యుద్ద సంక్షోభాన్ని ముందే పసిగట్టిన చైనా..? | Iran war: China amassed world's largest oil stockpile | Sakshi
Sakshi News home page

యుద్ద సంక్షోభాన్ని ముందే పసిగట్టిన చైనా..?

Apr 24 2026 8:12 AM | Updated on Apr 24 2026 8:46 AM

Iran war: China amassed world's largest oil stockpile

డ్రాగన్‌ కంట్రీ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన స్వార్థం కోసం ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి సిద్ధం కానీ తను మాత్రం ఎన్నడూ ఇబ్బందులకు గురి కాదు.ప్రస్తుతం ఇదే విషయం మరోసారి రుజువైంది. ఇరాన్‌- అమెరికా యుద్ధం వస్తుందని ముందే ఉహించిన చైనా ఆ దేశంలో భారీగా చమురు నిల్వలు ఉంచుకుందట.. అవీ ఏకంగా IEA అంతర్జాతీయ ఇంధన సంస్థ నిల్వల కంటే కూడా అధికంగా ఉన్నాయని సర్వేలు తెలిపాయి.

ప్రస్తుతం ఇరాన్‌- అమెరికా యుద్దంతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రధాన అంశం చమురు. ఆయిల్ రవాణాకు ఎంతో కీలకమైన హర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. అయితే ఈ సంక్షోభాన్ని ముందే ఉహించిన చైనా తమ దేశానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా భారీగా చమురునిల్వలు ఉంచుకుందట.. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ గణాంకాలు ఈ వివరాలే చెబుతున్నాయి.

ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం చైనా వద్ద సుమారుగా  1.4 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి.అయితే ఇది  అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) లోని 32 సభ్య దేశాల మొత్తం నిల్వలు (1.2 బిలియన్ బారెళ్లు) కంటే  అధికమని సర్వేలు చెబుతున్నాయి. అదే అమెరికా వద్ద ప్రస్తుతం 405 మిలియన్ బారెళ్ల నిల్వలు మాత్రమే ఉన్నాయని.. యుద్ధం కారణంగా పెరిగిన ధరలను తగ్గించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే  172 మిలియన్ బారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించారని పేర్కొన్నాయి..

అయితే యుద్దం అంచనాని ముందే పసిగట్టిన చైనా  ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనా తన చమురు దిగుమతులను ఏకంగా 15.8% పెంచుకుందని సర్వే చెబుతుంది. ఈ నేపథ్యంలోనే చైనా ప్రస్తుతం యుద్దం నేపథ్యంలో చమురు సంక్షోభాన్ని పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. అందుకే ఇది వరకూ ప్రపంచ దేశాలు చమురు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా చైనా మాత్రం ఎటువంటి ఆందోళన చెందలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement