హర్ముజ్ వద్ద మరోసారి టెన్షన్ టెన్షన్‌ | Iran collects toll at Hormuz | Sakshi
Sakshi News home page

హర్ముజ్ వద్ద మరోసారి టెన్షన్ టెన్షన్‌

Apr 23 2026 5:56 PM | Updated on Apr 23 2026 7:02 PM

Iran collects toll at Hormuz

ప్రస్తుతం హర్ముజ్‌ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్ముజ్ జలసంధిని బ్లాకేడ్‌ చేశాం అని అమెరికా ప్రకటించడం.. అదే సమయంలో ఇరాన్ సైతం హర్ముజ్‌ నుంచి రాకపోకలకు అంతరాయం కలిగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్‌లో తొలిసారిగా టోల్‌ కలెక్ట్ చేసినట్లు ప్రకటించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్రేజా హాజీ ఈ మేరకు ప్రకటన చేసినట్లు అల్‌ జజీరా కథనం పేర్కొంది. " ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే నౌకల నుండి ఇరాన్ టోల్  వసూలు చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మొదటి విడత ఆదాయాన్ని ఇప్పటికే దేశంలోని సెంట్రల్ బ్యాంక్‌లో జమ చేశాం" అని ఆయన అన్నట్లు పేర్కొంది. అమెరికా విధిస్తున్న నౌకాదళ ఆంక్షలకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ పన్నును అమలు చేస్తోన్నట్లు తెలిపింది.

కాగా ఇదివరకే హర్ముజ్ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు మరియు నౌకాదళ ఒత్తిడి కొనసాగినంత కాలం ఈ చమురు రవాణా మార్గాన్ని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ, అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ చేస్తున్న రాయబార ప్రయత్నాలను ఇరాన్ గుర్తించినప్పటికీ, అమెరికా తీరును మాత్రం తప్పుబడుతూ వస్తుంది.

కాగా ఇదివరకే అమెరికా బెదిరింపులకు ఏ మాత్రం తగ్గేది లేదని ఇది వరకే ఇరాన్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం  ఇరాన్‌కు తరచుగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే హర్ముజ్‌ వద్ద టోల్‌ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement