న్యూయార్క్‌–ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య | Air Indias New York-Delhi flight diverted to Ireland due to tech issue | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌–ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య

Mar 17 2026 5:50 AM | Updated on Mar 17 2026 5:50 AM

Air Indias New York-Delhi flight diverted to Ireland due to tech issue

అత్యవసరంగా ఐర్లాండ్‌కు మళ్లింపు 

న్యూఢిల్లీ: న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా ఎ–350 విమానంలో సోమవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో దాన్ని మార్గమధ్యంలోనే అత్యవసరంగా ఐర్లాండ్‌లోని షానన్‌ నగరంలో దించేశారు. విమానానికి పూర్తిస్థాయిలో సాకేంతిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అందులో దాదాపు 300 మంది ప్రయాణికులున్నారు. ‘‘వారంతా క్షేమమే. వారికి బస తదితర ఏర్పాట్లు చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఢిల్లీ చేరుకునేందుకు సాయపడతాం’’అని ఎయిరిండియా తెలిపింది. న్యూయార్క్‌ నుంచి బయల్దేరిన ఆరు గంటలకు విమానంలో సమస్య తలెత్తినట్టు వివరించింది. ఆ విమానాన్ని ఎయిరిండియా 2024లో సమకూర్చుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement