Election 2026: 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..! | Election 2026 Date Announcement For 5 States Announced | Sakshi
Sakshi News home page

Election 2026: 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..!

Mar 15 2026 4:13 PM | Updated on Mar 15 2026 5:03 PM

Election 2026 Date Announcement For 5 States Announced

న్యూఢిల్లీ:  ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది  ఈ మేరకు సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌  ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. దాంతో ఇక్కడ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో కలుపుకుని మొత్తం 17. 4 కోట్ల మంది ఓటర్లు ఉ న్నట్లు జ్ఞానేష్‌ కుమార్‌ తెలిపారు. 

ఆయా రాష్ట్రాలకు సంబంధించి సీఎస్‌, డీజీ, నోడల్‌ అధికారులు, ఎన్నికల అధికారులతో సమావేశమైనట్లుస్పష్టం చేశారు.  ఈ ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తునపాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 2.18 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

మే 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌
ఒకే విడతలో  తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ  కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో ఏప్రిల్‌ 9వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొన్నారు.  ఇక ఏప్రిల్‌ 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉంటుందన్నారు.ఇక వెస్ట్‌ బెంగాల్‌లో రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఏప్రిల్‌ 23వ తేదీన తొలి విడత, 29వ తేదీన రెండో విడత పోలింగ్‌ నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపారు.   ఎన్నికలు జరిగే ఈ ఐదు రాష్ట్రాల్లో మే 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ ఉంటుందన్నారు. 

 

రాష్ట్రాల వారీగా ఎలక్షన్ షెడ్యూల్

  • అసోం- పోలింగ్: ఏప్రిల్ 9, కౌంటింగ్: మే 4
  • తమిళనాడు – పోలింగ్: ఏప్రిల్ 23, కౌంటింగ్: మే 4
  • పశ్చిమ బెంగాల్ – పోలింగ్: ఏప్రిల్ 23 (1వ దశ), ఏప్రిల్ 29 (2వ దశ), తదుపరి దశ, కౌంటింగ్: మే 4
  • కేరళ – పోలింగ్: ఏప్రిల్ 9, కౌంటింగ్: మే 4
  • పుదుచ్చేరి – పోలింగ్: ఏప్రిల్ 9, కౌంటింగ్: మే 4

కాగా, ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మే 7న.. తమిళనాడులో మే 10న.. అసోంలో మే 20న..కేరళంలో మే 23న.. పుదుచ్చేరిలో జూన్ 15న అసెంబ్లీ పదవికాలం ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement