యుద్ధంతో పాక్‌ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం: షెహబాజ్‌  | US-Iran conflict hits Pakistan economy, says PM Shehbaz | Sakshi
Sakshi News home page

యుద్ధంతో పాక్‌ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం: షెహబాజ్‌ 

Apr 30 2026 6:05 AM | Updated on Apr 30 2026 6:05 AM

US-Iran conflict hits Pakistan economy, says PM Shehbaz

ఇస్లామాబాద్‌: అమెరికా–ఇరాన్‌ యుద్ధం పరోక్షంగా పాకిస్తాన్‌ ఆర్థికవ్యవస్థ ప్రగతికి ప్రతిబంధకంగా నిల్చిందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘యుద్ధంకారణంగా విదేశాల నుంచి చమురు దిగుమతుల కోసం పెద్దమొత్తంలో విదేశీమారక ద్రవ్యాన్ని ఖర్చుచేయాల్సి వస్తోంది. గతంలో క్రూడాయిల్‌ దిగుమతుల కోసం వారంలో 30 కోట్ల డాలర్లు ఖర్చయ్యేది. 

ఇప్పుడది ఏకంగా 80 కోట్ల డాలర్లకు పెరిగింది. చమురు సంక్షోభాన్ని కట్టడిచేసేందుకు ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటుచేశాం’’ అని బుధవారం కేబినెట్‌ సమావేశంలో షెహబాజ్‌ వెల్లడించారు. చర్చల్లో మధ్యవర్తిగా పాక్‌ అద్భుతమైన పాత్ర పోషిస్తోందని, కాల్పుల విరమణ గడువు పొడిగించడంలో పాక్‌ చేసిన కృషి దాగి ఉందని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement