ఇరాన్‌ ఆయుధాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే | Iran Has Thousands Of Missiles To Continue War | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ ఆయుధాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Apr 22 2026 2:06 PM | Updated on Jun 18 2026 1:00 PM

Iran Has Thousands Of Missiles To Continue War

ఇటీవల ‍అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ ఆయుధ సంపత్తిపై మాట్లాడారు. టెహ్రాన్‌ వద్ద ప్రస్తుతం ఎటువంటి ఆయుధ సంపత్తి లేదని ఆ దేశ నావికాదళం, వైమానిక దళం దాదాపుగా తుడిచిపెట్టుకపోయిందన్నారు. అయితే తాజా సర్వే కథనాలు మాత్రం అందుకు విభిన్నంగా ఉన్నాయి.  ఇరాన్‌ వద్ద ఇప్పటికీ వేలాదిగా క్షిపణులు, డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

ఇరాన్‌పై అమెరికాతో పాటు ఇజ్రాయెల్‌ ఏక కాలంలో విరుచుకపడ్డాయి. ఆ దేశంలోని రక్షణ,మౌళిక స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలోనే వైమానిక దళం తుడిచిపెట్టుకుపోయిందని, వారి నౌకాదళం సముద్ర గర్భానికి చేరుకుందని  ట్రంప్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఇరాన్‌కు తమతో యుద్దం చేసే సీన్‌ లేదని బిల్డప్‌ ఇచ్చారు. అయితే ఇరాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులు చేసినప్పటికీ వారి వద్ద  ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, కామికేజ్ డ్రోన్లు నిఘా నివేదికలు చెబుతున్నాయి.

అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ ఆడమ్స్ ప్రకారం.. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా సురక్షితంగా ఉన్నాయి. తీరప్రాంత రక్షణ క్షిపణులు  కూడా  పెద్ద సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే  గత వారం CNN జరిపిన దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వాహనాల్లో దాదాపు సగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, అలాగే వేలాది డ్రోన్‌లు ఆయుధాగారంలోనే  దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఆ దర్యాప్తులో తేలింది.

అయితే ప్రస్తుతం సీజ్‌ఫైర్‌ నడుస్తున్నప్పటికీ.. యుద్ధం విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా డిమాండ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని ఇరాన్ తెగేసి చెబుతుంది. మరోవైపు ట్రంప్ సైతం తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆయుధ సంపత్తిపై నివేదికలు చూస్తుంటే మరోసారి యుద్దం తలెత్తితే తీవ్రపరిణామాలు తలెత్తి అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement