అమెరికా KC-135 స్ట్రాటోట్యాంకర్ అదృశ్యం | US Military Tanker Goes Missing Near Gulf Region After Emergency Signal, Mystery Deepens | Sakshi
Sakshi News home page

అమెరికా KC-135 స్ట్రాటోట్యాంకర్ అదృశ్యం

May 5 2026 7:31 PM | Updated on May 5 2026 7:48 PM

US Flying Gas Station Goes Missing Over Qatar

వాషింగ్టన్‌: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధన కేంద్రంగా పనిచేసే బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఆచూకీ గల్లంతయ్యింది.

ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ విమానం ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా సంకేతాలు నిలిచిపోయాయి. అదృశ్యానికి ముందు ‘7700’ అనే అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది.

విమానాన్ని పర్షియన్ గల్ఫ్ మీదుగా కొనసాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ల్యాండింగ్‌కు ముందు కొంతసేపు గాలిలో వృత్తాకారంలో తిరిగినట్లు ట్రాకింగ్ డేటా తెలిపింది. అత్యవసర పరిస్థితికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై ఇరాన్‌ మీడియా సంస్థ ఫార్స్ వార్తా సంస్థ ఈ ఘటనపై నివేదిక ఇచ్చింది. అయితే, అమెరికా విమానం అదృశ్యానికి ఇరాన్‌ ప్రమేయం ఉందని ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement