత్సరాలుగా అమెరికాతో పాటు ప్రపంచాన్ని మోసం చేస్తోంది. వారు ఎప్పటికప్పుడు ఆటలాడుతూ ఆలస్యం(మూడుసార్లు నొక్కి.). చేస్తున్నారు’’ అని న్యూక్లియర్ డీల్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఒబామా చారిత్రక తప్పిదం చేశారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఇరాన్‌పై “సడలింపు” చూపారని.. ఆయన హయాంలో అమెరికా నుంచి ఇరాన్‌కు విమానాల్లో పెద్ద మొత్తంలో(400 మిలియన్ డాలర్లు) నగదు వెళ్లిందని ఆరోపించారు. ఒబామా కుదిర్చిన 2015 అణు ఒప్పందం ‘‘అత్యంత చెత్త ఒప్పందం’’. దాని వల్లే మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్‌కు అనవరసమైన ప్రాధాన్యం పెరిగింది. ఒబామా ప్రభుత్వం ఈ నగదు పంపిణీని 1979లో విఫలమైన ఆయుధ ఒప్పందం కారణంగా చెల్లించాల్సిన డబ్బు అని చెప్పింది. కానీ, అది ఎంతమాత్రం కాదు. ఈ చర్యతో ఒబామా ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన పాలనను బలపరిచారు’’ అని మండిపడ్డారు. గతంలో నేను ఈ ఒప్పందాన్ని రద్దు చేశానని.. లేకపోతే ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధం తయారు చేసి ఇజ్రాయెల్‌పై వాడేదని అన్నారు. అలాగే, తన బలమైన నాయకత్వంలోనే జనరల్ ఖాసీం సోలేమానీని హతమార్చానని.. ఆ చర్యను “అత్యవసరమైన రక్షణ చర్య”గా ప్రకటించారు. (ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని క్వాడ్స్ ఫోర్స్ కమాండర్. 2020 జనవరి 2న ఇరాక్ బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించాడు. అప్పటి ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీకి ఖాసీం సోలేమానీ కుడి భుజంగా ఉండేవాడు.)ఇరాన్ నుంచి ఒక లేఖ రావొచ్చు, చూద్దాం ఎలా ఉంటుందో అని రెండ్రోజుల కిందటే ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే రోజు ఇరాన్ తన ప్రతిస్పందనను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు అందజేసిందని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. అయితే.. ఇరాన్ తాజా ప్రతిపాదనలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, అందులో ఏ అంశాలు అంగీకరించలేనివిగా ఉన్నాయో మాత్రం ఆయన బయటకు చెప్పడం లేదు. మరోవైపు.. ఇరాన్ మాత్రం దిగి రామంటోంది. అమెరికా చెప్పినట్లు ఒప్పందం చేసుకోవడం అంటే.. లొంగిపోవడం కిందకే వస్తోందని అంటోంది. ఇరాన్ డిమాండ్లు:అమెరికా నుంచి యుద్ధ పరిహారం (war reparations) హర్ముజ్ జలసంధిపై పూర్తి ఇరాన్ సార్వభౌమాధికారంఇరాన్పై ఆంక్షల ఎత్తివేతఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల, వీటికి అదనంగా..అమెరికా నావికాదళ ఆంక్షలు తొలగించాలిభవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలిఇరాన్ చమురు అమ్మకాలపై నిషేధం తొలగించాలిఅయితే ఈ డిమాండ్లు, యుద్ధం మొత్తం కాలంలో అమెరికా ప్రకటించిన ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. కమ్యూనికేషన్ లోపం వల్లే.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం ఎంత పేలవంగా ఉందో అమెరికా మాటలతో బయటపడింది. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఎన్బీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రధాన లక్ష్యం హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా నావిగేషన్.. అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ. ఇరాన్ నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. ప్రభుత్వంలో వర్గాల ఒత్తిడి, మధ్యవర్తితత్వం వహిస్తున్న కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఆలస్యం జరుగుతోంది’’ అని చెప్పారు.ఒకవైపు పాక్‌తో పాటు ఈజిప్ట్ కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ ప్రతిస్పందన.. ఈ ఘర్షణను మరింత క్లిష్టం చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో పాటు.. పర్షియన్ గల్ఫ్ రీజియన్‌లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా దాడులతో లెబనాన్ వణికిపోతోంది. దీంతో దౌత్య ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అదే సమయంలో.. ఇంధన ధరలు పెరుగుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
చమురును సముద్రంలో పారబోస్తున్న ఇరాన్.. కారణం ఏంటంటే..?
-
అమెరికా ప్రతిపాదనలపై చర్చకు ఓకే
దుబాయ్/ఇస్లామాబాద్: అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్‌కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్‌కు సమాచారం పంపినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని, నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ముందుగా వీటిపైనే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. ఇవి కార్యరూపం దాల్చాకే హార్మూజ్‌ను తిరిగి తెరవడం, అణుకార్యక్రమాన్ని వదలుకోవడంపై వంటి వాటిపై చర్చలు జరపాలని ప్రభుత్వం పేర్కొందని ఇరాన్ టీవీ తెలిపింది. ఈ షరతులపై అమెరికా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్–అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఆటంకాలు కొనసాగుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడులతో ఖతార్ తీరంలోని ఓ సరుకు నౌకకు నిప్పంటుకోగా, కొన్ని డ్రోన్లు కువైట్ గగనతలంలోకి చొరబడ్డాయి. ఆదివారం ఉదయం అబుధాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఫలితంగా చెలరేగిన మంటలను వెంటనే ఆర్పేశామని ఖతార్ తెలిపింది. ఆదివారం వేకువజామున తమ గగనతలంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని డ్రోన్లను మధ్యలోనే పేల్చివేసినట్లు కువైట్ వెల్లడించింది. దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఉద్రిక్తత అంటూ వ్యాఖ్యానించింది. తాము గుర్తు తెలియని డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇవి ఇరాన్ ప్రయోగించినవేనంటూ ఆరోపించింది. గత వారం హార్ముజ్ జలసంధిలో లంగరు వేసి ఉన్న తమ నౌకపై వెంటవెంటనే రెండు డ్రోన్‌దాడులు జరిగినట్లు దక్షిణ కొరియా నౌక ఆదివారం తెలిపింది. దాడితో పేలుడు, మంటలు చెలరేగాయని వెల్లడించింది. -
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శత్రుదేశాలు దాడులకు తెగబడితే రెట్టింపు ప్రతి దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు.ఆదివారం మొజ్తాబా ఖమేనీతో ఇరాన్ ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ చీఫ్ కమాండర్ అలీ అబ్దుల్లాహి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారిరువురి మధ్య పశ్చిమాసియా యుద్ధం, కాల్పుల విరమణ, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ప్రతి దాడులు చేయాలని, శత్రువులను దృఢంగా ఎదుర్కొనేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఫార్స్ న్యూస్ తెలిపింది. ఇరాన్ సాయుధ దళాలు అమెరికా-ఇజ్రాయెల్ ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని కమాండర్ అబ్దుల్లాహి పేర్కొన్నారు. శత్రువు ఏ తప్పు చేసినా ఇరాన్ ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది అని ఆయన హెచ్చరించినట్లు ఫార్స్ న్యూస్ హైలెట్ చేసింది. తాజా ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ సైన్యం, ఐఆర్జీసీ తరచూ అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి వంటి కీలక చమురు మార్గాల భద్రతపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
శత్రువు గుండెల్లో నిద్ర పోవడం అంటే ఇదేనేమో..!
-
తీవ్ర గాయాలతో అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అదృశ్యం సంచలనంగా మారింది. గత ఫిబ్రవరిలో టెహ్రాన్‌పై జరిగిన భారీ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రస్తుతం ఓ రహస్య ప్రాంతం నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబు పేల్చాయి. బహిరంగంగా ఎక్కడా కనిపించనప్పటికీ, తెరవెనుక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయన యుద్ధాన్ని, శాంతి చర్చలను శాసిస్తున్నారనే వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.తీవ్ర గాయాలతో ప్రాణాపాయం?తండ్రి అలీ ఖమేనీ మరణానంతరం సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, ఫిబ్రవరి 28 దాడుల తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, చికిత్సలు అందుకుంటున్న స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇరాన్ అధికారులు ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని, కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వాదిస్తున్నారు. ఈ విరుద్ధ ప్రకటనలతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎడతెగని మిస్టరీ కొనసాగుతోంది.ట్రాకింగ్ భయం.. టెక్నాలజీకి దూరంశత్రువుల కళ్లుగప్పేందుకు ఖమేనీ అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఆయన పూర్తిగా పక్కనబెట్టారు. తన ఉనికిని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు, కేవలం అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారా, భౌతిక సందేశాల రూపంలోనే ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా తదితర దేశాలతో నడుస్తున్న కాల్పుల విరమణ చర్చల సమయంలో, శత్రువులు తన జాడను ట్రాక్ చేయకుండా ఆయన ఈ పాతకాలపు పద్ధతిని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.అసలు ఇరాన్‌ను శాసిస్తున్నది ఎవరు?ఖమేనీ కనుమరుగైన నేపథ్యంలో, ఇరాన్ అధికార యంత్రాంగంలో చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం లీడర్ కార్యాలయం పేరుకే పెద్దదైనా, క్షేత్రస్థాయిలో పాలన, కార్యకలాపాల నియంత్రణ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లు, ఇతర రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దౌత్య చర్చల వంటి వ్యవహారాల్లో మొజ్తబా ఖమేనీ నిర్ణయాలే అంతిమమని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన పేరును సైనికాధికారులు కేవలం ప్రతీకాత్మకంగా వాడుకుంటున్నారని అనుమానిస్తున్నారు. రెండు నెలలు గడుస్తున్నా ఖమేనీ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన రాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.ఇది కూడా చదవండి: ‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది! -
కాల్పుల విరమణపై సందేహాలు!
దుబాయ్: అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా శుక్రవారం దాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా తీరుపై ఇరాన్ భగ్గుమంటోంది. ప్రతిదాడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న రెండు ఇరాన్ ట్యాంకర్లపై తమ బలగాలు దాడి చేశాయని అమెరికా సైన్యం తెలిపింది. అంతకుముందు తమ నౌకలపై జరిగిన దాడులను తిప్పికొట్టామని, జలసంధిలోని ఇరాన్ సైనిక స్థావరాలపై దాడి చేశామని ప్రకటించింది. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 41 మందిని అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ శనివారం ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడం, హార్మూజ్ జలసంధిని నౌకాయానానికి వీలుగా తిరిగి తెరవడం, వివాదాస్పద అణు కార్యక్రమాన్ని టెహ్రాన్ ఉపసంహరించుకోవడంపై ఒప్పందం కోసం అమెరికా చేసిన తాజా ప్రతిపాదనపై ఇరాన్ఇంకా స్పందించలేదు. కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెబుతోంది. అణు కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌పై బాంబు దాడులను పునఃప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేయడం గమనార్హం. మరోవైపు అమెరికా మద్దతుగా నిలుస్తున్న బహ్రెయిన్‌కు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికాకు వత్తాసు పలకడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. హార్మూజ్ జలసంధి ఒక కీలకమైన జీవనాధారం. దానిని మీ అంతట మీరే శాశ్వతంగా మూసివేసే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దు’’అంటూ ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిషన్ అధిపతి ఇబ్రహీం అజీజీ తేల్చిచెప్పారు. పశ్చిమాసియాలో ఘర్షణలు ముగిసిన తర్వాత హార్మూజ్‌లో తమ నౌకలను రక్షించుకోవడానికి యుద్ధనౌకను పంపించనున్నట్లు బ్రిటన్ రక్షణశాఖ ప్రకటించింది. -
హర్ముజ్ లో టెన్షన్ టెన్షన్.. నిలిచిపోయిన 1500 ఓడలు..
-
గల్ఫ్ లో మళ్లీ యుద్ధం.. అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి
-
ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ యుద్ధంలో మరో ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా పర్షియన్ గల్ఫ్ వేదికగా మరోసారి ఇరు దేశాలకు దాడులు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన పేరిట పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ చర్చలకు దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. హర్ముజ్‌లో యూఎస్ యుద్ధనౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. జలసంధిలో గస్తీ కాస్తున్న ట్రక్ట్సన్, మాసన్ లక్ష్యంగా దాడులు చేసింది. అమెరికా రక్షణ వ్యవస్థ ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే కాల్పుల విరమణ కొనసాగుతోందని.. జరిగింది చిన్నస్థాయి దాడులని ఆయన అన్నారు. అయితే ఆ వెంటనే. ఇరాన్‌లోని క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై అమెరికా దాడికి దిగింది. మరోవైపు.. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న ఇరాన్ ట్యాంకర్‌పై అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. క్విష్మ్, బందర్ అబ్బాస్ నగరాల్లోనూ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై క్షిపణులు విరుచుకుపడడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి!. ఈ దాడుల వెనుక యూఏఈ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఅమెరికా తుంగలో తొక్కిందని విమర్శిస్తూనే.. ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. దీంతో శాంతి చర్చలకు విఘాతం కలిగే అకాశం కనిపిస్తోంది.ఇరాన్‌కు సాలిడ్ వార్నింగ్!ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ వెంటనే శాంతి ఒప్పందానికి రావాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ సాధారణ దేశం కాదు.. అది ఉన్మాదుల చేతుల్లో ఉంది. గాలిలోనే వాళ్ల డ్రోన్లు దగ్గం అయ్యాయి. సీతాకోకచిలుకల్లా సముద్రంలో రాలిపోయాయి. శాంతి ఒప్పందంపై త్వరగా సంతకం చేయాలి. లేదంటే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది’’ అని అన్నారు.ట్రంప్ తీరు బాగోలేదు!ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాక్‌తో కలిసి సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్ముజ్ జలసంధిలో నౌకల కోసం చేపట్టిన ఎస్కార్ట్ ఆపరేషన్‌ను ట్రంప్ 24 గంటలు గడవక ముందే ఆపేశారు. ఆయన ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుండడంపై సౌదీ అరేబియా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు గగనతల అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. -
త్వరలోనే అందుబాటులోకి హార్మూజ్
టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే తెరుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా, ఇరాన్‌లు మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సమాచారం. హార్ముజ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆస్కారం ఉంది. దాంతో జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుంది. అక్కడ చిక్కుకుపోయిన చమురు నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఫిబ్రవరి 28న దాడులు, ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత హార్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది. కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అనంతరం అమెరికా కూడా జలసంధిలో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హార్మూజ్ మూసివేతతో చమురు రవాణా స్తంభించిపోయింది. చమురు, ఎల్పీజీ ధరలు పెరిగిపోయాయ. ప్రధానంగా ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హార్మూజ్‌లో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన నౌకలను విడిపించేందుకు అమెరికా సైన్యం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించింది. కానీ, ఇరాన్‌తో చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లభించడంతో ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని ఆయన స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో రెండు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి త్వరలోనే తెరపడవచ్చన్న సంకేతాలు రావడం గురువారం అంతర్జాతీయ మార్కెట్లను ఉత్తేజపరిచింది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందం అతి త్వరలోనే కుదురుతుందని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహీర్ అంద్రాబీ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీలో పోప్ లియో–14తో సమావేశయ్యారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని సాధించడానికి సాగుతున్న ప్రయత్నాల గురించి చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పోప్ లియో–14పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, వాటికన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్కో రూబియో ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పారోలిన్తోనూ రూబియో భేటీ అయ్యారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. -
యుద్ధంలో అమెరికాకు తీవ్ర నష్టం
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దానికంటే తీవ్రమైన నష్టమే వాటిల్లింది. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, వాయు, నావిక దళాల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగింది. ఇరాన్ నుంచి ఇంతటి వినాశకరమైన ప్రతిస్పందనను ట్రంప్ బృందం ఊహించలేదు. ట్రంప్ ప్రభుత్వం గతంలో నివేదించిన దానికంటే అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చాలా ఎక్కువ విధ్వంసం సృష్టించిందని తేలింది. 15 స్థావరాల్లోని 228 నిర్మాణాలు.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ విడుదల చేసిన 128 అధిక–రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ‘ది వాషింగ్టన్ పోస్ట్’నష్ట తీవ్రతను విశ్లేషించింది. మధ్యప్రాచ్య ఉపగ్రహ చిత్రాలను అందించే రెండు వాణిజ్య సంస్థలైన వాంటోర్, ప్లానెట్ చిత్రాలను విడుదల చేయడాన్ని నిలిపేయాలని ట్రంప్ కోరడం వల్ల అమెరికాకు జరిగిన నష్ట తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం ఇప్పటివరకు కష్టంగా ఉందని నివేదించింది. గల్ఫ్‌లోని 15 అమెరికా సైనిక స్థావరాల్లో 228 నిర్మాణాలు, పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. సాంకేతికంగా ఉన్నతమైన అమెరికాకు ఇది భారీ నష్టం. హ్యాంగర్లు, బ్యారక్‌లు, ఇంధన డిపోలు, విమానాలు, రాడార్, కమ్యూనికేషన్లు, వాయు రక్షణ పరికరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులతో కొన్ని సైనిక స్థావరాలు నిరుపయోగంగా మారాయి. బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలో, కువైట్‌లోని మూడు స్థావరాలైన అలీ అల్–సలేం, అమెరికా సైన్యం ప్రాంతీయ ప్రధాన కార్యాలయం క్యాంప్ అరిఫ్జాన్, క్యాంప్ బ్యూరింగ్లలో అత్యధిక నష్టం జరిగింది. ఇందులో ఖరీదైన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఒక విద్యుత్ కేంద్రం, ఐదు ఇంధన నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖతార్‌లోని అల్–ఉదైద్ వైమానిక స్థావరం వద్ద ఉన్న ఉపగ్రహ సమాచార కేంద్రం, జోర్డాన్, యూఏఈలలోని థాడ్ రాడార్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న ఈ–3 సెంటినల్ కమాండ్ అండ్ కంట్రోల్ విమానం ధ్వంసమైంది. ఒక ఇంధన ట్యాంకర్ కూడా కోల్పోయింది. ఫ్రెండ్లీ ఫైర్‌లోనూ భారీ నష్టం.. యుద్ధం, గాలింపు చర్యలు, ఫ్రెండ్లీ ఫైర్ సమయంలో అమెరికా కోల్పోయిన 40 డ్రోన్లు, యుద్ధ విమానాలనూ కోల్పోయిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్కొక్కటి 30 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే 24 ఎమ్క్యూ–9 రీపర్ డ్రోన్లు, 200 నుంచి 240 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే అత్యంత విలువైన ఎమ్క్యూ–4సీ ట్రైటాన్ ఉన్నాయి. నాలుగు ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగిల్స్, ఒక ఏ–10 వార్హాగ్ కూడా కోల్పోయింది. ఒక ఎఫ్–35ను కూడా కూల్చి వేశామని ఇరాన్ పేర్కొంది. ఫిబ్రవరి 28న ఈ ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఏడుగురు అమెరికా సైనికులు మరణించారు. సుమారు 400 మంది సైనికులు గాయపడ్డారు. మరణించిన వారిలో ఆరుగురు కువైట్‌లో, ఒకరు సౌదీ అరేబియాలో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అత్యంత కచ్చితత్వంతో దాడులు 200కు పైగా కట్టడాలపై ఇరాన్ అత్యంత కచ్చితమైన దాడులు జరిపింది. కచ్చితత్వంతో నడిచే క్షిపణులను సమర్థవంతంగా ఉపయోగించారు. భారీ ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో బ్యారక్‌లు, హ్యాంగర్లు, గిడ్డంగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా దళాలు స్థావరాలను విడిచిపెట్టిన తర్వాత కొన్ని దాడులు జరిగి ఉండవచ్చు. జిమ్‌లు, ఫుడ్ హాల్లు, వసతి గృహాల వంటి సున్నితమైన లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయి. ‘ఇరాన్ దాడులు చాలా కచ్చితమైనవి. గురి తప్పిందని సూచించే యాదృచ్ఛిక గుంతలు ఏవీ లేవు’అని రిటైర్డ్ మెరైన్ కార్ప్స్ కల్నల్ మార్క్ కాన్సియన్’తెలిపారు. చవకైన షాహెద్ డ్రోన్లతో పోరాడటానికి విలువైన ఇంటర్సెప్టర్లను ఉపయోగించకుండా కాపాడుకోవడానికి అమెరికా ఉద్దేశపూర్వకంగా కొంత నష్టాన్ని అనుమతించి ఉండవచ్చన్నారు. 50 బిలియన్ డాలర్ల ఖర్చు.. ఈ యుద్ధానికి ఇప్పటివరకు సుమారు 50 బిలియన్ డాలర్ల ఖర్చు అయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇక, ఇరాన్ దాడి చేసిన అధునాతన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఖరీదైనవి. వాటిని భర్తీ చేయడం కష్టం. ఆ సైనిక స్థావరాలను పునర్నిర్మించడానికి, ధ్వంసమైన ఆస్తుల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి సుమారు 40 నుంచి 50 బిలియన్ డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ ఖర్చుగా సెనేట్‌కు సమర్పించిన 25 బిలియన్ డాలర్ల అంచనా కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. 2027 సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కోరింది. ఇది గత సంవత్సరం కంటే 42% ఎక్కువ. అయితే, డెమోక్రాట్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 630 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల మధ్య నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. -
ఇరాన్ ఒప్పుకుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఎట్టకేలకు ఇరాన్.. ట్రంప్ డిమాండ్‌కు తలొగ్గినట్టు ఆయన వెల్లడించారు. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ అంగీకరించినట్టు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. దీంతో, ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకునే అవకాశముంది.ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వైట్‌హౌస్ వేదికగా మాట్లాడుతూ..‘ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం మంచిది కాదు. ఇరాన్ అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలకు ముప్పు. న్యూక్లియర్ వెపన్స్ ఉండటం ఇరాన్‌కు కూడా మంచిది కాదు. మా డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించింది. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ ఓకే చెప్పింది. ఇరాన్ అంగీకారంతో చర్చలు తుది దశకు చేరుకునట్టే’ అని వ్యాఖ్యలు చేశారు. 🚨 DONALD TRUMP CONFIRMS IRAN HAS AGREED TO NO NUCLEAR WEAPONSThis is HUGE! 🇺🇸"Iran cannot have a nuclear weapon, and they won't. And they've agreed to that, among other things, yes!" 🔥 pic.twitter.com/3kgf8pkBeS— Eric Daugherty (@EricLDaugh) May 6, 2026ట్రంప్ వార్నింగ్.. ఇదిలా ఉండగా.. అంతకుముందే ఇరాన్‌ను ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో, అత్యంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మూజ్‌లో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరిస్తుందని వ్యాఖ్యనించారు.ఇరాన్ కొత్త ప్లాన్.. మరోవైపు, హార్మూజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. "సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్" పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఇ-మెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలి. ఫిబ్రవరి 28న ఇరాన్ భూభాగంపై జరిగిన దాడుల తర్వాత ఇజ్రాయెల్, అమెరికాలతో సంబంధం ఉన్న నౌకలను సురక్షితంగా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. దీనిని మరింత చట్టబద్ధం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఒక ముసాయిదాను కూడా పరిశీలిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు, శత్రువులు కాని ఇతర దేశాల నౌకల ప్రయాణానికి 'టోల్ సిస్టమ్' తీసుకురావాలని భావిస్తోంది. -
మళ్లీ ట్రంప్ బెదిరింపులు
వాషింగ్టన్: ఇరాన్‌పై బాంబులేసి యుద్ధాగ్ని జ్వాలల్ని రాజేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. ‘‘గతంలో మేం పెట్టిన షరతులకు తలొగ్గి ఇరాన్ ఆచరణసాధ్యమైన శాంతి ఒప్పంద ప్రతిపాదనలతో ముందుకొస్తోందని సమాచారమొచ్చింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులకు మేం ఆరంభించిన ‘ఎపిక్ ఫ్యూరీ’సైనిక చర్య దాదాపు ముగింపుకొచ్చింది. అత్యంత ప్రభావవంతమైన మా దిగ్బంధం ధాటికి ఇప్పుడు హార్మూజ్ ఇరాన్ సహా అందరికీ అందబాటులోకి రాబోతోంది. ఈ దిశలో ఇరాన్గనక మళ్లీ తోకజాడిస్తే బాంబుల వర్షం కురవడం ఖాయం. గతంలో ఎన్నడూలేనంతటి భీకరంగా బాంబులేస్తాం’’అని ట్రంప్ తన సోషల్‌మీడియా మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. హార్మూజ్‌ను వీలైనంత త్వరగా తెరవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీకి బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సూచించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటనచేయడం గమనార్హం. మరోవైపు ఒక పేజీకి సరిపడా షరతులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్, అమెరికాలు ఓవైపు ముందడుగేస్తున్నాయన్న వార్తలు వెలువడ్డాయి. మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే విదేశీ చమురునౌకలకు రక్షణగా తమ యుద్ధనౌకలను సాయంగా పంపే ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. -
కామికేజ్ డాల్ఫిన్లతో దాడులకు టెహ్రాన్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరు దేశాలు సీజ్ఫైర్ అమలు చేస్తున్న యుద్దం విషయంలో మాత్రం స్పష్టత రావట్లేదు. అయితే ఇటీవల ఓ కొత్త విషయం పలువురిని ఇబ్బందులకు గురి చేసింది. అమెరికాపై దాడులకు ఇరాన్ కామికేజ్ డాల్ఫిన్లను ఉపయోగించే అవకాశం ఉందని కథనాల వచ్చాయి. కాగా దీనిపై తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్స్ హెగ్సెత్ స్పందించారు.ప్రస్తుతం హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో ఏం చేయాలో గుండా రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా సైతం ఇరాన్ నౌకశ్రయాలను బ్లాకేడ్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల వాల్‌స్ట్రీట్ జనరల్‌లో ప్రచురితమైన కథనం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.ఈ విషయమై అమెరికా రక్షణ శాఖ మంత్రిని సంప్రదించగా ఈ విధంగా మాట్లాడారు. "ఇరాన్ తన కార్యకలాపాల కోసం 'కామికేజ్ డాల్ఫిన్లను వాడడం పూర్తిగా అవాస్తవం ఇరాన్ వద్ద అటువంటి డాల్ఫిన్ ఆపరేషన్లు ఏవీ లేవని తాను ఖచ్చితంగా చెప్పగలను. అయితే అమెరికా వద్ద అవి ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం నేను అవును లేదా కాదు అని సమాధానం చెప్పను" అని అన్నారు.ఇరాన్ వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయాఇరాన్ వద్ద ప్రస్తుతం కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే 2000 సంవత్సరంలో ఇరాన్ రష్యా నుండి కొన్ని శిక్షణ పొందిన డాల్ఫిన్లను కొనుగోలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కాని అవి ఇప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉంటాయని, కాబట్టి వాటిని ప్రస్తుత యుద్ధ అవసరాలకు వాడటం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా అమెరికా మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోంది. 'యుఎస్ మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్' ద్వారా వీటిని మైన్లను గుర్తించడానికి, సముద్రంలో వస్తువులను వెతకడానికి ఉపయోగిస్తారు.అమెరికా శిక్షణ ఇచ్చే డాల్ఫిన్లు మైన్లను గుర్తించడానికే పరిమితమని అవి బాంబులతో పాటు పేలిపోయే 'కామికేజ్' రకం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.డాల్ఫిన్ల ప్రత్యేకతసైనిక అవసరాల కోసం డాల్ఫిన్లను వాడటం కొత్తేమీ కాదు. రష్యా కూడా తన ఓడరేవుల రక్షణ కోసం వీటిని వాడుతుంటుంది. సైన్స్ ప్రకారం, డాల్ఫిన్ల వద్ద ఉన్న సోనార్ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది. ఎంత చీకటిగా ఉన్నా లేదా బురద నీటిలోనైనా ఇవి నీటి అడుగున ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలవు. మానవ నిర్మిత డ్రోన్ల కంటే ఇవే వేగంగా మైన్లను పసిగట్టగలవని అమెరికా నేవీ వెబ్సైట్ పేర్కొంది.కామికేజ్ అనే పేరుసాధారణంగా, ఆత్మహత్యాయుద్ధానికి పాల్పడే వారిని (ముఖ్యంగా జపాన్ విమాన పైలట్లు) 'కామికేజ్' అని పిలుస్తారు. డాల్పిన్ల విషయానికి వస్తే, వాటి శరీరానికి పేలుడు పదార్థాలను అమర్చి, శత్రువుల నౌకలను లేదా సబ్మెరైన్లను ఢీకొట్టి పేల్చేలా శిక్షణ ఇవ్వడాన్నే "కామికేజ్ డాల్పిన్లు" అంటారు.అయితే, అధికారికంగా ఏ దేశం కూడా తాము ఇలాంటి "ఆత్మహత్య" దళాలను వాడుతున్నామని ఒప్పుకోలేదు. కానీ, అమెరికా మరియు రష్యా వంటి దేశాలు "మెరైన్ మామల్ ప్రోగ్రామ్స్" ద్వారా ప్రస్తుతం డాల్పిన్లకు సైనిక శిక్షణ ఇస్తున్నాయి. -
ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ నిలిపేస్తున్నాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌లోని హార్మూజ్ జలసంధికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో దౌత్యపరమైన ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తున్నందున జలసంధి గుండా నౌకల రాకపోకలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్‌ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్‌పై ఉన్న బ్లాకేడ్ (నౌకాశ్రయాల నిర్బంధం) మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి కనిపిస్తోంది. అందుకే హార్మూజ్‌లో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆపరేషన్‌ను నిలిపివేయడానికి మేం పరస్పరం అంగీకరించాం. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సంపూర్ణ, తుది ఒప్పందం దిశగా వెళ్తున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముంది. అయితే, సముద్ర కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగుతుంది. ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న పోరాటం సైనిక విజయమే. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముందని పేర్కొన్నారు.President Trump posts on TruthSocial: Based on the request of Pakistan and other Countries, the tremendous Military Success that we have had during the Campaign against the Country of Iran and, additionally, the fact that Great Progress has been made toward a Complete and Final… pic.twitter.com/BF6mZ4AtCc— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 6, 2026కాగా, ఈ చర్యల ద్వారా అమెరికా ఒకవైపు సైనిక ఒత్తిడి కొనసాగిస్తూ, మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తోంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గం. ముఖ్యంగా చమురు రవాణాలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.కీలక పరిణామాలు.. ఇక, ఇరాన్‌తో అమెరికా చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతోంది. అయితే అమెరికా ప్రతిపాదనలపై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అణు కార్యక్రమం కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాల దిశగా కదులుతోందని అమెరికా ఆరోపిస్తుండగా, ఇరాన్ మాత్రం తన కార్యక్రమం శాంతియుతమని చెబుతోంది. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చూస్తే హార్మూజ్‌లో ఉద్రిక్తతలు తగ్గకపోయినా, చర్చల ద్వారా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌కు ఇచ్చిన తాత్కాలిక విరామం ఆ దిశలో కీలక మలుపుగా మారే అవకాశముంది. -
'ప్రత్యామ్నాయం' వైపు పలు దేశాలు
హార్మూజ్ దిగ్బంధనాల అడకత్తెరలో చిక్కుకుని ప్రపంచం విలవిలలాడుతున్న వేళ, దక్షిణ అమెరికాలోని కొలంబియా అనే చిన్న దేశంలో గమనార్హమైన సమావేశాలు జరిగాయి. ఏప్రిల్ 24 నుంచి 29 వరకు సుమారు 60 దేశాల భాగస్వామ్యంతో జరిగిన ఆ సమావేశాల అజెండా – పెట్రోల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయాల వైపు మళ్లటం ఎట్లాగన్నది. ఇది ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంవల్ల ఏర్పడిన ఒత్తిడికి పర్యవసానం. పర్యావరణ అంశాలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన 30 సంవత్సరాలకు పైగా సదస్సులు జరుగుతుండటం, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపు గురించి తీర్మానాలు, ఒప్పందాల మాట తెలి సిందే. కానీ ఇపుడు మొదటిసారిగా ఐక్యరాజ్యసమితితో నిమిత్తం లేకుండా, అమెరికాను కనీసం ఆహ్వానించకుండా ఈ సమావేశాలు జరగటం విశేషం. పెద్ద దేశాలకు లేదు ఆహ్వానంఅమెరికాయే కాదు. రష్యా, చైనా, ఇండియా, గల్ఫ్ దేశాల వంటివి కూడా అందులో పాల్గొనలేదు. కానీ, సమావేశాలకు సహనిర్వాహకురాలైన నెదర్లాండ్స్‌తో పాటు పలు యూరోపియన్ దేశాలు వెళ్లాయి. ఇందులో అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ను న్నాయి. అమెరికాను ఆహ్వానించకపోవటం ఎందువల్ల? దీనికి నిర్వాహకులు చెప్పిన సమాధానం, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించటం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన ఎన్నో సమావేశాలు జరిగినా ఆ తీర్మానాలను అమెరికా వీటో చేస్తూ వస్తున్నది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అయితే అసలు శిలాజ ఇంధనాల వినియోగం సమస్యే కాదంటూ కొట్టివేసి ప్యారిస్ ఒప్పందం నుంచి నిష్క్రమించారు. తక్కిన పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలావరకు ఇటువంటి ఇంధనాలతోనే ముడిబడి ఉన్నాయి. వారు ప్రత్యామ్నాయాల కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా, చైనాలో తప్ప ఇతరచోట్ల మందకొడిగానే సాగుతున్నాయి.ఈ పరిస్థితుల మధ్య మిగిలిన దేశాలు శిలాజ ఇంధనాల పరిధి నుంచి వీలైనంత వేగంగా బయట పడటం తప్పనిసరి అవుతున్నది. ఇదెంత అత్యవసరమో ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలో ఒకసారి తెలిసి రాగా, ఇపుడు ఇరాన్ యుద్ధంవల్ల మరింత తీవ్ర రూపంలో అర్థమవుతున్నది. చమురును, గ్యాస్‌ను ఉత్పత్తి చేసే దేశాలు, వాటి వ్యాపారాన్ని నియంత్రించే కంపెనీలు గల రాజ్యాలు, వాటి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు మొత్తం శిలాజ ఇంధన రంగం బందీ అయిపోయింది. ఇంధన ఉత్పత్తులు, ధరల నియంత్రణను కొందరు తరచు ఆయుధంగా ఉపయోగించుకున్నారు. అటువంటి ఇంధన వనరులు గల ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకునేందుకు రాజకీయంగా, సైనికంగా అనేకం చేశారు. ఈ స్థితి ఇప్పుడు ఇరాన్ యుద్ధ సందర్భంగా పరాకాష్ఠకు చేరింది. ఇంత క్లిష్ట స్థితి చరిత్రలోనే ఎప్పుడూ లేదన్నది నిపుణుల మాట.యుద్ధంతో పెరిగిన ఒత్తిడిఈ ప్రభావాలు చిన్న దేశాలపై సరేసరి కాగా అభివృద్ధి చెందిన యూరప్‌పై కూడా పడుతున్నాయి. అందువల్లనే కొలంబియా సమావేశాలకు నెదర్లాండ్స్ సహ నిర్వాహకురాలు కాగా, వచ్చే సంవత్సరం పసిఫిక్ ద్వీప దేశమైన తువాలూ సమావేశాలకు ఐర్లండ్ సహనిర్వాహకురాలు కావాలని నిర్ణయించారు. పర్యావరణ మార్పులతో సముద్ర జలాల స్థాయి పెరిగి 2100 నాటికి తువాలూ దేశం 90 శాతం మునుగుతుందన్నది అంచనా. కొలంబియా సమా వేశాలకు పలు యూరోపియన్ దేశాలు వెళ్లటాన్ని బట్టి, ఇరాన్ యుద్ధంతో తలెత్తిన శిలాజ ఇంధన సమస్యలు వారికి కూడా ఎంత ఇబ్బందికరంగా మారాయో గ్రహించవచ్చు. యూరోపియన్ యూనియన్ దేశాలు బొగ్గు, చమురు, గ్యాస్ వినియోగాలను 2050 నాటికి దశల వారీగా నిలిపి వేయాలని నిర్ణయించాయి కూడా.కొలంబియాలో జరిగిన నిర్ణయాలు అన్నీ శిలాజ ఇంధన ఉత్పత్తి దేశాలూ, కంపెనీలూ, వాటిని నియంత్రించే శక్తులతో ప్రమేయం ఉండని విధంగా ఇతర ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లాలని. అవి, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, అణు విద్యుత్తు, ఎలక్ట్రికల్, బ్యాటరీ రంగాలు, జల విద్యుత్తు, సముద్ర కెరటాల విద్యుత్తు వంటివి. ఇవి శిలాజ ఇంధన రంగం నుంచి విముక్తం చేయటంతోపాటు ఆర్థిక స్వాతంత్య్రాన్నిచ్చి పర్యావరణ సమస్యల నుంచి పరిష్కారాలను చూపుతాయి. వీటన్నింటి ప్రభావంతో బయటి శక్తుల ప్రభావాలు తగ్గి, దేశాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటివి సులభమవుతాయి. అమెరికా, జర్మనీలకు చెందిన మాజీ ఇంధన మంత్రులైతే, ఒక దాదాకు, గుత్తాధికారం గల శక్తికి గల ప్రభావం నుంచి బయట పడేందుకే ఈ ప్రయత్నాలు జరుగు తున్నాయని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఈ విధమైన వివిధ అంచనాలను గమనించినపుడు, శిలాజ ఇంధనాలన్న ఒక్క అంశంతో ముడిబడి ఎన్నెన్ని ఉన్నాయనే ఆశ్చర్యం కలుగుతుంది.పర్యావరణ ప్రజాస్వామ్యంకొలంబియా సమావేశాలకు అధ్యక్షత వహించిన ఆ దేశ పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్, ‘ప్రపంచ పర్యావరణ ప్రజాస్వామ్యానికి ఈ చర్చలు ఆరంభ’మని అన్నారు. మరొక విధంగా చెప్పాలంటే, ప్రపంచంలోని ‘పెట్రో నియంతృత్వాలకు, ఎలక్ట్రో ప్రజాస్వామ్యాలకు మధ్య విభజనకు ఇది నాంది అవుతున్న’ దని ప్రకటించారు. ఈ పరిణామాలను గమనించిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం అధిపతి సైమన్ స్టియెల్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై చమురు పరిశ్రమ ఆధిపత్యం కారణంగానే ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వాలు కళ్లు తెరిచాయని అన్నారు. జాతీయ భద్రతలు, ఆర్థిక సుస్థిరతలు, విధానపరమైన స్వయం నిర్ణయాలు, మౌలికమైన రీతిలో సార్వభౌమాధికారాల పరిరక్షణల కోసం కూడా ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థలు అవసరమని స్పష్టం చేశారు. కొన్ని దేశాల సైనిక సలహాదారులు సైతం ఇదే అభిప్రాయంతో ఉండటం గమనించదగ్గది.అయితే, కొలంబియాలో 60 దేశాలు చూపిన చొరవ, ఆ దిశగా ఆయా దేశాలు వచ్చే సమావేశాల నాటికి ప్రణాళికలు రూపొందించనుండటం గొప్ప విషయమేగానీ, లక్ష్యసాధనకుగల సమస్యలు తక్కువ కాదు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు కాగల ఖర్చు శిలాజ ఇంధనాల కన్న చాలా తక్కువే. ఆ పని దశల వారీగా కూడా చేయవచ్చు. అసలు సమస్య సాంకేతిక నైపుణ్యాలు, ప్రత్యామ్నాయ ఇంధన పరికరాల ఉత్పత్తికి సంబంధించినది. ఈ రెండు విషయాలలోనూ చైనా అగ్రస్థానంలో ఉంది. వారు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయగలరుగానీ, ఇతర దేశాల స్వయం సమృద్ధికి సహకరించగలరా? అదెట్లున్నా కొలంబియా చొరవ హర్షించదగ్గది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అమెరికా KC-135 స్ట్రాటోట్యాంకర్ అదృశ్యం
వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధన కేంద్రంగా పనిచేసే బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఆచూకీ గల్లంతయ్యింది.ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ విమానం ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా సంకేతాలు నిలిచిపోయాయి. అదృశ్యానికి ముందు ‘7700’ అనే అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది.విమానాన్ని పర్షియన్ గల్ఫ్ మీదుగా కొనసాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ల్యాండింగ్‌కు ముందు కొంతసేపు గాలిలో వృత్తాకారంలో తిరిగినట్లు ట్రాకింగ్ డేటా తెలిపింది. అత్యవసర పరిస్థితికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై ఇరాన్ మీడియా సంస్థ ఫార్స్ వార్తా సంస్థ ఈ ఘటనపై నివేదిక ఇచ్చింది. అయితే, అమెరికా విమానం అదృశ్యానికి ఇరాన్ ప్రమేయం ఉందని ఎలాంటి ప్రకటన చేయలేదు. -
మళ్లీ మొదలైన యుద్ధం: గ్లోబల్ మార్కెట్‌పై ఎఫెక్ట్!
గత కొన్నిరోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. శాంతి చర్చల తరువాత యుద్దానికి బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు మళ్లీ వార్ మొదలైంది. ఈ యుద్ధం మళ్లీ మొదలవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత క్షిణించే అవకాశం ఉంది. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై కూడా పడింది.యుద్ధం మొదలైతే.. దీని ఎఫెక్ట్ వెంటనే స్టాక్ మార్కెట్ల మీద చూపిస్తుంది. పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పూనుకోరు. అంతే కాకుండా.. తమ పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకోవడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఏవియేషన్, కన్స్యూమర్ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ సమయంలో ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే ఇన్వెస్టర్లు, సురక్షితమైన ఆస్తులవైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో గోల్డ్ రేటు పెరుగుతుంది. అలాగే యూఎస్ డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడటం వల్ల.. ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడతాయి.ఇది కరెన్సీ మార్కెట్లలో కూడా మార్పులకు దారితీస్తుంది. ఉదాహరణకు ఇండియన్ రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దీనివల్ల మళ్లీ ద్రవ్యోల్బణం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఒక ప్రభావం మరో ప్రభావాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తీసుకొస్తుంది.మరో ముఖ్యమైన అంశం ట్రేడ్ అండ్ రవాణా. పశ్చిమాసియాలో ఉన్న సముద్ర మార్గాలు, ముఖ్యంగా హర్ముజ్ వంటి ప్రాంతాలు యుద్ధం వల్ల ప్రమాదంలో పడతాయి. ఈ మార్గాలు ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ అంతరాయం కలిగితే, చమురు సరఫరా ఆలస్యం అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి.భారతదేశం వంటి దేశాలపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగిన చమురు ధరలు, కరెన్సీ బలహీనత, ద్రవ్యోల్బణం అన్నీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. తద్వారా ఆర్థిక వృద్ధి గాడి తప్పుతుంది.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక -
మళ్లీ మొదలైన పశ్చిమాసియా యుద్ధం!
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యూఏఈలోని పుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. త్వరలో శత్రువుల పునాదులు పెకలిస్తామని ఐఆర్జీసీ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం.గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో యుద్ధానికి దిగింది. అయితే 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను యూఏఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు.. పర్షియన్ గల్ఫ్ తీరంలోని ముసందం (Musandam) గవర్నరేట్ పరిధిలోని బుఖా ప్రాంతంలో(ఒమన్) కార్మికుల నివాస భవనం దెబ్బతింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఈయూ, సౌదీ అరేబియాలు ఖండించాయి. దాడుల నేపథ్యంలో యూఏఈ తమ విమానాలను నిలిపివేసింది.ఇటు హర్ముజ్‌లోనూ..హర్ముజ్ జలసంధిలోనూ ఇరాన్ అమెరికా రక్షణలో ఉన్న నౌకలను టార్గెట్‌గా చేసుకుని దాడులు జరిపాయి. అయితే తమ నౌకలు సేఫ్‌గానే ఉన్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దాడుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఓ వాణిజ్య నౌక మంటల్లో కాలిపోయింది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వందలాది నౌకలు హర్ముజ్‌లో నిలిచిపోయాయి. వాటిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అమెరికా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది.ట్రంప్ ఏమన్నారంటే.. ఇరాన్ తాజా దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యూఎస్ నౌకలను.. యూఎస్ రక్షణలో ఉన్న నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన వాళ్లను భూమ్మీద లేకుండా చేస్తాం హెచ్చరించారు. ఈ తరుణంలో కాల్పుల విరమణ(ceasefire) కొనసాగుతోందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. అయితే ‘‘యుద్ధం సైనికంగా ముగిసింది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.ఇరాన్ వైఖరియూఏఈపై దాడులు జరిపింది తామేనని ఇరాన్ అంగీకరించలేదు. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పందిస్తూ.. ఈ ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు సైనిక పరిష్కారం పనికి రాదు. రాజకీయ పరిష్కారం అవసరం అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్ తాజా దాడుల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో కాల్పులు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ చాలా బలహీనంగా మారడంతో ఏ క్షణాన ఏం జరగనుందో అని గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. -
హర్ముజ్‌పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు పరస్పర ప్రతిపాదనలను తోసిపుచ్చుకున్నాయి. శాంతి చర్చలంటూనే.. ఇరాన్‌ను రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ప్రకటన హర్ముజ్‌లో సరికొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్.. ట్రంప్ చేసిన తాజా ప్రకటన. హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ మేరకు ఆయన సోషల్ ట్రూత్‌లో ‘‘చిక్కుకున్న ఆ నౌకలు తటస్థమైనవి. ఈ ఉద్రిక్తతలతో వాటికి ఏ సంబంధం లేదు. ఏ తప్పు చేయకుండానే అందులో ఉన్న సిబ్బంది ఆహారం, ఇతర అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని సురక్షితంగా బయటకు తేవాల్సిన అవసరం అమెరికా బాధ్యత’’ అని ప్రకటించారు. ఏం చేస్తారంటే.. ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు ఫ్రీడమ్ సోమవారం మధ్యాహ్నాం(మిడిల్ ఈస్ట్ కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. మానవతా దృక్పథంతో ఈ ఆపరేషన్ చేపడుతున్నామని.. ప్రాంతీయ స్థిరత్వానికి, అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం.. సముద్ర మార్గంలో చిక్కుకున్న వందలాది నౌకలు, వాటిల్లోని సుమారు 20,000 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం. ఆ నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు అమెరికా సైన్యం దారి చూపుతుంది. వాటికి రక్షణగా నిలుస్తుంది. తద్వారా వాటి వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు సహాయం చేస్తుంది. సీ ఆపరేషన్‌కు ఇరాన్ సహకరిస్తుందా?హర్ముజ్ సముద్ర మార్గం ప్రపంచ చమురు రవాణాకు కీలకమైనది. రెండు నెలలుగా ఇక్కడ ఏర్పడ్డ అంతరాయం, కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై ప్రభావం పడింది. గ్లోబల్ మార్కెట్ కుదేలైంది. దీనిని ఆసరాగా చేసుకుని అమెరికాను తమ డిమాండ్లకు ఒప్పించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్ తాజా ప్రకటనకు, నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు సహకరిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఇరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల శాంతి ప్రణాళికను ట్రంప్ తిరస్కరించారు. ఆయన దానిని "అంగీకారయోగ్యం కాదు" అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో "సానుకూల చర్చలు" జరుగుతున్నాయని ట్రంప్ సూచించారు. అదే సమయంలో ప్రాజెక్టు ఫ్రీడమ్‌లో గనుక జోక్యం చేసుకుంటే కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.ఇరాన్ ఏమందంటే.. ప్రాజెక్టు ఫ్రీడమ్‌ను మానవతా చర్యగా ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఇది ముమ్మాటికీ అమెరికా వ్యూహాత్మక శక్తి ప్రదర్శనగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఈ చర్యను అసాధ్యంగా ఇరాన్ అభివర్ణిస్తోంది. హర్ముజ్ తమ ఆధీనంలో ఉందని.. ఇప్పటికే అమెరికా బ్లాకేడ్(దిగ్బంధనం) తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని.. ఇప్పుడు నౌకల తరలింపునకు అమెరికా తన సైన్యాన్ని రంగంలోకి దించితే గనుక అది కాల్పుల విరమణ ఉల్లంఘన కిందకే వస్తుందని ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి అబ్రహీం అజిజీ ఈ సముద్ర ఆపరేషన్‌పై సెటైర్లు వేశారు. హర్ముజ్ సముద్ర మార్గం అనేది అమెరికా ట్రూత్ సోషల్ పోస్టులతో నిర్వహించబదని ఎద్దేవా చేశారు. హర్ముజ్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారాయన. దీంతో “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”కు ఇరాన్ సహకారం ఇవ్వదనేది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. -
దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులు చేస్తాం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో తాత్కాలికంగా నిలిచిపోయిన యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు ఇరాన్ నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనను సమీక్షిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒకవేళ ఇరాన్ గనక దురుసుగా ప్రవర్తిస్తే ఆ దేశంపై దాడులు మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆయన శనివారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ నుంచి మియామీ వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ తప్పుగా ప్రవర్తిస్తే, ఏదైనా చెడు చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనను నిశీతంగా పరిశీలిస్తున్నానని, దానిపై మళ్లీ మీడియాతో మాట్లాడతానని తెలిపారు. ఈ కొత్త ఆఫర్ కూడా తనకు అంతగా నచ్చలేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత 47 ఏళ్లుగా మానవాళిపై పాల్పడిన అకృత్యాలకు ఇరాన్ ఇంకా మూల్యం చెల్లించలేదని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నూతన ప్రతిపాదన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను భావించడం లేదన్నారు. ఇరాన్‌కు పెద్ద శిక్ష పడాల్సి ఉందని తేల్చిచెప్పారు. అయితే, పశ్చిమాసియాలో శాంతి సాధన విషయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఈ ప్రపోజల్‌ను ఇరాన్ గురువారం అమెరికాకు పంపించినట్లు తెలిసింది. గతంలో ఇరాన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించి విషయం విదితమే. దానిపై తాను సంతృప్తిగా లేనని ఆయన తేల్చిచెప్పారు. బంతి అమెరికా కోర్టులోనే ఉంది: ఇరాన్ నూతన ప్రతిపాదన పట్ల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతిస్పందించింది. చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరుకుంటారా? లేక యుద్ధానికి తిరిగి వెళ్తారా? అనేది అమెరికా ఇష్టమని తేల్చిచెప్పింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి కజెమ్ ఘరీబాబాదీ పేర్కొన్నారు. దౌత్య మార్గాన్ని ఎంచుకుంటారో లేక ఘర్షణను కొనసాగిస్తారో వారే నిర్ణయించుకోవాలని ఉద్ఘాటించారు. తన జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకోవడమే తమకు ముఖ్యమని స్పష్టంచేశారు. ఇరాన్ రెండు మార్గాలకు.. చర్చలకు లేదా యుద్ధానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఏమిటీ కొత్త ప్రతిపాదన? అమెరికా చేసిన 9 పాయింట్ల ప్రతిపాదనకు ప్రతిస్పందనగా ఇరాన్ 14 పాయింట్లతో ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా దిగ్బంధనాన్ని ముగించడం, ఇరాన్, లెబనాన్‌లో యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంపై ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయా అంశాలపై చర్చలకు ఒక నెల గడువు విధించింది. అటువంటి ఒప్పందం కుదిరిన తర్వాతే అణు కార్యక్రమంపై మరో ఒప్పందానికి వచ్చేందుకు మరో నెల రోజులపాటు చర్చలు కొనసాగించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఎలాంటి దాడులు చేయకూడదని, తమ భద్రతకు హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేస్తామంటూ ఇరాన్ స్పష్టమైన గ్యారంటీ ఇవ్వలేదని సమాచారం. హార్మూజ్‌ను తెరుస్తామని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించే చర్యలపై దృష్టి సారిస్తామని ఇరాన్ వెల్లడించింది. అమెరికా ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని, తమ చమురు ఎగుమతులపై ఆంక్షలు సహా ఆర్థిక ఆంక్షలను తొలగించాలని షరతు విధించింది. సముద్ర వాణిజ్యం, చమురు సరఫరా పునరుద్ధరణను అణు కార్యక్రమాల చర్చల నుంచి వేరు చేయాలన్నదే ఇరాన్ వ్యూహమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనల కింద తమ అణు కార్యక్రమ హక్కులను అధికారికంగా గుర్తించాలని ఇరాన్ కోరుతోంది. ఏ ఒప్పందమైనా శాశ్వతంగా ఉంటుందని, ఏకపక్ష ఉపసంహరణకు తావులేదన్న హామీలు ఇవ్వాలని అంటోంది. -
ఇరాన్-అమెరికా యుద్ధం తీవ్రస్థాయికి?.. సంచలన వ్యాఖ్యలు
ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ప్రతిపాదన తనకు నచ్చలేదని యుద్దం ముగించే అవకాశాలు లేవని అన్నారు. తాజాగా దీనికి ఇరాన్ అధికారి ఘాటుగా స్పందించారు. ఇరాన్- అమెరికా మధ్య మరోసారి యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.ఆ దేశ మిలిటరీ కేంద్ర కమాండ్‌లోని సీనియర్ అధికారి మొహమ్మద్ జాఫర్ అసాదీ మాట్లాడుతూ "ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య మరోసారి ఘర్షణ జరిగే అవకాశం ఉంది." అని అన్నారు. యు.ఎస్ అధికారుల తాజా చర్యలు మరియు ప్రకటనలు కేవలం "వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమేనని ఆయన తెలిపారు. యు.ఎస్ అధికారుల చర్యలు మరియు ప్రకటనలు ప్రాథమికంగా మీడియా ఆధారితమైనవి. చమురు ధరలు పడిపోకుండా నిరోధించడం ఒకటైతే, వారు సృష్టించిన గందరగోళం నుండి తమను తాము రక్షించుకోవడం రెండవది" అని ఆయన అన్నారు. అమెరికా ఏదైనా ఉద్రిక్తతలకు పాల్పడితే ఇరాన్ సాయుధ బలగాలు తిప్పికొట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికన్లు చేసే ఏ కొత్త సాహసాలకైనా, మూర్ఖత్వాలకైనా సాయుధ బలగాలు పూర్తిగా ఎదుర్కొంటాయి అని పేర్కొన్నారు అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇది వరకే ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి దీనిపై స్పందించారు.తమ దేశం "చర్చల నుండి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని కానీ కానీ శాంతి పేరుతో నిబంధనలను రుద్దడం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. కాగా ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ నడుస్తోంది. ఇరు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే అణుఒప్పందం విషయంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఇదే..
యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇరాన్ ఒక పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపింది. యుద్ధ విరమణ.. ప్రాంతీయ భద్రత, ఆంక్షల తొలగింపు, ఇతర డిమాండ్లతో ముడిపడి ఉండాలని.. వీటన్నింటినీ 30 రోజుల్లోపు పరిష్కరించాలని ఇరాన్ కోరింది. అమెరికా ప్రతిపాదించిన 9 అంశాల ప్రణాళికకు ఇరాన్ అధికారికంగా ఈ 14 అంశాల వివరణాత్మక ప్లాన్‌తో సమాధానమిచ్చినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.అమెరికా రెండు నెలల యుద్ధ విరమణను ప్రతిపాదించగా.. ఇరాన్ దానిని తిరస్కరించింది. అన్ని ప్రధాన సమస్యలను 30 రోజుల్లోనే పరిష్కరించాలని పట్టుబట్టింది. భవిష్యత్తులో సైనిక దాడులు జరగకుండా హామీ ఇవ్వాలని.. ఇరాన్ సరిహద్దు ప్రాంతాల నుండి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. నిలిపివేసిన తమ ఆర్థిక ఆస్తులను విడుదల చేయాలని, నష్టపరిహారం చెల్లించడంతో పాటు సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది.ఈ శాంతి ఒప్పందం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. లెబనాన్‌తో సహా అన్ని వైపులా పోరాటాలను ముగించాలని ఇరాన్ కోరింది. అలాగే, వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిలో భద్రత, రవాణా నియంత్రణ కోసం కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. ఈ కొత్త ప్రతిపాదనను సమీక్షిస్తానని చెబుతూనే.. దశాబ్దాలుగా టెహ్రాన్ చేసిన చర్యలకు ఇంకా తగినంత భారీ మూల్యం చెల్లించలేదని పేర్కొన్నారు. తాను త్వరలోనే ఇరాన్ పంపిన ఈ ప్రణాళికను పరిశీలిస్తానని.. అయితే ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను ఊహించలేకపోతున్నానని ఆయన రాసుకొచ్చారు. -
నర్గీస్ మొహమ్మదీ ఆరోగ్యం విషమం!
టెహ్రాన్: ఇరాన్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెను శుక్రవారం రాత్రి జైలు నుంచి వాయువ్య ఇరాన్‌లోని జంజాన్ ఆసుపత్రికి తరలించారు. మొహమ్మదీ ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారినట్లు ఆమె ఫౌండేషన్ వెల్లడించింది. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు, తీవ్రమైన వికారం వంటి సమస్యలతో మొహమ్మదీ బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను రాజధాని టెహ్రాన్‌కు తరలించాలని జంజాన్ ఆసుపత్రి వైద్యులు సూచించారు. యాంజియోగ్రఫీ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే, మొహమ్మదీని టెహ్రాన్‌కు తరలించడానికి ఇరాన్ ప్రభుత్వం అంగీకరించలేదని ఆమె భర్త తాఘీ రెహ్మానీ తెలిపారు. యాంజియోగ్రఫీ పూర్తయ్యే వరకు తన భార్య ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించలేమని పేర్కొన్నారు. పారిస్‌లో ఉన్న రెహ్మానీ ఈ మేరకు ఒక సందేశాన్ని మీడియా ద్వారా విడుదల చేశారు. హెచ్చుతగ్గులకు గురవుతున్న రక్తపోటుకు వైద్యులు చికిత్స చేయలేకపోతున్నారని మొహమ్మదీ సోదరుడు హమీద్రేజా మొహమ్మదీ వెల్లడించారు. తన సోదరి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. నర్గీస్ మొహమ్మదీ ఇరాన్లో మానవ హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. లాయర్‌గా, జర్నలిస్టుగా పనిచేశారు. ఇరాన్ ప్రభుత్వంపై ఆమెపై కేసులు బనాయించింది. పలుమార్లు జైలుకు పంపించింది. మొహమ్మదీ 2023లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. ఓ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఆమెకు ఏడున్నరేళ్ల జైలుశిక్ష పడింది. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నారు.గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరికి ఉరిశిక్ష ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. యాగూబ్ కరీంపూర్, నాసర్ బెక్రజాదే అనే ఈ ఇద్దరు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు రహస్య సమాచారం చేరవేస్తూ దొరికిపోయారని పేర్కొంది. నేరం రుజువు కావడంతో కింది కోర్టు వారికి మరణశిక్ష విధించినట్లు తెలిపింది. మరణశిక్ష విధించడాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించడంతో ఉరిశిక్ష అమలు చేసినట్లు వెల్లడించింది. అలాగే ప్రభుత్వ, మత పెద్దల వివరాలతో పాటు నతాంజ్ అణు కేంద్రం గురించి సమాచారాన్ని పంపినట్లు రుజువులు ఉన్నాయని తెలియజేసింది. గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణల కింద ఇరాన్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో దాదాపు 25 మందిని ఉరితీసింది. ప్రభుత్వ తీరుపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. నిందితుల వాదన వినకుండానే, నేరం రుజువు కాకుండానే ఉరిశిక్ష అమలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. -
ఇరాన్‌పై యుద్ధం ముగిసింది.. కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదు
వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కాబట్టి యుద్ధం ముగిసినట్లేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేశారు. యుద్ధానికి చట్టపరమైన ఆమోదం కోసం తాను గడువును పాటించాల్సిన అవసరం లేదని వాదించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న ఆరంభమైన దాడులు ఏప్రిల్ 7 నుంచి ఆగిపోయాయని గుర్తుచేశారు. 1973 నాటి వార్ పవర్స్ చట్టం ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు మరో దేశంపై సైనిక చర్య ప్రారంభించినప్పుడు దాని గురించి చట్టసభ సభ్యులకు తెలియజేసిన 60 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాలి. లేకపోతే యుద్ధాన్ని విరమించుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ శుక్రవారం కాంగ్రెస్ సభ్యులకు లేఖ రాశారు. కాల్పుల విరమణ నేపథ్యంలో యుద్ధం ఆగిపోయింది కాబట్టి వార్ పవర్స్ చట్టం ప్రకారం తాను నడుచుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధం గురించి కాంగ్రెస్ సభ్యులకు అధికారికంగా తెలియజేసిన తర్వాత సరిగ్గా 60వ రోజున ట్రంప్ ఈ లేఖ రాయడం గమనార్హం. 60 రోజుల డెడ్‌లైన్ శుక్రవారమే ముగిసింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దీర్ఘకాల శాంతి ఒప్పందంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రధానంగా అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో అమెరికా విధించిన షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. వారికి లేని అనుమతి నాకెందుకు? ఇరాన్‌తో యుద్ధం కొనసాగించడానికి తనకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. గతంలో అమెరికా కమాండర్–ఇన్–చీఫ్‌లు అలాంటి అనుమతి ఏనాడూ తీసుకోలేదని స్పష్టంచేశారు. యుద్ధం చేసే విషయంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కాంగ్రెస్ అధికారాన్ని మాజీ అధ్యక్షులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా భావించారని తెలిపారు. ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై దాడులు కొనసాగించడానికి కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకుంటారా? అని ప్రశ్నించగా, మాజీ అధ్యక్షులు కాంగ్రెస్‌ను పరిగణనలోకి తీ సుకోకుండా యుద్ధాలు చేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎవరూ అనుమతి అడగలేదని వెల్లడించారు. వారికి లేని అనుమతి తనకెందుక ని ట్రంప్ పరోక్షంగా అసహనం వ్యక్తంచేశారు. ఇరాన్ నుంచి తిరిగొస్తూ క్యూబాను స్వాదీనం చేసుకుంటాం చమత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చమత్కరించారు. ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు అమెరికా నౌకాదళం క్యూబాతో తలపడుతుందని అన్నారు. క్యూబాను స్వాధీనం చేసుసుకొనే ఆలోచన ఉందంటూ తన మనసులోని మాటను పరోక్షంగా వ్యక్తీకరించారు. క్యూబాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ట్రంప్ శుక్రవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ఇరాన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు, మా పెద్ద విమాన వాహక నౌకల్లో ఒకటైన, బహుశా ప్రపంచంలోనే అతిపెద్దదైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను క్యూబా తీరానికి సుమారు 100 గజాల దూరంలో నిలిపినప్పుడు క్యూబా ప్రజలు ఎదురొస్తారు. మీకు ధన్యవాదాలు, మేము లొంగిపోతున్నాం అని చెబుతారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. క్యూబాపై అమెరికా ఎప్పటినుంచో కన్నేసింది. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తనకు కావాల్సింది సాధించుకోవడానికి క్యూబాపై సైనిక చర్య తీసుకోవచ్చని ట్రంప్ పదేపదే బెదిరిస్తూ వస్తున్నారు. హార్మూజ్‌లో ఇరాన్‌కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తాం దుబాయ్: హార్మూజ్ జలసంధిలో ప్రయాణించడానికి ఇరాన్‌కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తామని షిప్పింగ్ కంపెనీలను అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ ఆఫీసు ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేసింది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. జలసంధిలో ఇరాన్ ఓడరేవులను అమెరికా సైన్యం దిగ్బంధించింది. మరోవైపు విదేశీ నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. తమ తీరానికి దగ్గరగా ఉన్న మార్గాల్లో కొన్ని నౌకలకు మాత్రం అనుమతి ఇస్తోంది. అందుకు వాటి నుంచి రుసుము వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. -
హార్మూజ్‌ను దాటుకుని వస్తున్న భారత నౌక
బెంగళూరు: హార్మూజ్ జలసంధి వద్ద ఇతర దేశాల నౌకలకు అనుమతి నిరాకరిస్తూ భారత నౌకలకు మాత్రం అనుమతి ఇచ్చామని ఇండియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ అన్నారు. దీనిబట్టే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తోందని తెలిపారు. మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న ఎల్పీజీ క్యారియర్ ఎంఠీ సర్వ్ శక్తి భారత సరుకు తీసుకుని మే 2న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మే 13న విశాఖపట్నానికి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 46,313 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ తీసుకెళ్తున్న ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 18 మంది భారతీయులు ఉన్నారు. బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇలాహీ మాట్లాడుతూ.. భారత్-ఇరాన్ మధ్య శతాబ్దాల చరిత్ర, సంస్కృతి ఆధారంగా బంధం నిలిచిందని తెలిపారు. వివిధ రంగాల్లో దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. “భారత్ ఒక గొప్ప దేశం. మేము భారత ప్రజలను గౌరవిస్తాము. మాకు ఇరాన్‌తో 5,000 సంవత్సరాల సంబంధం, స్నేహం ఉంది. విద్య, తత్వశాస్త్రం, సంస్కృతి, నాగరికత, ఆర్థిక రంగాల ద్వారా ఇరాన్ భారత్‌తో అనుసంధానమై ఉంది. ఇరానీయులు భారతీయులను చాలా ఇష్టపడతారు. మన సంస్కృతి కూడా ఒకటే. మన ప్రవర్తన ఒకటే. మన ముఖాలు, ఆకృతులు కూడా ఒకటే” అని అన్నారు.“భారత్-ఇరాన్ మధ్య సంబంధం, స్నేహం చాలా బలంగా, లోతుగా ఉంది. ప్రస్తుతం భారత్‌తో మా సంబంధం, సహకారం చాలా బాగుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో మూడుసార్లు చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రితో అనేక సార్లు చర్చలు జరిపారు. అనేక దేశాలకు అనుమతి లభించని సమయంలో ఇరాన్ భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటేందుకు అనుమతించింది” అని ఆయన తెలిపారు.గత శతాబ్దాల్లో అనేకమంది ఇరానీయులు భారత్‌లో స్థిరపడ్డారని, ఇది సామాజిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరిచిందని చెప్పారు. భవిష్యత్ సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. సత్సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు. ఇరాన్ నాయకత్వం భారత్‌తో సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించిందని, ద్వైపాక్షిక సహకారంలో అడ్డంకులను తొలగించేందుకు మద్దతు ఇచ్చిందని తెలిపారు.ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గతంలో పలుసార్లు భారత్‌తో బలమైన సంబంధాలను ప్రోత్సహించారని, అడ్డంకులు ఉండకూడదని అన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ కూడా భారత్‌ను ఇష్టపడతారని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలపరచాలని భావిస్తున్నారని తెలిపారు. -
"మేము సముద్రపు దొంగలమేమో" .. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. తాజాగా ఆయన అటువంటి వ్యాఖ్యలే చేశారు. "మేము సముద్రపు దొంగల లాంటి వాళ్లం" అని అమెరికాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల స్వాధీనం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీ ట్రంప్ మాట్లాడారు. అందులో " మేము ... నౌకపైకి దూకి, దాన్ని మా ఆధీనంలోకి తీసుకున్నాము. సరుకును స్వాధీనం చేసుకున్నాం, చమురును తీసుకున్నాం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం." అన్నారు. ట్రంప్ ఇలా వ్యాఖ్యానించిన తర్వాత ఆ సభలో ప్రజలు కేరింతలు కొడుతూ ఈలలు వేశారు. ఇటీవల ఇరాన్‌కు చెందిన నౌకలను అమెరికా దిగ్భందనం చేసింది ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడారు.అయితే ఇరాన్ ఓడరేవుల వద్ద అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగుతుంది. అమెరికా దళాలు 'మేజిస్టిక్ ఎక్స్' ఇరాన్-ఫ్లాగ్ కలిగిన 'టూస్కా' వంటి కార్గో నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై ఇరాన్ సైతం ఘాటుగానే స్పందించింది. "అంతర్జాతీయ జలాల్లో సాయుధ దోపిడీ" అని పేర్కొంటూ, వాషింగ్టన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఈ చర్య వాస్తవంగా సముద్రపు దొంగతనాన్ని సమర్థించడమేనని అన్నారు. దీనిని ఆయన "అంతర్జాతీయ జలాల్లో సముద్రపు దొంగతనం మరియు సాయుధ దోపిడీని ప్రత్యక్షంగా చట్టబద్ధం చేయడమే" అని అభివర్ణించారు. తాజాగా ట్రంప్ సైతం ఈ వ్యాఖ్యలకు కౌంటర్ తాము సముద్రపు దొంగలమేనన్నారు.అయితే కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ చర్యలు తనను సంతృప్తి పరచలేదని యుద్దాన్ని ముగించే ప్రసక్తే లేదన్నారు. -
ఒకప్పుడు బాంబులు మోత.. ఇప్పుడు మాత్రం..?
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. దీంతో కాల్పుల మోతకు తాత్కాలిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపుగా రెండునెలలలుగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్ నగరం ఇప్పుడు ఏలా ఉందో ఆ యువతి వీడియో చూపించింది. ఈ వీడియో నెటిజన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, మరియు అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో'ఎస్టెల్' అనే వినియోగదారు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. "ఏ డే ఇన్ టెహ్రాన్ డ్యూరింగ్ సీజ్ఫైర్" (టెహ్రాన్‌లో కాల్పుల విరమణ వేళ ఒక రోజు) పేరుతో ఉన్న ఈ వీడియో, టెహ్రాన్‌లోని సాధారణ ,ప్రశాంతమైన జీవనశైలిని ప్రపంచానికి చూపిస్తోంది. గతంలో క్షిపణులు నగరాన్ని తాకిన భయానక దృశ్యాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.టెహ్రాన్ మెుత్తం కలియతిరుగుతూ...రాజధాని నగర వీధుల గుండా ప్రయాణిస్తూ ఎస్టెల్ తన కారులో ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తూ నగరాన్ని చూపించారు. ఫుట్‌పాత్ మీద ఉన్న ఒక చిన్న విక్రేత వద్ద క్యాట్ ప్లషీని కొనడం, ఒక ఫుడ్ కోర్టులోకి వెళ్లి లంచ్ ఆర్డర్ చేయడం, ఇరానియన్ బిస్కెట్లు కొనడం వంటి దృశ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె ఒక స్టాల్లో కొరియన్ ఫుడ్ కూడా రుచి చూసింది.అదే విధంగదా సాయంత్రం సమయంలో, ఆమె ఒక విలాసవంతమైన హోటల్లోని లాంజ్‌కు వెళ్ళింది. అక్కడ ప్రజలు యుద్ధ భయం లేకుండా ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు.వైరల్‌గా వీడియోఅయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ల వైరల్‌గా మారింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, మీడియాలో చూపే దానికి, అక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల ఆతిథ్యాన్ని, నగర అందాలను ప్రశంసిస్తూ, యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం యుద్ధం విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం ముగింపుకు ఇరాన్ చేసిన కొత్త ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు.దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Estelle W (@estelleeats__) -
నో డీల్..నో క్లారిటీ : మా దళాలు సిద్ధం : ఇరాన్ సంచలన ప్రకటన
ఏప్రిల్ 7 నుంచి అమెరికా బలగాలు, ఇరాన్ మధ్య కాల్పులు జరగలేదని కాంగ్రెస్ నేతలకు శుక్రవారం(మే 1) రాసిన లేఖలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ముగిసిందంటూ కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో ట్రంప్ ఈ లేఖ రాశారు. అంతేకాదు యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం ఇప్పుడు తనకు లేదని పేర్కొన్నారు. అయితే దీనికి స్పందనగా ఇరాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, దీనివల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగే అవకాశం ఉందని, తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించింది.ఖతం అల్-అన్బియాసెంట్రల్ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్దార్ మహమ్మద్ జాఫర్ అసాదీ శనివారం మాట్లాడుతూ, వాషింగ్టన్ దౌత్యపరమైన అవగాహనలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శించారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రధానంగా మీడియా ప్రేరేపితమైనవని విమర్శించారు. కేవలం చమురు ధరలు తగ్గకుండా చూడటానికి ,వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమే వారు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏవైనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!భారీ నష్టంసిఎన్ఎన్ (CNN) పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. కువైట్‌లోని క్యాంప్ బ్యూరింగ్ ప్రాంతంలోని అతిపెద్ద అమెరికా స్థావరాలలో ఒకటైన ఇక్కడ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీనిలోని ప్రధాన భాగాలు ప్రస్తుతం పనిచేయడం లేదు.ఇదీ చదవండి: నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకంఎనిమిది దేశాల్లోని కనీసం 16 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. పశ్చిమ ఆసియాలోని మెజారిటీ అమెరికా సైనిక స్థావరాలు ఈ దాడుల వల్ల ప్రభావితమయ్యాయని, కొన్ని చోట్ల సౌకర్యాలు పూర్తిగా ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంమరోవైపు, అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.పారిశ్రామిక మార్గాల్లో అమెరికా కఠిన చర్యల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల చమురు ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగాన్ అంచనా వేసినట్లు యాక్సియోస్ (Axios) నివేదించింది. కాగా అమెరికా, ఇరాన్ మధ్య దీర్ఘకాలిక ఒప్పందమేదీ ఇంతవరకూ కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ ద్వారా తెహ్రాన్ కొత్త సందేశం పంపించిందని ఇరాన్ మీడియా చెబుతోంది. మరోవైపు మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపిన ఒక అధికారిక ప్రతిపాదనలో కొత్త కాలపరిమితిని స్పష్టంగా పేర్కొన్నారని ఆ అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ఇజ్రాయెల్ మరియు అమెరికా మళ్లీ దాడి చేయవన్న హామీతో యుద్ధం ముగుస్తుంది. ఇరాన్ జలసంధిని తెరుస్తుంది ,అమెరికా ఇరాన్‌పై తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. -
ఇరాన్ నన్ను ఇరిటేట్ చేస్తోంది.. ట్రంప్
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని ప్రస్తుతానికి యుద్దం ముగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే ఇరాన్ మాత్రం తమతో యుద్దం ముగింపుకై సంప్రదింపులు జరుపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 60 రోజులు గడుస్తోంది అయినప్పటీకీ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు దేశాలు చర్చల విషయంలో తగ్గడం లేదు. అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం కుదరదు అనడం ఇరాన్ దానికి ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడంతో చర్చలు సాగడం లేదు. అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంలో మరోసారి స్పందించారు.ట్రంప్ మాట్లాడుతూ "వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ నేను దానికి సిద్ధంగా లేను; నాకు దానితో తృప్తి లేదు, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వారు పురోగతి సాధించారు, కానీ వారు ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్లో వారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.కాగా ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైననాటి నుంచి చట్టపరమైన అనుమతి కోరడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఈ రోజు ( శనివారం)చివరి గడువు అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో యుద్ధం ముగిసిపోయినందున దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ కాంగ్రెస్‌కు తెలిపినట్లు సమాచారం. -
మళ్లీ అదే జరగొచ్చు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చంటూ ఇరాన్ సీనియర్ సైనిక అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు నిలిచిపోవడంతో అమెరికాతో తిరిగి ఘర్షణ తలెత్తే అవకాశం ఉందన్నారు. అమెరికా హామీలకు, ఒప్పందాలకు కట్టుబడి ఉండదని ఆధారాలు చూపిస్తున్నాయంటూ ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్ సెంటర్ 'ఖతమ్ అల్-అంబియా'కు చెందిన మొహమ్మద్ జాఫర్ అసాదీ అన్నట్లు ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ పేర్కొంది. మరో వైపు, యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని.. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదన్న ట్రంప్... అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు.ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్‌పై యుద్ధం ముగిసిపోయిందంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్‌పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. -
ఇరాన్ కొత్త ప్రతిపాదన నచ్చలేదు
వాషింగ్టన్: యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని స్పష్టంచేశారు. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదని అన్నారు. అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఇంకా తెలియరాలేదు. ‘‘ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ ప్రతిపాదన నాకు సంతృప్తి కలిగించలేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం’’అని శుక్రవారం వైట్ హౌస్‌లో ట్రంప్ విలేకరులతో అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫోన్ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన రావడం ఇదే మొదటిసారి కాదు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఇంతకుముందు అంగీకరించింది. కానీ తమ అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని షరతు విధించింది. అందుకు అమెరికా ఒప్పుకోలేదు. ఇరాన్‌తో చర్చల ముసాయిదా పత్రంలో అణు కార్యక్రమ అంశాన్ని చేర్చాలంటూ తమ ప్రతినిధి బృందాన్ని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. చర్చలు కొనసాగుతున్నంత కాలం.. బాంబు దాడికి గురైన ఇరాన్ అణు కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను తరలించడానికి ప్రయతి్నంచబోమని, లేదా ఆ కర్మాగారాల్లో ఎలాంటి కార్యకలాపాలను పునఃప్రారంభించబోమని ఇరాన్ హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేసింది. దీనిపై ఇరాన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి మళ్లీ కొత్త ప్రతిపాదన రావడం ఆసక్తి కలిగిస్తోంది. మాతో ఒప్పందానికి ఇరాన్ తహతహ పశ్చిమాసియాలో ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసిన యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ తహతహలాడుతోందని ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై వైమానిక దాడులను పునఃప్రారంభించే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టంచేశారు. ఇరాన్లో కాల్పుల విరమణను ఉల్లంఘించాలన్న ఆలోచన అమెరికాకు ఉందా? అని ప్రశ్నించగా.. ఆ అవసరం ఉందని తాను అనుకోవడం లేదని ట్రంప్ బదులిచ్చారు. అమెరికా చేపట్టిన సైనిక చర్య ఇరాన్ సైనిక సామర్థ్యాలను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నౌకాదళం, వాయుసేన చాలావరకు ధ్వంసమయ్యాయి. డ్రోన్ ఫ్యాక్టరీలు 82 శాతం నష్టపోయాయి. క్షిపణి ఉత్పత్తి కూడా దారుణంగా పడిపోయింది. క్షిపణి ఫ్యాక్టరీలు దాదాపు 90 శాతం పడిపోయాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని నాశనం చేశాం. హార్మూజ్ జలసంధిపై అమెరికా విధించిన దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా కుప్పకూలుతోంది’’అని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈయూ వాహనాలపై సుంకాల పెంపుయూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను వచ్చేవారం 25 శాతం పెంచబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తాము పూర్తిగా అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించడం లేదని ఆక్షేపించారు. అయితే, తమ అభ్యంతరాలు ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఇరాన్‌పై యుద్ధం ముగిసింది: అమెరికా వాషింగ్టన్: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్‌పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్‌పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇరాన్ తన మాట వినకపోవడంతో దాడులు చేయాలని ఆయన ఆదేశించినట్లు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ వెల్లడించింది.యాక్సియోస్ నివేదిక ప్రకారం.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి లేకపోవడం, ఇరాన్ బెదిరింపులు పెరగడం వంటి పరిణామాలపై ట్రంప్ యూనైటెడ్ స్టేట్ సెంట్రల్ కమాండ్ అధికారి బ్రాడ్ కూపర్, రక్షణ మంత్రి, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో 45 నిమిషాల పాటు ముఖాముఖీ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఇరాన్‌పై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధ సామాగ్రిని పంపింది. జెరూసలేం పోస్టు ప్రకారం సుమారు 6,500 టన్నుల ఆయుధాలు, పరికరాలు ఇజ్రాయెల్‌కు చేరాయి. వీటిలో వాయు, భూతల ఆయుధాలు, సైనిక ట్రక్కులు, జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్ యూనిట్లు ఉన్నాయి. ఈ సరుకు రెండు నౌకల ద్వారా అష్డోడ్, హైఫా పోర్టులకు చేరగా, అనేక విమానాల ద్వారా కూడా రవాణా జరిగింది.‘ఆపరేషన్ రోరింగ్ లయన్ ప్రారంభమైనప్పటి నుంచి 403 ఎయిర్లిఫ్ట్స్, 10 సీలిఫ్ట్స్ ద్వారా 115,600 టన్నులకుపైగా సైనిక సామాగ్రి అందుకుంది’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ ఎప్పుడైనా శత్రువులపై చర్యలకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రక్షణ అధికారులు ఆయుధ రవాణా కొనసాగుతుందని, మరింత విస్తరించవచ్చని తెలిపారు. -
ఇరాన్లో పెను సంచలనం.. అబ్బాస్ అరాగ్చీ తొలగింపుకు ప్లాన్
టెహ్రాన్: అసలే యుద్ధంతో అతలాకుతలమువుతున్న ఇరాన్లో ఇప్పుడు మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో ఎంతో కీలకంగా వ్యవహారిస్తున్న విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని పదవి నుంచి తొలగించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న చర్చలు పక్క దారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. ఇరు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించి కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే ఇంత ప్రాధాన్యమైన పరిస్థితులు నడుస్తున్న వేళ ఇరాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది.ఇరాన్ అధ్యక్షుడు మాసూద్ పెజెష్కియన్, ఆ దేశ స్పీకర్ మహమ్మద్ ఖాలిబాప్ ఇరువురు నేతలు అబ్బాస్ అరాగ్ఛీని తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చల సమయంలో అధ్యక్షుడి ఆదేశాల అనుసారం కాకుండా ఇరాన్ సైన్యం ఆదేశాలు పాటించినట్లు అరాగ్చీపై ఆరోపణలు వచ్చాయి. గత రెండువారాలుగా అమెరికాతో చర్చల ప్రయత్నాలలో అరాగ్చీ తమ ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదని ఇద్దరు నేతలు ఆరోపించినట్లు నివేదికలు వచ్చాయి. .మంత్రిగా బాధ్యతాయుత వ్యక్తిగా ప్రవర్తించాల్సిన సమయంలో దేశ అధ్యక్షుడు ఆదేశాలను లెక్కచేయకుండా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ నేతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహరంపై ఇజ్రాయెల్ సైతం గతంలో ఓ నివేదిక ప్రచురించింది. ఆయతుల్లా ఖమేనీ హత్యతో ఇప్పుడు ఇరాన్ పాలన ఆ దేశ మిలటరీ చేతిలోకి వెళ్లిందని వారు గత పాలకులకంటే అధికమైమ మతఛాందస భావాలు కలవారని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతర్గతంగా రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. -
అయతుల్లా అలీ ఖమేనీ ఒంటి చేయి రహస్యం ఇదేనా?
టెహ్రాన్: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. అచ్చం సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ విషయంలో అదే జరిగింది. ప్రపంచ దేశాలకు ఆయన ఇరాన్ సుప్రీమ్ లీడర్‌గానే కనిపించవచ్చు. కానీ సుపరిచితులందరికీ ఆయన ఒంటి చేయి వీరుడు అని మీకు తెలుసా?ఇరాన్ -ఇరాక్ యుద్ధం 22 సెప్టెంబర్ 1980న ప్రారంభమైంది. దాదాపు ఎనిమిదేళ్లు కొనసాగి, 20 ఆగస్టు 1988న ముగిసింది. ఈ యుద్ధం ప్రారంభమైన మరుసటి ఏడాది జూన్ 27, 1981న నాటి అధ్యక్ష హోదాలో ఇరాన్ యుద్ధ సన్నాహాల్ని పర్యవేక్షించారు. అనంతరం, ప్రార్ధన చేసి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో అనుచరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.అదిగో అప్పుడే ఓ యువకుడు ఖమేని ముందుకు వచ్చాడు. ఖమేని డెస్క్‌పై ఓ టేప్‌రికార్డ్ పెట్టాడు. దానిని ఆన్ చేశాడు. ఇరాన్‌లోని మతపరమైన పాలనకు వ్యతిరేకంగా ఉన్న ఒక మిలిటెంట్ గ్రూప్ ఫుర్కాన్ అమర్చిన బాంబు నిమిషం వ్యవధిలో పేలింది. ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఆయన చావునుంచి తృటిలో తప్పించుకున్నారు. ఖమేనీ తన కుడి చేయి, లంగ్స్, ఊపిరితిత్తులకు తీవ్రగాయాలయ్యాయి. కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టింది. కొన్ని గాయాలు నయమైనప్పటికీ, అతని కుడి చేయి శాశ్వతంగా పనిచేయకుండా ఆగిపోయింది.ఘటన జరిగిన కొద్ది రోజులకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఖమేనీకి సహచరులు ‘ఒంటి చేత్తో ఏం సాధిస్తావు, అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి’ అని సలహా ఇచ్చిన వేళ, ఆయన గద్గద స్వరంతో, ‘నేను ఒంటి చేయి వీరుణ్ని. ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి లేచినట్లు లేస్తాను. నాకు ఆ చేయి అవసరం లేదు. నా మెదడు, నా నాలుక పనిచేస్తే చాలు’ అని అన్నారు.కొంతకాలం తర్వాత ఖమేనీ తన ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాడు. ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ.. ఘటన జరిగిన ఎనిమిదేళ్లకు ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా ఓ దేశానికి సుప్రీం లీడర్‌గా ఖమేనీ చరిత్రలో నిలిచిపోయారు. -
60 రోజుల గడువు ముగుస్తున్న వేళ.. అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: అరవై రోజుల గడువు ముగుస్తున్న వేళ.. ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ బృందం కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య కోసం కాంగ్రెస్(అమెరికా పార్లమెంటు) ఆమోదం పొందాల్సిన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 60 రోజుల గడువు గురించి అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్‌ను ఓ వార్తా సంస్థ ప్రశ్నించగా.. తాము యుద్ధంలో లేమంటూ ఆయన సమాధానమిచ్చారు.ప్రస్తుతం బాంబు దాడులు, కాల్పులు వంటి క్రియాశీలక సైనిక చర్యలేవీ జరగడం లేదు. ప్రస్తుతం మేము శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. చాలా సున్నితమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగలడానికి నేను ఇష్టపడను. ఏం జరుగుతుందో వేచి చూడాలని జాన్సన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా టెహ్రాన్, ఇరానియన్ నగరాలపై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సీనియర్ కమాండర్లు, పౌరులు మరణించారు.దీనికి ప్రతికారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాంబు దాడులు చేసింది. అంతేకాకుండా కీలకమైన వాణిజ్య నౌకా రవాణా మార్గమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను కూడా ఇరాన్ మూసివేసింది. మార్చి 2న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య గురించి కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా యుద్ధ అధికారాల చట్టం (US War Powers Act) ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది. ఇవాళ (మే 1)తో ముగుస్తుంది.చట్టపరమైన నిబంధనలు ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి లేదు. కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని వాడటానికి గరిష్ఠ గడువు 60 రోజులుగా నిర్ణయించారు. శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా అమెరికా పార్లమెంటుకు అధ్యక్షుడు తెలపాల్సి ఉంటుంది.కాగా, తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ.. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కష్టతరంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సెనేట్‌లో తీర్మానం ఆమోదం పొందినా, రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న హౌస్‌లో ఆమోదం పొందడం.. అలాగే ట్రంప్ దానిపై వీటో (Veto) అధికారాన్ని ఉపయోగించడం వంటి అడ్డంకులు ఉన్నాయి. 'వార్ పవర్స్ యాక్ట్' (War Powers Act) అధ్యక్షుడి యుద్ధ నిర్ణయాలను నియంత్రించడంలో అరుదుగా మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, కోర్టులు జోక్యం చేసుకోవడానికి వెనుకాడడం, వివాదాలు రాజకీయ వేదికలకే పరిమితం కావడంతో ట్రంప్‌ను నియంత్రించడం డెమోక్రాట్లకు సవాలుగా మారింది. -
ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళిక సిద్ధం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రణాళికలో భాగంగా మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ, హార్మూజ్‌లో ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.జలసంధిలో స్వేచ్ఛాయుత ఇంధన రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి పెంచడం, తద్వారా ఆ దేశం దిగొచ్చేలా చేయడమే అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. హార్మూజ్‌పై ఇరాన్ పట్టును సడలించేలా ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ పలు దౌత్య, విధానపరమైన మార్గాలను పరిశీలిస్తున్నారని తెలియజేశారు. మొత్తానికి ఇరాన్‌కు దారికి తీసుకురావడం, హార్మూజ్‌ను తెరిపించడం ట్రంప్ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు, శత్రువుల భారీ నుంచి గల్ఫ్‌ను కాపాడుతామని.. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్‌లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామంటూ పరోక్షంగా స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా.. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్‌తోపాటు హార్మూజ్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. -
పేరుకుపోతున్న ఇరాన్ చమురు నిల్వలు.. నెక్ట్స్ జరిగేదేంటంటే?
ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళ నిర్బంధం కారణంగా టెహ్రాన్ చమురు ఎగుమతులు తగ్గాయి. ఇరాన్ చమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. చమురు నిల్వ చేసుకునే ప్రదేశాలు తక్కువగా ఉండడంతో ట్యాంకర్లలో క్రూడ్ నిల్వలు పెరుగుతున్నట్లు షిప్పింగ్ డేటా చూపిందని విశ్లేషకులు తెలిపారు. దీని వల్ల ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచం ముందు ఏయే సవాళ్లు ఉన్నాయి? గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఇరాన్ క్రూడ్‌ను తీసుకెళ్లిన నౌకలు ఏప్రిల్ 13-25 తేదీల మధ్య చాలా తక్కువగా ఉన్నాయని చమురు విశ్లేషణ సంస్థ వోర్టెక్సా తెలిపింది. మార్చిలో 13-25 తేదీల మధ్య 23.4 మిలియన్ బారెల్స్ ఎగుమతి చేసింది. మార్చి 13-25 తేదీలతో పోల్చితే ఏప్రిల్ 13-25 తేదీల మధ్య 80 శాతానికి పైగా తగ్గుదల నమోదైందని తెలిపిన ఎల్ఎస్ఈజీ డేటాను వోర్టెక్సా చూపించింది.ఇరాన్‌కు చెందిన కొన్ని నౌకలు పోర్టుల నుంచి బయలుదేరిన తర్వాత అమెరికా అడ్డుకుంది. ఆంక్షల పరిధిలో ఉన్న కంటైనర్ నౌకలు, ఆసియా జలాల్లోని ఇరాన్ ట్యాంకర్లు కూడా ఇందులో ఉన్నాయి.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల మొత్తం చమురు మార్కెట్లో సరఫరా తగ్గి, డిమాండ్‌తో పోలిస్తే అందుబాటులో ఉన్న చమురు తక్కువగా ఉండటం వల్ల పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. చమురు సరఫరా తగ్గి, పోటీ పెరిగి, ధరలు పెరుగుతున్నాయి.ఈ దశలో, సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ ఇరాన్ క్రూడ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి విజయవంతంగా బయటకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఆ నౌకలను తర్వాత అడ్డగించారా? అన్నది ప్రస్తుతం నిర్ధారించలేకపోతున్నారు.ఇరాన్ నుంచి సరఫరా తగ్గడం వల్ల మార్కెట్లో ఇప్పటికే ఉన్న క్లిష్ట పరిస్థితి మరింత పెరిగింది. హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతులు తగ్గి, ధరలు పెరిగాయి.గత నెలలో, ధరలు తగ్గేందుకు ఇరాన్‌కు అమెరికా ఇంధన ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షల మినహాయింపు ఇచ్చింది. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్యారెల్‌కు సుమారు $50 పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధన ధరలు పెరిగాయి.ప్రపంచంలోనే అతిపెద్ద అంతరాయం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి అంతరాయం అని పేర్కొంది. హార్మూజ్ నిర్బంధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఏ ఇరాన్ క్రూడ్ ట్యాంకర్లు బయటకు వెళ్లలేదని తెలుస్తోంది.తమ నిర్బంధం ద్వారా ఇరాన్‌కు క్రూడ్ ఎగుమతి ఆదాయం తగ్గిందని అమెరికా తెలిపింది. “ప్రస్తుతం 41 ట్యాంకర్లలో 69 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉంది, ఇవి ఇరాన్ ప్రభుత్వం అమ్మలేకపోతోంది” అని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.ఇరాన్ కరెన్సీ రియాల్ (దేశీయ ద్రవ్య మాధ్యమం) అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఇది చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను చూపిస్తోంది. ఒత్తిడి ఉన్నప్పటికీ, ఖార్గ్ దీవిలోని ప్రధాన ఎగుమతి కేంద్రంలో ఇరాన్ ఇంకా క్రూడ్ లోడింగ్ కొనసాగిస్తోందని ట్యాంకర్ ట్రాకర్స్ తెలిపింది.ఉపగ్రహ చిత్రాల ప్రకారం గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లోని చాబహార్ పోర్టు వద్ద దాదాపు 10 ట్యాంకర్లు నిలిచివున్నాయి. ఫిబ్రవరిలో ఇరాన్ రోజుకు సుమారు 3.24 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఉత్పత్తి చేసింది. అందులో సగం దేశీయ రిఫైనింగ్‌కు ఉపయోగించింది.అయితే, నిల్వలకు స్థలం తక్కువగా ఉండటంతో ఒకటి రెండు వారాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి రావచ్చని విశ్లేషకులు తెలిపారు. భూభాగ నిల్వలు సుమారు 60 శాతం నిండి ఉన్నాయి. పూర్తి నిల్వలు 50 మిలియన్ బ్యారెల్స్ పైగా ఉన్నాయి. మొత్తం సామర్థ్యం 86 మిలియన్ బ్యారెల్స్. సామర్థ్య పరిమితుల వల్ల జూన్ మధ్యలో ఇరాన్ ఉత్పత్తిని తగ్గించాల్సి రావచ్చని ఎఫ్జీఈ నెక్స్టాంట్ ఈసీఏ కన్సల్టెన్సీ అంచనా వేసింది. -
బ్రహ్మాస్త్రం సిద్ధం!
అమెరికాతో రెండో విడత చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాకు గుండెపోటు తెప్పించే రహస్య అస్త్రం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. దాని గురించి తెలిస్తే శత్రువులు భయకంపితులు కావడం తథ్యమని పేర్కొంది. ఇదొక ‘సూపర్ వెపన్’అని ఇరాన్ నేవీ కమాండర్ షహ్రామ్ ఇరానీ తేల్చిచెప్పారు. శత్రువుపై త్వరలోనే ఈ కొత్త అస్త్రం ప్రయోగిస్తామని అన్నారు. రహస్య అస్త్రం ప్రస్తుతం శత్రువు పక్కనే ఉందని వెల్లడించారు. అది చూసి వారి(అమెరికా) గుండె పేలిపోదనే ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ చెబుతున్న రహస్య ఆయుధం ‘హూట్ రాకెట్ టార్పెడో’కావొచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సముద్ర గర్భంలో తుపాకీ తూటాలాగా శరవేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలు చేసే ఆయుధం. అనుకూలతలే కాకుండా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని అంటున్నారు. అసలేమిటి హూట్ టార్పెడో? ఈ ఆయుధాన్ని తొలిసారిగా 2006లో ఇరాన్ రహస్యంగా పరీక్షించింది. అత్యంత వేగంగా ప్రయాణించడం ఈ టార్పెడో ప్రత్యేకత. శత్రుదేశాలు ప్రతిస్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. హూట్ అంటే పర్షియన్ భాషలో భారీ తిమింగలం. నీటి అడుగున అత్యంత వేగంగా దూసుకెళ్లే ఆయుధాల్లో హూట్ సైతం ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది. కానీ, రష్యా వద్ద ఇంతకంటే మెరుగైన సూపర్–కావిటేటింగ్ టార్పెడో ఉంది. ఇది 1990వ దశకంలోనే రష్యా నావికాదళంలోకి ప్రవేశించింది. సంప్రదాయ టార్పెడోల కంటే సూపర్ టార్పెడోలు కొంత భిన్నమైనవి. ఇవి అండర్‌వాటర్ గైడెడ్ క్షిపణుల్లాంటివి. సముద్ర గర్భంలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కానీ, హూట్ టార్పెడో 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదని ఇరాన్ చెప్పుకుంటోంది. అదే నిజమైతే మాత్రం ఇదొక గొప్ప ముందడుగు అవుతుంది. నీరు అత్యంత శక్తివంతమైన నిరోధకం. గాలి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉండటం వల్ల నీటి అడుగున ప్రయోగించిన ఆయుధాలు వాటి వేగాన్ని చాలావరకు కోల్పోతాయి. నీటిలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆయుధాన్ని అభివృద్ధి చేయడం సామాన్యమైన విషయం కాదు. నీటి అడుగున హూట్ చుట్టూ గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. అది నీటి నిరోధకతను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో హూట్ వేగంగా ముందుకు సాగుతుంది. → హూట్ రాకెట్ టార్పెడో 200 కిలోలకుపైగా వార్హెడ్లను(శక్తివంతమైన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లగలదు. → హూట్ వేగమే దాని ప్రతికూలతగా చెప్పొచ్చు. అధిక వేగం కారణంగా ఇంధనం అత్యంత వేగంగా దహనమవుతుంది. దీనివల్ల టార్పెడో కేవలం 15 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అంటే ప్రయోగించిన చోటునుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధనౌకలు, జలాంతర్గాములను మాత్రమే ధ్వంసం చేయగలదు. → సంప్రదాయ టార్పెడోలు సాధారణంగా 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. → హూట్ అ్రస్తాన్ని విజయవంతంగా పరీక్షించారే తప్ప ఏనాడూ యుద్ధక్షేత్రంలో ప్రయోగించలేదు. ఒకవేళ అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహన నౌకలు, సబ్మెరైన్లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తే ఎంతవరకు ఆశించిన ఫలితాలు వస్తాయో ఇరాన్ సైనికాధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సూపర్ టార్పెడోల వేగం, శబ్దం చాలా ఎక్కువ. కచి్చతంగా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అంటున్నారు. → అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ప్రస్తుతం ఇరాన్ సమీపంలోనే మోహరించి ఉంది. దీనికి అనేక అంచెల్లో బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. హూట్ టార్పెడోతో ఢీకొట్టడం అంత సులువు కాదని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. → హూట్ టార్పెడోను సబ్మెరైన్లు, నౌకలు, స్పీడ్బోట్ల నుంచి ప్రయోగించవచ్చు. → హూట్ రేంజ్ 15 కిలోమీటర్లే కాబట్టి దగ్గరగా వచి్చనప్పుడు శత్రుసైన్యం ముందుగానే కనిపెట్టి ప్రతిదాడి చేసేందుకు ఆస్కారం ఉంది. → ఇరాన్ తన హూట్ సూపర్ టార్పెడోను ప్రయోగించగల ఏకైక ప్రదేశం హార్మూజ్ జలసంధి వంటి పరిమిత జలాల్లో మాత్రమే. → ఇరాన్ చేతిలో ఆకస్మిక దాడికి గురవుతామన్న అంచనాతో అమెరికా విమాన వాహక నౌకలు హార్మూజ్‌కు దూరంగా ఉంటూ, సురక్షితమైన దూరాల నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. → ఒకవేళ హూట్ టార్పెడో అద్భుతంగా పనిచేసి అమెరికా విమాన వాహక నౌకను తాకితే, అది గణనీయమైన నష్టాన్ని కలిగించగలదు. కానీ, అందుకు అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీటలువారిన ఒపెక్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకటి తలిస్తే జరిగేది ఎప్పుడూ మరోటి. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తే అది నాలుగురోజుల్లో పాదాక్రాంతమవుతుందని అంచనావేసుకుని ప్రారంభించిన యుద్ధం కాస్తా వికటించి ఆయన ఆ ఊబిలో కూరుకుపోయారు. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియని తరుణంలో పశ్చిమాసియాలో ఆయన ఉద్దేశించని పరిణామం సంభవించింది. మే 1 నుంచి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. దాన్నుంచి మాత్రమే కాదు... 2016లో ఏర్పడిన ‘ఒపెక్ ప్లస్’నుంచి కూడా వైదొలగనున్నట్టు తెలిపింది. ఒపెక్‌లో సభ్యత్వం తీసుకోని రష్యావంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో ఈ గ్రూప్ ఏర్పడింది. ఒపెక్ ప్రపంచ చమురు ఉత్పత్తుల పరిమాణాన్నీ, ఎగుమతుల్నీ, వాటి ధరల్నీ నిర్దేశిస్తున్న కీలక సంస్థ. ప్రపంచ ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులు దానిపైనే ఆధారపడతాయి. ప్రపంచ పెట్రో ఉత్పత్తుల్లో ఒపెక్ వాటా మూడోవంతుకన్నా ఎక్కువ. ఒపెక్ నుంచి తప్పుకోవాలన్న యూఏఈ ఆలోచన చాలా పాతది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ ఇరాన్ యుద్ధంతో అది తుది నిర్ణయానికొచ్చింది.ఒపెక్ సంస్థ ఆవిర్భావానికీ, విస్తరణకూ పాశ్చాత్య బహుళజాతి సంస్థల నిర్వాకం కారణం. చమురు దేశాలు ఎంత ఉత్పత్తి చేయాలో, ఏ ధర నిర్ణయించాలో అవి నిర్దేశించేవి. వాటి చెప్పుచేతల్లో ఉండటం ఇక సాధ్యంకాదన్న నిర్ణయానికొచ్చిన చమురు దేశాలు 1960 సెప్టెంబర్‌లో బాగ్దాద్‌లో సమావేశమై ఒపెక్ ఏర్పాటుకు తీర్మానించాయి. ఇరాన్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనెజులా దేశాలు ఇందులో భాగస్వాములు. 1967లో యూఏఈ చేరింది. 1973లో అరబ్–ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకొస్తున్న అమెరికా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, పోర్చుగల్ తదితర దేశాల వైఖరిపై ఆగ్రహించిన ఒపెక్... చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తూ, ఆ దేశాలకు ఎగుమతుల్ని నిషేధించింది. దాంతో పెను సంక్షోభం ఏర్పడింది. అనంతరకాలంలో ఈ దేశాలన్నీ అమెరికాకు సాగిలబడ్డాయి. అది వేరే కథ!ఒపెక్‌లో రాజుకుంటున్న అసంతృప్తికి సౌదీ పెద్దన్న పాత్ర పోషిస్తుండటం ఒక కారణం. ఏ దేశం ఎంత ఉత్పత్తి చేయాలో అదే నిర్ణయించటంవల్ల తమకు అన్యాయం జరుగుతున్నదని సభ్యదేశాల్లో ఎప్పటినుంచో అసంతృప్తి ఉంది. అందుకే 2019లో ఖతార్, ఆ మరుసటి ఏడాది ఈక్వెడార్, 2024లో అంగోలా సంస్థనుంచి వైదొలగాయి. ఆ వరసలో యూఏఈ నాలుగో దేశం. అంతర్జాతీయ చమురు ధరల్ని బట్టి ఉత్పత్తిని నియంత్రించుకుంటూ, అది కోరుకున్న ధరలో ఉండేలా చూసుకోవటం ఒపెక్ అలవాటు. తన తొలి ఏలుబడిలో ఒపెక్ దేశాలపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలున్నాయి. చమురు ధరలు పెంచుతూ ప్రపంచ ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. అయితే 2020లో కోవిడ్ సమయంలో పాతాళానికి పడిపోయిన చమురు ధరలతో దివాలా స్థితికి చేరిన అమెరికన్ సంస్థల్ని కాపాడుకునేందుకు ఉత్పత్తిని తగ్గించమని ఒపెక్‌ను వేడుకున్నది కూడా ఆయనే. సౌదీ తీరుపై యూఏఈ ఆగ్రహంతో ఉండటానికి కారణం ఉంది. అది ప్రస్తుతం రోజుకు 35 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. తనకున్న సామర్థ్యంతో అంతకన్నా ఎక్కువ చేయగలిగినా, సౌదీ అరేబియా నిర్దేశిస్తున్న కోటా ఆటంకంగా ఉంది. వచ్చే ఏడాదికల్లా దాన్ని 50 లక్షల బ్యారెళ్లకు పెంచాలంటే తప్పుకోవటమే ఉత్తమమని అది భావిస్తోంది. ఈలోగా ఇరాన్ యుద్ధం దాని సమస్యల్ని పెంచింది. గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడుల్లో ఆ దేశమే అధికంగా నష్టపోయింది. కనుకనే ఈ బాదరబందీని వదుల్చుకోవాలని నిర్ణయించుకుంది. పర్యవసానంగా వెనువెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర మూడు శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా, దీర్ఘకాలంలోగానీ దాని అసలు ప్రభావం కనబడదు. యూఏఈ మిత్రదేశంగా భారత్‌కు ఈ పరిణామం లాభదాయకమే. కానీ ఒపెక్ ఎలాంటి ఆంక్షలు పెడుతుందో చూడాలి. మొత్తానికి ఇన్నాళ్లూ కలిసికట్టుగా ఉన్నట్టు కనబడిన గల్ఫ్, ఒపెక్ బీటలువారుతున్నాయి. ఈ పరిణామం పశ్చిమాసియాలో అమెరికా పలుకుబడిని తగ్గిస్తుంది. ఇరాన్ పాదాక్రాంతం మాటేమో గానీ... అమెరికాకు మున్ముందు ఇది సమస్యాత్మకం. -
జలసంధిలో చట్టాల ఉల్లంఘన!
ప్రపంచమంతా ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ, యుద్ధ విరమణ గురించి ఉత్కంఠగా పరిశీలిస్తున్నది. విచిత్రమయిన, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ యుద్ధంలో న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, మధ్యవర్తి అర్హతల గురించిన చర్చ మచ్చుకు కూడా లేదు. యుద్ధంలో భాగస్వాములు కాని అరబ్ దేశాల అవస్థల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరి దృష్టీ కేవలం హార్మూజ్ జలసంధిని ఒకవైపు ఇరాన్, మరోవైపు పరోక్షంగా అమెరికా దిగ్బంధించడం మీదనే ఉన్నది. ఎందుకంటే హార్మూజ్ గుండా చమురు, గ్యాస్ నిరాటంకంగా రవాణా జరిగితే చాలు, మిగతా విషయాలు మాకేమిటనే ధోరణిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల ఉల్లంఘన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘బలవంతుడి మాటే చట్టం’ అని ప్రపంచ దేశాలు రాజీ పడినట్టుగా కనిపిస్తున్నది. అంతర్జాతీయ చట్టాల అమలుకు బాధ్యత తీసుకోవాల్సిన ఐక్యరాజ్య సమితి కోమాలో ఉన్నట్టుగా తోస్తున్నది.మౌనం దాల్చిన ప్రపంచ దేశాలు!పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలలో ప్రతిష్ఠంభనకు రెండు ప్రధాన పీటముడులు ఉన్నాయి. ఒకటి, హార్మూజ్ దిగ్బంధనం; రెండు, ఇరాన్ అణు కార్యక్రమం. హార్మూజ్ జలసంధిని పూర్తిగా నియంత్రించే అధికారం తనకున్నదని ఇరాన్ వాదిస్తున్నది. మొదటి విడత చర్చల తర్వాత ఇరాన్ కాస్త మెత్తబడి హార్మూజ్ నుండి అన్ని నౌకల రవాణాకు సహకరించడానికి ముందుకొచ్చింది. కానీ, ఇరాన్ రేవు పట్టణాల నుండి వచ్చే నౌకలను, ఇరాన్ రేవులకు వెళ్లే నౌకలను అడ్డగిస్తామని అమెరికా మంకుపట్టు పట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇరాన్, అమెరికాలకు ఈ రకంగా ప్రపంచ వాణిజ్యాన్ని అడ్డుకొనే హక్కు ఉందా అని ప్రపంచ దేశాలు ప్రశ్నించాల్సింది పోయి, నోరు మెదపకుండా కూర్చోవడం శోచనీయం. సన్నని జలసంధులు, సముద్ర మార్గాల గుండా సరుకుల రవాణాను నియంత్రించడానికి రెండు ప్రధాన అంతర్జాతీయ చట్టాలున్నాయి. 1. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యు.ఎన్.సి. ఎల్.ఓ.ఎస్), 2. శాన్ రెమో మాన్యువల్. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. రెండు రకాల జలసంధి రవాణా మార్గాలను గుర్తించింది. అవి : 1. ఇన్నోసెంట్ పాసేజ్, 2. ట్రాన్సిట్ పాసేజ్. తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం లోపు నౌకల రవాణా జరిగితే ఆ మార్గాన్ని ఇన్నోసెంట్ పాసేజ్‌గా పరిగణిస్తారు. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. ఆర్టికల్ 19 కింద తీరదేశాల భద్రతకు ముప్పు లేకుండా నౌకలు ప్రయాణించవచ్చు. ఆర్టికల్ 25 (3) ప్రకారం తీర దేశం ఇన్నోసెంట్ ప్యాసేజ్ గుండా నౌకల రవాణాను తన దేశ భద్రత దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. భౌగోళిక రాజకీయ వ్యూహాలు12 నాటికల్ మైళ్లకు ఆవల ఉండే జలమార్గాలను ట్రాన్సిట్ ప్యాసేజ్గా పరిగణిస్తారు. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. ఆర్టికల్ 44 ప్రకారం తీరదేశాలు ట్రాన్సిట్ ప్యాసేజ్ గుండా నౌకల రవాణాను అడ్డుకోవడం నిషేధం. ఇరాన్–ఒమన్ తీరాలను విభజించే హార్మూజ్ జలసంధి వెడల్పు కనిష్ఠంగా 21 నాటికల్ మైళ్లు. ఒమన్, ఇరాన్ సార్వభౌమ సముద్ర జలాలు (టెరిటోరియల్ వాటర్స్) చెరొక 12 నాటికల్ మైళ్లకు విస్తరిస్తే మొత్తం 24 నాటికల్ మైళ్లు. కానీ జలసంధి 21 నాటికల్ మైళ్లు మాత్రమే. అంటే నౌకలు ఇరాన్ సార్వభౌమ సముద్ర జలాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఇరాన్ హార్మూజ్‌ను ఇన్నోసెంట్ పాసేజ్‌గా పరిగణిస్తూ, తన భద్రత దృష్ట్యా మూసివేస్తానని వాదిస్తున్నది. ఇక అమెరికా హార్మూజ్ జలసంధి గుండా ఇరానియన్ రేవు పట్టణాలకు నౌకల రవాణాను అడ్డుకోవడం యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్ నిబంధనలను, యుఎన్ ఛార్టర్, హై సీస్ ఫ్రీడమ్ యాక్ట్ నిబంధనలను అతిక్రమించడమే. 1908లో ఇరాన్లో చమురు నిల్వలు కనుగొన్నప్పటి నుంచి మధ్యప్రాచ్యం... యూకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా; అనంతరం అమెరికాల జియోపొలిటికల్ వ్యూహంలో పావుగా మారింది. యూకే, ఫ్రాన్స్, డచ్, జర్మన్, యూఎస్ఏల చమురు కంపెనీలు, రాత్స్‌చైల్డ్ వంటి యూదుల ప్రైవేట్ బ్యాంకులు చక్రం తిప్పాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా పంచుకున్నాయి. టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ల సరిహద్దులను తమ ఇష్టానుసారం చమురు నిల్వల ప్రయోజనాల ఆధారితంగా నిర్ధారించాయి. వలస పాలకులు, చమురు కంపెనీల వారు సరిహద్దులను గీయటం, మధ్యప్రాచ్యంలో సున్నీ–షియా–కుర్ద్ –యూదుల మధ్య వైషమ్యాలు తీవ్రరూపం దాల్చటం... ప్రస్తుత రావణకాష్టానికి కారణం. షియాల ప్రాబల్యమున్న ఇరాన్–ఇరాక్‌ల నుంచి రక్షణ కోసం అరబ్ దేశాలు అమెరికా పంచన చేరాయి. అమెరికా ఈ దేశాలలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి, రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. పెట్రో డాలర్ బూమ్‌తో అరబ్ దేశాలు బలమైన ఆర్థిక శక్తులుగా తయారయ్యాయి. కానీ పొరుగున పాలస్తీనా (గాజా), సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్లలో అనిశ్చితి కొనసాగుతున్నది. ఈ ప్రాంతీయ అనిశ్చిత స్థితి తమ ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ముప్పు అని గుర్తించి అరబ్ దేశాలు క్రమంగా ఇజ్రాయిల్‌తో మైత్రికి ముందుడుగు వేశాయి. ఇజ్రాయిల్‌తో సంబంధాలను మెరుగుపరచుకున్నాయి. ఇరాన్ మంత్రి రష్యా పర్యటన!2020 కల్లా చైనా, రష్యా, భారత్‌లు అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తులుగా ఆవిర్భవించాయి. 2023లో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీ అరేబియా ఇరాన్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసింది. భారత్ ప్రతిపాదించిన ఐమెక్ (ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్)లో యూఏఈ, సౌదీ చేరాయి. అమెరికా–ఐరోపాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పాటయిన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో సౌదీ, యూఏఈలు 2024లో సభ్యులుగా చేరడం అరబ్ దేశాల నూతన వ్యూహాన్ని బలపరుస్తున్నది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీలు ‘పెట్రో యువాన్’ను బలపరచటానికి తోడ్పడుతున్నాయి. భారత్–యూఏఈలు డాలర్లో కాకుండా స్థానిక కరెన్సీలలో వాణిజ్యానికి ఒప్పందం చేసుకున్నాయి. యూఎస్ఏ నాయకత్వంలోని పశ్చిమ దేశాల స్విఫ్ట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీ, చైనా, హాంకాంగ్‌లు ఎం–బ్రిడ్జ్ ప్రాజెక్టును పరీక్షిస్తున్నాయి. డాలర్లకు బదులుగా ఖతర్, సౌదీలు బంగారంలో పెట్టుబడులను అధికం చేస్తున్నాయి. మరోవైపు అరబ్ దేశాలు గత దశాబ్దకాలంగా చైనా, భారత్, రష్యాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. భారత్ అనుసరిస్తున్న మల్టీ అలైన్మెంట్ విధానం అరబ్ దేశాలకు కూడా అనుసరణీయంగా కన్పిస్తున్నది. ఈ నేపథ్యంలో, ఇరాన్–అమెరికాల మధ్య శాంతి చర్చల సమన్వయ ప్రయత్నాలలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి జరిపిన రష్యా పర్యటన క్రమంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇరాన్ యుద్ధంలో రష్యా ప్రత్యక్ష పాత్రకు బహుశా ఇది నాంది కావచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఒక్కటైన గల్ఫ్ దేశాలు?.. ట్రంప్‌కు ఖమేనీ బిగ్ షాక్?
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలతో ఏకమై హర్మూజ్ జలసంధిలో అమెరికా చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ మేరకు గల్ఫ్ దేశాలకు తన స్వహస్త్రాలతో లేఖ రాసినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది.గురువారం మొజ్తాబా ఖమేనీ రాసిన లేఖలో ఫిబ్రవరి 28న నుంచి అమెరికా,ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్,హర్మూజ్ జలసంధికి సంబంధించి కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోంది.ఇరాన్ గల్ఫ్ దేశాల్ని సురక్షితం చేస్తుందని, హర్మూజ్ జలసంధిపై అమెరికా చేస్తున్న దుర్వినియోగాలను’నిర్మూలిస్తుందని అన్నారు. హర్మూజ్ జలసంధి కొత్త నిర్వహణ అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని మొజ్తాబా కమేనీ రాసిన లేఖలో స్పష్టం చేశారు.గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఉనికిని అనవసరమని మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా లేకుండా గల్ఫ్ ప్రాంతం మరింత శాంతి, అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అంతేకాదు ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా పరిరక్షిస్తామని ప్రకటించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా ఉనికే ఆ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణం. ఆ దేశానికి తన సొంత భద్రతను కాపాడుకునే సామర్థ్యం లేదు. అమెరికాను అభిమానించే వారికి, అమెరికా భద్రత కల్పిస్తుందనే ఆశ అసలు లేదు.ఇరాన్ శత్రువులకు దాని జలాల లోతుల్లో తప్ప మరెక్కడా స్థానం లేదు. వేలాది కిలోమీటర్ల దూరం నుంచి పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రువులకు అక్కడ మరెక్కడా స్థానం లేదని స్పష్టం చేశారు.ఖమేనీ రాసిన ఈ లేఖ, ఇరాన్ నేవీ కమాండర్ షెహరామ్ ఇరానీ టార్పిడో గురించి వివరిస్తూ అమెరికాను బెదిరించిన తర్వాత వెలువడింది. ఇరాన్ నేవీ తన ప్రకటనలో, శత్రు యుద్ధనౌకలను, జలాంతర్గాములను చీల్చగల సూపర్ జలాంతర్గామి ఆయుధాన్ని ఊహించమని పేర్కొంది. ‘హూట్’ (ఇరాన్ భాషలో హూట్ అంటే తిమింగళం) అనే పేరున్న ఈ సూపర్ వెపన్ దెబ్బకు శత్రువులు భయపడుతున్నారు. యుద్ధ సమయంలో ఇరాన్ నావికాదళం బలహీనపడినప్పటికీ, త్వరలోనే కొత్త ఆయుధంతో శత్రువుపై దాడి చేస్తామని ప్రకటించింది.‘ఏ క్షణమైనా కొత్త ఆయుధంతో శత్రువును ఢీకొంటాం. బహుశా వాళ్లకు హార్ట్ అటాక్ రాకపోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. కాగా, హర్మూజ్ జలసంధి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల భవిష్యత్తు రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ఇరాన్‌పై అమెరికా దాడులు మళ్లీ మొదలు.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని రీతిలో ఇరాన్‌పై మెరుపు దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటామ్) సైనిక చర్యలకు సన్నాహాలు చేస్తోందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ నివేదించింది. రెండు వేర్వేరు మూలాల ఆధారంగా.. గురువారం ఇరాన్‌పై దాడుల ప్రణాళికలపై సెంటామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌తో ట్రంప్ చర్చించనున్నట్లు పేర్కొంది.చర్చలలో ప్రధాన అంశాలుట్రంప్–కూపర్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఇరాన్‌పై భారీ స్థాయిలో కాంబాట్ ఆపరేషన్ నిర్వహించడం, శాంతి ఒప్పంద చర్చలు ముందుకు సాగేందుకు ప్రయత్నించడం, యుద్ధం ముగించే ముందు శత్రువుకు చివరి దెబ్బ ఇవ్వడం వంటి వ్యూహాలు ఉన్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్‌ను ఒప్పించేలా స్వల్పకాలిక శక్తివంతమైన దాడులు జరిపేందుకు సెంటామ్ మొగ్గు చూపుతోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, అదనంగా బాంబులు వర్షం కురిపించి అణు చర్యలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.సెంట్రల్ కమాండ్ మరో ప్రణాళికలో హర్మూజ్ జలసంధిలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్య నౌకాయానానికి తిరిగి తెరవడంపై దృష్టి సారించింది. ఈ ఆపరేషన్‌లో భూతల దళాలు కూడా పాల్గొనవచ్చని నివేదిక పేర్కొంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ట్రంప్ ప్రధాన బలంగా భావిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ, ఇరాన్ లొంగకపోతే ఆయన సైనిక చర్యను పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.మూడవ ప్రత్యామ్నాయంఈ బ్రీఫింగ్లో ప్రస్తావనకు రాబోయే మరో వ్యూహం, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక దళాలతో ఆపరేషన్ చేపట్టడం. గతంలో ఇరాన్ అణు కార్యక్రమం ఒక ముప్పు అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడానికి ఇది ప్రధాన కారణమని ఆయన అన్నారు. యుద్ధం ఇప్పటికే 60 రోజులకు పైగా కొనసాగుతోంది. ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాలను కోరుకోవడం లేదని, శాంతియుత ప్రయోజనాల కోసం అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని చెబుతోంది.జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా ట్రంప్‌తో జరిగే సెంట్రల్ కమాండ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ముందు కూడా కూపర్ ఇలాంటి బ్రీఫింగ్ ఇచ్చారు. దానికి ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై దాడులు జరిపి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచిందని యాక్సియోస్ నివేదిక హైలెట్ చేసింది. -
ఇక నో హార్మూజ్.. భారత్‌కు గుడ్‌న్యూస్
ఇరాన్, అమెరికా యుద్ధం వేళ చమురు విషయంలో భారత్‌కు శుభవార్త. చమురు ఉత్పత్తి, తరలింపు విషయంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిని బైపాస్ చేసి, ఫుజైరా(Fujairah) ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది భారత్ లాంటి అతిపెద్ద చమురు మార్కెట్‌కు మంచి పరిణామం. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు. దీంతో భారత్ చమురు కష్టాలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.యూఏఈ రెండు రోజుల క్రితమే.. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) బయటకు వచ్చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మే ఒకటో తేదీ నుంచి యూఏఈ బయటకు రాబోతోంది. ఈ నేపథ్యంలో యూఏఈ అవసరాలు, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఇరాన్ హార్మూజ్ అవసరం లేకుండా.. బైపాస్ చేసి, ఫుజైరా ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు వెల్లడించింది.After leaving OPEC, the UAE can now freely increase its oil production, thanks to the Fujairah Pipeline that bypasses the Strait of Hormuz.The Emirates had planned and developed this independent export route for years, enabling it to add up to 2 million barrels per day.A… pic.twitter.com/rqQpwq7hB0— سيف الدرعي| Saif alderei (@saif_aldareei) April 28, 2026ఇక, యూఏఈ ఒపెక్ నుంచి బయటకు రావడంతో తన చమురు ఉత్పత్తిని రోజుకు పది లక్షల బ్యారెళ్ల మేర తక్షణమే పెంచుకోగలదు. ఒపెక్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్‌ను ఎగుమతి చేయవచ్చు. దీంతో భారత్ కష్టాలకు చెక్ పడొచ్చు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండటం వల్ల భారత్‌కు యూఏఈ తన తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే ఇంధనం, వాణిజ్యం, భద్రతా రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చమురు.. భారీ సంఖ్యలో భారత్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు.ఫుజైరా ఆయిల్ పైప్‌లైన్ ఇలా.. హబ్షాన్-ఫుజైరా ఆయిల్ పైప్‌లైన్, దీనిని అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ (ADCOP) అని కూడా పిలుస్తారు. అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుండి ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా ఓడరేవు వరకు 380-406 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్‌లైన్‌ను, ఇరుకైన హార్మూజ్ జలసంధిని తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. సుమారుగా 4 బిలియన్ డాలర్ల వ్యయంతో 2012లో ఈ పైప్ లైన్‌ను నిర్మించారు. దీని ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయవచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకుని, ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. దీంతో హార్మూజ్ జలసంధి అవసరం లేకుండా పోతుంది.ఫుజైరా నుంచి భారత్‌కు ఆయిల్ సరఫరా గణాంకాలు..యూఏఈ సరఫరా (ఏప్రిల్ 2026): రోజుకు 619,000 బ్యారెల్స్గత ఆర్థిక సంవత్సర సగటు: రోజుకు 433,000 బ్యారెల్స్వృద్ధి: సుమారు 43% పెరుగుదలభారత్ మొత్తం క్రూడ్ దిగుమతి (ఏప్రిల్ 1–26, 2026): రోజుకు 4.4 మిలియన్ బ్యారెల్స్ (ఫిబ్రవరి 5.2 మిలియన్ బ్యారెల్స్‌తో పోలిస్తే 15% తక్కువ)భారత్‌లో ఇంధన ధరలపై ప్రభావంహార్మూజ్లో ఉద్రిక్తతల కారణంగా సరఫరా మార్గాలు కష్టతరంగా ఉన్నప్పటికీ, ఫుజైరా పైప్‌లైన్ వల్ల భారత్‌కు స్థిరమైన సరఫరా లభిస్తోంది.ఇది ధరల పెరుగుదల ఒత్తిడిని తగ్గిస్తోంది.యూఏఈ ఉత్పత్తి సామర్థ్యం 2027 నాటికి 5 మిలియన్ బ్యారెల్స్/రోజు చేరుతుంది.ఒపెక్ పరిమితులు లేకుండా యూఏఈ ఎక్కువగా ఉత్పత్తి చేయగలదు. దీని వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది.దీంతో, భారత్‌కు దిగుమతి బిల్లు తగ్గుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం.. ఇంధన ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. -
శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్ సంచలన హెచ్చరిక
ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం మరింత భీకర రూపం దాల్చనుందా? అంటే ఇరాన్ తాజా హెచ్చరికలు అవుననే సంకేతాలు అందిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలపై కొత్త ఆయుధాన్ని ఉపయోగించబోతున్నామంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ ఆయుధం శత్రువులకు "గుండెపోటు" తెప్పించేంత భయంకరమైనదని ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ పేర్కొన్నారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీ ప్రకారం, ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ, శత్రు దళాలు దేనికైతే "తీవ్రంగా భయపడుతున్నాయో", అటువంటి ఆయుధంతో త్వరలోనే వారిని ఎదుర్కోబోతున్నామని ఇరానీ తెలిపారు. ఆ ఆయుధం వారి పక్కనే ఉందని, అది చూసి వారికి గుండెపోటు రావచ్చు అని ఆయన ఎద్దేవా చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ చాలా త్వరలోనే భయంకర ఆయుధంతో ఎదుర్కొంటుందన్న హెచ్చరికలు భయాందోళనలు రేపాయి.అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి బదులుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. ఈ ప్రతిపాదన టెహ్రాన్ అణు కార్యక్రమంపై చర్చలను కూడా వాయిదా వేసేది. అయినప్పటికీ, హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు.ఇరాన్ చమురు వ్యాపారాన్ని అడ్డుకోవడం ద్వారా చర్చలకు తీసుకురావచ్చనే ట్రంప్ వ్యూహం సైనిక అకాడమీల్లో ఒక "జోక్" గా మారిందంటూ ధ్వజమెత్తారు. అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్ పై ఇరాన్ కనీసం ఏడుసార్లు క్షిపణి దాడులు చేసిందని, దీనివల్ల అమెరికా కొంతకాలం పాటు విమాన కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందని ఆయన వెల్లడించారు.కాగా ఫిబ్రవరి 28న ఇరాన్ అణుకార్యక్రమంపై విభేదాల కారణంగా ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాయి. అప్పటి నుండి ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై సుమారు 100 సార్లు ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. తమ పౌరుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంప్రపంచ ముడి చమురు రవాణాలో 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది శత్రు దేశాల నౌకలు ఇరాన్ అనుమతితోనే ప్రయాణించాలని నిబంధన విధించింది. అరేబియా సముద్రం నుండి కూడా ఈ మార్గాన్ని ఇరాన్ అదుపులోకి తీసుకుంది. అమెరికా దళాలు తమ నౌకలను అక్రమంగా పట్టుకోవడం "పైరసీ" కంటే ఘోరమని ఇరానీ మండిపడ్డారు.హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, దానికి బదులుగా అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని (blockade) తొలగించాలని, అలాగే అణు కార్యక్రమ చర్చలను వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ట్రంప్ బాంబు దాడుల కంటే దిగ్బంధనం చాలా ప్రభావం చూపిస్తోందని, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. -
నో ప్లాన్ బీ..! నెక్ట్స్ స్టెప్ బాంబింగ్ కంటే డేంజర్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాటే లేకుండా తిరస్కరించారు. అణు ఒప్పందం విషయంలో తాను పెట్టిన షరతులకు అంగీకరించే దాకా హర్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముందు హర్ముజ్‌ను తెరవండి. ఆ తర్వాత అణు ఒప్పందంపై చర్చలు జరుపుదాం.. అని ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన వెళ్లింది. అయితే ట్రంప్ అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా అణు ఒప్పందం జరగాలని.. అప్పటివరకు బ్లాకేడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ దిగ్బంధనంతో ఊపిరి ఆడకుండా విలవిలలాడుతోంది(ఈ క్రమంలో త్రీవ పదజాలం ప్రయోగించారాయన). అమెరికా షరతులపై అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు ఈ బ్లాకేడ్ కొనసాగిస్తుంటుంది. ఈసారి బ్లాకేడ్ బాంబింగ్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది’’ అని అన్నారాయన. అయితే..దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికా బ్లాకేడ్‌కు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తాం అంటూ బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. మేం దౌత్యానికి అవకాశం ఇస్తున్నాం. కానీ మా సహనం పరిమితమే. అవసరమైతే కఠోర చర్యలకు దిగుతాం అని హెచ్చరించారు.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం తమదేనని.. అవసరమైతే టోల్ కూడా వసూల్ చేస్తామని చెబుతూ ఇరాన్ జలసంధిని మూసేసింది. ఫలితంగా చమురు సంక్షోభం మొదలైంది. అయితే తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో జలసంధిని ఇరాన్ తెరిచింది. ఈలోపే తన మిత్రదేశం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ వెంటనే మళ్లీ మూసేసింది. ఇక చర్చల్లో ఇరాన్ మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఏప్రిల్ 13న అమెరికా నేవీ హర్ముజ్ బ్లాకేడ్‌ను ప్రకటించింది. అమెరికా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు ఇరాన్‌కు వచ్చీపోయే వాణిజ్య నౌకలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వస్తే దాడులు చేశాయి. అప్పటి నుంచి ఈ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇంకోవైపు ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయి ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. హర్ముజ్‌ను తాము మూసేయడంతో ఇరాన్‌కు ఒకరోజుకి 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అమెరికా అంటోంది. అయితే ఇరాన్ మాత్రం దీన్ని సార్వభౌమత్వంపై దాడిగా ప్రకటించుకుంది.ప్లాన్‌బీ లేనే లేదు!అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ ఇంకా కుదరలేదు. మధ్యవర్తిగా ఉన్న పాక్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. దీంతో మరో వ్యూహం జోలికి పోకుండా ట్రంప్ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను చర్చలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘‘ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరు చమురును వినియోగించుకోలేకపోతోంది. ఆ నిల్వలు పేరుకుపోయి పైప్లైన్లు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు.. ఇకపై తాను మంచోడిలా ఉండలేనంటూ తుపాకీతో ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌పై మరోసారి దాడులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పరిస్థితిని సమీక్షిస్తోంది. కుదిరితే చిన్నస్థాయిలో దాడులు చేయాలని.. వాటి ఫలితం మాత్రం ఇరాన్‌పై అత్యంత ప్రభావం చూపాలని ప్రణాళిక గీస్తోంది. అయితే ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉందని ఓ అధికారి చెబుతున్నారు. ఇరాన్ మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని.. ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఈ లెక్కన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు హర్ముజ్ మరోసారి కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. -
యుద్ధంతో పాక్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం: షెహబాజ్
ఇస్లామాబాద్: అమెరికా–ఇరాన్ యుద్ధం పరోక్షంగా పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ ప్రగతికి ప్రతిబంధకంగా నిల్చిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘యుద్ధంకారణంగా విదేశాల నుంచి చమురు దిగుమతుల కోసం పెద్దమొత్తంలో విదేశీమారక ద్రవ్యాన్ని ఖర్చుచేయాల్సి వస్తోంది. గతంలో క్రూడాయిల్ దిగుమతుల కోసం వారంలో 30 కోట్ల డాలర్లు ఖర్చయ్యేది. ఇప్పుడది ఏకంగా 80 కోట్ల డాలర్లకు పెరిగింది. చమురు సంక్షోభాన్ని కట్టడిచేసేందుకు ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటుచేశాం’’ అని బుధవారం కేబినెట్ సమావేశంలో షెహబాజ్ వెల్లడించారు. చర్చల్లో మధ్యవర్తిగా పాక్ అద్భుతమైన పాత్ర పోషిస్తోందని, కాల్పుల విరమణ గడువు పొడిగించడంలో పాక్ చేసిన కృషి దాగి ఉందని ఆయన అన్నారు. -
ఇకపై నేను మంచివాడిని కాదు
వాషింగ్టన్: ఇరాన్ అణు కార్యక్రమాలపై దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమైనంత త్వరగా లభించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఒకవేళ ఆశించిన పరిష్కారం లభించకపోతే అత్యంత కఠినంగా వ్యవహరించక తప్పదని ఇరాన్‌ను హెచ్చరించారు. ముప్పు తప్పించుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలని ఇరాన్‌కు సూచించారు. అణ్వస్త్ర కార్యక్రమాలకు స్వస్తి పలకాలని పరోక్షంగా స్పష్టంచేశారు. ఈ మేరకు చేతుల్లో తుపాకీ పట్టుకున్న ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో తాజాగా పోస్టుచేశారు. ఇందులో కొండలపై బాంబు పేలుళ్ల దృశ్యం కనిపిస్తోంది. తన మాట వినకపోతే ఇరాన్‌పై భీకర యుద్ధానికి సిద్ధమని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇకపై తాను మంచివాడిగా ఉండబోనని(నో మోర్ మిస్టర్ నైస్ గై) అని ట్రంప్ పోస్టు చేశారు. శాంతి చర్చల విషయంలో ఇరాన్ సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. అమెరికాతో అణ్వస్త్ర రహిత ఒప్పందం ఎలా చేసుకోవాలని ఇరాన్‌కు ఏమాత్రం తెలియడం లేదని ఆక్షేపించారు. వారు కాస్త తెలివిగా ప్రవర్తిసే బాగుంటుందని పేర్కొన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. అమెరికా యుద్ధ వ్యయం రూ.2.37 లక్షల కోట్లుపశ్చిమాసియాలో ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ఇప్పటిదాకా 25 బిలియన్ డాలర్లు(రూ.2.37 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు పెంటగాన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జూల్స్ హస్ట్–3 వెల్లడించారు. ఈ సమాచారాన్ని అమెరికా చట్టసభ సభ్యులకు చేరవేశారు. హౌస్ ఆరŠమ్డ్ సర్వీసెస్ కమిటీతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. 25 బిలియన్ డాలర్లలో ఎక్కువ భాగం ఆయుధ సామగ్రిపై ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికి, ఖాళీ అయిన పరికరాలను భర్తీ చేయడానికి కూడా పెద్ద ఎత్తున సొమ్ము వ్యయం చేసినట్లు తెలియజేశారు. -
దౌత్యమా... ఇంకా దాదాగిరీయేనా?
మొదటి విడత చర్చలు ఏప్రిల్ 12న విఫలమై, రెండవ విడతకు ముహూర్తమైనా కుదరని స్థితిలో, తాను దౌత్యానికి మారదలచుకున్నారా లేక దాదాగిరీ పద్ధతిలోనే కొనసాగుతారా అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చుకోవలసి ఉంది. లేదంటే ఇరాన్‌తో మళ్ళీ చర్చలు గానీ, సమస్య పరిష్యారం గానీ జరిగే సూచనలు లేవు. రెండవ విడత కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తుండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇస్లామాబాద్‌కు ఏప్రిల్ 24, 25వ తేదీలలో వెళ్ళి చర్చల పునరారంభానికి తమ షరతులేమిటో చెప్పి తిరిగిపోవటం, తమ ప్రతినిధుల ప్రయాణాన్ని ట్రంప్ అకస్మాత్తుగా రద్దు చేయటాన్ని బట్టి అర్థమవుతున్నది ఇదే. అరాగ్చీ ప్రతిపాదించిన షరతులేమిటో అధికారికంగా వెల్లడి కాలేదు గానీ, అవి గతానికన్నా భిన్నంగా ఉండే అవకాశం తక్కువ. అసలు విషయం అది కాదు. ఇరాన్‌కు సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్‌ల లక్ష్యాలు మారటమన్నది మౌలిక ప్రశ్న. ఒకసారి అది తేలితే ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో రాజీలు కుదరటం సాధ్యమవుతుంది. మొదట్నుంచీ అదే వైఖరిఈ మాట అనటం ఎందుకంటే, ఇరాన్ పట్ల దౌత్యానికి బదులు దాదాగిరీ వైఖరిని తన మొదటి విడతలోనే (2017–21) ప్రదర్శించిన ట్రంప్, ఈ రెండవ విడతలోనూ అదే పని చేస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగానే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు ఆరంభించటం మొదలుకొని, మొదటి విడత చర్చల వైఫల్యం మీదుగా ఈ రెండవ విడత చర్చల అనిశ్చితి వరకు తను చూపుతున్నది ఆసాంతం దాదాగిరీయే. తమ అసమానమైన ఆర్థిక, సైనిక శక్తులు మినహా ఆయన నోటి నుంచి మరొక మాట వినిపించదు. వాటిని ఉపయోగించి ఇరాన్ సహా ఎవరినైనా సర్వనాశనం చేయగలమంటారు. ఇందులో దౌత్య విధివిధానాలు ఆవగింజంతయినా కనిపిస్తున్నాయా?ట్రంప్‌లో దౌత్య నీతి లక్షణాలుంటే, యురేనియం శుద్ధి విషయమై ఇరాన్, అమెరికాల మధ్య (రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో కలిపి) 2015లో కుదిరిన ఒప్పందం సజావుగా సాగుతుండగా 2018లో దానిని అకస్మాత్తుగా రద్దు చేసేవారు కాదు. ఇరాన్‌పై యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఎంత ఒత్తిడి చేసినా బుష్, ఒబామా, బైడెన్లు నిరాకరించిన స్థితిలో, తాను దాడులకు సిద్ధమయ్యేవారు కాదు. పరిష్కారం లభించవచ్చుననుకున్న ప్రతి దశలోనూ ఆ అవకాశాలను ఇజ్రాయెల్ భంగపరుస్తుండగా మౌనం వహించేవారు కాదు. వాస్తవానికి దాదాగిరీ లక్షణాన్ని ఆయన చూపుతున్నది ఇరాన్ విషయంలోనే కాదు. రెండవసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి పనామా కాలువ, కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనిజులా విషయమై చేసిందేమిటో తెలిసిందే. యుద్ధాలు ఆపే ప్రతిజ్ఞలు చేసిన మనిషి, 9 యుద్ధాలు ఆపానంటూ ఇప్పటికి కొత్తగా 8 సైనిక దాడులు సాగించారు. టారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాల అరాచకం సరేసరి. ఇందులోనూ గమనించదగ్గ విశేషం ఒకటున్నది. తన పులి చారలు, కోరలను అనునిత్యం ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టజూసే ఆయనలో ‘కాగితం పులి’ లక్షణాలు కూడా ఉన్నాయి. అది, బలహీనుల ముందు విజృంభించి బలవంతుల ఎదుట తగ్గి ఉండటం. పనామా, వెనిజులా విషయంలో జరిగింది ఒకటైతే, తనను ధిక్కరించిన కెనడా, గ్రీన్‌ల్యాండ్ (యూరప్), బ్రెజిల్, దక్షిణాఫ్రికాల సంగతి వేరయ్యింది. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాను లొంగదీయలేక తానే రాజీకి ప్రయత్నిస్తున్నారు. చైనా మాట అయితే చెప్పనక్కరలేదు. ఇరాన్ ప్రతిఘటనలు మరొక దృష్టాంతం.పరిష్కారానికి రాజమార్గంకొంత లోతుకి వెళ్ళినట్లయితే, ట్రంప్ ద్వారా ప్రదర్శితమవుతున్న ఈ లక్షణాలన్నీ అమెరికా సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడుతూ... దానికి స్లో–మోషన్ సంకేతాల వంటివి. అమెరికన్ నాయకత్వపు ‘నాటో’ కూటమిలోనే పెరుగుతున్న భిన్నాభిప్రాయాలు, కనీసం ఇరాన్ దిగ్బంధానికైనా ఏ ఒక్కరూ కలిసి రాకపోవటం, మరొక స్థాయిలో బహుళ ధ్రువ ప్రపంచ ఆకాంక్షలు విస్తరిస్తుండటం ఈ మార్పులను ప్రతిఫలిస్తున్నాయి. ఈ పలు విధాలైన పరిణామాల దశలో ఇరాన్ ఒక హీరోలా లేచి నిలుచున్నది. అందువల్ల అమెరికా అధ్యక్షుడు వాస్తవాలను కనీసం ఇప్పటికైనా గుర్తించి, ఇజ్రాయెల్ ప్రభావం నుంచి బయటపడి, దౌత్యమార్గం వైపు మళ్లటం మంచిదవుతుంది. తమ సార్వభౌమతను, హక్కులను కాపాడుకునేందుకు ఇరాన్ చూపుతున్న దృఢ సంకల్పం, ప్రతిఘటన సాధారణమైనవి కావు. మనం స్వయంగా చూసినంతవరకు వియత్నాం(1955–75), అఫ్గానిస్తాన్(2001–21) తర్వాత, 1953 నుంచి మొదలై నేటికీ సాగుతున్న ఇరాన్ పోరాటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. యురేనియం శుద్ధి తదితర అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతుండగానే అకస్మాత్తుగా దాడులు జరిపి ఇరాన్ రాజకీయ, సైనిక నాయకత్వాలను నిర్మూలించటం నుంచి మొదలు కొని, ఇరాన్ రేవులను దిగ్బంధించటం వరకు గల క్రమం అంతా చూపుతున్నది అమెరికా దౌత్య నీతినా లేక బస్తీ రౌడీ లక్షణాలనా? ఇరాన్ రెండవ విడత చర్చలకు నిరాకరించటమే సరైనదని భావించక తప్పదు. విదేశాంగ మంత్రి అరాగ్చీ ఇస్లామాబాద్‌లో 25వ తేదీన మరోమారు అన్నమాట: అమెరికాకు విశ్వసనీయత లేకుండా పోయిందనీ, అది కుదిరేవరకు తాము చర్చలకు వెళ్లబోమనీ, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనీ. ఆ తర్వాత ఒమాన్, రష్యా సందర్శనల వెనుక ఆయన తెహ్రాన్‌కు తిరిగి వెళ్ళి అన్ని పరిస్థితులను సమీక్షించుకున్నపుడు, వైఖరి అంటూ మార్చుకోవలసింది స్వదేశంలోనూ విశ్వసనీయతను కోల్పోతున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని అర్థమవుతుంది. సమస్య పరిష్కారానికి రాజమార్గం ఎదుటనే ఉంది. అది అంతర్జాతీయ నిబంధనల మేరకు అణుశుద్ధికి ఇరాన్‌కు గల హక్కులకు అడ్డుచెప్పకపోవటం, పాలస్తీనా సృష్టిని అంగీకరించటం, గ్రేటర్ ఇజ్రాయెల్ పథకాన్ని రద్దు చేయటం!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
గన్ ఫొటోతో ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుందనే ఊహాగానాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇకపై తాను మంచిగా ఉండదలచుకోవడం లేదంటూ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ట్రంప్ గన్నుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘ఇకపై నేను మంచిగా ఉండాలనుకోవడం లేదు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ తన వైఖరి మార్చుకోవాలి. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియదు. లేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక, సైనిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది’అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో హర్మూజ్ జలసంధిలో దీర్ఘకాలిక బ్లాకేడ్ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు.వైట్ హౌస్‌లో ట్రంప్ వ్యాఖ్యలువైట్ హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాలో తన శత్రువులను సైనికంగా ఓడించిందని పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను అభివృద్ధి చేయడానికి అనుమతించబోమని ఆయన పునరుద్ఘాటించారు.ఇరాన్ ప్రతిస్పందనఇరాన్ తాజాగా అమెరికాకు కొత్త ప్రతిపాదనను పంపింది. ఇందులో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించడం వంటి అంశాలు ఉన్నాయి. అణు చర్చలను తరువాత దశకు వాయిదా వేయాలని కోరింది. అమెరికా మాత్రం ఇరాన్ కనీసం 10 సంవత్సరాలపాటు యురేనియం ఎన్రిచ్మెంట్ నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం తొలగించాలని డిమాండ్ చేస్తోంది. President Trump posts on Truth Social: Iran can’t get their act together. They don’t know how to sign a nonnuclear deal. They better get smart soon! President DJT pic.twitter.com/tFEwmalvrD— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) April 29, 2026 -
ఇరాన్‌కు ముచ్చెమటలు.. ట్రంప్ బ్లాక్‌బస్టర్ వ్యూహం
అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్‌కు చుక్కలు చూపిస్తోంది. మొన్నటి వరకు ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడిన అమెరికా.. ఇప్పుడు ప్లాన్ మార్చి వ్యూహాత్మకంగా ఇరాన్‌ను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై కఠిన ఆర్థిక చర్యలకు దిగింది. తాజాగా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) రంగంలోకి దిగింది. ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు, వ్యక్తులపై.. ‘షాడో బ్యాంకింగ్’ నెట్వర్క్ ద్వారా ఇరాన్ ఆయుధాలు, క్షిపణి ప్రోగ్రామ్‌లు, ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చుతున్నాయని ఆరోపిస్తూ వీరిని బ్లాక్‌లిస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా యుద్ధంలో రోజురోజుకు పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇరాన్‌పై ట్రంప్ కఠిన ఆర్థిక చర్యలకు దిగారు. ఇరాన్‌పై ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంలో భాగంగా ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు(కొన్ని బ్యాంకులు కూడా), వ్యక్తులపై ఓఎఫ్ఏసీ ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ రహస్యంగా నిర్వహిస్తున్న షాడో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా భారీ మొత్తంలో డబ్బు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతోంది. ఈ నిధులు ఇరాన్ సైన్యం, క్షిపణి కార్యక్రమాలు, ప్రాంతీయ ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చేరుతున్నాయి. ఇరాన్ సైనిక వ్యవస్థకు ఈ రహస్య బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక జీవనాధారంగా పనిచేస్తుంది. ఈ నెట్‌వర్క్‌కు సహకరించే ఏ ఆర్థిక సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలు, ఆంక్షలకు గురైన సంస్థలకు అంతర్జాతీయ ఆర్థిక రంగంలోకి అక్రమ ప్రవేశం కల్పించడానికి విదేశీ అధికార పరిధిలోని షెల్ ఖాతాలను ఉపయోగిస్తున్నాయి’ అని ఆరోపించారు.ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. ఇదిలా ఉండగా.. ఇరాన్ టార్గెట్ అమెరికా.. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌కు సంబంధించి దాదాపు వెయ్యి సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. తాజా చర్యలతో అమెరికాలో ఉన్న సంబంధిత సంస్థల ఆస్తులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే వీరితో లావాదేవీలు కొనసాగించే విదేశీ బ్యాంకులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దూరమయ్యే ప్రమాదం ఉంది.బ్యాంకులకు ఝలక్.. మరోవైపు.. అమెరికా విధించిన ఆంక్షలకు గురైన సంస్థల్లో బ్యాంక్ సెపాత్ అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంక్ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అలాగే బ్యాంక్ సినా సుప్రీం లీడర్ నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. పార్సియన్ బ్యాంక్‌లతో సంబంధాలు ఉన్న కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అయితే, తాజా చర్యలు ఇరానియన్ ఆయిల్ కంపెనీలకు నిధులను తరలించే వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన షుకున్ లిమిటెడ్ సంస్థ, 2024లో ఇరాన్ చమురు లావాదేవీల కోసం 70 మిలియన్ డాలర్లకు పైగా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.చైనా రిఫైనరీలకు హెచ్చరిక..ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న “టీపాట్ రిఫైనరీలు” (ప్రధానంగా షాండాంగ్ ప్రావిన్స్‌లో)తో వ్యాపారం చేసే బ్యాంకులు కూడా ఆంక్షలకు గురవుతాయని OFAC హెచ్చరించింది. ఇవి చిన్న, స్వతంత్ర రిఫైనరీలు. ప్రధానంగా చైనా షాండాంగ్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. పెద్ద ప్రభుత్వ రిఫైనరీలతో పోలిస్తే, వీటికి అంతర్జాతీయ నియంత్రణలు తక్కువగా ఉంటాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న ఈ రిఫైనరీలతో వ్యాపారం చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆంక్షలకు గురవుతాయి అని అమెరికా స్పష్టం చేసింది. అంటే, ఈ రిఫైనరీలకు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ సర్వీసులు అందించే సంస్థలు కూడా బ్లాక్‌లిస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. -
ఇరాన్ దగ్గరే అణ్వాయుధం గనుక ఉంటే..
ఇరాన్‌తో అణు ఒప్పందం ఎటూ తేలకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. చర్చలకు ఇరాన్ దిగి రాకపోవడం, మధ్యవర్తి పాకిస్తాన్ సైతం చేతులెత్తేయడంతో ఈ డీల్‌పై అనిశ్చితి నెలకొంది. ఈ తరుణంలో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు మరింత చిరాకు పుట్టించినట్లున్నాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా తీరును మెర్జ్ తప్పుబట్టగా.. అందుకు ట్రంప్ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇరాన్ అణు ఆయుధం కలిగి ఉండడం సరైందేనని మెర్జ్ భావిస్తున్నారు. కానీ, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. ఒకవేళ ఇరానే గనుక అణ్వాయుధం కలిగి ఉంటే.. ప్రపంచమే దానికి బందీ అవుతుంది’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. గత అమెరికా అధినేతలెవరూ చేయలేని పనిని తాను చేస్తున్నానని.. అందుకు సంతోషించాలని మెర్జ్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వాస్తవానికి.. ‘‘ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలను పొందకూడదు. ఆ దేశ అణు సామర్థ్యం యూరప్‌కే కాదు.. ప్రపంచానికి ప్రమాదకరం’’ అని మెర్జ్ అన్నారు. అదే సమయంలో చర్చల్లో ఇరాన్ నైపుణ్యంగా వ్యవహరిస్తోందని.. అమెరికా ఈ సమస్యను ఎదుర్కొనే విధానం అస్పష్టంగా ఉందని ఆయన విమర్శించారు. అమెరికా ప్రతినిధులు పాకిస్తాన్‌కి వెళ్లి చర్చలు జరిపినా, ఎటువంటి ఫలితం రాలేదని ఆయన ఉదహరించారు. అయితే..మెర్జ్ వ్యాఖ్యలను ట్రంప్ పొరపాటుగా అర్థం చేసుకున్నారా? లేదంటే అమెరికా తీరును తప్పుబట్టినందుకు మండిపోయి అలా పోస్ట్ చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఉక్రెయిన్ యుద్ధంలోనూ అమెరికా వ్యూహాలపై యూరప్ దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అగ్రరాజ్యం అసలు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందా? అని ప్రశ్నించాయి. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోలాండ్, బాల్టిక్ దేశాలు, అలాగే యూరోపియన్ యూనియన్ నాయకత్వం అమెరికా–రష్యా మధ్య జరుగుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టారని విమర్శించాయి. అప్పటి నుంచి అమెరికా-యూరప్ దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతూ వస్తున్నాయి. -
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఇప్పుడెలా ఉన్నారు?
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన వదంతులను భారత్‌లోని ఆయన ఉప ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ హొస్సేన్ జియాయీనియా ఖండించారు. మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పారు.“మా సుప్రీం లీడర్ హజ్రత్ అయతొల్లా సయ్యిద్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి దేవుని కృప వల్ల బాగుంది. కొన్ని రోజుల క్రితం మాకు అందిన సమాచారం ప్రకారం.. ఆయన పరిస్థితి బాగుంది” అని జియాయీనియా తెలిపారు. ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల్లో వాస్తవాలు లేవని చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, కొన్ని సమస్యలు ఉన్నాయని వస్తున్న వదంతులన్నీ నిజం కాదని పేర్కొన్నారు.పశ్చిమాసియా ఘర్షణపై ఇరాన్ వైఖరిని మరోసారి చెబుతూ.. “యుద్ధం ప్రారంభం నుంచే మా దివంగత సుప్రీం లీడర్ హజ్రత్ అయతొల్లా సయ్యిద్ అలీ ఖమేనీ చెప్పిన వాక్యాన్ని మేము చెబుతున్నాము. అమెరికన్లు, మా శత్రువులు ఈ యుద్ధాన్ని ప్రారంభించారు, కానీ ఈ యుద్ధాన్ని ముగించేది మాత్రం మేమే. ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో మేమే నిర్ణయిస్తాము’’ అని చెప్పారు.గతవారం న్యూ యార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల తర్వాత మొజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనపడలేదు. ఆ దాడులు మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివసించిన భవన సముదాయంపై జరిగాయి. ఆ ఘటనలో ఆయన భార్య, కుమారుడు మరణించారు.ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ వద్దకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ప్రధానంగా వైద్య సిబ్బంది మాత్రమే ఆయనను చూసుకుంటున్నారు. దాడుల్లో గాయాల నుంచి ఆయన కోలుకుంటున్నారని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.పశ్చిమాసియా ఘర్షణ ముగింపుకు ప్రయత్నాలు, రష్యా, చైనా, భారత్ పాత్రపై జియాయీనియా స్పందిస్తూ.. “ప్రతి దేశం పాత్ర పోషించవచ్చు, అది సానుకూలం లేదా ప్రతికూల పాత్ర కూడా కావచ్చు” అని చెప్పారు. ప్రతి ఒక్కరూ గ్యాస్, చమురు ధరల గురించి ఆందోళన చెందుతున్నారని.. కానీ, ప్రాణాలు కోల్పోతున్న ప్రజల జీవన విలువ గురించి ఎవరూ ఆందోళన చెందడం లేదని అన్నారు.ఇరాన్ ప్రజలు ఐక్యంగా ఉన్నారని, దేశంలో అంతర్గత ఉద్రిక్తతలపై వచ్చే నివేదికలు, సూచనలు ప్రభుత్వ వ్యవస్థ గురించి అవగాహన లేని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వ వ్యవస్థ ఒక వ్యక్తిపై ఆధారపడదని, అది రిపబ్లిక్ అని చెప్పారు. -
వ్యూహం మార్చిన ట్రంప్.. IRGCకి తొలి దెబ్బ!
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం అసలు సిసలు స్టేజ్‌కు చేరుకుంది. ఇరాన్‌పై అమెరికా పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఆర్థికంగా ఇరాన్ దెబ్బకొట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్ పోర్టులకు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని నౌకలను అడ్డుకుంటోంది. సముద్ర దిగ్భందనం చేసింది. దీంతో, ఇరాన్ రోజుకు దాదాపు 500 మిలియన్ డాలర్లు నష్టం చవిచూస్తోంది.ఇక, తాజాగా అమెరికా మరో మాస్టర్ ప్లాన్ చేసింది. అమెరికా ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి విమానయాన రంగాన్ని కీలకంగా ఉపయోగిస్తోంది. అమెరికా ఆపరేషన్ ఎకానామిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ విమానయాన సంస్థలతో లావాదేవీలు జరిపే కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ విమానాలకు జెట్ ఇంధనం, క్యాటరింగ్, ల్యాండింగ్ సేవలు లేదా నిర్వహణ వంటి సహాయాన్ని అందించే సంస్థలను సాయం నిలిపివేయాలని హెచ్చరించింది. ఈ క్రమంలో, ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కి సేవలు అందించే ఏ కంపెనీ అయినా ఆంక్షలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఆయా కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా పేర్కొంది.కాగా, ఇరాన్‌కు Iran Air మరియు Mahan Air విమాన సంస్థలు ఉన్నాయి. ఇవి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ప్రకారం, ఇరాన్ ఎయిర్‌లైన్స్ IRGC కోసం ఆయుధాలు, సిబ్బంది, సామగ్రి తరలించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్‌లైన్స్‌పై ఆంక్షలు విధించి ఆర్థికంగా ఇరాన్‌ను దెబ్బతీయాలనే ప్లాన్ చేసినట్టు తెలిసింది. అలాగే, ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోని కంపెనీలు ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో సంబంధాలు పెట్టుకోకుండా చూడాలని అమెరికా కోరుతోంది.ప్రస్తుతం అమెరికా ఆంక్షల జాబితా (SDN List)లో ఇరాన్‌కు సంబంధించిన అనేక కంపెనీలు, షిప్పింగ్ సంస్థలు, రిఫైనరీలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా చైనా, హాంకాంగ్, యూఏఈ, లైబీరియా, మార్షల్ దీవులు, కేమన్ దీవులు వంటి దేశాలకు సంబంధించిన సంస్థలు. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా ఆంక్షల వల్ల చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ఇప్పటికే నష్టపోయాయి. ముఖ్యంగా చైనా రిఫైనరీలు, షిప్పింగ్ కంపెనీలు, మరియు ఇరాన్ ఆయిల్ రవాణా నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ నుండి వేరుచేయబడ్డాయి.ట్రంప్ వార్నింగ్యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉందని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్‌కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్, దిగ్బంధనం కారణంగా వారి వద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. ఆర్థికంగా ఇరాన్ బలహీనంగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ..ఇరాన్‌పై 2025లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇరాన్‌కి సంబంధించిన ఆయుధాలు, డ్రోన్లు, ఆయిల్ స్మగ్లింగ్, విమాన రవాణా నెట్‌వర్క్‌లను అడ్డుకోవడమే లక్ష్యం.ప్రెషర్ పాయింట్: అంతర్జాతీయంగా విమానయాన సేవలు లేకుండా ఎయిర్‌లైన్స్ నడవలేవు. అందుకే ఈ రంగాన్ని ఆంక్షలతో బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు.ప్రాంతీయ ఉద్రిక్తతలు: హార్మూజ్ జలసంధిలో ఇరాన్ బలగాలు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపిన ఘటనల తర్వాత ఈ హెచ్చరిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.ఆంక్షలు: అమెరికా వెలుపల ఉన్న కంపెనీలు కూడా ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కి సేవలు అందిస్తే ఆంక్షలకు గురవుతాయి. ఆంక్షలు పడిన సంస్థలు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ, మార్కెట్లకు దూరమవుతాయి.సేవలు నిషేధం:జెట్ ఇంధనం సరఫరావిమాన మెయింటెనెన్స్, రిపేర్ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్గ్రౌండ్ హ్యాండ్లింగ్ల్యాండింగ్, ఎయిర్పోర్ట్ ఫీజులుప్రపంచ వ్యాపారాలు: విమానయాన, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లోని సంస్థలు నేరుగా ప్రభావితమవుతున్నాయి.ప్రాంతీయ ప్రభావం: హార్మూజ్ జలసంధి దిగ్భందనం వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా అంతరాయం. -
పోరు ఆపితే తెరుస్తాం
కైరో/మాస్కో/దుబాయ్: హార్మూజ్ జలసంధిని దిగ్బంధం నుంచి విముక్తి కల్పించి యుద్ధానికి చరమగీతం పాడితే హార్మూజ్ జలసంధి గుండా విదేశీ వాణిజ్యనౌకల రాకపోకలకు మార్గం సుగమం చేస్తామని ఇరాన్ కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది. ఆదివారం ఒమన్ నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు తమ ప్రతిపాదనలకు హెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తెలియజేశారు. వీటిని అమెరికాకు పాక్ అందజేయనుంది. వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విముఖత చూపొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుతిన్‌తో అరాఘ్చీ భేటీ.. ఇరాన్ మంత్రి అరాఘ్చీ సోమవారం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. తమ సార్వ¿ౌమత్వం కోసం పోరాడుతున్న ఇరానియన్లను ఈ సందర్భంగా పుతిన్ పొగిడారు. తర్వాత పశ్చిమాసియా యుద్ధం, హార్మూజ్ దిగ్బంధం, అమెరికా షరతులు, ఇరాన్ డిమాండ్లు తదితర కీలకాంశాలపై అరాఘ్చీ, పుతిన్ విస్తృతంగా చర్చించుకున్నారని రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్ తెలిపింది. ‘‘పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం రష్యా తన శక్తిమేరకు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్‌తో వ్యూహాత్మక బంధం బలోపేతానికి కృషిచేస్తాం’’అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టంచేశారు. భారతీయ ట్యాంకర్‌పై కాల్పులు.. ఒమన్ నుంచి భారత్‌కు వస్తున్న రసాయనాల ట్యాంకర్ ఎంటీ చిరాన్7పై ఇరాన్ గన్బోట్లు హెచ్చరిస్తూ కాల్పులు జరిపాయి. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన ఈ కాల్పులఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హార్మూజ్‌కు వాయవ్యంగా ఒమన్‌కు చెందిన షినాస్ పోర్ట్ సమీప జలాల గుండా నౌక వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నౌకలోని 17 మంది భారతీయనావికులకు ఎలాంటి గాయాలుకాలేదని కేంద్ర షిప్పింగ్, పోర్ట్‌లు, వాటర్‌వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రంధావా తెలిపారు. -
యూఏఈకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ
అబుదాబి: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేందుకు యూఏఈ చర్యలకు ఉపక్రమించింది. ఇజ్రాయెల్ అందించిన ‘ఐరన్ డోమ్’ను యూఏఈ మోహరించింది. ఇరాన్ నుంచి పెరుగుతున్న డ్రోన్, క్షిపణి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, యూఏఈ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అబ్రహాం ఒప్పందాల తర్వాత రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారం పెంచుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా, యూఏఈలో ఐరన్ డోమ్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 4–70 కిలోమీటర్ల పరిధిలోని రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను అడ్డుకుంటుంది. మిర్ ఇంటర్‌సెప్టర్ అనే క్షిపణులు లక్ష్యాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తాయి. ఎల్టా సిస్టమ్స్ రాడార్ ద్వారా వచ్చే ముప్పులను గుర్తించి, వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇజ్రాయెల్‌లో ఈ వ్యవస్థ 90శాతం విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ గత కొన్నేళ్లుగా యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై డ్రోన్ దాడులు జరిపింది. 2025లో యూఏఈపై జరిగిన దాడుల్లో 2,200కి పైగా డ్రోన్లు ఉపయోగించింది. ఈ నేపథ్యంలో యూఏఈలో ఐరన్ డోమ్‌ను వినియోగంలోకి తెచ్చింది. యూఏఈ ఇప్పటికే అమెరికా నుంచి పాట్రియట్, థాడ్ రక్షణ వ్యవస్థలను పొందింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చేరడంతో యూఏఈ రక్షణ మరింత బలపడనుంది. అమెరికా,ఇజ్రాయెల్,యూఏఈ త్రైపాక్షిక సహకారం ఇరాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్,యూఏఈ,అమెరికా బలమైన కూటమి ఏర్పడుతోంది. తాజా పరిణామంతో యూఏఈలోని చమురు, వాణిజ్య కేంద్రాలు ఇప్పుడు మరింత రక్షణగా ఉండనున్నాయి. ఇరాన్ దాడులు కొనసాగితే, ఐరన్ డోమ్ వ్యవస్థ యూఏఈ భద్రతకు కీలకంగా మారుతుంది. మొత్తం మీద, యూఏఈలో ఐరన్ డోమ్ అమలు కేవలం రక్షణ చర్య మాత్రమే కాదు .. ఇరాన్ ముప్పు పెరుగుతున్న ఈ సమయంలో, యూఏఈ భద్రతా వ్యూహంలో కీలక మలుపేనని నిపుణులు భావిస్తున్నారు. -
ఈసారి భీకర దాడే: ఇరాన్ వార్నింగ్
గల్ప్ దేశాలకు ఇరాన్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ నుంచి నాలుగింతలు దాడి చూడాలనుకుంటేనే అమెరికా మద్దతు విషయంలో ముందుకెళ్లాలని, ఈ తరుణంలో జరిగే పరిమాణాలకు మీరే బాధ్యత వహించాలని ఇరాన్ హెచ్చరించింది. యుద్ధానికి సంబంధించి రెండో విడత శాంతి చర్చలు ఇంకా అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో తమ పొరుగు గల్ఫ్ దేశాలు ఏమైనా అమెరికాకు మద్దతు ఇస్తే మాత్రం ఈసారి తమ నుంచి భీకర దాడి చూడాల్సి వస్తుందని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఎస్మాయిల్ సాగాబ్ ఎస్ఫహానీ హెచ్చరించారు. ప్రధానంగా హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న నిర్బంధం కారణంగా తమ మౌలిక వసతులు, ముఖ్యంగా చమురు బావులు, దెబ్బతింటే మాత్రం నాలుగు రెట్లు ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వాలని భావించే గల్ఫ్ దేశాలు కాస్త వెనక్కి తగ్గితేనే మంచిదని, లేని పక్షంలో తమ నుంచి ఈసారి వచ్చే ప్రతిస్పందన మీ ఊహకు కూడా అందదని ఎస్ఫహానీ ముందస్తు సంకేతాలు పంపారు. ‘మా లెక్కలు వేరుగా ఉంటాయి. ఒక చమురు బావి అంటే నాలుగు చమురు బావుల నష్టం, అమెరికాకు మద్దతిస్తే మాకు భారీ నష్టాన్ని తేవడంలో మీ వంతు పాత్ర కూడా ఉందనే అనుకుంటాం. అందుకు ప్రతి స్పందన కూడా నాలుగింతలే ఉంటుంది’ అని పేర్కొన్నారు. గత వారం, తన ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్.. ఇరాన్‌ను కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థగా రాసుకొచ్చారు. ‘ ఇరాన్ ఆర్థికంగా కూలిపోతోంది. వారు హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని కోరుకుంటున్నారు . నగదు కోసం ఆకలితో ఉన్నారు. రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతున్నారు. సైన్యం, పోలీసులు జీతాలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి’ అని తెలిపారు. -
దిగివచ్చిన ఇరాన్.. యుద్ధం ముగింపు, హార్మూజ్‌పై గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు అందించింది అంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీంతో, యుద్ధంగా ముగుస్తుందా? అనే చర్చ మొదలైంది. అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ ప్రకారం..‘అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తానీ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ చేరవేసింది. వివాదాస్పద అణు చర్చలను తదుపరి దశకు వాయిదా వేస్తున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొంది’ అని వెల్లడించింది. కాగా, పశ్చిమాసియా సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన కీలక పరిణామంగా ఆ మీడియా కథనం అభివర్ణించింది. యాక్సియోస్ ప్రకారం.. వైట్‌హౌస్‌కు ఈ ప్రతిపాదన అందింది. కానీ, దీనిని పరిశీలించడానికి యునైటెడ్ స్టేట్స్ సుముఖంగా ఉందో లేదో స్పష్టంగా తెలియదు.Amid the deepening stalemate in peace talks, Iran has conveyed a fresh proposal to the United States through Pakistani mediators, prioritising reopening the Strait of Hormuz and bringing the ongoing war in West Asia to an end while deferring contentious nuclear negotiations to a… pic.twitter.com/DNRlZgKoZH— India Today Global (@ITGGlobal) April 27, 2026ఇదిలా ఉండగా.. చర్చలకు రెడీ అయితే ఇరాన్ ఎప్పుడైనా తమకు సందేశాన్ని పంపొచ్చని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు పొందే అవకాశాన్ని ఇరాన్‌కు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక, ఇరు దేశాల మధ్య స్తంభించిపోయిన శాంతి ప్రయత్నాల మధ్య ఈ ప్రతిపాదన వచ్చింది.అణు చర్చలపై ఉత్కంఠ..అంతకుముందు.. ఇరాన్ కనీసం ఒక దశాబ్దం పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్న నిల్వలను దేశం నుండి తరలించాలని అమెరికా డిమాండ్ చేసింది. అయితే, నివేదిక ప్రకారం, ఈ డిమాండ్లకు ఎలా స్పందించాలనే దానిపై ఇరాన్ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి మరియు ప్రధాన సంధానకర్త అబ్బాస్ అరఘ్చి వారాంతంలో మధ్యవర్తులతో చెప్పారు. ఇక, పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా తెలియజేసిన రెండు దశల ప్రణాళికలో మొదట హార్మూజ్ జలసంధిపై సంక్షోభాన్ని పరిష్కరించడం, అమెరికా దిగ్బంధనాన్ని ముగించడంపై ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, కాల్పుల విరమణను సుదీర్ఘ కాలం పాటు పొడిగించడమో లేదా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమో చేయాలి. జలసంధిని తిరిగి తెరిచి, దిగ్బంధనాన్ని ఎత్తివేసిన తర్వాత, తదుపరి దశలో మాత్రమే అణు చర్చలు ప్రారంభించాలి. -
పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఇరాన్!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్‌పై ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు పాకిస్తాన్ తగిన మధ్యవర్తి కాదంటూ బాంబు పేల్చారు. అమెరికాకు మాత్రమే పాకిస్తాన్ వత్తాసు పలుకుతోందని ఘాటు విమర్శలు గుప్పించారు. దీంతో, చర్చలపై కొత్త ట్విస్ట్ నెలకొంది.అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధం నెలకొన్న వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ జాతీయ భద్రత మరియు విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న ఎంపీ ఇబ్రహీం రెజాయీ.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇబ్రహీం ఎక్స్ వేదికగా..‘ఇరాన్‌కు పాకిస్తాన్ మంచి మిత్రుడే. కానీ, చర్చలకు సంబంధించి మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్తాన్‌కు లేదు. చర్చలకు పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదు. ఒక మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలి, ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపకూడదు. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇస్లామాబాద్ వాషింగ్టన్‌ను బహిరంగంగా విమర్శించకుండా ఉంటోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి ఉన్నప్పటికీ చర్చలను సజీవంగా ఉంచడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్‌కు ఊహించని షాక్ ఇచ్చినట్టు అయ్యింది. కాగా, అరఘ్చి ఇటీవల మూడు రోజుల్లో రెండోసారి ఇస్లామాబాద్‌లో పర్యటించారు. అక్కడ ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సంఘర్షణ, భవిష్యత్ కార్యాచరణ మార్గాలపై చర్చలు జరిపారు.ఫోన్లో చర్చలు: ట్రంప్ సూచనఇదిలా ఉండగా.. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి పరిష్కారం కోసం ఫోన్లో మాట్లాడుకోవచ్చని ట్రంప్ ఆదివారం సూచించారు. 17 గంటల విమాన ప్రయాణంలో ప్రతినిధి బృందాన్ని పంపే బదులు తానే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. "అన్ని అవకాశాలు మా చేతిలోనే ఉన్నాయి. వారు మాట్లాడాలనుకుంటే మా వద్దకు రావచ్చు, లేదా మాకు ఫోన్ చేయవచ్చు" అని ట్రంప్ అన్నారు. అయితే, ఆ ఫోన్ కాల్ ఎప్పుడు జరుగుతుందో మాత్రం సూచించలేదు.ట్రంప్ వార్నింగ్రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితిపై ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్‌కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్.. దిగ్బంధనం కారణంగా వారివద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. -
సడన్ ట్విస్ట్.. ఇరాన్లో యుద్ధం సీను మారింది?
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్లో వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మంచుకురుస్తోంది. దశాబ్ధానికిపైగా కరువుతో అల్లాడుతున్న ఇరాన్లో క్రమంగా వాతావరణం మారుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సుల్లో మళ్లీ జీవం కనిపిస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారడంపై ఓ ఆసక్తికర వాదన తెరపైకి వచ్చిందిసోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇరాన్లో మార్పుల వెనుక అసలు సీక్రెట్ అదేనా. ఇరాన్లో కరువు పరిస్థితులు శతృదేశాల కుట్రే పూరితంగా సృష్టించినవేనాఅమెరికా ఇరాన్ యుద్ధం మొదలై యాబై రోజులు దాటిపోయింది. ఈ యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా భారీ దాడులే చేసింది. క్షిపణులు, వైమానిక దాడులతో బీభత్సమే సృష్టించింది. దీని కోసం పెద్ద సంఖ్యలో ఆయుధ శక్తిని ఉపయోగించింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న ఇరాన్‌ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టింది. అయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా,ఇజ్రాయెల్‌కు ఇరాన్ అదే స్థాయిలో బదులిస్తోంది.ఇలాంటి సమయంలో ఇరాన్ వాతావరణం మారిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నిత్యం కరువుతో అల్లాడే ఇరాన్లో ఇప్పుడు భారీ స్థాయిలో వర్షాలు, మంచు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక్కడే ఓ ఆసక్తికరమైన వాదన తెరపైకి వచ్చింది. దేశ వాతావరణాన్ని తారుమారు చేయడానికి వాడటానికి వినియోగించే రాడార్లను, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడం వల్లే ఈ వాతావరణ మార్పు సంభవించిందన్న వాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి దశాబ్ధానిపైగా ఇరాన్ కరువుతో అల్లాడుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సులే అక్కడి నీటి సంక్షోభం గురించి చెప్పడానికి ఉదహారణలుగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో యాభైరోజుల యుద్ధం తర్వాత అక్కడి వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, మంచు, ఉష్ణోగ్రతలు తగ్గడంతో అక్కడ పచ్చదనం చిగురులు తొడుగుతోంది. ఆనకట్టలు వాటి పూర్తి సామర్ధ్యానికి వస్తున్న తరుణంలో ఇరాన్ మీడియా కుట్ర సిద్ధాంతాలతో హోరెత్తుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ వాతావరణ ఇంజినీరింగ్ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడమే వాతావరణంలో ఆకస్మిక మార్పులకు కారణమన్నది వారి వాదన.ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చెందిన అధునాతన రాడార్ వ్యవస్థలపై, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలపైన దాడి చేసిన మాట నిజమే. అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించే క్షిపణి వ్యవస్థలు కేవలం ముందస్తు అలెర్ట్ కోసమే కాకుండా మధ్యధరా సముద్రంలోని తేమను ఇరాన్ పొరుగు ప్రత్యర్ధుల వైపు మేఘాలను మళ్లించడానికి వీటిని ఉపయోగించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.నిజానికి వర్షపు నీరు దొంగతనం అనే చర్చ ఇరాన్లో ఎప్పటి నుంచో ఉంది. 2018 నుంచి ఈ వాదన పదే పదే తెరపైకి వస్తోంది. ఇజ్రాయెల్,అమెరికా, యూఏఈ జియో ఇంజినీరింగ్‌ను ఉపయోగించి వాతావరణ సరళిని తారు మారు చేస్తున్నాయనేది ఇరాన్ వాదన. ఇప్పుడు సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
ఇరాన్లో నిర్ణయాలు వీళ్లే తీసుకుంటున్నారా? ఇలాగైతే యుద్ధం..
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదురుతుందా? యుద్ధం మళ్లీ మొదలవుతుందా? అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఇరాన్ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. అమెరికా డిమాండ్లకు ఇరాన్ ఒప్పుకోవడం లేదు. అమెరికాలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశం తరఫున అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలీ ఖమేనీ (ఇరాన్ దివంగత సుప్రీం లీడర్)ను అమెరికా-ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత అతడి కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారని ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, మొజ్తబా ఖమేనీ తీవ్రగాయాలతో బాధపడుతున్నాడని, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా అతడికి లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, అమెరికాతో చేస్తున్న యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై మొజ్తబా ఖమేనీని కాదని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోందని పలు నివేదికలు కూడా వచ్చాయి.నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తోంది ఇరాన్. మరి ఈ యుద్ధానికి ఇరాన్లో బాధ్యత తీసుకుంటోంది ఎవరు? ఆధికారికంగానైతే సుప్రీం లీడరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనే బాధ్యత వహిస్తున్నారని ఆ దేశం చెబుతోంది. ఫిబ్రవరి 28న (యుద్ధం తొలి రోజే) అలీ ఖమేనీ మృతి చెందాడు. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యత స్వీకరించాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థలో ఆ పదవిలో ఉన్న వారే తుది నిర్ణయం తీసుకుంటారు. యుద్ధం, శాంతి, దేశానికి సంబంధించిన వ్యూహాలు వంటి ముఖ్య విషయాలపై తుది మాట ఆ సుప్రీం లీడర్‌దే. అయితే, ఇరాన్‌కు సంబంధించిన నిర్ణయాలు నిజంగానే మొజ్తబా ఖమేనీనే తీసుకుంటున్నారా? ఇరాన్ నాయకత్వంలో అంతర్గతంగా ఏకాభిప్రాయం లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒకే నిర్ణయం మీద లేరని, వేర్వేరు వర్గాలు వేర్వేరు అభిప్రాయాలు చెబుతున్నాయని ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో, స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వాలని అమెరికా కోరుతోందని అన్నారు. అప్పుడు మాత్రమే చర్చలు సరిగ్గా ముందుకు వెళ్తాయని చెప్పారు.సుప్రీం లీడర్ ఎక్కడ?పదవి చేపట్టిన తర్వాత మొజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. ఆయన పేరిట లిఖితపూర్వకంగా కొన్ని ప్రకటనలు రావడం తప్ప ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇరాన్ వ్యూహాలకు ఆమోదం తెలుపుతున్నారని గానీ చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తబా గాయపడ్డాడని ఇరాన్ అధికారులు అంగీకరించారు. కానీ, అందుకు సంబంధించిన వివరాలు తక్కువగా ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మొజ్తబా ముఖం సహా శరీరంలోని పలు అవయవాలకు గాయాలు తగిలి మాట్లాడటానికి కష్టంగా మారిందని పేర్కొంది. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధికారం కేవలం సంస్థాగతం కాదు. మొజ్తబా తండ్రి అలీ ఖమేనీ ప్రసంగాలు, ప్రత్యక్షంగా పలు కార్యక్రమాలకు హాజరు కావడం, పలు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం జరిపేవారు. అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరగడం లేదు.కొందరు యుద్ధ సమయంలో పదవీ స్వీకరణ వల్ల అతను తన అధికారాన్ని స్థాపించలేకపోయాడని అంటున్నారు. మరికొందరు గాయాల కారణంగా వ్యవస్థను నిర్వహించగలడా అన్న ప్రశ్న వేస్తున్నారు. పరిస్థితుల గురించి స్పష్టత లేదు. ఎవరు ఏమి నిర్ణయిస్తున్నారు? అసలు అధికారంలో ఎవరు బలంగా ఉన్నారు? అన్న దానిపై గందరగోళం ఉంది.క్లిష్టమైన సమయంలో బాధ్యతలు మొజ్తబా బాధ్యతలు చేపట్టిన సమయం చాలా క్లిష్టమైనది. ఆ సమయంలో యుద్ధం జరుగుతోంది. అందుకే తన నాయకత్వాన్ని పూర్తిగా అమలు చేయడానికి, తన మాట నిలబెట్టుకోవడానికి సరైన స్థిరత్వం, సమయం దొరకలేదు. ఫలితంగా, ఇరాన్లో ఇతర వర్గాలు/నాయకులు కూడా ప్రభావం చూపుతూ ఉండవచ్చు. పాలనలో మొజ్తబా పూర్తి నియంత్రణను స్థాపించుకోలేకపోయాడని తెలుస్తోంది. యుద్ధానికి ముందు నిర్ణయాలు సుప్రీంలీడర్ చుట్టూ ఉన్న వ్యవస్థ చేతిలో ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నిర్ణయాలు ఒక్కరే తీసుకోవడం లేదు. పలు వర్గాలు/నాయకులు కలిసి లేదా వేర్వేరు విధాలుగా ప్రభావం చూపుతున్నారు. అధికార వికేంద్రీకరణ జరిగింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికాతో చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ వ్యూహాలు రచించడం అనేది వీరి చేతల్లో లేదని తెలుస్తోంది. పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్ నేతృత్వంలో ప్రతినిధి బృందానికి ప్రస్తుతం ఉన్న అధికారాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇరాన్లో అరాఘ్చీ పాత్ర ఇతరుల నిర్ణయాల అమలు స్థాయిలోనే ఉంది. హార్మూజ్ విషయంలో ఆయన వెను వెంటనే చేసిన ప్రకటనలు సందేహాలు లేవనెత్తాయి. పెజెష్కియన్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరగాల్సిన రెండో దశ చర్చలు నిలిచిపోవడం దీన్నే సూచిస్తుంది.హార్మూజ్ జలసంధి నియంత్రణ ఇరాన్‌కు ఒత్తిడి సాధనంగా మారింది. దీని ద్వారానే అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. కానీ, దాన్ని మూసి ఉంచే నిర్ణయం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ – ఇరాన్ విప్లవ గార్డ్ సైనిక విభాగం) చేతిలో ఉంది. ఇరాన్లో ఒకే వ్యక్తి వ్యూహాన్ని స్పష్టంగా నడిపిస్తున్నట్టు కనిపించడం లేదు. చర్యలు, వాటికి సంబంధించిన సందేశాల మధ్య జాప్యం కనపడుతోంది. సుప్రీం లీడర్‌కు పూర్తిగా అధికారాలు ఉన్నాయి. కానీ, స్పష్టంగా అవే అమలు అవుతున్నట్లు కనపడడం లేదు. అధ్యక్షుడు నాయకత్వం వహించడం లేదు. రాజనీతిక చర్యలు నిర్ణయాత్మకంగా జరగడం కాదు. ఇలాగైతే యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే చరిత్రలో ఎవరూ చూడనంత విధ్వంసాన్ని చూస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. యుద్ధం భీకరంగా జరిగితే ఇరాన్లో అంతా బూడిదే మిగులుతుంది. -
పాక్ ప్రధానితో ఇరాన్ ఫోన్ కాల్..
ఇస్లామాబాద్: ఇరాన్, అమెరికా మధ్య చర్చల సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ బయల్దేరి వెళ్లిపోయారు. దీంతో శాంతి చర్చలకు తన ప్రతినిధులను ఇస్లామాబాద్‌కు పంపించడం లేదని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక కామెంట్స్ చేశారు.పెజెష్కియాన్ తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. అలాగే, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పేర్కొన్నారు. అమెరికా అనుసరిస్తున్న చర్యలే చర్చలకు ప్రధాన అడ్డంకి ఆయన కుండబద్దలు కొట్టారు.కాగా, ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి దిగ్బంధనాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడం అసాధ్యమని పేజెష్కియాన్ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అరాగ్చీ స్పందన..ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇప్పటికే తాము ఒక ఫ్రేమ్ వర్క్‌ను పాకిస్తాన్‌కు అందించామని తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇది ఒక మంచి మార్గమని ఆయన చెప్పారు. అయితే, శాంతి చర్చలపై అమెరికాకు నిజంగా ఆసక్తి ఉందా? అన్నది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అబ్బాస్ అరాగ్చీ ఒమన్ పర్యటనలో ఉన్నారు. అయితే, చర్చల కోసం ఆయన తిరిగి పాకిస్తాన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. -
అయ్యో ఇరాన్.. ఎంతటి గడ్డు పరిస్థితులు..
వెనకటికి ఒక సామెత ఉండేదంటారు.. పైన పటారం.. లోన లొటారం.. అని.. ఈ సామెత ఇప్పుడు అచ్చు గుద్దినట్టు ఇరాన్‌కు వర్తించేలా ఉంది. ఎందుకంటే అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. పైకి అంత బాగానే ఉన్నట్టు మేనేజ్ చేస్తున్న ఇరాన్.. వాస్తవంగా మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అది ఎంతలా అంటే.. ఆహార ద్రవ్యోల్బణం 112 శాతానికి చేరుకుంది. వంట నూనెల ధరలైతే 200% పైగా పెరిగాయి. నిత్యావసరాలే కాదు.. చివరికి అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగాయి. దీంతో, ఇరాన్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.అమెరికా, ఇజ్రాయెల్ మార్చి యుద్ధం తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా క్షీణించింది. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గడం, పరిశ్రమలకు జరిగిన నష్టం.. ఇలా అన్నీ కలిసి పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఇరాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, కోడిగుడ్లు తదితర ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 2026 ఏప్రిల్ నాటికి పాలు, గుడ్లు, చికెన్, బియ్యం వంటి ఆహార పదార్థాలు 70–130% వరకు పెరిగాయి. ముఖ్యమైన ఔషధాలు అయితే 300% నుండి 2,700% వరకు పెరిగి సాధారణ కుటుంబాలకు అందని స్థాయికి చేరాయి. ఇన్సులిన్ కొరత కారణంగా రేషన్ విధానం అమలు చేస్తున్నారు. సాధారణ నొప్పి నివారణ మందులు కూడా రేషన్‌లోనే అందిస్తున్నారు. మానసిక ఆరోగ్య మందులు లభ్యం కావడం కష్టమైంది. దీంతో, సామాన్యులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాదికి ద్రవ్యోల్బణం 80% నుంచి 500% వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.అయితే, 2025 చివరి నాటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ద్రవ్యోల్బణం 50% పైగా కొనసాగింది. రియాల్ విలువ 20 రోజుల్లో 20% కంటే ఎక్కువ తగ్గింది. బ్యాంక్ అయాందె కుప్పకూలడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో నమ్మకం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లోనే యుద్ధం ప్రారంభమైంది. దీంతో, ఇరాన్ రియాల్ విలువ ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయింది. ఒక డాలర్ విలువ 16 లక్షల రియాల్స్‌కు దగ్గరలో ఉంది. దీంతో పౌరుల పొదుపు ఆవిరవుతోంది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాలు తగ్గి, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ మూతపడుతున్నాయి. యుద్ధ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించడంలేదు సరి కదా, రుణాలు కట్టడం ఆలస్యమైతే జరిమానాలు విధిస్తోంది. చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీంతో బ్యాంక్‌లు చాలా ఖాతాలను మూసివేస్తున్నాయి.గుడ్డు, మాంసం ఎంతంటే.. గత రెండు నెలల్లో ఇరాన్లో గుడ్లు, మాంసం, వంట నూనె ధరలు నిరంతరం పెరిగాయి. గుడ్ల ధరలు 2026 ఏప్రిల్ నాటికి రూ.333(భారత కరెన్సీ ప్రకారం)కి చేరాయి. మాంసం ధర కిలోకు రూ.574 వరకు పెరిగాయి. 2025లో మాంసం ధర రూ.313గా ఉంది. ఇక, వంట నూనె ధరలు కూడా 100% పైగా పెరిగి 380 వరకు చేరాయి. 2025లో వంట నూనె ధర రూ.180గా ఉంది. ఇక, 2025లో బియ్యం ధర రూ.34 ఉండగా.. తాజాగా 67కు చేరుకుంది.ఉద్యోగుల పరిస్థితి ఇదీ.. అధికారిక లెక్కల ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనధికారికంగా ఈ సంఖ్య 20 నుంచి 30 లక్షల వరకు ఉండొచ్చని ఓ అంచనా. 1.5 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఆదాయం లేక అల్లాడుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే నెలవారీ సబ్సిడీ, ఫుడ్ వోచర్లతో కనీసం 10 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి నెలకొంది.కారణాలు..ఇంటర్నెట్ బ్లాకౌట్ ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం.యువత, చిన్న వ్యాపారాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి.పేదరికం, నిరుద్యోగం పెరుగుతూ ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.ప్రభావిత రంగాలుఈ-కామర్స్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, మీడియా, విద్య, సర్వీస్ రంగాలు ప్రభావితమయ్యాయి.నిరంతర కనెక్టివిటీ అవసరం ఉండటంతో ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి.పెద్ద కంపెనీలు: ఉద్యోగాల కోతలు ఇప్పుడు పెద్ద వాణిజ్య సంస్థలలో కూడా ప్రారంభమయ్యాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం, ప్రజల జీవన ప్రమాణాలను కాపాడుకోవడం, అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ చర్యలు తీసుకుంటే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా, కనీస స్థాయిలో అయినా నిలబడే అవకాశం ఉంటుంది.ప్రధాన లక్ష్యాలు..ఆర్థిక స్థిరీకరణ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, కరెన్సీ విలువను నిలబెట్టడం.ప్రజల జీవన ప్రమాణాలు: ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడం.పరిశ్రమల పునరుద్ధరణ: పెట్రోకెమికల్స్, మెటల్స్, వ్యవసాయం, నిర్మాణ రంగాలను తిరిగి నిలబెట్టడం.బ్యాంకింగ్ వ్యవస్థ రక్షణ: బ్యాంకుల లిక్విడిటీ, డిపాజిట్లపై నమ్మకం కాపాడుకోవడం, రుణాలపై నియంత్రణ.సామాజిక స్థిరత్వం: నిరుద్యోగం తగ్గించడం, ప్రజల్లో అసంతృప్తి తగ్గించడం.అంతర్జాతీయ సంబంధాలు: నిర్బంధం, బ్లాకేడ్ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు కనుగొనడం. యూఏఈ, టర్కీ వంటి ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా పరిమిత ఎగుమతులు కొనసాగించడం. -
వెనుతిరిగిన ఇరాన్, ముందుకు రాని అమెరికా... రెండో విడత ప్రత్యక్ష చర్చలపై వీడని పీటముడి
-
మూడు విశ్వాసాల కేంద్రం
ఇటీవలి ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల్లో కొంతకాలం నిర్బంధాలకు గురైన జెరూసలేం నగరంలోని ప్రార్థనా స్థలాలు, కాల్పుల విరామ సమయంలో మళ్లీ తెరుచుకున్నాయి. ‘వెయిలింగ్ వాల్’గా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోడ వద్ద యూదులు; అల్–అఖ్సా మసీదులో మహమ్మ దీయులు; పరిశుద్ధ సమాధి ఆలయంలో క్రైస్తవులు– ఇలా మూడు ముఖ్య మతాలవారూ ఒకేసారి ప్రార్థనలు చేస్తున్న ఈ చిన్న నగరం ఎందుకు ప్రపంచాన్ని ఇంతలా ఆకర్షిస్తోంది? యుద్ధ మేఘాల మధ్య కూడా ఆధ్యాత్మిక ఆకర్షణను ఎలా నిలబెట్టుకోగలుగుతోంది?క్రీ. పూ. 1000 ఏళ్ల ప్రాంతంలో పాత ఇశ్రాయేలును పాలించే యూదురాజు దావీదు ‘జెబూసులు’ అనే స్థానిక తెగల నుంచి జెరూసలేం నగరాన్ని జయించి, దానిని ఏకీకృత ఇశ్రాయేలు రాజ్య రాజధానిగా చేశాడు. అతని కుమారుడు సాలమన్ ఆ నగరంలో నేడు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తున్న కొండపై మొట్ట మొదటి యూదు ఆలయం నిర్మించాడు. ఆ ఆలయాన్ని తరువాతి కాలంలో బాబిలోనియన్లు, ఆ తరువాత రోమన్లు ధ్వంసం చేశారు. మిగిలిన అవశేషమైన గోడను ఈ రోజు ‘ఏడ్పుల గోడ’గా పిలుస్తున్నారు. మూడు వేల సంవత్సరాల చరిత్ర గలిగిన ఆ కొండ, దానిపై ఒకప్పుడున్న ఆలయం గుర్తుగా మిగిలిన అవశేషం యూదులకు పరమ పవిత్రమైన ప్రార్థనా స్థలాలు.క్రైస్తవ మతానుయాయులకు, జెరూసలేం యేసుక్రీస్తు జీవితంతో ముడిపడి ఉంది. యేసు ఇక్కడే బోధించాడు, శిలువ వేయబడ్డాడు, పునరుత్థానం చెందాడు. నాలుగవ శతాబ్దంలో ‘పరిశుద్ధ సమాధి’ నిర్మాణంతో ఇది క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా మారింది. ‘గోల్గతా’ లేదా ‘కల్వరి’గా పిలిచే శిలువ వేయబడిన స్థలం, క్రీస్తు సమాధి అయ్యి పునరుజ్జీవం పొందిన అనంతరం ఖాళీ అయిన సమాధి, శిక్షాస్థలి నుండి శిలువ వరకు క్రీస్తు నడిచి వెళ్ళిన ‘వేదన మార్గం’ (లేదా డోలోరోసా), సమాధికి వెళ్ళే మార్గంలో, క్రీస్తు అనుభూతులను జ్ఞప్తికి తెచ్చే 14 ముఖ్య ప్రాంతాలు– క్రైస్తవులకు పరమ పూజనీయాలు.ముస్లింలు అల్–ఖుద్స్గా పిలుచుకునే జెరూసలేం నగరం వారికి మక్కా, మదీనాల తరువాత అత్యంత పవిత్రమైన స్థలం. ఇస్లాం మొదటి రోజుల్లో జెరూసలేం వైపే ఖిబ్లా, అంటే ‘నమాజు చేసే దిక్కు’ ఉండేది; తరువాతి రోజుల్లో కారణాంతరాల వల్ల ఈ దిక్కు మక్కాలోని ‘కాబా’ వైపునకు మారింది. మహమ్మద్ ప్రవక్త ఒక రాత్రి మక్కా నుంచి జెరూసలేం వచ్చి; హరామ్ అల్ షరీఫ్ (అదే ప్రాంతాన్ని యూదులు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తారు)లోని ‘పునాది శిల’ నుంచి స్వర్గారోహణ చేశాడని మహమ్మదీయులు విశ్వసిస్తారు. అదే శిలపై తరువాతి కాలంలో నిర్మించబడిన ‘రాతి గుమ్మటం’, దాని పరిసరాలలోని ‘అల్–అఖ్సా మసీదు’... ఇవన్నీ మహమ్మదీయులకు ఎనలేని ప్రాధాన్యం కలిగిన స్థలాలు. మహమ్మద్ ప్రవక్త స్వర్గారోహణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన ఇస్రా, మిరాజ్‌లకు కూడా ఈ ప్రాంతం కేంద్ర బిందువు.ఒకే మూల పురుషుడుఆరాధనా స్థలాలలోనే కాదు, ఆవిర్భావంలో కూడా ఈ మూడు మతాలకు విశేషమైన సారూప్యత, సామీప్యత ఉన్నాయి. ‘ఒకే దైవం’ అనే సిద్ధాంతాన్ని విశ్వసించి, బోధించిన ప్రప్రథమ ప్రవక్త ‘అబ్రహమ్’ లేదా ‘ఇబ్రహీమ్’. ఆ ప్రవక్త కుమారుడైన ఇసాక్‌కు జాకబ్ జన్మించాడు. ‘ఇజ్రాయెల్’ అనే దైవదత్త నామాంతరం కలిగిన జాకబ్ నుండి యూదులు ఉద్భవించటంతో, వారి ప్రాంతం ‘ఇజ్రాయెల్’గా పేరొందింది. జన్మతః యూదు మతస్థుడైన క్రీస్తు మరణానంతరం... ఆయనను విశ్వసించే యూదు సమూహం వారి అసలు మతాన్నుండి విడివడటంతో క్రైస్తవులుగా వారిని పిలుస్తున్నారు. అబ్రహమ్ మరో కుమారుడైన ఇస్మాయిల్ నుండి ఇస్లాం ఆవిర్భవించిందని విశ్వసిస్తారు. ఇలా ఒకే మూల పురుషుడు గలిగిన మూడు మతాలవారు, ఒకే భౌగోళిక ప్రాంతంలో తమ తమ విశ్వాసాలకు అనుగుణంగా ప్రార్థనలు నిర్వహించడం అసాధారణం కాదు.ఒకే ప్రవక్త నుండి ఉద్భవించి, ఒకే చరిత్రను పంచుకోవడం వల్ల జెరూసలేం మూడు మతాలవారికీ ముఖ్య కేంద్రంగా ఖ్యాతికెక్కింది. చిత్రంగా, అదే చారిత్రక వాస్తవం శతాబ్దాలుగా సంఘర్షణలకు, ఉద్రిక్తతలకు – ఒక్కోసారి మానవ హననానికి కూడా కారణమవుతోంది. యుద్ధ విరామంలో ఈ పవిత్ర స్థలం తిరిగి అందరినీ అక్కున జేర్చుకోవడం సుస్థిరమైన శాంతిని స్థాపించే సుదీర్ఘ ప్రస్థానంలో చిన్న ఆశాకిరణం.కృష్ణబాలాజీ పల్లపోతువ్యాసకర్త ఎస్బీఐలో, పశ్చిమాసియా దేశాల్లో విధులు నిర్వహించిన విశ్రాంత ఉన్నతాధికారి -
మళ్లీ మొదటికి!
ఇస్లామాబాద్/వాషింగ్టన్/దుబాయ్: పశ్చిమాసియాలో హార్మూజ్ దిగ్బంధం ఏ స్థాయిలో కొనసాగుతోందో పాకిస్తాన్ వేదికగా రెండో దఫా ప్రత్యక్ష చర్చలపై ప్రతిష్టంభన అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒకడుగు ముందుకేసి పాకిస్తాన్‌కు స్వయంగా విచ్చేసి ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లతో చర్చిస్తున్న వేళ సంతోషం వ్యక్తంచేసిన అమెరికా తన బృందాన్ని సైతం పంపేందుకు సంసిద్ధమవుతుండగా అరాఘ్చీ హఠాత్తుగా పాక్‌కు వీడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోపం తెప్పించారు.దీంతో ఇరాన్ బృందంలేని పాకిస్తాన్లో తాము మాత్రం ఎలా ప్రత్యక్ష చర్చలకు కూర్చోగలమనే అసహనంతో ట్రంప్ వెంటనే తన బృందం ప్రయాణాన్ని రద్దుచేశారు. దీంతో రెండోదఫా ప్రత్యక్ష చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ అంశంలో ఇరాన్ ఒక స్పష్టతనిచ్చింది. అమెరికాతో మరోమారు ప్రత్యక్షచర్చలకు కూర్చోబోమని తెగేసి చెప్పింది. పరోక్ష చర్చలకే తాము సుముఖంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ శనివారం ప్రకటించారు. పాక్ ప్రధాని, ఫీల్డ్ మార్షల్‌తో మంతనాలు పాక్ నుంచి ఒమన్‌కు వెళ్లిపోయే ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషక్ దార్లతో విస్తృతస్థాయిలో చర్చించారు. శాంతి చర్చలకు సంబంధించిన తమ దేశ డిమాండ్లను అమెరికాకు తెలియజేయాలని సంబంధిత ప్రతిపాదనల చిట్టాను షెహబాజ్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ తరఫున ఉప విదేశాంగ మంత్రి కజీమ్ ఘరీబ్అబాదీ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్, పాక్ తరఫున పాక్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.అయితే చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాల వివరాలను అటు పాక్‌గానీ ఇటు ఇరాన్‌గానీ అధికారికంగా బహిర్గతంచేయలేదు. ప్రాంతీయ అస్థిరత, శాంతి చర్చల అంశాలపై నేతలు చర్చించారని సామాజిక మాధ్యమంలో ఇరాన్ రాయబార కార్యాలయం ఒక పోస్ట్పెట్టింది. ఇరాన్ పెట్టిన షరతులను ఇస్లామాబాద్‌కు విచ్చేసే అమెరికా ప్రతినిధుల ఎదుట పాక్ పెట్టనుందని, వాటికి సమ్మతిస్తేనే ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ బృందం పాక్‌కు రానుందని పాక్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ వివరాలను తుర్కియేతో పాక్ పంచుకుంది. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు.. తమ బృందం రాకముందే ఇరాన్ మంత్రి పాక్ నుంచి వెళ్లిపోయారనే వార్త తెల్సి ట్రంప్ వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రతినిధులనూ పాక్‌కు పంపబోమని తెగేసి చెప్పారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘18 గంటలు ప్రయాణించి ఇస్లామాబాద్‌కు వెళ్లేందుకు నా బృందం సిద్ధమవుతుంటే వెంటనే ఆగిపొమ్మని చెప్పేశా. పాక్‌కు అన్ని గంటలపాటు ప్రయాణంచేయడం వృథా. అనవసర శ్రమ. పాక్‌లో మనతో మాట్లాడ్డానికి ఎవరూ లేనప్పుడు, ఎలాంటి చర్చల్లేనిదానికి అంతదూరం వెళ్లడం దండగ.అసలే ఇరాన్లో ఎవరు తమ నేతనో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. వాళ్లలో ఇన్చార్జ్ ఎవరో వాళ్లకే తెలీడంలేదు. ఆట మనచేతుల్లోనే ఉంది. వాళ్లకు అంతగా మాట్లాడాలనుకుంటే ఇరాన్ నాయకులు మనకు ఫోన్‌చేసి మాట్లాడతారు. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని ట్రంప్ స్పష్టంచేశారు. పశి్చమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్‌లను పాక్‌కు కొద్దిసేపట్లో పంపబోతున్నామని శ్వేతసౌధంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అంతకుముందే ప్రకటించగా కొన్ని నిమిషాలకే ట్రంప్ విరుద్ధమైన ప్రకటన చేశారు.దీంతో అమెరికా ప్రతినిధి బృందం పాక్ పర్యటన చివరినిమిషంలో వాయిదాపడింది. ఈ బృందం ఇక ఎప్పుడు పాక్‌కు వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రత్యక్ష చర్చల కోసం తమ ప్రయత్నాలు నిరాటంకంగా కొనసాగుతాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్ పునరుద్ఘాటించారు. అమెరికా చిత్తశుద్ధిచూద్దాం.. పాక్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు చేరుకున్న ఇరాన్ మంత్రి అరాఘ్చీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘పాక్‌లో పర్యటన సత్ఫలితాలనిచ్చింది. యుద్ధం శాశ్వత పరిసమాప్తికి మేం చేసిన ప్రతిపాదనలను పాక్ ముందుంచాం. వాటిని వినేందుకు, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ఏపాటి చిత్తశుద్ధిచూపుతుందో చూద్దాం’’అని అన్నారు. ఒమన్ తర్వాత రష్యాలో అరాఘ్చీ పర్యటిస్తారు. తిరిగి ఆయన శనివారం లేదా ఆదివారం పాక్‌కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇంధనాన్ని ఆదా చేసుకోవాలి: మసూద్ యుద్ధకాలంలో ఇరాన్ ఇంధన వనరులు, మౌలికవసతులను అమెరికా సేనలు దారుణంగా దెబ్బతీయడంతో వాటిని ఇప్పుడు పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సూచించారు. ‘‘ఇంట్లో పది లైట్లు ఉంటే అన్ని వెలిగించాల్సిన అవసరమేంటి? ఒక రెండు వెలిగిస్తే సరిపోతుంది’’అని సలహా ఇచ్చారు. కరెంట్ వృథా ఖర్చును భారీగా తగ్గించుకోవాలని ఇరాన్ విద్యుత్ సంస్థ సీఈవో తవానిర్ ఇరానియన్లను కోరారు. -
ఇరాన్‌కు అమెరికా షాక్.. ఆ డబ్బు మొత్తం ఫ్రీజ్!
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. ఇరాన్‌తో చర్చల కోసం ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధుల బృందం పర్యటనను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నపళంగా రద్దు చేశారు. ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఇరాన్‌కు అమెరికా మరో షాక్ ఇచ్చింది. ఇరాన్‌కు సంబంధించిన 344 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3242 కోట్ల) విలువైన క్రిప్టో కరెన్సీని ఫ్రీజ్ చేశామని ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఒప్పందం కుదుర్చుకునేలా ఇరాన్‌పై ఒత్తిడి తీసు కువచ్చేందుకు అమెరికా ఈ తరహా ప్రయత్నాలు చేస్తోంది. 'నిధులు సమకూర్చుకోవడం, వాటిని తరలించడం వంటి విషయాల్లో ఇరాన్ సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాం. దానిలో భాగంగానే ఇరాన్‌తో సంబంధం ఉన్న పలు వాలెట్లపై ఆంక్షలు విధిస్తున్నాం. దాంతో నిధులు ఫ్రీజ్ అవుతాయి' అని బెసెంట్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. -
రణభారం
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్‌కు, అమెరికా, ఇజ్రాయెల్‌లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించారచమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే విపరిణామాల గురించి ఒక విహంగ వీక్షణం...భారత్‌కు భారీ ఆర్థిక నష్టంప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా–ఇరాన్ యుద్ధంతో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్‌లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ‘ఇంధన’ సెగ భారత్‌నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.భారత్‌పై యుద్ధ ప్రభావం⇒ డాలర్‌తో రూపాయి విలువ పతనం రూ. 93.30⇒ రిజర్వ్ బ్యాంకు నిల్వల నుంచి ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు⇒ స్టాక్ మార్కెట్ నష్టాలు రూ. 41.00 లక్షల కోట్లుఅమెరికా, ఇజ్రాయెల్‌ల సైనిక ఖర్చుయుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్‌పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచానికి ఆర్థిక విఘాతంప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్య«ధికంగా సుమారు 20%–25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5%, అమెరికా జీడీపీకి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.‘నాటో’ దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా ‘నాటో’ దేశాల జీడీపీ 0.5% నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా ‘నాటో’ దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.విధ్వంసకరమైన ఆయుధాలుఅమెరికా–ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఈ యుద్ధంలో విధ్వంసకరమైన ఆయుధాలతో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, అధునాతనమైనవి. ఈ ఆయుధాలు ఎంత ఖరీదైనవో, ఇవి సృష్టించే విధ్వంసం వల్ల సంభవించే నష్టం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉభయ పక్షాలూ ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న ప్రధానమైన ఆయుధాల వివరాలుఎఫ్ 35 లైటెనింగ్–2 విమానంరాడార్లకు చిక్కకుండా లక్ష్యాలపై బాంబులను జారవిడవగల యుద్ధవిమానం ఇది. ఈ విమానాలను అమెరికా పదుల సంఖ్యలోనే ఇరాన్‌పై దాడుల కోసం రంగంలోకి దించింది. ఇరాన్ క్షిపణుల దెబ్బకు ఇప్పటి వరకు ఎఫ్35 లైటెనింగ్ విమానాలు రెండు నేలకూలాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.960 కోట్లు.లూకాస్ డ్రోన్లుశత్రు స్థావరాల మీద దాడుల కోసం రూపొందించిన డ్రోన్ ఇది. తక్కువ ఖరీదు చేసే ఈ డ్రోన్లను అమెరికా బలగాలు ఇరాన్‌పై దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.32 లక్షలు.టొమాహాక్ క్రూజ్ మిసైల్స్దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికా బలగాలు దాదాపు 850 టొమాహాక్ క్షిపణులను ఉపయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.23 కోట్లు.ఎస్ఎం3 ఇంటర్‌సెప్టర్ క్షిపణులుశత్రువుల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తిమంతమైన ఆయుధం ఇది. ఇరాన్‌పై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా బలగాలు దాదాపు వంద వరకు ఈ క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ. 116 కోట్లు.యారో–3ఇది శక్తిమంతమైన ఇంటర్‌సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 100 కిలోమీటర్ల ఎత్తులోనే నాశనం చేయగల సామర్థ్యం గల అధునాతన ఆయుధం ఇది. ఇరాన్‌పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు 35 వరకు యారో–3 క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.33 కోట్లు.ఐరన్ డోమ్ఇది కూడా ఇంటర్‌సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 70 కిలోమీటర్ల దూరంలోనే పడగొట్టగల సామర్థ్యం గల ఆయుధం ఇది. ఇరాన్‌పై దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఐరన్ డోమ్ క్షిపణులను ఇప్పటి వరకు వందల సంఖ్యలోనే ప్రయోగించినట్లు సమాచారం. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.42 లక్షలు.ఫతా–2ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోయి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. దీని ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.93 లక్షలు.ఖైబర్ షెకాన్ఇది దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. అమెరికా బలగాలు ‘ఆపరేషన్ ఫ్యూరీ’ మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ బలగాలు దాదాపు 180 వరకు ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.35 కోట్లు.షాహెద్–136 డ్రోన్లుశత్రు స్థావరాలపై దాడుల కోసం తక్కువ ఖరీదుతో రూపొందించిన డ్రోన్లు ఇవి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు రెండువేల వరకు ఈ డ్రోన్లను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.27 లక్షలు.ప్రపంచ దేశాలకు ఇక్కట్లుఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే! -
చర్చల వేళ మరో ట్విస్ట్.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
టెహ్రాన్: మరోసారి అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా 'సముద్రపు దోపిడీ' కొనసాగిస్తే.. ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ సైన్యం తేల్చిచెప్పింది. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మధ్య సమన్వయం వహించే అత్యున్నత సైనిక విభాగం 'ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్' ఈ ప్రకటనను విడుదల చేసింది. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తమ సాయుధ బలగాల నుండి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటూ ఇరాన్ పేర్కొంది.ఇరాన్ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా, గరిష్ట స్థాయి సంసిద్ధతతో ఉన్నాయని.. జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఇరాన్ స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో శత్రువుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని.. అమెరికా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు జరపాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇవాళ(శనివారం) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఈ చర్చల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా నౌకాదళం ముందుగా హార్ముజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని టెహ్రాన్ స్పష్టమైన షరతు విధించింది. ఒకవైపు శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. మరోవైపు సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధనౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న ‘యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా’ అనే గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఏప్రిల్ 24న ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం అధికారికంగా ప్రకటించింది. -
దాదాపు 50 రోజుల ఉద్రిక్తతల తర్వాత.. ఇరాన్ కీలక నిర్ణయం
టెహ్రాన్: యాభై రోజుల ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానా సేవలను పునరుద్ధరించారు. వాణిజ్య విమానాల రాకపోకలను శనివారం నుంచి ప్రారంభించినట్లు ఇరాన్ వెల్లడించింది. తాత్కాలిక కాల్పుల విరమణ నేపథ్యంలో మళ్లీ విమాన సర్వీసులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా సమాచారం ప్రకారం.. ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో విమానా సేవలను పునరుద్ధరించారు భౌగోళిక, రాజకీయ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని విమానయాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించడానికి అధికారులు నాలుగు దశల ప్రణాళికను అమలు చేస్తున్నారు.'ఫ్లైట్ రాడార్ 24' డేటా ప్రకారం.. శనివారం ఉదయం టెహ్రాన్ నుండి ఇస్తాంబుల్‌కు మూడు విమానాలు బయలుదేరాయి. వీటితో పాటు మస్కట్, మదీనాకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కీలకమైన మార్గాల్లో సేవలను పునరుద్ధరించారు. యుద్ధం కారణంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను కూడా అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం తర్వాత తన వైమానిక మార్గాలను పాక్షికంగా తెరవాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకే విమాన సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. ప్రస్తుతం నేరుగా సైనిక దాడులు నిలిచిపోయినప్పటికీ, పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఒక్కో దశలో విమాన రాకపోకల సామర్థ్యాన్ని పెంచుతూ సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నారు. -
హార్ముజ్ లో హై టెన్షన్.. అటు అమెరికా.. ఇటు ఇరాన్ నౌకలు సీజ్
-
చర్చల్లో ఇరాన్ బిజీ.. యుద్ధం బహుమతి అంటూ అమెరికా వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు చేరుకోగా, వాషింగ్టన్ నుంచి విట్కాఫ్, కుష్నర్లు పాకిస్తాన్ బయల్దేరారు. మరోవైపు.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. అలాగే, ఇరాన్ యుద్ధంపై ఈజిప్టు, పాక్ అధికారులు చర్చించారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య మరో విడత చర్చలు ప్రారంభించే ప్రయత్నాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు.ఈ క్రమంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ప్రపంచానికి పెద్ద బహుమతి అని చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్ సముద్ర రవాణాపై అమెరికా దిగ్బంధనం అవసరమైనంత కాలం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక వైఖరి బలహీనపడిందని, సముద్రంలో క్రమరహిత వ్యూహాలపై ఎక్కువగా ఆధారపడుతోందన్నారు. అవసరమైనంత కాలం ఒత్తిడిని కొనసాగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దెబ్బతిన్న ఇరాన్ సైన్యం, ప్రత్యేకించి ఐఆర్జీసీ సముద్రపు దొంగల ముఠాగా మారిపోయిందని తెలిపారు. విచక్షణారహితంగా మందుపాతరలు పాతేది, యాదృచ్ఛికంగా ఓడలపై కాల్పులు జరిపేది, కొన్ని వారాల వ్యవధిలో 45,000 మంది తమ సొంత ప్రజలను అమాయక నిరసనకారులను చంపింది వారేనని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అనుమానాస్పద డ్రగ్స్ పడవపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను యూఎస్ సదరన్ కమాండ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అందులో నీటిలో తేలియాడుతున్న ఒక పడవ పేలుడు ధాటికి పూర్తిగా మంటల్లో కాలిపోతున్నట్టు ఉంది. స్మగ్లింగ్ మార్గాల్లో వెళ్తున్న డ్రగ్స్ సరఫరాదారులనే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం స్పష్టం చేసింది.ఇరాన్ కౌంటర్.. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు వరకు ఇజ్రాయెల్ గగనతలంపై తాము పూర్తి పట్టును సాధించామని ఇరాన్ రక్షణశాఖ అధికార ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ రజా తలాయీ నైక్ వెల్లడించారు. దాడులు చేసేందుకు మరిన్ని అధునాతన ఆయుధాలు ఇరాన్ అమ్ములపొదిలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో ఇరాన్ స్వయంగా అధునాతన ఆయుధాలను తయారుచేస్తోందని, ఇదే పేర్కొన్నారు. -
అమెరికాకు ఇరాన్ షరతులు.. హార్ముజ్ లో హై టెన్షన్
-
అమెరికాతో చర్చలు.. ఇరాన్ కొత్త ట్విస్ట్!
-
అమెరికాతో చర్చలు.. ఇరాన్ కొత్త ట్విస్ట్!
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమెరికాను దురాక్రమణదారుగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. దీంతో, చర్చల విషయమై పాకిస్తాన్‌కు టెన్షన్ నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా మరికొన్ని గంటల్లో అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాగా, అమెరికా నుంచి ప్రత్యేక రాయబారులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అరాగ్చీ బృందం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగబోవని స్పష్టంచేసింది. ప్రాంతీయ శాంతి ప్రయత్నాల మధ్య ఈ పర్యటన కొనసాగుతున్నప్పటికీ, అమెరికా-ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు అవకాశం లేదని తెలిపింది. తమ అభిప్రాయాలను పాకిస్తాన్ అధికారులకు మాత్రమే వివరిస్తామని తెలిపింది. దీంతో, చర్చలపై మరోసారి సందిగ్ధం నెలకొంది.మరోవైపు.. అమెరికా, ఇరాన్ చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10వేల మంది భద్రతాసిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్‌ను పూర్తిగా మూసివేసి, కార్యాలయ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యం కల్పించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో రౌండ్ అత్యంత కీలకంగా మారింది. కాగా, ఈ చర్చల కోసం అమెరికాకు చెందిన లాజిస్టిక్స్, భద్రతా బృందం ఇప్పటికే పాకిస్తాన్‌కు చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్‌తో చర్చల కోసం పాక్‌కు వెళ్లనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వారు భేటీ కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదు. చర్చల్లో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. -
హార్ముజ్ లో రణరంగం.. లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
-
చర్చలపై కొత్త ఆశలు!
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో హార్మూజ్‌జలసంధి దిగ్బంధంతో రెండో దఫా చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాకిస్తాన్ చేరుకోవడం శాంతి చర్చలపై కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. పాకిస్తాన్‌తోపాటు ఒమన్, రష్యాల్లోనూ పర్యటించి శాంతి చర్చల్లో తేల్చుకోవాల్సిన కీలకాంశాలపై ఒక అవగాహనకు రానున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘‘టెహ్రాన్ నుంచి ఇస్లామాబాద్(పాకిస్తాన్), మస్కట్(ఒమన్), మాస్కో(రష్యా) పర్యటనకు శ్రీకారం చుడుతున్నా. ద్వైపాక్షిక అంశాలపై మా భాగస్వాములతో సహకారం కోసం ఈ మూడు దేశాల్లో పర్యటించబోతున్నా. పొరుగుదేశాలే మాకు ముఖ్యం’’అని అరాఘ్చీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స’ఖాతాలో శుక్రవారం ఒక పోస్ట్‌పెట్టారు. దీంతో రెండోదఫా చర్చలకు సన్నాహకాలు మొదలయ్యాయని తెలుస్తోంది. అరాఘ్చీ తన బృందంతో కలిసి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అమెరికా దౌత్యవేత్తలకు సాయపడే బృందాలు, భద్రతా సిబ్బంది ఇప్పటికే ఇస్లామాబాద్‌లో సిద్ధంగా ఉన్నాయి. అమెరికా సాంకేతిక బృందంతో ఇరాన్ మధ్యవర్తులు మాట్లాడి షెడ్యూల్‌ను ఖరారుచేశాక అసలైన అమెరికా ప్రతినిధుల బృందం శనివారం రాత్రికల్లా ఇస్లామాబాద్‌కు చేరుకుంటుందని పాక్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. స్టీవ్ విట్కాఫ్, కుష్నర్లు శనివారం పాకిస్తాన్ చేరుకుంటారని అమెరికా కూడా ధ్రువీకరించింది. కొనసాగుతున్న దిగ్బంధం‘‘ట్రంప్ సూచనమేరకు సముద్రమందుపాతరలను పెట్టే పడవలను పేల్చేందుకు కాచుకుని కూర్చున్నాం. దశాబ్దాల్లో తొలిసారిగా పశ్చిమాసియాజలాల్లో ఒకేసారి మూడు అమెరికా యుద్ధవిమానాల వాహక నౌకలు యూఎస్ఎస్ అబ్రహాం లింకన్, యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్, యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ లు చక్కర్లు కొడుతున్నాయి. 200 యుద్ధవిమానాలు, 15,000 మంది నావికాదళసభ్యులు హార్మూజ్‌ను దిగ్బంధించాయి’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ శుక్రవారం వెల్లడించింది. మరోవైపు అమెరికాయేతర నౌకలు సైతం అమెరికా నౌకాశ్రయాల్లోకి ముడిచమురు, సహజవాయువులను సరఫరాచేసేందుకు వీలుగా జోన్స్ చట్టం అమలును మరో 90 రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ స్వాదీనంచేసుకున్న ఎపామినోండాస్ నౌకలోని భారతీయ నావికుడు సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రణ్‌ధావా శుక్రవారం చెప్పారు. -
చైనాకు షాకిచ్చిన అమెరికా!
ఇరాన్‌తో వ్యాపారం చేసే కంపెనీలు, దేశాలపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు చేసిన గంటల వ్యవధిలోనే అమెరికా ఆచరణలోకి తీసుకొచ్చింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం చైనాలోని హెంగ్లీ పెట్రో కెమికల్ రిఫైనరీ సహా ఇరాన్ చమురుతో సంబంధం ఉన్న సుమారు 40 షిప్పింగ్ సంస్థలు, ట్యాంకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. ఇరాన్‌కు కీలక ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను నిలిపేయడానికి ట్రంప్ చేసిన ఎత్తుగడలో ఇదొక భాగమని చెప్పొచ్చు. అంతేకాదు ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన పర్షియన్ గల్ఫ్ జలమార్గమైన హర్మూజ్‌జలసంధిని అమెరికా దిగ్భంధనం చేసిన సంగతి తెలిసిందే. కాగా చైనాకు చెందిన హెంగ్లీ పెట్రో కెమికల్ రిఫైనరీలో రోజుకు సుమారు 400,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది చైనాలోనే అతిపెద్ద స్వతంత్ర రిఫైనరీల్లో ఒకటిగా నిలిచింది. ఇక 2023 నుంచి హెంగ్లీ రిఫైనరీ ఇరాన్ నుంచి ముడి చమురును సరఫరా చేసుకుంటూ ఇరాన్ సైన్యానికి వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నట్లు సమాచారం. ప్రపంచ మార్కెట్లకు చమురును తరలించడానికి ఇరాన్ ఆధారపడే నౌకలు, మధ్యవర్తులు, కొనుగోలుదారుల నెట్‌వర్క్‌ను మరింత కఠినతరం చేస్తామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ మొదటివారంలో ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న చైనా, హాంగ్ కాంగ్, యూఏఈ, ఒమన్‌లోని ఆర్థిక సంస్థలను హెచ్చరిస్తూ ఆంక్షలు విధిస్తామని లేఖలు పంపించింది. కాగా మరికొన్ని వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన కీలక రిఫైనరీపై ఆంక్షలు విధించడం ఎలాంటి చర్చకు దారి తీస్తుందనేది ఆసక్తిగా మారింది. -
క్యాన్సర్‌తో బాధపడుతున్న నెతన్యాహు!
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. తనకు క్యాన్సర్ సోకిన విషయాన్ని నెతన్యా హునే స్వయంగా పేర్కొన్నారు అయితే తనకు వచ్చిన ముప్పేమీ లేదని, ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. ఇటీవల తొలిదశ ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నట్లు నెతన్యాహు తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్వయంగా ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తన ఆరోగ్య నివేదిక బయటకు రాకుండా ఉండేందుకు తానే అడ్డుపడినట్లు వెల్లడించారు. ఒకవేళ ఈ విషయం బయటికొస్తే ఇరాన్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసే అవకాశముందని, అందుకే 2 నెలల పాటు తన వార్షిక ఆరోగ్య నివేదికను వాయిదా వేయాలని అధికారులను అభ్యర్థించినట్లు ట్వీట్లో తెలిపారు. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. తనకు ప్రారంభ దశలోనే ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే విజయవంతమైన చికిత్స పూర్తయిందని స్పష్టం చేశారు. తన ఆరోగ్య పరిస్థితిపై వివరిస్తూ, ప్రోస్టేట్‌లో చిన్న స్థాయి సమస్యను వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. అది ఇతర అవయవాలకు వ్యాపించకముందే చికిత్స తీసుకున్నట్లు వెల్లడించారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ సమస్య ఎదురయ్యిందని, అప్పటికే ప్రొస్టేట్‌లో ఒక సెంటీమీటర్ కంటే చిన్న సైజులో మచ్చ గుర్తించినట్లు చెప్పారు. దీనిని టెస్ట్ చేయగా, క్యాన్సర్ తొలి దశలో ఉన్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలోనే జెరూసలేంలోని హదస్సా ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆ సమస్య పూర్తిగా తగ్గిపోయిందని వెల్లడించారు. అంతేకాదు ఇజ్రాయెల్ ప్రజలు తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు సమయానికి పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. అయితే ఇరాన్‌తో యుద్ధం సమయంలో నెతన్యాహు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తన మరణ వార్తలను ఖండించిన నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రజలతో కాఫీ తాగుతున్న వీడియోలను షేర్ చేసుకున్నారు. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఏఐతో నెతన్యాహు వీడియోను సృష్టించారని పేర్కొంది. దీంతో నెతన్యాహు మరోసారి స్వయంగా తన ఫోన్లో తీసిన వీడియోనూ సామాజిక మాధ్యమంలో షేర్ చేసుకుంటూ తాను ఇంకా బతికే ఉన్నానని, ఇరాన్ తప్పుడు ప్రచారం మానుకోవాలని పరోక్షంగా ఎద్దేవా చేశారు.היום התפרסם הדו״ח הרפואי השנתי שלי. ביקשתי לעכב את פרסומו בחודשיים כדי שהוא לא יפורסם בשיא המלחמה על מנת שלא לאפשר למשטר הטרור באיראן להפיץ עוד תעמולת כזב נגד ישראל. אני מבקש לשתף אתכם בשלושה דברים:1 - ברוך השם, אני בריא.2 - אני בכושר גופני מצויין.3 - הייתה לי בעיה…— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) April 24, 2026 -
మలి విడత చర్చలు.. పాక్‌కు అమెరికా ప్రతినిధులు!
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న మలి విడత శాంతి చర్చల కోసం అమెరికా ప్రతినిధులు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇరాన్‌తో జరిగే చర్చల్లో పురోగతి కనిపిస్తే వాన్స్ పాకిస్తాన్‌కు వెళ్తారని అధికారులు తెలిపారు. కాగా మలి విడత చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఆయన పాకిస్తాన్‌కు బయల్దేరి వెళ్లడానికి ముందు పాకిస్తాన్ డిప్యూటీ సీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో వరుస హెచ్చరికలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న ఇరాన్, అమెరికాకు చెందిన ప్రతినిధులు పాక్‌కు చేరుకోవడం చూస్తుంటే రెండో విడత శాంతి చర్చలు ఉంటాయనే అంచనాలు బలపడుతున్నాయి. -
అమెరికా సంచలన ప్రకటన : ఆ నేతను పట్టిస్తే రూ.94 కోట్లు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం ఇరాన్ మద్దతు ఉన్న మిలిషియాపై తన ఒత్తిడిని మరింత పెంచుతోంది. తాజాగా 'ఖతైబ్ సయ్యిద్ అల్ శుహదా' (KSS) ఉగ్రవాద సంస్థ అధినేత హషీమ్ ఫిన్యాన్ రహీమ్ అల్-సరాజీ (అలియాస్ అబూ వాలా అల్ వేలీ) గురించి సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 94 కోట్లు పైమాటే) బహుమతిని ప్రకటించింది. మిలీషియాలను అదుపులోకి తీసుకురావడానికి మరింతగా కృషి చేసే అవకాశం ఉన్న కొత్త ప్రధానమంత్రిని నియమించేలా బాగ్దాద్‌ను ప్రోత్సహించేందుకు, ఇరాక్‌లోని ఇరాన్ మద్దతుగల మిలీషియాలపై అమెరికా ఒత్తిడిని పెంచుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.సమాచారం అందించిన వారికి నగదు బహుమతితో పాటు, అవసరమైతే వేరే ప్రాంతానికి పునరావాసం (Relocation) కల్పించే అవకాశం కూడా ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తన 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' ప్రోగ్రామ్ కింద ఈ ప్రకటన చేసింది. ముఖ్యంగా ఇరాక్, సిరియాలోని అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక బలగాలపై దాడులు చేయడం, ఇరాక్ పౌరుల మరణాలకు ఈ గ్రూపు బాధ్యత వహించిన నేపథ్యంలో ఆ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇరాన్ నిర్దేశించిన విధంగా ఇరాక్, సిరియా మరియు సౌదీ అరేబియాపై కూడా దాడులకు పాల్పడటం. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు అబూ వాలా అల్ వేలీ బహిరంగంగా మద్దతు ప్రకటించడం గమనార్హం.గత దశాబ్ద కాలంగా, ఈ మిలీషియాలు ఇరాక్‌లోని అమెరికా బలగాలపైనా, దౌత్యవేత్తలపైనా దాడులు చేశాయి. ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధ సమయంలో, ఈ మిలీషియాలు తమ దాడులను తీవ్రతరం చేశాయి. సౌదీ అరేబియాపై కూడా దాదాపు 1,000 దాడులు నిర్వహించాయి. ఇదీ చదవండి: 3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్ఎవరీ అబూ వాలా అల్ వేలీ?అబూ వాలా అల్ వేలీ ఇరాక్ కేంద్రంగా పనిచేస్తున్న కేఎస్ఎస్ సాయుధ గ్రూపుకు సెక్రటరీ జనరల్‌గా ఉన్నాడు. ఈ సంస్థ ఇరాన్ యొక్క 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) కు అత్యంత విధేయంగా ఉంటూ, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తుంటుంది. గతంలో ఇతను అమెరికా వ్యతిరేక సంస్థ అయిన 'ఖతైబ్ హెజ్బుల్లా' (KH)లో సభ్యుడిగా ఉండేవాడు. ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా అమెరికా ఇతడిని అరెస్టు చేసి జైలులో ఉంచింది. అయితే, 2010లో ఇతను విడుదలయ్యాడు. 2010వ దశకం ఆరంభంలో సిరియా అంతర్యుద్ధం సమయంలో, ఖతైబ్ హెజ్బుల్లా నుంచి విడిపోయిన మిలీషియాలోని అబు హుస్సేన్ , అబు ఫదక్ విభాగాలకు చెందిన KH సభ్యులతో కలిసి దీన్ని ఏర్పాటు చేశాడు. 2023, నవంబరులో వేలీని 'ప్రత్యేకంగా గుర్తించిన ప్రపంచ ఉగ్రవాది' (SDGT)గా అమెరికా ప్రకటించింది. ఇదీ చదవండి: అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు -
ఇరాన్ మాజీ యువరాజుపై దాడి..
ఇరాన్ బహిష్కృత యువరాజుపై బెర్లిన్‌లో దాడి జరిగింది. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపురంగు ద్రవాన్ని మీద చల్లారు. అయితే వెంటనే ఆయన రక్షణ సిబ్బంది స్పందించి ఆందోళనకారుడిని ప్రక్కకు తోశారు.రెజా పహ్లావి గురువారం బెర్లిన్‌లో ఒక భవనం నుండి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో పహ్లావి తన భద్రతా సిబ్బందితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుక నుండి వచ్చిన ఒక వ్యక్తి తన బ్యాగ్ నుంచి ఎరుపు రంగు ద్రవాన్ని (ఇది టమోటా జ్యూస్ అని భావిస్తున్నారు) ఆయనపై విసిరాడు. దీంతో ఆ ఎరుపు ద్రవం పహ్లావి తల వెనుక భాగం, మెడ మరియు ఆయన ధరించిన బ్లేజర్‌పై పడింది. అయితే ఈ హఠాత్ పరిణామంతో ఏ మాత్రం సంబంధం లేకుండా చాలా ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే రెజాపహ్లవిపై దాడి చేసిన వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే పహ్లవి విలేకరుల సమావేశం నిర్వహించారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు: ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తుల్ని గూండాలు, ఉగ్రవాదులుగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశాలన్ని ఇరాన్ పాలనపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, కేవలం యధాతథ స్థితిని కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ఖైదీల విడుదల, ఉరిశిక్షల నిలిపివేత విషయంలో ఐరోపా దేశాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.రెజా పహ్లవీ నేపథ్యంకాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ పాలన అంతం కోసం ఆయన పోరాడుతున్నారు. ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక జోక్యాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అయితే ఇరాన్ లోపల ఆయనకు ఎంతవరకు మద్దతు ఉందనేది తెలియాల్సి ఉంది. -
ఖమేనీ అజ్ఞాతవాసానికి కారణం ఇదేనా?
ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఇరాన్ దాగుడు మూతలు ఆడుతోంది. పుకార్లను ఖండిస్తూ.. ఆయన క్షేమంగా ఉన్నారని మాత్రమే ప్రకటనలు ఇస్తోంది. ఫొటోలు, వీడియోలు, ఆఖరికి వాయిస్ రికార్డింగ్‌లు కూడా ఒక్కటి రిలీజ్ చేయలేదు. ఆయన ఆరోగ్యస్థితి ఏమాత్రం బాగోలేదని.. పైగా పాలన మొత్తం కరడుగట్టిన సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని వెస్ట్రన్ మీడియా కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా సంచలన విషయాలను పబ్లిష్ చేసింది. ‘ఖమేనీ సజీవంగానే ఉన్నారు. రహస్య ప్రదేశంలో ఆయనకు చికిత్స అందుతోంది. దాడుల్లో ఖమేనీ ముఖం, పెదవులు కూడా తీవ్రంగా కాలిపోయాయి. అందుకే మాట్లాడటం కూడా కష్టంగా మారింది. స్పృహలోనే ఉంటూ అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆయనకు ఏదైనా చెప్పాలంటే రాసి చూపిస్తున్నారు. అలాగే.. ఆయనకు ఏదైనా సమాచారం చేరవేసేందుకు.. చేతితో రాసిన ఉత్తరాలను మాత్రమే వాడుతున్నారు. వాటిని ఖమేనీ ఉన్న ప్రాంతానికి బైక్‌లపై చేరవేస్తున్నారు. అక్కడి నుంచి బదులు కూడా అలాగే వస్తోంది. ఇజ్రాయెల్ నిఘాకు దొరకకుండా ఉండేందుకు ఇదంతా చేస్తున్నారు..దాడుల్లో కాలికి గాయం కావడంతో దానికి మూడుసార్లు ఆపరేషన్ జరిగింది. కృత్రిమ కాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతికి కూడా సర్జరీ జరిగింది. ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రు సైన్యం నుంచి తప్పించుకునేందుకు ఇదే ఉత్తమమైన మార్గం కూడా అని ఆయన అనుకుంటుఉన్నారు’’ అని ఆ కథనాలు సారాంశం.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా దాడులకు దిగాయి. ఆనాటి దాడుల్లో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుటుంబం మరణించింది. ఆయన తనయుడు ఖమేనీ గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత ఆయన్నే ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇరాన్ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఆయన్ని కలవడానికి వెళ్లడం లేదు.పాలన చేజారిందంటూ.. దేశాన్ని నడిపేందుకు ముజ్తాబా ఖమేనీ ఓ బోర్డును ఏర్పాటు చేసినట్లు ఆ దేశ రాజకీయవేత్త అబ్దుల్‌రెజా దవారీ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ బోర్డుకి ఖమేనీ డైరెక్టర్‌గా ఉండగా.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ జనరల్స్ సభ్యులుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వారి సలహాలు, మార్గదర్శకాల పైనే ఖమేనీ ఎక్కువగా ఆధారపడుతున్నారని అన్నారాయన. అంతేకాదు అమెరికా-ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధం, దౌత్య ప్రయత్నాలు, జాతీయ భద్రత విషయాల్లో వారు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే..ఈ వ్యవహారంలో సుప్రీం లీడర్ పరిమితంగా వ్యవహరిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనం ఇచ్చింది. సుప్రీం లీడర్‌కి చేరుకోవడం కష్టమవడంతో.. నిర్ణయాధికారం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కమాండర్ల చేతుల్లోకి వెళ్లిందని.. వాళ్లే యుద్ధం, దౌత్యం, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని.. ఇది ఇరాన్ గత సుప్రీంల పాలనకు భిన్నంగా ఉందని ఆ కథనం పేర్కొంది. అంతేకాదు.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి డమ్మీలుగా మారిపోయారని.. అమెరికాతో జరగాల్సిన చర్చలు కూడా సైనికాధికారుల వ్యతిరేకత కారణంగానే విఫలమయ్యాయని తెలిపింది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ జీవచ్ఛవంగా ఉండిపోయారని.. ఇరాన్లో “రెజీమ్ చేంజ్”(పాలన పగ్గాలు మారాయని) వ్యాఖ్యానించినప్పటికీ.. ఇరాన్ మీడియా మాత్రం ఆ కథనాలను ఖండిస్తూ వస్తోంది. -
యుద్ద సంక్షోభాన్ని ముందే పసిగట్టిన చైనా..?
డ్రాగన్ కంట్రీ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన స్వార్థం కోసం ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి సిద్ధం కానీ తను మాత్రం ఎన్నడూ ఇబ్బందులకు గురి కాదు.ప్రస్తుతం ఇదే విషయం మరోసారి రుజువైంది. ఇరాన్- అమెరికా యుద్ధం వస్తుందని ముందే ఉహించిన చైనా ఆ దేశంలో భారీగా చమురు నిల్వలు ఉంచుకుందట.. అవీ ఏకంగా IEA అంతర్జాతీయ ఇంధన సంస్థ నిల్వల కంటే కూడా అధికంగా ఉన్నాయని సర్వేలు తెలిపాయి.ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్దంతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రధాన అంశం చమురు. ఆయిల్ రవాణాకు ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. అయితే ఈ సంక్షోభాన్ని ముందే ఉహించిన చైనా తమ దేశానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా భారీగా చమురునిల్వలు ఉంచుకుందట.. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాలు ఈ వివరాలే చెబుతున్నాయి.ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం చైనా వద్ద సుమారుగా 1.4 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి.అయితే ఇది అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) లోని 32 సభ్య దేశాల మొత్తం నిల్వలు (1.2 బిలియన్ బారెళ్లు) కంటే అధికమని సర్వేలు చెబుతున్నాయి. అదే అమెరికా వద్ద ప్రస్తుతం 405 మిలియన్ బారెళ్ల నిల్వలు మాత్రమే ఉన్నాయని.. యుద్ధం కారణంగా పెరిగిన ధరలను తగ్గించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే 172 మిలియన్ బారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించారని పేర్కొన్నాయి..అయితే యుద్దం అంచనాని ముందే పసిగట్టిన చైనా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనా తన చమురు దిగుమతులను ఏకంగా 15.8% పెంచుకుందని సర్వే చెబుతుంది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రస్తుతం యుద్దం నేపథ్యంలో చమురు సంక్షోభాన్ని పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. అందుకే ఇది వరకూ ప్రపంచ దేశాలు చమురు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా చైనా మాత్రం ఎటువంటి ఆందోళన చెందలేదు. -
ఇరాన్‌తో యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్‌పై ట్రంప్ క్లారిటీ
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్ వాడాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ దాడులద్వారానే ఇరాన్ సైన్యం చిన్నాభిన్నమైందంటూ వ్యాఖ్యానించారు. పర్మినెంట్ డీల్ కోసమే చూస్తున్నామని.. ప్రస్తుతం ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ దెబ్బతిన్నాయంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంలో మునిగిపోయిన ఇరాన్‌ను ఆర్థిక సుడిగుండంలో నిండా ముంచేందుకు హార్మూజ్ జలసంధిని గుప్పిట పట్టామని ట్రంప్ పునరుద్ఘాటించారు. జలసంధిపై తమ ఆధిపత్యాన్ని కొనసాగేంచేందుకు అగ్రరాజ్య నావికాదళాలకు ఆయన గురువారం కీలక ఆదేశాలిచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘హార్మూజ్ జలసంధిలో మన యుద్ధ నౌకలు, విదేశీ నౌకల రాకపోకలను పెను ప్రమాదంలోకి నెట్టేసే సముద్రమందుపాతరను వెనువెంటనే ఏరిపారేయండి...కొత్తగా మందుపాతరలను పెట్టేందుకు సముద్రజలాల్లో సంచరించే ఇరాన్ పడవలను వెంటనే పేల్చేయండి. అవి చిన్నపడవలు అనే కనికరం అస్సలు చూపకండి. ఇప్పటికే మన దెబ్బకు ఇరాన్ నావికాదళంలోని కీలక 159 నౌకలు మునిగిపోయి సముద్రగర్భంలోకి చేరాయి. మన మైన్ ‘స్వీపర్లు’ ఇప్పటికే సీమైన్స్‌ను ఏరిపారేయడంలో నిమగ్నమ య్యాయి. ఈ పనిని మూడు రెట్లు అత్యధిక వేగంతో పూర్తిచేసే బాగుంటుంది.హార్మూజ్ దిగ్బంధం కొనసాగుతుంది. ఇరాన్ మనతో ఒప్పందం కుదుర్చుకునేదాకా మన అనుమతి లేకుండా ఏ ఒక్క నౌక ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఐఆర్జీసీ ఆధిపత్యం, పాలకులతో విబేధాలతో తమ అసలైన అత్యున్నత నేత ఎవరు అనేది తేల్చుకోవడం ఇరానియన్లకు కష్టంగా మారింది. అతివాద నేతలేమో మన దాడుల్లో చనిపోతు న్నారు. ఉదారవాదులకు కాస్తంత గౌరవం దక్కుతోంది. ఇది నిజంగా క్రేజీ విషయం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.‘‘ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం ఆత్రంగా ఎదురుచూడట్లేము. మాకు తొందరేం లేదు. యుద్ధాన్ని త్వరగా ముగించి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ట్రంప్ అన్నారు. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే జలసంధి దిగ్బంధించామని అమెరికాæ ఆర్థిక మంత్రి స్కాట్బీసెంట్ అన్నారు. ‘‘ఈ విషయంలో మా అధ్యక్షుడు స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. హార్మూజ్ సహా ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధిస్తే ముడిచమురు సరఫరా ఆగిపోతుంది.దీంతో ఖర్గ్ ద్వీపంలోని ముడిచమురు నిల్వకేంద్రాలన్నీ క్రూడా యిల్లో నిండిపోతాయి. చమురుబావుల నుంచి సరఫరా అయ్యే ముడిచమురును నిల్వచేయడానికి చోటే ఉండదు. అప్పుడు తప్పనిపరిస్థితుల్లో చమురుబావుల నుంచి వెలికితీత ఆపేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆపేస్తే మళ్లీ మొదలెట్టడం శ్రమతోకూడిన సంక్లిష్ట ప్రక్రియ. దీంతో ఆదాయం లేక ఇరాన్ చేతులెత్తేస్తుంది’’ అని హెచ్చరించారు. -
డేటా వార్!.. కేబుళ్లను కత్తిరిస్తామంటూ ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. పర్షియన్ గల్ఫ్‌లోని కీలక డిజిటల్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్జీసీ) బాంబు పేల్చింది. సముద్రంలోని ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచంలోని అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రయాణిస్తోంది. కేబుల్స్‌కు ముప్పు వాటిల్లితే నష్ట ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండనుంది. చాలా దేశాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలుగా మారిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే. -సాక్షి, స్పెషల్ డెస్క్హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే కీలక సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను, వాటికి ఉన్న ముప్పును ఐఆర్‌జీసీకి అనుబంధంగా ఉన్న తస్నీమ్ వార్తా సంస్థ ప్రచురించిన నివేదికలో వివరించింది. ఇంధన రవాణాకే గాక ప్రపంచ డేటా ప్రవాహానికీ ఈ జలసంధి అత్యంత కీలక మార్గమని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాలు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ సముద్ర కేబుల్ వ్యవస్థలపైనే ఆధారపడుతున్నాయని నొక్కి చెప్పింది. కేబుళ్ల ల్యాండింగ్ స్టేషన్స్, క్లౌడ్ హబ్‌లను శత్రువుపై ఒత్తిడి పెంచే వ్యూహాత్మక కేంద్రాలని తెలిపింది. ఎలాంటి అంతరాయం కలిగినా ఆయా దేశాల ఆర్థిక, సమాచార వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ డేటా సెంటర్లు కేంద్రీకృతమై ఉన్నాయి. మూల స్తంభాలుగా.. ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి గుండా సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ భారీ నెట్వర్క్ ఉంది. ఇది ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య కీలక అనుసంధానంగా నిలుస్తుంది. పశ్చిమ దేశాలతో భారత్‌ను అనుసంధానించే ఐదు ప్రధాన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలు మన దేశ డిజిటల్ కమ్యూనికేషన్లకు మూల స్తంభాలుగా ఉన్నాయి. వీటిలో ఫాల్కన్ నెట్వర్క్, ఆసియా–ఆఫ్రికా–యూరప్–1, టాటా టీజీఎన్–గల్ఫ్, సౌత్ఈస్ట్ ఆసియా–మిడిల్ ఈస్ట్–వెస్టర్న్ యూరప్–4, ఇండియా–మిడిల్ ఈస్ట్–వెస్టర్న్ యూరప్ ఉన్నాయి. కేవలం ఎర్ర సముద్రం గుండానే 15–20 కేబుల్స్ వెళ్తున్నాయి. రిలయన్స్ అభివృద్ధి చేస్తున్న ఇండియా–యూరప్–ఎక్స్‌ప్రెస్, ఇండియా–ఆసియా–ఎక్స్‌ప్రెస్, గూగుల్‌కు చెందిన ధివారు సముద్ర కేబుల్ ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. సేవలకు అంతరాయం.. ఒకటి లేదా రెండు కేబుల్స్ దెబ్బతింటే ఆ అంతరాయాన్ని సాధారణంగా సరిచేయొచ్చు. అనేక కేబుల్స్ తెగిపోతే ఇంటర్నెట్ వేగం తగ్గడం, వెబ్‌సైట్స్ పనిచేయకపోవడం, బ్యాంకింగ్, క్లౌడ్ సిస్టమ్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన దేశంలోని ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో సుమారు 60% ముంబై నుంచి గల్ఫ్ ప్రాంతం మీదుగా యూరప్ వైపు వెళ్లే మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది. మిగిలిన ట్రాఫిక్ చెన్నై నుంచి సింగపూర్ మీదుగా పసిఫిక్ మహాసముద్రం వైపు సాగే మరో మార్గం ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల నుంచి ఆసుపత్రి డేటా వరకు అన్నీ ’క్లౌడ్’లో భద్రపరచి ఉన్నాయి. కనెక్టివిటీ పోతే ఈ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. భారత్ ఒక ’డిజిటల్ ద్వీపం’ లాంటిది. మన అంతర్జాతీయ డేటాలో 97% సముద్ర మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది. మరమ్మతులకు నెలలు.. తరచుగా నౌకల లంగర్ల వల్ల జరిగే ప్రమాదవశాత్తు నష్టాలు కూడా ఇంటర్నెట్ అంతరాయాలకు కారణమవుతాయి. భారీ స్థాయిలో నష్టం జరిగితే వాటిని సరిచేయడానికి వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చు. 2024, 2025లో ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో ఎర్ర సముద్రంలోని పలు సముద్రగర్భ కేబుల్స్ దెబ్బతిన్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వేగం తగ్గడంతోపాటు అనేక దేశాల్లో సేవలకు అంతరాయం కలిగింది. ఆ ప్రాంతంలోకి ప్రవేశం పరిమితంగా ఉండటం వల్ల మరమ్మతులు చేయడానికి నెలలు పట్టింది. రిస్క్ అనాలసిస్.. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం దిగ్గజాలు తమ అంతర్జాతీయ డేటా ప్రసారం కోసం ఈ హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్ర మార్గాలపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయి. హార్ముజ్ గుండా వెళ్లే కేబుల్స్‌కు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడటానికి ఇరాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరపాలని ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విజ్ఞప్తుల నేపథ్యంలో టెలికం శాఖ ఆపరేటర్లందరినీ తమ డేటా మార్గాల భద్రతపై ’రిస్క్ అనాలిసిస్’ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ కేబుల్స్ దెబ్బతింటే డేటాను ప్రత్యామ్నాయ మార్గాల (సింగపూర్ లేదా పసిఫిక్ రూట్) ద్వారా ఎలా మళ్లించాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. -
‘అవి నరకాలు కావు..మానవాళికి మహోన్నత దేశాలు’
భారత్, చైనా నరకాలు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్‌లోని నాగరికతను నాశనం చేస్తామంటూ ప్రకటనలు మీద ప్రకటనలు ఇస్తున్న ట్రంప్ ఉంటున్న అమెరికానే నరకం అంటూ ఇరాన్ రిప్లై ఇచ్చింది. భారత్, చైనాలు మానవాళికి మహోన్నత దేశాలు అంటూ ఇరాన్ పేర్కొంది. భారత్, చైనాలను నాగరికతకు పుట్టినిల్లు అని పేర్కొంటూ ట్రంప్‌పై విరుచుకుపడింది. చైనా, భారత్ నాగరికతకు పుట్టినిల్లు. నిజానికి అమెరికా దేశ యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు ఇరాన్లో నాగరికతను నాశనం చేస్తానని బెదిరించిన చోటే ఆ నరకమనేది ఉంది’ అంటూ ఇరాన్ బదులిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో భారత్, చైనాలను నరక కూపాలు అని అభివర్ణిస్తూ వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా స్పందించింది. ట్రంప్ ప్రకటనలకు సంబంధించి కొన్ని నివేదికలను చూశామని పేర్కొంది. తాము కొన్ని నివేదిలైతే చూశామని, ఈ వ్యాఖ్యల వివాదాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్‌పై విషం కక్కిన ట్రంప్ -
హర్ముజ్ వద్ద మరోసారి టెన్షన్ టెన్షన్
ప్రస్తుతం హర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్ముజ్ జలసంధిని బ్లాకేడ్ చేశాం అని అమెరికా ప్రకటించడం.. అదే సమయంలో ఇరాన్ సైతం హర్ముజ్ నుంచి రాకపోకలకు అంతరాయం కలిగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్‌లో తొలిసారిగా టోల్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్రేజా హాజీ ఈ మేరకు ప్రకటన చేసినట్లు అల్ జజీరా కథనం పేర్కొంది. " ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే నౌకల నుండి ఇరాన్ టోల్ వసూలు చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మొదటి విడత ఆదాయాన్ని ఇప్పటికే దేశంలోని సెంట్రల్ బ్యాంక్‌లో జమ చేశాం" అని ఆయన అన్నట్లు పేర్కొంది. అమెరికా విధిస్తున్న నౌకాదళ ఆంక్షలకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ పన్నును అమలు చేస్తోన్నట్లు తెలిపింది.కాగా ఇదివరకే హర్ముజ్ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు మరియు నౌకాదళ ఒత్తిడి కొనసాగినంత కాలం ఈ చమురు రవాణా మార్గాన్ని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ, అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ చేస్తున్న రాయబార ప్రయత్నాలను ఇరాన్ గుర్తించినప్పటికీ, అమెరికా తీరును మాత్రం తప్పుబడుతూ వస్తుంది.కాగా ఇదివరకే అమెరికా బెదిరింపులకు ఏ మాత్రం తగ్గేది లేదని ఇది వరకే ఇరాన్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్‌కు తరచుగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే హర్ముజ్ వద్ద టోల్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
హర్మూజ్ జల సంధిలో భారత్ నౌకను సీజ్ చేశాం : ఇరాన్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్ అడ్డుకుంటూ, స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఇరాన్ నౌకాదళం రెండు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారత్‌కు చెందిన నౌక కూడా ఉంది. ఈ నౌక దుబాయ్ నుంచి బయలుదేరి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఇరాన్ కమాండోలు గన్బోట్ల ద్వారా భారత్ నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎస్ఈ పేరుతో పనామా జెండాతో వెళ్తున్న మరో ఫ్రాన్స్ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు నౌకలను ఇరాన్ తీరానికి తీసుకెళ్లారు.ఇరాన్ విడుదల చేసిన వీడియోలో ముసుగులు ధరించిన కమాండోలు తుపాకులతో నౌకపైకి ఎక్కి తనిఖీలు చేపట్టిన దృశ్యాలు చూడొచ్చు. నౌకపై కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసరడంతో బ్రిడ్జ్ (కమాండ్ సెంటర్) దెబ్బతింది. అయితే సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు.ఈ ఘటనకు ముందు అమెరికా మెరైన్లు రెండు ఇరాన్ జెండా కింద నడుస్తున్న నౌకలను స్వాధీనం చేసుకోవడంతో, ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధికారులు ఇరాన్ ‘మస్కిటో ఫ్లీట్’ అనే చిన్న, వేగవంతమైన పడవలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.భారత్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్గం కావడంతో, ఇలాంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 🇮🇷⚡️BREAKING: IRGC releases footage showing their Navy forces seizing the 'MSC Epaminondas' vessel in the Strait of Hormuz earlier today. pic.twitter.com/Mx8Jt6QIAB— IRGC (@IRGC_Press) April 22, 2026 -
టెహ్రాన్ వీధుల్లో ఉరేగింపు.. వేల సంఖ్యలో జనం
టెహ్రాన్: ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని రాబోయే 36 నుంచి 72 గంటల్లోపూ మరో దశ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ బలప్రదర్శన చేసింది. తన బాలిస్టిక్ క్షిపణితో టెహ్రాన్ వీధుల్లో ఉరేగింపు జరిపింది. ఈ ఊరేగింపులో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధంలో సీజ్ఫైర్ నడుస్తున్నందున ఇరాన్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు సాధారణ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తమ దేశ ఆయుధ సంపత్తిని తెలియజేస్తూ టెహ్రాన్ వీధుల్లో ఓ ర్యాలీ నిర్వహించింది. ఒక భారీ వాహనంపై తన దేశానికి చెందిన ఆధునాతన బాలిస్టిక్ క్షిపణి ఖదర్ను ప్రదర్శనకు ఉంచి ఊరేగింపు జరిపింది.ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొని నినాదాలు చేస్తూ ర్యాలీగా బయిలు దేరారు. ఖదర్ అనే క్షిపణి పాత షహాబ్-3A క్షిపణికి ఆధునాతన వెర్షన్ ఇది. ఇజ్రాయెల్‌పై దాడులకు ఇరాన్ ప్రధానంగా వీటినే వినియోగించింది.అయితే ఇటీవల ట్రంప్ తరచుగా ఇరాన్ ఆయుధ సామాగ్రిపై ట్రంప్ తరచుగా కామెంట్స్ చేశారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎటువంటి ఆయుధ సామాగ్రి లేదని తరచుగా మాట్లాడారు. కాగా ఇటీవల యుఎస్ అధికారి ఇచ్చిన నివేదిక ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ ఆడమ్స్ ప్రకారం.. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా సురక్షితంగా ఉన్నాయి. తీరప్రాంత రక్షణ క్షిపణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు.మరోవైపు గత వారం CNN జరిపిన దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వాహనాల్లో దాదాపు సగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, అలాగే వేలాది డ్రోన్లు ఆయుధాగారంలోనే దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఆ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ర్యాలీ సైతం తమ వద్ద ఇంకా బలమైన ఆయుధాలు ఉన్నాయని పరోక్షంగా హెచ్చరించడానికే అన్న కోణంలో ఉంది.Iran publicly displays 2000 km range ballistic missile in Tehran pic.twitter.com/HnKXAyPis9— Iran Headlines (@Iran_Headlines) April 23, 2026 -
50 డేస్.. అమెరికా అట్టర్ ప్లాప్ షో..
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్ వేదిక చర్చల్లో కూడా సందిగ్ధత నెలకొంది. సీజ్‌ఫైర్‌ను ట్రంప్ పొడిగించినప్పటికీ అరకొరదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇరాన్ సైతం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరోవైపు.. ఇరాన్‌పై దాడుల కారణంగా అమెరికా ఆయుధాల సంఖ్య రోజురోజుకి తరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 2027 బడ్జెట్లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది. ఇంతకీ అమెరికా వద్ద ఇంకా ఎన్ని క్షిపణులు, ఆయుధాలు ఉన్నాయనే అంశం ఓ నివేదిక బయటకు వచ్చింది.అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమై 50 రోజులు దాటింది. యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా భారీగానే దాడులు చేసింది. భారీ క్షిపణులు, వైమానిక దాడులతో విధ్వంసమే సృష్టించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఆయుధాలను ఉపయోగించింది. దీంతో, ఇరాన్ సైనిక సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా, అమెరికా ఆయుధ నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయి. ఆయుధ నిల్వలు భారీగా తరిగిపోయాయి. అయితే, అమెరికా వద్ద ప్రస్తుత యుద్ధాన్ని కొనసాగించడానికి సరిపడా మిసైళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో కొత్త యుద్ధాలు తలెత్తితే నిల్వల కొరత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.అమెరికా ఆయుధ నిల్వల పరిస్థితి..టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్లు: యుద్ధానికి ముందు 3,100 ఉండగా.. యుద్ధం కోసం 850 వినియోగించబడ్డాయి. దీంతో, దాదాపు 25% నిల్వలు తగ్గాయి.JASSM (జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండాఫ్ మిసైళ్లు): 4,400 ఉండగా.. ఇరాన్ యుద్ధం కోసం 1,000 వినియోగించబడ్డాయి.THAAD ఇంటర్సెప్టర్లు: 360 ఉండగా.. 190–290 వినియోగించబడ్డాయి. ఇప్పుడు 70 మాత్రమే మిగిలి ఉన్నాయి.పాట్రియట్ PAC-3: 2,330 ఉండగా.. 1,060–1,430 వినియోగించబడ్డాయి. కేవలం 900 మాత్రమే మిగిలాయి.SM-6: 600 ఉండగా..200 వినియోగించారు. 400 వరకు ఉన్నాయి. SM-3: 150 ఉండగా.. 40 వరకు వినియోగం. ఇంకా 110 మిగిలి ఉన్నాయి.భవిష్యత్తు ప్రణాళిక.. భారీగా ఖర్చు..2027 బడ్జెట్లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది.టోమాహాక్: 55 నుంచి 785కి పెంపు( ఒక్క దానికి ఖర్చు: తయారీకి $2.6 మిలియన్ డాలర్లు).Patriot PAC-3: 357 నుంచి 3,203కి పెంపు ( $3.9 మిలియన్)THAAD: 55 నుంచి 857కి పెంపు($15.5 మిలియన్)SM-6: 166 → 540కి పెంపు($4.3 మిలియన్)SM-3: 12 → 136కి పెంపు($9–10 మిలియన్)ప్రధాన సమస్యలు..ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారు చేసే డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు అమెరికా ఖరీదైన రక్షణ వ్యవస్థలను బలవంతంగా వినియోగింపజేస్తున్నాయి.THAAD, Patriot లాంటి రక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.ఉత్పత్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టడం కారణం (టోమాహాక్ – 47 నెలలు, THAAD – 53 నెలలు, SM-36 నెలలు, SM-36 నెలలు) కావడంతో నిల్వలను తిరిగి భర్తీ చేయడం కష్టతరం అవుతుంది. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం.. యుద్ధంలో ప్రధానంగా షాహెడ్ డ్రోన్లు మరియు క్రూయిజ్ మిసైళ్లు వినియోగిస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, పెద్ద సంఖ్యలో తయారు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండటంతో అమెరికా మరియు మిత్రదేశాల రక్షణ వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నాయి. ఇరాన్ ఒకేసారి వందల డ్రోన్లను పంపి, అమెరికా THAAD మరియు Patriot వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. ఇరాన్ ఉపయోగిస్తున్న డ్రోన్లుShahed-136 ("కమికాజే" డ్రోన్)ఒకే దిశలో దాడి చేసే UAV (Unmanned Aerial Vehicle).ఖర్చు: సుమారు $20,000–$50,000 మాత్రమే.లక్ష్యం: శత్రు రక్షణ వ్యవస్థలను అధిక సంఖ్యలో దాడులతో అలసటకు గురి చేయడం.“పేదవాడి క్రూయిజ్ మిసైల్” అని పిలుస్తారు, ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో క్రూయిజ్ మిసైల్ లాంటి ప్రభావం చూపుతుంది.UAE రక్షణ శాఖ ప్రకారం, యుద్ధం ప్రారంభం నుండి 941 డ్రోన్లు గుర్తించబడ్డాయి, వాటిలో 65 UAEలో పడిపోయి మౌలిక వసతులకు నష్టం కలిగించాయి.Shahed-131 / Shahed-238 (అప్‌గ్రేడ్ వెర్షన్లు)Shahed-136 కంటే చిన్నవి లేదా వేగవంతమైనవి.కొన్ని జెట్-ఇంజిన్ ఆధారిత డ్రోన్లు కూడా వినియోగించబడ్డాయి, ఇవి మరింత వేగంగా ఉండి Patriot లాంటి రక్షణ వ్యవస్థలకు సవాలు విసురుతున్నాయి.ఇరాన్ క్రూయిజ్ మరియు బాలిస్టిక్ మిసైళ్లు1. Zolfaghar బాలిస్టిక్ మిసైల్700 కిమీ పరిధి.1,100 పౌండ్ల వార్‌హెడ్ మోసే సామర్థ్యం.ఇరాక్‌లోని ఎర్బిల్ ప్రాంతంలో పలు దాడుల్లో వినియోగించబడింది.2. Soumar క్రూయిజ్ మిసైల్రష్యా KH-55 ఆధారంగా అభివృద్ధి చేయబడింది.దీర్ఘదూర దాడులకు ఉపయోగపడుతుంది.3. Quds-1 / Quds-2 క్రూయిజ్ మిసైళ్లుతక్కువ ఖర్చుతో తయారు చేయగలిగే సామర్థ్యం.గల్ఫ్ ప్రాంతంలోని మౌలిక వసతులపై దాడులకు వినియోగించబడ్డాయి.ఇదిలా ఉండగా.. అమెరికా పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది. -
ఓ మై గాడ్.. ఇరాన్ ఎంత పని చేసింది?
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా బ్లాకేడ్.. ఇరాన్ ఆధిపత్య ప్రయత్నాలతో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అయితే ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఓ క్లారిటీ ఇచ్చింది.హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి కనీసం మరో ఆరు నెలల టైం పట్టవచ్చని తాజాగా పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా చట్టసభ సభ్యులతో ఆ విభాగం రహస్యంగా ఓ సమావేశం నిర్వహించిందని.. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలకమైన నివేదికను అక్కడి సభ్యులకు వివరించిందన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఈ జాప్యానికి శాంతి చర్చలతో సంబంధం లేదని తెలుస్తోంది. ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ఉండటం వల్లే ఈ ఆలస్యం జరగవచ్చని ఆ నివేదిక తెలిపింది. హర్ముజ్ రూట్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 కంటే ఎక్కువ మైన్స్‌నే అమర్చి ఉంటుందని అంచనా. ఇందుకోసం ఇరాన్ జీపీసీ (Global Positioning Capability/Control) టెక్నాలజీ వాడింది. అందుకే వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది. కాబట్టి.. వాటిని తొలగించడానికి టైం పట్టవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే..ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తిస్థాయిలో వాటి తొలగింపు ఆపరేషన్ చేపట్టడానికి వీలుంటుందని కూడా పెంటగాన్ నివేదిక స్పష్టం చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే పెంటగాన్ ఈ కథనాలను ధృవీకరించాల్సి ఉంది. ఇరాన్ ఇటీవల హర్ముజ్ జలసంధి సముద్ర మైన్స్ (Sea Mines) గురించి పలు ప్రకటనలు చేసింది. ముఖ్యంగా, నౌకలు మైన్స్‌తో ఢీకొనే ప్రమాదం ఉందని హెచ్చరించి.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పలు దేశాల వాణిజ్య నౌకలకు సూచించింది. అయితే డీల్ కుదిరాక ఇరాన్ సహకారంతోనే సీ మైన్స్‌ను తొలగిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అది జరిగే పని కాదంటూ ఇరాన్ ట్రంప్ ప్రకటనపై సెటైర్లు కూడా వేసింది. ఏయే యుద్ధాల్లో వాడారంటే..సీ మైన్స్ (Sea Mines) అనేవి సముద్రంలో ఉంచే పేలుడు పరికరాలు. ఇవి నౌకలు లేదంటే జలాంతర్గాములు (submarines) దగ్గరికి వచ్చినప్పుడు పేలిపోతాయి. చరిత్రలో అనేక యుద్ధాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు. 14వ శతాబ్దంలో చైనా సామ్రాజ్యంలో జపాన్ దొంగలపై వీటిని ఉపయోగించినట్లు చరిత్రలో ప్రస్తావన ఉంది. అమెరికన్ రెవల్యూషన్-సివిల్‌వార్ టైంలో అమెరికా తొలిసారిగా వాడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో.. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు కొరియా, వియత్నాం యుద్ధాల్లోనూ వీటిని వాడారు. రష్యా నౌకల కదలికలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్.. తాజాగా హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరులో ఇరాన్ వీటిని ఉపయోగించాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు అంతరాయం కలుగుతూ వస్తోంది. హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం తమదేనని ఇరాన్.. అలా కుదరదు స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని అమెరికా వాదిస్తూ వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల(అణు ఒప్పందం ప్రధానంగా) కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో.. హర్ముజ్ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. కానీ, అమెరికా డిమాండ్లను ఇరాన్ తోసిపుచ్చడం, చర్చలకు(రెండో దఫా) ముందుకు రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. -
హార్ముజ్ లో భారత్ నౌక సీజ్.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్
-
నౌకలపై ఇరాన్ దాడి
వాషింగ్టన్/టెహ్రాన్/ఇస్లామాబాద్/దుబాయ్: పాక్ ప్రాయోజిత శాంతి చర్చల ప్రక్రియకు తూట్లు పొడుస్తూ ఇరాన్ హార్మూజ్ జలసంధిని మరోమారు కాల్పులమోతకు వేదికగా మార్చేసింది. శాంతి చర్చలకు ఫలవంతమైన ప్రతిపాదనలతో ఇరాన్ వచ్చేవరకు కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే విదేశీ నౌకలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ బలగాలు దాడులపర్వానికి తెరలేపాయి. ఇటీవల కొన్ని గంటలపాటు హార్మూజ్‌ను పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనతో పర్షియన్ గల్ఫ్ నుంచి ఆశగా బయల్దేరిన నౌకలు గురువారం హార్మూజ్ జలసంధిని దాటే క్రమంలో వాటిపైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు తుపాకులు ఎక్కుపెట్టాయి. దీంతో మూడు నౌకలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మూడింటిలో రెండింటిని ఇరాన్ స్వా«దీనంచేసుకుని తమ తీరానికి తీసుకెళ్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు బయల్దేరని కారణంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం సైతం పాకిస్తాన్‌కు బయల్దేరలేదు. దీంతో రెండో దఫా చర్చలు సాధ్యపడలేదు. అయితే చర్చలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయేగానీ రద్దుకాలేదని అమెరికా వ్యాఖ్యానించింది. శుక్రవారంలోపు రెండోదఫా చర్చలు జరిగే వీలుందని ట్రంప్ చెప్పినట్లు ‘ది న్యూయార్క్ పోస్ట్’తన కథనంలో పేర్కొంది. మరోవైపు బుధవారంతో ముగిసిపోతున్న కాల్పుల విరమణ గడువును ట్రంప్ హఠాత్తుగా పొడిగించడంపై మధ్యవర్తిత్వ దేశం పాకిస్తాన్ హర్షం వ్యక్తంచేసింది. సత్ఫల ప్రతిపాదనలతో ముందుకొచ్చేలా ఇరుపక్షాలను ఒప్పించేందుకు తమకు గడువు, సువర్ణావకాశం దక్కాయని పాకిస్తాన్ వెల్లడించింది. ‘‘మా దాడుల ధాటికి ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పొడచూపాయి. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నా. ఇరాన్ నుంచి ఆమోదయోగ్య ప్రతిపాదనలు వచ్చేదాకా కాల్పుల విరమణ గడువు పొడిగిస్తున్నా. గడువు పొడిగించినా హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ నౌకాశ్రయాల గుండా నౌకల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది’’అని ట్రంప్ అన్నారు. రెండో దఫా చర్చలు జరిగి శాశ్వత శాంతి ఒప్పందం అమల్లోకి వస్తే హార్మూజ్ తెరచుకుని ముడిచమురు సంక్షోభం సమసిపోయి క్రూడ్ ఆయిల్, పెట్రో ధరలు దిగొచ్చేవి. ఇవేవీ సాకారంకాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగి పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు మరింత ప్రియమైన పెనుప్రమాదం అలాగే పొంచి ఉంది. ముంద్రా పోర్ట్‌కు వస్తుంటే మెరుపుదాడిఒమన్కు ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్లదూరంలో హార్మూజ్ జలాల్లో ఉన్న లైబీరియా జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘ఎపామినోండాస్’పైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు హఠాత్తుగా కాల్పులు జరిపి నౌక ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. వాస్తవానికి ఈ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు రావాల్సి ఉందని నౌకల స్థితిగతులపై నిఘా పెట్టే ‘మెరైన్ ట్రాఫిక్’సంస్థ వెల్లడించింది. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కేంద్రంగా పనిచేసే పనామా జెండాతో వెళ్తున్న ‘యుఫోరియా’నౌక మీద ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నౌకలోని నావికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాన్ తీరానికి కేవలం 8 నాటికల్ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు యుఫోరియాపై కాల్పులు జరిపారని వ్యాన్‌గార్డ్, యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) వెల్లడించింది. ఇరాన్ తీరానికి కేవలం ఆరు నాటికల్ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు పనామా జెండాతో ఉన్న ‘ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా’నౌక మీదా బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో నౌక కిందిభాగం స్వల్పంగా దెబ్బతింది. ఎపామినోండాస్, ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌకలను స్వా«దీనంచేసుకుని ఇరాన్తీరాలకు బలగాలు తీసుకెళ్తున్నాయి. ఎలాంటి సరైన ధృవీకరణ పత్రాలు, అనుమతులు లేకుండా, రహస్యంగా ఇవి హార్మూజ్‌ను దాటుతున్నాయని ఇరాన్ నేవీ ఆరోపించింది. ట్రాకింగ్‌ను సైతం ఏమార్చి పారిపోతున్నాయని పేర్కొంది. ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌక శ్రీలంకలోని హంబన్»ొటా నౌకాశ్రయానికి, యుఫోరియా నౌక జెడ్డాకు వెళ్లాల్సి ఉందని వాటి ట్రాకింగ్డేటా ప్రకారం తెలుస్తోంది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28వ తేదీ తర్వాత ఇప్పటిదాకా 30కిపైగా నౌకలపై దాడులు జరిగాయి.గడువు పెంపుపై పెదవి విరిచిన ఇరాన్ గడువు పెంపును అమెరికా వేసిన మరో ఎత్తుగడగా ఇరాన్ అభివర్ణించింది. ‘‘సదభిప్రాయంతోనే సీరియస్‌గా తొలి దఫా చర్చలకు కూర్చున్నాం. కానీ అమెరికా అవిశ్వాసం చూపింది. అసంబద్ధ, అతి డిమాండ్ల చిట్టా విప్పింది. ఈ వారాంతంలోపు అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనాలా వద్దా అనే దానిపై మేం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ చెప్పారు.క్షిపణుల ప్రదర్శన మరోవైపు తమపై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ జంకుతున్నాయంటూ ఇరాన్ పాలకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వసూచనల మేరకు ఇరాన్ సాయుధబలగాలు బుధవారం టెహ్రాన్ వీధుల్లో భారీ క్షిపణులు, మిస్సైల్ లాంఛర్లను ఊరేగింపుగా ప్రదర్శించారు. తమ వద్ద ఇంకా భారీసంఖ్యలో క్షిపణులు ఉన్నాయని పేర్కొన్నారు. క్షిపణులను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. జెండాలను చేతబూని ఇరాన్ పాలకులకు అనుకూలంగా నినాదాలుచేశారు.సముద్ర ఇంటర్నెట్ కేబుళ్లు కత్తిరిస్తాం: ఇరాన్గల్ఫ్ దేశాలకు ఇంటర్నెట్ సేవలు అందించే అత్యంత కీలక సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను తప్పదనుకుంటే కత్తిరించేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ఒక హెచ్చరిక జారీచేసింది. ఈ వార్తను ఇరాన్ వార్తాసంస్థ టాస్నిమ్ ప్రచురించింది. ‘‘ఈసారి హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే పలు ప్రధాన కేబుళ్లు ఏకకాలంలో ‘ప్రమాదవశాత్తు’ పాడైపోవచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా మారొచ్చు. దీంతో పర్షియన్ గల్ఫ్ దేశాల్లో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయే ప్రమాదముంది. గల్ఫ్ అరబ్ దేశాల ఇంటర్నెట్ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది’’ అని టాస్నిమ్ తన కథనంలో పేర్కొంది. హార్మూజ్ గుండా పలుదేశాల ఇంటర్నెట్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఎర్రసముద్ర జలాల్లో ఇప్పటికే ఇవి పలుమార్లు కత్తిరింపులకు గురయ్యాయి. తమ పరిధిలోనూ వాటిని కత్తిరిస్తామని ఇరాన్ దన్నుతో పనిచేస్తున్న యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు పలుమార్లు హెచ్చరించారు.ఎలాంటి చెల్లింపులు జరపలేదునగదు, క్రిప్టో కరెన్సీ లావాదేవీల వార్తలను ఖండించిన భారత్ న్యూఢిల్లీ: ఇండియా దిశగా వస్తున్న నౌకలు సురక్షితంగా హార్మూజ్ జలసంధిని దాటేలా ఇరాన్‌కు భారత్ నగదు లేదా క్రిప్టోకరెన్సీ చెల్లింపులు జరిపిందన్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని మోదీ సర్కార్ స్పష్టంచేసింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధం తర్వాత ఏ దేశానికి చెందిన నౌకనూ రాకపోకలు సాగించేందుకు ఇరాన్ అనుమతించట్లేదు. అయితే తమ నౌక ఇప్పటికే తమ వద్ద అనుమతి పొందిందని, అనుమతి పొందిన జాబితాలో రెండో నంబర్ తమ నౌకదేనని ‘సన్మార్ హెరాల్డ్’నౌకలోని సిబ్బంది చెబుతున్నట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ బయటకురావడంతో భారత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మోదీ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముఖేశ్ మాంగళ్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘హార్మూజ్‌ను దాటేందుకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ అధికారులకు సన్మార్ హెరాల్డ్ నౌక కెప్టెన్ డాలర్ల రూపంలో నగదు చెల్లింపులు జరిపాడని వస్తున్న వార్తలో నిజంలేదు. ఈ విషయాన్ని మేం నౌక యజమానితో మాట్లాడి రూఢీచేసుకున్నాం. ఈ ఉదంతంతో భారత్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు’’అని ముఖేశ్ స్పష్టంచేశారు. ఏప్రిల్ 18వ తేదీన రెండు భారత్‌కు వచ్చే నౌకలపై ఆర్‌ఆర్‌జీసీ నేవీ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పులు ఆపేస్తే వెనక్కి వెళ్లిపోతామని సన్మార్ హెరాల్డ్ నౌకలోని సిబ్బంది చెప్పినట్లుగా ఆనాడు మీడియాలో వార్తలొచ్చాయి. -
శుక్రవారం నాటికి ‘శుభవార్త’.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని.. రాబోయే 36 నుంచి 72 గంటల్లో శాంతి చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు 'న్యూయార్క్ పోస్ట్’ పేర్కొంది. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ అభ్యర్థన మేరకు.. ఇరాన్‌తో కాల్పుల విరమణను ట్రంప్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏడు వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ నాయకత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 8న ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ కీలక ప్రకటన వెలువడింది. దీంతో పాకిస్తాన్‌కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధి బృందం పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో కూడిన బృందం మంగళవారం ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే, హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు ఇరాన్ ఒక సమగ్ర ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, చర్చల కోసం ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనను తెచ్చే వరకు మాత్రమే అమెరికా దాడులకు దూరంగా ఉంటుందని.. కానీ ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.అమెరికా చర్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. ఓడరేవులను దిగ్బంధించడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇది ఒక ‘యుద్ధ చర్య’గా ఆయన అభివర్ణించారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం అన్యాయమని, తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో ఇరాన్‌కు తెలుసని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఆసియాలో ఇరాన్ ముడి చమురును అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్న 'M/T టిఫానీ' అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్‌పై దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టుతో అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు 30 శాతం పెరిగి, బ్యారెల్ ధర 95 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగిన మొదటి విడత చర్చలు విఫలం కావడంతో, ఇప్పుడు రెండో విడత చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
ఇరాన్లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్ చేసేశారా?
టెహ్రాన్: ఇరాన్ అంతర్గత అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై ఓ వైపు సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. ఆయన్ని కాదని ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చాపకింద నీరులా ప్రభుత్వంపై పట్టు బిగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ అంతర్గత పోరాటం కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్’ అన్న చందంగా ఇరాన్ వ్యవహారం మారింది. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో హాట్‌టాపిక్‌గా మారి, అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అమెరికా సైతం చర్చలు విఫలమవడానికి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ ఇరాన్లో ఏం జరుగుతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.ఆరు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన గొంతు వినలేదు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కీలక నేతలను కోల్పోవడం వల్ల భయాందోళనలో ఉన్నారని సమాచారం.అమెరికా మీడియా నివేదికల ప్రకారం, మొజ్తాబా ప్రత్యక్ష నిర్ణయాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పెరిగాయి. అణు కార్యక్రమంపై చర్చల్లో ఇరాన్ ప్రతినిధులకు ఎంత అధికారం ఇవ్వాలో స్పష్టత లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 440 కిలోల నిల్వ ఉంది. ఇది 90 శాతం ఆయుధ స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, ఎనిమిది నుంచి పన్నెండు అణు బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్‌కి చెందిన అలీ వాయేజ్ ప్రకారం, మొజ్తాబా స్వయంగా చర్చలు జరిపే స్థితిలో లేరు. ఆయన కేవలం విస్తృత నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారని, చర్చల వ్యూహాల్లో ఆయన పాత్ర లేదని చెప్పారు. ఆయన గైర్హాజరీని ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపిస్తోందని, ఇది అంతర్గత విమర్శల నుంచి రక్షణగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం ఇరాన్ పాలనకు సవాలుగా మారింది. ఆయన పేరుతో టీవీల్లో వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలతో సందేశాలు పంపడం ఆయన ఆరోగ్యంపై, ఆయన ఎక్కడున్నారనే అనుమానాలను మరింత పెంచుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. మరోవైపు, రాయిటర్స్ ప్రకారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధం, అమెరికాతో చర్చల వంటి ప్రధాన అంశాలపై నిర్ణయాల్లో పాల్గొంటున్నారని సమాచారం.ఇరాన్ ప్రభుత్వంలో కుమ్ములాటఇరాన్లో ప్రస్తుతం పెద్ద రాజకీయ కుమ్ములాట జరుగుతోంది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రభుత్వంపై పట్టు బిగించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ నియామకాలను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించడాన్ని నిరోధించడం ద్వారా అధ్యక్షుడిని పూర్తిగా పక్కకు పెట్టిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఐఆర్జీసీ మరింత ఆధిపత్యం సాధించింది. ఆయన చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులకు ఆయనను కలిసే అవకాశం లేకుండా చేసింది. దీంతో పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలస్యమవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఐఆర్జీసీ ఆధిపత్యం పెరగడం వల్లే శాంతి చర్చలు నిలిచిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు -
పశ్చిమాసియా యుద్ధంపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
బెర్లిన్: శాంతి చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని.. పశ్చిమాసియా యుద్ధంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపాలని ఇప్పటికే ఇరుదేశాలను ప్రధాని మోదీ కోరారని గుర్తు చేశారు. బెర్లిన్(జర్మనీ)లోని భారత రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడంలో న్యూఢిల్లీ తన వంతు పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.పశ్చిమాసియా సంక్షోభంలో భారతదేశానికి ఏదైనా పాత్ర ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ రేపు ఒక సమయం రావచ్చు.. అప్పుడు భారత్ ఈ విషయంలో తన పాత్రను పోషించి విజయం సాధించడం కూడా సాధ్యమేనని తేల్చిచెప్పారు. ‘‘యుద్ధాన్ని ముగించాలని ప్రధాని మోదీ రెండు వైపులా విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన విషయాల్లో మా ప్రధానికి చాలా సమతుల్యమైన దృక్పథం ఉంది’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.కాగా, ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమంపై తలెత్తిన విభేదాల కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన ఇరాన్-అమెరికా రెండో రౌండ్ శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించారు. ఇరుపక్షాలను తిరిగి చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన అభ్యర్థన మేరకు, ఇరాన్ నాయకులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్లో రాసుకొచ్చారు.అయితే, ఈ కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ త్రోసిపుచ్చింది. ఇది అకస్మాత్తుగా దాడి చేయడానికి సమయాన్ని పొందేందుకు పన్నుతున్న కుట్రగా ఇరాన్ అభివర్ణించింది. ఓడిపోయే పక్షం షరతులు విధించలేదు. దిగ్బంధం కొనసాగితే దానికి సైనికపరమైన సమాధానం తప్పదంటూ ఇరాన్ ప్రతినిధి మహదీ మొహమ్మదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
హర్ముజ్‌లో మళ్లీ టెన్షన్: భారత నౌకను దిగ్బంధించి..
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అలాగే భారత్‌కు చెందిన నౌకను సైతం దిగ్బంధించినట్లు సమాచారం అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ఇరాన్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్‌లో వెళ్తున్న కంటైనర్ షిప్‌లపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్ని బ్రిటన్ ఆర్మీ ధృవీకరించింది. మొత్తం మూడు నౌకలపై దాడులు జరిగాయని.. గ్రీక్, పనామా, లైబీరియా రిజిస్ట్రేషన్ నౌకలుగా వాటిని గుర్తించారు. తొలుత.. ఈ ఉదయం గ్రీక్ ఆపరేటెడ్ కంటైనర్ షిప్‌పై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో నౌక పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. సిబ్బంది క్షేమంగానే ఉన్నారని సమాచారం. ఆ వెంటనే పనామా, లైబీరియా షిప్‌లపై దాడి జరిగింది. దాడులను ధృవీకరించిన ఇరాన్ మీడియా.. హర్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేసింది.భారత నౌకపై కూడా.. భారత్‌కు చెందిన నౌకలకు స్వేచ్ఛా రవాణా ఉంటుందని ఇరాన్ పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాటి పరిణామాలు మరోలా ఉన్నాయి. గుజరాత్ వైపు వస్తున్న ఓ నౌకను ఇరాన్ అడ్డగించింది. దిగ్బంధించిన ఆ నౌక పరిస్థితి.. సిబ్బంది క్షేమసమాచారాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొన్నీమధ్య కూడా హర్ముజ్‌లో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. ఏప్రిల్ 18న ఐఆర్జీసీ రెండు భారత-పతాక నౌకలపై కాల్పులు జరిపింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు, కానీ నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత నౌకల భద్రత విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ కోరింది.ప్రపంచ వర్తక వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి కీలకమన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రూట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే.. కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్‌లో తమ బ్లాకేడ్(దిగ్బంధం) కొనసాగుతుందని అమెరికా అంటోంది. ఈ క్రమంలో టౌసా అనే వాణిజ్య నౌకను సీజ్ చేసింది. ఇది యుద్ధ చర్యేనంటున్న ఇరాన్.. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రతరంగా మార్చే అవకాశం లేకపోలేదు. -
"ఇరాన్ ఆయుధాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే"
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఆయుధ సంపత్తిపై మాట్లాడారు. టెహ్రాన్ వద్ద ప్రస్తుతం ఎటువంటి ఆయుధ సంపత్తి లేదని ఆ దేశ నావికాదళం, వైమానిక దళం దాదాపుగా తుడిచిపెట్టుకపోయిందన్నారు. అయితే తాజా సర్వే కథనాలు మాత్రం అందుకు విభిన్నంగా ఉన్నాయి. ఇరాన్ వద్ద ఇప్పటికీ వేలాదిగా క్షిపణులు, డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.ఇరాన్‌పై అమెరికాతో పాటు ఇజ్రాయెల్ ఏక కాలంలో విరుచుకపడ్డాయి. ఆ దేశంలోని రక్షణ,మౌళిక స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలోనే వైమానిక దళం తుడిచిపెట్టుకుపోయిందని, వారి నౌకాదళం సముద్ర గర్భానికి చేరుకుందని ట్రంప్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఇరాన్‌కు తమతో యుద్దం చేసే సీన్ లేదని బిల్డప్ ఇచ్చారు. అయితే ఇరాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులు చేసినప్పటికీ వారి వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, కామికేజ్ డ్రోన్లు నిఘా నివేదికలు చెబుతున్నాయి.అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ ఆడమ్స్ ప్రకారం.. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా సురక్షితంగా ఉన్నాయి. తీరప్రాంత రక్షణ క్షిపణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గత వారం CNN జరిపిన దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వాహనాల్లో దాదాపు సగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, అలాగే వేలాది డ్రోన్లు ఆయుధాగారంలోనే దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఆ దర్యాప్తులో తేలింది.అయితే ప్రస్తుతం సీజ్ఫైర్ నడుస్తున్నప్పటికీ.. యుద్ధం విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా డిమాండ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని ఇరాన్ తెగేసి చెబుతుంది. మరోవైపు ట్రంప్ సైతం తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆయుధ సంపత్తిపై నివేదికలు చూస్తుంటే మరోసారి యుద్దం తలెత్తితే తీవ్రపరిణామాలు తలెత్తి అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా.. మొదటికే ముప్పు?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా, ఇరాన్ వద్ద ఉన్న యురేనియం కోసం అధ్యక్షుడు ట్రంప్ ఎదురుచూస్తున్నారు. అయితే, సుసంపన్నం చేసిన యురేనియంను అప్పగించడానికి అమెరికా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ పదార్థాన్ని దేశం నుండి బయటకు తీసుకురావడం అనేది చర్చల కంటే చాలా కష్టతరం కావచ్చు అంటూ పలు నివేదికలు చెబుతున్నారు. అమెరికాకు ఇది అంత సులభం కాదని హెచ్చరిస్తున్నాయి. దీంతో, ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టిందా? అనే అనుమానాలు చర్చకు వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. మాజీ అధికారులు, అణు నిపుణులు ఈ ఆపరేషన్ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన యురేనియం తొలగింపు ఆపరేషన్‌గా ముగిసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే.. ఇరాన్ యురేనియంలో అధిక భాగం ఇస్ఫహాన్ మరియు నతాంజ్ వంటి కేంద్రాలలో నిల్వ చేయబడిందని భావిస్తున్నారు. ఈ రెండూ ఇటీవలి నెలల్లో అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు గురయ్యాయి. దీంతో, అక్కడికి చేరుకోవడం కష్టమైంది. సొరంగాల ప్రవేశ మార్గాలను కూడా పూడ్చివేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయ తనిఖీ అధికారులు కొన్ని నెలలుగా ఈ ప్రదేశాలను సందర్శించలేదు.ఇదే సమయంలో మరో ప్రశ్న కూడా ఉంది. యురేనియం గురించిన దానిలో ఎక్కువ భాగం భారీ సిలిండర్లలో వాయు రూపంలో నిల్వ చేయబడింది. ఆ కంటైనర్లు చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో బృందాలు మొదట తనిఖీ చేయాలని నిపుణులు అంటున్నారు. అవి దెబ్బతిన్నట్లయితే, ప్రమాదాలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఆ పదార్థాన్ని సురక్షితంగా అంచనా వేయడానికి మరియు వెలికితీయడానికి రిమోట్-ఆపరేటెడ్ పరికరాలు మరియు రోబోట్లతో సహా ప్రత్యేక పరికరాలు అవసరం కావచ్చు. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. అలాంటి పరిస్థితులలో కార్యకలాపాలకు వారాలు పడుతుంది. దెబ్బతిన్న, దాడి అనంతర వాతావరణంలో, కాలపరిమితులు అనిశ్చితంగా మారతాయి. దాన్ని బయటకు తరలించడం సులభం కాదు. ఇక, అణ్వాయుధ పదార్థాల రవాణా ఒక సున్నితమైన పని. సంఘర్షణలతో కూడిన ప్రాంతం నుండి దీన్ని చేయడం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.ÚLTIMA HORA: Un periodista iraní afirma que se registraron nuevas explosiones en una instalación subterránea de almacenamiento de misiles en Isfahán (Irán), previamente atacada por EE.UU. antes del alto el fuego, con ondas expansivas sentidas en la zona.pic.twitter.com/RqZxZGZJL6— Isaac (@isaacrrr7) April 20, 20261990లలో కజకిస్తాన్ నుండి ఆయుధ సామగ్రిగా ఉపయోగపడే యురేనియంను తొలగించడంతో సహా, గతంలో అమెరికా చేపట్టిన మిషన్లు నియంత్రిత వాతావరణంలో జరిగాయి. అయితే, ఇరాన్ విషయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. భద్రత, విమాన రవాణా ఏర్పాట్లు వంటివి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.యురేనియం ఎక్కడికి పంపాలి?అయితే, శుద్ది చేసిన యురేనియాన్ని యునైటెడ్ స్టేట్స్కు పంపడాన్ని ఇరాన్ వ్యతిరేకించింది. చర్చలో ఉన్న ప్రత్యామ్నాయాలలో రష్యా లేదా కజకిస్తాన్‌లో సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ ఆ పదార్థాన్ని పలుచగా చేసి అంతర్జాతీయ పర్యవేక్షణలో నిల్వ చేయవచ్చు. ఒకవేళ ఇరాన్ బదిలీకి అంగీకరించినప్పటికీ, ధృవీకరణ చాలా కీలకం. కొంత పదార్థం దాచడం లేదా ధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారు. యురేనియం తరలించబడిందా లేక ఉన్నచోట ఉందా అని నిర్ధారించడానికి పర్యావరణ తనిఖీలతో సహా, ఏ ఒప్పందానికైనా లోతైన తనిఖీలు అవసరం కావచ్చు.ఇరాన్ వద్ద 440 కిలోల యురేనియం..అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) గణాంకాల ప్రకారం.. 2025 జూన్‌లో అమెరికా దాడులకు ముందు ఇరాన్ వద్ద 60 శాతం సుసంపన్నమైన యురేనియం సుమారు 440 కిలోల వరకు ఉంది. అణుబాంబు తయారీకి అవసరమైన 90 శాతానికి ఇది చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ నిల్వల భవితవ్యంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే దాడులకు గురైన ప్రాంతాల్లో తనిఖీలకు ఐఏఈఏ ఇన్స్పెక్టర్లను ఇరాన్ అనుమతించడం లేదు.యురేనియం శుద్ధి ఇలా.. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది. 2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్‌కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అదే విషయంలో ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారు.అయితే, కజకిస్తాన్ (1994), లిబియా (2003) యురేనియం/అణు పదార్థాల తొలగింపు ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. కానీ ఇరాన్ పరిస్థితి వాటితో పోలిస్తే చాలా క్లిష్టమైనది. యురేనియం తరలింపునకు కజకిస్తాన్, లిబియా ప్రభుత్వాలు సహకరించాయి. ఇరాన్ మాత్రం ప్రతిఘటనతో, భూగర్భ సదుపాయాల్లో పదార్థాన్ని దాచిపెట్టింది.కజకిస్తాన్ – Project Sapphire (1994)స్థితి: సోవియట్ యుగం తర్వాత 600 కిలోల weapons-grade HEU (Highly Enriched Uranium) ఉల్బా మెటలర్జికల్ ప్లాంట్‌లో నిల్వ.ఆపరేషన్: అమెరికా–కజకిస్తాన్ రహస్య సహకారంతో 31 నిపుణుల బృందం 6 వారాల పాటు పని చేసి, 1032 కంటైనర్లలో ఉన్న యురేనియాన్ని 448 సురక్షిత కంటైనర్లలో ప్యాక్ చేసింది.తరలింపు: 3 C-5 విమానాల ద్వారా Oak Ridge (USA)కి తరలించి, IAEA పర్యవేక్షణలో low-enriched uranium గా మార్చారు.ప్రధాన అంశం: కజకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది, అందువల్ల ఆపరేషన్ సురక్షితంగా, రహస్యంగా పూర్తయింది.లిబియా – Disarmament (2003–2004)స్థితి: గడాఫీ పాలనలో అణు, రసాయన, జీవ రసాయన ఆయుధాల ప్రోగ్రామ్‌లు కొనసాగాయి.తీర్మానం: 2003 డిసెంబర్ 19న గడాఫీ స్వచ్ఛందంగా WMD ప్రోగ్రామ్‌లను నిలిపివేస్తానని ప్రకటించాడు.ఆపరేషన్: అమెరికా, యుకే, IAEA పరిశీలకులు కలిసి యురేనియం సదుపాయాలు, సెంట్రిఫ్యూజ్‌లు, రసాయన ఆయుధాలను తొలగించారు.ప్రధాన అంశం: లిబియా అంతర్జాతీయ ఒత్తిడి, ఆంక్షలు, ఇరాక్ యుద్ధం తర్వాత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి స్వచ్ఛందంగా సహకరించింది. -
ట్రంప్ ప్లాన్ బీ.. ఉక్కిరి బిక్కిరి నడుమే ఇరాన్ కౌంటర్
పశ్చిమాసియా యుద్ధంలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కాల పరిమితిని లేకుండా యుద్ధ విరమణను పొడిగించారు. అయితే ఇరాన్ దీని వెనక పెద్ద కుట్రే దాగి ఉందని అంటోంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంతో ఇరాన్ ఆర్థికంగా బాగా దెబ్బ తిందని ట్రంప్ అంటున్నారు. ‘‘ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నౌకాదళ నిర్బంధం కారణంగానే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. సైన్యానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతోంది. సైన్యంతో పాటు పోలీసులకు జీతాలు అందడం లేదు. నగదు కోసం ఇరాన్ ఆకలితో ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేయబడటం వల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. దానిని తిరిగి తెరవాలని తహతహలాడుతోంది’’ అని ట్రూత్ సోషల్ ఆయన వ్యాఖ్యానించారు.అయితే ఇరాన్ తొలి నుంచి హర్ముజ్ మూసివేతకే మొగ్గుచూపుతూ వస్తోంది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ దానిని తెరవాలని కోరుకుంటోందని అంటున్నారు. ‘‘ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్లు సంపాదించేది. ఇప్పుడు అదే మొత్తాన్ని కోల్పోతోంది. కాబట్టి తెరవాలనే చూస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. చర్చల్లో పాల్గొంటున్న మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ఇప్పటికే సంకేతాలు పంపిందని.. కానీ, తగిన రాజకీయ రాయితీలు లేకుండా జలసంధి తెరిస్తే చర్చల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారాయన. ట్రంప్ వాదనలో నిజం లేదా?ఇరాన్ సైన్యం పూర్తిగా ధ్వంసమైందని అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. అలాగే.. యుద్ధంతో సైన్య వ్యవస్థ ఘోరంగా దెబ్బ తిందని ట్రంప్ అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. అమెరికా పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది. ప్లాన్ బీ ఇదే.. ప్రాంతీయ మిత్రపక్షాల సహకారంతో ఇరాన్ యుద్ధంలో బలంగానే కనిపిస్తున్నా.. ఆర్థికంగా మాత్రం బలహీనంగానే ఉందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చర్చల కోసం ఇరాన్ మెడలు వంచాలని అమెరికా అడుగులేస్తోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఇరాక్‌కు డాలర్ల సరఫరాను నిలిపివేసింది. ఈ చర్య ద్వారా ఇరాన్ మద్దతు పొందిన మిలీషియాలను బలహీనపరచడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇరాన్ సముద్ర వాణిజ్యాన్ని అడ్డుకోవడం.. వారి ప్రధాన ఆదాయ వనరులను కత్తిరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. చమురు ఎగుమతులే ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరు. అయితే ప్రస్తుతం అక్కడి పోర్టులపై అమెరికా నిర్బంధం కొనసాగుతోంది. దీనివల్ల చమురు బయటకు వెళ్లడం లేదు. ఈ ప్రభావంతో ఖార్గ్ దీవి (ఇరాన్ చమురు ఎగుమతుల 90% నిర్వహించే కేంద్రం) నిల్వలు నిండిపోయి ఉన్నాయి. కొత్తగా చమురు తీయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో చమురు బావులను తాత్కాలికంగా మూసేసే పరిస్థితికి దారి తీసింది. ఇది.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అంటున్నారు. ఇరాన్ కౌంటర్సీజ్ ఫైర్ పొడిగింపు.. అమెరికా ఏకపక్ష నిర్ణయంగానే కనిపిస్తోంది. పాకిస్తాన్ నాయకత్వం అభ్యర్థన మేరకు దాడుల్ని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై ఇరాన్ కౌంటర్ వేసింది. ‘‘ సీజ్ ఫైర్ వంకతో ఈ గ్యాప్‌లో అమెరికా మళ్లీ దాడులు చేయాలని చూస్తోంది. అయినా ఓడిపోయేవాళ్లు నిబంధనలు పెట్టడం ఏంటి?’’ అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ చర్చల ప్రతినిధి మహ్మద్ బాగేర్ ఖలీబాఫ్ ఓ ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ పొడిగింపు కేవలం వ్యూహాత్మక ప్రయోజనం కోసమే. నౌకాదళ నిర్బంధం కొనసాగుతూనే ఉంది. పోర్టులకు వచ్చే నౌకలను ఆపడం కాల్పుల ఉల్లంఘన కాదా?. ఇది యుద్ధ చర్య కాకుండా మరేమిటి?. ఇలాంటి బెదిరింపుల మధ్య మేం చర్చలు జరపం అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. ఇరాన్ చర్చలకు దూరంగా ఉండటం.. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్ పర్యటనను రద్దు చేసుకోవడం.. ఈ రెండు పరిణామాలు కలిపి శాంతి చర్చలపై తీవ్ర అనిశ్చితిని సృష్టించాయి. -
కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన.. గల్ఫ్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
-
గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌తో శాంతి చర్చలు కోసం తపిస్తున్నారు. యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ ఎలాగైనా దానిని ముగించే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సీజ్ఫైర్ని మరోసారి పొడిగిస్తూ ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఏకీకృత ఒప్పందం వచ్చే వరకూ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్స్ మరోసారి గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై దాడి చేయడానికి అమెరికాకు సహకరిస్తే చమురు ఉత్పత్తి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాలు సీజ్ఫైర్ ఒప్పందాన్ని పాటిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం గల్ఫ్ దేశాల పాలిట శాపంగా మారింది. అమెరికా ఎయిర్‌బేస్‌లకు సహకరిస్తున్నారని నెపంతో ఇరాన్ గల్ఫ్ దేశాల టార్గెట్‌గా దాడులు జరిపింది. అయితే ప్రస్తుతం సీజ్ఫైర్ నడుస్తున్న నేపథ్యంలో అమెరికా గల్ఫ్ దేశాల్లోని తన స్థావరాలను మరింత బలోపేతం చేస్తుందేమోనని ఇరాన్ అనుమానిస్తోంది. దీంతో ఆ దేశాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో "ఇరాన్ దేశంపై దాడి చేయడానికి శత్రువుల పక్కన చేరి దేశ భూభాగాన్ని, సౌకర్యాలని వారు ఉపయోగించుకునేలా సహకరిస్తే దక్షిణ పొరుగు దేశాలు చమురు ఉత్పత్తికి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుందని తెలుసుకోవాలి " అని గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజీద్ మౌసావి పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి.అయితే ఇది వరకూ యుద్ధంలో ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ స్థావరాలే లక్షంగా దాడి చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ (UAE), కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లలోని చమురు నిల్వ ఉంచిన డిపోలు, రిఫైనరీలు, మరియు గ్యాస్ ఫెసిలిటీలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్నింగ్ ఇచ్చింది. -
కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని తెలిపారు.ఇరాన్ తమతో ఏకీకృత ఒప్పందానికి వచ్చే వరకు, శాంతి చర్చలు ముగిసేవరకు కాల్పుల విమరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతో కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు, చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం యాథావిధిగా ఉంటుంది. ఇప్పటికే దీనిపై అప్రమత్తంగా ఉండాలని మా సైన్యాన్ని ఆదేశించాను’ అని తెలిపారు. అయితే ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన రెండో విడత శాంతి చర్చలకు వచ్చేందుకు ఇరాన్ విముఖత చూపడంతో ట్రంప్ మంగళవారం సీఎన్‌బీసీ ‘స్వాక్బాక్స్’ కార్యక్రమంలో ఇరాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘ఇరాన్ మాతో ఒప్పందానికి రావడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం.కాల్పుల విరమణ గడువు పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారంతో ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ గడువు ముగియనుంది. అయితే ఇంతలో ట్రంప్ కాల్పుల విరమణపై యూటర్న్ తీసుకోవడంతో కొంతమేర ఉపశమనం లభించినట్లయింది.ఫలించిన పాక్ ప్రయత్నం..హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన దౌత్యప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఒక మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్‌కు హితబోధ చేస్తోంది. కనీసం కాల్పుల విరమణ గడువును అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పాక్ అభ్యర్థనపై ఒక అడుగు ముందుకేసి కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. -
చర్చలపై తొలగని ఉత్కంఠ
వాషింగ్టన్/ఇస్లామాబాద్/టెహ్రాన్: హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో రెండో దఫా శాంతి చర్చలపై సందిగ్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అన్ని ఏర్పాట్లూ చేశాక అతిథులు రాబోరన్న వార్త తెల్సి కంగుతున్న అతిథ్య పాకిస్తాన్ మరోమారు తమ దౌత్యమంత్రాంగాన్ని ముమ్మరంచేసింది. ఓ మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్‌కు హితబోధ చేస్తోంది. గత 24 గంటలుగా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా కొత్తగా హిందూమహాసముద్రంలో ఇరాన్ నౌకను అమెరికా తమ అదీనంలోకి తెచ్చుకోవడంతో ఇరాన్ పాలకుల్లో కోపం మరింత ఎక్కువైంది.కనీసం గడువు తేదీని అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రాయబారం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ‘‘ఇరాన్ మాతో సంప్రతింపులు జరపాలి. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ గొప్పదేశంగా అవతరించవచ్చు. అద్భుత దేశంగా ఎదగవచ్చు. మంచి ఒప్పందంతోనే అమెరికా ప్రతినిధి బృందం సంతోషంగా ఇస్లామాబాద్ నుంచి వెనుతిరుగుతుందని ఆశిస్తున్నా.రెండోదఫా చర్చలకు ఇరాన్ ముందుకు రాక తప్పదు. ఆ దేశానికి మరో మార్గమే లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ గడువును పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు అనేది నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు’’అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం సీఎన్‌బీసీ ‘స్వా్కక్ బాక్స్’కార్యక్రమంలో స్పష్టంచేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగుస్తుండటంతో బుధవారం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత ఎక్కువైంది మేమింకా వేచిచూస్తున్నాంఇరాన్ స్పందన కోసం పాక్ వేచిచూస్తోంది. ‘‘ప్రతినిధి బృందం పంపుతుందోలేదో అనే సందేశం కోసం మేం ఆశగా ఎదురుచూస్తున్నాం. కాల్పుల విరమణ గడువు ముగిసేలోపే రెండోదశ చర్చలు మొదలుకావడం అత్యంత కీలకం’’అని పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లాహ్ తరార్ మంగళవారం సాయంత్రం మీడియాతో చెప్పారు. అమెరికా వైఖరితోనే మేం రావట్లేదు చర్చలపై ఇరాన్ మంగళవారం స్పందించింది. ‘‘అమెరికా అధ్యక్షుడి చంచల మనస్తత్వం, అసంబద్ధ ప్రకటనలు, సంబంధంలేని వ్యాఖ్యానాలు, బెదిరింపులు, అమెరికా ప్రతినిధి బృందం చేసిన అతి డిమాండ్లతో మేం విసిగిపోయాం. ఫలవంతమైన చర్చలు జరుగుతాయనే నమ్మకం ఉంటేనే రెండోదశ చర్చలకు వస్తాం’’అని ఇరాన్ విదేశాంగ శాఖ పతినిధి ఇస్మాయిల్ బఘేల్ తెలిపారు.మరో నౌక స్వాదీనం: అమెరికా ఇండోనేసియా, శ్రీలంక మధ్యలో హిందూ మహాసముద్రజలాల్లో ఇరాన్‌కు చెందిన ‘ఎం/టీ టిఫానీ’నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. హెచ్చరికల తర్వాత తమ బలగాలు నౌకపైకి దిగాయని అమెరికా ప్రకటించింది. ఈ నౌకను అమెరికాకు తరలించాలా లేదంటే మిత్రదేశంలోకి తరలించాలా అనేది మరో నాలుగు రోజుల్లో తేలుస్తామని అమెరికా తెలిపింది. దిగ్భంధనాన్ని ఛేదించిన జీ సమ్మర్ఇరాన్కు చెందిన ముడిచమురు రవాణా నౌక ‘జీ సమ్మర్’విజయవంతంగా అమెరికా దిగ్బంధనాన్ని చేధించుకుని అరేబియా సముద్రం దిశగా పయనిస్తోందని వార్తలొచ్చాయి. ఏ ఒక్క నౌక కూడా తమ దిగ్బంధనం నుంచి తప్పించుకోబోదని గొప్పలుపోయిన అమెరికాకు ఈ వార్త తలనొప్పిగా మారింది. హార్మూజ్‌ను దాటేసి, ఏప్రిల్ 19వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్నూ దాటేసిందని నౌకల ట్రాకింగ్ డేటా పేర్కొంది.ఆ 8 మందిని విడిచిపెట్టండిఇరాన్కు ట్రంప్ పిలుపు వాషింగ్టన్: ఇరాన్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది మహిళలను వదిలేయాలని ఆదేశ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇస్లామాబాద్‌లో అమె రికా–ఇరాన్‌ల చర్చలు ప్రారంభమవుతాయని భావిస్తున్న వేళ ఆయనీ విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఆరుగురు మహిళలు, ఇద్దరు యువతులకు సంబంధించిన ఫొటోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో విడుదల చేశారు. ‘మన మధ్య జరగబోయే చర్చలకు ఇది శుభారంభం అవుతుంది’అనే వ్యాఖ్యను జోడించారు. -
అమెరికా–ఇరాన్ డీల్‌పై ఆశలతో...
ముంబై: అమెరికా–ఇరాన్‌ల మధ్య శాంతి చర్చల పురోగతిపై ఆశలతో పాటు క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్ల కిందకి దిగిరావడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ ఒక శాతం లాభపడింది. సెన్సెక్స్ 753 పాయింట్లు పెరిగి 79,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 212 పాయింట్లు బలపడి 24,577 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.క్యాపిటల్ గూడ్స్ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్ ఆద్యంతం స్థిరమైన లాభాలతో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 847 పాయింట్లు పెరిగి 79,367 వద్ద, నిఫ్టీ 237 పాయింట్లు ఎగసి 24,602 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. సూచీలు ఒక శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.469 లక్షల కోట్లకు చేరింది. ⇒ ఆసియాలో దక్షిణ కొరియా (2.65%), తైవాన్ (1.72%), జపాన్(1%), హాంగ్‌కాంగ్(0.48%), సింగపూర్ (0.22%), చైనా (0.07%) లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్ (–0.40%), బ్రిటన్ (–0.50%) మార్కెట్లు నష్టపోగా, అయితే జర్మన్ (0.10%) పెరిగింది. అమెరికా స్టాక్ సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో ఎఫ్ఎంసీజీ (2.23%), రియల్టీ (2.17%), ప్రైవేటు బ్యాంకులు (1.71%), ఫైనాన్షియల్ సర్వీసెస్ (1.32%), టెలికమ్యూనికేషన్ (1.14%), పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ (1%) పెరిగాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు వరుసగా 0.79%, 0.29 శాతం లాభపడ్డాయి. ⇒ మార్చి త్రైమాసిక నికర లాభం 19% వృద్ధితో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 8% పెరిగి రూ.979 వద్ద స్థిరపడింది. 28 పైసలు క్షీణించిన రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 28 పైసలు బలహీనపడి 93.44 వద్ద ముగిసింది. పశ్చి మాసియా శాంతి చర్చలపై అనిశ్చితి, క్రూడ్ ధరల్లో ఒడిదుడుకులు వంటివి రూపాయిపై ఒత్తిడి పెంచాయి. నాన్–డెలివరబుల్ ఫార్వర్డ్(ఎన్డీఎఫ్) మార్కెట్లలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌పై ఆర్బీఐ నియంత్రణలను సడలింపు నిర్ణయమూ దేశీయ కరెన్సీపై ప్రభావం చూపిందని నిపుణులు తెలిపారు. -
ఇద్దరిలో ఓ మెట్టు దిగాల్సింది ఎవరు?
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉన్నా.. ఇరాన్ ముందుకు రాకపోవడంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. యుద్ధం గనుక మళ్లీ మొదలైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా కూడా తగ్గబోమని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఇరాన్ కూడా అంటోంది. అయితే..చర్చల విషయంలో సానుకూలంగానే ఉన్నా ఇరాన్ బెట్టు చేయడం సరికాదని అమెరికా అంటోంది. కొత్త ఒప్పందం అమలు అయితే అన్నీ సర్దుకుంటాయని.. ఆ ఒప్పందం ఓ కొలిక్కి రావాలంటే ఇరాన్ చర్చలకు దిగి రావాల్సిందేనని.. అప్పుడే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో ఇరాన్ చర్చలకు వచ్చినా తుది ఒప్పందం కుదురుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఆ ‘ఒక్క’ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేకపోవడమే ఇందుకు కారణంగా చూపిస్తున్నారు. శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది.2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్‌కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అయితే..అదే విషయమై.. అదే ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారాయన. యుద్ధం కన్నా ఒప్పందం మంచిదని పదేపదే పాట పాడుతున్నారు. ఇరాన్‌కు మరో దారి లేదని హెచ్చస్తూనే.. అవసరమైన సడలింపులు కూడా ఇచ్చేందుకు రెడీ అంటూ బుజ్జగిస్తున్నారు. అవసరమైతే.. డీల్ కుదుర్చుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అంటున్నారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య యురేనియం శుద్ధి (uranium enrichment) కాలపరిమితి విషయంలోనే కనిపిస్తోంది.ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని సుదీర్ఘ కాలం(20 ఏళ్లపాటు) నిలిపివేయడానికి అంగీకరించిందని, ఇది కొత్త ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. అయితే, అమెరికా ఏ రకమైన సడలింపులు ఇవ్వగలదో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ మాత్రం చాలా తక్కువ కాలం (5–7 సంవత్సరాలు) మాత్రమే అంగీకరించేందుకు సిద్ధంగా ఉంది. తమకు ఇచ్చే సడలింపులపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది. అలాగే ఆర్థిక ఆంక్షలను తక్షణమే తొలగించాలని షరతు పెడుతోంది. ఇక్కడే చర్చలు ముందుకు సాగడం లేదు.అమెరికా ఏం కోరుకుంటోందియురేనియం శుద్ధి, అణు ఆయుధాల అభివృద్ధి పూర్తిగా ఆపడం.బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై నియంత్రణ.లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గించడం.దేశీయ నిరసనలపై కఠిన చర్యలు తగ్గించడం.ఇరాన్ ఏం ఆశిస్తోందంటే..ఆంక్షలు ముందుగా ఎత్తివేయాలి. అమెరికా ఆర్థిక ఆంక్షలు తగ్గించకపోతే, అణు కార్యక్రమంపై పెద్ద సడలింపులు ఇవ్వలేమని ఇరాన్ అంటోంది.అణు శుద్ధి అవసరం కూడా. అణు శక్తి ఉత్పత్తి కోసం అవసరమని వాదిస్తోంది.తక్కువకాల పరిమితి మాత్రమే: అమెరికా కోరుతున్న 20 సంవత్సరాలపాటు అణు కార్యక్రమం నిలిపివేయడం సాధ్యం కాదని, గరిష్టంగా 5–7 సంవత్సరాలు మాత్రమే అంగీకరించగలమని చెబుతోంది.ప్రాంతీయ ప్రభావం తగ్గించలేం. లెబనాన్, సిరియా, యెమెన్‌లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం తమ భద్రతా వ్యూహంలో భాగమని ఇరాన్ అంటోంది.దేశీయ విధానాల్లో జోక్యం వద్దు. నిరసనలపై చర్యలు తమ అంతర్గత వ్యవహారమని, అమెరికా లేదంటే ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం అంగీకరించలేమని చెబుతోంది.సమాన ఒప్పందం కావాలి: అమెరికా మాత్రమే లాభపడే ఒప్పందం కాకుండా, ఇరాన్‌కు కూడా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలిగేలా ఉండాలని కోరుతోంది.సాధ్యమైన సడలింపులు ఆర్థిక ఆంక్షల సడలింపు: చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తగ్గించడం లేదా ఎత్తివేయడం.వాణిజ్య అవకాశాలు: అంతర్జాతీయ మార్కెట్లలో ఇరాన్‌కు తిరిగి ప్రవేశం కల్పించడం.మానవతా మినహాయింపులు: ఔషధాలు, ఆహారం వంటి అవసరమైన వస్తువులపై ఆంక్షలు తగ్గించడం.సైనిక ఒత్తిడి తగ్గింపు: ఇరాన్ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గిస్తే.. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించడం.ఒప్పందం కుదిరితేప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చు: మధ్యప్రాచ్యంలో యుద్ధం అవకాశాలు తగ్గి, స్థిరత్వం పెరుగుతుంది.ఆర్థిక లాభం: ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు సడలితే, చమురు ఎగుమతులు పెరుగుతాయి.చమురు మార్కెట్‌పై ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.రాజకీయ సంబంధాలు మెరుగుపడవచ్చు. అమెరికా–ఇరాన్ సంబంధాలు సానుకూల దిశలో కదిలి, ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.ఒప్పందం కుదరకుంటేఉద్రిక్తతలు పెరుగుతాయి: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఘర్షణలు.. సైనిక చర్యలు పెరిగే అవకాశంఆంక్షలు కొనసాగుతాయి: ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.చమురు ధరలు పెరిగే అవకాశం: సరఫరా తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి.ప్రాంతీయ అస్థిరత: లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు పెరిగి.. ఘర్షణలు మరింత తీవ్రమవుతాయి.చర్చలు విఫలమైతే.. అమెరికా–ఇరాన్ సంబంధాలు మరింత దూరమవుతాయి. రెండువారాల యుద్ధ విరమణ బుధవారంతో(భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి దాటాక) ముగియనుంది. అంటే.. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. చర్చల్లో ఏదో ఒక పురోగతి కనిపిస్తేనే.. అది పొడిగింపు ఉండొచ్చు. అంటే.. ఈ చర్చలు మిడిల్ ఈస్ట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. -
పాకిస్థాన్‌కు ట్రంప్..? యుద్ధం ముగిసేనా..!
ఇరాన్ అమెరికా మధ్య చర్చల విషయంలో ప్రస్తుతం తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. ఇరాన్ చర్చలకు ససేమిరా అనడంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో జరిగే రెండో విడత చర్చలకు ట్రంప్ స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఎటువంటి ఒప్పందం లేకుండానే భేటీ ముగిసింది. అయితే మరో దఫా చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తుండగా ఇరాన్ మాత్రం అంగీకరించట్లేదు. యుఎస్ఏ పెట్టే డిమాండ్లకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి జరిగే శాంతి చర్చలకు ట్రంప్ నేరుగా లేదా వర్చువల్‌గా పాల్గొనాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్‌తో రాయబారం కోసం ప్రయత్నిస్తున్నట్లు కీలక సమాచారం అందుతుంది. ఇరాన్ సైతం తొలుత చర్చలు జరపమని పట్టుబట్టినప్పటికీ ప్రస్తుతం సానూకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ నేరుగా హాజరైతే చర్చల అంశం ఆశాజనకంగా ముగిసే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చలు విఫలానికి కారణంట్రంప్.. ప్రధానంగా ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకూడదని, హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని కోరుతున్నారు. అయితే దీనికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు అమెరికా యుద్ధ పరిహారం చెల్లించాలని, ఇరాన్ మీద ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ డబ్బులు చెల్లించాలని కోరుతుంది. ఈ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది.సెక్యూరిటీ నీడలో ఇస్లామాబాద్చర్చల జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం ప్రస్తుతం సెక్యూరిటీ నీడలో ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల కోసం పాకిస్థాన్ సుమారు 20,000 మంది భద్రతా సిబ్బందిని ఇస్లామాబాద్‌లో మోహరించింది. తొలిదశ చర్చల సమయంలో సైతం ఇరాన్ అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. -
ఇరాన్‌కు సీక్రెట్ సాయం.. చైనా దొరికిపోయిందా?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రికత్తల వేళ పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యుద్ధంలో ఇరాన్‌కు చైనా సాయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన భారతీయ మూలాల నాయకురాలు నిక్కీ హేలీ దీనికి సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేశారు. దీంతో, చైనా అడ్డంగా బుక్కైనట్టు నీక్కి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చైనాను అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉంది. పశ్చిమాసియా ఘర్షణల్లో చైనా ఇరాన్‌కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చైనా టెహ్రాన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మనిషి భుజం మీద పెట్టుకొని క్షిపణులను ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లను, ఇతర క్షిపణి వ్యవస్థలను టెహ్రాన్‌కు సరఫరా చేయడానికి బీజింగ్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపాయి. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు చైనా ఈ ఆయుధాలను ఇతర దేశాల మీదుగా పంపుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు పట్టుబడిన ఇరాన్ నౌక టౌస్కా అనే కంటైనర్ చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణకు ఆజ్యం పోసింది.దొరికిపోయినట్టేనా? కాగా, ఇటీవలే అమెరికా నౌకాదళం హార్మూజ్ సముద్ర మార్గంలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న Touska అనే కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. ఈ నౌక ఇరాన్ షిప్పింగ్ లైన్స్ (IRISL)కు చెందినది. IRISLపై అమెరికా 2019లోనే ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇది ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి అవసరమైన వస్తువులను తరలిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిక్కీ హేలీ.. ఈ నౌక చైనా నుండి ఇరాన్‌కు వస్తూ, క్షిపణుల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను తీసుకెళ్తోందని ఆరోపించారు. నౌకలను ఆపాలని అమెరికా పదేపదే ఆదేశాలు ఇచ్చినా ఇరాన్ మాత్రం దీన్ని ఆపలేదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, యుద్ధంలో ఇరాన్‌కు చైనా సహాయం చేస్తోంది అనే వెల్లడి అయ్యింది. ఇది విస్మరించలేని వాస్తవం’ అని ఆమె పేర్కొన్నారు.The ship the U.S. seized in the Strait of Hormuz this weekend was headed from China to Iran and is linked to chemical shipments for missiles. It refused repeated orders to stop. Another reminder that China is helping prop up Iran’s regime—a reality that can’t be ignored.— Nikki Haley (@NikkiHaley) April 20, 2026మరోవైపు.. నిక్కీ హేలీ ఆరోపణలపై ఇరాన్ గట్టిగానే సమాధానం ఇచ్చింది. నౌక విషయంలో అమెరికా చర్యను సాయుధ దోపిడీగా అభివర్ణించింది. ఆ నౌక చైనా నుంచి ప్రయాణిస్తోందని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ సమయంలో అమెరికా బలగాలను తాము ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నప్పటికీ నౌకలో సిబ్బంది కుటుంబ సభ్యులు ఉన్నందున తక్షణ ప్రతిస్పందన ఇవ్వలేకపోయామని తెలిపింది.ఇదిలా ఉండగా, ఆసియా నుంచి ప్రయాణం తర్వాత ఆ నౌక ద్వంద్వ ప్రయోజన వస్తువులను తీసుకువచ్చే అవకాశం ఉందని తమ ప్రాథమిక అంచనాలని అమెరికా భద్రతా వర్గాలు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాయి. ఆ నౌక గతంలో కూడా ద్వంద్వ ప్రయోజన వస్తువులుగా భావించే వాటిని రవాణా చేసిందని ఆ వర్గాల్లో ఒకరు తెలిపారు. అయితే, ఆ వస్తువుల వివరాలను మాత్రం ఆయా వర్గాలు వెల్లడించలేదు. అయితే, సైనిక, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉన్న లోహాలు, పైపులు, ఎలక్ట్రానిక్ విడిభాగాలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) పేర్కొంది. 🚨 HOLY CRAP! The Iranian-flagged ship Touska, which the US military seized yesterday, was in-bound from China “loaded with dual-use chemicals used to manufacture ballistic missiles,” per WPUS Marines are now searching 5,000 containers on board.No wonder they tried to run the… pic.twitter.com/Vjl5Z1ynLR— Nick Sortor (@nicksortor) April 21, 2026 చైనాకు కష్టమే.. మొత్తంగా Touska నౌక స్వాధీనం అమెరికా–ఇరాన్–చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇది హార్మూజ్ సముద్ర మార్గం ఎంత సున్నితమైన జియోపాలిటికల్ ప్రాంతమో మరోసారి చూపించింది. దీంతో, చైనా–అమెరికా సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలు కఠినతరం కావడం, చైనా–ఇరాన్ వాణిజ్యం అంతర్జాతీయ పరిశీలనకు గురవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా చైనాపై మరిన్ని ఆంక్షలు లేదా వాణిజ్య పరిమితులు విధించే అవకాశం ఉంది. ఇది చైనా–అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ వార్‌ను మరింత కఠినతరం చేస్తుంది. -
Magazine Story: యుద్ద కాండ
-
ట్రంప్ కొత్త రాగం.. మా కండీషన్ అదే..
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా అఖండ విజయం సాధించింది. ఇరాన్‌పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టెహ్రాన్ తీవ్రంగా నష్టపోయిందని, బలహీనపడిందని అన్నారు. ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘యుద్ధంలో ఇరాన్‌పై మేము విజయం సాధించాం. ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అమెరికా దాడుల కారణంగా ఇరాన్ చాలా బలహీనపడింది. ఇరాన్ నౌకాదళం పూర్తిగా దెబ్బతింది. వైమానిక దళం కార్యకలాపాలు తగ్గాయి. రక్షణ వ్యవస్థలు కూడా బలహీనంగా మారాయి. అలాగే, ఆర్థిక పరంగా కూడా ఇరాన్ రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టం చవిచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని వెల్లడించారు.ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవాలి. ఇదే ప్రధాన షరతు అంటూ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే తాను కూడా ఇరాన్ నాయకులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే, చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడులు తీవ్రంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే, ఈ పరిస్థితిని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపుతున్నాయని కూడా ఆయన విమర్శించారు. కొన్ని ఫేక్ న్యూస్ మీడియా సంస్థలు దీనిని తప్పుగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థలను ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, ఇస్లామాబాద్ చర్చలు కీలక మలుపు తిప్పే అవకాశముంది. ఒకవైపు ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ చర్చల ఫలితం ఆధారంగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది. -
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా... అమెరికా నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
-
హార్మూజ్‌ను దాటిన 10 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా భారతీయ జెండాతో ఉన్న 10 సరకు రవాణా నౌకలు హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్«దీర్ జైశ్వాల్ వెల్లడించారు. ‘‘భారతీయ నౌక ‘దేశ్ గరిమా’విజయవంతంగా హార్మూజ్‌ను ఆదివారం దాటేసింది. దీంతో జలసంధిని దాటిన మన నౌకల సంఖ్య పదికి పెరిగింది. ముడి చమురుతో బయల్దేరిన ఈ నౌక త్వరలోనే ముంబై నౌకాశ్రయానికి చేరుకోనుంది. పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా పలు నౌకలు భారత్ దిశగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని జైశ్వాల్ చెప్పారు. -
ఇరాన్ విదేశాంగ మంత్రికి పాక్ ఉప ప్రధాని ఫోన్!
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాఖ్ దర్ సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. చర్చల కొనసాగింపుకు సంబంధించి కీలక విషయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి కూడా అయిన దర్ టెలిఫోన్లో అరాఘ్చీతో మాట్లాడినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం ఎక్స్ పోస్టులో తెలిపింది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతను పెంపొందించేందుకు అన్ని పెండింగ్ సమస్యలను త్వరితంగా పరిష్కరించుకోవాలని, ఇందుకోసం చర్చలు ఎంతో అవసరమని దర్ పేర్కొన్నట్లు పాక్ తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మంగళవారం ఈ చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకు ప్రకటించారు. ఇక ఇరాన్ రెండో విడత చర్చలకు నిరాకరించిన సమయంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇరాన్‌తో మలి విడత చర్చల కోసం పాక్‌కు వెళ్లలేదన్న సమాచారం చర్చనీయాంశమైంది. -
చల్లారని పశ్చిమాసియా!
పశ్చిమాసియా మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన రెండు వారాల అరకొర కాల్పుల విరమణకు ఆదినుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అది కాస్తా మంగళవారం అర్ధరాత్రి ముగియబోతుండగా, ఇరుపక్షాల మధ్యా పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత చర్చలకు అమెరికా దుందుడుకు చర్యవల్ల గండిపడింది. అరేబియా సముద్రం వైపునుంచి హార్మూజ్ జలసంధిలో ప్రవేశించబోతున్న ఇరాన్ రవాణా నౌకపై సోమవారం వేకువజామున దాడిచేసి, ధ్వంసం చేసి చర్చల విషయంలో తనకు చిత్తశుద్ధి లేదని ఆ దేశం మరోసారి నిరూపించుకుంది. కనుక రెండో విడత చర్చలకు పోదల్చుకోలేదని ఇరాన్ ప్రకటించటంలో వింతేమీ లేదు. శత్రుత్వంతో రగిలిపోయే వైరిపక్షాలమధ్య ఏకాభిప్రాయ సాధన అంత సులభం కాదు. ఇరుపక్షాలూ నిజాయితీగా వ్యవహరిస్తే ఏదోమేరకు అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. కానీ ఒప్పందం కుదిరిన మరుక్షణంనుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్‌ను రెచ్చగొట్టారు. మరోపక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్‌కు ప్రతినిధి బృందాన్ని పంపారు. విట్కాఫ్, తన అల్లుడు జేడీ కుష్నెర్లాంటి రియలెస్టేట్ ఏజెంట్లున్న ఈ ప్రతినిధి బృందానికి కాల్పుల విరమణ గురించి ఏం అవగాహన ఉంటుంది? అసలు హార్మూజ్ జలసంధిని ఇకపై తామే పర్యవేక్షిస్తామనీ, రాకపోకలకు ఎవరినీ అనుమతించబోమనీ గతవారం ట్రంప్ ప్రకటించినప్పుడే ఆ ఒప్పందం కాస్తా అర్థరహితంగా మారింది. ఇరాన్‌ను చుట్టుముట్టి దిగ్బంధిస్తే, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే పాదాక్రాంత మవుతుందని ఇప్పటికీ ట్రంప్ కలలుగంటున్నారు. నష్టపోకతప్పని స్థితి ఏర్పడితే అది తనతో ఆగకుండా ప్రపంచం మొత్తానికి అంటుకునేలా ఇరాన్ ప్రత్యామ్నాయాన్ని సిద్ధపరిచే ఉంచింది. తాజా పరిణామాలతో సోమవారం ముడి చమురు ధర ఒక్కసారిగా 7 శాతం పెరిగి బ్యారెల్ చమురు 89 డాలర్లకు చేరుకోవటం జరగబోయేదేమిటో సూచిస్తోంది. గత నెల్లాళ్ల చమురు ధరలు గమనిస్తే ఇప్పటికీ ఆ ధరలు దాదాపు 10.4 శాతంమేర తక్కువగానే ఉన్నాయి. కానీ నిరుటితో పోల్చిచూస్తే 41.01 శాతం అధికం! అసలు గతవారం ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ సంయమనం పాటించకపోతే ఈపాటికే ఆ ప్రాంతం ఘర్షణలతో అట్టుడికేది. ఎక్కడో వేలమైళ్ల దూరంనుంచి వచ్చి, నావికా దళాలను మోహరించి దిగ్బంధిస్తామని హెచ్చరిస్తే ఏ దేశమైనా సహించగలదా? సమర్థవంతంగా వ్యవహరించగలిగితేనే మధ్యవర్తి పాత్ర పోషించాలని పాకిస్తాన్‌కు ఈ పరిణామాల తర్వాతైనా అర్థమైవుండాలి. మధ్యవర్తిత్వమంటే పోస్టుమాన్ పని కాదు. భిన్న వాదనల్ని వినిపిస్తున్న ఇరుపక్షాలూ వాస్తవ పరిస్థితులేమిటో గ్రహించేలా చేసి, తన తర్కంతో ఒప్పందానికి ఒప్పించే నేర్పుండాలి. వెనకుండి ప్రోత్సహించిన చైనా ఏం చెప్పిందోగానీ... తనకు హఠాత్తుగా దక్కిన ఈ నడమంత్రపు కీర్తితో పాకిస్తాన్ అన్నీ మరిచినట్టు కనిపిస్తోంది. తమ వద్ద యురేనియం ఉండాలో లేదో నిర్ణయించటానికి అమెరికా ఎవరన్న ఇరాన్ తాజా ప్రశ్నకు ట్రంప్ ఏం జవాబివ్వగలరు? అమెరికా దగ్గర దండిగా అణ్వాయుధా లున్నాయి. దశాబ్దాల క్రితమే తన మిత్రదేశం ఇజ్రాయెల్‌కు సైతం వాటిని చేరేసింది. అది అమెరికా అవలక్షణాలను పుణికిపుచ్చుకుని పశ్చిమాసియా దేశాలను బెదిరిస్తూ, అకారణంగా దాడులకు పాల్పడుతూ ఈ ప్రాంత శాంతికి విఘాతం కలిగిస్తోంది.ఇలాంటి స్థితిలో తన ఆత్మరక్షణకు ఇరాన్ సైతం అదే బాట పడితే ఆశ్చర్యమేముంది? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, కాల్పుల విరమణ పేరిట మాయచేసి ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్నదే ట్రంప్ ఆంతర్యంగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధ విరమణ ప్రకటించినా అమెరికాలో ఇప్పటికే 3.3 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం కనీసం మరో ఏడాది వరకూ దిగిరాదు. 38 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) పరిధిలో ద్రవ్యోల్బణం 4 శాతం దాటొచ్చన్న అంచనాలున్నాయి. కనుక ఇప్పటికైనా అమెరికా తన వైఖరి మార్చుకోవాలి. ఓటమిని అంగీకరించి గౌరవప్రదంగా తప్పుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని గ్రహించాలి. -
అందుకే.. గోల్డ్ రేటు తగ్గింది!
గత కొంత కాలంగా.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు (ఏప్రిల్ 20) కొంత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. దీనికి కారణం ఏమిటి?, ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలపడటం. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే.. ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేసే వారు మరింత వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతాయి.భారతదేశంలో ఇలా..భారతదేశంలో కీలకమైన పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో జువెలరీ డిమాండ్ తగ్గింది. అయితే పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోలు కొంత పెరిగింది. ఇతర లోహాల విషయానికి వస్తే, వెండి ధర 1.7% తగ్గింది. ప్లాటినం, పల్లాడియం కూడా స్వల్పంగా తగ్గాయి.ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు..మరోవైపు.. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు సరిగ్గా ముందుకు సాగకపోవడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు ధరలు పెరిగాయి. చమురు సరఫరా అంతరాయం కలగవచ్చనే భయం పెట్టుబడిదారుల్లో కనిపించింది. దీని వల్ల స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనయ్యాయి.అమెరికా ఒక ఇరానియన్ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకోవడం, దానికి ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించడం వంటి పరిణామాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఇప్పటికే అమలులో ఉన్న తాత్కాలిక ఒప్పందం కూడా ఎక్కువకాలం నిలవకపోవచ్చనే అనుమానాలు పెరిగాయి. అంతే కాకుండా.. ఇరాన్ తదుపరి చర్చల్లో పాల్గొనబోమని ప్రకటించడం కూడా అనిశ్చితిని పెంచింది.ద్రవ్యోల్బణ భయం!అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారి క్రిస్టోఫర్ వాలర్ మాట్లాడుతూ.. ఈ యుద్ధ పరిస్థితులు తాత్కాలికంగా ద్రవ్యోల్బణం పెంచవచ్చని చెప్పారు. అయితే పరిస్థితి త్వరగా సద్దుమణిగితే భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని సూచించారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...
-
అప్పుడు మాత్రమే హర్మూజ్‌ను దాటండి: భారత్
హర్మూజ్ జలసంధిని దాటే క్రమంలో రెండు వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో భారత్ అప్రమత్తమైంది. మొన్నటి వరకూ హర్మూజ్‌ను జలసంధిని దాటే క్రమంలో భారత్‌కు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, రెండు రోజుల క్రితం భారత్ నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాస్త ఆందోళన కల్గించింది. ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాతే ఆ నౌకలు హర్మూజ్‌ను దాటుతున్నప్పటికీ ఒక్కసారిగా దాడి జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడమ హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ఇరాన్ మరింత పటిష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హర్మూజ్‌ను తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసిన ఇరాన్.. అందుకు అమెరికా వైఖరే కారణమని ధ్వజమెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో విసుగెత్తిపోయిన ఇరాన్.. ఇక చేసేది లేక హర్మూజ్‌ను దిగ్బంధనాన్ని కొనసాగించడమే కాకుండా దానిని మరింత పటిష్టంగా చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏ నౌకలకు ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదు. ఆ క్రమంలోనే భారత నౌకలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అప్పటివరకూ హర్మూజ్‌ను దాటకండిఈ పరిస్థితుల నడుమ భారత్ కొన్ని నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. తమ ఆదేశాలు వచ్చే వరకూ హర్మూజ్‌ను భారత నౌకలు దాటే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే లారక్ దీవి దగ్గరికి వెళ్లకుండా ఉండాలని తమ ఆదేశాల్లో పేర్కొంది, భారత నౌకాదళం సూచించినప్పుడు మాత్రమే హోర్ముజ్ జలసంధి దాటాలని పేర్కొంది. ఏప్రిల్ 18వ తేదీన ఐఆర్జీసీ(ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ )రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఘటన తర్వాత హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది భారత నౌకాదళం.ఇప్పటివరకు పదకొండు భారత నౌకలు జలసంధిని విజయవంతంగా దాటాయి. చివరి ట్యాంకర్ దేశ్ గరీమా ఏప్రిల్ 18న దాటింది. అదే రోజు జగ్ అర్ణవ్, సన్మార్ హెరాల్డ్ నౌకలు.. ఇరాన్ కాల్పుల కారణంగా వెనక్కి తిరగాల్సి వచ్చింది. పర్షియన్ గల్ఫ్‌లో తమ దేశ నౌకల భద్రతకు సంబంధించి లారక్ దీవి వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బారత నౌకాదళం. దీనిలో భాగంగానే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లారాక్ ద్వీపంఇరాన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన మార్గం. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి నియంత్రణలో భాగంగా ఇరాన్ ఈ ద్వీపాన్ని సైనికంగా ఉపయోగిస్తుంది. -
అమెరికా నౌకలపై ఇరాన్ దాడి!
-
పాక్‌కు ఇరాన్ సరికొత్త మెలిక
పశ్చిమాసియా సంక్షోభంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ వాణిజ్య నౌకను అమెరికా దళాలు సీజ్ చేయడం.. అటుపై కౌంటర్ దాడులతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శాంతి చర్చలకు తమ ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదని ఇరాన్ ప్రకటించడంతో.. పరిస్థితి మొదటికి వచ్చింది. అయితే చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఇరాన్ కొత్త షరతులతో మధ్యవర్తి పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ కుదర్చడం ద్వారా ట్రంప్‌నకు మరింత దగ్గర కావాలని.. తమ దేశం చివర ‘శాంతిదూత’ అనే ట్యాగ్ తగిలించుకోవాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. అయితే తొలి దఫా చర్చల కోసం పేలవమైన నిర్వహణ.. డీల్ కుదర్చడంలో విఫలం కావడంతో అంతర్జాతీయ సమాజంలో పాక్ నవ్వులపాలైంది. దీంతో రెండో దఫా చర్చలను ఎలాగైనా సక్సెస్ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే.. ఇరాన్ మాత్రం పాక్‌ను మిత్రదేశంగా కాకుండా.. మధ్యవర్తిగానే చూస్తూ చర్చల విషయంలో మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇరాన్‌ను ఇబ్బంది పెట్టే ఏ ప్రయత్నాన్ని తాము అంగీకరించబోమని అంటోంది. అమెరికా డిమాండ్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియంను అప్పగించే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టింది. ఇదే విషయంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్లో ప్రస్తావించారు. ఈ ఫోన్‌కాల్‌లో ఆయన.. అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. అయితే ఆఖర్లో ఇరాన్ భద్రతా ప్రయోజనాలను కాపాడే షరతులపై మాత్రమే చర్చలకు తాము ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ‘‘మా అణు కార్యక్రమం శాంతి ప్రయోజనాల కోసం. దాన్ని వదులుకోవడం అసాధ్యం’’ అని పాక్ ప్రధానితో ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే.. ఈ విషయంలో అమెరికా ఓ మెట్టు పైనే ఉంటోంది. ఇరాన్ అణు ప్రోగ్రామ్ తగ్గించాలని, శుద్ధి చేసిన యురేనియంను అంతర్జాతీయ పర్యవేక్షణ కోసం తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఇరాన్‌ను ఒప్పించే పూచీ తమదని ట్రంప్‌నకు తొలి నుంచి పాక్ చెబుతూ వస్తోంది. ఈ హామీ ఆధారంగానే ట్రంప్ బాహాటంగా ఇరాన్ అన్నింటికీ అంగీకరిస్తుందంటూ వరుస స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే.. ఇరాన్ మాత్రం ఆ కండిషన్లకు ససేమీరా అంటోంది. వాటిని ‘అసాధ్యమైనవి’గా పేర్కొంటూ అవసరమైతే చర్చలనే బహిష్కరిస్తామని హెచ్చరిస్తోంది. ఈ కఠిన వైఖరి ట్రంప్‌నకు మరింత మంట పుట్టిస్తోంది. అదే టైంలో.. పాక్‌కు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది.ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.. ఇరాన్–అమెరికా మధ్య చర్చలు జరగడం ప్రాంతీయ శాంతికి కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ తన అణు హక్కులను వదులుకోదనే స్పష్టమైన సంకేతం ఇస్తూ.. అమెరికాను ఢీ కొట్టి తీరతామనే వైఖరిని ప్రదర్శిస్తోంది. -
గల్ప్ దేశాలకు గుణపాఠం..
ఇరాన్‌పై అమెరికా-ఉక్రెయిన్ దాడుల కారణంగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే ఇరాన్, అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ఇటు ఇరాన్ ప్రతి దాడులతో గల్ప్ దేశాల పరిస్థితి దారుణంగా మారింది. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలకు అమెరికా ఇచ్చిన ప్రధాన భరోసా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ THAAD (Terminal High Altitude Area Defense) విఫలం కావడంతో గల్ప్ దేశాలకు కునుకు పట్టడం లేదు. భారీగా డబ్బులు వెచ్చించి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసినప్పటికీ ఇలా జరగడంతో పలు దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.ఇజ్రాయెల్-అమెరికాలతో ఇరాన్ తనకున్న పరిమితి వనరులతోనే ధైర్యంగా పోరాటం చేస్తూ వ్యూహాత్మకంగా ఎదురుదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడి, శత్రువుల ఆయుధాలను నాశనం చేసింది. ఇదే సమయంలో గల్ప్ దేశాల్లో ఉన్న రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్షిపణులు చేధించడం చర్చనీయాంశంగా మారింది. గల్ప్ దేశాలకు అమెరికా అందించిన అత్యాధునిక టెక్నాలజీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ థాడ్, Patriot PAC-3 లాంటి వ్యవస్థలను ఇరాన్ మట్టికరిపించింది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2025 మేలో రియాద్ వేదికగా గల్ప్ దేశాలతో 142 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.11.8 లక్షల కోట్)లు విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో THAAD, Patriot అప్గ్రేడ్లు, డ్రోన్లు, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యంగా తయారు చేయబడ్డాయి. కానీ, ఇరాన్ క్షిపణి దాడులకు ఇవి నిలవలేకపోయాయి. అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేయగా, ఇరాన్ ప్రతీకారంగా 400 క్షిపణులు, 1000 డ్రోన్లు గల్ఫ్ దేశాలపై ప్రయోగించింది. దీంతో.. THAAD రాడార్లు (AN/TPY-2) జోర్డాన్, సౌదీ, యూఏఈలో నాశనం అయ్యాయి. Patriot వ్యవస్థలు కొంతమేర అడ్డుకున్నా, భారీ సంఖ్యలో వచ్చిన డ్రోన్లు, క్షిపణులను తట్టుకోలేకపోయాయి. సౌదీ, యూఏఈలోని ఎయిర్‌బేస్‌లు, ఇంధన సదుపాయాలు, పట్టణాలు నేరుగా దెబ్బతిన్నాయి. రక్షణ కోసం గల్ఫ్ దేశాలు ఖర్చు చేసిన వందల బిలియన్ల డాలర్లు ఆశించిన మేరకు రక్షణ ఇవ్వలేకపోయాయి. అమెరికా కవచం “ఇనుప గోడ” అని చెప్పబడినా వ్యవస్థ వాస్తవంలోకి రాగానే తుస్సుమనిపించింది.ఇక, సెంటర్ ఫర్ స్ట్రాటజీక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం.. దక్షిణ కొరియా, గౌమ్ సహా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 8 థాడ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ఒక్కో దాని విలువ 300 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,760 కోట్లు). ‘ఇవి చాలా విలువైన వ్యూహాత్మక వనరులు.. వీటిని కోల్పోవడం ఒక పెద్ద ఎదురు దెబ్బ’ అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో క్షిపణి రక్షణ నిపుణుడు టామ్ కరాకో అన్నారు. థాడ్ బ్యాటరీలో సాధారణంగా 90 మంది సైనికులు, ట్రక్కులపై అమర్చిన ఆరు లాంఛర్లు, మొత్తం 48 ఇంటర్‌సెప్టర్ క్షిపణులు (ప్రతి లాంచర్‌కు 8 వంతున), ఒక TPY-2 రాడార్‌తో పాటు టాక్టికల్ ఫైర్ కంట్రోల్, కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. ఒక్కో ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర 13 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గగనతల, రక్షణ వ్యవస్థ ఏర్పాటుచేయాలంటే ఇదొక్కటే మార్గమని పసిఫిక్ ఫోరమ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణుడు విలియమ్ అల్బెర్క్యూ అన్నారు.🚨⚡️ BLINDED: Iranian strikes destroy the $1.1 Billion US Radar in Qatar! 🇶🇦🇺🇸🇮🇷Al Jazeera reveals the destruction of the AN/FPS-132 system at Al Udeid.Iran successfully neutralized the "Brain" of THAAD and Patriot defenses! pic.twitter.com/m5xi4sdBDb— RussiaNews 🇷🇺 (@mog_russEN) April 10, 2026ఇదిలాఉండగా.. ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి ఎయిర్ బేస్ వద్ద అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు (US THAAD) ఉపయోగించే RTX కార్ప్ AN/TPY-2 రాడార్, సహాయక సామాగ్రి ధ్వంసమైనట్టు శాటిలైట్ ఫోటోలను ఉటంకిస్తూ ముందు సీఎన్ఎన్ నివేదించింది. అనంతరం, ఈ వ్యవస్థ ధ్వంసమైనట్టు అమెరికా అధికారి సైతం ధ్రువీకరించారు.THAAD బ్యాటరీ అంటే ఏమిటి? THAAD అనేది అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. స్వల్ప-శ్రేణి, మధ్యస్థ, దీర్ఘ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. దీనిని 'అమెరికన్ బ్రహ్మాస్త్ర' అని కూడా అంటారు. వాతావరణం లోపల, వెలుపలి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఏకైక వాయు రక్షణ వ్యవస్థ దీనికి కారణం. అందుకే అమెరికా THAAD సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరుస్తుంది.THAAD ఎలా పని చేస్తుంది? THAAD అనేది ఇన్కమింగ్ బాలిస్టిక్ క్షిపణులను వాటి ఫ్లైట్ టెర్మినల్ దశలో (లక్ష్యానికి దగ్గరగా) మాత్రమే అడ్డుకునేలా రూపొందించబడింది.THAAD షార్ట్, ఇంటర్మీడియట్ , ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులకు వ్యతిరేకంగా రక్షిస్తుంది.ఇందులో ఎలాంటి పేలుడు వార్హెడ్లు ఉండకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత. ఇది గతిశక్తి (శక్తి వినియోగం) సహాయంతో లక్ష్యాలను నాశనం చేస్తుంది.THAAD ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది ప్రత్యేకంగా అమెరికన్ సైనికులచే నిర్వహించబడుతుంది.THAAD ప్రధాన భాగాలు? THAADలో 4 ప్రధాన భాగాలు ఉన్నాయి, ఇందులో ఇంటర్సెప్టర్లు, లాంచర్లు, రాడార్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌లు ఉన్నాయి.ఇంటర్‌సెప్టర్ ఇంపాక్ట్ ఫోర్స్‌ని ఉపయోగించి ఇన్కమింగ్ క్షిపణులను నాశనం చేయడంలో సహాయపడుతుంది, అయితే లాంచ్ వెహికల్స్ ఇంటర్‌సెప్టర్‌ను మోసుకెళ్లి లాంచ్ చేస్తాయి.అదేవిధంగా, రాడార్ సాంకేతికతలు 870 నుండి 3,000 కి.మీ పరిధిలో బెదిరింపులను గుర్తించగలవు. అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు ఇంటర్సెప్టర్ల ప్రయోగ, లక్ష్యాన్ని సమన్వయం చేస్తాయి. IMO, this is the best shot of an Iranian missile attack in this war so far. This was at Prince Sultan Airbase in Saudi Arabia.The US lost a THAAD radar & an E-3 Sentry AWACS at this base. Both were executed by $20K drones. pic.twitter.com/UsrpcQWfol— Dr. Syed Mohd Murtaza مرتضیٰ (@syedmohdmurtaza) April 14, 2026చర్చలే కీలకం.. THAAD, Patriot లాంటి వ్యవస్థలు బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా, వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో బలహీనతలు బయటపడ్డాయి. ఈనేపథ్యంలో పొరుగు దేశాలతో శాంతి ఒప్పందాలు, చర్చలు, పరస్పర అవగాహన క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఉపయోగపడనుంది. అలాగే, గల్ఫ్ దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తే భద్రతా వ్యవస్థలు మరింత బలపడతాయి. ఇదే సమయంలో స్వదేశీ సాంకేతికత, స్థానిక రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేస్తే ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్- అమెరికా మధ్య అసలేం జరగనుంది..?
ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. ఓ వైపేమో డొనాల్డ్ ట్రంప్ చర్చలకు రాకుంటే వినాశనం తప్పదని హెచ్చరిస్తుంటే మరోవైపేమో ఇరాన్ హర్మూజ్ బ్లాకేడ్ విరమించేదాకా చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగనుంది. అసలు యుద్ధం ముగింపు దశకు చేరుకుందా.. లేక మరింత ఉదృతమవుతుందా అనే సమాచారం తెలుసుకోవాలని ఉందా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి..!యుద్ధం ఎందుకు మెుదలైందిఅమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. అయితే దానికి మెుదటి కారణం ఇరాన్ తన అణు అణు బాంబును తయారు చేసే స్థాయికి చేరుకోవడమైతే మరోటి ఆ దేశంలోని ప్రజల అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టడం. ఈ రెండు కారణాలపై మెుదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ట్రంప్ చివరికి అనుకున్న పని చేశారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించారు.మెుదటి రోజే ఖమేనీ హత్యదీంతో ఫిబ్రవరి 28 న ఇరాన్‌పై ఆపరేషన్ "ఎపిక్ ప్యూరీ" పేరుతో అమెరికా దాడులు ప్రారంభించింది. యుద్దం ప్రారంభించిన మెుదటిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని అంతం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ సైతం అధికారికంగా ధృవీకరించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యుద్దం తీవ్రంగానే ఉండబోతుందని ఆందోళన చెందింది. అయితే ఇరాన్ సైతం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఏకకాలంలో ధీటుగా ఎదుర్కొంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేయడంతో పాటు టెల్ అవీవ్ పై మిసైల్స్ అటాక్ చేసింది. ఇరాన్ ఏంతకీ వెనక్కి తగ్గలేదు.హర్ముజ్ దిగ్భందనంప్రపంచ చమురు రవాణాకు ఏంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం చమురు ఈ జలసంధి గుండానే రవాణా జరుగుతుంది. అటువంటిది ఈ జలసంధిని ఇరాన్ బ్లాక్చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చమురు, గ్యాస్ సరఫరా లేక చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని దేశాలు ఇంధన కొరతను తట్టుకోలేక లాక్డౌన్ సైతం విధించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది.ట్రంప్ అంచనాలు తలకిందులు.యుద్దం విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా తలకిందులైంది. యుద్ధాన్ని కేవలం వారం రోజుల్లో ముగిస్తానని అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తొలుత నుంచి చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్‌నకు ఆ రెండు విషయాల్లో చుక్కెదురైంది.. వారం రోజుల్లో కాదు కదా యుద్ధం ప్రారంభమై 40 రోజుల దాటినా ఇరాన్ వెనుకంజవేయలేదు.. మరో వైపు అక్కడి ప్రజలు ఇరాన్‌కు అండగా ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడ్డారు.ట్రంప్ చర్చల రాగంఅయితే మెుదటి నుంచి ఇటు ఇరాన్.. అటు అమెరికా ఎక్కడా తగ్గలేదు.. ఇరాన్‌లోని అణుస్థావరాలను విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేశామని అమెరికా వాదిస్తుంటే.. అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చేసేమని తమతో యుద్దంలో అమెరికా ఓడిపోయిందని పరస్పరం వాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో తాను చర్చలకు సిద్ధమని ట్రంప్ ఏప్రిల్ 8న ప్రకటించారు. అయితే చివరి వరకూ చర్చలపై ఏటూ తేల్చని ఇరాన్.. ట్రంప్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో కాస్త తగ్గింది. చర్చలకు రాకుంటే ఇరాన్ నాగరికతనే అంతం చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఎట్టకేలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండు వారాల పాటు సీజ్ఫైర్ ఒప్పందం జరిగింది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలుదీంతో ఇస్లామాబాద్ వేదికగా ఏప్రిల్ 11, 12 తేదీలలో చర్చలు జరిగాయి. అయితే అమెరికా నిబంధనలు నేపథ్యంలో చర్చలు విఫలమయ్యాయి.ఇరాన్ అణుబాంబు తయారిని పూర్తిగా నిలపివేయాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించాలని డిమాండ్ పెట్టింది. దీంతో ఇరాన్ ఈ చర్చలకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.దీంతో అమెరికా హర్ముజ్‌ను బ్లాకేడ్ చేసింది. దీంతో ఇరాన్ సైతం తీవ్రంగా స్పందించింది. తాను కూడా హర్ముజ్‌ను అష్టదిగ్భందనం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరోసారి తన దుందుడుకు స్వభావంతో వ్యాఖ్యానించారు. ఇరాన్ మిలటరీ సర్వనాశనం అయ్యిందని వారికి యుద్దం చేసే సత్తాలేదని ఆరోపించారు.యుద్ధం ముగుస్తుందా?ప్రస్తుతం యుద్దం ముగుస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే అమెరికా ప్రధాన లక్షం ఇరాన్‌కు అణుబాంబు లేకుండా చేయడం అయితే దానికి టెహ్రాన్ ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేలా లేదు. మరోవైపు ఇతర విషయాలలోనే రెండు దేశాలు పరస్పర వైవిధ్యాలు కలిగి ఉన్నాయి. ఇరాన్ స్పీకర్ మహ్మద్ గాలిబాఫ్ సైతం ఇటీవల ఈ వ్యాఖ్యలే చేశారు. అమెరికా ఒత్తిడి చేస్తున్న ఇరాన్ రెండో దఫా చర్చలకు వచ్చేది లేదని తేల్చి చెబుతుంది. ఈ నేపథ్యంలో ఏవరో ఒకరు పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గితే తప్ప దీనికి పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం కనిపించడం లేదు. దీంతో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
సీజ్ ఎఫెక్ట్.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇరాన్ నౌకలపై దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. అమెరికా యుద్ధ నౌకలపైకి ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.కాగా, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న ఓ నౌకను అమెరికా సీజ్ చేసింది. దిగ్భంధనాన్ని దాటినందుకు తౌస్కా అనే వాణిజ్య నౌకపై రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై పోస్టు చేసింది. ఓ నౌక ఇరాన్ పోర్టు వైపు ప్రయాణించబోతే తాము సీజ్ చేసినట్లు పేర్కొంది. దీంతో, ఈ చర్యకు ప్రతిస్పందించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అనంతరం, అమెరికా యుద్ధ నౌకల పైకి డ్రోన్లను ప్రయోగించింది. గల్ఫ్ఆఫ్ ఒమన్ నుంచి అమెరికా నౌకలను ఐఆర్జీసీ తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్ అభివర్ణించింది.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్‌కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అసలు చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది. -
ప్రపంచానికి హెచ్చరిక భారీ షాక్ ఇచ్చిన ఇరాన్
-
రేపు లేదా ఎల్లుండి ఏదైనా జరగొచ్చు: నెతన్యాహు
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సాగుతున్న పోరాటం ఇంకా ముగియలేదన్నారు. యుద్ధంలో ఏ క్షణమైనా కొత్త పరిణామాలు చోటుచేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, యుద్ధం మరింత భయంకరంగా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.బెంజిమిన్ నెతన్యాహు తాజాగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో కలిసి మాట్లాడుతూ..‘ఇరాన్‌పై పోరాటం ఇంకా ముగియలేదు. పోరాటం కొనసాగుతుంది. ఏ క్షణంలోనైనా మరిన్ని పరిణామాలు చోటుచేసుకోవచ్చు. రేపు లేదా ఎల్లుండి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?’ అంటూ పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించి తీరతాయని, ప్రపంచ స్వేచ్ఛా ప్రియులకు ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తుందని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు తాము జరిపిన దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ అలీ రిడా అబ్బాస్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని బింట్ జెబీల్ పట్టణానికి హెజ్బొల్లా కమాండర్‌గా అబ్బాస్ ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్ మానుకోవాలని హూతీలు తాజాగా హెచ్చరించారు. లేకపోతే బాబ్ అల్ మాండెబ్ జలసంధిని తాము మూసేస్తామన్నారు. ఒక్కసారి దానిని మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికీ సాధ్యం కాదని హూతీ ప్రభుత్వ విదేశాంగ శాఖ హుస్సేన్ పేర్కొన్నారు.మరోవైపు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్‌కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.చర్చలు లేవన్న ఇరాన్..అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది. -
రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరణ..
-
‘ప్రతీకారం తీర్చుకుంటాం..’ అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. రెండో దఫా చర్చలపై ప్రతిష్టంబన కొనసాగుతుండగా.. అమెరికా నౌకాదళం ‘‘టౌస్కా’’ అనే ఇరాన్ వాణిజ్య నౌకను అడ్డగించి స్వాధీనం చేసుకుంది. ఈ నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చైనా నుండి ఇరాన్ వైపు ప్రయాణిస్తుండగా పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ చర్యకు గట్టి ప్రతీకారమే ఉంటుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది అమెరికా. తమ సైన్యం హెచ్చరించినా ఆ నౌక ఆగలేదని.. అందుకే స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ మండిపడింది. ఇరాన్ సైనిక కమాండ్ ఖాతమ్ అల్-అన్బియా ఈ చర్యను.. సముద్ర దొంగతనంగా, ఆయుధ దోపిడీగా అభివర్ణించారు. అమెరికా రెండు వారాల కాలం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. అమెరికా దాడికి తగిన ప్రతిస్పందన ఇస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో.. నౌకను అమెరికా మెరైన్లు స్వాధీనం చేసుకున్నారని, ప్రస్తుతం నౌకపై పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. ఈ నౌకపై గతంలో అక్రమ కార్యకలాపాలు జరిపినందుకు అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించిందని ఆయన గుర్తు చేశారు.మొదట ఇరాన్ ఈ ఘటనను ఖండిస్తూ.. తమ నౌకాదళం సమయానికి స్పందించి అమెరికా దాడిని అడ్డుకుందని ప్రకటించింది. అయితే, తరువాత అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోలో నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టమైంది. ఈ సంఘటనతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.చర్చలపైనా ఉత్కంఠఇరాన్–అమెరికా మధ్య ఇస్లామాబాద్(పాకిస్తాన్) వేదికగా తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ అమెరికా ప్రతినిధుల బృందం పాక్‌కు వెళ్తుందని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఇరాన్ మాత్రం ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదని అంటోంది. హర్ముజ్‌లో అమెరికా కవ్వింపు చర్యలు, తమకు వ్యతిరేకంగా ఇస్తున్న ప్రకటనల నేపథ్యంలో చర్చలకు వెళ్లబోమని ప్రకటించింది. దీంతో ట్రంప్ ఇరాన్‌పై భగ్గుమన్నారు. చర్చలకు రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఈ నెల 22తో ముగియనుంది. ఇరాన్ దిగిరాకుంటే కాల్పుల విరమణ పొడిగింపు ఉండదని.. భీకర దాడులు జరుపుతామని ట్రంప్ అంటున్నారు.


