ఇరాన్‌- అమెరికా మధ్య అసలేం జరగనుంది..? | What is the status of the Iran-US war? | Sakshi
Sakshi News home page

ఇరాన్‌- అమెరికా మధ్య అసలేం జరగనుంది..?

Apr 20 2026 9:27 AM | Updated on Apr 20 2026 11:24 AM

What is the status of the Iran-US war?

ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. ఓ వైపేమో డొనాల్డ్ ట్రంప్ చర్చలకు రాకుంటే వినాశనం తప్పదని హెచ్చరిస్తుంటే మరోవైపేమో ఇరాన్ హర్మూజ్‌ బ్లాకేడ్‌ విరమించేదాకా చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగనుంది. అసలు యుద్ధం ముగింపు దశకు చేరుకుందా.. లేక మరింత ఉదృతమవుతుందా అనే సమాచారం తెలుసుకోవాలని ఉందా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి..!

యుద్ధం ఎందుకు మెుదలైంది

అమెరికా, ఇజ్రాయెల్‌ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. అయితే దానికి మెుదటి కారణం ఇరాన్ తన అణు అణు బాంబును తయారు చేసే స్థాయికి చేరుకోవడమైతే మరోటి ఆ దేశంలోని ప్రజల అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టడం. ఈ రెండు కారణాలపై మెుదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ట్రంప్ చివరికి అనుకున్న పని చేశారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించారు.

మెుదటి రోజే ఖమేనీ హత్య

దీంతో ఫిబ్రవరి 28 న ఇరాన్‌పై ఆపరేషన్ "ఎపిక్‌ ప్యూరీ" పేరుతో అమెరికా దాడులు ప్రారంభించింది. యుద్దం ప్రారంభించిన మెుదటిరోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా ఖమేనీని అంతం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌ సైతం అధికారికంగా ధృవీకరించడంతో యావత్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యుద్దం తీవ్రంగానే ఉండబోతుందని ఆందోళన చెందింది. అయితే ఇరాన్‌ సైతం అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలను ఏకకాలంలో ధీటుగా ఎదుర్కొంది. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేయడంతో పాటు టెల్‌ అవీవ్‌ పై మిసైల్స్ అటాక్‌ చేసింది. ఇరాన్‌ ఏంతకీ వెనక్కి తగ్గలేదు.

హర్ముజ్‌ దిగ్భందనం

ప్రపంచ చమురు రవాణాకు ఏంత కీలకమైన హర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ బ్లాక్‌ చేసింది. దీంతో ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం చమురు ఈ జలసంధి గుండానే రవాణా జరుగుతుంది. అటువంటిది ఈ జలసంధిని ఇరాన్‌ బ్లాక్‌చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చమురు, గ్యాస్‌ సరఫరా లేక చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని దేశాలు ఇంధన కొరతను తట్టుకోలేక లాక్‌డౌన్‌ సైతం విధించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది.

ట్రంప్ అంచనాలు తలకిందులు.

యుద్దం విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా తలకిందులైంది. యుద్ధాన్ని కేవలం వారం రోజుల్లో ముగిస్తానని అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తొలుత నుంచి చెప్పుకుంటూ వ‍చ్చిన ట్రంప్‌నకు ఆ రెండు విషయాల్లో చుక్కెదురైంది.. వారం రోజుల్లో కాదు కదా యుద్ధం ప్రారంభమై 40 రోజుల దాటినా ఇరాన్ వెనుకంజవేయలేదు.. మరో వైపు అక్కడి ప్రజలు ఇరాన్‌కు అండగా ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడ్డారు.

ట్రంప్ చర్చల రాగం

అయితే మెుదటి నుంచి ఇటు ఇరాన్‌.. అటు అమెరికా ఎక్కడా తగ్గలేదు.. ఇరాన్‌లోని అణుస్థావరాలను విద్యుత్‌ ప్లాంట్లను ధ్వంసం చేశామని అమెరికా వాదిస్తుంటే.. అమెరికా ఫైటర్‌ జెట్స్‌ను కూల్చేసేమని తమతో యుద్దంలో అమెరికా ఓడిపోయిందని పరస్పరం వాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో తాను చర్చలకు సిద్ధమని ట్రంప్ ఏప్రిల్‌ 8న ‍ప్రకటించారు. అయితే చివరి వరకూ చర్చలపై ఏటూ తేల్చని ఇరాన్‌.. ట్రంప్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో కాస్త తగ్గింది. చర్చలకు రాకుంటే ఇరాన్‌ నాగరికతనే అంతం చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఎట్టకేలకు ఇరాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో  రెండు వారాల పాటు సీజ్‌ఫైర్ ఒప్పందం జరిగింది.  

ఇస్లామాబాద్ వేదికగా చర్చలు

దీంతో ఇస్లామాబాద్‌ వేదికగా ఏప్రిల్‌ 11, 12 తేదీలలో చర్చలు జరిగాయి. అయితే అమెరికా నిబంధనలు నేపథ్యంలో చర్చలు విఫలమయ్యాయి.ఇరాన్‌ అణుబాంబు తయారిని పూర్తిగా నిలపివేయాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించాలని డిమాండ్ పెట్టింది. దీంతో ఇరాన్‌ ఈ చర్చలకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.దీంతో అమెరికా హర్ముజ్‌ను బ్లాకేడ్ చేసింది. దీంతో ఇరాన్‌ సైతం తీవ్రంగా స్పందించింది. తాను కూడా హర్ముజ్‌ను అష్టదిగ్భందనం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరోసారి తన దుందుడుకు స్వభావంతో వ్యాఖ్యానించారు. ఇరాన్ మిలటరీ సర్వనాశనం అయ్యిందని వారికి యుద్దం చేసే సత్తాలేదని ఆరోపించారు.

యుద్ధం ముగుస్తుందా?

ప్రస్తుతం యుద్దం ముగుస్తుందా లేదా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఎందుకంటే అమెరికా ప్రధాన లక్షం ఇరాన్‌కు అణుబాంబు లేకుండా చేయడం అయితే దానికి టెహ్రాన్‌ ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేలా లేదు. మరోవైపు ఇతర విషయాలలోనే రెండు దేశాలు పరస్పర వైవిధ్యాలు కలిగి ఉన్నాయి. ఇరాన్‌ స్పీకర్‌ మహ్మద్‌ గాలిబాఫ్‌ సైతం ఇటీవల ఈ వ్యాఖ్యలే చేశారు. అమెరికా ఒత్తిడి చేస్తున్న ఇరాన్‌  రెండో దఫా చర్చలకు వచ్చేది లేదని తేల్చి చెబుతుంది. ఈ నేపథ్యంలో ఏవరో ఒకరు పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గితే తప్ప దీనికి పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం కనిపించడం లేదు. దీంతో  ఏం జరుగుతుందో   వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement