ఇరాన్‌-అమెరికా యుద్ధం తీవ్రస్థాయికి?.. సంచలన వ్యాఖ్యలు | us iran war news fully prepared for American foolishness iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌-అమెరికా యుద్ధం తీవ్రస్థాయికి?.. సంచలన వ్యాఖ్యలు

May 3 2026 9:12 PM | Updated on May 3 2026 9:14 PM

 us iran war news fully prepared for American foolishness iran

ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌ ప్రతిపాదన తనకు నచ్చలేదని యుద్దం ముగించే అవకాశాలు లేవని అన్నారు. తాజాగా దీనికి ఇరాన్ అధికారి ఘాటుగా స్పందించారు. ఇరాన్‌- అమెరికా మధ్య మరోసారి యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.

ఆ దేశ మిలిటరీ కేంద్ర కమాండ్‌లోని సీనియర్ అధికారి మొహమ్మద్ జాఫర్ అసాదీ మాట్లాడుతూ "ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య మరోసారి ఘర్షణ జరిగే అవకాశం ఉంది." అని అన్నారు. యు.ఎస్ అధికారుల తాజా చర్యలు మరియు ప్రకటనలు కేవలం "వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమేనని ఆయన తెలిపారు. యు.ఎస్ అధికారుల చర్యలు మరియు ప్రకటనలు ప్రాథమికంగా మీడియా ఆధారితమైనవి. చమురు ధరలు పడిపోకుండా నిరోధించడం ఒకటైతే, వారు సృష్టించిన గందరగోళం నుండి తమను తాము రక్షించుకోవడం రెండవది" అని ఆయన అన్నారు. 

అమెరికా ఏదైనా ఉద్రిక్తతలకు పాల్పడితే ఇరాన్ సాయుధ బలగాలు తిప్పికొట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికన్లు చేసే ఏ కొత్త సాహసాలకైనా, మూర్ఖత్వాలకైనా సాయుధ బలగాలు పూర్తిగా ఎదుర్కొంటాయి అని పేర్కొన్నారు అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇది వరకే ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి దీనిపై స్పందించారు.

తమ దేశం "చర్చల నుండి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని కానీ  కానీ శాంతి పేరుతో నిబంధనలను రుద్దడం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. కాగా ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ మధ్య సీజ్‌ ఫైర్‌ నడుస్తోంది. ఇరు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే అణుఒప్పందం విషయంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement