breaking news
National
-
ఢిల్లీ వాయు కాలుష్యంపై మంత్రి కీలక ప్రకటన
ఢిల్లీ కాలుష్య తీవ్రతపై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి స్పందించారు. కేవలం తొమ్మిది, పది నెలల్లో ఢిల్లీలోని కాలుష్య తీవ్రతను తగ్గించడం ఎన్నికైన ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రజలు తమ ప్రభుత్వాన్ని క్షమించాల్సిందిగా మంత్రి మంజీందర్ సింగ్ సిస్రా ప్రజలను కోరారు.ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత రోజురోజూకి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రాజధానిలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సైతం గాలి కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలని ఆదేశించింది. అయితే గత మూడురోజులుగా ఢిల్లీలోని వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు.మంత్రి మంజీందర్ సింగ్ మాట్లాడుతూ "పర్యావరణ కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రజలకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. తొమ్మిది లేదా పది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించడం ఎన్నికైన ఏప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే వాయు కాలుష్యాన్ని నివారించడానికి గత ప్రభుత్వంతో పోల్చితే మెరుగైన చర్యలు మేము తీసుకుంటున్నాం" అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిందని దానిని నివారించడానికి మేము సరైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అయితే ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం 400 పాయింట్ల కంటే అధిక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బొగ్గు,కట్టెలతో తందూరి వంటకాలను తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లపై బ్యాన్ విధించింది. ఇది వరకే కాలుష్య కారకాలకు సంబంధించిన పలు కారకాలపై నిషేధాజ్ఞలు విధించింది. -
ఆధార్, పార్సిల్ అంటూ : మహిళా టెకీని బెదిరించి రూ. 2 కోట్ల మోసం
డిజిటల్ అరెస్ట్ మోసానికి బలవుతున్న బాధితులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నకిలీ అధికారుల వలలో పడి బాధితులు కోట్ల రూపాయలను నష్టపోతున్నారు. బాధితుల్లో విద్యాధికులే ఎ క్కువగా ఉండటం మరింత విచారకరం. తాజగా బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి 2 కోట్ల విలువైన ఆస్తులను అమ్ముకున్న వైనం ఆందోళన రేపుతోంది. బెంగుళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ నిపుణురాలు బబితా దాస్ డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో రూ. 2 కోట్లు నష్టపోయింది. నకిలీ పోలీసుల డిమాండ్లను నెరవేర్చేందుకు తను ఉంటున్న ఇంటినీ, మరో రెండు ప్లాట్లను తెగనమ్ముకుంది. బాధితురాలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, తన 10 ఏళ్ల కొడుకుతో కలిసి విజ్ఞాన్ నగర్‌లోని ఫ్లాట్‌లో నివసిస్తోంది బబితా. జూన్‌లో, కొరియర్ అధికారిగా నటిస్తున్న ఒక వ్యక్తి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక అనుమానాస్పద లగేజీని తాము స్వాధీనం చేసుకున్నట్లు నమ్మించాడు.ఆ కాల్‌ను తక్షణమే ముంబై పోలీసు అధికారులుగా చెప్పుకుంటున్న మరో కేటుగాళ్లకు బదిలీ చేశాడు. అరెస్టు చేస్తామని బెదిరించి, ధృవీకరణ పూర్తయ్యేవరకు బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మోసగాళ్లు ఒక నిర్దిష్ట మొబైల్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేయాలని బెదిరించారు. తమకు సహకరించి అలా చేయకపోతే, కొడుకువిషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తాము చెప్పినట్టుగా చెల్లింపులు చేసి, ఆ తరువాత పోలీసుల ద్వారా తిరిగి పొందవచ్చని నమ్మబలికారు.చదవండి: గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్నభారత సంతతి మహిళ అరెస్ట్దీంతో బిడ్డ భవిష్యత్తు గురించి భయపడిపోయిన ఆమె వాళ్లు చెప్పినట్టే చేసింది. తక్కువ ధరకే మలూరు లోని రెండు ప్లాట్లను , ఇటు తాను ఉంటున్న విజ్ఞాన్ నగర్ ఫ్లాట్‌ను కూడా అమ్మేసింది. తద్వారా వచ్చిన సొమ్మును ను మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో పాటు ఆమె బ్యాంకు నుండి రుణం కూడా తీసుకుని సుమారు రూ. 2 కోట్లు మోసగాళ్లకు చెల్లించింది. ఆ తరువాత మోసగాళ్లు తరువాత డబ్బును తిరిగి పొందడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని చెప్పి, అకస్మాత్తుగా కాల్ కట్ చేశారు. ఆ తర్వాత యథావిధిగానే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌పై దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి? -
West Bengal: క్రీడాశాఖ మంత్రి రాజీనామా
ఢిల్లీ: ఇటీవల అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రాక సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో చోటు చేసుకున్న విధ్వంసానికి బాధ్యత వహిస్తూ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం మమతా బెనర్జీ ఆమోదించారు. ఈనెల 13వ తేదీన తేదీన బెంగాల్లో మెస్సి రాక సందర్భంగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. ఘటన జరిగిన రోజు క్రీడాకారులకు క్షమాపణ చెప్పిన మమత బెనర్జీ.. ఆ విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు చేపట్టారు. ఈవెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లను ఇప్పటికే అరెస్ట్ చేయగా, తాజాగా క్రీడామంత్రి రాజీనామాను సైతం ఆమోదించారు మమతా.లియోనెల్ మెస్సీ కార్యక్రమంలో గందరగోళం, విధ్వంసం పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డిజిపి రాజీవ్ కుమార్, బిధన్ నగర్ సిపి ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు & క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా లకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.కార్యక్రమం జరిగిన రోజున తన విధులు, బాధ్యతలలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిసిపి అనీష్ సర్కార్ (ఐపిఎస్) పై శాఖాపరమైన చర్యలు చేపట్టిందిప్రభుత్వం. -
ఆ గుడిలో వెలగపండే ప్రసాదం!
డిసెంబరు నెలలో తొలి పున్నమి వచ్చిందంటే చాలు.. గూడచి వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలగపండ్లు రాశులు పోసి కనిపిస్తాయి. దైవ దర్శనం పూర్తి చేస్తున్న భక్తులందరూ ఈ రాశుల వద్దకు చేరి డజన్లకు డజన్లు కొనుగోలు చేస్తూ కనిపిస్తారు. ఎందుకంటే కర్ణాటకలోని బెళగావి జిల్లా, రామదుర్గ తాలూలోని గూడచి వీరభద్రేశ్వర స్వామి జాతరకు హాజరైన వారందరూ స్వామివారి ప్రసాదంలా వెలగపండ్లు ఇళ్లకు తీసుకెళ్లడం వాడుక. అనాది కాలపు సంప్రదాయం. పౌర్ణమితో మొదలై ఐదు రోజులపాటు వైభవంగా జరిగే ఈ జాతరలో బెళగావితోపాటు పొరుగునే ఉన్న బాగల్‌కోట, విజయపుర, హావేరి జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూంటారు. జాతర ఐదవ రోజున ఆలయంలో జరిగే లక్ష దీపోత్సవం ఒక హైలైట్. సాంప్రదాయికంగా ఈ జాతర జరిగేది ఐదు రోజులే అయినప్పటికీ పౌర్ణమి నుంచి తరువాతి అమావాస్య వరకూ భక్తుల రాకపోకలు జోరుగానే సాగుతూంటాయి. వచ్చిన వారిలో అత్యధికులు వెలగపండ్లను ప్రసాదంగా తీసుకెళ్లడమూ కద్దు. మనమంటే వెలగపండ్లు అని పిలుస్తున్నాం కూడా కర్ణాటకలో దీనికి బోలెడన్ని పేర్లు. బేల, బలవత్తే, దంతశఠ, కపిత్థ అన్న పేర్లు వాడుకలో ఉన్నాయి ఈ ప్రాంతంలో. శాస్త్రీయ నామం లిమోనియా అసిడిసిమా. ఇంగ్లీషులో ‘వుడ్ ఆపిల్’. వీరభద్రేశ్వర ఆలయమున్న రామదుర్గ ప్రాంతంలో బళువల అని పిలుస్తారు. ఈ పండ్లను తీసుకెళ్లడంతోనే జాతర పూర్తయినట్లు వీరి నమ్మకం. అందుకే ఈ జాతరకు వెలగపండ్ల జాతరని కూడా స్థానికులు పిలుస్తూంటారని ఈరణ్ణ కామన్నవర తెలిపారు. లారీల కొద్దీ పంట..వీరభద్రేశ్వర స్వామి ఆలయ జాతరకు లారీల కొద్దీ వెలగపండ్లు వస్తూంటాయి. ఈ ఏడాది సుమారు 15 లారీల వరకూ పండ్లు వచ్చినట్లు సమాచారం. ఏటా సుమారు యాభై మంది వరకూ వ్యాపారులు ఇక్కడ వెలగపండ్ల విక్రయాలు సాగిస్తూంటారు. వీటిని రాశులుగా పోసుకుని అమ్ముకునేందుకు, భక్తుల అవసరాల కోసం గ్రామపంచాయతీ, జాతర కమిటీలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. జాతరకు వచ్చిన ఒక్కో కుటుంబం కనీసం ఐదారు డజన్ల వెలగపండ్లను ఖరీదు చేస్తాయని వ్యాపారి ద్యామణ్ణ నాగప్ప అమరగోళ తెలిపారు. మరి అన్ని పండ్లు ఏం చేసుకుంటారని ప్రశ్నిస్తే.. ఊళ్లో బంధు మిత్రులకు జాతర ప్రసాదంగా పంచుతారని సమాధానమిచ్చారు ఆయన. వెలగపండ్ల గుజ్జుకు బెల్లం కలిపి ఒక్కరోజు వదిలి తింటే ఆ రుచి అద్భుతం అని మనలో చాలామందికి తెలుసుకదా? ప్రసాదంగా పొందిన వారందరూ అంత మధురానుభూతి పొందాలన్నది ఈ సంప్రదాయం ఉద్దేశమేమో?ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రామదుర్గం తాలూకాలో వెలగపండ్లు అందుబాటులో ఉండటం తక్కువ కావడం. హావేరీ, శిగ్గావి, హానగల్, గోందీ, అనవట్టి వంటి ప్రాంతాల్లో దొరికే పండ్లను వ్యాపారలు ఇక్కడకు తీసుకొస్తూంటారు. ఎప్పుడో 12వ శతాబ్ధంలో మడివాళ మాచప్ప శరణరు సందర్శించిన సందర్భంలో ఇక్కడి ప్రజలు ఎక్కువ మంది రోగాలపాలై ఉన్నారట. పోషకాలతో నిండిన వెలగపండ్లు తింటే మేలు జరుగుతుందని చెబితే ప్రజలు పట్టించుకోరని.. వీరభద్రేశ్వర ఆలయం.. జాతర వంటి ఏర్పాట్లు చేశారని ప్రతీతి. ప్రసాదంగా ఈ వెలగపండ్లు పంచడం కూడా అప్పుడే మొదలైందని చెబుతారు. అయితే ఈ కథకు సంబంధించి ఎక్కడ రాతపూర్వక ఆనవాళ్లయితే లేవు. పోషకాల పుట్ట...వాస్తవానికి వెలగపండ్లు పోషకాల పుట్ట. తీపి, పులుపు రుచులతో ఉండే ఈ పండులో విటమిన్-సీ, పొటాషియం, ఫాస్పరస్ తదితర పోషకాలు మెండుగా ఉంటాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలకు మందుగా పనిచేస్తుందని అంచనా. అంటే.. దైవ ప్రసాదం మంచి రుచిని మాత్రమే కాదు. ఆరోగ్యాన్నీ ఇస్తోందన్నమాట.- గానధళు శ్రీకంఠ, ప్రజావాణి సౌజన్యంతో -
ఏ బిల్లునూ ఇష్టారాజ్యంగా మార్చకూడదు: ప్రియాంకా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్ భారత్ - జీ- రామ్- జీ (గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో కొత్త బిల్లును తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు చట్టాన్ని బలహీనపరుస్తుందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఎవరైనా వ్యక్తిగత అభిలాష, పక్షపాతం, స్వేచ్ఛ ఆధారంగా చట్టాలు చేయకూడదని ప్రియాంకా గాంధీ అన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ ఇచ్చే MGNREGS పథకాన్ని రద్దు చేసి కొత్త బిల్లుతో భర్తీ చేయడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు రైతులు, కార్మికులు, గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా బలమైన నిరసన వ్యక్తం చేస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలోని కోట్లాది కుటుంబాలకు రక్షణ కవచం. దానిని బలహీనపరచడం ప్రజల హక్కులను హరించడం అవుతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా ఈ బిల్లుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.గాంధీ పేరు తొలగించడం అనైతికం: థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ నిరసనకు మద్దతు తెలిపారు. రాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేయొద్దు అంటూ కేంద్రాన్ని కోరారు. ప్రజల జీవనోపాధి కోసం రూపొందించిన పథకానికి పేరు మార్చడం అనైతికమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడే పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని స్పష్టం చేశారు.ఈ మేరకు పార్లమెంటులో మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పేరును తొలగించి "జిరాంజీ"గా మార్చడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. -
ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి?
గుడికెళ్లినా, ఆసుపత్రికెళ్లినా అవే దృశ్యాలు మనల్ని వెక్కిరిస్తుంటాయి. ఆఖరికి రోడ్డుమీద నడిచివెడుతున్నా కూడా చిక్కాకు పుట్టించే పరిస్థితి. ఏ మూల నుంచి ఎవడు పుసుక్కున ఉమ్ముతాడో తెలియదు. ఏ సిగ్నల్ దగ్గర ఆగినా ఇవే దృశ్యాలు.. కొండొకచో పోలీస్ స్టేషన్ల దగ్గర్ల కూడా ఇదే పరిస్థితి. ఇదంతా దేని గురించో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. పాన్ పరాగ్, గుట్కా, ఖైనీ తిని అసహ్యంగా ఉమ్ముతూ పరిసర ప్రాంతాలను, రోడ్లను అత్యంత చెత్తగా తయారు చేస్తున్న వైనం గురించే. వీటిని ఇబ్బడి ముబ్బడిగా సేవిస్తున్న వారి సంఖ్య రోజూ రోజుకు పెరుగుతోంది. ఇవి తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాటు మితిమీరితే వివిధ రకాల కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడటం ఖాయం. దీనికి సంబంధించిన అనేక హెచ్చరికలు చేస్తున్నా.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వీటిని వాడేవారి నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏ సినిమా హాలుకెళ్లినా దీనికి సంబంధించిన యాడ్ ప్లే అవుతుంది. అయినా ఉత్తరభారతంలోని అనేక నగరాలతో పాటు, హైదరాబాద్ నగరంలో గుట్కా తిని ఉమ్మేసేవాళ్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలిస్తే షాకవ్వక మానరు. తాజాగా ఇంగ్లాండ్ లోని లింకన్ షైర్ లో జరిగిన ఘటన గురించి తెలుసుకుంటే.. మన దేశంలో చట్టాల అమలు తీరుపై ఆశ్చర్యం కలగమానదు. లింకన్ షైర్ కు చెందిన, ఆస్తమా, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న రాయ్ మార్ష్ (86) వైద్యుడి సలహా మేరకు వాకింగ్‌కు వెళ్లాడు. పార్క్‌లో నడుస్తుండగా ఎండిన ఆకు ఒకటి గాలికి ఎగిరొచ్చి వృద్ధుడి నోట్లో పడింది. చాలా యధాలాపంగా వెంటనే ఆయన దాని ఉమ్మేశారు. అదే ఆయనకు భారీ షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు షైర్‌కు ఏకంగా రూ.30 వేల ( 250 పౌండ్ల ) జరిమానా విధించారు.చట్ట ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం నేరమని, జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారు. మార్ష్ వివరణ ఇచ్చినా ససేమిరా అన్నారు. ఉద్దేశపూర్వకంగాఅలా చేయలేదని పొరబాటు జరిగిందని, అంతమొత్తం కట్టలేనని లబోదిబో మనడంతో కనికరించిన అధికారులు జరిమానాను 150 పౌండ్ల (సుమారు రూ.18 వేలు) తగ్గించారు. ఈ విషయాన్ని మార్ష్ కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేశారు.అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ ఇలాంటి కఠినచట్టాలు, అమలు మన దేశంలో అమలైతే ఎంతమంది ఎన్ని వేల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుందో ఒక్కసారి ఆలోచించింది. చట్టాలు, అమలు కంటే సమాజ హితంకోసం ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం. లేదంటే ఇంగ్లాండ్లొ వృద్ధుడికి ఎదురైన పరిస్థితే మనకు వస్తే? ఆలోచించండి.కాగా భారతదేశంలో పొగాకు ఉత్పత్తులపై కఠిన నియమ నిబంధలు, కొన్ని రాష్ట్రాల్లో వీటి విక్రయాలపై షేధం ఉన్నప్పటికీ పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు పొగాకు, సున్నం, వక్క, తామలపాకు, మసాలా దినుసులు, చక్కెరతోపాటు సుగంధ రసాయనాలతో గుట్కాలు, ఖైనీలు తయారవుతాయి. వాణిజ్య ఉత్పత్తులైన రజనీగందా, పాన్పరాగ్లో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి సోడియం బెంజోయేట్ లాంటివాటినీ ఉపయోగిస్తారు. ఇవి రుచి, మత్తును కలిగిస్తాయి. అంతిమంగా వారిని మరణం అంచుకునెట్టేస్తాయి. మోటారు ఫీల్డ్‌లో ఉన్నవారు ప్రధానంగా వీటికి బానిసలవుతున్నారు. ప్యాన్లు సహా దీర్ఘకాల వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇండియాలోదాదాపు 20-25శాతం జనాభా తినే పొగాకు ఉత్పత్తులకు బానిసలేనని అంచనా. నికోటిన్‌తోపాటు ఆరెకోలిన్ వంటి రసాయనాలు ఈ ఉత్పత్తులను అత్యంత వ్యసనకరంగా మారుస్తాయి. ఎక్కడ బడితే అక్కడ ఉమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ ఉత్పత్తుల గురించి అవగాహన కలిగి ఉండటం ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం. ఏమంటారు? -
పిల్లల కోసం కాపురం.. రెండోసారీ భార్య మోసం!
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఓ ఉదంతం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. అమృత్‌సర్‌కు చెందిన రవి గులాటి 15 ఏళ్లుగా తన భార్య హిమానీతో సంసారం సాగిస్తున్నాడు. అయితే తాజాగా అతను తన భార్యను ఒక హోటల్లో మరొక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ విధంగా ఆమె భర్తను మోసం చేయడం ఇది మొదటిసారి కాదు.భర్త తెలిపిన వివరాల ప్రకారం 2018లో కూడా ఆమె ఒక హోటల్లో వేరే వ్యక్తితో పట్టుబడింది. అప్పుడు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రవి సంసారం కొనసాగించాడు. అలాగే ఆ సమయంలో భార్య తన తల్లిదండ్రుల సమక్షంలో క్షమాపణ చెప్పడంతో, పరిస్థితి చక్కబడుతుందని రవి ఆశించాడు. కానీ భార్య తీరుతెన్నులో ఏమాత్రం మార్పు రాలేదు. గతంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని రవితన భార్యకు చెందిన యాక్టివా వాహనానికి రహస్యంగా జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చాడు. ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది.ఇంతలో రవి పదేపదే ఫోన్ చేసినా ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో అనుమానం పెరిగింది. జీపీఎస్ లొకేషన్‌ను అనుసరించి రవి ఒక హోటల్‌కు చేరుకున్నాడు. అక్కడ రవి తన భార్య మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన దరిమిలా రవి తండ్రి పర్వేజ్ గులాటి ఆమె ఇక తన కుమారునితో ఉండనక్కరలేదని, వారి పుట్టింటికి వెళ్లిపోవాలని తెగేసి చెప్పాడు. కాగా ఆమెతో పాటు పట్టిబడిన వ్యక్తిని ఆమె గతంలో తన సోదరునిగా భర్తకు పరిచయం చేసిందని పర్వేజ్ గులాటి తెలిపారు. రవి తండ్రి పర్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తితో హిమానీ ఏడేళ్లుగా రహస్యంగా సంబంధం కొనసాగిస్తోంది. గతంలో క్షమాపణతో ఈ సమస్య శాంతియుతంగా ముగిసిందని భావించామని, అయితే అదే తప్పు మళ్లీ జరగడంతో ఆమెపై గౌరవం పూర్తిగా పోయిదని పర్వేజ్ తెలిపారు. ఈ కథనం ‘న్యూస్ 18’లోని వివరాల ఆధారంగా రాయడం జరగింది. -
Bengal SIR list: ఎన్ని లక్షల పేర్లు తొలగించారంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ నిర్వహించిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం 58,20,898 మంది ఓటర్ల పేర్లను తొలగింపు కోసం గుర్తించారు. ఇవి ఓటర్ల గణన దశ ముగింపును సూచిస్తాయి. దీని తర్వాత అభ్యంతరాలు, విచారణలతో కూడిన క్లిష్టమైన దశ ప్రారంభమవుతుంది. మూడు దశల ‘సర్’ ప్రక్రియలో రెండవ దశ ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతుంది. తుది ఓటర్ల జాబితా 2026, ఫిబ్రవరి 14న ప్రచురితమవుతుంది.తొలగింపు కోసం గుర్తించిన 58 లక్షలకు పైగా పేర్ల వివరాలను ఈసీఐ విడుదల చేసింది. వీరిలో అత్యధికంగా 24,16,852 మంది మృతి చెందినట్లు గుర్తించిన ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో శాశ్వతంగా వేరే చోటికి మారిన లేదా వలస వెళ్లిన 19,88,076 మంది ఓటర్లు ఉన్నారు. 12,20,038 మంది ఓటర్లు గల్లంతైనట్లుగా గుర్తించగా, 1,38,328 పేర్లను నకిలీ, తప్పుడు లేదా బోగస్ ఎంట్రీలుగా గుర్తించారు. మిగిలిన 57,604 పేర్లను ఇతర కారణాల వల్ల తొలగించాలని ప్రతిపాదించారు. అయితే జాబితా నుండి మినహాయించినవారు సంబంధిత పత్రాలతో పాటు ఫారం 6లో తమ ఫిర్యాదులను సమర్పించుకునే అవకాశం ఉంది.కాగా ఈ ‘సర్’ ప్రక్రియ రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ‘సర్’ సమయంలో దాదాపు 40 మంది ఎన్నికల అధికారులు మరణించారని ఆరోపించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి బీజేపీ, ఎన్నికల సంఘం కుట్ర పన్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం బెంగాల్ నుండి ఎవరినీ బయటకు పంపడానికి అనుమతించబోదని ఆమె స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ..మమతా బెనర్జీ ఆగ్రహం అక్రమ వలసదారులతో కూడిన తన ఓటు బ్యాంకును రక్షించుకోవడానికేనని ఆరోపించింది. కాగా బెంగాల్‌తో పాటు, అండమాన్-నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ‘సర్’ప్రక్రియ నిర్వహిస్తున్నారు.ఇది కూడా చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి షాక్.. సోనియా, రాహుల్‌కు ఊరట -
ఢిల్లీ కాలుష్యం.. తందూర్‌లపై నిషేధం
సాక్షి,ఢిల్లీ: రాజధానిలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తందూరి వంటకాలను తయారు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ఆహార కేంద్రాల్లో బొగ్గు లేదా కట్టెలతో నడిచే తందూర్లను పూర్తిగా నిషేధించింది. ఇకపై అన్ని వాణిజ్య సంస్థలు విద్యుత్, గ్యాస్ ఆధారిత లేదా శుభ్రమైన ఇంధన పరికరాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.బొగ్గు, కట్టెలతో నడిచే తందూర్లు ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ఆహార కేంద్రాల్లో వాడకూడదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు Air (Prevention and Control of Pollution) Act, 1981లోని సెక్షన్ 31(A) కింద జారీ అయ్యాయి.మంగళవారం ఉదయం 10 గంటలకు ఆనంద్ విహార్, ITO ప్రాంతాల్లో AQI 400 వద్ద నమోదైంది. ఇది ప్రమాదకరమైన స్థాయిగా పరిగణించబడుతుంది. కాలుష్యం తీవ్రత పెరగడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) – Stage IV (Severe+) అమల్లోకి వచ్చింది. బయోమాస్, వ్యర్థాలు లేదా బొగ్గు వంటి పదార్థాలను బహిరంగంగా కాల్చడం పూర్తిగా నిషేధం. కాలుష్య స్థాయి ప్రమాదకరంగా పెరగడంతో అన్ని అత్యవసర చర్యలు తక్షణమే అమలు చేయాలని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) నిర్ణయించింది. ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు రెస్టారెంట్ వ్యాపారాలపై ప్రభావం చూపనున్నాయి. -
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి షాక్.. సోనియా, రాహుల్‌కు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మంగళవారం ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన తాజా చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ జరిపిన దర్యాప్తు.. కొత్తగా నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు, మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్ల ఉత్తర్వుల ఆధారంగానే జరిగిందని కోర్టు గమనించింది. అందుకే ఎఫ్ఐఆర్ కాపీని పొందే అర్హత ఈ దశలో నిందితులకు లేదని కూడా కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది.ఈ కేసులో మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)సోనియా , రాహుల్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. తమ అగ్ర నాయకత్వంపై కేంద్రంలోని మోదీ-షా ద్వయం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ వేధింపులు, బెదిరింపులు, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా అవాస్తవమని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కాంగ్రెస్ వాదించింది.కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలను బీజేపీ తిరస్కరించింది. సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ వాదనలను నిరాధారమని కొట్టిపారేశారు. ఈ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైనప్పుడు ప్రధాని మోదీ పదవిలో లేరని, ఈ కేసు 2008 నాటిదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు మానుకొని, వారు చేసిన దోపిడీకి లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకోనివ్వాలని ఆయన పేర్కొన్నారు.ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ 120(బి), మోసానికి సంబంధించిన సెక్షన్ 420 కింద ఫిర్యాదులు నమోదయ్యాయని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ కేసు పాతది కాబట్టి దీనిని పాత శిక్షాస్మృతి (పెనల్ కోడ్) కింద నమోదు చేశారని ఆయన తెలియజేశారు. కాగా ఈ కేసులో గాంధీలకు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, ఈడీ తదుపరి దర్యాప్తుకు కోర్టు అనుమతించడం ఉత్కంఠ కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: విజయ్ దివస్ 2025: పాక్‌ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి.. -
ప్రధాని మీటింగ్ లీక్స్.. కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓటు చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని, ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి సమావేశం జరిగిన విషయాన్ని కిషన్ రెడ్డి వివరించారు. ఆ సమావేశం మర్యాదపూర్వక భేటీ అని, అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు.ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయట పెట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా? లీక్ చేసినోడు మెంటలోడు. ఎవరో తెలిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతర్గత విషయాలను బయటకు చెప్పడం పార్టీ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
విజయ్ దివస్ 2025: పాక్‌ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి..
1971 డిసెంబర్ 16.. భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. సరిగ్గా 54 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత సైన్యం అద్భుతమైన వీరత్వాన్ని ప్రదర్శించి, 13 రోజుల ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాక్‌పై చారిత్రక విజయాన్ని సాధించింది. ఈ మహత్తర విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా డిసెంబర్ 16న యావత్ భారతదేశం విజయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారత సైన్యం సాధించిన విజయం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సాయుధ దళాల ధైర్యసాహసాలను దేశంలోని ప్రజలు ఈ రోజున గుర్తుచేసుకుంటారు.సైనిక అణచివేతపై పోరాటం..1971 యుద్ధానికి మూలం తూర్పు పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభం. పశ్చిమ పాకిస్తానీ సైన్యం అక్కడ తీవ్రమైన సైనిక అణచివేతకు పాల్పడింది. తూర్పు పాకిస్తానీ పౌరులు హింసను ఎదుర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు భయంతో తమ ఇళ్లను విడిచిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, శరణార్థుల సంక్షోభం తీవ్రమవడంతో, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న తూర్పు పాకిస్థాన్ ప్రజలకు మద్దతుగా భారతదేశం రంగంలోకి దిగింది. ఈ జోక్యం 1971 డిసెంబర్ 3 నాటికి సైనిక సంఘర్షణగా మారింది.జనరల్ అమీర్ అబ్దుల్లా లొంగుబాటుభారత సాయుధ దళాలు.. తూర్పు పాకిస్తాన్‌లోని ముక్తి బాహిని (విముక్తి దళాలు) సహకారంతో, సమిష్టిగా పనిచేస్తూ, పాకిస్తానీ సైన్యాన్ని నిర్ణయాత్మకంగా ఓడించాయి. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. 1971, డిసెంబర్ 16న పాకిస్తానీ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత సైన్యం, ముక్తి బాహిని సంయుక్త దళాల ముందు లొంగిపోయారు. అలాగే సుమారు 93 వేల మంది పాకిస్తానీ సైనికులు తమ ఆయుధాలను వీడారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చూసిన అతిపెద్ద సైనిక లొంగుబాట్లలో ఒకటి. ఈ యుద్ధం తూర్పు పాకిస్థాన్‌కు విముక్తి కల్పించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది.దేశం కోసం ప్రాణాలర్పించి..ఈ అద్భుతమైన విజయం ప్రపంచంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసింది. అయితే ఈ గెలుపునకు భారత్ భారీ మూల్యం చెల్లించింది. దాదాపు 3,900 మంది భారతీయ సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. మరెందరో గాయపడ్డారు. విజయ్ దివస్ అనేది కేవలం విజయాన్ని జరుపుకోవడానికి మాత్రమే కాదు.. నాటి యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు నివాళులు అర్పించే రోజు ఇది. భారత సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం, సరిహద్దుల వద్ద మనలను రక్షించే సైనికులను గౌరవించాల్సిన అవసరాన్ని విజయ్ దివస్ గుర్తుచేస్తుంది. ఈ రోజును భారతదేశం అంతటా దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో గల అమర్ జవాన్ జ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు.నిరంతర స్ఫూర్తిదాయకంభారత్-బంగ్లాదేశ్ చారిత్రక సంబంధాలను ప్రతిబింబించేలా 20 మంది సభ్యుల బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం భారతదేశంలో జరిగే విజయ్ దివస్ వేడుకలకు హాజరుకానుంది. ఈ బృందంలో 1971 యుద్ధ సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఎనిమిది మంది ముక్తిజోధాలు (విముక్తి యోధులు), బంగ్లాదేశ్ సైనిక అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం యువ తరానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందించడం. స్వాతంత్ర్యం అనేది ఒక బహుమతి అని, దానిని నిరంతరం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని ఈ రోజు పునరుద్ఘాటిస్తుంది. ఇది కూడా చదవండి: విజయ్ దివస్: యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళులు -
దేవుడా... అలసిపోయావా?
అంతర్యామి అలసితి సొలసితి...అంటూ అన్నమయ్య నీరసంగా ఆపసోపలు పడుతూ పాడారే కానీ...ఇపుడు ఆ దేముడికే అలసట వచ్చిపడుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి క్షణం తీరిక దొరకట్లేదు. వేళాపాళ లేకుండా భక్తాదులు వచ్చి వాకిట నిలబడుతుండటంతో వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన పెనుబాధ్యత స్వామి వారి భుజస్కందాలపై ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అయినా భక్తులు దర్శనమీయాల్సిందే....మా మొర ఆలకించాల్సిందే అంటూ మొండికేస్తున్నారు. పైగా వడ్డీకాసుల వాడి చెంత ఉత్త చేతులతో ఎలాగూ పోలేరు...పాలకమ్మన్యులు పోనివ్వరు కూడా. పోనీ రాత్రి బాగా పొద్దుపోయాక కాసింత నడుం వాలుద్దామన్నా...కళ్ళు మూసి తెరిచేలోగా సుప్రభాత సేవలు షురూ అయిపోతున్నాయి. అంతలోనే అర్చకులు, భక్తులు కమలాకుచ చూచుక కుంకుమ...అంటూ శ్లోకాలు అందుకుం టున్నారు. స్వామివారు బిక్కమొగం వేసుకుని తన ఇరు దేవేరులను చూస్తూ భక్తులకు విసుగు కనిపించనీయకుండా ప్రసన్నచిత్తులై దర్శనమీవాలి. ఒక్కసారి గమనించండి దేముడికి ఎంత కష్టం వచ్చిందో.అందుకే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఏంటసలు మీ తీరు...భక్తి సరే...భగవంతుడి మాటేంటి? స్వామి వారిని కనీసం నిద్రకూడా పోనివ్వరా? అనేక దంతం భక్తానాం అంటారా సరే..మరి కోట్లాది మంది భక్తులు నిరంతరం స్వామి చెంత నిలుచునుంటే...దేముడికి కాసింత పర్సనల్ స్పేస్ అక్కర్లేదా? కాసులకు కక్కుర్తిపడి గర్భగుడి తలుపులు వేళలు పాటించకుండా తెరిచేస్తారా? ఇది మీరు దేముడికి చేస్తున్న అపచారం కాదా? అంటూ బృందావన్ లోని బంకీ బిహారీ ఆలయ వ్యవహారంపై మండిపడింది. శక్తి కొద్ది భక్తి అన్నారు కానీ కరెన్సీ కొద్ది భక్తి అనలేదు కదా...మరి డబ్బున్న భక్తుల కోసం ఆ దేముడ్ని ఎందుకండీ ఇబ్బంది పెడతారు అంటూ సుప్రీం సీరియస్ అయ్యింది.బంకీ బిహారీ జీ ఆలయంలో పాలకుల తీరుతెన్ను చూసి మండిపోయిన ఓ భక్తాగ్రేసరుడు సుప్రీం చెంతకు చేరాడు. నాస్వామిని వీళ్ళందరూ రాచి రంపాన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దర్శన వేళలతోపాటు ఆలయ సంప్రదాయాల్లో తెచ్చిన మార్పుల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో ...సుప్రీం స్పందించక తప్పలేదు. ఆలయవేళల్లో మార్పు చేయడంతోపాటు దెహ్రి వంటి పలు ముఖ్యమైన ఆచారాలను బంద్ చేశారని పిటిషనర్ వాపోయారు. పోనీలే కనీసం ఓ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడని బంకీ బిహారీజీ అమందానంద కందళిత హృదయారవిందులై ఉప్పొంగి పోయుంటారుఈ సమస్య ఒక బంకీ బిహారీజీ...వేంకటేశ్వస్వామీ...సింహాద్రి అప్నన్న సామిలదే కాదు. అసలే మనకు ముప్పది మూడు కోట్ల దేముళ్ళు. కానీ కొందరికే భక్త పరంపర హెచ్చుగా ఉంటుంది. దాన్ని మనం తర్కించలేం. భక్తుని కష్టాలు భగవంతుడికే తెలుసంటారు...మరి భగవంతుడి కష్టాలు భక్తులకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతసేపూ సేవలకు సొమ్ముకట్టామా....కాయకొట్టామా....ముడుపులు వేశామా...కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ స్వామి ముందుంచామా....ఇదే తప్ప...అరె స్వామివారికి మనవల్ల ఎంత మనస్తాపం కలుగుతుంది...అసలు వారికి విశ్రాంతి దొరుకుతోందా అని ఎప్పుడైనా అనుకున్నామా? ఇదేం చోద్యం దేముడికి రెస్ట్ కూడా ఉంటుందా అని కొందరు ఎగతాళి చేస్తుంటారు...మరి ఆ స్లీపింగ్ స్లాటే లేకుంటే...ఉయ్యాల సేవలు...నిద్రపుచ్చే పాటలు ఎలా వచ్చాయండి? అని మరికొందరు లా పాయింటు లేవదీసి మరీ వాదిస్తుంటారు.ఇక తిరుమల వేంకటేశ్వరుడు...వారి భక్తిసామ్రాజ్యం ఎంత సువిస్తారమో....అక్కడ రాజకీయాలు అంతకన్నా విస్తారం. గత వైకుంఠఏకాదశి పుణ్యదినం కోసం ఎందరు భక్తులు టికెట్ల రద్దీలో చితికి ప్రాణాలు వదిలేశారో మనకు తెలుసు కదా. అదే సమయంలో గరికపాటివారి వ్యంగ్య ప్రసంగం తెగ వైరల్ కాలేదూ. అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది...ముక్తి ప్రాప్తమవుతుందని అశేష ఆస్తికమహాశయుల ప్రగాఢ నమ్మిక. అయితే శక్తి లేనివారిలో భక్తులుండరా? నీ కొండకు నీవే రప్పించుకో...ఆపదమొక్కలు మాతో ఇప్పించుకో అని ఘంటసాల ఎంత ఆర్డ్రంగా పాడారు. భక్తుడు రావాలా...లేదా తనే ఆతని వద్దకు వెళ్లాలా అని డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. కానీ మన సర్కారు మహత్తరంగా...ప్రచారాలు చేసి మీకు మోక్షం దక్కాలన్నా...పున్నెం రావాలన్నా తెల్లారు జాము ఉత్తర దర్శనం తప్పని సరి అది ఈరోజే అంటూ ఊదరగొట్టినందుకే కదా తొక్కిసలాట...మరణాలు సంభవించింది. దీని పై సర్కారు స్పందన ఉండదు....కానీ లడ్డూలో కల్తీ అంటూ రాజకీయం చేయడానికి సిద్ధం. సాక్షాత్తు సుప్రీం కోర్టే సర్కారును నిలదీసి...తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రచారాలు ఎలా చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తన మహాప్రసాదం...భక్తులు భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించే లడ్డూపైన వివాదలు పుట్టించడం గమనించిన ఆ దేవదేవుడి మనసు ఎంత వ్యాకులత చెంది ఉంటుందో కదా. అయినా ఆలయాల్లో రాజకీయాలేంటి అని స్వామివారు చిరాకుపడ్డా ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తిరుమల ఆ దశను దాటిపోయింది. అక్కడ ప్రతీది రాజకీయమే. దర్శనంతో మొదలు లడ్డూ దాకా...భక్తుని మొదలు పాలక మండలి దాకా అంతా రాజకీయమే. ఇంత జరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదంటే అది స్వామివారి వైభవం...వైభోగం అంతే. ఒక తిరుపతే కాదు దేశంలో ఏ ఆలయమైనా భక్తులతో కిటకిటలాడుతునే ఉంటుంది. ఈ దేశంలో మనుషులతో కిక్కిరిసి కనిపించేవి రెండే రెండు...ఇకటి ఆలయం...రెండోది ఆసుపత్రి.ఏది ఏమైనా సుప్రీం జోక్యంతో అయినా బంకీ బిహారీ జీ ...తిరుపతి వెంకన్నలకు కాసింత ఊరట లభిస్తే అదే పదివేలు.:::ఆర్ఎం -
ఢిల్లీలో ఈ ఎమర్జెన్సీ.. ఇంకెన్నేళ్లో?
తీవ్ర వాయుకాలుష్యానికి తోడయ్యే దట్టమైన పొగమంచు.. ఎటు చూసినా మాస్కులు ధరించిన ప్రజలు.. కరోనా కానరాకుండా పోయినా శీతాకాలంలో మన దేశరాజధాని వీధుల్లో కనిపించే దృశ్యాలివే!. వాహనాల గొట్టాలు కక్కే పొగ, ఇండస్ట్రీల నుంచి వెలువడే ప్రాణాంతక వాయువులు, నిర్మాణాలు వెదజల్లే ధూళి.. పంట అవశేషాల దహనాలు .. ఇవన్నీ కలగలిసిపోయి ఢిల్లీని ఓ గ్యాస్ చాంబర్‌గా మార్చేస్తున్నాయి.. ప్రతి సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ III, స్టేజ్ IV లాంటి ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటోంది. ఆ సమయంలో కన్స్ట్రక్షన్ పనులు ఆపేస్తారు. డీజిల్, పెట్రోల్ వాహనాలపై పరిమితులు పెడతారు. స్కూల్స్ మూసేస్తారు. ఆఫీసులను హైబ్రిడ్.. మరింత దిగజారితే వర్క్‌ఫ్రమ్ హోంకు పరిమితం చేస్తారు. గాలి మందగించి, పొగమంచు కమ్ముకుని, ప్రజలు మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. అయితే ఇవన్నీ తాత్కాలిక చర్యలు మాత్రమే. ఈ ఏడాది పరిస్థితి మరింతగా ముదిరింది. పిల్లలను కనీసం బయట కూడా తిరగొద్దని కోర్టులు చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా దీర్ఘకాలిక పరిష్కారం లేకపోవడం వల్ల ఎమర్జెన్సీనే నార్మల్‌గా మారింది. పాలసీ ఫాటీగ్(మానసిక, భావోద్వేగ అలసట) పరిస్థితి ఏర్పడింది. ప్రజలు కూడా ఈ చర్యలను సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. ఢిల్లీ కాలుష్యం కథ ఒక నిరంతర యుద్ధం. ప్రతి సంవత్సరం అదే దృశ్యం.. అదే చర్యలు.. అదే విఫలత. కానీ ఈసారి ప్రశ్న వేరుగా ఉంది. దేశరాజధానికి ఊపిరి ఇవ్వాలంటే.. సిస్టమ్ మొత్తాన్ని రీడిజైన్ చేయగలమా? లేదంటే ఎమర్జెన్సీని నార్మల్‌గా అంగీకరించేస్తూ పోతారా?.. ఢిల్లీలోనే ఎందుకంటే.. ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ ఎందుకు పడిపోతోంది?. ఎందుకంటే.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వాహనాల సంఖ్య ఎక్కువ. ఎన్సీఆర్లో ప్రధానంగా ఉండే కోల్ ఆధారిత పవర్ప్లాంట్లు.. ఫ్యాక్టరీలు ప్రమాదకరమైన వాయువుల్ని విడుదల చేస్తుంటాయి. చుట్టుపక్కల పంజాబ్, హర్యానాల రైతులు పంటలని కాల్చడంతో ఆ పొగ కాలుష్యానికి తోడవుతోంది. వీటన్నింటికి తోడు.. నిరంతరాయంగా కొనసాగే నిర్మాణ పనులతో ఆ ధూళి గాల్లో కలిసి కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. శాశ్వత పరిష్కారం ఉండవా?దేశరాజధానిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజల అవసరాలకు తగ్గట్లు పెంచాలి. మెట్రో లైన్లు విస్తరించినా.. బస్సుల సంఖ్య తక్కువ. ఫలితంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు. పంట అవశేషాల దహనం ఆపడానికి రైతులకు ప్రత్యామ్నాయాలు ఇవ్వాలి, కానీ సపోర్ట్ సిస్టమ్ బలహీనంగా ఉంది. రైతులు తక్కువ ఖర్చుతో పంట అవశేషాలను కాల్చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ కాలుష్యాన్ని ఎదుర్కోలేకపోతోంది. WHO ప్రమాణాల కంటే 10–15 రెట్లు ఎక్కువ టాక్సిక్ లెవెల్స్ ఢిల్లీలో నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో శ్వాస సమస్యలు, కంటి ఇర్రిటేషన్, గుండె సంబంధిత సమస్యలతో రోగులు పెరుగుతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా విఫలమవుతున్నదనే సూచన.ప్రైవేట్ రంగం, స్టార్టప్‌లు కాలుష్య నివారణ కోసమంటూ ముందుకు వస్తున్నాయి. కార్‌పూలింగ్ యాప్‌లు, ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, క్రాప్ రెసిడ్యూ ప్రాసెసింగ్ వంటి పరిష్కారాలు ప్రతిపాదిస్తున్నారు. కానీ ఇవి చిన్న స్థాయిలో మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ లాంటి మహానగరానికి ఇవి సరిపోవు. పెద్ద స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వ మద్దతు, ప్రజల సహకారం కచ్చితంగా అవసరం.అంటే ఢిల్లీ పొల్యూషన్ కేవలం వాతావరణ సమస్య కాదు.. ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్‌కి ప్రతీక. ఇది ప్రభుత్వ పాలసీల లోపం, అమలు బలహీనత, ప్రజల ప్రవర్తన, ఆర్థిక ఒత్తిళ్లు అన్నీ కలిసిన విఫలత. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, రైతులకు ప్రత్యామ్నాయాలు, ఇండస్ట్రీలపై కఠిన నియంత్రణ, ప్రజల అవగాహన.. మొత్తం వ్యవస్థనే మార్చగలిగినప్పుడు మాత్రమే ఢిల్లీ మళ్లీ మంచి ఊపిరి తీసుకోగలుగుతుంది. -
ఇండిగో విమానంలో లూత్రా సోదరులు ఇండియాకు
గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) తరువాత బ్యాంకాక్ పారిపోయిన ప్రధాన ప్రధాన నిందితులు క్లబ్ ఓనర్లు గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra) థాయిల్లాండ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఇండిగో విమానంలో (6E1064) తిరిగి తీసుకువస్తున్నారు. బ్యాంకాక్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1:45 గంటలకు (IST) బయలుదేరాల్సి ఉంది. ఢిల్లీ చేరిన తరువాత వీరిని ఇద్దరినీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారు, అధికారులు వారి ట్రాన్సిట్ రిమాండ్ కోరుతున్నారు. అనంతరం వీరిని గోవాకు తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విషాదం జరిగిన కొన్ని గంటల తర్వాత థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయారు. ఈ ఘటన తరువాత లూత్ర సోదరులపై నేరపూరిత హత్య మరియు నిర్లక్ష్యం కేసు నమోదైనాయి. వీరిని అరెస్ట్ చేసే క్రమంలోనే లూత్రా బ్రదర్స్ పాస్‌పోర్టులను కూడా అధికారులు రద్దు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు సిబ్బందినిఅరెస్టు చేశారు, వారిలో మేనేజర్ కూడా ఉన్నారు. క్లబ్ కు పర్మిట్లు, లైసెన్సులు జారీ చేయడంలో పాల్గొన్న అనేక ప్రభుత్వ విభాగాల అధికారులను కూడా విచారిస్తున్నారు. తాను "సైలెంట్ పార్టనర్" అని చెప్పుకున్నప్పటికీ, మూడవ భాగస్వామి అజయ్ గుప్తాను కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. డిసెంబర్ 9న థాయిలాండ్‌లోని తమ హోటల్ నుండి భోజనం కోసం బయటకు వచ్చిన తర్వాత ఇద్దరినీ థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. -
విజయ్ దివస్: యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) విజయ్ దివస్ సందర్భంగా భారత సాయుధ దళాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకున్నారు. ‘మన చరిత్రలో గర్వించదగిన క్షణం’ అని ఈ విజయాన్ని ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత సైనికుల అచంచలమైన సంకల్పం, నిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయని,ఈ విజయం తరతరాలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుందని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. On Vijay Diwas, we remember the brave soldiers whose courage and sacrifice ensured India had a historic victory in 1971. Their steadfast resolve and selfless service protected our nation and etched a moment of pride in our history. This day stands as a salute to their valour and…— Narendra Modi (@narendramodi) December 16, 2025రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ చారిత్రక దినాన్ని పురస్కరించుకుని సాయుధ దళాలకు నివాళులు అర్పించారు. 1971లో దేశానికి విజయాన్ని అందించిన సైనికులకు దేశమంతా కృతజ్ఞతతో నమస్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ వ్యూహాత్మక సంకల్పాన్ని ప్రతిబింబించిందని, సైన్యం, నావికాదళం, వైమానిక దళం మధ్య సమన్వయాన్ని ప్రతిబింబించిందని అన్నారు. వారి శౌర్యం, క్రమశిక్షణ, పోరాట స్ఫూర్తి మన జాతీయ సంకల్పాన్ని బలోపేతం చేస్తున్నాయని ఆయన ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.1971, డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 16 వరకు భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఫలితంగా తూర్పు పాకిస్తాన్ నుండి విడివడి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ యుద్ధంలో భారత సాయుధ దళాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇది ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగిపోవడంతో డిసెంబర్ 16ను విజయ్ దివస్‌గా ప్రకటించారు. అదే రోజున 93 వేల మందికి పైగా పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. ఇది ఆధునిక సైనిక చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాట్లలో ఒకటిగా నిలిచింది.ఇది కూడా చదవండి: హఠాత్తుగా ఆగిన కేబుల్ కార్.. తుళ్లిపడిన ప్రయాణికులు! -
ప్రియురాలిని బలిగొని.. పెళ్లి పీటలెక్కిన క్రూరుడు!
ఉత్తరప్రదేశ్‌లో ఒక షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహారన్పూర్కు చెందిన టాక్సీ డ్రైవర్ బిలాల్ తన ప్రియురాలు ఉమ (30)ను దారుణంగా హత్య చేశాడు. సదరు మహిళ తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో పడేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.ఘటన వివరాలు.. డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం బిలాల్, ఉమను సహారన్పూర్ నుండి స్విఫ్ట్ కారులో తీసుకెళ్లి దాదాపు ఆరు గంటల పాటు తిరిగారు. అనంతరం ఆమెను లాల్ ధాంగ్ లోయ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం తల నరికి మృతదేహాన్ని అడవిలో పడేసి అక్కడి నుండి పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన బిలాల్ ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తూ మరో మహిళతో తనకు కాబోయే పెళ్లి కోసం షాపింగ్ ప్రారంభించాడు.పోలీసులు తెలిపిన వివరాలు.. బిలాల్ మరో స్త్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉమను తన జీవితంలో నుండి తొలగించడానికి హత్యను ప్లాన్ చేశాడు. ఉమ గతంలో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఆమె తన వివాహానికి ఒక రోజు ముందు ఇంటిని విడిచి తన ప్రియుడితో కలిసి వెళ్లి పోయింది. తరువాత వివాహం చేసుకుంది. ఏడాదిన్నర క్రితం భర్తకు విడాకులు ఇచ్చి, తన కుమారుడిని తండ్రి వద్దే ఉంచింది.కుటుంబం స్పందన.. ఉమ మృతదేహం దొరికిందని సమాచారం అందుకున్న తర్వాతే తన హత్య విషయం తెలిసిందని బంధువులు తెలిపారు. ఉమ సోదరుడు మాట్లాడుతూ.. ఆమె తల నరికివేయబడిందని తెలిసి కుటుంబం తీవ్ర షాక్‌కు గురైందని పేర్కొన్నారు. సంఘటనకు 15 రోజుల ముందు ఉమ తన కుమారుడిని కలుసుకుంది. తనకి కొన్ని బట్టలు ఇచ్చి వెళ్లింది. అతనితో జీవించడం ఇష్టం లేదని ఉమ కుమారుడు పోలీసులకు తెలిపాడు.బిలాల్‌ను అరెస్టు చేసి, ఫోరెన్సిక్ ఫార్మాలిటీలను పూర్తి చేస్తున్నారు. మిగిలిన ఆధారాలను సేకరించి, కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసు ఉత్తరప్రదేశ్ , హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్రస్థాయి వాయు కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావొద్దని అధికార యంత్రాగం జాగ్రత్తలు సూచిస్తోంది. ఇప్పటికే పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారీ పొగమంచు రవాణా వ్యవస్థపై వరుసగా రెండో రోజు కూడా ప్రభావం పడింది. విజిబులిటీ పడిపోవడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఒక్క సోమవారం నాడే 200కి పైగా విమానాలు రద్దయ్యాయి. AQI(గాల్లో వాయు నాణ్యత) తీవ్రత నిన్న 500 మార్కును దాటింది. అయితే ఈ రోజు ఉదయం నమోదైన డేటా ప్రకారం ఇది సుమారు 370గా ఉంది. లోధి కాలనీ, పూసా రోడ్ వంటి నిర్దిష్ట ప్రాంతాలలో స్థాయిలు సుమారు 350గా నమోదయ్యాయి. కాలుష్య స్థాయిలో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ, నివాసితులు ఈ సంక్షోభంతో పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. నర్సరీ నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు క్లాసులను ఆన్లైన్లోనే కొనసాగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. ప్రమాదానికి కారణమిదే!
ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారు ఝామన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనకు పొగమంచు కారణంగా తెలుస్తోంది. భారీ పొగమంచులో తొలుత రెండు వాహనాలు వేగంగా ఢీ కొట్టుకోగా.. ఆ వెంటనే మిగతా వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టి మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం వేకువజామున 4గం. ప్రాంతంలో ఆగ్రా-నోయిడా లేన్ 127వ మైలురాయి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత మూడు కార్లు వరుసగా ఢీ కొట్టకున్నాయి. ఆ తర్వాత ఏడు బస్సులు ఢీ కొట్టుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సుల్లో ఒకటి ఆర్టీసీ ఉండగా.. మిగతా ఆరు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సులు. మొత్తం 7 బస్సులు.. నాలుగు కార్లు మంటల్లో చిక్కకుని బూడిదయ్యాయి.ఇప్పటిదాకా నాలుగు మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం నుంచి పలువురు సురక్షితంగా బయటపడగా.. నిద్రలో ఉండడం, ఒక్కసారిగా మంటల ఎగసి పడడం, వాహనాలు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి బయటపడలేని స్థితిలో పలువురు సజీవ దహనం అయ్యి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రంగంలోకి దిగిన 11 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ ఘోర ప్రమాదంతో ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.#WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/k8LdYmBOC1— ANI (@ANI) December 16, 2025#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited.#firemishap #buses #DelhiAgraExpresswayANI pic.twitter.com/kKqC31C7MR— Argus News (@ArgusNews_in) December 16, 2025ఇదిలా ఉంటే.. నిన్న ఢిల్లీ-ముంబై రహదారిపైనా ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నుహ్(హర్యానా) వద్ద సోమవారం ఉదయం 5గం. ప్రాంతంలో వాహనాలు భారీ పొగమంచు కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకున్నాయి. రెండు ఓవర్‌లోడెడ్ డంపర్లు యాక్సిడెంట్‌కు గురి కాగా.. ఆ వెనక 20 దాకా వాహనాలు వేగాన్ని అదుపు చేసుకోలేక ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. సుమారు 20 మంది దాకా గాయాలయ్యాయి. పొగ మంచు వరుస ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వాహనదారులకు సూచిస్తున్నాయి. -
ప్రియురాలే గెలిచింది
కర్ణాటక: ప్రేమ, పెళ్లి పేరుతో యువత దారి తప్పుతున్న ఉదంతాల నేపథ్యంలో పెళ్లి వేడుకలో ప్రియురాలు రచ్చ చేసి ప్రియున్ని వివాహమాడిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 12న నగరంలో రిషభ్‌కు తల్లిదండ్రులు ఓ అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఇన్ స్టాలో చూసి తెలుసుకున్న ప్రేయసి నగరానికొచ్చి పెళ్లిని నిలిపేసింది. రిషభ్ బళ్లారిలో చదువుతున్న సమయంలో కొప్పళకు చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించి, మళ్లీ ఓ గుడిలో మూడుముళ్లు వేశాడు. తాజాగా ఆమెను దూరంగా ఉంచి తల్లిదండ్రులు చెప్పినట్లు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇంతలో కళ్యాణ మంటపానికి చేరుకున్న ప్రియురాలు పోలీసుల సహకారంతో పెళ్లిని నిలుపుదల చేసి, పెద్దల సమక్షంలో తానే వివాహం చేసుకుంది. ఈ తతంగంపై మరో అమ్మాయి తరఫు బంధువులు భగ్గుమన్నారు. ప్రేమ బాగోతాన్ని దాచిపెట్టి మరో పెళ్లి ఎలా చేసుకుంటావు అని నిలదీశారు. -
ప్రాణం మీదకొచ్చిన పార్టీ
బెంగళూరు: స్నేహితులతో కలిసి హోటల్లో పార్టీ చేసుకుంటున్న సమయంలో పోలీసులు రావడంతో భయపడి ఓ యువతి పరుగులు తీసే క్రమంలో పై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. వైష్ణవి (21), 8 మంది స్నేహితులతో ఏఇసీఎస్ లేఔట్‌లోని ఓ హోటల్లో 3వ అంతస్తులో పార్టీ పెట్టుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి గట్టిగా మ్యూజిక్ వేసుకుని కేకలు వేస్తూ డ్యాన్స్ చేస్తుండటంతో చుట్టుపక్కల ఇళ్లవారు 112 కు ఫోన్‌చేశారు. స్థానిక పోలీసులు వచ్చి పార్టీ జరుగుతున్న పై అంతస్తుకు వెళ్లారు. దీంతో అందరూ తలోదిక్కుకు పరుగులు తీశారు. వైష్ణవి భయపడి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పై అంతస్తు నుంచి పైపును పట్టుకుని కిందికి దిగడానికి ప్రయత్నిస్తుండగా జారి కింద ఇనుప గ్రిల్స్ మీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో మృత్యువు అంచుల్లో ఉంది. లంచం అడిగారు హోటల్ వద్దకు వచ్చిన పోలీసులు కేసు కాకూడదంటే డబ్బులు ఇవ్వాలని అడిగారు, మేము ఫోన్ పే చేస్తామని చెప్పగా, వద్దు క్యాష్ కావాలన్నారు అని పారీ్టలో పాల్గొన్నవారు ఆరోపించారు. దీనిపై డీసీపీ విచారణ చేపట్టారు. హోటల్, పోలీసు సిబ్బందిపై యువతి తండ్రి ఆంథోనీరాజ్ హెచ్ఏల్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
ఉత్తర ప్రదేశ్ ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. పొగమంచు కారణంగా.. మంగళవారం వేకువ జామున పలు కార్లు, బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకుని మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొలుత నలుగురు మరణించారని ప్రకటించిన అధికారులు.. సహాయక చర్యల అనంతరం ఆ సంఖ్యను 13గా వెల్లడించారు. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పలు వాహనాలు మంటల్లో చిక్కుకుని 13 మంది మృతి చెందారు. సుమారు 65 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, మథుర ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘యమునా ఎక్స్‌ప్రెస్‌వే 127వ మైల్ స్టోన్ వద్ద ఏడు బస్సులు, మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. వాహనాల నుంచి మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఫైర్ బృందాలు రెండు గంటలు శ్రమించి మంటల్ని అదుపు చేశాయి’’ అన్నారు. #WATCH | Mathura, UP | SSP Mathura, Shlok Kumar says, "... An accident took place at the Yamuna Expressway Milestone 127. The reason was low visibility... 7 buses and 3 cars collided as a result of which, a fire broke out in all the vehicles... The rescue operation is nearing… https://t.co/fcMTyQjWBk pic.twitter.com/RY8vdxLqVi— ANI (@ANI) December 16, 2025ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తొలుగ మూడు కార్లు మరొకటి ఢీ కొట్టాయి. అనంతరం ఆ వెనకాలే ఏడు బస్సులు ప్రమాదానికి గురై మంటలు అంటుకున్నాయి. అలా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో పలువురు ఫోన్లలో తీసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/9J3LVyeR3P— ANI (@ANI) December 16, 2025 #WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/qvKDqAT5T1— ANI (@ANI) December 16, 2025 👉ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవే (యమునా ఎక్స్‌ప్రెస్‌వే) పొడవు 165.5 కిలోమీటర్లు. 2012 ఆగస్టు 9న ప్రారంభించబడింది. ఇది గ్రేటర్ నోయిడా నుండి ఆగ్రా వరకు విస్తరించి, ఆరు లేన్లతో నిర్మించబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం పాత ఢిల్లీ–ఆగ్రా జాతీయ రహదారి (NH-2)లోని ట్రాఫిక్‌ను తగ్గించడం. 👉ఈ హైవే గ్రేటర్ నోయిడా, జేవర్, వృందావన్, మథుర, హత్రాస్ వంటి పట్టణాలను కలుపుతూ ఆగ్రాకు చేరుస్తుంది. భారతదేశంలో ఆరో పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా గుర్తించబడింది. అయితే.. అధిక వేగం, డ్రైవర్లు నిద్రలోకి జారుకోవడం, పొగమంచు కారణంగా తరచూ ఈ హైవేపై ప్రమాదాలు జరుగుతుంటాయి. 👉2012–2023 మధ్య జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రైవర్లు నిద్రపోవడం వల్ల జరిగాయి!. ఎక్స్‌ప్రెస్‌వే పొడవుగా, సూటిగా ఉండటం వల్ల డ్రైవర్లు వేగంగా దూసుకెళ్తుండడంతో నియంత్రణ కోల్పోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక.. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం జరుగుతుంది. అందుకే ఇటీవలే వేగ పరిమితిని 75 kmphకి తగ్గించారు. తాజా ప్రమాదం పొగమంచు కారణంగానే జరిగి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. -
రామ్ విలాస్ వేదాంతి కన్నుమూత
అయోధ్య: రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి(67)సోమవారం గుండెపోటుకు గురై కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈ నెల 14వ తేదీన మధ్యప్రదేశ్‌లోని రేవాలోని ఆస్పత్రిలో చేర్పించారు. రక్తం విషపూరితం కావడంతో కిడ్నీలు ఫెయిలయ్యాయని, ఆదివారం రాత్రి గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ అమర్చిన కొద్ది గంటల్లోనే సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారన్నారు. వేదాంతి అంత్యక్రియలను అయోధ్యలో నిర్వహిస్తామని ఆయన శిష్యుడు చోటె దాస్ మహారాజ్ చెప్పారు. ఈ నెల 10వ తేదీన రేవాలో జరిగే ఆధాత్మిక కార్యక్రమం కోసం వేదాంతి అయోధ్య నుంచి వెళ్లారని, అక్కడే అనారోగ్యానికి గురయ్యారని అయోధ్య మేయర్ గిరీశ్‌పతి త్రిపాఠీ చెప్పారు. 1958లో రేవాలో జన్మించిన వేదాంతి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీ అయ్యారు. ఈయన అయోధ్యలోని ప్రముఖ హనుమాన్‌గఢి మహంత్ అభిరామ్ దాస్ శిష్యుడు. 1949లో బాబ్రీ మసీదులో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించింది అభిరామ్ దాసేనని ఆయన శిష్యులు చెప్పారు. వేదాంతి అయోధ్యలో వశిష్ట భవన్ పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. -
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్లో నబీన్
న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూతనంగా నియమితులైన నితిన్ నబీన్(45) సోమవారం కొత్త బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యక్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలిపి, సన్మానించారు. సంస్థాగత నిర్వహణలో నబీన్‌కు ఉన్న అనుభవం ప్రజా సేవ, దేశ నిర్మాణ ప్రయాణంలో పారీ్టకి కొత్త దిశానిర్దేశం చేస్తాయని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతల నిర్వహణలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అమిత్ షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధానలు ఆయనతో కొద్దిసేపు చర్చలు జరిపారు. అంతకుముందు, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నబీన్ సోమవారం మధ్యాహ్నం పట్నా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎం గుప్తా తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన్ను పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. కొత్త బాధ్యతలు చేపట్టిన నబీన్ బీజేపీ కురువృద్ధ నేత మురళీ మనోహర్ జోషి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లను కలుసుకుని, వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. బిహార్ అసెంబ్లీకి అయిదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబీన్ ప్రస్తుతం నితీశ్ కేబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. -
సీఐసీగా ఆర్కే గోయెల్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయెల్ మరో 8 మంది సమాచార కమిషనర్ల నియామకంతో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పూర్తి సామర్థ్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ సారథ్యంలో హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ గత వారం వీరిని ఎంపిక చేసి, రాష్ట్రపతికి సిఫారసు చేయడం తెల్సిందే. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్ కుమార్ గోయెల్ తదితరులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర కుమార్ పాల్గొన్నారు. సీఐసీ సారథ్యంలోని ఈ కమిషన్‌లో గరిష్టంగా 10 మంది సమాచార కమిషనర్లకు గాను ప్రస్తుతం ఇద్దరు కమిషనర్లు మాత్రమే పని చేస్తున్నారు. తాజా నియామకాలతో దాదాపు తొమ్మిదేళ్లకు సీఐసీ పూర్తిస్థాయిలో పనిచేయనుంది. సోమవారం కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జయ వర్మ సిన్హా, స్వాగత్ దాస్, సంజీవ్ కుమార్ జిందాల్, సురేంద్ర సింగ్ మీనా, కుష్వంత్ సింగ్ సేథి, పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, సుధారాణి రేలంగి ఉన్నారు. -
మంచు పేరిట ముంచేశారు!
మంచు అందాలను ఆస్వాదించడానికి మనాలీకి వెళ్లే పర్యాటకులకు షాకింగ్ నిజం బయటపడింది. అక్కడి గైడ్లు.. పర్యాటకుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసి, కృత్రిమ మంచుతో మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న ఒక పర్యాటకుడి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.ట్రక్కుల్లో మంచును తరలించి..ట్రక్కుల్లో మంచును తరలించి, దానిని నేలపై పోసి, పర్యాటకులతో ఆటలు ఆడిస్తుండటాన్ని ఈ వీడియో బయటపెట్టింది. అతుల్ చౌహాన్ అనే పర్యాటకుడు ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, మనాలీలో జరుగుతున్న ’స్నో స్కామ్’ను బట్టబయలు చేశారు. ‘చివరికి, మనాలీలో మంచు ఎలా కురుస్తుందో మీకు చూపిస్తాను. చూడండి.. ఈ వ్యక్తులు మంచును ట్రక్కుల్లో తీసుకువచ్చారు. ఇక్కడ కుమ్మరిస్తున్నారు. ఆ తర్వాత ఈ మంచుపై పర్యాటకులతో ఆడిస్తారు’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో సహజమైన మంచు ఏ మాత్రం లేదని, పరిసరాలు బీడు భూమిలా కనిపిస్తున్నాయని వీడియో స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు ట్రక్కుల నుంచి పారలతో కృత్రిమ మంచును దించి, నేలపై చల్లడం కనిపించింది. పర్యాటకులు కృత్రిమ మంచుపైనే స్కేటింగ్ చేస్తూ, ఆటలాడుతూ కనిపించారు.గ్లోబల్ వార్మింగ్ఈ వీడియో ఇంటర్నెట్లో కలకలం సృష్టించింది. చాలా మంది నెటిజన్లు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధిక అడవుల నిర్మూలన, అనియంత్రిత నిర్మాణాల కారణంగా.. సహజంగా మంచు కురవడం తగ్గిపోయిందని, ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావమని కొందరు వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ, ‘పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మంచు ఉంటుందని చెప్పి, స్నో సూట్ల కోసం అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. కానీ పర్యాటకులు చివరకు చూసేది చిన్న మంచు ప్యాచ్ మాత్రమే. దానికి అంత డబ్బు, శ్రమ అవసరం లేదు’.. అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ’స్నో స్కామ్’ ఘటన.. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాన్ని, మరోవైపు పర్యాటక రంగంలో జరుగుతున్న మోసాలను బట్టబయలు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హిజాబ్ పైకెత్తి.. వైద్యురాలి మొహంలోకి చూసి
పట్నా: ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలను పంపిణీ చేసిన సీఎం నితిశ్ కుమార్(75)..ఓ వైద్యురాలి హిజాబ్‌ను ఎత్తి ముఖంలోకి చూడటం వివాదాస్పదమైంది. సోమవారం రాష్ట్ర సెక్రటేరియట్ ‘సంవాద్’లో ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలను సీఎం నితీశ్ అందజేశారు. ఎత్తయిన వేదికపై ఉన్న నితీశ్.. నుస్రత్ పర్విన్ అనే వైద్యురాలు అపాయింట్మెంట్ లెటర్ తీసుకునేందుకు ముందుకు వచ్చారు. సీఎం నితీశ్ ఆమె ధరించిన హిజాబ్‌ను చేతితో పైకెత్తి ముఖంలోకి చూశారు. ముఖం చిట్లించి..ఇదేమిటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అనూహ్య చర్యతో షాకై చూస్తున్న డాక్టర్ నుస్రత్‌ను అక్కడే ఉన్న ఓ అధికారి పక్కకు లాగారు. కాగా, ఆ సమయంలో సీఎం నితీశ్ పక్కనే ఉన్న డిప్యూటీ సీం సమ్రాట్ చౌదరి వెంటనే అలెర్టయ్యారు. హిజాబ్‌ను ఎత్తి ముఖంలోకి చూస్తున్న నితీశ్ చొక్కా పట్టుకుని లాగి, వద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
లష్కరే ఉగ్రవాదులే పహల్గాం దాడి సూత్రధారులు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి ఘటనలో లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సభ్యులను సూత్రధారులుగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తొలి చార్జ్‌షీట్ సోమవారం దాఖలుచేసింది. దారుణోదంతం జరిగిన దాదాపు 8 నెలలకు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపాక బలమైన సాక్ష్యాధారాలతో సమగ్రస్థాయిలో ఎన్ఐఏ 1,597 పేజీల చార్జ్‌షీట్‌ను ప్రత్యేక న్యాయస్థానంలో సమరి్పంచింది. పాక్‌లో ఉంటున్న ఉగ్ర హ్యాండర్ హబీబుల్లాహ్ మాలిక్ అలియాస్ సాజిద్ జాట్‌ను ప్రధాన కుట్రదారుగా ఎన్ఐఏ పేర్కొంది. పహల్గాం దాడికి వ్యూహరచన, ఉగ్రవాదులను పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా భారత్‌లోకి పంపించడం, వారి రహస్య బస వంటివన్నీ జాట్ ప్లాన్ ప్రకారమే జరిగాయని చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ వెల్లడించింది. మొత్తంగా రెండు ఉగ్ర సంస్థలు, ఆరుగురు ఉగ్రవాదులను చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పేర్కొంది. పహల్గాం పరిధిలోని ప్రఖ్యాత బైసారన్ లోయలో ఏప్రిల్ 22న దాడికి పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, దాని అనుబంధ ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ఉగ్రవాదులు ఏ విధంగా వ్యూహం పన్నారు? దాడికుట్రను ఏ విధంగా అమలుపరిచారు? సూత్రధారులు ఎవరు? ఎవరెవరు దాడి చేశారు? దాడిలో పాక్ పాత్ర వంటి సమగ్ర అంశాలను అభియోగపత్రంలో ఎన్ఐఏ సవివరంగా ప్రస్తావించింది. ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అకా జిబ్రాన్, హమ్జా అఫ్గానీల పేర్లనూ చార్జ్‌షీట్‌లో చేర్చారు. ఆపరేషన్ మహదేవ్ పేరిట చేపట్టిన గాలింపు చర్యలవేళ భద్రతాబలగాలు ఈ ముగ్గురిని అంతమొందించడం తెల్సిందే. ఉగ్రవాదులకు స్థానిక బస, ఆహారం, రవాణా సదుపాయాలు కల్పిచిన పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌ల పేర్లనూ చార్జ్‌షీట్‌లో చేర్చారు. భారతీయ న్యాయసంహిత, ఆయుధాల చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)చట్టాల్లోని పలు సెక్షన్ల ప్రకారం 2 ఉగ్రసంస్థలు, పలువురు ఉగ్రవాదుల చార్జ్‌షీట్ వేశారు. ఏప్రిల్ 22నాటి అమానవీయ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. -
దేవుడిని విశ్రాంతి కూడా తీసుకోనివ్వరా..?
న్యూఢిల్లీ: ఆలయాల్లో ధనవంతులిచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి దేవుడి విశ్రాంతి వేళలోనూ ప్రత్యేక పూజలకు అనుమతించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడి విశ్రాంతికి అంతరాయం కల్గిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బృందావన్‌లోని ప్రఖ్యాత బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళలతోపాటు సంప్రదాయాల్లో తీసుకువచ్చిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం ఈ మేరకు స్పందించింది. బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేశారని, దెహ్రి పూజ వంటి పలు ముఖ్యమైన మతాచారాలను నిలిపివేశారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, తన్వి దుబేలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ‘సంప్రదాయం, వేడుకల్లో దర్శన వేళలు కూడా ఒక భాగం. భక్తుల దర్శనాల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచడం ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయం. ఆలయ వేళలను మార్చితే, లోపల జరిగే పూజలు, వేడుకల వేళలు కూడా మారుతాయి. తదనుగుణంగా దేవుడి ఉదయం మేల్కొనే వేళ, రాత్రి నిద్రించే వేళలూ మారుతాయి. ఇలా జరగరాదు. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని, పవిత్రతను తుచ తప్పక అనుసరించాలి’అని ఈ సందర్భంగా దివాన్ వాదించారు. సెపె్టంబర్లో జారీ అయిన ఆఫీసు మెమోరాండం ప్రకారం ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజా సంప్రదాయాల్లో మార్పులు తెచ్చారని ఆయన తెలిపారు. ఆలయంలో దర్శన వేళలు పూర్తయ్యాక, ఒక ప్రత్యేక ప్రదేశంలో చేపట్టే దెహ్రి పూజను సైతం రద్దీని నివారించేందుకంటూ రద్దు చేస్తూ తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కనబెట్టారని పిటిషనర్లు తెలిపారు. గురు–శిష్య పరంపరలో భాగంగా గోస్వామీలు మాత్రమే ఈ పూజా కార్యక్రమాన్ని జరపాల్సి ఉంటుందన్నారు. ఈ వాదలనపై సీజేఐ సూర్యకాంత్ మౌఖికంగా.. ‘బంకీ బిహారీ జీ ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని నామమాత్రంగా మూసివేస్తున్నారు. అయితే, ఆ వెంటనే దేవుడికి ఒక్క సెకను కాలం కూడా విశ్రాంతినివ్వకుండా, ఇతర విషయాల మాదిరిగానే దేవుడిని కూడా వాడేసుకుంటున్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపే ధనవంతుల కోసం ప్రత్యేక పూజలకు అనుమతిస్తున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సమాధానమివ్వాలని ఆలయ నిర్వహణ కమిటీతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ఆలయంలో వేడుకలు, పూజలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ 1939 నాటి నిబంధనల ప్రకారం జరుగుతోంది. అయితే, 2025లో తీసుకువచ్చిన ఉత్తరప్రదేశ్ శ్రీ బంకీ బిహారీ జీ ఆలయ ట్రస్ట్ ఆర్డినెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం మత సంస్థల్లో జోక్యం చేసుకునేందుకు అవకాశ మేర్పడింది. తద్వారా అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగుతోందన్న వాదనలు ఉన్నాయి. దీనిపై ఈ ఏడాది ఆగస్ట్‌లో దాఖలైన పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టుకే విడిచిపెట్టింది. అదే సమయంలో, హైకోర్టు స్పష్టత ఇచ్చే వరకు ఆర్డినెన్స్‌పై స్టే విధించింది. ఆలయ రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ సారథ్యంలో కమిటీని నియమించింది. -
ఏపీలో కమీషన్ల కోసమే ప్రైవేటు అప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభలో సోమవారం అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వ తీరును, కేంద్రం చూసీచూడనట్లు వ్యవహరించడాన్ని ఎండగట్టారు. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ముందుకొస్తున్నా.. కమీషన్ల కక్కుర్తితో అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తెస్తున్నారని చెప్పారు.ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా తెచ్చే ఈ అప్పులకు ఏకంగా రాష్ట్ర ఖజానా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచే నేరుగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. గతంలో అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) 13.5 శాతంగా ఉంటే, ప్రస్తుతం అది దేశంలోనే అత్యధికంగా 22 శాతానికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.రూ.150 కోట్ల కమీషన్: ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్ల పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు (9.3 శాతం) నిధులు సమీకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులు 6 శాతానికే రుణాలు ఇస్తుంటే.. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఎందుకు అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 1.5 శాతం బ్రోకరేజ్ కమీషన్ కోసమే ఈ దందా నడుస్తోందని, దాదాపు రూ.150 కోట్ల ప్రజాధనాన్ని కమీషన్ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.అంతేగాక ప్రైవేటు వ్యక్తుల నుంచి తెచ్చే అప్పులకు గ్యారెంటీగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌ను చూపించడం, ప్రభుత్వ అనుమతి లేకుండానే అందులోంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడం దుర్మార్గమని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల అప్పులను కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని లేఖలు రాసిన కేంద్ర ఆర్థికశాఖ.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.ఇప్పుడు నిబంధనలు మారాయా? లేక కూటమి ప్రభుత్వానికి ఒక న్యాయం, మాకో న్యాయమా?.. అని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు గత ఏడు నెలలుగా డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సొంత రాష్ట్రం, సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఉందంటే సిగ్గుచేటని విమర్శించారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వమే నడపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేయడాన్ని మిథున్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. -
బ్యాలెట్ పేపర్లతోనే ప్రజాస్వామ్యం పదిలం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టెక్నాలజీ పేరుతో వస్తున్న ఈవీఎంల కంటే నమ్మకమైన బ్యాలెట్ పేపర్ విధానాన్నే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో సోమవారం ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.2024లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలను ఎండగడుతూ, ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఎన్నికల సంఘం 2024 మే 25న విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పోలైన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్ తర్వాత ఫాం–20లో చూపించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను ఈ తేడాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఈ తప్పులకు బాధ్యులెవరని ప్రశ్నించారు. బాధ్యులపై ఈసీ ఏం చర్యలు తీసుకుందని నిలదీశారు. అసెంబ్లీకి, లోక్‌సభకు ఓట్లలో తేడా ఎలా? ‘ఒకేసారి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో.. ఒకే ఓటరు జాబితా, ఒకే పోలింగ్ బూత్ ఉన్నప్పుడు ఫాం–17ఏ (ఓటరు రిజిస్టర్), ఫాం–17సీ (ఓట్ల లెక్క) మధ్య తేడాలు ఎలా వస్తాయి? రాజమహేంద్రవరం, రాయచోటి, యలమంచిలి, కడప, పులివెందుల వంటి అనేక నియోజకవర్గాల్లో ఈ వ్యత్యాసాలు వెలుగుచూశాయి. ఇది కచ్చితంగా ఓట్ల డేటాలో మాయాజాలం లేదా అవకతవకలే. ఎంత ఆధునికమైనా ఈవీఎంలను పూర్తిగా నమ్మలేం. అదే బ్యాలెట్ పేపర్ అయితే పాత పద్ధతే అయినా ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. ఆడిట్ చేయడానికి వీలులేని ఏ వ్యవస్థా విశ్వసనీయం కాదు.అందుకే రాబోయే అన్ని ఎన్నికల్లోను ఈవీఎంలను రద్దుచేసి, బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల పారదర్శకత కోసం వైఎస్సార్సీపీ తరఫున ఆయన కేంద్రానికి, ఈసీకి పలు సూచనలు చేశారు. ‘పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజీ, ఫాం–17ఏ, 17సీ వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంల వెరిఫికేషన్‌ను కచ్చితంగా అమలు చేయాలి. వందశాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉండాలి..’ అని సూచించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 40 శాతం ఓటింగ్ షేర్ వచ్చిందని చెప్పారు. కానీ జరిగిన అవకతవకలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
డెడ్ ఎకానమీయా?
న్యూఢిల్లీ: భారత్ డెడ్ ఎకానమీ అయితే గ్లోబల్ ఏజెన్సీలు అంతంత గొప్ప రేటింగులు ఎలా ఇస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలను ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను డెడ్ ఎకానమీగా పేర్కొనడంపై కేంద్రం వివరణ ఇచ్చి తీరాలని విపక్షాలు సోమవారం లోక్‌సభలో పట్టుబట్టాయి. దాంతో నిర్మల మాట్లాడారు. విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 8.2 శాతం వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ గతంలో బయటి సాయంపై ఆధారపడేది. అలాంటిది గత పదేళ్లలో బయటి దేశాలకు ఆదర్శంగా మారేలా ఎదిగింది. డెడ్ ఎకానమీ అన్నదే నిజమైతే డీబీఆర్ఎస్, ఎస్ అండ్ పీ, సర్ అండ్ ఐ వంటి ప్రముఖ సంస్థలు మన క్రెడిట్ రేటింగ్‌ను పెంచుతాయా? ఎవరో ఏదో అంటే మనం పట్టించుకోవాలా? ఆరోపణలు చేసేది ఎంత పెద్దవారైనా సరే, గణాంకాలు ఏం చెబుతున్నాయన్నదే చూడాలి. వాటి ఆధారంగానే మాట్లాడాలి’’ అంటూ విపక్షాలకు మంత్రి నిర్మల హితవు పలికారు.రూ. 41 వేల కోట్ల వ్యయానికి లోక్ సభ ఆమోదంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు కీలక శాఖలకు సంబంధించి రూ.41,455 కోట్ల మేరకు అదనపు వ్యయానికి లోక్‌సభ అనుమతి మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్లను సోమవారం ఆమోదించింది. దీన్ని బడ్జెట్ రూపకల్పనలో అసమర్థతగా విపక్ష ఎంపీలు చేసిన విమర్శలను మంత్రి నిర్మల తిప్పికొట్టారు. బాధ్యతాయుత ప్రభుత్వానికి ఇలాంటి సప్లిమెంటరీ డిమాండ్లు చాలా అవసరమన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని చెప్పారు. -
వరకట్న వ్యతిరేక చట్టాలకు కోరల్లేవు
న్యూఢిల్లీ: వరకట్న భూతాన్ని సమూలంగా రూపుమాపడం తక్షణావసరం అని అత్యున్నత న్యాయస్థానం సోమవారం అభిప్రాయపడింది. అయితే వరకట్న వ్యతిరేక చట్టాలు ఆచరణలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. పైగా తరచూ వాటి దుర్వినియోగం జరుగుతుండటం మరో ఆందోళనకర పరిణామం. దాంతో మన దేశంలో వరకట్న దురాచారం ఇప్పటికీ నిర్ని రోధంగా కొనసాగుతూనే ఉందని న్యాయ మూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఆవేదన వెలిబు చ్చింది. 24 ఏళ్లనాటి వరకట్న హత్య కేసులో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వారికి జీవిత ఖైదు విధించడమే సరైనదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘కేవలం కలర్ టీవీ, మోటార్ సైకిల్, రూ.25 వేలు ఇవ్వలేదని నవ వధువును కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. అయితే నిందితుల్లో మహిళకు ఇప్పుడు 94 ఏళ్లు గనుక ఆమెకు తీర్పు అమలు కాబోదు. రెండో వ్యక్తి మాత్రం 4 వారాల్లో లొంగిపోవాలి‘ అని ఆదేశించింది. వరకట్న దురాచారం విషయమై కేంద్ర రాష్ట్రాలకు, దిగువ కోర్టులకు ఈ సందర్భంగా పలు నిర్దేశాలు చేసింది. పెండింగ్ లో ఉన్న వరకట్న హత్యలు (సెక్షన్ 304–బి), భర్త, అత్తింటివారి హింస (398–ఏ) కేసులపై హైకోర్టులు మరింతగా దృష్టి పెట్టాలి. వరకట్నం సాంఘిక దురాచారమని మన భావితరాలకు తెలియాలి. ఆ మేరకు బాలల్లో అవగాహన కలిగేలా విద్యా ప్రణాళికల్లో కేంద్రం, రాష్ట్రాలు అవసరమైన మార్పులు చేయాలి. చట్టం పేర్కొన్న మేరకు వరకట్న నిషేధ అధికారులను రాష్ట్రాలన్నీ తక్షణం నియమించాలి. వారికి అవసరమైన అన్ని అధికారాలు, సాధన సంపత్తి కట్టబెట్టాలి. వారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబరు, మెయిల్ ఐడీలను అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలి. వరకట్న కేసులను విచారించే పోలీసు, న్యాయాధికారులకు ఇందుకు సంబంధించిందిన అంశాలపై తరచూ శిక్షణ ఇవ్వాలి‘ అని సూచించింది. -
మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం అక్రమ కేసులో బెయిల్‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాజీ ఐఏఎస్ కె.ధనంజయ రెడ్డి, పెల్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్లు సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు... పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి. ఆర్యమ సుందరం, నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపిస్తూ, కౌంటర్ అఫిడవిట్లకు సంబంధించి శనివారం రెండు రిజాయిండర్లు దాఖలు చేశామని, మరొకటి సోమవారం దాఖలు చేస్తున్నామని వివరించారు. ఇరుపక్షాల కౌంటర్లు, రిజాయిండర్లు, వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.కాగా ఈ కేసులో ట్రయల్ కోర్టు తదుపరి చర్యలకు తమ మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాదని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. నేపథ్యం ఇదీ... తప్పుల తడక చార్జ్‌షిట్ నేపథ్యంలో ముగ్గురు నిందితులకు గతంలో ట్రయల్ కోర్టు ‘డిఫాల్ట్ బెయిల్’ మంజూరు చేసింది. అయితే, దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు వారి డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేసింది. నవంబర్ 26లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లకు అనుకూలంగా నవంబర్ 26న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
‘ఉపాధి’ భారం రాష్ట్రాలపైనా!
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) చట్టం ఇక కనుమరుగు కానుంది. దాని స్థానంలో వికసిత భారత్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్ (వీబీజీ ఆర్‌ఏఏఎం–జీ) పేరిట కోటా చట్టాన్ని మోదీ సర్కారు తేనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఇది గ్రామీణులకు ఏటా కనీసం 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తుందని బిల్లు ప్రతిలో పేర్కొన్నారు. ఇది చట్టంగా అమల్లోకి వచ్చిన ఆర్నెల్ల లోపు అందులోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా కొత్త పథకాన్ని అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకం కాగా కొత్త చట్ట భారాన్ని మాత్రం రాష్ట్రాలు కూడా మోయాల్సి ఉంటుంది. దాన్ని ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 10 శాతంగా, ఇతర రాష్ట్రాలకు 40 శాతంగా నిర్ణయించారు. అసెంబ్లీలు లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో పథక వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి గా భరిస్తుంది. అంతేకాకు మరో మెలిక కూడా పెట్టారు. కొత్త పథకం కింద ప్రతి రాష్ట్రానికీ ఆర్థిక సంవత్సరం మొత్తానికీ నిర్దిష్ట మొత్తంలో నిధులు కేటాయించి అంతటితో సరిపెడతారు. వ్యయం అంతకు మించితే సంబంధిత రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. నాలుగింటిపై దృష్టి కొత్త ఉపాధి హామీ పథకం ప్రధానంగా 4 రకాల పనులపై దృష్టి సారించనుంది. జలభద్రత ( నీటి సంరక్షణ, సాగునీరు, నీటి వనరుల పునరుజ్జీవం, అడవుల పెంపకం వంటివి), మౌలిక గ్రామీణ వసతులు (రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల వంటివాటి నిర్మాణం, మెరుగుదల), జీవనాధార సంబంధిత వసతులు, వాతావరణానికి అనుగుణంగా సర్దుబాట్లు. ‘ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 20 ఏళ్లుగా గ్రామీణులకు ఉపాధి భద్రత బాధ్యతను నెరవేరుస్తూ వచ్చింది. అయితే గ్రామాల్లో మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరింత బలోపేతం చేయాల్సిన సమయం వచ్చింది‘ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.గాంధీ పేరెందుకు తీసేశారు? కేంద్రానికి విపక్షాల ప్రశ్నా్రస్తాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పేరు మార్పు ప్రతిపాదనపై విపక్షాలు సోమవారం మండిపడ్డాయి. పథకం నుంచి గాంధీ పేరు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ను ఎలాగైనా టాప్ మోదీ ప్రధాని అయిన నాటినుంచి చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సప్తగిరి ఉలక ఆరోపించారు. గాంధీ పేరు తొలగించి అధికార బీజేపీ ఏం సాధిస్తోందని కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ పార్లమెంటు ఆవరణలో మీడియాముఖంగా ప్రశ్నించారు. దీన్ని గాం«దీకి అవమానంగా రుణం కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ అభివరి్ణంచారు. పేరు మార్పు ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్నే దుంపనాశనం చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి దుయ్యబట్టారు. -
వారానికి 4 రోజులే పని?
వారానికి పని దినాలు ఎన్ని? ఇదేం ప్రశ్న అంటారా? మన దగ్గరైతే మెజారిటీ కంపెనీలు, సంస్థల్లో ఆరు పనిదినాలు. విదేశాల్లోనైతే ప్రభుత్వంలోనైనా, ప్రైవేటులోనైనా ఐదుకు మించవు. మన దగ్గర కూడా ఐటీ వంటి రంగాల్లో ఎన్నో ఏళ్లుగా వారానికి ఐదు రోజుల పని సంస్కృతి అమల్లో ఉంది. కాకపోతే ఆరేడు రోజులకు మించిన పని ఆ ఐదు రోజుల్లోనే చేయిస్తారని ఈ ఐటీ జీవులు వాపోతూ ఉంటారన్నది వేరే సంగతి. అయితే, వారానికి నాలుగే పని దినాలుంటే? ఆ ఆలోచనే చాలా బాగుంది కదా! విదేశాల్లో సాధ్యమేమో గానీ మన దగ్గర ఎక్కడ కుదురుతుంది లెమ్మని అనిపిస్తోందా? కానీ ఇది అచ్చంగా భారత్ గురించే! కొత్త కార్మిక చట్టాలు వారానికి నాలుగు రోజుల పనికి నిజంగానే వీలు కల్పిస్తున్నాయి. ఇక కంపెనీలు నిర్ణయం తీసుకోవడం తరువాయి, ఉద్యోగులు వారంలో నాలుగే రోజులు పని చేసి, మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులు ఆస్వాదించవచ్చు...!పాతకాలం నాటి 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం గత నవంబర్ 21న రద్దు చేసింది. వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి తేవడం తెలిసిందే. వాటిలో భాగంగా వారానికి నాలుగు పని దినాలకు కూడా అనుమతిస్తోంది. కొందరు ఉద్యోగులతో పాటు కొన్ని సంస్థలు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. వారం మొత్తానికి సంబంధించిన పని గంటలను సర్దుబాటు చేసుకునే వెలుసుబాటు సంస్థలు, కంపెనీలకు ఇస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు కూడా పెట్టింది. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తించనున్నాయి! రోజుకు 12 గంటల పని...!వారంలో పని దినాల సంఖ్య తగ్గినా మొత్తం పనిగంటల సంఖ్య మాత్రం తగ్గబోదు. ఉద్యోగులు వారం మొత్తమ్మీద కనీసం 48 గంటలు పని చేయాల్సిందే. అంటే వారంలో 4 రోజులే పనిచేసేలా ఉంటే రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ‘కొత్త కార్మిక చట్టాలు ఇందుకు అనుమతిస్తాయి. అయితే వారంలో పని గంటల సంఖ్య 48కి మించేందుకు వీల్లేదు. మించితే ఆ అదనపు గంటలకు గాను ఉద్యోగులకు కంపెనీలు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది‘ అని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఆ 12 గంటలు కూడా ఉద్యోగులు నిరంతరాయంగా పని చేయాల్సిన అవసరం లేదు. భోజన విరామం, షిఫ్టులు మారే నడుమ విరామం వంటివి ఆ 12 గంటల్లో కలిపే ఉంటాయి. వీటన్నింటికీ కంపెనీలు, కొన్నిసార్లు సిబ్బంది ఎంతవరకు ఒప్పుకోవచ్చన్నది ప్రశ్న. అందుకే, ‘వారానికి నాలుగు రోజుల పని కేవలం ఐచ్ఛికమే. కంపెనీ, సిబ్బంది పరస్పర అంగీకారంతో ఆ మేరకు పని చేసుకోవచ్చు. కంపెనీ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు తదితరాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి‘ అని కార్మిక శాఖ పేర్కొంది. 24 గంటలూ నిరంతరాయంగా పని చేయాల్సిన రంగాలు, విభాగాలకు ఈ నాలుగు రోజుల పని పనికొచ్చే వ్యవహారం కాదన్నది కార్మిక రంగ నిపుణుల అభిప్రాయం. దీనిపై కంపెనీలు, ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుందన్నది తెలిసేందుకు కొద్ది రోజులు పట్టవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ద్వైపాక్షికం ద్విగుణీకృతం
అమ్మాన్: జోర్డాన్‌తో భారత ద్వైపాక్షిక బంధం ద్విగుణీకృతం కాబోతోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జోర్డాన్‌కు విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడి అత్యంత విలాసవంత రాజ ప్రాసాదం హుస్సేనియా ప్యాలెస్‌లో జోర్డాన్ రాజు అబ్దుల్లాహ్–2 ఇబిన్ అల్ హుస్సేన్‌తో భేటీ అయ్యారు. 37 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్‌లో పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం పర్యటించడం ఇదే తొలిసారికావడం విశేషం. ఇరుదేశాల ప్రతినిధుల స్థాయి సమావేశానికి ముందే ఇరుదేశాల అగ్రనేతలు ఇలా స్వయంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. పరస్పరం ప్రయోజనం చేకూర్చే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా మోదీ, రాజు అబ్దుల్లాలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపారు. ‘‘భారత్–జోర్డాన్ బంధం మరింత పటిష్టమవుతోందని రాజు అబ్దుల్లాహ్ బలంగా విశ్వసిస్తున్నారు. ఇరుదేశాల సత్సంబంధాల పునాదులు మరింత గట్టిపడుతున్నాయి. వాణిజ్యం, ఎరువులు, డిజిటల్ సాంకేతికత, మౌలిక వసతుల కల్పన అంశాలతోపాటు ఇరుదేశాల ప్రజల మధ్య సాంస్కృతిక బంధాల బలోపేతం కోసం పరస్పర సహకారాన్ని ఇకమీదటా కొనసాగిస్తాం. ఉగ్రవాదం విషయంలో ఇరుదేశాల ఉమ్మడి పోరు సల్పుతాం. గాజా అంశంలోనూ క్రియాశీలక, సానుకూల పాత్ర పోషిస్తాం. పశ్చిమాసియాలో శాంతికపోతాలు ఎగిరేందుకు శతథా కృషిచేస్తాం. ఉగ్రవాదం విషయంలో ఇరుదేశాల వైఖరి ఒక్కటే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ మీ నాయకత్వంలో జోర్డాన్ అనేది ఉగ్రవాదం, అతివాదం, వేర్పాటువాదాల విషయంలో ప్రపంచానికి గట్టి సందేశం ఇస్తోంది. నన్ను, భారత ప్రతినిధులకు సాదర స్వాగతం పలికిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రాజు అబ్దుల్లాహ్‌ను మోదీ కొనియాడారు. సత్సంబంధం సమున్నత శిఖరాలకు..‘‘ ఇండియా–జోర్డాన్ బంధాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లేలా మీరెంతో సానుకూల దృక్పథాన్ని అవలంభిస్తున్నారు. భారత్ విషయంలో మీ స్నేహపూర్వక వైఖరి, అంకిత భావానికి ధన్యవాదాలు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధం ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. మేలిమలుపు లాంటి ఈ సందర్భంలో కొంగొత్త ఉత్సాహంతో ఇరుదేశాల బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం’’ అని రాజుతో మోదీ అన్నారు. ఈ సందర్భంగా 2018లో ఇస్లామిక్ వారసత్వ సదస్సు కోసం అబ్దుల్లాహ్ భారత పర్యటన నాటి విశేషాలను మోదీ గుర్తుచేసుకున్నారు. ‘‘ ప్రాంతీయ శాంతి కోసం మాత్రమేకాదు ప్రపంచశాంతి కోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. 2015లో ఐక్యరాజ్యసమితిలో సమావేశాల వేళ తొలిసారిగా మీతో భేటీ అయ్యా. ఉగ్రవాదభూతాం పెను విలయాలను మానవాళి ఎంతగా ఇబ్బందులు పడుతుందో మీరెంతో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు’’ అని మోదీ పొగిడారు. పర్యటనలో భాగంగా మోదీ ప్రాచీనభారత్లో వ్యాపారంచేసిన పెట్రా ప్రాంతంలో యువరాజుతో కలిసి పర్యటించనున్నారు.భారతీయుల ఘన స్వాగతంఅంతకుముందు సోమవారం మోదీ జోర్డాన్‌లోని అమ్మాన్ నగరంలోని విమానాశ్రయానికి చేరుకోగానే జోర్డాన్ ప్రధానమంత్రి జఫర్ హసన్ సాదరంగా ఆహ్వానించారు. తర్వాత హోటల్‌కు చేరుకోగానే అక్కడి ప్రవాస భారతీయులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. భారతీయ అనుకూల జోర్డాన్ పౌరులు సైతం ప్రధానికి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. జోర్డాన్స్థానికులు భారతీయ నాట్యంచేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపే కళారూపాలను ప్రదర్శించారు. -
శబరిమలలో కొనసాగుతున్న భక్తుల తాకిడి
కేరళ పంబ తీర్థం స్వామియే శరణం అయ్యప్ప ప్రతిధ్వనులతో మారుమోగిపోతుంది. ఏ వైపు చూసినా అయ్యప్పస్వాములే దర్శనమిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటికే అధిక మెుత్తంలో స్వాములు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. ఇప్పటివరకూ అయ్యప్పస్వామిని 25 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.శబరిమలలో అయ్యప్పస్వాముల రద్దీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అయ్యప్పభక్తులు పెద్దఎత్తున పంబ సన్నిధానానికి చేరుకుంటున్నారు. అయ్యప్పస్వామికి ఇరుముడి సమర్పించి తమ మెుక్కులు పూర్తి చేసుకుంటున్నారు. ప్రారంభంలో స్వామివారి దర్శనానికి కొన్ని ఇబ్బందులు తలెత్తినా ప్రస్తుతం ఏర్పాట్లు మెరుగైనట్లు కేరళ పోలీసులు తెలిపారు. గత ఏడాది ఈ సమయం వరకూ దాదాపు 21 లక్షల మంది స్వామివారి దర్శనం చేసుకోగా ప్రస్తుతం ఆసంఖ్య 25 లక్షలు దాటిందన్నారు.మండల పూజకోసం అయ్యప్పస్వామి (అభరణాల ఊరేగింపు) "తంగ అంకి" రథోస్థవం డిసెంబర్ 23 ప్రారంభమవుతున్నట్లు అధికారులు తెలిపారు.ఉదయం 7గంటలకు అరణ్ముల పార్థసారధి ఆలయం నుంచి బయిలుదేరి 26న అయ్యప్ప సన్నిధానం చేరుకుటుందని తెలిపారు. 27వ తేదీన అభరణాల అలంకారం అనంతరం స్వామివారికి మండల పూజ జరుగుతుందని దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.అయ్యప్ప స్వాములందరూ వారికి కేటాయించిన సమయాలలో స్వామివారి దర్శనానికి రావాలని పోలీసులు సూచించారు. అలా చేయడం ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చని కేరళ పోలీసులు తెలిపారు. -
ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీల నిరసన
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరసన బాట పట్టారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 15వ తేదీ) పార్లమంట్ సమావేశాల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీలు.. అనంతరం ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మకరద్వారం వద్ద ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. ఎంపీలు సుబ్బారెడ్డి ,మిథున్ రెడ్డి, గురుమూర్తి, అవినాష్ రెడ్డి, తనుజ రాణి, అయోధ్య రామిరెడ్డిలు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసాం. రాష్ట్రంలో కోట్లాది సంతకాలు సేకరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలు చేస్తాం. ప్రైవేటీకరణ వెనక్కి తీసుకేనేంతవరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. ప్రమాదకరస్థాయిలో ఏపీ అప్పులు..ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. 18 నెలల్లోనే రూ 2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. అధిక వడ్డీకి అప్పులు తెచ్చి కుంభకోణానికి పాల్పడుతున్నారు. 9 శాతానికి వడ్డీ తెచ్చి ప్రజలపై భారం వేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి అప్పులు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిధి నుంచి డబ్బులు డ్రా చేసే అవకాఃశం ప్రైవేటు వ్యక్తులకు కల్పించడం దారుణమన్నారు. ప్రభుత్వం చేతుల్లోనే వైద్య రంగం ఉండాలని, ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు చేసిన ఏపీ ప్రభుత్వం.. వైద్య కళాశాలను కాపాడలేదా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.ఇవీ చదవండి:కోటి సంతకాలు.. కోట్ల గళాలువిజయవాడకు వైఎస్ జగన్ఇది కదా ప్రజా ఉద్యమం అంటే.. -
ఐసిస్‌తో సంబంధాలు.. ఉగ్రవాదుల అరెస్ట్
ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాజన్, మనీష్ బేడీ అనే ఇద్దరు టెర్రరిస్టులు పాకిస్థాన్‌లోని ఐసిస్ ఉగ్రసంస్థ ఆదేశాల మేరకు భారత్‌లో ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వీరంతా ఆర్మేనియా నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గత నెలలో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) NIA అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీగా సోదాలు నిర్వహిస్తుంది. అధికారులు ఇదివరకే పలువురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎర్రకోట వద్ద జరిగిన బాంబుపేలుళ్లలో 15 మంది మృతిచెందగా అనేక మంది గాయపడ్డారు. కాగా ఈ ఘటనతో సంబంధమున్న నిందితులను దర్యాప్తు బృందాలు ఇది వరకే అరెస్టు చేశాయి. -
‘42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలి’
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కోర్టు గడువు వల్ల పంచాయతీ ఎన్నికలకు వెళ్లాం. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం పోరాడుతున్నాం’ అని తెలిపారు. ఈ మేరకు సోమవారం(డిసెంబర్ 15వ తేదీ) ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్లు 42%కు పెంపు చట్టానికి ఆమోదం కోరుతూ ఆందోళన చేపట్టింది జేఏసీ. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేసింది. సామాజిక రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ ధర్నాలో మహేష్‌గౌడ్‌తో పాటు వి. హనుమంతరావు, విల్సన్ ఎంపీ (డిఎంకే), కే. నారాయణ (సిపిఐ), వి. శ్రీనివాస్ గౌడ్, వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, మల్లు రవి ఎంపీ, అనిల్ కుమార్ యాదవ్‌లు హాజరయ్యారు. -
భారత ఆయుధ చట్టం ఏం చెబుతోంది?
సామూహిక కాల్పుల ఘటనలప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చే అంశం.. అక్కడి గన్ కల్చర్.. సులువైన ఆయుధ చట్టాలు అందుకు కారణమయ్యే పరిస్థితులు. అయితే.. ఇలాంటి దాడులప్పుడు ఆయుధ చట్టాలను కఠినతరం చేయడం పరిపాటిగా మారింది. బాండీ బీచ్ కాల్పుల ఘటన (Bondi Beach Shooting) నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. మరి భారత్‌లో పరిస్థితి ఏంటి?భారత పౌరుడు గన్ లైసెన్స్‌ను ఆయుధ చట్టం(1959) ప్రకారం మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఎన్పీబీ తుపాకులను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉండగా.. ప్రాణాలకు ముప్పు ఉంటేనే తుపాకీ కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తారు. ఆత్మ రక్షణకు తప్ప మరే సందర్భాల్లోనూ వీటిని వినియోగించకూడదు. లైసెన్స్ పొందాలనుకునే వ్యక్తి కచ్చితంగా ఎఫ్ఐఆర్ సమర్పించాల్సిందే. తుపాకీ కావాలనుకుంటే కలెక్టరేట్లో, ఎస్పీకి మొదటగా అర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడిపై గతంలో కేసులున్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టి వివరాలు సేకరించిన తర్వాతే లైసెన్స్ మంజూరు చేశారు.వ్యక్తిగత రక్షణ, వ్యవసాయ అవసరాలు(జంతువుల నుండి రక్షణ)కు మాత్రమే లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ లేకుండా ఆయుధం కలిగి ఉంటే జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఆయుధాల చట్టం ఉల్లంఘనకు 3-7 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. ఆయుధాల చట్టం-1959 ప్రకారం ఆయుధాల కలిగి ఉండటం, తయారీ, అమ్మకం, దిగుమతి, ఎగుమతి, రవాణా చేయడం నేరం.ఆయుధాల నియమాలు 1962ను రద్దు చేసిన కేంద్రం.. 2016లో కేంద్రం కొత్త ఆయుధాల నియమాలను జారీ చేసింది. కొత్త నిబంధనలు ప్రకారం.. ఆయుధాల లైసెన్స్ కోరుకునే వారు ఏదైనా రైఫిల్ క్లబ్లో సభ్యత్వం పొంది గన్ వినియోగం, నిర్వహణపై శిక్షణ పొందాల్సి ఉంటుంది. 18 ఏళ్ల లోపు వారికి ఆయుధ లైసెన్స్ ఇవ్వకూడదు. క్రిమినల్ రికార్డు ఉన్నవారు లైసెన్స్ పొందలేరు. లైసెన్స్ ప్రతి 3 సంవత్సరాలకు రీన్యూ చేయాలి. ఆయుధాన్ని ప్రదర్శన కోసం, భయపెట్టడానికి ఉపయోగించడం చట్ట విరుద్ధం.నిషేధిత ఆయుధాలు: మిలిటరీలో ఉపయోగించే ఆటోమేటిక్ ఆయుధాలు (AK-47, LMGలు) ఉపయోగించకూడదుప్రొహిబిటెడ్ అమ్యూనిషన్ (ఉదా: హై-ఎక్స్‌ప్లోసివ్ బుల్లెట్లు)వీటిని పౌరులు కలిగి ఉండటం పూర్తిగా నిషేధంఅనుమతించబడిన ఆయుధాలు (వీటికి లైసెన్స్ తప్పనిసరి)నాన్-ప్రొహిబిటెడ్ బోర్ (NPB) ఆయుధాలు (రివాల్వర్లు, పిస్టల్స్, షాట్‌గన్స్, స్పోర్ట్స్ రైఫిల్స్)కాగా, ఆస్త్రేలియాలో సామాన్య జనంపై కాల్పులు ఘటనలు చాలా అరుదే. 1996లో పోర్ట్ అర్థర్ టౌన్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆయుధ చట్టాలను కఠినతరం చేసింది. ఆయుధ లైసెన్స్‌లు సులభంగా దక్కకుండా చర్యలు చేపట్టింది. ఆ తర్వాత 2014లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు, 2018లో ఏడుగురు మృతిచెందారు.ఆయా ఘటనల్లో సాయుధులు తమ కుటుంబ సభ్యులపైనే కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019లో ఉత్తర ఆస్ట్రేలియాలోని డార్విన్ సిటీలో జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచ్చిన ఖైదీ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 2022లో క్వీన్స్లాండ్ స్టేట్‌లో ఓ తీవ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. ఆ్రస్టేలియాలో భారీ ఎత్తున కాల్పులు జరగడం, పది మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. -
లోక్‌సభలో వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకల సమావేశాల్లో భాగంగా ఈరోజు(సోమవారం, డిసంబర్ 15వ తేదీ) లోక్‌సభలో కేంద్రం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, మరొకటి ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు. ఈ రెండు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) పంపే అవకాశం ఉంది. వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు అంటే..ఉన్నత విద్య నియంత్రణను పూర్తిగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది.యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ వంటి సంస్థలను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే గొడుగు కింద వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ (VBSA) అనే కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.12 మంది సభ్యులతో కూడిన వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ అనే అత్యున్నత కమిషన్ ఏర్పాటుచేసి, ఉన్నత విద్యా విధానాలు, ప్రమాణాలు, నాణ్యత నియంత్రణను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా కేంద్రానకి అధిక అధికారాలుంటాయి. దీని ఫలితంగా ఉన్నత విద్య నియమ నిబంధనలు అనేవి కేంద్రం నియంత్రణలోకి వస్తాయి. ముందుగా ప్రతిపాదించిన భారత ఉన్నత విద్యా కమిషన్( Higher Education Commission of India బిల్లును ఇప్పుడు వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లుగా మార్చారు.ప్రయోజనాలుసమగ్ర నియంత్రణగా అమలు చేయడానికి వీలవుతుంది. అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒకే విధమైన ప్రమాణాలు.విభిన్న సంస్థల మధ్య గందరగోళం తగ్గుతుంది.ఒకే కమిషన్ ద్వారా విద్యా ప్రమాణాలు కఠినంగా అమలు చేయవచ్చు.ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లుపాత చట్టాలను రద్దు చేయడం లేదా వాటిలో మార్పులు చేయడం కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లు. ఇది కొత్త చట్టాలను తీసుకురావడానికి లేదా పాత చట్టాల్లోని అనవసరమైన, పాతబడ్డ నిబంధనలను తొలగించడానికి ఉపయోగిస్తారుఇప్పటికే ఉన్న చట్టాల్లో మార్పులు చేయడం. ఉదాహరణకు, ఒక చట్టంలోని సెక్షన్లో పదాలను మార్చడం, కొత్త నిబంధనలను చేర్చడం, లేదా పాత నిబంధనలను సవరించడం జరుగుతంది. దీని ద్వారా చట్ట వ్యవస్థను సులభతరం చేయడం జరుగుతుంది. రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చమరొకవైపు రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరుగుతుంది. ఈ చర్చల్లో వైఎస్సార్సీపీ తరుఫున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో అనేక తేడాలున్నాయన్నారు. సీసీటీవీ ఫుటేజ అందుబాటులో ఉంచాలన్నారు. ఈవీఎంలను నమ్మలేని పరిస్థితి వచ్చిందని, పేపర్ బ్యాలెట్‌పై అందరికీ నమ్మకం ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి. -
ఉగ్రవాదమా.. నీ మతమేంటి?
అలజడులు సృష్టించడం.. పదుగురు అటెన్షన్ రాబట్టుకోవడం.. మనుషుల ప్రాణాలను ఏమాత్రం ఆదలెక్కలేకుండా ఎడాపెడా తీసేయడం.. ఇవే కదా ఉగ్రవాద లక్షణాలు.. లక్ష్యాలు. మరి ఈ ఉగ్రవాదం ఏదో ఒక మతానికి పరిమితం చేయడం ఎంతవరకు సబబు? క్రూరత్వానికి మతమేముంటుంది? విద్వేషానికి, కుట్రలకు, కుతంత్రాలకు మతమంటూ ఉంటుందా? తాజాగా ఆస్ట్రేలియా దేశం సిడ్నీలోని ఓ బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే వీరిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారు కావడంతో విమర్శలు మరింత ఘాటుగా.. నాటుగా ఉంటున్నాయి.బాండీ బీచ్ లో ఆదివారం తుపాకులు గర్జించడంతో ఆస్ట్రేలియా సిడ్నీ ఉలిక్కిపడ్డాయి. బాండీ బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చిన సందర్శకులకు ఆక్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులు చేతపట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాండీ బీచ్ లో సంప్రదాయంగా జరుగుతున్న హనుక వేడుకల్లో పాల్గొన్న జుయిష్ కమ్యూనిటీ ప్రజల్లో ఏమయ్యిందో తెలుసుకునేలోగా 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 29 మందికి గాయాలయ్యాయి. ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న వేడుక.. రక్తసిక్త రణరంగంగా మారిపోయింది. ఈ ఉగ్రదాడుల్లో తండ్రి కుమారుడు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చిన వారు...ముస్లిం మతస్తులు కావడంతో...ఆ మతం పై సహజంగానే కొందరు విరుచుకు పడుతున్నారు.అయితే ఇంత ఘోర ఉగ్రచర్యల్ని అడ్డుకుంది కూడా ఓ ముసల్మానే అని మనం గుర్తుంచుకోవాలి. అతనో పండ్ల వ్యాపారి. ఉగ్రవాదులైన తండ్రీ కొడుకులిద్దరూ తుపాకులు పట్టుకుని విచక్షణ రహితంగా కాలుస్తుంటే.. పండ్లవ్యాపారి అహ్మద్ అత్యంత ధైర్యసాహసాలను, మానవత్వాన్ని ప్రదర్శించాడు. వెనకనుంచి వచ్చి వారిలో ఒకరికి వారి గన్ తీసుకుని గురిపెట్టి తరిమేయసాగాడు. కానీ మరో ఉగ్రవాది అతడిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో అహ్మద్ రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అహ్మద్ చొరవ ప్రదర్శించకుండా ఉంటే మరికొందరు కచ్చితంగా ప్రాణాలు కోల్పోయేవారే.కాల్పుల ఘటన సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్...కామెంటేటర్ మైకేల్ వాన్ అహ్మద్ చూపిన చొరవ తెగింపును ప్రశంసించాడు. ఘటన సమయంలో బాండీ బీచ్ కు దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్లో వాన్ తన కుటుంబంతో ఉన్నాడు. ఫోన్లో మాటాడ్డానికి బైటికి వెళ్లిన సమయంలో ఈ కాల్పుల శబ్దం వినిపించినట్లు వివరించాడు. అహ్మద్ చూపిన మానవీయ దైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అహ్మద్ నిజమైన హీరో అని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.పెహల్గాం దాడిలో పాల్గొంది ముస్లింలే కావచ్చు. వారు బాధితుల్ని మతం అడిగి మరీ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చు. అలాగే మన దేశంలో చాలా వరకు ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల మతం ముస్లిం మతమే కావచ్చు. అయినంత మాత్రాన అందరినీ అదే గాటన కట్టేయడం సరికాదని కొందరి అభిప్రాయం. ఉగ్రవాదమనేది మనిషిలోని అతిరేక లక్షణమే గానీ మతం విధానం కానేకాదు.ఇప్పుడు చెప్పండి.. విచక్షణారహితంగా ఉగ్రరూపంతో కాల్పులు జరిపిన తండ్రీ కొడుకులు ముస్లిం మతానికి చెందిన వారు. అలాగే ధైర్య సాహసాలతో మానవీయతతో ప్రజల్ని ఆ కాల్పుల నుంచి కాపాడిన వ్యక్తి ముస్లిం మతానికి చెందిన వాడే. మరి ముస్లింలందరూ ఉగ్రవాదులే అన్న కొందరి వితండ వాదన నిజమైతే ...పండ్ల వ్యాపారి అహ్మద్ కు ఎదుర్కోవాల్సిన పనేం ఉంది. తను కూడా ఉగ్రవాదుల చర్యల్ని సమర్థించవచ్చు కదా అంటున్నారు సెక్యూలరిస్టులు. ముస్లింలలో కొంతమంది ఉగ్రవాదులుండవచ్చేమో గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే అనడం అర్థరహితం. అసలు ఉగ్రవాదానికి ముస్లిం మతమెందుకు ఉంటుంది? అది కొందరు పనిగట్టుకుని అద్దిన రంగు మాత్రమే.- ఆర్ఎం. -
రన్నింగ్ ట్రాక్ కాదది.. రూ.449 కోట్ల ఫ్లైఓవర్!
బెంగళూరు: బెంగళూరు నగరంలో రూ. 449 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కాస్తా రన్నింగ్ ట్రాక్‌గా మారిపోయింది. నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్, ఎలక్ట్రానిక్స్ సిటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూ. 449 కోట్ల భారీ వ్యయంతో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. దాదాపు ఐదు కి.మీ పొడవున్న ఈ ఫ్లైఓవర్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా పేరొందింది.ఈ ఫ్లైఓవర్ మొదటి దశ (రాగిగుడ్డ నుండి హెచ్ఆర్ఎస్ లేఅవుట్‌కు) పనులు 2024 జూలై నాటికి పూర్తయ్యాయి. దీంతో సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద రద్దీ కొంత మేరకు తగ్గింది. అయితే రెండవ దశ (హెచ్ఎస్ఆర్ నుండి రాగిగుడ్డ వైపు) నిర్మాణం పూర్తైనట్లు కనిపిస్తున్నా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.ఈ జాప్యానికి భారీ ట్రాఫిక్ రద్దీ, పని గంటలపై విధించిన ఆంక్షలే కారణమని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)అధికారులు చెబుతున్నారు. కాగా ప్రారంభానికి నోచుకోని ఈ ఫ్లైఓవర్‌ను స్థానికులు తమ మార్నింగ్ జాగింగ్, వాకింగ్‌లకు ట్రాక్‌గా ఉపయోగిస్తున్నారు.స్థానికుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి దాదాపు సిద్ధమైంది. అయితే యాక్సెస్ ర్యాంప్ ఇంకా సిద్ధం కాలేదు. అందుకే మేము కట్టే రోడ్డు టాక్స్‌ను సద్వినియోగం చేసుకునేందుకు దీనిపై రన్నింగ్ చేస్తున్నామన్నారు. అధికారికంగా వాహన రాకపోకలకు తెరుచుకోని ఈ ఫ్లైఓవర్ నగరంలో తాత్కాలిక వాహన రహిత రన్నింగ్ ట్రాక్‌గా మారిపోయింది. కాగా బీఎంఆర్సీఎల్ అధికారులు మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలోని మిగిలిన 10శాతం పనులు త్వరలోనే పూర్తిచేసి, 2026 జనవరి చివరి నాటికి అందుబాటులోకి తెస్తామంటున్నారు.ఇది కూడా చదవండి: కొద్ది రోజుల్లో ప్రళయం.. ఘనా ప్రవక్త జోస్యం! -
ఇంక్రిమెంటేగా...ఇచ్చేస్తే పోలా...
వడ్డించేటోళ్ళు మనోళ్ళయితే ఆ కిక్కే వేరప్పా...డిపార్ట్ మెంట్ ఏదైనా...ఫికరే లేదు. మన బాస్ కు మనం కాకా కొడితే చాలు. బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే సూత్రాన్ని గట్టిగా పాటిస్తే...జీతం అదంతటదే పెరుగుతుంది. తెలివితేటలు, శ్రద్ధ, నిబద్ధత...ఇవన్నీ తుప్పాస్... పెద్ద సార్ ను జాగ్రత్తగా చూసుకుని వారి కనుసన్నల్లో పడుంటే చాలు. అందుకే అక్కడి ఉద్యోగుల్లో కొందరికి ఎడాపెడా ఇంక్రిమెంట్లు వచ్చి పడుతున్నాయి. కారణం బాస్ భజనే. ఇదెక్కడో కాదండోయ్ సాక్షాత్తు న్యాయవ్యవస్థలోనే. అందరికీ శకునాలు చెప్పే బల్లి తానే కుడితిలో పడ్డట్టు...ఊరందరికీ న్యాయం చేసే పెద్దమనుషులు తమ కింది ఉద్యోగులకు మాత్రం తమను తోచినట్టుగా....తమకు నచ్చినట్టుగా ఇంక్రిమెంట్లు ఇస్తుండటంతో అందరూ ముక్కున వేలేసేకుని...ఔరా ఇలా కూడా చేస్తున్నారా అనుకుంటూ సన్నాయినొక్కుల నొక్కుతున్నారు.సాదారణంగా ఓ కంపెనీలో... ప్రైవేటయినా...ప్రభుత్వం అయినా...పనిచేసే ఉద్యోగికి ప్రమోషన్ రావాలన్నా...కనీసం ఇంక్రిమెంట్ పడాలన్నా...సదరు ఉద్యోగి తలప్రాణం తోకకొస్తుంటుంది. ఎంత పనిచేసినా...ఎంత కష్టపడినా...బాస్ గుడ్ లుక్స్ లో లేకుంటే ఆ ఉద్యోగికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల మాట అటుంచి ఉద్యోగం నిలబట్టుకోవడమే కష్టంగా మారిపోతుంటుంది. ఇంక్రిమెంట్లు ఎండమావుల్లా ఊరిస్తుంటాయే కానీ జీతంలో వచ్చి చేరవు. ఏడాదంతా కష్టపడి గొడ్డులా పనిచేస్తే...చివర్లో వచ్చే ఇంక్రిమెంట్ కోసం బిక్కమొగం వేసుకుని ఎదురు చూస్తుంటే... పదో పరకో మొహాన కొట్టే కంపెనీలు ఎన్ని లేవు. అలాగని ఆ ఉద్యోగాన్ని వదిలేసుకునే ధైర్యం చేయలేరు. ఇదేం గానుగెద్దులాంటి జీవితంరా బాబు. ఖర్చులు కొండవీటి చాంతాడంత...జీతం మాత్రం గొర్రబెత్తడంత అని నిట్టూర్చుకోవడం మినహా చేయగలిగేదేం ఉండదు.ఎవరికి ఏ అన్యాయం జరిగినా కోర్టు తలుపులు తట్టుతుంటాం. మనకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం...గౌరవం. ఎవరు అన్యాయం చేసినా అక్కడ న్యాయం దొరికే దొరుకుతుందని ఆనుకుంటుంటాం. అంతటి ప్రతిష్టాత్మకమైన సర్వోన్నత న్యాయస్థానంలోని ఉద్యోగం చేసేవారిలో కొందరికి అత్యధికంగా ఇంక్రిమెంట్లు దక్కుతున్నాయి. ఎంతటి ప్రతిభావంతుడికైనా ఏడాదికి ఒక ఇంక్రిమెంట్ న్యాయం ధర్మం. కానీ ఇక్కడ మాత్రం కొందరికి ఇబ్బడి ముబ్బడిగా ఇంక్రిమెంట్లు వచ్చేస్తున్నాయి. పోనీ వారు చేస్తున్న పనికి గుర్తింపా అంటే అదేం కాదు...బాస్ ను మెప్పించినందుకే ఈ నజరానాలు అని తెలుస్తోంది.సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తులు వారు తమ పదవీ కాలం ముగిసే సమయాన...వ్యవధి ఎంత తక్కువ కాలం అయినా సరే... రిటైర్ అయ్యేటైములో తమకు నచ్చిన వారికి...తమను మెప్పించిన వారికి ఇంక్రిమెంట్లు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. ఏడాదికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఇవ్వడానికి ప్రధాన న్యాయమూర్తులు కొందరు వెనకాడటం లేదు. ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు వారికి అధికారం ఉందన్న ఏకైక కారణంతో తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనేది విమర్శ. ఉద్యోగులకు వృత్తిగత నైపుణ్యం లేకున్నా...ఏడాదికి రెండు మూడు ఇంక్రిమెంట్లు ఉదారంగా ఇస్తున్నారు. ఇలా లబ్ది పొందన వారిలో సీజేఐ పర్సనల్ సిబ్బందే అధికం.ఈ అవ్యవహారాన్ని గత నాలుగైదేళ్లుగా గమనిస్తే...ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 2000మంది ఉద్యోగులకు ఒక ఏడాదలో పలుసార్లు ఇంక్రిమెంట్లు లభించాయి. ప్రధాన న్యాయమూర్తి కనుసన్నల్లో మెదిలిన కొందరు సిబ్బందికి ఆరుసార్లు ఇంక్రిమెంట్లు పడ్డాయంటే...పరస్థితి ఎంత దారుణంగా తయారైందో తెలుస్తోంది. సాధారణ పరిస్థితిలో లభించే ఇంక్రిమెంట్ల కంటే 150 శాతం అధికంగా లభించడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇలా అవ్యవస్థగా సాగిన అవ్యవహారం గురించి చర్చించేందుకు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ న్యాయమూర్తులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా చాలా మంది న్యాయమూర్తులు కోర్టు ఎవరి సామ్రాజ్యమో కాదని... ప్రధాన న్యాయమూర్తులు ఇక్కడ రాజులు కారని, వారి ఇష్టారీతిగా ఏదో అగ్రహారాలు రాసిచ్చినట్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం సరికాదని భావించారు. సుదీర్ఘ చర్చానంతరం ఇలా ఇష్టారీతిగా ఇంక్రిమెంట్లు ఇచ్చే విధానాన్ని బంద్ చేయాలని ఫుల్ కోర్టు నిర్ణయించింది అలాగే కొందరు ఉద్యోగులకు అర్తరహితంగా ఇచ్చిన ఇంక్రిమెంట్లను ఉపసంహరించుకోవాలని కోర్టు భావిస్తోంది. పొరపొటు తెలుసుకుని సరిచేయడం సరే...అసలు సర్వోన్నత న్యాయస్థానంలో కొందరు ప్రధాన న్యాయమూర్తులు ఈ వ్యవహార శైలి ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -ఆరెం. -
నైట్‌క్లబ్‌లో దారుణం.. భార్యపై లైంగిక దాడి.. భర్తకు చావు దెబ్బలు
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం చోటుచేసుకంది. ఇక్కడి ఒక నైట్‌క్లబ్ యజమాని తన కోరిక తీర్చలేదని ఒక మహిళను లైంగికంగా వేధించి, ఆమె భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన జైపూర్‌లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘క్లబ్ ఆల్ఫా’లో చోటుచేసుకుంది. బాధితురాలు ఇరామ్ షేక్ తన భర్త నవేద్ ఉస్మానీతో కలిసి క్లబ్‌కు వెళ్లింది. ఇంతలో అక్కడున్న ఒక వెయిటర్.. క్లబ్ యజమాని భరత్ ఆమెను ఒక ప్రైవేట్ గదిలో కలవాలనుకుంటున్నట్లు తెలియజేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. కాగా క్లబ్ యజమాని అభ్యర్థనను ఆమె తిరస్కరించారు.ఆ దంపతులు క్లబ్లో సేదతీరిన కొద్దిసేపటి తర్వాత ఇరామ్ షేక్ వాష్‌రూమ్ వైపు వెళ్లారు. అదే సమయంలో క్లబ్ యజమాని భరత్, మేనేజర్ దీపక్, పలువురు బౌన్సర్లు ఆమెను చుట్టుముట్టి, అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నవేద్ ఉస్మానీ అక్కడకు పరుగుపరుగున వచ్చాడు. అతను క్లబ్ యజమాని, సిబ్బందిని అడ్డుకున్నాడు. దీంతో భరత్, మేనేజర్ దీపక్, బౌన్సర్లు కలిసి నవేద్ ఉస్మానీపై దాడి చేసి, ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ దాడిలో నవేద్ ఉస్మానీ కాలు విరిగింది. అంతటితో ఆగని బౌన్సర్లు బాధిత దంపతుల కారును కూడా ధ్వంసం చేశారు.కొద్దిసేపటి తరువాత బాధితులు ఈ దాడి గురించి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన నవేద్‌ను ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత దంపతులు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఏసీపీ బలరామ్ చౌదరి తెలిపారు. ఘటన జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజీని, నిందితుల కాల్ డీటెయిల్ రికార్డులను సేకరిస్తున్నామన్నారు. సేకరించిన ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా నైట్‌క్లబ్ యజమాని, సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు -
శబరిమలలో ముమ్మరంగా ఆహార భద్రతా శాఖ తనిఖీలు
శబరిమలకి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా పంబా, సన్నిధానంలలో పనిచేస్తున్న ప్రత్యేక ఆహార భద్రతా బృందాలు ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో పంబలో 328 , సన్నిధానంలో 302 తనిఖీలు పూర్తయ్యాయి.పంబలో లోపాలు గుర్తించిన సంస్థలపై 6 కాంపౌండ్ ఫుడ్ నోటీసులు, 21 సవరణ నోటీసులు జారీ చేశారు. సన్నిధానంలోని 24 సంస్థలకు సవరణ నోటీసులు పంపించారు. మొత్తం ఆరు ఫిర్యాదులు పరిష్కరించబడగా , కాంపౌండ్ ఫుడ్ విధానం ద్వారా నాలుగు సంస్థల నుంచి రూ.30,000 జరిమానా వసూలు చేశారు.పంబ, సన్నిధానంలోని ఆహార వ్యాపారులకు ఆహార సరఫరా సంబంధిత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రాథమిక నాణ్యత పరీక్షల కోసం పంబాలో 69 ఆహార నమూనాలు, సన్నిధానంలో 62 ఆహార నమూనాలను పరీక్షలకు పంపించారు.ఆహార భద్రతకు సంబంధించిన టోల్ - ఫ్రీ నంబర్లను అన్ని సంస్థల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో కూడా తనిఖీలు కొనసాగుతాయని ఆహార భద్రతా అధికారులు తెలిపారు. కాగా, సరిగ్గా మూడేళ్ల క్రితం శబరిమల అయ్యప్పస్వామి అరవణ పాయసంలో వాడే యాలకుల్లో పురుగు మందు అవశేషాలున్నట్లు తేలడం తోపాటు ఇటీవల అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో సైతం లోపాలున్నట్లు విజిలెన్స్ తేల్చడం తదితర కారణాల రీత్యా శబరిమలలో ఆహారభద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విజిబులిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర భారతదేశానికి భారీ పొగమంచు అలర్ట్ జారీ చేసింది. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని విమానాలు మార్గం మళ్లించబడ్డాయి. విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. Heavy Fog Alert for Northern IndiaDelhi (DEL) & other airports in Northern India are experiencing dense fog, severely affecting visibility.For Passengers:Before heading to the airport, please check the latest flight status with your airline.Check flight information on the…— MoCA_GoI (@MoCA_GoI) December 15, 2025ఉత్తర భారతదేశంలో శీతాకాలం తీవ్రత పెరగడంతో పొగమంచు మరింతగా అలుముకుంటోంది. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రోజుల్లో కూడా పొగమంచు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. -
ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు స్వల్ప అంతరాయం
న్యూఢిల్లీ: నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సిన ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేయడంతో, ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన కోసం వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ప్రధాని వాస్తవానికి ఉదయం 8:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత (విజిబిలిటీ) గణనీయంగా పడిపోవడంతో ఆయన పర్యటనలో ఆలస్యం చోటుచేసుకుంది. ఈ పర్యటనలో ప్రధాని ముందుగా జోర్డాన్‌ను సందర్శించనున్నారు. ‘ముందుగా నేను జోర్డాన్‌ను సందర్శిస్తాను. హిజ్ మెజెస్టి కింగ్ అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ఈ చారిత్రాత్మక పర్యటన ఉండబోతోంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు అయ్యింది’ అని ప్రధాని తన విదేశీ పర్యటనకు ముందు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నడూ లేనంత దట్టమైన పొగమంచుఢిల్లీ నగరాన్ని సోమవారం దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోయింది. ఫలితంగా ఉదయం వేళ ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ దట్టమైన పొగమంచు దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ఉదయం ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో నగరం అంతటా చలి వాతావరణం నెలకొంది. ఈ సీజన్లో ఇంత దట్టమైన పొగమంచు కమ్మడం ఇదే మొదటిసారి.విమానాలకు తీవ్ర అంతరాయంఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు ఈ పొగమంచు తీవ్ర అంతరాయం కలిగించింది. దృశ్యమానత బాగా తగ్గిపోవడంతో, సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి విమానయాన సంస్థలు తమ షెడ్యూల్‌లను సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. ఫలితంగా అనేక విమానాలు ఆలస్యం అయ్యాయి. ఈ అంతరాయం కారణంగా ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.ప్రయాణికులకు సూచనప్రస్తుత పరిస్థితిపై ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికులకు ఒక సలహాను జారీ చేసింది. ‘దట్టమైన పొగమంచు కారణంగా విమానాల కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడవచ్చు. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు మేము భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. అప్డేట్ల కోసం ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలి’ అని సూచించింది.ఇది కూడా చదవండి: కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు -
పీకే యూ టర్న్? ప్రియాంకను కలిసి..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022లో కాంగ్రెస్‌తో చర్చలు విఫలమై, తీవ్ర విభేదాలు తలెత్తిన మూడేళ్ల తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే తాజాగా ఇరు పార్టీల మధ్య మొదలైన మంతనాలు ఎటువైపునకు దారి తీస్తాయో.. పీకే తాజా వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.బిహార్ వైఫల్యంతో పునరాలోచన?బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ పేలవమైన ప్రదర్శన కనబరచడం ఈ భేటీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీజేపీకి, కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉన్న మహాకూటమికి వ్యతిరేకంగా పోటీకి దిగిన జన్ సురాజ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పోటీ చేసిన మొత్తం 238 మంది అభ్యర్థులలో 236 మంది (99.16%) తమ డిపాజిట్లను కోల్పోయారు. ఈ ఫలితాలు పీకే ఎన్నికల వ్యూహాలపై, అతని రాజకీయ ప్రస్థానంపై పలు ప్రశ్నలు లేవనెత్తాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా బిహార్‌లో ఘోరంగా విఫలమైంది. 61 స్థానాల్లో పోటీ చేసి, కేవలం ఆరింటిని మాత్రమే గెలుచుకుంది. ఇది ఆ పార్టీ 2020 ఎన్నికల్లో గెలిచిన 19 స్థానాల కంటే చాలా తక్కువ.నిన్నమొన్నటి వరకూ విమర్శించి..2022లో చర్చలు విఫలమైనప్పటి నుండి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌పై నిరంతరం విమర్శనాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆయన రాహుల్ గాంధీ లేవనెత్తిన ‘ఓట్ చోరీ’ ప్రచారం రాష్ట్రంలో ఎన్నికల సమస్య కాదని వాదించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)గురించి పీకే చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇలా నిరంతర విమర్శల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అకస్మాత్తుగా కాంగ్రెస్ కీలక మహిళా నేత ప్రియాంకా గాంధీని కలవడం రాజకీయంగా కొత్త సమీకరణలకు దారితీయవచ్చనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది.2022లో ఎలా బెడిసికొట్టింది?రాజకీయ వ్యూహకర్తగా, నేతగా గాంధీ కుటుంబంతో ప్రశాంత్ కిషోర్‌కు గతంలో మంచి అనుబంధం ఉంది. 2021లో జేడీయూ నుండి బహిష్కరణ వేటు పడిన తర్వాత ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌ను పునరుద్ధరించే ప్రతిపాదనతో గాంధీ కుటుంబాన్ని సంప్రదించారు. ఇందుకోసం ఆయన 2022, ఏప్రిల్‌లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాటు చేసిన ‘అధికార సాధికార బృందం’ (ఈఏజీ)లో చేరాలనే ప్రతిపాదనను పీకే తిరస్కరించడంతో నాటి చర్చలు అకస్మాత్తుగా ముగిశాయి.అధిక స్వేచ్ఛ, ప్రాధాన్యత కోరడంతో..ఇదే తరుణంలో కాంగ్రెస్ నిర్దిష్ట బాధ్యతతో ఈఏజీలో భాగంగా పార్టీలో చేరాలంటూ పీకేని ఆహ్వానించింది. దీనికి పీకే వెంటనే స్పందించారు. ఈఏజీలో చేరి, ఎన్నికల బాధ్యత తీసుకోవాలనే కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించారు. పార్టీలోని నిర్మాణాత్మక సమస్యలను పలు సంస్కరణల ద్వారా పరిష్కరించడానికి నాయకత్వం, సామూహిక సంకల్పం అవసరమని నాడు పీకే ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ఆయన తనకు అధిక స్వేచ్ఛ, ప్రాధాన్యత కావాలని కోరారు. అయితే బయటి వ్యక్తి చెప్పినట్లు పార్టీలో నిర్మాణాత్మక మార్పులు చేయడానికి సీనియర్ నాయకత్వం విముఖత చూపిందని తెలుస్తోంది.ఇరు పార్టీలకు అవసరమై..ఇప్పుడు మూడేళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశం మళ్లీ కాంగ్రెస్- పీకే మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి సంకేతమా? అనేది అందరిలో పలు సందేహాలను లేవనెత్తుతోంది. బిహార్ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌కు కాంగ్రెస్ లాంటి జాతీయ స్థాయి పార్టీతో తిరిగి కలిసి పనిచేయాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చని పలువురు అంటున్నారు. అలాగే వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్, భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకత్వం కోసం పీకేను తిరిగి సంప్రదించి ఉండవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా ఒకప్పుడు తీవ్ర విభేదాలు తలెత్తిన నేతల మధ్య జరిగిన తాజా భేటీ.. రాబోయే రాజకీయ సమీకరణలపై తప్పక ప్రభావం చూపనుంది.ఇది కూడా చదవండి: తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు? -
గ్యాస్ ఛాంబర్లా దేశ రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విజిబులిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. AQI తీవ్రత 500 పాయింట్లతో ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం గ్రాఫ్ 4 నిబంధనలు అమలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో 50% సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్మాణ పనులపై సంపూర్ణ నిషేధం విధించారు. నగరంలో డీజిల్ వాహనాలకు ప్రవేశం నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
తెరపైకి ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వేతన పరిమితి త్వరలో పెరిగే అవకాశం ఉంది. పదకొండేళ్ల క్రితం తర్వాత మరోసారి ఈ పరిమితిని పెంచేందుకు కేంద్ర కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల సామాజిక భద్రతకి మరింత ధీమా కలగడంతోపాటు పదవీ విరమణ సమయంలో ఉద్యోగికి అందే ఆర్థిక లబ్ధి కూడా భారీగా పెరగనుంది. వేతన పరిమితిని చివరిసారిగా 2014లో రూ.6,500 నుంచి 15 వేలకు పెంచారు. ఆ తర్వాత ఇప్పటివరకు పెంపుదలపై ఎలాంటి చర్చలు జరగలేదు. ఈ అంశంపై ఇటీవల పార్లమెంటులో పలువురు సభ్యులు లేవనెత్తగా... అందుకు స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోదు. వాటాదారులతో చర్చించాలి. అంతేకాకుండా కార్మిక సంఘాలు, పారిశ్రామిక సంఘాలతోనూ చర్చలు జరపాల్సి ఉంటుంది. అయితే పెంపు అంశంపై మాత్రం కేంద్రం సానుకూలంగా ఉంది’ అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా వేతన పెంపు అంశం తెరపైకి వచ్చింది.30వేల వరకు పెంచాలంటున్న సంఘాలుఈపీఎఫ్ 1995లో అమల్లోకి వచ్చిన సమయంలో ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.5వేలుగా ఉంది. ఆ తర్వాత 2001లో అప్పటి జీవన వ్యయం, వేతనాల స్థితికి అనుగుణంగా వేతన పరిమితిని రూ.6,500కు పెంచారు. 13 ఏళ్ల తర్వాత దీన్ని రూ.15వేలకు పెంచారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లో చేరే వారికి కనీస వేతనం రూ.20వేల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు అనివార్యమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వేతన పరిమితిని రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వేతన పరిమితి పెంపుతో ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చేస్తారు. అంతేకాకుండా ఈపీఎఫ్ ఉద్యోగుల పొదుపు మరింత పెరుగుతుంది. యాజమాన్యాలపై కొంత భారం పడినప్పటికీ... ఉద్యోగులకు మాత్రం పీఎఫ్‌లో భారీగా పొదుపు ఉంటుందనేది కార్మిక సంఘాల నేతల అభిప్రాయం. అయితే వేతన పెంపు అంశంపై ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. సీబీటీ సమావేశం ఇప్పటివరకు షెడ్యూల్ కాలేదు. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే రెగ్యులర్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
సాయుధ బలగాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో మహిళా సిబ్బంది భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో సీఆర్పిఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్), బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్), ఐటీబీపీ (ఇండో–టిబెటియన్ బోర్డర్ పోలీస్), ఎస్ఎస్బీ (సశస్త్ర సీమాబల్)లో కలిపి మొత్తం 3,239 మంది మహిళా సిబ్బంది నియమితులయ్యారు. 2026లో మొత్తం 5,171 పోస్టుల భర్తీ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఇటీవల వెల్లడించారు. కానిస్టేబుల్ ర్యాంకులో మహిళా సిబ్బంది నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే సీఆర్పిఎఫ్లో 33 శాతం, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీలో 14 నుంచి 15 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించి మహిళా సిబ్బందిని నియమిస్తున్నారు. మహిళా సిబ్బందికి సరైన పని వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా బ్యారక్‌లు, టాయిలెట్లు, డ్రెస్ చేంజింగ్ రూంలు, క్రెచ్‌లు, డే కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడంతో మహిళలు ఈ బలగాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఉమెన్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపుల వంటి అంశాల్లో ఫిర్యాదులపై అత్యంత గోప్యత పాటించడంతోపాటు సమస్య పరిష్కరించేలా అంతర్గత వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. -
బాండీ బీచ్ ఘటన.. భారత్‌లో జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో యూదు సమాజంపై ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో యూదు ప్రార్థనా మందిరాలు, సాంస్కృతిక కేంద్రాలు, యూదు సమాజానికి చెందిన సంస్థలు ఉగ్రవాదుల లక్ష్యంగా మారే అవకాశం ఉందని గూఢచార సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాయి.సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రవాద దాడి పట్ల భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో ఇద్దరు ముష్కరుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయాలపాలైయ్యారు. కాగా పోలీసులు కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరొక ఉగ్రవాదిని అరెస్టు చేశారు. -
‘మంచే’ జరిగిందిలే!
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ప్రకృతి అసాధారణ పరిణామం చెందింది. ఎత్తైన ప్రాంతాల్లో రాత్రిపూట మంచు కురవడంతో, ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయనే అంచనాలకు భిన్నంగా, ఈ నెలలో తొలిసారిగా కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు ఫ్రీజింగ్ పాయింట్ (సున్నా డిగ్రీలు) కంటే పైకి పెరిగాయి. ఈ అసాధారణ పరిణామం వల్ల.. చలి తీవ్రత నుంచి లోయవాసులకు కాస్త ఉపశమనం లభించిందని అధికారులు ఆదివారం తెలిపారు. దాదాపు 5 డిగ్రీల సెల్సియస్ పెంపు శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాత్రి ఇది మైనస్ 2.9 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. అంటే, ఒక రోజులో దాదాపు ఐదు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరిగింది. వాతావరణ శాఖ ప్రకారం, ప్రస్తుతం నమోదైన ఉష్ణోగ్రత ఈ సీజన్‌కు ఉండాల్సిన సాధారణ స్థాయి కంటే 3.2 డిగ్రీలు ఎక్కువ. జమ్మూ కశ్మీర్లో పుల్వామా మాత్రమే మైనస్ 2.7 డిగ్రీల సెల్సియస్‌తో.. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేసిన ఏకైక ప్రాంతంగా నిలిచింది. మంచు కురిసిన ప్రాంతాలు గందర్బల్ జిల్లాలోని జోజిలా పాస్, మినామర్గ్, బాల్టాల్ ప్రాంతాలు సహా బందిపోరా జిల్లాలోని తులైల్ ప్రాంతాల్లో మంచు కురిసినట్లు అధికారులు తెలిపారు. ‘చిల్లై కలాన్’ ముంగిట కశ్మీర్ డిసెంబర్ 21న ప్రారంభమయ్యే 40 రోజుల అతి తీవ్రమైన చలికాలంగా పరిగణించే ’చిల్లై కలాన్’ వైపు కశ్మీర్ అడుగులు వేస్తోంది. ఈ సమయంలోనే మంచు కురిసే అవకాశాలు అత్యధికంగా ఉండి, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. అయితే, ’చిల్లై కలాన్’ మొదలయ్యే డిసెంబర్ 20–21 తేదీలలో లోయలో అక్కడక్కడా తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.మంచు కురిసినా పెరగని చలి ∙కశ్మీర్లో ప్రకృతి అసాధారణ మార్పు -
సౌర తుపాను అధ్యయనంలో ఆదిత్య–ఎల్1 కీలకం: ఇస్రో
బెంగళూరు: భారత తొలి సౌర అబ్జర్వేటరీ ఆదిత్య–ఎల్1 మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2024లో భూమిని వణికించిన అత్యంత భయానకమైన, శక్తిమంతమైన సౌర తుపాను అంత అసాధారణంగా ఎందుకు ప్రవర్తించిందో శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన తన అయస్కాంత క్షేత్ర కొలతల ద్వారా ఈ అరుదైన సౌర దృగి్వషయాన్ని అంతరిక్షంలో పలు నిర్ధారిత ప్రాంతాల నుంచి అధ్యయనం చేయడంలో దోహదపడింది. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మంగళవారం ఈ మేరకు వెల్లడించింది. ‘గానన్స్ స్టార్మ్ గా పిలుచుకుంటున్న ఆ సౌర తుపాను కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ) గా పిలిచే అతి భారీ సౌర పేలుళ్ల సమాహారం. సీఎంఈలు అత్యంత వేడిమితో కూడిన వాయు సమూహాలు. ఇవి చండ ప్రచండంగా భూమిని తాకినప్పుడు భూ అయస్కాంత క్షేత్రాన్ని కుదిపేస్తాయి. ఉపగ్రహాలు, జీపీఎస్‌తో పాటు పవర్ గ్రిడ్లను నష్టపరుస్తాయి. 2024 నాటి సౌర తుపాను తీవ్రత, అందుకు దారితీసిన పరిస్థితులపై భారత సైంటిస్టు బృందం కీలక పరిశోధన చేసింది. ఆ తుపాను మధ్యంలో మెలిదిరిగిన తాళ్లను పోలి ఉండే సౌర అయస్కాంత క్షేత్రం అక్కడక్కడ విరుగుతూ, తిరిగి కలిసిపోతూ సాగింది. ఈ అసాధారణతను మన బృందమే వెలుగులోకి తెచి్చంది. దీన్ని ప్రతిష్టాత్మక ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్ ప్రముఖంగా ప్రచురించింది. ఆదిత్య–ఎల్1 అనేది సౌర అధ్యయనం నిమిత్తం 2023లో భారత్ ప్రయోగించిన తొలి అంతరిక్ష మిషన్. -
విమానంలో ప్రాణదానం
సాక్షి, బళ్లారి: విమాన ప్రయాణంలో ఉండగా హఠాత్తుగా విదేశీ ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో మాజీ మహిళా ఎమ్మెల్యే వైద్యసేవలతో ఆమెకు ప్రాణం పోశారు. ఈ సంఘటన గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. గోవా నుంచి టేకాఫ్ తీసుకున్న 10 నిమిషాల్లోనే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ (31) అస్వస్థతకు గురైంది. గుండెపోటుతో సొమ్మసిల్లింది. అదే విమానంలో బెళగావి జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ ఢిల్లీ వెళ్తున్నారు. వెంటనే జెన్నీ పరిస్థితిని గమనించి సీపీఆర్‌తో ఆమెకు కృత్రిమ శ్వాస కల్పించారు. దీంతో జెన్నీ కోలుకుంది. ఆమె అభ్యర్థన మేరకు అంజలి విమానం దిగే వరకు పక్కనే కూర్చున్నారు. విమానం ఢిల్లీలో ల్యాండయిన వెంటనే జెన్నీని ఆస్పత్రికి తరలించారు. అంజలిని సీఎం, నెటిజన్లు అభినందించారు. -
బీజేపీ డీఎన్ఏలో ఓటు చోరీ
సాక్షి, న్యూఢిల్లీ: అసత్యం, ఓట్ల చోరీ బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలోనే ఉన్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సత్యం, అహింస అనే నినాదంతో బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రతిన బూనారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీతోపాటు ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో రాహుల్ గాంధీ విచుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వారంతా బీజేపీ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు అధికారం అండతో విచ్చలవిడిగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అనుసరించేవారి డీఎన్ఏలో సత్యం ఉంటుందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలో మాత్రం అసత్యం, ఓట్ల చోరీ మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం ‘‘సత్యమే మన ఆయుధం. సమయం పట్టొచ్చు గానీ ఎప్పటికైనా సత్యానిదే విజయం. ప్రపంచం సత్యాన్ని పట్టించుకోదని, అధికారాన్ని, బలాన్ని మాత్రమే చూస్తుందని ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ చెప్పడం దారుణం. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తున్న సంగతి నిజం కాదా? ఎన్నికల కమిషనర్లను కాపాడేందుకు ప్రధాని మోదీ కొత్త చట్టం తీసుకొచ్చారు. మేమే వచ్చాక ఈ చట్టాన్ని తప్పనిసరిగా మారుస్తాం’’ అని అన్నారు. దొంగతనమే వారి డీఎన్ఏ దొంగతనం బీజేపీ డీఎన్ఏలో ఉందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. డబ్బు దొంగతనం, భూమి దొంగతనం, వ్యవస్థల దొంగతనం, హక్కుల దొంగతనం, ఉద్యోగాల దొంగతనం, ప్రజా తీర్పును దొంగిలించడం, ప్రభుత్వాన్ని దొంగిలించడం, ఎన్నికలను, ఓట్లను దొంగిలించడం బీజేపీకి అలవాటేనని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకొని అధికారం అనే నిచ్చెనపైకి ఎగబాకడం బీజేపీ విధానమని దుయ్యబట్టారు. ప్రజల కోసమే రాహుల్ పోరాటం: ఖర్గే ప్రజల కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయనను బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్ చోర్–గద్దీ ఛోడ్ ధర్నాలో ఖర్గే ప్రసంగించారు. రాహుల్ గాం«దీకి మద్దతు ఇవ్వకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. దేశాన్ని, ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనమంతా కలిసి పోరాటం చేయాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, భావజాలం దేశాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. హిందూమతం, హిందుత్వం పేరుతో పేదలను బానిసలుగా మార్చడానికి ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దేశ ద్రోహులైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలకు, ఓట్ల దొంగలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి మరింత బలోపేతం చేయాలని ప్రజలకు ఖర్గే విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్లతో గెలిచే దమ్ముందా?బ్యాలెట్ పేపర్లతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి గెలిచే దమ్ముందా? అని బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘం ఏదో ఒకరోజు దేశ ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదంగా సాగుతోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం సహకరించకపోతే ఎన్నికల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గలేదని తేల్చిచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోదీ సర్కార్ ఎదుట మోకరిల్లుతున్నాయని ఆరోపించారు. -
తీర్పును టెక్నాలజీ మెరుగుపర్చగలగాలి
కటక్(ఒడిశా): నూతన సాంకేతికత అనేది న్యాయస్థానాల తీర్పును మరింత మెరుగుపర్చాలిగానీ తీర్పును అధిగమించేదిగా ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఒడిశాలోని కటక్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. పెండింగ్ కేసుల భారం దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు న్యాయ వ్యవస్థలోని ప్రతి స్థాయిలోనూ ఇబ్బందులను సృష్టిస్తున్నాయన్నారు. పైస్థాయిలో తలెత్తిన అడ్డంకులు దిగువ స్థాయిపై ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయని చెప్పారు. పెండింగ్ సమస్యను అధిగమించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సీజేఐ తెలిపారు. అవసరానికి తగినన్ని న్యాయస్థానాలు లేకుంటే, ఎంత చిత్తశుద్ధి కలిగిన న్యాయవ్యవస్థ అయినా కుప్పకూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతతో ఎన్నో సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ దు్రష్పభావాలు కూడా ఉన్న విషయం మరువరాదన్నారు. నేటి డీప్ ఫేక్‌లు, డిజిటల్ అరెస్ట్‌ల కాలంలో న్యాయస్థానాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పేదలు, వృద్ధులను పట్టించుకోని సంస్కరణ అస్సలు సంస్కరణే కాదు, అది తిరోగమనం కూడా అని తెలిపారు. -
ఢిల్లీలో ఆరుబయట ఆటలొద్దు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం నానాటికీ దిగజారుతోంది. దాంతో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఔట్ డోర్ క్రీడలన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని, నగర డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ)ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) ఆదేశించింది. లేదంటే పిల్లలు తీవ్ర అనారోగ్య బారి వాడటం ఖాయమని హెచ్చరించింది. ఢిల్లీతో పాటు హరియాణా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు కమిషన్ లేఖలు రాసింది. ‘ఆరుబయట ఆడే క్రీడలన్నింటినీ రద్దు చేయాలంటూ నవంబర్ 19నే మేం లేఖలు రాశాం. కానీ కొన్ని స్కూళ్లు, విద్యా సంస్థలు ఇంకా వాటిని కొనసాగిస్తున్నాయి‘ అంటూ ఆక్షేపించింది. ‘రోడ్లపై విపరీతమైన దుమ్ము పేరుకొని ఉంది. ఒకవైపు తీవ్ర కాలుష్యంతో సతమతమవుతూ ఉంటే వాటి నిర్వహణ ఇంత అధ్వానంగానా? సగానికి సగం రోడ్లపై మున్సిపాలిటీ వ్యాన్లు సేకరించిన చెత్త పడి ఉంది’ అంటూ నాలుగు పెట్టింది. శనివారం నుంచి ఢిల్లీ, ఎన్ సీఆర్ పరిధిలో అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను సీఏక్యూఎం నిషేధించడం తెలిసిందే. అలాగే ట్రక్కులకు నగరంలోకి ప్రవేశాలు నిలిపేశారు. ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. చలికాలంలో ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది.కర్టెన్లు చాలు: రామ్ దేవ్ఢిల్లీ కాలుష్యానికి ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకం పరిష్కారం కాదని యోగ గురు బాబా రామ్ దేవ్ అన్నారు. పైగా అది సంపన్నుల ఆడంబరం అంటూ ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ కొన్నిసార్లు గ్యాస్ చాంబర్‌ను తలపిస్తుంది. అంతమాత్రాన ఆందోళన పడాల్సిన పనిలేదు. డోర్ కర్టెన్లు వేసుకుంటే చాలు. వాటిని 20 రోజులకు ఒకసారి మూతికి మాస్క్ పెట్టుకొని దులుపుకుంటే సరిపోతుంది. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా అలవాటు చేసుకోవాలి’ అని ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో సూచించారు. ఇంత కాలుష్యంలో వ్యాయామమా అని ప్రశ్నించగా, కపాలభాతి వంటి శ్వాస వ్యాయామాలు చేయాలన్నారు. -
పాటలతో పులులు పరార్!
పిలిభిత్: సంగీతంతో ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారని మనకు తెలుసు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణులు ఏకంగా పులుల్నే భయపెడుతున్నారు. కత్తులు, కర్రలకు బదులుగా సంగీతంతో, అదీ మామూలు సినిమా పాటలతోనే వాటిని అదరగొడుతున్నారు. సంగీత ధ్వనుల ధాటికి పులులు అడవిని దాటి పొలాలు, జనావాసాల వైపు రావడానికి జంకుతున్నాయట. ఇప్పుడిక తాము ఊరు బయటకు, పొలాలు, చెరుకు తోటల్లోకి నిర్భయంగా వెళ్లివస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ వీళ్లు ఎలా పులుల్ని వణికిస్తున్నారంటే.. మాలా అటవీ రేంజ్లో పిలిభిత్ టైగర్ రిజర్వు ఉంది. పులుల సంరక్షణ ప్రాంతానికి ఆనుకుని డజను వరకు గ్రామాలున్నాయి. గ్రామాల చుట్టూ పొలాలు, దట్టంగా చెరుకు తోటలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో టైగర్ రిజర్వులోని పులులు పొలాలు, చెరుకుతోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆవాసాల సమీపంలో సంచరిస్తుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు శూన్యం. దీంతో, జమునియా గ్రామానికి చెందిన కృష్ణకుమార్ ఓ ఉపాయం కనిపెట్టారు. ‘పెద్ద శబ్దాలను వింటే, జంతువులు భయపడి దూరంగా వెళ్లిపోతాయని నాకు తెలుసు. ఇదే ఉపాయాన్ని అమల్లో పెట్టా. సౌర శక్తితో పనిచేసే మైక్ సెట్‌ను మా చెరుకు తోట వద్ద ఏర్పాటు చేశాను. మైక్ ద్వారా పెద్ద శబ్దంతో వచ్చే సంగీతం, సినిమా పాటలతో పులి వంటి జంతువులు మా ఛాయలకు కూడా రావడం లేదు. మా పొలాలకు దూరంగా వెళ్లిపోతున్నాయి. నన్ను చూసి, మిగతా రైతులు కూడా ఇదే ఉపాయాన్ని అమలుచేస్తూ సత్ఫలితాలు సాధించారు. మా ఊరే కాదు, అజిత్పూర్, రామ్‌నగరియా, మహువా, మలా ఘెరా, రిచ్చోలా, బసంత్పూర్లాంటి పులుల భయమున్న గ్రామాల రైతులూ ఇదే ఉపాయం అమలు చేస్తున్నారు’అని కుమార్ తెలిపారు. -
ఫ్యాన్స్ ఫుట్‌బాల్ ఆడేసుకున్నారు
ఫుట్‌బాల్ దేవుడు లియోనెల్ మెస్సీని కళ్లారా చూసేందుకు కోల్‌కతాలో అభిమానుల సాహసాలు, పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. కొందరు వేలకు వేలు చెల్లించగా, ఓ అభిమాని ఏకంగా తన పెళ్లి వేడుకలను పక్కనపెట్టి స్టేడియానికి వచ్చాడు. కానీ, అంతిమంగా వారందరికీ మిగిలింది తీవ్ర నిరాశే. ’గోట్ టూర్ 2025’లో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అడుగుపెట్టినప్పటికీ, ఆయన ముందుగానే నిష్క్రమించడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ అస్తవ్యస్థ, పేలవమైన నిర్వహణతో వేలాది మంది అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మెస్సీ కనిపించలేదు.. కార్పెట్ తీసుకుపోతున్నా! మెస్సీని దగ్గరగా చూడాలని రూ.10,000 చెల్లించిన ఓ అభిమాని, తీవ్ర నిరాశతో.. ఆవేశంతో ఊగిపోయాడు. స్టేడియం లోపలికి చొచ్చుకొచ్చి.. ఏకంగా మైదానంలోని గడ్డి కార్పెట్‌ను చుట్టి, మోసుకుపోతూ కనిపించాడు. ‘మెస్సీ ముఖం కూడా కనిపించలేదు. చాలా డబ్బు పోయింది, అందుకే ఈ కార్పెట్‌ను ఇంటికి తీసుకెళ్లి ప్రాక్టీస్ చేస్తా!’.. అని ఆగ్రహం, వ్యంగ్యం మిళితమైన స్వరంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నెటిజన్లు అతన్ని ’అత్యంత ప్రాక్టికల్ అభిమాని’గా అభివరి్ణంచారు. మెస్సీ కంటే ఎక్కువ సేపు స్టేడియంలో ఆ కార్పెట్ మాత్రమే ఉందంటూ మీమ్స్ వెల్లువెత్తాయి. కుండీలు మోసుకెళ్లిన మరో అభిమాని కార్పెట్ దొంగతనం జరిగిన కొద్దిసేపటికే, మెస్సీ జెర్సీ ధరించిన మరో వ్యక్తి సైతం మైదానం నుంచి రెండు పూలకుండీలను మోసుకెళ్తూ కనిపించాడు. పూలకుండీలను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా.. ‘వీటి ని మా ఆవిడకు ప్రేమగా బహుమతిగా ఇస్తాను’.. అని ఆ వ్యక్తి చెప్పాడు. అభిమానులు అందినకాడికి స్టేడియంలోని వస్తువులను దోచుకుపోయారు. మొత్తం మీద, మెస్సీని చూడాలనే ఆశ నెరవేరక, సోఫాలు పీకివేయడం, సీట్లు ధ్వంసం చేయడం, బాటిళ్లు విసరడం వరకు విధ్వంసం కొనసాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రవర్తన మార్పుతోనే దేశ ఇంధన ప్రగతి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రంగాలలో శక్తి (ఇంధన) సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రతి పౌరుడిలోనూ ప్రవర్తన మార్పు చాలా కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ’జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం’లో ఆమె మాట్లాడారు. ప్రకృతికి అనుగుణంగా సమతుల్య జీవనశైలిని అవలంబించాలనే చైతన్యం భారతదేశ సాంస్కృతిక సంప్రదాయంలో అంతర్లీనంగా ఉందని స్పష్టం చేశారు. ఈ భావనే ప్రపంచానికి మన సందేశంగా మారుతున్న ‘పర్యావరణం కోసం జీవనశైలి – లైఫ్’నినాదానికి ఆధారమన్నారు. కీలకమైన మార్పులు ‘భారతదేశ ఇంధన పరివర్తన విజయం కోసం ప్రతి రంగం, పౌరుల భాగస్వామ్యం అవసరం. అన్ని రంగాలకు ఇంధన సామర్థ్యాన్ని తీసుకురావడానికి ప్రవర్తనా మార్పు అత్యంత కీలకం.’.. అని రాష్ట్రపతి సూచించారు. ఇంధన సంరక్షణ అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే కాదని.. ప్రస్తుత అత్యంత ముఖ్యమైన అవసరమని తెలిపారు. సమర్థ వినియోగం జరగాలి శక్తిని ఆదా చేయడం అంటే తక్కువగా ఉపయోగించడం మాత్రమే కాదని, దానిని తెలివిగా, బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా వినియోగించడమని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. ‘అనవసరంగా విద్యుదుపకరణాలను వాడకుండా ఉండటం, శక్తి సామర్థ్యం గల పరికరాలను ఉపయోగించడం, మన ఇళ్లు, కార్యాలయాలలో సహజ కాంతి, గాలిని వినియోగించుకోవడం, లేదా సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన మార్గాలను స్వీకరించడం ద్వారా, మనం కేవలం శక్తిని ఆదా చేయడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించగలం’.. అని ముర్ము సూచించారు. పర్యావరణం, ఆర్థిక ప్రయోజనాలు స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన నీటి వనరులు, సమతుల్య పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికి కూడా ఇంధన సంరక్షణ చాలా ముఖ్యమని రాష్ట్రపతి చెప్పారు. ‘మనం ఆదా చేసే ప్రతి యూనిట్ శక్తి, ప్రకృతిపై మన బాధ్యతకు, భవిష్యత్ తరాలపై మన సున్నితత్వానికి చిహ్నంగా నిలుస్తుంది’.. అని స్పష్టం చేశారు. యువత, పిల్లలు ఇంధన సంరక్షణపై అవగాహన పెంచుకుని, ఈ దిశగా ప్రయత్నాలు చేస్తే, దేశం స్థిరమైన అభివృద్ధిని సాధించగలదని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు ’ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’, ’జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ వంటి కార్యక్రమాలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని ముర్ము గుర్తు చేశారు. ’పునరుత్పాదక వినియోగ బాధ్యత’, ’ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల’ ద్వారా ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని, శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.గణనీయంగా శక్తి ఆదా 2023–24లో భారతదేశ ఇంధన సామర్థ్య ప్రయత్నాల ఫలితంగా 53.60 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన శక్తి ఆదా అయిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ ప్రయత్నాలు వార్షికంగా గణనీయమైన ఆర్థిక పొదుపులకు, ఉద్గారాల తగ్గింపునకు దారి తీశాయని వెల్లడించారు. చివరగా, ఇంధన సంరక్షణ రంగంలో కృషి చేస్తున్న వాటాదారులందరినీ రాష్ట్రపతి అభినందించారు. సామూహిక బాధ్యత, భాగస్వామ్యం, ప్రజల సహకార స్ఫూర్తితో భారతదేశం ఇంధన సంరక్షణలో ప్రధాన పాత్ర పోషించి, ’హరిత భవిష్యత్తు’ లక్ష్యాలను సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ఆమె 2025 సంవత్సరానికి ’జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులు’, ’ఇంధన సంరక్షణపై జాతీయ చిత్రలేఖన పోటీ’ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. శాఖలే మారుస్తారా? లేదంటే.. మంత్రులనే మారుస్తారా? అనే విషయంలో మాత్రం తనకు స్పష్టత లేదన్నారు. అయితే, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,« అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిందనని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్, సురేఖను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, వాళ్లిద్దరూ కాంగ్రెస్ నేతలే అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్ వచ్చారు. ఈసందర్భంగా ఆయన తెంగాణభవన్‌లో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే నన్ను మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. స్వయంగా కేసీ వేణుగోపాల్ ప్రతిపాదన పెట్టారు. కానీ, నాకు మంత్రి పదవిపై మక్కువ లేదని చెప్పాను’అని అన్నారు. మహేశ్‌గౌడ్ ఇంకా ఏమన్నారంటే.. వేదికపైకి మంత్రులను పిలిస్తే బాగుండేది.. గ్లోబల్ సమ్మిట్‌లో రాజకీయ ప్రాధాన్యత ఉండొద్దనే ఉద్దేశంతోనే మంత్రులను స్టేజీ మీదకు ఆహ్వానించలేదు. అయితే, మంత్రులను కూడా వేదికపైకి పిలిస్తే బాగుండేది. కొందరు ఐఏఎస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ గ్లోబల్ సమ్మిట్‌కు కూడా వస్తే బాగుండేది. గ్లోబల్ సమ్మిట్ ప్రతిఏటా పెడితే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నాం. బీసీ ప్రైవేట్ బిల్లు పార్లమెంటులో పెడితే బాగుంటుందని రాహుల్ గాం«దీకి చెప్పాం. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ పదవులనూ తొలివిడతలోనే భర్తీ చేయాలి. కానీ, అక్కడ వచి్చన దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోలలేదు. అందుకే ఆ రెండింటిని పెండింగ్‌లో ఉంచాం. జనం కవిత మాటలు నమ్ముతున్నారు... బీఆర్ఎస్ కథ ముగిసిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని కవిత దగ్గర నుంచి చూసింది కాబట్టే.. ఆమె మాటలను ప్రజలు అంగీకరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేకుండా మనుగడ సాధించడం అంత సులభం కాదు. కేసీఆర్ ఇమేజ్ కేటీఆర్‌కు రాలేదు. హరీశ్‌రావు దెబ్బకొట్టడం ఖాయం. డబ్బులతో కేటీఆర్ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరుగుతుందో కేసీఆర్ ముందే ఊహించారు.. అందుకే ప్రచారానికి రాలేదు’ బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఏమాత్రం లేదు. బీజేపీ అధిష్టానానికీ ఆ విషయం తెలుసు. బీజేపీకి 60–70 స్థానాల్లో కనీసం కేడరే లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తు న్నారు. కానీ మేమే కొన్ని విలువలు పాటిస్తున్నాం. కాబట్టే.. అవకాశం ఇవ్వడం లేదు. మళ్లీ ప్రభుత్వం రావడం అనేది మాకు నల్లేరు మీద నడకే. ఇన్వెస్లర్ల చూపు హైదరాబాద్ వైపే... రేవంత్ రెడ్డి విజనరీ ఉన్న లీడర్. ఫోర్త్ సిటీ పూర్తయితే దేశంలోని మరే నగరం హైదరాబాద్‌తో తట్టుకోలేదు. కంపెనీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పాలసీలు రూపొందించాం. టెస్లాను హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో సహకరించాలని రాహుల్ గాం«దీని కోరాం. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇన్వెస్టర్లు మాత్రం హైదరాబాద్ వైపే చూస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏ పెద్ద వెంచర్లోకి వెళ్లినా పుణే, చెన్నై, ముంబై, బెంగళూరుకు చెందిన వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువశాతం వెంచర్లలో 25 నుంచి 30 శాతం మహారాష్ట్ర వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ ఇండియాలోనే నంబర్ వన్ నగరంగా మారబోతోంది. -
ఓట్లే కాదు.. అన్నీ లాగేసుకుంటారు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ (ఓట్ల దొంగతనం) అనే అంశం ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్యే కాదు.. ఇది మొత్తం దేశం సమస్య..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ఓట్ చోరీపై జరుగుతున్న యుద్ధంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీకి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ఒక సిపాయిలా మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణ నుంచి తాము వెన్నంటి ఉంటామని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’పేరుతో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాందీ, ఎంపీ ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ యుద్ధంలో రాహుల్‌ను గెలిపించాలి ‘దేశ ప్రజల రాజ్యాంగ హక్కు కోసం చేస్తున్న యుద్ధంలో రాహుల్‌ను దేశ ప్రజలు గెలిపించాలి. లేదంటే ఓటు హక్కును లాక్కుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ముందుగా ఓటరు లిస్టు నుంచి పేరు తొలగిస్తారు. ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, భూమి, ఆస్తులు కూడా లాక్కుంటారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో చట్ట సభలో విస్తృత్తంగా చర్చ జరిగింది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలని మహాత్మాగాం«దీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరారు. కానీ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్ గోల్వాల్కర్ తదితరులు ఈ వర్గాలకు ఓటు హక్కును నిరాకరించారు. కానీ మహాత్మాగాందీ, అంబేడ్కర్ పేదలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వారికి అవకాశం ఇచ్చారు..’అని సీఎం చెప్పారు. రాహుల్ ముందే హెచ్చరించారు.. ‘ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆలోచనా విధానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ, అమిత్‌షా గత పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలంటూ ఓటర్లను అడిగారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని రాహుల్‌గాంధీ అప్పుడు చెప్పారు. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 240 సీట్లతోనే సరిపెట్టారు. కాబట్టే రాజ్యాంగం రక్షించబడింది. ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయంటే వారికి 400 సీట్లు రాలేదు కాబట్టే. వారు ఎస్ఐఆర్ పేరిట ఓట్ చోరీ చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారు. గతంలో దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదలకు జరుగుతున్న అన్యాయానికి వ్య తిరేకంగా మహాత్మాగాందీ, అంబేడ్కర్ నిలబడ్డారు. ఇప్పుడు రాహుల్, ఖర్గే ఈ వర్గాలకు మద్దతుగా, మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా.. ఆర్ఎస్ఎస్, గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా రామ్‌లీలా మైదానంలో మీ ముందు ఉన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు కూడాధర్నాలో పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి.. భారత్‌లో ‘హై అలర్ట్’
ఢిల్లీ: భారత్‌లోని పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో యూదుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో హై-అలర్ట్ జారీ చేశారు.ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన యూదుల పండుగ హనుక్కా సందర్భంగా ఉగ్రవాదులు పెద్ద దాడులు చేయాలని యోచిస్తున్నట్లు భారత్‌లోని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇజ్రాయెల్‌కు సంబంధించిన సంస్థల్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.హనుక్కా పండుగ ఎప్పుడు?యూదులు ఘనంగా జరుపుకునే ఎనిమిది రోజుల పండుగ హనుక్కా. ఈ పండుగ డిసెంబర్ 14 నుండి ప్రారంభమైంది. ఈ పండుగ సమయంలో యూదులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తారు. అందువల్లే పండుగ పర్వదినాన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఏ నగరాలు ప్రధాన టార్గెట్?ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం యూదు సంస్థలు, ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద భద్రత పెంచారు. విదేశీ పర్యాటకులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం, రాష్ట్రాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. -
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నబీన్
న్యూఢిల్లీ/లక్నో: అందరి అంచనాలను తలకిందుల చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం బిహార్ యువనేత నితిన్ నబీన్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. నబీన్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం నోటిఫికేషన్లో ప్రకటించారు. కాయస్థ వర్గానికి చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బిహార్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో భవిష్యత్తులో ఈయన బీజేపీ చీఫ్ పదవిని చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. తద్వారా తక్కువ వయస్సులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. మోదీ అభినందనలు.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్‌ను ప్రధాని మోదీ అభినందించారు. కష్టించి పనిచేసే కార్యకర్తగా గుర్తింపు పొందిన నబీన్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్న విశ్వాసం తనకుందన్నారు. ‘యువకుడు, కష్టించి పనిచేసే నేత, సంస్థాగత వ్యవహారంలో అనుభవమున్న వాడు, ఎమ్మెల్యేగా మంచి రికార్డు ఉంది. బిహార్‌కు పలుమార్లు మంత్రిగా పనిచేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు బాధ్యతలు నిర్వర్తించారు’అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం లక్నోలో కేంద్రమంత్రి పియూష్ గోయెల్ ప్రకటించారు. ఈ పదవికి శనివారం పంకజ్ చౌదరి నామినేషన్ వేశారన్నారు. పోటీలో ఆయన ఒక్కరే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మొత్తం 1.62లక్షల బూత్‌ల ద్వారా ఈ ఎన్నిక జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నుంచి పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారని గోయెల్ తెలిపారు. యూపీ బీజేపీ 17వ అధ్యక్షుడిగా ఎన్నికైన పంకజ్ చౌదరి కుర్మి వర్గానికి చెందిన వారు. ఈ వర్గం ఇతర వెనుకబడిన కులా(ఓబీసీ)ల జాబితాలో ఉంది. ఈ సందర్భంగా పియూష్ గోయెల్ పార్టీ జాతీయ కౌన్సిల్‌లోని 120 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. వీరిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి, సీఎం ఆదిత్య నాథ్ గోరఖ్‌పూర్ నుంచి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లక్నో నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు. 45 ఏళ్లకే 5 సార్లు ఎమ్మెల్యేగా.. బిహార్‌లో బీజేపీ సీనియర్ నేత, నాటి ఎమ్మెల్యే నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా 2006లో ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు నితిన్ నబీన్‌కు పార్టీ అధిష్టానం పటా్న(పశ్చిమ) నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తొలిసారిగా బరిలోకి దింపింది. ఏకంగా 60వేల ఓట్ల భారీ మెజారిటీతో నబీన్ గెలిచారు. అప్పట్నుంచి వరసగా దాదాపు రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. తాజాగా బిహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 51,000 ఓట్ల మెజారిటీతో బంకింపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా కేవలం 45 ఏళ్ల వయసుకే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం నితీశ్ ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. నబీన్ గతంలో యువ మోర్చాలో పనిచేశారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు. బీజేపీ చీఫ్‌గా నడ్డా స్థానంలో మరొకరిని నియమించాల్సిన సమయంలో నబీన్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను అప్పగించడం గమనార్హం. నడ్డా తర్వాత బీజేపీ నూతన చీఫ్ అయ్యే అవకాశాలు నబీన్‌కు అత్యధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు స్వయంగా చెబుతున్నాయి. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులైనట్లు తెలియడంతో పటా్నలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్సవాలు మిన్నంటాయి. నితిన్ నబీన్‌కు శుభాకాంక్షల సందేశాలు వెల్లువలా వచ్చాయి. ఈ నియామకం పార్టీ కార్యకర్తలకు అంకితమిస్తున్నానని మీడియాతో నబీన్ పేర్కొన్నారు. తనపై విశ్వాసముంచి గురుతర బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధిష్టానం యువనాయకత్వం వైపు మొగ్గుచూపుతోందనడానికి నబీన్ నియామకం ఒక సంకేతమని వార్తలొచ్చాయి. #BREAKING: Nitin Nabin Appointed As National Working President of BJP. pic.twitter.com/rdCbo9KpYq— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 14, 2025 -
ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..
సాక్షి శబరిమల: శబరిమలలో అరవణ ప్రసాద కొరత తీవ్రంగా ఉన్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. ప్రస్తుతాని అధిక సంఖ్యలో ప్రసాదాలు అందుబాటులో లేనట్లు స్పష్టం చేసింది. అంతేగాదు ప్రతి భక్తుడు 20 ప్రసాదం డబ్బాలకు మించి కొనుగోలు చేయానికి వీల్లేదని సమాచారం. దీనికి ప్రధాన కారణం గతేడాది(జనవరి 2024) అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు కలకలం రేగిన ఘటనే. ఆ సమయంలో లక్షలాది డబ్బాలను అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.అదీగాక ఇటీవలే సరిగ్గా అలాంటి లోపాలే అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో కూడా ఉన్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) విజిలెన్స్ విభాగం గుర్తించింది. అంతేకాదు.. అయ్యప్ప స్వామి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను పకడ్బందీగా తనిఖీ చేయడానికి పంపాబేస్‌లో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’ ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆ నేపథ్యంలోనే ఈ అరవణ ప్రసాదం డబ్బాల కొరత ఏర్పడింది, అలాగే భక్తులకు కూడా పరిమితులు విధించారు ఆలయ అధికారులు. ఇక శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బైజు కూడా ప్రస్తుతానికి కొత్త స్టాక్ వినియోగాన్ని నిలిపివేశామని, అయ్యప్ప అభిషేకాలకు, ప్రసాదాల తయారీకి ఇప్పటికే స్టోర్‌లో నిల్వ ఉన్న స్టాక్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: శబరిమలలో మరో అపచారం) -
కేంద్రం,ఈసీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
సాక్షి,ఢిల్లీ: ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్లను ఓటర్ల జాబితానుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యి వ్యవస్థల్ని నిర్విర్యం చేస్తున్నారు. ఓట్ చోరీపై దేశ వ్యాప్తంగా 5.5కోట్ల మందికి పైగా సంతకాలు సేకరించాం. ఓట్చోరీపై అందరూ ఏకమవ్వాలి. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు జోడించారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత,నిస్పక్షపాతం ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలి’అని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. -
తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు?
తీహార్ జైలు.. దీనిని అధికారికంగా తీహార్ కారాగార ప్రాంగణం(Tihar Prison Complex) అని పిలుస్తారు. ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని ఈ జైలు.. ఖైదీల సంస్కరణ నిలయంగానూ ప్రసిద్ధి చెందింది. ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ హయాంలో దీనికి ‘తీహార్ ఆశ్రమం’ అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ కరుడుగట్టిన నేరస్తులు మొదలుకొని, పేరుపొందిన రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల వరకు పలువురు నేరస్తులు శిక్షలు అనుభవిస్తుంటారు. ఖైదీలకు వృత్తి విద్య, ఆధ్యాత్మిక శిక్షణ, యోగా, తీహార్ బ్రాండ్ కింద వివిధ ఉత్పత్తులను తయారుచేసే అవకాశాలు కల్పిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తీహర్ జైలు త్వరలో తరలిపోతున్నదనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తాజాగా నగరంలోని తీహార్ జైలును ఢిల్లీ శివార్లకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.తీహార్ గ్రామంలో..తీహార్ జైలు అనేది కేవలం ఒకే భవనం కాదు. పలు కేంద్ర జైళ్లతో కూడిన ఒక అతిపెద్ద సముదాయం. అధికారికంగా దీనిని ‘తీహార్ జైళ్లు’ అని పిలుస్తారు. ఇది పశ్చిమ న్యూఢిల్లీలోని తీహార్ గ్రామంలో 1958లో నెలకొల్పారు. తొలుత ఈ కేంద్ర జైలు 1,273 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యంతో ప్రారంభమైంది. జైలు పరిపాలనా నియంత్రణ మొదట్లో పంజాబ్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత 1966లో ఢిల్లీ పరిపాలనకు జైలు బదిలీ అయ్యింది. తీహార్ జైలు ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద జైలుగా పేరొందడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జైలు వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది.సామర్థ్యానికి మించి..కాలక్రమేణా తీహార్ జైలు సముదాయం భారీగా విస్తరించింది ప్రస్తుతం ఇందులో 10 వేర్వేరు కేంద్ర జైళ్లు (CJ-1 నుండి CJ-10 వరకు) ఉన్నాయి. ఈ జైలు అధికారికంగా దాదాపు 10,000 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, దీనిలో సామర్థ్యానికి మించి 15,000 నుండి 19,000 మంది ఖైదీలు ఉంటుంటారు. ఈ అధిక రద్దీ తీహార్ జైలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఈ సముదాయం శిక్ష పడిన ఖైదీలు, విచారణలో ఉన్న ఖైదీలు మహిళా ఖైదీల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.కిరణ్ బేడీ సంస్కరణలతో..1990లలో కిరణ్ బేడీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు)గా పనిచేసిన సమయంలో తీహార్ జైలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమె నాయకత్వంలో జైలులో పలు మానవతా సంస్కరణలు ప్రవేశపెట్టారు. వీటిలో ఖైదీల కోసం ధ్యానం, యోగా, వృత్తిపరమైన శిక్షణ, విద్యా కార్యక్రమాలు ప్రధానమైనవి. ఈ సంస్కరణలు జైలు వాతావరణాన్ని మెరుగుపరచడంలో, ఖైదీలలో సానుకూల మార్పులు తీసుకురావడంలో సహాయపడ్డాయి. ఈ సంక్షేమ కార్యక్రమాల కారణంగా తీహార్ జైలు కేవలం ఖైదీలను నిర్బంధించే స్థలంగానే కాకుండా, సంస్కరణల కేంద్రంగా కూడా పేరు పొందింది.హింస, గ్యాంగ్ వార్ ఘటనలతో..తీహార్ జైలును తరలించడానికి ఇక్కడ పెరుగుతున్న ఖైదీల సంఖ్య, భద్రతా సమస్యలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. సుమారు 10 వేల మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉన్న జైలులో ప్రస్తుతం 19 వేల మందికి పైగా ఖైదీలు ఉండటంతో భద్రత, నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే ఈ జైలు నివాస ప్రాంతాలకు దగ్గరగా (తిలక్‌నగర్, హరినగర్ వంటి జనావాసాలకు సమీపంలో) ఉండటం వల్ల, చుట్టుపక్కల ప్రజల భద్రత, రక్షణ కోసం దీనిని నరేలా వంటి నగర శివారు ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తున్నది. ఇటీవల జైలులో ఖైదీల మధ్య హింస, గ్యాంగ్ వార్ లాంటి సంఘటనలు పెరగడం కూడా ఈ యోచనకు ఒక కారణంగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: Monkey Day: అడవులను సృష్టించే ‘కోతి చేష్టలు -
Delhi Pollution: తొలగని అంధకారం.. వైద్యుల హెచ్చరికలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టేసింది. ఉదయం ఏడు గంటలు దాటినా అంధకారం తొలగిపోలేదు. వాయు నాణ్యత (AQI) 'తీవ్రమైన' విభాగంలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ఉదయం 6 గంటలకు AQIని 462గా నమోదు చేసింది. ఇది ఆరోగ్యకరమైనవారికి కూడా ప్రమాదకరమని, బయటికి వెళ్లడం లేదా వ్యాయామం చేయడం మానుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ఢిల్లీలోని మొత్తం 40 మానిటరింగ్ స్టేషన్లు ఎరుపు రంగు సూచికను చూపించాయి. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని రోహిణిలో అత్యధికంగా 499 AQI నమోదు కాగా, పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (PM2.5) ప్రధాన కాలుష్యకారిగా ఉంది. జహంగీర్‌పురి, వివేక్ విహార్లలో కూడా AQI 495 వద్ద ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది.దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దృశ్యమానత (visibility) గణనీయంగా తగ్గింది. ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని పట్పర్గంజ్కు చెందిన ఫొటోలలో వాహనదారులు హెడ్లైట్లు ఆన్ చేసి, నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం కనిపిస్తున్నది. AQI అనేది PM10,PM2.5,O3,SO2,NO2,CO,Pb, NH3 తదితర ఎనిమిది కాలుష్య కారకాల ఆధారంగా గాలి నాణ్యతను తెలియజేయడానికి ఉపయోగించే ఒక సాధనం. CPCB వర్గీకరణ ప్రకారం 401-500 మధ్య AQI 'తీవ్రమైన' విభాగంలోకి వస్తుంది. ఢిల్లీలో AQI 500 వద్ద పరిమితం చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ (NIAS) కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ గుఫ్రాన్ బేగ్ మాట్లాడుతూ AQI 500- 900 వద్ద ఆరోగ్య ప్రభావాలు ఒకే విధంగా ఉంటాయని, భయాందోళనలు కలగకుండా ఉండేందుకు అధిక సంఖ్యలను చూపడం లేదన్నారు. #WATCH | Delhi | Visuals from the Patparganj section of NH-24 as a layer of toxic smog blankets the city. AQI (Air Quality Index) around the area is 488, categorised as 'Severe', as claimed by CPCB (Central Pollution Control Board). CAQM (Commission for Air Quality… pic.twitter.com/RAp43VUQ4f— ANI (@ANI) December 14, 2025వాయు కాలుష్యం మరింత అధ్వాన్నంగా మారడానికి ప్రధాన కారణం స్థానిక ఉద్గారాలు మాత్రమే కాకుండా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గాలి వేగాన్ని గణనీయంగా తగ్గించాయి. గాలి దిశలో మార్పు, దిగువ వాతావరణంలో తేమ శాతం పెరగడం వంటివి కాలుష్య కారకాలు పేరుకుపోవడానికి అనుకూలంగా మారాయి. పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను నియంత్రించేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) మొదట గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ 3 కింద పరిమితులను విధించింది. ఆపై మరింత దిగజారుతున్న పరిస్థితులలో దానిని GRAP-4కి మార్చింది. 'తీవ్రమైన' విభాగంలో AQI ఉండటంతో హృదయ, శ్వాసకోశ బాధితులకు తక్షణ వైద్య అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం -
గిరిజన గళానికి గిన్నిస్ కిరీటం!
పుణే: భారతదేశం మరోసారి విశ్వ వేదికపై మెరిసింది. ఈసారి ఒక సాంస్కృతిక ఘనతతో, పుణే నగరం ’అత్యధిక పోస్టర్ల ప్రదర్శన’లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద పుస్తక మహోత్సవంలో భాగంగా ఈ చారిత్రక రికార్డు నెలకొల్పింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగ్రీకర్ శనివారం ఈ రికార్డును ధ్రువీకరించారు. అత్యధిక పోస్టర్ల ప్రదర్శన రికార్డులో అమెరికాను వెనక్కి నెట్టి, ఈ ఘనతను భారత్ సొంతం చేసుకుందని ప్రకటించారు. బిర్సా ముండాకు అంకితం ప్రపంచ రికార్డు సృష్టి వెనుక ఒక విశిష్ట లక్ష్యం ఉంది. ఈ రికార్డును గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండాకు నివాళిగా అంకితం చేశారు. పుస్తక మహోత్సవ కనీ్వనర్ రాజేష్ పాండే మాట్లాడుతూ, గిరిజన సమాజం, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి బిర్సా ముండా చేసిన సేవలను గౌరవించేందుకు ఒక ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన పదజాలంతో కూడిన పోస్టర్ల ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు. 1,678 పోస్టర్లతో భారతీయ అస్తిత్వం ఫెర్గుసన్ కళాశాలలో జరుగుతున్న పుణే పుస్తక మహోత్సవంలో ఈ రికార్డును నెలకొల్పారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం, గిరిజన పదాలను ప్రదర్శిస్తూ ఏకంగా 1,678 పోస్టర్లను ప్రదర్శించారు. గతంలో అమెరికాలో ఫిబ్రవరి 2025లో 1,365 పోస్టర్లతో నెలకొలి్పన రికార్డును ఈ ప్రదర్శన బద్దలు కొట్టింది. డిసెంబర్ 12న పుణే బుక్ ఫెస్టివల్, యశ్వంత్రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, రైజ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ రికార్డును సాధించినట్లు గిన్నిస్ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. అంతరిస్తున్న భాషల పరిరక్షణ సామాజిక కార్యకర్త గిరీష్ ప్రభూణే మాట్లాడుతూ, బిర్సా ముండా కృషి బహుముఖమైనదని కొనియాడారు. ‘అంతరించిపోతున్న మాండలికాలను పరిరక్షించడం అత్యవసరం. వాటిని దేవనాగరి లిపిలో నమోదు చేస్తే.. గిరిజన భాషలలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలవుతుంది’.. అని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ పుణే పుస్తక మహోత్సవం, పుస్తక ప్రదర్శన మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, భాషా పరిరక్షణకు ఒక శక్తివంతమైన వేదికగా నిలిచింది. ఈ రికార్డు విజయంతో, పుణే నగరం పుస్తకాల పండుగను కేవలం వినోద కార్యక్రమంగా కాకుండా, సామాజిక చైతన్యం, సాంస్కృతిక గౌరవానికి చిహ్నంగా మార్చింది. -
ఏకీకృత న్యాయ విధానం ఉండాలి: సీజేఐ
జైసల్మీర్: నేడు ఏకీకృత న్యాయవిధానం అవసరం ఎంతో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ప్రమాణాలు, విధానాలను ఏకీకృతం చేసేందుకు ఆధునిక సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. దీనివల్ల పౌరులు దేశంలో ఎక్కడ ఉన్నా నిరంతరంగా సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశమేర్పడుతుందని తెలిపారు. సమాఖ్య విధానం కారణంగా హైకోర్టులకు వేటికవి సొంత విధానాలు, సాంకేతికపరమైన సామర్థ్యాలను కలిగి ఉన్నాయంటూ ఆయన..ఇటువంటి అవరోధాలను సాంకేతిక సాయంతో, ఏకీకృత న్యాయ విధానంతో తొలగించుకోవచ్చని సీజేఐ చెప్పారు. జైసల్మీర్‌లో శనివారం జరిగిన వెస్ట్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ న్యాయవ్యవస్థ (నేషనల్ జ్యుడీషియల్ ఈకోసిస్టమ్) అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దేశ న్యాయ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలని పిలుపునిచ్చారు. -
ప్రధాన సమాచార కమిషనర్‌గా గోయల్
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి రాజ్‌కుమార్ గోయల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక ప్యానెల్ బుధవారం సమావేశమై గోయల్ పేరును సీఐసీ పదవికి సిఫార్సుచేసినట్లు శనివారం ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సీఐసీగా గోయల్‌తోపాటు మరో ఎనిమిది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్(ఐసీ)లను కొత్తగా ప్యానెల్ సిఫార్సుచేసింది.గోయల్ చేత సీఐసీగా సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయిస్తారు. అరుణాచల్ ప్రదేశ్–గోవా–మిజోరం–యూనియన్ టెరిటరీస్(ఏజీఎంయూటీ) క్యాడర్‌కు చెందిన 1990 బ్యాచ్(రిటైర్డ్) ఐఏఎస్ అధికారి అయిన గోయల్ ఇటీవల కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిగా సేవలందించారు. గతంలో ఈయన కేంద్ర హోం శాఖలో సరిహద్దు నిర్వహణ విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. అవిభాజ్య జమ్మూకశీ్మర్ రాష్ట్రంతోపాటు కేంద్రప్రభుత్వంలో పలు పదవుల్లో సేవలందించారు. సెపె్టంబర్ 13వ తేదీన ప్రస్తుత సీఐసీ హీరాలాల్ సమారియా రిటైర్ కావడంతో అప్పట్నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజ్గోయల్ను సీఐసీ పదవికి ఎంపికచేశారు. కొత్త కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించాక దాదాపు 9 ఏళ్ల తర్వాత కమిషన్ గరిష్ట సామర్థ్యంతో పనిచేయనుంది. బుధవారం 8 మందిని ఐసీలుగా సిఫార్సుచేయగా ఇప్పటికే ఆనందీ రామలింగం, వినోద్ కుమార్ తివారీలు ఐసీలుగా పనిచేస్తున్నారు. సమాచార కమిషనర్(ఐసీ) పోస్ట్‌కు ప్రభుత్వం ఎంపికచేసిన 8 మందిలో సీనియర్ పాత్రికేయులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ బోర్డ్‌లో లీగల్ సభ్యురాలైన రేలంగి సుధారాణి, మాజీ రైల్వేబోర్డ్ చీఫ్ జయవర్మ సిన్హా, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, సెంట్రల్ సెక్రటేరియట్ సరీ్వస్ మాజీ అధికారి సంజీవ్ కుమార్ జిందాల్, మాజీ ఐఏఎస్ అధికారి సురేంద్ర సింగ్ మీనా, మాజీ ఇండియన్ ఫారెస్ట్ సరీ్వస్ అధికారి కుష్వంత్ సింగ్ సేథీ ఉన్నారు. -
ఆసియాలోనే పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యా టక ప్రాంతం గుల్మార్గ్లో ఆసియాలోనే అత్యంత పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్ ఏర్పాటైంది. దీనిని శనివారం సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారు. స్కైయింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరున్న గుల్మార్గ్లో దీనివల్ల స్కైయింగ్ మౌలికవసతులు మరింతగా మెరుగయ్యాయని సీఎం చెప్పారు. అంతర్జాతీయ వింటర్ స్పోర్ట్స్ మ్యాప్‌లో గుల్మార్గ్ కూడా చేరినట్లయిందని చెప్పారు. బారాముల్లా జిల్లా కొంగ్డొరి వద్ద రూ.3.65 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ స్కై డ్రాగ్ లిఫ్టు పొడవు 726 మీటర్లు. పైన వేలాడుతున్న కదిలే బార్‌ను పట్టుకుని బోర్డుపై నిలబడిన వ్యక్తిని ఇది ఎత్తయిన ప్రదేశంపైకి లాక్కెళుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా గుల్మార్గ్లోని అఫ్ఫర్వాత్లో ఏర్పాటైన ప్రపంచంలోనే ఎత్తయిన రివాల్వింగ్ మల్టీపర్సస్ హాల్‌ను కూడా ప్రారంభించారు. గుల్మార్గ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.17 కోట్లతో నెలకొల్పిన పలు పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించారు. అదేవిధంగా, వింటర్ ట్రెయినింగ్ వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ స్కైయింగ్ ట్రెయినింగ్ అడ్వంచర్ టూరిజమ్ సెంటర్‌ను, ఇంటిగ్రేటెడ్ స్కై ట్రెయినింగ్ కోర్సులను కూడా ఆయన ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ పర్యాటక రంగంలో గుల్మార్గ్కు ప్రముఖ స్థానం ఉందని సీఎం ఒమర్ చెప్పారు. పూర్తిస్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అ త్యాధునిక, అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం పెట్టుబడుల అవసరముందని తెలిపారు. దీనివల్ల ఏడాదంతా పర్యాటక రంగ అవకాశాలుండటంతోపాటు స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. -
పథకాల పేర్ల మార్పులో కేంద్రం మాస్టర్
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) బిల్లు పేరును మారుస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పథకాల పేర్లను మార్చడంలో మోదీ ప్రభుత్వం దిట్ట అంటూ ఎద్దేవా చేసింది. మహాత్మాగాంధీ అనే పేరుంటే వచ్చిన ఇబ్బందేమిటని నిలదీసింది. శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. పథకాలు, చట్టాల పేర్లను మార్చడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిట్ట. గతంలో నిర్మల్ భారత్ అభియాన్‌ను స్వచ్ఛ భారత్ అభియాన్‌గా, గ్రామీణ ఎల్పీజీ పంపిణీ కార్యక్రమాన్ని ఉజ్వల యోజనగా మార్చారు. ఇలా రీ ప్యాకేజింగ్, బ్రాండింగ్‌లో బీజేపీ వాళ్లు సిద్ధహస్తులు. ఇప్పటిదాకా వాళ్లు పండిట్ నెహ్రూను మాత్రమే ద్వేషించారు. ఇప్పుడు మహాత్మాగాంధీ పేరు కూడా వారికి నచ్చడం లేదు. అందుకే, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్య బాపు ఉపాధి హామీ పథకంగా మార్చారు’ అని జైరాం రమేశ్ ఆరోపించారు. పేరు మార్చినంత మాత్రాన మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలే గ్రామాల రూపురేఖల్ని మార్చిన ఈ పథకానికి ఆద్యులన్న విషయం ప్రజలు మర్చిపోరని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఇదే పథకాన్ని వైఫల్యానికి చిరు నామాగా పేర్కొన్న ప్రధాని మోదీ, విప్లవాత్మ కమైన మార్పును తీసుకువచ్చిన ఈ పథకం ఘనత తమదేనని చెప్పుకునేందుకే పేరు మా ర్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థా గత) కేసీ వేణుగోపాల్ శనివారం ఎక్స్‌లో ఆరో పించారు. భారతావనికి గ్రామాలే పట్టుగొమ్మ లు అని ప్రవచించిన మహా త్ముడి పేరును లేకుండా చేసేందుకే మోదీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. పథకానికి నిధుల కేటాయింపుల్లో ఏడాదికే డాది కోత విధించడంతోపాటు చెల్లింపులు సైతం లేకపోవడంతో బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయన్నారు. మొత్తంగా ఈ పథకాన్ని ఎత్తి వేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నిర్లక్ష్యాన్ని దాచి పెట్టడానికి కేంద్రం తీసుకున్న కంటి తుడుపు చర్య మాత్రమే నని పేర్కొన్నారు. వాస్తవానికి, ఈ ప్రభుత్వా నికి సంక్షేమ పథకాలపై సదుద్దేశం లేదు. ఏం చేయాలో తెలియనప్పుడు, ఇలాంటి చర్యల తో ఏదో చేసినట్లుగా ప్రజల ముందు నటి స్తోందని దుయ్యబట్టారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరును మార్చుతూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలపడం తెల్సిందే. ఇకపై ఈ పథ కాన్ని పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజ నగా పిలుస్తారు. అదేవిధంగా, పనిదినాల సంఖ్యను ప్రస్తుత మున్న 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచనున్నారు. -
నా వేతనాన్ని పేదల సంక్షేమానికి వినియోగించండి
భువనేశ్వర్: తన వేతనం, అలవెన్సులను పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ఒడిశా మాజీ సీఎం, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం సీఎం మోహన్ చరణ్ మాఝీకి రాసిన లేఖలో తెలిపారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ప్రకారం..ప్రతిపక్ష నేత నెలవారీ వేతనం, అలవెన్సులు కలిపి రూ.3.62 లక్షలకు చేరాయి. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని నవీన్ పట్నాయక్ సీఎంను కోరారు. ఒడిశా ప్రజల ప్రేమ, అభిమానాలు తనకు చాలునన్నారు. కటక్‌లోని తమ పూర్వీకుల నివాసం ఆనంద్ భవన్‌ను కూడా 2015లోనే ప్రజల కోసం దానం చేసినట్లు చెప్పారు. తన తండ్రి బిజూ పట్నాయక్ సీఎంగా ఉన్న 1990–1995 కాలంలో నెల వేతనంగా రూ.1 మాత్రమే తీసుకున్నారని గుర్తు చేశారు. -
18 ఏళ్ల వేట
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది. చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి. అది కాళరాత్రి మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు. నేపాల్‌కు పరారైన హంతకుడు నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు. అతి ముఖ్యమైన క్లూ.. వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది. పట్టుబడిన క్షణం నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు. నిజం నిప్పులాంటిది ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నక్సలిజం సాధించిందేమీ లేదు!
రాయపూర్: నక్సలిజం నల్లతాచు పడగనీడ కారణంగా దేశంలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోయాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ఆయన ప్రతిజ్ఞచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కేంద్రం జగ్దల్పూర్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జరిగిన బస్తర్ ఒలింపిక్–2025 క్రీడోత్సవ ముగింపు వేడుకలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ‘‘ఆయుధం చేతబట్టిన నక్సలైట్లు నక్సలిజం పేరుతో సాధించింది ఏమీ లేదు. నక్సలిజం అనేది ఇటు సాయుధులకు ఉపయోగపడలేదు. అటు గిరిజనులకూ అక్కరకు రాలేదు. సాయుధ భద్రతాబలగాలకూ ఎలాంటి ప్రయోజనంలేని పనికిమాలిన పనిగా నక్సలిజం తయారైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీలోపు దేశంలో నక్సలిజంను అంతం చేస్తాం. ఏడు జిల్లాల సమాహారంగా ఉన్న బస్తర్ రీజియన్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుదాం. ఇకనైనా సీపీఐ(మావోయిస్ట్) ఉద్యమకారులు ఆయుధాలు విడనాడి సమాజ ప్రధాన స్రవంతితో కలిసి నడవాలి. దారితప్పిన యువతను పునరావాస పథకం ద్వారా మళ్లీ గాడినపెడతాం. గౌరవప్రద జీవితం గడిపే అవకాశం కల్పిస్తాం. ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు పడాలంటే ఒక్క శాంతితోనే సాధ్యం. బస్తర్ ఒలింపిక్–2024 చూడ్డానికి వచ్చా. ఈసారి కూడా బస్తర్ ఒలింపిక్–2025 వీక్షించేందుకు విచ్చేశా. వచ్చే ఏడాది బస్తర్ ఒలింపిక్–2026 చూడ్డానికి వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమేకాదు యావత్ భారతావని నుంచి దానిని తరిమేస్తాం. 2026 మార్చి 31కల్లా దేశవ్యాప్తంగా ఎరుపు ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. ఇది త్వరలో సిద్ధించనుంది. నక్సలిజాన్ని రూపుమాపడమే మా పనికాదు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధే మా కర్తవ్యం. నక్సలిజం శకం ముగిసి నూతన అభివృద్ధి శకం త్వరలో ఆరంభమవుతుంది’’అని అమిత్ వ్యాఖ్యానించారు. మరో ఐదేళ్లలో అద్భుతాభివృద్ధి ‘‘బస్తర్ రీజియన్‌లో కాంకేర్, కొండగావ్, బస్తర్, సుక్మా, బీజాపూర్, నారాయణ్‌పూర్, దంతేవాడ జి ల్లాలున్నాయి. వెనుకబడిన ఈ 7 గిరిజన జిల్లాలను వచ్చే ఐదేళ్లలో అంటే 2030 డిసెంబర్‌కల్లా దేశంలోనే అత్యంత అభివృద్ధిబాటలో పయనించిన జిల్లాలుగా మార్చేస్తా. ఛత్తీస్‌గఢ్‌తోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఈ ఏడు జిల్లాల కోసం శతథా కృషిచేస్తాయి. అర్హులకు ఇళ్లతోపాటు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంటగ్యాస్ కనెక్షన్, ఐదు కేజీల ఉచిత రేషన్ బియ్యం, ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాది రూ.5లక్షల దాకా ఉచితవైద్య సదుపాయం కల్పిస్తాం. ఏడు జిల్లాల మధ్య రహదారుల ద్వారా అనుసంధానతను పెంచుతాం. విద్యుత్ స్తంభాలు వేయించి అందరి ఇళ్లలో విద్యుత్ వెలుగుల్ని ప్రసరింపజేస్తాం’’అని అన్నారు. ప్రతి గ్రామాన్ని రోడ్లతో అనుసంధానిస్తాం ‘‘ప్రతి ఒక్క గిరిజన గ్రామాన్ని రోడ్లతో అనుసంధానిస్తాం. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తాం. ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల పటిష్ట నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేస్తాం. అటవీ ఉత్పత్తులను శుద్ధిపరిచే కర్మాగారాలను సహకారసంఘాల సహకారంతో నెలకొల్పుతాం. ఇతర గిరిజన జిల్లాలతో పోలిస్తే అత్యధిక పాల ఉత్పత్తికేంద్రాలుగా ఈ ఏడు జిల్లాలను తీర్చిదిద్దుతాం. పాడి, కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించి ఇక్కడి రైతుల కుటుంబాదాయాన్ని రెట్టింపుచేస్తాం’’అని అన్నారు. కొత్త పరిశ్రమలను తీసుకొస్తాం ‘‘నూతన పరిశ్రమలను ఈ జిల్లాలకు తీసుకొస్తాం. ఉన్నత విద్యా కేంద్రాలను నెలకొల్పుతాం. దేశంలోనే అత్యుత్తమమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తాం. బస్తర్ పట్టణంలో అత్యంత అధునాతనమైన ఆస్పత్రిని కడతాం. గిరిజన ప్రాంతాలను పట్టిపీడిస్తున్న పోషకాహార లోప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొత్త పథకాన్ని తీసుకొస్తాం. మావోయిస్టుల హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారికి, లొంగిపోయిన మావోయిస్టుల కోసం అత్యంత అధునాతన సౌకర్యాలతో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేస్తాం’’అని అన్నారు.అప్పుడు రణగొణలు.. ఇప్పుడు గణగణలు ‘‘ఒకప్పుడు నక్సలైట్ల మందుపాతరల పేల్చివేతలు, బుల్లెట్ల మోత, రణగొణలే వినిపించేవి. ఇప్పుడు రుధిర దారుల్లో విద్యాసుమాలు వెల్లివిరుస్తున్నాయి. విద్యాలయాలను నిర్మించాం. అందుకే నాటి రణగొణలు పోయి ఇప్పుడు బడిగంటల గణగణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి అనేది సుదూర స్వప్నంగా మారిన ఈ ప్రాంతంలో కొత్తగా రోడ్లు, రైల్వేలు, హైవేలు తీసుకొస్తున్నాం. అప్పట్లో ఇక్కడ లాల్ సలామ్ అనే నినాదమే వినిపించేది. ఇప్పుడంతా భారత్ మాతా కీ జై నినాదమే మార్మోగిపోతోంది. బస్తర్ అభివృద్ధికి మేమంతా కట్టుబడ్డాం. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీప్రభుత్వం కొలువుతీరాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని కూకటివేళ్లలో పెకిలించడం మొదలెట్టాయి. అందుకే ఎన్నో పరస్పర కాల్పుల ఘటనలు జరిగాయి. చాలా మంది నక్సలైట్లు చనిపోయారు. ఆ భయంతోనే గత రెండేళ్లలో ఏకంగా 2,000 మంది నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు’’అని అమిత్ షా అన్నారు. -
పర్యాటకుల స్వర్గధామం.. కాజీరంగా
కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్... పర్యాటకులకిది గమ్యస్థానమే కాదు.. జీవవైవిధ్యానికి అతి పెద్ద ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యధిక ఒంటికొమ్ము ఖడ్గమృగాలున్న జాతీయ పార్క్ ఇదే. ఇలా చెప్పుకుంటూ పోతే కాజీరంగాకు ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ పార్క్ అసోంలోని గోలాఘాట్, నాగావ్ జిల్లా పరిధిలో విస్తరించి ఉంది. బ్రహ్మపుత్ర నదీ తీరంలో నీటి గలగలలు వినసొంపుగా ఉంటాయి. కార్బీ ఆంగ్లాంగ్ కొండల మధ్య దృశ్యాలు కనువిందు చేస్తాయి. కాజీరంగా దాదాపు 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఈ జాతీయ పార్క్‌ను ఎన్‌హెచ్–37 మధ్యగా చీల్చుతుంది. ఈ నేషనల్ పార్క్ చుట్టూ తేయాకు తోటలు పరుచుకుని ఎంతో అహ్లాదకరంగా, ఎటుచూసినా పచ్చని దృశ్యాలే కనిపిస్తుంటాయి. ఈ జాతీయ రహదారిలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు రహదారి పక్కన ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవి దున్నలు, జింకలు తిరుగుతూ కనిపిస్తుంటాయి. – కాజీరంగా నుంచి సాక్షి ప్రతినిధికాజీరంగాలో అత్యధిక ప్రాంతం చిత్తడి నేలలతోనే కనిపిస్తుంది. భారీ, ఎత్తైన గడ్డిపొదలతో ఈ అడవి దట్టంగా కనిపిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులే వన్యప్రాణులకు ఎంతో ఇష్టమైన ఆవాసంగా మారింది. ఈ అడవిలో పెద్దసంఖ్యలో అడవి పందులు కూడా ఉన్నాయి. చిత్తడి నేలలు ఒక ఎత్తయితే.. చాలాచోట్ల చెరువులు, కుంటలు వన్యప్రాణులకు జీవం పోస్తున్నాయి. ఏడాదిలో కేవలం వేసవి సీజన్‌లోని కొన్నిరోజులు మినహాయిస్తే... ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ పార్క్‌లోకి సందర్శకులను అక్టోబర్ రెండో వారం నుంచి మే నెలాఖరు వరకు మాత్రమే అనుమతిస్తారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ రెండో వారం వరకు వర్షాల నేపథ్యంలో పర్యాటకులను అనుమతించరు. బ్రహ్మపుత్ర నది పోటెత్తినప్పుడు, భారీ వర్షాలతో ఈ అడవిలోనూ వరదలు సంభవిస్తాయి. ఆయా సమయాల్లో వన్యప్రాణులు మృత్యువాత పడటం, గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంతో ఈ పార్కు స్వరూపం కూడా మారుతుంటుంది. ఈ పార్కులో మానవప్రమేయం చాలా తక్కువ. ఖడ్గమృగాలపై గతంలో వేటగాళ్లు విరుచుకుపడ్డ పరిస్థితులను అస్సాం ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు పూర్తిగా నిలువరించారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మారింది. వేట చాలావరకు తగ్గింది. కాజీరంగా జాతీయ ఉద్యానవనం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండాం ప్రకృతి పరిరక్షణకు నిదర్శనంగా మారింది. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అనే సందేశాన్ని కాజీరంగా గట్టిగా వినిపిస్తోంది.» 1905లో పార్లమెంటులో నోటిఫికేషన్ ద్వారా కాజీరంగాను రిజర్వ్ ఫారెస్టుగా నిర్ధారించారు. 1908లో తుది నోటిఫికేషన్ వచ్చింది. » 1916లో కాజీరంగాను అభయారణ్యంగా డిక్లేర్ చేశారు. » 1937లో పర్యాటకులు/సందర్శకులకు అనుమతిచ్చారు. » 1950లో వన్యప్రాణుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. » 1974లో జాతీయ పార్కుగా నోటిఫై చేశారు. » 1985లో అంతర్జాతీయ చారిత్రక సంస్థగా యునెస్కో గుర్తించింది. » 2007లో దీన్ని టైగర్ రిజర్వ్‌గా నోటిఫై చేశారు. » 2018లో కాజీరంగాను ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఖరారు చేశారు. » 2022లో స్మగ్లింగ్/వేట రహితంగా ప్రకటించారు. » 2024లో జాతీయ పార్కుగా పేరొంది 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.కాజీరంగానేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్‌లోని జంతు సంపద (2022 పశుగణన లెక్కల ప్రకారం)...2,613 ఒంటికొమ్ము ఖడ్గమృగాలు 104 రాయల్ బెంగాల్ టైగర్1,129 చిత్తడి జింకలు553 పక్షి జాతులు550 వృక్ష జాతులు1,200+ ఏనుగులు 2,565 అడవి దున్నలుప్రత్యేకతలుప్రపంచంలోనే అత్యధిక ఒంటి కొమ్ము ఖడ్గమృగాలున్నది ఇక్కడే. 1966లో ఇక్కడ 366 ఒంటికొమ్ము ఖడ్గమృగాలుండగా... ఇప్పుడు వాటి సంఖ్య 2,613కి చేరింది. వచ్చేఏడాది వైల్డ్‌లైఫ్ సెన్సెస్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేషనల్ పార్కులో అత్యధిక రాయల్ బెంగాల్ టైగర్లు ఉన్నాయి. అంతేకాకుండా అడవిదున్నల సంఖ్య కూడా ఇక్కడే అత్యధికంగా ఉంది. ఏనుగుల సంఖ్యతో పాటు చిత్తడి జింకలు సైతం ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. 25 రకాల అంతర్జాతీయ పక్షి జాతులు ఇక్కడికి వలస వస్తుంటాయి.» జంతువుల దాడిలో పదేళ్లలో 19 మంది మృత్యువాత పడ్డారు. 2014, 2015, 2016లో మరణాలు నమోదు కానప్పటికీ... ఆ తర్వాత ఏటా సగటున 3 చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఈ దాడుల్లో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించింది. గాయపడిన వారికి ఆర్థిక సాయంతో పాటు మెరుగైన చికిత్సకు చర్యలు తీసుకుంది. » కాజీరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రానికి ఏటా టికెట్ల రూపంలో రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ పులుల సంరక్షణ ప్రాజెక్టుకు ఏటా సగటున రూ.10 నుంచి రూ.12 కోట్ల మేర నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 90 శాతం కాగా... 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. » ఈ అటవీ సంరక్షణలో 367 మంది ఉద్యోగులు విధులు ని ర్వహిస్తున్నారు. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తో పాటు అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్లు, వెటర్నరీ ఆఫీ సర్లు, ఫారెస్ట్ గార్డ్లు తదితర కేటగిరీల్లో ఉద్యోగులున్నారు. » కాజీరంగా జాతీయ పార్క్‌ను నాలుగేళ్లుగా ఏటా సగటున 3 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఇందులో 5 శాతం విదేశీ సందర్శకులే కావడం గమనార్హం. పదేళ్ల క్రితం ఈ పార్క్ విజిటర్ల సంఖ్య 1.31 లక్షలు కాగా.. ఇందులో విదేశీ పర్యాటకులు 8 వేలు. పదేళ్లలో ఈ పర్యాటకుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. » ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఎలి ఫెంట్ సఫారీ చేయొచ్చు. ఉదయం7.30 గంటల నుంచి మ ధ్యాహ్నం 3 గంటల వరకు జీపు సఫారీకి అనుమతిస్తారు. » పార్కులో ప్రవేశానికి దేశ పౌరులకు రూ.100, విదేశీయులకు రూ.650 చొప్పున రుసుము చెల్లించాలి. ఏనుగుపై సఫారీకి విదేశీయులకు రూ.2 వేలు, దేశ పౌరులు రూ.1,200 చెల్లించాలి. » జీపు సఫారీకి రూ.2,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కెమెరా షూట్, వీడియో కెమెరా షూట్, డాక్యుమెంటరీలు, ఫీచర్‌ఫిల్మ్ తదితరాలకు వేరువేరు ఫీజులుంటాయి. నిర్దేశించిన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కూడా చేసే అవకాశం ఉంది. » సందర్శకులు ఇక్కడ ఉండేందుకు ప్రత్యేకంగా గెస్ట్ హౌస్‌లు కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాలి. ఆన్లైన్ విధానంలో కూడా ముందస్తుగా గెస్ట్‌హౌస్‌లు, సందర్శనకు బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. -
హైదరాబాద్.. రీ రిలీజ్కా బాప్
సినిమా అంటేనే వినోదం.. భారతీయుల జీవితంలో ఒక భాగం. థియేటర్లో కొత్త మూవీ రిలీజ్ అయినప్పడే కాదు.. పాత సినిమాలు మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై విడుదల అయినా జనంలో ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. రీరిలీజ్ సినిమాలను ఆదరించడంలో భారత్‌లో మన హైదరాబాద్ ముందుండటం విశేషం. థ్రో బ్యాక్–2025 పేరుతో...సినిమాలు, లైవ్ ఈవెంట్స్, నాటకాలు, కచేరీలు, క్రీడల ఆన్లైన్ టికెటింగ్‌లో మార్కెట్ లీడర్ బుక్‌మైషో.. థ్రోబ్యాక్–2025 పేరుతో రూపొందించిన నివేదిక ద్వారా ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి–నవంబర్ మధ్య దేశవ్యాప్తంగా 58 లక్షల మంది రీరిలీజ్ సినిమాలను థియేటర్లలో వీక్షించారు. రీరిలీజ్ విభాగంలో దేశంలో ఇంటర్స్టెల్లర్ టాప్‌లో నిలిచింది. అభిమాన తారల సినిమా మళ్లీ వెండి తెరపైకి రావడం ఒక ఎత్తు అయితే.. ఏళ్లు గడిచినా ఆ చిత్రం తాలూకా జ్ఞాపకాలు, కథ, పాత్రలు వీక్షకుల మదిలో ఎంత పాతుకుపోయాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. రీరిలీజ్ మూవీలకు అడ్డాగా మన భాగ్యనగరి నిలవడం గమనార్హం. మరో నగరానికి వెళ్లి మరీ.. లైవ్ ఈవెంట్స్‌ను ఆస్వాదించేందుకు జనం గడప దాటుతున్నారు. అంతేకాదు మరో నగరానికి వెళ్లి మరీ ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో అహ్మదాబాద్‌లోని 1,32,000 సీట్ల సామర్థ్యం గల నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన కోల్డ్‌ప్లే లైవ్ మ్యూజిక్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఈవెంట్‌తో స్థానికంగా రూ.649 కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం. భారతీయులు వినోదాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకున్నారని నివేదిక తెలిపింది. ఇందుకోసం ఖర్చుకూ వెనుకాడడం లేదు. 18 లక్షల మందికిపైగా సోలోగా వెళ్లి ఈవెంట్స్‌ను ఎంజాయ్ చేశారు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల పెరుగుతున్న విశ్వాసానికి ఇది శక్తివంతమైన నిదర్శనం. ముఖ్యంగా పట్టణ మిలీనియల్స్, జెన్‌జీ ప్రేక్షకులు సోలో హాజరును సామాజిక వైఫల్యానికి బదులుగా స్వీయ భరోసాకు చిహ్నంగా భావిస్తున్నారు. వినోదానికే పండుగ» దేశవ్యాప్తంగా దసరా వీకెండ్లో 68 లక్షల మంది థియేటర్లలో అడుగుపెట్టారు. సంఖ్యాపరంగా ఆ తర్వాతి స్థానంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ నిలిచింది. » ముందస్తు టికెట్ల బుకింగ్‌లో రజనీకాంత్ ‘కూలీ’మూవీ రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందే 24 లక్షల మంది తమ టికెట్లను సొంతం చేసుకున్నారు. » కాంతార చాప్టర్–1 సినిమాను 6 లక్షల మందికిపైగా అభిమానులు రెండుసార్లు వీక్షించారు. » ఒక నగరం నుంచి మరోచోటకు వెళ్లి 5.62 లక్షల మంది ఫ్యాన్స్ లైవ్ మ్యూజిక్‌ను ఆస్వాదించారు.» రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్య థియేటర్లకు పరుగుతీయడంలో బెంగళూరు వరుసగా రెండేళ్లు టాప్‌లో నిలిచింది. » 34,086 లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే వీటి సంఖ్య 17% పెరిగింది. » ప్రీమియం సీట్స్ బుకింగ్స్ రెట్టింపు అయ్యింది. అభిమానులు వీఐపీ సీట్స్, ఎలివేటెడ్ డెక్స్, ప్రీమియం లాంజ్, ఖరీదైన ఆతిథ్యం కోరుకుంటున్నారు. » లైవ్ ఎంటర్టైన్మెంట్ వీక్షకుల సంఖ్య వైజాగ్‌లో 409%, వడోదర 230, ఇండోర్‌లో 214, షిల్లాంగ్‌లో 213% పెరిగింది. » నాటక ప్రదర్శనలు వీక్షిస్తున్న అభిమానుల సంఖ్య 45% అధికమైంది. -
శబరిమల.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
శబరిమల సన్నిధానం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల గుంపుపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఇవాళ సాయంత్రం(డిసెంబర్ 13, శనివారం) 6:10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ప్రమాదానికి గురైన ట్రాక్టర్ వ్యర్థాలను తీసుకెళ్తోంది. భారీ వర్షం కారణంగా ట్రాక్టర్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకుపోయింది. సన్నిధానం పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సన్నిధానం ఆసుపత్రికి రిఫర్ చేశారు. క్షతగాత్రులందరినీ పంబలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. -
అమరులకు ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి పార్లమెంట్‌పై ఉగ్రమూకలు విరుచుకుపడి 24 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంపై జరిగిన ఆ భయానక దాడిలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజాస్వామ్య దేవాలయాన్ని రక్షించుకున్న వీర జవాన్లను యావత్ దేశం స్మరించుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో అమరవీరులకు ఘన నివాళులరి్పంచారు. ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు పార్లమెంట్‌లోకి చొరబడేందుకు యతి్నంచగా పార్లమెంట్ సెక్యూరిటీ సరీ్వస్, సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీసులు వారిని నిలువరించారు. ఉగ్రవాదులెవరినీ లోపలికి వెళ్లనీయలేదు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సరీ్వస్ సిబ్బంది, ఒక తోటమాలి, టీవీ జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంట్ భవన ప్రాంగణంలోనే మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఉపరాష్ట్రపతి, మోదీ, రాహుల్, సోనియా నివాళి పార్లమెంట్ హౌస్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, మౌనం పాటించి వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. ధైర్యసాహసాలకు సలాం: ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ’2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడిలో ప్రాణత్యాగం చేసిన అమరులను దేశం నేడు స్మరించుకుంటోంది. ఆనాడు వారు చూపిన ధైర్యం, అప్రమత్తత, కర్తవ్య దీక్ష అమోఘం. సంక్షోభ సమయంలో వారు ప్రదర్శించిన తెగువకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’అని కొనియాడారు. ఉగ్రవాదంపై పోరుకు పునరంకితమవుదాం: రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ’2001లో పార్లమెంట్‌ను రక్షించుకునే క్రమంలో ప్రాణాలరి్పంచిన వీరనాయకులకు దేశం సెల్యూట్ చేస్తోంది. వారి త్యాగం మన జాతీయ భావనను ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. అమరుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది. ఈ రోజున ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా పునరంకితమవుదాం’అని సందేశం ఇచ్చారు. కమలేష్ కుమారికి సీఆర్పీఎఫ్ నివాళి ఉగ్రవాదులను అడ్డుకోవడంలో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి, మరణానంతరం ’అశోక చక్ర’పురస్కారం అందుకున్న సీఆరీ్పఎఫ్ కానిస్టేబుల్ కమలేష్ కుమారికి సీఆరీ్పఎఫ్ ప్రత్యేక నివాళులర్పించింది. ఆమె చూపిన తెగువ ’సదాస్మరణీయం’అని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జాతి సార్వభౌమాధికారంపై జరిగిన దాడిని తిప్పికొట్టిన వీరుల త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. -
కోల్‌కతా మెస్సీ ఈవెంట్ : టికెట్ ధరలు వాపసు
కోల్‌కతా, సాక్షి: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ లెజెండ్ లియెనెల్ మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. తమ అభిమాన క్రీడాకారుడిని చూడటానికి వచ్చేందుకు నిర్వహణా లోంపతో జనం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదీ 20 నిమిషాల్లోనే లియోనెల్ మెస్సీ వేదిక నుండి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. చివరికి పోలీసుల జోక్యంతోవారిని అదుపు చేశారు. అయితే ఎంతో ఖరీదు పెట్టి టికెట్లను కొని, దూర ప్రాంతాలనుంచి వచ్చినప్పటికీ, కనీసం మెస్సీ ముఖం కూడా చూడలేకపోయామని చాలామంది అభిమానులు ఆగ్రమం వ్యక్తం చేశారు.టికెట్ డబ్బులు వాపసుమరోవైపు లియోనెల్ మెస్సీ GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేశారు. కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అంతేకాదు అభిమాలను టికెట్ రుసుమును నిర్వాహకులు వెనక్కి ఇస్తారని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ రీఫండ్ ఎలా జరుగుతుంది అనేది పరిశీలించాలన్నారు.చదవండి: రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్ పైర్#WATCH | Kolkata: On the Chaos at Messi's Kolkata event, Additional Director General (ADG) Law and Order Jawed Shamim says, "There is normalcy now. The second part is the investigation; the FIR has been lodged, and the chief organiser has been arrested... I'm telling you, they… pic.twitter.com/GRqz03wPvp— ANI (@ANI) December 13, 2025 దీనిపై స్పందించిన రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్‌కతా క్రీడాభిమానులకు ఇదొక చీకటి రోజుగా వ్యాఖ్యానించారు. నిర్వాహక లోపం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనీ, దీనికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అలాగే ముందుజాగ్రత్తలు తీసుకోని పోలీసు అధికారును సస్పెండ్ చేయాలని కూడా అన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, దోషులను అరెస్టు చేయాలన్నారు.ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వాపసు ఇవ్వాలని, స్టేడియం ,ఇతర బహిరంగ ప్రదేశాలకు జరిగిన నష్టానికి నిర్వాహకులపై ఛార్జీలు విధించాలని, పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని గవర్నర్ అన్నారు.ఇదీ చదవండి: 90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే! -
కేరళలో బీజేపీ గ్రాండ్ విక్టరీ
కమ్యూనిస్టుల ఖిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడింది. 45 సంవత్సరాలుగా ఎల్డీఎప్ పాలిస్తున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజెపీ తొలిసారిగా సంచలన విజయం సాధించింది. కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఈ విజయంపై ప్రధాని మోదీ సైతం సంతోషం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు ధన్యవాదాలని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.కేరళ ఈపేరు వింటేనే కమ్యూనిస్టుల కంచుకోటగా చెబుతుంటారు. దేశవ్యాప్తంగా లెప్ట్ పార్టీల ప్రభావం క్షీణిస్తున్నా కేరళలో మాత్రం వారి ఉనికి కాపాడుకుంటూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా తన ప్రభంజనం చూపిస్తూ ప్రతిచోట స్వయంగానో లేదా తన కూటమిద్వారానో అధికారం హస్తగతం చేసుకుంటున్న కాషాయదళం ఇంతకాలం కేరళలో మాత్రం తమ ప్రభావం చూపలేక పోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బోణీకొట్టలేకపోయిన ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక సీటుతో సరిపెట్టుకుంది. దీంతో కేరళలో బీజేపీ పోటీలోనే లేనట్లు భావించారు. అయితే ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయం సాధించింది.ఎన్డీఏ కూటమి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 101 స్థానాలున్న కార్పొరేషన్లో బీజేపీ ఒంటరిగా 50 స్థానాల్లో గెలుపొందింది. ఎల్డీఎఫ్ కూటమి 29 సీట్లు సాధించగా కాంగ్రెస్‌కు చెందిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 స్థానాల్లో విజయం సాధించింది. 2 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అంతేకాకుండా బీజేపీ ఎర్నాకులం జిల్లాలోనిత్రిపునితురా మున్సిపాలిటితో పాటు పాలక్కడ్‌లోనూ జయకేతనం ఎగురవేసింది.అయితే ఈ విజయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు ఇది "కేరళలో ఇది అద్భుతమైన రోజు రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. యూడీఎఫ్ కూటమికి హృదయపూర్వక శుభాకాంక్షలు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇది మంచి పరిణామం. కార్యకర్తల కష్టం, అవినీతిపై వ్యతిరేకత వీటన్నిటితో 2020 ఫలితాలతో పోల్చితే మరింత మెరుగయ్యాము. అదే విధంగా తిరువనంతపురంలో సంచలన విజయం సాధించిన బీజేపీకి కృతజ్ఞతలు. ఆ ప్రాంతంలో 45 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా నేను ప్రచారం నిర్వహించాను. కానీ ప్రజలు అక్కడ వేరే పార్టీని ఎన్నుకున్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిందే" అని శశిథరూర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో గత నాలుగు దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కూటమే విజయం సాధిస్తూ వస్తుంది. అటువంటి చోట ప్రస్తుతం కాషాయ జెండా ఎగరడం అక్కడ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కాగా ఈ నెల 9,11 తేదీలలో కేరళలో స్థానికసంస్థలకు ఎన్నికలు జరిగాయి. -
సివిల్స్ విజేతలు.. వారే ఎక్కువ!
రాశి కంటే వాసి ముఖ్యమని మన పెద్దలు అంటుంటారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అనేది దీని అర్థం. ఎంత పని చేశామనే దానికంటే ఎంత బాగా చేశావన్నదే ముఖ్యం. చదువు, ఉద్యోగాల్లో ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటే గ్రాడ్యుయేట్లే ఎక్కువగా విజయం సాధించారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.గత ఐదు సంవత్సరాల డేటాను విశ్లేషిస్తే.. పీజీ చేసిన వారి కంటే డిగ్రీ పట్టభద్రులే ఎక్కువగా సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయినట్టు తేలింది. ప్రణాళిక ప్రకారం ప్రిపేరయితే బ్యాచిలర్ డ్రిగీతోనే సివిల్స్ సాధించొచ్చని దీని ద్వారా నిరూపితమవుతోంది. యూపీఎస్సీ సివిల్ పరీక్షల్లో (UPSC CSE) గత మూడేళ్లలో మహిళల ఉత్తీర్ణత రేటు కూడా గణనీయంగా పెరిగింది. సబ్జెక్టుల వారీగా చూసుకుంటే ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించినట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది. లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023లో సివిల్స్ పాసైన అభ్యర్థుల్లో 75% మందికి కేవలం బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే ఉంది. మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు 25% మంది ఎంపికయ్యారు. గత ఐదేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2019 నుంచి 2023 వరకు మొత్తం 4,655 మంది అభ్యర్థులు సివిల్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో 3,520 మంది గ్రాడ్యుయేట్లు (సుమారు 76%) ఉన్నారు. ఉన్నత విద్యార్హతలు లేకపోయినా.. పటిష్టమైన సన్నద్ధత, సరైన ప్రణాళిక ఉంటే సివిల్స్ పరీక్షలో విజయం సాధించవచ్చని దీన్నిబట్టి అర్థమవుతోంది.గ్రాడ్యుయేట్ల హవా ఇలా..2022: 1,020 మందిలో 765 మంది గ్రాడ్యుయేట్లు2021: 748 మందిలో 585 మంది గ్రాడ్యుయేట్లు2020: 833 మందిలో 650 మంది గ్రాడ్యుయేట్లు2019: 922 మందిలో 672 మంది గ్రాడ్యుయేట్లుఅమ్మాయిలు పెరుగుతున్నారుసివిల్స్లో మహిళల విజయం కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గత మూడేళ్లలో మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత రేటు పెరిగింది. 2019లో 24 శాతం మంది మహిళలు ఉత్తీర్ణత సాధించగా, గత మూడేళ్లలో ఇది 35 శాతంగా ఉంది. 2019లో 922 మంది సివిల్స్ సాధించగా, వీరిలో 220 మంది మహిళలు ఉన్నారు. 2024లో 1009 మంది సివిల్స్ పాసయితే వీరిలో 350 వరకు మహిళలు ఉన్నారు. అంతేకాదు టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురు అమ్మాయిలు ఉండడం విశేషం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శక్తి దూబే (Shakti Dubey) ఫస్ట్ ర్యాంక్ సాధించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ టాప్ఏ స్ట్రీమ్ విద్యార్థులు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఎక్కువగా పాసవుతున్నారనే ప్రశ్న ఎక్కువగా అడుగుతుంటారు. ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. 2023 ఫలితాల్లో ఇంజనీరింగ్ (49%), హ్యుమానిటీస్ (32%), సైన్స్ (12), మెడికల్: (6%) అభ్యర్థులు విజయం సాధించారు. గత కొనేళ్లుగా ఇదే తరహాలో ఫలితాలు వస్తున్నాయి. 2020 సివిల్స్ ఫలితాల్లో కూడా ఇంజనీరింగ్ అభ్యర్థులు 53 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచారు. చదవండి: సివిల్స్‌లో తగ్గుతున్న ఐఏఎస్‌ల వారసులు! -
రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్ పైర్
కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని(Lionel Messi) కోల్‌కతా విజిట్ గందరగోళానికి దారితీసింది. తమ అభిమాన స్టార్ ప్లేయర్‌ను కళ్లారా చూడాలని తరలి వచ్చిన ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీని వీక్షించడానికి జనం వేలాదిగా చేరుకున్నారు. నిర్వహణ లోపంతో అభిమానులు నియంత్రణకోల్పోయి హింసకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫలితంగా సాల్ట్ లేక్ స్టేడియం వెళ్లిన మెస్సీ కేవంల నిమిషాల్లో అక్కడ నుంచి వెళ్లిపోవడం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. రూ12 వేలు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తే కనీసం తమ అభిమాన మెస్సీ మొఖాన్ని కూడా చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మెస్సీ సమయాన్ని వృధా చేశారని అసహనం వ్యక్తం చేశారు. #WATCH | Kolkata, West Bengal: A fan of star footballer Lionel Messi says, "It was really disappointing, we came all the way from Darjeeling for this... We couldn't even see him properly, and that was the most disappointing thing I have ever witnessed..." https://t.co/Ce4kNu8dBH pic.twitter.com/dgBSOIMEoG— ANI (@ANI) December 13, 2025డార్జిలింగ్ నుంచి వచ్చిన మహిళా అభిమాని, తాను రూ. 12,000 కు టికెట్ కొనుగోలు చేశానని, కానీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న టాలిస్మాన్‌ను చూడలేకపోయానని ఆరోపించారు.కాగా గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం తెల్లవారుజామున కోల్ కత్తాకు చేరుకున్నారు. మెస్సీ ఇండియాలో మూడు రోజులు పాటు, నాలుగు నగరాల్లో పర్యటించ నున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. అయితే మెస్సీ కోలక్‌తా టూర్ సందర్బంగా ఏర్పడిన గందరగోళంలో పట్టరాలి ఆగ్రహంతో అభిమానులు స్టేడియంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. గ్రౌండ్లోకి కుర్చీలు విరగ్గొట్టారు బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్ యత్నించారు. దీంతో జనాన్ని చెదర గొట్టడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అభిమానులు టెంట్‌ను మరియు గోల్ పోస్ట్‌ను కూడా ధ్వంసం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.మరోవైపు ఈ గందరగోళం నేపథ్యంలో GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేసినట్టు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ వెల్లడించారు. కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. అంతేకాదు నిర్వాహకులు టికెట్ రుసుమును అభిమానులకు తిరిగి చెల్లిస్తారని కూడా హామీ ఇచ్చారు. -
భారత్‌తో ట్రంప్ దాగుడు మూతలు..?
ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను చూస్తే.. భారత్‌తో అమెరికా దూరం పెరిగిపోయిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ఏ విషయాన్ని తెగేసి చెప్పకుండా భారత్-పాక్‌ల యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకున్న ట్రంప్.. మద్దతు విషయానికొచ్చేసరికి పాక్‌కే ప్రయారిటీ ఇచ్చారు. ఆ దేశ ఆర్మీ ఛీఫ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్లను అమెరికాకు ఆహ్వానించడమే కాకుండా వారితో రాసుకుపూసుకుని తిరిగారు. ఇక్కడ ట్రంప్ ద్వంద్వ వైఖరి బయటపడింది. భారత్‌పై ఆంక్షలే లక్ష్యంగా..అదే సమయంలో భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించి అక్కసు తీర్చుకున్నారు. దీనిపై అమెరికాలో ఉన్న నిపణులు సైతం ట్రంప్‌ను హెచ్చరించారు కూడా. భారత్‌పై అత్యధిక సుంకాలు విధిస్తే ఆ దేశంలో ఎన్నో దశాబ్దాల నుంచి సాగుతున్న మిత్రత్వం చెడిపోతుందని కూడా వివరించారు. దానివల్ల అమెరికాక ఒరిగేదేమీ లేకపోయినా మనమే దెబ్బతింటామని కూడా చెప్పారు. కేవలం భారత్‌కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని ఒక్క ఒక్క తలంపుతో 50శాతం సుంకాలను విధించారు ట్రంప్.ఇదిలా ఉంచితే, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించారు. రష్యా చమురును కొనడం ఆపాలనే భారత్‌ను చాలాసార్లే హెచ్చరించారు. అయితే దాన్న భారత్ పూర్తి సీరియస్‌గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్‌కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై ఒక్క ముక్కలో తేల్చి పారేశారు. తాము భారత్‌కు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్‌కు అసహనం తెప్పిస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా వేరే దేశాలకు భారత్ దగ్గరవ్వడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. మెక్సికో సుంకాల వెనుక ట్రంప్ హస్తం?గత రెండు రోజుల క్రితం భారత దిగుమతులపై మెక్సికో 50 శాతం సుంకాన్ని విధించింది. దీనికి ఏవో కారణాలు చెప్పుకొచ్చింది. తమ దేశంతో పూర్తిస్థాయి వాణిజ్య సంబంధాలు లేని దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తున్నామంటూ స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా కూడా చేరింది. మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) లేని దేశాలన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయని చెప్పింది. అయితే వీటి వెనుక ఉన్నది ట్రంప్ అని పలు ఆరోఫలణలు వచ్చాయి.. వస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఇప్పటికే మెక్సికో సుంకాలపై స్పందించారు. ఇది ట్రంప్ చర్య కావొచ్చనే అనమానం వ్యక్తం చేశారు. దీన్ని పూర్తిగా కాదనలేం. అమెరికాకు అత్యంత మిత్ర దేశాల్లో మెక్సికో ఒకటి. మెక్సికోను పదే పదే పొగడ్తలతో ముంచెత్తం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది.ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలున్నాయి. గతంలో పలు సందర్భాల్లో మెక్సికో అధ్యక్షరాలు క్లాడియా షీన్బామ్ను అత్యంత సాహసిగా, గొప్ప నాయకురాలిగా అభివర్ణించారు ట్రంప్. ఇక మెక్సికోకు కూడా అమెరికాపై అంతే ప్రేమ ఉంది. ఈ కారణంగానే ట్రంప్ దాగుడు మూతలకు తెరలేపి భారత్‌కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని చూశారనేది నిపుణుల అంచనా. ఇది ట్రేడ్ డైవర్షన్‌కు అడ్డుకట్టా.. ట్రంప్ అడ్డుకట్టా..?భారత్, చైనాలపై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాలు మెక్సికోకు దిగుమతి చేసే వస్తువులను నేరుగా అమెరికాకు పంపకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. దీన్ని ట్రేడ్ డైవర్షన్ అంటారు.దీనికి అడ్డుకట్టవేయాలనే తలంపుతో మెక్సికో చేసినా, ఇందులో ట్రంప్ హస్తం ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై అక్కడ ఎంపీల నుంచే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ట్రంప్ ఇలా చేసే ఉంటారనేది మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి:భారత్‌పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావంట్రంప్ భారీ సుంకాల రద్దు.. ? యూఎస్ కాంగ్రెస్‌లో తీర్మానం! -
ఫస్ట్ ప్రూవ్ చేస్కో.. రాహుల్ పై విమర్శలు
బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకత్వంపై ఇంటా బయిట విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నాయకత్వ బాధ్యతలు ప్రియాంకా గాంధీకి ఇవ్వాలని లేఖ రాశారు. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తరచుగా ప్రధాని చేయమని ప్రజలను అడుగుతారని, ఆ పదవి కోరుకునే ముందు తానేంటో నిరూపించుకోవాలన్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా బాగాలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన ఆ పార్టీ చేసింది. సొంతంగా 99 ఎంపీ సీట్లు సాధించి లోక్ సభ ప్రతిపక్షనేత హోదా దక్కించుకుంది. అయితే ఆ తరువాత జరిగిన హర్యాణా, బిహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంపై ప్రస్తుతం విమర్శలస్తున్నాయి. నాయకత్వాన్ని మార్చకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని క్షేత్రస్థాయిలో క్యాడర్ సూచిస్తున్నారు. ఇటీవల పార్టీ నాయకత్వ బాధ్యతలు ఎంపీ ప్రియాంక గాంధీకి ఇవ్వాలని ఓ కార్యకర్త సోనియాగాంధీకి లేఖ రాయడం పొలిటికల్ హీట్ పెంచింది. కాగా తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాహుల్‌గాంధీని విమర్శించారు.కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూలను ఉద్దేశించి భగవంత్ మాన్ వ్యాఖ్యలు చేశారు. భగవంత్ మాన్ మాట్లాడుతూ "రాహుల్ గాంధీ తరచుగా తనని ప్రధాని చేయండి అప్పుడు నేనేమైనా చేస్తాను అంటారు. అయితే అంతకంటే ముందు ప్రజలకు తానేంటో నిరూపించాలి. తరువాత తనని ప్రధాని చేసే విషయం ప్రజలు ఆలోచిస్తారు. ఇదే తరహాలో పంజాబ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్దూ వ్యవహరిస్తారు. తనని పంజాబ్ సీఎం చేయమని అడుగుతారు. ప్రజలు తనకి ఇది వరకే చెప్పారు. మెుదటగా ఏదైనా పనిచేయండి దాని తర్వాత సీఎం చేయాలో లేదో తేలుస్తామన్నారు". అని భగవంత్ మాన్ తెలిపారు.నాయకత్వం అనేది క్రమశిక్షణగా పనిచేయడం ప్రజల నమ్మకం ద్వారా వస్తుందే తప్ప విద్వేశ ప్రసంగాల ద్వారా రాదని భగవంత్ మాన్ దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని కష్టపడి సంపాదించాలి అని తెలిపారు. భగవంత్ మాన్ తొలుత కామెడీయన్‌గా నటించారు. 2014లో ఆప్ నుంచి తొలిసారిగా ఎంపీ అయ్యారు. 2022 పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఈ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇది వరకూ ఆప్ ఇండియా కూటమిలో భాగంగా ఉండేది. 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆ కూటమి నుంచి విడిపోయి స్వతంత్ర్యంగా పోటీచేస్తుంది. -
90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే!
ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఎంత కాలం జీవించగలం అనేది జెనెటిక్ అంశాలతో పాటు, జీవనశైలి, రోజువారీ అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. దీర్ఘాయుష్కులుగా 90 అంతకంటే ఎక్కువ కాలం జీవించ గలమా లేదా అనేది తెలుసుకోవాలంటే 5 అద్భుతమైన పరీక్షలున్నాయి, వీటిల్లో చాలామంది మూడు పరీక్షల్లోనే ఫెయిలవుతున్నారు అంటూ డాన్ గో అనే ఫిట్నెస్ కోచ్ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట ఇంట్రిస్టింగ్ మారింది. మరి ఆ పరీక్షలేంటో ఒకసారి చూసేద్దామా?సాధారణంగా సుదీర్ఘం కాలం ఆరోగ్యంగా బతకాలంటే ఒత్తిడి లేని జీవితం, సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, ఒక వయసుదాటిన తరువాత కొన్ని ఆరోగ్య పరీక్షలు (ఇతర ప్రమాదకర అనారోగ్య సమస్యలు ఏమీ లేనివారు) చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. మరి 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జీవించగలరా అనేది తెలియాలంటే ఈ అయిదు పరీక్షలు చాలా కీలకమంటూ ఆరోగ్య కోచ్ షేర్ చేశారు. View this post on Instagram A post shared by Dan Go | Fitness Coach (@coachdango)నడక వేగంఎంత వేగంగా నడవ గలరు అనేదాని మీద కూడా మన ఆయుష్షు ఆధారపడి ఉంటుందట. ఇచ్చిన సమయ వ్యవధిలో మీరు ఎంత వేగంగా నడవగలరో చెక్ చేసుకోవాలి. ఇది గుండెలోని నాళాల పనితీరుకు సంకేతం. 1 మీ/సె (2.2 మైళ్ల) కంటే ఎక్కువ వేగం ఎక్కువ ఆయుర్దాయం కలిగిస్తుందని అంచనా. . 2.7 మైళ్ల కంటే ఎక్కువ వేగంగా నడవ గలిగితే మరణం ముప్పు తగ్గుతుందట. వేగంగా నడిచేవారిలో వృద్ధాప్యం లక్షణాలు తొందరగా కనిపించవు.విశ్రాంతి హృదయ స్పందన రేటులో రెస్టింగ్ హాట్ బీట్ రేట్ (ఏ పనీలేదా వ్యాయామం చేయకుండా విశ్రాంతిగా ఉన్నపుడు) మన గండెప నితీరుకు, ఒత్తిడిని తట్టుకునే శక్తికి నిదర్శనం.నిమిషానికి 70 బీట్స్ (బిపిఎం) కంటే తక్కువ కొట్టుకుంటే సాలిడ్‌గా ఉన్నట్టు. 60 బిపిఎం కంటే తక్కువ అంటే ఎలైట్ దీర్ఘాయువు ప్రాంతం.అదే విశ్రాంతి సమయంలో 80-90 బిపిఎం కంటే ఎక్కువ గుండె స్పందన ఉంటే గుండె దృఢత్వానికి సంబందించిన వ్యాయామాలు మొదలు పెట్టాల్సిందే అని సూచన.కూర్చుని పైకి లేచే ( Sit and Rise) పరీక్షడాన్ చెప్పిన దాని ప్రకారం 87 శాతం మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారట.ఇది చాలా సులభం అనుకుంటారుగానీ, నేలపై కూర్చుని,చేతుల సాయం లేకుండా తిరిగి నిలబడటం అనేది వయస్సు పెరిగే కొద్దీ బలం, సమతుల్యత, చలనశీలత, సమన్వయానికి నిదర్శనం. 85 సంవత్సరాల వయస్సులో, గాయాలకు సంబంధించిన అన్ని మరణాలలో దాదాపు 2/3 వంతు పడిపోవడంవల్లే సంభవిస్తాయి. 8 మంది పెద్దవారిలో ఒకరు మాత్రమే ఈ ఎక్సర్సైజ్ చేయగలరు.బార్ హ్యాంగ్స్ (గ్రిప్ స్ట్రెంత్)దీనికి ఆహారం లేదా వ్యాయామంతో సంబంధం లేదు.బలమైన పట్టు గుండె ఆరోగ్యం, కండరాల బలం, ,ఎముక సాంద్రతకు సూచిక. గ్రిప్ స్ట్రెంత్ దీర్ఘాయువును అంచనా వేస్తుంది. అందుకే పరిశోధకులు దీనిని ఆరో ముఖ్యమైన సంకేతం అంటారు. 90 సెకన్లలో బార్ పట్టుకుని వేలాడితే సాధారణం కంటే బెటర్‌గా ఉన్నట్టు.ఒక మైలు పరుగు సమయంఏ వయసులోనైనా 10 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తగలిగితే, హృదయనాళ వ్యవస్థ మంచి స్థితిలో ఉన్నట్టు. 8 నిమిషాల కంటే తక్కువ సమయమైతే దీర్ఘాయుష్షు-అథ్లెట్ స్థాయి ఫిట్నెస్తో ఉన్నట్టు అర్థం. ఇది ఫిట్నెస్ స్థాయికి స్నాప్‌షాట్ లాంటిది. ఎంత ఫిట్‌గా ఉన్నారో అంచనా వేయడానికి శరీర ప్రతిస్పందనలే సూచిక అని డాన్ వెల్లడించారు.నోట్ : ఆరోగ్య , ఫిట్‌నెస్‌కు సంబంధించి ఇది ఒక సలహా మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం సరియైన మార్గం. -
మీరు వాహనాల లోన్ కట్టలేదా?
మీరు కారు గానీ బైక్ కొనుగోలు చేయడానికి ఏదైనా సంస్థ నుంచి లోన్ తీసుకున్నారా? ఏదైనా కారణాలతో లోన్ కట్టకుండా పెండింగ్‌లో ఉంచారా?. అయితే ఫేక్ లోన్ రికవరీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ వాహనం యెుక్క లోన్ బకాయిలు చెల్లించాలంటూ వారు మిమ్మల్ని బుట్టలో వేయవచ్చు. ఎంత కొంత చెల్లించకుంటే వాహనాన్ని సీజ్ చేస్తామని బెదిరిస్తూ అందిన కాడికి దోచుకోని వారు పరారయ్యే అవకాశమూ ఉంది.ప్రస్తుత 5జీ కాలంలో టెక్నాలజీతో పాటు మోసాలు అదే విధంగా అప్డేట్ అవుతున్నాయి. సైబర్ అటాక్‌లతో అకౌంట్లలో డబ్బును రాత్రికి రాత్రి మాయం చేసేవారు కొందరైతే దొంగతెలివిని ఉపయోగించి ప్రజలను మోసం చేసేవారు మరికొందరు. ఇటీవల కాలంలో కొత్తరకం మోసగాళ్లు పుట్టుకొచ్చారు. ఫైనాన్స్ కంపెనీలలో పెండింగ్ బకాయిలు ఉన్న వారే టార్గెట్‌గా వీరు వల పనుతున్నారు. వివిధ రకాల ఫైనాన్స్ కంపెనీలలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాహనాల వివరాలు వీరు సేకరిస్తున్నారు. ఆ వాహనానికి లోన్ ఏ కంపెనీ నుంచి తీసుకున్నారో ఆ కంపెనీ ఏజెంట్లుగా నటిస్తూ లోన్ తీసుకున్నవారిని బెదిరిస్తున్నారు. అందినకాడికి డబ్బులు చేతపట్టుకొని అక్కడి నుంచి ఊడాయిస్తున్నారు.తాజాగా ఇటువంటి ఘటన కర్ణాటకలో జరిగింది. అక్కడి పర్యాటక ప్రాంతమైన కూర్గ్ నుంచి ఒక వ్యక్తి తిరిగివస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు తనని వెంబడించారని తెలిపారు. ఒక కారు డ్రైవ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి కారు డోర్ కొట్టారని ఏంటని ప్రశ్నించగా ఈ కార్ లోన్ పెండింగ్‌లో ఉంది. దీని డబ్బుులు కట్టాలని అడిగారన్నారు. అయితే కారుకు సంబంధించిన డ్యాకుమెంట్స్ అన్ని క్లియర్‌గా ఉండడంతో ఇది మోసం అని తాను గ్రహించానని వెంటనే అక్కడి నుంచి ఊడాయించానని అన్నారు. ఆ వ్యక్తికి ఏదురైన భయానక అనుభూతిపై రెడ్డిట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.అయితే ఇటువంటి ఘటనలు ఈ మధ్యన తరచుగా జరుగుతున్నాయి. ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరైనా పెండింగ్ బకాయిలు ఉన్నాయని ఆపితే వారు సంబంధింత ఫైనాన్స్ కంపెనీకి చెందిన వారా కాదా అని నిర్ధారించుకొండి. మీరు ఏ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నారో ఆ సంస్థకు ఫోన్ చేసి వివరాలు నిజ నిర్ధారణ చేసుకొండి. దాని తరువాతే వారికే డబ్బులు చెల్లించడమో లేదా వాహనాన్ని ఇవ్వడమో చేయండి. నకీలీ ఏజెంట్లకు కంపెనీల ఐడీ కార్డులు సృష్టించడం ఏమాత్రం పెద్ద విషయం కాదు కనుక ఐడీకార్డులను చూసి వారికి డబ్బులు చెల్లించి వారి వలలో పడొద్దు. -
అర్థరాత్రి ఆటోలో ఒంటరి మహిళ : ఆ నోట్ చూసిందంతే!
అర్థరాత్రి రద్దీగా ఉండే నగరాల్లో కూడా అర్థరాత్రి మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే బిక్కు బిక్కుమంటూ వెళ్లాల్సిందే. క్యాబ్ సేవలు అందించే సంస్థలకు చెందిన ఆటో,క్యాబ్, బైక్ డ్రైవర్లు మర్యాదగానే ఉంటారు. అయినా కూడా సురక్షింగా గమ్య స్థానానికి చేరేదాకా మనసులో బెరుకు తప్పదు. తాజాగా బెంగళూరులో రాపిడో ఆటోలో అర్ధరాత్రి ఇంటికి ప్రయాణిస్తున్న ఒక మహిళకు అనుభవం నెట్టింట విశేషంగా నిలిచింది.రాత్రి 12 గంటలకు అర్థరాత్రి, ఒంటరిగా ఉన్నప్పటికీ తన ప్రయాణంలో తాను ధైర్యంగా గడిపిన క్షణం గురించి వివరించిన వీడియోను షేర్ చేసింది. నిజంగా ఆటోలు కనిపించిన ఒక నోట్‌ను ఆమెలోఆనందాశ్చర్యాల్ని నింపింది. వాహనం లోపల అతికించిన చేతితో రాసిన నోట్‌ను చూపించడానికి కెమెరాను అటు తిప్పింది. అక్కడ ఇలా ఉంది: "నేను ఒక తండ్రిని, సోదరుడుని కూడా. మీ భద్రత ముఖ్యం. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి."అని ఒక నోట్లో రాసి ఉండటం విశేషం. అంటే ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల మనస్సుల్లో చెలరేగే భావాలను, భయాలను అర్థం చేసుకుని భయపడకండి.. నేనూ ఒక బిడ్డకు తండ్రినే, ఒక సోదరికి అన్నయ్యను కూడా..భయపడకుండా కూర్చోండి, నా వలన మీకెలాంటి ప్రమాదం ఉండదు అని ధైర్యం చెప్పడం బాగా ఆకట్టుకుంటోంది.ఇదీ చదవండి: చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త View this post on Instagram A post shared by Little Bengaluru Stories (@littlebengalurustories) ఈ వీడియోను లిటిల్ బెంగళూరు స్టోరీస్ "పీక్ బెంగళూరు" అనే శీర్షికతో పోస్ట్ చేసింది . దీంతో నెటిజన్ల నుండి హృదయపూర్వక స్పందనలు వచ్చాయి. "గత 20 సంవత్సరాలుగా నాకు ఈ నగరం తెలుసు! ఇది అందరికీ అత్యంత సురక్షితమైన నగరం." ‘‘మేము కోరుకుంటున్నది , మనం చేయవలసినది ఇదే" అంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి చిన్ని చిన్న విషయాలు చాలు. నగరంలోని మహిళలకు అర్థరాత్రి ప్రయాణం సురక్షితంగా అనిపించేలా చేయడంలో సహాయపడతాయి’’ అని మరొకరు కామెంట్ చేశారు. శభాష్..భయ్యా..ఇలాంటి భరోసానే కావాల్సింది అంటూ మరికొందరు ఆటో డ్రైవర్‌ను కొనియాడారు. -
చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త
ఇంట్లో పెంపుడు జంతువులుంటే ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతుందని నమ్ముతారు. అందుకే చాలామంది ఏదో ఒక పెట్‌ను పెంచుకుంటూ ఉంటారు. అల్లారుముద్దుగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ఒకోసారి పెంపుడు జంతువులే ప్రాణానికి చేటు తెస్తూ ఉంటాయి. బెంగళూరులో జరిగిన ఒక విషాదం గురించి తెలిస్తే హృదయం ద్రవించకమానదు.బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అరుణ్ కుమార్ ఎంతోఖరీదైన చిలుకను పెంచు కుంటున్నాడు. మకావ్ రకానికి చెందిన దీని విలువ 2.5 లక్షలరూపాయలు. అది ఉన్నట్టుండి ఇంట్లోంచి ఎగిరిపోయి, సమీపంలోని విద్యుత్ స్తంభంపై వాలింది. దాన్ని పట్టుకుందామని ప్రహరీ గోడపైకి ఎక్కాడు. అలా దాన్ని రక్షించబోయే ప్రయత్నంలో అరుణ్ ప్రమాదవశాత్తు హై-వోల్టేజ్ విద్యుత్ తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను కుమార్ గోడపై నుండి కిందపడి గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతణ్ణి అసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. బెంగళూరులోని గిరినగర్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. అరుణ్ కుమార్‌కి వాహనాల నంబర్ ప్లేట్ల తయారీ వ్యాపారం ఉంది. -
‘షాక్ అయ్యాను’.. మెస్సీ కార్యక్రమంపై మమతా క్షమాపణలు
కోల్‌కతా: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఈరోజు (శనివారం) ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ కార్యక్రమంలో జరిగిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆమె.. ‘ఈరోజు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళాన్ని చూసి నేను తీవ్రంగా కలత చెందాను. షాక్ అయ్యాను. అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని చూసేందుకు వేలాది మంది క్రీడా ప్రేమికులు, అభిమానులతో పాటు నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి స్టేడియంనకు వెళ్తున్నాను’ అని రాశారు. మమతా బెనర్జీ తన ‘ఎక్స్’ పోస్టులో క్రీడాకారుడు మెస్సీతో పాటు అభిమానులకు కూడా క్షమాపణలు కూడా చెప్పారు.ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుసాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన అల్లర్లపై కలకత్తా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అశిం కుమార్ రే నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా ప్రకటించారు. ఈ ప్యానెల్ వివరణాత్మక దర్యాప్తు నిర్వహించనుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేస్తుంది.అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన ముగిసింది. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినప మోహన్ బగన్ మెస్సీ ఆల్ స్టార్స్ వర్సెస్ డైమండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా గందరగోళం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే త్వరగా వెళ్లిపోయాడని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాటర్ బాటిల్స్‌ను, కూర్చీలను మైదానంలోకి విసిరి రచ్చ రచ్చ చేశారు. ఫ్లెక్సీలు ద్వంసం చేస్తూ, బ్యారికేడ్లను దాటుకుంటూ మైదానంలో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.ఈ గందరగోళ పరిస్ధితుల నేపథ్యంలో మెస్సీ టీమ్‌ను సొరంగం గుండా బయటకు పంపించారు. మెస్సీ మైదానంలో కేవలం ఐదు నిమిషాల మాత్రమే ఉన్నాడు. అతడిని చూసేందుకు బెంగాల్ పక్కరాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. వాస్తవానికి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సి ఉండేది. West Bengal CM Mamata Banerjee (@MamataOfficial) posts, "I am deeply disturbed and shocked by the mismanagement witnessed today at Salt Lake Stadium. I was on my way to the stadium to attend the event along with thousands of sports lovers and fans who had gathered to catch a… pic.twitter.com/Ew7azrl1o2— Press Trust of India (@PTI_News) December 13, 2025 -
Haryana: కాలుష్యంపై యుద్ధం.. ప్రపంచ బ్యాంక్ రూ.3,600 కోట్ల సాయం
చండీగఢ్: హర్యానా సర్కారు కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అత్యంత ప్రతిష్టాత్మక పర్యావరణ కార్యక్రమం ‘హర్యానా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ను ప్రపంచ బ్యాంక్ సహకారంతో ప్రారంభించింది. మొత్తం రూ. 3,600 కోట్ల కార్పస్‌తో రూపొందించిన ఈ ఐదేళ్ల ప్రాజెక్ట్.. రాష్ట్రంలో వాయు నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో పారిశ్రామిక నవీకరణలు, ఈ-బస్సుల ఏర్పాటు, మెరుగైన పర్యవేక్షణ మౌలిక సదుపాయాలు మొదలైనవి కీలకంగా ఉన్నాయి. ఈ భారీ కార్యక్రమం ద్వారా హర్యానా సర్కారు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రమాదకరమైన వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది.ఈ ప్రాజెక్ట్‌లో కాలుష్య రహిత పరిశ్రమల ప్రోత్సాహానికి చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 1,000 పరిశ్రమలకు వాయు ఇంధనాలపై నడిచే కొత్త బాయిలర్లను కొనుగోలు చేయనున్నారు. అదే విధంగా 1,000 డీజీ సెట్లను హైబ్రిడ్/డ్యూయల్ ఫ్యూయల్ మోడ్‌పై నడిచేలా చేస్తారు. రవాణా రంగంలో మార్పులు తీసుకురావడానికి 500 ఈ-బస్సులను ఏర్పాటు చేయనున్నారు. డీజిల్ ఆటోలను దశలవారీగా తొలగించడం, 50,000 ఈ-ఆటోలను ప్రోత్సహించడం వంటి చర్యలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. సాధారణ బాయిలర్లు, ఇటుక బట్టీల ఉద్గారాలను తగ్గించడానికి పైలట్ ప్రాతిపదికన రెండు టన్నెల్ బట్టీలు ఏర్పాటు చేయనున్నారు.మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థ కోసం రాష్ట్రంలో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, పర్యవేక్షణ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. 500 కి.మీల మేర దుమ్ము రహిత రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రియల్ టైమ్ సోర్స్ అపార్ట్మెంట్ సామర్థ్యంతో కూడిన 10 నిరంతర పరిసర వాయు నాణ్యత పర్యవేక్షణ (సీఏఏక్యూఎం) స్టేషన్లు, ఒక సీఏఏక్యూఎం మొబైల్ వ్యాన్‌ను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. తద్వారా కాలుష్య స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రణాళికలను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్య నియంత్రణపై జరిగిన సమీక్షా సమావేశంలో హర్యానా ప్రభుత్వం వెల్లడించింది.ఇది కూడా చదవండి: తల్లీకుమారుల ఆత్మహత్య.. లేఖలో గుండె పగిలే నిజాలు! -
రాష్ట్రపతి అంటే లెక్కే లేదా?
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవలి కేరళలో పర్యటించారు. అక్టోబరులో పర్యటన సందర్బంగా శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇరుముడితో వచ్చి అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి వెంట భద్రతాధికారులు, సిబ్బంది సైతం ఉన్నారు. అయితే, రాష్ట్రపతి ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. హెలిప్యాడ్ కుంగిపోయింది. దీంతో ఆమె రోడ్డు మార్గంలో పంబకు వచ్చి.. అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నారు. కాగా, తాజాగా హెలిప్యాడ్ కుంగిపోవడానికి గల కారణాలు ఆర్టీఐ దరఖాస్తుతో బయటకు వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..అయితే, సామాజిక కార్యకర్త రషీద్ అనప్పర దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తు మేరకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన వివరాలను కలెక్టరేట్, పతనంతిట్ట పబ్లిక్ వర్క్స్ భవన విభాగం సమాధానాలను వెల్లడించింది. ఈ క్రమంలో.. శబరిమల సందర్శనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. మొదట రాష్ట్రపతిని నిలక్కల్‌లో దించాలని నిర్ణయించారు. కానీ.. భారీ వర్షం, పొగమంచు కారణంగా చివరి నిమిషంలో ల్యాండింగ్‌ను ప్రమదానికి మార్చారు.అయితే, రాత్రికి రాత్రే అక్టోబర్ 22వ తేదీన హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. సాధారణ నేల ఉపరితలంపై పెద్ద హెలికాప్టర్ దిగితే కూరుకుపోతుందని కారణంతో సుమారు ఒక అడుగు ఎత్తులో మెటల్ చిప్స్ వేసి దానిపై కాంక్రీట్ పోశారు. రాష్ట్రపతికి రాకకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో హెలిప్యాడ్‌పై వేసిన కాంక్రీట్ సరిగా పొడిబారలేదు. ఈ కారణంగా రాష్ట్రపతి కోసం వచ్చిన ఆర్మీ హెలికాప్టర్ హెలిప్యాడ్ వద్ద మట్టిలో కూరుకుపోయింది. కాగా, రాష్ట్రపతి పర్యటన కోసం ప్రమదంలో నిర్మించిన మూడు హెలిప్యాడ్ల కోసం రూ. 20.7 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఖర్చు మొత్తాన్ని పరిపాలనా ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు. దీన్ని వీఐపీ పర్యటనల కోసం కేటాయించిన నిధుల నుండి తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.SCARY 🚨 President Droupadi Murmu’s Helicopter wheels sink into newly concreted landing pad in Kerala.pic.twitter.com/s1jcvJNjZy— News Algebra (@NewsAlgebraIND) October 22, 2025హెలిప్యాడ్ నిర్మాణం – సాంకేతిక విశ్లేషణహెలిప్యాడ్కు అవసరమైన ప్రాథమిక ప్రమాణాలు పాటించాలి. హెలిప్యాడ్ నిర్మాణం సాధారణ కాంక్రీట్ స్లాబ్ కాదు. ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సిందే.a) నేల బలం (Soil Bearing Capacity–SBC)హెలికాప్టర్ బరువు + డైనమిక్ లోడ్‌ను తట్టుకునేలా నేల బలం ఉండాలి.సాధారణంగా 15–20 టన్నుల వరకు లోడ్‌ను తట్టుకునేలా SBC పరీక్షలు చేస్తారు.b) ఉపరితల సమతలీకరణ (Leveling)1–2% కంటే ఎక్కువ స్లోప్ ఉండకూడదు.హెలికాప్టర్ దిగేటప్పుడు చిన్న unevenness కూడా ప్రమాదకరం.c) కాంక్రీట్ గ్రేడ్సాధారణంగా M30 లేదా M35 గ్రేడ్ కాంక్రీట్ వాడాలి.ఇది అధిక బలం, కంప్రెషన్‌కు తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.d) రీన్ఫోర్స్మెంట్ (Steel Mesh)8mm–12mm స్టీల్ మెష్ తప్పనిసరి.ఇది కాంక్రీట్ క్రాక్ అవకుండా, లోడ్‌ను సమానంగా పంపిణీ చేస్తుంది.కాగా, కేరళలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ విషయంలో రాజకీయంగా కూడా విమర్శలకు దారి తీసింది. హెలిప్యాడ్ నిర్మాణం సరిగా చేయకపోవడం నిర్లక్ష్యమే అని అటు రాజకీయ నేతలు, ఇటు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ పనితీరులో ప్రణాళికల లోపం ఉందని ఆరోపించారు. రాష్ట్రపతి వంటి వారు వచ్చినప్పుడు కూడా సురక్షిత ఏర్పాట్లు చేయలేకపోయారని విమర్శలు చేశారు. పబ్లిక్ మనీ వృథా అయ్యిందని కామె. రాష్ట్రపతి పర్యటనలో అపశృతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. అధికార పక్షం మాత్రం ప్రతిపక్ష నేతల వాదనలను తోసిపుచ్చింది. ఇది అత్యవసర పరిస్థితి, వాతావరణ మార్పుల వల్ల హెలిప్యాడ్‌ను త్వరగా సిద్ధం చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల ఏ ప్రమాదం జరగలేదని వెల్లడించింది. -
తల్లీకుమారుల ఆత్మహత్య.. లేఖలో గుండె పగిలే నిజాలు!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 52 ఏళ్ల మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమారులు (32-27 ఏళ్లు) ఆత్మహత్య చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులతో పాటు ఒక బెయిలిఫ్ వారి నివాసానికి చేరుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. పోలీసులు తలుపులు పదేపదే తట్టినా, లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, వారు నకిలీ తాళంచెవి సహాయంతో ఇంట్లోకి ప్రవేశించారు. లోపల తల్లి, ఆమె ఇద్దరు కుమారులు ఒకే గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.చేతిరాత లేఖలో..ఘటనా స్థలంలో లభ్యమైన ఒకటిన్నర పేజీల చేతిరాత లేఖ ఈ సామూహిక మరణాలకుగల గల కారణాలను వెల్లడించింది. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ లేఖలో బాధిత ఆ కుటుంబం చాలా కాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనే సమచారం ఉంది. ఆ లేఖలో బాధితులు తమ మానసిక వేదన, ఆర్థిక ఒత్తిడులే తమ ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఆ లేఖలోని వివరాల ప్రకారం ఆ కుమారులిద్దరూ నిరుద్యోగులు. నిరాశలో కుంగిపోయిన కారణంగా ఏ పనీ చేయలేకపోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. మరణించిన ఇద్దరు సోదరులలో చిన్నవాడు(27 ఏళ్లు) యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.అద్దె బకాయిలు, అప్పుల ఊబిపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వారు కొని నెలలుగా నెలవారీ రూ. 25,000 అద్దెను కూడా చెల్లించలేకపోయారు. ఫలితంగా ఇంటి యజమాని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బాధిత కుటుంబం 2023, డిసెంబర్లో ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నది. నాడు ఆ మహిళ భర్త బతికే ఉన్నాడు. అతను ఒక ప్రాపర్టీ డీలర్‌గా పనిచేశాడు. అతను పరిచయస్తుల దగ్గర రుణాలు తీసుకున్నాడు. అతను 2024లో మరణించగా, ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కొంత కాలంగా ఆ కుటుంబంలోని వారు బయటకు రాకుండా ఆ ఇంటిలోనే కాలం గడుపుతున్నారు. ప్రాథమిక విచారణలో, రెండు నెలల క్రితం కూడా ఆ ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాలను ఎయిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ఘటన వెనుక గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వారికి లభ్యమైన ఆత్మహత్య లేఖ, ఇతర పత్రాలు, డిజిటల్ పరికరాలను పరిశీలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆకాశానికి రంగులు అద్దిన ఉల్కలు! -
వైరల్: బీజేపీ నేత కుమార్తెకు ఆకతాయిల వేధింపులు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సికంద్రారావు నోరంగాబాద్ ప్రాంతంలోని పశ్చిమి ప్రాంతంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కుమార్తె కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి ఆమెను వేధించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దాంతో బాధితులు సదరు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Molestation in daylight! 🚨⚠️Three youths on a bike molested two girls returning from coaching in Hathras, UP. In the CCTV video, they were seen touching the girls' cheeks inappropriately. Shameful!If Hathras victim had got justice, incidents like this wouldn't happen today. pic.twitter.com/VEihF68JUQ— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) December 12, 2025రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపనున్నట్లు డీఎస్పీ హిమాన్షు మాథుర్ తెలిపారు. ఇంకా పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. సదరు ఘటన స్థానికంగా కలకలం రేపడంతో విద్యార్థినులు, మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
‘గోవా కలెక్టర్ ఫోన్ చేసి..’ బిగ్గరగా రోదించిన బాధితురాలు..
న్యూఢిల్లీ: గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఢిల్లీకి చెందిన భావనా జోషి అయినవారిని కోల్పోయి, తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్నారు. గత శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె తన భర్త వినోద్ కుమార్ (43)తో పాటు తన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. కమలా జోషి (42), అనితా జోషి (41), సరోజ్ జోషి (39)లను కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 25 మంది మృతిచెందగా, భావన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్లబ్‌లోని అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చూస్తున్నంతలోనే ఎగసిపడి, కొందరి జీవితాలను బుగ్గిపాలు చేశాయి. క్లబ్లో నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, పైరోగన్ల వాడకం, గడ్డితో కూడిన పైకప్పు, పలు భద్రతా లోపాల కారణంగా మంటలు నిముషాల వ్యవధిలోనే అంతటా చుట్టుముట్టాయి.నృత్య కార్యక్రమం సందర్భంగా వెలిగించిన విద్యుత్ పైరోగన్లే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్లబ్లో తగినన్ని నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, మండే పదార్థాల వాడకం, మద్యం సీసాల నిల్వలు మొదలైనవి మంటల తీవ్రతను పెంచి, ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేస్తామని గోవా కలెక్టర్ కార్యాలయం నుండి తనకు కాల్స్ వస్తున్నాయని భావనా జోషి తెలిపారు. అయితే తమకు ఎలాంటి పరిహారం అవసరం లేదని, న్యాయం కావాలని అని ఆమె కోరారు. వారు ఇచ్చే రెండు లక్షలు నా కుటుంబాన్ని తిరిగి తీసుకువస్తాయా? అని ఆమె ప్రశ్నించారు. పరిహారం కంటే న్యాయమే తనకు ముఖ్యమని ఆమె రోదిస్తూ తెలిపారు.మృత సోదరీమణుల తల్లి మీనా మీడియాతో మాట్లాడుతూ ‘నేను నా పిల్లలను కోల్పోయాను. అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయాను. నేరస్థులు బెయిల్‌పై లేదా జరిమానాతో తప్పించుకోకుండా కఠిన శిక్షలు ఎదుర్కొనేలా చూడాలని’ ఆమె డిమాండ్ చేశారు. కమల భర్త నవీన్ కూడా అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు చేస్తూ.. పలు రెస్టారెంట్లు, క్లబ్‌లలో నిబంధనలు పాటించడం లేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలావుండగా నైట్‌క్లబ్ సహ యజమానులు, ఢిల్లీకి చెందిన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ నుండి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయారు. వారిని భారతదేశానికి తీసుకురావడానికి దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.నిందితులు గోవాలో ఈ క్లబ్ నిర్వహణకు భూ ఒప్పందపు నకిలీ కాపీని ఉపయోగించారని పోలీసు దర్యాప్తులో తేలింది. కాగా నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఢిల్లీ కోర్టు దానిని తిరస్కరించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ నిందితులను త్వరలోనే సంయుక్త దర్యాప్తు బృందం భారతదేశానికి తిరిగి తీసుకువస్తుందన్నారు. ఈ విచారణను కేవలం క్లబ్ యజమానులే కాకుండా, కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా ఎదుర్కొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు -
3–6 ఏళ్ల చిన్నారుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి
న్యూఢిల్లీ: దేశంలోని 3–6 ఏళ్ల మధ్య చిన్నారుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని రాజ్యసభ నామినేటెడ్ సభ్యురాలు సుధా మూర్తి కోరారు. ఈ చిన్నారులకు ఉచిత విద్య, సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వాలే చేపట్టాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21బీ సవరించవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రైవేట్ బిల్లును శుక్రవారం ఆమె రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ‘చిన్నారులే మనందరి భవిష్యత్తు. వారు ఉదయించే సూర్యుని వంటివారు. ప్రారంభ విద్య వారి జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతమున్న 6– 14 ఏళ్లకు బదులుగా 3– 14 ఏళ్లకు ప్రభుత్వమే ఉచితంగా విద్య, సంరక్షణను అందించేందుకు వీలు కలి్పంచేలా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని రాజ్యసభలో ఆమె తెలిపారు. చిన్నారులకు మంచి విద్యనందించడం ఎంతో కీలకమని నూతన విద్యా విధానం కూడా చెబుతోందన్నారు. -
పార్లమెంట్ ప్రాంగణంలో ఈ–సిగరెట్.. ఆ ఎంపీపై చర్యలు తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ ఈ–సిగరెట్ తాగుతూ దొరికిపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సౌగతా రాయ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా సదరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సౌగతా రాయ్ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిషేధిత ఈ–సిగరెట్ తాగుతూ కనిపించారు. అనురాగ్ ఠాకూర్ ఈ అంశాన్ని ఆదేరోజు లోక్‌సభలో ప్రస్తావించారు. పవిత్రమైన పార్లమెంట్లో సిగరెట్ తాగడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సౌగతా రాయ్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. దాంతో అనురాగ్ ఠాకూర్ శుక్రవారం లిఖిపూర్వక ఫిర్యాదు అందించారు. నిషేధిత సిగరెట్ తాగడం చట్టప్రకారం తీవ్రమైన నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్లమెంట్ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై మండిపడ్డారు. యువతకు ప్రమాదకరమైన సందేశం ఇచ్చారని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిందితుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఈ–సిగరెట్లను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిషేధించింది. ఇదిలా ఉండగా, ఈ–సిగరెట్ తాగడం చిన్న విషయమని, దీనిపై రాద్ధాంతం అవసరం లేదని సౌగతా రాయ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. మరోవైపు అనురాగ్ ఠాకూర్ తీరును తృణమూల్ కాంగ్రెస్ మరో ఎంపీ కీర్తి ఆజాద్ తప్పుపట్టారు. లిఖితపూర్వక ఫిర్యాదులో సౌగతా రాయ్ పేరు ఎందుకు ప్రస్తావించలేదని కీర్తి ఆజాద్ ప్రశ్నించారు. -
పరస్పర ఆరోపణలు పక్కనపెట్టి కాలుష్యంపై చర్చిద్దాం
న్యూఢిల్లీ: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికార, విపక్షాలు కలిసికట్టుగా కృషి చేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విన్నవించారు. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం పక్కనపెట్టి.. వాయు కాలుష్యంపై అధికార, విపక్ష సభ్యులు కలిసి సభలో సమగ్ర చర్చ జరపాలని కోరారు. ప్రజల ఇక్కట్లు తీర్చడానికి ఇరుపక్షాలు కలిసి పని చేస్తాయన్న సందేశాన్ని ఇద్దామన్నారు. దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న కాలుష్యంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాన నగరాల్లో ప్రజలు విష వాయువు దుప్పటి కింద నివసిస్తున్నారని చెప్పారు. లక్షలాది మంది చిన్నారులు ఉపిరితిత్తుల జబ్బుల బారిన పడుతున్నారని, వారి భవిష్యత్తు దెబ్బతింటోందని అన్నారు. ప్రజలు క్యాన్సర్ పీడితులుగా మారుతున్నారని, వృద్ధులు శ్వాస సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలుష్య సమస్యపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని కోరారు. శుక్రవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన కాలుష్యం రాజకీయ సిద్ధాంతపరమైన అంశం కాదని అన్నారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కార మార్గం కనిపెట్టాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు. చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు రాహుల్ విజ్ఞప్తిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సానుకూలంగా స్పందించారు. కాలుష్యంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. దీనిపై లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమయం కేటాయిస్తుందన్నారు. -
1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు 36 మందికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. జీవితంలో మర్చిపోలేని విషాదానికి గురైన వీరంతా నాలుగు దశాబ్ధాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని సీఎం గుప్తా పేర్కొన్నారు. ఇది కేవలం ఉద్యోగ కల్పనే కాదు, వారి ఆత్మగౌరవాన్ని, హక్కులను, గుర్తింపును పునరుద్ధరించడమేనని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బాధిత కుటుంబాలకు పారదర్శక, సత్వర ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారని చెప్పారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1984లో అంగరక్షకుల కాల్పుల్లో చనిపోవడం తెల్సిందే. అనంతరం ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కుటుంబసభ్యులను కోల్పోయిన 19 మందికి ప్రభుత్వ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలిచి్చంది. తాజాగా నియామక పత్రాలిచి్చన వారితో కలిపితే ఇప్పటి వరకు 55 మందికి ఉద్యోగా లిచి్చనట్లయింది. -
‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు
చెన్నై: భారతీయ రైల్వేలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించే లక్ష్యంతో భారతీయ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే నెట్వర్క్ అంతటా వివిధ అవసరాలను తీర్చేందుకు తాత్కాలికంగా 5,058 మంది మాజీ సైనికులను (Ex-Servicemen) పాయింట్స్మెన్లుగా నియమించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. రెగ్యులర్ రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ఈ మాజీ సైనికులు విధులు నిర్వహిస్తారు. ఈ మేరకు రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై రైల్వే కార్మిక యూనియన్లు మండిపడుతున్నాయి.ఈ తాత్కాలిక నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ల ద్వారా సాధారణ అభ్యర్థులను నియమించే వరకు ఆపరేషనల్ అవసరాలను తీర్చడానికి ఉపకరిస్తాయి. మాజీ సైనికుల సంక్షేమ బోర్డుల ద్వారా ఈ నియామకాలు చేపట్టాలని రైల్వే బోర్డు ఆదేశించింది. వీరి ప్రారంభ ఒప్పందం 2026 డిసెంబర్ 31వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఖాళీలను బట్టి పొడిగింపు అవకాశం ఉంటుంది. పాయింట్స్‌మ్యాన్ పాత్ర చాలా కీలకం. ఇందులో ట్రాక్ స్విచ్‌లు, సిగ్నల్ల మాన్యువల్ ఆపరేషన్, రైళ్లను సురక్షితంగా నడిపించడం, షంటింగ్, ప్రమాద రహిత రైలు కదలికకు స్టేషన్ మాస్టర్‌కు సహాయం చేయడం తదితర బాధ్యతలు ఉంటాయి.అయితే మాజీ సైనికులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే ఈ నిర్ణయంపై రైల్వే కార్మిక సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు ఎన్. కన్నయ్య మాట్లాడుతూ కీలకమైన భద్రతా-సంబంధిత పాత్రలలో కాంట్రాక్టు సిబ్బందిని నియమించడాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయన్నారు. స్వల్పకాలిక కాంట్రాక్టులపై నూతన సిబ్బందిని భద్రతా వ్యవస్థలను నిర్వహించడానికి అనుమతిస్తే భద్రతకు ముప్పువాటిల్లుతుందన్నారు. ఈ పోస్టులలో చేరేవారికి దీర్ఘకాలిక జవాబుదారీతనం లేదా బాధ్యత ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు పాయింట్స్మెన్లకు సూచించిన శిక్షణ పొందుతారు. కాంట్రాక్టు వేతనం అందుకుంటారు. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే వారిని ఫీల్డ్‌లో పోస్ట్ చేస్తారు. శిక్షణలో ఉత్తీర్ణులుకాని లేదా అనర్హులుగా తేలిన వారిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోరు. అయితే వారికి వారి శిక్షణ కాలానికి ఒప్పంద నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.గతంలో జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ నియామకాలు భద్రతాపరమైన ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. 2024, అక్టోబర్ 11న దక్షిణ రైల్వేలోని కవరపేటై స్టేషన్లో జరిగిన రైలు ప్రమాద విచారణలో రైల్వే భద్రతా కమిషనర్ (సీఎస్ఆర్) చేసిన సూచనలను గుర్తుచేస్తున్నాయి. నాటి ఘటనను సీఆర్ఎస్ విధ్వంసంగా వర్గీకరిస్తూ, భద్రతా పరంగా కీలకప్రాంతాలలో కాంట్రాక్టు సిబ్బందిని మోహరించే పద్ధతిని సమీక్షించాలని, దీర్ఘకాలికంగా ఈ సంఖ్యను సున్నాకి తగ్గించాలని రైల్వే బోర్డుకు స్పష్టంగా సిఫార్సు చేసింది.కాగా సిబ్బంది కొరతను తక్షణమే తీర్చేందుకు రైల్వే బోర్డు తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం, ఒకవైపు మాజీ సైనికులకు ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, మరోవైపు కార్మిక సంఘాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు ఈ నిర్ణయంతో భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వేలు గతంలోనూ రిటైర్డ్ సిబ్బందిని తిరిగి నియమించుకోవడం లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాయి. -
చిలుక తెచ్చిన తంటా
కర్ణాటక: చిలుకను రక్షించబోయి యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన సంఘటన బెంగళూరు గిరినగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. అరుణ్‌కుమార్(32) అనే వ్యక్తి ఫారిన్ నుంచి రూ.2 లక్షల విలువైన చిలుకను కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. అది ఎగిరి వెళ్లి అపార్ట్మెంట్ లోపలి నుంచి వేయబడ్డ హైటెన్షన్ విద్యుత్ తంతిపై వాలింది. అరుణ్‌కుమార్ స్టీల్ పైప్‌కి కర్ర కట్టి అపార్ట్మెంట్ కాంపౌండ్ గోడ ఎక్కి చిలుకను రక్షిస్తుండగా విద్యుత్ షాక్‌కి గురై మృతిచెందాడు. గిరినగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మలయాళ నటి కేసులో ఆరుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష
కొచ్చి: కేరళలో 2017లో సంచలనం సృష్టించిన బహుభాషా నటిపై గ్యాంగ్ రేప్ ఘటనలో కోర్టు ఆరుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మరో నిందితుడ, మలయాళ నటుడు దిలీప్‌కు కోర్టు ఇటీవలే బయటపడటం తెల్సిందే. ఎర్నాకులం జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి హనీ ఎం వర్గీస్ శుక్రవారం సునీల్ ఎన్ఎస్ అలియాస్ పల్సర్ సునీ, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజేష్, సలీం, ప్రదీప్ అనే వారికి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన నేరానికి గాను 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. వీరికి వివిధ నేరాలకు పాల్పడినందుకు గాను అదనంగా జైలు శిక్షలు, వేర్వేరు జరిమానాలు సైతం విధించారు. అశ్లీల వీడియోను ఇతరులకు షేర్ చేసిన నేరానికి గాను సునీకి అదనంగా మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా, సాక్ష్యాన్ని నాశనం చేసిన నేరానికి మార్టిన్‌కు మూడేళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధించారు. ఈ శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని, బెయిల్‌కు ముందు రిమాండ్‌లో కలిపిన కాలాన్ని కూడా శిక్షలో భాగంగానే పరిగణించాలని స్పష్టం చేశారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారమివ్వాలని, లైంగికదాడి దృశ్యాలున్న పెన్‌డ్రైవ్‌ను విచారణాధికారి కస్టడీలో ఉంచాలని జడ్జి తెలిపారు. నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తెలిపిన అంశాలనే ఈ కేసుకు కూడా వర్తింప జేసినట్లు చెప్పారు. ఈ తీర్పు తమకు నిరుత్సాహం కలిగించిందని, దోషులందరికీ కోర్టు యావజ్జీవ కారాగారం విధిస్తుందని భావించామని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజా కుమార్ చెప్పారు. దీనిపై త్వరలో కేరళ హైకోర్టుకు వెళతామన్నారు. ఈ నెల 8వ తేదీన ఇదే కేసులో నటుడు దిలీప్ సహా నలుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
LIVE Updates: అపర్ణ మెస్సీ టీమ్‌పై రేవంత్ టీమ్ విజయం
GOAT India Tour: దేశంలో మెస్సీ మేనియా కొనసాగుతోంది. ఎటు చూసినా ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీ కోసం.. -
ప్రేమతో పిలిస్తే కాదనగలమా?
శివాజీనగర: ‘రోజూ స్థానికుల్లో ఎవరో ఒకరు, మా నియోజకవర్గం వారు ప్రేమతో భోజనం తీసుకొచ్చి ఇస్తున్నారు. భోజనం వద్దని అనగలమా? ప్రేమతో ఆహ్వానిస్తారు.. అందుకే ఒక్కొక్క రోజు ఒక్కో చోటుకు భోజనానికి వెళుతున్నాం. ఇది ఏ విందు భోజన సమావేశమూ కాదు’ అని డీసీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం బెళగావి సర్క్యూట్ హౌస్ వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు శివకుమార్ సమాధానం చెప్పారు. బెళగావి శివార్లలో గురువారం రాత్రి ఎమ్మెల్యేలు విందు భోజనం చేశారనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘నా నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడ పని చేస్తున్నాడు. అతని ఇంటి నుంచి ముద్ద, పప్పు, చారు తయారు చేసి పంపిస్తామని చెప్పాడు. ఇలా ప్రేమతో ఆహ్వానించినప్పుడు రాలేనని చెప్పగలమా?’ అని అన్నారు. ‘దొడ్డణ్ణ బెళగావి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, నా మిత్రుడు. వారిది పెద్ద కుటుంబం. గత 15 సంవత్సరాల నుంచి తమ ఇంటికి భోజనానికి రావాలని పిలుస్తుండేవారు. మా కాంగ్రెస్ కుటుంబం వారిని మరవటానికి సాధ్యమా? అందువల్ల నాతో పాటు కొంతమంది ప్రజలు భోజనానికి వెళ్లాం.. అంతే! అందులో ఎలాంటి విందు భోజన సమావేశమూ లేదు’ అని తెలిపారు. శనివారం తమను ఆసిఫ్ సేఠ్, ఫిరోజ్ సేఠ్‡ భోజనానికి పిలిచారన్నారు. చిన్నస్వామిలో క్రికెట్ మ్యాచులకు గ్రీన్‌సిగ్నల్ చిన్నస్వామి క్రీడా మైదానంలో క్రికెట్ మ్యాచుల నిర్వహణకు అనుమతి కలి్పంచిన విషయమై అడిగిన ప్రశ్నకు డీకే స్పందిస్తూ.. బెంగళూరు గౌరవాన్ని కాపాడేందుకు తాము అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని చిన్నస్వామి క్రీడామైదానంలో క్రికెట్ మ్యాచులకు అనుమతి కలి్పంచామన్నారు. ఈ విషయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల బాధ్యతను హోంమంత్రి పరమేశ్వర్‌కు అప్పగించామన్నారు. కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ బృందం, పోలీసు అధికారులు కూర్చొని చర్చిస్తారన్నారు. -
ప్రియుడు వద్దని.. భర్తే సర్వస్వమని..
కర్ణాటక: ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్‌స్టా తదితర యాప్‌లతో పరిచయాలు పెరగడం, జీవిత భాగస్వాములు వదిలేసి వెళ్లడం మామూలు విషయమైంది. దీనివల్ల గొడవలు జరిగి కుటుంబాలు రోడ్ల పాలవుతుంటే అభం శుభం తెలియని పిల్లల జీవితం ఛిద్రమవుతోంది. బెంగళూరు బన్నేరుఘట్ట పరిధిలో ఇదే మాదిరిగా భర్తను వదిలేసి ప్రియునితో వెళ్లిపోయిన మహిళ.. కొన్ని నెలల తరువాత మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది. దీంతో కథ సుఖాంతమైందని స్థానికులు నిట్టూర్చారు.ఏం జరిగింది..సెప్టెంబరు ఆఖర్లో లీల అనే మహిళ భర్త, క్యాబ్‌డ్రైవర్ మంజునాథ్, ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడు సంతుతో వెళ్లిపోయింది. మంజు కన్నీరు కారుస్తూ తన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తిరిగి రావాలని విలపిస్తూ చేసిన వీడియో ప్రచారమైంది. తాను మాత్రం సంతుతోనే ఉంటానని లీల చెప్పింది. సంతు, లీల సరదా ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ బాగోతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.లీలాలో పరివర్తన..నెలన్నర కిందట మంజు కోపం పట్టలేక సంతును వెతికిపట్టుకుని చితకబాదాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ కేసులో మంజును అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే విడుదలై కొత్త ఆటోను కొనుక్కుని పిల్లలను పోషిస్తున్నాడు. ఇంతలో లీల మనసులో ఏం పరివర్తన వచ్చిందో గానీ ప్రియున్ని వదిలేసి భర్త చెంతకు చేరింది. మంజు ఆమెను ఆత్మీయంగా స్వాగతించాడు. బన్నేరుఘట్టలోని అద్దె ఇంట్లో కులాసాగా కాపురం ప్రారంభించారు. త్వరలో ధర్మస్థలలో మళ్లీ పెళ్లి చేసుకుంటామని, అన్నీ మరచిపోయి సంతోషంగా జీవిస్తామని ఈ జంట చెబుతోంది. ఇది చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు అని కొందరు నెటిజన్లు వాపోతే, మరికొందరు దీవించారు. -
ఇలాంటి కేసులతో పరువు తీయకండి
న్యూఢిల్లీ: విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) పరిధి నుంచి మైనారిటీ స్కూళ్లను మినహాయిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులతో న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చవద్దని హెచ్చరించింది. న్యాయవ్యవస్థను కూలి్చవేద్దామనుకుంటున్నారా అంటూ దుయ్యబట్టింది. పిటిషనర్‌ను రూ.లక్ష జరిమానా విధించిన న్యాయస్థానం.. ఇలాంటి కేసులు వేయాలనుకునే వారికి ఇదో గుణపాఠం కావాలని వ్యాఖ్యానించింది. ఆర్టీఈ పరిధి నుంచి మైనారిటీ స్కూళ్లకు మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టీఈ లక్ష్యాలకు వ్యతిరేకమని పేర్కొంటూ యునైటెడ్ వాయిస్ ఫర్ ఎడ్యుకేషన్ ఫోరం అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘మీరు సుప్రీంకోర్టులో ఇలాంటి కేసును వేసి మాకు తీవ్ర ఆగ్రహం తెప్పించారు. ఇలాంటి కేసులు దేశ న్యాయ వ్యవస్థ స్థాయిని తగ్గించేవి. ఈ కేసు తీవ్రత ఏమిటో మీకు తెలియదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రిట్ వేసినందుకు వాస్తవానికి ధిక్కారం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ, ఇప్పటికి వదిలేస్తున్నాం. లక్ష రూపాయల జరిమానాతో సరిపెడుతున్నాం’అంటూ పిటిషనర్‌పై నిప్పులు చెరిగింది. ఇటువంటి కేసులు వేయాలని సలహాలిచ్చే లాయర్లపైనా జరిమానా విధించవలసి ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది. సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పు ప్రకారం..విద్యా హక్కు చట్టం నిబంధనలు మైనారిటీ స్కూళ్లకు వర్తించవు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 30(1) మత, భాషాపరమైన మైనారిటీలు సొంతంగా విద్యాసంస్థలను నెలకొల్పుకుని, వాటిని స్వయంగా నిర్వహించుకునేందుకు వీలు కలి్పస్తోంది. -
అలాంటి వాటిని మేం పట్టించుకోం
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులపై మీడియాలో వచ్చే అసమగ్ర, సత్యదూరమైన కథనాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివి ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. ప్రచారం కోసమో సొంత అభిప్రాయాన్ని తెలిపేందుకో వచ్చే ఇటువంటి కథనాల మాయలో తాము పడబోమని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌కు పంపించిన కొందరు వ్యక్తులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే కేసు విషయమై శుక్రవారం చేపట్టిన విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విజయ్ మాల్యాబాగి్చ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన మేరకు.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన సునాలి ఖాతూన్ అనే గర్భిణీతోపాటు ఆమె 8 ఏళ్ల కుమారుడిని అధికారులు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్లో ఉంటున్న తండ్రి వద్దకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా లాయర్లు ధర్మాసనానికి నివేదించారు. ఆమెకు వైద్యసాయం అందుతోందని కూడా తెలిపారు. సరైన విచారణ జరపకుండానే కొందరిని బంగ్లాదేశ్‌కు పంపించారంటూ కలకత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌పై జనవరి 6వ తేదీన విచారణ చేపడతామంది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సరైన విచారణ చేపట్టకుండానే బంగ్లాదేశ్ పౌరులంటూ కేంద్రం కొందరిని బలవంతంగా పంపించి వేసిందంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే ఉద్దేశంతోనే ఇలాంటివి వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఇలా ప్రచారం కోసం చేసే స్టంట్లకు తాము దూరంగా ఉంటామని స్పష్టం చేసిన ధర్మాసనం..వీటిని పట్టించుకోవద్దని తుషార్ మెహతాను కూడా కోరింది. ‘వాస్తవానికి న్యాయ వ్యవస్థపై మీడియా ఇలా వ్యాఖ్యానాలను చేయరాదు. మీరు ఇటువంటి అంశాలను ప్రస్తావించడం మంచిదే. సంబంధిత కథనంతో మీకు ఆవేదన కలగడం పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం’అని ధర్మాసనం తెలిపింది. అమెరికా, యూకేల్లో వలసలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై అంతర్జాతీయంగా కథనాలు వస్తున్నాయని, సోషల్ మీడియా, ఇతర వేదికలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయని సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ ధర్మాసనం ఎదుట వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో 20 ఏళ్లుగా ఉంటున్న స్వీటీ బీబీ, ఆమె భర్త, ఇద్దరు పిల్లలను కూడా అధికారులు బంగ్లాదేశ్‌లోకి పంపించారని మరో లాయర్ సంజయ్ హెగ్డే ప్రస్తావించగా, ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దృష్టికి తీసుకెళ్లాలని ధర్మాసనం కోరింది. -
జుబీన్ గార్గ్ మరణంపై చార్జిషీట్
గౌహతి: ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆర్గనైజర్, వ్యక్తిగత సెక్రటరీ సహా నలుగురు నిందితులపై హత్య అభియోగాలు మోపింది. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్‌గా హాజరయ్యేందుకు సింగపూర్ వెళ్లిన జుబీన్ గార్గ్.. సెపె్టంబర్ 19న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు, అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అభిమానుల ఆందోళనల నేపథ్యంలో ఈకేసును దర్యాప్తు చేయడానికి అస్సాం ప్రభుత్వం స్పెషల్ డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు, అనేక అరెస్టులు, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం శుక్రవారం ఉదయం సిట్.. 3500పేజీల చార్జిషీటును కోర్టుకు సమర్పించింది. ఈకేçసులో 300 మందికి పైగా విచారించినట్లు, ఏడుగురిని అరెస్టు చేసినట్లు సిట్ పేర్కొంది. ఈ చార్జిషీట్‌ను నాలుగు పెద్ద ట్రంక్ పెట్టెల్లో కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో జుబీన్ అభిమానులు కోర్టు బయట పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘జస్టిస్ ఫర్ జుబీన్’ అంటూ నినాదాలు చేశారు. -
రామమందిర వార్షికోత్సవాలు 31నుంచి
అయోధ్య: ఏళ్ల కిందటి హిందువుల కలను నెరవేరుస్తూ నిర్మితమైన రామమందిరం రెండో వార్షికోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 31నుంచి పవిత్రోత్సవాలు జరుగుతాయని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శుక్రవారం తెలిపింది. ఈ సంవత్సరం వార్షికోత్సవాన్ని ‘ప్రతిష్ఠ ద్వాదశి‘గా జరుపుకొంటామని వెల్లడించింది. ఆలయ సముదాయంలోని ఏడు ఉప ఆలయాల శిఖరాలపై ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వేడుకకు సంబంధించిన ముసాయిదాను నేడు జరగనున్న సమావేశంలో ఖరారు చేస్తారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిసెంబర్ 31న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని ట్రస్ట్ అధికారులు తెలిపారు. ఏడు ఉప ఆలయాల శిఖరాలపై ఇద్దరు నాయకులు సంయుక్తంగా జెండాలను ఎగురవేస్తారన్నారు. నవంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ పర్యటన సందర్భంగా, ఆలయ ప్రధాన శిఖరంపై జెండాను ఎగురవేసినప్పుడు, ఈ ఏడు ఆలయాల శిఖరాలపై జెండాలను ఎగురవేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని, ఆలయాల పనులు పెండింగ్‌లో ఉండటం, అనివార్య కారణాల వల్ల ఈ ప్రణాళిక వాయిదా పడిందని ట్రస్టŠట్ వర్గాలు తెలిపాయి. అలంకరణతో సహా ఏడు దేవాలయాల పనులు ఇప్పుడు పూర్తయ్యాయని, ‘ప్రతిష్ఠ ద్వాదశి’ వేడుకల సందర్భంగా జెండాలను ఎగురవేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించాయి. ఈ వేడుకకు సంబంధించిన ఆచారాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. -
తండ్రి సొంతింటి కల నెరవేర్చిన బిడ్డ
అహ్మదాబాద్‌లోని కొత్త ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్న 61 ఏళ్ల గిర్ధర్‌భాయ్ జిరావాలా కళ్ల ముందు.. విషాద జ్ఞాపకాలు ఒకేసారి మెదిలాయి. వజ్రాల పాలిషింగ్ కార్మికునిగా కష్టపడి జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆయన, ప్రస్తుత సొంత ఇంటిని, కొత్త ఫర్నిచర్‌ను చూస్తున్న ప్రతిసారీ, గుండెలో ఏదో తెలియని భారం. ఎందుకంటే, ఇది ఆయన కష్టంతో కొనుక్కున్న ఇల్లు కాదు. అది.. మరణానంతరం ఆయన పెద్ద కొడుకు మహేష్ జిరావాలా నెరవేర్చిన వాగ్దానం. కొద్ది రోజుల ముందు, గిర్ధర్‌భాయ్‌కి గుండెపోటు వచి్చంది. అప్పటివరకు కుటుంబంపై ఉన్న కొంత అప్పుల భారం, నరోడా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఆరుగురు సభ్యుల జీవితం.. ఇవన్నీ ఆయనకు నిద్ర పట్టనివ్వలేదు. నేనున్నాను నాన్నా..కానీ, 34 ఏళ్ల సినీ నిర్మాత మహేష్, అన్నీ తానై తండ్రిని చూసుకునేవాడు. తండ్రి బాధను చూసి తట్టుకోలేక, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ‘నాన్నా! మీరు ఇకపై పనికి వెళ్లొద్దు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. నా తాజా సినిమాల నుంచి మంచి ఆదాయం వస్తుంది, దీపావళి లోపు అప్పులన్నీ తీర్చేసి, కొత్త ఇంటిని కొనుగోలు చేస్తాను’.. అని గట్టిగా మాటిచ్చాడు. ఆకాశం నుంచి దిగిన మృత్యువుఅప్పటికి మహేష్.. హేతల్ను వివాహం చేసుకుని కేవలం మూడు నెలలే అయింది. కొత్త జీవితం, పెద్ద కలలు.. కుటుంబమంతా ఆశగా దీపావళి పండుగ కోసం ఎదురుచూస్తోంది. కానీ, ఆశలకు ఆయుష్షు తక్కువైంది. జూన్ 12వ తేదీ.. విధి వక్రీకరించింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలి, అగి్నకీలల్లో చిక్కుకుంది. ఆ భయంకరమైన విషాదంలో విమానంలోని ప్రయాణికులే కాక, నేల మీదున్న 19 మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్ పక్కన రోడ్డుపై నుంచి వెళ్తున్న మహేష్ జిరావాలా కూడా ఆ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మరణం తర్వాత నెరవేరిన కల మహేష్ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచినా, అతని వాగ్దానాన్ని మాత్రం మరిచిపోలేదు. విమాన ప్రమాదంలో పరిహారంగా ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ నుంచి మహేష్ కుటుంబానికి రూ.1.25 కోట్లు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా హేతల్‌కు పరిహారంగా రూ.4 లక్షలు లభించాయి. మొత్తంగా అందిన రూ.1.29 కోట్ల నుంచి, మహేష్ భార్య హేతల్ తన వాటా కింద రూ.54 లక్షలు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మిగిలిన రూ.75 లక్షలు గిర్ధర్‌భాయ్ చేతికొచ్చాయి. కొడుకు కల నెరవేర్చాను.. కళ్లలో వేదన సుడులు తిరుగుతున్నా, గిర్ధర్‌భాయ్ మనసులో తన కొడుకు కోరికను నెరవేర్చాలనే తపన బలంగా ఉంది. ‘ఆ రూ.75 లక్షలతో, ముందుగా మహేష్ కలలుగన్నట్టు రూ.15 లక్షల అప్పును తీర్చేశాను. ఆ తర్వాత, రూ.45 లక్షలతో ఇంటిని కొనుగోలు చేశాను.. ఇలా నా కొడుకు కోరికను నెరవేర్చాను’.. అని గిర్ధర్‌భాయ్ చెప్పారు. కొత్త ఇంట్లో ఫర్నిచర్ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి, మిగిలిన రూ.5 లక్షలను తన మనవరాలి (తమ్ముడు కార్తీక్ కూతురు) భవిష్యత్తు కోసం పక్కన పెట్టారు. మహేష్ ఆ చిన్నారికి ఆరేళ్లు రాగానే దత్తత తీసుకోవాలని కలలు కనేవాడు. ‘ఆ రూ.75 లక్షల్లో ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలకపోయినా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇకపై పనిచేయలేను. నా కొడుకు మరణం తర్వాత కూడా మా కుటుంబానికి గౌరవాన్ని అందించాడు’.. అని వణుకుతున్న గొంతుతో గిర్ధర్‌భాయ్ చెప్పారు. ఆకాశం నుంచి దిగిన మృత్యువు మహేష్‌ను దూరం చేసింది. కానీ, ఆ బిడ్డ త్యాగం ఒక తండ్రికి.. ఒక కుటుంబానికి ఆర్థిక ఆసరా కలి్పంచింది. సొంత ఇంటి కల నెరవేర్చి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ఇది ప్రేమ.. వాగ్దానం ముందు మరణం కూడా ఓడిపోయిన విషాదగాథ.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అందర్నీ చంద్రుడిపైకి తరలించమంటారా?
న్యూఢిల్లీ: దేశంలోని 75 శాతం జనాభా భూకంపాలు సంభవించే ప్రమాదకర జోన్లోనే ఉన్నారని, భూకంప నష్టం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకర్టు అసహనం వ్యక్తం చేసింది. అంటే, ఇక్కడున్న అందరిని చంద్రుడిపై తరలించమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఎదుట పిటిషనర్ స్వయంగా వాదనలు వినిపించారు. రాజధాని ఢిల్లీ మాత్రమే భూకంప ప్రమాదమున్న చోట ఉందని ఇప్పటి వరకు అంతా భావించేవారని, దేశంలోని 75 శాతం ప్రజలకు భూకంపాల ప్రమాదం ఉందని ఇటీవలి అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు. అయితే, చంద్రమండలంపైకి వీళ్లందర్నీ పంపించాలంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది. నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిటిషనర్ కోరగా ‘విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. అది కోర్టుల పని కాదు’అంటూ ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. భూకంప ప్రమాదాలకు సంబంధించిన వార్తా కథనాలను చూపించగా, తాము వాటిని పట్టించుకోమని వ్యాఖ్యానించింది. -
ఇండిగో సీఈవోపై ప్రశ్నల వర్షం
ముంబై/న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు తో తలెత్తిన సంక్షోభంపై సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ విచారణ కొనసాగుతోంది. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు శుక్రవారం వరుసగా రెండో రోజూ పీటర్ ఎల్బర్స్‌ను దాదాపు ఏడుగంటలపాటు ప్రశ్నించారు. ఇండిగో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇసిడ్రోను కూడా ఐదుగంటలపాటు విచారణ జరిపారు. అదేవిధంగా, విమానాల రాకపో కలను పర్యవేక్షించడంలో లోపాలను గుర్తించిన డీజీసీఏ అధికారులు అందుకు బాధ్యులైన నలుగురు ఫ్లయిట్ ఆప రేషన్స్ ఇన్స్పెక్టర్లను తొలగించారు. ప్రయా ణికులకు పరిహారంగా రూ.10వేల చొప్పున ట్రావెల్ వోచర్లు ఇస్తే, సంస్థపై రూ.500 కోట్ల వరకు భారం పడుతుందని ఇండిగో శుక్రవా రం తెలిపింది. అంతేకాదు, విమాన రాకపో కల్లో మూల కారణాన్ని తెలుసుకునేందుకు వైమానిక రంగ నిపుణుడిని నియమిస్తున్నట్లు తెలిపింది. రివైజ్డు తగ్గింపు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం 2 వేలకు పైగా విమానాలను నడిపినట్లు తెలిపింది. -
ఫోన్ ఆఫ్.. బంధాలు ఆన్!
సెల్‌ఫోన్..సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. యావత్ ప్రపంచాన్నీ గుప్పిట పెట్టేసింది. ఇది లేకపోతే ఎలా అన్నంతగా దైనందిన జీవితంలో మమేకమైంది. అయితే ఈ అద్భుత ఉపకరణం ఇతరత్రా దుష్ప్రభావాల మాటెలా ఉన్నా..కుటుంబ సభ్యుల అంతరాన్నీ గణనీయంగా పెంచుతోంది. అతిగా మొబైల్ ఫోన్ వాడకం కుటుంబ బంధాలు బీటలు పడడానికి కారణం అవుతోంది. ఇలాంటి సెల్‌ఫోన్‌ను కాసేపైనా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తే..! ఇతరత్రా ప్రయోజనాలతో పాటు జీవితంలోని అనేక మధుర క్షణాలను ఆస్వాదించే అవకాశమూ లభిస్తుందని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో చెబుతోంది.చిన్న పనే..పెద్ద ప్రభావంఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సాధారణంగా ఒక్క భోజన సమయంలోనే కుటుంబ సభ్యులంతా కలుస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో కూడా ఫోన్ మాట్లాడటం లేదా వీడియోలు చూస్తుండటం అలవాటుగా మారిపోయింది. అయితే కనీసం ఆ టైమ్‌లోనైనా ఎలాంటి అంతరాయానికి తావు లేకుండా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. బంధాలు బలపడటం ఖాయమని వివో స్విచ్ ఆఫ్ స్టడీ–2025 వెల్లడిస్తోంది.శ్రేయస్సు, వ్యక్తిగత వృద్ధిని పెంపొందించుకోవడానికే ప్రజలు సాంకేతికతను ఉపయోగించుకోవాలని, ప్రియమైనవారితో లోతైన సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచిస్తోంది. ఫోన్లు లేని క్షణాలు తమకు మధురానుభూతులు మిగిలిస్తున్నాయని, బలమైన బంధానికి బాటలు వేస్తున్నాయని తల్లిదండ్రులు, పిల్లలు సైతం భావిస్తుండడం విశేషం. ‘స్విచ్ ఆఫ్’ ఆలోచన చాలా చిన్నదే కావొచ్చు. కానీ కాస్త పరిణితి ప్రదర్శిస్తే అదో శక్తివంతమైన విధానంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.ఏం చేయాలి..?భోజన సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పిల్లలతో ఎక్కువ అనుబంధం ఏర్పడినట్టు 81% మంది తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు ఫోన్లలో బిజీగా ఉండటం వల్లే తాము వారితో తక్కువగా మాట్లాడుతున్నామని, ప్రత్యామ్నాయంగా ఏఐ వైపు మొగ్గు చూపుతున్నామని 67% మంది పిల్లలు చెబుతున్నారు.ఏది ఏమైనా గ్యాడెŠజ్ట్స్ను పక్కన పెట్టినప్పుడు కుటుంబంలో సంభాషణలు సులభంగా, అర్థవంతంగా అనిపిస్తాయన్నది 91% మంది పిల్లల మాట. నోటిఫికేషన్స్‌ను తగ్గించేలా ఫోన్ సెట్టింగ్స్ మార్చడం, అందరూ కూర్చునే ప్రదేశాలకు దూరంగా ఉపకరణాన్ని ఉంచడం వంటి చిన్నచిన్న మార్పులతో తల్లిదండ్రులు, పిల్లలు ప్రయోగాలు చేస్తున్నారు. ఫోన్ రహిత అలవాట్లను ఎంత ఎక్కువగా పాటిస్తే నిజమైన మధుర క్షణాలను పదిలపర్చుకోవచ్చని వారు అంటున్నారు.ఎవరెవరు పాల్గొన్నారంటే..స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడడం వల్ల తల్లిదండ్రులు–పిల్లల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సైబర్ మీడియా రీసెర్చ్‌తో కలిసి వివో ఈ అధ్యయనం చేపట్టింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల నుంచి 1,017 మంది తల్లిదండ్రులు, 500 మంది పిల్లలు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో పెద్దల వయసు 35–50 కాగా, పిల్లలు 10–16 ఏళ్లవారు.స్టడీ హైలైట్స్⇒ రాత్రి భోజనం సమయంలోనే 72% మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.⇒ డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లలో మునిగితేలడం సంభాషణకు ప్రధాన నిరోధకమని 72% తల్లిదండ్రులు, 30% పిల్లలు పేర్కొన్నారు.⇒ ఉదయం నోటిఫికేషన్లు చెక్ చేయడం, మధ్యాహ్నం ఓటీటీల వీక్షణం, రాత్రిపూట స్క్రోలింగ్.. ఇదీ యూజర్ల తీరు.⇒ ఫోన్ రహిత విందులు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, నమ్మకం, భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపరుస్తాయి.⇒ స్విచ్ ఆఫ్ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడటానికి 87% మంది పిల్లలు మరింత సౌకర్యంగా ఉంటారు.⇒ తమ చుట్టూ ఉన్నవారు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు పిల్లలు సైతం వారిని అనుసరిస్తున్నారు.అంకెల్లో యూజర్లు..ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు న్నారు. ఒక్కో వ్యక్తి రోజుకు సగటున నాలుగున్నర గంటలు ఫోన్లో విహరిస్తున్నారు. మనవాళ్లేం తక్కువ కాదు. మన దేశంలో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే.. రోజుకు సగటున 5–7.4 గంటలు స్క్రోల్ చేస్తున్నారు. -
చైనీయులకు సులువుగా బిజినెస్ వీసాలు
న్యూఢిల్లీ: భారత్‌ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా బిజినెస్ వీసాలు జారీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను సడలించింది. వీసా దరఖాస్తులను ఇకపై వేగంగా ఆమోదించబోతున్నారు. లద్దాఖ్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్–చైనా సంబంధాలు ఇటీవల మళ్లీ గాడిన పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షలు, టారిఫ్‌ల నేపథ్యంలో చైనాతో వాణిజ్య సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే బిజినెస్ వీసా నిబంధనల్లో తాజాగా మార్పులు చేసింది. తక్కువ కాలంపాటు భారత్‌ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా వీసాలు ఇవ్వడం ద్వారా వారి సేవలు ఉపయోగించుకోవచ్చని, చైనాతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వీసా దరఖాస్తుదారుల తనిఖీ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఆమోదంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. చైనా వృత్తి నిపుణులకు గతంలో ఎంప్లాయ్మెంట్ వీసాలు(ఈ వీసాలు) జారీ చేస్తుండేవారు. వీటి కాలపరిమితి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ. బిజినెస్ వీసాలకు సంబంధించి మార్పు చేసిన నిబంధనలు అన్ని దేశాల దరఖాస్తుదారులకు వర్తిస్తాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల చైనీయులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఈ వీసాల జారీ ప్రక్రియను నాలుగు వారాల్లోపే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చైనా పరికరాలు, యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలు సాగించే భారతీయ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లాభం చేకూరనుంది. చైనా నిపుణులు బిజినెస్ వీసాలపై ఇండియాకు వచ్చి, సదరు కంపెనీలకు సహకరించే వీలుంది. చైనా పౌరులకు టూరిస్టు వీసాలను జారీ చేసే ప్రక్రియను ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వాగతించిన చైనా విదేశాంగ శాఖ చైనా నిపుణులకు బిజినెస్ వీసాలను సులువుగా, వేగంగా జారీ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ శుక్రవారం స్వాగతించారు. ఇదొక సానుకూలమైన ముందడుగుగా అభివరి్ణంచారు. ప్రయాణాలను సులభతరం చేస్తే ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా ప్రజల మధ్య అనుబంధం బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. -
ప్రభుత్వ వాదనను విజయవంతంగా తిప్పికొట్టాం
న్యూఢిల్లీ: వందేమాతరం, ఎన్నికల సంస్కరణలపై ఉభయ సభల్లో ఇటీవల జరిగిన చర్చల సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వాదనల్లో పస లేదని నిరూపించామని రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత కూడా అయిన రాహుల్ శుక్రవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల నుంచి ఎదురైన దాడితో ప్రభుత్వం ఒత్తిడికి గురైన ట్లుగా కనిపించిందన్నారు. ‘వందేమాతరం, ఎస్ఐఆర్ అంశాలపై ఉభయసభల్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ రెండు చర్చలలోనూ, మేము ప్రభుత్వ వాదనలను తిప్పికొట్టినందుకు సంతోషంగా ఉంది. ఎస్ఐఆర్ చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవర పడ్డారని, పార్లమెంటులో దుర్భాషను కూడా ఉపయోగించారు’అని ఎంపీలతో భేటీ అనంతరం రాహుల్ మీడియాతో అన్నారు. ఓటు చోరీ అంశంపై ప్రభుత్వానికి ప్రమేయం ఉందన్న విషయం యావత్ దేశానికే తెలుసన్నారు. ఇండిగో సంక్షోభం, వాయు కాలుష్యం, కార్మిక చట్టాలు వంటి ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందన్నారు. -
ఉన్నత విద్యకు ఒకే నియంత్రణ వ్యవస్థ
న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి ఒకే నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) వంటి సంస్థల స్థానంలో ఏకైక వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఈసీఐ) బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు పేరును ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు’గా మార్చారు. సింగిల్ హైయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని నూతన జాతీయ విద్యా విధానంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జన గణన, పంటలకు కనీస మద్దతు ధర, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కాలం చెల్లిన చట్టాల రద్దు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. మూడు ప్రధాన బాధ్యతలు ఉన్నత విద్య నియంత్రణను ఒకే ఒక్క వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించడం ముఖ్యమైన సంస్కరణ అని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవస్థకు మూడు ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారు. రెగ్యులేషన్, అక్రెడిటేషన్, ప్రమాణాలు నిర్దేశించడం. విద్యా సంస్థలకు నిధులు కేటాయించే అధికారం మాత్రం ఉండదని తెలుస్తోంది. నిధుల బాధ్యత ప్రభుత్వానిదే. అలాగే వైద్య, న్యాయ కళాశాలలు ఈ సింగిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ పరిధిలోకి వచ్చే అవకాశం లేనట్లు సమాచారం. హెచ్ఈసీఐ ముసాయిదా బిల్లు ఇప్పటికే సిద్ధమైంది. ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షణ్ బిల్లు’ పార్లమెంట్లో ఆమోదం పొందితే ఈ కమిషన్ సాకారం కానుంది. ‘ఉపాధి’ పని దినాలు ఇకపై 125 రోజులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మార్చడానికి ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద పనిదినాల సంఖ్యను ఏటా 100 నుంచి 125కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కూలీలకు ప్రతి సంవత్సరం కనీసం 125 పని దినాలు కల్పించాల్సి ఉంటుంది. జన గణనకు రూ.11,718 కోట్లు దేశవ్యాప్తంగా జన గణన కోసం రూ.11,718 కోట్లు కేటాయించడానికి మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. ఈసారి డిజిటల్ రూపంలో జన గణన నిర్వహించబోతున్నారు. దాదాపు 30 లక్షల మంది ఎన్యుమరేటర్లు ఈ క్రతువులో పాల్గొంటారు. జన గణనతోపాటు కుల గణన నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. రెండు దశలో కులగణన నిర్వహిస్తారు. మొదటి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపడతారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి జన గణన ప్రారంభిస్తారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే జమ్మూకశీ్మర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మాత్రం 2026 సెప్టెంబర్‌లోనే జన గణన ప్రారంభమవుతుంది. ప్రజల డేటా సేకరణ కోసం మొబైల్ యాప్‌ను ఉపయోగించబోతున్నారు. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటి డిజిటల్ సెన్సెస్ అని చెప్పొచ్చు. బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐలు దేశంలో బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) అనుమతించే బీమా చట్టాల(సవరణ) బిల్లు–2025ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పెద్దపీట వేయడం ద్వారా దేశంలో బీమా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచబోతున్నారు బొగ్గు గనుల వేలానికి ‘కోల్‌సేతు’ పారిశ్రామిక అవసరాల కోసం బొగ్గు గనుల వేలం, ఎగుమతులకు అనుమతులు ఇచ్చే విషయంలో ‘కోల్‌సేతు’ వేదిక ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేలంలో పారదర్శకతతోపాటు వనరుల సది్వనియోగానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ వినియోగదారులు బొగ్గు కావాలంటే ‘కోల్‌సేతు’ ద్వారా వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. తవ్విన బొగ్గులో 50 శాతాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. మిగతా 50 శాతం ఇక్కడే ఉపయోగించాలి. ఎండు కొబ్బరికి మరో రూ.445 మిల్లింగ్ చేసిన ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను కేంద్ర మంత్రివర్గం క్వింటాల్‌కు మరో రూ.445 పెంచింది. దీంతో 2026 సీజన్లో క్వింటాల్ ధర రూ.12,027కు చేరింది. ఇక మిల్లింగ్ చేయని ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు మరో రూ.400 పెంచింది. ఈ రకం కొబ్బరికి క్వింటాల్ ధర రూ.12,500కు చేరుకుంది. కొబ్బరి రైతులను ప్రోత్సహించడానికి, వారికి మరింత ఆదాయం దక్కేలా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 71 చట్టాలు రద్దు కాలం చెల్లిపోయిన 71 చట్టాల రద్దు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇందులో 65 చట్టాలు సవరణ చట్టాలు, ఆరు అసలైన చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 1,562 పాత చట్టాలను రద్దు చేసింది. ప్రతిపాదిత రిపీల్ అండ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే.. రద్దయిన చట్టాల సంఖ్య 1,633కు చేరుకోనుంది. -
ఇండిగో.. ఇదేందయ్యో!
టికెట్ బుక్ అయిందంటే చాలు.. విమాన సంస్థ నమ్మకంగా తమను సమయానికి గమ్యానికి చేరుస్తుందన్న హామీ లభించినట్టు భావిస్తాం. వాతావరణం అనుకూలించక, సాంకేతిక సమస్యతో సర్వీసు రద్దయితే ప్రత్యేక పరిస్థితుల వల్లే ఇలా జరిగిందేమోనని అర్థం చేసుకుంటాం. అలాకాకుండా కార్యాచరణ నిర్లక్ష్యంతో కస్టమర్లకు ఇచ్చిన హామీని ఆపరేటర్ ఉల్లంఘిస్తే..? దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కార్పొరేట్ ఉదాసీనతగా భావించాలి. అంతేకాదు పెద్ద వైఫల్యం కూడా. ఇండిగో విషయంలో ఇదే జరిగింది. ప్రపంచం నివ్వెరపోయిన ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా నిలవడానికి బదులుగా నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడం కోట్లాది మందిని ఆశ్చర్యంలో ముంచెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో ప్రజల ఊహలకు అతీతంగా ప్రభుత్వం ప్రవర్తించిందన్నది ప్రయాణికుల మాట. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తినప్పుడు పౌర విమానయాన నియంత్రణ సంస్థ కఠిన చర్యల అమలుకు బదులు సలహా ప్రకటనలకే పరిమితమైంది. వివిధ దేశాల్లో విమానయాన సంస్థలు విఫలమైనప్పుడు ప్రయాణికులకు పరిహారం అందుతుంది. ఆపరేటర్లను వదిలిపెట్టరు. టికెట్‌కు అయిన ఖర్చు వెనక్కి ఇవ్వడం, భోజనాలు, పానీయాలు, ప్రత్యామ్నాయ విమానాల ఏర్పాటు వంటివి ఒకప్పుడు భారత్‌లో అమలయ్యాయి. కానీ దశాబ్ద కాలంగా నియంత్రణ చర్యలు పేలవంగా, అస్థిరంగా, అరుదుగా శిక్షలతో అమలవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేయొచ్చంటే.. సర్వీసు ఆలస్యం, కంపెనీ ప్రకటనలు, సమాచారాన్ని కస్టమర్లు రికార్డ్ చేయాలి. చాంతాడంత క్యూలు, ఖాళీ అయిన కౌంటర్లు, సిబ్బంది ప్రవర్తన మొదలైన వాటి ఫొటోలు, వీడియోలను సేకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘భోజనం, వసతి, ప్రత్యామ్నాయ విమానం, ప్రయాణ బిల్లులను ఉంచుకోవాలి. వినియోగదారుల ఫోరమ్స్‌లో పరిష్కారం కోసం ఇటువంటి ఆధారాలు అవసరం. డీజీసీఏ ఎయిర్‌సేవా పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలి.జిల్లా వినియోగదారుల కోర్టులనూ ఆశ్రయించాలి. సేవా ఉల్లంఘన కింద ఆపరేటర్‌కు చట్టపరమైన నోటీసు పంపాలి. బాధిత ప్రయాణికులు సమూహంగా ఏర్పడి ప్రభుత్వానికి, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఉమ్మడి పరిహార దావాలకు క్లాస్ పిటిషన్లను దాఖలు చేయవచ్చు’అని చెబుతున్నారు.బిజినెస్ క్లాస్ అంటేనే..: ఇండిగో వైఫల్యాన్ని బహిరంగంగా ఖండించాలని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ‘వివిధ కంపెనీల ప్రముఖులు, తరచూ ప్రయాణించేవారు ఆపరేటర్‌ను సామాజిక మాధ్యమాల్లో ఎండగడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ సంస్థల కంటే బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు విమానయాన సంస్థలు ఎక్కువగా భయపడతాయి. పదేపదే సేవలు ఉల్లంఘించే ఆపరేటర్లతో ఒప్పందాలను కార్పొరేట్ సంస్థలు నిలిపివేయొచ్చు. పెద్ద క్లయింట్లను కోల్పోవడం అంటే వ్యాపారాన్ని పోగొట్టుకున్నట్టేనని విమానయాన సంస్థలు భావిస్తాయి’అని చెబుతున్నారు.మన దగ్గరా అమలవ్వాలి..: నియంత్రణ పరంగా సంస్కరణలకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేయాలన్నది నిపుణుల మాట. ‘ఈయూ 261 తరహా నిబంధనల కోసం ఒత్తిడి చేయాలి. ఎయిర్‌లైన్ వల్ల కలిగే అంతరాయానికి కస్టమర్ల అభ్యర్థన ఆధారంగా కాకుండా ఆటోమేటిక్‌గా పరిహారం అందాలి. ఆపరేటర్లే భోజనాలు, ఆశ్రయాన్ని కల్పించాలి. జరిమానాలు ఆర్థికంగా ఉండాలి. ఉల్లంఘనలు పెరిగిన కొద్దీ జరిమానా అదే స్థాయిలో అధికం కావాలి’అని సూచిస్తున్నారు.ఏ దేశంలో ఎలా ఉందంటే..చాలా పరిణతి చెందిన విమానయాన మార్కెట్లలో కంపెనీల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తితే అక్కడి ప్రభుత్వాలు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. భారీ జరిమానాలు, కోర్టులు, వినియోగదార్ల ఫోరమ్స్‌లో వ్యాజ్యాలు, ఆపరేటర్లపై కఠిన చర్యలతోపాటు నియంత్రణ పరంగా జోక్యం చేసుకుంటాయి. యూరప్: ఈయూ నిబంధన 261 ప్రకారం.. విమానం ఆలస్యం, రద్దు అయితే ఒక్కో ప్యాసింజర్‌కు 600 యూరోల వరకు పరిహారం చెల్లించాలి. తప్పనిసరి భోజనం, పానీయాలు, వసతి కల్పించాలి. టికెట్ ధరను పూర్తిగా వెనక్కి ఇవ్వడం లేదా మరో మార్గంలో (రీ–రూటింగ్) గమ్యస్థానానికి పంపించాల్సిన బాధ్యత ఆపరేటర్‌దే. అమెరికా: 2022లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సంక్షోభంతో ప్రజల ఆగ్రహం, కోర్టుల్లో వ్యాజ్యాల కారణంగా ప్రభుత్వం దర్యాప్తు జరిపింది. భారీ మొత్తంలో కంపెనీ రీఫండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు హోటల్ కవరేజ్, భోజనం, రీబుకింగ్ సహాయం, రీఫండ్స్ లభించాయి.కెనడా: ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ నిబంధనల ప్రకారం ఎయిర్‌లైన్ లోపం కారణంగా తలెత్తే అంతరాయాలకు ప్రతి ప్యాసింజర్‌కు 125–1,000 కెనడియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ్రస్టేలియా: ప్రయాణికులను తప్పుదారి పట్టించడం, వారికి ఏదైనా హాని కలిగితే విమానయాన నియంత్రణ సంస్థలు ఆపరేటర్లకు జరిమానా విధిస్తాయి. -
ఇండిగో సంక్షోభం.. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి సాహసం
కనీవినీ ఎరుగని రీతిలో ఇండిగో విమానాల రద్దు, ప్రయాణీకుల కష్టాలకు సంబంధించిన ఇప్పటికే పలు హృదయవిదారక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. హరియాణాలోని రోహ్తక్ నుండి పంఘల్ కుటుంబాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. కుమారుడి పరీక్ష కోసం తండ్రి చేసిన సాహసం వైరల్‌గా మారింది.హర్యానాలోని రోహ్తక్కు చెందిన యువ షూటర్ ఆశీష్ చౌధరిపంఘాల్, ఇండోర్‌లోని డాలీ కళాశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. ప్రీ-బోర్డ్ పరీక్ష (XII ) రాసేందుకు ఇండోర్‌కు వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ నుండి విమానాశ్రయానికి వెళ్లాలని ప్లాన్. కానీ అనూహ్యంగా ఇండిగో విమాం రద్దు అయింది. రైలులో సీటు అందుబాటులో లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని తండ్రి రాజ్‌నారాయణ్ పంఘాల్ సాహసపోతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకు పరీక్షకు హాజరుకావాలంటే రాత్రంతా కారులో ప్రయాణించాలని ఎంచుకున్నాడు. దాదాపు 800కిలోమీటర్లు కారులో ప్రయాణించి కాలేజీకి చేరుకున్నాడు. సరిగ్గాపరీక్ష సమయానికి ఇండోర్‌కు చేరడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసిందిదీనిపై తండ్రి రాజ్ నారాయణ్ స్పందిస్తూ డిసెంబర్ 8న పరీక్షలు రాయాల్సి ఉంది. అంతకుముందు, డిసెంబర్ 6 సాయంత్రం ఇండోర్‌లోని కళాశాలలో అబ్బాయికి సత్కారం జరగాల్సి ఉంది. ఢిల్లీ నుండి ఇండోర్‌కు అతని విమానం ఇప్పటికే బుక్ చేశాం. అతణ్ని ఢిల్లీ విమానాశ్రయంలో దింపడానికి వెళ్ళాను, విమానం రద్దు కావడంతో సత్కారం మిస్ అయింది. కానీ పరీక్ష మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సమయానికి తీసుకెళ్ల గలిగాను అంటూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో గ్రేట్ ఫాదర్, నాన్న ప్రేమ అలా ఉంటుంది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
ఛత్తీస్‌గఢ్: మరో 10 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్: మరో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టులపై రూ.33 లక్షల చొప్పున రివార్డ్ ఉంది. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 263 మంది మావోయిస్టులు హింసను విడిచిపెట్టారని పోలీసు అధికారులు తెలిపారు. పూనా మార్గెం పునరావాస, సామాజిక సమ్మిళితం కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయారని అధికారులు వెల్లడించారు.లొంగిపోయిన మావోయిస్టులు ఏకే-47 తుపాకీ, రెండు సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్(SLRs), ఒక స్టెన్‌గన్, ఒక బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (BGL)ను అప్పగించారు. గత 11 నెలల్లో కనీసం 1,514 మంది మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలో ఆయుధాలను వదిలేశారని బస్తర్ ఐజీ సుందరరాజ్ పట్టీలింగం తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 2,400 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.కాగా, ఈ నెల (డిసెంబర్ 8)న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్లో చురుకుగా పనిచేసిన మావోయిస్టు కమాండర్ రామ్‌ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు. -
‘వారికి రూ. లక్ష ఇచ్చినా నాకు ఓటెయ్యరు’
అస్సాంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం హిమాంత్ బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలోని ముస్లిం సామాజిక వర్గం తనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయరన్నారు. వారికి ఓటుకు రూ.లక్ష ఇచ్చినా తనను ఎన్నుకోవడానికి మెుగ్గుచూపరన్నారు. ఈ మేరకు జాతీయ మీడియాతో ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శుక్రవారం జాతీయ మీడియాతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు ఇటీవల బిహార్‌లో ఓటర్లను ఆకర్షించడానికి అక్కడి సీఎం నితీశ్ కుమార్ ప్రవేశ్ పెట్టిన విధంగా మీరెమైనా అస్సాంలో పథకాలు తీసుకొస్తారా అని సీఎంను ప్రశ్ని్ంచారు. దానికి సీఎం బదులిస్తూ "నేను రూ.10 వేలు కాదు రూ.లక్ష ఇచ్చినా ఆ రాష్ట్ర ముస్లింలు నాకు ఓటెయ్యరు. వారు కావాలంటే నా కిడ్నీని దానంగా ఇస్తా కానీ వారు నాకు ఓటెయ్యరు" అని అన్నారు. ప్రస్తుతం ఓట్లనేవి పథకాలు, అభివృద్ధి బట్టి కాకుండా ఐడీయాలజీ ప్రకారం వేస్తున్నారని హిమంత్ అన్నారు.అస్సాంలోకి చాలా మంది అక్రమంగా ప్రవేశిస్తున్నారని హిమంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో 38 శాతం ఉన్న ముస్లింల జనాభా 2027 వరకూ 40 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. 1961 నుంచి ఆ కమ్యూనిటీ దశాబ్ధ జనాభా వృద్ధిరేటు 4-5శాతం నిరంతరాయంగా పెరుగుతూ ఉందని అన్నారు. ఒకవేళ ముస్లింల జనాభా రాష్ట్రంలో 50శాతం దాటితే వేరే మతాల ప్రజలు రాష్ట్రంలో నివసించలేరని హిమంత్ బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ముస్లిం ప్రజలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. వారు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం అక్కడ విజయం సాధించిందన్నారు. -
కోర్టుకు ఎక్కిన ఇండిగో..
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కోర్టుకు ఎక్కింది. విమాన ఇంజిన్లు, విదేశీ మరమ్మతుల తర్వాత తిరిగి దిగుమతి చేసుకున్న విడిభాగాలపై చెల్లించిన రూ .900 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.ఆన్లైన్ లీగల్ సమాచార పోర్టల్ బార్ & బెంచ్ కథనం ప్రకారం.. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ శైల్ జైన్ లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ కేసును విచారించింది. అయితే, తన కుమారుడు ఇండిగోలో పైలట్ గా పనిచేస్తున్నాడని పేర్కొంటూ జస్టిస్ జైన్ ఈ కేసు నుండి వైదొలిగారు. ఈ విషయాన్ని ఇప్పుడు వేరే ధర్మాసనం ముందు ఉంచనున్నట్లు నివేదిక తెలిపింది.ఇండిగో వాదన ఇదీ..మరమ్మతుల తర్వాత తిరిగి చేసుకునే దిగుమతులను సర్వీస్‌గా పరిగణించాలే తప్ప తాజా వస్తువుల దిగుమతిగా కాదు.. అనేది ఇండిగో వాదన. తదనుగుణంగానే పన్ను విధించాలని ఈ ఎయిరలైన్స్ కోరుతోంది. సంక్షిప్త విచారణ సందర్భంగా, ఇండిగో తరపున సీనియర్ న్యాయవాది వి.లక్ష్మీకుమారన్.. కస్టమ్స్ సుంకం రాజ్యాంగ విరుద్ధమని, అదే లావాదేవీపై "డబుల్ లెవీ" అని వాదించారు.ఇండిగో ఇప్పటికే పునర్-దిగుమతి చేసుకునే సమయంలోనే ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని చెల్లించిందని, మరమ్మతులను సర్వీసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద విడిగా జీఎస్టీని చెల్లించిందని చెప్పారు. అయితే, కస్టమ్స్ అధికారులు పునర్-దిగుమతిని తాజాగా వస్తువుల దిగుమతిగా పరిగణించి మళ్లీ సుంకాన్ని డిమాండ్ చేశారని విన్నవించారు.మరమ్మతు తర్వాత పునర్-దిగుమతులపై రెండుసార్లు సుంకం విధించలేరని కస్టమ్స్ ట్రిబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది. అయితే, ట్రిబ్యునల్ తరువాత మినహాయింపు నోటిఫికేషన్ ను సవరించింది, అటువంటి మార్పులు భవిష్యత్తులో పనిచేస్తాయని స్పష్టం చేసింది. అదనపు లెవీని అనుమతించే నోటిఫికేషన్ లోని భాగాన్ని ట్రిబ్యునల్ కొట్టివేసిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఇండిగో కోర్టుకు తెలిపింది.అదనపు సుంకం చెల్లించి తీరాల్సిందేనని కస్టమ్స్ అధికారులు బలవంతం చేశారని, అంత వరకూ విమానాన్ని నిరవధికంగా గ్రౌండ్ చేయనీయకపోవడంతో తప్పని పరిస్థితిలో 4,000 కంటే ఎక్కువ ఎంట్రీ బిల్లుల ద్వారా రూ.900 కోట్లకు పైగా డిపాజిట్ చేసినట్లు ఇండిగో వివరించింది. -
కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే
ఢిల్లీ: జనాభా లెక్కల సేకరణకు 11,718 కోట్ల రూపాయల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తొలివిడతలో ఇళ్ల లెక్కింపు, అనంతరం జనాభా లెక్కలు చేపట్టనున్నారు. 2026 ఏప్రిల్, సెప్టెంబర్లలో హౌస్ లిస్టింగ్, 2027 ఫిబ్రవరిలో జనగణన చేయనున్నారు.30 లక్షల మంది సిబ్బందితో జనాభా లెక్కల సేకరణ చేయనున్నారు. మొబైల్ యాప్‌తో డేటా సేకరించనున్నారు. సెంట్రల్ పోర్టల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించనున్నారు.‘కోల్ సేతు విండో’కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల రంగంలో సంస్కరణల కోసం కొత్త పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొబ్బరి కి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర కేబినెట్.. 2026 సీజన్లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి కి క్వింటాల్‌కు రూ. 445 రూపాయలు. బాల్ కొబ్బరి క్వింటాలుకు 400 రూపాయలు మద్దతు ధర పెంచింది. మిల్లింగ్ కొబ్బరి క్వింటాలు ధర: 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి ధర 12,500 ప్రకటించింది.ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్పు చేసింది. పనిదినాలు ఏడాదికి 120 రోజులకు పెంచింది. ఈ పథకాన్ని మొదట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (NREGA)గా ప్రారంభించగా.. తరువాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)గా మార్చారు. తాజాగా.. 'పూజ్య బాపు ఉపాధి హామీ పథకం'గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. -
ప్రియాంక గాంధీపై పార్టీ నేత సంచలన లేఖ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ నాయకత్వం సరిగ్గా లేదని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. త్వరలోనే నాయకత్వ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించాలన్నారు. అందుకోసం యావద్దేశం ఎదురుచూస్తుందని తెలిపారు. ఈ లేఖతో అధికార బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌లో మరోసారి గ్రూప్ వార్ నడుస్తోందని శుక్రవారం కామెంట్ చేసింది. కాంగ్రెస్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గడ్డుకాలం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు పరాజయం పాలవడంతో పాటు పలు రాష్ట్రాల్లో ఆపార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 16 రోజుల పాటు యాత్ర నిర్వహించారు. ఆయన అక్కడ ఇండియా కూటమికి చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పార్టీ భవిష్యత్తుపై మరోసారి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఒరిస్సాకు చెందిన బరాబతి-కటక్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మెుఖ్యుం సోనియాగాంధీకి లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే లేఖలో "ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి జాతీయ స్థాయితో పాటు రాష్ట్రాలలో ఆశాజనకంగా లేదు. కేంద్రంలో మనం మూడు సార్లు వరుసగా పరాజయం పాలయ్యాము. ఈ పరిస్థితి పార్టీనే దైవంగా కొలిచే మాలాంటి కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. బిహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, కశ్మీర్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఓడిపోవడానికి పార్టీ అంతర్గత సంక్షోభాలు కారణమన్నారు. భారత్‌లో ప్రస్తుతం 35 సంవత్సరాలలోపు జనాభా గలవారు దాదాపు 65శాతం మంది ఉన్నారు. భవిష్యత్తు మెుత్తం యువత చేతుల్లోనే ఉంటుంది. కనుక ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారి (83) వయస్సు రీత్యా వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోలేరు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ ప్రియాంక గాంధీ చేతికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి. దేశ యుువత వారి నాయకత్వం కోసం వేచిచూస్తుంది". అని లేఖలో ఆయన పేర్కొన్నారు. పార్టీలో సరైన నాయకత్వం లేకే జ్యోతిరాధిత్య సిందియా, హిమంత్ బిశ్వాస శర్మ, జైవీర్ శెర్గిల్ లాంటి కీలక నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఒడిస్సాతో పాటు దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఏమి బాగాలేదని ఇప్పటికైనా మేల్కోని తగిన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై బీజేపీ పార్టీ అటాక్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌లో అంతర్గతంగా రాహుల్ గాంధీ గ్రూప్, ప్రియాంక గాంధీ గ్రూప్ వార్ నడుస్తోందని తెలిపింది. అవి ఇప్పుడు బహిర్గతమయ్యాయని బీజేపీ కామెంట్ చేసింది. -
జనగణన 2027కు క్యాబినెట్ ఆమోదం, రెండు దశల్లో
న్యూఢిల్లీ, సాక్షి : కేంద్ర మంత్రివర్గం భారత జనాభా లెక్కలు 2027 (డిసెంబర్ 12న) నిర్వహణకు ఆమోదం తెలిపింది. దీని కోసం రూ. 11,718.24 కోట్ల ఖర్చు చేయనుంది. ఇది చాలా కాలం తర్వాత దేశంలోనే అతిపెద్ద పరిపాలనా, గణాంక ప్రక్రియగా నిలవనుంది.జనాభా లెక్కింపు రెండు దశల్లో నిర్వహించబడుతుంది. గృహాల జాబితా, గృహ గణన 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 6 వరకు జరుగుతుంది, తరువాత రెండో దశ ఫిబ్రవరి 2027లో జనాభా గణన (PE) జరుగుతుంది. లడఖ్, మంచుతో కప్పబడే, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని సమకాలిక ప్రాంతాలకు, PE సెప్టెంబర్ 2026లో నిర్వహించబడుతుందని ప్రభుత్వం తెలిపింది.తొలిపూర్తి డిజిటల్ జనాభా లెక్కలు2027లో జరగబోయే జనగణనన పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుంది. ఆండ్రాయిడ్, iOSలో మొబైల్ అప్లికేషన్ల ద్వారా డేటా సేకరణ ఉంటుంది. జనాభా లెక్కల నిర్వహణ & పర్యవేక్షణ వ్యవస్థ (CMMS) రియల్ టైమ్‌లో కార్యకలాపాలను ట్రాక్ చేస్తుంది.అయితే గృహాల జాబితా బ్లాక్ (HLB) క్రియేటర్ వెబ్-మ్యాప్ సాధనం క్షేత్ర పర్యవేక్షణకు మద్దతు ఇస్తుంది. ప్రజలు స్వీయ-గణన చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.2వ దశలో కులాల డేటాఈసారి జనగణనలో కులం ఆధారిత గణనను కూడా చేర్చారు. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఏప్రిల్ 30, 2025న కుల గణనను చేర్చాలని నిర్ణయించింది. దీని ప్రకారం, రెండవ దశ అయిన జనాభా గణన సమయంలో కుల డేటాను ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంగ్రహిస్తారు.కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాల్లో భాగంగాదేశంలో జరగబోయే జనగణన వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీనిప్రకారం, రాబోయే జనగణన దేశ చరిత్రలోనే మొట్టమొదటి డిజిటల్ జనగణన కానుంది. ఇందుకోసం దాదాపు 550 రోజుల పాటు దాదాపు 18,600 మంది సాంకేతిక సిబ్బంది పనిచేస్తారు. దీని వలన దాదాపు 1.02 కోట్ల మానవ-రోజుల ఉపాధి లభిస్తుంది. ఇదీ చదవండి : మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసిందిడిజిటల్ దృష్టి డేటా నిర్వహణ, పర్యవేక్షణలో నైపుణ్యాలను పెంపొందించుకుంటుందని అధికారులు తెలిపారు. గణనదారులు, పర్యవేక్షకులు, శిక్షకులు , జనాభా గణన అధికారులతో సహా దాదాపు 30 లక్షల మంది ఫీల్డ్ ఫంక్షనరీలను రాష్ట్ర మరియు జిల్లా పరిపాలనలు నియమిస్తాయి. వారికి గౌరవ వేతనం చెల్లిస్తారు. 1948 జనాభా లెక్కల చట్టం, 1990 జనాభా లెక్కల నియమాల ప్రకారం జరిగే 2027 జనాభా లెక్కింపు తొలి గణన తర్వాత 16వది. స్వాతంత్ర్యం తర్వాత 8వ జనాభా లెక్కింపు. -
కరూర్ తొక్కిసలాట కేసు: ఏదో తప్పు జరుగుతోంది..? సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమినాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సిట్ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టులో ‘ఏదో తప్పు జరుగుతోంది అంటూ వ్యాఖ్యానించింది. ప్రధానంగా ఈ కేసు విచారణ లిస్టింగ్ జాబితాకు సంబంధించి ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 12) ఈ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు రిజిస్టార్ జనరల్ నివేదికను పరిశీలించిన క్రమంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్‌ను పార్టీగా చేరుస్తూ నోటీసు జారీ చేసింది అదే సమయంలో మద్రాస్ హైకోర్టులో అనుసరిస్తున్న నియమాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు.. సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ విజయ్ టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ మేరకు వ్యాఖ్యానించింది. టీవీకే విజయ్ దాఖలు చేసిన పిటిషన్లో భాగంగా మద్రాస్ హైకోర్టు సిట్ విచారణకు ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడంపై గతంలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈసారి ఆ హైకోర్టులో ఏదో తప్పు జరుగుతోంది’ అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్టోయిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యంతో పాట అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు రెండు విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేయడంలోని ఔచిత్యాన్ని గతంలో కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది సీబీఐ విచారణ కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు.. సిట్ దర్యాప్తునకు మాత్రం ఆదేశాలివ్వడంతో కేసుల విచారణ లిస్టింగ్ సరిగా జరుగుతుందా లేదా అనేది పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరుగు ప్రయాణంలో అయ్యప్ప భక్తుల కష్టాలు..
పల్లికట్టు శబరిమలైకి - కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తె" అంటూ భక్తిపారవశ్యంతో నడిచి ఆ అయ్యప్ప దర్శనం చేసుకున్న భక్తులకు తిరుగు ప్రయాణం కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎంతో శ్రమకోర్చి కాలినడకన వచ్చి మరి ఆ అయ్యప్పను దర్శనం చేసుకున్నవారికి తిరుగు ప్రయాణం కష్టాలు కన్నీళ్లు పెట్టించేస్తున్నాయి. ఎలాంటి పరిష్కారం చూపకుండా మీపాట్లు మీరు పడండని గాలికి వదిలేశారంటూ మండిపడుతున్నారు. అస్సలు మా తిరుగు ప్రయాణం కష్టాలు ఎవ్వరికి పట్టవా అని ఆక్రోశిస్తున్నారు భక్తులు. నిజానికి శబరిమల ప్రధాన పార్కింగ్ ప్రాంతం నీలక్కల్. అయితే అయ్యప్ప దర్శనం చేసుకున్న యాత్రికులను నీలక్కల్ తీసుకుపోవడానికి బస్ స్టాప్ త్రివేణి వద్ద ఉంది. అందుకోసం బస్లులు పెట్రోల్ పంప్ దగ్గర యు-టర్న్ తీసుకొని నీలక్కల్‌కు వెళ్లడానికి త్రివేణికి చేరుకుంటాయి. మరోవైపు యాత్రికులు రోడ్డుపైకి రాకుండా నిరోధించడానికి బారికేడ్లు నిర్మించారు. అలాగే బస్సు ఎక్కడానికి ఒకే ఒక మార్గం ఉంది. దీంతో బస్సు రాగానే నిరీక్షిస్తున్న వందలాది మంది యాత్రికులు ఒకేసారి ఎక్కేందుకు ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగి ఎక్కే వీలు లేకుండా పోతోంది. హెల్తీగా ఉన్నవాళ్లు ఏదోలా ఎక్కేసినా..ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. మొత్తం మూడు బస్సులు కలిసి త్రివేణికి చేరుకుంటాయి. అయితే బస్సు రావడంతోనే ఎక్కే హడావిడిలో ఉంటారు ప్రయాణికులు..మరోవైపు ఒక బస్సు తలుపు మాత్రమే తెరుస్తారు. పోనీ మూడు బస్సులు ఒకేసారి డోర్లు తెరిచిని కాస్త పరిస్థితి చక్కబడేది. అలా కాకుండా ఒక బస్సు తర్వాత ఒకటి డోర్ ఓపెన్ చేయడంతో రద్దీ ఎక్కువై..చాలామంది అయ్యప్ప భక్తులు ఎక్కలేక నాన అవస్థలు పడుతున్నారు. బస్సులు వస్తూనే ఉంటున్నాయి కానీ తాము ఎక్కలేకపోతున్నాం అని భక్తులు చాలా బాధగా వాపోతుండటం గమనార్హం. పరిష్కారం కానీ జఠిల సమస్యలా..ప్రయాణికులు ఎంతలా ఫిర్యాదు చేసినప్పటికీ..పరిష్కారం కానీ జఠిలా సమస్యలా అలానే ఉంది అక్కడ పరిస్థితి. అసలు సన్నిధానం వద్ద అన్ని సమస్యలలో జోక్యం చేసుకునే స్పెషల్ కమిషనర్, ఏడీఎం ఈ సమస్యకు ఎందుకు పరిష్కారాన్ని సూచించడం లేదని మండిపడుతున్నారు భక్తులు. బస్సు ఎక్కడానికి క్యూ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది భక్తులందరి ప్రధాన డిమాండ్. కానీ ఇప్పటి వరకు అధికారులు దీనిపై ఎలాంటి నిర్ణయం గానీ పరిష్కారం గానీ సూచించకపోవడం అత్యంత బాధకరం.(చదవండి: శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా) -
న్యాయ వ్యవస్థకు బెదిరింపా?
తమిళనాట తీవ్ర రాజకీయ దుమారం రేపిన తిరుప్పరన్కుండ్రం ఆలయ తీర్పు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఆ తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను అభిశంసించాలని ప్రతిపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాయి. అన్నాడీఎంకే-బీజేపీ అభ్యంతరాలతో రాజకీయ దుమారం కొనసాగుతోంది. అయితే.. ఆయనకు మద్దతుగా న్యాయమూర్తులు రంగంలోకి దిగారు. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ మద్దతుగా 46 రిటైర్డ్ జడ్జిలు, 10 మంది ప్రస్తుత జడ్జిలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అభిశంసన నిర్ణయం న్యాయవ్యవస్థను బెదిరించడమేనని.. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఇందులో పలువురు సుప్రీం కోర్టు మాజీలు కూడా ఉండడం గమనార్హం. ‘‘తమకు రాజకీయంగా అనుగుణంగా లేరని కారణంతో న్యాయమూర్తులను బాహాటంగా బెదిరించే ప్రయత్నం ఇది. వాళ్లు తీసుకుంది సరైన నిర్ణయమని భావించినా.. అది ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యానికి మూలాలను దెబ్బతీస్తుంది. ఇది నాటి దేశ ఎమర్జెన్సీని తలపించే అంశం. రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా లేని తీర్పులు ఇచ్చినప్పుడు సీనియర్ న్యాయమూర్తులను బద్నాం చేయడం పరిపాటిగా మారుతోంది’’ అని మాజీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అభిశంసనను న్యాయవ్యవస్థ స్వేచ్ఛను కాపాడటానికి ఉపయోగించాలేగానీ.. రాజకీయ ఒత్తిడికి కాదు అని పేర్కొన్నారు. తమిళనాడులోని మధురై పర్వత ప్రాంతంపై ఆరో శతాబ్దానికి చెందిన తిరుప్పరన్కుండ్రం సుబ్రహ్మణ్య ఆలయం.. ఆ ప్రాంగణంలోనే 14వ శతాబ్దానికి చెందిన దర్గా ఉన్నాయి. ఈ క్రమంలో ఆలయం కింద ఉన్న స్తంభం వద్ద కార్తీక దీపోత్సవం నాడు భక్తులు దీపం వెలిగించడం వందల ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే.. డిసెంబర్ 1వ తేదీన ఈ అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్ జడ్జి జస్టిస్ స్వామినాథన్.. కింద ఉన్న స్తంభంలో కాకుండా ఆలయం పైన ఉన్న స్తంభం వద్దే దీపం వెలిగించాలని తీర్పు ఇచ్చారు. పైన ఉన్న స్తంభం కూడా ఆలయ సొత్తేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ తీర్పుపై ప్రభుత్వం, అటు ఆలయ నిర్వాహకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో దర్గా ఉందని.. అక్కడి స్తంభం వద్ద దీపాలు వెలిగిస్తే అది మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీయొచ్చని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. జస్టిస్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పు 2017లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని వాదించింది. అయినప్పటికీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఆ ఆదేశాలను ఆలయ నిర్వాహకులు పాటించలేదు. కొండ దిగువ భాగంలో ఉన్న స్తంభంపైనే దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. ఈ పరిణామంతో జస్టిస్ స్వామినాథన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం పైనా దీపాలు వెలిగించాల్సిందేనని.. లేకుంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని మరోమారు తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. దీంతో.. డిసెంబర్ 3వ తేదీన వందల మంది కేంద్ర బలగాల సాయంతో కొండపైన దీపాలు వెలిగించే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో.. అధికారులు ఆంక్షలు విధించారు. ఈలోపు తిరుపరన్‌కుండ్రం కార్తీక దీపం తీర్పు వల్ల రాజకీయ వివాదం చెలరేగింది. జస్టిస్ స్వామినాథన్ గతంలో బీజేపీ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారని.. అందుకే ఇలాంటి తీర్పు ఇచ్చారని విమర్శలు గుప్పించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ డిసెంబర్ 4వ తేదీన మద్రాస్ హైకోర్టును మరోసారి తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే అక్కడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో ఆ మరుసటిరోజే సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేయగా.. అది ఇంకా విచారణకు రావాల్సి ఉంది. ఈలోపు.. జడ్జిపై అభిశంసనను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. జస్టిస్ స్వామినాథన్‌ను అభిశంసించాలంటూ 120 మంది ఎంపీలు చేసి సంతకాలను డీఎంకే నేత కనిమొళి నేతృత్వంలోని ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు కనిమొళి వెంట ఉన్నారు. అయితే ఈ చర్యను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇండియా కూటమి చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జడ్జిని తొలగించే ప్రయత్నం జరగలేదని.. ఓటు బ్యాంక్ కోసం దిగజారాయని ప్రతిపక్షాలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. మరో ఆరు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో మతపరమైన ఉద్రిక్తతలు ఏమాత్రం మంచిది కాదని డీఎంకే భావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇది డీఎంకే హిందూ వ్యతిరేక విధానాలకు నిదర్శనమని మండిపడుతోంది. ఎవరీ స్వామినాథన్?జీఆర్ స్వామినాథన్ తమిళనాడు తంజావూర్ జిల్లా తిరువారుర్‌లో(1968లో) జన్మించారు. సేలం, చెన్నైలో న్యాయవిద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా దీర్ఘకాలం పనిచేసి, తర్వాత మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్‌కు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలందించారు. అటుపై 2017లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దేశంలో.. తన పనితీరును ప్రజలకు తెలియజేయడానికి రిపోర్ట్ కార్డు విడుదల చేసిన మొదటి జడ్జి కూడా ఈయనే. -
మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది
డానిష్ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్ తన బ్లాక్‌బస్టర్ యాంటీ-టైప్-2 డయాబెటిస్ డ్రగ్ ఓజెంపిక్ (సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్)ను ఇండియాలో లాంచ్ చేసింది. దీన్ని అధిక బరువు నియంత్రలో కూడా వాడుతున్నారు. 0.25 మిల్లీగ్రాముల డోసేజ్ వెర్షన్‌కు వారానికి రూ. 2,200 ప్రారంభ ధరకు భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.ఈ ఔషధం 0.25మి.గ్రా., 0.5 మి.గ్రా, 1 మి.గ్రా మూడు మోతాదు రూపాల్లో లభిస్తుంది నొప్పి లేకుండా సబ్కటానియస్ నోవోఫైన్ నీడిల్స్ ఇంజెక్షన్. ఇది సింగిల్-యూజ్ ప్రీ-ఫిల్డ్ పెన్. ‘ఒజెంపిక్’ను మొదటి 4 వారాల పాటు వారానికి ఒకసారి చొప్పున 0.25 మి.గ్రాతో ప్రారంభిస్తారు, ఆ తర్వాత కనీసం 4 వారాల పాటు వారానికి ఒకసారి 0.5 మి.గ్రా స్టెప్ అప్ డోసేజ్ ఇస్తారు. లాంగ్ డోసేజ్ కింద వారానికి ఒకసారి 1 మి.గ్రీ వరకు తీసుకోవచ్చు.ఇదీ చదవండి : దీన్ని సివిక్ సెన్స్ అంటారా..రోడ్డుపై రచ్చ మూడు మోతాదుల ఇంజెక్షన్‌గా ప్రీ-ఫిల్డ్ పెన్ను వస్తుంది. దీని ఖరీదు నెలకు రూ.8800 (వారానికి రూ.2200), మరొక డోస్ ధర రూ.10,170 (వారానికి రూ.2542.5), నెలకు రూ.11,175 (వారానికి రూ.2793.75) అవుతుందని కంపెనీ చెప్పింది.భారతదేశంలో ఇన్సులిన్ ధరల జోన్లోనే ఇది అందుబాటులో ఉందన్నారు. ఇదొక కీలకమైన అభివృద్ధిగా అభివర్ణించారు. వైద్య చరిత్రను మార్చిన పెన్సిలిన్ , యాంటీ బయాటిక్స్ ఆవిష్కరణలకు ఇది సమానమని నోవో నార్డిస్క్ ఇండియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియ పేర్కొన్నారు. నిజంగా ఓజెంపిక్‌ను ఈ ధర జోన్లోకి తీసుకురావడం చాలా కష్టతర మైందన్నారు. ఇండియాలో వైద్యులు సూచన మేరకు ఎక్కువ మంది తమ మందును వాడాలని ఆశిస్తున్నామన్నారు. దీని వాడకంపై ఆందోళనలుమానసిక-ఆరోగ్య సవాళ్లు, ఆత్మహత్య ధోరణుల ఆందోళనలపై బరువు తగ్గించే మందులపై ఆస్ట్రేలియా కొత్త భద్రతా హెచ్చరిక మధ్య, విస్తృతమైన ప్రపంచ & భారతీయ నియంత్రణ సంస్థ పరిశీలన నేపథ్యంలో ఇండియాలో అలాంటి ప్రతిసవాళ్లేవీ లేవని విక్రాంత్ శ్రోత్రియ ప్రకటించారు.కాగా చైనా తర్వాత భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ రోగులు అధికంగా ఉన్నారు. వేగంగా పెరుగుతున్న ఊబకాయం రేట్లతో పాటు, వేగంగా అభివృద్ధి చెందుతున్నబరువు తగ్గించే మందుల మార్కెట్లో వాటా కోసం పోటీ పడుతున్న ప్రపంచ ఔషధ తయారీదారులకు కీలకమైన జోన్‌గా ఇండియా మారింది. దీనికి సంబంధించి ప్రపంచ మార్కెట్ దశాబ్దం చివరి నాటికి ఏటా 150 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. -
వైద్య సిబ్బందిపై దాడి చేస్తే.. ఇక అంతే?
"వైద్యో నారాయణ హరి" అంటే ప్రాణం పోసే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అయితే వాస్తవం కూడా అదే ఎందుకంటే ఒక వ్యక్తికి ప్రాణం పోయడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరోకటి ఉండదు. అయితే అంతటి ప్రాముఖ్యత కలిగిన డాక్టర్లకు ఇతర వైద్య సిబ్బందికి సరైన భద్రత కల్పించడం కూడా ప్రభుత్వాల బాధ్యతే. అందుకే వైద్య సిబ్బంది భద్రతపై రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు.ఒక వ్యక్తికి ఆరోగ్యం విలువ తెలిసేది వారు అనారోగ్యం పాలయినప్పుడే అంటారు. ఎందుకంటే అన్నింటిని మించిన సంపద ఆరోగ్యమే అదే లేకుంటే ఎంత సంపద, అధికారం,పరివారం ఇలాంటివి ఎన్ని ఉన్నా అవి వృథానే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు వారి ప్రాణాలనే కాపాడే వైద్యులను సంఘంలో ఏంతో గౌరవంతో చూస్తారు. అయితే కొన్నికొన్ని సందర్భాలలో తమ వారికి ఏదైనా హాని కలిందనో, లేదా ఇతరాత్రా కారణాలతో వైద్యులతో పాటు ఇతరాత్ర సిబ్బందిపై కొంతమంది దాడులకు పాల్పడుతుంటారు. ఆస్పత్రుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటారు. ఆగ్రహంతో క్షణికావేశంలో వైద్యసిబ్బందిపై దాడి చేయడంతో డాక్టర్లు సైతం తమ విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కొన్ని సార్లు డాక్లర్లు సైతం తాము వైద్యం చేయమని ధర్నాలకు దిగుతున్నారు. వైద్యసిబ్బందిపై దాడి చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల ఎన్సీపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ ఫౌజియా ఖాన్ "సెంట్రల్ ప్రోటెక్షన్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ అండ్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ -2025" పేరుతో రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టారు. 1.వైద్యసిబ్బందిపై దాడులు 6నెలల నుంచి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ. 5లక్షల వరకూ జరిమానా 2.తీవ్ర దాడులకు పాల్పడితే 3 నుంచి 10 సంవత్సరాల జైలుశిక్ష రూ. 2 నుంచి 10 లక్షల జరిమానా. 3.ఆసుపత్రులపై దాడిని తీవ్రనేరాలుగా పరిగణించాలి.పై శిక్షలను చట్టంలో పేర్కొన్నారు. ఈ నేరాలను కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్‌గా పరిగణించాలని తెలిపారు.2025లో డాక్టర్లపై జరిగిన దాడి ఘటనలు.1ఇటీవల కోల్‌కతాలో ఒక యువ డాక్టర్‌పై హత్యాచారం చేసి చంపిన సంగతి తెలిసిందే.2.హౌరాలో మహిళ డాక్టర్‌పై రోగి బంధువులు తీవ్రంగా దాడి చేసి అత్యాచారం చేశారు.3. మహారాష్ట్ర సతారాలో యువవైద్యురాలిపై లైంగిక దాడి ఆరోపణలు చేయడంతో ఆమె ఆత్మహాత్య చేసుకుంది.4. ఢిల్లీ ఏయిమ్స్‌లో రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు.భారత్‌లో దాదాపు 75 శాతం మంది తమ విధి నిర్వహణలో ఏదో సందర్భంలో దాడికి గురయ్యారని సర్వేలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా అధికారికంగా రికార్టుల్లోకి ఎక్కకుండా మరెన్నో ఘటనలు జరుగుతున్నాయి.ET-హెల్త్‌కేర్ సర్వేఈ సంస్థ సెప్టెంబర్‌లో ఎస్ఎన్ మెడికల్ కాలేజ్ జోధ్‌పూర్‌లోని 658మంది డాక్టర్లపై అధ్యయనం చేసింది. ఇందులో 60 శాతానికి పైగా డాక్టర్లు ఏదో ఒక రకమైన హింస ఎదుర్కొంటున్నట్లు తేలింది. అంతేకాకుండా అందులో 3శాతంకు పైగా డాక్టర్లపై శారీరక దాడులు జరిగినట్లు సర్వేలో వెల్లడైంది. అయితే డాక్టర్లపై దాడుల నియంత్రించడానికి గతంలోనూ దేశవ్యాప్తంగా చట్టాలు తేవడానికి ప్రయత్నాలు జరిగాయి. కాని అవి అమలులోకి నోచుకోలేదు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక మైన ఒక చట్టం తేవాలని భావిస్త్నున్నారు.తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వైద్యులపై దాడికి ప్రత్యేక చట్టాలున్నాయి. అయితే వాటి అమలు విధానంలో లోపాలతో అవి సరైన కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే చట్టం రూపకల్పణ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. -
వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్య
టీమిండియా ఆల్ ఫార్మాట్ ఆల్‌రౌండర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జడ్డూ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు.స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్ (IND vs SA)లు ముగించుకున్న జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. జడ్డూ భార్య, గుజరాత్ మంత్రి రివాబా సోలంకి (Rivaba) తన భర్తను ప్రశంసించే క్రమంలో టీమిండియాను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.ఇంటికి దూరంగా ఉన్నా క్రికెటర్‌గా ఉన్న తన భర్త విదేశాలకు వెళ్లడం సహజమని.. అయితే, జట్టులోని మిగతా అందరిలా తన భర్త కాదని తెలిపారు. ఎక్కడున్నా నైతిక విలువలు కోల్పోడంటూ రివాబా వ్యాఖ్యానించారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదని చెప్పుకొచ్చారు.ద్వారకలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రివాబా తన భర్త రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నా భర్త.. క్రికెటర్ రవీంద్ర జడేజా.. లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా అంటూ ఆట నిమిత్తం వివిధ దేశాలు తిరగాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆయన ఎలాంటి చెడు వ్యసనాలకు ఆకర్షితుడు కాలేదు.వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారుఆయనకు తన బాధ్యతలు ఏమిటో తెలుసు. కానీ మిగతా జట్టంతా అలా కాదు. వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారు. అయినా వారిపై ఎవరూ ఎలాంటి ఆంక్షలు విధించలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అదే విధంగా.. ‘‘నా భర్త పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కావాలంటే ఆయన ఎలాంటి చెడ్డ పనైనా చేసి ఉండవచ్చు. కానీ నైతిక విలువలు అంటే ఏమిటో ఆయనకు బాగా తెలుసు’’ అంటూ జడ్డూపై రివాబా ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా.. రివాబా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదు.. కానీతన భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదని.. అయితే, అందుకోసం మిగతా అందరి ఆటగాళ్ల వ్యక్తిత్వాలను కించపరచడం సరికాదని టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉన్న వారు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.కాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన జడేజా క్రికెటర్‌గా అత్యుత్తమ స్థాయికి ఎదగడంలో అతడి తల్లి పాత్ర కీలకం. ఈ విషయాన్ని జడ్డూనే స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇక తన అక్క కూడా తన విజయానికి బాటలు వేసిన వారిలో ఒకరని గతంలో ప్రశంసించాడు.కుటుంబంలో విభేదాలు?ఇదిలా ఉంటే.. జడ్డూ తండ్రి, అక్క కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. భార్య రివాబా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రివాబా వచ్చిన తర్వాత జడ్డూ తమను పూర్తిగా దూరం పెట్టాడని అతడి తండ్రి ఆరోపించగా.. జడ్డూ మాత్రం భార్యకు మద్దతు తెలిపాడు.ఒకవైపు మాటలు మాత్రమే విని ఇంటర్వ్యూ చేయడం సరికాదని.. తన భార్యను తప్పుబట్టే విధంగా వ్యవహరిస్తే ఎవరినీ సహించబోనని మీడియాకు వార్నింగ్ ఇచ్చాడు జడ్డూ. కాగా జడేజా అక్కకు రివాబా స్నేహితురాలు. ఈ క్రమంలోనే జడ్డూ- రివాబాలకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి బాటలు వేసింది. వీరికి కుమార్తె నిధ్యానా ఉంది.చదవండి: దురభిమానం.. నైతిక విలువలు పాతరేస్తున్నారు"मेरे पति (रवींद्र जडेजा , क्रिकेटर)को लंदन , दुबई, ऑस्ट्रेलिया जैसे अनेकों देशों में खेलने के लिए जाना होता है फिर भी आज दिन तक उन्होंने कभी व्यसन नहीं किया क्योंकि वो अपनी जवाबदारी को समझते हैं @Rivaba4BJP जी , शिक्षा मंत्री गुजरात सरकार #Rivabajadeja #ravindrajadeja pic.twitter.com/OyuiPFPvVa— राणसिंह राजपुरोहित (@ransinghBJP) December 10, 2025 -
కేంద్రం కీలక నిర్ణయం: ఉపాధి హామీ పథకం పేరు మార్పు
కేంద్ర కేబినెట్ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కీలక ప్రకటన చేసింది. 'పూజ్య బాపు ఉపాధి హామీ పథకం'గా నామకరణం చేయడంతో పాటు.. పనిదినాలు ఏడాదికి 120 రోజులకు పెంచింది.ఈ పథకాన్ని మొదట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (NREGA) అని ప్రారంభించారు. తరువాత దీనిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)గా మార్చారు. ఇప్పుడు 'పూజ్య బాపు ఉపాధి హామీ పథకం'గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో.. నైపుణ్యం లేని పౌరులకు జీవనోపాధిని, ఆర్ధిక భద్రతను కల్పించడానికి కేంద్రం ఈ ఉపాధి హామీ పథకం ప్రారంభించింది. ఈ స్కీమ్ ప్రకారం.. ఇది వరకు ప్రతి ఇంటి నుంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్న పెద్దలకు కనీసం 100 రోజుల ఉపాధి కల్పించారు. అయితే ఇప్పుడు పనిదినాలు 120 రోజులకు పెంచారు.గ్రామీణ ప్రాంతాల్లో పనికి డిమాండ్ పెరిగినప్పుడు.. ఈ పథకం చాలామందికి ఉపాధి కల్పించింది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ఇంటికి దగ్గరగా సంపాదించుకోవడానికి అవకాశం కల్పించడం వంటివి ఈ పథకం ద్వారానే సాధ్యమైంది. ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన & స్థిరమైన అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.ఇదీ చదవండి: అప్పు కోసం బ్యాంకుకు వెళితే మొట్టమొదట చూసేదేమిటి? -
దీన్ని సివిక్ సెన్స్ అంటారా..రోడ్డుపై రచ్చ
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల్ని ఇండియాలో చాలామందివాహనదారులు అస్సలు లెక్క చేయరు.. ఫ్రీ లెఫ్ట్ వదిలేయండి.. దాన్ని ఆక్రమిస్తే జరిమానా అని స్వయంగా ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నా సరే అస్సలు పట్టించుకోరు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు ముందుకు పోతారు. ట్రాఫిక్ని జాం చేస్తారు. మరికొంతమంది సోషల్ మీడియా, రీల్స్ పిచ్చోళ్లు ఉంటారు. మినిమం సివిక్ సెన్స్ పాటించకుండా రోడ్డు మధ్యలోనే షూటింగ్ లంటూ, పిచ్చి పిచ్చి డ్యాన్స్‌లు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తూ ఉంటారు. ఇపుడు రహదారిపై కనీస మర్యాద పాటించని జంట గురంచి తెలుసుకుందాం. వీరికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది. హైవే మధ్యలో హాయిగా భోజనం తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పౌరుల రోడ్డు మర్యాదలు, భద్రతా అవగాహనపై కొత్త విమర్శలకు తావిస్తోంది.Civic sense is a rare luxury in India , something not everyone seems able to afford. Take this scene for example: a family has started cooking right in the middle of road , turning the area messy. Tell me honestly, is this acceptable? pic.twitter.com/Xytjpv2DlS— The Nalanda Index (@Nalanda_index) December 8, 2025నలంద ఇండెక్స్ ద్వారా X హ్యాండిల్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో తమ కారు రోడ్డు పక్కన పార్క్ చేసి వంట చేయడాన్ని చూడొచ్చు. సిలిండర్, వంటపాత్రలు, కూరగాయలు, కిరాణా సరుకులు సంచులను రోడ్డుపై చెల్లాచెదురుగా పడవేసిన వైనం నెట్టింట చర్చకు దారితీసింది.ఇండియాలో సివిక్ సెన్స్ అనేది చాలా అరుదు. ఉదాహరణకు ఇక్కడ చూడండి : ఒక కుటుంబం రోడ్డు మధ్యలో వంట మొదలు పెట్టేసింది. అక్కడంతా చిరాకు చేసి పడేసింది అని క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ అయింది. అయితే ఇదే విషయంపై ఇలారోడ్డుపై వంట చేయడం, ప్రాణాలకు ప్రమాదం కదా ఆమెను ప్రశ్నిస్తే.. ఆ మహిళ ఎలాంటి సంకోచం లేకుండా ఇలా సమాధానం ఇచ్చింది “మేము రోడ్డు పక్కన వంట చేయకూడదని కూడా మాకు తెలుసు,కానీ అది రోడ్డు (ఎదురుగా ఉన్న లేన్ వైపు చూపిస్తూ) అని చెప్పింది. ఇది సర్వీసు రోడ్డు విశ్రాంతి ప్రాంతం. ఈ ప్లేస్ విశ్రాంతి, వంట కోసం ఉద్దేశించబడింది.” అని సమాధానం చెప్పింది తాపీగా చపాతీలు చేస్తూ. పక్కనే ఒక చిన్నారిని కూడా గమనించవచ్చు.ఈ వీడియో విభిన్న వాదనలకు ఆజ్యం పోసింది. ఇలాంటి వాళ్లని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి జరిమానా విధించాలి, ఇది ఆమోదయోగ్యం కాదు అని, ఇలా రోడ్డు వంట చేసుకొని తినడం ప్రజా స్థలాన్ని ఇతరులకు ఆరోగ్యం, భద్రతా సమస్యగా మారడం ఆందోళన కలిగిస్తోందని కొంతమంది వ్యాఖ్యానించారు. ఆ రహదారి గుండా ఏవాహనాలు పోవడం లేదు కదా, అందుకే ఆ జంట అలా చేసిందని మరికొందరు సమర్ధించారు. ఇలాంటి కుటుంబాలకు సరియైన స్థలాన్ని, సపోర్ట్ అందించాలని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. -
శశి థరూర్.. మళ్లీనా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. శుక్రవారం ఆ పార్టీకి చెందిన అగ్రనేత నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఎంపీల భేటీకి డుమ్మా కొట్టారు. అయితే.. ఆయన ఇలా గైర్హాజరు కావడం ఇది వరుసగా మూడోసారి. అదీ పార్లమెంట్ సమావేశాల వేళ కావడంతో ఆసక్తికర చర్చకు దారి తీసింది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం కోసం రాహుల్ గాంధీ అధ్యక్షతన శుక్రవారం కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరిగింది. ఈ భేటీకి థరూర్ దూరంగా ఉన్నారు. థరూర్‌తో మరో సీనియర్ నేత, ఛండీగఢ్ ఎంపీ మనీశ్ తివారీ కూడా గైర్హాజరు అయ్యారు. అయితే..థరూర్ గత రాత్రి కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తాను అందుబాటులో ఉండటంలేదని థరూర్ ముందే సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ చీఫ్ విప్ మాత్రం థరూర్, తివారీల గైర్హాజరు గురించిన సమాచారం తనకు తెలియదని చెబుతుండడం గమనార్హం.శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్డీయే హయాంలోని విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన నేరుగా ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్‌పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఈలోపు..నవంబర్ 30వ తేదీన జరిగిన మీటింగ్‌కు విమాన ప్రయాణంలో ఉన్నందున హాజరు కాలేకపోయానని థరూర్ మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జరిగిన చర్చలోనూ ఆయన పాల్గొనలేదు. ఆ సమయంలో అనారోగ్యం కారణంగా పాల్గొనలేకపోయానని అన్నారాయన. కానీ, ఆయన కార్యాలయం మాత్రం తన తల్లి(90) వెంట ఉండాల్సి రావడంతోనే హాజరు కాలేకపోయారని భిన్నమైన ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే.. థరూర్ వరుసగా ఇలా ఎగ్గొట్టడాన్ని కాంగ్రెస్ నేతలు తేలికగా తీసుకోవడం లేదు.పుతిన్ పర్యటన సమయంలో ప్రభుత్వం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన విందుకు హాజరు కావడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ సీనియర్లు. ఇలా పార్టీ మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై పెదవి విరుస్తున్నారు. అయితే థరూర్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.ఐదేళ్ల కిందటే మొదలై..2020లో కాంగ్రెస్‌లో జీ-23 గ్రూప్ పరిణామం తీవ్ర కలకలం రేపింది. పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ గ్రూప్‌లో థరూర్ కూడా ఉన్నారు. ఆ సమయంలో దీనిని సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) ఓ తిరుగుబాటులాగా భావించారంతా. ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అధిష్టానం అండతో ఖర్గే గెలిచినా, థరూర్‌కు 1,000కి పైగా ఓట్లు రావడం కొసమెరుపు.2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్‌కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్ చెబుతూ వస్తున్నారు. -
ఫస్ట్ క్లాస్ నేషనల్ హైవేలు.. మృత్యు మృగాలు!
ప్రతి నిమిషానికి 2.. గంటకు 136.. రోజులో 3,260 మంది.. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల రూపంలో పోతున్న ప్రాణాల సంఖ్య ఇది. సేఫ్టీ ప్రచారాలు.. చర్యలు ఈ లెక్కను మరుసటి ఏడాదికి పెరగకుండా ఆపలేకపోతున్నాయి. ఇందునా భారతదేశం యాక్సిడెంట్లకు హాట్‌స్పాట్‌గా కొనసాగుతూ వస్తోంది. లక్షలాది ప్రమాదాలు, అపార ప్రాణనష్టం దేశానికి ఒక పెద్ద సవాలుగా మారాయి. అందునా.. శీతాకాలంలో ఈ రేటు మరింతగా ఉంటోంది. ఆ లోతుల్లోకి వెళ్తే.. భారతదేశం రోడ్డు భద్రతలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. 2025 జనవరి-జూన్ మధ్య యాక్సిడెంట్లో రూపంలో 29,000 మంది(కేవలం జాతీయ రహదారులపైన) బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 1.5–1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు (అన్నిరకాల యాక్సిడెంట్ల రూపంలో). ఇది ప్రపంచ మొత్తం మరణాల్లో 11%గా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (2025) నివేదిక ప్రకారం.. రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ అత్యంత ప్రమాదకర దేశంగా ర్యాంక్ అయ్యింది. డ్రైవింగ్ పరిస్థితులు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, అధిక వేగం ప్రమాదాలకు కారణంగా ఈ నివేదిక చూపించింది. డాటా ఫర్ ఇండియా అనే సంస్థ సర్వే ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు నమోదు చేసే దేశం.కారణాలు ఇవిగో..👇👉చాలా రహదారులు సరైన డిజైన్ ప్రమాణాలు లేకుండా నిర్మించబడ్డాయి. వాటిపై సంకేతాలు (sign boards), స్పీడ్ బ్రేకర్లు, డివైడర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైటింగ్ లేకపోవడం రాత్రి సమయంలో ప్రమాదాలకు దారితీస్తోంది. 👉ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం.. అధిక వేగం, తప్పు దిశలో డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ దాటడం వంటి ఉల్లంఘనలు కారణాలుగా ఉంటున్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగతున్నాయి. వీటికి తోడు.. 👉టూవీలర్ హెల్మెట్, ఫోర్ వీలర్లో సీటు బెల్ట్ వాడకాలు కూడా మరణాల రేటుపై ప్రభావం చూపెడుతోంది. హిట్ అండ్ రన్, ఓవర్ స్పీడ్లు కూడా మరణాలకు కారణం అవుతున్నాయి.డబ్యూహెచ్‌వో అంచనా ప్రకారం, హెల్మెట్ వాడితే తల గాయాలు 40% తగ్గుతాయి, సీటు బెల్ట్ వాడితే మరణాలు 50% తగ్గుతాయి.👉ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ (Golden Hour) లో చికిత్స అందకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అంబులెన్స్ సేవలు, ట్రామా కేర్ సెంటర్లు సరైన స్థాయిలో ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు దూరంగా ఉండటం వల్ల సమయానికి చికిత్స అందక ప్రాణాలు పోతున్నాయి.శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరగుతున్నాయి. గణాంకాల ప్రకారం.. చలికాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 30వేలకు తక్కువగా ఉండడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పొగమంచు (Fog): దృశ్యమానం(విజిబిలిటీ) తగ్గిపోవడం వల్ల వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం సాధారణంగా మారింది.తడి రహదారులు: మంచు, తేమ కారణంగా రహదారులు జారిపోవడం, బ్రేకులు సరిగా పనిచేయకపోవడం.అధిక వేగం: డ్రైవర్లు వేగం తగ్గించకపోవడం, ఫాగ్ లైట్లు వాడకపోవడం.అత్యవసర సేవల ఆలస్యం: ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సహాయం అందకపోవడం వల్ల మరణాలు పెరుగుతాయి.యాక్సిడెంట్.. డెత్స్.. లెక్కలు:2022లో: 4.5 లక్షల ప్రమాదాలు, 1.5 లక్షల అధికారిక మరణాలు2023లో: 4.8 లక్షల ప్రమాదాలు, 1.72 లక్షల మరణాలు2024లో.. 4.73 లక్షల యాక్సిడెంట్లు(కాస్త తగ్గినా) మరణాలు 1.77 లక్షలకు పెరిగాయి2025 (జనవరి–జూన్): జాతీయ రహదారులపై 29,018 మరణాలు (పూర్తి గణాంకాలు రావాల్సి ఉంది) భారతదేశంలో హైవేలు మొత్తం రహదారి నెట్‌వర్క్‌లో ఉండేది కేవలం 2% మాత్రమే. వీటికి ఫస్ట్ క్లాస్ హైవేల గుర్తింపు ఉంది. కానీ, దేశంలో జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో 50% కంటే ఎక్కువ వాటా వీటికే ఉంది. 2025లో ఇప్పటిదాకా సగటున రోజుకి హైవేల మీద 150 మరణాలు సంభవించాయి. అంటే.. ప్రతీ గంటకూ ఆరు మరణాలు అన్నమాట. ఈ లెక్కన హైవేలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వెనుక నుంచి ఢీకొనడం (Rear-end collisions) రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా జరుగుతున్న విభాగం. ఇవి మొత్తం ప్రమాదాల్లో 21%కి కారణమవుతాయి. అలాగే మొత్తం మరణాల్లో 20% వీటి నుంచే ఉంటున్నాయి.హిట్-అండ్-రన్ కేసులు రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు పెద్ద కారణం. ఇవి మొత్తం మరణాల్లో 18% వాటా కలిగి ఉన్నాయి. లోయల్లో వాహనాల పడి జరిగే ప్రమాదాలు.. ఐదు శాతం కంటే తక్కువే ఉంటోంది. కానీ, వీటి ద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. మధ్యాహ్నా టైంలోనే అధిక యాక్సిడెంట్లు!గణాంకాలను (MoRTH నివేదికలు) పరిశీలిస్తే.. ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్య ప్రమాదాలు 25–30% వరకు నమోదవుతాయి. - మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో సుమారు 40% దాకా ఉంటోంది(అధిక రద్దీ కారణంగా..). ఇక.. సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి మధ్య ప్రమాదాల సంఖ్య 20–25% దాకా ఉంటోంది. అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల సమయంలోనే ప్రమాదాల సంఖ్య కనిష్టంగానే ఉంటోంది. కానీ, అర్ధరాత్రి దాటాక జరిగే యాక్సిడెంట్లలోనే మరణాల రేటు అధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల సంభవించే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్(2024లో 24వేల మరణాలు.. ఈ ఏడాది కూడా అంతకు మించే..), తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ,రాజస్థాన్‌లో అత్యధిక మరణాల నమోదు అవుతున్నాయి. ఈ లెక్కన సగం రోడ్డు ప్రమాదాలు ఈ రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. -
శివరాజ్ పాటిల్ ఇక లేరు
విలువలతో కూడిన రాజకీయాలు ఈ రోజుల్లో అత్యంత అరుదు. అందునా.. నైతిక బాధ్యత అనే పదం వినిపించడం లేదు. అయితే 26/11 (2008లో..) ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి పదవిని వదులుకున్నారు శివరాజ్ పాటిల్. అలాంటి నిబద్ధత కలిగిన దిగ్గజ నేత ఇక లేరు. కాంగ్రెస్ దిగ్గజ నేత శివరాజ్ పాటిల్(90) ఇక లేరు. అనారోగ్యంతో మహారాష్ట్ర లాతూర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేగా.. కేంద్ర మంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, గవర్నర్‌గానూ ఆయన సేవలందించారు. శివరాజ్ పాటిల్ 1935 అక్టోబర్ 12న లాతూర్‌లో జన్మించారు. 1966–1970 మధ్య లాతూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా వెళ్లారు. 1977–1979 మధ్య డిప్యూటీ స్పీకర్, స్పీకర్‌గా సేవలందించారు. 1980లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, లాతూర్ నియోజకవర్గం నుండి వరుసగా 7 సార్లు ఎంపీగా గెలిచారు. లోక్‌సభకు 10వ స్పీకర్‌గా(1991–1996) పనిచేశారు.2004లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. 26/11 (2008లో..) ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాస్త గ్యాప్‌తో 2010–2015లో పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. మొత్తంగా పార్లమెంటులో, ప్రభుత్వంలో నాలుగు దశాబ్దాలకుపైగా సేవలు అందించారు. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన్ని.. రాజకీయాల్లో శాంత స్వభావుడిగా, క్రమశిక్షణ.. నిబద్ధత కలిగిన నేతగా అభివర్ణిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన నిరంతర సేవలు అందించారు, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ పనిచేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడిన స్పీకర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శివరాజ్ పాటిల్ భార్య పేరు విజయా పాటిల్. కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన (బీజేపీ నాయకురాలు), ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. శివరాజ్ పాటిల్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.కోమటి రెడ్డి సంతాపంహైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ మరణం పట్ల తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1972లో రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ పాటిల్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలుపొందారనీ,ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు,మన్మోహన్ సింగ్ కేబినెట్లో రక్షణ (Defence), సైన్స్ & టెక్నాలజీ, మరియు హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారనీ గుర్తు చేశారు. 10వ లోక్‌సభ స్పీకర్‌గా, పంజాబ్ గవర్నర్‌గా కూడా ఆయన సేవలందించారన్నారు. సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెబుతూ.. వారి కుటుంబ సభ్యులకు,ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
పీల్చేగాలి.. ధనికులకే సొంతమా?
భారత్.. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అలాంటి దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. శీతాకాలం మరింత విషాన్నికలిపి, గాలి నాణ్యతను మరింత దిగజార్చుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పీల్చే గాలి కూడా ధనికులకే సొంతమా? కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం ఊపిరి ఆడని పరిస్థితిని ఎదుర్కొంది. ముఖ్యంగా ఆస్పత్రిలో పడకలకోసం సామాన్యులు నానా ఇబ్బందులూ పడుతూ.. ఆక్సిజన్ లేక రోడ్లపైనే చనిపోతున్న సమయంలో.. ధనికులు ఆక్సిజన్ సిలిండర్‌కు ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో ప్రాణాలు నిలుపుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ వాసులు నాటి కోవిడ్-19 పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే? దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల స్థాయిలు పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విశ్లేషణలో తేలింది. దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. వాయు కాలుష్య కారకాలను తగ్గించడం, కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పని వేళల తగ్గించడం,కార్యాలయాల్లో 50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని (ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు) కల్పించడం, అనవసర నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించడం, ఐదవ తరగతిలోపు ఉన్న అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల మూసివేయడం, రైల్వే, మెట్రో, విమానాశ్రయాలు, రక్షణ రంగాలకు సంబంధించిన నిర్మాణాలు మినహా ఇతర నిర్మాణాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కానీ అప్పటికే విషవాయువుల ప్రభావం అక్కడి ప్రజలపై ప్రతాపం చూపించింది. నగర ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్ల మంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితిని చాలా తీవ్రమైనదిగా అభివర్ణించింది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోవని వ్యాఖ్యానించింది.ఢిల్లీ నగరంలో గాలి విషపూరితమై, జీవనమే ప్రశ్నార్థకమవుతున్న ఈ సమయంలో ధనికులు తమ ఇళ్లను ‘క్లీన్ ఎయిర్ బబుల్స్’గా మార్చుకుంటున్నారు. ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థలు, పదుల సంఖ్యలో ఎయిర్ ప్యూరిఫయర్లు, డీహ్యూమిడిఫయర్లు ఇలా లగ్జరీ సీల్డ్ హోమ్స్‌లో వారు తమకోసమే ఒక మైక్రో క్లైమేట్ సృష్టించుకున్నారు. బయట గాలి ఎంత విషపూరితమైనా.. ఇంటి లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని పీల్చేలా వాతావారణాన్ని కల్పించుకుంటుకున్నారు.క్లీన్ ఎయిర్ బుడగలుసంపన్న కుటుంబాలు తమ ఇళ్లలోకి ప్రవేశించే ముందు బయట గాలిని ఫిల్టర్ చేసే ప్రత్యేక వెంటిలేషన్, ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థలు ఇంటి లోపల శుభ్రమైన గాలిని ఉంచి, కలుషిత గాలి లోపలికి చొరబడకుండా అడ్డుకుంటాయి.ఎయిర్ ప్యూరిఫయర్లుకొన్ని అపార్ట్మెంట్లలో యజమానులు 10–12 ఎయిర్ ప్యూరిఫయర్లను ఉపయోగిస్తున్నారు. లోపలి గాలి శ్వాసించదగిన స్థాయిలో ఉండేందుకు ఫిల్టర్లను సంవత్సరంలో అనేకసార్లు మార్చుతున్నారు.డీహ్యూమిడిఫయర్లుఇళ్లను పూర్తిగా సీల్ చేయించుకున్న వారు తలుపులు, కిటికీలను మూసివేసి ఉంచుతారు. తేమ పెరగకుండా, గాలి కలుషితం కాకుండా ఉండేందుకు డీహ్యూమిడిఫయర్లను కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు.లగ్జరీ సీల్డ్ ఇళ్లుఢిల్లీలోని పలువురు ధనికులు బయట గాలి ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విధంగా వారు నియంత్రిత మైక్రోక్లైమేట్‌లను సృష్టించి, బయట వాతావరణం కంటే లోపల గాలి నాణ్యతను చాలా మెరుగ్గా ఉంచుతున్నారు.కానీ ఈ సౌకర్యం పేదలకు మాత్రం అందని ద్రాక్షాల మారింది. ఖరీదైన పరికరాలు, నిర్వహణ ఖర్చులు.. మధ్యతరగతి,పేద కుటుంబాలకు దూరమైంది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోకపోవడంతో విషపూరిత గాలిని పీల్చడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. అదే సమయంలో ధనికులు, పేదల మధ్య అంతరం మరింత పెరిగిపోతుంది. ధనికులు శుభ్రమైన గాలిని పీలుస్తుంటే.. సాధారణ ప్రజలు విష వాయుల్ని పీల్చి దినదినగండంగా కాలం వెళ్లదీయడం ప్రశ్నార్ధకంగా మారింది.ఢిల్లీలో గాలి సంక్షోభం ఇప్పుడు సామాజిక అసమానతకు ప్రతీకగా మారింది. ధనికులు తమ ఇళ్లలో బబుల్స్ సృష్టించుకుంటే, పేదలు విషవాయువులను పీల్చి జీవించాల్సి వస్తోంది. గాలి పీల్చడం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో కాకుండా..దీర్ఘకాలిక పరిష్కారాలు తీసుకురావాలి. లేకపోతే ఢిల్లీ గాలి సంక్షోభం, అసమానత సంక్షోభంగా మారిపోతుంది. -
చికెన్ తింటున్నారా.. ఎంత వరకు సురక్షితం?
చికెన్ ప్రియులకు అలర్ట్. మీరు తినే చికెన్ ఎంత వరకు ఆరోగ్యకరమైంది?. మన దేశంలో దాదాపు 95 శాతం వరకు చికెన్‌లో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ స్థాయి ఉన్నట్టు పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా వెల్లడైంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్.. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్)ను ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కొందరికి మాంసంలేనిది ముద్ద దిగదు. అందుకే మన దేశంలో మటన్, చికెన్‌కు డిమాండ్ ఎక్కువ. ఇదే సమయంలో డిమాండ్ తగినట్టు చికెన్‌ను సరఫరా చేసేందుకు పౌల్ట్రీ నిర్వాహకులు.. కోళ్ల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పెంచుతుంటారు. ఈ క్రమంలో కోళ్లకు యాంటీ బయోటిక్స్‌ను ఇస్తారు. కోళ్ల ఆరోగ్యానికి పలు రకాల యాంటీ బయోటిక్స్ వాడుతున్నారు. అయితే, ఇటీవల చేసిన కొన్ని పరిశోధనల్లో చికెన్‌లో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ స్థాయి నిల్వలు ఉన్నాయని తేలింది.పౌల్ట్రీలో యాంటీ బయోటిక్ వినియోగం గ్లోబల్ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో గుర్తించారు. పౌల్ట్రీల్లో ప్రపంచ సగటు కంటే 3–5 రెట్లు ఎక్కువ స్థాయిలో యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్టు తేలింది. పౌల్ట్రీ కోళ్లలో టెట్రాసైక్లిన్స్, ఫ్లోరోక్వినోలోన్స్, కోలిస్టిన్ వంటి ఔషధాల అవశేషాలు నమూనాల్లో ఉన్నట్టు తేలింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కోలిస్టిన్ విషయంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని కేవలం “చివరి ప్రత్యామ్నాయ ఔషధం”గా మాత్రమే వాడాలని సూచించింది. కోలిస్టిన్ వాడకాన్ని పెద్ద ప్రమాదంగా పేర్కొంది. కానీ, మన దేశంలో మాత్రం కోళ్లు తొందరగా ఎదిగేందుకు, బ్యాక్టీరియా దరి చేరకుండా ఉండేందుకు వీటిని అందిస్తున్నారు. అయితే, 160 కంటే ఎక్కువ దేశాలలో నిషేధించబడిన స్టెరాయిడ్ హార్మోన్లను భారత్‌లో మాత్రం ఎక్కువగా వాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇది స్వేచ్ఛగా జరుగుతున్నట్టు తేలింది.Wake Up, India: Your Plate of Chicken Could Be a Prescription for Superbugs & Hormonal Chaos ‼️ 🆘 🚨 Every time you eat chicken from industrial farms (which is 95%+ of all chicken sold in India), you are likely consuming:• Antibiotics far above global averages – India uses… pic.twitter.com/tpneUrI9Kc— 🥇 Pragnya Gupta (@GuptaPragnya) December 10, 2025ఇక, మన దేశంలో అమ్ముడయ్యే చికెన్‌లో 95 శాతం వరకు ఇలాంటి కోళ్లే ఉన్నట్టు తేలింది. కోళ్లలో యాంపిసిల్లిన్ రెసిస్టెన్స్ అత్యధికంగా 33 శాతం ఉన్నట్లు తేల్చారు. అలాగే సెపోటాక్సిమ్ రెసిస్టెన్స్ 51 శాతం, టెట్రా సైక్లిన్ రెసిస్టెన్స్ 50 శాతం ఉందని కొందరు పరిశోధకులు తెలిపారు. కోళ్ల పెంపకంలో భాగంగా ఎక్కువగా అమోక్సోక్లాప్, ఎన్రోఫ్లోక్సాసిన్ వంటి యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇవి కోళ్లకు రోగనిరోధక శక్తి పెంచడానికి వీటిని వాడుతున్నా.. వీటిని మనుషులు తినడం వల్ల ప్రమాదమే అంటున్నారు. ఇవి ఎక్కువగా తీసుకున్న కోళ్లను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఆరోగ్యంపై ప్రభావం..హార్మోన్లు ఎండోక్రైన్ డిస్రప్షన్కు కారణం కావచ్చుపిల్లల్లో ముందస్తు యవ్వనం వచ్చే అవకాశం. మహిళల్లో PCOS, పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్యలుతాజా అధ్యయనంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వెల్లడి. దేశంలో ఇప్పటికే యాంటీ మైక్రోబయల్ నిరోధకత (AMR) కారణంగా సంవత్సరానికి 1.2 మిలియన్ల మరణాలు నమోదు.తాజా అధ్యయనాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ మత్స్య, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు పలు ప్రశ్నలు సంధించారు. ప్రజల ఆరోగ్యం విషయమై సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. #CleanChickenNow అనే హ్యాష్ ట్యాగ్‌ను కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్‌కు జత చేశారు.ప్రశ్నలు ఇవే..1. కొలిస్టిన్ పౌల్ట్రీ పెరుగుదలకు చట్టబద్ధంగా ఎందుకు అనుమతించబడింది?2. ఈయూ, అమెరికా, చైనా, బంగ్లాదేశ్‌లో కూడా స్టెరాయిడ్ హార్మోన్లను నిషేధించారు. కానీ, భారతీయ పౌల్ట్రీలో ఎందుకు ఉపయోగిస్తున్నారు?3. రిటైల్ స్థాయిలో ఎందుకు రెగ్యులర్ టెస్టింగ్ లేదు?4. FSSAI చికెన్‌ను ‘యాంటీబయాటిక్స్, హార్మోన్లతో పెంచబడింది, యాంటీ బయాటిక్ రహితం’ అని లేబుల్ చేయడాన్ని ఎప్పుడు తప్పనిసరి చేస్తుంది?5. క్యాన్సర్ కారకాలుగా నిరూపించబడిన ఆర్సెనిక్ యాడిటివ్స్ ఇంకా ఎందుకు నిషేధించలేదు?6. పౌల్ట్రీలో వెటర్నరీ ఔషధాల కోసం గరిష్ట అవశేష పరిమితులు (MRLలు) 5–20 రెట్లు ఎక్కువ కలిగి ఉన్నాయి. MRLs ఎందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలడం లేదు?. ఎప్పుడు తీసుకువస్తారు?. -
సోలో మహిళా బైకర్ ...సరికొత్త రికార్డ్...
పురుషులతో సమానంగా బైక్ రైడింగ్‌లో మహిళలు దూసుకుపోతున్నారు. ఆకాశమే హద్దుగా రికార్డులు తిరగరాస్తున్నారు. అదే క్రమంలో పూణేకు చెందిన సోలో ఉమెన్ బైకర్ ఐశ్వర్య నాగర్కర్(32) అలియాస్ సఖి–రైడర్ని తన 350సిసి బైక్‌పై స్వర్ణ చతుర్భుజి హైవేపై ప్రయాణం (గోల్డెన్ క్వార్డిలేటరల్ హైవే జర్నీ) సాగిస్తున్నారు. యంగెస్ట్ ఇండియన్ మదర్ గా గతంలో ఏ మహిళా సోలో రైడర్ సాధించిన ఘనత కాకపోవడం గమనార్హం. ఈ ఘనత ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బూన్ ఆఫ్ రికార్డ్‌లలో నమోదు కానుంది. గత 6వ తేదీన పూణెలో ప్రారంభమైన ఈ జర్నీ దాదాపుగా 6వేల కిమీ కొనసాగనుందని బెంగళూరు, చెన్నై, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం నగరాల మీదుగా సాగి తూర్పు ఉత్తర భారత ప్రాంతాల్లో పూర్తి సర్క్యూట్ పూర్తి చేసిన తర్వాత ఈ నెల 22న పూణేకు తిరిగి చేరుకుంటానని గృహిణి, 8ఏళ్ల కూతురుకి తల్లి కూడా అయిన ఐశ్వర్య చెప్పారు. బైక్ రైడ్ కొనసాగిస్తూనే ‘సాక్షి’తో ముచ్చటించిన ఆమె పలు అంశాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...తెలుగువాళ్ల ఆదరణ మరువలేను..నా బైక్ జర్నీ ప్రారంభమైన 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ఒంగోలుకు చేరుకున్నాను. అలాఅలా విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం పట్టణాల మీదుగా ప్రయాణించాను. ఈ సందర్భంగా పలు చోట్ల స్థానికులతో సంభాషించాను ప్రతీ చోటా అక్కడి సమస్యలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలపై వారితో ముచ్చటించాను. నన్ను స్వంత ఇంటి మనిషిలా ఆదరించిన వారి ఆత్మీయత మరచిపోలేను. నా జర్నీ సందర్భంగా ఇంకా చాలా మంది మహిళలు సంకోచాలతో తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారని అర్ధమైంది. సేవతో మిళితం చేస్తూ...నా బైక్ రైడింగ్ ఇతరుల కంటే వేగంగా ప్రయాణించడమో, రికార్డుల సృష్టికే పరిమితం కాదు... ఇతరులు నా కోసం నిర్దేశించిన పరిమితులను దాటి ప్రయాణించడం నా లక్ష్యం. దీనిని సేవతో మిళితం చేస్తూ సాగుతున్నా. మహారాష్ట్రలోని ఫోఫ్సండి జిల్లా పరిషత్ పాఠశాల సహా పలు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్ధుల కు అండగా ఉండేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. వారికి ఆర్ధిక చేయూత అందించేందుకు విరాళాలు సేకరించడానికి రైడర్లు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సహోద్యోగులను సమీకరిస్తుంటాను.కూతురి కోసం మట్టి సేకరణ...నా ఈ తాజా ప్రయాణంలో అద్భుతమైన వ్యక్తులను కలిశాను ప్రతి రాష్ట్రం ఎంత అందంగా ఉంటుందో గమనించాను అంతేకాదు నేను ప్రయాణించే ప్రతి రాష్ట్రం నుంచి గుప్పెడు మట్టిని సేకరిస్తానని నా కుమార్తెకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేశా. ఎందుకంటే మన దేశం సంస్కృతిలో... ఆహారంలో, భాషలో, సుసంపన్నమైనది. కానీ దేశపు నిజమైన ఆత్మ దాని మట్టిలోనే ఇమిడి ఉంటుందని నా అభిప్రాయం నేను ఆమెకు ఈ మట్టి జాడీలను ఇచ్చినప్పుడు, భారతదేశం మొత్తం ఆమె ఇల్లేనని... ఆకాశమే ఆమె హద్దు అనే నమ్మకాన్ని కూడా బహుమతిగా ఇస్తాను కేవలం మట్టి మాత్రమే కాదు, నేను ప్రయాణించే రహదారుల నుంచి ధైర్యం, నేను స్పృశించే భూమి నుంచి ఆశీర్వాదాలు, నేను కలిసే వ్యక్తుల నుంచి జ్ఞాపకాలను సేకరిస్తూ ముందుకు సాగుతున్నాను. నా ప్రయాణం కిలోమీటర్ల లెక్క గురించి కాదు, ఇది నా దేశంతో అనుసంధానం కావడం గురించి, అది పంచిన ప్రేమను ఇంటికి తీసుకురావడం గురించి.మహిళకు స్ఫూర్తిగా..నేను నా కోసం, నా కూతురి కోసం, తాను కూడా ఎవరూ ఊహించనంత దూరం ప్రయాణించగలనని నిరూపించే ప్రతి మహిళ కోసం ఈ రైడ్ చేస్తున్నాను. ఒక మహిళ బలం పరిమితుల ద్వారా నిర్వచించలేం, వాటిని ఛేదించే ధైర్యం ద్వారా మాత్రమే నిర్వచించవచ్చు. ఇది వారికి చూపించడమే నా లక్ష్యం. నేను సంచరించే ప్రతి రహదారి, మహిళలు స్వేచ్ఛగా, ధైర్యంగా భయం లేకుండా సంచరించే ప్రపంచం వైపు ఒక అడుగు. ఇతర మహిళలు వారి శక్తిని విశ్వసించడానికి, వారి కలలను సాకారం చేసుకోవడానికి వారి స్వంత మార్గాన్ని సృష్టించుకునేలా నా ప్రయాణాల ద్వారా, ప్రేరేపించాలనేది నా ఆలోచన. నా మోటార్‌సైకిల్ కేవలం ఒక యంత్రం కాదు అది నా స్వరం, నా స్వేచ్ఛ, సాధికారత పట్ల నా నిబద్ధత. ప్రతి మైలుతో, మహిళలు తమ సొంత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారిని ఎవరూ ఆపలేరనే సందేశాన్ని నాతో మోసుకెళ్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా, నా భర్త మద్దతు లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు. నేను 15 రోజులు ఇంట్లో ఉండడం లేదంటే ఇలా రోడ్ల మీద ప్రయాణిస్తుంటే మా కూతురి బాగోగులు తాను చూసుకుంటున్నాడు. నా తల్లిదండ్రులు , నా అత్తమామలు కూడా తమ చేతనైనంతగా నాకు మద్దతు ఇస్తున్నారు. అదే విధంగా ప్రతీ మహిళ తనను తాను నిరూపించుకునేందుకు కుటుంబం అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను.::Satya Babu -
జాతీయ గీతం, గేయానికి సమాన హోదా దక్కాలి
న్యూఢిల్లీ: జాతీయ గీతం వందేమాతరం జాతీయవాదానికి సంబంధించిన అంశమ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. జాతీయ గీతానికి జాతీయ గేయం జనగణమన, జాతీయ జెండాతో సమాన హోదా, గౌరవం దక్కా లని అన్నారు. ఈ మేరకు ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. నడ్డా గురువారం రాజ్యసభలో మాట్లాడా రు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత వందేమాతర గీతానికి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ గీతం దేశాన్ని ఐక్యం చేసిందని, అది చూసి బ్రిటిష్ పాలకులు వణికిపోయారని పేర్కొన్నారు. జాతీయ గేయం జనగణమ నను సైతం ఎంతగానో గౌరవిస్తున్నానని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చను నడ్డా ముగించారు. చరిత్ర గురించి ప్రజలకు వాస్తవాలు తెలియ జేయడమే ఈ చర్చ ఉద్దేశమని వివరించారు. జవహర్లాల్ నెహ్రూ పాలనలో జాతీయ గీతానికి తగిన గౌరవం దక్కలేదని అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. చరిత్రను వక్రీకరించొద్దని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ సైతం స్పందించారు. జాతీయ గీతానికి, జాతీయ గేయానికి సమాన స్థాయి, హోదా ఉన్నాయని తేల్చిచెప్పారు. -
దేశంలోనే తొలిసారిగా హైడ్రో నావ!
వారాణసి: స్వచ్ఛ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ సాయంతో వాణిజ్యపరమైన నా వికా సేవలకు తెర తీసింది. వారణాసిలోని నమో ఘాట్ ఇందుకు వేదికైంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నావను కేంద్ర జల వనరులు, నౌకాయాన మంత్రి శర్బానంద్ సోనోవాల్ గురువారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయేతర, దీర్ఘకాలిక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘మన మిప్పుడు హైడ్రో ఇంధనాన్ని వాడుతున్న చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్ వంటి అతి కొద్ది దేశాల సరసన సగర్వంగా నిలిచాం. ఇది కేవలం సాంకేతిక ప్రగతి మా త్రమే కాదు. స్వచ్ఛ ఇంధనం, దాని వాడకం నిమిత్తం దేశీయ మార్గాల రూపకల్పన దిశగా మనం వడివడిగా వేస్తున్న ముందడుగు తిరుగులేని సూచిక. అంతర్గత జల మార్గాలు దేశాభివృద్ధిలో కీ పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతున్నాయి. జాతీయ జల మార్గాల సంఖ్య గడచిన పదేళ్లలో సంఖ్య 5 నుంచి ఏకంగా 111కు పెరిగింది! వాటిలో 13 జల మార్గాల్లో పర్యాటకం నానాటికీ ఇతోధికంగా పెరిగిపోతోంది. ఇదెంతో శుభసూచకం. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ వల్లే ఇది సాధ్యపడింది‘ అన్నారు. హైడ్రో ఇంధన సేవలను పూర్తిస్థాయిలో వినియోగించాలంటే మరిన్ని పరిశోధనలు, కీలక పరీక్షలు చేయాల్సి ఉంది. -
రాజకీయాలు అంటే సినిమా కాదు.. పవన్‌కు కన్నడ మంత్రి చురకలు
సాక్షి బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తీరుపై పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ధోరణిపై కన్నడ మంత్రి ఒకరు విరుచుకుపడ్డారు. రాజకీయాలంటే సినిమాలు కాదని, తెలుగు సినిమాలో మాత్రమే ఆయన హీరో అని, రాజకీయాల్లో కాదని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ ఎస్. లాడ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు పవన్‌కళ్యాణ్‌పై చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ‘ప్రజాసేవ అంటే సినిమా కాదు. జిమ్మిక్కులు, గిమ్మిక్కులు, నటనను ప్రజలు ఎప్పటికీ అభినందించరు.అయినప్పటికీ బలవంతంగా రాజకీయాల్లో కూడా ఆయన నటిస్తున్నారు’.. అంటూ మంత్రి ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బెళగావిలో మంత్రి సంతోష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌కళ్యాణ్‌కు ఒక మనవి చేస్తున్నా. మీరు రాజకీయాలకు ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ఇన్ని రోజులు సినిమాల్లో నటిస్తూ వచ్చారు. సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. అయితే ఇది సినిమా కాదు.సనాతన ధర్మం, హిందూ సంబంధిత విషయాల గురించి మాట్లాడితే ప్రజలకు ఏం ప్రయోజనం? పేదవారికి, శ్రామికుల కోసం, రాష్ట్రాభివృద్ధిపట్ల ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్డీఏ సర్కారులో భాగమైన మీరు విద్యా, ఉద్యోగాల విషయాలపై కేంద్రం వద్ద అధిక కేటాయింపులు సాధించి రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నించాలి. సనాతన ధర్మం గురించి ఎలాంటి ప్రసంగాలు ఇవ్వకండి’.. అంటూ ఆయన హితవు పలికారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో కనీస వేతనం ఎంత? ఈ విషయం పవన్‌కు తెలుసా? ఇప్పుడెందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు? బుద్ధ ధర్మం, ఇస్లాం ధర్మం గురించి ఎందుకు మాట్లాడరు’ అని ప్రశ్నించారు. -
కర్ణాటక సీఎం మార్పు కొలిక్కి!?
సాక్షి బెంగళూరు: కన్నడనాడు రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీఎం మార్పు అంశం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కుర్చీ పోరుకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 9న డీకే శివకుమార్ కల తీరనున్నట్లు సమాచారం. అయితే, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంఘర్షణ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్న 30 రోజుల పాటు మహామౌనం వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.వివాదానికి యతీంద్ర ఆజ్యం..బెళగావి శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో సిద్దరామయ్యే మళ్లీ సీఎం అంటూ ఆయన తనయుడు యతీంద్ర వ్యాఖ్యానించారు. నాయకత్వ మార్పు ఉండదని ఆయన పదేపదే వ్యాఖ్యానిస్తూ వివాదానికి ఆజ్యం పోస్తున్నారు. దీంతో సీఎం మార్పు వివాదం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీకి అస్త్రంగా మారింది. నిజానికి.. ఈ అంశం బీజేపీకి అస్త్రం కాకూడదని పార్టీ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్‌ను హెచ్చరించినప్పటికీ సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల అభిమానులెవ్వరూ లెక్కజేయకుండా మాట్లాడుతూ పార్టీని ఇరకాటంలోకి పెడుతున్నారు.జనవరి రెండో వారంలో డీకే సీఎం?ప్రతిపక్షాలను బాహాటంగా చీల్చిచెండాడే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించారు. ఇందుకు అసలు కారణం జనవరి 9గా తెలుస్తోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ హైకమాండ్ జనవరి రెండో వారంలో సీఎం కుర్చీపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో.. అప్పటివరకు పార్టీకి ఇబ్బంది కలిగించకుండా మౌనం వహించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని డీకే భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. డీకే శివకుమార్‌కు దాదాపు సీఎం పీఠం ఖరారవుతున్న తరుణంలో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన లక్ష్యాన్ని దూరం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ఆయన మౌనాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పైగా.. హైకమాండ్పట్ల విధేయత, క్రమశిక్షణ కనబరిచిన వాడిగా గుర్తింపు పొందాలని డీకే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.తనయుడికి సిద్దరామయ్య హితబోధ..ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాల కారణంగా ఈ సీఎం కుర్చీ పోరు కాస్తా నెమ్మదించినా సమావేశాల అనంతరం మళ్లీ రాజుకునే అవకాశముంది. సీఎం సిద్దరామయ్య తనయుడు యతీంద్ర చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఇవి డీకే వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు తన కుమారునితో సిద్దరామయ్య చర్చించారు. సున్నితమైన అంశాలను మీడియా సమక్షంలో ప్రస్తావించవద్దని తన కుమారునికి హితవు పలికినట్లు సమాచారం. ఇక యతీంద్ర వ్యాఖ్యలతో డీకే శివకుమార్ వర్గం కూడా అప్రమత్తమైంది. విధానసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం తన మద్దతుదారులతో సభలోనే డీకే ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు. -
సామాన్యుడి మొహంలో చిరునవ్వే మేం కోరుకునేది
న్యూఢిల్లీ: రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి కుటుంబానికి రైల్వే శాఖ దాదాపు 23 ఏళ్లకు పరిహారం అందజేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, హైకోర్టు పరిహారం అవసరం లేదంటూ తీర్పు వెలువరించినా, సుప్రీంకోర్టు జోక్యంతో యంత్రాంగం కదిలింది. రైల్వే శాఖ, పోలీసులు కలిసి వృద్ధురాలై మృతుడి భార్య జాడ కనుక్కుని పరిహారంగా రూ.8.92 లక్షలను ఆమెకు అందజేశారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హర్షం వ్యక్తం చేశారు. తమకు కావాల్సింది ఇలాంటివేనన్నారు. ‘మేం కోరుకునేది ఒక్కటే. అదే నిరుపేద మొహంలో చిరునవ్వు. అంతకుమించి మాకేం వద్దు..’అంటూ ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి కూడా ఉన్నారు. 2002లో జరిగిన ఘటన ఇది.. విజయ్ సింగ్ అనే వ్యక్తి భక్తియార్‌పూర్‌లో రైలు టిక్కెట్ కొనుక్కుని భాగల్పూర్–దానాపూర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో లక్నోకు బయలుదేరారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎలాగోలా లోపలికి ఎక్కేందుకు ప్రయతి్నంచారు. కొద్దిదూరం వెళ్లాక పట్టుతప్పి, పట్టాలపై పడిపోయారు. అటుగా వచి్చన మరో రైలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పరిహారం కోసం విజయ్ సింగ్ భార్య దేవి రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విజయ్ సింగ్‌కు మతి స్థిమితం లేనందున, పరిహారానికి అర్హుడు కాదని ట్రిబ్యునల్ తోసిపుచి్చంది. అనంతరం ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడ నిరాశే ఎదురైంది. తీర్పును సవాల్ చేస్తూ వృద్ధురాలైన దేవీ సింగ్ తరఫున లాయర్ ఫౌజియా షకీల్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. 2023 ఫిబ్రవరి 2వ తేదీన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..రైల్వే ట్రిబ్యునల్, పట్నా హైకోర్టు ఇచి్చన తీర్పులను తప్పుబట్టింది. మతి స్థిమితం లేని వ్యక్తి తనంతానే రైలు టిక్కెట్ ఎలా కొంటారని, పట్నా వెళ్లేందుకు తనొక్కడే ఎలా రైలు ఎక్కుతారని ప్రశ్నించింది. విజయ్ సింగ్ మృతికి కారణమైనందుకు రూ.4 లక్షల పరిహారాన్ని పిటిషన్ వేసినప్పటి నుంచి 6 శాతం వడ్డీ చొప్పున ఆయన కుటుంబానికి రెండు నెలల్లోగా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే, వృద్ధురాలైన దేవీ సింగ్ తనున్న చోటు నుంచి కుటుంబసభ్యులతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో, పరిహారం అందుకోవాలంటూ రైల్వే శాఖ రాసిన లేఖలు ఆమెను చేరలేదు. ఆమె కోసం హిందీ, ఇంగ్లిష్ పత్రికల్లో ప్రకటనలు వేయించాలని, స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేవీ సింగ్‌కు పరిహారం అందేలా చూడాలంటూ నలంద ఎస్ఎస్పీ, భక్తియార్పూర్ ఎస్‌హెచ్‌వోలకు ప్రత్యేకంగా ఆదేశాలిచి్చంది. చివరికి ఎలాగోలా దేవీ సింగ్ జాడను యంత్రాంగం కనిపెట్టింది. -
ఆ ప్రైవేట్ వైద్యుల కుటుంబాలు పీఎంజీకేవైకి అర్హులే: సుప్రీం
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద రూ.50 లక్షల బీమా పరిహారానికి అర్హమైనవేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పీఎంజీకేవై ప్యాకేజీకి ప్రైవేట్ వైద్యులు అర్హులు కారంటూ బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పును గురువారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం పక్కనబెట్టింది. చట్టాలు, నిబంధనల ప్రకారం వైద్యులకు ఉపయోగపడేందుకు గల అన్ని అవకాశాలను పరిశీలించాలి. పైపెచ్చు, కోవిడ్ సమయంలో ఫ్రంట్‌లైన్ వైద్యులకు, ఆరోగ్య నిపుణులకు యావత్తూ దేశం దన్నుగా ఉంటుందనే హామీ ఇవ్వడానికి ఉద్దేశించిన బీమా పథకమిది’అని ధర్మాసనం తెలిపింది. ‘పీఎంజీకేవై–ప్యాకేజీ కింద చేసిన బీమా కోసం వ్యక్తిగత క్లెయిమ్‌లు చట్టానికి లోబడి రుజువుల ప్రాతిపదికన పరిశీలించాలి. అనుగుణంగా పరిహారాన్ని నిర్ణయించాలి’అని పేర్కొంది. ‘కోవిడ్ సంబంధిత విధి నిర్వహణలోనే ఆ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయినట్లు నిరూపించే బాధ్యత క్లెయిమ్ చేసిన కుటుంబీకులపై ఉంటుంది. నమ్మదగిన సాక్ష్యం ఆధారంగా దానిని ధ్రువీకరించాల్సి ఉంటుంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పనిచేస్తేనే తప్ప, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు పీఎంజీకేవై ప్యాకేజీ వర్తించదంటూ బాంబే హైకోర్టు 2021లో వెలువరించిన తీర్పును ప్రదీప్ అరోరా తదితరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అంతకుముందు, మహారాష్ట్రలోని థానెలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో వైద్యుడైన తన భర్త 2020లో కోవిడ్ సమయంలో చనిపోయారని, పీఎం జీకేవై ఆయనకు వర్తింప జేయాలంటూ కిరణ్ భాస్కరే సుర్గాడే వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన పనిచేసే ఆస్పత్రిని కోవిడ్–19 ఆస్పత్రిగా ప్రభుత్వం గుర్తించనందున బీమా వర్తింజేయలేమని బీమా కంపెనీ తెలిపింది. కోవిడ్ సేవల్లో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు కేంద్రం 2020 మార్చిలో పీఎంజీకేవైను ప్రకటించింది.


