టెహ్రాన్: ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని రాబోయే 36 నుంచి 72 గంటల్లోపూ మరో దశ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ బలప్రదర్శన చేసింది. తన బాలిస్టిక్ క్షిపణితో టెహ్రాన్ వీధుల్లో ఉరేగింపు జరిపింది. ఈ ఊరేగింపులో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధంలో సీజ్‌ఫైర్ నడుస్తున్నందున ఇరాన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు సాధారణ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తమ దేశ ఆయుధ సంపత్తిని తెలియజేస్తూ టెహ్రాన్ వీధుల్లో ఓ ర్యాలీ నిర్వహించింది. ఒక భారీ వాహనంపై తన దేశానికి చెందిన ఆధునాతన బాలిస్టిక్ క్షిపణి ఖదర్‌ను ప్రదర్శనకు ఉంచి ఊరేగింపు జరిపింది.ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొని నినాదాలు చేస్తూ ర్యాలీగా బయిలు దేరారు. ఖదర్ అనే క్షిపణి పాత షహాబ్-3A క్షిపణికి ఆధునాతన వెర్షన్ ఇది. ఇజ్రాయెల్‌పై దాడులకు ఇరాన్ ప్రధానంగా వీటినే వినియోగించింది.
అయితే ఇటీవల ట్రంప్ తరచుగా ఇరాన్ ఆయుధ సామాగ్రిపై ట్రంప్ తరచుగా కామెంట్స్ చేశారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎటువంటి ఆయుధ సామాగ్రి లేదని తరచుగా మాట్లాడారు. కాగా ఇటీవల యుఎస్ అధికారి ఇచ్చిన నివేదిక ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ ఆడమ్స్ ప్రకారం.. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా సురక్షితంగా ఉన్నాయి. తీరప్రాంత రక్షణ క్షిపణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు గత వారం CNN జరిపిన దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వాహనాల్లో దాదాపు సగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, అలాగే వేలాది డ్రోన్‌లు ఆయుధాగారంలోనే దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఆ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ర్యాలీ సైతం తమ వద్ద ఇంకా బలమైన ఆయుధాలు ఉన్నాయని పరోక్షంగా హెచ్చరించడానికే అన్న కోణంలో ఉంది.
Iran publicly displays 2000 km range ballistic missile in Tehran pic.twitter.com/HnKXAyPis9
— Iran Headlines (@Iran_Headlines) April 23, 2026


