హార్మూజ్‌ను దాటిన 10 భారతీయ నౌకలు | Ten Indian vessels have crossed the Strait of Hormuz | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌ను దాటిన 10 భారతీయ నౌకలు

Apr 21 2026 4:28 AM | Updated on Apr 21 2026 6:04 AM

Ten Indian vessels have crossed the Strait of Hormuz

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా భారతీయ జెండాతో ఉన్న 10 సరకు రవాణా నౌకలు హార్మూజ్‌ జలసంధిని విజయవంతంగా దాటాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్‌«దీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు. ‘‘భారతీయ నౌక ‘దేశ్‌ గరిమా’విజయవంతంగా హార్మూజ్‌ను ఆదివారం దాటేసింది. దీంతో జలసంధిని దాటిన మన నౌకల సంఖ్య పదికి పెరిగింది. ముడి చమురుతో బయల్దేరిన ఈ నౌక త్వరలోనే ముంబై నౌకాశ్రయానికి చేరుకోనుంది. పర్షియన్‌ గల్ఫ్‌ జలాల్లో ఇంకా పలు నౌకలు భారత్‌ దిశగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని జైశ్వాల్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement