ఇరాన్‌కు అమెరికా షాక్‌.. ఆ డబ్బు మొత్తం​ ఫ్రీజ్‌! | US freezes 344 million cryptocurrency over ties to Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు అమెరికా షాక్‌.. ఆ డబ్బు మొత్తం​ ఫ్రీజ్‌!

Apr 26 2026 1:22 AM | Updated on Apr 26 2026 1:33 AM

US freezes 344 million cryptocurrency over ties to Iran

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన రెండో విడ‌త శాంతి చ‌ర్చ‌లు ఎటూ తేల‌కుండానే ముగిశాయి. ఇరాన్‌తో చ‌ర్చ‌ల కోసం ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన అమెరికా ప్ర‌తినిధుల బృందం ప‌ర్యట‌న‌ను ఆ దేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఉన్న‌ప‌ళంగా ర‌ద్దు చేశారు.  ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 

తాజాగా ఇరాన్‌కు అమెరికా మ‌రో షాక్ ఇచ్చింది. ఇరాన్‌కు సంబంధించిన 344 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3242 కోట్ల) విలువైన క్రిప్టో కరెన్సీని ఫ్రీజ్ చేశామని ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఒప్పందం కుదుర్చుకునేలా ఇరాన్‌పై ఒత్తిడి తీసు కువచ్చేందుకు అమెరికా ఈ తరహా ప్రయత్నాలు చేస్తోంది. 

'నిధులు సమకూర్చుకోవడం, వాటిని తరలించడం వంటి విషయాల్లో ఇరాన్ సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాం. దానిలో భాగంగానే ఇరాన్తో సంబంధం ఉన్న పలు వాలెట్లపై ఆంక్షలు విధిస్తున్నాం. దాంతో నిధులు ఫ్రీజ్ అవుతాయి' అని బెసెంట్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement