breaking news
Reviews
-
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీ సినిమాలు అనగానే అయితే రొమాంటిక్ లేదా థ్రిల్లర్స్ ఉంటాయిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డిఫరెంట్ స్టోరీలతో తీసిన మూవీస్ కూడా వస్తుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్‌స్పాట్ 2 మచ్'. 2024లో వచ్చిన తొలి పార్ట్ అందరికీ షాక్ ఇవ్వగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్ కూడా అదే రేంజులో ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ కార్తిక్ దర్శకుడు కాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. లెస్బియన్ పాత్ర చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ సినిమా.. 'చథా పచ్చ' తెలుగు రివ్యూ)కథేంటి?తొలి భాగంలో ఓ నిర్మాతకు స్టోరీ చెప్పడానికి వచ్చిన మహమ్మద్ షరీఫ్(విఘ్నేశ్ రాజా).. స్టోరీలన్నీ చెప్పి చివరకు నిర్మాత కుమార్తెనే(బ్రిగిడ సాగా) పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఇదే నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ కోసం వస్తుంది. ఓ మూడు కథలు చెబుతుంది. వీటిలో ఒకటి హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప, ఈ నిర్మాతకే స్టోరీ చెప్పడం వెనక ఓ ఉద్దేశం ఉంటుంది. ఇంతకీ అదేంటి? శిల్ప ఎవరు? షరీఫ్‌తో ఈమెకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమా అంటే ఇలానే ఉండాలి. ఇలానే తీయాలి అని కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తూ అప్పుడప్పుడు కొందరు దర్శకులు ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే 'హాట్‌స్పాట్'. 2024లో వచ్చిన ఈ సినిమాలో చిత్రవిచిత్రమైన అంశాల్ని చూపించగా.. ఈసారి సీక్వెల్లో మాత్రం సమాజంలోని హాట్ టాపిక్ లాంటి మూడు అంశాలని తీసుకుని వాటిని కన్విన్సింగ్‌గా చెప్పగలిగాడు. మెప్పించాడు కూడా.తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలని అభిమానించడం అనేది చాలా సాధారణమైన విషయం. అలా విపరీతమైన ఫ్యానిజం చూపించే ఇద్దరు కుర్రాళ్లకు.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎలాంటి గుణపాఠం చెప్పాడు. వాళ్లకు ఎలా కళ్లు తెరిపించాడు అనేది తొలి స్టోరీగా చూపించారు. ఇందులో చెప్పిన పాయింట్స్ గానీ, చూపించిన అంశాలు గానీ పచ్చి నిజాలే. యువత తమ సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా హీరోలకు ఎలా బానిసత్వం చేస్తున్నారు? వాళ్ల సినిమాల రిలీజ్ టైంలో ఎలా కొట్టుకుచస్తున్నారనేది చూపించారు. చివరలో ఇచ్చిన ట్విస్ట్ అయితే ఆలోచన రేకెత్తించడంతో పాటు ఇలా ఉన్నారేంట్రా బాబు అనిపించేలా చేస్తుంది.రీసెంట్ టైంలో డ్రస్సింగ్ సెన్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం నటుడు శివాజీ.. స్టేజీపై హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయంలో చాలామంది శివాజీని తప్పుపట్టారు. మరికొందరు ఇతడిని సమర్థించారు. అసలు డ్రస్సింగ్ అంటే ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు? అనేది చూపించారు. ఇంటికొచ్చిన అతిథుల ముందు కూడా పొట్టిబట్టలేసుకుని కౌంటర్స్ వేసే ఓ కూతురికి.. వయసైన తండ్రి లాగిపెట్టి కొట్టేలా ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అనేది పాయింట్ స్ట్రెయిట్‌గా చెప్పారు. ఇది చూస్తే కచ్చితంగా చాలామంది అమ్మాయిల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశముంటుంది.ఇక మూడోది టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ. 2026లోనూ స్వచ్ఛమైన ప్రేమ కావాలనుకునే ఓ కుర్రాడికి అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా 2050లో ఉండే ఓ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. రోజూ ఫోన్లో మాట్లాడుతూ తెలియకుండానే ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమెకు ఇతడికి ఓ షాకింగ్ కనెక్షన్ ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఆ ట్విస్టుకి తొలుత ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చి స్టోరీని సుఖాంతం చేశారు. ఏదేమైనా ఈ మూడు స్టోరీలు ప్రస్తుతం సమాజంలో చాలామంది చూస్తున్న చేదు నిజాలే. కానీ కామెడీగా బోల్డ్ టచ్ ఇస్తూ చెప్పడం బాగుంది.పైన చెప్పిన మూడు కథలతో పాటు ప్రియా భవానీ శంకర్ చేసిన శిల్ప పాత్రకు ఓ స్టోరీ ఉంటుంది. అదేంటనేది ఇందులో పెద్దగా రివీల్ చేయలేదు. త్వరలో వచ్చే మూడో భాగంలో పూర్తిస్థాయిలో చూపిస్తారేమో?నటీనటుల విషయానికొస్తే.. ప్రియాభవానీ శంకర్, భవానీ శ్రీ, తంబి రామయ్య, ఎమ్ఎస్ భాస్కర్, బ్రిగిడ సాగా.. ఇలా ఎవరికి వాళ్లు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గానూ బాగుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే బోల్డ్ సినిమా గానీ అసభ్యకర సన్నివేశాల్లాంటివి లేవు. వీలైతే ఒంటరిగానే చూడండి. కచ్చితంగా నచ్చుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్) -
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. పాతిరాత్రి రివ్యూ
మంజుమ్మల్ బాయ్స్, కూలీ సినిమాలతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సౌబిన్ షాహిర్. అతడు గతేడాది పోలీస్‌గా నటించిన థ్రిల్లర్ మూవీ పాతిరాత్రి. రతీనా పీటీ దర్శకత్వం వహించిన ఈ మలయాళ మూవీ 2025 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి జీ5లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం...కథేంటి?పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ అనగానే కేసుల్ని పోలీసులు ఎలా చేధిస్తారనేది చూపిస్తారు. అయితే ఈ మూవీలో మాత్రం కాస్త విభిన్నంగా తమకు సంబంధం లేని కేసులో ఇరుక్కున్న పోలీసులు దాన్నుంచి ఎలా బయటపడ్డారన్నది చూపించారు. అదే సమయంలో తమ తప్పు లేదని నిరూపిస్తూనే కేసును చేధిస్తారు. పాతిరాత్రి అంటే అర్ధ రాత్రి అని అర్థం. ఆ కటిక చీకటిలో ఏం జరిగిందనేదే సినిమా. ఎలా ఉంది?ఓపెనింగ్ షాట్‌తో సినిమాలో ఏదో విశేషం ఉండబోతుందని హింట్ ఇచ్చారు. తీరా చూస్తే మరీ అంత హైప్ ఇచ్చే మూమెంట్స్ ఏవీ ఉండవు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా, కొంత బోరింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి కాస్త ఆసక్తి పుంజుకుంటుంది. సెకండాఫ్‌లో స్పీడ్ పెరుగుతుంది. ప్రముఖ జర్నలిస్టు మరణం కేసులో కానిస్టేబుల్ హరీశ్ (సౌబిన్ షాహిర్), ఎస్ఐ జాన్సీ (నవ్య నాయర్) సస్పెండ్ అవుతారు.అక్కడి నుంచి వారు కేసులో అసలు హంతకులెవరో నిరూపించే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఈ క్రమంలో వెలుగుచూసే నిజాలు కొంత ఆశ్చర్యంగా అనిపించినా, విచారణ మాత్రం మరీ అంత ఆసక్తికరంగా సాగదు. అయితే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు పాతిరాత్రిని ఒకసారి చూసేయొచ్చు. ప్రస్తుతం జీ5లో ఉన్న ఈ సినిమా మలయాళ ఆడియోతో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. (Paathirathri Movie Review) -
‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: నవాబ్ కేఫ్నటీనటులు: శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ తదితరులునిర్మాణ సంస్థ: హర్షిక ప్రొడక్షన్స్దర్శకుడు : ప్రమోద్ హర్షనిర్మాత: రాధా వి పపుడిప్పుసంగీతం: ప్రశాంత్ ఆర్ విహారివిడుదల తేది: ఫిబ్రవరి 20, 2026టాలీవుడ్లో ఈ వారం రిలీజ్ అయిన మరో చిన్న సినిమా ‘నవాబ్ కేఫ్’. మొదటి ఈ సినిమాకు చాయ్ వాలా అని టైటిల్ పెట్టారు. కానీ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలపడంతో ‘నవాబ్ కేఫ్’గా మార్చారు. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ సినిమాకు పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. పాతబస్తీ ఇరానీ చాయ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన రంగనాథ్ (రాజీవ్ కనకాల) వారసత్వంగా వచ్చిన ‘నవాబ్ కేఫ్’ని రన్ చేస్తూ ఉంటాడు. అది కేవలం టీ కొట్టుగా కాకుండా కుటుంబ లెగసీగా ఫీలవుతాడు. తాత, తండ్రి లాగే రంగనాథ్ ‘టీ’కి కూడా అభిమానులు ఉంటారు. అయితే ఆయన కొడుకు రాజా(శివ కందుకూరి)కి మాత్రం ఆ కేఫ్‌లో పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అమెరికాకు వెళ్లి భారీగా డబ్బులు సంపాదించాలని కలలు కంటాడు. పెదనాన్న కొడుకు కుమార్(చైతన్య కృష్ణ) సలహాతో కేఫ్‌ని అమ్మేయాలని ఆలోచిస్తాడు. ఈ విషయంలో తండ్రి, కొడుకు మధ్య ఘర్షణ జరుగుతుంది. అదేరోజు రాత్రి రంగనాథ్ గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత రాజాలో వచ్చిన మార్పు ఏంటి? తన కలలను నెరవేర్చుకోవడం కోసం ‘నవాబ్ కేఫ్’ అమ్మేశాడా? లేదా తండ్రి విలువ తెలుసుకొని కేఫ్‌ని రన్ చేశాడా? ‘నవాబ్ కేఫ్’ కోసం కుమార్ చేసిన కుట్ర ఏంటి? రాజా తీసుకున్న నిర్ణయానికి ప్రియురాలు సఖీ( తేజు అశ్విని) ఎలా తోడుగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరో మొదట్లో అల్లరి చిల్లరగా తిరగడం.. ఓ విషాద ఘటన తర్వాత పూర్తిగా మారిపోయి..తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడం.. ఆ బిజినెస్‌ని దెబ్బతీసేందుకు విలన్ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టి.. చివరిలో ఆ రంగంలో రికార్డు సృష్టించడం..ఈ లైన్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘నవాబ్ కేఫ్’ కూడా ఇలాంటి కథే. కథ-కథనం రెండూ.. ఇటీవల ధనుష్ నటించిన ‘ఇడ్లీ కొట్టు’ సినిమాను గుర్తు చేస్తాయి. అక్కడ ఇడ్లీ దుకాణం.. ఇక్కడ టీ కొట్టు.. అంతే తేడా. తండ్రి-కొడుకు ఎమోషన్ చాలా సినిమాల్లో చూసినట్లుగానే ఉంటుంది. ప్రమోద్ హర్ష ఎంచుకున్న పాయింటే రొటీన్ అంటే.. స్క్రీన్‌ప్లే కూడా అలానే ఉంది. కథనం ఎక్కడ ఆసక్తికరంగా అనిపించదు. ఇంటర్వెల్ సీన్ ఒక్కటి కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది. మిగతా కథంతా ఊహకందేలా.. నిదానంగా సా..గుతూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. నవాబ్ కేఫ్ హిస్టరీని తెలియజేస్తూ కథను ప్రారంభించారు దర్శకుడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ.. హీరోయిన్‌తో పరిచయం.. వారిద్దరి మధ్య సాగే లవ్‌ట్రాక్.. ఏ ఒక్కటి కూడా ఆసక్తికరంగా అనిపించదు. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి.. సఖీ పాత్రను క్రియేట్ చేశారు కానీ..కథతో ఆమెకు ఎలాంటి సంబంధమే ఉండదు. హీరో అమెరికాకు వెళ్లాలని ఫిక్స్ అయినప్పుడే..తర్వాత కథనం ఎలా సాగుతుందనేది అర్థమైపోతుంది. ముందుగా చెప్పినట్లుగా ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఎమోషనల్ సీన్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థం కథనం మరింత సాగదీతగా సాగుతూ.. ఇడ్లీ కొట్టు, కీర్తి సురేశ్ మిస్ ఇండియా తో పాటు పలు సినిమాలను గుర్తుకు చేస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. రాజా పాత్రకు శివ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. హీరో తండ్రిగా రాజీవ్ కనకాల రొటీన్ పాత్రే చేసినా.. ఎమోషనల్ సీన్లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ తెజు అశ్విని పాత్రకు కథలో ప్రాధాన్యత లేదు. తెరపై కనిపించేది కూడా తక్కువే. రాజ్‌కుమార్ కసిరెడ్డి తనదైన కామెడీతో కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా కూడా సినిమా యావరేజ్‌గానే ఉంది. సినిమా మొత్తం ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉందంటే..అది ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అని చెప్పాలి. ఆయన అందించిన పాటలతో పాటు బీజీఎం కూడా సినిమా స్థాయిని పెంచేలా చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమా మొత్తంలో చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని సీన్లను కట్ చేసినా.. కథకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ప్రతివారం తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తూనే ఉంటారు. అందుకు తగ్గట్లే ఆయా భాషల మూవీస్.. డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ యాక్షన్ కామెడీ సినిమా కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. 90స్ కిడ్స్‌కి ఎంతో ఇష్టమైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈకి లోకల్ టచ్ ఇచ్చిన తీసిన చిత్రమే 'చథా పచ్చ'. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సావియో (అర్జున్ అశోకన్), వెట్రి(రోషన్ మ్యాథ్యూ), థామస్ (ఇషాన్ సౌకత్).. కొచ్చిలో పెరిగిన అన్నదమ్ములు. ఒకే తల్లి కడుపున పుట్టనప్పటికీ కలిసిమెలసి ఉంటారు. వీళ్లు ముగ్గురు.. చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ షో చూస్తూ పెరుగుతారు. వాల్టర్ దగ్గర కుస్తీ కూడా నేర్చుకుంటారు. కానీ థామస్ అలియాస్ లిటిల్.. తల్లితో కలిసి ఢిల్లీ వెళ్లిపోవాల్సి వస్తుంది. సావియో, వెట్రి మాత్రం కొచ్చిలోనే ఉండిపోతారు. కొన్నేళ్ల తర్వాత సోదరులని వెతుక్కుంటూ లిటిల్, సొంతూరికి వస్తాడు. కుస్తీ క్లబ్ మొదలుపెడదామని సావియోకు చెబుతాడు. దీంతో కొంతమందితో కలిసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైల్ ఫైటింగ్ క్లబ్ ప్రారంభిస్తారు. తర్వాత ఏమైంది? జైలు నుంచి వెట్రి బయటకొచ్చాడా? అసలు వాల్టర్ ఎవరు? చెరియన్(వైశాఖ్ నాయర్)తో సావియోకి శత్రుత్వం ఏంటనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ(WWE) షోకి ఇప్పుడు పెద్దగా క్రేజ్ లేదు గానీ 90స్ కిడ్స్‌ని అడిగితే దాని గురించి కథలు కథలుగా చెబుతారు. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు.. స్కూల్‌కి వెళ్లేముందు, వచ్చిన తర్వాత ఈ షోని తెగ చూసేవారు. ఇందులో చూపించిన స్టంట్స్‌ని నిజజీవితంలోనూ చేసి గాయాలపాలయ్యేవారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకుని తీసిన సినిమానే 'చథా పచ్చ'. ఈ టైటిల్‌కి తెలుగులో చావోరేవో(డూ ఆర్ డై) అని అర్థం.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పటివరకు మలయాళంలో కావొచ్చు తెలుగులో కావొచ్చు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో తీసుకున్న నేపథ్యం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కథ పరంగా చూస్తే మాత్రం చాలా సింపుల్. ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ల మధ్య పొరపొచ్చలు. చివరకు కలిసిపోవడం ఇంతే. కానీ దీనికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్ టచ్ ఇవ్వడం ఆసక్తికరంగా అనిపించింది. దాదాపు రెండు గంటల పాటు బాగానే ఎంటర్టైన్ చేసింది.డబ్బింగ్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ప్రధాన పాత్రల పేర్లు.. తెలుగు ప్రేక్షకులకు సరిగా అర్థం కావు. దీన్ని వదిలిస్తే సినిమా మాత్రం వేరే లెవల్ ఎంటర్టైనింగ్గా ఉంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ టచ్ అని మొత్తం ఫైట్స్ పెట్టేయకుండా ఎమోషన్ కూడా ఎంత కావాలో అంత పెట్టారు. స్టోరీ కూడా చాలా ఆర్గానిక్‌గా వెళ్తుంది. ఎక్కడా కూడా కృత్రిమంగా అనిపించదు. కాకపోతే డబ్బింగ్ పాటలు అస్సలు సెట్ కాలేదు. వాటిని లైట్ తీసుకుని మూవీ చూస్తే మాత్రం బాగుంది.ఎవరెలా చేశారంటే?అన్నదమ్ములుగా చేసిన అర్జున్ అశోకన్, ఇషాన్ సౌకత్, రోషన్ మ్యాథ్యూ అద్భుతంగా చేశారు. కలర్‌ఫుల్ డ్రస్‌ల్లో భలే సెట్ అయ్యారు. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేసిన వైశాఖ్ నాయర్ కూడా తనదైన కామెడీ, సీరియస్ యాక్టింగ్‌తో మెప్పించాడు. మిగతా పాత్రలు చేసిన యాక్టర్స్ కూడా తమ వంతు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. అద్వైత్ నాయర్ డైరెక్షన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. యాక్షన్ టచ్ ఉన్న కామెడీ మూవీ చూద్దామనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీపై లుక్కేయండి. ఎలాంటి అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. మీరు 90స్ కిడ్స్ అయితే ఫైట్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.- చందు డొంకాన -
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యంగ్ హీరో సుహాస్‌కి ఈ మధ్యకాలంలో సరైన హిట్టే పడలేదు. వరుస సినిమా చేస్తున్నప్పటికీ..ఏ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని అందించలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘హే బల్వంత్’(హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సుహాస్‌కి జోడీగా నటించిన శివానీ నాగారం.. ఇందులోనూ హీరోయిన్గా చేసింది. సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై బన్నీవాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రంతో అయిన సుహాస్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే...తల్లిలేని కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉంటుంది. పెద్దయ్యాక తండ్రి రావు బల్వంత్(నరేశ్) చేసే బిజినెస్ టేకోవర్ చేసి.. మంచి పేరు సంపాదించాలనుకుంటాడు. అయితే నాన్న చేసే బిజినెస్ ఏంటి అనేది మాత్రం అతనికి తెలియదు. నాన్నను, నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ)ను అడిగినా.. చెప్పరు. చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ చూసుకుంటానంటే తొలుత నాన్న ఒప్పుకోడు. కానీ ఓ కారణంగా రావు బల్వంత్ వ్యాపారం కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది. చిన్నప్పటి నుంచి ఏవోవో కలలు కన్న కృష్ణకి ఆ వ్యాపారం ఏంటనేది తెలిశాక..షాక్‌కి గురవుతాడు. తాను ఊహించినదానికి భిన్నంగా నాన్న వ్యాపారం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర(శివానీ నాగారం)కి కూడా ఆ వ్యాపారం గురించి చెప్పుకోలేని పరిస్థితి. అసలు బల్వంత్ రావు చేసే వ్యాపారం ఏంటి? దాని వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? కృష్ణ చేసే వ్యాపారం గురించి ప్రియురాలు మిత్రకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? మిత్ర తాత(బాబు మోహన్)కి కృష్ణ బిజినెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ బిజినెస్ వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పీవీబీ (హర్ష వర్ధన్)కి వచ్చిన సమస్య ఏంటి? చంప(స్రవంతి) ఎవరు? ఈ కథలో బెజ్జం దుర్గారావు (అజయ్ ఘోష్), యువన్ (వెన్నెల కిశోర్) పాత్రలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పేరుకు ఇది కామెడీ చిత్రం కానీ ఇందులో చాలా సెన్సిబుల్ టాపిక్‌ని చర్చించారు. సమాజం మొత్తం ఛీ కొట్టే ఓ వృత్తిలో మహిళలు ఎదుర్కొనే అవమానాలు, బాధలను చూపిస్తూ.. చట్టవిరుద్ధమైన ఓ వ్యాపారానికి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పాటు తండ్రి-కొడుకుల అనుబంధాన్ని, చదువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మంచి సందేశాన్ని అందించాడు దర్శకుడు. అయితే ఈ విషయాలన్నీ సీరియస్‌గా చెప్పకుండా లైటర్ వేలో కామెడీగా చూపించి..చివరిలో భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు.వినోదంతో పాటు భావోద్వేగాలకు పెద్ద పీటవేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్లో చూపించినట్లుగా ఈ సినిమా కథ మొత్తం హీరో తండ్రి చేసే బిజినెస్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా ప్రారంభంలోనే ఆ వ్యాపారం ఏంటో చూపించారు. అది తెలిశాక హీరో ఎలా రియాక్ట్ అవుతాడా అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇక హీరో ఆ బిజినెస్‌ని తన చేతుల్లోకి తీసుకున్నాక అసలు కథ ప్రారంభం అవుతుంది. ప్రియురాలికి ఆ వ్యాపారం గురించి తెలియకుండా హీరో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ప్రకృతి వైద్యం ఎపిసోడ్లో వెన్నెల కిశోర్ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం ఓ శవం చుట్టూనే కథనం తిరుగుతుంది. ఆ శవాన్ని తిసుకురావడానికి హీరో గ్యాంగ్ చేసే ప్రయత్నాలు ఒకవైపు.. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వెన్నెల కిశోర్ చేసే హంగామా మరోవైపు.. ఇలా ద్వితియార్థం కొనసాగుతుంది. ఇక ప్రీక్లైమాక్స్‌లో బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను అనుకరిస్తూ నరేశ్ చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం నెమ్మదిగా సాగుతుంది. కాస్త బుర్రపెట్టి చూస్తే..ట్విస్టులతో పాటు తర్వాత ఏం జరుగుతుందనేది కూడా ఊహించొచ్చు. క్లైమాక్స్‌లో నరేశ్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ బావోధ్వేగానికి గురి చేస్తుంది. లాజిక్స్ వెతక్కుండా సినిమా చూస్తే మరి పగలబడి కాకపోయినా.. సరదాగా నవ్వుకోవచ్చు. ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రకు సుహాస్ న్యాయం చేశాడు. ఎప్పటిమాదిరే తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు సుహాస్‌తో పాటు మరో హీరో నరేశ్ అని చెప్పొచ్చు. రావు బల్వంత్ పాత్రలో జీవించేశాడు. సినిమా మొత్తం నవ్విస్తూనే చివరిలో భావోద్వేగానికి లోనయ్యేలా చేశాడు. మహేశ్ బాబు ‘పోకిరీ’ సీన్‌తో పాటు బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను ఇమిటేట్ చేస్తూ చెప్పే డైలాగుకు పడి పడి నవ్వుతారు. మిత్ర పాత్రకి శివాని న్యాయం చేసింది. హీరో స్నేహితుడిగా సుదర్శన్ వేసే పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. యాంకర్ స్రవంతి పోషించిన చంప పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది. అయితే డబ్బింగ్ విషయంలో ఆమె ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అన్నపూర్ణమ్మ, హర్షవర్దన్, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఓటీటీ రివ్యూ: మలయాళ ఆణిముత్యం.. గుండె లోతుల్లో నిలిచిపోయే సినిమా
మలయాళ సినిమాలు అనగానే చాలామందికి థ్రిల్లర్సే గుర్తొస్తాయి. కానీ అంతకు మించినవి చాలానే ఉన్నాయి. అలాంటి ఓ మూవీనే 'కుంబలంగి నైట్స్'. కేరళలోని ఓ మత్స్యకార పల్లెలో జరిగే స్టోరీ ఇది. చూస్తున్నంతసేపు జీవితం కళ్లముందు కనిపిస్తుంది. గుండెని మెలిపెట్టేస్తుంది. ప్రేమలో పడేలా చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఆణిముత్యం. అంతకంటే పెద్ద పదమే ఉన్నా దానితోనూ పోల్చొచ్చు. అంతటి అద్భుతమైన ఈ మూవీ సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కేరళలోని కుంబలంగి గ్రామం. ఊరి చివరన ఓ సగం కట్టిన ఇల్లు. అందులో షాజీ, బోనీ, బాబీ, ఫ్రాంకీ అనే నలుగురు అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి పడదు. ఎవరూ ఏ పని చేయరు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోతే ఎలా ఉంటుందో వీళ్ల జీవితం అలానే తయారవుతుంది. పెద్దవాడైన షాజీ(సౌబిన్ షాహిర్).. తన స్నేహితుడు ఓ రోజు చనిపోవడంతో బిడ్డతల్లి అయిన అతడి భార్యకు తన ఇంట్లో ఆశ్రయమిస్తాడు. రెండో వాడైన బోనీ(శ్రీనాథ్ బసి) ఓ విదేశీయురాలితో ప్రేమలో పడతాడు. మూడో వాడైన బాబీ(షేన్ నిగమ్).. అదే ఊరికి చెందిన బేబీ(అన్నా బెన్)ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతాడు. ఇలా అన్నదమ్ముల జీవితాల్లోకి వచ్చిన మహిళల కారణంగా ఈ కుటుంబంలో ఎలాంటి మార్పులొచ్చాయి? అన్నదమ్ములు చివరకు ఎలా ఒక్కటయ్యారు? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఏదో ఓ విషయంలో అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ 'కుంబలంగి నైట్స్' చూసిన తర్వాక కంప్లీట్ మూవీ చూశాం అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు అద్భుతమైన దృశ్యకావ్యంలా అనిపిస్తుంది. మనం కూడా కుంబలంగి అనే ఊరిలో వాళ్లతో పాటు ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. మూవీ చూస్తున్నంతసేపు నవ్వుతాం, ప్రేమిస్తాం, ఏడుస్తాం, బాధపడతాం, భావోద్వేగానికి గురవుతాం. అంతలా మిమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తుంది.సినిమా ఫస్టాప్ అంతా కూడా పాత్రలు, వాటి స్వభావాలే చూపిస్తారు. సెకండాఫ్‌కి వచ్చేసరికి అసలు కథ మొదలవుతుంది. పాత్రల మధ్య సంఘర్షణ పీక్ స్టేజీకి వెళ్తుంది. అన్నదమ్ములంతా ఒక్కడవడంతో ముగుస్తుంది. అయితే ఈ మూవీలో స్టోరీగా చూస్తే.. ఏముందా అనిపిస్తుంది. కానీ కథనం(స్క్రీన్ ప్లే) చూస్తే మాత్రం వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సాధారణ సన్నివేశాలకు కూడా ముగింపు ఇచ్చిన తీరు కట్టిపడేసేలా ఉంటుంది.స్టోరీ మధ్యలో వచ్చే షమ్మి పాత్ర అయితే హైలైట్. చాలా ఇళ్లలో పురుషాధిక్యత చూపించే మగాళ్లకు ఇది ప్రతీక. వెకిలిగా నవ్వుతూ అందరిని చులకనగా చూసే ఈ పాత్రని సైకోలా చూపించారు. తన పంతం నెగ్గించుకోవడానికి ఇంట్లోని మహిళల్ని కట్టిపడేసి, బాబీ అన్నదమ్ములతో కలబడతాడు. వాళ్లందరూ షమ్మిని బంధించి.. ఆడవాళ్లని విడిపిస్తారు. అయితే షమ్మికున్న మానసిక జాడ్యం ఆ పాత్రదా? సమాజంలో కొనసాగుతున్న పురుషాహంకారాన్ని ప్రతిబింబిస్తుందా? అనేది అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత.షమ్మి.. తనని తాను మగాడు అనుకుంటాడు. తను చెప్పిందే అందరూ వినాలి అన్నట్లు పవర్తిస్తుంటాడు. ఇతడికి పూర్తి వ్యతిరేకంగా షజీ పాత్ర ఉంటుంది. ఆడదిక్కు లేని ఇంటి బాధ్యతల్ని తన భుజానేసుకుని, తమ్ముళ్లకు తల్లి లేని లోటు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఎలాంటి అహంకారం ఉండదు. తప్పు జరిగిందని తెలిసి ఆడదాన్ని కాళ్లమీద పడతాడు. తన వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకునేందుకు చేయాల్సిందంతా చేస్తాడు. కానీ ఎప్పుడూ నేను మగాడిని అనే అహంకారం ప్రదర్శించడు. తనలో బాధని బయటపెట్టలేక కనీసం ఏడుపు కూడా రాకపోయేసరికి.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని తమ్ముడిని అడుగుతాడు. చివరకు సైకియాట్రిస్ట్ దగ్గరకెళ్లి తనివితీరా ఏడ్చి బాధనంతా పోగట్టుకుంటాడు. తెరపై షజీ పాత్ర కన్నీళ్లు పెట్టుకోవడం ఏమో గానీ మన కళ్లు కూడా చెమ్మగిల్లుతాయి.ఈ సినిమాలో కథ బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఇంకా బాగుంటుంది. సంగీతం హృద్యంగా ఉంటుంది. క్లైమాక్స్ కడుపు నింపేస్తుంది. కేరళ అందాల దగ్గర నుంచి చేపల పట్టడం వరకు అన్నీ నచ్చేస్తాయి. అర్జెంట్‌గా మనం కూడా కుంబలంగి గ్రామానికి వెళ్లిపోవాలి అనిపించేంతలా నచ్చేస్తుంది. అలానే షజీగా చేసన సౌబిన్ షాహిర్, బోనీగా చేసిన శ్రీనాథ్ బసి, బాబీగా చేసిన షేన్ నిగమ్, ఫ్రాంకీగా చేసిన మ్యాథ్యూ థామస్, బేబీగా చేసిన అన్నా బెన్.. ఇలా ప్రతి పాత్ర మనకు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. వీళ్లందరి కంటే షమ్మిగా చేసిన ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ పిచ్చిపిచ్చిగా నచ్చేయడం గ్యారంటీ.ఏదైనా సినిమా చూస్తే బలంగా గుర్తుండిపోవాలి. మానవ సంబంధాలు ప్రతిబింబించేలా ఉండాలి. ప్రేమకున్న గొప్పతనం తెలియాలంటే మాత్రం ఈ మలయాళ ఆణిముత్యాన్ని అస్సలు మిస్ చేయొద్దు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో, యూట్యూబ్‌లో ఇది అందుబాటులో ఉంది. మలయాళ భాషలో మాత్రమే ఉందని చూడటం మానేయొద్దు. ఓ మంచి మూవీ మిస్ అవుతారు. కుటుంబంతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన -
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : కపుల్ ఫ్రెండ్లీనటీనటులు: సంతోష్ శోభన్, మానస వారణాసి, యోగిబాబు, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులునిర్మాణ సంస్థ:యూవీ కాన్సెప్ట్స్సమర్పణ: యూవీ క్రియేషన్స్రచన, దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్సంగీతం: ఆదిత్య రవీంద్రన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్విడుదల తేది: ఫిబ్రవరి 14, 2026సంతోష్ శోభన్.. ప్రతిభ గల నటుడు. కానీ ఆయన ఖాతాలో భారీ హిట్ అనేదే లేదు. ‘ఏక్ మినీ కథ’ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘కపుల్ ప్రెండ్లీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా సంతోష్ హిట్ ట్రాక్ ఎక్కాడా? ఫీల్ గుడ్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాంకథేంటంటే..నెల్లూరుకు చెందిన శివ..ఓ బడ్డింగ్ ఆర్కిటెక్ట్. ఉద్యోగం కోసం చెన్నై వస్తాడు. ఏళ్లు గడిచినా ఆయనకు సరైన ప్రాజెక్టు దొరకదు. దీంతో డైలీ ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. అలా మిత్ర(మానన వారణాసి) అనే అమ్మాయి బైక్ రైడ్‌లో పరిచయం అవుతుంది. చిత్తూరుకు చెందిన మిత్ర.. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చెన్నై వస్తుంది. శివలాగే ఆమె కూడా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓ కారణంగా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురురించి.. లివింగ్ రిలేషన్‌ని కొనసాగిస్తారు. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వీరిద్దరి జీవితంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది. అదేంటి? శివ, మిత్ర ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. మిత్ర రాకతో శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరకు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. జీవిత ప్రయాణం ఎప్పుడు ఎలా ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. రేపటి గురించి ఆలోచించకుండా..ఈ క్షణం మనల్ని ప్రేమించిన వాళ్లతో సంతోషంగా గడుపుతూ.. కొన్ని మధుర జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి.. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ద్వారా ఇచ్చిన మంచి సందేశం ఇది. సంభాషలతో కాకుండా కథ రూపంలో ఈ సందేశాన్ని ఇచ్చారు దర్శఖుడు. సినిమా కథ చాలా సరదాగా ప్రారంభమై.. ఎమోషనల్‌గా ముగుస్తుంది. కథనం నెమ్మదిగా సాగినా... ఎక్కడ బోర్ కొట్టదు. అనుకోకుండా పరిచమై.. ప్రేమలో పడి..పెళ్లికి ముందు హద్దులు దాటి.. చివరకు పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో ఓ షాకింగ్ విషయం తెలియడం.. ఆ ఆర్వాత వీరిద్దర ప్రయాణం ఎలా కొనసాగింది? అనేది తెరపై చాలా మెచ్యూర్డ్‌గా చూపించాడు దర్శకుడు.హీరో బ్రేకప్ సీన్‌తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ చెన్నైకి వెళ్తుంది. అక్కడ ఉద్యోగం కోసం శివ పడే ఇబ్బందులను చూపిస్తూనే మరోవైపు మిత్ర పాత్రను పరిచయం చేశారు. ఇద్దరూ కలిసినప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మిత్ర సహాయంతో శివ చేతికి ప్రాజెక్టులు రావడం..తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం.. ఈ ప్రయాణంలో మిత్రతో ప్రేమలో పడడం.. ఇదంతా రొమాంటిక్‌గా సాగుతుంది. ప్రథమార్థం కాస్త నెమ్మదిగా సాగినా.. బోర్ మాత్రం కొట్టదు. ఇక సెకండాఫ్ మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమాలోని ట్విస్ట్ తెలిసిన తర్వాత మనకు గీతాంజలి, ఓయ్, సాగరసంగమం లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. సినిమా ప్రారంభంలో చూపించే కేరళ సీన్ల వెనుక ఉన్న అసలు స్టోరీ ద్వితియార్థంలోనే తెలుస్తుంది. క్లైమాక్స్ ఊహకందేలా సాగుతుంది.ఎవరిలా చేశారంటే.. శివ పాత్రలో సంతోష్ శోభన్ జీవించేశాడు. ఎక్కడ అతి చేసినట్లుగా అనిపించదు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. మిత్రగా మానస తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. సంతోష్, మానసల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. మిగతా పాత్రలన్ని ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి అంతే. యోగి బాబు ఉన్నా..కామెడీ పండించే స్కోప్ లేదు. హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ ఫాదర్‌గా రాజీవ్ కనకాల తెరపై కనిపించేదేది కాసేపే అయినా.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆదిత్య రవీంద్రన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
టైటిల్: అమరావతికి ఆహ్వానంనటీనటులు: శివ కంఠంనేని, ఎస్తేర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులుదర్శకత్వం: జీవీకేనిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్నిర్మాతలు: కెఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావుసినిమాటోగ్రఫీ: జె ప్రభాకర్ రెడ్డిసంగీతం: పద్మనాబ్ భరద్వాజ్‌ఎడిటింగ్: సాయిబాబు తలారివిడుదల తేదీ: 13 ఫిబ్రవరి, 2026టాలీవుడ్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. అందుకే మలయాళ థ్రిల్లర్ తెగ చూసేస్తున్నారు. అందుకే డైరెక్ట్‌గా తెలుగులోనే వచ్చిన హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రం ఫిబ్రవరి 13వ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ టాలీవుడ్ ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అమరావతికి ఆహ్వానం కథేంటంటే..ఈశ్వర్ (శివ కంఠమనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి సిస్టర్స్ భార్గవి (సుప్రిత), విజ్జు. అయితే భార్గవికి పెద్ద సెలబ్రిటీ కావాలనే కోరిక ఉంటుంది. అందుకే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తుంటుంది. ఈ యూట్యూబ్ ఛానెల్లో దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు షూట్ చేసి.. కంటెంట్ అప్లోడ్ చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది.అయితే సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని అదే విషయాన్ని లైవ్‌లో నిరూపిస్తానని.. ఈ వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని భార్గవికి చెప్తాడు. దీంతో మరింత ఉత్సాహంతో భార్గవి కుటుంబంతో సహా అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడికెళ్లి ఈశ్వర్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి, ఈశ్వర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్ ఏంటి? సీఐగా ఈశ్వర్ సస్సెండ్ కావడానికి కారణం ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటే..దెయ్యాలు అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ దెయ్యం నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మెజారిటీ హారర్ సినిమాల్లో దెయ్యాలు, క్షుద్రపూజలనే ప్రధాన కథాంశంగా చూపిస్తారు. ఈ అమరావతికి ఆహ్వానంలోనూ అదే పంథా ఫాలో అయ్యాడు డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ చూపించాడు. అంతేకాకుండా మంచి సందేశాన్ని ఇచ్చిన తీరు ఆడియన్స్‌ను కనెక్ట్ చేసేలా ఉంది ఈ హారర్ థ్రిల్లర్ సినిమా.అమరావతి అనే గ్రామంలో రాత్రివేళ జరిగే ఓ హారర్ సీన్‌తో కథ ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటవెంటనే కథను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశాడు. ఫస్ హాఫ్‌లో భార్గవి వీడియోలు షూట్ చేయడం, మహేశ్ (శివ హరీశ్)తో ప్రేమలో పడడం లాంటివి చకచకా జరిగిపోతాయి. ప్రథమార్థంలో అంతగా ఆడియన్స్‌ను భయపెట్టే సీన్స్ పెద్దగా కనిపించవు. ఈశ్వర్ ఫ్యామిలీ అమరావతికి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ రాజేశ్వరి గురించి అసలు నిజం తెలుసుకోవడంతో ఫస్ట్ హాఫ్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇక్కడే డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేసింది.సెకండాఫ్‌లో కథ అంతా రాజేశ్వరి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఆమె ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో కథనం ఆడియన్స్‌కు ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హారర్ సీన్స్ ప్రేక్షకులను భయపెట్టేస్తాయి. ఇక ప్రీ క్లైమా క్స్ వచ్చే ట్విస్ట్ థ్రిల్ చేస్తుంది. హారర్ ఎలిమెంట్స్ మెప్పించినప్పటికీ.. కొన్నిచోట్ల ప్రేక్షకులు ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్. హారర్ థ్రిల్లర్‌లో సాంగ్స్ ఉంటే కథ సెట్ అవ్వదు. సెకండాఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో సాంగ్ చేయడం అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే ఓ హారర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్ జీవీకే. తన కథకు తగినట్లుగానే క్లైమాక్స్ డిజైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, థ్రిల్ అందించడంలో జీవీకే మార్క్ కనిపించింది. హారర్ కంటెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్లు అమరావతికి ఆహ్వానం ట్రై చేయొచ్చు. క్లైమాక్స్‌లో అమరావతికి ఆహ్వానంకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.ఎవరెలా చేశారంటే..ఈశ్వర్, జగదీష్ పాత్రలలో శివ కంఠంనేనిగారి నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లోనూ తనదైన మార్క్ చూపించారు. ఈ సినిమాకు మరో మెయిన్ పిల్లర్ ఏస్తేర్. ఆమె రాజేశ్వరి పాత్రలో అదరగొట్టేశారు. భానుమతి పాత్రలో ధన్యబాలకృష్ణ మెప్పించింది. హారర్ సీన్స్‌లో ధన్య అదరగొట్టేసింది. భార్గవి పాత్రను సుప్రిత చాలా బాగా చేసింది. మహేశ్, జెమినీ సురేష్, భద్రమ్, అశోక్ కుమార్, నాగేంద్రలు వారి వారి పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పద్మనాభ్ భరద్వాజ్ బీజీఎం హారర్ కథకు బాగా సెట్ అయింది. సాయి బాబా తలారి తన ఎడిటింగ్‌కు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ఫంకీనటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహర్, నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్ తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమానిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: అనుదీప్ కె.వి.సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఎడిటింగ్: నవీన్ నూలి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026విశ్వక్ సేన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. భారీ అంచనాల మధ్య గతేడాది రిలీజైన ‘లైలా’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ తెరకెక్కించిన చిత్రం కావడంతో ‘ఫంకీ’పై ఓ మోస్తరు అంచనాలు అయితే ఏర్పాడ్డాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇలా ఈ వారం(ఫిబ్రవరి 13) భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఫంకీతో విశ్వక్ సేన్ హిట్ ట్రాక్ ఎక్కాడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కోమల్ (విశ్వక్ సేన్) ఓ నూతన సినీ దర్శకుడు. ‘మంచి ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. రూ. 4 కోట్ల బడ్జెట్లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్(నరేశ్) హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు. బడ్జెట్ భారీగా పెరిగిపోయిందనే టెన్షన్‌తో నిర్మాత సుదర్శన్ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్) తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో కోమల్ ఏం చేశాడు? రూ. కోటి బడ్జెట్లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్ నిలబెట్టుకున్నాడా లేదా? కోమల్‌తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే (సంపత్ రాజ్) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘జాతి రత్నాలు’ తర్వాత అనుదీప్ సినిమాలంటే తెలుగు ఆడియన్స్‌కి ఓ అంచనా ఉంది. కథ గొప్పగా ఉండదు కానీ పంచ్ డైలాగ్స్‌తో ఫుల్ ఎంటర్టైనింగ్ కథనాన్ని నడిపిస్తాడనే నమ్మకం ఆడియన్స్‌లో ఉంది. అయితే గొప్ప కథ లేకపోయినా సరే..చెప్పుకోవడానికైనా కొంత స్టోరీ అయినా ఉండాలి కదా. అలా కాకుండా కేవలం సింగిల్ లైనర్స్‌తో పంచ్ డైలాగులు పేలిస్తే.. సినిమా ఆడేస్తుందని భావిస్తే అది పొరపాటే. జాతి రత్నాలు కేవలం పంచ్ డైలాగ్స్ వల్లే ఆడలేదు. అందులో కొంత కథ ఉంటుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వాటికి తోడుగా పంచ్ డైలాగ్స్ కూడా ఉండడంతో ఆ సినిమా హిట్ అయింది. కానీ ‘ఫంకీ’లో పంచ్ డైలాగ్స్ తప్ప మిగతావేవి ఆకట్టుకునేలా లేవు. ఆ డైలాగ్స్ కూడా కామన్ ఆడియన్స్‌కి పెద్దగా నవ్వు తెప్పించవు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు మాత్రం నవ్వుకుంటారు. డైలాగ్స్ కోసమే సన్నివేశాలు రాసినట్లుగా అనిపిస్తుంది. కథనం మొత్తం సింగిల్ పాయింట్ చుట్టూనే తిరుగుతూ.. చూసిన సన్నివేశాలే మళ్లీ రిపీట్ చేస్తూ విసుగు తెప్పించారు. అసలు ఈ కథని విశ్వక్, నాగవంశీ ఎలా ఒప్పుకున్నారనే సందేశం సినిమా చూస్తున్నంతసేపు మన మనసుని వెంటాడుతూనే ఉంటుంది.ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథే లేదు. కథనం ఆసక్తికరంగా సాగదు. ఒక్కో సన్నివేశాన్ని పేర్చుకుంటూ వెళ్లారు. కొన్ని సీన్లు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. హీరో పాత్రని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకునేలా ఉండడు. అన్ని విషయాలను లైట్ తీసుకునే వ్యక్తిలో కూడా ఎమోషన్లు ఉంటాయని హీరో పాత్ర ద్వారా చెప్పాలకున్నారు. కానీ దాన్ని తెరపై సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. క్లైమాక్స్‌లో మదర్ సెంటిమెంట్‌ని కూడా యాడ్ చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సినిమా ప్రారంభంలో వచ్చే కామెడీ సన్నివేశాల్లో మొదట్లో కాస్త నవ్వులు పూయిస్తాయి. అయితే అలాంటి సీన్లే మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడంతో నవ్వు రాకపోగా.. ఒకనొక దశలో చిరాకు అనిపిస్తుంది. కోమల్, చిత్ర పాత్రల పరిచయ సన్నివేశాలు బాగుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం కాస్త వేగంగా సాగుతుంది. అనుదీప్, కల్యాణ్ శంకర్ల గెస్ట్ అప్పీయరెన్స్ కూడా పెద్దగా నవ్వులు పంచలేకపోయింది. ఉన్నంతలో మదర్ సెంటిమెంట్ కాస్త ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే..విశ్వక్ సేన్ మంచి నటుడే. అయితే అనుదీప్ రాసిన ‘కోమల్’క్యారెక్టర్ అతనికి సరిగా సూట్ అవ్వలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పటిమాదిరే పాత్రలో లీనమైన నటించాడు. కానీ పూర్తిగా నవ్వించలేకపోయాడు. కయాదు లోహర్ తెరపై అందంగా కనిపించింది. నరేశ్ పాత్ర నిడివి తక్కువే. ఆయనను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సంపత్ రాజ్ పాత్ర కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. ఈశ్వరీరావు తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మాత్రం దారుణంగా ఉంది. కొన్ని సీన్లు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
టాలీవుడ్ సంగతి కాస్త పక్కనబెడితే తమిళంలో ఈసారి సంక్రాంతికి ఊహించన విషయాలు చాలా జరిగాయి. దళపతి విజయ్ 'జన నాయగణ్' మూవీ.. సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. శివకార్తికేయన్ 'పరాశక్తి' మెప్పించలేకపోయింది. కార్తీ 'వా వాతియర్' అట్టర్ ఫ్లాప్ అయింది. చివరి నిమిషంలో హడావుడిగా పండగ బరిలో నిలిచిన హీరో జీవా నటించిన 'తలైవర్ తంబి తలైమయిల్' అనే కామెడీ సినిమా హిట్ అయిపోయింది. ఇది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?జీవారత్నం(జీవా) ఓ పల్లెటూరికి సర్పంచ్. అందరికీ చేదోడు వాదోడులా ఉంటాడు. ఓ రోజు తన ఊరికి చెందిన ఇళవరసు(ఇళవరసు) కూతురు సౌజన్య(ప్రార్థన నాథన్) పెళ్లి దగ్గరుండి జరిపించే బాధ్యతని తీసుకుంటాడు. ఉదయమే శుభకార్యం అనగా పక్కింట్లో ఓ ముసలాడు చనిపోతాడు. ఓవైపు పెళ్లిసందడి, మరోవైపు చావు విషాదం. ఈ రెండిళ్ల మధ్య ఎలాంటి గందరగోళం ఏర్పడింది? జీవా ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సింపుల్ కాన్సెప్ట్, పరిస్థితులకు తగ్గట్లు వచ్చే కామెడీతో మలయాళంలో ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు. దాదాపు ఇదే టెంప్లేట్‌తో వచ్చిన తమిళ మూవీ 'తలైవర్ తంబి తలైమయిల్'. ఓ పల్లెటూరు, ఓ సర్పంచ్, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, ఓ పెళ్లి, ఓ చావు.. వీటన్నింటి నుంచి పుట్టుకొచ్చే కామెడీతో ఈ సినిమా తీశారు.పల్లెటూళ్లలో పంతాలు పట్టింపులు లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే గొడవ కాస్త.. ఊరిలో విధ్వంసానికి ఎలా కారణమైంది అనే విషయాన్ని చాలా సరదాగా, కామెడీగా ఇందులో చూపించారు. రెండు గంటల్లోపే ఉండే ఈ మూవీ అక్కడక్కడ బోర్ కొట్టినప్పటికీ.. ఓవరాల్‌గా పర్లేదు బానే ఉందనిపించేలా సాగుతుంది.మూవీ ప్రారంభ సన్నివేశంలో ఓ వ్యక్తిని పిచ్చోడు అని ఊరి మొత్తం అంటుంది. జీవా కూడా మనసులో అలానే అనుకుంటాడు. కానీ చివరకొచ్చేసరికి అతడు తప్పితే ఊరంతా పిచ్చోళ్లే అనే విషయాన్ని జీవా అర్థం చేసుకుంటాడు. ఇదే అంశాన్ని చూపించిన విధానం బాగుంది. పాత్రలన్నీ కూడా ఎక్కడా అతిగా ప్రవర్తించవు. పరిస్థితులకు తగ్గట్లే అలా అలా వెళ్లిపోతాయి.ఓ సర్పంచ్, ఇద్దరు వయసైన వ్యక్తులు, ఓ ముసలాడు, ఓ పెళ్లి కూతురు, ఓ పెళ్లి కొడుకు.. చివరకు ఊరిలోని వాటర్ ట్యాంక్‌ని కూడా కథలో భాగం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సర్పంచ్ పాత్రలో జీవా ఆకట్టుకోగా.. ఇళవరసు, తంబి రామయ్య కూడా మెప్పించాడు. పెళ్లి కూతురిగా ప్రార్థన నాథన్ క్యూట్‌గా చేసింది. మిగతా పాత్రధారులు తమకిచ్చిన రోల్స్‌కి న్యాయం చేశారు.టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరదాగా సాగిపోయింది. నితీశ్ సహదేవ్ దర్శకుడిగా మెప్పించాడు. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. ఈ వీకెండ్ ఏదైనా సరదాగా సాగిపోయే ఓ కామెడీ సినిమా చూద్దామనుకుంటే 'తలైవర్ తంబి తలైమయిల్'పై ఓ లుక్కేయొచ్చు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. ఎలాంటి అభ్యంతరకర సీన్స్ లేవు.- చందు డొంకాన -
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: నిలవేనటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులునిర్మాణ సంస్థ: POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నందర్శకత్వం - సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నంసంగీతం: కళ్యాణ్ నాయక్సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026ట్రైలర్ రిలీజ్ వరకు నిలవే చిత్రం గురించి ఎవరికీ తెలియదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది. చాలా మంది అర్జున్ రెడ్డి సినిమాతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి ఈ చిత్రం అ అంచనాలను అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అర్జున్(సౌమిత్ రావు) అనాథ. స్నేహితుడు(వైవా హర్ష) ఇంట్లో ఉంటూ ఓ యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుంటాడు. అతనికి తోడుగా ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనుకుంటాడు. కానీ ఆయన జీవితంలోకి అమ్మాయి రాదు. దీంతో డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఫ్లాట్‌లో ఊరి వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో నుంచి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమే అతిథి(శ్రేయాసి సేన్). తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. పరిచయం పెంచుకొని దగ్గరకు అవుతాడు. అతిథి కూడా అర్జున్‌తో ఫిజికల్‌గా దగ్గరవుతుంది. కానీ ప్రేమను అంగీకరించలేకపోతుంది. దానికి గల కారణం ఏంటి? అతిథి ప్లాష్‌బ్యాక్ ఏంటి? పెళ్లి, పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న అర్జున్ కల నెరవేరిందా? శాంతను ఎవరు? అతిథి తన జీవితంలోకి వచ్చిన తర్వాత అర్జున్‌లో వచ్చిన మార్పు ఏంటి? చివరకు అర్జున్, అతిథిలు ఒక్కటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఓ మంచి ప్రేమ కథని సంగీతానికి ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు సౌమిత్ రావు, సాయి వెన్నం. ఒంటరి జీవితం వద్దనుకునే అబ్బాయి.. అందర్నీ వదిలేసి ఒంటరిగా బతకాలనుకున్న అమ్మాయి.. వీరిద్దరి ప్రేమ కథే ఈ సినిమా. హీరో ఆత్మహత్యకు ప్రయత్నించే సన్నివేశంతో చాలా ఆసక్తికరంగా సినిమా ప్రారంభం అవుతుంది. ఒంటరితనం మనిషిని ఎలా కుంగదీస్తుంది అనే అర్జున్ పాత్రను చూస్తే అర్థమవుతుంది. తోడు కోసం వెతికే క్రమంలో ఎదురుదెబ్బలు తగలడం.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే సమయంలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. అప్పటి నుంచి కథనం రొమాంటిక్‌గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి.అర్జున్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. అతిథి వెనకడుగు వేయడంతో.. ప్లాష్‌బ్యాక్‌లో ఏదో ఒక స్టోరీ ఉందనే విషయం అర్థమైపోతుంది. అయితే అదేంటనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుకుంది. ఇక ద్వితియార్థం కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. అతిథి ప్లాష్‌బ్యాక్ స్టోరీ గుండెను బరువెక్కిస్తుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ, థియేటర్స్‌కి వెళ్లి చూసిన వారికి మాత్రం గొప్ప అనుభూతిని అందిస్తుసింది.ఎవరెలా చేశారంటే...ఈ సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు మిగతా నటీనటులంతా కొత్తవారే.అయినప్పటికీ చక్కగా నటించారు. అర్జున్ పాత్రకు సౌమిత్ రావు పూర్తి న్యాయం చేశాడు. డ్యాన్స్ ఇరగదీశాడు. ఎమోషనల్ సన్నివేశాలలో చాలా బాగా నటించాడు. తెరపై బాలీవుడ్ హీరోలా కనిపించాడు. ఇక అతిథిగా శ్రేయాసి సేన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమా అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా జాగ్రత్త పడింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్విస్తాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్లడ్ రోజెస్. ఈ మూవీకి ఏంజీఆర్ దర్శకత్వం వహించారు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్లో హరీష్ కమర్తి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్ నగరంలో దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు లీడర్స్ ఉంటారు. వీరిద్దరు తమ కుమారులను వచ్చే ఎన్నికల్లో నిలబెడతారు. ఆ తర్వాత సిటీలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. అదే సమయంలో ఈ వరుస హత్యలకు దేవి దాస్ కొడుకు మదన్‌కి సంబంధం ఉందని వార్తల్లో వస్తుంది. దేవి దాస్ కొడుకు రాజకీయ జీవితం నాశనం చేయడానికి భజరంగి దాస్ ప్లాన్ చేసాడని దేవి దాస్ కార్యకర్తలు రోడ్ మీదకి వస్తారు. ఈ కేసును సీఐ అరుణ్ గోగోయ్ చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. పొలిటికల్ ఒత్తిడితో అరుణ్ గోగోయ్ స్పెస్పెండ్ అవుతాడు. ఈ కేసు సీబీఐకి వెళ్తుండగా హోమ్ మినిస్టర్‌ని కమిషనర్ రిక్వెస్ట్ చేసి అధిరను ఒప్పిస్తాడు. ఈ వరుస హత్యలను వెనక ఉన్నా హంతకుడిని అధిర ఎలా పట్టుకున్నది అనేదే అసలు కథ.ఎలా ఉందంటే..ఈ సినిమాలో మహిళలను తక్కువ చేయొద్దని.. వాళ్లు అన్నింటిలో సమానం అని స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే ప్రేమించకూడదు.. ప్రేమిస్తే మోసం చేయకూడదని అమ్మాయి పాయింట్ అనే మెసేజ్ ఇందులో చూపించారు. అలాగే 2026లో డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా బ్లడ్ రోజెస్. వరుస హత్యల నేపథ్యంలో ఈ కథ సాగడం రోటీన్‌గా అనిపిస్తుంది. కథ నెమ్మదిగా సాగడంతో ఆడియన్స్‌కు అంతగా నచ్చదు.డైరెక్టర్ యం. జి అర్ కథ, మాటలు స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నప్పటికీ తెరపై చూపించడంలో ఫెయిల్ అయ్యారు. తాను అనుకున్న పాయింట్ ఆడియన్స్ చెప్పడంలో కాస్తా తడబాటుకు గురయ్యారు. కన్నడతో రెండు సినిమాలు చేసిన ఆయన తెలుగు ఆడియన్స్‌కు మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ మూవీలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. క్రైమ్ స్టోరీలు ఇష్టపడేవాళ్లకు కొద్దిగా నచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌గా చూస్తే రోటీన్ కథే. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.ఎవరెలా చేశారంటే..ఇందులో అధిర క్యారెక్టర్ చేసిన అప్సర రాణి లుక్ అదిరిపోయింది. ఆమెకు ఈ మూవీ తర్వాత ప్రత్యేక మార్క్ ఉంటుంది. శాండల్ వుడ్ హీరో ధర్మాకీర్తి రాజు అరుణ్ గోగోయ్ పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీలు పృథ్విరాజ్ జనని క్యారెక్టర్లో ఫర్వాలేదనిపించింది. క్రాంతి కిల్లి మార్టిన్ క్యారెక్టర్ అదరగొట్టేశారు. ఈ సినిమాలో సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదేశ్వరి, మాణికుమార్ మాణిక్, జ్యోతి, అనిల్ కుమార్,ధ్రువ,నరేన్ తేజ్,ప్రగ్య,నవిత, లౌక్య,హాసిని,ఆనంద్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. -
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
టైటిల్: యుఫోరియానటీనటులు: భూమిక, సారా అర్జున్, విఘ్నేశ్ గవిరెడ్డి, గౌతమ్ మేనన్, రోహిత్, ఆదర్శ్ బాలకృష్ణ, నాజర్, రవి ప్రకాశ్, నవీన రెడ్డి తదితరులునిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా ముఖి, రాగిణి గుణరచన-దర్శకత్వం: గుణశేఖర్సంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె పోతన్ఎడిటర్: ప్రవీణ్ పూడివిడుదల తేది: ఫిబ్రవరి 06, 2026తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల జాబితాలో గుణశేఖర్ పేరు ఉంటుంది. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఒక్కడు, రుద్రమదేవి, రామాయణం వంటి చిత్రాలతో చరిత్రాత్మక, సామాజిక, యాక్షన్ జానర్లలో తన ప్రత్యేక ముద్ర వేశారు. అయితే, గత కొన్నేళ్లుగా గుణశేఖర్‌కు సరైన విజయం దక్కలేదు. శాకుంతలం ఫ్లాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో 'యుఫోరియా' మూవీని తెరకెక్కించారు. యువతరం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుందో నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించారు.కథచైత్ర (సారా అర్జున్) చదువులో టాపర్.. ఐఏఎస్ కావాలనే కోరికతో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయి కూడా .. ఒకరోజు తన స్నేహితురాలు పిలుపుమేరకు ఓ పబ్‌కు వెళ్తుంది. అక్కడ చైత్రకు పరిచయమైన ఐదుగురు కుర్రాళ్లలో వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి) ఆమెపై కన్నేస్తాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న వారందరూ చైత్రను నమ్మించి కారులో తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. చైత్ర ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు.అయితే, చైత్రను అత్యాచారం చేసిన ఐదుగురు కుర్రాళ్ల బ్యాక్‌గ్రౌండ్ చాలా బలంగా ఉంటుంది. వారిలో సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పాటు రాజకీయ, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు. ఇలాంటి క్లిస్టసమయంలో కమిషనర్ జయదేవ్ కేసును ఎలా ఛేదించారు..? ఈ కేసులో నేను కూడా నేరం చేశానని వింధ్య వేములపల్లి (భూమిక) ఎంట్రీ ఇస్తుంది.. ఇంతకీ ఈ నేరంతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి..? తనకు శిక్ష విధించాలని హైకోర్టును ఎందుకు కోరుతుంది..? ఈ కేసుని డీల్ చేస్తున్న సిటీ కమిషనర్ జయదేవ్‌కు వింధ్య చేసిన సాయం ఏంటి..? తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వింధ్య ఎలాంటి సాహసం చేసింది..? తెలియాలంటే యుఫోరియా మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..2022 మే 28న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్‌రేప్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనలో 6 మంది యువకులు (వారిలో 5 మంది మైనర్లు) పాల్గొన్నారు. ఈ ఘటనతో పాటు మరికొన్ని కీలక సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు గుణశేఖర్ యుఫోరియా కథను వెండితెరపై చూపించారని అర్థమౌతుంది. నేటి యువతరం విచ్చలివిడిగా తమ ఆనందం కోసం మాదకద్రవ్యాలకు బానిసలై ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో ఈ మూవీలో చూపించారు. ఈ క్రమంలో తమ కన్నవాళ్ల జీవితాలు కూడా నరకంగా మారుతున్నాయని ఈ కుర్రాళ్ల కథ చెబుతుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు మనం రెగ్యులర్‌గా న్యూస్‌లో చూసిన విధంగానే పలు అత్యాచార సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి. మైనర్ల మీద అత్యాచారం అనే ఘటనలు విన్న ప్రతిసారి మనలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇలాంటి సీన్స్ పదేపదే కనిపించడంతో మూవీలో ఉన్న ఆసక్తి కాస్త తగ్గుతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అనిపించదు. సినిమా ప్రారంభంలోనే చైత్రపై వికాశ్ గ్యాంగ్ చేసిన అత్యాచార ఘటన చాలా భయాందోళనగా కనిపిస్తుంది. ఈ కేసులో వెంటనే కదలిక రావడం ఆపై భూమిక తెరపైకి కనిపించడం వంటి సీన్లు కథపై పట్టును కోల్పోనియదు. కమిషనర్ జయదేవ్ విచారణ శైలి మెప్పిస్తుంది. సమాజంలో ఇలాంటి కేసులో నిత్యం జరుగుతూనే ఉంటాయి.అలాంటి సమయంలో పోలీసులు కేసును ఎలా ఛేదిస్తారనేది ఆసక్తిగా చూపించారు. మైనర్లపై అత్యాచారం సంఘటనల్లో పోక్సో చట్టం ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పడంలో గుణశేఖర్ సక్సెస్ అయ్యాడు. చైత్ర కేసులో కొడుకు చేసిన తప్పుకు తల్లిగా భూమిక అనుభవించిన క్షోభ ఎలా ఉంటుందో అందరినీ కదిలిస్తుంది. కొడుకు చేసిన తప్పు వల్ల ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కుమారుడు చేసిన తప్పును తనపై వేసుకుని కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఇలాంటి సీన్లు అన్నీ కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. అయితే, సెకండాఫ్‌లో కథ కాస్త గాడితప్పింది. కొడుకు, తల్లి మధ్య చూపించిన బంధం బాగున్నప్పటికీ దానిని సరైన రీతిలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూపించలేదనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే.. 'యుఫోరియా' కథలో ప్రధాన బలం సారా అర్జున్‌దే అని చెప్పాలి. చైత్రగా ఆమె చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో మెప్పించింది. అత్యాచార బాధితురాలు సమాజంలో ఎలాంటి ఇబ్బంది పడుతుందో తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆపై వింధ్య వేములపల్లిగా భూమిక అదరగొట్టింది. చైత్ర తర్వాత భూమిక లీడ్రోల్లో కనిపిస్తుంది. కొడుకు తప్పు చేసినా సరే చట్టం ముందు శిక్ష పడాల్సిందేనని న్యాయవ్యవస్థ పట్ల ఉండాల్సిన గౌరవాన్ని చూపుతూ... మరోపైపు కొడుకు జీవితం గురించి తల్లడిల్లిపోయే ఒక తల్లిగా భూమిక జీవించింది. వికాశ్ పాత్రలో విఘ్నే, జయదేవ్ పాత్రలో గౌతమ్ మేనన్ తమ పరిదిమేరకు మెప్పించారు. కాల భైరవ సంగీతం బాగుంది. నేటి యువతరం చూడాల్సిన సినిమాగా 'యుఫోరియా' కథ ఉంటుంది. సినిమాలో చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ సమాజానికి చాలా అవసరమైన మూవీని గుణశేఖర్ తీశారని చెప్పొచ్చు. -
సీఎంను సామాన్యుడు కిడ్నాప్ చేస్తే?.. భ.. భ.. బ మూవీ రివ్యూ
టైటిల్: భ.. భ.. బ..(భయం .. భక్తి .. బహుమానం)విడుదల తేదీ: 2026-01-27నటీనటులు: దిలీప్, మోహన్‌లాల్, వినీత్ శ్రీనివాస్, ధ్యాన్ శ్రీనివాసన్, బైజు సంతోష్, శాండీ తదితరులుదర్శకుడు: ధనంజయ్ శంకర్నిర్మాణం సంస్థ: శ్రీ గోకులం మూవీస్సంగీతం: గోపీ సుందర్ఓటీటీ: జీ5ఓటీటీల్లో మలయాళ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటోంది. అందుకే అక్కడ హిట్ సినిమాలను తెలుగు ఆడియన్స్ కోసం డబ్ చేసి వదులుతున్నారు. ముఖ్యంగా మోహన్ లాల్‌కు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్లే ఆయన కీలక పాత్రలో మెప్పించిన భా భా బ అనే మూవీని తెలుగులోనూ స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు. ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..ఒక పిల్లవాడు తన చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోతాడు. తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో సీఎం కాన్వాయ్ వల్ల ఆలస్యమై ప్రాణాలు పోతాయి. అప్పటి నుంచే సీఎంపై కక్ష పెంచుకున్న పిల్లవాడు.. పెద్దయ్యాక తన రివేంజ్ తీర్చుకున్నాడా? ఎలాంటి ఆధారం లేని ఆ పిల్లవాడు సీఎంను ఏం కిడ్నాప్ చేశాడా? తన పగ తీర్చుకున్నాడా? అన్నదే భా.. భా.. భా.. కథ.ఎలా ఉందంటే..ఒక సీఎం కాన్వాయ్ వల్ల తన తండ్రి కోల్పోయిన రాడార్ (దిలీప్) తన రివేంజ్ కోసం ముఖ్యమంత్రి జోసెఫ్ (బైజు సంతోష్)నే కిడ్నాప్ చేస్తాడు. అయితే సీఎం కుమారుడైన నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) ఎన్ఐఏ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. తన తండ్రి కోసం కుమారుడే రంగంలోకి దిగుతాడు. అయితే ఈ కథను డైరెక్టర్ చిన్న పిల్లలతో ప్రారంభించాడు. రెండు చిన్న పిల్లల క్రికెట్ టీమ్‌ల మధ్య మాటలతో కథ బ్యాక్డ్రాప్లోకి తీసుకెళ్లాడు. ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేందుకు అయితే సీఎం ఓ సభకు హాజరు కాగా.. రాడార్ చాలా సులువుగా కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత కథ చాలా ఫన్నీగా సాగుతుంది. రాడార్ ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. తన తండ్రి కిడ్నాప్ చేసిన వారిని పట్టుకునేందుకు నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.అయితే తన తండ్రిని కిడ్నాప్ చేసింది 'రాడార్' (దిలీప్) అనే విషయం నోబుల్‌కి తెలుస్తుంది. ఆ తర్వాత కథనం స్పీడ్‌గా వెళ్తుంది. అంతేకాకుండా రాడార్‌కి.. ఢిల్లీ బాల (మోహన్ లాల్)తో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా తెలుస్తుంది. మోహన్ లాల్ ఎంట్రీతో కథ చాలా ఇంట్రెస్టింగ్ మారుతుంది. మోహన్ లాల్, రాడార్ కలిసి చేసే ఫైట్స్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. క్లైమాక్స్ సీన్ అద్భుతంగా అనిపిస్తుంది. అడవుల్లో ఫైరింగ్ స్టంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. చివరి అరగంట మాత్రమే ఆడియన్స్‌ను కుర్చీలో కట్టిపడేలా చేస్తుంది. ఓ సామాన్యుడు తలచుకుంటే సీఎంను కూడా ముప్పు తిప్పలు పెట్టగలడు అనేది డైరెక్టర్ ఈ చిత్రంలో చూపించారు. కాన్సెప్ట్ బాగుంది కానీ.. అందుకు తగినట్లుగా క్యూరియాసిటీ పెంచడంతో డైరెక్టర్ ఫెయిలయ్యాడనే చెప్పాలి. ఎప్పటికప్పుడు అన్నీ రివీల్ చేస్తూ వెళ్లడం మైనస్. కథలో ట్విస్ట్‌లు లేకపోవడంతో ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్గా అనిపించదు.అంతేకాకుండా మోహన్ లాల్ స్థాయికి ఈ కథ సెట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఓ స్టార్ హీరో సినిమా మధ్యలో ఎంట్రీ ఇవ్వడం అంతగా ఆసక్తిగా అనిపించకపోవచ్చు. స్టార్ ఇమేజ్‌కు తగినట్లుగా కథ లేకపోవడం ఇందులో పెద్ద మైనస్. దిలీప్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఇలాంటి కథను చేయడం ఆడియన్స్‌కు ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఈ వీకెండ్లో ఓ రివేంజ్ స్టోరీ చూడాలనుకుంటే భ.. భ.. బ ట్రై చేయొచ్చు. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో దిలీప్ పాత్రనే ఎక్కువ. మూవీ మొత్తం దిలీప్ తన నటనతో ఏ మాత్రం తగ్గకుండా చేశాడు. బైజు సంతోష్ సీఎం పాత్రలో ఒదిగిపోయారు. మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనలేదు. సినిమా మధ్యలో ఎంట్రీ ఇచ్చినా తన నటనతో మరోసారి ఆడియన్స్‌ను మెప్పించాడు. సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ పరంగా చూస్తే విజువల్స్ కథకు తగ్గట్టుగానే గ్రాండ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో ఇంకాస్తా కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
సూర్య శ్రీనివాస్, సంజీవ్, స్వాతి కశ్యప్ నటించిన తాజా చిత్రం జమానా. భాస్కర్ జక్కుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల అయింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..మ్యూజియంలో దొంగతనంతో సినిమా ప్రారంభమవుతుంది. హీరో సూర్య ఒక దొంగ.. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. ఒక పెద్ద స్కాం చేసి సెట్ అవుదాం అనుకుంటాడు. అదే సమయంలో స్వాతితో ప్రేమలో పడతాడు. ఇంతలో ఇంకో గ్యాంగ్ సంజీవ్.. ఒక లోకల్ రౌడీ షీటర్, ఒక రాజకీయ నాయకుడు , ఒక మాఫియా లీడర్. ఇలా ఒక పెద్ద టీం ఉంటుంది.. ఈ అన్ని టీం లకు ఒకరికి తెలీకుండా ఒకరు డీలింగ్స్ ఉంటాయి. అసలు గ్యాంగ్స్ చేసే స్కామ్స్ ఏంటో తెలియాలంటే జమానా సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఫస్ట్ హాఫ్‌లో హీరో చేసే స్కాం ల చుట్టే తిరుగుతుంది. సంజీవ్ ఎపిసోడ్ .. పది లక్షలు ఎపిసోడ్ ప్రథమార్థంలో ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. ఇంకా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా కొత్తగా అనిపిస్తుంది. అసలు ఊహించని ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. డైరెక్టర్ భాస్కర్ జక్కుల తాను తీసుకున్న లైన్‌ను చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్‌లో కథ పరిగెడుతుంది . మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. అతను రాసుకున్న కథ, కథనం చాలా బాగుంది. ఈ కథను చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాడు. దర్శకుడి మేకింగ్ కూడా అద్భుతంగా అనిపించింది. ఓవరాల్‌గా చూస్తే ఆడియన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా క్లైమాక్స్ సూపర్బ్ అనేలా ఉంది. డైరెక్టర్ సినిమా మొదటి నుంచి చివరి వరకు.. ప్రేక్షకుల్లో థ్రిల్లింగ్ కలిగించాడు. థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడే వారికి జమానా ఓకే.ఎవరెలా చేశారంటే..హీరో సూర్య చాలా అద్భుతంగా చేశాడు. హీరోయిన్ స్వాతి కశ్యప్ తన గుడ్ లుక్‌తో అదరగొట్టేసింది. సాంకేతికత విషయానికొస్తే విజువల్ పరంగా కూడా గ్రాండ్‌గా ఉంది. కేశవ కిరణ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. వర్మ ఎక్కడా ల్యాగ్ లేకుండా క్రిస్పీగా కట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ నిర్మాణ సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -
కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ
స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. కొత్త సినిమా రిలీజైన ప్రతిసారీ ఇక్కడా ఆదరణ బాగానే వస్తూ ఉంటుంది. అలాంటిది కార్తీ లేటెస్ట్ మూవీ తెలుగు వెర్షన్‌ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. అదే 'అన్నగారు వస్తారు'. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?తాత(రాజ్ కిరణ్)కి ఎన్టీఆర్ అంటే అంతులేని అభిమానం. సరిగ్గా ఎన్టీఆర్ మరణించిన సమయానికి మనవడు పుడతాడు. దీంతో తన అభిమాన హీరో అంతా గొప్పవాడు కావాలని మనవడికి రామారావు(కార్తీ) అని పేరు పెడతాడు. తాత ఒకలా అనుకుంటే మనవడు మరోలా తయారవుతాడు. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు గానీ చేసేవన్నీ దొంగపనులు. కొందరు రాజకీయ నాయకులతో కలిసి అవినీతి చేస్తుంటాడు. ఇతడికి ప్రేతాత్మలతో మాట్లాడే ఓ ప్రియురాలు (కృతిశెట్టి) ఉంటుంది. ఓ సందర్భంగా మనవడి బుద్ధి గురించి తాతకు తెలిసిపోతుంది. తర్వాత ఏమైంది? రామారావు శరీరంలోకి అన్నగారి ఆత్మ ఎందుకు ప్రవేశిస్తోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఎప్పుడో మరణించిన ఓ మహానటుడి ఆత్మ, ఓ సాధారణ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి, ప్రజలకు మంచి చేస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో సినిమా తీయాలనుకోవడం ఆసక్తికరమే. చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ తీయడమే గజిబిజి గందరగోళం అయిపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎగ్జైట్ చేయదు. పాటలో, డైలాగ్సో, సీన్సో.. ఏదో ఒకటి బాగున్నా సరిపెట్టుకోవచ్చులే అనుకోవచ్చు. ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఎంగేజ్ చేయదు. చూస్తున్నంతసేపు ఇలా చాలా అనిపిస్తాయి.తమిళ స్టార్ హీరో ఎమ్జీఆర్ రిఫరెన్సులతో ఈ సినిమా తీశారు. ఫస్టాప్‌లో హీరో తాతయ్య ఎమ్జీఆర్ వీరాభిమాని కావడం, మనవడిని అలానే పెంచాలనుకోవడం, ఇదంతా నచ్చని మనవడు.. నటిస్తూ పెరగడం, అవినీతి పోలీస్ కావడం.. ఇలా పర్లేదులే ఏదో ఉందిలే అన్నట్లు మూవీ సాగుతుంది. భక్త వత్సలం అనే పాత్ర దగ్గరకు రామారావు వెళ్లేంతవరకు కాస్త ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. తర్వాత కూడా అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్పకుండా స్టోరీని అటుఇటు తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. విలన్ భక్త వత్సలం.. ముఖ్యమంత్రితో కలిసి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తాడు. అదేంటో చెప్పకుండా చూపించకుండానే చిత్రాన్ని ముగించేశారు.రామారావు పాత్ర.. ఉన్నట్టుండి అన్నగారిలా మారిపోయి ఫైట్స్ చేసేస్తుంటాడు. జనాల్ని కాపాడేస్తుంటాడు. ఇతడిలోకి అన్నగారి ఆత్మ లేదా తాతయ్య ఆత్మ ఏమైనా ప్రవేశించిందా అంటే అదేం ఉండదు. మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే లాజిక్ ఉండదు. జనాలకు మంచి చేసే పసుపు ముఖం అని ఓ గ్రూప్ ఉంటుంది. వీళ్ల పాత్రలు కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. హీరోయిన్ కృతిశెట్టి పాత్ర అయితే అసలు ఎందుకుందో అర్థం కాదు. చెప్పాలంటే ఆమె పోర్షన్ అంతా తీసేసినా సరే సినిమాలో పెద్దగా పోయిదేం ఉండదు.లెక్క ప్రకారం డిసెంబరు తొలివారంలో సినిమాని తెలుగు, తమిళంలో రిలీజ్ చేయాలనుకున్నారు. నిర్మాత గతంలో చేసిన అప్పులు ఇప్పుడు ఆర్థిక సమస్యలుగా మారి కోర్టు కేసుల వరకు వెళ్లడంతో వాయిదా పడింది. సంక్రాంతికి విజయ్ 'జన నాయగణ్' రాలేకపోవడంతో దీన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. తమిళంలో డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం చేయలేదు. కట్ చేస్తే నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీని చూసిన చాలామంది.. కార్తీ ఇలాంటి మూవీ అసలు ఎందుకు చేశాడు? అని బుర్రగోక్కుంటున్నారు.రామారావుగా చేసిన కార్తీ, తాతగా చేసిన రాజ్ కిరణ్ తప్పితే ఈ సినిమాలో మరో పాత్ర, ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. సత్యరాజ్, కృతిశెట్టి లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ వాళ్లని సరిగా ఉపయోగించుకోలేదు. అలానే తెలుగు వెర్షన్లో ఎన్టీఆర్ పేరుని ఉపయోగించుకున్నప్పుడు ఆయన ఫొటోలనే చూపించాలి. కానీ అలాంటిదేం లేకుండా తెరపై ఎమ్జీఆర్, డబ్బింగ్లో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇది కాస్త కన్ఫ్యూజన్కి గురిచేసింది. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'అన్నగారు వస్తారు'ని లైట్ తీసుకోవడమే బెటర్.-చందు డొంకాన(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)) -
'దేవగుడి' సినిమా రివ్యూ
బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన నిర్మించిన సినిమా 'దేవగుడి'. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు చేశారు. ఈరోజు(జనవరి 30) ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?దేవగుడికి చెందిన వీరారెడ్డి (రఘు కుంచె) ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరులలో ఒకరి కొడుకు అయిన ధర్మ (అభినవ్ శౌర్య), తన కుమారుడితో (నరసింహ) స్నేహంగా ఉండడాన్ని సహించడు. తన కుమార్తె శ్వేత (అనుశ్రీ) ధర్మతో ప్రేమలో ఉందనే విషయం తెలిసి అతడిని ఊరు నుంచి గెంటేస్తాడు. వీరారెడ్డి అనారోగ్యం పాలవ్వగా ఇద్దరు అనుచరులని ప్రత్యర్థులు మట్టుపెడతారు. మరోపక్క శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేతకు ఏమైంది? ధర్మ-శ్వేత ఒక్కటయ్యారా? వీరారెడ్డి చివరికి ఏం చేశాడు? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సమాజంలో ప్రధాన సమస్యల్లో ఒకటైన కుల వ్యవస్థని ప్రశ్నిస్తూ ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు.. తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కొడుకుతో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటారు. అబ్బాయిలు, స్నేహితులుగా మారితే.. అమ్మాయి మాత్రం ఆ కుర్రాడి మీద మనసు పడుతుంది. తక్కువ కులానికి చెందిన అతన్ని ప్రేమించడం నచ్చని ఆమె తండ్రి.. అతన్ని ఊరి నుంచి పంపేస్తాడు. ర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ ఫ్లాట్.రాయలసీమలోని దేవగుడి అనే ఒక గ్రామం నేపథ్యంలో కథ అంతా సాగుతుంది. రాయలసీమ టచ్‌తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. చంద్రమండలం వరకు వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు కానీ ఇంకా రాతియుగపు నాటి కుల వ్యవస్థను మాత్రం వదలలేకపోతున్నారు. ఏదేమైనా చేయండి కానీ పెళ్లి విషయంలో చావు విషయంలో మాత్రం కులాల ప్రస్తావన కచ్చితంగా తీసుకొస్తున్నారు. ఇందులోనూ అదే అంశాన్ని చూపించారు.సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సాగుతుంది. కాకపోతే స్టోరీలా ఊహించేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకుడికి తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఉన్నంతలో బాగానే తీశారు.నటీనటుల విషయానికి వస్తే హీరోగా నటించిన అభినవ్ శౌర్య, హీరోయిన్గా చేసి అనుశ్రీ.. ఆమె సోదరుడి పాత్రలో నరసింహ ఆకట్టుకున్నారు. దేవగుడి వీరారెడ్డిగా రఘు కుంచె ఓకే. మిగతా పాత్రధారులు న్యాయం చేశారు. టెక్నికల్ టీమ్‌లో మదిన్ సంగీతం బాగుంది. నిడివి కూడా పర్లేదు. నిర్మాణ విలువలు ఓకే ఓకే. -
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా 'సర్వం మాయ'. హీరో నివీన్ పౌలీ.. దాదాపు పదేళ్ల తర్వాత ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. హిట్ కొట్టాడు. హారర్ కామెడీ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే రూ.150 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ చిత్రం హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన)కథేంటి?ప్రభేందు(నివీన్ పౌలీ) బ్రహ్మణ కుర్రాడే కానీ దేవుడిని నమ్మడు. తండ్రి, అన్నలా పౌరోహిత్యం చేయడు. మంచి గిటారిస్ట్ అవ్వాలనేది గోల్. ఆ ప్రయత్నాల్లో ఉంటూ స్టేజీ షోలు చేస్తుంటాడు. అనుకోని కారణాల వల్ల సొంతూరికి వస్తాడు. ఖాళీగా ఉండటం ఎందుకని డబ్బుల కోసం బావ రూపేష్(అజు వర్గీస్)తో కలిసి పూజలు, హోమాలు చేస్తుంటాడు. ఓసారి ఒకరి ఇంట్లో పిల్లాడికి పట్టిన దెయ్యాన్నివదిలిస్తాడు. తర్వాత నుంచి ఆ ఆడ దెయ్యం(రియా షిబు).. ప్రభేందు వెంటపడుతుంది. ఇతడికి మాత్రమే కనిపిస్తూ, ఇతడితోనే మాట్లాడుతూ ఉంటుంది. సదరు దెయ్యానికి.. తాను ఎవరు? ఎలా చనిపోయాననే విషయాలేం గుర్తుండవు. దీంతో ఆ దెయ్యానికి డెలులు అని పేరు పెడతాడు. మరి డెలులు వల్ల ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? డెలులు గతమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మలయాళ సినిమాల్లో పెద్దగా కథేం ఉండదు. సింపుల్ ఎమోషన్స్, సున్నితమైన కామెడీతోనే అంతా నడిపించేస్తుంటారు. ఇది అలాంటి ఓ స్టోరీనే. సాధారణంగా దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారు కానీ ఇందులో దెయ్యమే.. మనుషుల్ని చూసి భయపడుతుంది. గతం మర్చిపోవడం వల్ల పేరు సహా ఏదీ గుర్తుండదు. ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. హీరో కూడా అంతే. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు. అలాంటి వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు ఎలా సాయం చేసుకున్నారు. ప్రభేందు తన భయాన్ని ఎలా అధిగమించాడు. డెలులు చివరకు ముక్తి పొందిందా లేదా అనేది మెయిన్ ప్లాట్.హారర్ కామెడీ సినిమానే అయినప్పటికీ ఎక్కడా భయపెట్టే సీన్స్ ఉండవు. బదులుగా ఆడ దెయ్యంతో ప్రేమలో పడతాం. ప్రేమ, బంధం, నమ్మకం లాంటి విషయాల గురించి పలు పాత్రలతో చెప్పించిన డైలాగ్స్, ఆయా సీన్స్ చాలామందికి కనెక్ట్ అవుతాయి. మూవీ చూస్తున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది. ఫస్టాప్ చకచకా సాగిపోతుంది. సెకండాఫ్ మాత్రం అక్కడక్కడే తిరిగినట్లు కాస్త సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే డెలులు దెయ్యం ఉన్న ప్రతి సీన్ క్యూట్ అండ్ స్వీట్‌గా భలే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే దెయ్యం ఫ్లాష్‌బ్యాక్ కూడా రొటీన్‌కి భిన్నంగానే ఉంటుంది. కాకపోతే ఇంత సింపుల్‌గా తేల్చేశారేంటా అనిపిస్తుంది.ప్రభేందుతో పాటు ట్రావెల్ అయ్యే డెలులు దెయ్యం.. చివరకు అతడితోనే ప్రేమలో పడటం, అదే టైంలో ప్రభేందు.. సాధ్య అనే అమ్మాయిని ప్రేమించడం. తద్వారా ప్రభేందు-డెలులు మధ్య గొడవ జరగడం.. ఈ క్రమంలో డెలులు గతం గుర్తొచ్చే సీన్స్ బాగుంటాయి. డెలులు నిజ జీవితంలోనూ ప్రభేందునే ప్రేమించిందా? అనే ప్రశ్నతో సినిమాని ముగించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.ప్రభేందుగా చేసిన నివీన్ పౌలీ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. డెలులు దెయ్యంగా చేసిన రియా షిబు అయితే ప్రతిఒక్కరి ఫేవరెట్ అయిపోతుంది. అంత క్యూట్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసేసింది. మిగతా యాక్టర్స్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఏ ఒక్క క్యారెక్టర్ అనవసరంగా ఉందే అని ఎక్కడా అనిపించదు. చివరకు కుక్కని కూడా కథలో భాగం చేసిన తీరు అలరిస్తుంది. టెక్నికల్ విషయాలకొస్తే.. తెలుగు డబ్బింగ్ బాగున్నప్పటికీ పాటలకు రాసిన తెలుగు లిరిక్స్ అస్సలు సూట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రాఫీ కూడా చూడముచ్చటగా ఉంది. కేరళ అందాలని బాగా క్యాప్చర్ చేశారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.దెయ్యం లేదా హారర్ సినిమాలు చూడాలంటే మీకు చచ్చేంత భయమా? అయినా పర్లేదు. ఎలాంటి భయం లేకుండా మీరు ఈ మూవీ చూసేయొచ్చు. చూస్తున్నంతసేపు దెయ్యమేంటి ఇంత అందంగా ఉంది? ఇలాంటిది మన జీవితంలోకి ఎందుకు ఎప్పుడూ రాలేదు? అని ఒక్కసారైనా అనిపిస్తుంది. ఈ వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'సర్వం మాయ' బెస్ట్ ఆప్షన్. కుటుంబంతోనూ కలిసి హాయిగా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం) -
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా?
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. మలయాళ హిట్ సినిమా జయ జయ జయ జయహే రీమేక్‌గా తెలుగులో తెరకెక్కించారు. ఈ సినిమా నేడు జనవరి 30న విడుదలైంది. మాలయాళంలో రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన జయ జయ జయ జయహే మూవీ ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు ఆడియోతోనూ జియోహాట్‌స్టార్‌లో ఉంది. దీంతో చాలామంది సినిమా చూసేశారు. అయితే, ఇదే చిత్రాన్ని రీమేక్ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ప్రేక్షకులను మెప్పించేంత కంటెంట్ ఏమైనా కొత్తగా ఉందా అంటే సినిమా చూడాల్సిందే.స్త్రీలను మాతృమూర్తులుగా, ఆదిశక్తి స్వరూపులుగా భావించి గౌరవంగా చూసుకోవాలని మన శాస్త్రాలు చెప్తాయి. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు కొలువుంటారని వింటూనే ఉన్నాం. స్త్రీలను గౌరవించని చోట అక్కడ చేసే పనులన్నీ ప్రయోజనం లేనివిగా మారిపోతాయి. ఇదే కాన్సెప్ట్‌తో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ఉంటుంది. (Om Shanti Shanti Shantihi Movie Review)కథేంటంటే..శాంతి(ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచే తనకు నచ్చినట్లు ఉండాలని అనుకునే అమ్మాయి. మంచి చదువు, ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటూ పెరుగుతుంది. ఇంటర్ తర్వాత పట్నం వెళ్లి చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ, తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో ఇంటికి దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో డిగ్రీలో చేరుతుంది. తను చదువుకే కాలేజీలో జరిగిన ఒక సంఘటన వల్ల చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతలో తల్లిదండ్రులు శాంతికి పెళ్లి సంబంధం చూస్తారు. కానీ, తను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అనుకుంటుంది. అయితే, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నాయుడు (తరుణ్ భాస్కర్) వస్తాడు. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇస్తాడు. దీంతో ఆమె సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత నాయుడులోని పురుషాహంకారం బయటకు వస్తుంది. చీటికిమాటికి శాంతిపై చేయి చేసుకుంటాడు. దీంతో శాంతి కన్నీళ్లు పెట్టుకుని తన తల్లిదండ్రులతో చెబితే సర్దుకుపోవాలని సూచిస్తారు. ఒకరోజు రాయుడిపై శాంతి తిరగబడుతుంది. చేయిచేసుకున్న భర్తను శాంతి చితకబాదుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి జంట మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి..? విడాకులు తీసుకుందామంటే ఎలాంటి చిక్కులు వచ్చాయి..? ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శాంతి తన మనసు ఎందుకు మార్చుకుంది..? అనేది తెలియాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే:నేటి సమాజంలో ఆడపిల్లను చిన్నచూపు చూసే కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. మగపిల్లలను చూసిన తీరు ఆడపిల్లల పట్ల కనిపించదు. చిన్నతనంలోనే కట్టుబాట్ల పేరుతో పెంచుతారు. స్కూల్, కాలేజీ రోజుల్లో కూడా వారి చిన్న చిన్న సరదాలను కూడా అడ్డకట్ట వేసి బంధిస్తారు. ఆడపిల్లకు కూడా మనసు ఉంటుంది అనే విచక్షణ మరిచిపోతుంటారు. ఈ కథలో శాంతి పాత్ర కూడా ఇలాగే ఉంటుంది. తన చిన్నతనం నుంచే కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా ప్రేమ, సహకారం అందదు. అయినప్పటికీ చదువులో రాణిస్తుంది. మంచి మార్కులతో పాస్ అవుతుంది. గొప్ప చదువులు చదివి ఉద్యోగం సాధించాలనే తపనతో శాంతి ఉంటుంది. శాంతి పాత్రను దర్శకుడు తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. ఇలాంటి అమ్మాయి ప్రతి మధ్య తరగతి కుటుంబంలో కనిపిస్తూనే ఉంటుంది కదా అనే ఫీల్ కలుగుతుంది. అత్తారింటికి వెళ్లిన శాంతి అక్కడ పడే ఇబ్బందులు మనం చూస్తే చాలామంది ఆడపిల్లల జీవితాలు కళ్లముందు మెదులుతాయి. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇచ్చిన భర్త.. ఆ తర్వాత దానిని దాటేస్తూ ఉంటాడు. ఈ సమస్య చాలామంది ఆడబిడ్డలకు ఎదురై ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం ఆరు నెలల్లోనే 21 సార్లు చేయి చేసుకున్న భర్త పదేళ్లలో ఎన్నిసార్లు కొడతాడు.. ఆ లెక్కన 40 ఏళ్లలో ఎన్నిసార్లు దెబ్బలు తినాలి అంటూ శాంతి ప్రశ్నిస్తుంది. దీనికి కుటుంబ సభ్యులతో పాటు అత్తగారింటి నుంచి కూడా సరైన సమాధానం ఉండదు. ఇలా ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట జరిగే పలు సంఘటనలే కథలో కనిపిస్తాయి. వాటిని చక్కగా దర్శకుడు తెరకెక్కించాడు.ఫస్టాఫ్ అంతా బాగా కథ నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో కాస్త నిరాశపరిచాడనిపిస్తుంది. గృహహింస విషయంలో నేటి సమాజం ఆలోచన తీరు ఎలా ఉందో చాలా చక్కగా చూపించాడు. భర్తను భార్య కొట్టిందంటే అవమానం అంటారు. అలాంటప్పుడు భార్యను భర్త కొట్టడం ఎవరికీ తప్పు అనిపించదా..? అనేది శాంతి పాత్ర బలంగా ప్రశ్నిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ వరకు ఎలాంటి బోర్ లేకుండా సినిమాను చూసేయవచ్చు. సంసార జీవితంలో ఒక అమ్మాయికి ముఖ్యంగా ఉండాల్సిన మూడు విషయాలు ఇవే అంటూ.. ఒక భర్త నుంచి ప్రతి భార్య కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అని, అవన్నీ కూడా ఆడపిల్ల పుట్టకతోనే వస్తాయని జడ్జి చెప్పిన తీరు ఆలోచింపచేస్తుంది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో హీరో ఈషా రెబ్బా అని చెప్పాల్సిందే. ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబంలో ఉండే అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్లు తన నటనతో మెప్పించింది. ఓర్పు, సహనం, ప్రేమ ఇలా అన్ని కోణాలు ఆడపిల్ల జీవితంలో ఉంటాయని చూపింది. సహనం కోల్పోయిన తర్వాత ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో పవర్‌ఫుల్‌గా కూడా కనిపించింది. రాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ అదరగొట్టేశాడు. తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని గుర్తుచేశాడు. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సెటిల్డ్‌గా చూపించాడు. సంక్రాంతి తర్వాత కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఒక సినిమా చూడొచ్చు అనేలా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఉంటుంది. -
సిరై రివ్యూ: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే మూవీ
ప్రేమ గుడ్డిది. రంగు, ఆస్తి, కులమతాలు దానికి కనిపించవు. ఎప్పుడు ఏ రెండు మనసుల్ని కలుపుతుందో దానికే తెలీదు. కానీ, ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆ ప్రేమ సుఖాంతం అవడం చాలా కష్టం. ఈ క్రమంలో అది పెట్టే పరీక్షలు, కష్టాలు అనుభవించినవారికే ఎరుక. సిరై సినిమాలో అదే చూపించారు. ఆ మూవీ రివ్యూ ఓసారి చూసేద్దాం...కథవిక్రమ్ ప్రభు పోలీస్ కానిస్టేబుల్‌గా నటించాడు. ఓరోజు ఖైదీ అబ్దుల్ (అక్షయ్ కుమార్)ను కోర్టు విచారణకు తీసుకెళ్లే డ్యూటీకి వెళ్తాడు. ఆ సమయంలో ఖైదీ తప్పించుకుంటాడు. దీంతో దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్తే అక్కడ ఖైదీ ఉంటాడు. కానీ అతడిని అప్పగించేందుకు ఆ స్టేషన్ హెడ్ ఒప్పుకోడు. పైగా విక్రమ్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుల్స్ తాగి ఉన్నాడని గుర్తిస్తాడు. మరి ఖైదీని వీళ్లు విచారణకు తీసుకెళ్లారా? డ్యూటీ సరిగా చేయనందుకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. తప్పించుకున్న నేరస్తుడు మళ్లీ ఎందుకు లొంగిపోయాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?పోలీస్ డ్యూటీ అంటే ఆషామాషీ ఏం కాదు. ఏమాత్రం పొరపాటు జరిగినా వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. దుండగులు కత్తులతో దాడిచేస్తే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినా ఖైదీలా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. అది చూసి మనకే జాలేస్తుంది. ఇక ఖైదీ అబ్దుల్.. చిన్నప్పటినుంచే అతడికో లవ్‌స్టోరీ ఉంది. స్కూల్‌డేస్ నుంచే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మతాలు వేరు. మనసును కదిలిస్తుందిఅందులోనూ అతడికి తల్లి తప్ప తండ్రి లేడు. ఈ ప్రేమ వర్కవుట్ కాదని అర్థమై ప్రియురాలిని దూరంగా ఉండమని చెప్తాడు. కానీ, ఆమె మాత్రం అతడి చేయి వదలదు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతడి కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇక్కడ వారి స్వచ్ఛమైన ప్రేమ మనసుల్ని కదిలిస్తుంది. అతడు జైలు నుంచి విడుదలవుతాడునుకున్న సమయంలో ఓ ట్విస్ట్ వస్తుంది. ఓటీటీలోఅప్పుడు ప్రేక్షకులు కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. దర్శకుడు సురేశ్ రాజకుమారి సిరై సినిమాలో సమాజంలో పెరుగుతోన్న మతవివక్షను, న్యాయస్థానంలో కేసుల విచారణలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని చూపించారు. స్వచ్ఛమైన ప్రేమకథతో మనసును హత్తుకున్నారు. యాక్టర్స్ అందరూ బాగా నటించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. మిస్ అవకుండా చూసేయండి.. -
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
శోభిత తెలుగమ్మాయే. కానీ దాదాపు పదేళ్ల కెరీర్లో రెండే తెలుగు సినిమాలు చేసింది. కానీ అక్కినేని కోడలు అయిన తర్వాత ఈమె ముందు కంటే బాగానే ఫేమస్ అయిపోయింది. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె చేసిన సినిమా 'చీకటిలో'. థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? అక్కినేని కోడలు హిట్ కొట్టిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)కథేంటి?క్రిమినాలజీ చదివిన సంధ్య(శోభిత).. ఓ న్యూస్ ఛానెల్లో క్రైమ్ వార్తలు చదివే యాంకర్‌గా పనిచేస్తుంటుంది. చేస్తున్న ఉద్యోగంపై పెద్దగా ఆసక్తి ఉండదు. సొంతంగా పాడ్‌కాస్ట్ ఛానెల్ ప్రారంభించాలనేది ఈమె గోల్. మరోవైపు అమర్ (విశ్వదేవ్ రాచకొండ)తో ప్రేమలో ఉంటుంది. పెళ్లికి కూడా వీళ్లిద్దరూ రెడీ అవుతుంటారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ రోజు సంధ్య సహొద్యోగి బాబీ(అదితీ మ్యఖల్) హత్యకు గురవుతుంది. ఇంతకీ ఈమెని చంపింది ఎవరు? 25 ఏళ్ల క్రితం గోదావరి జిల్లాల్లో జరిగిన వరస హత్యలకు.. బాబీ చావుకు ఏమైనా సంబంధం ఉందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా అనగానే స్టోరీ ఏంటనేది ఓ అంచనా ఏర్పడుతుంది. 'చీకటిలో' కూడా దాదాపు అదే శైలిలో తీశారు. హత్యలు జరగడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇలా చాలా విషయాలు రొటీన్‌గానే అనిపిస్తాయి. జానర్ పరంగా చూస్తే మాత్రం ఇదో మాములు స్టోరీలానే అనిపిస్తుంది. కాకపోతే ఇందులో సామాజిక అంశాన్ని చూపించిన విధానం బాగుంది.అత్యాచారాలకు ముగింపు ఇవ్వాలంటే.. ధైర్యంగా బయటకు వచ్చి తమపై అత్యాచారం జరిగిందని చెప్పే గొంతుక కావాలి. బాధితులు ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ పాయింట్ పరంగా చూస్తే మాత్రం 'చీకటిలో' కాస్త భిన్నంగా అనిపిస్తుంది. అసలు విషయానికొస్తే.. శోభిత పరిచయం, హత్యలు జరగడం లాంటి అంశాలతో సినిమాని చాలా ఫ్లాట్‌గా మొదలుపెట్టారు. దాదాపు గంటవరకు అలానే వెళ్తుంది. శోభిత, పోలీసులతో కలిసి చేసే ఇన్వెస్టిగేషన్ అయితే ఏ మాత్రం ఆసక్తి కలిగించదు. ఇప్పటికే చాలా సినిమాల్లో ఇదంతా చూసేశాం అనే ఫీలింగ్ కలిగిస్తుంది.కానీ చివరి అరగంట మాత్రం బాగుంది. రెగ్యులర్‌గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లు కూడా సీరియల్ కిల్లర్ ఎవరనేది ఊహించడం కష్టం. ఎందుకంటే హీరోయిన్ చుట్టుపక్కనే అతడు ఉంటాడు. కానీ చివరివరకు అతడు ఎవరనేది తెలియనివ్వలేదు. అలానే చిన్నతనంలో జరిగే లైంగిక వేధింపులు, పెద్దయిన తర్వాత కూడా జీవితంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అనే విషయాన్ని బాగానే చూపించారు. మహిళలపై అత్యాచారం, హత్యలు లాంటి సీన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు వల్గారిటీ జోలికి పోలేదు. ఎక్కడ అసభ్యతగా అనిపించదు.ఇలా పాజిటివ్స్ పరంగా చాలా అంశాలు ఉన్నప్పటికీ నెగిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. క్లైమాక్స్, సీరియల్ కిల్లర్ ఎవరనేది రివీల్ చేసినప్పడు తప్పితే మిగతా విషయాల్లో అస్సలు థ్రిల్ అనిపించదు. శోభిత చేసే ఇన్వెస్టిగేషన్ అయితే మరీ లాజిక్‌లెస్‌గా ఉంటుంది. పోలీసులు బొమ్మల్లా ఉంటారు. ఈమెకు మాత్రం అన్ని ప్రూఫ్స్ దొరికిపోతుంటాయి. ఇది మాత్రం కన్విన్సింగ్‌గా అనిపించలేదు.ఎవరెలా చేశారు?చాన్నాళ్ల తర్వాత శోభిత చేసిన తెలుగు సినిమా ఇది. సంధ్య పాత్రలో పద్ధతిగా చుడీదార్, చీరల్లో కనిపించింది. సెటిల్డ్ యాక్టింగ్ చేసింది. పాత్రకు ఎంత కావాలో అంతే చేసింది. డబ్బింగ్ కూడా బాగుంది. విశ్వదేవ్ రాచకొండ, ఇషా చావ్లా, ఆమని, ఝాన్సీ, రవీంద్ర విజయ్ లాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్లలో ఒక్కరికి కూడా ఆకట్టుకునే అవకాశం దొరకలేదు. మూవీ అంతా దాదాపు శోభిత చుట్టూనే తిరగడం దీనికి కారణం కావొచ్చు.టెక్నికల్ విషయాలకొస్తే.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీకి తగ్గట్లు ఉంది. టైటిల్‌కి తగ్గట్లు సినిమా చాలావరకు చీకటిలోనే ఉంటుంది. అందుకు తగ్గట్లే సినిమాటగ్రఫీ ఉంది. దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ తప్పితే మిగతాది అంతా రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే 'చీకటిలో' మరో మంచి థ్రిల్లర్ అయ్యిండేది. కుటుంబంతోనూ కలిసి ఈ సినిమా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!) -
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
కొన్ని సినిమాలు పలాన నటుడు మాత్రమే చేయగలడని ప్రేక్షకులు అంటుంటారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమా ఎంపికలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన ఎలాంటి మూవీ తీసిన సరే మరో నటుడుని ఆ పాత్రలో ఊహించుకోలేము. మమ్ముట్టి కెరీర్లో 400కి పైగా సినిమాలు చేసి, హీరో, విలన్, గ్రే షేడ్స్, బయోపిక్ పాత్రలు అన్నింటినీ సమర్థంగా పోషించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటించిన 'కలాం కావల్' ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నిజ జీవిత సీరియల్ కిల్లర్ సయనైడ్ మోహన్ కేసు ఆధారంగా ఈ మూవీని దర్శకుడు జితిన్ కె.జోస్ తెరకెక్కించారు. ఈ సినిమాను చూడటం మొదలుపెడితే.. పూర్తి అయ్యేవరకు ఎవరూ ఆపరు. కథ ప్రారంభంలోనే హత్యలు చేసేది ఎవరు అనేది ప్రేక్షకులకు తెలిసిపోతుంది. కానీ.. పోలీసులకు తెలియదు. అయినప్పటికీ చాలా ఆసక్తిగా మూవీని నిర్మించారు.సైకో కిల్లర్ ఎలా ఉంటాడు.. వరుస హత్యలు ఎందుకు చేస్తాడు అనేది 'కలాం కావల్'లో చక్కగా చూపించాడు. ఒకరికి దోమను చంపితే సంతోషం.. మరోకరికి కోడిని కోసినప్పుడు అది గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు చూడటం సంతృప్తి. పాములో విషం ఉంటుందని తెలిసినా కూడా దానిని చంపే వరకు కొందరు ఊరుకోరు. ఇలా మన చుట్టూ ఉండే ప్రాణులను చంపడంలో కొందరిలో కనిపించే సంతోషం ఒక్కో స్థాయిలో ఉంటుంది. అయితే, కలాం కావల్ మూవీలో స్టాన్లీ దాస్ (మమ్ముట్టి)కి మాత్రం ఒంటరి మహిళలను చంపి సంతోషం పొందుతుంటాడు. వారిని ట్రాప్ చేసి తన కోరిక తీర్చుకుని చాలా సింపుల్‌గా చంపేస్తాడు. సినిమా ప్రారంభం నుంచే మొదలైన ఈ పరంపర.. చివరి వరకు కొనసాగుతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా దర్శకుడు జితిన్ కె.జోస్ మెప్పించాడు.స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) ఒంటరిగా ఉండే మహిళలను ట్రాప్ చేసి తన వలలో వేసుకుంటాడు. జీవితంలో విసిగిపోయిన వారికి కొత్త లైఫ్ ఇస్తానని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు వారితో గడిపి అదే రోజున హత్య చేస్తాడు. అయితే, ఒకరి ఫిర్యాదు వల్ల కథలో మలుపు తిరుగుతుంది. దీంతో ఈ కేసులోకి ఎస్సై జయకృష్ణన్ (వినాయకన్) ఎంట్రీ ఇస్తాడు. పోలీసులు ఎంత వేగంగా కేసును ధర్యాప్తు చేస్తున్నారో అంతే స్పీడ్‌గా స్టాన్లీ దాస్ ఆలోచన తీరు ఉంటుంది. అయితే, చాలా కూల్‌గా హత్యలు చేస్తాడు. అయితే, స్టాన్లీదాస్ ఎందుకు ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి చంపేస్తున్నాడు.. కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతం వారినే ట్రాప్ చేయడానికి కారణం ఏంటి..? వరుసగా హత్యలు చేస్తూ పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు..? ఫైనల్‌గా ఎస్సై జయకృష్ణన్ కేసును క్లోజ్ చేశాడా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.'కలాం కావల్' కథ 2000 సంవత్సరంలో జరిగినట్లు దర్శకుడు చూపుతాడు. దీంతో ఎక్కడా లాజిక్ మిస్ కాదు. నేటి తరం మాదిరి సీసీ కెమెరాలు వంటివి ఆరోజుల్లో లేవు. మొబైల్స్ కనెక్టివిటీ కూడా అప్పుడప్పుడే వినియోగంలోకి మొదలయ్యాయి. దీంతో సినిమాపై సానుకూలత కలిగేలా సీన్లు ఉంటాయి. మూవీ ప్రారంభంలోనే స్టాన్లీదాస్ ఒక మహిళను లోబరుచుకుని హత్య చేసే సీన్ ఉంటుంది. హంతకుడు ఎలాంటి వాడు అనేది అక్కడే ప్రేక్షకుడికి అర్థమయిపోతుంది. స్టాన్లీ చేస్తున్న హత్యలు వరుసగా జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో జయకృష్ణన్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంటుంది. టెక్నాలజీ లేని కాలంలో ఇలాంటి కేసులను పోలీసులు ఎలా చేధించేవారో చక్కగా చూపించారు.స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) హంతకుడు మాత్రమే కాదు... ఇంటర్వెల్లో తన అసలు రూపం ఏంటి అనేది ఒక ట్విస్ట్‌తో దర్శకుడు షాకిచ్చాడు. జయకృష్ణన్తోనే ఉంటూ పోలీసుల ప్లాన్స్ ఏంటి అనేది తెలుసుకుని చాలా తెలివిగా తప్పించుకుంటాడు. పోలీసులు రెండు అడుగులు వేస్తే.. స్టాన్లీ పది అడుగులు వేస్తాడు. అయితే, ఫైనల్‌గా స్టాన్లీనే ఈ హత్యలకు కారణం అని జయకృష్ణన్ కనుగునే సీన్ మూవీకే ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. వరుస ట్విస్ట్‌లతో సాగే ఈ మూవీ మలయాళ ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో సైకో కిల్లర్ స్టాన్లీగా మమ్ముట్టి అదరగొట్టేశాడు. ‘జైలర్’లో వర్మగా తన నటనతో మెప్పించిన వినాయకన్ ఈ మూవీలో మరోస్థాయిలో గుర్తుండిపోయేలా నటించాడు. సోనీ లివ్‌లో ఈ మూవీని కుటుంబంతో పాటుగా చూడొచ్చు. ఎలాంటి అసభ్యత లేదు. వరుస హత్యలు ఉన్నా రక్తపు మరకలు కనిపించకుండా దర్శకుడు తెరకెక్కించారు. -
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: నారీ నారీ నడుము మురారినటీనటులు: శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య, నరేశ్, వెన్నెల కిశోర్, సత్య, సుదర్శన్, సంపత్ రాజ్ తదితరులునిర్మాత: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకరస్క్రీన్ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజుసంగీతం: విశాల్ చంద్రశేఖర్విడుదల తేది: జనవరి 14, 2026ఈ సంక్రాంతికి చివరగా వచ్చిన సినిమా ‘నారి నారి నడుమ మురారి’. మిగతా సినిమాలతో పోల్చితే దీనికి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై కాస్త ఆసక్తి పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వరుస ప్లాఫులతో సతమతవుతున్న శర్వా.. ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆర్కిటెక్ట్ గౌతమ్(శర్వానంద్).. నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో..ఆయన తండ్రి కార్తిక్(నరేశ్)కి లేటు వయసులో ప్రేమించిన యువతి పల్లవి(సిరి హనుమంతు)తో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నిత్య తండ్రి రామలింగయ్య(సంపత్ రాజ్) తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోడు. కానీ కూతురు బాధ చూడలేక చివరకు ఒప్పుకుంటాడు. అయితే రిజిస్టర్ ఆఫీస్‌లోనే పెళ్లి చేసుకోవాలని షరతు విధిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ ఈ రిజిస్టర్ పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్ ఆఫీసుకి వెళ్లగా.. గౌతమ్‌కి అనుకొని సమస్య ఎదురవుతుంది? అదేంటి? దియా(సంయుక్త) ఎవరు? గౌతమ్‌కి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? పెళ్లి కోసం కొడుకు చెప్పే అబద్దాల కారణంగా కార్తీక్-పల్లవిల దాంపత్య జీవితంలో ఎలాంటి మలుపు వచ్చాయి. చివరకు గౌతమ్-నిత్యల పెళ్లి జరిగిందా లేదా? ఈ కథకి లవకుశ(సత్య), సత్యమూర్తి(సునీల్), గుణశేఖర్(వెన్నెల కిశోర్)ల పాత్రలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Nari Nari Naduma Murari Review).ఎలా ఉందంటే..కామెడీ సినిమాలకు కథ-కథనం ఎలా ఉన్నా సరే.. కడుపుబ్బా నవ్విస్తే చాలు.. ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. ఇక బలమైన కథ.. ఆ కథలోని పాత్రలకు సరైన నటీనటులు తోడైతే అది నారీ నారీ నడుము మురారీ సినిమా అవుతుంది. సామజవరగమన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు..మరోసారి అలాంటి కామెడీ కథతోనే ఈ సినిమాను తెరెక్కించాడు. కథలో కొత్తదనం లేకున్నా.. స్క్రీన్‌ప్లేతో మరోసారి మ్యాజిక్ చేశాడు. ముఖ్యంగా డైలాగులు అదిరిపోతాయి. కథనం మొత్తం కరెంట్ పంచ్ డైలాగులతో హిలేరియస్ యాంగిల్ లో సాగుతుంది.ఆరు పదుల వయసులో హీరో తండ్రి.. పాతికేళ్ల వయసు ఉన్న అమ్మాయిని ప్రేమించడం.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆమెను స్వయంగా కొడుకే తీసుకొచ్చి.. పెళ్లి చేయించే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఇలా సినిమా ప్రారంభం నుంచి నవ్వుల యాత్రను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత గౌతమ్-నిత్యల లవ్‌స్టోరీని ‘పులిహోర’తో ముడిపెడుతూ చాలా హిలేరియస్‌గా చూపించాడు. ఈ జంట పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. దియా ఎంట్రీతో కథనం మరో మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కామెడీ డోస్ మరింత పెరగుతుంది. వెన్నెల కిశోర్ ఎంట్రీ..శ్రీమంతం ఎపిసోడ్..విడాకుల పేరుతో నడిచే కోర్టు డ్రామా.. అన్ని నాన్‌స్టాఫ్‌గా నవ్విస్తాయి. ముఖ్యంగా నరేశ్ పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు..ఆయన చెప్పే డైలాగులకు పడి పడి నవ్వుతారు. ఆయన పర్సనల్ లైఫ్‌పై కూడా పంచ్‌లు వేసుకోవడం..మరింత ఫన్ని జనరేట్ చేసింది. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే క్లైమాక్స్‌లో కూడా మళ్లీ నరేశ్‌పై పంచ్ డైలాగులు వేయడంతో నవ్వుకుంటూ ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఒకటి రెండు డైలాగులు మినహా ఎలాంటి వల్గారిటీ, బూతు సీన్లు లేకుండా క్లీన్ కామెడీతో ఫ్యామిలీ మొత్తం చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో కొత్తదనం ఆశించకుండా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్తే..హాయిగా రెండున్నర గంటల పాటు నవ్వుకోవచ్చు((Positive And Negatives Of Nari Nari Naduma Murari Movie).ఎవరెలా చేశారంటే...గౌతమ్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. టైటిల్‌కి తగ్గట్టే ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడి పాత్ర ఇది. శర్వా పాత్ర టెన్షన్ పడే ప్రతిసారి ప్రేక్షకుడి నవ్వు ఆగదు. ఇక ఈ సినిమాకు రెండో హీరో నరేశ్. లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కార్తిక్ పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన నిజ జీవితానికి ఈ పాత్రకు మధ్య పోలికలు ఉండడం.. డైలాగులు కూడా అలానే ఉండడంతో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. సెకండాఫ్‌లో ఆయనకు మంచి సీన్లు పడ్డాయి. ఇక హీరోయిన్లు సాక్షి వైద్య, సంయుక్త.. ఇద్దరూ తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. కథకు సంబంధం లేకున్నా.. సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. గురువుపై విపరీతమైన ప్రేమ చూసే గుణశేఖర్‌గా వెన్నెల కిశోర్ తనదైన నటనతో నవ్వించేశాడు. సంపత్ రాజు, సునీల్, సుదర్శన్.. ఇలా ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న ప్రతి చోట నవ్విస్తూనే ఉంటారు. భాను భోగవరపు అందించిన కథ.. డైలాగులు బాగున్నాయి. కేవలం హీరోకు మాత్రమే కాదు సినిమాలో అన్నిపాత్రలకు అదిరిపోయే డైలాగులు ఉంటాయి. రామ్ మంచి స్క్రీన్‌ప్లేతో ఫుల్ ఎంటర్టైనింగ్గా సినిమాను తెరకెక్కించాడు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. జ్ఞానశేఖర్, యువరాజ్‌ల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: అనగనగా ఒక రాజునటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, తారక్ పొన్నప్ప, రావు రమేశ్, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేశ్ తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: మారిసంగీతం: మిక్కీ జె. మేయర్విడుదల తేది: జనవరి 14, 2026హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్‌తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘అనగజగా ఒక రాజు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆయనే కథ అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్‌గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్‌కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Anaganaga Oka Raju Review).ఎలా ఉందంటే..తెలిసిన కథతోనే సినిమా తీసి మెప్పించడం అనేది...పాత ఇంటికి కొత్త పెయింట్ వేసినట్టే అవుతుంది. లుక్ మారితే చాలా ఇష్టపబతారు. కానీ లోపాలు కనిపిస్తే విమర్శలు తప్పవు. ‘రాజుగారు’ ఆ విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు. కథ- కథనం అంతా పాత చింతకాయ పచ్చడే అయినప్పటికీ.. ‘రాజుగారు’ చేసే హంగామా చూసి ఫుల్ ఎంటర్టైన్ అవుతాం. సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల వరకు బోరింగ్‌గా సాగుతుంది. ఒక్కో సీన్ వచ్చి వెళ్తుంది కానీ.. ఎక్కడా కనెక్ట్ కాలేం. కానీ రాజు గారు పెళ్లి చూపుల వేట మొదలు పెట్టినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇక ‘ఆపరేషన్ చారులత’ ఎపిసోడ్ నుంచి నవ్వుల యుద్ధం ప్రారంభం అవుతుంది. కథనం ఊహకందేలా సాగినా.. నవీన్ పొలిశెట్టి వేసే పంచ్‌లు, కామెడీ సీన్లతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. గోవా ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరో ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత మళ్లీ కథనం పుంజుకుంటుంది. ఎలెక్షన్ క్యాంపెయిన్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో కథనం ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అప్పటివరకు నవ్వించిన రాజుగారు.. చివరిలో కాస్త ఎమోషనల్‌కు గురి చేస్తూ.. ఓ మంచి సందేశం ఇస్తాడు. కథ-కథనం గురించి ఆలోచించకుండా.. వెళ్తే.. ‘అనగనగా ఒకరాజు’ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తాన్ని తన భుజానా వేసుకొని ముందుకు నడిపించాడు. రాజు పాత్రలో జీవించేశాడు. ఇక చారులతగా మీనాక్షి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. వీరిద్దరు తప్పితే.. మిగతా పాత్రలేవి అంతగా గుర్తుండవు. హీరోయిన్ తండ్రిగా రావు రమేశ్ రెగ్యులర్ పాత్రలో కనిపించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఎర్రిబాబు పాత్రలో తారక్ పొన్నప్ప.. బాగానే చేశాడు. కానీ ఆయన పాత్రని ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. రంగస్థలం మహేశ్, చమ్మక్ చంద్ర కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగతా నటీనటలు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే. మేయర్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ తెరపై రిచ్‌గా కనబడుతుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : భర్త మహాశయులకు విజ్ఞప్తినటీనటులు: రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్, సత్య, వెన్నెల కిశోర్, సునీల్ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ఎల్వి సినిమాస్నిర్మాత: చెరుకూరి సుధాకర్‌దర్శకత్వం: కిషోర్ తిరుమలసంగీతం: భీమ్స్ సిసిరోలియోవిడుదల తేది: జనవరి 13, 2023ఈ ముగ్గుల పండక్కి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. వరుస ఫ్లాపులతో సతమవుతున్న రవితేజ.. తన రూట్ మార్చి చేసిన ఫ్యామిలీ డ్రామా ఇది. సంక్రాంతి పండగనే టార్గెట్‌గా పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. మరి ఈ చిత్రంతో అయినా రవితేజ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రామ సత్యనారాయణ అలియాస్ రామ్(రవితేజ) ఓ వైన్‌యార్ట్ ఓనర్. తాను కొత్తగా రెడీ చేసిన ‘అనార్కలి’ వైన్‌ని స్పెయిన్‌లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్ చేస్తారు. కారణం తెలుసుకునేందుకు స్పెయిన్ వెళ్లిన రామ్.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్)తో ఫిజికల్‌గా దగ్గరవుతాడు. ఈ విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్ హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్‌తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. ఈ విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్ ఏం చేశాడు? స్పెయిన్‌లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్‌కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్ విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్), సుదర్శన్(సునీల్)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఒకవైవు భార్య.. మరోవైపు ప్రియురాలు.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పురుషుడి కథతో ‘ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు’ తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ కూడా అదే. ఇద్దరి ఆడవాళ్ల మధ్య ఇరుకున్న ఓ భర్త.. ఆ ఇరకాటం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు తిరుమల కిషోర్ ఎంచుకున్న పాయింట్ చాలా రొటీన్. కానీ దాని చుట్టూ అల్లుకున్న కామెడీ సన్నివేశాలు మాత్రం ట్రెండ్‌కు తగ్గట్లు ప్రెష్‌గా ఉన్నాయి. మీమ్స్ కంటెంట్‌ని బాగా వాడుకున్నాడు. సోషల్ మీడియాని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారు కొన్ని సీన్లకు బాగా కనెక్ట్ అవుతారు. అయితే ఏ జోనర్ సినిమాకైనా ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితేనే.. ఆ కథతో ప్రయాణం చేస్తాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అది మిస్ అయింది. మగాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి తన భర్త ఒక రోల్ మోడల్ అని బాలమణి పదే పదే చెబుతుంది. అయితే అమె అంతలా తన భర్తను నమ్మడానికి గల కారణం ఏంటనేది చూపించలేదు. అలాగే హీరో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతన్నట్లుగా, భార్య దగ్గర దాచినందుకు టెన్షన్ పడుతున్నట్లుగా చూపించేందుకు రాసుకున్న సన్నివేశాల్లోనూ బలం లేదు. ఫస్టాఫ్‌లో సత్య, కిశోర్‌ల కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. స్పెయిన్ ఎపిసోడ్ వరకు చాలా ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుంది. ఎప్పుడైతే హీరో తిరిగి ఇండియాకొస్తాడో.. అక్కడ నుంచి కథనం నీరసంగా సాగుతుంది. హైదరాబాద్ వచ్చిన మానస.. భార్య కంట పడకుండా హీరో పడే తిప్పలు కొన్ని చోట్ల నవ్విస్తే..మరికొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. మొత్తంగా పస్టాఫ్‌లో కథ లేకుండా కామెడీతో లాక్కొచ్చి.. బోర్ కొట్టకుండా చేశారు. కానీ సెకండాఫ్‌లో మాత్రం ఆ కామెడీ డోస్ తగ్గిపోయింది. ఊహకందేలా కథనం సాగడం.. కామెడీ సీన్లు కూడా పేలకపోవడంతో సెకండాఫ్‌లో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కీలకమైన క్లైమాక్స్ సీన్‌ని కూడా హడావుడిగా ముగించేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్‌కి వెళితే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. రవితేజకు ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లోనూ రామ్ లాంటి పాత్రలు పోషించాడు. అందుకే చాలా అవలీలలా ఆ పాత్రను పోషించాడు. ఇక హీరోయిన్లలో ఆషికా రంగనాథ్, డింపుల్ పోటీ పడి మరీ అందాలను ప్రదర్శించడమే కాదు.. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్, సత్య, సునీల్‌ల కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయింది. మరళీధర్ గౌడ్ కూడా తెరపై కనిపించేదే కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. పిన్నీ సీరియల్ సాంగ్‌తో సహా పాత సినిమాల పాటలు ఇందులో చాలానే వాడారు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ‘మన శంకరవరప్రసాద్ గారు’నటీనటులు: చిరంజీవి, వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడ్కేర్, రఘుబాబు, అభినవ్ గోమఠం తదితరులునిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెలరచన-దర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 12, 2026ఈ సంక్రాంతికి బరిలోకి దిగిన రెండో పుంజు ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘భోళా శంకర్’ లాంటి డిజాస్టర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని చిరంజీవి ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? చిరు ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. (Mana Shankara Vara Prasad Garu Movie Review)కథశంకరవరప్రసాద్(చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన టీమ్(కేథరీన్, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం) కేంద్ర హోంమంత్రి నితీష్ శర్మ(శరత్ సక్సేనా) రక్షణ బాధ్యలతను చూస్తుంటుంది. వృత్తిపట్ల ఎంతో నిబద్ధతతో ఉండే శంకరవరప్రసాద్.. పర్సనల్ లైఫ్‌ని లీడ్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య శశిరేఖ(నయనతార) అతనికి విడాకులు ఇచ్చి.. బడా వ్యాపారవేత్త అయిన తన తండ్రి జీవీఆర్(సచిన్ ఖేడ్కెర్) దగ్గరకు వెళ్తుంది. పిల్లలను కూడా చూపించపోవడంతో ఆరేళ్లుగా వరప్రసాద్ అదే బాధలో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నితీష్.. తనకున్న పలుకుబడితో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలకు పీఈటీ టీచర్‌గా వరప్రసాద్‌ని పంపిస్తాడు. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు వరప్రసాద్ ఎలా దగ్గరయ్యాడు? అసలు శశిరేఖ, వరప్రసాద్ విడిపోవడానికి గల కారణం ఏంటి? మైనింగ్ వ్యాపారవేత్త వెంకీ గౌడ(వెంకటేశ్), శశిరేఖకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు శశిరేఖ, వరప్రసాద్ మళ్లీ కలిశారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..ఎలా ఉందంటే..అనిల్ రావిపూడి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. ఆయన సినిమాలో కొత్తదనం, ట్విస్టులు, లాజిక్కుల గురించి వెతకడం అంటే.. ప్యూర్ వెజ్ రెస్టారెంట్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినట్టే ఉంటుంది. పాత కథతోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కు రప్పించడం ఆయన స్టైల్. కథ-కథనం కంటే.. హీరోకి ఉన్న ప్లస్ పాయింట్స్‌ని ఎలా వాడుకోవాలనేదానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతాడు. హీరోని ఎలా చూపిస్తే.. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు? ఎక్కడ ఏ సీన్ పెడితే నవ్వుకుంటారు? అనేది అనిల్‌కి బాగా తెలుసు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికీ ఇదే మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి కూడా అనిల్ ఆ పనే చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్‌ని గట్టిగా వాడుకొని.. ఫ్యాన్స్ ఆయన్ని తెరపై ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాగే చూపించాడు. అలా అని చిరులో ఉన్న మాస్ యాంగిల్‌ని పక్కన పెట్టలేదు. మధ్య మధ్యలో యాక్షన్ సీన్లను పెట్టి మాస్ లుక్‌ని కూడా చూపించాడు. అయితే ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే లేదు. కోపంలో విడాకులు తీసుకున్న భార్యను పొందేందుకు భర్త చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇక్కడ అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటంటే.. ఈ సింపుల్ లైన్‌కి చిరంజీవి మేనరిజాన్ని హైలెట్ చేసేలా సన్నివేశాలు అల్లుకోవడమే! ఈ మధ్య కాలంలో... ఇంకా చెప్పాలంటే రీఎంట్రీ తర్వాత చిరంజీవిని తెరపై ఇంత స్టైలిష్‌గా, ఇంత హుషారుగా ఎవరూ చూపించలేదు. ఈ రకంగా చూస్తే చిరంజీవి ఫ్యాన్స్‌కి ఇది స్పెషల్ చిత్రమే. అయితే కథగా చూస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్థాయికి సరిపోలేదనే చెప్పాలి. ఒకానొక దశలో చిరంజీవిని చిన్న కమెడియన్లా చూపించారనే ఫీలింగ్ కలుగుతుంది.ఓ రౌడీ ముఠా.. హోం మంత్రికి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. చిరు ఎంట్రీ సీన్‌తోనే అనిల్ రావిపూడి తరహా కామెడీ ప్రారంభం అవుతుంది. హుక్ స్టెప్ సాంగ్ వరకు కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇక వరప్రసాద్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. వరప్రసాద్- శశిరేఖల ప్రేమ.. పెళ్లి.. విడాకులకు దారీతీసిన సంఘటనలు అన్నీ నవ్వులు పూయిస్తాయి. స్కూల్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కథనం కాస్త బోరింగ్‌గా సాగుతుంది. బుల్లిరాజా(రేవంత్) ఎంట్రీతో మళ్లీ నవ్వులు మొదలవుతాయి. ఇలా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ప్రతి పది నిమిషాలకు ఒక కామెడీ సీన్‌ని పెట్టి ఫస్టాఫ్ ముగించాడు. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. వీరేంద్ర పాండే పాత్ర ఎంట్రీతో మళ్లీ కథనం పుంజుకుంటుంది. కథతో సంబంధం లేకున్నా.. విడాకుల అంశంపై హీరో పాత్రతో ఓ మంచి సందేశం ఇప్పించాడు. అది కూడా కామెడీగానే చూపించినా.. సినిమా చూసిన ప్రేక్షకుడు కాస్త ఆలోచిస్తాడు. ఇక వెంకటేశ్ పాత్ర ఎంట్రీతో మళ్లీ నవ్వులు స్టార్ట్ అవుతాయి. వెంకీ గౌడగా వెంకటేశ్ ఎంట్రీ నుంచి కథనం పరుగులు పెడుతుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. సాధారణ సమయంలో రిలీజ్ అయితే ఫలితం ఎలా ఉండేదో తెలియదు కానీ.. సంక్రాంతి పండక్కి వచ్చి ‘మన శంకరవరప్రసాద్’ మంచి పనే చేశాడు. ముందుగా చెప్పినట్లుగా కొత్తదనం ఆశించకుండా, లాజిక్కులు వెతక్కుండా హాయిగా నవ్వుకోవడానికి అయితే ఈ సినిమా చూడొచ్చు. (Positives And Negatives Of Mana Shankara Vara Prasad Garu Movie)ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం మెగాస్టార్ చిరంజీవినే. ఆయన లుక్స్, ఎక్స్ప్రెషన్స్, డైలాగులు.. ఇవన్నీ చూస్తే ఒకప్పటి మెగాస్టార్ మన కళ్లముందు కనిపిస్తాడు. ఒకవైపు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటూనే.. యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హుక్ స్టెప్ పాటకు ఆయన వేసిన స్టెప్పులకు థియేటర్స్‌లో విజిల్స్ వేయడం గ్యారెంటీ. శశిరేఖగా నయనతార తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. హీరో మామగారిగా సచిన్ ఖేడ్కర్ చక్కగా నటించాడు. వెంకీ గౌడ పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయాడు. చిరు-వెంకీ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటాయి. హీరో తల్లిగా జరీనా వాహబ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. నయనతారతో ఆమె చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. వరప్రసాద్ టీమ్ సభ్యులుగా నటించిన కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠంతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. భీమ్స్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. మీసాల పిల్ల, హుక్ స్టెప్ సాంగ్ తెరపై మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్..
ఏదేమైనా థ్రిల్లర్ సినిమాలు తీయడంలో కొరియన్ దర్శకుల తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో టాప్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా వీళ్ల పేర్లు ఉంటాయనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రెగ్యులర్‌కి భిన్నంగా పార్క్ చాన్ వుక్ అనే దర్శకుడు తీసిన 'నో అదర్ ఛాయిస్' గురించి మాట్లాడుకుందాం. ఇది ఓ షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్. ఇంతకీ ఇదెలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మాన్సు అనే వ్యక్తి, 25 ఏళ్లుగా ఓ పేపర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. భార్య, కొడుకుతో చాలా సింపుల్‌గా బతికేస్తుంటాడు. ఒకరోజు ఎలాంటి వార్నింగ్ లేకుండా మాన్సుని ఉద్యోగం నుంచి తీసేస్తారు. దీంతో కొత్త ఉద్యోగం కోసం మాన్సు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఎక్కడా జాబ్ దొరకదు. అప్పుడే ఇతడు ఎవరూ ఊహించని ఆలోచన చేస్తాడు. తనతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల్ని చంపేస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుంది కదా అని భావిస్తాడు. మరి తర్వాత ఏం చేశాడు? చివరకు మాన్సుకి ఉద్యోగం దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. కరోనా లాక్ డౌన్ టైంలో చాలామందికి ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇప్పటికీ రంగంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు పోతూనే ఉన్నాయి. ఎవరైనా ఉద్యోగం పోతే ఏం చేస్తారు? మరో జాబ్ చూసుకోవడం లేదా డబ్బులుంటే వ్యాపారం చేసుకుంటారు. కానీ తనతో పోటీలో ఉన్న వాళ్లని చంపేస్తే ఉద్యోగం తనకే దక్కుతుందని భావిస్తే.. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు.నిరుద్యోగం ఒక మనిషిని ఎంత క్రూరంగా మారుస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో ఈ చిత్రంలో చాలా రా(RAW)గా చూపించారు. మరో దారిలేక ఓ సామాన్యుడు చేసే హింసాత్మక పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. పెట్టుబడీదారి వ్యవస్థకు చెంపదెబ్బ లాంటి మూవీ ఇది.అలానే సినిమా చూస్తున్నంతసేపు 'దృశ్యం' గుర్తొస్తుంది. ఎందుకంటే కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఓ తండ్రి ఏ స్థాయి వరకు వెళ్లాడు? ఈ క్రమంలో హత్యలు చేసేందుకు కూడా వెనుకాడకపోవడం, చివరకు పోలీసులకు దొరకకపోవడం లాంటివి చూసినప్పుడు 'దృశ్యం'తో పోలికలు కనిపిస్తాయి. కానీ రెండు వేర్వురు కాన్సెప్టులు.ప్రారంభంలో డార్క్ కామెడీ టోన్‌లో ఉంటుంది. కాసేపటికి థ్రిల్లర్ జోన్లోకి మారిపోతుంది. అక్కడి నుంచి ఒక్కొక్కరిని మాన్సు చంపుతుంటే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఇది ముబీ ఓటీటీలో కొరియన్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కుదిరితే ఒంటరిగానే చూడండి.-చందు డొంకాన -
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : ది రాజాసాబ్నటీనటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్రచన-దర్శకత్వం: మారుతిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళనిఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: జనవరి 9,2026ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆయన నటించిన తొలి హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో రాజాసాబ్‌పై దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 9)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ(The Raja Saab Movie Review)లో చూద్దాంకథేంటంటే..రాజు అలియాస్ రాజాసాబ్(ప్రభాస్)కి నాన్నమ్మ గంగాదేవి(జరీనా) అంటే ప్రాణం. ఆమెకు అల్జీమర్స్ వ్యాధి సోకడంతో ఏ విషయానైనా ఎక్కువసేపు గుర్తుపెట్టుకోదు. కానీ తనకు దూరమైన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. ఎప్పటికైనా భర్తను కలవాలని..అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయన హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి..తాత కోసం రాజాసాబ్ సిటీకి వెళ్తాడు. అక్కడ బ్లెస్సీ(నిధి అగర్వాల్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అదే సమయంలో అతన్ని వెతుక్కుంటూ వచ్చిన భైరవి(మాళవిక మోహన్)..రాజాసాబ్తో ప్రేమలో పడుతుంది. ఆమె ద్వారా తాత నర్సాపూర్ అడవిలో ఉన్న ఓ కోటలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ కోటలోకి వెళ్లిన తర్వాత రాజాసాబ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? చనిపోయిన తాత ఆత్మ ఆ కోటలోనే ఎందుకు ఉంది? కనకరాజు నేపథ్యం ఏంటి? దేవనగర సామ్రాజ్యపు జమీందారి అయిన గంగా... సామాన్యురాలిగా ఎందుకు బతకాల్సి వచ్చింది? ఈ కథలో గంగరాజు(సముద్రఖని) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే( The Raja Saab Movie Review). ఎలా ఉందంటే..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా అనగానే మారుతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అయితే టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ట్రోల్ చేసిన వాళ్లే మారుతిపై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్‌ని స్టైలీష్ లుక్‌లో చూపించడమే కాకుండా ఆయనలో దాగిఉన్న కామెడీ యాంగిల్‌ని చాలాకాలం తర్వాత మరోసారి బయటకు తీశాడని మారుతిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకరకంగా ట్రైలర్ రిలీజ్ తర్వాతే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను మాత్రం మారుతి పూర్తిగా అందుకోలేకపోయాడు. ప్రభాస్ ఇమేజ్‌కి తగ్గట్లుగానే కథను రాసుకున్నా.. దాన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ప్రభాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెటుకోనే కొన్ని అనవసరపు సన్నివేశాలను ఇరికించి..అసలు కథకి అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది.ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చెప్పినట్లుగా ఇది నాన్నమ్మ-మనవడి కథే. నేపథ్యం కూడా కాస్త కొత్తగానే ఉంది. అయితే ఈ కథని గందరగోళం లేకుండా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. సీన్ల పరంగా చూస్తే సినిమా బాగుంది అనిపించినా.. ఓవరాల్‌గా మాత్రం ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ కలుగుతుంది. మారుతి రాసుకున్న కామెడీ సన్నివేశాలు.. ప్రభాస్ నటన ఆ లోపాన్ని కాస్త కప్పిపుచ్చాయనే చెప్పాలి. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ మెండుగానే ఉన్నా.. ఒకటి,రెండు సీన్లు తప్ప మిగతావేవి భయపెట్టలేదుకమెడియన్ సత్య కోటలోకి అడుగుపెట్టే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సాంగ్‌తో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం కాసేపు నాన్నమ్మ-మనవడిల చుట్టూనే తిరుగుతుంది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగుంటాయి. తాత కోసం హీరో హైదరాబాద్ వెళ్లడం..అక్కడ బ్లెస్సీ, భైరవిలతో ప్రేమాయణం..ఇవన్నీ ఎంటర్టైనింగ్గా సాగుతూనే..మధ్యలో గంగరాజు పాత్రని చూపిస్తూ.. ఆయనకు తాతకు మధ్య ఏదో సంబంధం ఉందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిపించారు. ఇక తాత నేపథ్యం చెప్పినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. కనకరాజు-గంగాదేవి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. (Positives And Negatives In Rajasaab Movie)ఇక ద్వితీయార్ధంలో కథనం మొత్తం అడవిలొ ఉన్న కోట చుట్టూనే తిరుగుతుంది. ఆ కోట నుంచి బయటకు వెళ్లేందుకు హీరో బృందం ప్రయత్నించడం.. వారిని తాత ఆత్మ అడ్డుకోవడం.. ఈ క్రమం వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సన్నివేశాలు మారుతి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రమ్ మూవీని గుర్తుకు చేస్తాయి. హారర్ కంటే కామెడీ, రొమాంటిక్ సీన్లే బాగా పేలాయి. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఆస్పత్రి సీన్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. క్లైమాక్స్ కొత్తగా ప్రయత్నించారు. ఇంతకు ముందుకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ క్లైమాక్స్ ఉంటుంది. ఎవరెలా చేశారంటే..చాలా కాలం తర్వాత ప్రభాస్‌ని తెరపై కొత్తగా చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాను నిలబెట్టింది. సీరియస్ విషయాన్ని కూడా కాస్త వెటకారంగా చెబుతూ..నాన్నమ్మ కోసం ఎంతకైనా తెగించే రాజాసాబ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. ఆయన పంచ్‌లు, ఫైట్స్ అన్నీ వింటేజ్ ప్రభాస్‌ని గుర్తు చేస్తాయి. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ ఇరగదీశాడు. ఆస్పత్రి సీన్లో ప్రభాస్ నటన అదిరిపోతుంది. హీరోయిన్లలో మాళవికకు కాస్త నిడివి ఎక్కువే. నిధి తెరపై అందంగా కనిపించింది. రిద్ధి పాత్రకు అంత ప్రాధాన్యతలేదు.. నిడివి కూడా చాలా తక్కువే. నాన్నమ్మ గంగాదేవిగా జరీనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సంజయ్ దత్ కూడా చూపులతో విలనిజం పండించాడు. నటనకు స్కోప్‌లేదు. ఎక్కువగా గ్రాఫిక్స్‌లోనే ఆయన్ని చూపించారు. ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేశ్, సప్తగిరి కొన్ని చోట్ల నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. కానీ వాటి ప్లేస్మెంట్ సరిగా కుదర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతిఫ్రేమ్ తెరపై రిచ్‌గా కనిపించింది. ఆర్ట్‌వర్క్ బాగుంది. అయితే కోట సెట్ అనే విషయం తెలిసిపోతుంది. సహజత్వం లోపించింది. ఎడిటర్ తన కత్తెరకు బాగానే పని చెప్పాల్సింది. ఈ సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని తొలగించి నిడివి( 3 గంటల 9నిమిషాలు) తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఖర్చు విషయంలో ఎక్కగా తగ్గలేదని సినిమా చూస్తే అర్థవమవుతుంది.- అంజిశెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్‌లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ది రాజాసాబ్ వచ్చేశాడు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్రీమియర్స్‌తో ఫ్యాన్స్ ముందుకొచ్చేశాడు. ఏపీలో ది రాజాసాబ్ ప్రీమియర్స్‌తో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. ఈ మూవీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.ది రాజాసాబ్‌లో ప్రభాస్ నటన అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంజయ్ దత్ ఎంట్రీ చాలా భయానకంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.హీరోయిన్ రిద్ది కుమార్ దాదాపు 5 నిమిషాల పాటు కనిపిస్తుందని.. నిధి అగర్వాల్ మొదటి 30 నిమిషాల తర్వాతే ఎంట్రీ ఇచ్చిందని పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి లుక్, నటన అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్ ఎంట్రీ ఆలస్యమైనా అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో చివరి 30 నిమిషాల్లో కనిపించిన మాళవిక ఫైట్ సీన్లో అదరగొట్టేసిందని అంటున్నారు.సెకండాఫ్‌లో కూడా అలరించిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మొసళ్లతో ఫైట్ అదిరిపోయిందని పోస్ట్ చేస్తున్నారు. చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ అని రాసుకొస్తున్నారు. ప్రభాస్ ఫర్మామెన్స్తో అదరగొట్టేశాడని చెబుతున్నారు. చివరి 40 నిమిషాల్లో ఎస్ఎస్ తమన్ బీజీఎం అద్భుతమని అంటున్నారు. Hospital sequence ➡️ crocodile fight ➡️ climax 🔥The last 30 minutes are the SOUL of the film.#Prabhas delivers a performance with par excellence 👌 Trying something different and nailing it.Brilliant writing by @DirectorMaruthi 👌 Truly surprising!@MusicThaman is the…— Suresh PRO (@SureshPRO_) January 8, 2026 #TheRajaSaab – First Half Review— STORY – #RajaSaab is about the hero’s journey in search of his grandfather.— #Prabhas’ performance is good. Each reaction he gives works well.Prabhas’ intro scene is superb.— #RiddhiKumar appears for about 5 minutes so far. Her look is… pic.twitter.com/Mj8iHpZbc9— Movie Tamil (@_MovieTamil) January 8, 2026 Musk changed like ❤️ button to celebrate 🔥🔥🔥 the release of #TheRajaasaab #TheRajaSaab #Prabhas𓃵 @prabhas pic.twitter.com/OmVMnJVyWS— R A J (@dune1411) January 8, 2026 -
బెట్టింగ్ రాయుళ్ల ఆటకట్టించే యువకుడి కథ.. బ్రాట్ మూవీ రివ్యూ
టైటిల్: బ్రాట్నటీనటులు: డార్లింగ్ కృష్ణ, మనీషా కంద్కూర్డైరెక్టర్: శశాంక్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ బ్రాట్. గతేడాది అక్టోబరు 31న థియేటర్లలోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..క్రిస్టీ(డార్లింగ్ కృష్ణ) తన జీవితాన్ని డెలివరీ బాయ్‌గా ప్రారంభిస్తాడు. ఎంత కష్టపడినా డబ్బులు సరిపోకపోవడంతో తనలో తానే బాధపడుతుంటాడు. అలా ఓ రోజు కారులో కుక్కను చూసిన క్రిస్టీ ఊహించని విధంగా రియాక్ట్ అవుతాడు. ఆ తర్వాత డబ్బు కోసం క్రికెట్ బెట్టింగ్ వైపు అడుగులు వేస్తాడు. ఫుల్‌గా డబ్బు సంపాదిస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో తన ఫ్రెండ్‌కు జరిగిన సంఘటన చూసి ఓ నిర్ణయం తీసుకుంటాడు. అసలు డబ్బు కోసం క్రిస్టీ క్రికెట్ బెట్టింగ్‌నే ఎందుకు ఎంచుకున్నాడు? తన ఫ్రెండ్‌కు అసలేం జరిగింది? క్రిస్టీ తండ్రి మహదేవయ్యకు తన కుమారుడితో ఉన్న ఇబ్బందులు ఏంటి? చివరికీ బెట్టింగ్‌నే కెరీర్‌గా మార్చుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే బ్రాట్ చూడాల్సిందే.బ్రాట్ ఎలా ఉందంటే..ఈ రోజుల్లో క్రికెట్ బెట్టింగ్ అనేది కామన్ వర్డ్ అయిపోయింది. ఈ పదం కేవలం నగరాల్లోనే కాదు.. పల్లెలకు కూడా పాకిపోయింది. అలాంటి ఈ బెట్టింగ్ కాన్సెప్ట్‌గా వచ్చిన చిత్రమే బ్రాట్. అలా ఈ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ శశాంక్ కథను తెరకెక్కించాడు. ఓ యువకుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాడు. క్రిస్టీ బెట్టింగ్.. అతని తండ్రి పోలీస్ కావడంతో ఈ స్టోరీపై ఆసక్తిని పెంచేశాడు. పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైన క్రిస్టీ బెట్టింగ్ వైపు ఎందుకు వెళ్లాడనేది ప్రేక్షకుడికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయం క్లైమాక్స్ వరకు ఎక్కడా ప్రేక్షకుడికి అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంతా క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు సంపాదించడం.. పోలీసులకు దొరక్కుండా మేనేజ్ చేయడం.. మనీషాతో క్రిస్టీకి పరిచయం.. అది కాస్తా ప్రేమగా మారడం ఇలాంటి సంఘటనలతో కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండానే సాగుతుంది.ఒకసారి బెట్టింగ్ కేసులో క్రిస్టీని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైతో క్రిస్టీ చెప్పిన మాటలతో దర్జాగా బయటికొచ్చేస్తాడు. ఆ తర్వాత ఈ బెట్టింగ్ సామ్రాజ్యం ఊహించని మలుపులు తిరుగుతుంది. బెట్టింగ్‌లో డాన్‌గా ఉన్న డాలర్ మనీకి(విలన్).. క్రిస్టీకి మధ్య జరిగే సీన్స్ కామెడీగా అనిపించినా.. సీరియస్‌నెస్ కనిపిస్తుంది. ఈ కథలో కామెడీకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. దర్శకుడు విలన్‌తోనే ప్రేక్షకుడిని నవ్వించిన తీరు ఆకట్టుకుంటుంది. తన కుమారుడు బెట్టింగ్‌లో పడి ఏమైపోతాడోనని బాధపడుతున్న తండ్రికి క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. క్లైమాక్స్ వరకు ఎక్కడా రివీల్ చేయకుండా కథ నడిపించిన శశాంక్.. చివర్లో వచ్చే ట్విస్టులతో ప్రేక్షకుడిని ఫూల్ చేసినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే సింపుల్ కాన్సెప్ట్ అయినప్పటికీ.. నిడివి ఎక్కువ కావడంతో సెకండాఫ్ కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. బెట్టింగ్తో పాటు ఓ మేసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. వీకెండ్లో సీరియస్‌నెస్‌తో పాటు కామెడీ ఎంజాయ్ చేయాలనుకుంటే బ్రాట్ చూసేయొచ్చు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఆసక్తి ఉంటే ఓ లుక్ వేయొచ్చు.ఎవరెలా చేశారంటే..డార్లింగ్ కృష్ణ నటనే ఈ సినిమాకు బలం. హీరోగా తన హవాభావాలతో మెప్పించాడు. క్రిస్టీ ప్రియురాలిగా మనీషా కంద్కూర్ అదరగొట్టేసింది. గ్లామర్ అంతగా లేకపోయినా ఈ కథకు బాగానే సెట్ అయింది. అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర, డ్రాగన్ మంజు తమ పాత్రల్లో మెప్పించారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎడిటింగ్ అనవసర సీన్స్ ఇంకా కట్ చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నతంగా ఉన్నాయి. -
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
సినిమా ఇలానే తీయాలి, స్టోరీ ఇలానే ఉండాలి అనేది ఒకప్పటి మాట. ఇప్పుడొస్తున్న చాలామంది దర్శకులు, రచయితలు డిఫరెంట్ కథలతో మూసధోరణికి భిన్నంగా మూవీస్ తీస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. రీసెంట్ టైంలో అలా దక్షిణాదిలో హాట్ టాపిక్ అయిపోయిన మలయాళ చిత్రం 'ఎకో'(Eko Movie). థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)కథేంటి?కేరళలోని కాట్టుకున్న అటవీ ప్రాంతంలో ఎత్తయిన ఓ కొండపై మిలాతీ(బియానా మోమిన్) అనే వృద్ధురాలు నివసిస్తూ ఉంటుంది. ఈమె కేర్ టేకర్ పీయూస్(సందీప్ ప్రదీప్). ఈ కుర్రాడిని మిలాతీ కొడుకులు నియమిస్తారు. అలానే మలేసియా జాతికి చెందిన పదుల కుక్కలు.. ఈమెని జాగ్రత్తగా కాపలా కాస్తుంటాయి. అయితే ఈమె భర్త కురియాచన్ (సౌరభ్ సచ్దేవ్) కోసం ఓ నేవీ అధికారి(నరైన్), కురియాచన్ స్నేహితుడు మోహన్ పోతన్(వినీత్) తదితరులు వెతుకుతూ ఉంటారు. ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపిన తర్వాత నుంచి కురియాచన్ కనిపించకుండా పోతాడు. ఇతడు తన కుక్కల సాయంతో దట్టమైన అడవిలో దాక్కున్నాడనేది అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కురియాచన్ ఆచూకీ ఎవరూ కనిపెట్టలేకపోతారు. ఇంతమంది ఇతడి కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఇందులో కుక్కల పాత్రేంటి? మలేసియాకు చెందిన మిలాతీ.. కేరళ వచ్చి ఎందుకు బతుకుతోంది? అనేది అసలు కథ.ఎలా ఉందంటే?థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫార్మాట్ అంటూ ఏం ఉండదు. చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు చాలా సాదాసీదా స్టోరీలా అనిపించాలి. ఒక్కో ట్విస్ట్ బయటపడుతుంటే ఆశ్చర్యపోవాలి. 'ఎకో' కూడా అలాంటి ఓ మూవీనే. గతంలో 'కిష్కిందకాండం' లాంటి థ్రిల్లర్ మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు దింజిత్ అయ్యతన్- రచయిత బహుల్ రమేశ్ కాంబో.. ఇప్పుడు ఈ చిత్రంతో వచ్చారు. మరోసారి హిట్ కొట్టారు. ఆ మూవీలో కోతులు కీలక పాత్ర పోషించగా.. ఇందులో కుక్కలు కీ రోల్ ప్లే చేశాయి.సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి, చివరకు దొరికాడా లేదా? అనేదే మెయిన్ పాయింట్. కాకపోతే ఈ కథకు మలేసియా కుక్కల జాతిని లింక్ చేసి, కర్ణాటక-కేరళ సరిహద్దుల్లోని అడవుల్ని చూపిస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్లే జోడించారు. ప్రారంభంలో ఏం జరుగుతుందో అర్థం కాక తికమకగా అనిపిస్తుంది కానీ ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ క్లైమాక్స్ వచ్చేస్తుంది. అప్పటికీ ఏదో అర్థం కాలేదే అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే క్లైమాక్స్ నుంచి స్టోరీని వెనక్కి అనాలసిస్ చేసుకుంటూ వెళ్లండి. అప్పుడు అరె భలే తీశార్రా అనిపిస్తుంది.సైకో కిల్లర్స్‌ని చూసి మనం భయపడతాం. కానీ చాలా సాదాసీదా బతుకుతూ తమ పనికి అడ్డం వచ్చేవారిని తెలివిగా తప్పించే వారి గురించి తెలిసినప్పుడు మనకు ఒళ్లు జలదరిస్తుంది. ఇది కూడా అలాంటి పాయింట్‌తో తీసిన సినిమా. చాలా మలయాళ చిత్రాల్లానే ఇందులోనూ స్లో నెరేషన్ ఉంది. కాకపోతే అడవుల విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. మెయిన్ స్టోరీకి మలేసియాకు చెందిన కుక్కల జాతికి ఉన్న లింక్ కూడా ఆశ్చర్యపరుస్తుంది. స్టోరీలో ఉన్న ట్విస్టులు చాలా చిన్నవే కానీ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ వల్ల అవి డిఫరెంట్‌గా అనిపిస్తాయి.సినిమాల్లో టెక్నికల్ విషయాలు బాగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతోనూ చూడొచ్చు. సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్దేవ్, బియానా మోమిన్, వినీత్, నరైన్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీళ్లందరి సంగతి పక్కనబెడితే అసలు కుక్కలతో ఇంత బాగా ఎలా యాక్టింగ్ చేయించగలిగారా అనే సందేహం కచ్చితంగా వస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ వాడారో లేదో తెలీదు గానీ మూవీ అంతా చాలా సహజంగా.. మనం కూడా కొండపై, అడవుల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. స్టోరీ నెమ్మదిగా ఉన్నాసరే పర్లేదు డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం 'ఎకో' బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్) -
'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'స్ట్రేంజర్ థింగ్స్' గురించే మాట్లాడుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్లకు కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలియని వాళ్లకు దీని గురించి వివరించాలంటే ఇదో ఫాంటసీ థ్రిల్లర్ అడ్వెంచరస్ సిరీస్. 2016లో మొదలై 2026లో ముగిసింది. న్యూఇయర్ సందర్భంగా చిట్టచివరి ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. పదేళ్ల పాటు సాగిన ఈ సిరీస్‌కి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ వేశారు. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంటుంది? ఎందులో చూడొచ్చు? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్ స్కామ్‌పై వెబ్ సిరీస్.. విడుదలకు లైన్ క్లియర్)కథేంటి?అమెరికాలోని హాకిన్స్ అనే గ్రామం. మైకేల్, విలియమ్, లూకస్, డస్టిన్ అనే నలుగురు పిల్లలు. ఓ రోజు రాత్రి మైకేల్ అలియాస్ మైక్ ఇంట్లో అందరూ కలిసి డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడతారు. పూర్తయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్తారు. విలియమ్ అలియాస్ విల్ మాత్రం కనిపించకుండా పోతాడు. ఇంతకీ విల్ ఏమయ్యాడు? మరోవైపు ఫ్రెండ్ కోసం వెతుకుతుండగా.. మిగిలిన ముగ్గురు పిల్లలకు ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతమేంటి? విల్ని కనిపెట్టడంలో ఈమె ఎలాంటి పాత్ర పోషించింది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమాలు చూడటం మనకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. 2-3 గంటల్లో ఇవి ముగిసిపోతాయి. కాకపోతే కొన్నేళ్లుగా పెరిగిన ఓటీటీ కల్చర్ వల్ల పరభాషా సినిమాలు, వెబ్ సిరీస్‌లు మనకు పరిచయమయ్యాయి. అలాంటి వాటిలోని ఓ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్'. తెలుగు ప్రేక్షకుల్లో దీన్ని ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఎందుకంటే 2016 నుంచి ఇది సీజన్ల వారీగా స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. లాక్డౌన్ టైంలో దీనికి మన దేశంలోనూ విపరీతమైన పాపులారిటీ వచ్చింది.ఇదో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్. ఓ చిన్న గ్రామంలో నలుగురు పిల్లలకు ఓ సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయికి స్నేహం ఏర్పడితే తర్వాత ఏమైందనేదే స్టోరీ లైన్. కాకపోతే పిల్లాడు తప్పిపోవడంతో మొదలయ్యే ఈ సిరీస్.. తర్వాత అనుహ్యమైన మలుపులు, అద్భుతమైన సన్నివేశాలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మర్చిపోలేని పాత్రలు.. ఇలా ప్రతి దశలోనూ ఆశ్చర్యపరుస్తుంది. చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ అర్థమయ్యాలా ఉండటం ఈ సిరీస్ స్పెషాలిటీ.పదేళ్ల పాటు సాగిన ఈ సిరీస్‌లో మొత్తంగా 42 ఎపిసోడ్స్ ఉంటాయి. తొలి మూడు సీజన్లలో ఒక్కో ఎపిసోడ్ సగటున 50 నిమిషాల పాటు ఉంటుంది. నాలుగో సీజన్లో మాత్రం ఎపిసోడ్ యావరేజ్ గంట 10 నిమిషాలు. రీసెంట్గా రిలీజైన ఐదో సీజన్లోనూ ఒక్కో ఎపిసోడ్ గంటకు పైనే నిడివితో ఉంటుంది. జనవరి 1న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఫినాలే ఎపిసోడ్ అయితే ఏకంగా 2 గంటలు ఉంది.మిగిలిన సిరీస్‌ల కంటే 'స్ట్రేంజర్ థింగ్స్' ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం స్టోరీ చెప్పిన విధానం. ఇందులో డార్క్ హారర్ ఎలిమెంట్స్, ఉలిక్కిపడేలా చేసే జంప్ స్కేర్ సీన్లకు కొదవలేదు. తొలి మూడు సీజన్లలో హారర్ అంశాలు ఓ రేంజులో ఉంటే నాలుగో సీజన్లో అంతకు మించి అనేలా ఉంటుంది. కేవలం విజువల్స్ అనే కాదు సౌండ్, పాత్రలు, నిర్మాణ విలువలు ఒకటేమిటి ఇలా సిరీస్‌లోని ప్రతి అంశం ఆశ్చర్యపరుస్తుంది. మరి ముఖ్యంగా విలన్ వెక్నా, మైండ్ ఫ్లయిర్ని చూస్తే భయమేస్తుంది.ఈ సిరీస్ అంతా కూడా 80ల్లో జరుగుతుంది. అందుకు తగ్గట్లే అప్పటి పరిస్థితులు, దుస్తులు, వస్తువులు.. ఇలా ప్రతి ఒక్క దాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. ఈ సిరీస్ మొత్తం బడ్జెట్ రూ.5000-6000 కోట్ల పైనే ఉంటుంది! వ్యూస్ కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఉంది కానీ బూతులు ఎక్కువ. వీలైతే ఇంగ్లీష్ వెర్షన్లోనే చూడండి. ఈ సిరీస్‌ని మీరు ఒక్కసారి చూడటం మొదలుపెట్టారంటే అయిపోయేంతవరకు అస్సలు ఆపరు.గత నెలరోజుల్లో చిట్టచివరిదైన ఐదో సీజన్‌ని మూడు భాగాలుగా రిలీజ్ చేశారు. తొలి నాలుగు సీజన్లు వావ్ అనేలా ఉంటాయి. చివరి దానిలో మాత్రం వావ్ ఫ్యాక్టర్స్ కంటే వీలైనంత ఎమోషనల్ కంటెంట్ ఉండేలా దర్శకద్వయం ఢప్పర్ బ్రదర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సిరీస్‌కి ఎలాంటి ముగింపు ఇస్తారా అని అందరూ ఎదురుచూశారు. కానీ చాలా సింపుల్‌గా తేల్చేయడం ఈ సిరీస్ ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు. ప్రస్తుతానికైతే భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎలెవన్ పాత్ర చనిపోయిందా? బతికుందా అనే విషయాన్ని ప్రేక్షకులకే వదిలేశారు.ఐదో సీజన్లలో ఈ సిరీస్‌ని ముగించారు. కానీ దీనికి 'స్పిన్ ఆఫ్' ఉంటుందని దర్శకద్వయం చెప్పుకొచ్చారు. దీని పేరు కూడా 'స్ట్రేంజర్ థింగ్స్' అనే పెడతామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు వచ్చిన సిరీస్ 1980ల్లో హాకిన్స్ అనే ఊరిలో జరిగింది. స్పిన్ ఆఫ్‌లో భాగంగా ప్రస్తుత కాలంలో మరో ఊరిలో జరిగే కథతో కొత్త సిరీస్ తీయబోతున్నారు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'రంగస్థలం'లో ఆ పాట సుకుమార్‌కి నచ్చలేదు.. ఎవరూ ఏడవకపోవడంతో) -
సఃకుటుంబానాం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: సఃకుటుంబానాంనటీనటులు..: రామ్ కిరణ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ తదితరులుదర్శకుడు..: ఉదయ్ శర్మనిర్మాతలు..: మహదేవ్ గౌడ్, నాగరత్నవిడుదల తేదీ..: జనవరి 01, 2026రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన తాజా చిత్రం సకుటుంబానాం. ఉదయ్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సాధారణ మధ్యతరగతి కుటుంబంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి (రామ్ కిరణ్) తన కుటుంబంపై అపారమైన ప్రేమ చూపిస్తాడు. అతనిది ప్రశాంతమైన జీవితం.. మంచి జీతం. అయితే ఒక అమ్మాయి తన టీమ్‌లో చేరడంతో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. అలా ఆమెను తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. కానీ ఆమె రాకతో కుటుంబంలో వచ్చే పరిణామాలు ఏంటి? ఆ తర్వాత బయటపడే రహస్యాలు.. అతని జీవితంలో వచ్చే పరివర్తనలు ఏంటి? చివరికి కుటుంబం మొత్తం ఐక్యంగా ఉంటుందా? అసలు అతనికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? విలన్ వారి జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తాడు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..కుటుంబ విలువలను, విభేదాలను ఎలా సమతుల్యం చేయాలో దర్శకుడు చూపించాడు. అవీ కుటుంబ బంధాలను ఎంత బలోపేతం చేస్తాయో ఈ కథలో మేసేజ్ ఇచ్చాడు. కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన సకుటుంబానాం టైటిల్ తగ్గట్టుగానే కథను ఎంచుకున్నారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ ఉద్యోగం, ప్రేమ చుట్టే కథ తిరుగుతుంది.ఇక సెకండాఫ్‌లోనే అసలు కథ మొదలవుతుంది. కుటుంబంలో జరిగే పరిణామాల చుట్టే స్టోరీని నడిపించాడు. అక్కడక్కడా కొన్ని సీన్స్ రోటీన్‌గా అనిపిస్తాయి. ప్రేక్షకుడి బోర్ కొట్టించేలా కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. కథ పరంగా డైరెక్టర్ తన విజన్‌కు తగినట్లుగానే తెరకెక్కించాడు. తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను ప్రేక్షకుడికి వివరించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సరికొత్త కథాంశంతో వెండితెరను అలరించడంలో దర్శకుడు ఉదయ్ శర్మ విజయవంతమయ్యాడు. ఓవరాల్‌గా చూస్తే కుటుంబ సమేతంగా చూడదగిన అద్భుత చిత్రమే సకుటుంబానాం.ఎవరెలా చేశారంటే..హీరోగా పరిచయమైన రామ్ కిరణ్ తన డ్యాన్స్, నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మేఘ ఆకాష్ తనదైన నటనతో అదరగొట్టేసింది. రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలో జీవించేశాడు. బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, భద్రం, నిత్య, రచ్చ రవి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. సినిమాటోగ్రాఫర్ మధు దాసరి పనితీరు బాగుంది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు, నృత్యాలు సినిమాకు పెద్ద ప్లస్. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. శశాంక్ మలి తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది.రేటింగ్ : 2.5 /5 -
‘సైక్ సిద్ధార్థ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యంగ్ హీరో నందు, యామినీ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ్’. ‘మీలాంటి యువకుడి కథ’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డిలతో కలిసి సురేష్‌ప్రోడక్షన్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే రోజు అఖండ 2 రిలీజ్ అవ్వడంతో చివరి నిమిషంలో జనవరి 1కి వాయిదా వేశారు. ట్రైలర్ రిలీజ్ కంటే ముందు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ ట్రైలర్లో బూతు పదాలు పెట్టడం..అవి కాస్త వైరల్ అవ్వడంతో సైక్ సిద్ధార్థ్‌పై హైప్ క్రియేట్ అయింది. యూత్ టార్గెట్‌గా నేడు (జనవరి 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నందు ఖాతాలో హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.(Psych Siddhartha Telugu Movie Review)కథేంటంటే..హైదరాబాద్‌కి చెందిన యువకుడు సిద్ధార్థ (శ్రీ నందు), పబ్‌లో పరిచయం అయిన త్రిష(ప్రియాంక రెబెకా శ్రీనివాస్) అనే అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. ఆమె కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టాలనుకుంటాడు. బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మన్సూర్(సుఖేష్ రెడ్డి)తో పాటు ప్రియురాలు త్రిష కూడా ఉంటారు. చివరకు మన్సూర్, త్రిష కలిసి సిద్ధార్థను మోసం చేస్తారు. వాళ్లిద్దరూ రిలేషన్షిప్లో పడి సిద్ధార్థను కంపెనీ నుంచి బయటకు గెంటేస్తారు. ఉన్న డబ్బంతా వాళ్లే దోచుకోవడంతో అద్దె కూడా సరిగా కట్టలేక.. బస్తీలో ఓ చిన్న ఇంట్లోకి అద్దెకు దిగుతాడు సిద్ధార్థ. అదే బిల్డింగులోకి భర్త చేతిలో చిత్ర హింసలు అనుభవిస్తున్న శ్రావ్య(యామిని భాస్కర్) కూడా రెంట్‌కి దిగుతుంది. శ్రావ్యతో పరిచయం సిద్ధార్థ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.(Psych Siddhartha Movie Story)విశ్లేషణకొన్ని సినిమాలకు కథ ఉండదు కానీ కథనంతో మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. అలాంటి మ్యాజికే సైక్ సిద్ధార్థ్ సినిమాలో చేసేందుకు ప్రయత్నించాడు దర్శకుడు వరుణ్ రెడ్డి. రొటీన్ కథనే తెరపై డిఫరెంట్‌గా చూపించాలకున్నాడు. అయితే ఆ ప్రయత్నం దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. కథనం కొత్తగా ఉన్నా..కథలో బలం లేకపోవడంతో ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా రెండు ప్రధాన పాత్రల పరిచయం తర్వాత కథనం మొత్తం ఊహకందేలా సాగడం మరో మైనస్. అయితే ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మాత్రం యువతను..ముఖ్యంగా జెన్ జీ బ్యాచ్‌ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అదే సమయంలో అవసరానికి మించిన అడల్ట్ సీన్లు పెట్టి.. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేశారు. (Psych Siddhartha Strengths And Weaknesses)అమ్మాయి కోసం అర్థ నగ్నంగా పరుగెడుతున్న సిద్ధార్థ్ పాత్ర పరిచయ సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పరుగు ఎవరి కోసం అనేది చివరిలో చూపించారు. ఫస్టాఫ్ అంతా సిద్ధార్థ్ పాత్ర చుట్టూనే తిరుగుంది. త్రిషతో పరిచయం.. మన్సూర్ మోసం.. బస్తీలో రెంట్‌కి దిగడం.. ఇలా రొటీన్‌గా సాగుతుంది. అయితే ఇక్కడ స్క్రీన్‌ప్లేతోనే మ్యాజిక్ చేశారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కథనాన్ని నడిపించి ఆకట్టుకున్నారు. ఇంటర్వెల్ సీన్‌తో క్లైమాక్స్ కథను ఊహించొచ్చు. ఉన్నంతలో సెకండాఫ్ కాస్త బెటర్. ఒకటి రెండు ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే సినిమాకు ప్రధాన బలమైన సిద్ధార్థ పాత్రకు సరైన బ్యాక్ స్టోరీ లేకపోవడంతో.. ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోయారు. ముందుగా చెప్పినట్లుగా జెన్ జీ బ్యాచ్ మాత్రమే ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నటీనటులు విషయానికొస్తే... సిద్ధార్థ్ పాత్రలో నందు జీవించేశాడు. ఇంతకు ముందు ఎప్పుడూ నందు అలాంటి పాత్రలో నటించలేదు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం అంతా తెరపై కనిపించింది. టైటిల్‌కి తగ్గట్లుగానే ఆయన చేసే సైకో చేష్టలు.. ఓ వర్గాన్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి. సింపుల్ సీన్స్ కూడా తన నటనతో మరోస్థాయికి తీసుకెళ్లాడు. శ్రావ్య పాత్రకు యామిని భాస్కర్ పూర్తి న్యాయం చేసింది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. హీరో ప్రియురాలు త్రిషగా ప్రియాంక రెబెకా బాగా నటించింది. డబ్బులంటే పిచ్చి ఉన్న మోడ్రన్ అమ్మాయి పాత్ర తనది. నందు ఫ్రెండ్ రేవంత్ పాత్రలో నటించిన వ్యక్తితో పాటు మిగిలినవారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. స్మరన్ సాయి నేపథ్య సంగీతం డిఫెరెంట్‌గా ఉంది. ఎడిటింగ్ కొత్తగా ఉంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
సైకలాజికల్ థ్రిల్లర్ 'షట్టర్ ఐలాండ్' మూవీ రివ్యూ
ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు క్రేజెక్కువ. అలాంటి ఓ థ్రిల్లర్ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. హాలీవుడ్ స్టార్ లినార్డో డికాప్రియో ప్రధాన పాత్ర పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షట్టర్ ఐల్యాండ్. మార్టిన్ స్కోర్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు,మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులో ఉంది.. ఆ సినిమా రివ్యూ చూసేద్దాం..కథషట్టర్ ఐలాండ్ ద్వీపంలో ఓ పిచ్చి ఆసుపత్రి ఉంటుంది. క్రూరమైన హింసలు చేసిన ఖైదీలకు ఆ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుంటారు. అక్కడ ఓ ఖైదీ/రోగి తప్పించుకుందన్న విషయం తెలిసి హీరో టెడ్డీ ఒక మార్షల్‌గా (పోలీస్‌గా) తన పార్ట్నర్తో కలిసి ఆ హాస్పిటల్‌కు వెళ్తాడు. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు విచారణ మొదలు పెడతారు. అయితే అక్కడ అందరి ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది. హీరో కేవలం ఖైదీని కనిపెట్టడం కోసమే రాడు.. ఆస్పత్రిలో కొన్ని అసాధారణమైనవి జరుగుతున్నాయని అతడి అనుమానం. మానసికంగా జబ్బుపడినవారి మెదడుపై అక్కడ ప్రయోగాలను చేస్తున్నారని దాన్ని ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటాడు. తుపానును సైతం లెక్క చేయకుండా విచారణ కొనసాగిస్తాడు. ఈ క్రమంలో తన పార్ట్నర్ను కోల్పోతాడు. అక్కడి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతోంది? ఆ మిస్టరీని హీరో చేధించాడా? లేదా? అతడి సహచరుడు ఏమయ్యాడు? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే?సినిమా ప్రారంభంలో మనం కూడా మిస్టరీ కోసం కళ్లు పెద్దవి చేసుకుని చూస్తాం. కానీ మూవీ ఎంత ముందుకు కదిలినా ఒక్క మిస్టరీ కూడా బయటపడదు. మరోవైపు హీరో అనారోగ్యానికి గురవుతుంటాడు. అతడి గతం తాలూకు ఊహలు, పీడకలలు ఆయన్ని వెంబడిస్తుంటాయి. దీనికి తోడు మైగ్రేన్.. ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగేందుకు వైద్యుడు టెడ్డీకి మందులిస్తాడు. ఈ మందులవల్ల తనను మానసిక రోగిని చేస్తున్నారేమోనన్న భయంతో హీరో వాటిని వేసుకునేందుకు నిరాకరిస్తాడు. ఇదంతా బాగానే ఉంటుంది.. కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో రివీల్ చేస్తారు. అప్పుడు హీరోలాగే మనక్కూడా ఏది నిజం? ఏది అబద్ధం? అని కొంతసేపు అయోమయానికి గురవుతాం. చివరకు హీరో పరిస్థితి చూసి జాలిపడకుండా ఉండలేం. క్లైమాక్స్ కాస్త నిరుత్సాహానికి గురిచేసినా సినిమా మాత్రం ఆసక్తికరంగా కొనసాగుతుంది. హీరో యాక్టింగ్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వర్కవుట్ అయింది. వీలున్నప్పుడు కచ్చితంగా ఓసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. -
మోహన్ లాల్ వృషభ మూవీ రివ్యూ.. ఆడియన్స్‌ను మెప్పించిందా?
టైటిల్: వృషభనటీనటులు: మోహన్ లాల్, సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, అజయ్ తదితరులుదర్శకత్వం: నందకిశోర్విడుదల తేదీ..డిసెంబర్ 25, 2025మలయాళ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రియుల గుండెల్లో నిలిచిపోయారు. ఈ ఏడాది తుడురమ్, ఎంపురాన్-2, హృదయపూర్వం చిత్రాలతో అలరించారు. తాజాగా మోహన్ లాల్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓకేసారి తెలుగు, మలయాళ భాషల్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.వృషభ కథేంటంటే..గత జన్మలు కూడా ఉన్నాయని మనందరం వింటుంటాం. అయితే ఆ జన్మలో మనం ఎలా పుట్టాం.. అసలేం జరిగింది కేవలం ఊహాజనితమే. అసలు గత జన్మలు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. అయితే ఆ రెండు జన్మలను ఓకేసారి చూపిస్తూ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించే చిత్రమే మోహన్ లాల్ వృషభ.ఈ కథ రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు ఓ మహిళ పెట్టే శాపంతో మొదలవుతుంది. గత జన్మలో జరిగిన సంఘటనలతో ఈ కథను ప్రారంభించాడు. బిజినెస్‌లో ఆదిదేవ వర్మ(మోహన్ లాల్) కింగ్. ప్రతి ఏడాది ఉత్తమ బిజినెస్‌మెన్‌గా అవార్డ్ ఆయనకు రావాల్సిందే. అలా ఇది నచ్చని మరో వ్యాపారవేత్త అవార్డ్ బహుకరించే రోజే ఆదిదేవ వర్మపై దాడికి ప్లాన్ చేస్తాడు. కానీ ఆది దేవ వర్మ కుమారుడు తేజ్(సమర్జీత్ లంకేశ్) ఎంట్రీతో ఆ ప్లాన్ తిప్పికొడతాడు. అలా వర్తమానంలో తండ్రీ, తనయులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తేజ్ పెళ్లి చేసుకోవాలనేది తండ్రి బలమైన కోరిక. ఈ విషయాన్ని పదే పదే తన కొడుకుతో చెబుతుంటాడు.అదే సమయంలో గత జన్మ అనుభవాలతో ఆది దేవ వర్మ సతమతమవుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న తేజ్ తండ్రి కోసం మంచి సైక్రియాటిస్ట్ను కలవాలనుకుంటాడు. ఇదే క్రమంలో దామిని(నయన్ సారిక) అతనికి పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలా ఇద్దరు కలిసి ఆదిదేవ వర్మ సమస్యకు పరిష్కారం కోసం బయలుదేరతారు. నాన్నకు ఉన్న ప్రాబ్లమ్ గురించి ఇంట్లో పనిచేసే వంటమనిషి పప్పు.. తేజ్‌తో ఓ ఆసక్తికర విషయం చెబుతాడు. ఇది విన్న తేజ్ తండ్రికి చెప్పకుండానే వెంటనే సొంత గ్రామమైన దేవనగరికి బయల్దేరతాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అసలు తేజ్ ఆ ఊరికి ఎందుకు వెళ్లారు? తండ్రి కోసం వెళ్లిన తేజ్ ఎందుకలా మారిపోయాడు. అసలు తండ్రీ, కొడుకుల మధ్య ప్రతీకారానికి కారణమేంటి? ఆది దేవ వర్మకు గత జన్మలో అసలేం జరిగింది? ఆ జ్ఞాపకాలు ఇంకా ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు ఆ మహిళ పెట్టిన శాపం ఏంటి? అనేది తెలియాలంటే వృషభ చూడాల్సిందే.ఎలా ఉందంటే..మామూలుగా గత జన్మలో ఏం జరిగింది అనేది మొదట చూపించి కథను మొదలెడతాం. అలానే గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు జరిగిన సంఘటనలను పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు. గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ అసమాన యోధుడిగా తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు అయితే వృషభ చేసిన పొరపాటు వల్ల ఓ మహిళ ఆయనకు శాపం పెడుతుంది. అదే శాపం వర్తమానంలోనూ ఆదిదేవ వర్మ(మోహన్ లాల్)ను వెంటాడుతుంది. అయితే కుమారుడి కోసం తాపత్రయ పడుతున్న ఆదిదేవకు..దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ పాతదే కావొచ్చు. కానీ స్క్రీన్ ప్రజెంట్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. తాను అనుకున్నట్లుగానే కథను ప్రేక్షకులను పరిచయం చేశాడు. ప్రారంభంలోనే రాజుకు పెట్టే శాపం రివీల్ చేసి ఆసక్తి క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వర్తమానంలోకి తీసుకెళ్లాడు. తండ్రి, కుమారుల మధ్య బాండింగ్.. కొడుకు కోసం తండ్రి.. తండ్రి కోసం కుమారుడు పడే తపన చూపించాడు. అమ్మాయితో పరిచయం కావడం.. వెంటనే ఇద్దరి మధ్య లవ్.. చకాచకా ఓకే చెప్పడం.. అలా కథను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఫస్ట్ హాప్ మొత్తం ఆదిదేవ వర్మ(మోహన్ లాల్), సమర్జీత్ లంకేశ్(తేజ్)ల బాండింగ్.. దామినితో లవ్‌లో పడడం అంతా రోటీన్‌గా సాగుతుంది. తేజ్ ఎప్పుడైతే తండ్రి సొంత గ్రామమైన దేవనగరి గ్రామానికి వెళ్లాడో అక్కడి నుంచే కథలో వేగం పుంజుకుంది. ఫస్ట్ హాఫ్‌లో కథ ప్రేక్షకుడి ఊహకందేలానే సాగుతుంది. కానీ అలా ప్రేక్షకుడు కథలో లీనమవ్వగానే.. ఇంటర్వెల్‌కు ముందు ఇచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించలేరు. ఆ బిగ్ ట్విస్ట్ థియేటర్లో చూసి సగటు ప్రేక్షకుడు షాకవ్వాల్సిందే. అలా ప్రథమార్థాన్ని వర్తమానంతోనే ముగించాడు. సెకండాఫ్‌లో గత జన్మలో జరిగిన పరిణామాలు.. రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) త్రిలింగ రాజ్యం గురించే ఉంటుంది. ఆ రాజ్యంలో జరిగే సంఘటనలు చుట్టే తిరుగుతుంది. కానీ త్రిలింగ రాజ్యంలోని స్ఫటిక లింగం దొంగతనం చేసేందుకు వచ్చిన హయగ్రీవా(సమర్జీత్ లంకేశ్) వస్తాడు. ఆ తర్వాత వృషభ రాజుకు.. హయగ్రీవాకు మధ్య జరిగే పోరాటం సెకండాఫ్‌లో హైలెట్. ఆ యుద్ధ ఫైట్ సీన్లో జరిగిన సంఘటన తర్వాతే ఈ కథ ఏంటనేది ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అప్పటిదాకా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. సెకండాఫ్‌లో అలీ కామెడీ కొద్దిసేపే అయినా నవ్వులు తెప్పించింది. ఇందులో గత జన్మకు.. వర్తమానానికి ముడిపెట్టడం వల్ల ప్రేక్షకుడిని కాస్తా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. గత జన్మ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ కథలో క్లైమాక్స్‌లో ఫుల్ ఎమోషన్ క్రియేట్ చేశాడు. తండ్రీ, తనయుల మధ్య పోరాటాన్ని భావోద్వేగానికి ముడిపెడుతూ మలిచిన తీరు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఈ కథలో ప్రేక్షకుడి ఊహకందని బిగ్ ట్విస్ట్‌లు ఇచ్చాడు డైరెక్టర్. కథలో కొత్తదనం లేకపోయినా విజువల్స్, స్క్రీన్ ప్లేతో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నారు. ఆడియన్స్‌కు ఎక్కడా బోరింగ్ అనిపించకుండా కథను ముందుకు తీసుకెళ్లడం ప్లస్. భారీ ఫైట్స్ లేకున్నా..కథకు తగినట్లుగా ప్లాన్ చేశాడు.ఎవరెలా చేశారంటే..మోహన్ లాల్ ఆదిదేవ వర్మగా, రాజా విజయేంద్ర వృషభగా రెండు పాత్రల్లో తనలోని టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. సమర్జీత్ లంకేశ్ యంగ్ హీరోగా అదరగొట్టేశాడు. గత జన్మ హయగ్రీవా పాత్రలో డిఫరెంట్‌గా కనిపించాడు. నయన సారిక తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. బీజీఎం అంత కాకపోయినా ఫర్వాలేదనిపించింది. సామ్ సీఎస్ నేపథ్యం సంగీతం బాగుంది. కృతి మహేశ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ వీకెండ్లో ఓ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే వృషభ చూడాల్సిందే. -
‘ఛాంపియన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నిర్మాలా కాన్వెంట్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా..పెళ్లి సందడి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని పీరియాడికల్ ఫిల్మ్ ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఛాంపియన్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రోషన్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1747-48 ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్(రోషన్)కి ఫుట్‌బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఈ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్లి..అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓసారి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అతని తండ్రి చేసిన ఓ పని వల్ల వెళ్లలేకపోతాడు. దొంగమార్గాన ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటాడు. దాని కోసం కొన్ని తుపాకులను ఒక చోటుకి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసుల కంటపడతారు. వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్‌పల్లి అనే గ్రామానికి వస్తాడు. అదే ఊరికి చెందిన చంద్రకళ(అనస్వర రాజన్)తో పరిచయం.. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? పోలీసు అధికారి బాబు దేశ్‌ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్ గొడవ ఏంటి? బైరాన్‌పల్లి ప్రజల కోసం మైఖేల్ చేసిన త్యాగమేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ప్రపంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి చాలా ప్రత్యేకత ఉంది. అందులో బైరాన్‌పల్లి గ్రామస్తులు చేసిన పోరాటం మరింత ప్రత్యేకం. ప్రాణాలు పోతాయని తెలిసినా.. నిజాం పాలకులపై ఎదురుదాడి దిగారు. ఒకనొక దశలో రజాకార్లకే ముచ్చమటలు పట్టించారు. ఆ ఊరి ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్నే ‘చాంపియన్’లో మరోసారి చూపించారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చినప్పటికీ.. ఓ ఆటగాడి కోణంలో సాయుధ పోరాటాన్ని చూపించడం.. అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చెప్పడం ‘ఛాంపియన్’ స్పెషల్. అది తప్పితే ఈ సినిమా కథంతా రొటీన్‌గానే సాగుతుంది. పైగా చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. ఆపరేషన్ పోలోకి దారి తీసిన సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రజాకార్ల అరచకాలు.. బైరాన్‌పల్లి ప్రజల పోరాటాన్ని చూపించి.. కథను సికింద్రాబాద్‌కి మార్చాడు. అక్కడ ఆంగ్లో ఇండియన్ కుర్రాడిగా హీరో పరిచయం.. ఫుట్‌బాల్ టోర్నమెంట్, కోవై సరళ, వెన్నెల కిశోర్ సన్నివేశాలన్నీ కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఎప్పుడైతే బైరాన్ పల్లి గ్రామానికి వస్తాడో.. అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌తో పరిచయం.. నాటక ప్రదర్శన.. 'గిర్రా గిర్రా.. పాట ఇవన్నీ ఎంటర్టైనింగ్గా సాగుతాయి. బైరాన్పల్లిపై రజాకార్ల దాడి జరగడం.. హీరో ఊరి పోరాటంలో భాగమవ్వడం.. అవ్వడంతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే ద్వితియార్థంలోనూ డ్రామాపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేశాడు. కథనాన్ని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఎమోషనల్ సన్నివేశాలనే హైలెట్ చేశాడు. కానీ అవి పూర్తిగా వర్కౌట్ కాలేదు. ప్రేమ కథ ఒకవైపు.. సాయుధ పోరాటం మరోవైపు.. ఈ రెండిటిలో దేనికి ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్ కాలేదు. రజాకార్లలో అసలు పోరాటం మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి నేపథ్యం.. ఆయన చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. హీరో తండ్రి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించడం ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. భావేద్వేగానికి గురి చేసేలా క్లైమాక్స్ ఉంటుంది. ఎవరెలా చేశారంటే..మైఖేల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్‌ని అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా ఇరగదీవాడు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. తాళ్లపూడి చంద్రకళగా అనస్వర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. రాజిరెడ్డి పాత్రకు నందమూరి కల్యాణ్ చక్రవర్తి అంతగా సెట్ అవ్వలేదు. తెలంగాణ యాసను పలకడంలో ఆయన తడబడ్డాడు. పాత్ర సుందరయ్యగా మురళీశర్మ ఆకట్టుకుంటారు. రచ్చరవి, మురళీధర్ గౌడ్, బలగం సంజయ్, అర్చనతో పాటు మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తోటతరణి ఆర్ట్ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
హారర్ సినిమా 'ఈషా' రివ్యూ
ప్రమోషనల్ కంటెంట్‌తో కొంతలో కొంత ఆకట్టుకున్న హారర్ సినిమా 'ఈషా'. త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు, బబ్లూ పృథ్వీరాజ్ లీడ్ రోల్స్ చేశారు. సున్నిత మనస్కులు ఈ మూవీకి రావొద్దని నిర్మాతలు స్టేట్మెంట్ ఇవ్వడం లాంటివి ఆసక్తి కలిగించాయి. తాజాగా(డిసెంబరు 25) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? చెప్పినంతలా భయపెట్టిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవు అని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్‌గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ కాలంలోనూ దెయ్యాలు, భూతాలు ఉన్నాయా? అంటే చాలామంది అలాంటివేం లేవని అంటారు. మరికొందరు మాత్రం అవును అలాంటివి ఉన్నాయని నమ్ముతుంటారు. అలా వ్యతిరేక భావాలున్న ఇద్దరూ ఎదురెదురు పడి సవాళ్లు విసురుకుంటే ఏమైందనేదే 'ఈషా' సినిమా.హారర్ సినిమాలు అనగానే కొన్ని అంశాలు పక్కాగా ఉంటాయి. హీరో లేదా హీరోయిన్ పాత్రధారులు దెయ్యాల్ని నమ్మకపోవడం.. అనుకోని పరిస్థితుల్లో పాడుబడిన బంగ్లాలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటం.. దెయ్యాల్ని వదిలించే ఓ శక్తివంతైన బాబా.. ఇలాంటివి దాదాపుగా కనిపిస్తాయి. అయితే ఎన్ని ఉన్నా సరే ప్రేక్షకుడు భయపడ్డాడా లేదా అనేది కీలకం. ఈ విషయంలో 'ఈషా'కు పాస్ మార్కులే పడతాయి. ఎందుకంటే నాలుగైదు చోట్ల భయపెట్టడం తప్పితే గొప్పగా ఏం లేదు.నలుగురు ఫ్రెండ్స్ దెయ్యాలు లేవని నిరూపించడం.. ఈ క్రమంలోనే ఆదిదేవ్ బాబాని వెతుక్కుంటూ అతడి దగ్గరకు వెళ్లడం.. మార్గం మధ్యలో ఓ ప్రమాదం.. ఓ సవాలు.. అనుకోని పరిస్థితుల్లో వీళ్లంతా పాడుబడిన బంగ్లాలో ఉండాల్సి రావడం.. ఇలా దాదాపు స్టోరీ అంతా ఫ్లాట్‌గానే వెళ్తూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెడుతూ ఉంటుంది తప్పితే తెరపై సీన్స్ ఆ ఫీల్ కలిగించవు.ఇందులో పుణ్యవతి ఎపిసోడ్ భయపెడుతుంది. కాకపోతే అదంతా చాలా సింపుల్‌గా తేల్చేయడం ఏంటో అర్థం కాదు. అసలు ఆ పాత్రని ఇంకాస్త పొడిగించి ఉంటే భయపెట్టే స్కోప్ చాలా ఉండేది. ఆమె ఆత్మకు.. కొడుకు, భర్తతోనూ ఎమోషనల్ సీన్స్ పెట్టొచ్చు. కానీ దర్శకుడు అలా ఎందుకు ఆలోచించలేకపోయాడా అనిపిస్తుంది. పుణ్యవతి పాత్రని ఎందుకో మధ్యలోనే వదిలేశారో ఏంటో? అలానే అమెరికాలో టాప్ న్యూరో సర్జర్ అయిన ఆదిదేవ్.. మన దేశానికి వచ్చి దెయ్యాల్ని వదిలిస్తూ బాబాగా ఎందుకు మారాడో అర్థం కాదు. అతడి బ్యాక్ స్టోరీ చెప్పలేదు.ఈ సినిమాకు క్లైమాక్సే కీలకం. దర్శకుడు కూడా దాన్నే నమ్ముకుని తీశాడు. క్లైమాక్స్ ఒక్కటే సర్ప్రైజ్ చేస్తే సరిపోదుగా.. మిగతా సీన్స్ కూడా ఎంగేజ్ చేయాలి. అప్పుడే మూవీ బాగుంటుంది. ఇక్కడా ఆ పొరపాటే జరిగింది. క్లైమాక్స్ తప్పితే మిగతా అంతా రొటీన్. అకస్మాత్తుగా చనిపోయిన వాళ్లు ఆత్మలుగా ఎందుకు మారతారు? అనే పాయింట్‌ని చివరలో చూపిస్తూ.. సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చి ముగించారు.ఎవరెలా చేశారు?ఫ్రెండ్స్ గ్యాంగ్ త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ బాగానే చేశారు. బాబా ఆదిదేవ్గా బబ్లూ పృథ్వీరాజ్ ఓకే. వేషధారణ కాస్త విచిత్రంగా ఉన్నా ఎందుకో పవర్‌ఫుల్‌గా చూపించలేకపోయారు. పుణ్యవతి ఆత్మ ఆవహించిన వ్యక్తిగా మైమ్ మధు అదరగొట్టేశాడు. గెటప్ చూస్తేనే భయపడతాం. ఆ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. ధ్రువన్ సంగీతం బాగుంది. సీన్లో దమ్ములేకపోయినా సౌండ్‌తో భయపెట్టే ప్రయత్నం బాగా చేశారు. విజువల్స్ కూడా హారర్ ఫీల్ కలిగించాయి. దర్శకుడు శ్రీనివాస్ మన్నె ఎంచుకున్న పాయింట్లో కొత్తదనం లేదు. సినిమాని కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా తీయలేకపోయాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లున్నాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'ఈషా' ఓకే.- చందు డొంకాన -
'దండోరా' సినిమా రివ్యూ
గత రెండు మూడు రోజుల నుంచి వార్తల్లో నిలిచిన నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దండోరా'. కుల వివక్ష, పరువు హత్య లాంటి సబ్జెక్ట్ ఈ మూవీ కాన్సెప్ట్. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు(డిసెంబరు 25) థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది 2004. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ దగ్గర తుళ్లూరు అనే గ్రామం. ఇక్కడ అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు చనిపోతే ఎక్కడో ఊరి చివరకు తీసుకెళ్లి దహనం చేస్తుంటారు. ఇదే గ్రామంలో శివాజీ (శివాజీ) ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఇతడు చనిపోతాడు. కుల పెద్దలు మాత్రం ఇతడి శవాన్ని ఊరి శ్మశానంలో తగలబెట్టడానికి వీల్లేదని తీర్మానిస్తారు. అసలు శివాజీని వాళ్ల కులమే ఎందుకు బషిష్కరించింది? ఇతడి గతమేంటి? శివాజీతో కన్న కొడుకు విష్ణు(నందు) ఎందుకు ఏళ్లుగా మాట్లాడటం మానేశాడు? ఇతడితో వేశ్య శ్రీలత (బిందుమాధవి)కి సంబంధమేంటి అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?టాలీవుడ్లో కుల వివక్షపై వచ్చిన సినిమాలు తక్కువే. వివాదాలు ఏర్పడతాయని భయమో? కమర్షియల్‌గా ఆడవనే ఉద్దేశమో గానీ ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడే వస్తుంటాయి. 'దండోరా' కూడా అలాంటి ఓ సినిమానే. మరి ఇది ఎలా ఉంది అంటే ఓకే ఓకే. ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని డీల్ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. లాజిక్స్ మర్చిపోయాడు!అణచివేయబడిన కులానికి చెందిన ఓ వృద్ధురాలి శవాన్ని ఊరి చివరకు తీసుకెళ్లే సీన్‌తో సినిమా మొదలవుతుంది. 2004 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కథంతా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా కులం గొడవలు, రవి-సుజాతల లవ్ స్టోరీతో టైమ్ పాస్ అయిపోతుంది. కులాన్ని ఎక్కువగా చూసే ఓ గ్రామంలో ఓ మనిషి చచ్చిపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా సాదాసీదాగానే ఉంటుంది తప్పితే ఇందులో కొత్తగా ఏముందా అనిపిస్తుంది. కులం గొడవలు అంటే కచ్చితంగా హత్య, చావు ఉంటాయిగా.. అలా ఓ హత్యతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.ఫస్టాప్ ఓకే ఓకే అనిపించినప్పటికీ సెకండాఫ్ కాస్త ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కులం కాన్సెప్ట్‌పై తీసిన సినిమాల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి మనోవేదన అనుభవిస్తారనే విషయాన్ని చూపించారు. ఇందులో మాత్రం హత్యకు కారణమైన వ్యక్తి, అతడి కుటుంబం ఎలాంటి మానసిక వేదన అనుభవిస్తుంది అనే అంశాన్ని చూపించారు. క్లైమాక్స్‌ని కూడా ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ముగించారు.సినిమా అంతా చూసిన తర్వాత ఇలాంటివి వార్తల్లో చాలా చూశాం. క్లైమాక్స్ తప్పితే ఇందులో కొత్తగా ఏముందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే మూవీలో ఓ కులం వాళ్లు.. ఊరిలో స్మశానం మెంటైన్ చేస్తుంటారు. వేరే కులం వాళ్లు ఎక్కడో ఊరి అవతల శవాల్ని దహనం చేస్తుంటారు. అయితే అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు.. ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్యని ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు? అసలు వీళ్లలో కనీసం ఒక్కరికి కూడా ఆలోచన రాదా? ఎవరో దానం చేస్తే తప్ప వీళ్లకు వేరే గత్యంతరం లేదా? ఇలా చాలా సందేహలు వస్తాయి. దర్శకుడు ఈ లాజిక్స్ అన్ని ఎలా మిస్ అయ్యాడా అనిపిస్తుంది.సర్పంచ్ క్యారెక్టర్ అయితే మరీ విచిత్రంగా ఉంటుంది. చిన్నప్పుడు ఓ సంఘటన చూసి ఊరికి ఏదో చేసేద్దామని డిసైడ్ అయిన వ్యక్తి.. అధికారం వచ్చినా సరే ఏం చేయకపోవడం, వేరే వాళ్లు దానం చేస్తే దాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకోవడం కన్విన్సింగ్‌గా అనిపించదు. స్టోరీకి అవసరం లేని సీన్స్ కూడా చాలానే ఉంటాయి. చాలా సీరియస్ కాన్సెప్ట్ చెబుతున్నప్పుడు సీన్స్ ఎంత ఎంగేజింగ్‌గా ఉంటే అంత బెటర్. కానీ ఇందులో కొన్ని మెరుపులు మాత్రమే ఉంటాయి. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేస్తాయంతే.ఎవరెలా చేశారు?శివాజీ బాగానే చేశాడు. కానీ ఆ పాత్ర 'కోర్ట్'లో మంగపతి క్యారెక్టర్‌కి కొనసాగింపులా ఉంటుంది తప్పితే కొత్తగా ఏముందా అనిపిస్తుంది. రవికృష్ణది రొటీన్ పాత్రే అయినప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. నవదీప్ 2.0 అని ఈ మూవీ టైటిల్స్‌లో వేశారు కానీ ఇందులో అతడి పాత్రకు పెద్దగా స్కోప్ దొరకలేదు. చాలా సాధారణంగా ఉంటుంది. వేశ్యగా బిందుమాధవి పాత్ర బాగుంది కానీ ఆమె డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఎందుకో సెట్ కాలేదనిపిస్తుంది. శివాజీ కొడుకు విష్ణుగా చేసిన శ్రీ నందుకు మంచి స్కోప్ దొరికింది. డిఫరెంట్ వేరియేషన్స్ బాగా చూపించాడు. శివాజీ కూతురు సుజాతగా చేసిన మనిక చూడటానికి బాగుంది. మిగతా పాత్రధారులు కూడా తమ ఫరిది మేరకు అలరించారు.టెక్నికల్ విషయాలకొస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. 'దం.. దండోరా' అని సాగే పాట బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్. దర్శకుడు మురళీకాంత్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని చూపించిన విధానం ఓకే ఓకే అనిపిస్తుంది. కాకపోతే డైరెక్టర్లో విషయముందనిపిస్తుంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే కుల వివక్షకు కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి తీసిన సినిమా 'దండోరా'. స్టోరీ కంటే పాత్రలు, కొన్ని డైలాగ్స్ గుర్తుంటాయి.- చందు డొంకాన -
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: శంబాలనటీనటులు: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ తదితరులునిర్మాతలు : మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజుదర్శకత్వం: యుగంధర్ మునిసంగీతం:శ్రీచరణ్ పాకాలవిడుదల తేది: డిసెంబర్ 25, 2025ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని సస్పెన్స్ థ్రిల్లర్ ‘శంబాల’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల ఆది ఏ సినిమాకు రానంత హైప్ శంబాలకు వచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి మొదలు ట్రైలర్ వరకు ప్రతీది ఆసక్తిని పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉది? ఆది(aadi saikumar) ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాంకథేంటంటే...ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్(ఆది సాయికుమార్) వస్తాడు. చావులోనూ సైన్స్ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు. ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్‌తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్‌కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో శంబాల(Shambhala Review) చూడాల్సిందే.ఎలా ఉందంటే..సైన్స్ గొప్పదా? శాస్త్రం గొప్పదా అంటే సరైన సమాధానం చెప్పలేం. కొంతమంది సైన్స్‌ని మాత్రమే నమ్ముతారు. మరికొంత మంది శాస్త్రాలనే నమ్ముతారు. అయితే సైన్స్‌లోనూ శాస్త్రం ఉంది..శాస్త్రంలోనూ సైన్స్ ఉంది అని చాటి చెప్పే చిత్రం శంబాల. దర్శకుడు యుగంధర్ ముని ట్రెండింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకొని.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అసలు కథ ఏంటో చెప్పకుండా టీజర్, ట్రైలర్ వదిలి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు. అదే ఆసక్తితో థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకుడి అంతకు మించిన కొత్త విషయాలను పరిచయం చేసి అబ్బురపరిచాడు. సైన్స్, శాస్త్రాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినా.. ఈ సినిమా కథనం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రొటీన్ కథే అయినా స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ప్రతి ఐదారు నిమిషాలకు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని పరిచయం చేస్తూ.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించారు.పురాణాల్లోని కథని సాయి కుమార్‌తో వాయిస్ ఓవర్ చెప్పించి.. శంబాల కథను ప్రారంభించారు దర్శకుడు. ఫస్టాఫ్ మొత్తం శంబాల గ్రామం పరిచయం..అక్కడి ప్రజలకు ఎదురయ్యే వింత ఘటనల చుట్టూనే కథనం సాగుతుంది. శంబాల ఊరిలో ఉల్క పడడం..ఆవు నుంచి పాలుకు బదులు రక్తం రావడం.. రైతు రాములు వింతగా ప్రవర్తించడం..ఇలా సినిమా ఆరంభంలోనే ప్రేక్షకుడిని శంబాల ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.ఫస్ట్ సీన్ నుంచే ప్రేక్షకులను భయపెట్టడం స్టార్ట్ చేశాడు. రవివర్మ పాత్ర సన్నివేశాలే భయపెట్టేలా ఉంటే..అంతకు రెండింతలు అన్నట్లుగా మీసాల లక్ష్మణ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. కల్లు దుకాణంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. ఇక లక్ష్మణ్ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు అయితే ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టిస్తాయి.ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఊరి సమస్యను తీర్చేందుకు విక్రమ్ చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. సినిమా ప్రారంభంలో వచ్చే ఒక పాటలోని లిరిక్స్‌కి ఈ కథను ముడిపెట్టిన విధానం బాగుంది. ప్రతీ సీన్ కన్విన్సింగ్ ఉంటుంది. కానీ చాలా చోట్ల రిపీటెడ్‌గా అనిపిస్తాయి. శంబాల గ్రామ చరిత్ర తెలిసిన తర్వాత కథనం ఊహకందేలా సాగుతుంది. ఇంద్రనీల్ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉన్నా..అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. సైన్స్‌కి, శాస్త్రాలకు మధ్య సంబంధం ఉందని చెప్పేలా ఆ ట్విస్ట్ ఉంటుంది. ఓవరాల్‌గా రైటింగ్ పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. శంబాల మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆది సినీ కెరీర్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది.ఎవరెలా చేశారంటే..సైంటిస్ట్ విక్రమ్ పాత్రలో ఆది ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. దేవి పాత్రకు అర్చన అయ్యర్ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమెకు బలమైన సన్నివేశాలేవి ఉండవు. రైతు రాములుగా రవివర్మ తనదైన నటనతో భయపెట్టేశాడు. ఇక మీసాల లక్ష్మణ్‌కి కూడా ఈ సినిమాలో ఓ బలమైన పాత్ర లభించింది. దివ్యాంగుడు కృష్ణగా ఆయన నటన అదిరిపోయింది. కొన్ని చోట్ల కేవలం చూపులతోనే భయపెట్టేశాడు. కానిస్టేబుల్ హనుమంతుగా మధునందన్ బాగా చేశాడు. అతని కూతురిగా చేసిన అమ్మాయి కూడా చక్కగా నటించింది. స్వాసిక విజయ్, శివకార్తిక్, ఇంద్రనీల్, షిజు మీనన్, శైలజ ప్రియలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రవీన్ కె బంగారి సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫెక్స్ వర్క్ ఈ సినిమాలో తక్కువే ఉన్నా.. చక్కగా కుదిరింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె , సాక్షి డెస్క్ -
మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ
ప్రతి రంగంలోనూ లోటుపాట్లు ఉంటాయి. వైద్యరంగంలోనూ బయటకు కనిపించనవి చాలానే జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి అంశాల్ని పలు సినిమాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మెడికల్ రంగంలో జరిగే మాఫియాపై ఓ థ్రిల్లర్ డ్రామా సిరీస్ తీశారు. అదే 'ఫార్మా'. మలయాళ హీరో నివిన్ పౌలీ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడిది హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కేపీ వినోద్(నివిన్ పౌలీ).. ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. ప్రారంభంలో ఇబ్బందిపడినా తర్వాత కుదురుకుంటాడు. పనితనం చూపిస్తాడు. ఈ ఫార్మా కంపెనీ.. గర్బిణిల కోసం కైడాక్సిన్ అనే మందు కనిపెడుతుంది. దీని సేల్స్ పెంచడంలో వినోద్ కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఈ మందు వల్ల పుట్టిన పిల్లలందరూ మధుమేహం (షుగర్) బారిన పడ్డారని డాక్టర్ శైలజ(శ్రుతి రామచంద్రన్)కి తెలుస్తుంది. ఇదే విషయం వినోద్‌కి చెబుతుంది. దీంతో ఉద్యోగం చేసిన కంపెనీపైనే న్యాయపోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? డాక్టర్ రాజీవ్ రావు(రజత్ కపూర్).. వినోద్‌కి ఎలాంటి సాయం చేశారనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇదో కల్పిత కథతో తీసిన సిరీస్. చూస్తున్నంతసేపు బయట హాస్పిటల్స్‌లోనూ ఇలానే జరుగుతుందా అనే సందేహం, మరోవైపు చిన్నపాటి భయం వేస్తుంది. మెడికల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ సిరీస్ అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే అలా ఉంది మరి. స్టోరీ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దాన్ని డీల్ చేయడంలో అక్కడక్కడ తడబాటు కనిపిస్తుంది. అయితేనేం ఇలాంటి స్టోరీలు అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కొందరు వ్యక్తులు టక్, షూ వేసుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకుని హాస్పిటల్స్‌లో అప్పుడప్పుడు కనిపించడం మీరు చూసే ఉంటారు. వీళ్లని మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటారు. వీళ్ల చేసే పని ఏంటంటే.. ఫార్మా కంపెనీ తయారు చేసిన మందులు, మెడికల్ పరికరాలని ప్రతి ఊరిలో ఉండే డాక్టర్లు, ఆసుపత్రులు, ఫార్మాసిస్ట్‌లకు పరిచయం చేసి అమ్మడం. అసలు వీళ్లు ఎలా పనిచేస్తారు? ఎంతలా కష్టపడతారు? టార్గెట్స్ పేరు చెప్పి వీళ్లతో కంపెనీ ఎలాంటి పనులు చేయిస్తాయి? లాంటి విషయాల్ని ఈ సిరీస్‌లోని కేపీ వినోద్ పాత్రతో చాలా చక్కగా చూపించారు.కొన్ని ఫార్మా కంపెనీలు.. బిజినెస్సే ముఖ్యమనుకుని ప్రజల ప్రాణాలతో ఎలా చెలాగాటం ఆడుతున్నాయి? ఆయా సంస్థల నుంచి వచ్చే మెడిసన్ వల్ల భవిష్యత్తు తరాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది. ఎంతో ప్రమాదకరమైన మందులు.. ప్రజల్లోకి ఎంత తేలికగా వచ్చేస్తున్నాయనే అంశాలని ఈ సిరీస్‌లో పూసగుచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. అదే టైంలో డబ్బు ముఖ్యమని అనుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఎవరికైనా సరే దేవుడు కచ్చితంగా శిక్ష విధిస్తాడు అనే విషయాల్ని కూడా ఈ సిరీస్‌లో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.కేపీ వినోద్ పాత్రలో నివిన్ పౌలీ సెటిల్డ్‌గా చేశాడు. మలయాళంలో ప్రముఖ హీరో అయినప్పటికీ.. ఈ సిరీస్‌లో చాలా సాధారణంగా కనిపిస్తాడు. కథకి తగ్గట్లే ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఈ పాత్రకు ఉండవు. లేడీ డాక్టర్ శైలజగా చేసిన శ్రుతి రామచంద్రన్, సీనియర్ డాక్టర్ రాజీవ్ రావు పాత్రలో రజత్ కపూర్ కూడా అదరగొట్టేశారు. మిగిలిన పాత్రధారులు కూడా స్టోరీకి తగ్గట్లు జీవించేశారు. సిరీస్ చూస్తున్నంతసేపు మనం కూడా కథతో పాటే వెళ్తాం. అలా చూపించారు. టెక్నికల్ అంశాలు కూడా అన్ని సెట్ అయ్యాయి.దర్శకుడు పీఆర్ అరుణ్.. ఈ సిరీస్ కోసం చాలానే రీసెర్చ్ చేశాడని అనిపిస్తుంది. కాకపోతే రెగ్యులర్ డ్రామాని చూపించినప్పుడు బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఒకటిరెండు సీన్స్ తప్పితే ఓవరాల్‌గా సిరీస్ బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 8 ఎపిసోడ్లుగా దీన్ని తీశారు. కానీ మొత్తం రన్ టైమ్ 3 గంటల 16 నిమిషాలే. ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయండి.- చందు డొంకాన -
పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
వెతకాలే గానీ ఓటీటీల్లో భాషతో సంబంధం లేకుండా మంచి మంచి సినిమాలు చాలా కనిపిస్తాయి. అలాంటి ఓ మూవీ 'జోజో రాబిట్'. సాధారణంగా యుద్ధం బ్యాక్ డ్రాప్ అనగానే యాక్షన్ లేదంటే ఎమోషన్స్ చూపిస్తారు. దీనికి మాత్రం కామెడీ టచ్ ఇచ్చారు. ఓ పిల్లాడి కంట్లో నుంచి ప్రపంచ యుద్ధాన్ని చూస్తే ఎలా ఉంటుందనేదే ఈ మూవీ స్టోరీ. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో ఉంది? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.2019లో థియేటర్లలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఆదరణ దక్కించుకున్న సినిమాల్లో ఇది ఒకటి. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో 2020లో ఆస్కార్ కూడా సొంతం చేసుకుంది. హిట్లర్, నాజీ సైన్యంపై తీసిన మూవీనే అయినప్పటికీ కాస్త వ్యంగం జోడించి తెరకెక్కించడం ఇక్కడ స్పెషాలిటీ. ఇది హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.కథేంటి?అది రెండో ప్రపంచయుద్ధ సమయం. జర్మనీలోని ఓ ఊరిలో జోజో అనే పదేళ్ల పిల్లాడు ఉంటాడు. హిట్లర్ సైన్యంలో పిల్లల విభాగంలో ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇతడికి మాత్రమే కనిపించే 'ఊహజనిత హిట్లర్'.. అన్ని విషయాల్లోనూ గైడ్ చేస్తుంటాడు. అలాంటి జోజో జీవితంలో ఈ యుద్ధం ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. తల్లి రోజ్, ఇతడి ఇంట్లో రహస్యంగా ఉంటున్న యూదు అమ్మాయి ఎల్సా.. ఇతడి ప్రయాణంలో ఎలాంటి మలుపులకు కారణమయ్యారు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?చూడగానే ఇది పిల్లల సినిమాలా అనిపిస్తుంది గానీ రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్, జర్మనీలోని నాజీ సైన్యం, యూదులు.. ఇలా పలు విషయాల్ని వ్యంగ్యంగా చూపించే ప్రయత్నం చేశారు. వీళ్లు గురించి ఏం తెలియకపోయినా పర్లేదు. ఎందుకంటే వాటి కంటే జోజో అనే పదేళ్ల పిల్లాడు, అతడి ప్రపంచం మనకు నచ్చేస్తుంది. తోటి పిల్లలతో ఉండే కామెడీ, తల్లి, ఎల్సాతో ఉండే ఎమోషనల్ సీన్స్ మనం ఆ ప్రపంచంలోకి వెళ్లేలా చేస్తాయి.రెండు గంటల కూడా ఉండదు ఈ సినిమా. అయితేనేం డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. జోజోతో పాటు మనం కూడా ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. జోజో తల్లి, తండ్రి.. యూదులకు మంచి జరగాలనే ఉద్దేశంతో పనిచేస్తుంటారు. జోజోకి మాత్రం హిట్లర్, అతడి సైన్యం అంటే చచ్చేంత ప్రేమ. అలాంటి ఈ పిల్లాడు.. ఇంట్లోనే రహస్యంగా ఉంటున్న ఎల్సాతో స్నేహం చేయడం, యూదుల గురించి తెలుసుకోవడం.. ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. అదే టైంలో ఆకట్టుకుంటాయి.కాకపోతే రెగ్యులర్ ఉండే డ్రామా కంటే ఇందులో కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి సగటు ప్రేక్షకుడి ఇది నచ్చకపోవచ్చు. లేదు ఏదైనా డిఫరెంట్‌గా టైమ్ పాస్ కోసం చూద్దామనుకుంటే మాత్రం ఈ మూవీ ట్రై చేయొచ్చు. మరీ ముఖ్యంగా జోజో పాత్రలో నటించిన రోమన్‌తో ప్రేమలో పడిపోతాం. ఇతడి తల్లిని హిట్లర్ ఆర్మీ చంపి, ఊరి మధ్యలో వేలాడాదీసే సీన్ అయితే మనల్ని కూడా కంటతడి పెట్టిస్తుంది.- చందు డొంకాన -
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: గుర్రం పాపిరెడ్డిదర్శకత్వం: మురళీ మనోహర్నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, జీవన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోస్గి తదితరులువిడుదల తేదీ: డిసెంబర్ 19, 2025హాలీవుడ్ నుంచి జేమ్స్ కామెరూన్ అవతార్-3 రిలీజవ్వగా.. ఈ వారం టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు అలరించేందుకు వచ్చేశాయి. జిన్, గుర్రం పాపిరెడ్డి లాంటి థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి లాంటి డార్క్ కామెడీ థ్రిల్లర్‌పైనే కాస్తా బజ్ నెలకొంది. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్ దోపిడీకి పాల్పడతాడు. అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.ఎలా ఉందంటే..డార్క్ కామెడీ థ్రిల్లర్ స్టోరీలు మన టాలీవుడ్లో కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. కానీ కాస్తా గుర్రం పాపిరెడ్డిలో రోటీన్‌కు భిన్నంగా కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ కథలో డార్క్ కామెడీ కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ఆసక్తికరంగా కథను మొదలెట్టిన డైరెక్టర్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేశాడు. శవాల దొంగతనం.. వాటిని మార్చడం.. వాటి కోసం హీరో పడే ఇబ్బందులు ఫుల్ కామెడీని పండించాయి. ఇంటర్వెల్ వరకు ఫుల్ కామెడీ సీన్స్‌తోనే అలరించాడు.ఫస్ హాఫ్ కథనం మొత్తం శవాల చుట్టే తిరుగుతుంది. అలా ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేశాడు.సెకండాఫ్ కథలో వేగం తగ్గుతుంది. స్క్రీన్ ప్లే కూడా మరీ స్లోగా ఉండడంతో ఆడియన్స్‌కు కొంత విసుగు తెప్పిస్తుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఆ విషయంలో డైరెక్టర్ మరింత ఫోకస్ చేయాల్సింది. అయితే బ్రహ్మానందం రోల్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఎక్కువ సేపు స్క్రీన్‌పై అలరించిన తీరు ఆకట్టుకుంది. కథలో కామెడీ పండినా.. కొన్ని సీన్స్‌లో అనవసరంగా పెట్టారేమో అనిపించేలా ఉంటాయి. కామెడీకి అవకాశమున్నా చోట ప్రేక్షకులను నవ్వించేశాడు.సింపుల్ కథను స్వాతంత్రానికి పూర్వం ఉన్న సంస్థానాలతో ముడిపెట్టి నడిపించిన తీరు ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. కోర్టు రూమ్ డ్రామా మొదయ్యాక కథలో సీరియస్‌నెస్ కనిపించదు. ప్రీ క్లైమాక్స్ వరకూ కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. చివరగా రెండో భాగానికి లీడ్ ఇస్తూ కథను అలా ముగించేశాడు డైరెక్టర్.ఎవరెలా చేశారంటే.లీడ్ రోల్లో నరేశ్ అగస్త్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫిరియా అబ్దుల్లా సౌదామినిగా తన పాత్రలో ఒదిగిపోయింది. మిలటరీగా రాజ్‌కుమార్.. చిలిపిగా వంశీధర్‌గౌడ్, గొయ్యి పాత్రలో జీవన్ తమ పాత్రల పరిధిలో అలరించారు. బ్రహ్మానందం తన పాత్రతో అభిమానులను మెప్పించారు. అయితే యోగిబాబు పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం ఫర్వాలేదనిపించింది. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్‌లో ఇంకాస్తా కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్: 2.75/5 -
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ
ప్రపంచ సినీ చరిత్రలో ఓ సంచలనం ‘అవతార్’. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ఇది. 2009లో రిలీజైన ఈ చిత్రం.. అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు వెండితెరపై చూడని విజువల్స్‌ని చూపించి..సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లాడు కామెరూన్. ఈ సినిమాకు కొనసాగింపుగా నాలుగు సీక్వెల్స్ ఉంటాయని అప్పుడే ప్రకటించిన కామెరూన్.. పార్ట్ 2 అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ని 2022లో రిలీజ్ చేశాడు. ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు అవతార్‌కి రెండో సీక్వెల్‌గా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’(Fire And Ash Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పెద్ద కొడుకు నితాయాం చనిపోయిన తర్వాత జేక్ సల్లీ(శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి(జో సల్డానా) జంట తీవ్రమైన విషాదంలో కూరుకొనిపోతుంది. మిగిలిన పిల్లలు లోక్(బ్రిటన్ డాల్టన్), టూక్(ట్రినిటీ జో-లి బ్లిస్), కిరి (సిగౌర్నీ వీవర్)తో పాటు దత్తపుత్రుడు స్పైడర్(జాక్ ఛాంపియన్)ని కాపాడుకుంటూనే.. కొడుకు చావుకు కారణమైన మానవ సైన్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం అవుతారు. అదే సమయంలో అవతార్ 2లో చనిపోయిన కల్నల్ క్వారిచ్(స్టీఫెన్ లాంగ్).. నావి తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ జీవం పోసుకొని వస్తాడు. అతనికి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్(ఊనా చాప్లిన్) సహాయం చేసేందుకు ముందుకు వస్తుంది. వరంగ్‌కి జేక్ సల్లీ ప్యామిలీ కొలిచే ఈవా దేవత అంటే నచ్చదు. అదే కోపంతో కల్నల్ క్వారిచ్‌తో చేతులు కలుపుతుంది. మరోవైపు పండోరా గ్రహాన్ని నాశనం చేయాలనుకున్న ఆర్డీఏ బృందం కూడా వీరికి తోడుగా నిలుస్తుంది. బలమైన ఈ ముగ్గురు శత్రువుల నుంచి జేక్ సల్లీ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేదే అవతార్ 3(Avatar 3 Review) కథ. ఎలా ఉందంటే..‘అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను చూపించిన జేమ్స్ కామెరూన్.. పార్ట్ 2 సముద్ర గర్భంలోని సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. అయితే అవతార్ 2 సమయంలోనే కథ-కథనంపై విమర్శలు వచ్చాయి. కానీ విజువల్స్ అద్భుతంగా ఉండడంతో సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మూడో భాగంగా వచ్చిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’లోనూ కథ- కథనమే మైనస్ అయింది. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ కథ-కథనంలో మాత్రం కొత్తదనం లేదు. విజువల్స్ చూడడానికి బాగున్నా.. వావ్ ఫ్యాక్టర్ మాత్రం మిస్ అయింది. అవతార్, అవతార్ 2లో చూసిన సన్నివేశాలే.. పార్ట్ 3లోనూ కనిపిస్తాయి. అగ్నితెగ ఒక్కటి ఇందులో యాడ్ చేశారు. అంతకు మించి పార్ట్ 2కి, పార్ట్ 3కి పెద్ద తేడా లేదు. పైగా నిడివి చాలా ఎక్కువగా (దాదాపు 3 గంటల 17 నిమిషాలు) ఉండడంతో .. చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ ప్రేక్షుకుడి సహనానికి పరీక్షలా మారుతుంది. చూసిన సన్నివేశలే మళ్లీ మళ్లీ రావడం.. కథ అక్కడక్కడే తిరగడంతో ‘విరామం’ పడితే బాగుండేది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఉన్నంతలో సెకండాఫ్‌లో కథ కాస్త పరుగులు పెడుతుంది. వరంగ్, కిరి మధ్య వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. అలాగే స్పైడర్ పాత్ర నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు హృదయాలను హత్తుకుంటాయి. బంధీ అయిన జేక్ సల్లీని విడిపించేందుకు నేతిరి రావడం..ఈ క్రమంలో వచ్చే పోరాట ఘట్టాలు బాగుంటాయి. క్లైమాక్స్ విజువల్స్ పరంగా బాగున్నా.. అవతార్ 2లోని క్లైమాక్స్‌ని గుర్తు చేస్తుంది. మొత్తంగా జేమ్స్ కామెరూన్ మార్క్ ఎమోషన్, స్క్రీన్‌ప్లే ఈ చిత్రంలో మిస్ అయింది. వీఎఫెక్స్ పనితీరు మాత్రం ఇంతకు ముందు వచ్చిన రెండు పార్టుల కంటే బాగుంటుంది. కథ పరంగా చూస్తే.. అవతార్ 3 రొటీన్ చిత్రమే కానీ.. సాంకేతికంగా మాత్రం అవతార్ 3 ఓ అద్భుతమే. విజువల్ గ్రాండియర్ కోసమే అయినా ఈ సినిమాను తెరపై ఒక్కసారి చూడొచ్చు. ఎవరెలా చేశారంటే.. జేక్ సెల్లీ పాత్రకు సామ్ వర్తింగ్టన్ పూర్తి న్యాయం చేశాడు. ఓ తెగ నాయకుడిగా, పిల్లలకు మంచి తండ్రిగా చక్కని నటన కనబరిచాడు. యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేతిరి పాత్రలో జో సల్డానా ఒదిగిపోయింది. పార్ట్ 2తో పోలిస్తే..ఇందులోనే ఆమెకు ఎక్కువ యాక్షన్ సీన్స్ పడ్డాయి. ఇక ఈ సినిమాకు కొత్తతనం తెచ్చిన పాత్ర వరంగ్. ఆ పాత్రలో ఊనా చాప్లిన్ జీవించేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో ఆమె నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సిగర్నీ వీవర్, బ్రిటన్ డాల్టన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. , రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. సైమన్ ఫ్రాంగ్లెన్ నేపథ్య సంగీతం ఓకే. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. కొన్ని సన్నివేశాలను తొలగించినా.. అసలు కథకు ఇబ్బందేమి లేదు. అలాంటి సీన్లను తొలగించి నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'ధురంధర్' సినిమా రివ్యూ
గత కొన్నిరోజుల నుంచి సినీ ప్రేమికులు ఓ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదే 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ.. సౌత్‌లోనూ దీని సౌండ్ గట్టిగానే ఉంది. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ ఇందులో నటించారు. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కలెక్షన్స్ కూడా ఇప్పటికే రూ.500 కోట్లు దాటేశాయి. మరి అంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)కథేంటి?1999లో కాందహార్ హైజాక్, 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత మన దేశ ఏజెంట్.. పాకిస్థాన్‌లో ఓ హై పొజిషన్లో ఉండాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్.మాధవన్) భావిస్తారు. వెంటనే 'ఆపరేషన్ ధురంధర్' ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా హంజా అలీ (రణ్వీర్ సింగ్) పాక్‌లోని కరాచీకి స్పై ఏజెంట్‌గా వెళ్తాడు. తర్వాత లయరీ అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్(అక్షయ్ ఖన్నా) నడిపిస్తున్న లోకల్ గ్యాంగ్‌లో చేరతాడు. తర్వాత ఐఎస్ఐ లీడర్‌తోనూ స్నేహం చేసే స్థాయికి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఇందులో ఎస్పీ చౌదరి (సంజయ్ దత్) పాత్ర ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పటివరకు చాలా స్పై థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా దాదాపు ఒకే టైపులో ఉంటాయి. కానీ 'ధురంధర్' మాత్రం పేరుకే స్పై జానర్ గానీ కేజీఎఫ్ స్టైల్లో ఉంటుంది. అంటే ఊరమాస్ అనమాట. కాందహార్ హైజాక్ సీన్‌తో మొదలయ్యే ఈ మూవీని మొత్తం ఎనిమిది ఛాప్టర్లుగా చూపిస్తారు. 214 నిమిషాల నిడివి అంటే మూడున్నర గంటలపైనే ఉంటుంది. చూస్తున్నంతసేపు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.ఈ సినిమా అంతా పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్లోనే ఉంటుంది. 1990ల్లో కరాచీలోని లయరీ అనే ప్రాంతం, అక్కడి గ్యాంగ్ వార్స్‌ని కళ్లకు కట్టినట్లు చూపించారు. షూటింగ్ అంతా ఎక్కడ చేశారో గానీ మూవీ చూస్తున్నంతసేపు నిజంగా మనం పాకిస్థాన్‌లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి సీన్, ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్.. చాలా డీటైల్డ్‌గా చూపించారు. లయరీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్టర్స్ రెహమాన్ బలోచ్, అర్షద్ అప్పు నిజ జీవిత పాత్రలే. రెహమాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా జీవించేశాడు. పేరుకే రణ్వీర్ సింగ్ హీరో గానీ మూవీలో రెహమాన్ పాత్ర వేరే లెవల్లో ఉంటుంది.సినిమా నిడివి విషయంలో ఇబ్బంది అనిపించొచ్చు గానీ ఒక్కసారి మీరు మూవీలోలో లీనమైతే మాత్రం అదిరిపోయే సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ గ్యారంటీ. ఎందుకంటే ఓవైపు విజువల్స్, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు.. ఇలా దేనికవే టాప్ నాచ్ ఉంటాయి. హీరోయిన్ పాత్ర అసలెందుకు ఉందా అని ప్రారంభంలో అనిపిస్తుంది గానీ ఆమె పాత్రని ఉపయోగించిన విధానం చూస్తే ఈమె క్యారెక్టర్ అవసరమే అనిపిస్తుంది. కాకపోతే రణ్వీర్ పక్కన హీరోయిన్ సారా చిన్నపిల్లలానే కనిపిస్తుంది. ఇది కాస్త మైనస్.ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా రియలస్టిక్‌గా ఉంటాయి. సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఓ మూడు నాలుగు సన్నివేశాలు ఉంటాయి. వీటిని చూడకపోవడమే బెటర్. అంత దారుణంగా ఉంటాయి. ఈ సినిమాలో హీరోతో పాటు కొన్ని కల్పిత పాత్రలు ఉంటయి గానీ మిగిలినవి మాత్రం నిజ జీవిత సంఘటనల నుంచి తీసుకున్నవే. మాధవన్ చేసిన అజయ్ సన్యాల్ పాత్ర చూస్తున్నంతసేపు అజిత్ ఢోబాల్ గుర్తొస్తారు.క్లైమాక్స్‌లో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అది కూడా మరో మూడు నెలల్లో అంటే మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. తొలిభాగంలో గ్యాంగ్‌స్టర్ గ్రూప్‌లో ఒకడిగా కనిపించిన భారత స్పై హంజా అలీ(రణ్వీర్).. సీక్వెల్లో మాత్రం ఏకంగా లయరీలోని గ్యాంగ్‌స్టర్స్‌లో ఒకడు అయిపోతాడు. మిగిలిన గ్యాంగ్‌స్టర్స్‌ని చంపేస్తాడు. ఇదంతా ఎండ్ క్రెడిట్స్‌లో చిన్నపాటి ట్రైలర్‌లా చూపించారు. తద్వారా సీక్వెల్‌పై ఆసక్తి పెంచారు.ఈ సినిమా ప్రస్తుతానికి హిందీలో మాత్రం థియేటర్లలో రన్ అవుతోంది. ఈ వీకెండ్ తెలుగులోనూ రిలీజ్ చేయొచ్చని అంటున్నారు గానీ దానిపై స్పష్టత లేదు. ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. డీల్ ప్రకారం 8 వారాల తర్వాత అంటే ఫిబ్రవరి తొలి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఒకవేళ అప్పటివరకు వెయిట్ చేయలేం అనుకుంటే మాత్రం 'ధురంధర్'ని థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి. వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ) -
రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ
రెగ్యులర్ రొటీన్ ప్రేమకథలకు సినిమాల్లో కాలం చెల్లింది. అప్పుడప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీస్ వస్తుంటాయి. అలాంటి ఓ మూవీనే 'ఆరోమలే'. గత నెలలో తమిళంలో రిలీజై హిట్ అయింది. రొమాంటిక్ కామెడీ జానర్లో తీసిన ఈ చిత్రంలో కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లు. ఇప్పుడు ఇది హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: రూ. 99కే సినిమా.. కొత్త ప్రయోగం!)కథేంటి?అజిత్ (కిషన్ దాస్) మిడిల్ క్లాస్ కుర్రాడు. టీనేజీలో ఓ ప్రేమకథా సినిమా చూసి, తనకు కూడా ఇలాంటి లవ్ స్టోరీనే కావాలని ఫిక్స్ అయిపోతాడు. స్కూల్లో ఉన్నప్పుడు స్మృతి, కాలేజీలో మేఘ, పెద్దయ్యాక స్నేహ(మేఘా ఆకాశ్)ని ప్రేమిస్తాడు. కానీ వాళ్లు పట్టించుకోరు. తీరా చదువు పూర్తయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఓ మ్యాట్రిమోనీ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. అక్కడ అంజలి(శివాత్మిక రాజశేఖర్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఆమెనే తనకు టీమ్ లీడర్ అని తెలిసి షాక్ అవుతాడు. ఆమెకు ప్రేమపై పెద్దగా నమ్మకం ఉండదు. అదో టైమ్ వేస్ట్ వ్యవహారం అనుకునే టైపు. ఇలా ప్రేమ విషయంలో భిన్నమైన ఆలోచనలు ఉన్న వీళ్లిద్దరి జీవితంలో ఏం జరిగింది? ప్రేమలో ఎందుకు పడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రేమ అనే దానికి సరైన డెఫినిషన్ అంటూ ఏం లేదు. ఎవరికి వాళ్లు స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ అనుభూతిని అర్థం చేసుకోవడం కష్టం. అదే ప్రేమలో ఉన్న మహత్తు. పెళ్లి చేసుకోవద్దని ఎవరైనా చెబితే వింటారేమో గానీ ప్రేమలో పడొద్దని చెబితే ఎవరూ వినరు. అలా ప్రేమ కోసం తపించే ఓ యువకుడి స్టోరీనే ఈ సినిమా.సినిమా గురించి చెప్పాలంటే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రెగ్యులర్ ప్రేమకథలతో పోలిస్తే కాస్త డిఫరెంట్‌గా ఉంది. రెండు గంటల సినిమాలో ప్రేమ, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని ఫెర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నారు. కాకపోతే క్లైమాక్స్ మాత్రం హీరోహీరోయిన్ కలవాలి అని ఏదో హడావుడిగా ముగించినట్లు అనిపిస్తుంది. ఆ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే మాత్రం మూవీ మరో లెవల్లో ఉండేది.థియేటర్లో ఓ ప్రేమకథా సినిమా చూసి లవ్ అంటే బయట కూడా ఇలానే ఉంటుందని హీరో అనుకోవడం.. తర్వాత స్కూల్, కాలేజీ లైఫ్‌లో ప్రేమలో పడటం.. కనీసం వ్యక్తపరిచే అవకాశం రాకుండా అవి ముగిసిపోవడం ఇలా తొలి 20 నిమిషాల్లో చకచకా సీన్లన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే అంజలి పనిచేసే మ్యాట్రిమోనీ కంపెనీలో అజిత్ చేరతాడో అక్కడి నుంచి సినిమాలో అసలు కథ మొదలవుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.ఫస్టాప్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్‌తో పాటు వీటీవీ గణేశ్ ఎపిసోడ్, హీరో తల్లి గతం ఎపిసోడ్ ఇలా డిఫరెంట్ లేయర్స్ చూపిస్తారు. స్టోరీ నుంచి సైడ్ అవుతున్నారేమో అనిపించినా చివరకొచ్చేసరికి హీరోహీరోయిన్‌ని కలపాలి కాబట్టి కలిపేశాం అన్నట్లు అనిపించింది. ఇలా ఒకటి రెండు కంప్లైంట్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఫీల్ గుడ్ మూవీ చూశాం అనిపిస్తుంది.చెప్పాలంటే ఇది చాలా సింపుల్ కంటెంట్.. బడ్జెట్ పరంగా చూసినా చిన్న సినిమా. కానీ స్టోరీలోని పాయింట్ బాగుంది. తెచ్చిపెట్టుకున్నట్లు కాకుండా సీన్లన్నీ చాలా సహజంగా ఉంటాయి. జీవితంలో ఓదార్చేవాళ్లు ఉన్నప్పుడు ఒంటరిగా బ్రతకడంలో అర్థం లేదనే మెసేజ్ కూడా బాగుంది. పేరుకే ప్రేమకథ అయినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్స్ చేసే కామెడీ కూడా ఆకట్టుకుంది.ఎవరెలా చేశారు?అజిత్ పాత్రలో కిషన్ దాస్ యాక్టింగ్ బాగుంది. అంజలి పాత్రలో శివాత్మిక రాజశేఖర్ బాగా చేసింది. మిగిలిన వాళ్లలో వీటీవీ గణేష్, తులసి పాత్రలు అసలెందుకు ఉన్నాయి అని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. కానీ కథని మలుపు తిప్పే పాత్రల్లో వీళ్లిద్దరూ ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా సెట్ అయింది. పాటల్లో మ్యూజిక్ బాగున్నా సాహిత్యం బాగోలేదు.డైరెక్టర్ సారంగు త్యాగు గురించి చెప్పుకోవాలి. సినిమాటిక్ లిబర్టీ అని ఏది పడితే అది తీసేయలేదు. సాదాసీదాగా ప్రేమ ఎలా ఉంటుందో అలానే చూపించాడు. చాలామంది ఈ పాత్రల్లో తమని తాము చూసుకునేలా తీశాడు. ఇతడికి టెక్నికల్ టీమ్, యాక్టర్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. ఓవరాల్‌గా చెప్పుకొంటే ఈ సినిమాని కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా) -
‘అఖండ 2: తాండవం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : అఖండ 2: తాండవంనటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంటరచన, దర్శకత్వం: బోయపాటి శ్రీనుసంగీతం: తమన్ ఎస్ ఎస్సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్,సంతోష్ డేటాకేఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: డిసెంబర్ 12, 2025 సింహ, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన నాలుగో చిత్రం ‘అఖండ 2: తాండవం’. 2021లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘అఖండ 2’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..చైనా ఆర్మీ జనరల్ తన కొడుకు చావుకు కారణమైన భారత్‌పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు. మాజీ జనరల్ సహాయంతో బయోవార్ ద్వారా భారత్‌ను దొంగదెబ్బ తీయాలనుకుంటాడు. ఇందుకుగాను భారత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్(కబీర్ దుల్షన్ సింగ్) ని పావుగా వాడుతాడు. అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మే దేవుడు లేడని నిరూపించి..వారిమధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు. అందులో భాగంగా మహా కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్ కెమికల్ కలిపిస్తాడు. దీంతో నదిలో స్నానం చేసినవారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు. ప్రతిపక్ష నేత ఠాకూర్ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు..అసలు దేవుడు అనేవాడే లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వాక్సిన్ కనిపెట్టే పనిలో ట్రైనీ సైంటిస్ట్, ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ(బాలకృష్ణ) కూతురు జనని(హర్షాలి మల్హోత్రా) సక్సెస్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ తన మనషులతో ఆ సైంటిస్టులను చంపేయిస్తాడు. జనని తప్పించుకొని పారిపోగా..ఠాకూర్ మనషులు ఆమెను వెతుకుతుంటారు. అదే సమయంలో రంగంలోకి దిగుతాడు అఖండ(బాలకృష్ణ). ఆ తర్వాత ఏం జరిగింది? ఠాకూర్ మనషుల నుంచి జననిని ఎలా కాపాడాడు? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు? ఆపద వస్తే వస్తాడు? అని ఎలా నిరూపించాడు? సనాతనధర్మం పాటించే భారతీయులను దొంగదెబ్బ కొట్టాలనుకున్న చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం నేర్పించాడు? ఇందులో నేత్ర(ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి(సంయుక్త) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Akhanda 2 Review In Telugu).ఎలా ఉందంటే.. బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో జనాలకు ఓ అంచనా ఉంది. అందులోనూ బోయపాటితో సినిమా అంటే.. లాజిక్ అనే పదాన్ని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఈ విషయం తెలిసి థియేటర్స్‌కి వెళ్లినా కూడా మన ఊహకు మించిన అనుభవం ఈ సినిమాలో ఎదురవుతుంది. లాజిక్స్ పక్కకి పెట్టి చూసినా కూడా సినిమాలోని కొన్ని సీన్లకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. దైవశక్తితో కథను ప్రారంభించిన బోయపాటి మధ్యలో దృష్టశక్తిని తీసుకొచ్చి.. చివరిలో దేశభక్తితో ముగించాడు. మధ్య మధ్యలో సనానతధర్మం గురించి క్లాసులు తప్పితే..ఒక్క సీన్ కూడా ఆకట్టుకునేలా ఉండదు. అసలు కథనమే ఊహకందేలా సాగితే..ఇక ఆసక్తి ఎలా పెరుగుతుంది?ఇక యాక్షన్ సీన్ల దగ్గరకు వస్తే..ప్రతిసారి త్రిశూలాన్ని అటు తిప్పడం..ఇటు తిప్పడం తప్ప కొత్తగా ఏమి ఉండదు. పైగా కొన్ని యాక్షన్ సీన్లు చూసినప్పుడు.. ‘బాలయ్య సినిమా కదా..అంతే..అంతే’అనుకోవాల్సిందే. మనిషిని తలకిందులు చేసి హారతి ఇవ్వాలన్నా.. త్రీశూలంతో హెలికాఫ్టర్ రెక్కల్ని గిరగిరా తిప్పాలన్నా... ఒక్కడే చైనా వెళ్లి ఆర్మీ సైన్యాన్ని మొత్తాన్ని చంపాలన్న.. ‘బాలయ్య సినిమాల్లోనే సాధ్యం’ అని మన మనసుకు నచ్చజెప్పుకోకపోతే.. క్లైమాక్స్ వరకు థియేటర్స్‌లో కూర్చోలేం. అసలే రొటీన్ కథ.. దానికి తోడు యాక్షన్ సీన్లు కూడా రొటీన్‌గా ఉండడంతో కథనం మొత్తం సాగదీతగా అనిపిస్తుంది.అఖండ సినిమాకు కొనసాగింపుగా కథను ప్రారంభించారు. ఆ చిత్రంలోని చిన్నపాప పెరిగి పెద్దదై.. సైటిస్ట్గా మారుతుంది. మరోవైపు అఖండ సోదరుడు బాలమురళీకృష్ణ ఎమ్మెల్యే అయినట్లు చూపించారు. బాలయ్య 1 ఎంట్రీ సీన్‌కో ఎలివేషన్.. బాలయ్య 2 ఎట్రీ సీన్‌తో ఎలివేషన్ అవి తప్ప మొదటి అరగంట కథే ఉండదు.పైగా శివుడు ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో బాలకృష్ణ ఎలివేషన్ తప్ప.. శివుడికి ఎలివేషన్ ఉండదు. ఒకటి రెండు సీన్లలో శివుడిని పవర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ మొత్తం రొటీన్‌గా సాగుతూ...ఇంటర్వెల్ సీన్ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లాడు. విరామానికి ముందు వచ్చే యాక్షన్ సీన్లు బాలయ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే..నార్మల్ ప్రేక్షకులు మాత్రం ‘అరె..ఎంట్రా ఇది’ అనుకుంటారు. ఉన్నంతలో సెకండాఫ్‌లో కథనం కాస్త పరుగులు తీస్తుంది. అయితే ప్రతిసారి అఖండ రావడం..ఓ క్లాస్ తీసుకోవడం బోర్ అనిపిస్తుంది. ఇక సినిమాలో బాలయ్య చెప్పే కొన్ని డైలాగులు అయితే.. అక్కడ సీన్‌తో సంబంధమే ఉండదు. పెద్ద పెద్ద డైలాగులు చెబుతాడు కానీ ఒక్కటి కూడా అర్థం కాదు. పైగా ఇప్పుడెందుకు ఈ డైలాగు చెప్పాడు? అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఆది పినిశెట్టి పాత్ర కూడా అనవసరంగా చొప్పించినట్లు అనిపిస్తుంది. దైవశక్తి కాన్సెప్ట్ ఉంది కాబట్టి.. దుష్టశక్తి సీన్లను కూడా చూపించాలనుకొని ఆది పాత్రను క్రియేట్ చేశారనిపిస్తుంది. ఆ పాత్ర ఎపిసోడ్ మొత్తం తీసేసినా.. అసలు కథకు ఎలాంటి ఇబ్బంది కలగదు. క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్లు కొంతమేర ఆకట్టుకుంటాయి. మొత్తంగా అఖండ 2 బాలయ్య అభిమానులకు కాస్త నచ్చవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా చూసి నీరసంగా నిట్టూరుస్తూ బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. బాలయ్య ఎప్పటి మాదిరే తెరపై హుషారుగా కనిపించే ప్రయత్నం చేశాడు.అయితే ఈ సారి మాత్రం తెరపై ఆయన వృద్ధాప్యం కొట్టొచ్చినట్టు కనిపిచ్చింది. ముఖ్యంగా అఖండ పాత్రలో ఆయన ముసలితనం మొత్తం బయటపడింది. ఇక యంగ్ బాలకృష్ణ పాత్ర లుక్ బాగుంది. పెద్ద పెద్ద డైలాగులు ఉన్నా.. ఒక్కటి కూడా అర్థం కాదు. మాస్ పాట కోసం ఆయన వేసిన స్టెప్పులు ఆకట్టుకోకపోగా..ట్రోలింగ్కి మెటీరియల్‌గా మిగిలిపోయాయి. విలన్‌గా ఆది పినిశెట్టి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ పాత్ర సినిమాలో అనవసరం అనే ఫీలింగ్ కలుగుతుంది. సంయుక్త పాత్ర పరిధి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. శివుడు పాత్ర చేసిన నటుడు బాగా నటించాడు. పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. (Akhanda 2 Movie Positives And Negatives)సాంకేతిక విభాగాల పనితీరు విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రామ్‌ప్రసాద్, సంతోష్ డేటాకే సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.(Akhanda 2 Review) -
'బెడ్రూమ్ వీడియో ల్యాప్‌టాప్‌లో బంధిస్తే'.. నునాకుజి మూవీ చూడాల్సిందే!
ఓటీటీలు వచ్చాక సినిమాల పరంగా కంటెంట్‌కు కొదువే లేదు. ఏ భాషలో తెరకెక్కించినా సరే డబ్బింగ్ చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతున్నాయి. అలా గతేడాది రిలీజైన మలయాళ చిత్రం నునుకుజి. ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు దృశ్యం డైరెక్టర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చదివేయండి.ఏబీ జకారియా (బసిల్ జోసెఫ్) మంచి కోటీశ్వరుడు. తన తండ్రి మాట కోసం రిమీ (నిఖిలా విమల్)ను పెళ్లాడాతాడు. తండ్రి చనిపోయాక.. వాళ్ల కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒక రోజు అనుకోకుండా ఏబీ జకారియా తన వింత కోరికతో చిక్కులో పడతాడు. భార్యతో శృంగారాన్ని రికార్డ్ చేసి, వీడియోగా తన ల్యాప్ టాప్‌లో స్టోర్ చేస్తాడు. భార్య ఎంతగా చెప్పిన డిలీట్ చేయడు. అదే అతన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఒక రోజు ఊహించని పరిణామాలతో ఏబీ జకారియా ల్యాప్‌టాప్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్స్ చేతికి వెళ్తుంది. ఈ విషయం తెలిసిన భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు ఆ ల్యాప్‌టాప్ చివరికీ జకారియాకు దొరికిందా? తన ల్యాప్ టాప్ కోసం జకారియా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నదే నునాకుడి కథ.ఎలా ఉందంటే..దృశ్యం డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీతూ జోసెఫ్ తన థ్రిల్లర్ కంటెంట్‌తో అభిమానులను కట్టిపడేయడంలో దిట్ట. ఆ విషయం దృశ్యం చూసిన వాళ్లకు ఈజీగా అర్థమైపోతుంది. నునాకుజి కథలో సస్పెన్స్‌తో పాటు కామెడీని జొప్పించారు. సున్నితమైన సబ్జెక్ట్‌తో సస్పెన్స్ క్రియేట్ చేసి ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చిపడేశాడు. నాలుగు గోడల మధ్య జరిగే తంతును కెమెరాలో బంధిస్తే ఎలాంటి ఇబ్బందులువు ఎదురవుతాయనే సింపుల్ సబ్జెక్ట్‌ను సీరియస్‌గా కాకుండా కామెడీ కోణంలో చూపించడం జీతూ జోసెఫ్‌కే సాధ్యమని చెప్పొచ్చు. ఎక్కడా కూడా సీన్స్ బోరింగ్ అనిపించవు. కథలో సీరియస్‌నెస్‌తో పాటు సమపాళ్లలో కామెడీ పండించేందుకు డైరెక్టర్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ కథ మొత్తం కేవలం ఆ ఒక్క ల్యాప్ టాప్ చుట్టే తిప్పాడు. చివరి వరకు ల్యాప్ టాప్ కోసం సాగిన ఈ కథలో క్లైమాక్స్‌లోనూ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తెలియాలంటే నునాకూజి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా జీ5 వేదికగా తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ వీకెండ్లో మంచి సస్పెన్స్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ కావాలంటే నునాకుజి చూసేయండి. ఎవరెలా చేశారంటే..మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ నటన మన తెలుగువారికి తెలిసిందే. బసిల్ జోసెఫ్ తన పాత్రలో అదరకొట్టాడు. రష్మిత రంజిత్ పాత్రలో గ్రేస్ ఆంటోనీ, నిఖిలా విమల్, సిద్దీఖి తమ పాత్రలకు న్యాయం చేశారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎస్ వినాయక్ ఎడిటింగ్ ఫర్వాలేదు. ఎక్కడా బోరింగ్ కొట్టకుండా కట్ చేశాడు. విష్ణు శ్యామ్ నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?
చాలా సినిమాలు థియేటర్లలో రిలీజై ఆపై ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. అలా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'స్టీఫెన్'. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇంతకీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్‌కి ఓ గుణపాఠం!) కథేంటి?స్టీఫెన్ జబరాజ్ (గోమతి శంకర్) అనే కుర్రాడు.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలని హత్య చేస్తాడు. తీరా పోలీసులు ఇతడిని పట్టుకుందామని అనుకునేసరికి దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోతాడు. కోర్ట్లోనూ ఇదే విషయాన్ని ఒప్పుకొంటాడు. దీంతో 15 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తుంది. పోలీసులు విచారణ మొదలుపెడతారు. ఇంతకీ స్టీఫెన్ ఎవరు? అతడి గతమేంటి? తొమ్మిది హత్యలు చేయడానికి కారణమేంటి? కృతిక ఎవరు? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓటీటీల్లో ఎక్కువమంది చూసేవి థ్రిల్లర్స్. సినిమాలు కావొచ్చు, వెబ్ సిరీస్‌లు కావొచ్చు సరిగా తీయాలే గానీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఉంటాయి. మరి 'స్టీఫెన్' ఎలా ఉందంటే ఓకే ఓకే అనిపిస్తుంది. ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని తెరకెక్కించిన విధానం బోర్ కొట్టిస్తుంది. తొలి గంటలో జరిగే సీన్స్ అన్నీ చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. తర్వాత నుంచి స్టోరీలో ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యేసరికి.. బాగానే తీశారే అనిపిస్తుంది.ఆడిషన్ కోసం పిలిచి అమ్మాయిలని స్టీఫెన్ హత్య చేయడం అనే పాయింట్‌తో సినిమా మొదలవుతుంది. తర్వాత ఇతడి కోసం పోలీసులు వెతకడం, ఇతడేమో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోవడం.. కోర్ట్‌లో హాజరు పరచడం.. తర్వాత పోలీస్ కస్టడీకి స్టీఫెన్ని అప్పగించడం ఇలా సీన్స్ చకచకా వెళ్తాయి. విచారణ మొదలైన తర్వాత స్టీఫెన్, అతడి గతం, తల్లిదండ్రులు ప్రవర్తన.. స్టీఫెన్ ఇలా ఎందుకు తయారయ్యాడు అనేది మనకు తెలుస్తుంది. కానీ అమ్మాయిలని ఎందుకు చంపాడు అనే ప్రశ్న మాత్రం మన మదిలో ఉండనే ఉంటుంది. దానికి సెకండాఫ్‌లో సమాధానం దొరుకుతుంది.సినిమా అంతా ఓకే ఓకే ఉంటుంది గానీ చివరి 20 నిమిషాలు మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అప్పటివరకు మనం చూసిందంతా అబద్ధం, ఇది కాక వేరే నిజం ఉంది అనే సీన్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది. దీనికి సీక్వెల్ కూడా ఉందని హింట్ ఇచ్చారు.సైకో కిల్లర్స్ అంటే ఎక్కడో ఉండరు. మన చుట్టుపక్కనే చాలా సాధారణంగా బతికేస్తుంటారు. కాకపోతే వాళ్ల మానసిక పరిస్థితి కారణంగా అమాయకులు బలైపోతుంటారనే విషయాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. ఈ స్టోరీలో చాలా కోణాలు ఉన్నాయి. ఓ సైకో కిల్లర్ అమ్మాయిలను చంపడం అనే కథని ఇదివరకే మనం చాలాసార్లు చూశాం. ఈ మూవీ స్టోరీ కూడా అదే అయినప్పటికీ కాస్త కొత్తగా ఉంటుంది. స్టీఫెన్ పాత్రలో చాలా షేడ్స్ కనిపిస్తాయి. అదే ఈ మూవీకి బలం. ఊహించని ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి.స్టీఫెన్ పాత్రలో గోమతి శంకర్ అనే కొత్త కుర్రాడు పర్లేదనిపించాడు. మరీ సూపర్ అని చెప్పలేం గానీ బాగా చేశాడు. ఇతడి తల్లిదండ్రులుగా చేసిన విజయ శ్రీ, కుబేరన్ ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు ఓకే ఓకే. టెక్నికల్‌గా ఈ సినిమా మరీ ఏమంత గొప్పగా అయితే అనిపించదు. కాకపోతే సైకలాజికల్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ మూవీస్ అంటే ఇష్టమున్న వాళ్లకు మాత్రం నచ్చేస్తుంది. అభ్యంతరకర సీన్స్ ఏం లేవు గానీ ఒంటరిగానే చూడండి.- చందు డొంకాన(ఇదీ చదవండి: చెల్లి పెళ్లి చేసిన యంగ్ హీరో.. ఎమోషనల్ పోస్ట్) -
లవ్ ఫెయిల్... సరదాగా నవ్వించే మూవీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఫెయిల్యూర్నాటి దేవదాసు నుండి నేటి గర్ల్ ఫ్రెండ్ వరకు ప్రేమను ఓ అందమైన దృశ్య కావ్యంగా చిత్రీకరించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. సక్సెస్ఫుల్ ప్రేమ ముందుగా ఫెయిల్యూర్‌తోనే పుడుతుంది. అది ఏ కాలమైనా, ప్రాంతమైనా, భాష అయినా ఇదే సిద్ధాంతం. అందుకేనేమో ఈ థీమ్‌తో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల మదిలో అలా పదిలంగా నిలిచిపోతాయి. కానీ ఓ సీరియస్ ప్రేమ అయిన స్వీట్‌కు కామెడీ అనే కారం తగిలిస్తే ఎలా ఉంటుందో తెలిపేదే ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’.ఎలా ఉందంటే?ఈ సినిమా పేరుతోనే దర్శకుడు ప్రేక్షకుడికి కాస్తంత గిలిగింతలు పెట్టించాడు. కాస్త లోతుగా గమనిస్తే సెటైరికల్ మోడ్‌లో మహా గమ్మత్తుగా ఉందీ టైటిల్. శశాంక్ ఖేతన్ ఈ కథ రాసి, దర్శకత్వం వహించారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రూ. వంద కోట్ల వసూళ్లు దక్కించుకుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.సన్నీ సంస్కారి తన గర్ల్ ఫ్రెండ్ అయిన అనన్యకు వినూత్న రీతిలో... ఇంకా చెప్పాలంటే బాహుబలి సెటప్‌లో కాస్త భారీగానే ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. సెటప్, గెటప్ అంతా బాగానే ఉన్నా అనన్య మాత్రం కోటీశ్వరుడైన విక్రమ్‌తో తన తల్లిదండ్రులు తనకు పెళ్ళి నిర్ణయించారని సంస్కారికి ససేమిరా నో చెబుతుంది. ఇది విన్న సన్నీ బాగా బాధపడి ఎలాగైనా అనన్యను సొంతం చేసుకోవాలని విక్రమ్ గురించి ఆరా తీస్తాడు. తులసీ కుమారి అనే అమ్మాయితో ఇటీవలే విక్రమ్‌కు బ్రేకప్ అయిన విషయం తెలుసుకొని తులసీ కుమారిని కలవడానికి వెళతాడు. ఈ లోపల అనన్య, విక్రమ్‌ల పెళ్ళి ఆహ్వాన పత్రిక సన్నీతో పాటు తులసీ కుమారికి కూడా అందుతుంది. తులసీతో కలిసి సన్నీ ఈ పెళ్ళి చెడగొట్టడానికి ఓ కుట్ర పన్నుతాడు (Sunny Sanskari Ki Tulsi Kumari Movie Review). మరి... సన్నీ ప్లాన్ సక్సెస్ అయి, అనన్యను పెళ్ళి చేసుకుంటాడా? అలాగే విక్రమ్, తులసీ కుమారి మళ్ళీ కలిసిపోతారా? అన్న విషయం మాత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ సినిమాలోనే చూడాలి. వరుణ్ తన ఈజ్‌తో... అలాగే జాన్వీ తన క్రేజ్‌తో యూత్‌ని బాగా అలరించే సినిమా ఇది. అక్కడక్కడా కాస్త ఓవర్ యాక్షన్ అనిపించినా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు... సరికదా సరదాగా సాగిపోతుంది. వర్త్ టు వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
గుల్మొహర్ రివ్యూ.. మనసును హత్తుకునే సినిమా
ఇల్లు అంటే కేవలం నాలుగు గదులు అంతేనా? కాదు, ఇల్లు అంటే కుటుంబంలో ఒక భాగం. కుటుంబసభ్యుల ప్రేమానురాగాలకు, అలకలకు, కోపతాపాలకు, రహస్యాలకు, విషాదాలకు.. ఇలా అన్నిరకాల జ్ఞాపకాలకు నిలువెత్తు నిదర్శనం. ఏళ్ల తరబడి ఉన్న సొంతింటిని వీడాలంటే కన్నతల్లికే దూరమవుతున్నట్లు మనసు తల్లడిల్లుతుంది. అలా ఇంటి చుట్టూ తిరిగే కథ గుల్మొహర్.అందరి ఇంటి కథమనోజ్ బాజ్‌పాయ్, షర్మిల ఠాగోర్, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన మూవీ గుల్మొహర్. రాహుల్ చిట్టెల, అర్పిత ముఖర్జీ ఇల్లు, అందులో ఉండే కుటుంబం గురించి కథ రాసుకున్నారు. చూడటానికి సింపుల్‌గా ఉన్నా కొన్ని సన్నివేశాలు మనసును కదిలిస్తాయి. కుసుమ్ బాత్రగా షర్మిల నటన ఆకట్టుకుంటుంది. అందరి ఇంట్లోలాగే తను కూడా ఇంటిపెద్దగా, నాయినమ్మగా పెత్తనం చెలాయిస్తుంటుంది. కానీ, తన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు.కథఅందరం కలిసికట్టుగా జీవించాలనుకునే వ్యక్తి అరుణ్ (మనోజ్ బాజ్‌పాయ్). కానీ అతడి కుమారుడు ఆది (సూరజ్ శర్మ) భార్యతో కలిసి విడిగా ఉండాలనుకుంటాడు. తండ్రి సాయం లేకుండా సొంతంగా తన కాళ్లపై నిలబడాలనుకుంటాడు. అది అరుణ్‌కు నచ్చదు. కుటుంబం ఎప్పుడూ ఒకేచోట ఉండాలన్నది అతడి విధానం. ఇంతలో అతడి తల్లి కుసుమ్ కూడా పుదుచ్చేరిలో ఇల్లు కొన్నానని, ఒక్కతే అక్కడ ఉండబోతున్నానని చెప్పి బాంబు పేలుస్తుంది. ఇది ఎవరికీ మింగుడు పడకపోయినా ఆమెను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయరు.ఎలా ఉందంటే?చేతి ఐదువేళ్లు ఒకేలా ఎలా ఉండవో.. ఇంట్లోని మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కొరిది ఒక్కో స్వభావం. దాన్ని సినిమాలో చాలా బాగా చూపించారు. (Gulmohar Movie Review) క్లైమాక్స్‌లో మనోజ్ తన నటనతో ఏడిపించేశాడు. ఆ ఇంట్లో చివరి హోలీ చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది. అది చూశాక మన మనసులు కూడా కాస్త తేలికపడతాయి. అందర్నీ ఇంతలా మెప్పించిన ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. -
ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
మీకు ఈ మధ్యే పెళ్లయిందా లేదంటే త్వరలో చేసుకోబోతున్నారా? అయితే ఈ సినిమా మీకోసమే. ఈ కాలంలో వైవాహిక బంధం నిలబడాలంటే ఏం కావాలి? అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు? ప్రస్తుత జనరేషన్లో విడాకులు కేసులు ఎందుకు ఎక్కువయ్యాయి తదితర అంశాలతో తీసిన తమిళ కామెడీ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. గత నెలలో థియేటర్లలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడు హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ)కథేంటి?శివ (రియో రాజ్) సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్దలు నిశ్చయించడంతో శక్తి(మాళవిక మనోజ్)ని పెళ్లి చేసుకుంటాడు. నెల రోజులు బాగానే ఉంటారు. కానీ తర్వాతే అసలు సమస్యలు మొదలవుతాయి. ఏడాది తిరిగేసరికల్లా కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కోర్టుకి వెళ్తారు. పెళ్లయిన ఏడాదికే శివ-శక్తి.. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలేం జరిగింది? చివరకు వీళ్లిద్దరూ కలిశారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?పెళ్లి జీవితం గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో ఇదొకటి. ప్రస్తుత జనరేషన్లో వివాహం చేసుకున్న జంటల జీవితం ఎలా ఉంటోంది? వాళ్ల జీవితంలో ఏమేం జరుగుతోంది? లాంటి విషయాలని చాలా రియలస్టిక్‌గా, హాస్యభరితంగా చూపించిన మూవీ ఇది.80, 90ల్లో అయినా ఇప్పటితరంలో అయినా పెళ్లి జీవితం నిలబడాలంటే ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటి చిన్న విషయాలే కావాలి. ఈ పాయింట్‌నే కాస్త కామెడీగా, కాస్త ఎమోషనల్‌గా ఇందులో చూపించారు. ఇప్పటి జనరేషన్.. పెళ్లికి గౌరవం ఇచ్చి, ఎలా కలిసిమెలిసి ఉండాలో క్లైమాక్స్‌లో కోర్టులో వచ్చే సీన్‌తో అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.వైవాహిక జీవితంలో ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు. అటు భర్త అయినా ఇటు భార్య అయినా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి. అప్పుడే బంధం బలంగా నిలబడుతుంది. ఈ విషయాన్ని చూపించిన విధానం.. ఊహించే విధంగా ఉన్నప్పటికీ చాలామందికి కనెక్ట్ అవుతుంది. అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూని హైలెట్ చేస్తూ అమ్మాయిలని విలన్‌గా చూపించినట్టు కొన్ని సీన్స్ అనిపిస్తాయి. కానీ ఇద్దరిలోనూ తప్పులున్నాయని చూపించడం సహజంగా అనిపిస్తుంది.అసలైన ఫెమినిజంకి సూడో ఫెమినిజంకి తేడా కూడా కొట్టినట్లు చూపించారు. భార్య భర్తల మధ్య ఇగో (పంతం) అనేది ఎంత ప్రమాదమో? చుట్టుపక్కన ఉన్నోళ్లు.. ఈ గొడవల్లో ఎంతలా పెట్రోల్ పోస్తారనే సీన్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. సోషల్ మీడియాలో ఫెమినిజం మైండ్ సెట్‌తో హడావుడి చేసే అమ్మాయి.. ఒకవేళ మన ఇంట్లో ఉంటే పరిస్థితి ఏంటి? పెళ్లికి ముందు చాలామంది కుర్రాళ్లు.. కాబోయే భార్యలకు చాలా ప్రామిస్‌లు చేసేస్తుంటారు కదా. వాటి వల్ల తర్వాత కాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కూడా కామెడీగా చూపించిన విధానం బాగుంది.'ఫెమినిస్ట్ అంటే.. భర్త, పిల్లలతో సంతోషంగా ఉండకూడదా ఏంటి?' అని ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇది చాలామంది ఆడపిల్లలు, మహిళలని ఆలోచింపజేస్తుంది. 50-50 అని గొడవపడటం కాకుండా.. 70-30, 30-70 అని అర్థం చేసుకుంటూ తగ్గి నెగ్గి కలిసి జీవించాలి అనే చెప్పే క్లైమాక్స్ అయితే సూపర్ అనిపిస్తుంది.అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా ఉంటే ఉన్నాయి. సినిమాలో స్టోరీ చాలావరకు ఊహించే విధంగా ఉంటుంది. కామెడీ బాగున్నా రెండు గంటల సినిమానే అయినా చాలాచోట్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. తెలుగు డబ్బింగ్ బాగున్నా సరే పాటల్లో సాహిత్యం అస్సలు అతకలేదు. హీరోహీరోయిన్ రియో రాజ్, మాళవిక మాత్రం సహజంగా నటించారు. ఓవరాల్‌గా ఈ వీకెండ్ ఏదైనా మంచి కామెడీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి. టైమ్ పాస్ అయిపోతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ) -
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. నేడు(నవంబర్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్) నాన్న చిన్నప్పుడే ల్యాండ్ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్)..కచ్చితంగా తమల్ని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి.. బర్త్‌డేని సెలెబ్రేట్ చేస్తారు. మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి..తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్ నర్సిరెడ్డి(అజయ్ గోష్) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి.. ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్స్టర్స్, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అనేదే ఈ సినిమా కథ(Revolver Rita Movie Story In Telugu). ఎలా ఉందంటే.. అనుకోకుండా హత్య చేయడం..ఆ శవాన్ని తరలించే ప్రయత్నం..ఈ క్రమంలో ఒక్కో ట్విస్ట్ బయటకు రావడం.. చివరకు ఈ హత్య వెనక కూడా ఓ రహస్యం ఉండడం..ఇలాంటి నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. రివాల్వర్ రీటా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ఓ హత్య చుట్టూ తిరిగే డార్క్ కామెడీ థ్రిల్లర్. కర్మ ఎవరినీ విడిచి పెట్టదు.. దాని ఫలితాన్ని అనుభవించక తప్పదనే కోణంలో ఈ మూవీ కథనం సాగుతుంది. అయితే దర్శకుడు ఎంచుకున్న ఈ పాయింట్ వినడానికి కొత్తగా అనిపిస్తుంది కానీ...తెరపై మాత్రం అది మిస్ అయింది. సినిమా చూస్తున్నంత సేపు దృశ్య 2 మొదలు మొన్నటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాల వరకు చాలా చిత్రాలు గుర్తుకువస్తాయి. కామెడీ అనుకొని రాసిన సన్నివేశాలు కూడా పెద్దగా పేలలేదు. ఉన్నంతలో రాధికా శరత్ కుమార్, రెడిన్ కింగ్స్లీ కాస్త నవ్వులు పంచారు. ఇక ట్విస్టులు అనుకొని రాసిన సన్నివేశాలు కూడా డార్క్ కామెడీ చిత్రాలు రెగ్యులర్‌గా చూసేవాళ్లు ఈజీగా పసిగట్టగలరు. కర్మ సిద్ధాంతం గురించి చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ప్రారంభంలోనే పాండిచ్చేరి డాన్ పాండ్య- నర్సిరెడ్డి మధ్య వైర్యానికి గల కారణం ఏంటో చెప్పి.. కథను కామెడీ జానర్లోని మార్చేశాడు. రీటా ఫ్యామిలీ పరిచయ సీన్లతో పాటు..పాండ్య హత్యవరకు అన్నీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. హత్య తర్వాత కథనం రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో వచ్చే చేజింగ్ సీన్లు.. బోరింగ్‌గా సాగుతాయి. ఒకటి రెండు చోట్ల రెడిన్ కింగ్స్లీ వేసే పంచ్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. అంతేకానీ సునీల్ సీన్లతో పాటు జాన్ విజయన్ సన్నివేశాలు కూడా రొటీన్‌గానే అనిపిస్తాయి. చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం ఆకట్టుకుంటాయి. అయితే ముందుగా చెప్పినట్లు ఈ తరహా కథలు చాలానే రావడం.. క్రైమ్, కామెడీ సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేకపోవడంతో.. ‘రివాల్వర్ రీటా’ తూట సరిగా పేలలేకపోయిందనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటకు వస్తారు.ఎవరెలా చేశారంటే.. టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్..మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అయితే కథలోనే కొత్తదనం లేకపోవడంతో.. ఆమె నటనలోనూ కొత్త కోణం ఏది కనిపించదు. రీటా తల్లి చెల్లమ్మగా నటించిన రాధిక శరత్ కుమార్.. అమాయకత్వపు పనులతో నవ్వులు పూయించింది. సునీల్ పాత్ర లుక్ చాలా సీరియస్‌గా ఉన్నప్పటికీ.. అది తెరపై కనిపించలేదు. జాన్ విజయన్ కూడా రొటీన్ పోలీసు పాత్రలో కనిపించాడు. రెడిన్ కింగ్స్లీ ఎప్పటి మాదిరే తనదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశాడు. బాత్రూం సీన్ ఒక్కటి బాగా వర్కౌట్ అయింది. సూపర్ సుబ్బరాయన్, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సీన్ రోల్డాన్ నేపథ్య సంగీతం ఓకే. దినేష్ కృష్ణన్. బి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్. కె.ఎల్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ
టైటిల్: ఆంధ్రకింగ్ తాలుకానటీనటులు: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేశ్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులునిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ దర్శకత్వం: మహేశ్‌బాబు పి.సంగీతం: వివేక్-మెర్విన్సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నూనిఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్విడుదల తేది: నవంబర్ 27, 2025రామ్ పోతినేని ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్లు అవుతుంది. ఆయన చివరగా `ఇస్మార్ట్ శంకర్`తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్స్, స్కంధతో పాటు భారీ అంచనాలతో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘ఆంధ్రకింగ్ తాలుకా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై రామ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. చాలా నమ్మకంతో ప్రమోషన్స్ గట్టిగా చేశాడు. మరి ఈ చిత్రంలో అయినా రామ్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూ(Andhra King Taluka Review)లో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000-2003 మధ్యకాలంలో సాగుతుంది. సూర్య(ఉపేంద్ర) ఓ స్టార్ హీరో. ప్లాప్ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ తెప్పించే అభిమానులు ఉన్నారు. అయితే వరుసగా తొమ్మిది సినిమాలు డిజాస్టర్ కావడంతో.. తన కెరీర్లో 100వ మూవీతో ఎలాగైన భారీ హిట్ కొట్టాలనే కసితో ఉంటాడు. అయితే 100వ సినిమా షూటింగ్ మొదలైన కొన్నాళ్లకే ఆగిపోతుంది. ఇక సినిమా చేయలేనంటూ నిర్మాత చేతులెత్తేస్తాడు. ఆ సినిమా పూర్తి చేయాలంటే మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ డబ్బు కోసం మరో నిర్మాతకు ఫోన్ చేస్తే.. తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో తండ్రి పాత్ర చేయమని అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా..తర్వాత ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకుంటాడు. ఈ విషయం నిర్మాతకు చెప్పేలోపే.. సూర్య అకౌంట్లో రూ. 3 కోట్లు వచ్చి చేరుతాయి. ఆ డబ్బు ఎవరేశారని ఆరా తీయగా..తన వీరాభిమాని సాగర్(రామ్ పోతినేని) గురించి తెలుస్తుంది. రాజమండ్రి సమీపంలోని గోడపల్లిలంక అనే ఒక చిన్న పల్లెటూరికి చెందిన సాగర్‌కు అంత డబ్బు ఎలా వచ్చింది? అసలు సాగర్‌కి హీరో సూర్య అంటే ఎందుకు అంత పిచ్చి? ప్రియురాలు మహాలక్ష్మీ(భాగ్యశ్రీ బోర్సె)ని దక్కించుకోవడం సాగర్ చేసిన చాలెంజ్ ఏంటి? ఆ చాలెంజ్‌లో సాగర్ గెలిచాలడా ఓడాడా? హీరోపై ఉన్న అభిమానం..సాగర్ని, తన ఊరిని ఎలా మార్చేసింది? అభిమానిని వెతుక్కుంటూ వచ్చిన హీరో సూర్యకి.. తెలిసొచ్చిన విషయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Andhra King Taluka Review). ఎలా ఉందంటే.. స్టార్ హీరోలకు వీరాభిమానులు ఉంటారు. జీవితంలో ఒక్కసారి కూడా ఆ హీరోని నేరుగా చూడకపోయినా.. ఆయన కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతారు. డబ్బులు ఖర్చు పెట్టి మరీ సినిమాను ఆడించే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి ఓ అభిమాని కథే ఈ సినిమా. ఇలా అభిమానిని ఆధారంగా చేసుకుని ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా కథ చాలా డిఫరెంట్. ఈ స్టోరీ పూర్తిగా హీరో-అభిమాని చుట్టూనే తిరుగుతుంది. అందులోనే గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథను చూపించారు. దర్శకుడు మహేశ్ ఎంచుకున్న పాయింట్ డిఫరెంట్‌గా ఉన్నా.. దాన్ని తెరపై ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం తడబడ్డాడు. ఈ కథకు బలమైన ‘మూడు కోట్ల’ సీన్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. ఓ అభిమాని.. హీరోకే మూడు కోట్ల రూపాయలు ఇచ్చాడంటే..అతని ప్రభావం ఫ్యాన్‌పై బలంగా ఉండాలి. ఇందులో ఆ బలమైన సన్నివేశాలు కూడా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. పైగా కథనం మొత్తం ఊహకందేలా సాగడం మరో మైనస్. అయితే పతాక సన్నివేశాలు మాత్రం హృదయాలను ఆకట్టుకుంటాయి. స్టార్ హీరో సూర్య 100వ సినిమా ఆగిపోయే సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఈ వార్త బటయకు రావడం..బయ్యర్లు ధర్నాకు దిగడం.. మూడు కోట్ల కోసం హీరో ప్రయత్నాలు చేయడం..ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచుతుంది. ఇక హీరో అకౌంట్లో రూ. 3 కోట్లు పడిన విషయం తెలిసిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. సూర్య వీరాభిమాని సాగర్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. రామ్ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఇక హీరోయిన్ పరిచయ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. వారిద్దరి పరిచయం.. ప్రేమలో పడడం..కాలేజీలో గొడవ..ఇవన్నీ రొటీన్‌గా సాగిపోతాయి. హీరో.. తన ఫేవర్ హీరో కోసం ఒకసారి.. హీరోయిన్ కోసం మరోసారి పరుగులు తీస్తూనే ఉంటాడు కానీ కథనం మాత్రం నెమ్మది, అక్కడక్కడే తిరుగుతుంది. చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలోనే మూడు కోట్ల ట్విస్ట్ ఊహించొచ్చు. అయితే ఆయా సన్నివేశాలు మాత్రం ఎమోషనల్‌గా సాగుతాయి. ‘మహాలక్ష్మీ థియేటర్’ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌లో హీరో-అభిమాని మధ్య వచ్చే సీన్లు హృదయాలను హత్తుకుంటాయి. సినీ స్టార్స్ అభిమానులంతా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఎవరెలా చేశారంటే.. హీరో సూర్య వీరాభిమాని సాగర్ పాత్రలో రామ్ ఒదిగిపోయాడు. పేరుకు ఇది హీరో-ఫ్యాన్ స్టోరీనే కానీ ఇందులో ఎక్కువగా కనిపించేది ఫ్యానే. హీరో రామ్ ఒక్కడే ఈ కథను తన భూజాన వేసుకొని ముందుకు తీసుకెళ్లాడు. ఎమోషనల్ సీన్లలోనూ అద్భుతంగా నటించాడు. ఇక మహాలక్ష్మీ పాత్రకి భాగ్యశ్రీ న్యాయం చేసింది. ఇందులో ఆమెది కూడా కీలక పాత్రే. తెరపై చాలా అందంగా కనిపించింది. రామ్-భాగ్యశ్రీ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. స్టార్ హీరో సూర్య పాత్రలో ఉపేంద్రని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఆయన నిడివి తక్కువే అయినా.. కథపై చాలా ప్రభావం చూపించింది. హీరో తండ్రిగా నటించిన రావు రమేశ్‌కు ఒకటి, రెండు బలమైన సన్నివేశాడు పడ్డాయి. రాహుల్ రామకృష్ణ, సత్య, మురళీశర్మ, తులసి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ - మెర్విన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివి(166 నిమిషాలు) కాస్త తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ
కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వచ్చేవే. కానీ రియలస్టిక్ చిత్రాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. అలా అని అవేదో గొప్ప మూవీస్ అని కాదు. మనకు తెలిసిన విషయాల్నే కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అలాంటి ఓ మూవీనే 'హౌమ్ బౌండ్'. మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్ బరిలో ఉంది. థియేటర్లలో రిలీజైనప్పుడు కొందరికే రీచ్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో దీని గురించి మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!)కథేంటి?ఇది షోయబ్ అలీ (ఇషాన్ కట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) అనే ఇద్దరు స్నేహితుల కథ. ఓ పల్లెటూరిలో వీళ్లిద్దరూ బతుకుంటారు. తక్కువ కులాలకు చెందిన వాళ్లు కావడంతో ఎవరూ వీళ్లకు కనీస గౌరవం ఇవ్వరు. పోలీస్ కానిస్టేబుల్ అయితే ఊరిలో తమకు గౌరవం దక్కుతుందని అనుకుంటారు. కానీ పరిస్థితులు వీళ్లపై పగబడతాయి. ఇంతకీ ఏమైంది? అలీ, చందన్.. పోలీస్ ఉద్యోగాలు సాధించారా లేదా? కరోనా వల్ల వీళ్ల జీవితంలో ఏం జరిగిందనేది అసలు స్టోరీ.ఎలా ఉందంటే?'ఏ ఫ్రెండ్షిప్, ఏ పాండమిక్ అండ్ ఏ డెత్ బిసైడ్ ద హైవే' అనే ఆర్టికల్ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇందులో కొత్త విషయాలు అంటూ ఏం ఉండవు. మన చుట్టూ జరిగేవే ఇందులోనూ కనిపిస్తాయి. మరి ఏంటి ప్రత్యేకత అంటే.. వాటిని చూపించిన విధానం. చాలా సహజంగా ఉంటుంది. 2025 వచ్చినా సరే ఇప్పటికీ సమాజంలో కుల, మత వివక్ష అనేది ఎంత దారుణంగా ఉందనేది కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమిది. మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే మూవీ ఇది.ప్రభుత్వం లేదా సమాజం చర్యల వల్ల ఎప్పుడూ ప్రభావితమయ్యేది దిగువ మధ్యతరగతి కుటుంబాలే. అది నోట్ల రద్దు కావొచ్చు, లాక్ డౌన్ కావొచ్చు. అసలు సామాన్య ప్రజలు ఈ పరిస్థితుల్ని ఎలా తట్టుకోగలరు అనేది ప్రభుత్వం ఎప్పడైనా ఆలోచిస్తుందా అనే ప్రశ్న రేకెత్తించేలా చేసే సినిమా ఇది. కరోనా అనేది ఇప్పుడు బతుకుతున్న చాలామంది జీవితాల్ని తలకిందులు చేసింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఉద్యోగాలు పోయాయి. చాలామంది కార్మికులు వందల కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లారు. చాలామంది మధ్యలోనే ప్రాణాలు కూడా విడిచారు. అలాంటి ఓ కథే ఈ సినిమా.కరోనా ఒక్కటే కాదు ఇప్పటికీ కులం కారణంగా కొందరూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాల్లోనూ ఎలాంటి అణిచివేతకు గురవుతున్నారనే విషయాన్ని మనసుని మెలిపెట్టేలా చూపించిన మూవీ ఇది. ప్రతి సీన్ చాలా సహజంగా ఉంటుంది. యాక్టర్స్ ఎవరూ కూడా నటిస్తున్నట్లు అసలు అనిపించదు. అంత సహజంగా చేశారు. లీడ్ యాక్టర్స్ అయిన ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ఫెర్ఫార్మెన్స్ కూడా అదే రేంజులో ఉంటుంది. ఇంటర్వెల్ ముందొచ్చే సీన్ కావొచ్చు క్లైమాక్స్‌లో తన స్నేహితుడు చనిపోయాడని తెలిసి బాధపడే సన్నివేశం గానీ మనల్ని కూడా ఏడిపించేస్తాయి.అలా అని ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే లేదు. రెండు గంటల మూవీలో చాలా డ్రామా ఉంటుంది. ఇందులో లీనమైతే తప్ప ఇది మీకు నచ్చదు. లేదు కమర్షియల్ అంశాలు కావాలనుకుంటే మాత్రం దీన్ని చూడొద్దు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 21న థియేటర్లలో 21 సినిమాలు రిలీజ్.. ఏది హిట్? ఏది ఫట్?) -
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
టైటిల్: 12 ఏ రైల్వే కాలనీనటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణికథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ & షోరన్నర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్ఎడిటర్ & డైరెక్టర్: నాని కాసరగడ్డనిర్మాణ సంస్థ:శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరిసంగీతం: భీమ్స్ సిసిరోలియోవిడుదల తేది: నవంబర్ 21, 2025అల్లరి నరేశ్ ఖాతాలో హిట్ పడి చాలా రోజులవుతుంది. కామెడీ వదిలి సీరియస్ సబ్జెక్టులతో చ్చినా.. సరైన విజయం అందడం లేదు. దీంతో ఈ సారి థ్రిల్లర్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘12 ఏ రైల్వే కాలనీ’. పోలిమేర సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పని చేసిన ఈ చిత్రం నేడు(నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వరంగల్‌లోని రైల్వే కాలనీకి చెందిన కార్తిక్(నరేశ్) ఓ అనాథ. స్నేహితులతో(హర్ష, గెటప్ శ్రీను, సద్దాం) కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వరంగల్ టిల్లు(జీవన్ కుమార్) దగ్గర పని చేస్తుంటారు. అదే కాలనీలో ఉంటున్న ఆరాధన(కామాక్షి భాస్కర్ల)తో ప్రేమలో పడతాడు. ఆరాధన మాత్రం కార్తిక్‌ని పట్టించుకోదు. ఎలెక్షన్స్‌కి మూడు రోజుల ముందు టిల్లు..కార్తిక్‌ని పిలిచి ఓ కవర్ ఇస్తాడు. అది ఓపెన్ చేయొద్దని..ఎవరికి తెలియకుండా దాచాలని చెబుతాడు. ఆ కవర్ని తన ఇంట్లో దాచుదామని తీసుకెళ్తుండగా..పోలీసులు రైడింగ్‌కు వస్తున్నారనే విషయం తెలుస్తుంది. దీంతో రెండు, మూడు రోజులుగా తాళం వేసి ఉన్న ఆరాధన ఇంట్లో అది దాచాలనుకుంటాడు. దొంగచాటుగా ఆ ఇంట్లోకి వెళ్లిన కార్తిక్‌కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. మూడు రోజుల క్రితమే ఆరాధన, ఆమె తల్లిని ఎవరో దారుణంగా హత్య చేస్తారు. ఆ హత్య చేసిందెవరు? వారి లక్ష్యం ఏంటి? అసలు ఆరాధన ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ముంబైలో ఉన్న డాక్టర్ షిండే(అనీష్ కురువిల్లా)కి ఆరాధనకు ఉన్న సంబంధం ఏంటి? చనిపోయిన ఆరాధన..కార్తిక్‌కి మాత్రమే ఎందుకు కనిపించింది? ఈ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రానా ప్రతాప్ (సాయి కుమార్) ఎలా ఛేదించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.విశ్లేషణ'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' లాంటి సినిమాలు విజయం సాధించడంలో స్క్రీన్‌ప్లే కీలక పాత్ర పోషించింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అలాంటి సినిమాలు అందించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం కావడంతో ‘12 ఏ రైల్వే కాలనీ’పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ అంతగా ఆకట్టుకోకపోయినా.. స్క్రీన్‌ప్లేతో ఏదో మ్యాజిక్ చేస్తాడులే అనుకున్నారు. కానీ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంతో ఈ చిత్రం ఘోరంగా విఫలం అయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎగ్జైట్ చేయలేదు. పైగా ఈ చిత్రానికి అసలు 12ఏ రైల్వే కాలనీ అని టైటిల్ ఎందుకు పెట్టారో.. తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడించారో అర్థమే కాదు. పోనీ.. ఆ యాసనైనా సరిగా వర్కౌట్ అయిందా అంటే అదీ లేదు. ఏదో అరువు తెచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇక కథ విషయానికొస్తే.. అసలు దర్శకుడు ఏం చెప్పి నరేశ్‌ని ఒప్పించాడో అర్థమే కాదు. ఒకటి రెండు ట్విస్టులతో స్టోరీ చెప్పేస్తే.. ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారా? క్లైమాక్స్ ఒకటి బాగుంటే.. సినిమా హిట్ అవుతుందా? లాజిక్కుల గురించి ఇక్కడ ప్రస్తావించకపోవడమే మంచింది. ఇంటర్వెల్ సీన్ మినహా ఫస్టాఫ్ మొత్తం బోరింగే అని చెప్పాలి. కొన్ని సీన్లను ఎందుకు పెట్టారో కూడా అర్థమే కాదు. ఏదో సంబంధం ఉన్నట్లుగా సెకండాఫ్‌లో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ..అక్కడ కూడా లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఉన్నంతతో ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్ మొత్తం మర్డర్ మిస్టరీ చుట్టూనే కథనం సాగుతుంది. స్క్రీన్‌ప్లే గందరగోళంగానే ఉంటుంది తప్ప..ఎక్కడ ఆకట్టుకోలేదు. క్లైమాక్స్‌లో ఓ పాత్ర ఇచ్చే ట్విస్టు బాగుంటుంది. అయితే అప్పటికే ప్రేక్షకుడి సహనం నశించిపోవడంతో.. అది కూడా అంత థ్రిల్లింగ్‌గా అనిపించదు.నటీనటుల విషయానికొస్తే.. అల్లరి నరేశ్ ఉన్నంతలో బాగానే చేశాడు కానీ కథలో దమ్ములేనప్పుడు ఎంత మంచి నటుడైనా ఏం చేయగలడు? ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానమే బాగోలేదు. ఇక తెలంగాణ యాసలో మాట్లాడేందుకు బాగానే ప్రయత్నించాడు కానీ.. న్యాచులారిటీ మిస్ అయింది. కామాక్షి భాస్కర్ల పాత్ర చుట్టూనే ఈ కథ నడుస్తుంది కానీ..ఆమెకు నటించే స్కోప్ అయితే లేదు. అభిరామి తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తంలో ఆమె నటన ఒక్కటే బాగా గుర్తుంటుంది. అనీష్, సాయికుమార్, హర్ష, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు.సాకేంతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ సిసిరోలియో బీజీఎం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణవిలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. -
మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ
ఓటీటీలో ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్‌ల్లో 'ద ఫ్యామిలీ మ్యాన్' ఒకటి. దర్శకద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్ తొలి సీజన్ 2019లో రిలీజై సూపర్ హిట్ కాగా 2021లో రెండో సీజన్ వచ్చింది. ఇందులో సమంత విలన్‌గా చేస్తే దీనికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మూడో సీజన్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సీజన్ తొలి రెండు సీజన్లని మెప్పించేలా ఉందా? ఈసారి శ్రీకాంత్ తివారీ ఎలాంటి అడ్వెంచర్స్ చేశాడనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఈశాన్య భారతంలో 'ఆపరేషన్ సహకార్' పేరుతో ప్రధానమంత్రి బసు ఓ ప్రాజెక్ట్ చేపడతారు. అక్కడి లోకల్ రెబల్ గ్రూప్స్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంటాయి. దీంతో వీళ్లతో సమావేశమయ్యేందుకు ఎన్ఐఏ ఛీప్ కులకర్ణి (దలీప్ తాహిల్), టాస్క్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్) నాగాలాండ్ వెళ్తారు. కానీ అనుహ్య పరిస్థితుల్లో కులకర్ణిని బడా డ్రగ్ డీలర్ రుక్మా(జైదీప్ అహ్లవత్), అతడి రెబల్ గ్రూప్, దారిలో కాపుకాసి దారుణంగా చంపేస్తుంది. ఈ ప్రమాదం నుంచి శ్రీకాంత్ తివారీ తీవ్రగాయాలతో బయటపడతాడు. కానీ కులకర్ణి మృతికి ఇతడే ప్రధాన అనుమానితుడు అవుతాడు. ఇన్నాళ్లు పనిచేసిన వ్యక్తులే తనని టార్గెట్ చేయడంతో శ్రీకాంత్, ఫ్యామిలీతో పాటు తప్పించుకుని పారిపోతాడు. తర్వాత ఏమైంది? ఇంతకీ మీరా(నిమ్రత్ కౌర్) ఎవరు? ద్వారక్ అనే ఎన్నారైతో ప్రధానమంత్రి బసు చేసుకున్న ఆయుధాల డీల్‌కి, కులకర్ణి చావుకి సంబంధమేంటి? భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని ఫీనిక్స్ గ్రామాల సంగతేంటి? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పేరు చెప్పగానే కామెడీ, క్రేజీ యాక్షన్ గుర్తొస్తుంది. తొలి సీజన్ ముంబై, ఢిల్లీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో జరగ్గా.. రెండో సీజన్ చెన్నై, శ్రీలంకలో జరిగింది. మూడో సీజన్‌కి వచ్చేసరికి మొత్తం సెటప్ మారిపోయింది. ఈశాన్య భారతంలో కథంతా నడిచింది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులు, అక్కడ రెబల్ గ్రూప్స్‌తో కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులు, పాకిస్థాన్-మయన్మార్‌తో కలిసి భారత్‌పై చైనా చేస్తున్న కుట్రలు.. ఇలా ఒకటేమిటి చాలా విషయాల్ని మూడో సీజన్లో చూపించారు. ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు.మూడో సీజన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగుంది. కాకపోతే ఏడు ఎపిసోడ్లలో చాలా విషయాలు చెప్పేందుకు ప్రయత్నించారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రెబల్ గ్రూప్స్‌ని అడ్డుపెట్టుకుని చైనా ఎలాంటి రాజకీయాలు చేస్తోంది. ప్రధానమంత్రి పక్కనుండే వాళ్లు ఇచ్చే సలహాల వల్ల అటు ప్రజలు, ఇటు ఆర్మీ.. ఎలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో చిక్కుకుంది. దేశం కోసం పనిచేసే శ్రీకాంత్ తివారీనే హత్యానేరంలో అనుమానితుడిగా ఎలా కార్నర్ అయ్యాడు. ఇలా ఒక్కొక్కటి నిదానంగా చెబుతూ వెళ్లారు.గత రెండు సీజన్లలో శ్రీకాంత్ తివారీ చేసే అడ్వెంచర్స్, ఫ్యామిలీ డ్రామా, కొడుకు, కూతురు చేసే హంగామా, తోటి ఉద్యోగి జేకే చేసే కామెడీ ఇలా అన్ని బ్యాలెన్స్‌గా ఉండేవి. కానీ ఈ సీజన్లో మాత్రం శ్రీకాంత్ తివారీ పాత్ర నుంచి అవి మిస్ అయిపోయాయి. స్టోరీతో పాటు వెళ్లడం వల్ల శ్రీకాంత్ పాత్ర ఎలాంటి అడ్వెంచర్స్ చేయడానికి వీలుపడదు. మొత్తం ఏడు ఎపిసోడ్లు కలిపి దాదాపు 6 గంటల 14 నిమిషాల నిడివి. ఇందులో యాక్షన్ 20 శాతం ఉంటే డ్రామా 80 శాతం వరకు ఉంటుంది. యాక్షన్ కావాలనుకుని సిరీస్ చూస్తే డిసప్పాయింట్ అవుతారు. లేదు డ్రామా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు శ్రీకాంత్ తివారీ పాత్రతో ట్రావెల్ అవుతాం.ఎప్పటిలానే శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో రుక్మా (జైదీప్ అహ్లవత్), మీరా(నిమ్రత్ కౌర్)తో బోలెడన్ని కొత్త పాత్రలు 'ద ఫ్యామిలీ మ్యాన్' ప్రపంచంలోకి ఎంటరయ్యాయి. ఎవరికి వాళ్లు అదరగొట్టేశారు. తొలి సీజన్లో కనిపించిన కల్నల్ విక్రమ్ (సందీప్ కిషన్), చెల్లం సార్, మేజర్ సమీర్ పాత్రలు ఈసారి కథలో కీలక మలుపులకు కారణమయ్యాయి. తెలుగు నటులు రవివర్మ, రాగ్ మయూర్ కాసేపు అలా కనిపిస్తారు. రాజ్-డీకే తీసిన 'ఫర్జీ' సిరీస్‌లోని మైకేల్ (విజయ్ సేతుపతి) పాత్ర.. కీలక సమయంలో శ్రీకాంత్ తివారీ పాత్రకు సహాయపడుతుంది. ఈసారి శ్రీకాంత్ భార్య సుచిత్రగా ప్రియమణికి నటించే స్కోప్ పెద్దగా దొరకలేదు. పిల్లలుగా చేసిన ఆశ్లేషా ఠాకుర్, వేదాంత్ సిన్హా ఓకే ఓకే.టెక్నికల్‌గా చూసుకుంటే మాత్రం స్టోరీ పరంగా చాలా విషయాలు చెప్పాలనుకున్నారు. ఆ విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరీ గొప్పగా ఏం లేవు గానీ డీసెంట్‌గా ఉన్నాయి. ఏడు ఎపిసోడ్ 'ఎండ్ గేమ్' అనేసరికి స్టోరీని పూర్తి చేస్తారేమో అనుకున్నాం. కానీ చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే ముగించారు. శ్రీకాంత్ తివారీ పాత్ర మయన్మార్‌లో ఉండిపోతుంది. విలన్ రుక్మా బుల్లెట్ గాయాలతో తప్పించుకుంటాడు. కథలో ప్రధానమైన ఆయుధాల డీల్ కూడా మధ్యలో ఆగిపోతుంది. ఇలా చాలా విషయాల్ని సస్పెన్స్‌లో పెట్టి సీజన్ ముగించారు. అంటే నాలుగో సీజన్ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. మరి అది ఎప్పుడొస్తుందో చూడాలి?-చందు డొంకాన -
'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్ ఇస్తుందా?
ప్రియదర్శి (Priyadarshi Pulikonda), ఆనంది (Anandhi) హీరో హీరోయిన్లుగా, సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘ప్రేమంటే..’ థ్రిల్ ప్రాప్తిరస్తు ఉపశీర్షికను చేర్చారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) థియేటర్స్‌లోకి వచ్చేసింది. మల్లేశం, బలగం, కోర్ట్ సినిమాలతో ప్రియదర్శికి క్రేజ్ బాగానే ఉంది. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలుగమ్మాయి ఆనంది ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ప్రేమ, పెళ్లి జీవితంతో ముడిపడిన కథతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?ప్రేమంటే కథ సాధారణంగానే మొదలైనప్పటికీ కేవలం 15 నిమిషాల తర్వాత యూనిక్ కాన్సెప్ట్‌గా ఉందే అనిపిస్తుంది. ప్రియదర్శి (మధు సూదన్/మది) సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్ బిజనెస్ చేస్తుంటాడు. ఆనంది (రమ్య) చదువు పూర్తి చేసి ఉద్యోగంలో ఉంటుంది. అయితే, వీరిద్దరు పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో ఊహించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని సంబంధాలు కూడా రిజెక్ట్ చేస్తుంటారు. అయితే ఒక పెళ్లిలో అనుకోకుండా మధి, రమ్య కలుసుకుంటారు. ఇద్దరి అభిరుచులు కలుస్తాయి. ఆపై వారి కుటుంబాలు కూడా కలిసిపోతాయి. తర్వాత పెళ్లితో ఒక్కటైపోతారు. రమ్యకు థ్రిల్లింగ్ అనిపించే పనులు చేయాలంటే ఇష్టం.. మధి తన కుటుంబం కోసం ఏమైనా చేయాలనే మనస్థత్వంతో ఉంటాడు. సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్ బిజనెస్ చేసే మధి రాత్రి సమయంలో తన టీమ్‌తో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. తన ప్రవర్తనలో ఏదో తేడా ఉందని రమ్య గుర్తిస్తుంది. అయితే, మధి గురించి అసలు విషయం తెలిసిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతుంది. ఇలాంటి సమయంలో రమ్యకు ఏం చెప్పి మధి ఒప్పించాడు..? మధి ఎందుకోసం దొంగతనాలు చేస్తున్నాడు..? ఫైనల్‌గా రమ్య కూడా మధితో పాటు చోరీలు చేయడానికి కారణం ఏంటి..? పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ జోడీ వేస్తున్న స్కెచ్ ఏంటి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రేమంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో అని ముందే ఊహించుకుంటాం. కానీ, అందుకు విరుద్దంగా లైఫ్ కొనసాగితే ఎలా ఉంటుందో ఈ మూవీలో చక్కగా చూపించారు. ప్రేమలో ఉన్నప్పుడు వారి ప్రయాణం థ్రిల్లింగ్‌గా, ఓ సాహసోపేతమైన ప్రయాణంలా ఉండొచ్చు. కానీ, ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారన్నది ప్రమంటేలో దర్శకుడు చూపించారు. కథలోని పాయింట్ కాస్త యూనిక్‌గా ఉన్నప్పటికీ చెప్పిన విధానం మాత్రం రెగ్యులర్ సినిమా కథలాగే ఉంటుంది. లాజిక్స్ వెతుకుతే సినిమా నచ్చకపోవచ్చు. ఫస్టాఫ్ ఫుల్ కామెడీగా మంచి ఎంటర్టైనర్గా ఉంటుంది. దొంగతనం అంటే ఇష్టం లేని రమ్య తన భర్త మధితో పాటు చేసేందుకు రెడీ అవుతుంది.. ఎందుకు అనేది బలమైన కారణం ఉండదు. కానీ, చోరీ చేసే ప్లాన్స్, సన్నివేశాలు తప్పకుండా థ్రిల్‌ను పంచుతాయి. నగరంలో వరుసగా చోరోలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును ఛేదించేందుకు హెడ్ కానిస్టేబుల్ సుమ (ఆశ) రంగంలోకి దిగుతుంది. ఆమెకు పై అధికారిగా వెన్నెల కిషోర్ (సంపత్) ఉంటాడు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అందరినీ మెప్పిస్తాయి. దొంగతనాల వెనుక ఎవరున్నారని తెలుసుకునేందుకు ఆశ జరిపిన విచారణ ప్రేక్షకులను మెప్పించేలా సరదాగానే కొనసాగుతుంది. థ్రిల్ ప్రాప్తిరస్తు క్యాప్షన్‌కు న్యాయం చేసేలా ప్రీఇంటర్వెల్ సీన్ అదరగొడుతుంది. ముఖ్యంగా సుమ, వెన్నెల కిషోర్, ఆది, రామ్ ప్రసాద్ సరదా సంభాషణలు నవ్వులను తెప్పిస్తే.. ప్రియదర్శి, ఆనంది చేసే చోరీలు తప్పకుండా థ్రిల్‌ను పంచుతాయి. పాటలు పెద్దగా మెప్పించవు. సెకండాఫ్ కొంచెం మైనస్. ఫైనల్‌గా ప్రేమంటే సినిమా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ రైడ్ అని చెప్పొచ్చు.ఎవరెలా చేశారంటే..?ప్రియదర్శి కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లలో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ నటించారు. తెలుగమ్మాయి ఆనంది తన నటనతో దుమ్మురేపింది. ఫుల్ ఎనర్జీగా స్క్రీన్‌పై కనిపించడమే కాకుండా భావోద్వేగ సీన్స్‌లలో మెప్పించింది. ఈ మూవీకి మరో ప్రధాన బలం సుమ, వెన్నెల కిషోర్ జంట.. వీరిద్దరి మధ్య మరికొన్ని సరదా సీన్లు ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. సుమ వేసే పంచ్‌లకు వెన్నెల కిషోర్ ఇచ్చే రియాక్షన్ పంచ్‌లకు అదిరిపోయేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సీన్స్‌కు తగ్గట్లు సంగీతం ఉండటంతో ప్రెక్షకులు కనెక్ట్ అవుతారు. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ ప్రేమంటే చిత్రంతో తన టాలెంట్ చూపించాడు. దొంగతనం సీన్స్ తెరకెక్కించిన తీరు భేష్ అనిపించేలా ఉంటాయి. 'ప్రేమంటే' థ్రిల్ ఉంటది. -
‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ
టైటిల్: రాజు వెడ్స్ రాంబాయినటీనటులు: అఖిల్ ఉడ్డెమారి, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులునిర్మాణ సంస్థ: డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌నిర్మాతలు:వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవిదర్శకత్వం: సాయిలు కంపాటిసంగీతం: సురేశ్ బొబ్బిలిసినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్విడుదల తేది: నవంబర్ 21, 2025‘రాంబాయి నీ మీద నాకు మనసాయనే..’ అనే పాటతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే ఓ సినిమా వస్తుందన్న విషయం జనాలకు తెలిసింది. అప్పటి వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. కానీ పాట హిట్ అవ్వడం..ట్రైలర్ ఆకట్టుకోవడంతో ‘రాజు వెడ్స్ రాంబాయి’పై అంచనాలు పెరిగాయి. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్లో ‘ఈ సినిమా హిట్ కాకపోతే అమీర్‌పేట్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా’ అని చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి చాలెంజ్ చేయడం..ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకం నిజమైందా? లేదా? రివ్యూ(Raju Weds Rambai Review)లో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా..2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్-ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊళ్లో రాజు(అఖిల్ రాజు) బ్యాండ్ కొట్టడంలో చాలా ఫేమస్. పెళ్లికి అయినా..చావుకైనా రాజుగాడి బ్యాండ్ మోగాల్సిందే. నాన్న(శివాజీ రాజా) వద్దని చెప్పినా బ్యాండ్ కొట్టే పనిని వదలడు రాజు. అంతేకాదు హైదరాబాద్ వెళ్లి ఏదో ఒక పని చేయమని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేసినా.. వినిపించుకోడు. దానికి కారణం రాంబాయి(తేజస్విని రావ్). ఆమె అంటే రాజుకి చచ్చేంత ప్రేమ. రాంబాయి మొదట్లో రాజు ప్రేమను వ్యతిరేకించినా..కొన్నాళ్ల తర్వాత తిరిగి ప్రేమిస్తుంది. రాంబాయి తండ్రి వెంకన్న(చైతన్య జొన్నలగడ్డ)కి మాత్రం..తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రాజుతో పెళ్లంటే నాన్న ఒప్పుకోడనే భయంతో ముందే గర్భవతి కావాలనుకుంటుంది రాంబాయి. రాజుతో ఈ విషయం చెప్పి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం వెంకన్నకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? వెంకన్న మూర్ఖత్వం రాజు-రాంబాయి ప్రేమకు ఎలాంటి ఇబ్బంది కలిగించింది? చివరకు రాజు-రాంబాయి పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే...పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. రాజు వెడ్స్ రాంబాయి సినిమా నేపథ్యం కూడా అలాంటిదే. అయితే ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు అగ్రవర్ణాల్లోనే పరువు హత్యలు ఉన్నట్లుగా చూపించారు. కానీ అణగారిన వర్గాల్లోనూ పరువు హత్యలు జరుగుతాయని కళ్లకు కట్టినట్లుగా చూపించడం రాజు వెడ్స్ రాంబాయి ప్రత్యేకత. ఇది కల్పిత కథ కాదు.. నిజంగా జరిగిన సంఘటన. 2010 ప్రాంతంలో ఇల్లందు అనే పల్లెటూరిలో జరిగిన ఓ పరువు హత్య ఘటనకు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. దానికి కారణం ఇంతరవకు ఏ జంటకు ఎదురు కానీ ఓ దుర్మార్గం ఈ ఘటనలో ఉంది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కుతాయి. అయితే అది క్లైమాక్స్ మాత్రమే. మిగతా కథంతా రెగ్యులర్ లవ్‌స్టోరీనే గుర్తు చేస్తుంది. 2010 నాటి స్టోరీ కావడంతో..అప్పటి యువత చేసే అల్లరి పనులు..ముఖ్యంగా గ్రామాల్లోనే ఉండే యువతీయువకులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది..90స్ కిడ్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఇదంతా ఫస్టాఫ్ వరకే. సెకండాఫ్‌లో కథను సాగదీశారు. ఓ ప్రేమ జంట పెళ్లిలో రాజు చేసే హడావుడి సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. రాంబాయి ఎంట్రీ తర్వాత కథనం పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. తన ప్రేమ విషయాన్ని చెప్పేందుకు రాజు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ఒకవైపు వీరిద్దరి లవ్‌స్టోరీ.. మరోవైపు రాజు గ్యాంగ్ చేసే అల్లరితో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. రాజు-రాంబాయి లవ్‌స్టోరీ వెంకన్నకు తెలిసిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ భావోద్వేగానికి గురి చేస్తుంది. సెకండాఫ్ మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. ప్రేమ విషయం తెలిసిన తర్వాత వెంకన్న చేసే పనులు.. రాజు-రాంబాయి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గా ఉంటాయి. పైగా కథనం నెమ్మదిగా సాగడంతో చాలా బోరింగ్ అనిపిస్తుంది. అయితే చివరి 20 నిమిషాలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సీన్ షాకివ్వడమే కాకుండా గుండెను బరువెక్కిస్తుంది. సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా? అనే భయం ఒకవైపు.. ఇప్పటికీ రాజు-రాంబాయి లాంటి స్వచ్ఛమైన ప్రేమికులు కూడా ఉన్నారా? అనుమానంలో ప్రేక్షకుడు థియేటర్స్ నుంచి బయటకు వస్తాడు. ఎవరెలా చేశారంటే.. హీరోహీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే అయినప్పటికీ చాలా బాగా నటించారు. అన్ని రకాల ఎమోషన్స్‌ని పండించారు. తెలంగాణ యాసని చక్కగా పలికారు. కొన్ని సీన్లలో తేజస్వీరావు ఎంతో అనుభవం ఉన్న నటిలాగా నటించింది. వెంకన్నగా చైతన్య నటన ఈ సినిమాకే హైలెట్. చాలా బాగా నటించాడు. అయితే రైటింగ్ లో లోపం వల్ల కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్‌గా నటించినవారంతా బాగా చేశారు. ముఖ్యంగా డాంబర్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. శివాజీరాజాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. తెలంగాణ పల్లెటూరి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘పాంచ్ మినార్’ మూవీ రివ్యూ
టైటిల్: పాంచ్ మినార్నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలునిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్ LLPసమర్పణ: గోవింద రాజురచన & దర్శకత్వం: రామ్ కడుములనిర్మాతలు: మాధవి, MSM రెడ్డిసంగీతం: శేఖర్ చంద్రడీవోపీ: ఆదిత్య జవ్వాదివిడుదల తేది: నవంబర్ 21, 2025రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్లు అవుతుంది. ఆయన నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి కానీ.. కొన్ని అయితే రిలీజ్ అయిన విషయం తెలిసేలోపే థియేటర్స్ నుంచి వెళ్లిపోయాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ యంగ్ హీరో. కాస్త గ్యాప్ తీసుకొని ఈ సారి క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పాంచ్ మినార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రంతో అయినా రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే..కృష్ణచైతన్య అలియాస్ కిట్టు(రాజ్ తరుణ్) ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. ప్రియురాలు ఖ్యాతి(రాశి సింగ్) ఒత్తిడి చేయడంతో సాఫ్ట్వేర్ జాబులో జాయిన్ అయ్యానని అబద్దం చెప్పి.. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతో తనకు చెవుడు ఉన్నట్లుగా నటిస్తాడు. ఓ రోజు ఇద్దరు కిరాయి హంతకులు కిట్టు క్యాబ్‌ని బుక్ చేసుకొని.. అతని ముందే గ్యాంగ్‌స్టర్ చోటు(రవి వర్మ)ని హత్య చేస్తారు. ఈ హత్య చేసినందుకు మూర్తి(అజయ్ ఘోష్) వారికి రూ. 5 కోట్లు ఆఫర్ చేస్తాడు. ఆ డబ్బుని తీసుకునేందుకు వెళ్తున్న క్రమంలో హంతకులు పోలీసులకు చిక్కుతారు. చెవిటి వాడిలా నటించిన కిట్టు.. హంతకులకు తెలియకుండా ఆ డబ్బుని కొట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈజీగా వచ్చిన డబ్బు.. కిట్టుకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? తనను చంపేందుకు కుట్ర పన్నిన హంతకులు, సీఐ (నితిన్ ప్రసన్న)ల నుంచి కిట్టు ఎలా తప్పించుకున్నాడు? చివరకు రూ. 5 కోట్లు ఎవరికి దక్కాయి? ఈ కథకు ‘పాంచ్ మినార్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఇదొక మంచి క్రైమ్ కామెడీ సినిమా.ఉద్యోగం సాధించాలనే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు ఎలాంటి సమస్యలో ఇరుక్కున్నాడు అనేది ఈ చిత్ర కథాంశం. కొత్త కథ అని చెప్పలేం కానీ.. జానర్‌కు తగ్గట్లు ప్రతి సందర్భంలో నుంచి థ్రిల్.. వినోదాన్ని పుట్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామ్ కడుముల. ఒకవైపు నవ్వులు పూయిస్తూనే..మరోవైపు తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచేలా చేశాడు. హీరో పాత్ర ప్రాబ్లమ్స్లో నలిగిపోతున్న ప్రతిసారి ప్రేక్షకులు నవ్వుతారు. చోటు తండ్రి మరణించే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ..ఉద్యోగం కోసం ఆయన పడే పాట్లు.. అన్నీ నవ్వులు పూయిస్తాయి. చోటు హత్య తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. పాంచ్ మినార్ పదం కిట్టు జీవితాన్ని ఎలా మార్చేసిందనేది తెరపై చూడాల్సిందే. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం పరుగులు తీస్తుంది. తన ప్రాణాలతో పాటు డబ్బుని కూడా రక్షించుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు అలరిస్తాయి. చిన్న చిన్న టిస్టులు థ్రిలింగ్ కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ ట్విస్ట్ అదిరిపోతుంది. ఎలాంటి వల్గారిటీ, రక్తపాతం లేకుండా ఫ్యామిలీ అందరూ కలసి హాయిగా నవ్వుకుని చూసే క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఈ పాంచ్ మినార్.ఎవరెలా చేశారంటే...కిట్టు పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా నటించాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే..ఇందులో రాజ్ తరుణ్ చాలా హుషారుగా కనిపించాడు. ఆయన పాత్ర సమస్యల్లో ఇరుకున్న ప్రతిసారి ప్రేక్షకుడు నవ్వుతాడు. ఖ్యాతి పాత్రకి రాశిసింగ్ న్యాయం చేసింది. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐగా నితిన్ ప్రసన్న చక్కగా నటించాడు. కామెడీ విలన్‌గా అజయ్ ఘోష్ తనదైన శైలీలో నటించి మెప్పించాడు. సుదర్శన్, లక్ష్మణ్‌లు పంచ్ డైలాగ్స్‌లో నవ్వులు పూయించారు. మరోవైపు హీరో తండ్రిగా బ్రహ్మాజీ తెరపై కనిపించేది కాసేపే అయినా..బాగా నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంగా ఉన్నాయి.-రేటింగ్: 2.75/5 -
అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఓటీటీల్లో మలయాళ సినిమాలనే ఎందుకు ఎక్కువగా చూస్తారు? అంటే సమాధానం చాలా సింపుల్. కథలు, పాత్రలు సహజంగా ఉంటాయి. మంచి థ్రిల్ ఇస్తాయి లేదంటే ఫుల్ కామెడీ అనిపిస్తాయి. కొన్నిసార్లయితే ఇలాంటి ఓ పాయింట్తోనూ సినిమా తీయొచ్చా అని ఆశ్చర్యపరుస్తాయి. అలా ఇప్పుడు 'అక్రమ సంబంధం' అనే సీరియస్ అంశంపై పూర్తి కామెడీగా ఓ మూవీ తీశారు. అదే 'అవిహితం'. రీసెంట్గా ఇది హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ పల్లెటూరు. ప్రకాశ్ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో మందు పార్టీ చేసుకుని ఇంటికి తిరిగొస్తుంటాడు. ఓ చోట అలికిడి అయ్యేసరికి అటువెపు వెళ్తాడు. ఆ చీకటిలో వినోద్ అనే కుర్రాడు.. మరో యువతితో కలుసుకోవడం చూస్తాడు. పక్కనే నిర్మల ఇల్లు ఉండేసరికి చీకటిలో ఉన్నది ఆమెనే అనుకుంటాడు. తర్వాత ఈ విషయాన్ని వేణు అనే వ్యక్తికి చెబుతాడు. అలా ఒకరి నుంచి ఒకరికి చాలామందికి దీని గురించి తెలుస్తుంది. చివరకు ఈ సంగతి.. నిర్మల భర్త ముకుందన్ వరకు చేరుతుంది. ఇంతకీ చీకటిలో కనిపిస్తున్న యువతి ఎవరు? వినోద్-నిర్మల విషయంలో అందరి అనుమానం నిజమైందా? చివరకు అందరూ కలిసి ఏం చేశారనేదే స్టోరీ.ఎలా ఉందంటే?సిటీలో తక్కువ గానీ గ్రామాల్లో గాపిస్ కల్చర్ ఎక్కువే. ఏదైనా ఓ విషయం జరగ్గానే అమ్మలక్కలు చేరిపోయి ముచ్చట్లు పెడతారు. చేయాల్సిన పనులన్నీ గాలికొదిలేసి సదరు పుకార్ల గురించే తెగ మాట్లాడుకుంటారు. ఈ సినిమా కూడా సేమ్ అలాంటి ఓ పాయింట్‌తోనే తీశారు. రాత్రిపూట చీకటిలో ఓ యువతీ యువకుడు కలుసుకోవడం ముందు ఒకడు చూస్తాడు. అది ఇంకోకడికి చెబుతాడు. ఈ ఇద్దరు మరో ఇద్దరికి చెబుతారు. అలా ఇదో పెద్ద డిస్కషన్ అయిపోతుంది.సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే 'అక్రమ సంబంధం' అనే అసలు పాయింట్ రివీల్ అవుతుంది. చీకటిలో కనిపించిన అమ్మాయి ఎవరో ఒక్కరికి కూడా తెలియదు. కానీ పక్కనోడు చెప్పాడని, పరిస్థితులు సింక్ అవుతున్నాయని 'ఆమె'నే అని అందరూ ఫిక్స్ అయిపోతారు. ఎలాగైనా సరే ఆమెని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేస్తారు. రాత్రయితే చాలు ఈ విషయం తెలిసిన ఒక్కడూ నిద్రపోడు. చీకటిలో వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారా అని మాత్రమే ఆలోచిస్తుంటారు. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్. దానికి తోడు ఓ మెసేజ్. సందేశం కదా అని స్పీచుల్లాంటివి ఉంటాయని అనుకోవద్దు. సింపుల్‌గా రెండు మూడు సీన్లతోనే చాలామంది భర్తలకు కళ్లు తెరిపించే మెసేజ్ ఇచ్చారు.డార్క్ కామెడీ జానర్ కావడంతో అడల్ట్ టచ్ జోక్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ గీత దాటకుండా ఉంటాయి. ఇవి అర్థమైతే మాత్రం ఫుల్‌గా నవ్వుకుంటారు. చూస్తున్నంతసేపు మంచి టైమ్ పాస్ అవుతుంది. సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటంటే పల్లె వాతావరణంలో చాలా సహజంగా ఉంటుంది. ఇదేదో మన ఊరిలో జరుగుతుందా అనిపిస్తుంది. యాక్టర్స్ ఎవరో గానీ పాత్రల్లో జీవించేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వన్ లైనర్స్ భలే పేలాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అయితే ఇలాంటి ఓ పాయింట్తోనూ సినిమాని తీయొచ్చు. ప్రేక్షకుల్ని అలరించొచ్చని ఇది చూశాకే అర్థమైంది.-చందు డొంకాన -
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్‌లు ఎప్పటికీ మెప్పిస్తాయి. అయితే, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా సీజన్-3 వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం బాగుందని సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దర్శకులు తనూజ్ చోప్రా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో షెఫాలీ షా, హ్యుమా ఖురేషి, రసికా దుగ్గల్, రాజేష్ తైలాంగ్, యుక్తి తరేజా తదితరులు నటించారు. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. రెండూ భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. సీజన్-3లో హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే ఓ మహిళను డీసీపీ (షెఫాలీ) ఎలా పట్టుకున్నారో చూపించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ బోర్ అనిపించదు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.కథేంటి..?అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ఒక ముఠాకు వ్యతిరేకంగా డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ), ఆమె బృందం చేసే పోరాటమే ఢిల్లీ క్రైమ్-3 కథ.. 2012లో జరిగిన బేబీ ఫలక్ కేసు నుండి ప్రేరణగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి కథ మొదలౌతుంది. 2012లో 15 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరుతుంది. బాలికను వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో ఆమె పుర్రె విరిగిపోయి, శరీరంపై మానవ కాటు గుర్తులు ఉన్నట్లు గుర్తించి షాక్ అవుతారు. తమ కెరీర్లో ఎప్పుడు కూడా ఇంతటి ఘోరమైన కేసును చూడలేదని డాక్టర్లు చెబుతారు. దీంతో బాలిక కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుంది. పోలీసుల ఎంట్రీతో కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసును ఛేదించేందుకు డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్ రంగంలోకి దిగుతుంది. ఇంతకు ఈ బాలికను ఆసుపత్రిలో చేర్పించింది ఎవరు అనే పాయింట్ నుంచి విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే అస్సాం నుండి ఒక ట్రక్‌లో కొన్ని వెపన్స్ వస్తున్నాయని ఆమెకు సమాచారం అందడంతో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రక్‌ను ఆపుతుంది. అయితే, ఆ ట్రక్‌లో వెపన్స్ బదులు పదుల సంఖ్యలో ఆడపిల్లలు ఉండడంతో షాక్ అవుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నట్లు వర్తికా గుర్తిస్తుంది. ఇక్కడి నుంచే ఆమె తీగలాగడం మొదలుపెడుతుంది. అమ్మాయిలను అక్రమంగా తరలిస్తుంది ఎవరు..? ఢిల్లీలో ఈ మూఠా వెనుకున్నది ఎవరు..? హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న బాలికకు ఈ ముఠాతో ఉన్న లింక్ ఏంటి..? 15 ఏళ్ల బాలికన అంత ఘోరంగా చిత్రహింసలు చేయడానికి కారణం ఏంటి.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరు..? ఫైనల్‌గా ఆ బాలిక బతికిందా..? వంటి అంశాలు తెలుసుకోవాలంటే డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్ చేసిన ఢిల్లీ క్రైమ్-3 ఇన్విస్టిగేషన్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..?క్రైమ్ ఇన్విస్టిగేషన్ సినిమాలు ఎప్పుడూ కూడా ఆసక్తిని కలిగించేలా ఉండాలి. ఈ విషయంలో దర్శకులు తనూజ్ చోప్రా విజయం సాధించారు. కేవలం 6 ఏపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఎక్కువగా అనాథలు, పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలే ఈ మూఠా ఎలా టార్గెట్ చేస్తుంది అనే పాయింట్‌ను చాలా చక్కగా చూపించారు. అమ్మాయిలను ఆశ చూపించి కొన్ని ముఠాలు ఎలా కోట్లు సంపాదిస్తున్నాయో కూడా తెరపై కళ్లకు కట్టినట్లు చూపారు. ఆయుధాల మాదిరిగానే అమ్మాయిలు కూడా పాలు, నీళ్ల ట్యాంకర్లతో పాటు కంటెయినర్లలో ఎలా తరలిస్తారనేది దర్శకుడు ఈ కథలో చక్కగా ఆవిష్కరించారు. ఇలాంటి కేసులను ఛేదించేందుకు పోలీసులు ఎంత రిస్క్ చేస్తారనేది అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా మెప్పిస్తుంది. అస్సాం, హర్యానా, మిజోరాం, సూరత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలను ప్రధానంగా టచ్ చేస్తూ ఈ కథను నడిపించిన తీరు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. అమ్మాయిల జీవితాలను నాశనం చేసే ముఠాల నుంచి కాపాడటానికి ప్రాణాలకు తెగించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారనే విషయాన్ని ఈ సిరీస్ క్లియర్‌గా చూపుతుంది.ఢిల్లీ క్రైమ్-3 రియల్ స్టోరీ. కథ చాలా బలంగానే ఉంటుంది. అయితే, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ముఖ్యంగా క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో షెఫాలీ మరోసారి దుమ్మురేపింది. హ్యుమా, యుక్తి తరేజా తప్ప మిగతా కీలకపాత్రధారులందరూ పాత సీజన్లలో కనిపించినవారే కావడంతో ప్రేక్షకులు త్వరగానే కనెక్ట్ అవుతారు. కె-ర్యాంప్తో హిట్ కొట్టిన యుక్తి తరేజా ఈ సిరీస్‌లో దూకుడు స్వభావం గల లేడీ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించింది. ఈ సిరీస్‌కి ఒన్నాఫ్ ది హైలైట్ పాత్ర ఆమెదే అని చెప్పొచ్చు. ఇలాంటి కథలు చాలా థ్రిల్లింగ్ డ్రామాలా కొనసాగితే ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది. కానీ, ఈ విషయంలో కాస్త మైనస్ అని చెప్పాలి. కీలక సన్నివేశాల్లో తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు బాగా అంచనా వేయడంతో గొప్పగా సస్పెన్స్‌లకు ఛాన్స్ ఉండదు. కానీ, ఫైనల్‌గా అందరికీ ఢిల్లీ క్రైమ్-3 నచ్చుతుంది. -
‘కాంత’ మూవీ రివ్యూ
‘మహానటి’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంత’. సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1950 బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్టార్ హీరో- దర్శకుడి చుట్టూ తిరుగుతుంది. అయ్య(సముద్రఖని) ఓ గొప్ప సీనీ దర్శకుడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శాంత’. ‘నట చక్రవర్తి’ టీకే మహదేవన్ అలియాస్ టీకేఎం(దుల్కర్ సల్మాన్) హీరోగా ప్రారంభమైన ఈ సినిమా ఓ కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఈ కథను టీకే మహదేవన్‌తోనే తెరకెక్కించాల్సి వస్తుంది. అయ్యకు ఇష్టంలేకపోయినా..ప్రొడ్యూసర్ కారణంగా టీకేఎంతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు. కానీ టీకేఎం ఈ సారి ఈ కథ క్లైమాక్స్‌ని మార్చి దానికి ‘కాంత’(Kaantha Review) అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తాడు. అంతేకాదు అయ్యను కేవలం కుర్చీకే పరిమితం చేసి తనకు నచ్చినట్లుగా సినిమాను తీస్తుంటాడు. ఇందులో కొత్త అమ్మాయి కుమారి(భాగ్యశ్రీ) హీరోయిన్. ఆమెను నటిగా తీర్చిదిద్దింది కూడా అయ్యనే. అటు హీరో, ఇటు దర్శకుడి మధ్య ఈగో వార్ జరుగుతున్నప్పటీకీ..సినిమా షూటింగ్ మాత్రం ఆగదు. చివరి రోజు ఒకే ఒక్క సీన్ మిగిలి ఉండగా..హీరో-దర్శకుడి మధ్య గొడవ జరిగి షూటింగ్ ఆగిపోతుంది. అదే రోజు స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది. అది ఎవరిది? ఎందుకు చేశారు? గురు శిష్యులైన అయ్య, టీకేఎం మధ్య ఎందుకు విబేధాలు వచ్చాయి? వీరిద్దరి ఈగోల కారణంగా కుమారికి జరిగిన నష్టం ఏంటి? స్టూడియోలో జరిగిన హత్య కేసును పోలీసు అధికారి ఫీనిక్స్(రానా) ఎలా సాల్వ్ చేశాడు?అనేది తెలియాలంటే సినిమా(Kaantha Review) చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇది కల్పిత కథ అని చెప్పినప్పటీకీ..1934-59 మధ్యకాలంలో తమిళంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటలను ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈగోతో ఓ దర్శకుడితో గొడవపడడం.. జైలుకు వెళ్లడం.. ఇవన్నీ ఎంకేటీ నిజజీవితంలో జరిగాయి. దర్శకుడు సెల్వరాజ్ ఈ ప్రధాన అంశాలకు కాస్త ఫిక్షనల్ స్టోరీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్‌ని తెరపై చూపించడం అంత ఈజీ కాదు. సినిమాలోనే ఓ సినిమా చూపించాలి. అదీ కూడా బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి కథ. టెక్నికల్‌గా ఇది కష్టమైనప్పటీకీ.. తెరపై మాత్రం చాలా చక్కగా చూపించారు. ఆ కాలంనాటి సంగీతం, ఆర్ట్‌వర్క్, కలర్ టోన్.. ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుడు అప్పటి సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించారు. ఈ విషయంలో దర్శకుడితో పాటు టెక్నికల్ టీమ్‌ని కూడా అభినందించాల్సిందే. కానీ ఈ కథను ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా రూపొందించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్.. సినిమా సంబంధిత వర్గాలను మాత్రమే ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ మొత్తం షూటింగ్ సమయంలో దర్శకుడికి, హీరోకి మధ్య గొడవలు.. వారి ఈగోల వల్ల కింది స్థాయి సిబ్బంది పడే ఇబ్బందులు.. హీరో-హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టూనే కథనం సాగుతుంది. దర్శకుడి- హీరోకి మధ్య విబేధాలు రావడానికి గల కారణం ఏంటనేది పూర్తిగా చెప్పకుండా..అక్కడక్కడ కొన్ని సీన్లను మాత్రమే చూపించడంతో అసలు వీళ్ల మధ్య ఏం జరిగి ఉంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితాయార్థం మొత్తం హత్య కేసు చుట్టూనే తిరుగుతూ..ఓ సాధారణ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పోలీసాఫీసర్‌గా రానా ఎంట్రీ ఇవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తుంది. ఈ కథ 1950 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్నప్పటికీ.. రానా ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతం కాలాన్నే గుర్తు చేస్తుంది. ఇన్వెస్టిగేషన్లో బయటపడే చిన్న చిన్న ట్విస్టులు కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది. హంతకుడు ఎవరనేది ముందే ఊహించినా.. ఎందుకు చేశాడనేది మాత్రం గెస్ చేయలేం. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. దుల్కర్ నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటిస్తాడు. అందులోనూ పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్ పాత్రల్లో అయితే జీవించేస్తాడు.1950లలో నాటి సూపర్ స్టార్ టీకే మహాదేవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కొన్ని సీన్లను చూస్తే.. ఇది దుల్కర్ తప్ప మరే నటుడు చేయలేడు అన్నంతగా ఆయన ఫెర్మార్మెన్స్ ఉంది. దుల్కర్‌తో పోటీపడి నటించారు సముద్ర ఖని, భాగ్యశ్రీ. సముద్రఖని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెర్మార్మెన్స్గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పవచ్చు. తెరపై డైరెక్టర్ అయ్య మాత్రమే కనిపిస్తాడు తప్పితే సముద్రఖని కనిపించడు. ఇక భాగ్యశ్రీ కూడా అంతే. ఇంతవరకు అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమైన భాగ్యశ్రీ.. ఈ చిత్రంతో నటన పరంగానూ ఆకట్టుకుంది. నటి కుమారి పాత్రలో జీవించేసింది. రానా తెరపై కనిపించేది కాసేపే అయినా..ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఆ సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. జాను చాంతర్ పాటలు బాగున్నాయి. కథతో భాగంగా ఈ పాటలు వస్తుంటాయి తప్పితే..ఎక్కడా ఇరికించినట్లుగా అనిపించవు. డాని సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటి టైంని రీ క్రియేట్ చేయడంలో తన కెమెరా పనితనాన్ని చూపించాడు. సినిమా చూస్తున్నంత సేపు అప్పటి రోజుల్లోకి వెళతాం. ఆర్ట్‌వర్క్ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత షార్ప్‌గా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'జిగ్రీస్' మూవీ.. నలుగురి స్నేహితుల కథ (రివ్యూ)
టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్.. ఈ మూవీని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. నవంబర్ 14న విడుదల కానుంది. అయితే, ఈ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే థియేటర్స్‌లో వేశారు. యువ నటీనటులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..జిగ్రీస్ అనే టైటిల్‌కు తగ్గట్లుగా కార్తిక్ (కృష్ణ బూరుగుల ) ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి ఫుల్‌గా మద్యం సేవించి ఉండగా మారుతీ 800 కారులో గోవా వెళ్లాలని అనుకుంటారు. వారందరూ తాగిన మైకంలో ఉండగా దారి మద్యలోనే కారు ట్రబుల్ ఇస్తుంది. ఈ క్రమంలోనే కథలోకి మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. ఈ నలుగురు స్నేహితులు అంత చిన్న కారులో గోవా చేరుకున్నారా..? రాత్రికిరాత్రే ఈ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాలి అనుకుంటారు..? గోవాలో వీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు.. అక్కడ వారు చేసిన అల్లరి ఏంటి? గోవా ప్రయాణం వారి జీవితాలలో తెచ్చిన అనూహ్య మార్పులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే జిగ్రీస్ మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..జిగ్రీస్ టైటిల్‌కు తగ్గట్టే ఈ స్టోరీ నలుగురి స్నేహితులది. పెద్దగా కథలో ట్విస్ట్‌లు అంటూ ఏమీ లేవు కానీ నవ్వులు పూయిస్తుంది. చాలా సీన్స్ కూడా ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇలాంటి కథలకు బలం కూడా ఇదే.. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ముఖ్యంగా లారీ సీన్‌తో పాటు ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్ నవ్వులు తెప్పిస్తాయి. ఆపై కాండోమ్ చుట్టూ క్రియేట్ చేసిన సీన్ హిలేరియస్‌గా అందరినీ నవ్విస్తుంది. మావోయిస్టుల బ్లాక్ ఎపిసోడ్ కూడా ఓ మాదిరిగానే మెప్పిస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ మన చుట్టూ కూడా ఉన్నారనిపించేలా ప్రేక్షకులకు అనిపిస్తుంది. చాలా సీన్లు కూడా మన కథనే వెండితెరపై చూపిస్తున్నారని కలుగుతుంది. ‘జిగ్రీస్’ కథలో పెద్దగా ఊహించని మలుపులు లేకపోయినప్పటకీ ప్రేక్షకుడిని మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది. క్లైమాక్స్ సీన్ మాత్రం అందరిని మెప్పిస్తుంది. చాలామంది ఆ సీన్ చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురవుతారు.ఎవరెలా చేశారంటే..సినిమాలో ఎక్కువగా కనిపించింది యువ నటీనటులే.. కానీ, అందరూ తమ పాత్రల మేరకు మెప్పించారు. లీడ్ రోల్ చేసిన కృష్ణ బూరుగుల పర్ఫార్మెన్స్ అందరినీ మెప్పిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి తనదైన నటనతో మెప్పిస్తాడు. రామ్ నితిన్ తన పాత్ర మేరకు పర్వాలేదనిపిస్తాడు. ధీరజ్ ఆత్రేయచాలా సహజంగా, అమాయమైన నటనతో కామెడీ పండించాడు. మనీ వాక సినిమాలో కీలకమైన పాత్ర, అసలు కథ మెుత్తం తన చుట్టూనే తిరుగుతుంది. అయితే ఎమోషన్ సీన్స్ నటనలో అనుభవం ఇంకొంత అవసరం కావాలినిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. కమ్రాన్ అందించిన సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా బాగానే ఉంది. కథమేరకు నిర్మాణ విలువలు మెప్పించాయి. స్వప్నిక్ రావు సౌండ్ డిజైన్‌తో పాటు శ్యామల్ సిక్దర్ మిక్సింగ్ బాగుంది. మీ జిగ్రీస్తో కలిసి సినిమాకు వెళ్లండి తప్పకుండా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. -
40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి!
టైటిల్: ఆప్ జైసా కోయి(Aap Jaisa Koi)నటులు: ఆర్.మాధవన్, ఫాతిమా సనా షేక్ (దంగల్ నటి)ఓటీటీ: నెట్ఫ్లిక్స్ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. తమకు నచ్చిన కంటెంట్‌ను చూసే వీలు దొరికింది. దీంతో భాషతో సంబంధం లేకుండా నచ్చిన కంటెంట్ తెగ చూసేస్తున్నారు. ప్రజెంట్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ట్రెండ్‌కు తగ్గ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. అలా ప్రస్తుత రోజుల్లో 42 ఏళ్లయినా పెళ్లికానీ ఓ సంప్రదాయ యువకుడి కథే ఈ ఆప్ జైసా కోయి(Aap Jaisa Koi). ఎలా ఉందో రివ్యూలో చూసేయండి.కథేంటంటే..సంప్రదాయ కుటుంబానికి చెందిన 42 ఏళ్ల శ్రీరేణు(ఆర్ మాధవన్). అతని పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు ఎన్నో ఏళ్లుగా సంబంధాలు చూస్తూనే ఉంటారు. శ్రీ పెళ్లి వేడుక కోసం ఫ్యామిలీ అంతా ఎదురు చూసేవారు. అసలు అతనికి పెళ్లి యోగం ఉందో లేదో అని జ్యోతిష్యులను అడిగేవారు. కానీ అవన్నీ వర్కవుట్ కాకపోవడంతో శ్రీరేణు మానసికంగా ఇబ్బందులు పడేవాడు.అలా ఇబ్బందులు పడుతున్న శ్రీకి అతని ఫ్రెండ్ ఓ సలహా ఇస్తాడు? అతని సలహా విన్న శ్రీరేణు ఉరకలెత్తే ఉత్సాహంతో మొదలుపెడతాడు? అలా అతను ఊహల్లో తేలుతుండగానే.. మధు బోస్(ఫాతిమా సనా షేక్) అతనికి పరిచయమవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే వీరి మధ్య విభేదాలొస్తాయి. ఇక ఇద్దరికీ సెట్ కాదని శ్రీరేణు భావిస్తాడు. దీంతో ఆమెను దూరంగా పెడతాడు. ఆ తర్వాత మళ్లీ వీరు కలిశారా? అసలు చివరికీ ప్రేమలో పడ్డారా? 40 ఏళ్లు దాటినా శ్రీరేణు పెళ్లి కళ నేరవేరిందా? అనేది తెలియాలంటే ఆప్ జైసా కోయి చూడాల్సిందే.డైరెక్టర్ వివేక్ సోని నేటి సమాజానికి అవసరమైన కథనే ఎంచుకున్నారు. ఈ సోషల్ మీడియా రోజుల్లో వర్జిన్ అన్న పదానికి అర్థం వెతకడం దాదాపు అసాధ్యమే. అలాంటి మైండ్‌సెట్ ఉన్న నేటి యువతకు ఈ మూవీతో సరైన సందేశం ఇచ్చాడు. ఒక మనిషికి ప్రేమ, నమ్మకం, ఆత్మగౌరవం అనేవి ఎంత ముఖ్యమో ఈ కథతో సరికొత్త నిర్వచనమిచ్చాడు దర్శకుడు. శ్రీ రేణు లాంటి అబ్బాయి.. మధు బోస్ లాంటి అమ్మాయికి మధ్య జరిగే సన్నివేశాలు నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. ఒకవైపు ప్రేమ- మరోవైపు నమ్మకం అనే వాటి చుట్టే కథను నడిపించాడు డైరెక్టర్. ఓవరాల్‌గా చూసే పెళ్లి కానీ 42 ఏళ్ల యువకుడి కథే. కానీ ఈ ప్రేమకథలో తీసుకొచ్చిన ఎమోషన్స్ అద్భుతం. ఆడ, మగను ఎక్కువ, తక్కువ అంటూ చూసే వాళ్ల కళ్లు తెరిపించే ప్రేమకథా చిత్రమే ఆప్ జైసా కోయి. వీకెండ్లో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావాలంటే ఈ మూవీ ట్రై చేయండి. -
Dies Irae: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ
గత కొన్నేళ్లుగా హారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. కానీ దీనికి కామెడీ మిక్స్ చేసి తీస్తున్నారు. అలా కాకుండా కేవలం హారర్ ఎలిమెంట్స్‌తో తీసి వేరే లెవల్లో భయపెట్టిన చిత్రాలంటే అరుదు. ఇప్పుడు అలా ప్యూర్ హారర్ కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'డీయస్ ఈరే'. ఇదో మలయాళం సినిమా. అక్టోబరు 31న అక్కడ రిలీజైంది. వారం ఆలస్యంగా అంటే నవంబరు 7న తెలుగులో థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ)కథేంటి?రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఓ ఆర్కిటెక్ట్. బాగా డబ్బున్న ఫ్యామిలీ కుర్రాడు. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. ఇతడేమో ఇక్కడ పెద్ద ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంటాడు. ఖాళీ టైంలో పార్టీలు, ఫ్రెండ్స్ అని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రోహన్ క్లాస్మేట్ కని(సుస్మితా భట్) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు రోహన్, అతడి ఫ్రెండ్ కని ఇంటికి వెళ్లొస్తారు. అప్పటినుంచి రోహన్ ఇంట్లో రాత్రిపూట గజ్జెల శబ్దాలు వినిపిస్తుంటాయి. కని ఆత్మనే తనని వేధిస్తోందని రోహన్ భావిస్తుంటాడు. అసలు ఈ ఆత్మ ఎవరిది? ఎందుకు రోహన్ వెంటపడుతోంది? కని పొరుగింటి వ్యక్తి మధు(జిబిన్ గోపీనాథ్), రోహన్‌కి ఎలాంటి సాయం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?హారర్ సినిమా అనగానే ఓ ఫార్మాట్ ఉంటుంది. ఓ దెయ్యం, దానికో ఫ్లాష్ బ్యాక్, అది హీరో లేదా హీరోయిన్ని వేధించడం.. చివరకు దాని నుంచి బయటపడటం.. దాదాపు ఇదే పాయింట్‌తో చాలా వరకు తీస్తుంటారు. 'డీయస్ ఈరే' కూడా దీనికి మినహాయింపు ఏం కాదు. కానీ చూస్తున్న ప్రేక్షకుడిని ఎంతవరకు భయపెట్టామా అనేది కీలకం. ఈ విషయంలో 'డీయస్ ఈరే' టీమ్‌కి నూటికి నూటి మార్కులు వేయొచ్చు. ఎందుకంటే ఆ రేంజులో భయపెట్టారు. కొన్ని సీన్లలో అయితే వణికిపోతాం.సినిమా మొదలైన కాసేపటివరకు కథలో పెద్ద కదలిక ఉండదు. రోహన్, అతడు చుట్టూ ఉంటే ప్రపంచాన్ని పరిచయం చేశారు. కని ఆత్మహత్య చేసుకోవడం, ఆమె ఇంటికి రోహన్ వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. కని హెయిన్ పిన్ని రోహన్ తన ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి ఓ ఆత్మ రోహన్‌ని భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం చూపించే సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండాఫ్‌లో దెయ్యం ఎవరు? దాన్ని రోహన్ ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాలు చూపిస్తారు. అయితే సెకండాఫ్‌లో ప్రతి సీన్లోనూ నెక్స్ట్ ఏం జరగబోతుందా అని ఒకటే ఆత్రుత. చివరి 20 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. సీటు నుంచి మనల్ని కదలం. ఊపిరి కూడా తీసుకోకుండా చూస్తాం. అప్పటివరకు నిదానంగా సాగిన సినిమా కాస్త క్లైమాక్స్‌లో పరుగెడుతుంది.(ఇదీ చదవండి: ‘జటాధర’ మూవీ రివ్యూ)ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్ (చెబితే స్పాయిలర్ అవుతుంది)ని పలు సందర్భాల్లో మనం వార్తల్లో చూసే ఉంటాం. ఇంత చిన్న పాయింట్‌ని తీసుకుని ఓ హారర్ మూవీ తీయడం అంటే మాటలు కాదు. అదే టైంలో మలయాళ చిత్రాలపై ఎప్పుడు ఉండే కంప్లైంట్ ఇందులోనూ ఉంటుంది. చాలా అంటే చాలా నిదానంగా మూవీ సాగుతుంది. అసలు కని ఏ కారణంతో చనిపోయిందో రివీల్ చేయలేదు. చివర్లో పార్ట్ 2 ఉంటుందనే హింట్ ఇచ్చారు. బహుశా సీక్వెల్లో ఆ విషయం రివీల్ చేస్తారేమో?కని తమ్ముడు ఓ సందర్భంలో రోహన్ ఇంటికొస్తాడు. అక్కడి ఆత్మ కారణంగా కిరణ్ పై ఫ్లోర్ నుంచి కిందపడిపోతాడు. ఆ విజువల్స్ చూస్తే మన ఒళ్లు జలదరిస్తుంది. క్లైమాక్స్‌లో కని పొరుగింటికి రోహన్ వెళ్తాడు. ఆ సీన్స్ చూస్తున్నంతసేపు కళ్లు తిప్పుకోలేం. ఓ వైపు ఆశ్చర్యం, మరోవైపు భయమేస్తుంది.ఎవరెలా చేశారు?ఇందులో పాత్రలు చాలా తక్కువ. లీడ్ రోల్ చేసిన ప్రణవ్ మోహన్‌లాల్ ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్‌లో ఎల్సమ్మ పాత్రలో జయ కురుప్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవల్. ఓ రకంగా ఆమె సర్ప్రైజ్ చేస్తుంది. మధు పాత్రలో జిబిన్ గోపీనాథ్ మెప్పించారు. మిగిలిన పాత్రధారులు అందరూ న్యాయం చేశారు. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ గురించి చెప్పుకోవాలి. గతంలో భూతకాలం, భ్రమయుగం అనే హారర్ మూవీస్‌తో భయపెట్టిన ఈయన.. ఇప్పుడు ఈ చిత్రంతో ఇంకాస్త భయపెట్టాడు. అసలు స్టోరీ ఏం లేనప్పటికీ ఏదో ఉందనే భ్రమ కల్పించి, తనదైన మ్యాజిక్ చేశాడు.మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో గ్జేవియర్ ఈ సినిమాకు మరో హీరో. ఎందుకంటే సాధారణంగా హారర్ సినిమాల్లో జంప్ కట్స్, స్కేరీ మూమెంట్స్ ఎక్కడొస్తాయో ఇప్పటి ప్రేక్షకులు పసిగట్టేస్తున్నారు. అలా పండిపోయిన హారర్ మూవీ ప్రేమికుల్ని కూడా తనదైన నేపథ్య సంగీతంతో భయపెడతాడు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌కి తోడు సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్ వేరే లెవల్ డ్యూటీ చేశాడు. సీన్ మూడ్ ఎలివేట్ చేసేలా, లైటింగ్‌తో.. ఇదెక్కడి హారర్ మూవీ బాబోయే అనిపిస్తాడు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ మూవీ ఇది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసి అయ్యో దీన్ని థియేటర్లో మిస్ అయిపోయామే అనుకోవచ్చు. వీలుంటే మాత్రం బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయండి. ఇకపోతే 'డీయస్ ఈరే' అనేది లాటిన్ పదం. తన కోపం చూపించే రోజు, శిక్షాదినం అని దీనికి అర్థం.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?) -
'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?
'రాక్షసుడు' అనే తమిళ సినిమాతో మన ప్రేక్షకులకు కాస్త పరిచయమైన యంగ్ హీరో విష్ణు విశాల్. మట్టీ కుస్తీ, అరణ్య లాంటి తెలుగు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో చాలా గ్యాప్ తర్వాత 'రాక్షసుడు' తరహా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌తో వచ్చాడు. అదే 'ఆర్యన్'. తమిళంలో గత వారం రిలీజ్ కాగా.. ఇప్పుడు(నవంబరు 07) తెలుగులోనూ థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ)కథేంటి?ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి... ప్రముఖ న్యూస్ ఛానెల్లో నయన(శ్రద్ధా శ్రీనాథ్) హోస్ట్ చేస్తున్న షోకి వస్తాడు. గన్‌తో అందరినీ బెదిరించి భయపెట్టేస్తాడు. తను ఓ ఫెయిల్యూర్ రచయితనని ఓ థ్రిల్లింగ్ కథ చెబుతానని అంటాడు. రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని.. ఎవరో చెప్పి మరీ చంపేస్తానని చెబుతాడు. అలా చెప్పిన కాసేపటికే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కేసుని పైఅధికారులు.. పోలీసాఫీసర్ నంది(విష్ణు విశాల్)కి అప్పజెబుతారు. చెప్పినట్లే ఆత్రేయ చనిపోయినా వరస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఆత్రేయ ఎవరు? వీళ్లనే ఎందుకు చంపుతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనగానే ఓ ఫార్మాట్ ఉంటుంది. హత్యలు చేసే విలన్ని చివర్లో చూపిస్తారు లేదంటే విలన్ని ఇంటర్వెల్లో బయటపెడతారు. ఇదీ కాదంటే ప్రారంభంలోనే విలన్ ఎవరో రివీల్ చేసేసి దొంగ పోలీస్ గేమ్ తరహాలో స్టోరీని నడిపిస్తాడు. ఇవన్నీ కాకుండా సరికొత్తగా తీయొచ్చా అంటే తీయొచ్చు. అదే విషయాన్ని 'ఆర్యన్' దర్శకుడు నిరూపించి చూపించాడు.న్యూస్ ఛానల్ లైవ్‌లో చనిపోయిన ఓ వ్యక్తి.. తర్వాత ఐదు రోజుల్లో మనుషుల్ని చంపడం అనే డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా తీశారు. వినడానికి బాగానే ఉంది గానీ మూవీ ఎలా తీశారా అంటే అదిరిపోయిందనే చెప్పొచ్చు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా అయితే మంచి థ్రిల్లర్ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.హీరో ఎవరో తెలుసు. విలన్ ఎవరో తెలుసు. మరోవైపు హత్యలు జరుగుతుంటాయి. పోని చనిపోతున్నవాళ్లు చెడ్డవాళ్లా అంటే కాదు. అందరూ మంచివాళ్లు. సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడేవాళ్లు. అలాంటి వాళ్లని ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాన్ని క్లైమాక్స్ వరకు పట్టుసడలకుండా అద్భుతంగా చూపించారు. 'రాక్షసుడు' అంత కాకపోయినప్పటికీ 'ఆర్యన్' కూడా బాగుంది.కథంతా సీరియస్ టెంపోలో వెళ్తున్న టైంలో హీరో, అతడి భార్యతో విడాకులు, కోర్టు వాదనలు ఈ సీన్స్ అన్నీ అనవసరం అనిపిస్తాయి. అసలు ఈ సన్నివేశాలు సినిమాలో లేకపోయినా సరే స్టోరీలా పెద్దగా పోయేదేం ఉండదు కదా అనిపిస్తుంది. సినిమా అంతా బాగానే ఉంటుంది గానీ క్లైమాక్స్‌లో ఈ హత్యల వెనక కారణం కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది. అదే విషయాన్ని విష్ణు విశాల్ పోషించిన నంది పాత్రతోనూ చెప్పించారు.ఎవరెలా చేశారు?నంది అనే పోలీసాఫీసర్‌గా విష్ణు విశాల్ అదరగొట్టేశాడు. ఫిజిక్, యాక్టింగ్ అన్నీ కూడా నిజంగానే పోలీస్‌ని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగించాయి. నయనగా చేసిన శ్రద్ధా శ్రీనాథ్, నంది భార్య అనితగా చేసిన మానస చౌదరివి సైడ్ క్యారెక్టర్స్ లాంటి పాత్రలు. చాలా పరిమితంగా సీన్స్ ఉంటాయి. విలన్ ఆత్రేయగా సెల్వ రాఘవన్ మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే.. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. జిబ్రాన్ ఈ విషయంలో అదరగొట్టేశాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే తెరపై సీన్, వెనక నేపథ్య సంగీతం వింటుంటే టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఆ రేంజ్ సౌండింగ్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ డీసెంట్. డైరెక్టర్ ప్రవీణ్ వావ్ అనిపించాడు. ఓవరాల్‌గా సరికొత్త థ్రిల్లర్ చూద్దామనుకుంటే మాత్రం దీన్ని మిస్ అవ్వొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ‘జటాధర’ మూవీ రివ్యూ) -
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ
నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girlfriend Review). రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్, ఎమోషనల్ లవ్‌స్టోరీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌తో పాటు పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘ది గర్ల్‌ఫ్రెండ్’పై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..భూమా(రష్మిక) తండ్రి(రావు రమేశ్)చాటున పెరిగిన ఓ అమాయకపు అమ్మాయి. ఎంఏ లిటరేచర్ చదవడం కోసం తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వచ్చి రామలింగయ్య ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో జాయిన్ అవుతుంది. విక్రమ్(దీక్షిత్ శెట్టి), దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) కూడా అదే కాలేజీలో చేరతారు.విక్రమ్ ఆవేశపరుడు. అంతేకాదు అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలనుకునే స్వభావం కలవాడు. తనకు నచ్చినట్లుగా భూమా ప్రవర్తన ఉండడంతో ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు అదే కాలేజీకి చెందిన మరో అమ్మాయి దుర్గ(అనూ ఇమ్మాన్యుయేల్)..విక్రమ్‌ని ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం ఆమెను నిరాకరిస్తూ ఉంటాడు. లవ్, రిలేషన్‌కు దూరంగా ఉండాలనుకుంటూనే..భూమా కూడా విక్రమ్‌తో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన లైఫ్ మొత్తం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలిసిన తర్వాత భూమా తీసుకున్న అనూహ్య నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం ఆమెకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది? వాటిని అధిగమించి ఎలా సక్సెస్ అయిందనేదే మిగతా కథ(The Girlfriend Review)ఎలా ఉందంటే..అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి.. ఇలాంటి పనులే చేయాలని చెప్పే ‘మగమహారాజులు’ చాలా మందే ఉన్నారు. బయట నీతులు మాట్లాడి..ఇంట్లో ఆడవాళ్లకు కనీస గౌరవమర్యాదలు ఇవ్వని భర్తలు.. ప్రేమ పేరుతో వారి జీవితాన్ని తమ కంట్రోల్లోకి తీసుకొని.. మాటలతో హింసించే బాయ్‌ప్రెండ్స్ ఇప్పటీకీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. అలాంటి బాధలన్నీ భరించి.. ఎదురించి చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్న ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్‌ఫ్రెండ్’. మనల్ని కంట్రోల్ చేసే పవర్‌ని ఇతరులకు ఇవ్వొద్దని, కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోవాలి అని చెప్పే సినిమా ఇది. కథగా చూస్తే..ఇది చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ. కానీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. విజువల్స్ ద్వారానే తను చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే రష్మిక షవర్ సీన్, హీరో అమ్మగారితో మాట్లాడుతున్న సమయంలో తీసిన మిరర్ విజువల్, బ్రేకప్ తర్వాత హీరో గ్యాంగ్ వెంబడించినప్పు వచ్చే సింబాలిక్ షాట్స్.. ఇవన్నీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ప్రతిభను చాటిచెబుతాయి.ఇదంతా ఒకవైపు.. ఇక లాజిక్కులు, ప్రస్తుత సమాజంలోని వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే.. పాత చింతకాయపచ్చడి కథేలాగే కనిపిస్తుంది. అంతేకాదు నాణానికి ఒకవైపే చూపించాడని.. రెండో వైపు కూడా ఉంటుంది కదా..దర్శకుడు అదేలా మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం మగవాళ్లను బ్యాడ్ చేయడానికే ఈ సినిమా తీశాడనే విమర్శలు కూడా దర్శకుడిపై వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈ సినిమాలోని హీరో లేదా హీరోయిన్ పాత్రతో కనెక్ట్ అవ్వడం ఖాయం. ఇద్దరీ పాత్రలూ.. మనం ఎక్కడో చూసినట్లుగా, విన్నట్లుగానే ప్రవర్తిస్తాయి. ఫస్టాఫ్ మొత్తం హీరోహీరోయిన్ల ప్రేమ చుట్టూ తిరిగితే.. సెకండాఫ్ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే చూపించారు. ఊహకందేలా కథనం సాగినా..తెరపై ఆయా సన్నివేశాలను చూస్తుంటే..కొన్ని చోట్ల ఎమోషనల్ అవుతాం. క్లైమాక్స్‌లో హీరోయిన్ చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా నేటి తరం యువకులను ఆలోచింపజేస్తాయి. అక్కడక్కడ లాజిక్ మిస్ అవ్వడంతో పాటు ల్యాగ్ చేసినా..‘ది గర్ల్‌ఫ్రెండ్’ని మాత్రం ఓ వర్గం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలోని భూమా పాత్రకు రష్మికను ఎంచుకోవడంలోనే రాహుల్ సగం విజయం సాధించాడు. ఆ పాత్రకు రష్మిక తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అన్నట్లుగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె అద్బుతంగా నటించింది. విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి ఒదిగిపోయాడు. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. చాలా బాగా నటించింది. రావు రమేశ్ ఒకటి రెండు షాడ్స్తో కనిపించినా..తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ పాటలు, ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం రెండూ ఈ సినిమా స్థాయిని పెంచేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ
మూవీ: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోనటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా తదితరులునిర్మాణ సంస్థ: 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్నిర్మాత: అగరం సందీప్రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్సంగీతం: సురేష్ బొబ్బిలిసినిమాటోగ్రఫి: సోమశేఖర్ఎడిటర్: నరేష్ అడుపవిడుదల తేది: నవంబర్ 7, 2025కథేంటంటే.. విజయనగరం జిల్లాకు చెందిన రమేశ్(తీరువీర్) ఓ ఫోటోగ్రాఫర్. ఊర్లోనే ఓ ఫోటో స్టూడియో పెట్టుకొని పెళ్లిళ్లతో పాటు ఇతర కార్యక్రమాల ఫోటోలు తీస్తుంటాడు. అతని అసిస్టెంట్ రామ్(రోహన్ రాయ్)కి పనిమీద కంటే తిండిమీదే ధ్యాస ఎక్కువ. రామ్ చేసే చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా..తన స్టూడియోకి ఎదురుగా ఉన్న పంజాయితీ ఆఫీస్‌లో పనిచేసే హేమ(టీనా శ్రావ్య)ను ప్రేమిస్తూ ఉంటాడు రమేశ్. హేమకు కూడా రమేశ్ అంటే ఇష్టమే కానీ..ఒకరికొకరు బయటకు చెప్పుకోకుండా చూపులతోనే ప్రేమించుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటారు. కట్ చేస్తే.. ఓ రోజు అదే ప్రాంతానికి చెందిన ఆనంద్(నరేంద్ర రవి) రమేశ్ స్టూడియో దగ్గరకు వచ్చి.. జిల్లాలోనే ది బెస్ట్ ప్రీవెడ్డింగ్ షూట్ చేయాలని అడ్వాన్స్ ఇచ్చివెళ్లిపోతారు. ఔట్‌డోర్‌లో షూటింగ్ అంటే..తనకు కాబోయే భార్య సౌందర్య(యామిని)తీసుకొని జిల్లాకు వెళ్తాడు. దాదాపు లక్షన్నర వరకు ఖర్చు చేయించి..షూట్ కంప్లీట్ చేస్తాడు. ఆ షూట్ ఫుటేజ్ చిప్‌ని తన అసిస్టెంట్ రామ్ కి ఇచ్చి..స్టూడియోలో పెట్టమని చెప్తాడు. పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టని రామ్.. ఆ చిప్‌ని ఎక్కడో పారేస్తాడు. ఈ విషయం ఆనంద్‌కు తెలిస్తే..ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో రమేశ్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? తన నిర్ణయం తప్పని తెలిసిన తర్వాత రమేశ్ ఏం చేశాడు? ఆనంద్, సౌందర్యల పెళ్లి ఆగిపోవడానికి గల కారణం ఏంటి? రమేశ్ తీసుకున్న నిర్ణయం ఆయనతో పాటు ఆనంద్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఈ సమస్య నుంచి బయటపడేందుకు రమేశ్‌కు హేమ ఎలాంటి సహాయం చేసింది? చివరకు ఆనంద్, సౌందర్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు పెద్ద కథ అవరసరం లేదు. సింపుల్ స్టోరీ అయినా సరే.. చెప్పాలనుకునే పాయింట్‌ని సిన్సియర్‌గా తెరపై చూపిస్తే చాలు.. ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ చాలా సింపుల్ కథను ఎంచుకొని.. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ జోలికి పోకుండా.. లీనియర్ స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆయన సక్సెస్ అయ్యాడు. స్టార్స్‌ని కాకుండా కంటెంట్‌ని నమ్ముకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక్క సంఘటన మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది? సందర్భాన్ని బట్టి మనిషి స్వభావం ఎలా మారుతుందనే విషయాన్ని కామెడీ వేలో చక్కగా చూపించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగానే సాగుతుంది. ఎమోషనల్ సన్నివేశాలు తక్కువే ఉన్నప్పటికీ.. అవి అలా గుర్తిండిపోతాయి. ఫస్టాఫ్ మొత్తం వినోదాత్మకంగా సాగుతుంది. ఆనంద్, సౌందర్యల ప్రీ వెడ్డింగ్ షూట్.. చిప్ పోవడం.. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు హీరో చేసే ప్రయత్నాలు...ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. పెళ్లి చెడగొట్టేందుకు హీరో చేసే ప్రయత్నాలు..కొంతవరకు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్లను కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆనంద్, సౌందర్యలు విడిపోవడానికి గల కారణం నవ్విస్తూనే..ఆలోచింపజేస్తూంది. ఆటో సీన్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో హీరో చెప్పే డైలాగ్స్ భావోద్వేగానికి గురి చేస్తాయి. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. అవేవి పట్టించుకోకుండా చూస్తే.. అందరికీ నచ్చేస్తుంది. కామెడీ పేరుతో వల్గారిటీని చూపిస్తున్న ఈ రోజుల్లో.. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకోవడంలో తీరువీర్ దిట్ట. ఈ సారి కూడా అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫోటోగ్రాఫర్ రమేశ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై అమాయకత్వంగా కనిపిస్తూనే..హీరోయిజాన్ని పండించాడు. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర నరేంద్ర రవిది. పెళ్లికొడుకు ఆనంద్ పాత్రలో ఆయన జీవించేశాడు. నవ్విస్తూనే కొన్ని చోట్ల భావోధ్వేగానికి గురి చేస్తాడు. హేమా పాత్రకు టీనా శ్రావ్య న్యాయం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ మరోసారి తనదైన నటనతో నవ్వులు పూయించాడు. యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక నిపుణులకొస్తే సురేశ్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. సోమశేఖర్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ
కొన్నాళ్ల క్రితం పలు వివాదాలకు కారణమైన తమిళ సినిమా 'బ్యాడ్ గర్ల్'. బ్రహ్మణులని కించపరిచే సీన్స్ ఉన్నాయని చెప్పి టీజర్ రిలీజ్ టైంలో చాలా హడావుడి చేశారు. సెన్సార్ దగ్గర కూడా పలు సమస్యలు ఎదుర్కొని ఎట్టకేలకు సెప్టెంబరు తొలివారంలో థియేటర్లలోకి వచ్చింది. రెండు నెలల తర్వాత ఇప్పుడు(నవంబరు 04 నుంచి) ఓటీటీలోకి వచ్చేసింది. హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజ్ అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). అందరు ఆడపిల్లల్లానే తనకు కూడా ఓ బాయ్ ఫ్రెండ్, సుఖంగా ఉండేందుకు చిన్న ఇల్లు ఉంటే చాలు అని కలలు కంటూ ఉంటుంది. స్కూల్ చదువుతున్నప్పుడు నలన్ (హ్రిదు హరూన్), కాలేజీలో అర్జున్ (శశాంక్), ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇర్ఫాన్ (టీజే అరుణాచలం)తో రిలేషన్లో ఉంటుంది. వీటిలో ఏ బంధం కూడా ఎక్కువరోజులు నిలబడదు. కంటికి రెప్పలా చూసుకునే తల్లి, అద్భుతమైన స్నేహితురాలు ఉన్నా సరే ఈమెని సమాజం 'బ్యాడ్ గర్ల్' అని ముద్ర వేస్తుంది. ఇలా కావడానికి కారణమేంటి? చివరకు రమ్య ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓ కుర్రాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగితే సమాజం అతడిని ఏం అనదు. ఇదే పని ఓ అమ్మాయి చేస్తే తిరుగుబోతు అనే ముద్ర వేస్తుంది. ఆమె వైపు నుంచి తప్పుందా? అబ్బాయిల వైపు తప్పుందా? అనేది ఎవరు పట్టించుకోరు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని నిలబడిన ఓ అమ్మాయి కథే 'బ్యాడ్ గర్ల్'.సాధారణంగా అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసే సినిమాల్లో మగాళ్లని కొన్నింట్లో వెధవల్లా, మరికొన్నింట్లో విలన్స్‌గా చూపిస్తుంటారు. 'బ్యాడ్ గర్ల్'లో అలాంటివేం ఉండవు. కేవలం ఓ అమ్మాయి మనసుని.. టీనేజీ నుంచి 30స్లోకి వచ్చేంతవరకు ఆవిష్కరించారు. ఏ మతం, ఏ కులంలో పుట్టినా సరే ఆడవాళ్లకూ మనసు ఉంటుంది. దానికి బోలెడన్ని కోరికలు ఉంటాయి. ఈ సినిమాలోనూ హీరోయిన్‌కి ప్రేమ, శృంగారం లాంటి ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి. ఎంతలా అంటే 9వ క్లాస్‌లో ఉన్నప్పుడే స్కూల్లోనే ఓ అబ్బాయికి ముద్దు పెడుతుంది. కాలేజీకి వెళ్లేసరికి శృంగారం, జాబ్ చేస్తున్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్.. ఇలా ఉంటాయి.ఓ అమ్మాయి తనకు నచ్చినట్లు బతికితే ఈ సమాజం, ఇందులోని వ్యక్తులు.. 'బ్యాడ్ గర్ల్'గా ఎలా ముద్రవేస్తారు అనేది చెప్పిచెప్పనట్లు ఈ సినిమాలో చూపించారు. క్లైమాక్స్‌లో ఆడపిల్లని పిల్లి పిల్లతో పోల్చి చూపించడం.. ఈ క్రమంలో రమ్య తల్లి చెప్పే డైలాగ్ భలే అనిపిస్తాయి. 'ఓ అబ్బాయి చేసిన గాయాన్ని మరో అబ్బాయి మానిపోయేలా చేయలేడు' లాంటి కొన్ని డైలాగ్స్ కూడా అవును నిజమే కదా అనిపించేలా చేస్తాయి. మూవీ విడుదలకు ముందు బ్రహ్మణులని టార్గెట్ చేసేలా సీన్స్ ఉన్నాయని అన్నారు గానీ చూస్తున్నప్పుడు అలా ఏం కనిపించలేదు.ఎవరెలా చేశారు?రమ్యగా అంజలి శివరామన్ అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. టీనేజీ అమ్మాయిలా ఎంత బాగుందో.. స్వతంత్ర భావాలుండే మహిళగానూ చక్కగా ఇమిడిపోయింది. ఈమె పలికించిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా అనిపించాయి. ఈమె తల్లి పాత్ర చేసిన శాంతిప్రియ చాలా రియలస్టిక్ యాక్టింగ్ చేశారు. రమ్య స్నేహితురాలిగా చేసిన సెల్వి, బాయ్‌ఫ్రెండ్స్‌గా చేసిన హ్రిదు, శశాంక్, అరుణాచలం కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే దర్శకురాలు వర్ష భరత్ గురించి చెప్పాలి. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? వాళ్ల కోరికలు ఏంటి అనే విషయాల్ని ఫెర్ఫెక్ట్గా చూపించారు. ఈమెకు తోడు అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సరిగ్గా సరిపోయాయి. ఈ తరహా సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు. చూసే వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని డైలాగ్స్ రియలస్టిక్‌గా ఉంటాయి కాబట్టి కుదినంతవరకు ఒంటరిగానే చూడండి.- చందు డొంకాన -
ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ
అందానికి అసలైన కొలమానం? రంగు, ఎత్తు, బరువు, ఆకృతి.. ఇవేవీ కావు. ఆత్మవిశ్వాసమే మనిషికి అసలైన అందం. ఈ నిజాన్ని అర్థం చేసుకున్నరోజు ఎవరి వెక్కిరింతలు మనల్ని ఏమీ చేయలేవు. ఆత్మనూన్యతతో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ముఖ్యం. మలయాళ మూవీ తలవర ఇదే విషయాన్ని నొక్కి చెప్తోంది.హీరోకి బొల్లి వ్యాధితలవర సినిమాలో హీరో జ్యోతిష్ (అర్జున్ అశోకన్) బొల్లి వ్యాధితో బాధపడుతుంటాడు. అది చూసి స్నేహితులు సహా అందరూ తనను వెక్కిరిస్తుంటారు. అతడు కూడా కెమెరా ముందుకు రావాలంటే జంకుతాడు. అలాంటి అతడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోల కోసం ఓ ఫోటోగ్రాఫర్ దగ్గరకు వెళ్తాడు. అప్పటికే అక్కడ షార్ట్ ఫిలిం షూటింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ సడన్‌గా ఓ వ్యక్తి రావట్లేదని తెలిసి.. ఫోటో కోసం వెయిట్ చేస్తున్న హీరోను అతడి స్థానంలో నటించమని కోరతారు.అవమానాలుఅలా కెమెరా అంటే భయపడే హీరో తొలిసారి షార్ట్ ఫిలింలో నటిస్తాడు. అప్పుడు తనపై తనకు కొంత ధైర్యం వస్తుంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి అవమానాలు పడతాడు, దెబ్బలు తింటాడు. ఆ సమయంలో ప్రియురాలు (రేవతి శర్మ).. ఎవరో ఏదో అన్నారని గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటావా? టాలెంట్‌ను నమ్ముకుని ముందుకెళ్లమని చెప్తుంది. మరి యాక్టర్ అయ్యాడా? అందుకు అతడి తల్లి ఒప్పుకుందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉంది?మలయాళ సినిమాలు ఆదరాబాదరా లేకుండా, ఎక్కువ హడావుడి చేయకుండా సింపుల్‌గా, నెమ్మదిగా ముందుకెళ్తాయి. ఫస్టాఫ్ అంతా మామూలుగా వెళ్తూ ఉంటుంది. సెకండాఫ్‌లో హీరో మనసులోని బాధ.. కోపంగా, పట్టుదలగా మారుతుంది. క్లైమాక్స్ బాగుంది. చాలామంది ఇప్పటికీ తమలో ఏదో ఒకటి తక్కువగా ఉందని లోలోనే మథనపడుతుంటారు. అలాంటివారి మనసు మార్చే సినిమా ఇది! ఓటీటీలో..ఈ కథను రాసుకుని, దాన్ని తెరపై అందంగా మలిచిన దర్శకుడు అఖిల్ అనిల్‌కుమార్‌ను అభినందించాల్సిందే! ముఖంతోపాటు శరీరమంతా తెల్లమచ్చలుండే వ్యక్తి పాత్రలో జీవించిన అర్జున్ను కూడా మెచ్చుకుని తీరాల్సిందే! తలవర అంటే విధి అని అర్థం. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. -
Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ
‘ధమాకా’ తర్వాత రవితేజ ఖాతాలో సరైన హిట్టే పడలేదు. శ్రీలీల పరిస్థితి కూడా అంతే. ఇద్దరి నుంచి వరుస సినిమాలు వస్తున్నా.. ‘ధమాకా’ స్థాయి హిట్ మాత్రం రాలేదు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఇద్దరు జోడీగా ‘మాస్ జాతర’(Mass Jathara Movie Review In Telugu)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ధమాకా’ చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియోనే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మాస్ జాతర’(Mass Jathara Review )పై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మాస్ జాతర’ అందుకుందా? రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..లక్ష్మణ్ భేరి(రవితేజ) పవర్ఫుల్ రైల్వే పోలీసు అధికారి. రైల్వే స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా చూసుకునే బాధ్యతే తనది. కానీ దాంతో పాటు ఆ ప్రాంతంలో ఎలాంటి నేరాలు జరిగినా.. ఆయన ఎంటర్ అవుతుంటారు. ఓ కేసు విషయంలో మంత్రి కొడుకుని కొట్టి.. వరంగల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా అడవివరం గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఈ గ్రామం మొత్తం శివుడు(నవీన్ చంద్ర) కంట్రోల్లో ఉంటుంది. అక్కడి రైతులతో గంజాయి పండించి..కోల్‌కత్తాకు సరఫరా చేయడం ఆయన పని. లక్ష్మణ్ భేరీ వచ్చీరావడంతోనే శివుడు చేసే స్మగ్లింగ్ పనికి ఎదురుతిరుగుతాడు. కానీ ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు మొత్తం శివుడికి సపోర్ట్‌గా నిలుస్తారు. కేవలం రైల్వే స్టేషన్ పరిధిమేర మాత్రమే అధికారాలు ఉన్న లక్ష్మణ్..శివుడి దందాని ఎలా అడ్డుకున్నాడు? ఈ కథలో శ్రీలీల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మాస్ జాతర’ చూడాల్సిందే. ఎలా ఉందంటే...కమర్షియల్ సినిమాకు కొత్త కథ అవసరం లేదు. హీరోకి భారీ ఎలివేషన్స్, బలమైన విలన్.. మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటే చాలు. ఇవన్నీ ‘మాస్ జాతర’లో ఉన్నాయి. కానీ వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు భాను భోగవరపు పూర్తిగా సఫలం కాలేదు. కథ-కథనం పక్కకి పెట్టి..కేవలం రవితేజ ఫ్యాన్స్ కోరుకునే అంశాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అవి కొంతవరకు ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేసినా.. సాధారణ ప్రేక్షకులకు మాత్రం రొటీన్‌గానే అనిపిస్తాయి. ఎంత కమర్షియల్ సినిమా అయినా కొన్ని చోట్ల అయినా వాస్తవికంగా అనిపించాలి. కానీ ఈ సినిమా అలా ఎక్కడ అనిపించదు. రవితేజ పాత్ర ఒకచోట తెలంగాణ యాస మాట్లాడితే..మరికొన్ని చోట్ల సాధారణ భాష మాట్లాడుతుంది. హీరోయిన్ పాత్ర శ్రీకాకుళం యాస మాట్లాడితే.. ఆమె తండ్రి మాత్రం సాధారణ భాషలో మాట్లాడతాడు. సీరియస్‌గా ఉండే హీరో..హీరోయిన్ కనిపించగానే కామెడీ చేస్తుంటాడు. లవ్‌ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోదు. హీరో-తాతయ్యల మధ్య వచ్చే సన్నివేశాలు అటు పూర్తిగా నవ్వించ లేదు.. ఇటు ఎమోషనల్గానూ ఆకట్టుకోలేకపోయాయి. ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు. రవితేజ ఎంట్రీ సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ ఆ తర్వాత కాసేపటికే కథనం రొటీన్‌గా సాగుతుంది. తాత(రాజేంద్రప్రసాద్) తో లక్ష్మణ్ భేరీ చేసే కామెడీ కొంతమేర నవ్విస్తుంది. ఇక హీరో అడవివరం వెళ్లిన తర్వాత కథనంలో మార్పు ఉంటుందని ఆశించినా...అక్కడ నిరాశే ఎదురవుతుంది. శివుడి ఎంట్రీ వరకు అద్బుతంగా చూపించి.. మళ్లీ రోటీన్‌గానే కథని ముందుకు నడిపించారు. క్లైమాక్స్.. ఇటీవల వచ్చిన చాలా సినిమాలు గుర్తుకు చేస్తుంది. కథ-కథనం రొటీన్‌గా ఉన్నా.. యాక్షన్ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. శివుడి మామ గ్యాంగ్‌తో వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. ఇక క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా అదిరిపోతుంది. కథ-కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే..‘మాస్ జాతర’ ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రవితేజ ఎనర్జీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అందులోనూ పోలీసు పాత్రలు ఆయన అవలీలగా చేసేస్తాడు. రైల్వే పోలీసు అధికారి లక్ష్మణ్ భేరీ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా బాగానే చేశారు. ఫ్యాన్స్ కోరుకునేలా తెరపై కనిపించి అలరించాడు. ఇక శివుడి పాత్రలో నవీచంద్రం విలనిజం అద్భుతంగా పండించాడు. ఆయనలోని కొత్త యాంగిల్ ఇందులో కనిపిస్తుంది. తులసి పాత్రకు శ్రీలీల న్యాయం చేసింది. హీరో తాతగా రాజేంద్ర ప్రసాద్ కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. Mass Jatara 2025 Movie Plus/Minus Points: సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నా..వాటి ప్లేస్మెంట్ సరిగా లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్ధాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా మొదటి భాగం 2015లో రిలీజ్ కాగా..రెండో భాగం 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ రెండు సినిమాలు కలిపి ఓకే చిత్రంగా ‘బాహుబలి: ది ఎపిక్’(Baahubali The Epic Review)పేరుతో నేడు (అక్టోబర్ 31) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు ఇక్కడ కూడా ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..బాహుబలి కథ అందరికి తెలిసిందే. థియేటర్స్‌తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక(తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బంధీగా ఉన్న దేవసేన(అనుష్క శెట్టి) తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బంధీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. భళ్లాలదేవుడు(రానా) కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిచాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బళ్లాల దేవుడిని అంతం చేస్తాడు. ఇదే ది ఎపిక్ కథ(Baahubali The Epic Review Telugu).విశ్లేషణముందుగా చెప్పినట్లుగా ఇదంతా అందరికి తెలిసిన, చూసిన కథే. పార్ట్ 1 చూసినప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియదు. కాబట్టి అంతా పార్ట్ 2 చూశారు. మరి ‘బహుబలి: దిపిక్’ దేని కోసం చూస్తారు? అల్రేడీ చూసి చూసి ఉన్న చిత్రమే కదా అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే జక్కన మరోసారి మ్యాజిక్ చేశాడు. బోర్ కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్‌తో కథను చెప్పుకొచ్చాడు. ఆరున్నర గంటల సినిమాను 3.45 గంటలకు కుదించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా సన్నివేశాలను పేర్చాడు. తెరపై చూస్తుంటే కొత్త సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. ఫస్టాప్‌లో పార్ట్ 1 కథని, సెకండాఫ్‌లో పార్ట్ 2 కథను చూపించాడు. ఈ రెండు భాగాల్లో ప్రేక్షకులకు బాగా నచ్చిన సన్నివేశాలన్నింటిని హైలెట్ చేశాడు. ప్రధాన పాత్రల పరిచయ సన్నివేశాలు.. బళ్లాలదేవుడి పట్టాభిషేకం, కాలకేయులతో యుద్ధం..తల నరికే సీన్..ఇవ్వన్నీ తెరపై చూస్తుంటే గూస్బంప్స్ గ్యారెంటీ. రెండు భాగల్లో ఏదో ఒకటి చూసిన వారికి కూడా ఈ సినిమా అర్థమయ్యేలా సీన్లను పేర్చాడు. అవంతిక లవ్‌స్టోరీ సీన్లను కట్ చేసినా..కొత్తగా చూసిన వారికి అర్థమయ్యేలా రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సుదీప్ కిచ్చతో పాటు కొన్ని కీలకమైన సీన్లను, పాటలను తొలగించినా.. కథలోని ఆత్మను మిస్ కానివ్వకుండా జక్కన్న జాగ్రత్తపడ్డాడు. కీరవాణి రీరికార్డింగ్ కూడా ఈ సినిమాకు ప్రెష్‌నెస్‌ని తీసుకొచ్చింది. అయితే నిడివి మాత్రం కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. కనీసం ఇంకో 20 నిమిషాల నిడివిని అయినా తగ్గిస్తే బాగుండేదేమో. మొత్తానికి బాహుబలి 1& 2 లాగే ది ఎపిక్ చిత్రాన్ని కూడా థియేటర్ విజువల్ వండర్లా తీర్చిదిద్దడంలో జక్కన్న వందశాతం సక్సెస్ అయ్యాడు.నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? ప్రభాస్, రానాతో పాటు ఇందులో కీలక పాత్రల్లో నటించిన వారంతా తమ తమ కెరీర్‌తో ది బెస్ట్ ఇచ్చారు. ప్రభాస్-అనుష్క జోడీని మరోసారి అలా తెరపై చూస్తుంటే.. రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంటుంది. యాక్షన్ సీన్లలో రానా, ప్రభాస్ పోటీ పడి నటించారు. రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా, సుబ్బరాజుతో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది. పదేళ్ల క్రితమే కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. వీఎఫెక్స్ అదిరిపోయాయి. అంతకు డబుల్ బడ్జెట్ పెడుతున్న సినిమాలకు కూడా ఈ స్థాయిలో సన్నివేశాలను తీర్చిదిద్దలేకపోతున్నారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా రీరిలీజ్‌లలో కూడా ‘బహుబలి’ ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే చెప్పాలి. -
మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ
ఇప్పటి జనరేషన్లో ఎంతమందికి 'మహాభారతం' గురించి తెలుసు? కచ్చితంగా చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే రీసెంట్ టైంలో దీని ఆధారంగా వచ్చిన సినిమాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. ప్రభాస్ 'కల్కి'లో కర్ణుడు, అశ్వద్ధామ పాత్రల్నిచూపించినా సరే మహాభారతంని పెద్దగా టచ్ చేయలేదు. అలాంటిది మహాభారతంలో జరిగిన యుద్దం ఆధారంగా 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ తీశారు. అక్టోబరు 10న తొమ్మిది ఎపిసోడ్స్‌తో తొలి సీజన్ రిలీజ్ కాగా ఇప్పుడు మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్‌ని రెండో సీజన్‌గా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)కథేంటి?'కురుక్షేత్ర' సంగ్రామంలో కౌరవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న ద్రోణుడిని పాండవులు సంహరించడంతో తొలి సీజన్ ముగించారు. అక్కడి నుంచే రెండో సీజన్ మొదలైంది. మరి కౌరవుల కొత్త సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కౌరవులు పక్షాన ఉన్న ధుర్యోధనుడు, కర్ణుడు, అశ్వద్ధామ, దుశ్శాసన.. పాండవుల పక్షాన ఉన్న అర్జునుడు, ధర్మరాజు, భీముడు తదితరుల మధ్య ఎలాంటి భీకర పోరాటం జరిగింది? అసలు ఈ కురుక్షేత్రం ఎలా మొదలైంది? ఎలా అంతమైంది? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం, కర్మ ఫలితం ఏంటి? యుద్ధం ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధాన్ని.. ఈ సిరీస్ మేకర్స్ 18 ఎపిసోడ్స్‌గా తీశారు. తొలుత తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తొలి సీజన్లో దాదాపు 15 రోజుల పాటు సాగిన యుద్ధాన్ని చూపించేశారు. రెండో సీజన్లో ఏం చూపిస్తారా అనే సందేహం వచ్చింది. కానీ మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్‌లో ఓవైపు యాక్షన్ చూపిస్తూనే మరోవైపు డ్రామాని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు.కుంతి, కర్ణుడు, దుశ్శాసన, భీమ, అశ్వత్థామ, దుర్యోధన.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ఎపిసోడ్ డిజైన్ చేశారు. అసలు వీళ్లు ఎవరు? ఈ యుద్ధంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? 'కురుక్షేత్ర'లో వీళ్ల పాత్ర ఏంటి? అనేది చక్కగా చూపించారు. పేరుకే యానిమేటెట్ సిరీస్ గానీ చూస్తున్నంతసేపు మహాభారతం కళ్లముందు కనిపిస్తుంది. నేరుగా యుద్ధాన్ని చూపించేసి సిరీస్ ముగించేస్తే పెద్దగా డ్రామా పండదు. 16వ ఎపిసోడ్‌లోనే యుద్ధం పూర్తయిపోతుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో యుద్ధం తర్వాత పరిస్థితుల్ని ఆకట్టుకునేలా చూపించారు. 'స్త్రీ పర్వ' ఎపిసోడ్, అందులో వచ్చే డ్రామా, డైలాగ్స్ బాగుంటాయి. చివరి ఎపిసోడ్లో శ్రీ కృష్ణుడి పాత్రపై వచ్చే విజువల్స్.. సగటు సినీ ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తాయి.ఇదివరకే మహాభారతం చూసినవాళ్లకు, తెలిసినవాళ్లకు ఈ సిరీస్ ఓకే అనిపించొచ్చు. కానీ మహాభారతం, కురుక్షేత్రం గురించి ఏ మాత్రం తెలియనవాళ్లకు మాత్రం బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, కర్ణుడు, అశ్వత్థామ, దృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి, ద్రౌపతి, దుర్యోధనుడు, దుశ్శానస.. ఇలా లెక్కలేనన్ని పాత్రలు ఉన్నాసరే అన్నింటి మధ్య కనెక్షన్స్, ఆయా విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి.రీసెంట్ టైంలో 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ సినిమా.. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఒకవేళ ఈ మూవీ గనక నచ్చితే 'కురుక్షేత్ర' సిరీస్‌ని అస్సలు మిస్ చేయొద్దు. పేరుకే 18 ఎపిసోడ్స్ గానీ ఒక్కొక్కటి 25-30 నిమిషాల నిడివితోనే ఉంటాయి. ఇలా మొదలుపెడితే అలా పూర్తయిపోతాయి. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. వీలైతే పిల్లలకు కూడా చూపిస్తే 'మహాభారతం' గురించి వాళ్లకు కూడా బోలెడంత జ్ఞానం వస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!) -
పిల్లలతో తీసిన హారర్ సినిమా.. వాళ్లు చూడకపోవడమే బెటర్!
హారర్ సినిమా అంటే ఓ రేంజులో భయపెట్టాలి. మొదటి సీన్ నుంచే మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోవాలి. కానీ మన దగ్గర రీసెంట్ టైంలో తీసే మూవీస్‌లో చాలావరకు అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాయి! అందుకే మూవీ లవర్స్.. కొరియన్, హాలీవుడ్ హారర్ చిత్రాల వెంటపడుతున్నరు. ఇప్పుడు అలాంటి వాళ్లని ఓ గుజరాతీ సినిమా తెగ భయపెట్టేస్తోంది. అదే 'వష్ 2'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ సంగతేంటి? ఎలాంటి థ్రిల్ ఇచ్చిందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)2023లో గుజరాతీలో 'వష్' అనే సినిమా రిలీజైంది. వశీకరణం స్టోరీతో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది. దీన్ని హిందీలో అజయ్ దేవగణ్ 'సైతాన్' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. దీంతో 'వష్' గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ దర్శకనిర్మాతల నుంచి సీక్వెల్ వచ్చింది. 'వష్ లెవల్ 2' పేరుతో తీశారు. ఇది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. గుజరాతీతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.కథేంటి?తొలి భాగానికి కొనసాగింపుగా 'వష్ 2' మొదలవుతుంది. మొదటి భాగంలో మాంత్రికుడికి ఉన్న శిష్యుడు.. ఓ స్కూల్లో చదివే 50 మందికి పైగా అమ్మాయిలని వశీకరణం ద్వారా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇతడి వశంలో ఉన్న కొందరు అమ్మాయిలు.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరైతే ఊరిమీద పడి జనాలని దారుణంగా చంపేస్తుంటారు. అసలు దీనంతటికీ మూలకారణం ఏంటి? ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొన్నారు? చివరకు అమ్మాయిలు బతికి బయటపడ్డారా లేదా అనేది మిగతా స్టోరీ.స్కూల్ పిల్లలు, ఓ మాంత్రికుడు, దుష్టశక్తులు.. ఇదే 'వష్ 2' సినిమా మెయిన్ ప్లాట్. వింటుంటేనే వామ్మో అనిపిస్తుంది కదా! అయినా పిల్లలతో హారర్ మూవీ ఎవరైనా తీస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ చూస్తున్నంతసేపు ఓవైపు భయమేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆత్రుత మరోవైపు కలుగుతూ ఉంటుంది. చెప్పాలంటే లోకల్‌గా తీసినప్పటికీ హాలీవుడ్ రేంజ్ కంటెంట్ డెలివరీ చేశారని చెప్పొచ్చు.ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలో రిలీజైతే.. అదే నెలలో 'వెపన్స్' అనే హాలీవుడ్ మూవీ కూడా విడుదలైంది. విచిత్రం ఏంటంటే ఈ రెండింటి కాన్సెప్ట్ దాదాపు ఒక్కటే. కొన్ని షాట్స్ అయితే అరే ఒకేలా ఉన్నాయేంటి అని కచ్చితంగా అనిపిస్తుంది. ఒకే నెలలో రిలీజ్ కావడం వల్ల కాపీ అనే ప్రసక్తి రాదు. సరే 'వష్ 2' విషయానికొస్తే ఓ స్కూల్, ఉదయం కాగానే వచ్చే పిల్లల సందడితో సినిమా మొదలవుతుంది. సరిగ్గా 13 నిమిషాల తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. పదిమంది ఆడపిల్లలు.. బిల్డింగ్ పైకెక్కి అక్కడినుంచి దూకి చనిపోతారు. అలా మొదలయ్యే టెన్షన్, థ్రిల్.. ఎండ్ కార్డ్ పడేవరకు ఆపకుండా ఉంటుంది.కేవలం 100 నిమిషాలు మాత్రమే ఉండే ఈ సినిమా.. చూస్తున్నంతసేపు మనల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. సినిమా అంతా భయంకరమైన, షాకింగ్ విజువల్స్ ఉంటాయి. మోనాల్ గజ్జర్ తప్పితే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మరో ముఖం లేదు. అయినా సరే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. పిల్లలందరూ యాక్టింగ్ అదరగొట్టేశారు. వీళ్లకు తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెడుతుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.అన్ని ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే ఉన్నాయి. చాలా హింసాత్మక సన్నివేశాలున్నాయి. వాటిలో టీనేజీ పిల్లలు ఉండటం కొందరికి ఇబ్బందిగా అనిపించొచ్చు. సెన్సిటివ్‌గా ఉండేవారు ఈ మూవీ చూడకపోవడమే మంచిది. మొదటి పార్ట్‌లో ఏదైతే స్టోరీ ఉందో దాన్ని అటుతిప్పి ఇటుతిప్పి చూపించినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. మంచి హారర్ సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్) -
ఓటీటీలోకి చావును వెంటాడే సినిమా.. ధైర్యం ఉంటేనే చూడండి (రివ్యూ)
ఈ వీకెండ్లో మీరు అదిరిపోయే సినిమా చూడాలని అనుకుంటున్నారా..? అయితే, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్(Final Destination Bloodlines) చిత్రాన్ని చూసేయండి. అయితే, ఇందులో హింసాత్మకమైన సీన్స్ ఉంటాయి. మిమ్మల్ని కలవరపరిచే ఛాన్స్ ఉంది. కాబట్టి సున్నితమైన వారు, చిన్న పిల్లలు దూరంగా ఉండటం మంచిది. ఫైనల్ డెస్టినేషన్ మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, అక్టోబర్ 16న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో అదిరిపోయే సూపర్ థ్రిల్లర్ సినిమా చూడాలనే ఆసక్తి ఉంటే దీనిని వదులుకోకండి. రూ.440 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2700 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ మూవీ రన్‌టైమ్ కేవలం 1:50 మాత్రమే.ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ ఏడాది పార్ట్-6 విడుదలైంది. చివరిగా 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 తర్వాత సుమారు 14 ఏళ్లకు ఈ ఫ్రాంఛైజీ నుంచి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ వచ్చింది. ఈ మూవీని దర్శకులు జాక్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టీన్ తెరకెక్కించారు. కైట్లిన్ శాంటా జువానా, రిచర్డ్ హార్మన్, టోనీ టాడ్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.మన కుటుంబంలోని వ్యక్తులు ఏ విధంగా మరణిస్తారో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? ఇదే కాన్సెప్ట్‌తో సినిమా కొనసాగుతుంది. అయితే, నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ మూవీని తీశామని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఈ ఫ్రాంఛైజీలోని 5 సినిమాలు కూడా ఇదే రేంజ్లో ఉంటాయి. తాజాగా విడుదలైన పార్ట్-6 కథ విషయానికి వస్తే.. 1968లో ఓ స్కై వ్యూ హోటల్లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (బ్రెక్ బాసింగర్). జరగబోయే ప్రమాదం గురించి ఆమె పసిగట్టేస్తుంది. అయితే, వారి ఆయుష్షు తీరినా కూడా ఐరిస్ తెలివిగా కొందరిని కాపాడుతుంది. ఎంతో ఘోరమైన ప్రమాదంలో చాలామంది దారుణమైన రీతిలో మరణిస్తారు. కానీ ఐరిస్ వల్ల కొందరు ప్రాణాలతో బయటపడతారు. చావును ఎదిరించి ప్రాణాలతో ఉన్న వారిని ఒక్కొక్కరిగా చావు తరుముతూ వస్తుంది. అయితే, ఒక ఆర్డర్ ప్రకారమే వారు మరణిస్తారు. ఈ క్రమంలోనే వారందరినీ కాపాడిని ఐరిస్ వంతు ఒకరోజు వస్తుంది. ఆమె మరణిస్తే తన తర్వాతి కుటుంబ సభ్యులు కూడా చనిపోతారని గ్రహిస్తుంది. ఈ ఆర్డర్‌ను తప్పించేందుకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? చావును ఎదిరించి ఎలా బతికింది..? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఐరిస్ చాలా పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ఏంటి..? ఫైనల్‌గా తన కుటుంబ సభ్యులను కాపాడుకుందా..? ఈ క్రమంలోనే ఆమె మనవరాలు స్టేఫినీ (కైట్లిన్ శాంటా జువానా) చేసిన సాహసం ఏంటి..? అనేది తెలియాలంటే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ చూడాల్సిందే. ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సీన్లు ఉండవ్.. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ, ఘోరమైన ప్రమాదాలు కలవరపరిచేలా ఉంటాయి.ఫైనల్ డెస్టినేషన్ కథ సింపుల్‌గానే ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తూ.. సస్పెన్స్ తో కూడిన డెత్ సీన్స్ ట్రీట్ ఇస్తాయి. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఆడియెన్స్ ఈ మూవీకి దూరంగా ఉండటం మంచింది. మనిషి జీవితంలో మరణం ఏ రీతిలో పలకరిస్తుంది ముందే తెలుసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. -
‘కె-ర్యాంప్’ మూవీ రివ్యూ
ఈ దీపావళికి ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమాగా ‘కె- ర్యాంప్’(K- Ramp Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? కిరణ్ అబ్బవరం ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కుమార్ అబ్బవరం(కిరణ్ అబ్బవరం) రిచ్ కిడ్. ఎంసెంట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ..చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న(సాయి కుమార్) ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్.. తొలి చూపులోనే క్లాస్మేట్ మెర్సీ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. మెర్సీ కూడా కుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరి ఫ్యామిలీకీ వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో మెర్సికి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందనే విషయం తెలుస్తుంది. ఆమెకు ఉన్న వ్యాదితో కుమార్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాది ఎలా సోకింది? దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? ఈ కథలో నరేశ్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగానే ఇది కామెడీతో కూడిన కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలలో లాజిక్స్ గురించి వెతుకొద్దు. కథలో కొత్తదనం, ట్విస్టులు కూడా పెద్దగా ఆశించొద్దు. ఊరమాస్ కామెడీ సీన్లతో ఫన్ జనరేట్ చేస్తే చాలు.. ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. నూతర దర్శకుడు జైన్స్ నాని అదే పని చేశాడు. కథపై దృష్టిపెట్టకుండా హీరో కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా సీన్లను పేర్చుకుంటూ వెళ్లాడు. అవి హిలేరియస్ అనిపించాయి. రొటీన్ కామెడీ స్టోరీకి చివరిలో ఎమోషనల్ టచ్ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరో పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ కథ ప్రారంభం అవుతుంది. ఇక కిరణ్ అబ్బవరం ఎంట్రీ సీన్ థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది. రాజశేఖర్ సినిమా పాటలకు ఆయన వేసే స్టెప్పులు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథంతా రొటీన్‌గానే సాగుతుంది. కుమార్ కేరళకు వెళ్లడం.. మెర్సీని చూసి ప్రేమలో పడడం.. ఆమె కోసం చేసే పనులు ఇవ్వన్నీ రెగ్యులర్ సినిమాల్లో చూసినట్లుగానే ఉంటాయి. కొన్ని ఊరమాస్ సన్నివేశాలు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్‌గానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం హీరోయిన్ ఉన్న ఆరోగ్య సమస్యతో హీరో ఎలా ఇబ్బందికి గురయ్యాడనేదే చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిశోర్ పాత్ర ఎంట్రీ తర్వాత ఫన్ డోస్ ఇంకాస్త పెరుగుతుంది. ఒకవైపు వెన్నెల కిశోర్.. మరోవైపు నరేశ్..వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు..ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. నరేశ్ చెప్పే మాటలు.. సాయి కుమార్-కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. నరేశ్ పాత్ర చెప్పే కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. లాజిక్స్, కొత్తదనం ఆశించకుండా థియేటర్స్‌కి వెళితే.. హాయిగా నవ్వుకొవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రానికి కిరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. యాక్షన్, ఫన్‌తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకు ప్లస్ అయింది. అరుదైన వ్యాధి ఉన్న మెర్సీ పాత్రలో యుక్తి తరేజా ఒదిగిపోయింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు కానీ.. సెకండాఫ్‌లో మాత్ర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై కిరణ్-యుక్తిల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే కిరణ్ పాత్ర పూరి జగన్నాథ్ సినిమాల్లోని హీరోని గుర్తు చేస్తే.. యుక్తి పాత్ర మారుతి సినిమాల్లోని హీరోయిన్ని గుర్తు చేస్తుంది. ఇక వీకే నరేశ్ పాత్ర ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి నవ్వులు పూశాయి. అయితే ఆయనకు ఇంకొన్ని సీన్లు పడితే బాగుందనిపించింది. ఇక వెన్నెల కిశోర్ కనిపించేది కాసేపే అయినా.. ఆ ఎపిసోడ్ అదిరిపోతుంది. సాయి కుమార్, మురళీధర్ గౌడ్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారంగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను తెరపై బాగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. -
'డ్యూడ్' రివ్యూ.. ప్రదీప్‌కు హ్యాట్రిక్ విజయం దక్కిందా
టైటిల్: డ్యూడ్నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్, రోహిణి,హృదు హరూన్,నేహా శెట్టినిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్సంగీతం: సాయి అభ్యంకర్సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిఎడిటర్: బరత్ విక్రమన్విడుదల తేది: అక్టోబర్ 17, 2025లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో తెలుగులో కూడా మంచి విజయాలు అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్.. తాజాగా ఆయన నటించిన సినిమా డ్యూడ్ విడుదలైంది.. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి యూత్న్ టార్గెట్ చేస్తూనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా నటించగా.. శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. డ్యూడ్ సినిమాతో మలయాళ నటుడు హృదు హరూన్ టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించారు. గతంలో ఆయన సుధా కొంగర వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.కథ ఏంటి..?ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్‌గా కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. రాష్ట్రంలో ఎంతో పేరు పొందిన మంత్రిగా ఆదికేశవులు (శరత్ కుమార్) ఉంటాడు. తన రాజకీయ భవిష్యత్ కోసం ఏమైనా చేయగలిగే వ్యక్తి. తన కులానికి చెందిన వాడినే అల్లుడిగా చేసుకోవాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తికి కుమార్తె కుందన (మమితా బైజు) ఉంటుంది. ఆమెకు మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఇద్దరి మధ్య చిన్నతనం నుంచే మంచి బాండింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే గగన్‌ను కుందన ప్రేమిస్తుంది. కానీ, అతను మాత్రం మరో అమ్మాయిని ఇష్టపడుతాడు. వారిద్దరి మధ్య బ్రేకప్ కాగానే కుందన తన ప్రేమ విషయాన్ని గగన్తో పంచుకుంటుంది. అయితే, గగన్ ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. దీంతో కుంగిపోయిన కుందన ఒంటరిగా ఉండేందుకు బెంగళూరు వెళ్లిపోతుంది. ఆమె దూరమే గగన్‌కు తన ప్రేమను అర్థమయ్యేలా చేస్తుంది. అయితే, తన ప్రేమ విషయాన్ని మొదట తన మామ (శరత్ కుమార్)తో చెప్తాడు. సంతోషంగా పెళ్లికి ఒప్పుకొని ఏర్పాట్లు కూడా చేస్తాడు. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన కుందన తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. అలా కుందన సడెన్‌గా నిర్ణయం మార్చుకోవడానికి ఉన్న కారణం ఏంటి.. గగన్- కుందన పెళ్లికి ఉన్న చిక్కులు ఎవరి వల్ల వచ్చాయి.. కుందన ఎలాంటి కారణాలు చెబుతుంది... ప్రియురాలి కోసం గగన్ చేసిన త్యాగం ఏంటి.. గగన్ తల్లి (రోహిణి), కుందన తండ్రి (శరత్ కుమార్) అన్నాచెల్లెలు.. అయినప్పటికీ ఎందుకు మాట్లాడుకోరు.. ఫైనల్‌గా కుందనతో గగన్ పెళ్లి జరిగిందా లేదా అనేది తెలియాలంటే డ్యూడ్ చూడాల్సిందే.ఎలా ఉందంటే..?డ్యూడ్ సినిమా ప్రమోషన్లో ఈ కథకు స్ఫూర్తి అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 చిత్రమేనని దర్శకుడు చెప్పారు. ఆయన ఈ మాట ఎందుకు చెప్పారనేది చిత్రం చూసిన తర్వాత తెలుస్తోంది. ఆర్య కాన్సెప్ట్నే డ్యూడ్‌లో చూపించారు. లవ్ ఫెయిల్ అయితే దేవదాస్‌లు కానక్కర్లేదు.. ప్రేయసి కోసం ప్రేమికుడిగా ఏం చేయవచ్చో డ్యూడ్ చెప్తాడు. కథలో పెద్దగా కొత్తదనం ఉండదు. కానీ, ఫుల్ ఫన్‌తో ఈ చిత్రం ఉంటుంది. కథ చాలా రొటీన్‌గా ఉన్నప్పటికీ తెరపై దర్శకుడు చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ విషయంలో కీర్తిశ్వరన్ విజయం సాధించాడు. కాన్సెప్ట్ అంతా పాతదే అయినప్పటికీ నేటి యూత్ కోసం కొత్తగా చూపించాడు. నిజమైన ప్రేమకు ఎమోషన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ పాయింట్‌నే డ్యూడ్‌లో చూపించారు. డ్యూడ్ మూవీ చూస్తున్నంత సేపు అక్కడక్కడ ఆర్య-2 గుర్తకు వస్తుంది. అయితే, ఇక్కడ ఆ సీన్లు చాలా ఫ్రెష్‌గానే ఉంటాయి. ఈ మూవీలో డైలాగ్స్ చాలా చోట్ల యూత్‌తో విజిల్స్ వేపించేలా ఉంటాయి. అయితే. క్లైమాక్స్‌లో మినహా ఎక్కడా కూడా భావోద్వేగంతో కూడిన సీన్స్ కనిపించవ్.. కానీ, కుందన ప్రేమను గగన్ తిరస్కరించిన సమయంలో వచ్చే సీన్ ప్రతి ప్రేమికుడిని గుచ్చేస్తుంది. సినిమా ఎండింగ్ కూడా ప్రేక్షకుడిని సంతృప్తి పరిచేలా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..?డ్యూడ్‌కు ప్రధాన బలం ప్రదీప్ రంగనాథ్.. గత సినిమాల మాదరే ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు తన ఎక్స్‌ప్రెషన్స్‌తో దుమ్మురేపాడు. ఆ తర్వాత శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. ఇందులో ఆయన కాస్త ఫన్నీగా కనిపించడమే కాకుండా అవసరమైన చోట సీరియస్‌గా కనిపించి తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. అయితే, మమితా బైజు వారిద్దరితో పోటీ పడుతూ నటించింది. నటన పరంగా మంచి స్కోప్ ఉన్న పాత్రనే ఆమెకు దక్కిందని చెప్పవచ్చు. మలయాళ నటుడు హృదు హరూన్, రోహిణి తమ పరిదిమేరకు నటించారు. తమిళ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసి కీర్తిశ్వరన్.. డ్యూడ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మెప్పించాడని చెప్పవచ్చు. డ్యూడ్ చిత్రానికి మరో ప్రధాన బలం సంగీతం. సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకుడిలో జోష్ నింపుతుంది. పైనల్గా పుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు. యూత్న్ మాత్రం నిరాశపరచదని చెప్పవచ్చు. -
తెలుసు కదా మూవీ రివ్యూ
టైటిల్: తెలుసు కదానటీనటులు:సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీనిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్రచన, దర్శకత్వం: నీరజ కోనసంగీతం: ఎస్. థమన్సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ విఎస్ఎడిటర్: నవీన్ నూలివిడుదల తేది: అక్టోబర్ 17, 2025డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్న స్టార్ బాయ్ సిద్ధుకి ‘జాక్’ భారీ షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘తెలుసు కదా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ (Telusu Kada Movie Review)లో చూద్దాం.కథేంటంటే..స్టార్ హోటల్ లో చీఫ్ చెఫ్‌గా పనిచేసే వరుణ్ కుమార్(సిద్దు) అనాథ. కాలేజీ డేస్‌లో లవ్ బ్రేకప్ అవ్వడంతో అమ్మాయిలను ఎంత వరకు ప్రేమించాలనే విషయంలో క్లారిటీతో ఉంటాడు. భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. మ్యాట్రిమొనీ ద్వారా అంజలి(రాశి ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ రాగా(శ్రీనిధి శెట్టి) ద్వారా సరోగసీతో తల్లి కావొచ్చనే విషయం అంజలికి తెలుస్తుంది. బిడ్డను మోసేందుకు డాక్టర్ రాగా ముందుకు వస్తుంది. కట్ చేస్తే.. కాలేజీ డేస్‌లో వరుణ్ ప్రేమించిన అమ్మాయినే డాక్టర్ రాగా. ఈ విషయం తెలిసి కూడా రాగా తన బిడ్డను మోసేందుకు ఒప్పుకుంటాడు వరుణ్. ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాగా-వరుణ్ బ్రేకప్‌కి కారణం ఏంటి? తనను వదిలేసి వెళ్లిపోయిన రాగా పట్ల ఎంతో కోపం పెంచుకున్న వరుణ్.. ఆమె తన బిడ్డను మోసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు? రాగా-వరుణ్‌ల విషయం అంజలికి తెలిసిందా లేదా? మాజీ ప్రేయసి ఒకవైపు.. కట్టుకున్న భార్య మరోవైపు.. ఇద్దరి మధ్య వరుణ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? వరుణ్ కోరుకున్నట్లుగా చివరకు తండ్రి అయ్యాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. పెళ్లి అయిన తర్వాత తల్లికాలేని భార్య.. ప్రియుడి బాధను అర్థం చేసుకొని బిడ్డను మోసేందుకు ముందుకు వచ్చిన ప్రియురాలు.. వీరిద్దరిని హీరో ఎలా డీల్ చేశాడనేదే సినిమా కథ. ప్రేమ, ఈగో, ఎమోషన్స్ చుట్టూ కథనం తిరుగుతుంది. దర్శకురాలు నీరజ కోన ఎంచుకున్న పాయింట్ కాస్త కొత్తగా ఉన్నా.. కొన్ని చోట్ల హీందీ చిత్రం చోరి చోరి చుప్కే చుప్కే పోలికలు కనిపిస్తాయి. మెచ్యూర్డ్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు కానీ.. ప్రియురాలే బిడ్డను కనేందుకు ముందుకు రావడం అనే లైన్‌ని సినిమా చూసే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కొన్ని సున్నితమైన విషయాలను కూడా కాస్త బోల్డ్‌గానే చూపించారు. ఈ విషయంలో దర్శకురాలిని అభినందించాల్సిందే. కానీ కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యారు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. హీరో బ్రేకప్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ప్లాన్ చేయడం.. ఈ క్రమంలో అంజలిని కలవడం.. ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉండడంతో పెళ్లి చేసుకోవడం.. పిల్లలు పుట్టరనే విషయం తెలిసే వరకు కథనం సింపుల్‌గానే సాగుతుంది. రాగా ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. బిడ్డను మోసేందుకు తనే ముందుకు రావడంతో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ మొత్తం వరుణ్, రాగా, అంజలిల చుట్టే తిరుగుతుంది. వరుణ్, రాగాల గురించి అంజలికి తెలిసిన తర్వాత ఏం జరిగిందనేదే సెకండాఫ్ స్టోరీ. ఫస్టాప్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ముగ్గురి మధ్య వచ్చే సీన్లు రొటీన్‌గానే ఉంటాయి. కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. అయితే సినిమాలోని డైలాగ్స్ అన్ని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం బాగుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈగో, ఎమోషన్స్‌తో కూడిన వరుణ్ పాత్రలో సిద్దు ఒదిగిపోయాడు. శ్రీనిధి, రాశీ ఖన్నాలతో సిద్దు కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. ప్రేమ, పెళ్లి వద్దు.. ఉన్నంత సేపు సంతోషంగా గడిపి తర్వాత ఎవరిదారి వారు చూసుకుందామనే అమ్మాయి రాగా పాత్రకి శ్రీనిధి న్యాయం చేసింది. హీరో భార్య అంజలిగా రాశీ ఖన్నా చక్కగా నటించింది. వైవా హర్ష తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, డిఫరెంట్ ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు. చిన్న చిన్న డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అయితే ఆ బీజీఎం మొత్తం ఇటీవల వచ్చిన ఓజీ సినిమాను గుర్తు చేస్తుంది. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ కి రిచ్ నెస్ తీసుకొచ్చింది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘మిత్రమండలి’ మూవీ రివ్యూ
టైటిల్ : మిత్రమండలినటీనటులు: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ తదితరులునిర్మాణ సంస్థ: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: కల్యాన్ మంతిన, భాను ప్రతాప,డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగలదర్శకుడు: విజయేందర్సంగీతం : ఆర్. ఆర్ ధ్రువన్సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ ఎస్జెవిడుదల తేది: అక్టోబర్ 16, 2025మిత్రమండలి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ‘జాతిరత్నాలు’తో పోల్చారు. ఓ జాతిరత్నం ప్రియదర్శి ఇందులో హీరోగా నటించడం.. స్టార్ కమెడియన్స్ అంతా ఇతర పాత్రల్లో కనిపించడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు అయితే పెరిగాయి. ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో బన్నీ వాసు చేసిన కామెంట్స్.. ‘ఈ సినిమా నచ్చకపోతే నా తర్వాత సినిమా చూడకండి’అంటూ నాని రేంజ్లో ప్రియదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ ‘మిత్రమండలి’పై హైప్‌ని క్రియేట్ చేశాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం(Mithra Mandali Movie Review).కథేంటంటే...జంగ్లీపట్నానికి చెందిన నారాయణ(వీటీవీ గణేష్)కి కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకంటే.. వారిని చంపేసే రకం. తుట్టె కులం అండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక ఎన్ఎమ్) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్)ని కలుస్తాడు. లంచం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్(సత్య) ద్వారా స్వేచ్ఛ పారిపోవడం వెనక అదే ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓయి), రాజీవ్ (ప్రసాద్ బెహరా) ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నలుగురు ఆవారాగాళ్లు. రోజంతా బాతకాలు కొట్టడం.. సాయంత్రం మందేసి చిందులు వేయడమే వీరి పని. ఇలాంటి చిల్లర గాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వేచ్ఛ పారిపోవడం వెనున ఉన్న అసలు కారణం ఏంటి? స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా(Mithra Mandali Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..కామెడీ చిత్రాలకు కథతో సంబంధం లేదు. నవ్వులు పూయించే సన్నివేశాలు ఉంటే చాలు, ఆ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇక కథతో కూడిన కామెడీ ఉంటే.. ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుంటారు. జంద్యాల, ఈవీవీ చిత్రాలే ఇందుకు నిదర్శనం. కథలో కొత్తదనం లేకున్నా.. కామెడీ పండించినా..ఆ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికి ఉదాహారణ ‘జాతిరత్నాలు’. ఈ రెండూ లేని కామెడీ చిత్రం ‘మిత్ర మండలి’. చెప్పుకోవడానికి పెద్ద కథ లేదు.. నవ్వుకోవడానికి కామెడీ సన్నివేశాలు లేవు. కానీ ‘స్టార్’ కమెడియన్స్ అంతా ఈ చిత్రంలో ఉన్నారు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు చూసుకున్న ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. కామెడీ చిత్రం కదా ఆ కొత్తదనం ఆశించడం తప్పే అవుతుంది. కానీ కామెడీ అనుకొని రాసుకున్న సన్నివేశాలు అయినా నవ్వులు పూయించే విధంగా ఉండాలి కదా? అది లేదు. ఒక ఫిక్షనల్ సిటీ.. కులపిచ్చి గల రాజకీయ నేత.. ఇంట్లో అమ్మాయి పారిపోవడం.. దాని వెనుక నలుగురు కుర్రాళ్లు ఉండడం.. ఈ సింపుల్ కథతో కావాల్సినంత కామెడీ పుట్టించొచ్చు. దర్శకుడు పేపర్‌పై రాసుకున్నప్పుడు కూడా ఇలాగే ఊహించొచ్చు. కానీ ఆయన ఊహకి తెర రూపం ఇవ్వడంలో మాత్రం విఫలం అయ్యాడు. కామెడీ అనుకొని రాసుకున్న సన్నివేశాలేవి నవ్వించలేకపోయాయి. ప్రధాన పాత్రలు చెప్పే డైలాగ్స్.. వారి ప్రవర్తన..ప్రతీదీ అతిగానే అనిపిస్తుంది. కులపిచ్చి ఉన్న నారాయణ ఎమ్మెల్యే టికెట్ కోసం చేసే ప్రయత్నం.. కూతురు పారిపోవడం.. నలుగురు మిత్రుల గ్యాంగ్ చేసే అల్లరి సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ సత్య చేసే కామెడీ ఒకటే కాస్త నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త బెటర్. ఛేజింగ్ సీన్, పెళ్లి సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా మిత్రమండలి చేసే కామెడీ కాస్త నవ్వులు పూయిస్తే.. చాలా చోట్ల అతిగానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి, రాగ్ మయూరి, విష్ణు, సత్య, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్..వీళ్ల కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో కామెడీ పండించగలరు. కానీ ఈ చిత్రంలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయారు. దానికి కారణం దర్శకుడు అనే చెప్పాలి. వీరి కామెడీ టైమింగ్‌ని వాడుకోవడంలో ఆయన విఫలం అయ్యాడు. ఉన్నంతలో సత్య ఒక్కడే కాస్త నవ్వించాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ ఆయన చేసే కామెడీ వర్కౌట్ అయింది. మిగతా పాత్రలన్నీ అతి చేసినట్లుగానే అనిపిస్తుంది. స్వేచ్ఛగా నిహారిక తన పరిధిమేర నటించింది. సాంకేతికంగా సినిమా ఓకే. ఆర్. ఆర్ ధ్రువన్ నేపథ్య సంగీతం పర్వాలేదు. నిబ్బా నిబ్బి సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్
కల్పిత కథలతో సినిమాలు తీయడం సులభమే. కానీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూవీస్ తీసి హిట్ కొట్టడం చాలా కష్టం. కొన్నిసార్లు మాత్రం ఇలా తీసి బ్లాక్ బస్టర్ కొడుతుంటారు లేదంటే చూసే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంటారు. ఈ మధ్య అలా వచ్చిన 'ద లాస్ట్ బస్' అనే చిత్రం మూవీ లవర్స్‌కి మంచి అనుభూతి ఇస్తూ తెగ నచ్చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)కథేంటి?అది 2018. అమెరికాలోని కాలిఫోర్నియా. కెవిన్ (మాథ్యూ మెక్ కొనాగే) స్కూల్ బస్ డ్రైవర్. ఇతడికి నడవలేని స్థితిలో ఉండే తల్లి, టీనేజ్ కొడుకు ఉంటారు. ఓ రోజు డ్యూటీలో భాగంగా పిల్లల్ని స్కూల్లో దింపేసి కెవిన్.. ఇంటికి తిరిగొచ్చే దారిలో ఉంటాడు. అప్పుడే ఆ ప్రాంతమంతా కార్చిచ్చు అంటుకుంటుంది. దీంతో స్కూల్లో ఉన్న 22 మంది పిల్లల్ని మరోచోటకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కెవిన్‌పై పడుతుంది. ఓవైపు ఊళ్లకు ఊళ్లు తగలబడిపోతుంటాయి. మరోవైపు కెవిన్.. ఈ పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలి? మరి కెవిన్ ఏం చేశాడు? చివరకు పిల్లలతో పాటు బతికి బయటపడ్డాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమాని నిజంగా జరిగిన సంఘటనల స్ఫూర్తితో తీశారు. 2018లో కాలిఫోర్నియాలో కార్చిచ్చులో 85 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఊళ్లకు ఊళ్లు బూడిదయ్యాయి. ఇదంతా జరుగుతున్న సమయంలోనే కెవిన్ అనే సాధారణ స్కూల్ బస్ డ్రైవర్.. ఊళ్లని తగలబెట్టేసే మంటల్ని దాటుకుని 22 మంది పిల్లల్ని సాహసోపేతంగా ఎలా కాపాడాడనేదే 'ద లాస్ట్ బస్' మూవీ.పేరుకే ఇది సినిమా. కానీ చూస్తున్నప్పుడు ఏ మాత్రం అలా అనిపించదు. చాలా రియలస్టిక్‌గా ఉంటుంది. మనం కూడా ఆ బస్సులోనే ఉన్నామా అని ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఈ రేంజు విజువల్స్, గ్రాఫిక్స్ ఎలా తీశార్రా అని కచ్చితంగా సందేహం వస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క సీన్ కూడా గ్రాఫిక్స్‌లా అనిపించదు. ఫస్టాప్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది గానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి సర్వైవల్ థ్రిల్లర్ జానర్లోకి వస్తుంది. తర్వాత ఏమవుతుందా అనే టెన్షన్ మనల్ని కుదురుగా కూర్చోనివ్వదు.ఏదైనా ఆపద వచ్చినప్పుడు 'ప్రెజెన్స్ ఆఫ్ మైండ్' అనేది చాలా కీలకం. ఇందులో బస్ డ్రైవర్ కెవిన్ ఆలోచన విధానం చూస్తే అదే గుర్తొస్తుంది. తొందరపడటం కంటే కొన్నిసార్లు ఏం చేయకుండా అలా ఉండటం కూడా ఒకందుకు మంచిదే అనేలా ఓ సీన్ ఉంటుంది. కానీ కార్చిచ్చు వీళ్ల దగ్గరకు కూడా వచ్చేసరికి మంటల్లోని బస్ పోనిచ్చే సీన్ అయితే ప్రీ క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చివరకొచ్చేసరికి హ్యాపీ ఎండింగ్‌తోనే ముగించడం సంతోషం.సినిమాలో కనిపించిన నటీనటులు ఎవరూ మనకు తెలియదు. కానీ వాళ్లతో పాటు మనం కూడా ట్రావెల్ అవుతాం. అయితే సినిమాలో ఎమోషన్స్, డ్రామా లాంటివి ఇంకా పెట్టొచ్చు కానీ దర్శకుడు ఆ పనిచేయలేదు. అది మాత్రం కాస్త వెలితిగా అనిపిస్తుంది. సెప్టెంబరు 19న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. అక్టోబరు 03 నుంచి ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతోనూ చూడొచ్చు. ఒకవేళ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు) -
'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు
మొన్నటివరకు సినిమా అంటే కచ్చితంగా నటీనటులు ఉండాలి, భారీ బడ్జెట్ పెట్టాలనేది అందరికీ తెలిసిన విషయం. కానీ 'మహావతార్ నరసింహా'.. దీన్ని బ్రేక్ చేసింది. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. మొత్తం యానిమేషన్‌తో తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ తరహా యానిమేషన్‌తో ఇప్పుడు మహాభారతంలోని కురుక్షేత్ర ఘట్టానికి దృశ్యరూపం ఇచ్చారు. అలా 'కురుక్షేత్ర' పేరుతో వెబ్ సిరీస్‌గా ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: Bigg Boss 9: వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్)ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఉజాన్ గంగూలీ దర్శకుడు. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని 18 ఎపిసోడ్స్‌గా తెరకెక్కించారు. ఛాప్టర్-1 పేరుతో ఇప్పుడు తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా.. ఈనెల 24న మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్ విడుదల చేయనున్నారు. మరి 'కురుక్షేత్ర' తొలి సీజన్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.'కురుక్షేత్ర' కథేంటి?అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత పాండవులకు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు.. రాజ్యంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాట తప్పుతారు. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఓపిగ్గానే ఉంటారు. సంజయుడితో కౌరవులకు రాయబారం పంపిస్తారు. కానీ అది విఫలమవుతుంది. కౌరవులు.. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్నారనే విషయం పాండవులకు తెలుస్తుంది. దీంతో కృష్ణుడు, అర్జునుడు వైపు.. కృష్ణుడి సైన్యం దుర్యోధనుడికి దక్కుతుంది. అలా 'కురుక్షేత్రం' మొదలవుతుంది. ఆయుధాలే పట్టనని అనుకున్న అర్జునుడు.. కృష్ణుడి గీతోపదేశం తర్వాత ఎలా మారాడు? ఈ యుద్ధంలో అసలేం జరిగిందనేది అసలు కథ?ఎలా ఉందంటే?మహాభారతం అంతులేని సబ్జెక్ట్. ఎంత చెప్పినా అస్సలు తరగదు. దీనిపై ఇప్పటికే పలు సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. జనాలని అలరించాయి. నెట్‌ఫ్లిక్స్ మాత్రం 18 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని మాత్రమే తీసుకుని ఈ 'కురుక్షేత్ర' సిరీస్ తీసింది. ఒక్కముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. ముందే యానిమేటెడ్ సిరీస్ అని చెప్పేశారు కాబట్టి ఓ అంచనా ఉంటుంది. దాన్ని అందుకోవడంలో ఏ మాత్రం తగ్గలేదు. గ్రాఫిక్స్, తెలుగు డబ్బింగ్, కథని చెప్పే విధానం.. ఇలా ప్రతిదీ టాప్ రేంజులో ఉన్నాయి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))అయితే ఉన్నది ఉన్నట్లు చెబితే చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టొచ్చు. అందుకే ఓవైపు యుద్ధాన్ని చూపిస్తూనే మరోవైపు ఫ్లాష్ బ్యాక్స్ కూడా చూపిస్తూ ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. కౌరవుల దగ్గరకెళ్లి సంజయుడి రాయబారం చేసే సీన్స్‌తో తొలి ఎపిసోడ్ మొదలవుతుంది. రెండో ఎపిసోడ్‌కి యుద్ధం ప్రారంభమైపోతుంది. అక్కడి నుంచి భీష్ముడి మరణం, పద్మవ్యూహంలో బంధించి అభిమన్యుడిని కౌరవులు చంపడం, జయద్రధుడిని అర్జునుడు సంహరించే సీన్.. ఇలా గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలతో ఆద్యంతం అలరించేలా తీశారు.మహాభారతంలో పాత్రలు చాలా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈ సిరీస్‌లో చాలా సులభంగా గుర్తుపెట్టుకునేలా అన్ని పాత్రల్ని తీర్చిదిద్దారు. ఎలాంటి సాగదీత లేకుండా క్లియర్ కట్‌గా సీన్స్ అన్ని చూపించారు. కాస్ట్యూమ్స్ గానీ కోటలు, రాజభవనాలు గానీ.. యుద్ధ సన్నివేశాలు గానీ ప్రతిదీ టాప్ క్వాలిటీతో తెరకెక్కించారు. తెలుగు డబ్బింగ్ కూడా ఫెర్ఫెక్ట్గా ఉంది. ఇప్పటి జనరేషన్‌కి మహాభారతం, కురుక్షేత్రం గురించి అస్సలు తెలియకపోవచ్చు. వాళ్లు గానీ ఈ సిరీస్ చూస్తే థ్రిల్ కావడంతో పాటు చాలా విషయాలు తెలుసుకుంటారు కూడా!ఈ సిరీస్‌లో మిగిలిన పాత్రల సంగతేమో గానీ కర్ణుడు పాత్ర చూస్తున్నప్పుడు మాత్రం ప్రభాస్ పోలికలు కనిపిస్తాయి. మరి మేకర్స్ కావాలని పెట్టారా లేదంటే అలా కుదిరేసిందో? ఏదేమైనా రీసెంట్ టైంలో 'మహాభారతం' ఆధారంగా సినిమాలు గానీ సిరీస్‌లు గానీ రాలేదు. ఓ రకంగా ఈ విషయం ఈ సిరీస్‌కి చాలా ప్లస్ పాయింట్. టైమ్ ఉంటే మాత్రం ఓటీటీలో ఉన్న ఈ జెమ్ని అస్సలు మిస్ కావొద్దు- చందు డొంకాన(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా) -
ఓటీటీలో సూపర్ హీరో సినిమా.. ఎలా ఉందంటే?
టైటిల్: మిన్నల్ మురళినటీనటులు- టొవినో థామస్,గురు సోమసుందరం, అజు వర్గీస్, సాజన్సంగీతం: సుశీన్ శ్యామ్, షాన్ రెహమాన్సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్ఎడిటింగ్: లివింగ్‌స్టోన్ మాథ్యూదర్శకత్వం: బాసిల్ జోసెఫ్ఓటీటీ: నెట్ఫ్లిక్స్ఓటీటీల్లో చిత్రాలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకైతే ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అలా వచ్చి ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన మిన్నల్ మురళి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.సినీ ఇండస్ట్రీలో గతంలో సూపర్ మ్యాన్ తరహాలో చాలా సినిమాలొచ్చాయి. ఇలాంటి చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రాలు ఎక్కువగా హాలీవుడ్, బాలీవుడ్లోనే ఎక్కువగా వస్తుంటాయి. అయితే మలయాళ సినీ పరిశ్రమ ప్రేక్షకులకు ఆ స్థాయి ఎక్స్పీరియన్స్ వచ్చే సినిమాను తీసుకొచ్చింది. టొవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన మిన్నల్ మురళి ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంది. అసలు మిన్నల్ మురళి కథేంటి? అతను సూపర్ హీరో ఎలా అయ్యాడో చూసేద్దాం.మిన్నల్ మురళి కథేంటంటే..అనంతపురంలోని ఉరవకొండ గ్రామంలో నివసించే జేసన్ (టొవినో థామస్ ఓ టైలర్. కానీ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఓ పెద్దాయన అతన్ని చేరదీస్తాడు. అతని జీవిత లక్ష్యం అమెరికా వెళ్లడమే. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే క్రమంలో పోలీస్ ఆఫీసర్ కూతురిని ప్రేమించి విఫలమవుతాడు. అయితే అదే గ్రామంలో హోటల్లో పని చేసే శిబు (గురు సోమసుందరం), జేసన్ (టోవినో థామస్) ఒకరోజు మెరుపు దాడి(పిడుగుపాటు) గురవుతారు. ఆ సమయంలో వీరిద్దరికీ ఊహించని శక్తులు వస్తాయి. మరీ ఆ శక్తులను వాళ్లు ఎలా ఉపయోగించారు? మంచి కోసం వాడారా? వీరి వల్ల ఆ గ్రామ ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడ్డారు? అన్నది తెలియాలంటే మిన్నల్ మురళి చూడాల్సిందే.ఎలా ఉందంటే..సూపర్ హీరో ఒక్కరే ఉంటే.. అతను విలన్ అంతం చేయడమనేది ఉంటుంది. కానీ ఇద్దరికీ ఓకే రకం పవర్స్ ఉంటే సరాసరి పోరాటం ఉంటుంది. అదే ఈ మిన్నల్ మురళి. తెరపై ఇద్దరు సూపర్ హీరోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాలీవుడ్లో మార్వెల్, డీసీ కామిక్స్ లాంటి ఎందరో సూపర్ హీరోలను మనం చూశాం. కానీ ఇండియా సినీ చరిత్రలో ఇద్దరు సూపర్ హీరోల పాత్రలు అరుదనే చెప్పలి. జేసన్ తన అమెరికా కల కోసం పోరాటం.. శిబు తన ప్రియురాలి కోసం ఆరాటం.. ఈ క్రమంలోనే తమ సూపర్ పవర్‌ని ఎలా ఉపయోగించారనే స్టోరీని అద్భుతంగా తెరకెక్కించాడు బాసిల్ జోసెఫ్.ఈ సూపర్‌హీరో కథను ఇండియన్ ఆడియన్స్‌కు అర్థమయ్యేలా రూపొందించడంలో బాసిల్ జోసెఫ్ సక్సెస్ అయ్యారు. ఈ మూవీలో జేసన్ కంటే శిబు పాత్ర హైలెట్‌గా అనిపిస్తుంది. లేటు వయసులో తన ప్రియురాలి కోసం చేసే పోరాటం ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. కానీ శిబు లవ్ స్టోరీ మాత్రం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరికీ క్లైమాక్స్‌లో ఇద్దరు సూపర్ హీరోల పోరాటం సీట్ నుంచి కదలకుండా చేస్తుంది. ఇద్దరు సూపర్ హీరోలను ఒకరికి తెలియకుండా ఒకరి కథను తీసుకెళ్లిన విధానం బాగుంది. ఈ సూపర్ హీరోల స్టోరీలో ఎమోషనల్ టచ్ ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కథ నెమ్మదిగా సాగడం.. కొన్ని సీన్స్ ముందుగానే ప్రేక్షకులు ఊహించేలా ఉండడం మైనస్.ఎవరెలా చేశారంటే..మలయాళ హీరో టొవినో థామస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్‌హీరో పాత్రలో టొవినో ఒదిగిపోయాడు. మరో సూపర్ హీరో గురు సోమసుందరం శిబు పాత్రలో మెప్పించాడు. ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా ఫర్వాలేదు. సుశీన్ నేపథ్య సంగీతం.. సమీర్ సినిమాటోగ్రఫీని ఓకే అనిపించాయి. ఈ వీకెండ్ ఓటీటీల్లో సినిమా చూసేవారు మిన్నల్ మురళిపై ఓ లుక్కేయొచ్చు. -
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. మటన్ సూప్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: మటన్ సూప్నిర్మాణ సంస్థలు - అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్నటీనటులు - రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులురచన, దర్శకత్వం - రామచంద్ర వట్టికూటినిర్మాతలు - మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల సినిమాటోగ్రఫీ : భరద్వాజ్, ఫణింద్ర మ్యూజిక్ : వెంకీ వీణ ఎడిటింగ్ : లోకేష్ కడలి విడుదల తేదీ: 10-10-2025నిజ సంఘటనల ఆధారంగా తీసిన లేటేస్ట్ మూవీ మటన్ సూప్. ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. డిఫరెంట్ టైటిల్‌తో డైరెక్టర్ రామచంద్ర వట్టికూటి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ చిత్రం ఆడియన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం.మటన్ సూప్ కథేంటంటే..శ్రీరాం (రమణ్) ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాడు. డబ్బులు ఇవ్వడం.. ఇవ్వకపోతే వారి నుంచి నిర్దాక్షిణ్యంగా వసూళ్లు చేయడం చేస్తుంటాడు. దీంతో అతనికి శత్రువులు ఎక్కువవుతారు. అతని పార్ట్నర్తో కలిసి చేసే వ్యాపారం వల్ల చాలా శ్రీరాంకు సమస్యలు వస్తుంటాయి. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన సత్యభామ (వర్ష విశ్వనాథ్)ను శ్రీరాం ప్రేమిస్తాడు. వీరిద్దరూ ప్రేమికుల రోజున పార్క్‌లో ఉండటం, గజగంగ్ దళ్ చూడటం.. అలా అక్కడే ఆ ఇద్దరికీ పెళ్లి చేయడం జరుగుతుంది.అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో శ్రీరాంపై కొందరు దాడి చేస్తారు. మొహంపై యాసిడ్ పోయటంతో మొత్తం కాలిపోతుంది. దీంతో శ్రీరాం హాస్పిటల్ పాలవుతాడు. శ్రీరాంను సత్య ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటుంటుంది. శ్రీరాంకి దగ్గరి బంధువైన శివరాం(జెమినీ సురేష్) ఈ దాడి మీద విచారణ చేస్తుంటాడు. అసలు దాడి ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఇంతకీ శ్రీరాంపై దాడి చేసిందెవరు? కృష్ణకు శ్రీరాంకు ఉన్న సంబంధం ఏంటి? అసలు శ్రీరాం తల్లికి వచ్చే అనుమానం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటే..ఈ మధ్య సినిమాల్లో కంటే ఎక్కువగా క్రైమ్స్, రకరకాల పద్దతుల్లో నేరాలు జరుగుతున్నాయి. అలా అందరినీ షాకింగ్‌కు గురి చేసే ఓ కేసుని తీసుకుని దర్శకుడు ఈ మటన్ సూప్ చిత్రాన్ని తెరకెక్కించాడు. డైరెక్టర్ రామచంద్ర వట్టికూటి ఎంచుకున్నఈ క్రైమ్ కథను అనుకున్న విధంగానే తెరపై ఆవిష్కరించాడు. ఇలాంటి క్రైమ్ కథల్లో ఉండే ట్విస్ట్‌లు మామూలే. సినిమా క్లైమాక్స్ ఏంటో అందరికీ ముందే తెలుస్తుంది. అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ చెప్పడంంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాలను రాసుకున్న తీరు ఆట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో బిల్డ్ చేసిన స్టోరీ.. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ సినిమాలో ఆకట్టుకునేలా ఉన్నాయి.ఎవరెలా చేశారంటే..రమణ్ ఇందులో రెండు పాత్రల్లో మెప్పించాడు. గత సినిమాతో పోలిస్తే నటన పరంగా తను మెరుగైనట్లు కనిపించాడు. హీరోయిన్ వర్ష విశ్వనాథ్ తన పాత్రలో మెప్పించింది. జెమినీ సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా నటించాడు. యాక్టర్ గోవింద్, గోపాల్ మహర్షి, కిరణ్ మేడసాని వారి పాత్రల పరిధి మేరకు నటించారు. భరద్వాజ్, ఫణీంద్ కెమెరా వర్క్, వెంకీ వేణు సంగీతం ఫర్వాలేదనిపించాయి. ఎడిటర్ తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. ఓవరాల్‌గా మటన్ సూప్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఓ సెక్షన్‌ను ఆకట్టుకునేలా ఉంది. -
‘అరి’ మూవీ రివ్యూ
టైటిల్: అరినటీనటులు : వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి తదితరులునిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డిరచన –దర్శకత్వం : జయశంకర్సంగీతం: అనుప్ రూబెన్స్సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్ఎడిటర్ : జి. అవినాష్విడుదల తేది: అక్టోబర్ 10, 2025'పేపర్ బాయ్' ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. ఇంతవరకు తెరపై చూపించని కాన్సెప్ట్‌తో వస్తున్నామని దర్శకుడు పదే పదే చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఇదొక డిఫరెంట్ మూవీ అని తెలియజేసింది. ఏదో కొత్త పాయింట్ చూపించబోతున్నారనే విషయం ట్రైలర్‌తోనే తెలిసిపోయింది. దీంతో అరిపై ఓ మోస్తరు అంచనాలు అయితే పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘అరి’ అందుకుందా? జయశంకర్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..'ఇక్కడ మీ కోరికలు తీర్చబడును' అని సోషల్ మీడియా, పేపర్, ఫోర్బ్స్ వంటి మ్యాగజైన్లలో యాడ్ ఇస్తాడు ఓ వ్యక్తి(వినోద్ వర్మ). అది చూసి ఆరుగురు వ్యక్తులు ఆయన దగ్గరకు వస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కోరిక. హోటల్లో టీ మాస్టర్‌గా పని చేసే అమూల్ కుమార్(వైవా హర్ష)కు సన్నీ లియోన్ అంటే మోజు. ఆమెతో ఒక్క రాత్రి అయినా గడపాలని అతని కోరిక.60 ఏళ్లకు పైబడిన గుంజన్‌కు ఆస్తి పిచ్చి. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆస్తి అంతా తనకే దక్కాలనే ఆశసీఐ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్) నిధి అన్వేషణలో ఉంటాడు. ఆ నిధి ఎక్కడ ఉందో తెలుసుకొని..మొత్తం తీసుకెళ్లాలనేది అతని కోరికఎయిర్ హోస్టర్ ఆత్రేయి(అనసూయ) తన సహోద్యోగి అవ్య అంటే అసూయ. తన కంటే అందంగా మారాలని.. ఆ అందం ఎప్పటికీ ఉండాలనేది ఆమె కోరికమరణించిన తన భర్తను తిరిగి బ్రతికించుకోవాలనేది లక్ష్మీ(సురభి ప్రభావతి) ఆశతన వారసులు ఎప్పటికీ ధనవంతులుగానే ఉండాలనేది వ్యాపారవేత్త విప్రనారాయణ పాశ్వాన్(సాయి కుమార్) కోరికఈ ఆరుగురు విడివిడిగా వచ్చి యాడ్ ఇచ్చిన వ్యక్తిని కలుస్తారు. లైబ్రరీలో ఉండే సదరు వ్యక్తి వీరందరికి ఒక్కో టాస్క్ ఇస్తాడు. అది పూర్తి చేస్తేనే మీ కోరికలు తీర్చుతా అని హామీ ఇస్తాడు. ఆయన ఇచ్చిన టాస్కులు ఎంటి? వాటిని ఈ ఆరుగురు పూర్తి చేశారా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు..ప్రస్తుతం వీటి చుట్టూనే మనిషి జీవితం తిరుగుతుంది. ఈ ఆరు బలహీనతలతో ఏదో ఒకటి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అవి ఎలా ఉంటాయి? వాటిని తీర్చుకోవడం కోసం మనిషి ఎంతకు తెగిస్తాడు? అనేది ఈజీగా అర్థమయ్యేలా చూపించిన చిత్రం ‘అరి’. అరిషడ్వార్గాల గురించి పురాణాల్లో వింటాం. అయితే మనిషిలో అవి ఎలా ఉంటాయని అనేది ఆరు పాత్రల్లో ఆసక్తికరంగా చూపించడమే కాకుండా ‘మనిషి ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి’ అనే సందేశాన్ని అందించాడు. డైరెక్టర్ రాసుకున్న కథకు వంక పెట్టడానికి ఏమి లేదు. డిఫరెంట్ స్టోరీనే..ఇంకా చెప్పాలంటే ఆయన అన్నట్లుగా ఇంతవరకు తెరపై చూపించని కాన్సెప్టే. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కాస్త తడబడ్డారు. శ్రీనివాస రెడ్డి, 'చమ్మక్' చంద్ర పాత్రలతో కామెడీగా కథను ప్రారంభించిన దర్శకుడు.. కీలకమైన ఆరు క్యారెక్టర్లను ఆసక్తికరంగా పరిచయం చేసి వెంటనే అసలు కథలోకి తీసుకెళ్లాడు. ఒక్కో పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ.. కథనంపై ఆసక్తిని పెంచేశాడు. పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒక్కొక్కరి కోరికతో పాటు వారు పూర్తి చేయాల్సిన టాస్క్ తెలిసిన తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. వారు ఈ టాస్కులను పూర్తి చేస్తారా? అసలు వారికి అలాంటి టాస్కులు ఎందుకు ఇస్తున్నాడు? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే సీరియస్‌గా సాగుతున్న కథకి మధ్యలో వచ్చిన పాట, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రల కామెడీ అడ్డంకిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండాఫ్ కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. ఆరు పాత్రల్లో వచ్చే భావోద్వేగ మార్పు అందరికి అలోచింపజేస్తుంది. చివరి 30 నిమిషాలు ఈ సినిమాకు కీలకం. ఆరు పాత్రలకు ఉన్న సంబంధాన్ని ముడిపెడుతూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌లో మైథలాజికల్ టచ్ ఇవ్వడం సినిమాకు హైలెట్. దర్శకుడు తాను చెప్పదలుచుకున్న సందేశాన్ని క్లైమాక్స్‌లో గొప్పగా ఆవిష్కరించారు. ఎవరెలా చేశారంటే..అరిషడ్వర్గాలకి ప్రతీకగా ఈ చిత్రంలో ఆరు పాత్రలు ఉంటాయి. వ్యాపారవేత్త విప్రనారాయణ పాశ్వాన్ పాత్రకి సాయి కుమార్ న్యాయం చేశాడు. ఎయిర్ హోస్ట్ ఆత్రేయిగా అనసూయ ఉన్నంతలో చక్కగా నటించింది. కోపం ఎక్కువగా చూపించే సీఐ చైతన్య పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ ఒదిగిపోయాడు. అమూల్ కుమార్‌గా హర్ష కామెడీ సినిమాకు ప్లస్ అయింది .వినోద్ వర్మ పోషించిన పాత్ర ఈ సినిమాకు చాలా కీలకం. చివరిలో ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. లక్ష్మిగా సురభి ప్రభావతి, దొంగ పాత్రలో సూర్య, గుంజన్ పాత్రలో శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.అనూప్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలను ప్రాణం పోశాడు. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడి నేపథ్యంలో వచ్చే పాట తెరపై మరింత ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ట్రెండింగ్‌లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ
తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమాలు తీయడం, భారీ వసూళ్లు రాబట్టడంలో మలయాళ ఇండస్ట్రీ దిట్ట! ఈ ఏడాది మాలీవుడ్‌లో అనేక సినిమాలు హిట్‌గా నిలిచాయి. అందులో ఒకటి సుమతి వలవు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ మధ్యే ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..రియల్ స్టోరీసుమతి వలవు (Sumathi Valavu Movie Review) అంటే తెలుగులో సుమతి మలుపు. ఇది సినిమాలోనే కాదు నిజంగా ఉంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని మైలమ్మూడుకు సమీపంలో ఈ మలుపు ఉంది. 1950ల ప్రాంతంలో సుమతి అనే అమ్మాయిని అక్కడ చంపేశారని, తను దెయ్యమై అక్కడే తిరుగుతోందన్న కథ ప్రచారంలో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీ తీశారు.కథఅడవిని ఆనుకుని కల్లేలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే అడవి గుండా వెళ్లాలి. అక్కడే సుమతి వలవు అనే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే సుమతి అనే దెయ్యం తిరుగుతూ ఉంటుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ అక్కడకు వెళ్లరు. కానీ ఓ రోజు రాత్రి ఆ ఊర్లోని శేఖరన్ పెద్ద కూతురు ప్రేమించినవాడితో పారిపోతుంది. హీరో అప్పూ (అర్జున్ అశోకన్)యే ఏదో చేసుంటాడని శేఖరన్ కుటుంబం అతడిపై పగపెంచుకుంటుంది. ఈ క్రమంలో శేఖరన్ రెండో కూతురు భామ (మాళవిక మనోజ్)తో ప్రేమలో పడతాడు అప్పు. మరి వీరి ప్రేమకథను ఒప్పుకుంటారా? శేఖరన్ పెద్ద కూతురు పారిపోయిందా? లేదా దెయ్యం చంపేసిందా? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!విశ్లేషణహీరో అప్పుకు చీకటంటే పిరికి. ఓరోజు రాత్రి ఊర్లోని నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటారు. అందరూ భయపడుతుంటే హీరో గ్యాంగ్ మాత్రం బండి సిద్ధం చేసుకుని తీసుకెళ్తారు. మలుపు దాకా వెళ్లాక బండి దానంతటదే ఆగిపోతుంది. ఈ ఇంటర్వెల్లో జరిగే సీన్లు బాగుంటాయి. కానీ సెకండాఫ్‌లో కాస్త పస తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాను చాలా సహజంగా తెరకెక్కించారు. మూవీలో ఓ పక్క ప్రేమకథ.. మరోపక్క హారర్ రెండూ ఉంటాయి. మరీ ఎక్కువ భయపెట్టకుండా నవ్విస్తూ, అలరిస్తూ కథ అలా ముందుకు సాగుతుంది. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. అన్నట్లు దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. The Curve That Everyone’s Talking About — 100 M+ Streaming Minutes Strong 🚀 #ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada #GopikaAnil@GokulamMovies @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/0CjoYEX6EL— ZEE5 Malayalam (@zee5malayalam) October 3, 2025 -
Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ
మూడేళ్ల క్రితం ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కన్నడ సినిమా 'కాంతార'. తర్వాత పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేస్తే తెలుగు, హిందీలోనూ సక్సెస్ అయింది. దీనికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే 'కాంతార ఛాప్టర్ 1'. ఇప్పుడు ఇది థియేటర్లలోకి వచ్చేసింది. రిషభ్ శెట్టి హీరో కమ్ దర్శకుడు. ఈ మూవీని తొలి భాగం కంటే భారీగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థమైంది. ఈసారి హీరోయిన్గా రుక్మిణి వసంత్ చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తొలి పార్ట్‌కి మించి ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది బాంగ్రా రాజ్యం. దీనికో రాజు. ఓ రోజు ఈశ్వరుని పూదోట అనే ప్రాంతానికి వెళ్తాడు. బ్రహ్మ రాక్షసుడి కారణంగా ఇతడితో పాటు సైన్యం అక్కడ చనిపోతారు. పిల్లాడిగా ఉన్న రాజు కొడుకు రాజశేఖరుడు(జయరామ్) బతికిపోయి తిరిగి రాజ్యానికి వస్తాడు. పెద్దయ్యాక కూడా అటు వైపు వెళ్లే సాహసం చేయడు. ఇదే ఈశ్వరుని పూదోటకు దగ్గరలోని కాంతార అనే చోట జనాలు నివసిస్తుంటారు. వాళ్లకు బెర్మి(రిషభ్ శెట్టి) అనే పిల్లాడు దొరుకుతాడు. పెరిగి పెద్దవుతాడు. మరోవైపు రాజశేఖరుడు కొడుకు కులశేఖరుడు(గుల్షన్ దేవయ్య) కూడా పెద్దయ్యాక యువరాజు అవుతాడు. ఎక్కడో అడవుల్లో ఉండే బెర్మి.. బాంగ్రా రాజ్యానికి ఎందుకు రావాల్సి వచ్చింది? కులశేఖరుడితో వైరం ఏంటి? ఇంతకీ యువరాణి కనకవతి(రుక్మిణి వసంత్) ఎవరు? తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?2022లో వచ్చిన 'కాంతార'లో క్లైమాక్స్ తప్పితే మిగతా సినిమా అంతా సోసోనే. చివరలో వచ్చే దైవత్వం అనే ఎలిమెంట్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. భాష అర్థం కాకపోయినా సరే ప్రేక్షకులు ముగ్దులయ్యారు. దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందా? అంటే లేదు. తొలి భాగమంతా మెప్పించిందా? అంటే లేదు. తొలి పార్ట్‌తో దీనికి కచ్చితంగా పోలిక వస్తుంది. అందులో అంతా చాలా సహజంగా ఉంటే ఇందులో మాత్రం ప్రతి సీన్లో భారీతనం కనిపించింది. కానీ నేటివిటీ మిస్ అయింది.తొలి పార్ట్‌లో శివ చిన్నతనంలో తండ్రి తప్పిపోవడం అనే పాయింట్ దగ్గర ఈ సినిమా మొదలవుతుంది. ఎక్కడైతే తన తండ్రి తప్పిపోయాడో అక్కడికి వెళ్లి చూస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి దంత కథ అంటూ చెప్పడం మొదలుపెడతాడు. ఈశ్వరుని పూదోట, బాంగ్రా రాజ్యం, కాదంబ రాజ్యం, కడపటి దిక్కువాళ్లు, కాంతార అనే ప్రదేశం.. ఇలా చాలా కొత్త విషయాలు కొత్త మనుషుల్ని పరిచయం చేస్తూ వెళ్లారు. ఈ క్రమంలో అసలు కథ చెప్పడానికి చాలా టైమ్ తీసుకున్నారు. అడవిలో ఉండే హీరో అతడి మనుషులు బాంగ్రా రాజ్యానికి రావడం, అక్కడ చేసే హంగామాతో ఫస్టాప్ అలా నడిచిపోతుంది. టైగర్ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్ మొదలయ్యాక స్టోరీ ఎటెటో వెళ్తుంది. అసలు కథ కంటే ఉపకథలు ఎక్కువైపోయాయి. దీంతో మొత్తం గజిబిజి గందరగోళంలా అనిపిస్తుంది. స్క్రీన్‌పై అన్నీ జరుగతుంటాయి కానీ దేనికి కనెక్ట్ కాలేకపోతాం. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి కూడా టైమ్ పడుతుంది. సరే అయిందేదో అయిపోయిందిలే అనుకుంటే చివరలో మూడో పార్ట్ కూడా ఉందని చెప్పి ముగించారు. అప్పుడొచ్చిన 'కాంతార' స్టోరీ ఎవరైనా సరే సింపుల్‌గా చెప్పడానికి వీలు కుదిరేలా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు అలా చెప్పలేరు. సినిమా చూసొచ్చాక ఎవరినానై స్టోరీ ఏంటో చెప్పమని అడగండి. కచ్చితంగా తడబడతారు. అలా ఉంది! అయితే యాక్షన్ సన్నివేశాలు, దానికి తగ్గ సెటప్ బాగుంది. కానీ సెకండాఫ్‌లో వచ్చే యుద్ధం సీన్ చూస్తున్నప్పుడు బాహుబలి ఛాయలు కనిపిస్తాయి.ఎవరెలా చేశారు?రిషభ్ శెట్టి నటన బాగానే ఉంది గానీ తొలి పార్ట్ కంటే డిఫరెన్స్ ఏముందా అని సందేహం వస్తుంది. మిగతా వాళ్లలో రుక్మిణి వసంత్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. యువరాణిలా అందంగా ఉంది. ఈమె పాత్రలో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. చివరలో ఈమె పాత్రని ముగించిన తీరు మాత్రం ఆమె ఫ్యాన్స్‌కి అస్సలు మింగుడుపడదు. జయరామ్, గుల్షన్ దేవయ్య.. రాజులుగా బాగానే చేశారు. మిగిలిన వాళ్లలో పెద్దగా తెలిసిన ముఖాలేం లేవు. టెక్నికల్ విషయాలకొస్తే పాటలు రొటీన్. గుర్తుండవు అలానే అర్థం కావు కూడా. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే. నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ దర్శకుడిగా మాత్రం రిషభ్ శెట్టి ఈసారి మెప్పించలేకపోయాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం రిచ్‌గా ఉన్నాయి. మూవీ అంతా చూసిన తర్వాత పాన్ ఇండియా మోజులో పడిపోయి రిషభ్ శెట్టి ఇలాంటి సినిమా తీశాడేంటా అని కచ్చితంగా అనిపిస్తుంది.- చందు డొంకాన -
ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ
ధనుష్ పేరుకే తమిళ హీరో కానీ.. సార్, కుబేర లాంటి తెలుగు సినిమాల్లోనూ నటించి మన ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. గతంలో రెండు మూడు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇతడు.. ఇప్పుడు అలా లీడ్ రోల్ చేసి దర్శకత్వం వహించి నిర్మించిన మూవీ 'ఇడ్లీ కొట్టు'. పెద్దగా ప్రమోషన్ చేయకుండానే తెలుగులోనూ తాజాగా (అక్టోబర్ 01) థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శంకరాపురం అనే ఊరిలో శివకేశవ(రాజ్ కిరణ్) ఓ ఇడ్లీ కొట్టు నడుపతుంటాడు. ఈ షాపులోని ఇడ్లీ.. చుట్టుపక్కలా చాలా ఫేమస్. ఇతడి కొడుకు మురళి(ధనుష్) మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని, హొటల్ మేనేజ్మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. కొన్నాళ్ల తర్వాత తను పనిచేస్తున్న కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలినీ పాండే)తోనే పెళ్లికి సిద్ధమవుతాడు. సరిగ్గా పెళ్లికి రెండు మూడు రోజులు ఉందనగా శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి.. సొంతూరికి వస్తాడు. తర్వాత ఏమైంది? విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్(అరుణ్ విజయ్)తో మురళికి గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓ కొడుకు.. కుటుంబ భవిష్యత్ కోసం భార్య పిల్లల్ని వదిలిపెట్టి మరీ పరాయి దేశంలో ఆరేళ్లు పనిచేస్తాడు. కొన్ని కారణాల వల్ల సొంతూరికి వస్తాడు. కన్నతల్లిని ఆప్యాయంగా పలకరిస్తే.. ఎవరు బాబు నువ్వు? అని అడుగుతుంది. నేను అమ్మ నీ కొడుకుని అంటే.. నా కొడుకు పేరు నీ పేరు ఒకటే అని అమాయకంగా అంటుంది తప్పితే కొడుకుని గుర్తుపట్టదు. దీంతో కొడుకు నోట మాటరాదు. ఒక్కసారిగా గుండె పగిలినంత పనవుతుంది. ఇది చెబుతున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో తెలీదు గానీ సినిమాలో ఈ సీన్ చూస్తున్నప్పుడు మాత్రం మనలో చాలామందికి గుండె కలుక్కుమంటుంది. ఎందుకంటే ఊరిని విడిచిపెట్టి ఎక్కడెక్కడి వెళ్లి ఉద్యోగాలు చేసే చాలామందికి ఈ సీన్ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇదే కాదు 'ఇడ్లీ కొట్టు' చూస్తున్నంత సేపు మీ సొంతూరు, అక్కడి మనుషులు, వాతావరణం ఇలా ప్రతిదీ గుర్తొస్తుంది.తెలుగులో తక్కువ గానీ తమిళ, మలయాళంలో అచ్చం మనకథలానే ఉందే అనిపించే సినిమాలు అడపాదడపా వస్తుంటాయి. ఇది కూడా అలాంటి ఓ చిత్రమే. స్టోరీ పరంగా చూస్తే ఇందులో కొత్తేం లేదు. చాలాసార్లు చూసిన కథే. కానీ ఎమోషన్ ఎంత వర్కౌట్ అయిందా? చూస్తున్నంతసేపు ఫీలయ్యామా లేదా ముఖ్యం. ఈ విషయంలో ధనుష్ అటు నటుడిగా ఇటు దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు.స్టోరీ సింపుల్‌గానే ఉండటం వల్ల రెండున్నర గంటల సినిమా కాస్త సాగదీతగానే అనిపిస్తుంది. ఒక్కసారి మూవీలోని ఎమోషన్‌కి కనెక్ట్ అయితే మాత్రం కన్నీళ్లు వస్తాయి. కచ్చితంగా ఎమోషనల్ అయిపోతాం. అలాంటి సీన్లు ఐదారు వరకు ఉన్నాయి. ట్రైలర్లో ఏదైతే చూపించారో దాదాపు స్టోరీ అదే. కాకపోతే తమిళ చిత్రాల్లో ఉన్నట్లు మనకు కావాల్సిన వాళ్లు చనిపోవడం, తద్వారా హీరో పడే బాధ, దాన్నుంచి వచ్చే ఎమోషన్స్ ఇలా ఈ తరహా సినిమాలు మీకు సెట్ అవుతాయి అనుకుంటే కళ్లు మూసుకుని వెళ్లిపోవచ్చు.చనిపోయిన తండ్రిని.. మన హీరో ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్న ఇడ్లీ కొట్టులోనూ, ఇంట్లో పెంచుకుంటున్న దూడలోనూ చూడటం.. దీని బ్యాక్ డ్రాప్లో వచ్చే సన్నివేశాలు అబ్బా భలే ఉన్నాయే అనిపిస్తాయి. ప్రారంభంలో కనిపించిన కొన్ని పాత్రలు ఊహించనట్లుగానే విలనీ షేడ్స్‌తో కనిపించి చివరకొచ్చేసరికి హీరోగా అండగా నిలబడటం లాంటివి ముందే అర్థమయిపోతాయి. కానీ వాటిని చూపించిన విధానం బాగుంది. ఈ మూవీ చూసిన తర్వాత కచ్చితంగా సొంతూరు, మన మనుషులు, మన మట్టిని ఎంతగా మిస్ అవుతున్నామో కదా అని కచ్చితంగా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?ధనుష్‌కి ఇలా అండర్ ప్లే చేసే పాత్రల్లో నటించడం కొట్టిన పిండి. అలా మురళిగా సాలిడ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కల్యాణిగా నిత్యామేనన్, అశ్విన్‌గా అరుణ్ విజయ్ అదరగొట్టేశారు. ఇదే సినిమాలో సత్యరాజ్, సముద్రఖని, పార్తిబన్ లాంటి సీనియర్స్ కూడా ఉన్నారు. వీళ్లకు తక్కువ స్కోప్ దొరికిందా కానీ ఎక్కడా అతి చేయకుండా సహజంగా నటించారు. ధనుష్ తండ్రి శివకేశవగా ఒకప్పటి నటుడు రాజ్ కిరణ్ బాగా చేశారు. మీరా పాత్రలో షాలినీ పాండే బాగుంది. మిగిలిన నటీనటులు ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే జీవీ ప్రకాశ్ కుమార్ బీజీఎం బాగుంది కానీ పాటలే పెద్దగా ఎక్కవు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నటుడిగా ధనుష్‌ని వంక పెట్టడానికి ఏం లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఎందుకో పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాడు. తమిళ ఆడియెన్స్ ఈ సినిమాకు ఫిదా అయిపోవచ్చు గానీ తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి? ఫ్లాట్ స్టోరీ, ఊహించినట్లు ఉండే స్క్రీన్ ప్లే దీనికి కారణం కావొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్‌కి నచ్చే సినిమా ఇది. తెలుగు డబ్బింగ్ బాగుంది. కుటుంబంతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన -
'ద ట్రయల్ 2' రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘ది ట్రయల్’ రెండో సీజన్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఏదైనా నేరం జరిగితే తగిన సాక్ష్యాలతో నేరస్థుడిని నిరూపించే ప్రక్రియలో న్యాయవాదులు ఉంటారు. ఆ న్యాయవాదుల సమూహంగా కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి. ఆ కంపెనీలలో ఎంతో మంది న్యాయవాదులు తమ క్లయింట్ల తరఫున కోర్టులో విచారణకు హాజరవుతుంటారు. అటువంటి లా ఫర్మ్‌లపై తీసిన సిరీస్ ‘ది ట్రయల్’. 2023లో ఈ సిరీస్ మొదటి భాగం హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయింది. మళ్ళీ రెండేళ్ళకు దానికి కొనసాగింపుగా ఇప్పుడు 2025లో ‘ది ట్రయల్’ రెండో సీజన్ రిలీజ్ అయింది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించగా ఆమె భర్త అజయ్ దేవగన్ ఈ సిరీస్‌కి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.రెండు సిరీస్‌లు కలిపి 14 ఎపిసోడ్లతో ఉన్న ‘ది ట్రయల్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ కథాంశానికొస్తే... న్యోనికాసేన్ గుప్తా ఓ పేరున్న ఫర్మ్‌లో మంచి లాయర్. ఆమె భర్త రాజకీయ నాయకుడు. ఆమె చేస్తున్న లా ఫర్మ్‌లో ఎన్నో రాజకీయాలతో ఆమె ప్రమోషన్ని అడ్డుకుంటూ న్యోనికా కుటుంబానికి కూడా ఆపద కలిగిస్తుంటారు ఆమె ప్రత్యర్థులు. ఆ లా ఫర్మ్లోకి వచ్చే కేసులు కూడా ఈ భార్యాభర్తలకు లింకు అవుతుంటాయి. ఆ లింకులు పెద్ద పెద్ద కష్టాలనే తెచ్చిపెడతాయి. మరి... ఆ కష్టాలన్నింటినీ తట్టుకుని తన క్లయింట్ల కేసులను వాదిస్తూ, ఫర్మ్‌లోని రాజకీయాలను ఎదుర్కొంటూ న్యోనికా నిజంగా ట్రయల్ గెలుస్తుందా? లేదా అన్నది మాత్రం సిరీస్‌లోనే చూడాలి. హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది ట్రయల్’ మంచి కాలక్షేపం. ఈ లా ఫర్మ్ కథలు పెద్దలు మాత్రమే చూడదగినవి. ఎంజాయ్..– హరికృష్ణ ఇంటూరు -
మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా ఈ ఇండస్ట్రీ నుంచి వస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీస్ కూడా వస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'హృదయపూర్వం'. గత నెలలో థియేటర్లలో రిలీజై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? చూడొచ్చా లేదా?కథేంటి?సందీప్ బాలకృష్ణన్(మోహన్ లాల్) కొచ్చిలో క్లౌడ్ కిచెన్ నడుపుతుంటాడు. ఇతడికి గుండె సమస్య. ఓ రోజు పుణెలో ఉండే కర్నల్ రవీచంద్రన్ ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఈయన గుండెని వైద్యులు.. సందీప్‌కి అమర్చుతారు. తర్వాత కొన్నిరోజులకు సందీప్ దగ్గరకు వచ్చిన కర్నల్ కూతురు హరిత(మాళవిక మోహనన్).. తన నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తుంది. అలా సందీప్.. పుణె వెళ్తాడు. అక్కడికి వెళ్లాక ఎదురైన పరిస్థితులు ఏంటి? రెండు రోజులు అనుకున్నది కాస్త రెండు వారాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పుడొస్తున్న చాలా సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. చెప్పుకోవాలంటే ఇందులో పెద్దగా కథేం ఉండదు కానీ పరిస్థితులకు తగ్గట్ల వచ్చే సింపుల్ కామెడీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్.. ఫెర్ఫెక్ట్ మూవీ చూశాం అనే ఫీలింగ్ కలిగిస్తాయి.సాధారణంగా అవయవాల ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే మాటని అప్పుడప్పుడు వింటుంటాం. అలా ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి గుండెని హీరోకి అమర్చుతారు. చెప్పుకొంటే ఇది సీరియస్ సబ్జెక్ట్. కానీ దర్శకుడు దీన్ని ఓ అందమైన ప్రయాణంలా చూపించాలని ఫిక్సయ్యాడు. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.కర్నల్ గుండెని సందీప్‌కి అమర్చడంతో కథ నేరుగా మొదలవుతుంది. తర్వాత సందీప్ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూపిస్తారు. అనంతరం జెర్రీ అనే నర్స్‌తో కలిసి పుణె వెళ్లడం, అనుకోని పరిస్థితుల్లో హరిత నిశ్చితార్థం ఆగిపోవడం.. ఇలా స్టోరీలో సంఘర్షణ ఏర్పడుతుంది. అప్పటివరకు కామెడీగా వెళ్తున్నది కాస్త రొమాంటిక్ టర్న్ తీసుకుంటుంది. హరిత, అతడి తల్లి చూపించే కేరింగ్ హీరోకి మరోలా అర్థం కావడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చివరకొచ్చేసరికి ఎమోషనల్‌గా ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.ప్రారంభంలో మొహమాటం, కాస్తంత అమాయకత్వం ఉన్న సందీప్... గుండె అమర్చిన తర్వాత పరిస్థితుల కారణంగా ఎలా మారుతాడు. చివరకు ధైర్యం, ముక్కుసూటితనం లాంటివి ఎలా నేర్చుకుంటాడు అనే విషయాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో హీరో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. మోహన్ లాల్ పాత్ర అతి సామాన్యంగా ఉంటుంది. హరిత, ఆమె తల్లి పాత్రలు కూడా మన చుట్టూ మనుషుల్లానే అనిపిస్తారు.సందీప్ బాలకృష్ణన్ పాత్రని మోహన్ లాల్ సటిల్డ్‌గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హరితగా మాళవిక మోహనన్ అందంగా ఉంది. జెర్రీగా సంగీత్ ప్రతాప్, సందీప్ బావగా సిద్ధిఖీ కామెడీ చేసే బాధ్యత తీసుకున్నారు. వీళ్లతో పాటు మిగతా పాత్రధారులందరూ ఏ మాత్రం అతి చేయకుండా చాలా సహజంగా నటించారు. చూస్తున్నంతసేపు ఓ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రానంత సహజంగా అనిపిస్తుంది. పాటలు, సెకండాఫ్‌లో వచ్చే మెలోడ్రామా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. తప్పితే ఓవరాల్‌గా మూవీ భలే అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన -
They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఓజీనటీనటులు: పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుదేవ్ నాయర్, రాహుల్ రవీంద్రన్ తదిరులునిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు : డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరిదర్శకత్వం: సుజీత్సంగీతం: తమన్ ఎస్సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసఎడిటర్ : నవీన్ నూలివిడుదల తేది: సెప్టెంబర్ 25, 2025‘హరిహర వీరమల్లు’ లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన మూవీ ‘ఓజీ’(OG Review). మూడేళ్ల కిత్రం శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం పవన్ కారణంగా ఆలస్యమై.. ఎట్టకేలకు కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? వరుస డిజాస్టర్స్‌ను చవిచూసిన పవన్‌కు ‘ఓజీ’తో అయినా హిట్ పడిందా, లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1970-90ల మధ్యకాలంలో జరుగుతుంది. జపాన్‌లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్) ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(ప్రకాశ్‌రాజ్)పై అటాక్ జరిగితే.. రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్ట్‌ని నిర్మించి.. సత్యదాదా డాన్‌గా ఎదుగుతాడు. అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకొని నాసిక్‌లో కొత్త జీవితం ప్రారంభిస్తారు (OG Movie Review). ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ)తో పాటు తన కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నగరాన్ని తమ గుప్పిట్లో పెటుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్‌లో ఉన్న తన కంటేనర్ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్‌లో ఉన్న ఓమీ.. ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్ట్‌ని స్వాధీనం చేసుకొని.. అతడి మనుషులను దారుణంగా చంపేస్తాడు. అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటేనర్‌లో ఉన్న విలువలైన వస్తుంలేంటి? సత్యాదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ప్లాష్‌బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..గ్యాంగ్‌స్టర్ కథలు.. అందులోనూ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఓజీ(They Call Him OG Review) కూడా అలాంటి రొటీన్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ స్టోరీనే. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథనంలో ఎక్కడా బిగువు లేదన్నది తెలుస్తూ ఉంటుంది. కథ ముందుకు సాగేకొద్ది.. పవన్ నటించిన పంజా సినిమాతో పాటు చాలా సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. వాటిని మరిపించేందుకు ఏవైనా ట్విస్టులు అయినా ఉంటాయా అంటే అదీ ఉండదు. కథ ప్రారంభంలోనే క్లైమాక్స్ సీన్ ఊహించొచ్చు. కథ-కథనం విషయాన్ని పక్కన పెట్టి.. ఎలివేషన్‌పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రారంభంలో ఆ ఎలివేషన్ ఆకట్టుకున్నా.. ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ అవ్వడంతో ఒకానొక దశలో చిరాకు అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు కూడా పవన్ గతంలోనే చేసిన సినిమాలనే గుర్తు తెస్తాయి. ఇక లాజిక్ల గురించి మాత్రం అస్సలు ఆలోచించొద్దు. కత్తితో గన్ నుంచి వదిలిన బుల్లెట్లను ఆపడం.. రక్తంతో కాలి బూటుకి అంటుకున్న అగ్నిని చల్లార్చడం.. ఇలా ‘బాలయ్య’ ను మించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.జపాన్‌లో కథను ప్రారంభించడంతో ఇదేదో కొత్త కథలా ఉండే అనుకుంటాం. కానీ ఆ మరుక్షణమే కొత్తదనం ఆశించడం తప్పనే విషయం తెలిసిపోతుంది. సత్యదాదాకు ఓజీ పరిచయం అవ్వడం.. ముంబై వదిలి అజ్ఞాతంలోకి వెళ్లడం.. కన్మణితో ప్రేమాయణం ఒకవైపు.. ఓమీ అరచకాలు.. దాదా పోర్ట్‌పై దాడి.. ఈ విషయం తెలిసి ఓజీ ముంబై రావడం.. ఫస్టాప్ అంతా ఇలా రొటీన్‌గానే సాగినా.. క్యారెక్టర్లకు ఇచ్చిన ఎలివేషన్ సీన్లు ఫర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ ఫ్యాన్స్‌కి నచ్చుతుంది. ఇక సెకండాఫ్ కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. ఫ్యామిలీ సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలివేషన్ మీద పెట్టిన శ్రద్ధలో సగమైనా ఎమోషనల్ సీన్లపై పెడితే బాగుండేది. రక్తపాతం జరుగుతున్నా.. కీలక పాత్రలు కనుమరుగవుతున్నా.. ఎక్కడా జాలీ, బాధ కలగదు. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. పార్ట్ 2 కోసమే అన్నట్లుగా.. క్లైమాక్స్‌లో ఓజీ ప్లాష్బ్యాక్కి మరో ఎలివేషన్ ఇచ్చారు. ‘అవసరం’ అయినప్పడు మళ్లీ వస్తా’ అని హీరోతో ఓ డైలాగ్ చెప్పింది.. రెండో భాగం కూడా ఉందని ప్రకటించారు. ఎవరెలా చేశారంటే.. పవన్ నటన పరంగా చేయడానికేమి లేదు. వింటేజ్ లుక్ తప్ప ఆయన నుంచి కొత్తగా ఏమి ఆశించొద్దు. ఆయనకు సంబంధించిన చాలా సీన్లు డూప్‌తో తీశారు. అది తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్ సీన్లే కాదు ఎలివేషన్ సన్నివేశాల్లోనూ డూప్‌నే వాడినట్లు ఉన్నారు. కొన్ని చోట్ల పవన్‌కి కళ్లజోడు పెట్టి మ్యానేజ్ చేస్తే.. మరికొన్ని చోట్ల తలను కిందికి దింపి కవర్ చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా పవన్‌ని తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక విలన్ ఓమీగా ఇమ్రాన్ హష్మీ బాగానే నటించాడు. ఇక కన్మణి పాత్రకి ప్రియాంక మోహన్ న్యాయం చేసింది. తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. సత్యదాదాగా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గీతగా శ్రియారెడ్డి మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆమె పాత్రకు ఒకటి రెండు బలమైన సన్నివేశాలు పడ్డాయి. తేజ్ సప్రూ, సుదేశ్ నాయర్, హరీశ్ ఉత్తమ్, రాహుల్ రవీంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధానబలం. రొటీన్ సన్నివేశాలకు కూడా తనదైన బీజీఎంతో హైప్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్లు బాగున్నాయి. వీఎఫెక్స్ తేలిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే) -
మెరుగైన ఇంటి వైపు హోమ్‌బౌండ్
ఈ దేశవాసులకు ఈ దేశమే ఇల్లు. ఇక్కడే ఉండాలి. జీవించాలి. కాని ఈ నేల ప్రతి ఒక్కరికీ నివాసయోగ్యంగా ఉందా? ప్రతి ఒక్కరినీ సమానంగా, గౌరవంగా చూస్తోందా? ఏ మహమ్మారో వస్తే వలస కూలీలను ‘మీ ఊరికి పోండి’ అని సాటి మనుషులే తరిమికొడితే ‘ఇంటి వైపు’ నడక సాగుతుందా? మన హైదరాబాదీ దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీసిన ‘హోమ్‌బౌండ్’ ఎన్నో సామాజిక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివక్షలను ప్రశ్నిస్తోంది. భారత దేశం నుంచి ఆస్కార్‌కు ఆఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన ఈ సినిమా వివరాలు.మే 21, 2025. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కనీవినీ ఎరగనట్టుగా స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్నారు ప్రేక్షకులు. సినిమా అయ్యాక లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ఒక నిమిషం... రెండు నిమిషాలు... చప్పట్లు ఆగడం లేదు... 9 నిమిషాల పాటు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సినిమాలో నటించిన నటీనటులు, నిర్మాత, దర్శకుడు ఉద్వేగంతో కన్నీరు కారుస్తూ ఒకరిని ఒకరు హత్తుకున్నారు. బహుశా ఆ చప్పట్ల మోత ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ను తాకినట్టున్నాయి. 2026లో జరగనున్న 98వ ఆస్కార్ అవార్డ్స్ పోటీకి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరి కోసం ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆ సినిమాను ఎంపిక చేశారు. పేరు: హోమ్‌బౌండ్ (Homebound).→ అదే దర్శకుడికి అదే గుర్తింపు‘హోమ్‌బౌండ్’ (ఇంటి వైపు) దర్శకుడు నీరజ్ ఘేవాన్ (Neeraj Ghaywan). ఇంతకు ముందు ఇతను తీసిన ‘మసాన్’ సినిమా మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా విపరీతమైన ప్రశంసలు పొందింది. దానికి కారణం ఆ సినిమాలో ఎత్తి చూపించిన వివక్ష, తాత్త్వికత. ఇప్పుడు కూడా అలాంటి వివక్షను, ఆధిపత్యాన్ని దర్శకుడు గొప్ప కళాత్మకంగా, సెన్సిబుల్‌గా చూపించడం వల్లే ‘హోమ్‌బౌండ్’కు ఘన జేజేలు దక్కుతున్నాయి. హాలీవుడ్ దిగ్గజం మార్టిన్ స్కోర్సెసి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉండటమే కాదు సినిమా విపరీతంగా నచ్చడంతో పొగడ్తలతో ప్రచారంలోకి తెచ్చాడు. ఆ తర్వాత ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో సినిమాకు ప్రశంసలు మొదలయ్యాయి. కాన్స్ తర్వాత టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ‘హోమ్‌బౌండ్’ రెండవ స్థానంలో నిలిచింది. ‘మసాన్’ సినిమా సమయంలో కేన్స్‌లో పాల్గొన్న నీరజ్ తిరిగి ఈ సినిమాతో అదే కేన్స్‌లో సగర్వంగా నిలిచాడు.→ ఇద్దరు స్నేహితుల కథ‘హోమ్‌బౌండ్’ షోయెబ్, చందన్ కుమార్ అనే ఇద్దరు మిత్రుల కథ. వీరిద్దరూ అట్టడుగు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న యువకులు. చిన్నప్పటి నుంచి వీరు పోలీస్ కానిస్టేబుళ్లు అవ్వాలనుకుంటారు. అందుకై ప్రయత్నిస్తూ నగరంలో అంత వరకూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కాని ఒకసారి ఊరు విడిచి నగరానికి చేరుకున్నాక ప్రపంచపు పోకడ, మన దేశంలో వేళ్లూనుకుని ఉన్న వివక్ష వారికి అనుభవంలోకి వస్తుంది. చందన్ దళితుడైన కారణంగా అవమానాలు ఎదుర్కొంటుంటే, షోయెబ్ ముస్లిం కావడం వల్ల వివక్షను ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ ‘దేశం’ అనే ‘ఇల్లు’ వీరికి ‘కొందరికి’ ఇస్తున్నట్టుగా మర్యాద, గౌరవం ఇవ్వడం లేదు. ‘కానిస్టేబుల్ ఉద్యోగం’ వస్తే అన్ని వివక్షలు పోతాయని వీరు అనుకుంటారుగాని అదంతా ఉత్తమాట... కొందరు ఎంత ఎదిగినా కిందకే చూస్తారని కూడా అర్థమవుతుంది. వీరికి పరిచయమైన అమ్మాయి సుధా భారతి అంబేద్కరైట్‌గా సమాజంలో రావలసిన చైతన్యం గురించి మాట్లాడుతుంటుంది. ఈలోపు పులి మీద పిడుగులా లాక్డౌన్ వస్తుంది. అక్కడి నుంచి ఆ స్నేహితులిద్దరూ సొంత ఊరికి బయలుదేరడంతో ఆ ప్రయాణం వారిని ఎక్కడికి చేర్చిందనేది కథ. ఇందులో ఇద్దరు స్నేహితులుగా విశాల్ జేత్వా, ఇషాన్ ఖట్టర్ నటించారు. సుధా భారతిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కరణ్ జొహర్, అదర్ పూనావాలా (కోవీషీల్డ్ తయారీదారు) నిర్మాతలు. సహజమైన పాత్రలు, గాఢమైన సన్నివేశాలు, దర్శకుడు సంధించే ప్రశ్నలు ఈ సినిమా చూశాక ప్రేక్షకులను వెంటాడుతాయని ఇప్పటి వరకూ వస్తున్న రివ్యూలు చెబుతున్నాయి. ఆస్కార్ నామినేషన్స్‌ను జనవరి 22, 2026న ప్రకటిస్తారు. హోమ్‌బౌండ్ నామినేట్ అవుతుందని ఆశిద్దాం. మరో ఆస్కార్ ఈ సినిమా వల్ల వస్తే అదీ ఘనతే కదా. నిజ సంఘటన ఆధారంగా...ఈ సినిమాను నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీశాడు. 2020లో న్యూయార్క్ టైమ్స్‌లో కశ్మీర్ జర్నలిస్ట్ బషారత్ పీర్ ఒక ఆర్టికల్ రాశాడు. ఒక మిత్రుడి సమాధి పక్కన కూచుని ఉన్న మరో మిత్రుడి ఫొటో వేసి. ‘టేకింగ్ అమృత్ హోమ్’ అనే ఆ ఆర్టికల్ కోవిడ్ కాలంలో సూరత్ ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఇద్దరు మిత్రులు ఉత్తర్ ప్రదేశ్‌లోని తమ సొంత ఊరుకు బయలుదేరి ఎలా సర్వం కోల్పోయారో, వారిలో ఒక మిత్రుడు చనిపోతే మరో మిత్రుడు కోవిడ్‌కు భయపడకుండా ఆ శవాన్ని ఎలా ఇంటికి చేర్చాడో బషారత్ ఆ ఆర్టికల్‌లో రాశాడు. అది చదివిన నీరజ్ కోవిడ్ సమయాన్ని నేపథ్యంగా ఉంచుతూనే ఈ దేశంలో వ్యాపించిన సామాజిక దుర్నీతులను ముందు వరుసలో పెట్టి ‘హోమ్‌బౌండ్’ను తీశాడు. -
ఐఫోన్‌తో తీసిన జాంబీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఓటీటీల్లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. అందున హాలీవుడ్ నుంచి ఈ జానర్ మూవీస్ వస్తున్నాయి అంటే కచ్చితంగా భయపెట్టి తీరేలానే ఉంటాయి. అలా జూన్‌లో థియేటర్లలోకి వచ్చిన ఓ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే '28 ఇయర్స్ లేటర్'(28 ఏళ్ల తర్వాత). ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'స్లమ్ డాగ్ మిలీయనీర్'ని తీసిన డేనీ బోయెల్ దీనికి దర్శకుడు. మరి ఈ సినిమా అంతలా భయపెట్టిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)కథేంటి?2002లో రేజ్ వైరస్ రాకతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. అలా 28 ఏళ్లు గడిచిపోతాయి. బ్రిటన్‌లోని ఓ దీవిలో ఈ వైరస్ బారిన పడని కొంతమంది జీవిస్తుంటారు. హీరో జేమీ తన 12 ఏళ్ల కొడుకు స్పైక్, భార్యతో కలిసి బతుకుతుంటాడు. ఓ రోజు వేట కోసం జేమీ, స్పైక్.. మెయిన్ ల్యాండ్‌కు వెళ్తారు. ఇక్కడ మెయిన్ ల్యాండ్ అంటే జాంబీలు ఉండే ప్రదేశం. అక్కడ 'ఆల్ఫా' అనే బలమైన జాంబీ ఈ తండ్రి కొడుకులకు ఎదురుపడుతుంది. తర్వాత ఏమైంది? తిరిగి ద్వీపానికి చేరుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇదో జాంబీ సినిమా. అంటే వైరస్ సోకేసరికి చాలామంది మనుషులు రాక్షసుల్లా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు ఓ ద్వీపంలో తలదాచుకుంటారు. ఆ ద్వీపానికి జాంబీలు ఉండే ప్రదేశానికి మధ్యలో చిన్న దారి ఉంటుంది. కానీ రాత్రయితే ఆ దారి అంతా సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. అలాంటి వీళ్లలోని ఓ తండ్రి కొడుకు జాంబీల దగ్గరకు వెళ్తారు. తర్వాత ఊహించి పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడి నుంచి పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ ఏర్పడుతుంది. తర్వాత ఏమైందనేది మూవీ చూసి ఎక్స్‌పీరియెన్స్ చేయాలి.ఈ సినిమాని కచ్చితంగా ఒంటరిగానే చూడండి. అలా అని బూతు సన్నివేశాలు ఏం ఉండవు. జాంబీలన్నీ బట్టల్లేకుండానే ఉంటాయి. కానీ ఒంటిపై బురదలాంటిది ఉంటుంది. కానీ జాంబీలని భయంకరంగా చంపడం లాంటి సీన్స్ ఉంటాయి. ఇదో హారర్ మూవీ అయినప్పటికీ మరోవైపు థ్రిల్ పంచుతూ మానవ సంబంధాలు, భావోద్వేగాలని కూడా చూపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.రెండు గంటల్లోపే ఉండే ఈ సినిమా నెమ్మదిగానే ఉంటుంది గానీ విజువల్స్ గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ కూడా మూవీలో మీరు లీనమయ్యేలా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఐఫోన్‌తో తీయడం విశేషం. అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ఓటీటీల్లోనూ ఉంది గానీ వాటిలో రెంట్ పద్ధతిలో చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే దీనిపై ఓ లుక్కేసేయండి.-చందు డొంకాన(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)) -
‘బ్యూటీ’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్యూటీనటీనటులు: అంకిత్ కొయ్య, నీలఖి, నరేశ్ వీకే, వాసుకి,తదితరులునిర్మాణ సంస్థలు:ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో నిర్మాతలు : విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమూర్ భన్సల్కథ, స్క్రీన్ ప్లే: ఆర్.వి. సుబ్రహ్మణ్యందర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్దన్సంగీతం: విజయ్ బుల్గానిన్విడుదల తేది: సెప్టెంబర్ 19, 2025యూత్‌ని టార్గెట్ చేస్తూ వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. సినిమా విడుదలై రెండు వారాలు గడిచినా.. ఇప్పటికీ ఆ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్తున్నారు. అదే జోష్‌లో వచ్చిన మరో యూత్‌ఫుల్ రొమాంటిక్ చిత్రం ‘బ్యూటీ’. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది. మరో‘బేబీ’ చిత్రం అవుతుందని మేకర్స్ నమ్మకంగా చెప్పడంతో ‘బ్యూటీ’పై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలు ఈ చిన్న చిత్రం అందుకుందా? యూత్‌ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం వారిని ఆకట్టుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌లో కాలేజీ చదువుతున్న అలేఖ్య(నీలఖి)ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న నారాయణ (వీకే నరేశ్) క్యాబ్ డ్రైవర్. అమ్మ (వాసుకి) హౌస్‌వైఫ్. తోటి స్నేహితులంతా స్కూటీపై కాలేజీకి వెళ్తుండంతో అలేఖ్య మనసు స్కూటీపై పడుతుంది. తనతో ఎంతో క్లోజ్‌గా ఉండే నాన్న నారాయణ ముందు తన స్కూటీ కోరికను బయటపెడుతుంది. డ్రైవింగ్ నేర్చుకున్నాక చూద్దాంలే అని నాన్న అంటారు. అదే సమయంలో అలేఖ్యకు పరిచయం అవుతాడు అర్జున్(అంకిత్ కొయ్య). డ్రైవింగ్ నేర్పిస్తానంటూ స్నేహం చేస్తాడు. ఈ క్రమంలో ఈ పెట్ ట్రైనర్‌తో ప్రేమలో పడుతుంది అలేఖ్య. ఓ రోజు ఇంట్లో అర్జున్‌తో రొమాంటిక్ వీడియో కాల్ మాట్లాడుతుండగా.. అమ్మ చూస్తుంది. ఆ భయంతో ఇంట్లో నుంచి పారిపోతుంది అలేఖ్య. అర్జున్ దగ్గరకు వచ్చి ‘నన్ను తీసుకెళ్లిపో’ అని చెబుతుంది. ఇద్దరు కలిసి హైదరాబాద్‌కి వెళ్తారు. కూతురుని వెతుకుతూ నారాయణ కూడా హైదరాబాద్ వస్తాడు. మరి నారాయణకు కూతురు దొరికిందా? అమ్మ చంపేస్తుందన్న భయంతో అర్జున్‌తో వచ్చిన అలేఖ్యకు హైదరాబాద్‌లో ఎదురైన కష్టాలేంటి? అర్జున్-అలేఖ్యలు పోలీసు స్టేషన్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీరిద్దరిని ఫాలో అవుతూ హైదరాబాద్ వరకు వచ్చిన మూడో వ్యక్తి ఎవరు? అతనితో అర్జున్‌కి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘ప్రపంచం మొత్తం నీపై పగ పట్టినా.. నీకోసం ప్రాణం పెట్టి పోరాడేవాడు ఒకడుంటాడు. అతను కచ్చితంగా నాన్న అయ్యి ఉంటాడు. ప్రపంచంలో నాన్నను మించి యోధుడు లేడు’ అని సందేశం ఇచ్చిన ఓ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. తెలిసి తెలియని వయసులో చేసే తప్పులు తల్లిదండ్రులను ఎంతటి క్షోభకు గురి చేస్తాయి? ప్రేమగా చూసుకునే పెరెంట్స్‌ని కాదని.. ‘ప్రేమ అంటే ఇదే’ అనుకొని ఇంట్లో నుంచి పారిపోయే అమ్మాయిలకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయని అనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది అందరికి తెలిసిన కథే. నిత్యం టీవీల్లో, పేపర్లలో చూస్తున్న వార్తే. యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్టాఫ్ మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు.. తండ్రి-కూతురు బాండింగ్‌తో పాటు రొమాంటిక్ లవ్ ట్రాక్‌ని చూపించి.. సెకండాఫ్‌లో వాటిలోని గ్రే షేడ్స్‌ని చూపించారు. కథగా చూస్తే ఇది రొటీనే కానీ.. స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పిల్లలపై పెరెంట్స్కి ఎంత ప్రేమ ఉంటుందో తెలియజేసే సన్నివేశాలను అద్భుతంగా మలిచారు. ఇంట్లో ప్రియుడితో రొమాంటిక్ వీడియో కాల్ మాట్లాడుతుండగా.. సడెన్‌గా అమ్మ చూడడం.. పారిపోయే క్రమంలో నాన్న క్యాబ్ ఎక్కడం.. లాడ్జ్‌లో, గదిలో ప్రియుడితో చేసే రొమాన్స్ ఒకవైపు.. చిన్నప్పుడు స్నానం చేయించి నాన్న దుస్తులు వేయించే సన్నివేశం మరోవైపు.. ఇవన్నీ తెరపై చూస్తుంటే గుండె బరువెక్కడం ఖాయం. ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం ఒకలా సాగితే.. ఆ తర్వాత మరోలా సాగుతుంది. ఫస్టాఫ్ కథ మొత్తం.. బేబీ, కొత్త బంగారులోకం..తదితర సినిమాల్లాగా సాగితే.. సెకండాఫ్ కథ.. ఆ మధ్య వచ్చిన ‘బుట్టబొమ్మ’ సినిమాను గుర్తు చేస్తుంది. ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగదు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికొస్తే.. అర్జున్-అలేఖ్యల లవ్‌స్టోరీ వాస్తవికానికి దూరంగా అనిపిస్తుంది. వీడియో కాల్ సీన్ కూడా అంతే.. దానికి బలమైన కారణాన్ని తెరపై చూపించలేకపోయారు. వీరిని ఫాలో అవుతున్న మూడో వ్యక్తికి సంబంధించిన సీన్లలో కూడా లాజిక్ మిస్ అవుతుంది. ఇక హీరోలో ఉన్న మరో కోణాన్ని కూడా పూర్తి కన్విన్సింగ్‌గా చూపించలేకపోయారు. నాన్నను మించి యోధుడు లేడు అని చెప్పేందుకు క్లైమాక్స్‌లో మరిన్ని బలమైన సీన్లను పెట్టి ఉంటే బాగుండేదేమో. ఇవన్నీ పక్కన పెడితే.. కాలేజీ చదువుతున్న అమ్మాయిలతో పాటు వారి పెరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా ఇది. అటు పిల్లలకు, ఇటు పెరెంట్స్కి ఓ మంచి సందేశం ఇచ్చారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాను నిలబెట్టిన పాత్ర నీలఖిది అనే చెప్పాలి. కాలేజీ చదువుతున్న అలేఖ్య పాత్రలో ఆమె జీవించేసింది. దర్శకుడు ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం ఎంత గొప్పగా ఉందో.. నీలఖి కూడా అంతే గొప్పగా నటించింది. ఇంటర్ చదువుతున్న అమ్మాయిలకి ఆమె పాత్ర బాగా కనెక్ట్ అవ్వడమే కాదు..వారికొక హెచ్చరికను కూడా ఇస్తుంది. అర్జున్‌గా అంకిత్ కొయ్య బాగా నటించాడు. ఇక మిడిల్ క్లాస్ ఫాదర్‌గా నరేశ్ వీకే మరోసారి తెరపై తన అనుభాన్ని చూపించాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన హృదయాలను కలిచివేస్తుంది. హీరోయిన్ తల్లిగా వాసుకి తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. సోనియా, నందగోపాల్, మురళీధర్ గౌడ్, ప్రసాద్ బెహరతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం విజయ్ బుల్గానిన్ సంగీతం. పాటలు బాగున్నాయి. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. శ్రీ సాయికుమార్ దారా కెమెరా వర్క్ బాగుంది. ఎస్ బీ ఉద్దవ్ ఎడిటింగ్ పర్వాలేదు. సెకండాఫ్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మలయాళం థ్రిల్లర్ సినిమా 'సూత్రవాక్యం' రివ్యూ
మలయాళంలో బడ్జెట్ తక్కువ కంటెంట్ ఎక్కువ ఉండేలా సినిమాలను నిర్మిస్తుంటారు. ఈ మధ్య మలయాళం నుంచి వచ్చిన చిత్రాలు తెలుగులో కూడా బాగానే అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి మూవీస్ ఓటీటీలో మంచి ఆదరణతో దూసుకెల్తున్నాయి. దీంతో తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. తాజాగా హార్ట్ టచ్చింగ్ మూవీ "సూత్రవాక్యం" (Soothravakyam) మలయాళంలో మంచి విజయం అందుకుంది. కొద్దిరోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video)లో కూడా విడుదలైంది. ఇందులో దసరా విలన్ షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) హీరోగా అద్భుతంగా నటించాడు. విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ కీలక పాత్రలు పోషించారు. యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా ఈ మూవీతో పరిచయం అయ్యాడు. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం.కథేంటి..?పోలీస్ స్టేషన్‌కు నేరాలు చేసినవాళ్లతో పాటు ఆ నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్లాలి..? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది... పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు..? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనతో "సూత్రవాక్యం" తెరకెక్కించారు. క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) పోలీస్ ఆఫీసర్. నిమిషా (విన్సీ లోషియస్) మ్యాథ్స్ టీచర్, వివేక్ పాత్రలో దీపక్ పరంబోల్, ఆర్య పాత్రలో అనఘా నటించారు. ఈ సినిమా కథ అంతా వీరి చుట్టే ఎక్కువగా ఉంటుంది. క్రిస్టో జేవియర్ తన విధులతో పాటు పిల్లలకు పాఠాలు కూడా చెబుతాడు. అయితే, అక్కడి పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా క్రిస్టో చెబుతున్న పాఠాలు వినేందుకు మాత్రమే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ విషయం నిమిషా టీచర్‌కు నచ్చదు. దీంతో తన ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేస్తుంది. అతని దగ్గరికి 11వ తరగతి చదివే ఆర్య (అనఘా) కూడా ట్యూషన్‌కు వస్తుంది. ఆమె అన్నయ్య అయిన వివేక్ (దీపక్ పరంబోర్) ఎప్పుడూ ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఇదే విషయం గురించి ఒకసారి వివేక్‌కు క్రిస్టో జేవియర్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అయినా అతనిలో మార్పు రాదు. ఇంతకు తన చెల్లి మీద వివేక్‌కు ఎందుకు కోపం..? ఆమెపై దాడి చేసి ఎక్కడికి వెళ్లిపోయాడు..? ఈ క్రమంలో ఊహించని పరిస్థితుల్లో వివేక్ ఎలా చనిపోతాడు..? అతడి ఆచూకీ తెలుసుకోవాలని క్రిస్టో జేవియర్ చేసిన ఇన్వెస్టిగేషన్లో మరో యువతి మర్డర్ కేసు ఎలా బయట పడింది..? రెండు హత్యల వెనుక ఉన్నదెవరు..? ఎంతో ఉత్కంఠతో సాగిన విచారణలో క్రిస్టో జేవియర్ ఫైనల్‌గా హంతకులను ఎలా పట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాల్సిందే.ఎలా ఉందంటే..?మలయాళం సినిమా కథలు మొదట చాలా నెమ్మదిగా మొదలవుతాయి. సూత్రవాక్యం మూవీ కూడా అంతే.., అయితే, కాస్త ఒపికతో ఫస్ట్ 20 నిమిషాలు చూస్తే ఆ తర్వాత చాలా ఉత్కంఠతో ఈ చిత్రాన్ని చూస్తారు. సినిమా ప్రారంభంలోనే పోలీస్ స్టేషన్లోనే ట్యూషన్లు చెప్పే పోలీసు కాన్సెప్ట్ మొదలౌతుంది. దానికి ఒక టీజర్ బాధ పడటం వంటి సీన్లు ఎంగేజ్ చేస్తాయి. స్టోరీ మధ్యలో ఆ గ్రామం పొలిమేరలో ఉన్న ఒక బావి స్టోరీ ఆసక్తిగా చెప్పడం వంటి సంఘటనలు పర్వాలేదనిపిస్తాయి. కథలో వివేక్ మరణంతో సినిమా పరుగులు పెడుతుంది. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్‌ను పంచుతుంది. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. వివేక్ హత్య కేసు విచారణలో ఉండగానే మరో యువతి మర్డర్ కేసు బయటకు వస్తుంది. ఇలాంటి ట్విస్ట్‌లు సినిమాకు మరింత బలాన్ని ఇస్తాయి. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న సూత్రవ్యాక్యం కేవలం 1 గంటా 52 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉంది. కుటుంబంతో పాటుగా చూడొచ్చు. -
‘మిరాయ్’ మూవీ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే ఈ కుర్ర హీరో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ఆ స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవాలంటే.. తేజకి ఇంకో హిట్ కచ్చితంగా కావాలి. అందుకే వెంటనే సినిమా చేయకుండా.. కాస్త సమయం తీసుకొని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మిరాయ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తేజా సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ కథ అశోకుడి పాలన(క్రీ.పూ.232)లో ప్రారంభమై.. ప్రస్తుత కాలంలో సాగుతుంది. కళింగ యుద్ధం తర్వాత సామ్రాట్ ఆశోకుడు పశ్చాత్తాపానికి లోనై.. తనలో దాగి ఉన్న దివ్య శక్తిని 9 గ్రంథాలలోకి ఇముడింపజేస్తాడు. ఒక్కో గ్రంథంలో ఒక్కో శక్తి ఉంటుంది. వాటికి తరతరాలుగా 9 మంది యోధులు రక్షకుల ఉంటారు. మహావీర్ లామా(మంచు మనోజ్) వాటిని చేజిక్కుంచుకుని దివ్య శక్తిలను పొంది.. ప్రపంచాన్ని శాసించాలని చూస్తాడు. తనకున్న తాంత్రిక శక్తుల బలంతో 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు. తొమ్మిదో గ్రంథం అంభిక(శ్రియా శరన్) రక్షణలో ఉంటుంది. మహావీర్ కుట్రను ముందే పసిగట్టిన అంభిక.. తొమ్మిదో గ్రంథం రక్షణ కోసం తన కొడుకు వేద(తేజ సజ్జా)ను తయారు చేస్తుంది. అనాథగా పెరిగిన వేదకు విభా(రితిక నాయక్) దిశానిర్దేశం చేస్తుంది. మహావీర్‌ని ఆడ్డుకునే శక్తి ‘మిరాయ్’ ఆయుధంలో ఉందని వేదకు తెలిసేలా చేస్తుంది. మరి మిరాయ్ ఆయుధం కోసం వేద ఏం చేశాడు? ఆ ఆయుధాన్ని కనిపెట్టే క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? హిమాలయాల్లో ఉన్న ఆగస్త్య(జయరాం) అతనికి ఎలాంటి సహాయం చేశాడు. చివరకు ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్ చేతికి వెళ్లిందా లేదా? మహావీర్ నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాణాలు, ఇతీహాసాల్లోని కథలను తీసుకొని, దానికి కాస్త ఫిక్షన్ జోడించి సినిమా చేయడం..ఈ మధ్య టాలీవుడ్‌లోనూ ట్రెండింగ్‌గా మారింది. ఆ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కూడా. ఆ కోవలోకి చెందిన చిత్రమే ‘మిరాయ్’. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్‌ని తీసుకొని.. ఒకవేళ ఆ గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నిస్తే.. మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. కథగా చూస్తే.. ఇది మరీ అంత కొత్తదేమి కాదు. హను-మాన్, కార్తీకేయ 2 తో పాటు హాలీవుడ్‌లోనూ ఈ తరహా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్, విజువల్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉన్నాయి. కార్తీకేయ 2లో కృష్ణుడి కంకణం కోసం హీరో బయలుదేరితే.. మిరాయ్లో శ్రీరాముడి కోదండం కోసం వెతుకుతాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నిశాలు స్క్రీన్‌పై చూస్తుంటే గూస్బంప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సంపాతి పక్షి ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్. అలాగే సెకండాఫ్‌లో కూడా ఒకటి, రెండు సీన్లు అదిరిపోయాయి. రాముడి ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే... సెకండాఫ్ కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే ట్రైన్ ఎపిసోడ్, శ్రీరాముడి ఎపిసోడ్ .. ఆ సాగదీతను మరిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగున్నా.. వావ్ ఫ్యాక్టర్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ‘మిరాయ్’ మాత్రం థియేటర్స్‌లో చూడాల్సిన విజువల్ వండర్. ఎవరెలా చేశారంటే.. వేద పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. ఇదే తరహాలో డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ పోతే మాత్రం..తేజ రేంజ్ ఊహించని స్థాయికి వెళ్తుంది. ఇక మంచు మనోజ్ విలనిజం అద్భుతంగా పండించాడు. తేజ సజ్జ కంటే మనోజ్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి. మహావీర్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. శ్రీయకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. వేద తల్లి అంభిక పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది. ఆమె తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. ఆగస్త్య పాత్రలో జయరాం చక్కగా నటించాడు. రితికా నాయక్, జగపతి బాబు, వెంకటేశ్ మహా, తిరుమల కిశోర్, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గౌర హరి నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా సంపాతి పక్షి ఎపిసోడ్, రాముడి ఎపిసోడ్‌కి ఇచ్చిన బీజీఎం గూస్బంప్స్ తెప్పిస్తాయి. దర్శకుడిగానే కాకుంగా సినిమాటోగ్రాఫర్‌గాను కార్తీక్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ప్రతీ సీన్ తెరపై చాలా రిచ్‌గా ఉంది. ఇక వీఎఫెక్స్ పని తీరు గురించి ముఖ్యంగా చెప్పుకొవాలి. వందల కోట్ల పెట్టి తీసిన సినిమాల్లోనూ గ్రాఫిక్స్ పేలవంగా ఉంటుంది. కానీ రూ. 60 కోట్ల బడ్జెట్లో ఈ స్థాయి ఔట్ పుల్ తీసుకురావడం నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'కిష్కింధపురి' సినిమా రివ్యూ
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ సినిమా 'కిష్కింధపురి'. ఇది ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్లే ట్రైలర్, పోస్టర్స్ లాంటివి కాస్త ఆసక్తికరంగా అనిపించాయి. మరి మూవీ టీమ్ చెప్పినట్లు ఈ చిత్రం భయపెడుతూ థ్రిల్ చేసిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా)కథేంటి?రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమికులు. మరో స్నేహితుడితో కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ చేస్తుంటారు. దీనికి బయట నుంచి కొందరు వ్యక్తులు వస్తుంటారు. వీళ్లందరూ కలిసి జన సంచారం లేని కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఓ సందర్భంలో 'సువర్ణమాయ' అనే పాడుబడ్డ రేడియో స్టేషన్‌కి 11 మంది వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లొచ్చిన తర్వాత ఊహించని రీతిలో ముగ్గురు చనిపోతారు. అనంతరం ఈ బృందంలోని ఓ చిన్నారి.. దెయ్యానికి టార్గెట్ అవుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతున్న దెయ్యం ఎవరు? రాఘవ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మూవీ మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరూ ఫోన్ కూడా పట్టుకోరు, ఒకవేళ అలా ఎవరైనా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తానని ఛాలెంజ్ చేశాడు. తర్వాత దీన్ని కవర్ చేసుకున్నాడు అదే వేరే సంగతి. మరి హీరో చెప్పినట్లు సినిమాలో అంత సీన్ ఉందా అంటే ఓ మాదిరిగా ఉంది అంతే!హారర్ సినిమా అనగానే స్టోరీలో ఓ స్టైల్ ఉంటుంది. దాదాపు దాన్ని ఫాలో అవుతూనే 'కిష్కింధపురి' కూడా తీశారు. ఫస్టాఫ్ అంతా దెయ్యం ఎలిమెంట్స్ చూపిస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది పార్ట్స్ పార్ట్స్‌గానే వర్కౌట్ అయింది. దెయ్యం వెనకున్న ఫ్లాష్ బ్యాక్ చెబుతూ థ్రిల్ పంచే ఎలిమెంట్స్ అన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. సౌండ్స్‌తో భయపెట్టడం వరకు సరే గానీ థ్రిల్లింగ్ అంశాలు మాత్రం సెకండాఫ్‌లో తగ్గిపోయాయి. సాధారణంగా హారర్ మూవీస్ అనగానే చిల్ మూమెంట్స్ కీలకం. అంటే ప్రేక్షకుల్ని సడన్‌గా భయపెట్టాలి. ఇందులో ఒకటి రెండు చోట్ల తప్పితే అలాంటి సన్నివేశాలు పెద్దగా లేవు.ప్రారంభంలో సగటు తెలుగు సినిమాల్లో ఉన్నట్లే హీరో ఇంట్రడక్షన్, లవ్ సాంగ్.. ఇలా సాగుతుంది. ఎప్పుడైతే 'సూవర్ణమాయ' రేడియో స్టేషన్లో హీరోహీరోయిన్తో అడుగుపెడతారో అసలు కథ మొదలవుతుంది. ఇందులోకి వచ్చి వెళ్లిన ఇద్దరు లోకో పైలెట్స్ని, అలానే ఓ నిర్మాణ కూలీని చంపడం లాంటి సీన్స్ రెగ్యులర్‌గానే అనిపించాయి. ఓవైపు సూవర్ణమాయ గురించి తెలుసుకునేందుకు హీరో ప్రయత్నిస్తూనే, మరోవైపు మిగతా వాళ్లు చనిపోకుండా ఆపడం లాంటి అంశాలతో సెకండాఫ్ అంతా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే స్టోరీ, ట్విస్టులు బాగున్నాయి. కానీ ఇదంతా ఎక్కడో తెలుగు సినిమాలో చూసేశామే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారు?బెల్లంకొండ శ్రీనివాస్ హారర్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. రాఘవ్ పాత్రలో పర్లేదనిపించాడు. హీరోయిన్ అనుపమకి మాత్రం మంచి స్కోప్ దొరికింది. మొదట్లో రెగ్యులర్ కమర్షియల్ పాత్రలానే అనిపిస్తుంది గానీ సెకండాఫ్‌లో ఈమె దెయ్యంగా మారే సీన్స్‌లో ఆకట్టుకుంది. విశ్రవ పుత్రగా శాండీ మాస్టర్ మెప్పించాడు. ప్రారంభంలో హైపర్ ఆది, సుదర్శన్ కాస్త నవ్వించేందుకు ప్రయత్నించారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. తనికెళ్ల భరణి, మకరంద్ దేశ్ పాండే తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన వాళ్లంతా ఓకే ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్నిచోట్ల స్టోరీలో లాజిక్స్ మిస్ కావడం డిసప్పాయింట్ చేస్తుంది. గ్రాఫిక్స్ కూడా ఇది గ్రాఫిక్స్ అని తెలిసిపోయేలా ఉంది. దాన్ని కాస్త నేచురల్‌గా చేసుండాల్సింది. దర్శకుడు భయపెడదామని బాగానే ప్రయత్నించాడు కాకపోతే పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. స్టోరీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది!అలానే 'కిష్కింధపురి' అనే టైటిల్ పెట్టారు. ప్రారంభంలో కోతులతో ఓ సీన్ చూపించడం, సినిమాలో ఊరి పేరు తప్పితే ఎక్కడా టైటిల్‌కి స్టోరీకి కనెక్షన్ అనిపించలేదు. దీని బదులు 'సూవర్ణమాయ రేడియో స్టేషన్' అని పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది.- చందు డొంకాన(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ) -
శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ
తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. గత కొన్నేళ్లలో ఘోరమైన డిజాస్టర్స్ ఇచ్చాడు. ఈ ఏడాది 'సికిందర్' అనే హిందీ మూవీ చేశాడు గానీ ఇది ఫెయిల్ కావడానికి హీరో సల్మాన్ ఖాన్ కారణమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు 'మదరాసి' అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? మురుగదాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడా? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?తమిళనాడులో గన్ కల్చర్ తీసుకురావాలనేది విరాట్(విద్యుత్ జమ్వాల్) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్లాన్. ఇందులో భాగంగా గన్స్ ఉన్న ఆరు కంటెయినర్లని రాష్ట్రంలోకి తీసుకొస్తుంటాడు. ఈ సంగతి ఎన్ఐఏ(NIA)కి తెలుస్తుంది. ఆఫీసర్ ప్రేమ్(బిజు మేనన్).. తన టీమ్‌తో కలిసి వీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ పెద్ద గొడవ. ఆఫీసర్ ప్రేమ్ తీవ్ర గాయాలపాలవుతాడు. మరోవైపు లవ్ ఫెయిలైందని రఘు(శివకార్తికేయన్) ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఫ్లైఓవర్ పై నుంచి దూకేస్తాడు. ఇతడికీ గాయాలవుతాయి. అనుకోకుండా ప్రేమ్-రఘని ఒకే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొస్తారు. తర్వాత ప్రేమ్ లీడ్ చేస్తున్న మిషన్‌లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? రఘు ప్రేమించిన మాలతి (రుక్మిణి వసంత్) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఏఆర్ మురుగదాస్ హిట్ కొట్టి చాలాకాలమైంది. ఇతడిపై ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవు. కానీ 'మదరాసి'పై కాస్తోకూస్తో హైప్ ఉందంటే అదంతా హీరో శివకార్తికేయన్ వల్లే. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే బాగుంది అంతే. మరీ సూపర్ కాదు, అలా అని తీసిపారేయదగ్గ మూవీ కాదు. పోలిక కాదు గానీ మురుగదాస్ గతంలో తీసిన 'తుపాకీ' గుర్తొస్తుంది. బహుశా రెండింటిలోనూ ఒకే విలన్ ఉండటం వల్లే ఏమో!'మదరాసి'లో విలన్‌కి హీరోకి ఏ మాత్రం సంబంధం ఉండదు. తనకున్న సమస్యతో తన బాధేదో తను పడుతుంటాడు. అలాంటి హీరో.. ఎన్ఐఏ అధికారులతో ఎందుకు కలిసి పనిచేయాల్సి వచ్చింది? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో తీశారు. యాక్షన్ ఎంటర్టైనర్లా సినిమా తీయాలని ఫిక్సయ్యారు. లవ్‌స్టోరీ కూడా పెట్టారు కానీ ఇదెందుకో అంతగా అతకలేదు. లవ్ సీన్స్ అన్నీ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఫస్టాప్ బాగుంటుంది. హై మూమెంట్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్‌కి వచ్చేసరికి యాక్షన్ పార్ట్ ఎక్కువైంది. స్టోరీ తక్కువైంది. కానీ చూడటానికి బాగానే ఉంటుంది. సెకండాఫ్ మధ్యలోనే స్టోరీ అయిపోతుంది. కానీ అక్కడి నుంచి మరో అరగంట సినిమా సాగుతూ వెళ్తుంది. మురుగదాస్ గత చిత్రం 'సికిందర్'తో పోలిస్తే ఇది పర్వాలేదనిపిస్తుంది. స్టోరీలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా చూసేటట్టుగానే ఉంటుంది. అనుకున్న పాయింట్ చెప్పడంలో టీమ్ అంతా పర్లేదు సక్సెస్ అయ్యారు. కాకపోతే మరీ అంత ఎక్స్ట్రార్డినరీగా అయితే ఉండదు.ఎవరెలా చేశారు?ఈ సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే అది శివకార్తికేయన్ మాత్రమే. ఇతడి క్యారెక్టర్ డిజైన్ బాగుంటుంది. అలానే శివకార్తికేయన్‌లో టిపికల్ కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఈ మూవీలో అక్కడక్కడ ఉపయోగించుకున్నారు. రుక్మిణి వసంత్ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించింది. స్క్రీన్ పై ఈమె అందంగా కనిపించింది. విలన్స్ విరాట్-చిరాగ్గా విద్యుత్ జమ్వాల్, షబ్బీర్ బాగానే చేశారు. మంచి ఎలివేషన్స్ పడ్డాయి. బిజు మేనన్.. ఎన్ఐఏ ఆఫీసర్‌గా బాగానే చేశారు. మిగిలిన వాళ్లంతా ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే.. పాటలు అస్సలు బాగోలేవు. లిరిక్స్ ఒక్క ముక్క అర్థం కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్లేదనిపించింది. కానీ అనిరుధ్ మార్క్ కనిపించలేదు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. ఫైనల్‌గా ఏఆర్ మురుగదాస్.. ఈ సినిమాతో కాస్త కుదురుకున్నాడు. కానీ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది అనిపించింది. అలానే టైటిల్ పడేటప్పుడు తమిళనాడు మ్యాప్ తప్పుగా చూపించారు. అందులో దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని కూడా తమిళనాడులో కలిపేసి చూపించారు. మరి టీమ్ ఇది తెలిసి చేసిందా? తెలియక చేసిందా? అనేది అర్థం కాలేదు.- చందు డొంకాన -
‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: లిటిల్ హార్ట్స్నటీనటులు: మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులురచన, దర్శకత్వం : సాయి మార్తండ్నిర్మాత: ఆదిత్య హాసన్సంగీతం: సింజిత్ యెర్రమల్లిసినిమాటోగ్రఫీ : సూర్య బాలాజీవిడుదల తేది: సెప్టెంబర్ 5, 2025‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ఫేమ్ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసుకుంది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న సినిమాపై ఓ మోస్తరు అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఈ సినిమా కథ 2009-2020 మధ్య కాలంలో సాగుతుంది. నల్లి అఖిల్(మౌళి తనూజ్) చదువులో చాలా వీక్. అతన్ని ఇంజనీర్ చేయాలానేది తండ్రి గోపాలరావు(రాజీవ్ కనకాల)ఆశయం. కానీ అఖిల్ ఎంసెట్‌లో క్వాలిఫై కూడా కాడు. తనవల్ల కాదని చెప్పినా వినకుండా లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు తండ్రి. ఆ కోచింగ్ సెంటర్లో ఉన్న కాత్యాయని(శివానీ నాగారం) పరిస్థితి కూడా అంతే. ఆమెకు మెడిసిన్ చదవడం ఇష్టం ఉండదు. కానీ పెరెంట్స్ బలవంతంగా లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తారు. అక్కడే అఖిల్‌కి కాత్యాయని పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. అఖిల్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టగానే.. కాత్యాయని ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడిస్తుంది. అదేంటి? అఖిల్, కాత్యాయనిల ప్రేమకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని వీరిద్దరు ఎలా ఎదుర్కొని..ఒకటయ్యారు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉన్నా.. తెరపై చూస్తుంటే బోర్ కొట్టదు. ఊహించే మలుపు ఉన్నా.. ఎక్కడో చూసిన సన్నివేశాలు కనిపించినా.. ఎంటర్టైన్ అవుతుంటాం. లిటిల్ హార్ట్స్ ఆ కోవలోకి చెందిన చిత్రమే. కథగా చెప్పాలంటే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. రెగ్యులర్ రొటీజ్ టీనేజ్ లవ్‌స్టోరీ. కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు.. పంచ్ డైలాగులు సినిమాను నిలబెట్టాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. టీనేజ్ అమ్మాయి/అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా 2009-2020 మధ్య కాలేజీ చదివిన వాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. జియో సిమ్ రాకముందు అంటూ హీరోహీరోయిన్లు, వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లో హీరోహీరోయిన్ల పరిచయం తర్వాత కథనం మరింత ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాత్యాయని ఇంప్రెస్ చేసేందుకు అఖిల్ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహితుడు వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీ డబుల్ అవుతుంది. హీరోయిన్‌కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు.. ఆమె బర్త్‌డే కోసం అఖిల్ చేసే సర్ప్రైజ్.. అవి ఇంట్లో వాళ్లకు తెలిసిన తర్వాత ఎదురయ్యే చిక్కులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోహీరోయిన్లు కలిసేందుకు చిన్న పిల్లలను వాడుకోవడం.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అలాగే ఒకటి రెండు చోట్ల డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే ప్రస్తుతం వస్తున్న యూత్‌ఫుల్ కామెడీ చిత్రాలతో పోలిస్తే.. ఇందులో వల్గారిటీ చాలా తక్కువనే చెప్పాలి. బూతు సన్నివేశాలేవి లేకుండానే కామెడీ పండించారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ‘గోల్స్ ఎప్పుడు అందంగా ఉండాలి’ అంటూ హీరోతో ఒక డైలాగ్ చెప్పించడమే కాకుండా.. క్లైమాక్స్‌లో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. యూత్ అయితే ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. అఖిల్ పాత్రలో మౌళి పర్వాలేదనిపించాడు. ఆయన కామెడీ టైమింగ్ బాగుంది. కాత్యాయని పాత్రకి శివానీ నాగారం న్యాయం చేసింది. మౌళికి జోడీగా ఆమెను ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో స్నేహిడు మధుగా జయకృష్ణ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలమైంది. మరో స్నేహితుడిగా నిఖిల్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగానే చేశారు. రాజీవ్ కనకాల, అనిత చౌదరి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. -
అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ
అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’(2023) తర్వాత ఆమె నుంచి వచ్చిన తాజా చిత్రం ‘ఘాటి’(Ghaati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ..ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Ghaati Movie Review ). కథేంటంటే..శీలావతి.. ఖరీదైన గంజాయి. ఇది ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది. అక్కడ పండిన గంజాయి పంటను కోసి, బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్ మాఫీయా లీడర్ కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్యరావు) ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అలా ఘాటీలుగా పని చేసిన దేశిరాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క).. ఓ కారణంగా ఆ పని వదిలేస్తారు... వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. శీలావతికి బావ దేశిరాజు అంటే చాలా ఇష్టం. అప్పులు తీర్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే.. కుందుల నాయుడికి తెలియకుండా ఓ గ్యాంగ్ శీలావతి గంజాయిని లిక్విడ్‌గా మార్చి బయటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంటుంది. ఈ ముఠాకి లీడర్‌గా దేశిరాజు ఉన్నట్లు కుందుల నాయుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఘాటీ పని వదిలిన దేశి రాజు, శీలావతి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? శీలావతి క్రిమినల్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేశిరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శీలావతి ఏం చేసింది? ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రిష్ సినిమాల్లో కథ చాలా సింపుల్‌గా, హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. ఒక చిన్న పాయింట్‌ని పట్టుకొని దానికి ఎమోషల్ జోడించి.. ఆలోచింపజేసే డైలాగులతో కథనాన్ని నడిపిస్తుంటాడు. గమ్యం, వేదం, కంచె సినిమాల నేపథ్యం అలానే సాగుతుంది. ఘాటి కథను కూడా అలానే నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సినిమాల్లోలాగా ఎమోషన్ని ఇందులో పండించలేకపోయాడు. డైలాగులు కూడా అంత గొప్పగా ఏమి లేవు. కథ నేపథ్యం బాగున్నా..దాన్ని అంతే ఆకర్షనీయంగా తెరపై చూపించడంతో క్రిష్ పూర్తిగా సఫలం కాలేదు. ఘాటీలు, వారి వృత్తి నేపథ్యాన్ని వివరిస్తూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ల ఎంట్రీ చాలా సహజంగా ఉంటుంది. శీలావతి గంజాయి సరఫరా.. రైల్వే స్టేషన్ నుంచి డబ్బులు తీసుకునేక్రమంలో వచ్చే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక గంజాయి స్మగ్లింగ్ వెనుక హీరోహీరోయిన్లు ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత..కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. తొలి అర్థభాగం మొత్తం ఎలాంటి ట్విస్టులు, హైమూమెంట్స్ లేకుండా కథనం చాలా సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. అయితే ఆ సీన్‌తో సెకండాఫ్ ఎలా ఉండబోతుందో ఈజీగా ఊహించొచ్చు. ద్వితియార్థం మొత్తం రివేంజ్ యాక్షన్ డ్రామానే. కథనం మొత్తం అక్కడక్కడే తిరుగుతూ సాగదీతగా అనిపిస్తుంది. ఒకదాని వెనుక మరోకటి యాక్షన్ సీన్లు వస్తూ ఉంటాయి. అయితే గుహలో నాయుడు ముఠాతో చేసే యాక్షన్ సీన్, తలనరికే ఎపిసోడ్ తప్ప..మిగతావేవి ఆకట్టుకోలేవు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అనుష్క కోసం ఇరికించినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా, ఉహకందేలా ఉంటుంది. బాధితురాలు నేరస్తురాలిగా మారడం.. ఆ తర్వాత తను ఎంచుకున్న మార్గాన్ని వదిలి.. తన వర్గాన్ని మంచి దారిలో నడిపించడం కోసం ప్రయత్నించడం.. ఇదే ఘటి కథ. అయితే తన వర్గాన్ని మంచి దారిలో తీసుకొచ్చేందుకు శీలావతి చేసే పోరాటం ఆసక్తికరంగా మలిచి ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. శీలావతి పాత్రకి అనుష్క న్యాయం చేసింది. యాక్షన్ సన్నివేశాలు ఇరగదీసింది. కానీ ఆ సీన్లను తీర్చిదిద్దిన విధానమే బాగోలేదు. చాలా చోట్ల ఇరికించినట్లుగా, కొన్ని చోట్ల అతిగా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్లను బాగానే నటించింది. కానీ అరుధంతి, బాహుబలి, భాగమతిలో ఉన్న అనుష్క మాత్రం తెరపై కనిపించలేదు. దేశిరాజుగా విక్రమ్ ప్రభు బాగానే నటించాడు. చైతన్యరావు తొలిసారి విలన్‌గా నటించి మెప్పించాడు. అయితే ప్రతిసారి గట్టిగా అరవడం తప్ప.. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. రవీంద్ర విజయ్ విలనిజం కూడా అంతంతమాత్రమే. పోలీసు ఆఫీసర్‌గా జగపతి బాబు అక్కడక్కడ కనిపిస్తాడు. ఆయన పాత్ర ఎంటర్టైనింగ్గా మలిచారు. కానీ అది తెరపై వర్కౌట్ కాలేదు. జాన్ విజయ్, రాజు సుందరం, వీటీవీ గణేష్ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. మనోజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాగర్ సంగీతం ఓకే. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!
హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ, విలన్ ఎంట్రీ, నాలుగు ఫైట్లు, డ్యుయెట్లు.. శుభం పలికే క్లైమాక్స్.. దాదాపు అన్ని సినిమాల్లో ఇవే ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే సినిమాలో ఇవేవీ ఉండవు. అయినా ఎంతోమందిని ఈ చిత్రం కదిలించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ సినిమా చూసి నవ్వుతూనే ఏడ్చేశారు. అందుకే హీరోయిన్ అదితి బాలన్, దర్శకుడు అరుణ్ ప్రభును ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసులు బహుకరించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం సినిమా అద్భుతమని, చివరి పావుగంట నమ్మలేకుండా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఆ సినిమా పేరు అరువి. 2017లో వచ్చిన ఈ తమిళ చిత్రం రూ.1 కోటితో తెరకెక్కి రూ.35 కోట్లకు పైగా వసూలు చేసింది. దర్శకుడు అరుణ్ ప్రభుకు, హీరోయిన్గా అదితి బాలన్‌కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ఏముందో చూద్దాం..కథఏ అమ్మాయికైనా తండ్రంటే పంచ ప్రాణాలు. తల్లి కోప్పడినా తండ్రి మాత్రం గారాబం చేస్తుంటాడు. అరువి అనే అమ్మాయి కూడా తండ్రి చేతిలో అల్లారుముద్దుగా పెరిగింది. కానీ ఓ యాక్సిడెంట్ వల్ల తన జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. తనకో సమస్య ఉందని ఇంట్లోవాళ్లే ఆమెను ఛీ కొడతారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినా ఎవరూ లెక్కచేయరు. ఇంట్లో నుంచి గెంటేస్తారు. కన్నీళ్లతో ఇంటినుంచి బయటకు వస్తుంది. (Aruvi Movie Review)హృదయ విదారక కథకానీ, ఆ కన్నీళ్లను చూసి సమాజం జాలిపడదు సరికదా! దాన్నే అలుసుగా తీసుకుంటుంది. అలా ముగ్గురు మగవారి చేతిలో మోసపోతుంది. ఎమిలీ అనే ట్రాన్స్‌జెండర్ స్నేహితురాలితో కలిసి ఈ విషయాన్ని ఓ టీవీ డిబేట్లో వెల్లడిస్తుంది. అక్కడి నుంచి సినిమా మరో మలుపు తిరుగుతుంది. అసలు అరువి జీవితాన్ని తలకిందులు చేసిన సమస్య ఏంటి? కంటిరెప్పలా చూసుకున్న కన్నతండ్రే ఆమెను ఎందుకు గెంటేశాడు? చావు తథ్యమని తెలిసి ఆమె ఏం చేసింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో అరువి చూడాల్సిందే!క్లైమాక్స్‌లో ఏడ్చేస్తారుసినిమా ప్రారంభంలో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఒక్క సంఘటన తర్వాత కథ ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. చేయని తప్పుకు అరువి జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. ఎవరూ తనను నమ్మకపోవడమనేది ఆమెను మానసికంగా చిత్రవధ చేస్తుంది. సినిమా చివర్లో హీరోయిన్ మాట్లాడే మాటలు కంటతడి పెట్టిస్తాయి. ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్ ఉన్న ఈ సినిమా తప్పకుండా చూడండి! -
హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ
మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్.. అఖిల్ 'హలో' మూవీతో హీరోయిన్ అయింది. 'చిత్రలహరి' అనే మరో తెలుగు సినిమా కూడా చేసింది. తర్వాత పూర్తిగా సొంత భాషకే పరిమితమైపోయింది. ఇప్పుడు ఈమె.. ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. అదే 'కొత్త లోక: ఛాప్టర్ 1 చంద్ర'. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ.. ఆగస్టు 28న మలయాళంలో రిలీజ్ కాగా, ఓ రోజు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కి సూపర్ పవర్స్ ఉంటాయి. ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసు. ఓ సందర్భంలో బెంగళూరు వస్తుంది. తన అతీంద్రయ శక్తుల్ని దాచిపెట్టి, సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో సన్నీ(నస్లేన్) ఫ్రెండ్స్‌తో కలిసి నివసిస్తుంటాడు. చంద్రని చూసి సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతమేంటి? ఈమెకు ఎస్ఐ నాచియప్ప (శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా సూపర్ హీరో సినిమాలు అనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. రీసెంట్ టైంలో 'హనుమాన్' పేరుతో తెలుగులోనూ ఓ మూవీ వచ్చింది. ఇప్పుడు మలయాళంలో సూపర్ హీరో జానర్లో ఏకంగా ఓ యూనివర్స్ సృష్టించారు. ఇందులో వచ్చిన తొలి సినిమానే 'లోక'. తెలుగులో దీన్ని 'కొత్త లోక' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. రెగ్యులర్ రొటీన్ మూవీస్‌తో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంది. అందుకు తగ్గట్లే థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఇచ్చింది.చంద్ర ఓ పవర్ ఫుల్ ఫైట్ చేయడంతో సినిమా మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల బెంగళూరు రావడం, ఇక్కడ ఎదురింట్లో ఉండే సన్నీతో పరిచయం.. ఇలా పాత్రలు, పరిస్థితుల్ని చూపిస్తూ వెళ్లారు. ఓ సాధారణ అమ్మాయిలా బతుకుదాం అని వచ్చిన చంద్ర.. ఒకడిని కొట్టడంతో ఈమె లైఫ్‌లోకి ఓ రౌడీ గ్యాంగ్ వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. అక్కడి నుంచి చంద్ర లైఫ్ ఎలా టర్న్ అయింది. చివరకు ఏమైందనేదే తెలియాలంటే సినిమా చూడాలి.ఈ సినిమా ఫస్టాప్ అంతా ఎంగేజింగ్‌గా ఉంటుంది. హీరోయిన్‌కి ఉన్న సూపర్ పవర్స్, అందుకు తగ్గట్లు అక్కడక్కడ ఫైట్ సీక్వెన్స్ లు ఎంటర్టైన్ చేస్తాయి. సెకండాఫ్ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. కానీ చివరకొచ్చేసరికి రెగ్యులర్ చిత్రాలతో పోలిస్తే ఓ డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది. సాధారణంగా ఫిమేల్ సెంట్రిక్ కథలు అనగానే సింపతీనే చూపిస్తుంటారు. ఇందులో అణిచివేతకు ఎదురు నిలబడిన యోధురాలిగా చంద్ర పాత్రని ప్రెజెంట్ చేశారు.యక్షిణి పాత్ర గురించి మనం పురాణాల్లో విన్నాం. అయితే ఆ పాత్రని తీసుకుని సూపర్ హీరో తరహా స్టోరీగా మార్చడం.. బ్యాట్ మ్యాన్ టైపులో చూపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సినిమా మొత్తం చూసిన తర్వాత కథని పూర్తి చేయలేదేంటి అనే సందేహం వస్తుంది. అవును అదే నిజం. కేవలం చంద్ర పాత్ర తాలూకు బలాలు, బలహీనతలు చూపించారు. తర్వాత రాబోయే పార్ట్-2 చిత్రానికి లీడ్ వదిలారు. ఇందులో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉంది. అది కొన్నిచోట్ల వర్కౌట్ అయింది.ఎవరెలా చేశారు?కల్యాణి ప్రియదర్శిని ఇప్పటివరకు కమర్షియల్ పాత్రలు ఎక్కువగా చేసింది. ఇందులో చంద్ర అనే సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిగా ఆకట్టుకుంది. ఫైట్స్ ఇరగదీసింది. చంద్ర వెంటపడే అమాయకమైన కుర్రాడిగా నస్లేన్ బాగా చేశాడు. అతడి ఫ్రెండ్స్‌గా చేసిన ఇద్దరు కుర్రాళ్లు కామెడీ బాగానే చేశారు. నాచియప్ప అనే విలన్ తరహా పాత్ర చేసిన శాండీ.. స్వతహాగా కొరియోగ్రాఫర్. కానీ యాక్టింగ్ కూడా బాగా చేశాడు. మిగిలిన వాళ్లు ఆకట్టుకున్నారు. ఇందులోనే 'కూలీ' ఫేమ్ సౌబిన్ షాహిర్, హీరోలు టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో అలా మెరిశారు.టెక్నికల్ అంశాలకొస్తే.. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్. రెడ్-బ్లూ కలర్స్‌ని ఉపయోగించిన విధానం బాగుంది. తెలుగు డబ్బింగ్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి తగ్గట్లు ఉంది. డొమినిక్ అరుణ్.. దర్శకుడిగా కంటే రైటర్‌గా ఎక్కువగా ఆకట్టుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసినా సరే ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. కథలో మైథాలజీ ఉంది. కొత్త పాయింట్ ఉంది. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు కూడా బాగుంది. రెగ్యులర్ రొటీన్ సినిమాలు కాదు ఏదైనా కొత్తగా చూద్దామనుకుంటే మాత్రం ఇది డోంట్ మిస్.- చందు డొంకాన -
‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ
టాలీవుడ్లో ప్రతివారం కొత్త సినిమాలు వస్తున్నా..వాటిల్లో కొన్ని మాత్రమే రిలీజ్‌కి ముందు అటెన్షన్‌ని గ్రాప్ చేస్తాయి. అలా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆగస్ట్ 15న ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు(సత్యరాజ్) మనవరాలు నిధి(మేఘన) కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసుని కానిస్టేబుల్ చంద్ర(సత్యం రాజేశ్) డీల్ చేస్తుంటాడు. మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్(వశిష్ట సింహా) విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. దానికోసం రూ.30 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. తన స్నేహితుడు, లేడీ డాన్ వాలికి పద్మ(ఉదయ భాను) మేనల్లుడు దేవ్(క్రాంతి కిరణ్)తో కలిసి ఇష్టం లేకపోయిన కొన్ని అసాంఘీక పనులు చేస్తుంటాడు. దేవ్‌కి జూదం అంటే పిచ్చి. అత్త వాకిలి పద్మకు తెలియకుండా డ్రగ్స్ మాఫియా లీడర్ దాస్(మొట్ట రాజేంద్రన్) దగ్గర లక్షల్లో అప్పు చేసి జూదంలో పొగొట్టుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత దాస్ తన అప్పు తీర్చమని దేవ్‌పై ఒత్తిడి చేస్తాడు. దీంతో డబ్బు కోసం రామ్ ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి? నిధి మిస్సింగ్‌కి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు నిధిని కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే...టైటిల్‌ని చూసి ఇదేదో మైథాలాజికల్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఇది రొటీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దానికి కాస్త మైథాలాజికల్ టచ్ ఇచ్చి డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ విషయంలో ఆయన కాస్త సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథ రొటీనే అయినా కథనం మాత్రం కొత్తగా ఉంటుంది. ఒకేసారి రెండు డిఫరెంట్ కథలను చెబుతూ..చివరిలో ఆ రెంటింటికి మధ్య ఉన్న సంబంధం రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ రెండు ఎపిసోడ్స్‌కి మధ్య లింక్ ఉంటుందని ఊహించినా.. ఆ లింకుని ఎలా చూస్తాడనే అనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు విజయం సాధించాడు.మహా భారతంలో ఘటోత్కచుని కొడుకు బార్బరీకుడు త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలడు. ఆయన దగ్గర ఉండే మూడు బాణాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిని తెలియజేస్తూ ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత తాత-మనవరాలి స్టోరీని పాటలోనే ఎమోషనల్‌గా చూపించారు. అదే సమయంలో మరో ఎపిసోడ్లో సత్యతో రామ్ లవ్ స్టోరి..వాలికి పద్మ నేపథ్యం, దాస్ డ్రగ్స్ దందా..ఇవన్నీ చూపిస్తూ.. కథనంపై ఆసక్తిని పెంచేశాడు.నిధికి ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేశారు? అమ్మాయి ప్రాణాలతో ఉందా? రామ్‌కి 30 లక్షలు దొరుకుతాయా? రామ్ స్నేహితుడు అప్పు నుంచి బయట పడతాడా? అంటూ ఇలా చాలా లేయర్లతో కథనం ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రివేంజ్ డ్రామా. తన మనవరాలి మరణానికి తాత చేసే న్యాయం ఏంటి? అన్నది ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. పరిస్థితుల వల్ల మనుషులు ఎలా మారిపోతారు? అన్నది ఇందులో గొప్పగా చూపించారు. రాముడి వేషంలో రావణుడిలా మన చుట్టూ ఉన్న వాళ్ళని కనిపెట్టాలి అంటూ అమ్మాయిలకు మంచి సందేశం కూడా ఇచ్చారు.ఎవరెలా చేశారంటే..సైక్రియార్టిస్ట్ శ్యామ్ పాత్రకి సత్య రాజ్ న్యాయం చేశాడు. ఇక ఈ మూవీలో వశిష్ట పాత్ర అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. రకరకాల వేరియేషన్స్‌తో వశిష్ట మరోసారి అందరినీ మెప్పించేస్తారు. కొత్త కుర్రాడు క్రాంతి కిరణ్ కూడా ఆకట్టుకుంటాడు. ఉదయభానుకి చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర పడినట్టు అనిపిస్తుంది. అయితే ఆమె పాత్ర నిడివి మాత్రం కాస్త తక్కువే. సత్యం రాజేష్, సాంచీ రాయ్, మేఘన, కార్తికేయ పాత్రలు ఇలా అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇక కామెడీ కోసం తీసుకున్న వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్రన్ కారెక్టర్స్ కూడా ఆకట్టుకుంటాయి.సాంకేతికంగా ఈ సినిమా బాగుంది.ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన స్క్రీన్‌ప్లేతో సినిమా స్థాయిని పెంచేశారు. పాటలు పర్వాలేదు. కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు చాలా చోట్ల హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. తొలి సినిమానే అయినా సెల్యూలాయిడ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గొప్పగా ఉన్నాయి. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
'సుందరకాండ' సినిమా రివ్యూ
ప్రభాస్ తొలి సినిమాలో హీరోయిన్ శ్రీదేవి.. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో హీరోయిన్గా చేసిన మూవీ 'సుందరకాండ'. నారా రోహిత్ హీరో కాగా, వృతి వాఘని మరో కథానాయిక. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇన్నాళ్లకు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సిద్ధార్థ్ (నారా రోహిత్) 30 ఏళ్ల వయసు దాటిపోయి చాన్నాళ్లయినా పెళ్లి చేసుకోడు. స్కూల్లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)ని ప్రేమిస్తాడు. ఆమెలోని కొన్ని లక్షణాలు నచ్చుతాయి. పెద్దయిన తర్వాత అలాంటి లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రూల్ పెట్టుకుంటాడు. సంబంధాలు వస్తుంటాయి, అమ్మాయిల్ని చూస్తుంటాడు కానీ ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో ఐరా(వృతి వాఘని) అనే అమ్మాయిలో తను అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయని ఆమె వెంటపడతాడు. తనని ప్రేమించేలా చేస్తాడు. మరి ఈ ప్రేమకథ సుఖాంతమైందా? సిద్ధార్థ్ మళ్లీ వైష్ణవిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?టాలీవుడ్లో ఇప్పటికే వందలాది ప్రేమకథ సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ ఇందులోనూ కొత్తగా చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటి పాయింట్స్‌ని స్టోరీగా రాసి మూవీగా తీస్తుంటారు. ఇది కూడా అలాంటి ఓ చిత్రమే. కాన్సెప్ట్ వినడానికే విడ్డూరంగా ఉంటుంది గానీ గీత దాటకుండా బాగానే తీశారు. కామెడీ బోనస్.సిద్ధార్థ్ పెళ్లి చేసేందుకు అతడి కుటుంబం.. అమ్మాయిల్ని చూడటంతో సినిమా మొదలవుతుంది. అలా తను అనుకున్న లక్షణాలు లేవవి రిజెక్ట్ చేస్తూ వెళ్తుంటాడు. ఓ సందర్భంలో ఎయిర్‌పోర్ట్‌లో ఐరాని చూస్తాడు. ఆమెలో క్వాలిటీస్.. తను అనుకున్న వాటికి మ్యాచ్ అవుతున్నాయని తెలిసి ఆమె వెంటపడి తనని ప్రేమించేలా చేస్తాడు. అంతా సుఖాంతం అనుకునే టైంలో ఓ ట్విస్ట్. అలా ఇంటర్వెల్ పడుతుంది. సిద్దార్థ్ చిన్నప్పుడు ఇష్టపడ్డ వైష్ణవి అనే క్యారెక్టర్ ఈ కథలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఏమైంది? సిద్ధార్థ్ తన ప్రేమకథకి ఎలా ముగింపు ఇచ్చాడనేది మూవీ చూసి తెలుసుకోవాలి.సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ బాగుంది. ఫస్టాప్ అంతా పెద్దగా మెరుపులేం ఉండవు. హీరో పరిచయం, అతడికో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్.. ఇలా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ఇంటర్వెల్లో ఓ ట్విస్ట్ ఉంటుంది. అయితే ఫస్టాప్ చూస్తున్నప్పుడే దీన్ని చాలామంది ఊహించేస్తారు. అయితే ఈ ట్విస్ట్‌కి తగ్గట్లు సెకండాఫ్‌లో సీన్లు ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి అంతే. మిగతా అంతా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ అయితే హడావుడిగా అనిపిస్తుంది.ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలో చాలానే డ్రామా నడిపించొచ్చు. కావాల్సినంత స్కోప్ కూడా ఉంది. కానీ ఎందుకో చేయలేకపోయారు అనిపించింది. కొంతలో కొంత సత్య కామెడీ ట్రాక్ రిలీఫ్‌గా అనిపిస్తుంది. పాటలు, ఫైట్స్ లాంటివి సినిమాటిక్‌గా ఉన్నాయి తప్పితే కథలో సెట్ కాలేదనిపించింది.ఎవరెలా చేశారు?నారా రోహిత్ ఎప్పటిలానే చేశాడు కానీ ఫిజిక్ పరంగా ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాలి. డ్యాన్స్ చేశాడు కానీ ఇబ్బందిపడుతున్నట్లు అనిపించింది. చాన్నాళ్ల తర్వాత తెలుగులో చేసిన శ్రీదేవి ఆకట్టుకుంది. ఈమె పాత్రకు ఇంకొన్ని సీన్స్ పడుంటే బాగుండేది. స్కూల్ లవ్ స్టోరీలోనూ ఈమెనే పెట్టేశారు. బదులుగా ఎవరైనా చైల్డ్ ఆర్టిస్టుని పెట్టుంటే బాగుండేదేమో! ఐరా రోల్ చేసిన వృతి చూడటానికి బాగుంది. యాక్టింగ్ కూడా బాగానే చేసింది. సత్య, వాసుకీ, సీనియర్ నరేశ్ ఎవరికి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. లియోన్ జేమ్స్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది గానీ ఎక్కడో విన్న ఫీలింగ్ కలిగింది. దర్శకుడు వెంకటేశ్ తను అనుకున్న పాయింట్ బాగానే ప్రెజెంట్ చేశాడు కానీ ప్రేక్షకులు దీన్ని ఏ మేరకు అంగీకరిస్తారనేది చూడాలి.- చందు డొంకాన -
తమిళంలో హిట్.. బన్ బటర్ జామ్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
బన్ బటర్ జామ్ మూవీ తమిళంలో ఆల్రెడీ సక్సెస్ అయింది. నేటి యువతకు తగ్గట్టుగా, ట్రెండ్‌ను ఫాలో అవుతూ తీసిన చిత్రంగా ‘బన్ బటర్ జామ్’ మూవీకి మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ఈ మూవీని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ శుక్రవారమే ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. మరి తెలుగు ఆడియెన్స్‌ను ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఓ సారి చూద్దాం.కథ ఏంటంటే?లలిత (శరణ్య), ఉమ (దేవ దర్శిని) ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదర్చిన వివాహాలు ఏవీ కూడా నిలబడటం లేదని తెలుసుకుంటారు. ఇంటర్ చదువుతున్న తమ బిడ్డల్ని ఒకటి చేయాలని లలిత, ఉమలు అనుకుంటారు. లలిత తన కొడుకు చంద్రు ((రాజు జయమోహన్)ని, ఉమ తన కూతురు మధుమిత (ఆద్య ప్రసాద్)ని ఒకే దగ్గర ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో లలిత ఇంటి పక్కనే ఓ ఇళ్లు అద్దెకు తీసుకుంటుంది ఉమ. అయితే చంద్రు ఏమో నందిని (భవ్య త్రికా)తో, మధు మిత ఏమో ఆకాష్ (వీజే పప్పు)తో ప్రేమలో ఉంటారు. చివరకు వీరి ప్రేమ కథలు ఒడ్డుకు ఎలా చేరతాయి? చంద్రుకి తన ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్)కి దూరం ఎందుకు పెరుగుతుంది? చివరకు హీరో హీరోయిన్ల తల్లులు వేసిన ప్లాన్ బెడిసి కొడుతుందా? సక్సెస్ అవుతుందా? అన్నదే కథ.ఎలా తీశారంటే?బన్ బటర్ జామ్ అనే చిత్రం ప్రస్తుతం ఉన్న తరానికి, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉన్నట్టు కనిపిస్తోంది. సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్లు అని తేడా లేకుండా అన్నీ విడాకులకే దారి తీస్తున్నాయి. ఇదే పాయింట్ మీద దర్శకుడు కథను రాసుకున్నాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వివాహా బంధం నిలబడాలంటే ఏం చేయాలి? అసలు ప్రేమ ఎలా ఉండాలి? ఎలాంటి ప్రేమను ఇవ్వాలి? ఎలా ప్రేమించాలి? అన్న పాయింట్ల చుట్టూ కథను అల్లుకున్నాడు.ప్రేమలో ఓడిపోతే జీవితం పోయినట్టు కాదు అనే పాయింట్‌ను చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రేమ, స్నేహం అనే వాటి చుట్టూ కథను చక్కగా అల్లుకున్నాడు. ఇక ఇప్పుడు ఎక్కువగా వినిపించే బెస్టీ అనే ట్రెండ్‌ను కూడా ఇందులో వాడుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాలేజ్ ఎపిసోడ్స్, ప్రేమ చిగురించే సీన్లు, హీరో హీరోయిన్ల తల్లులు చేసే ఫన్‌తో నడుస్తుంది. ఇక సెకండాఫ్‌కు కథ వెళ్లే సరికి కాస్త ఎమోషనల్‌గా మారుతుంది.ప్రేమంటే ఏంటి? ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? ముందుకు ఎలా సాగాలి? నిజమైన ప్రేమకు అర్థం ఏంటి? అని సెకండాఫ్‌లో చూపిస్తాడు. క్లైమాక్స్ ఊహకందేలానే సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు కథను సాగదీసినట్టుగా అనిపిస్తుంది. గతం గత: అనే పాయింట్‌ను చెప్పేందుకు చాలానే ల్యాగ్ చేశాడనిపిస్తుంది. గతాన్ని వదిలి.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. వర్తమానాన్ని ఆస్వాధించాలని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది.సాంకేతికంగా చూసుకుంటే..బన్ బటర్ జామ్ మూవీకి ఇచ్చిన పాటలు తెలుగు వారికి అంతగా ఎక్కకపోవచ్చనిపిస్తుంది. ఆర్ఆర్ సీన్లకు తగ్గట్టుగా ఉంటుంది. ఇక డైలాగ్స్ కొన్ని చోట్ల గుండెను తాకేలా ఉంటాయి. విజువల్స్ చక్కగా కుదిరాయి. ఎడిటింగ్ బాగుంటుంది. ఓ గ్రాండ్ ఫిల్మ్ చూసినట్టుగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.ఎవరెలా చేశారంటే..బన్ బటర్ జామ్ సినిమాలో చంద్రు పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మాయిలు అంటేనే భయపడిపోయే చంద్రు పాత్ర అందరినీ మెప్పిస్తుంది. చంద్రు పాత్రలో రాజ్ ఎంతో సహజంగా నటించారు. ఇక నందిని పాత్రకు అయితే నేటి యువతులు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. రీల్స్, ఇన్ స్టా, ఇన్ ఫ్లూయెన్సర్ అంటూ హల్చల్ చేసే ఆ పాత్ర ఎక్కువగా రిలేట్ అవుతుంది. శరణ్య, దేవ దర్శిని పాత్రలు ట్రెండి మామ్స్ అన్నట్టుగా సాగుతాయి. మధుమిత, శివ, శ్రీనివాస్, ఆకాష్ ఇలా అన్ని పాత్రలు బాగానే కుదిరాయి. -
అనుపమ 'పరదా' సినిమా రివ్యూ
'రివ్యూలు నచ్చితేనే మా సినిమా చూడండి'.. రీసెంట్గా ప్రమోషన్లలో హీరోయిన్ అనుపమ చెప్పిన మాట ఇది. చాలా నమ్మకంతో ఆగస్టు 22న రిలీజ్ పెట్టుకుని, రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. ఆ చిత్రమే 'పరదా'. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తీసిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించింది. సంగీత, మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?పడతి అనే గ్రామంలో ఈడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల ముఖానికి పరదా కప్పుకొని తిరుగుతుంటుంది. దానికి ఓ కారణం ఉంటుంది. పొరపాటున ఎవరైనా పరదా తీస్తే వాళ్లు.. గ్రామదేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదే ఊరిలో ఉండే సుబ్బు(అనుపమ), రాజేశ్ (రాగ్ మయూర్) ప్రేమలో ఉంటారు. వీళ్లకీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. సరిగ్గా నిశ్చితార్థం రోజున సుబ్బు ఫొటో కారణంగా.. ఈమె ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. తన తప్పు లేదని చెబుతున్నా సరే వినరు. దీంతో అనుకోని పరిస్థితుల మధ్య సుబ్బు తన ఊరి దాటి ధర్మశాల వెళ్లాల్సి వస్తుంది. ఈమెకు తోడుగా రత్న(సంగీత), అమిష్ట(దర్శన రాజేంద్రన్) కూడా వెళ్తారు. ఇంతకీ ధర్మశాల ఎందుకు వెళ్లారు? చివరకు సుబ్బు.. పరదా తీసిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?గత కొన్నాళ్లలో హీరో సెంట్రిక్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కాస్త తగ్గాయని చెప్పొచ్చు. ఆ లోటుని భర్తీ చేసేందుకు వచ్చిన చిత్రమే 'పరదా'. ఇందులో హీరోహీరోయిన్లు అంటూ ఎవరూ ఉండరు. కథే మెయిన్ హీరో.పడతి గ్రామంలో జ్వాలమ్మ జాతరతో సినిమా మొదలవుతుంది. ఈ ఊరిలోని ఈడొచ్చిన అమ్మాయిలు, మహిళలు ఎందుకు పరదా కప్పుకోవాల్సి వచ్చిందనేది మొదటి పది నిమిషాల్లోనే తోలుబొమ్మలాట కథతో చెప్పేస్తారు. తర్వాత సుబ్బు, రాజేశ్ ప్రేమ.. నిశ్చితార్థం.. అనుకోని అవాంతరం వల్ల అది ఆగిపోవడం.. ఇలా కథలో సంఘర్షణ ఏర్పడుతుంది. తన తప్పు లేదని చెబుతున్నా సరే సుబ్బుని ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు ఆదేశించడం.. తర్వాత అనుకోని పరిస్థితుల్లో సుబ్బు.. మరో ఇద్దరు మహిళలతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వెళ్లాల్సి రావడం జరుగుతుంది. తర్వాత ఏమైంది? ఈ ప్రయాణంలో ఏం తెలుసుకున్నారనేది తెలియాలంటే మూవీ చూడాలి.ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిల్లో చైతన్యం పెరిగింది. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా భిన్న రంగాల్లో రాణిస్తున్నారు. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాల పేరుతో మహిళలని ఇబ్బంది పెడుతున్నారు. ఆచారం, సంప్రదాయం అని చెప్పి బయట ప్రపంచం చూడనీయకుండా చేస్తున్నారు. అలాంటి ఓ ఊరికి చెందిన అమ్మాయి.. తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఎలాంటి సాహసం చేసింది? మూఢనమ్మకాలపై ఎలా పోరాడింది అనే కల్పిత కథతో తీసిన చిత్రమే ఇది.సినిమా ప్రారంభంలో జెయింట్ వీల్ ఎక్కడానికే సుబ్బు చాలా భయపడుతుంది. కానీ పరిస్థితుల కారణంగా ఎత్తయిన ఎవరెస్ట్ వరకు వెళ్తుంది. తనలో భయాన్ని పోగొట్టుకుంటుంది. మూవీ అంతా సుబ్బు పాత్ర పరదా కప్పుకొని ఉంటుంది. ఆమె పూర్తిగా పరదా తీసేసే సీన్లో సీతాకోక చిలుక రిఫరెన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సుబ్బుతో పాటు జర్నీ చేసే రత్న ఓ గృహిణి, ఆమిష్ట ఓ ఇంజినీర్. ఈ పాత్రల్ని ప్రారంభించిన తీరు, ముగించిన తీరు కూడా మెచ్చుకునేలా ఉంటుంది. సెకండాఫ్ మొదలవగానే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వస్తుంది. ఉన్నది కాసేపే అయినా.. ఆయన చెప్పే ఓ స్టోరీ, డైలాగ్స్ మంచి ఎమోషనల్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో సుబ్బు పాత్ర.. దేవుడికి కట్టిన వస్త్రాల్ని తగలబెట్టే సీన్, ఊరి ప్రజల కళ్లు తెరిపించింది అనేలా విజువల్‌గా చూపించడం బాగుంది.అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. సినిమా అంతా కూడా మహిళలు, వారి చైతన్యం అనేలా సాగుతుంది. రెగ్యులర్ ప్రేక్షకులందరికీ ఇది నచ్చకపోవచ్చు. కానీ అమ్మాయిలు మాత్రం తప్పకుండా ఈ మూవీ చూడాలి. చూస్తున్నంతసేపు కచ్చితంగా ఎమోషనల్ అవుతారు.ఎవరెలా చేశారు?సుబ్బు పాత్రలో అనుపమ అద్భుతంగా నటించింది. ఈ పాత్ర ప్రారంభంలో బిడియం, భయం, ప్రేమ లాంటి అంశాలతో చలాకీగా కనిపిస్తుంది. తర్వాత సీరియస్ టోన్‌లోకి మారుతుంది. చివరకొచ్చేసరికి ఫియర్లెస్ ఉమన్‌గా మారడం లాంటి మార్పు కిక్ ఇస్తుంది. రత్నగా చేసిన సంగీత క్యారెక్టర్ కూడా చాలామంది గృహిణులకు కనెక్ట్ అవుతుంది. ఓ సీన్లో ఈమె తన భర్త క్యారెక్టర్‌తో చేసే కామెడీ భలే నవ్విస్తుంది. పెళ్లి, పిల్లలు వద్దు అంటూ ఇండిపెండెంట్‌గా ఉండే మహిళలకు దర్శన రాజేంద్రన్ చేసిన అమిష్టా క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. లీడ్ రోల్స్ చేసిన ఈ ముగ్గురు కూడా బాగా చేశారు. రాగ్ మయూర్, 'బలగం' సుధాకర్ రెడ్డి.. ఇలా మిగిలిన వాళ్లు కూడా తమ వంతు న్యాయం చేశారు.టెక్నికల్ టీమ్ కూడా సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ కాస్త లౌడ్‌గా అనిపించింది కానీ మిగతా చోట్ల సెట్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గురించి చెప్పుకోవాలి. గతంలో సినిమా బండి, శుభం అని సినిమాలు తీశాడు. అవి మోస్తరుగా అనిపించాయి కానీ ఈ మూవీతో తనలో చాలానే విషయం ఉందని నిరూపించాడు. ఫిమేల్ సెంట్రిక్ తరహా సినిమాలంటే ఇష్టముంటే మాత్రం 'పరదా' మిస్ కావొద్దు.- చందు డొంకాన -
తండ్రి వేదన... తనయుడి ఆవేదన
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సర్ జమీన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనవాడు అనేవాడు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు. పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకుని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే... అదే ‘సర్ జమీన్’ సినిమా. ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. దర్శకుడు కాయోజీ ఇరానీ తెరకెక్కించిన ఈ సినిమాలో ముఖ్యపాత్రధారులుగా మలయాళ నటుడు పృథ్వీరాజ్, బాలీవుడ్ నటి కాజోల్, నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ నటించారు. నాలుగు ముఖ్యపాత్రలు, రెండున్నర గంటల నిడివితో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపథ్యంలో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించారు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓసారి చూద్దాం. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. అతనికి హర్మన్ అనే కొడుకుంటాడు. దేశమా,ప్రాణమా అంటే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం విజయ్. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. పైగా తను భయస్తుడు కూడా. ఓసారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్‌ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని... లేదంటే నీ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్‌ని హెచ్చరిస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, అతని భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కానీ తీవ్రవాదులు హర్మన్‌కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్‌ని తీవ్రవాదిగా తయారు చేసి, మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్, అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా? లేదా అన్నదే సినిమా. దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా? అన్నది హాట్ స్టార్‌లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్. మస్ట్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ రివ్యూ.. వివాదాల సినిమా ఎలా ఉందంటే?
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి (Suresh Gopi), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala).. కోర్ట్‌రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించారు. అయితే, టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీతాదేవి మరో పేరు జానకి కావడం.. ఈ మూవీలో దాడికి గురైన మహిళా పాత్రకు ఆ పేరు పెట్టడంతో సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో టైటిల్లో చిన్న మార్పు చేసి (‘వి’ యాడ్ చేశారు) (Janaki v vs State of Kerala) కేవలం మలయాళంలో మాత్రమే జులైలో విడుదల చేశారు. అయితే, తాజాగా 'జీ 5'లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగులో త్వరలో విడుదల కావచ్చు. అయితే, సబ్‌టైటిల్స్‌తో చూసే ఛాన్స్ ఉంది.థ్రిల్లర్ కథాంశంతో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ రూపొందింది. న్యాయం కోసం పోరాడే యువతి కథే ఈ చిత్రం. జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ.. పండగ కోసం కేరళలోని తన సొంత ఊరికి వస్తుంది. అయితే, అక్కడ ఆమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. కానీ, నిందితుల తరఫున డేవిడ్ అనే ప్రముఖ లాయర్ (సురేశ్ గోపి) వాదిస్తాడు. దీంతో కేసు ఓడిపోవడం, తండ్రిని కోల్పోవడం, గర్భం దాల్చడం వంటి సంఘటనలు ఆమె జీవితాన్ని కుదిపేస్తాయి. జానకి ప్రభుత్వాన్ని తన బిడ్డను చూసుకోవాలని కోరుతుంది. దీనిపై కేరళ హైకోర్టు ఎలా స్పందించింది..? అనే అంశం కథలో కీలకం. ఒక కానిస్టేబుల్ సహాయంతో కేసు తిరిగి ఓపెన్ చేయడంతో కథ కొత్త మలుపులు తిరుగుతుంది. జానకి చేసిన న్యాయ పోరాటంలో ఫైనల్‌గా ఎవరు గెలిచారు..? నిందితుల పక్షాన సురేశ్ గోపి ఎందుకు వాదించాల్సి వచ్చింది. జానకికి జన్మించిన బిడ్డ బాధ్యతను చివరగా ఎవరు తీసుకుంటారు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఈ చిత్రం న్యాయ వ్యవస్థ, మహిళల హక్కులు, సామాజిక బాధ్యతలపై ప్రశ్నలు వేస్తూ.. భావోద్వేగంగా సాగుతుంది. మీరు లీగల్ డ్రామా సినిమాలు ఇష్టపడితే, ఇది తప్పక చూడవచ్చు. కథలో చెప్పిన అంశం చిన్నదైనా సరే చాలామందిని ఆలోచింపచేస్తుంది. అయితే, ఇలాంటి కథలు వెండితెరపై చాలానే కనిపించాయి. కానీ, ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించిన ఈ చిత్రం కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎక్కువ సమయం సాగదీశారనిపిస్తుంది. ఇలాంటి కథలకు కోర్టు రూమ్ ఎపిసోడ్స్ చాలా బలంగా ఉండాలి. కానీ, చాలా పేలవంగా దర్శకుడు చూపించాడు. అడ్వకేట్‌గా సురేశ్ గోపి వంటి స్టార్ నటుడు ఉన్నప్పటికీ బలమైన డైలాగ్స్ చెప్పించలేకపోయాడు.జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ స్టోరీ ప్రారంభం నుంచే నెమ్మదిగా సాగుతుంది. జానకి విద్యాధరన్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చాలా బాగా నటించింది. అయితే, ఆమె పాత్రను ఇంకా బలంగా చూపించాల్సి ఉంది. మరోవైపు జానకి కేసులో నిందితుల తరఫున వాదించేందుకు డేవిడ్ (సురేశ్ గోపి) ముందుకు రావడంతో కథలో కాస్త స్పీడ్ అందుకుంటుంది. అక్కడక్కడ జానకిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలతో ఆయన విసిగించినా ప్రేక్షకులకు నచ్చుతుంది. గర్భం దాల్చకుండానే ఆమె ఇలాంటి నేరం జరిగిందని ఆరోపణలు చేస్తుందా అనే ఫీల్ కలిగించేలా కొన్ని సీన్లు ఉంటాయి. అవి బాగానే కనెక్ట్ అవుతాయి. డేవిడ్ వంటి లాయర్ ఎంట్రీ ఇవ్వడంతో జానకి కేసును కోర్టు కొట్టివేస్తుంది. అయితే, ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలౌతుంది. తండ్రిని కోల్పోయి ఆపై లైంగికి దాడికి గురై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు సాయంగా కానిస్టేబుల్ ఫిరోజ్ (అస్కర్ అలీ) ఎంట్రీ ఇస్తాడు. అతను చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠను రేకిత్తిస్తుంది. ఆ సమయంలో కేసును వాదించేందుకు డేవిడ్ కూతురు అడ్వకేట్ నివేదిత (శృతి రామచంద్రన్) రంగంలోకి దిగుతుంది. ఫైనల్‌గా కోర్టు రూమ్ డ్రామాలో జానకికి ఎలాంటి న్యాయం జరిగింది అనేది పెద్దగా ఉత్కంఠత లేకుండానే దర్శకుడు కథ ముగిస్తాడు. కానీ, కోర్టు డ్రామా సినిమాలు చూసేవారికి తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుంది. జీ5లో అందుబాటులో ఉంది. అయితే, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. త్వరలో తెలుగులో కూడా విడుదల కావచ్చు. వీకెండ్లో కుటుంబంతో కలిసి చూసేయండి. ఎలాంటి అశ్లీలత లేదు. -
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'కూలీ' హడావుడే. సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబో కావడం.. తొలిసారి కింగ్ నాగార్జున విలన్‌గా చేయడం.. దానికి తోడు అనిరుధ్ పాటలు వైరల్ కావడం.. ఇలా ఎక్కడలేని హైప్ అంతా ఈ మూవీపై ఏర్పడింది. అలా భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి అభిమానులు ఆశపడ్డట్లు రజినీకాంత్ హిట్ కొట్టారా? ఇంతకీ 'కూలీ' ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటి?వైజాగ్ పోర్ట్‌లో కింగ్‌పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్‌గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్‌పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?కూలీ ట్రైలర్ రిలీజ్ కాగానే.. చాలామంది చాలారకాలుగా అంచనా వేశారు. ఇదేదో ట్రైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అని మాట్లాడుకున్నారు. అలానే లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌కి కనెక్షన్ కచ్చితంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఇది ఫక్తు రివేంజ్ కమర్షియల్ డ్రామా. ఎల్సీయూతో ఎలాంటి లింక్ లేదు. సింపుల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే తన ఫ్రెండ్‌ని ఎవరో చంపేస్తారు. ఆ విషయం తెలుసుకున్న హీరో.. ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఇంతకీ చంపింది ఎవరు అనేదే స్టోరీ.వైజాగ్ పోర్ట్ ఏరియా, అక్కడ సైమన్ స్మగ్లింగ్ సామ్రాజ్యం, దాన్ని చూసుకునే దయాల్.. ఇలా కాస్త ఇంట్రెస్టింగ్‌గానే సినిమా మొదలైంది. కట్ చేస్తే దేవాగా రజినీకాంత్ ఎంట్రీ. వెంటనే ఓ పాట. కాసేపటికే తన ఫ్రెండ్ రాజశేఖర్ చనిపోయాడనే వార్త.. ఇది తెలిసి అతడి ఇంటికి దేవా వెళ్లడం, అక్కడేమో రాజశేఖర్ కూతురు ప్రీతి.. కాసేపటికి సైమన్ ఎంట్రీ.. అలా ఒక్కో పాత్ర పరిచయం చేస్తూ వెళ్లారు. తన ఫ్రెండ్‌ని చంపింది ఎవరో తెలుసుకునే క్రమంలో హీరో.. విలన్ గ్యాంగ్‌లో చేరడం, తాను వెతుకుతున్న హంతకుడు ఎవరో తెలియడం లాంటి అంశాలతో తొలి భాగం ముగుస్తుంది. దేవా మ్యాన్షన్లోనే హీరో చేసే ఓ ఫైట్ తప్పితే ఫస్టాప్ అంతా డ్రామానే ఉంటుంది. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఇంటర్వెల్లో ఫైట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇందులో కాస్త డిఫరెంట్.తొలి సగంలో ఎక్కువగా డ్రామానే ఉంది కదా కనీసం సెకండాఫ్‌లో అయినా యాక్షన్ ఉంటుందా అనుకుంటే అక్కడ కూడా అదే డ్రామాని నడిపించారు. సినిమాలో స్టార్స్ ఎక్కువమంది అయ్యేసరికి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే ప్రయత్నంలో సినిమా మొత్తం కలగాపులగం అయిపోయింది. దయాల్ పాత్రలో ట్విస్టులు బాగున్నాయి. సైమన్ దగ్గర పనిచేస్తూ, అతడి కొడుకుని ప్రేమించే అమ్మాయి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ పాత్రలో ట్విస్టులు కూడా బాగున్నాయి. మూవీలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువైపోవడంతో చాలా సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో దాహా అనే పాత్రలో ఆమిర్ ఖాన్ ఎంట్రీ పెద్దగా ఇంపాక్ట్ చూపించిందా అంటే లేదు.ఎవరెలా చేశారు?రజినీకాంత్ ఎప్పటిలానే తన స్వాగ్, స్టైల్‌తో ఆకట్టుకున్నారు. విలనిజం చేసిన నాగార్జున.. కాస్త కొత్తగా కనిపించారు. ఆయన పాత్ర డిజైన్ బాగానే ఉంది గానీ ఏదో అసంతృప్తిగా అనిపించింది. సత్యరాజ్, ఉపేంద్ర ఉన్నారంటే ఉన్నారు అంతే. పెద్దగా స్కోప్ దొరకలేదు. శ్రుతి హాసన్ కూడా ఇచ్చినంతవరకు న్యాయం చేసింది. దయాల్‌గా చేసిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. మెస్మరైజ్ చేశాడు. కల్యాణిగా చేసిన కన్నడ నటి రక్షిత రామ్ కూడా చిన్న రోల్ అయినా బాగుంది. ఆమిర్ ఖాన్ పాత్ర కూడా తేలిపోయింది.సినిమాలో కథ పరంగా పెద్దగా మెరుపులు, హై మూమెంట్స్ లేనప్పటికీ టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంది. రిచ్ విజువల్స్, స్టార్ వాల్యూ ఉన్నంతలో కాస్త రిలీఫ్. అనిరుధ్ గురించి చెప్పుకోవాలి. చాలా సాధారణమైన సన్నివేశాల్ని కూడా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఎలివేట్ చేశాడు. కొన్నిచోట్ల బాగానే వర్కౌట్ అయ్యాయి. సినిమా అంతా చూసిన తర్వాత ఇది తీసింది లోకేశ్ కనగరాజేనా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు చాలానే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ అంచనాల్ని అందుకోవడం ఆమాడ దూరంలో ఆగిపోయాడు. నిర్మాణ విలువలు టాప్ నాచ్ ఉన్నాయి కానీ కథలో బలం లేకపోతే ఏం లాభం. ఓవరాల్‌గా చెప్పుకుంటే సోషల్ మీడియాలో ఉన్న హైప్‌కి.. 'కూలీ' సినిమాలో స్టోరీకి ఏ మాత్రం సంబంధం లేదు.- చందు డొంకాన -
‘వార్ 2 ’మూవీ రివ్యూ
టైటిల్ : వార్ 2నటీనటులు: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులునిర్మాణ సంస్థ: యశ్‌రాజ్ ఫిల్మ్స్‌నిర్మాత : ఆదిత్యా చోప్రాదర్శకత్వం: అయాన్ ముఖర్జీసంగీతం: ప్రీతమ్(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్)సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్విడుదల తేది: ఆగస్ట్ 14, 2025బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్ ఫిలిం వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.వార్ 2 కథేంటంటే..కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్‌పై పడుతుంది. భారత్‌ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్‌లో చేరాలంటే.. తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, కల్నల్ సునీల్ లూథ్రా(అశుతోష్ రాణా)ని చంపాలని కబీర్‌కు టాస్క్ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్‌ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్ (అనిల్ కపూర్) ఓ స్పెషల్ టీమ్‌ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్ రావు సారంగ్ సూచనతో స్పెషల్ టీమ్‌కి మేజర్ విక్రమ్ చలపతి(ఎన్టీఆర్)ని లీడర్‌గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్ లూథ్రాని చంపిన కబీర్‌పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్ టీమ్‌లో చేరుతుంది. విక్రమ్ టీమ్ కబీర్‌ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్‌కి, కబీర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే కళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్‌కి వస్తాడు. వార్ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్.. హృతిక్‌కి ఒక టాస్క్ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్ సునీల్ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్‌గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్‌తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కబీర్‌ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ ఛేజింగ్ సీన్, మెట్రో ట్రైన్‌పై వచ్చే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కు ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. స్పై యాక్షన్ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్ ప్రారంభంలో హృతిక్, ఎన్టీఆర్‌పై వచ్చే ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్‌కు ఆల్రేడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్‌కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ. మేజర్ విక్రమ్‌గా అద్భుతంగా నటించాడు. యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్‌తో పోటీ పడి యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్, హృతిక్‌ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్ సునీల్ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్‌స్పేస్ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్‌తో వచ్చే యాక్షన్ సీన్లో కియారా అదరగొట్టేసింది. అనిల్ కపూర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే..? పరంతు పో మూవీ చూడాల్సిందే!
టైటిల్: పరంతు పో..నటీనటులు: శివ, గ్రేస్ ఆంటోని,, మిథుల్ అంజలి తదితరులుడైరెక్టర్: రాముఓటీటీ: జియో హాట్స్టార్ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ బాగున్న సినిమాలను ఓటీటీ ప్రియులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు థియేటర్లలో అంతగా రాణించలేకపోయినా.. ఓటీటీకి వచ్చేసరికి దూసుకెళ్తున్నాయి. అలాంటి మరో సందేశాత్మక చిత్రమే పరంతు పో. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..గోకుల్ (శివ), గ్లోరీ ( గ్రేస్ ఆంటోనీ) లవ్ మ్యారేజ్ చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ఓ కుమారుడు జన్మిస్తాడు. వాడి పేరు అన్బుల్(మిథుల్). అసలే ప్రేమ పెళ్లి కావడంతో వీరికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి మద్దతు లభించదు. ఫ్యామిలీ నడవాలంటే భార్యాభర్తలిద్దరూ తప్పక పని చేయాల్సిన పరిస్థితి. వీళ్లది మిడిల్ క్లాస్ కావడంతో జీవనం సాగించేందుకు చిన్నపాటి బిజినెస్ చేస్తుంటారు. గ్లోరీ బట్టల షాపు రన్ చేస్తుండగా.. గోకుల్ సైతం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉంటారు. ఇద్దరు కూడా బిజీగా ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ పిల్లాడిపై పడుతుంది. దీంతో అన్బుల్ ఒక్కడే ఇంట్లో ఉంటూ టీవీకి పరిమితమైపోతాడు. ఒకసారి సడన్‌గా గ్లోరీ బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్తుంది. అప్పుడు పిల్లాడి బాధ్యత తండ్రి గోకుల్ మీదే పడుతుంది. ఇంట్లో కొడుకు అల్లరిని తట్టుకోలేక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు గోకుల్. ఇంతకీ వాళ్ల ట్రిప్ సజావుగా సాగిందా? ఇంట్లో ఉన్నప్పుడు టీవీ తప్ప మరో ప్రపంచం తెలియని అన్బుల్ ఆ తర్వాత ఎలా మారిపోయాడన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువ జంటలు చేస్తున్న పొరపాటునే డైరెక్టర్ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పెళ్లి తర్వాత జీవనోపాధి కోసం నగరాలకు వచ్చి చేరుతున్న యువ జంటలు.. పనిలో పడి పిల్లలను పట్టించుకోవడం మానేశారు. నగరాల్లో దాదాపు అందరివీ ఒంటరి జీవితాలే. ఎందుకంటే ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఎవరి పనిలో వాళ్లుండి ఫుల్ బిజీగా లైఫ్‌ను సాగదీస్తుంటారు. పిల్లలకు టైమ్ కేటాయించడమనేది చాలా అరుదు.స్కూల్‌కు వెళ్లి వచ్చిన పిల్లాడు.. ఇంట్లో ఎవరు లేకపోతే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పాయింట్‌నే ప్రధానంగా చూపిస్తూ కథ రాసుకున్నారు. ఈ జనరేషన్ పిల్లలపై ఆ ప్రభావం ఏంటనేది పరతు పోలో చక్కగా చూపించారు. ఈ కథ మొత్తం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ కథ ప్రారంభంలో గ్లోరీ, గోకుల్ బిజినెస్‌తో బిజీగా ఉండడం చూపించారు. గ్లోరీ తన బట్టల షాప్ బిజినెస్‌లో పడి పిల్లాడితో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. దీంతో పిల్లాడి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. స్కూల్‌కి వెళ్లి రావడం, టీవీకి అతుక్కుపోవడం అదే అతని దినచర్యగా మారుతుంది. అలా ఫస్టాఫ్‌లో వారి బిజీ లైఫ్, పిల్లాడి చుట్టూ కథ తిరుగుతుంది. గ్లోరీ తన బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్లడంతో ఇంట్లో పిల్లాడిని కంట్రోల్ చేయలేక తండ్రి గోకుల్ రోడ్ ట్రిప్ కోసం బయలుదేరతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు కామెడీతో పాటు కొత్త లైఫ్ స్టైల్‌ను పరిచయం చేసే సన్నివేశాలు అంతా రోటీన్‌గానే ఉంటాయి. తండ్రీ, కుమారుల మధ్య వచ్చే సంభాషణలు ఫుల్ కామెడీగా అనిపిస్తాయి.అయితే ఈ రోడ్ ట్రిప్ మధ్యలో ఎప్పుడో ఐదో క్లాస్ చదివిన అంజలి.. గోకుల్‌ను చూసి వెంటనే గుర్తు పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, స్కూల్ లవ్ స్టోరీ చాలా ఫన్నీగా చూపించాడు డైరెక్టర్. ఎప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండే అన్బుల్కు ట్రిప్‌లో కొత్త దోస్తులు పరిచయమవుతారు. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ.. కొత్త ఫ్రెండ్స్ తోడు కావడంతో అన్బుల్లో ఊహించని మార్పు రావడాన్ని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ట్రిప్ మధ్యలో అన్బుల్ తల్లి గ్లోరీ ఫోన్ చేసి కొడుకు గురించి ఆరా తీయడం, భార్య, భర్తల మధ్య సంభాషణలతో కామెడీ పండించారు డైరెక్టర్. ఈ కథలో సందేశం ఇస్తూనే ఎంటర్‌టైనింగ్‌తో పాటు పల్లె జీవితాన్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. కథనం నెమ్మదిగా సాగినాప్పటికీ.. క్లైమాక్స్ చివరి పదిహేను నిమిషాలు పరుగులు పెట్టించిన తీరు ఆకట్టుకుంది. ఓవరాల్‌గా నేటి జనరేషన్ జాబ్, బిజినెస్ అంటూ పిల్లల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని తెరపై కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించాడు. ఈ మూవీ చూసిన తర్వాతనైనా తల్లిదండ్రుల్లో కాస్త మార్పు రావాలని ఆశిద్దాం.నటీనటుల విషయానికొస్తే శివ, గ్రేస్ ఆంటోనీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చిన్న పిల్లాడు మిథుల్ తన పాత్రలో అదరగొట్టేశాడు. అంజలి పాత్ర కొద్దిసేపే కనిపించినా తన నటనతో ఆకట్టుకుంది. సాంకేతికత పరంగా ఫర్వాలేదనిపించేలా ఉంది. లోకేషన్స్, కొండ ప్రాంతాల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు నేచురల్ ఫీలింగ్ కలుగుతుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. -
'అరేబియా కడలి' తెలుగు సిరీస్ రివ్యూ
ఈ మధ్యే వచ్చిన 'కింగ్డమ్' సినిమాతో నటుడిగా మరోసారి ఆకట్టుకున్న సత్యదేవ్.. ఓ తెలుగు వెబ్ సిరీస్ చేశాడు. అదే 'అరేబియా కడలి'. ఆనంది హీరోయిన్. ప్రముఖ దర్శకుడు క్రిష్.. షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో రిలీజైన 'తండేల్' సినిమాతో ఈ సిరీస్‌ని పోల్చి చూస్తున్నారు. మరి రెండు ఒకే కథతో తీశారా? ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విశాఖ భీమిలిపట్నంలో మత్స్యవాడ, చేపలవాడ గ్రామాల ప్రజలు చాన్నాళ్లుగా గొడవపడుతుంటారు. జెట్టీలు లేకపోవడంతో చేపల వేటకు సరైన సదుపాయాలు ఉండవు. దీంతో బతుకు దెరువు కోసం గుజరాత్ వలస వెళ్తుంటారు. చేపలవాడ గ్రామానికి చెందిన బద్రి(సత్యదేవ్).. మత్స్యవాడకు చెందిన గంగని ప్రేమిస్తుంటాడు. మరోవైపు గుజరాత్ వెళ్లిన బద్రి.. తన బృందంతో కలిసి అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్తాడు. దీంతో ఆ దేశ ఆర్మీ.. వీళ్లని బంధిస్తుంది. మరి బద్రితో పాటు ఉన్నవాళ్లని తీసుకొచ్చేందుకు ఊరి ప్రజలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సిరీస్ చూస్తున్నంతసేపు నాగచైతన్య 'తండేల్' సినిమానే గుర్తొస్తుంది. ఆల్రెడీ తెలిసిన కథ అయినప్పటికీ.. బాగానే తీశారు. చూస్తున్నంతసేపు ఎంగేజ్ అయ్యేలా చేశారు. కాకపోతే సినిమా రెండు-రెండున్నర గంటల్లోనే చెప్పేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్ని అందులో సింపుల్‌గా చూపించేశారు. కానీ ఇది వెబ్ సిరీస్ కావడంతో చాలా డీటైల్డ్‌గా చూపించారు. అసలేం జరిగింది? జాలర్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది విడమరిచి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ప్రతి ఎమోషన్ని చూపించారు.మొదట్లో చేపలవాడ, మత్స్యవాడ గ్రామాల మధ్య గొడవలు.. తర్వాత వేటకు వెళ్లడం, బద్రి-గంగ మధ్య లవ్ స్టోరీ. జాలర్ల కుటుంబాల్లోని బాధలు చూపిస్తూ కథని నిదానంగా తీసుకెళ్లారు. సహజత్వానికి దగ్గరగా సీన్లు చూపించారు. సముద్రంలోని జరిగే సన్నివేశాలు ఆసక్తి రేపుతూనే, ఉత్కంఠగానూ అనిపించాయి. పాక్ పోలీసులకు దొరికిపోయి అక్కడి జైల్లో మన జాలర్లు పడే ఇబ్బందులు ఎమోషనల్ అయ్యేలా చేశాయి.'తండేల్'ని ప్రేమకథగా తీస్తే.. ఈ సిరీస్‌ని మాత్రం కాస్త డిఫరెంట్ యాంగిల్లో చూపించారు. ప్రేమించినవాడితో కలిసి ఊరికి మంచి చేయాలనుకోవడం, జెట్టీ వస్తే తమ ఊరిప్రజలు వలస వెళ్లాల్సిన అవసరం లేదని హీరో భావించడం.. ఇలా హీరోహీరోయిన్లకు ఓ కారణాన్ని చూపించడం.. సినిమాని ఈ సిరీస్‌ని వేరు చేసి చూపించిందని చెప్పొచ్చు.ఎవరెలా చేశారు?స్వతహాగా సత్యదేవ్ ఉత్తరాంధ్రకు చెందినవాడు కావడంతో బద్రి పాత్రలో విశాఖ యాసలో ఆకట్టుకున్నాడు. గంగ రోల్ చేసిన ఆనంది కూడా పూర్తి న్యాయం చేసింది. 'కోర్ట్' ఫేమ్ రోషన్, చింతకింది శ్రీనివాసరావు, నాజర్ తదితరులు తమ పాత్రల ఫరిది మేరకు నటించారు. ఇది సిరీస్ కావడంతో కమర్షియల్ హంగులు లేకుండానే తెరకెక్కించారు. స్టోరీ పరంగా కొత్తగా ఆశిస్తే మాత్రం అసంతృప్తికి గురయ్యే అవకాశముంది. టెక్నికల్ అంశాలు కూడా బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ సిరీస్ నచ్చేయొచ్చు. -
‘బకాసుర రెస్టారెంట్’ మూవీ రివ్యూ
వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రవీణ్. ఆయన తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. ఎస్జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటించాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తిసేస్తుంది. ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్(ప్రవీణ్) గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక కామెడీ హారర్ చిత్రం. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో దెయ్యాన్ని తిండిబోతుగా చూపించడం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సాధారణగా కామెడీ హారర్ చిత్రాల్లో ఒక ఆత్మ ఉండడం..దానికో ఎమోషల్ ప్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్‌లో దాని కోరిక నెరవేర్చడం.. ఇదే కథ. ఈ చిత్రంలో కూడా అవన్నీ ఉంటాయి. తాంత్రిక పూజకు సంబంధించిన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. హీరో పరిచయ సన్నివేశంతోనే అసలు కథ ప్రారంభం అవుతుంది. డబ్బుల కోసం యూట్యూబ్ వీడియోలు చేయాలనుకోవడం..గోస్ట్హౌస్కి వెళ్లడం..అక్కడ జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే ప్రతిసారి ఆ తరహా కామెడీనే చూపించడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. అంజిబాబు పాత్ర ఎంట్రీ, అతనిలోకి బకాసుర ఆత్మ వెళ్లిన తర్వాత మళ్లీ కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశారు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. బక్క సూరి ప్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఆత్మను అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించే సన్నివేశాలు అలరిస్తాయి. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే అల్లరి దెయ్యాలు కామెడీ ట్రాక్ వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్‌ని కాస్త ఎమోషనల్‌గా మలిచే ప్రయత్నం చేశారు. రొటీన్ కామెడీ హారర్ కథే అయినా... తిండిబోతు దెయ్యం మాత్రం కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు కమెడియన్‌గా అలరించిన ప్రవీణ్.. ఇందులో హీరోగా నటించి సినిమా భారం మొత్తం తన భుజాన వేసుకున్నాడు. తన బలమైన కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించాడు. వైవా హర్ష తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే యాక్ట్ చేశాడు. అంజిబాబు పాత్రకి ఫణి న్యాయం చేశాడు. ప్రవీణ్ స్నేహితులుగా నటించిన కుర్రాళ్ల కామెడీ టైమింగ్ బాగుంది. చాలా రోజుల తర్వాత కృష్ణ భగవాన్ వెండితెరపై మెరిశాడు. ఓ హోటల్ యజమానిగా కనిపించిన ఆయన.. తనదైన పంచ్ డైలాగులతో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?
రీసెంట్గా కన్నడలో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా 'సు ఫ్రమ్ సో'(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం). రూ.4 కోట్లు పెడితే రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ ఇప్పుడు అదే పేరుతో విడుదల చేశారు. తాజాగా (ఆగస్టు 08న) థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ ఎలా ఉంది? అంతలా నవ్వించిందా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒక్క ముక్కలో చెప్పాలంటే 'సు ఫ్రమ్ సో' చాలా సింపుల్ స్టోరీ. ఓ పల్లెటూరిలో ఉండే కుర్రాడికి దెయ్యం పడుతుంది. దాన్ని వదిలించేందుకు ఊరంతా చేసే ప్రయత్నమే కథ. వినడానికి చాలా సింపుల్‌గా ఉంది కదా! కానీ రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా నవ్వించారు. మూవీ ప్రారంభంలోనే ఊరు, ఊరి జనాల స్వభావాలని పరిచయం చేసి అసలు కథలోకి తొందరగానే తీసుకెళ్లిపోయారు.నిజానికి సినిమాలో దెయ్యం అనేది అబద్ధం అనే సంగతి చూస్తున్న ప్రేక్షకుడికి ముందే చూపించేస్తారు. కానీ అది ఉందేమోనని భ్రమపడుతూ, ఊరి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే మనం చాలానే ఎంజాయ్ చేస్తాం. అంతలా కథ ఎంగేజ్ చేస్తుంది. సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యం ఎవరు? ఎందుకు ఆత్మలా మారింది లాంటి విషయాల్ని చివరలో రివీల్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అలా చేయలేదు. అది ఓ రకంగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.అశోక్ ఓ అమ్మాయికి సైట్ కొడుతుంటాడు. కానీ ఓ సందర్భంలో చేయరాని తప్పు చేస్తాడు. ఈ క్రమంలోనే ఊరిలో వాళ్లకు దొరికిపోతానేమో అని భయపడి, ఆ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు దెయ్యం నాటకం ఆడతాడు. కానీ ఈ ప్లాన్ బెడిసికొట్టి, వ్యవహారం మొత్తం ఎక్కడికో వెళ్లిపోతుంది. అక్కడి నుంచి ఎలాంటి టర్న్స్, ట్విస్టులు చోటుచేసుకున్నాయనేది మిగతా స్టోరీ.సినిమా ప్రారంభం నుంచే కామెడీతో కడుపుబ్బా నవ్విస్తారు. సెకండాఫ్‌కి వచ్చేసరికి ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ప్రస్తుత సమాజంలో ఒంటరి మహిళలు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారనే సీరియస్ విషయాన్ని చూపిస్తారు. అలా నవ్విస్తూ, ఎమోషనల్ చేస్తూ, ఆలోచింపజేస్తూ ముగిస్తారు. చివరగా ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిస్తారు. కాకపోతే తీసుకున్న పాయింట్ చాలా చిన్నది. స్టోరీ అక్కడక్కడే తిరుగుతుంటుంది కాబట్టి కాస్త బోరింగ్గానూ అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?ఈ సినిమాలో నటించిన ఒక్కరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కాదు. కానీ సినిమాలో ఒక్కసారి ఇన్వాల్వ్ అయిపోతే ఆ విషయమే మర్చిపోతాం. మనం కూడా ఆ ఊరిలో ఉన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. అంతా సహజంగా నటించారు. అశోక్ అనే పాత్రలో నటించిన జేపీ తుమినాడ్.. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా. సింపుల్ పాయింట్ తీసుకుని తనదైన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. పాత్రల డిజైనింగ్ బాగుంది.ముఖ్యంగా డ్రింకర్ బావ అని ఓ పాత్ర చాలా హిలేరియస్‌గా ఉంటుంది. అతడు కనిపించినప్పుడల్లా.. 'వచ్చాడు వచ్చాడు బావ వచ్చాడు' అని పాట ప్లే అవుతూ ఉంటుంది. భలే కామెడీగా అనిపిస్తుంది. టెక్నికల్‌గానూ ఈ సినిమా బాగుంది. థియేటర్‌కి వెళ్లి సరదా నవ్వుకోవాలి అంటే కచ్చితంగా ఈ సినిమా చూడండి.రేటింగ్: 2.75/5- చందు డొంకాన -
ప్రాణాంతకమైన గేమ్.. ఆ చేయి పట్టుకుంటే దెయ్యం వచ్చేస్తుంది!
కొన్ని ఆటలు చాలా ప్రమాదకరం. ఈ విషయం తెలిసినా సరే ఓసారి ఆడి చూస్తే పోలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులోనూ దెయ్యాన్ని చూడొచ్చు అనగానే ఓ పక్క ఎగ్జయిట్ అవుతూ, మరో పక్క భయపడుతూనే రంగంలోకి దిగుతారు. ఒక్క లైన్లో చెప్పాలంటే టాక్ టు మి సినిమా (Talk To Me Movie Review) కథ ఇదే! ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ దగ్గర రాతి చేయి ఉంటుంది. కథఓ క్యాండిల్ వెలిగించి.. ఆ చేయిని పట్టుకుంటే చాలు దెయ్యాలు కనిపిస్తాయి. కనిపించడంతో ఆగవు. చేయి పట్టుకున్న వ్యక్తి శరీరంలోకి కూడా వెళ్తాయి. చేయిని వదిలేసి, క్యాండిల్ ఆర్పేసినప్పుడు ఆ దెయ్యం ఒంట్లో నుంచి తిరిగి వెళ్లిపోతుంది. దెయ్యం శరీరంలోకి చేరినప్పుడు ఎవరేం చేస్తున్నారనేది సరదాగా వీడియోలు షూట్ చేస్తూ ఉంటారు మిగతా ఫ్రెండ్స్. అప్పటివరకు వచ్చిన దెయ్యాలేవీ పెద్దగా భయపెట్టకపోవడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. దీంతో చీకటి అంటేనే భయపడే ఓ బాలుడు కూడా ధైర్యం చేసి తనూ గేమ్ ఆడతానంటాడు.అందుకు అతడి అక్క ఒప్పుకోదు. అప్పటికే ఆమె ప్రియుడి శరీరంలోకి దెయ్యం ప్రవేశించి చేసిన పిచ్చిపనిని చూసి ఆమె బిక్కచచ్చిపోతుంది. ఇదేమంత సరదా గేమ్ కాదని, ఇక ఆపేయమని వారిస్తుంది. అయినా పట్టించుకోకుండా చిన్నపిల్లాడితో గేమ్ ఆడిస్తారు. ఈసారి గేమ్ వైల్డ్‌గా మారుతుంది. అతడు తన కనుగుడ్లు పీకేసుకుంటాడు. తలను టేబుల్‌కేసి బాదుకుంటూ చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. రక్తం ఏరులై పారుతుండటంతో అందరూ భయంతో వణికిపోతారు. ఎలా ఉంది?దీంతో అందరూ ఎలాగోలా ఆ రాతి చేతి నుంచి బాలుడి చేతిని విడిపిస్తారు. తర్వాతేం జరిగిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! దెయ్యాన్ని ఆహ్వానించే ఆటలాడితే ఏం జరుగుతుందనేది చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అలాంటిదే! కాకపోతే కథ ఎక్కడా దారితప్పకుండా స్పీడ్‌గా వెళ్లిపోతూ ఉంటుంది. అనవసరమైన సీన్లు ఉండవు. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంది. అయితే మరీ ఎక్కువగా భయపెట్టే సన్నివేశాలు లేవు.టాక్ టు మి.. ఆస్ట్రేలియన్ హారర్ మూవీ. 2023లో రిలీజైన ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్రకటించారు. టాక్ టు మి 2 కథ ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది. 'టాక్ టు మి' మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. దీనికి ఐఎమ్‌డీబీలో 7.1 రేటింగ్ ఉంది. -
'సార్ మేడమ్' మూవీ రివ్యూ.. అందరికీ కనెక్ట్ అవుతుందా..?
టైటిల్: సార్ మేడమ్నటీనటులు: విజయ్ సేతుపతి, నిత్యా మేనన్, యోగిబాబు, రోషిని హరిప్రియన్, దీప శంకర్, మైనా నందిని, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్ తదితరులునిర్మాణ సంస్థలు: సత్య జ్యోతి ఫిలిమ్స్నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్దర్శకత్వం: పాండిరాజ్సంగీతం: సంతోష్ నారాయణన్విడుదల తేది: ఆగస్టు1, 2025సరికొత్త కథలను ప్రేక్షకుల దగ్గరచేయడంలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ వంటి స్టార్స్ ఎప్పుడూ ముందుంటారు. అలాంటిది వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే భారీ అంచనాలు ఉంటాయి. ఈ జోడీ నటించిన కొత్త చిత్రం 'సార్ మేడమ్'.. భార్యాభర్తల అనుబంధం నిత్య జీవితంలో ఎలా ఉంటుందో దర్శకుడు పాండిరాజ్ చూపించారు. తమిళ్లో జులై 25న 'తలైవన్ తలైవి' పేరుతో విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఆగష్టు 1న రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేటంటే..ఏడడుగుల బంధం ఎలా ఉంటుందో 'సార్ మేడమ్' చిత్రంలో చూపించారు. పెళ్లైన వారందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం ఇది. ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి) సొంత గ్రామంలోనే పరోటా మాస్టర్‌గా ఒక హోటల్ నడుపుతుంటాడు. ఇందులో చేయి తిరిగిన పరోటా మాస్టర్‌గా ఆయనకు పేరు ఉంటుంది. తనుకు పెళ్లి చెయ్యాలని రాణి (నిత్యా మీనన్) అనే అమ్మాయిని వీరయ్య కోసం చూస్తారు. పెళ్లి చూపుల్లోనే ఇరుకుటుంబాలు ఒప్పుకుంటాయి. ఎలాగైన తమ కుమారుడికి పెళ్లి చేయాలని పదో తరగతి మాత్రమే చదవిన వీరయ్య డబుల్ MA చేశాడని ఆపై ఇల్లు తమ సొంతమని కొన్ని అబద్దాలు చెబుతారు. అయితే, వీరయ్య కుటుంబ నేపథ్యం గురించి నిజం తెలుసుకున్నాక ఆ సంబంధం వద్దనుకుంటారు. కానీ, పెళ్లి చూపుల్లోనే ప్రేమలో మునిగిపోయిన వీరయ్య, రాణి పెద్ద వాళ్లను కాదని పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత సంతోషంగా హోటల్ రన్ చేసుకుంటూ వారి సంసార జీవితాన్ని గడుపుతారు. రాణిని మొదటి మూడు నెలలు అత్తమామలు, ఆడపడుచుతో సహా అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అయితే, ఆ తర్వాత నుంచే అసలు కథ మొదలౌతుంది. రాణిపై అత్త పెత్తనంతో పాటు ఆడపడుచు సాధింపులు మొదలవుతాయి. దీంతో తరుచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఒకరోజు అవి తారాస్థాయికి చేరుకుంటాయి. దీంతో వీరయ్య, రాణి ఇద్దరూ విడిపోవాలని విడాకులు తీసుకోవాలనుకుంటారు. ఎంతో ప్రేమగా ఉన్న ఆ జంట విడిపోయేందుకు కారణాలు ఏంటి..? భార్యాభర్తల గొడవలకు ఎవరు కారణం అయ్యారు..? రాణి అన్నయ్యతో వీరయ్యకు ఉన్న గొడవ ఏంటి..? సంతోషంగా ఉన్న కాపురంలో మొదట అగ్గిరాజేసింది ఎవరు..? అనేది అసలు కథ.ఎలా ఉందంటే.. భార్యాభర్తల బంధం బలంగా నిలబడాలంటే ప్రేమ, గౌరవం, నమ్మకం, పరస్పర అవగాహనతో కూడి ఉండాలి. పొరపాట్లు జరగడం సహజం. అప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి.. ఆపై క్షమాపణ చెప్పడానికి వెనుకాడకూడదు. 'సార్ మేడమ్' సినిమా కూడా ఇలాంటి మెసేజ్‌నే ఇస్తుంది. భార్యాభర్తల అనుబంధాన్ని నిలుపుకునేందుకు వారు పడే పాట్లు కష్టంగానే ఉన్నా చూసే వారికి అందంగానే ఉంటుంది. ఈ చిత్రం ఇప్పటికే పెళ్లైన, పెళ్లి చేసుకోవాలనకునే వారందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ కథలో చాలా సీరియస్‌నెస్ ఉంటుంది. కానీ, దర్శకుడు పాండిరాజ్ చాలా సహజంగా అందరినీ ఆలోచింపచేసేలా నవ్విస్తూనే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. భార్యభర్తల మధ్య తరుచూ కనిపించే గిల్లికజ్జాలు, గొడవలు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాయి.భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా తండ్రికి తెలియకుండా కూతరు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు అత్తమామలు చేసే ప్రయత్నం నుంచి కథ ఆరంభం అవుతుంది. అలా వారి గతాన్ని చాలా ఫన్నీగా చెబుతూ.. మొదట వీరయ్య, రాణిల పెళ్లి ఎలా అయింది..? పెళ్లి తర్వాత రాణిపై అత్త, ఆడపడుచు ఆధిపత్యం చేయడం. కోడలిపై మామగారికి ఉన్న అభిమానం. భార్యపై భర్తకు ఉన్న ప్రేమ.. ఇలా ఒకటేంటి ఎన్నో ఈ కథలో మనకు కనిపిస్తాయి. సంతోషంగా సాగుతున్న సంసారంలో కొన్నిసార్లు గొడవలు సహజం. ఆ గొడవల మధ్యలోకి అత్తమామలు దూరితే సంఘర్షణ డబుల్ అవుతుంది. సినిమా అంతా బాగున్నప్పటికీ ఈ కథ ఎక్కువగా రెండు పాత్రల చుట్టూ తిరగడం కాస్త మైనస్, పదేపదే గొడవ పడటం వంటి అంశాలు రిపీటెడ్‌గా అనిపిస్తాయి. అంతే తప్పా ఇందులో మైనస్‌లు పెద్దగా లేవు. కొన్ని సీన్లు ఎక్కువగా సాగదీశారనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే.. ఆకాశ వీరయ్యగా విజయ్ సేతుపతి, రాణి పాత్రల్లో నిత్యా మేనన్ ఫుల్ ఎనర్జిటిక్‌గా మెప్పించారు. వారి మధ్య కనిపించే కెమిస్ట్రీ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. సినిమాలో అప్పుడప్పుడు కనిపించే యోగిబాబు తన పంచ్‌లతో నవ్విస్తాడు. సరైన సమయంలో తన పాత్ర ఎంట్రీ ఇస్తుండటంతో బాగా అనిపిస్తుంది. ఆపై విజయ్ సేతుపతి తన నటనతో అదరగొట్టేశాడు. అటు తల్లికి... ఇటు భార్యకు నచ్చచెబుతూ తను మాత్రం ఇద్దరి మధ్య నలిగిపోతుంటాడు. ఒక సామాన్యుడి జీవితానికి వీరయ్య పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. ఆపై అత్తింటి వాళ్లతో పాటు భర్తతో గొడవపడేటప్పుడు రాణి పాత్రలో నిత్యా మేనన్ దుమ్మురేపింది. అదే సమయంలో తన పుట్టింట్లో భర్త గురించి గొప్పగా చెప్పుకున్న సీన్ ప్రతి అమ్మాయి జీవితాన్ని తాకుతుంది. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య జరిగే చిన్న గొడవల్లోకి కుటుంబ సభ్యులు, చుట్టాలు ఎలా ఎంట్రీ ఇస్తారో ప్రీ క్లైమాక్స్‌లో అర్థం అయ్యేలా దర్శకుడు బాగా చూపించాడు. కథకు తగ్గట్టుగా సంగీతం బాగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపిస్తుంది. సినిమా పూర్తి అయిన తర్వాత ఈ కథకు కనెక్ట్ అయిన ప్రతిఒక్కరు నవ్వుతూనే ఆలోచిస్తారు. జీవితం అంటే ఇదే కదా అంటూ బయటకు వచ్చేస్తారు. -
హెబ్బా పటేల్ థాంక్యూ డియర్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ డియర్’. తోట శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, చత్రపతి శేఖర్, బలగం సుజాత, రామారావు కీలక పాత్రలు పోషించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.థాంక్యూ డియర్ కథేంటంటే..సత్య(ధనుష్ రఘుముద్రి) సినిమా డైరెక్టర్ కావాలని కష్టపడుతుంటాడు. జాను (రేఖా నిరోషా) హీరోయిన్ కావాలని సిటీకి వస్తుంది. ఓ కారణంగా ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రియ(హెబ్బా పటేల్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఆ హత్యలతో ఈ జంటకి ఉన్న సంబంధం ఏంటన్నదే? అసలు మిగతా కథ.ఎలా ఉందంటే..ప్రస్తుత సమాజంలోని వివిధ అంశాలను తీసుకొని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించారు. కొన్ని వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి అనేది దర్శకుడు ఈ మూవీలో చూపించారు. అలాగే కొంతమంది చేసే అసాంఘిక చర్యల వల్ల ప్రజలలో ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని చూపించే ప్రయత్నమే థాంక్యూ డియర్. కొన్ని సీన్లు నిదానంగా ఉన్నప్పటికీ ఈ కథకు తగ్గట్లు స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.దర్శకుడు తోట శ్రీకాంత్ తాను రాసుకున్న కథను అనుకున్న విధంగానే తెరపై ఆవిష్కరించారు. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా కథనం ఆకట్టుకుంది. బీజీఎం ఫర్వాలేదనిపించినా పాటలు సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. డబ్బింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది. అయితే డైలాగులు సినిమాలో చాలా బాగున్నాయి. క్లైమాక్స్ సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఓవరాల్‌గా డైరెక్టర్ తాను అనుకున్న సందేశమిచ్చాడు.ఎవరెలా చేశారంటే..హీరోగా తంత్ర ఫ్రేమ్ నటుడు ధనుష్ రఘుముద్రి తన పాత్రలో చాలా బాగా నటించారు. ప్రతి సీన్లో తనదైన శైలిలో నటిస్తూ మెప్పించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంలో కూడా తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరో హీరోయిన్ రేఖ నిరోషా కూడా ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలోని తన పాత్రతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్‌లో కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘కింగ్డమ్’ మూవీ రివ్యూ
టైటిల్: కింగ్డమ్నటీనటులు: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే , వెంకటేశ్ పీసీ, కసిరెడ్డి తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు:సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: గౌతమ్ తిన్ననూరిసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ:జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISCఎడిటర్ : నవీన్ నూలివిడుదల తేది: జులై 31, 2025విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. నిజం చెప్పాలంటే ‘గీత గోవిందం’ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమానే లేదు. భారీ ఆశల మధ్య గతేడాది వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో విజయ్ ఆశలన్నీ ‘కింగ్డమ్’పైనే పెట్టుకున్నాడు.డైరెక్టర్ గౌతమ్‌కి కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను కింగ్డమ్ అందుకుందా? విజయ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేటంటే..సూరి(విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. అన్న శివ(సత్యదేవ్) అంటే ప్రాణం. ఓ కారణంతో శివ చిన్నప్పుడే తండ్రిని చంపి ఇంటి నుంచి పారిపోతాడు. అతని ఆచూకి కోసం సూరి వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో సూరి శ్రీలంకలో ఉన్నాడని తెలుస్తుంది. కట్ చేస్తే.. శ్రీలంకలో ఓ తెగ ఉంటుంది. 70 ఏళ్ల క్రితం ఇండియా నుంచి శ్రీలంకకు పారిపోయిన తెగ అది. గోల్డ్ మాఫియా సిండికేట్ చేతిలో వారు బానిసలు. మురుగన్(వెంకటేశ్) చెప్పింది చేయడమే వాళ్ల పని. శివ ఆ గ్యాంగ్ లీడర్. అతన్ని తిరిగి ఇండియాకు తీసుకురావడమే సూరి లక్ష్యం. మరి ఆ లక్ష్యం నెరవేరిందా? తమ్ముడు సూరి ఇండియన్ పోలీసుల గూఢచారి అని తెలిసిన తర్వాత శివ ఏం చేశాడు? అసలు ఈ తెగ ఇండియా నుంచి శ్రీలంకకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది. గుఢచారిగా వెళ్లిన సూరి.. చివరకు ఆ తెగకు దేవుడిగా ఎలా మరాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. తెరపై భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సిద్ధహస్తుడు. ‘మళ్లీ రావా’లో ప్రేమ, విరహం, గతం-వర్తమానం మధ్య తడమాటాన్ని అద్భుతంగా చూపించాడు. జెర్సీలోని ట్రైన్ సీన్ ఒక్కటి చాలు గౌతమ్ తన కథల్లో ఎమోషన్ని ఎంత బలంగా చూపిస్తాడో చెప్పడానికి. కింగ్డమ్లో కూడా తన బలమైన ఎమోషన్‌పైనే గౌతమ్ ఎక్కువ దృష్టిపెట్టాడు. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. గ్యాగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌తో అన్నదమ్ముల కథని చెప్పాడు. అయితే ఇక్కడ ఎమోషన్ వర్కౌట్ అయినా.. కథ-కథనంలో మాత్రం కొత్తదనం కొరవడింది. సినిమా చూస్తున్నంత సేపు ఇటీవల వచ్చిన రెట్రో సినిమాతో పాటు పాత చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు మన కళ్లముందు తిరుగుతాయి. కథను బలంగా చెప్పే క్రమంలో కొన్ని చోట్ల ట్రాక్ మిస్ అయ్యాడు. అయితే అనిరుధ్ నేపథ్య సంగీతం, విజయ్ నటన ఆ తప్పిదాలను కొంతవరకు కప్పిపుచ్చాయి. 1920లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన బంగారు గని కార్మికుల నేపథ్యంతో కథ చాలా ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత కథ 70 ఏళ్లు ముందుకు జరిగి.. 1991లోకి వస్తుంది. చిన్నప్పుడే పారిపోయిన అన్నకోసం సూరి వెతకడం.. ఓ పోలీసు ఆఫీసర్ దృష్టిలో పడడం.. అన్న ఆచూకి చెప్పి అండర్ కవర్ ఆపరేషన్ కోసం శ్రీలంకకు పంపిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. భారీ యాక్షన్ సీన్లు, ఎలివేషన్లతో కథను నడిపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు మాత్రం భావోద్వేగాలనే బలంగా చూపించాడు. అన్నదమ్ములు కలిసే సీన్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. సముంద్రంలో వచ్చే ఛేజింగ్ సీన్, నేవి అధికారుల నుంచి బంగారం కొట్టేసే సీన్ ఫస్టాఫ్‌కే హైలెట్. ఇంటర్వెల్ సన్నివేశం సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథ అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. పైగా కొన్ని చోట్ల కథనం ట్రాక్ తప్పుతుంది. ఆపదలో ఉన్నవారిని చివరి నిమిషంలో అయినా సరే హీరో వచ్చి ఆదుకోవడం మన తెలుగు సినిమాల సాంప్రదాయం. కానీ కింగ్డమ్లో అది ఫాలో కాకపోవడంతో.. కొంతమందికి ప్రీక్లైమాక్స్ కొత్తగా అనిపిస్తే.. చాలా మందికి ఇలా చేశారేంటి? అనిపిస్తుంది. పార్ట్ 2 కోసమే క్లైమాక్స్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. సూరి పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. సాధారణ పోలీసు కానిస్టేబుల్‌గా, ఆ తర్వాత పోలీసుల గూఢచారిగా, కింగ్డమ్ రాజుగా ఇలా పలు వేరియేషన్లు ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. తన కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సత్యదేవ్ పాత్ర. హీరో అన్న శివగా అద్భుతంగా నటించాడు. ఆయన పాత్రకు స్క్రీన్ స్పేస్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు రెండో హీరో సత్యదేవ్ అనే చెప్పొచ్చు. ఇక మాఫీయా లీడర్ మురుగన్‌గా వెంకటేశ్ విలనిజం బాగా పండించాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీకి పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. డాక్టర్‌గా రెండు మూడు సీన్లలో కనిపిస్తుంది అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం చాలా వరకు రియల్ లొకేషన్లలోనే షూట్ చేశారు. జాన్, గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితనంతో వాటిని అంతే అందంగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా
థ్రిల్లర్ సినిమాల్లో మీరు చూసిన బెస్ట్ అంటే ఏం చెబుతారు? తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది 'దృశ్యం' అంటారు! ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ చూపించింది మరి. ఒకవేళ దాన్ని మించిపోయే మూవీ ఉంటే?.. ఏంటి అలాంటి సినిమా ఉందా? ఎక్కడ చూడాలి? ఏ భాషలో ఉంది అని కచ్చితంగా అడుగుతారు. అందుకే మీ కోసం మెంటలెక్కించే ఓ కొరియన్ థ్రిల్లర్‌ని తీసుకొచ్చేశాం. అదే 2017లో వచ్చిన 'ఫర్గాటెన్'. ఇంతకీ దీని సంగతేంటి? అంత బాగుందా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?జిన్ సోక్ (కాంగ్ హా న్యుల్).. తన అమ్మ, నాన్న, అన్నయ్యతో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతాడు. కొన్నిరోజులకే కుటుంబమంతా ఇంట్లో సెట్ వాతావరణానికి సెట్ అయిపోతారు. జిన్‌కి మాత్రం ఇంట్లోని ఓ గది నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. పీడకలలు వస్తుంటాయి. ఓ రోజు జిన్ అన్నయ్య యో సూక్(కిమ్ మ్యు యోల్)ని ఇతడి కళ్ల ముందే కొందరు కిడ్నాప్ చేస్తారు. పోలీస్ కేసు పెట్టినా లాభముండదు. కానీ 19 రోజుల తర్వాత యో సూక్ తిరిగి క్షేమంగా ఇంటికొచ్చేస్తాడు. తిరిగొచ్చిన అన్నయ్యతో పాటు తల్లిలోనూ జిన్ కొన్ని మార్పులు గమనిస్తాడు. భయమేసి ఇంట్లో వాళ్ల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. విచారణ మొదలవుతుంది. అసలు ఇంతకీ జిన్ ఎవరు? ఇద్దర్ని హత్య చేసి గతాన్ని ఎందుకు మర్చిపోయాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలామందికి ఓ ఐడియా ఉంటుంది. కానీ 'ఫర్గాటెన్' అలాంటి వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్. ఎందుకంటే సినిమా మొదలవడమే ఓ ఫ్యామిలీ స్టోరీలా అనిపిస్తుంది. చక్కని కుటుంబం. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు. ఏం జరుగుతుందా? ఎలాంటి థ్రిల్ ఇస్తుందా అని చిన్న ఆసక్తి. అలా చూస్తుండగానే కాసేపటికి హారర్ మూవీలా చిన్నగా భయపెడుతుంది. హీరో కుటుంబం ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది. దీంతో మన హీరో పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ఇక అక్కడి మొత్తం సీన్ మారిపోతుంది.ఎక్కడైనా సినిమాలో ట్విస్టులు ఉంటాయి. 'ఫర్గాటెన్'లో మాత్రం ట్విస్టులు మధ్య సినిమా ఉందా అన్నట్లు సాగుతుంది. అప్పటివరకు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుడికి.. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తుంది. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ చేస్తుంది. అదే టైంలో హత్యలు చేయడానికి దారితీసిన పరిస్థితులు, ఆ సంఘటనని మర్చిపోవడం.. ఇలా ఒక్కో సీన్ చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సిన థ్రిల్లర్ అని కచ్చితంగా అనిపిస్తుంది.అదే టైంలో తొలుత చూపించిన సన్నివేశాల్ని, చివర్లో ఒక్కొక్కటిగా లింక్ చేసిన విధానం చూస్తే భలే ముచ్చటేస్తుంది. రెండు గంటల్లోపే ఉన్న ఈ సినిమా క్రేజీ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం గ్యారంటీ. ఒకవేళ చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే కొరియన్ భాషలో మాత్రమే ఆడియో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. తెలుగు లేదు కదా అని అనుకుని స్కిప్ చేస్తే మాత్రం ఓ మంచి సినిమా మిస్ అవుతారు.ఈ సినిమాలో స్టోరీని చూపించే విధానంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ కూడా అద్భుతం అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ అంతా కాస్త నెమ్మదిగా ఉంటుంది గానీ చివరికొచ్చేసరికి అవేం గుర్తుండవు. అదిరిపోయే సినిమా చూశాం ఈ రోజు అనే అనుభూతి మాత్రమే మిగులుతుంది. ఒకటి రెండు సన్నివేశాలు మినహా ఫ్యామిలీతోనూ చూడొచ్చు.- చందు డొంకాన -
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కొన్నాళ్ల క్రితం మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఏడాదికో యానిమేటెడ్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి సినిమా 'మహావతార్: నరసింహ' నేడు(జులై 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూనిమేటెడ్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'మహావతార్: నరసింహ' కథేంటంటే..పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథ గురించి తెలిసిందే. విష్ణువు మూర్తి నరసింహ అవతారం(సగం మనిషి, సగం సింహం) ఎత్తి, భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. ఇదే కథను యానిమేషన్లో చూస్తే.. అదే మహావతార్: నరసింహ సినిమా.విశ్లేషణభక్త ప్రహ్లాద కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించిన 'భక్త ప్రహ్లాద' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ప్రహ్లాద కథ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి తెలిసింది. ఇలాంటి కథలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా'మహావతార్: నరసింహ'. కథనం మొత్తం యానిమేషన్‌తో నడుస్తుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. మహా విష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు..తమకున్న శక్తులతో దేవతలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భంలో బంధిస్తాడు. దీంతో విష్ణు మూర్తి వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు సంహరించి భూదేవిని తీసుకొస్తాడు. సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యకశిపుడు మరింత పగను పెంచుకుంటాడు. తీవ్రమైన తప్పస్సు చేసి బ్రహ్మాదేవుడి నుంచి తనకు భూమి, అకాశం పైన,దేవతలతో గాని, పశువులతోగానీ, పగలు గానీ రాత్రి గానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చకుంటాడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు. తండ్రికేమో విష్ణువు అంటే పడదు.. కొడుకుకేమో విష్ణుమూర్తే సర్వస్వం అన్నట్లుగా బతుకుతాడు. ఎంత నచ్చజెప్పిన విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు. చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహా అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి. దాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ చక్కగా వాడుకున్నాడు. భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్‌లో నరసింహ స్వామి ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోతుంది.హిరణ్యకశిపుడితో నరసింహాస్వామి చేసే యాక్షన్ తెరపై చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. యానిమేటెడ్ సినిమా అయినా సరే కొన్ని యాక్షన్ సీన్లకు థియేటర్స్‌లో విజిల్స్ పడతాయి. యానిమేషన్ పర్ఫెక్ట్గా కుదిరింది. తెరపై చూస్తుంటే కమర్షియల్ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. సామ్ సీ.ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎం అదిరిపోయింది. చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. -
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ
రీసెంట్ టైంలో బాలీవుడ్లో ఓ యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ మూవీ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే 'సయారా'. జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడిన ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్‌ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రీసెంట్ టైంలో ఏ ఇండస్ట్రీలో చూసినా సరే లవ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ పెద్దగా రావట్లేదు. అందరూ హారర్, యాక్షన్, పీరియాడికల్ అంటూ పాన్ ఇండియా ట్రెండ్ వెంటపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో సింపుల్ ప్రేమకథ, మనసుకు హత్తుకునే పాటలతో వచ్చిన హిందీ సినిమానే 'సయారా'. ఇప్పటివరకు చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటిలో ఒకలాంటిదే ఇది కూడా. స్టోరీ పరంగా కొత్తగాం ఏం ఉండదు. చాలాసార్లు చూసేశాం అనిపిస్తుంది. కాకపోతే స్టోరీని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.పెళ్లి బట్టలతో వాణి బత్రా.. రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లిన సీన్‌తో సినిమా మొదలవుతుంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దీంతో కొన్నాళ్ల పాటు బాధతో ఇంటికే పరిమితమవుతుంది. అలా ఆరు నెలల తర్వాత తిరిగి బాహ్య ప్రపంచంలో అడుగుపెడుతుంది. రైటర్‌గా ఓ చోట జాబ్‌లో జాయిన్ అవుతుంది. అదే రోజు తన ఆఫీస్‌కి వచ్చి ఒకడ్ని కొడుతున్న సింగర్ క్రిష్ కపూర్‌ని ఈమె చూస్తుంది. అలా అక్కడ వీళ్లిద్దరికీ మొదలైన పరిచయం కాస్త ఎక్కడి వరకు వెళ్లింది? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ.హిందీ ఆడియెన్స్ ఈ సినిమా చూసి తెగ ఎమోషనల్ అయిపోతున్నారు గానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది ఓకే ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఎమోషనల్‌గానే అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా గతం మర్చిపోయిన వాణి ముఖంలో అమాయకత్వం చూస్తే అయ్యో అనిపిస్తుంది. అలానే పాటలు కూడా దేనికవే బాగుంటాయి. మరీ సూపర్ అని చెప్పాం గానీ ఓ మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.ఎవరెలా చేశారు?క్రిష్ కపూర్‌గా చేసిన అహన్ పాండే, వాణిగా చేసిన అనీత్ పడ్డాకి ఇదే తొలి సినిమా. కానీ అద్భుతంగా చేశారు. అదిరిపోయే కెమిస్ట్రీ పండించారు. కొన్ని క్లోజప్ షాట్స్‌లో హీరోయిన్ని చూస్తుంటే మనల్ని కూడా ఇలాంటి అమ్మాయి ప్రేమిస్తే బాగుండు అనిపిస్తుంది. అంతా బాగుంటుంది మరి. మిగిలిన వాళ్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ మోహిత్ సూరి.. తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్లో మరో మంచి మూవీ తీశాడు. సినిమాటోగ్రఫీ, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో, అది కూడా హిందీలో మాత్రమే ఉంది. ప్రేమలో ఉన్నోళ్లు, ప్రేమలో విఫలమైనోళ్లు ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఎమోషనల్ అయ్యే అవకాశముంది. ఒకవేళ బిగ్ స్క్రీన్‌పై చూస్తే ఆసక్తి లేదంటే కొన్నాళ్లు ఆగితే నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలు అనగానే చాలామందికి మలయాళ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో మూవీస్‌ని రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలా 'రోంత్' అనే చిత్రం తెలుగు డబ్బింగ్‌తో హాట్స్టార్లోకి వచ్చేసింది. రాత్రి గస్తీలో పోలీసులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు? వాళ్లకు ఎలాంటి రిస్కులు ఎదురవుతాయి అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది. ఇంతకీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)కథేంటి?ధర్మశాల పోలీస్ స్టేషన్లో యోహన్నా(దిలీశో పోతన్) ఎస్సై. దిన్నాథ్(రోషన్ మ్యాథ్యూ) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారు. ఓ రోజు రాత్రి గస్తీ కోసం వీళ్లకు డ్యూటీ వేస్తారు. అలా పెట్రోలింగ్‌కి వెళ్లిన వీళ్లిద్దరికి ఓ చోట లవర్స్ లేచిపోవడం, మరోచోట ఓ సైకో కన్నబిడ్డని డబ్బా కింద దాచడం, మరోచోట ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం.. ఇలా రకరకలా సంఘటనలు ఎదురవుతాయి. చివరగా అనుకోకుండా జరిగిన ఓ మరణం వల్ల వీళ్లు సమస్యల్లో ఇరుక్కుంటారు. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మలయాళ సినిమాలు ఎందుకు చూస్తారు? అని అడిగితే.. సహజత్వానికి దగ్గరగా ఉంటాయని చాలామంది చెప్పేమాట. ఈ సినిమా కూడా సేమ్ అలాంటిదే. రోంత్ అంటే గస్తీ అని అర్థం. అందుకు తగ్గట్లే మూవీ అంతా ఇద్దరు పోలీసులు, జీప్‌లో తిరుగుతూ.. రాత్రి కాపల కాయడమే చూపిస్తారు. అదే టైంలో వాళ్ల జీవితంలో అనుకోని సంఘటనలు జరగడం, వాటి పరిణామాల వల్ల ఊహించని పరిస్థితులు ఎదుర్కోవడం లాంటివి కూడా చాలా రియలస్టిక్‌గా చూపించారు.ఈ సినిమాలో దాదాపు 80 శాతం రాత్రిపూట ఇద్దరు పోలీసులు పెట్రోలింగ్ చేయడమే చూపిస్తారు. వాళ్లకు ఎదురయ్యే సంఘటనలు.. ఈ విషయంలో వాళ్లు తీసుకునే నిర్ణయాలే కథని ముందుకు తీసుకెళ్తాయి. మధ్యమధ్యలో వచ్చే ఎమోషన్స్ కూడా బాగుంటాయి.స్టోరీ సాఫీగా సాగిపోతుందే అనుకునే టైంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. చివరి అరగంట ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కలిగిస్తుంది. ఊహించని క్లైమాక్స్ సర్ప్రైజ్ చేస్తుంది.సిన్సియర్‌గా పనిచేయడమే కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం కూడా అవసరమే. లౌక్యం లేకపోతే ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగతంగానూ దెబ్బయిపోతాం అనే మెసేజ్ ఇచ్చిన స్టోరీ ఇది. పై స్థాయి అధికారులు అవసరమొస్తే కిందస్థాయి అధికారుల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తారనేది కూడా చాలా నేచురల్‌గా చూపించారు.అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే రెండు గంటల సినిమా. అంతా పోలీసులు డ్యూటీ చేయడం లాంటి సీన్సే ఉంటాయి. ఒకవేళ పోలీస్ డ్రామాలు అంటే ఆసక్తి ఉంటేనే దీన్ని చూడండి. లేదంటే మాత్రం డిసప్పాయింట్ కావొచ్చు. సింపుల్ కథలానే అనిపిస్తుంది గానీ చివరకొచ్చేసరికి పోలీసుల జీవితం ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?యోహన్నాగా చేసిన దిలీశ్ పోతన్, దిన్నాథ్గా చేసిన రోషన్ మ్యాథ్యూ చాలా నేచురల్‌గా నటించారు. సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతే వీళ్లతో పాటు మనం ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. మిగిలిన పాత్రధారులకు పెద్ద స్కోప్ లేదు. కానీ బాగానే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. ఇందులో పెద్ద కథేం లేదు. కానీ డైరెక్టర్ షాహీ కబీర్ తనదైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. ఈయనకు మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. పోలీసుల గురించి, రాత్రి పూట వాళ్లకు ఎదురయ్యే పరిస్థితుల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'డీఎన్ఏ' మూవీ రివ్యూ.. మెప్పించేలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ) -
'డీఎన్ఏ' మూవీ రివ్యూ.. మెప్పించేలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ
తమిళంలో ఘన విజయం సాధించిన 'డీఎన్ఏ' సినిమా తెలుగులో 'మై బేబీ' పేరుతో విడుదల అయింది. ఒక్క యాక్సిడెంట్ కోట్ల మాఫియాకు ఎలా దారి తీసిందో ఈ సినిమాలో చూపించిన తీరు చాలా బాగుంది. తెలుగులో థియేటర్లలోకి వచ్చిన ఒక్క రోజులోనే ఓటీటీలోకి వచ్చిన మూవీ కావడంతో భారీగా క్రేజ్ సొంతం చేసుకుంది. జులై 18 థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం జులై 19న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో రన్ అవుతుంది. అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించాడు. సోషల్‌మీడియాలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేంటంటే..పుట్టిన బిడ్డ పురిటిలోనే చేతులు మారిపోతున్న సంఘటనలు నేటి సమాజంలో ఎన్నో మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇదే పాయింట్‌తో 'డీఎన్ఏ' కథను ప్రేక్షకులకు చెప్పడంలో దర్శకుడు నీల్సన్ వెంకటేశన్ విజయం సాధించారు. చెన్నై వీధుల్లో ఆనంద్ (అథర్వ) తాగేసి రోడ్లపై తిరుగుతుంటాడు. తను ప్రేమించిన అమ్మాయి శరణ్య (మానస చౌదరి) దూరం కావడంతో కుంగిపోయి ఉంటాడు. ఇదే వివషయంలో తండ్రీకొడుకుల మధ్య రోజూ గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే, కుమారుడికి పెళ్లి చేస్తే జీవితంలో సెట్ అవుతాడని భావిస్తారు. ఈ క్రమంలో దివ్య (నిమిషా సజయన్)తో పెళ్లి చేస్తారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండదని తెలిసినా కూడా ఆమెతో పెళ్లికి ఆనంద్ ఒప్పుకుంటాడు.కొంత కాలానికి దివ్య గర్భవతి అవుతుంది. ప్రముఖ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే, బాబును ఇంక్యుబేటర్‌లో పెట్టాలని వైద్యులు తీసుకెళ్తారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత ఆ బిడ్డను దివ్య చేతుల్లో పెట్టగానే, అది తన బిడ్డ కాదని దివ్య గొడవ చేస్తుంది. ఆమె మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుంది కాబట్టి అలా చెబుతుందని అందరూ అనుకుంటారు. ఆపై ఆమె మాటలు ఎవరు నమ్మరు. అయితే, దివ్య మాటలకు ఆనంద్ చుట్టూ గందరగోళం నెలకొంటుంది. దివ్య బాధను చూడలేక మరో ఆసుపత్రిలో బాబుకు డీఎన్ఏ టెస్ట్ చేపిస్తాడు. అక్కడ ఆ బిడ్డ తమది కాదని తెలుస్తోంది. తమ బాబును ఎవరో కిడ్నాప్ చేశారని ఆనంద్ గుర్తిస్తాడు. అయితే, మరో బిడ్డను తమకు వదిలేసి ఎందుకు వెళ్లారని ఆనంద్‌కు అర్థం కాదు. దివ్య బిడ్డను ఎవరు తీసుకెళ్లారు..? పోలీసులతో కలిసి ఆనంద్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడు..? తన బిడ్డను ఎలా పట్టుకున్నాడు..? వేరే బిడ్డను తమకు ఎందుకు ఇచ్చారు..? తెలియాలంటే ఎలా ఉందంటే..ఇదొక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇదే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, వాటికి భిన్నంగా డీఎన్ఏ కథను దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ చెప్పాడు. సినిమా ప్రారంభంలో ఆనంద్ జీవితాన్ని పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడినప్పటికీ తన బిడ్డ మాయం అయిన క్షణం నుంచి కథలో స్పీడ్ పెరుగుతుంది. మద్యానికి బానిస అయిన తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్‌కు ఆనంద్ వెళ్తాడు. అక్కడ అతనిలో వచ్చిన మార్పు వల్లనే మానసిక సమస్యతో బాధ పడుతున్న దివ్యను పెళ్లి చేసుకుంటాడు. ఆ సీన్లు మన అందరికీ కనెక్ట్ అవుతాయి. కథ ప్రారంభంలో ఆనంద్ బ్రేకప్ బాధలు, అమ్మాయితో పెళ్లి కష్టాలు వంటి సీన్లు కొత్తగా ఏమీ అనిపించవు. అయితే, ఎస్సై చిన్నస్వామి సాయంతో తన బిడ్డ కోసం ఇన్వెస్టిగేషన్‌ను మొదలు పెడతాడు ఆనంద్.. ఈ క్రమంలో ఆస్పత్రిలో పుట్టిన బిడ్డలను ఎలా కిడ్నాప్ చేస్తారు..? వారు ఏడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..? వంటి సీన్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇదే సమయంలో పుట్టిన బిడ్డలను మూఢ విశ్వసాలతో నరబలి ఇచ్చే ఆచారాలను కూడా దర్శకుడు చూపాడు. సినిమా క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంటుంది. థ్రిలింగ్ ఇచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఇదొక గొప్ప అనుభూతిని ఇస్తుంది.ఎవరెలా చేశారంటే..డీఎన్ఏ చిత్రంలో ఆనంద్‌గా అధర్వ మెప్పించాడు. దివ్య పాత్రలో నిమిష సజయన్ అద్భుతంగా నటించింది. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లలో అధర్వ మెప్పిస్తే.. బిడ్డను కోల్పోయిన తల్లిగా నిమిష నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. పార్తీబన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథ, స్క్రీన్ ప్లేకు తగ్గట్లుగా ఉంటుంది. అయితే, ఫస్టాఫ్ లెంగ్త్ తగ్గిస్తే బావుండేది. ఇందులోని పాటలు బాగా మైనస్‌గా నిలుస్తాయి. సినిమా బాగా ఆసక్తిగా ఉన్నప్పుడు సడెన్‌గా వచ్చే పాటలతో చిరాకు తెప్పిస్తాయి. తమిళ్లో సుమారు నెల కిందట విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగులో 'మై బేబీ'గా విడుదలైంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను డీఎన్ఏ మెప్పిస్తుంది. -
'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమా రివ్యూ
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య తదితర సినిమాలని నిర్మించిన ప్రవీణ పరుచూరి.. దర్శకురాలిగా మారి తీసిన తొలి చిత్రం 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. దాదాపు కొత్త నటీనటులతో తీసిన ఈ మూవీకి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించాడు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ రూరల్ డ్రామా సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ)కథేంటి?కొత్తపల్లి అనే ఊరు. అప్పన్న(రవీంద్ర విజయ్) ఊరందరికీ అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటూ ఉంటాడు. ఇతడి దగ్గరే రామకృష్ణ(మనోజ్ చంద్ర) సహాయకుడిగా పనిచేస్తుంటాడు. అదే ఊరిలో ఉండే రెడ్డి(బెనర్జీ) మనవరాలు సావిత్రిని(మౌనిక) రామకృష్ణ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయించే రామకృష్ణ.. సావిత్రితో.. పక్క ఊరిలో డ్యాన్స్ చేయించాలని అనుకుంటాడు. అయితే నేరుగా ఆమెతో మాట్లాడే ధైర్యం లేక సావిత్రి ఇంట్లో పనిచేసే అందం(ఉషా) సాయం తీసుకుంటాడు. కానీ అనుకోని సంఘటనల వల్ల అందంని రామకృష్ణ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు అప్పన్న చనిపోతాడు. తర్వాత ఊరిలో జరిగిన పరిణామాలేంటి? చివరకు రామకృష్ణ సావిత్రి ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో తీసే మూవీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య చిత్రాల్ని నిర్మించిన ప్రవీణ.. ఆ అనుభవంతో తొలిసారి దర్శకత్వం వహించిన సినిమాని కూడా అదే జానర్లో తీశారు. బిగినర్స్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ డిఫరెంట్ కథని డిఫరెంట్‌గానే ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.కొత్తపల్లిలో అనే ఊరిలో అప్పులిచ్చి వడ్డీలు కట్టించుకునే అప్పన్న, రికార్డింగ్ డ్యాన్సులు కడుతూ అప్పన్న దగ్గర పనిచేసే హీరో రామకృష్ణ.. అతడి ప్రేమించి సావిత్రి, సావిత్రి వాళ్ల ఇంట్లో పనిచేసే అందం.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్లేసరికి ఫస్టాప్ అయిపోతుంది. సరదా సరదాగా సాగిపోతూనే ఇంటర్వెల్‌కి చిన్న ట్విస్ట్ పడుతుంది. అప్పటివరకు సరదాగా సాగిన మూవీ కాస్త.. సెకండాఫ్‌కి వచ్చేసరికి దెయ్యం, దేవుడు అంటూ ఫిలాసఫీ వైపు మళ్లుతుంది.'దేవుడంటే నిజమో అబద్ధమో కాదు ఓ నమ్మకం' అనే పాయింట్‌ని చెప్పిన విధానం బాగుంది. కాకపోతే అక్కడక్కడ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే చాలావరకు నిజాయతీగా చేసిన ఓ మంచి ప్రయత్నంలా అనిపిస్తుంది. మొదట్లో నేచురల్‌గా ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత జరిగే సీన్స్ కొన్ని మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే మాత్రం చూస్తున్న రెండు గంటల పాటు ఎంటర్టైన్ అవుతారు.ఎవరెలా చేశారు?మనోజ్ చంద్ర రామకృష్ణ పాత్రలో ఆకట్టుకున్నాడు. తెరపై అమాయకంగా కనిపిస్తూ అలరించాడు. సావిత్రిగా చేసిన మౌనిక కంటే అందంగా చేసిన ఉషాకు కాస్త ఎక్కువ స్కోప్ దొరికింది. కాకపోతే హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మిగిలిన పాత్రధారులు ఉన్నంతలో బాగానే చేశారు. వంక పెట్టడానికి ఏం లేదు. టెక్నికల్ విషయాలకొస్తే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. మరీ గుర్తుంచుకునేలా ఉండవు కానీ బాగుంటాయి. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ఫైనల్‌గా దర్శకురాలు కమ్ నిర్మాత ప్రవీణ గురించి చెప్పుకోవాలి. తను అనుకున్న స్టోరీని నిజాయతీగా చెప్పారు. కాకపోతే చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి.- చందు డొంకాన(ఇదీ చదవండి: పుష్ప విలన్ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్.. స్పెషల్ ఏంటి?) -
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
టైటిల్ : జూనియర్నటీనటులు: కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, డా. రవిచంద్రన్, రావు రమేశ్, సత్య, వైవా హర్ష తదితరులునిర్మాణ సంస్థ: వారాహి చలన చిత్రంనిర్మాత: రజని కొర్రపాటిరచన-దర్శకత్వం: రాధా కృష్ణసంగీతం: దేవిశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్ఎడిటర్: నిరంజన్ దేవరమేనేవిడుదల తేది: జులై 18, 2025‘వైరల్ వయ్యారి..’ ఈ ఒక్క పాటతో ‘జూనియర్’ సినిమాకు భారీ హైప్ వచ్చింది. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రమిది. సోషల్ మీడియాలో వైరల్ పాట బాగా వైరల్ అవ్వడం.. శ్రీలీల, జెనీలియా లాంటి స్టార్స్ నటిస్తుండడంతో టాలీవుడ్‌లోనూ ఈ చిత్రంపై బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘జూనియర్’(Junior Movie Review )పై భారీ అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..విజయనగరానికి చెందిన కోదండపాణి(రవి చంద్రన్)-శ్యామల దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి(కిరీటీ రెడ్డి). కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది. దీంతో కోదండ పాణి తన కొడుకుకు అన్నీ తానై పెంచుతాడు. తండ్రి-కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం.. ఆయన చూపించే అతిప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది. తండ్రికి దూరంగా ఉండాలనే పైచదువుల కోసం సిటీకి వెళ్తాడు. ‘అరవయ్యేళ్లు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలి కదా’ అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. తోటి విద్యార్థిని స్పూర్తి(శ్రీలీల)తో ప్రేమలో పడి.. ఆమె పని చేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. తొలిరోజే తన ప్రవర్తనతో బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కు చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఓ నిజం తెలుస్తుంది. ఓ కారణంగా ఆమెతో కలిసి తన సొంతూరు విజయనగరానికి వెళ్తాడు. అభికి తెలిసిన నిజం ఏంటి? విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి? అభి తండ్రి సొంత ఊరిని వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు? కోదండ పాణికి, విజయ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సినీ తారలు లేదా ప్రముఖ కుటుంబాల నుంచి ఎవరైనా హీరోగా సీనీ రంగంలోకి అడుగుపెడితే.. తొలి సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. హీరోగా రాణించగలడా? లేదా? అనేది తొలి సినిమాతోనే డిసైడ్ చెస్తారు. డెబ్యూ ఫిల్మ్‌తో కాస్త మెప్పించినా సరే.. భవిష్యత్‌కు ఢోకా ఉండదు. అందుకే వారసుల ఎంట్రీకి ప్రముఖ కుటుంబాలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ కథతో రావడానికి ట్రై చేస్తారు. తమ వారసుడిలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని తొలి సినిమాలోనే చూపించేందుకు ప్రయత్నిస్తారు. కిరీటి రెడ్డి విషయంలోనూ అదే జరిగింది.(Junior Movie Review ) ప్రముఖులు వారసుల డెబ్యూ ఫిల్మ్‌కి కావాల్సిన అంశాలన్నింటిని కొలతలేసి మరీ ‘జూనియర్’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాధా కృష్ణ. హీరోని ఎలివేట్ చేసేలా యాక్షన్ సీన్స్, డ్యాన్స్, డైలాగ్స్ అన్నీ చక్కగా సెట్ చేసుకున్నాడు. కానీ కథ విషయంలో మాత్రం కొత్తగా ఆలోచించలేకపోయాడు. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీ సన్నివేశం పాత సినిమాలను గుర్తు తెస్తుంది. కామెడీ బాగా పండడం.. పాటలు, యాక్షన్ సీన్లు ఆకట్టుకునేలా ఉండడంతో రొటీన్ కథే అయినా ప్రేక్షకులకు బోర్ కొట్టదు(Junior Movie Review). ఒక ఎమోషన్ సీన్‌తో కథను ప్రారంభించి.. కాసేపటికే కథను కాలేజీకి షిఫ్ట్ చేశాడు. హీరో ఎంట్రీ సీన్‌ని బాగా ప్లాన్ చేశారు. కాలేజీలో హీరోయిన్‌తో చేసే అల్లరి, స్నేహితులతో కలిసి చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది. జెనీలియా పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కాస్త సీరియస్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితీయార్థంపై ఆసక్తి పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కొన్ని సన్నివేశాలు శ్రీమంతుడు, మహర్షి సినిమాలను గుర్తు తెస్తుంది. కొన్ని చోట్ల ఎమోషన్ బాగా పండింది కానీ కథనంలో మాత్రం కొత్తదనం అనిపించదు. ప్రతి సీన్ ఎక్కడో చూసినట్లుగానే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓ చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హీరో కిరీటిరెడ్డికి మాత్రం ఫర్ఫెక్ట్ డెబ్యూ ఫిల్మ్. మరి కమర్షియల్‌గా ఏ మేరకు ఆట్టుకుంటుందో చూడాలి. ఎవరెలా చేశారంటే..కిరీటీకి ఇది తొలి చిత్రమే అయినా తెరపై చూస్తే మాత్రం ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వైరల్ వయ్యారి పాటలో శ్రీలీలతో పోటీ పడి మరీ డ్యాన్స్ చేశాడు. కొన్ని స్టెప్పులు జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో వేశాడు. శ్రీలీల పాత్రకు ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదు. కేవలం పాటల కోసమే అన్నట్లుగా ఆమె పాత్రని తీర్చిదిద్దారు. సెకండాఫ్ మొత్తంలో ఒక వయ్యారి పాటలో మాత్రమే కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత జెనీలియా ఓ మంచి పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. విజయ సౌజన్య పాత్రకు ఆమెకు న్యాయం చేసింది. అయితే నటించేందుకు ఆ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. హీరో తండ్రిగా రవిచంద్రన్ ఉన్నంతలో చక్కగా నటించాడు . వైవా హర్ష, సత్యల కామెడీ బాగా పండింది. రావు రమేశ్, అచ్యుత్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి బిగ్ ఎసెట్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. వైరల్ వయ్యారి పాట బిగ్ స్క్రీన్‌పై ఇంకా బాగుంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
తమ్ముడు మూవీ రివ్యూ
టైటిల్: తమ్ముడునటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్నిర్మాత : దిల్ రాజు, శిరీష్దర్శకత్వం: శ్రీరామ్ వేణుసంగీతం: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్ఎడిటింగ్: ప్రవీణ్ పూడివిడుదల తేది: జులై 4, 2025నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్లు అయింది. భారీ అంచనాలు పెట్టుకున్న రాబిన్ హుడ్ కూడా నితిన్‌ని నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పవన్ కల్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ ‘తమ్ముడు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం నితిన్‌ని హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూ (Thammudu Movie Review)లో చూద్దాం.కథజై (నితిన్) ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనుకుంటాడు. కానీ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేకపోతాడు. దానికి కారణం.. చిన్నప్పుడు తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ( లయ) విషయంలో చేసిన ఒక చిన్న తప్పు! ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది. అక్కని కలిస్తే తప్ప తను ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు చిత్ర ( వర్ష బొల్లమ) తో కలిసి వైజాగ్ వస్తారు. అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి అంబరగొడుగు జాతర వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో జై అక్కడికి వెళ్తాడు. అక్కడ బిజినెస్మెన్ అజార్వాల్ మనుషులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. అజార్వాల్ మనుషులు ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి అక్కని జై ఎలా రక్షించాడు? అతనికి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలాంటి సహాయం చేసింది? ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి? చివరకు అది నెరవేరిందా లేదా? అక్క విషయంలో జై చేసిన తప్పు ఏంటి? చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అనిపించుకున్నాడా లేదా అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే...అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. చాలా రొటీన్ స్టోరీ. కానీ దర్శకుడు తనదైన స్క్రీన్‌ప్లేతో తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాకి కీలకమైన అక్క- తమ్ముడు సెంటిమెంట్‌ను ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతిదీ మన ఊహకి అందేలా సాగడం, ఎమోషనల్ సన్నివేశాలు సరిగా పండకపోవడం సినిమాకి మైనస్ అనే చెప్పాలి.ఫ్యాక్టరీ ప్రమాదం సన్నివేశంతో చాలా ఎమోషనల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. విలన్ పరిచయం సీన్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. భారీ ఎలివేషన్‌తో విలన్‌ను పరిచయం చేసి.. ఆ తరువాత కథని హీరో వైపు మళ్లించాడు. ఆర్చరీలో బంగారు పథకమే లక్ష్యం గా ఉన్న జై... అక్క విషయంలో చేసిన తప్పుని పదేపదే గుర్తు తెచ్చుకోవడం... కోచ్ చెప్పిన మాటతో అక్క కోసం వెళ్ళడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అంబరగొడుగు నేపథ్యం సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఊహించింది తెరపై జరుగుతుంటే కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తాం. ఇంటర్వెల్ వరకు కథనం సోసోగానే సాగుతుంది. అజార్వాల్ గ్యాంగ్ నుంచి ఝాన్సీ ఫ్యామిలీని జై ఎలా రక్షించాడు? అనేదే సెకండాఫ్ స్టోరీ. అయితే మధ్య లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ రొటీన్‌గా సాగుతుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎమ్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.ఎవరెలా చేశారంటే..జై పాత్రలో నితిన్ (Nithiin) చక్కగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. అయితే ఆయన ఈ సినిమాలో హీరో అనడం కంటే... కీలక పాత్రధారి అని చెప్పడం బెటర్. రత్నం పాత్రకి సప్తమి గౌడ న్యాయం చేసింది. ఝాన్సీగా లయ నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. చిత్రగా వర్ష బొల్లమ్మ బాగా నటించింది. మిగతావాళ్లందరూ తమ పాత్రలతో మెప్పించారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
'ఉప్పు కప్పురంబు' మూవీ రివ్యూ.. డిఫరెంట్ పాత్రలో కీర్తి సురేశ్
టైటిల్ : ఉప్పు కప్పురంబునటీనటులు: కీర్తి సురేశ్, సుహాస్, బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరినిర్మాణ సంస్థ: అమెజాన్ ప్రైమ్నిర్మాత: రాధిక లావుకథ: వసంత్ మురళీకృష్ణ దర్శకత్వం: ఐవీ శశివిడుదల తేది: జులై 4, 2025స్ట్రీమింగ్: అమెజాన్జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్(Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). జులై 4న డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. నటుడు సుహాస్ కీలక పాత్ర పోషించారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా దర్శకులు ఐవీ శశి రూపొందించగా.. రాధికా ఎల్ నిర్మించారు. ఈ చిత్రానికి వసంత్ మురళీకృష్ణ కథని అందించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక గ్రామంలో శ్మశాన వాటిక కోసం ఏర్పడిన సంక్షోభాన్ని.. అక్కడి ప్రజలు ఏవిధంగా పరిష్కరించుకుంటారనే కథనంతో ఈ సినిమా సిద్ధమైంది. 1990 నాటి బ్యాక్డ్రాస్ స్టోరీతో వచ్చిన ఉప్పు కప్పురంబు సినిమా ఎలా ఉంది తెలుసుకుందాం.కథేంటంటే..‘ఉప్పు కప్పురంబు’ సినిమాకు కథను పరిచయం చేస్తూ హీరో రానా వాయిస్ ఇచ్చారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ' చిట్టి జయపురం' అనే గ్రామానికి పెద్దగా (సుబ్బరాజు) శుభలేఖ సుధాకర్ ఉంటారు. అయితే, ఆయన మరణించడంతో అతని కుమార్తె అపూర్వ (కీర్తి సురేష్) గ్రామ పెద్దగా కొనసాగుతుంది. వయసులో చిన్నపిల్ల అయిన అపూర్య గ్రామ పెద్ద ఏంటి..? అంటూ భద్రయ్య (బాబు మోహన్), మధు (శత్రు) తీవ్రంగా వ్యతిరేఖిస్తారు. అయితే, ఇక్కడ వారిద్దరు కూడా ఒకరిపైమరోకరు ఆధిపత్యం కోసం పోరాడుతూనే అపూర్వను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అలా వారు రెండు వర్గాలుగా విడిపోయి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. గ్రామ పెద్దగా ఉన్న అపూర్వకు ఒక సమస్య వచ్చి పడుతుంది.గ్రామంలో ఎవరు మరణించినా వారి ఆచారం ప్రకారం ఉత్తరాన మాత్రమే పాతిపెట్టడం ఆనవాయితీగా ఉంది. చాలా ఏళ్ల నుంచి వారు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఆ స్మశానం నిండిపోయిందని అక్కడి కాపరిగా ఉండే చిన్న (సుహాస్) తెలుపుతాడు. అయితే, నలుగురికి మాత్రమే అక్కడ చోటు ఉందని చిన్న చెబుతాడు. ఈ సమస్యను పరిష్కరించాలని అపూర్వను కోరుతాడు. గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ నలుగురిని లాటరీ పద్ధతి ద్వారా అపూర్వ ఎంపిక చేస్తుంది. అయితే, సడెన్‌గా జరిగిన ఒక ప్రమాదంలో అదేరోజు మరో నలుగురు మరణిస్తారు. తప్పని పరిస్థితిలో వారిని అక్కడ పాతిపెట్టాక శ్మశానం హౌస్‌ఫుల్ అని బోర్డు పెట్టేస్తారు. అయితే, ఆ శ్మాశనంలో ఇంకోకరికి చోటు ఉంటుంది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చిన్న దాచిపెడుతాడు. అలా అతను ఎందుకు చేశాడు..? గ్రామానికి తూర్పు దిక్కున మాత్రమే శ్మశానం ఎందుకు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు..? శ్మశాన కాపరిగా ఉన్న చిన్న చేసిన మోసం వల్ల అపూర్వకు ఎదురైన చిక్కులు ఏంటి..? ఫైనల్‌గా అపూర్వ కనుగొన్న పరిష్కారం ఏంటి..? అనేది తెలియాలంటే ఉప్పు కప్పురంబు సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. 1990 కాలం నాటి ప్రజలు శ్మశానంలో ఆరు అడుగుల స్థలం కోసం ఎలాంటి ఇబ్బందులు పడేవారో ఈ చిత్రంతో దర్శకుడు ఐవీ శశి చక్కగా చూపారు. ఆ రోజులకు తగ్గట్టుగానే పాత్రలను డిజైన్ చేయడమే కాకుండా కథను కూడా కాలానికి అనుగునంగా రాసుకున్నాడు. దీంతో ఓటీటీ ప్రియులకు మంచి వినోదాన్ని ఈ చిత్రం ఇస్తుంది. పరిశ్రమలోకి వచ్చే కొత్త రచయితలు, దర్శకులు ఇలా సరికొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. ఇంత చిన్న పాయింట్‌తో కూడా సినిమా తీయొచ్చా..? అని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటి శ్మశానం. ఆ పాయింట్‌కు కాస్త వినోదం జోడించి తెరపై చూపించడంలో దర్శకుడు ఐవీ శశి విజయం సాధించారు.ఇప్పటి వరకు కీర్తి సురేష్ గ్లామర్, డీ గ్లామర్ పాత్రలతో మెప్పించింది. అయితే ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్రలో అదరగొట్టింది. మంచి కామెడీ స్కోప్ ఉన్న పాత్రలో దుమ్మురేపింది. అపూర్వ ఊరి పెద్ద అయిన తర్వాత శ్మశానం సమస్య తెరపైకి వస్తుంది. ఏదో తాత్కాలికంగా దానిని తీర్చాం అనుకునేలోపు నలుగురు చనిపోతారు. దీంతో ఆ సమస్య మరింత తీవ్రం అవుతుంది. అలాంటి సమయంలో సుహాస్ ఒక ప్లాన్‌తో తెరపైకి వస్తాడు. ఇలా శ్మశానం చుట్టూ సమస్యలు వాటికి పరిష్కారాలు తెరపై దర్శకుడు చూపిస్తాడు. కీర్తి సురేశ్ గ్రామ పెద్దగా నటన బాగున్నప్పటికీ ఆమె పాత్రలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి ప్రేక్షకుడికి లాజికల్‌గా అనిపించవు. ఒక సీన్లో అమాయకంగా కనిపించిన కీర్తి.. మరో సీన్లో చాలా తెలివైన అమ్మాయిగా వ్యవహరిస్తుంది. ఇలాంటి సీన్స్ కాస్త తికమకకు గురిచేస్తాయి. కొన్ని సీన్లు మరీ ఓవర్ రియాక్ట్ అయ్యేలా ఉంటాయి. కానీ, ఆమె నటన మాత్రం అదిరిపోతుంది. సుహాస్ పాత్ర చాలా స్టేబుల్‌గానే ఉంటుంది. ఎక్కడా కూడా తడబాటు లేకుండా సెట్ చేశాడు. సినిమా మొత్తం ఎక్కువగా సుహాస్, కీర్తిల మధ్యే జరుగుతుంది. కథలో అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది. మిమ్మల్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తుంది. క్లైమాక్స్‌లో ఊరి సమస్యకు పరిష్కారం కనుగొన్న తీరు కాస్త ఎమోషనల్‌గా సీన్ రాసుకోవడం బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఓటీటీలో చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. ఇందులో కీర్తి సురేశ్ నటన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మెప్పిస్తుంది కూడా..ఎవరెలా చేశారంటే.. ఈ మూవీలో కీర్తి సురేష్ పాత్ర చాలా బలం. అందుకు తగ్గట్లుగానే ఆమె నటించింది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలు అన్నీ కూడా చాలా రొటీన్‌గానే ఉంటాయి. కానీ అపూర్వ పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఎప్పిటికీ నిలిచిపోతుంది. ఇందులో అమాయకంగా, క్యూట్‌గా, అల్లరి పిల్లగా, బాధ్యతగల గ్రామ పెద్దగా ఇలా పలు షేడ్స్ ఆమె నటనలో కనిపిస్తాయి. ఒక మంచి పాత్రే కీర్తికి పడింది అని చెప్పవచ్చు.కాటి కాపరి పాత్రలో సుహాస్ మెప్పించాడు. ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు.'నిజం' సినిమాలో మహేశ్‌బాబుకు అమ్మగా నటించిన తాళ్లూరి రామేశ్వరికి ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర పడింది. ఈ మూవీతో ఆమెకు మరిన్ని ఛాన్సులు రావచ్చని చెప్పొచ్చు. బాబు మోహన్, శత్రు తమ పాత్రల మేరకు మెప్పించారు. సంగీతం, సినిమాటోగ్రాఫర్ ఈ మూవీకి బలాన్ని చేకూర్చాయి. మూవీ నిర్మాణ విలువలు బడ్జెట్‌కు మించే ఉన్నాయని చెప్పవచ్చు. 'ఉప్పు కప్పురంబు' ఓటీటీలో ఎవరినీ నిరుత్సాహపరచని సినిమాగా తప్పకుండా మిగిలిపోతుంది. -
విజయ్ ఆంటోనీ 'మార్గన్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్‌తో మెప్పించాడా?
కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త సినిమా 'మార్గన్' జూన్ 27న విడుదలైంది. చిత్రపరిశ్రమలో విజయ్ ఆటోనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన హీరో మాత్రమే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా ఇలా మల్టీ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే, ఈ సారి నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘మార్గన్’ అనే చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథనగరంలో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఓ ఇంజక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారు. ఆమె శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. సంచలనంగా మారిన ఆ కేసును చేధించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ) రంగలోకి దిగుతాడు. సుమారు పదేళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురికావడంతో ఈ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని ధృవ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవ్వరూ బలి కావొద్దని అనుకుంటాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి.అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తాడు. కానీ, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలను ధృవ తెలుసుకుంటాడు. ఈ హత్యలకు ఆరవింద్‌కు సంబంధం ఉందా. ధృవ కూతురిని చంపింది ఎవరు..? ఈ కేసును పరిష్కరించే క్రమంలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల, మేఘల పాత్ర ఏంటి..? ఫైనల్‌గా హంతకుడు ఎలా దొరికాడు..? అనేది తెలియాలంటే మార్గాన్ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..మార్గన్ కథ మనం గతంలో చూసిన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలానే ఉంటుంది. అంతా ఒకే ఫార్మాట్లోనే సాగుతుంది. హత్యల చేస్తున్న వ్యక్తి అందరిముందు శ్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాడు. కానీ, అతనే హత్య చేశాడని చివరివరకు రివీల్ కాదు. ఇదే పంతాలో మార్గన్ స్టోరీ ఉంది. రమ్య హత్య ఎపిసోడ్‌తో కథలో ఎంతమేకు సీరియస్‌నెస్ ఉందో దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. యువతి హత్య కేసును చేధించేందుకు వచ్చిన ధృవ వెంటనే అరవింద్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఇంత సులువుగా ఇన్వెస్టిగేషన్ మొదలు అయిందా అనే ఫీలింగ్ వస్తుంది.రెగ్యులర్ ఫార్మాట్లో సాగే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కాదని సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ చెప్పారు. కానీ, సినిమా చూస్తే మాత్రం అలా అనిపించకపోవచ్చు. ఇందులో ఎక్కువ టైం తీసుకోకుండా నేరుగా పాయింట్లోకి వెళ్లాడు. సోది అనేది లేకుండా డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆడియెన్స్ అనుమాన పడేలా అరవింద్ క్యారెక్టర్‌ను చూపిస్తారు. ఇంటర్వెల్ వరకు అందరూ కూడా అరవింద్ మీదే ఫోకస్ పెడతారు. అప్పటిదాకా నగరంలో జరిగిన హత్యలతో అరవింద్‌కు సంబంధం ఉన్నట్లు సినిమా చూసే వారికి అనిపిస్తుంది. మళ్లీ కాదేమో అనిపిస్తుంది. ఇలా ఇంటర్వెల్‌కు వచ్చేసరికి దీనిపై అటు హీరోకీ ఇటు ప్రేక్షకులకూ ఓ స్పష్టత వచ్చేస్తుంది. అక్కడి నుంచి సెకండాఫ్ మరింత ఆసక్తిని రెట్టింపు చేస్తుంది.సెకండాఫ్‌లో హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వేగం అందుకుంటుంది. కానీ, కథలో వేగం తగ్గుతుంది. కానీ ఇలాంటి జానర్లో వచ్చే చిత్రాలకు ఓ ఫార్మూలా ఉంటుంది. ఎవరి మీద అయితే అనుమానపడతామో.. వాళ్లు అసలు హంతకులు కాదు. ఎవరిని అయితే మనం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటామో వాళ్లే చివరకు షాకింగ్‌గా సర్ ప్రైజ్ ఇస్తారు. అలా ఇందులోనూ ట్విస్ట్ ఇస్తారు. దాదాపు హంతకులు ఎవరన్నది ఆడియెన్స్ ఊహించలేరు. ఫస్ట్ హాఫ్ అంతా అరవింద్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో ఆ పాత్ర చేసే విన్యాసాలు, ఇన్వెస్టిగేషన్లో చేసే సహాయం బాగుంటుంది. క్లైమాక్స్ సమయంలో దర్శకుడు కాస్త సాగదీశాడేమో అనిపిస్తుంది. సైకో కిల్లర్ ఎవరన్నది ప్రేక్షకులకు క్లారిటీ వచ్చినా.. అతను అలా చేయడానికి కారణం ఏమంత కొత్తగా అనిపించదు. అయితే, రెండు గంటల సేపు ఎంగేజింగ్‌గా తీయడంతో జాన్ పాల్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం.ఎవరెలా చేశారంటే..'మార్గన్' సినిమాకు విజయ్ ఆంటోనీ ప్రధాన బలం. ఈ చిత్రానికి తెరపై, తెర వెనుక హీరో అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఇలా అన్నింటినీ హ్యాండిల్ చేశారు. పోలీస్ పాత్రకు తగ్గట్లు సీరియస్‌గా ఒకే లుక్‌లో ఆయన కనిపించారు. ఆర్ఆర్ అయితే ఇంటెన్స్‌గా అనిపిస్తుంది. అజయ్ దిశాన్ పాత్ర కథకు చాలా కొత్తగా ఉంటుంది. సినిమా ఆరంభంలో సైకో కిల్లర్‌లా అదరగొట్టిన ఆయన సెకండాఫ్ వచ్చేసరికి సూపర్ హీరోలా అలరించాడు. తన యాక్టింగ్‌తో అందరినీ సర్ ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు. ఇతను విలనా..? సపోర్టింగ్ యాక్టరా..? హీరోనా..? అన్న రేంజ్లో పర్ఫామెన్స్ ఇస్తాడు. బ్రిగిడ పాత్రకు అంత స్కోప్ దక్కలేదు. వెన్నెల, మేఘ పాత్రధారి నటన బాగుంటుంది. మిగిలిన ఇతర పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు. ఓటీటీలో రెగ్యులర్‌గా ఇలాంటి క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చూసే వాళ్లకి మార్గన్ గొప్ప చిత్రంగా అనిపించకపోవచ్చు. కానీ మార్గన్ మూవీ ఆడియెన్స్‌ని నిరాశ పర్చకపోవచ్చు. దర్శకుడు కథను ముగించిన తీరు అందరికీ సంతృప్తినివ్వదని చెప్పవచ్చు. -
‘కన్నప్ప’ మూవీ రివ్యూ
టైటిల్ : కన్నప్పనటీనటులు: విష్ణు మంచు, మోహన్ బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీనిర్మాత: మోహన్ బాబుకథ:పరుచూరి గోపాల కృష్ణ,ఈశ్వర్ రెడ్డి, జి. నాగేశ్వర రెడ్డితోట ప్రసాద్దర్శకత్వం: ముకేశ్ కుమార్ సింగ్సంగీతం : స్టీఫెన్ దేవస్సీసినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌఎడిటర్: ఆంథోనీవిడుదల తేది: జూన్ 27, 2025కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథకుడిగా, నిర్మాతగాను వ్యవహరించాడు. మంచు ఫ్యామిలికి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించాయి. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్ వచ్చాక ఈ సినిమాపై ఉన్న నెగెటివిటీ తగ్గిపోయింది. ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Kannappa Movie Review).కథేంటంటే..తిన్నడు(మంచు విష్ణు) పరమ నాస్తికుడు. అతని తండ్రి నాథ నాథుడు(శరత్ కుమార్) మాటే ఆయనకు వేదం. గూడెం ప్రజలకే ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడానికి చెందిన యువరాణి నెమలి(ప్రీతీ ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ఓసారి గూడెంలో ఉన్న వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. ఈ విషయం కాల ముఖుడికి తెలిసి.. గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు. అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని వీడాల్సి వస్తుంది. నెమలితో కలిసి అడవికి వెళ్తాడు. శివుడి పరమభక్తురాలైన నెమలి.. దేవుడినే నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు? వీరి జీవితంలోకి రుద్ర(ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం కోసం కాల ముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడు పరమ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కన్నప్ప కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పరమ నాస్తికుడైన తిన్నడు పరమ భక్తుడిగా ఎలా మారాడు అనేది 50 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘భక్త కన్నప్ప’ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అదే కథతో ఇప్పుడు మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఓ భక్తి కథకు కావాల్సినంత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ ను నేటి తరానికి నచ్చేలా ‘కన్నప్ప’ కథను చెప్పాలనుకున్నారు. ఈ విషయంలో మంచు విష్ణుని అభినందించాల్సిందే. అయితే టెక్నికల్‌గా సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. సీజీ వర్క్ పేలవంగా ఉంది. వార్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎమోషన్ని తెరపై బాగా పండించి ఆ లోపాలను కాస్త కప్పిపుచ్చారు. భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్‌గా సాగుతూ.. శివ భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శివుడు గొప్పతనాన్ని పాట రూపంలో చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత తిన్నడు ఎందుకు నాస్తికుడిగా మారాల్సి వచ్చిందో అర్థవంతంగా చూపించారు. మంచు విష్ణు ఎంట్రీ కథనం ఆసక్తి పెరుగుతుంది. యువరాణి నెమలితో ప్రేమలో పడడం.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకుంటాయి. పాటల పేరుతో భక్తి చిత్రంలోనూ శృంగార రసాన్ని బాగానే పండించారు. కొన్ని చోట్ల ఆ శృంగార రసం మితిమీరిపోయింది కూడా. ఇక మోహన్ బాబు ఎంట్రీ, మోహన్ లాల్ ఎంట్రీ సీన్స్ అదిరిపోతాయి. అయితే ఫస్టాఫ్‌లో వచ్చే యుద్ద సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఓవరాల్‌గా ఫస్టాఫ్ పర్లేదులే అన్నట్లుగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రుద్రగా ప్రభాస్ ఎంట్రి ఇచ్చిన తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ప్రభాస్ కనిపించేది 20 నిమిషాలే అయినా.. ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోతారు. క్లైమాక్స్‌లో విష్ణు నటన ఆకట్టుకుంటుంది. శివ భక్తులకు చివరి 40 నిమిషాలు అయితే విపరీతంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తిన్నడు అలియాస్ కన్నప్పగా మంచు విష్ణు బాగా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో విష్ణు నటన అదిరిపోతుంది. ఆయన కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్‌గా కన్నప్ప నిలిచిపోతుంది. గూడెపు యువరాణి, శివుడి పరమ భక్తురాలు నెమలిగా ప్రీతి ముకుందన్ మంచి నటనతో ఆకట్టుకుంది. తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శిస్తూనే.. నటన పరంగాను మంచి మార్కులే సంపాదించుకుంది. విష్ణు, ప్రీతీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక రుద్రగా ప్రభాస్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తెరపై కనిపించేది 20 నిమిషాలే అయినా.. అవే సినిమాకు కీలకంగా మారుతాయి. తిన్నడు, నెమలితో పాటు మహాదేవ శాస్త్రీ పాత్రలకు రుద్రకు మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయి. ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్‌లో విజిల్స్ వేయిస్తాయి. ఇక శివుడికి తనకంటే గొప్ప భక్తుడు లేడని భావించే మహాదేవ శాస్త్రీగా మోహన్‌బాబు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన డైలాగు డెలివరీ ఆ పాత్రకు హుందాతనం తెచ్చింది. మోహన్‌లాల్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతీదేవి పాత్రలో కాజల్ ఒదిగిపోయారు. ఇక తిన్నడు తండ్రిగా శరత్‌కుమార్ నటన బాగుంది. కానీ, ఓన్ వాయిస్‌తో చెప్పిన డబ్బింగ్ బాగోలేదు. చిన్నప్పటి తిన్నడుగా నటించిన అవ్రామ్.. నటన పరంగా ఓకే కానీ డబ్బింగ్ దారుణంగా ఉంది. తెలుగు పదాలు సరిగా పలకలేకపోయాడు. బ్రహానందం, మధుబాల, శివబాలాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా బాగుంది. స్టీఫెన్ దేవస్సీ పాటలు పర్వాలేదు కానీ నేపథ్య సంగీతమే అంతగా బాగోలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేసేలా బీజీఎం ఉంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. న్యూజిలాండ్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
శేఖర్ కమ్ముల(Sekhar kammula)కు సెన్సిబుల్ దర్శకుడు అనే పేరుంది. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఇవ్వడం ఆయన స్టైల్. అందుకే సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని వచ్చినా.. శేఖర్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. లేట్‌గా వచ్చిన డిఫరెంట్ సినిమానే చూపిస్తాడనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది. లవ్‌స్టోరీ(2021) తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రం కుబేర(Kuberaa Movie Review). తొలిసారి ధనుష్(Dhanush), నాగార్జున లాంటి బడా హీరోలతో ఆయన ఈ సినిమా తెరకెక్కించాడు. నేషనల్ క్రష్ రష్మిక ఇందులో మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో కుబేరపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కుబేరా’ కథేంటంటే..?దీపక్ (నాగార్జున) నిజాయితీ గత సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. కోర్టుకు వెళ్లినా న్యాయం జరగదు. అదే సమయంలో తనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్‌ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ. 50 వేల కోట్లను వైట్‌లో మరో 50 వేల కోట్లను బ్లాక్‌లో బదిలీ చేయాల్సి ఉంటుంది(Kuberaa Movie Review). దాని కోసం దీపక్ నలుగురు బిక్షగాళ్లను తీసుకొచ్చి, వాళ్ల పేరు మీద రూ. 10 వేల కోట్ల చొప్పున అకౌంట్లో జమ చేస్తాడు. వారిలో ఒక భిక్షగాడే దేవా(ధనుష్). పని ఇప్పిస్తామని చెప్పి తిరుపతి నుంచి ముంబైకి తీసుకొచ్చి.. దేవా పేరుపై డబ్బులు జమ చేస్తారు. ఆ డబ్బులను మళ్లీ కేంద్ర మంత్రుల బినామీకి బదిలీ చేయించే క్రమంలో దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు? నీరజ్ గ్యాంగ్ అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి? నీరజ్ గురించి దీపక్‌ని తెలిసి అసలు నిజం ఏంటి? కేంద్ర మంత్రులకు నీరజ్ మిత్రా రూ. లక్ష కోట్లను లంచంగా ఎందుకు ఇస్తున్నాడు? బిచ్చగాడైన దేవా..బడా వ్యాపారవేత్త నీరజ్‌కి చెప్పిన గుణపాఠం ఏంటి? చివరకి రూ. లక్ష కోట్లు చేతులు మారాయా లేదా? ఈ కథలో సమీరా(రష్మిక)పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సెన్సిబుల్ కథలో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడంలో శేకర్ కమ్ముల దిట్ట. సమాజంలో జరుగుతున్న పరిణామాలనే కథగా మలిచి.. ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే ఒక మంచి సందేశం అందిస్తుంటాడు. అలా అని సందేశం ఇవ్వడానికి సినిమా తీసినట్లుగా అనిపించదు. సినిమా చూస్తే మనకే ఓ సందేశం అందుతుంది. కుబేర చిత్రాన్ని కూడా అలానే తెరకెక్కించాడు. కార్పోరేట్ వ్యవస్థలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయి? రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు? బ్లాక్ మనీ ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. దీని కోసం శేకర్ కమ్ముల చాలా లోతుగా అధ్యయనం చేసినట్లుగా సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రతీ విషయం డీటేయిల్డ్‌గా చూపించాలనే తాపత్రాయంతో నిడివిని అమాంతం పెంచేశారు. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ చిత్రాన్ని దాదాపు అరగంటకు తగ్గించిన పర్వాలేదనిపిస్తంది. కట్ చేసినా పర్లేదు అనే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అదొక్కటే సినిమాకు పెద్ద మైనస్. అయితే ధనుష్ , నాగార్జున తమ నటనతో ఆ సాగదీతను కొంతమేర కప్పిపుచ్చుకొచ్చారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బిచ్చగాడు.. ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక ధనవంతుడు.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ నిజాయితీ ఆఫీసర్.. ఈ మూడు రకాల పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. ఆయిల్ స్కామ్ సన్నివేశంతో కథని ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నాగార్జున పాత్ర ఎంట్రీ, బ్లాక్ మనీ బదిలీ ప్లాన్.. బిచ్చగాళ్ల ఎంపిక.. ఇవన్నీ చకచక సాగిపోతాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత ధనుష్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. దేవా తప్పించుకుపోయిన తర్వాత కథనం పరుగులు పెరుగుతుంది. అతన్ని ఎలా పట్టుకుంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో నాటకీయత ఎక్కైవైనట్లుగా అనిపిస్తుంది. వ్యాపారవేత్త నీరవ్ మిత్రా బిచ్చగాడిలా మారడం.. అధికార బలం ఉన్నా బిచ్చగాడిని పట్టుకోలేకపోవడం.. సినిమాటిక్‌గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల శేకర్ లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. ఎప్పటి మాదిరే తను చెప్పాలనుకున్న కథను శేఖర్ కమ్ముల చాలా నిజాయితీగా చెప్పేశాడు. ఎవరెలా చేశారంటే.. ధనుష్ నటన గురించి ప్రత్యేక్షంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతాడు. అలాంటి నటుడు శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి దొరికితే ఎలా ఉంటుంది? కొత్త నటీనటులతోనే అద్భుతంగా నటింపజేసే శేకర్.. ధనుష్‌లోని టాలెంట్‌ని పూర్తిగా వాడేశాడు. బిచ్చగాడు దేవ పాత్రలో నటించలేదు..జీవించేశాడు. తెరపై ఓ స్టార్ హీరో ఉన్నాడనే సంగతే గుర్తుకురాదు. బిచ్చగాడే మన కళ్లముందు కనిపిస్తాడు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకే అభినందించాలి. ఇక ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది. నాగార్జున కూడా ఇందులో డిఫరెంట్ పాత్ర పోషించాడు. సీబీఐ ఆఫీసర్ దీపక్‌గా చక్కగా నటించాడు. ఆయన కెరీర్లో ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. రష్మిక తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె ఎంట్రీ కామెడీగా ఉన్నా.. రాను రాను ఆమె పాత్ర ప్రాధాన్యత పెరుగుతుంది. విలన్‌గా జిమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్‌గా కనిపంచాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేవాడు. పాటలు సందర్భానుసారంగా వస్తుంటాయి. పోయిరా పోయిరా పాటతో పాటు అమ్మ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ముంబై సెట్‌తో పాటు ప్రతీది సహజంగా తీర్చిదిద్దారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో నిర్థాక్షిణంగా కట్ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'8 వసంతాలు' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రేమకథలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలా వచ్చిన చిత్రం '8 వసంతాలు'. గతంలో 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనంతిక సనీల్ కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా ఇది థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రేమకథా సినిమా అనగానే.. హా ఏముంది అబ్బాయి-అమ్మాయి ప్రేమించుకుంటారు. కుదిరితే ఒక్కటవుతారు లేదంటే విడిపోతారు. ఇందులో పెద్ద చెప్పుకోవడానికి ఏముందిలే అనుకుంటాం. కానీ ప్రేమకథని ఎంత అందంగా, ఎంత హృద్యంగా చెప్పొచ్చో కొందరు దర్శకులు నిరూపించారు. అలా 'అందాల రాక్షసి', 'సీతారామం' లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వాటితో సరిసమానంగా నిలిచే చిత్రం ఈ '8 వసంతాలు'.సినిమా టైటిల్స్ పడుతున్న టైంలోనే మొత్తం కథని రివర్స్‌లో చూపించేస్తారు. అలా ఊటీలో ఓ కరాటే ఇన్స్టిట్యూట్లో కథ మొదలవుతుంది. తనని ఓడిస్తే ఐపాడ్ గిఫ్ట్‌గా ఇస్తానని హీరో వరుణ్ ఛాలెంజ్ చేస్తాడు. అక్కడున్న వాళ్లందరూ అతడి చేతిలో ఓడిపోతారు. కానీ శుద్ధి అతడిని ఓడిస్తుంది. అహాన్ని నేలకు దించుతుంది. ఆ క్షణం వరుణ్.. శుద్ధితో ప్రేమలో పడిపోతాడు. తర్వాత ఆమె వెంటపడటం, ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలు ఆహ్లాదంగా ఉంటాయి. అంతా సవ్యంగానే ఉంది కదా అనుకునే టైంలో వరుణ్ తన స్వార్థం చూసుకుంటాడు. శుద్ధిని దూరం పెడతాడు. దీంతో ఆమె వచ్చి వరుణ్ ముందు నిలబడుతుంది. వీళ్లిద్దరి మధ్య సాగే సంభాషణ విజిల్స్ వేయిస్తుంది. అలా అదిరిపోయే సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్‌కి వచ్చేసరికి శుద్ధికి కరాటే నేర్పిన గురువు చనిపోవడం, ఆయన అస్థికల్ని గంగలో కలపడం ఇలా సాగుతుంది. కొన్నాళ్ల తర్వాత శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. ఈమెలానే అతడు కూడా ఓ రచయిత. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా? ఇంతకీ సంజయ్ గతమేంటి? చివరలో శుద్ధితో సంజయ్ ఒక్కటయ్యాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.'8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. మధ్యమధ్యలో బలమైన సన్నివేశాలు, మనసుని తాకే డైలాగ్స్ వస్తుంటాయి. తొలి భాగంలో మహిళల గుణం గురించి హీరోయిన్ చెప్పే ఓ సీన్ భలే ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముందు శుద్ధి-వరుణ్ మధ్య సంభాషణ వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి సంజయ్ పాత్ర ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఎందుకంటే క్లైమాక్స్‌కి కాసేపు ముందు వచ్చే ఈ పాత్రకు పెద్దగా సీన్స్ ఉండవు. కానీ క్లైమాక్స్‌లో ఇతడి పాత్రని తొలి సీన్ నుంచి లింక్ చేసిన విధానం.. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అలానే '8 వసంతాలు' అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా చివర్లో రివీల్ చేసిన విధానం బాగుంది. సినిమాలో ఎన్ని పాత్రలున్నా సరే హీరోయిన్ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. డైలాగ్స్ అయితే భావుకత, కవితలు అంటే ఇష్టపడేవారితో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా నచ్చేస్తాయి.ఎవరెలా చేశారు?శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక జీవించేసింది. 17 ఏళ్ల అమ్మాయిగా, 25 ఏళ్ల మహిళగా వేరియేషన్స్ చూపించింది. వరుణ్‌గా చేసిన హనురెడ్డి.. ఎన్నారై కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో వచ్చే సంజయ్ పాత్రధారి రవి దుగ్గిరాల ఇదివరకే 'మధురం'లో నటించాడు. ఇందులో అతడి పాత్ర ఉన్నది కాసేపు అయినా డిజైన్ చేసిన విధానం బాగుంది. మిగిలిన పాత్రధారులు కూడా ఎవరికి వాళ్లు పూర్తిగా న్యాయం చేశారు.టెక్నికల్‌గా చూసుకుంటే సినిమాలో డైలాగ్స్ మెయిన్ హైలైట్. ప్రతి 10-15 నిమిషాలకు ఒకటి వస్తుంటుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఊటీ, కశ్మీర్, కాశీ అందాల్ని బాగా చూపించారు. ఇక డైరెక్షన్ విషయానికొస్తే.. ఇదివరకే మధురం షార్ట్ ఫిల్మ్, మను సినిమాతో తానెంటో నిరూపించుకున్న ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు '8 వసంతాలు' సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.స్వచ్ఛమైన ప్రేమకథని వినసొంపైన సంగీతంతో మనసుని తాకే సంభాషణలతో తీసిన ఓ మంచి సినిమా చూడాలనుకుంటే '8 వసంతాలు' అస్సలు మిస్ కావొద్దు. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన -
ఓటీటీ సినిమా రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్
సింపుల్ బడ్జెట్, డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీయడంలో మలయాళ దర్శకుల తర్వాత ఎవరైనా. ఎందుకంటే రీసెంట్ టైంలో అలా వచ్చిన పలు చిత్రాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో దుమ్మురేపుతున్నాయి. అలాంటి ఓ చిత్రమే 'పడక్కళమ్'. ఓవైపు నవ్విస్తూనే కన్ఫ్యూజన్ కామెడీతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉంది? దీని సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ ఇంజినీరింగ్ కాలేజీ. షాజీ(సూరజ్ వెంజరమోడు) అనే ప్రొఫెసర్. ఆయన డిపార్ట్మెంట్ హెచ్ఓడీని సస్పెండ్ చేయడంతో ఆ స్థానంలోకి షాజీ వెళ్తాడు. అదే కాలేజీలో పనిచేస్తున్న మరో ప్రొఫెసర్ రంజిత్(షరాఫుద్దీన్)కి ఇది నచ్చదు. దీంతో తన దగ్గరున్న మాయాపెట్టెతో షాజీని తన కంట్రోల్‌కి తీసుకుని ఆటాడిస్తాడు. ఇదంతా జతిన్(సందీప్ ప్రదీప్) అనే కుర్రాడు చూసేస్తాడు. తన ఫ్రెండ్స్‌కి చెబుతాడు. కానీ వాళ్లు నమ్మరు. దీంతో రంజిత్ బ్యాగ్‌ని దొంగిలించడానికి జతిన్ ప్రయత్నిస్తాడు. తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల జతిన్ శరీరంలో రంజిత్, రంజిత్ బాడీలోకి షాజీ, షాజీ శరీరంలోకి జతిన్ ఆత్మలు ప్రవేశిస్తాయి. అసలు ఎందుకిలా జరిగింది? చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ సినిమాలు అనగానే హా ఏముంది లవ్ స్టోరీ అయ్యింటుందిలే అనుకుంటాం. కానీ ఇందులో 'జంబలకిడిపంబ' తరహాలో ఒకరి శరీరంలో మరొకరు ప్రవేశించడం అనే కాన్సెప్ట్‌ని జోడించడం కాస్త కొత్తగా అనిపించింది. పడక్కళమ్ అంటే యుద్ధభూమి అని అర్థం. సినిమా ప్రారంభంలోనే ఓ రాజ్యం, యుద్ధం అని మొదలుపెడతారు. ఓ మాయ పెట్టె గురించి చెబుతారు. కట్ చేస్తే ప్రస్తుతానికి వచ్చేస్తాం. కాలేజీలో జతిన్ గ్యాంగ్ చేసే అల్లరి, షాజీ-రంజిత్ పాత్రలు కాస్త నవ్విస్తాయి. అలా అలా ఫస్టాప్ అయిపోతుంది. సరిగ్గా ఇంటర్వెల్ సమయానికి ప్రధాన పాత్రధారులు ముగ్గరు.. ఒకరి శరీరాల్లోకి ఒకరు వెళ్లడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.సెకండాఫ్ అంతా కూడా ఒకరి శరీరంలోకి ప్రవేశించిన మరొకరు అసలు ఏం చేశారు? చివరకు మళ్లీ యాధావిధిగా వచ్చేశారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీస్‌తో పోలిస్తే ఈ సినిమా బాగుంది. కాకపోతే ఫస్టాప్ సరదాగా సాగిపోయినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం కన్ఫ్యూజన్ కామెడీతో కొంతమేర ఆకట్టుకుంది. అక్కడక్కడ థ్రిల్లింగ్‌గా అనిపించినా లాజిక్స్ లాంటివి ఏం పట్టించుకోకుండా చూస్తే టైమ్ పాస్ అయిపోతుంది. చివర్లో కాస్త ఎమోషన్ సీన్స్ పడేసరికి ఓ మంచి సినిమా చూశాంలే అనే ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?ఈ సినిమాలో జతిన్‌గా చేసిన సందీప్ ప్రదీప్‌కి ఎక్కువ స్కోప్ దొరికింది. ఫస్టాప్ అంతా అమాయక కుర్రాడిగా, సెకండాఫ్ అంతా అగ్రెసివ్‌గా పాత్రలో ఆకట్టుకున్నాడు. విలనీ లక్షణాలున్న పాత్రలో షరాఫుద్దీన్ కూడా మెప్పించాడు. సూరజ్ వెంజరమోడు పాత్ర కూడా బాగుంది కానీ ఇంకాస్త మంచిగా సీన్స్ పడుంటే బాగుంటుంది కదా అనిపించింది. మిగతా పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే.. కాలేజీలో జరిగే కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్ సింపుల్ బడ్జెట్లో తీసేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఓకే ఓకే. డైరెక్షన్ కూడా పర్లేదు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగు డబ్బింగ్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాసేపు అలా ఫ్యామిలీతో కలిసి నవ్వుకుందాం అనుకుంటే ఈ సినిమాపై ఓ లుక్కేయొచ్చు.- చందు డొంకాన -
రానా నాయుడు 2 రివ్యూ.. కుటుంబం కోసం 'యుద్దం'
వెబ్‌సిరీస్: రానా నాయుడు 2 నటీనటులు: వెంకటేశ్, రానా, అర్జున్ రాంపాల్, అభిషేక్ బెనర్జీ, రజత్ కపూర్, కృతి కర్బంద, సుర్విన్ చావ్లా, సుశాంత్ సింగ్ తదితరులు కథ: అనన్య మోదీ దర్శకత్వం: సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ స్ట్రీమింగ్ : నెట్ఫ్లిక్స్ఎపిసోడ్స్: 8కుటుంబంతో చూడొచ్చా: ఇబ్బందికరమే. కానీ, సీజన్-1తో పోలిస్తే.. కాస్త బోల్డ్ కంటెంట్ తగ్గించారు.వెంకటేశ్, రానా నటించిన రానా నాయుడు(Rana Naidu) సీజన్-1కు సీక్వెల్‌గా తాజాగా సీజన్ -2 విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మొదటి సీజన్ టైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ భారీగా వివాదాస్పదమైంది. బూతులు, బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉందని విమర్శలు వచ్చాయి. అయితే, పార్ట్2లో అలాంటి కంటెంట్ తగ్గించారు. ఇందులో రానాకు పెద్దపీఠ వేస్తూ తెరకెక్కిచారు. వెంటకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. అయితే, ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే..రానా నాయుడు (రానా ) నగరంలోని టాప్ సెలబ్రిటీలకు ఎలాంటి సమస్య వచ్చిన పరిష్కారం చూపుతాడు. అందుకోసం అతను ఎంత రిస్క్ అయినా సరే చేస్తాడు. అయితే, భార్య కోరిక మేరకు తన చీకటి గతాన్ని వదిలేయడానికి రానా ప్రయత్నిస్తుంటాడు. కానీ, అతడు అంగీకరించిన చివరి డీల్ పూర్తిచేసే క్రమంలో చిక్కుల్లో పడుతాడు. ఈ క్రమంలోనే రానా కొడుకు కిడ్నాప్ అవుతాడు. దీంతో రానా ఈ నేర ప్రపంచంలో మరింతగా ఇరుక్కుపోతాడు. కొడుకుని విడిపించుకునేందుకు బాలీవుడ్‌కు చెందిన ఒక స్టూడియో ఓనర్ విరాజ్ ఒబెరాయ్ (రజత్ కపూర్) నుంచి సాయం తీసుకుంటాడు. అందుకు ప్రతిగా తన దగ్గర మాత్రమే రానా పనిచేయాలని విరాజ్ షరతు విధిస్తాడు. తన కొడుకుని కాపాడే క్రమంలో రావూఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) తమ్ముడిని చంపేస్తాడు రానా. తన సోదరుడి చావుకు కారణమైన రానాపై పగ తీర్చుకోవాలని రవూఫ్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో రానా కుటుంబాన్ని రావూఫ్ టార్గెట్ చేస్తాడు. రానా చుట్టూ ప్రమాదం పొంచివున్న విషయం నాగా నాయుడు (వెంకటేశ్)కు తెలుస్తోంది. అప్పుడు నాగా నాయుడు ఏం చేశాడు.? సెలబ్రిటీల కోసం రిస్క్ చేసే రానా తన ఫ్యామిలీ కోసం ఎలాంటి రిస్క్ చేశాడు..? రానాకు సాయిం చేస్తానని చెప్పిన విరాజ్ ఒబెరాయ్ (రజత్ కపూర్) చేసిన కుట్ర ఏంటి..? చివరికి తండ్రికొడుకులు తమ కుటుంబం కోసం ఎలాంటి పోరాటం చేస్తారు..? అనేది అసలు స్టోరీ.ఎలా ఉందంటే..రానా నాయుడు: సీజన్2 కిడ్నాప్‌తో మొదలౌతుంది. వెంటనే కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్తాడు దర్శకుడు. సీజన్-1 తన క్లయింట్స్ కోసం పోరాటం చేసిన రానా.. సీక్వెల్లో తన కుటుంబం కోసం పెద్ద యుద్దమే చేస్తాడు. తొలి సీజన్లో ఎక్కువ బూతులు ఉండటంతో కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇందులో అలాంటి సమస్య ఉండదు. ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీల్ మనకు కలిగేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కుమారుడు కిడ్నాప్‌తో రానాకు మరోవైపు ఇంటి సమస్యలు పెరుగుతాయి. భార్య కూడా విడిపోయే స్థితికి వస్తుంది. తండ్రి నాగా నాయుడుతో పాటు, సోదరులతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న రానాకు నమ్మిన వాళ్లు కూడా కుట్రకు తెరలేపుతారు. ఇలా అనేక సంఘటనలు ప్రేక్షకులలో జోష్ నింపుతాయి. రానా, రావూఫ్ మీర్జా, విరాజ్ ఒబెరాయ్ కథలో కీలకం. ఈ మూడు పాత్రల చుట్టూ డ్రామా, యాక్షన్, థ్రిల్‌తో పాటు భారీ ట్విస్టులు మెప్పిస్తాయి. ఈ సీజన్లో రానా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఈ పాత్రను చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేయడంలో దర్శకులు సుపర్ణ్ వర్మ, కరణ్ అంశుమన్ విజయం సాధించారు. ఓటమి అంచు వరకు వెళ్లి అతను గెలిచే తీరు అందరిలో థ్రిల్ పంచుతుంది.రానా నాయుడు తన సోదరుడిని చంపాడని రావూఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) తెలుసుకున్న సమయం నుంచి కథలో స్పీడ్ పెరుగుతుంది. వారిద్దరి మధ్య జరిగే వైరంతో పాటు అదే సమయంలో కుమారుడి కోసం రానా నాయుడు పడే తపన ప్రేక్షకులలో కంటతడి పెట్టిస్తుంది. అప్పుడు రానా ఫ్యామిలీలో కనిపించే ఎమోషన్స్.. వాటిని ప్రేక్షకులకు చూపించిన తీరు బాగుంటుంది. రానా నాయుడిని అంతం చేయాలని రావూఫ్ మీర్జా, విరాజ్ ఒబెరాయ్‌లు ప్లాన్ వేస్తున్న సమయంలో నాగా నాయుడు (వెంకటేశ్ ) ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు మరింత ఆసక్తిగా కథ రన్ అవుతుంది. ఇలా సిరీస్‌లో కొన్ని బలమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. వాటిని అక్కడక్కడ బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే తప్పని పరిస్థితిలో అతికించారనే ఫీల్ కలుగుతుంది. దర్శకులు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ మంచి సన్నివేశాలే ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఈ సిరీస్‌లో అన్ని ఎపిసోడ్స్లకు మధ్య ఉండాల్సిన లింక్ దెబ్బతిందేమోననే అభిప్రాయం కలుగుతుంది. భారీ యాక్టర్స్ ఉన్నప్పటికీ అక్కడక్కడగా పెద్దగా ఎమోషన్ పండలేదు. రానా నాయుడు ప్రతి ఫ్యామిలీని ఆలోచింప చేస్తాడు. భార్య భర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం, పిల్లలను ఎలా పెంచాలి అనేది చాలా క్లారిటీగా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సీక్వెల్లో రానా పాత్ర చాలా బలంగా ఉంటుంది. కథలో ఆయనే కీలకం. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటీ సుమారు 50 నిమిషాల నిడివితో ఉంటుంది. ఇందులో మహిళా పాత్రధారులకు కొంత స్కోప్ ఇచ్చారు. భర్తతో (రానా) ఇబ్బంది పడుతున్న భార్యగా సుర్వీన్ చావ్లా అద్భుతంగా నటించింది. సర్వీన్ చావ్లాకు కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ. ఆ సీన్లు సహజంగానే ఉంటాయి. ఆ ట్రాక్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు. నాగా నాయుడిగా వెంకటేశ్‌కు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఉండదు. రానాకు విసుగు తెప్పించే పాత్రలో ఆయన అదరగొట్టాడు. అర్జున్ రాంపాల్ విలనిజాన్ని చాలా బలంగా చూపించాడు. ఎపిసోడ్స్ నిడివి తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువల విషయంలో నెట్‌ఫ్లిక్స్ ఎక్కడా కూడా రాజీపడలేదు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ సినిమా రేంజ్లో నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తాయి. మూడో సీజన్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్‌కు ప్రధాన బలం రానా, వెంకటేశ్, దర్శకత్వం అని చెప్పవచ్చు. కథను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే రానా నాయుడు అదరగొట్టేవాడు. అయినప్పటికీ ఎంటర్టైన్ చేస్తాడు. -
నార్నే నితిన్ ఫస్ట్ సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' రివ్యూ
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో ఆయనకంటూ గుర్తింపు పొందాడు. అయితే, ఈ చిత్రాల కంటే ముందుగా ఆయన నటించిన చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru). జూన్ 6న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇందులో సంపద హీరోయిన్గా నటించగా చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలు. 2022లో ప్రారంభం అయిన ఈ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న(Satish Vegesna) దర్శకత్వం వహించారు. గతంలో ఆయన 'శతమానం భవతి' వంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించారు. అయితే, తాజాగా విడుదలైన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే..మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరిలో సుబ్బరాజు (నరేశ్ వీకే), కృష్ణమూర్తి (రావు రమేశ్) మంచి స్నేహితులు. అయితే, పుట్టుకతోనే చలనం లేకుండా జన్మించిన జన్మించిన రాజా (నార్నే నితిన్) సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. చనిపోయాడు అనుకున్న కుమారుడిలో తిరిగి చలనం కనిపించడంతో సుబ్బరాజు (నరేశ్ వీకే) చాలా సంతోషిస్తాడు. అయితే, తన కుమారుడు పెరిగే కొద్ది సిగరెట్‌కు బానిస కావడం తండ్రిగా సహించలేడు. రాజాకు ఉన్న సిగరెట్ అలవాటుతో అతన్ని ఊరి వాళ్లు అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు. కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే రాజాకి చాలా ఇష్టం. ఇద్దరూ ఒకరినిఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమలో ఉంటారు. కానీ, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. జులాయిగా తిరుగుతున్న రాజాకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. కానీ, కూతురి కోసం పెళ్లికి ఓకే చెబుతాడు. అయితే, నిశ్చితార్థం నాడు రాజా చేసిన ఒక పొరపాటు వల్ల అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో వారిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఆపై స్నేహితులుగా ఉన్న వారి తండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణమూర్తికి సుబ్బరాజు ఒక ఛాలెంజ్ ఇసురుతాడు. త్వరలో జరిగే ఎంపీటీసీ ఎన్నికల వరకు తన కుమారుడు సిగరెట్ ముట్టడని, ఈ సవాల్లో తాను గెలిస్తే నిత్యను రాజాకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు. అందుకు కృష్ణమూర్తి కూడా రెడీ అంటాడు. అయితే, ఫైనల్‌గా రాజా గెలుస్తాడా..? తను ప్రేమించిన నిత్యను పెళ్లి చేసుకుంటాడా..? ఛాలెంజ్ కోసం సిగరెట్ ఆపేస్తాడా..? నిశ్చతార్థంలో జరిగిన గొడవకు కారణం ఏంటి..? వంటి అంశాలు తెలియాలంటే శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమాకు ప్రధాన బలం నార్నే నితిన్, దర్శకుడు సతీశ్ వేగేశ్న అని చెప్పవచ్చు. నార్నే నితిన్ కెరీర్లో మొదటి చిత్రంగా విడుదల కావాల్సిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు తన నాలుగో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ హీరో టొవినో థామస్ నటించిన 'తీవండి' మూవీనే దర్శకుడు తెలుగులో రీమేక్ చేశారు. కథలో హీరో పుట్టగానే సిగరెట్ పొగ వల్ల ప్రాణాలు పోసుకున్నట్లు చూపించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ కథలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆత్రేయపురం బ్యాక్‌డ్రాప్ అదిరిపోతుంది. కానీ, దానిని తెరపై చూపించడంలో దర్శకుడు అక్కడక్కడ కాస్త ఇబ్బందిపడ్డాడు అని చెప్పవచ్చు. ఈ కథలో హీరో పాత్ర చాలా బలంగా రాసుకున్న దర్శకుడు.. మిగిలిన పాత్రలపై అంతగా శ్రద్ద పెట్టలేదని తెలుస్తోంది. అయితే, కేవలం హీరో పాత్రకే ఎక్కువ సమయం ఇవ్వడంతో కాస్త బోర్‌గా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల ప్రేమ కథ కూడా చాలా రొటీన్‌గానే ఉంటుంది. ఈ కథ చాలా సినిమాలలో చూసిందే కూడా.. అయితే ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంటుంది. దీంతో సెకండాఫ్ అదిరిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ, అంతగా మెప్పించలేదని చెప్పవచ్చు. ఇరు కుటుంబాలతో పాటు హీరో, హీరోయిన్ పడే సంఘర్షణ ఫర్వాలేదనిపించినప్పటికీ... ప్రతి సీన్ మనం ముందే అంచనా వేయవచ్చు. ప్రీక్లైమాక్స్‌లో ఫ్యామిలీ ట్రాక్‌లోకి కథ వెళ్తుంది. తండ్రి సవాల్ కోసం హీరో తీసుకున్న నిర్ణయం.. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకూడదని కృష్ణమూర్తి పడే పాట్లు కొన్ని మెప్పిస్తాయి. ఫనల్గా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేని సినిమాగా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మిగిలిపోతుంది.ఎవరెలా చేశారంటే..నార్నే నితిన్‌కు ఇదే మొదటి సినిమా.. ఆపై కథలో తన పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అయినప్పటికీ రాజా పాత్రలో బాగానే మెప్పించాడు. గత మూడు సినిమాల్లో అతనిలోని కామెడీ యాంగిల్ చూసి ఉంటారు. ఇందులో యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌ను సులువుగా పండించాడు. హీరోయిన్గా సంపద చాలా అందంగా కనిపిస్తుంది. తన పాత్రమేరకు పెద్దగా స్కోప్ లేకున్నా ఉన్నంతలో న్యాయం చేసింది. రావు రమేశ్, నరేశ్‌ల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరూ అదరగొట్టేశారు. కైలాస్ మేనన్ అందించిన సంగీతం అక్కడక్కడ సౌండ్ చేస్తుంది. పెద్దగా ప్రభావం చూపించలేదు. కెమెరామెన్ పల్లెటూరి అందాల్ని తెరపై బాగానే చూపించారు. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. -
హిందీ హీరో చేసిన తెలుగు ఫ్లేవర్ సినిమా.. ఓటీటీ రివ్యూ
తెలుగులో లెక్కలేనన్నీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అలా తెలుగు దర్శకులు.. ఇతర భాషల్లోనూ మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీసిన హిందీ సినిమా 'జాట్'. ఏప్రిల్‌లో హిందీ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'.. తెలుగు రివ్యూ)కథేంటి?శ్రీలంక నుంచి అక్రమంగా ఇక్కడికి వలసొచ్చిన రణతుంగ(రణదీప్ హుడా).. ప్రకాశం జిల్లాలోని మోటుపల్లితో పాటు చుట్టుపక్కన 30 గ్రామాల్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. మరోవైపు అయోధ్య వెళ్తున్న జాట్(సన్నీ డియోల్).. ట్రైన్లో సాంకేతిక లోపం కారణంగా మోటుపల్లిలో దిగుతాడు. ఆకలేసి ఓ షాపులో ఇడ్లీ తినబోతుంటే.. కొందరు రౌడీలు జాట్ ప్లేట్‌ని తోసేస్తారు. దీంతో వాళ్లని సారీ చెప్పమంటాడు. వాళ్లు చెప్పరు. ఫలితంగా ఈ పంచాయతీ.. రణతుంగ దగ్గరకు చేరుతుంది. తర్వాత ఏమైంది? ఇంతకీ జాట్, రణతుంగ గతమేంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?జాట్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు సినిమాల్లో అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీ ఇది. కొన్ని గ్రామాల ప్రజల్ని ఇబ్బంది పెట్టే కరుడుగట్టిన విలన్.. అనుకోకుండా హీరో ఆ ఊరికి రావడం, సమస్య తెలుసుకుని విలన్‌తో తలపడటం.. చివరకు కథ సుఖాంతం. ఎన్నిసార్లో తెలుగు ప్రేక్షకులు ఈ తరహా సినిమాల్ని చూసి చూసి విసుగెత్తిపోయారు. బహుశా అందువల్లనేమో మన దగ్గర థియేటర్లలో నేరుగా రిలీజ్ చేయలేదు. హిందీలో రిలీజ్ చేస్తే ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది.ట్రైన్లో వెళ్తుండే హీరో.. అనుకోకుండా విలన్ ఉండే ఊరిలో దిగడం, తర్వాత కొందరు రౌడీలతో ఇడ్లీ పంచాయతీ. అది కాస్త మెయిన్ విలన్ దగ్గరకు వెళ్లడం.. ఇలా ఫస్టాప్ ముగుస్తుంది. ఊహించినట్లే సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోటుపల్లి గ్రామస్థులని విలన్, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏంటి? లాంటి సీన్స్ ఓకే ఓకే అనిపిస్తాయి. హీరో బ్యాక్ గ్రౌండ్ రివీల్ చేసి, విలన్ని చంపే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో క్లైమాక్స్‌ని రొటీన్‌గా ముగిస్తారు.రెండున్నర గంటల సినిమానే గానీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించేలా సాగుతుంది. యాక్షన్ సీన్లలో డోస్ ఎక్కువైపోయింది. హీరో అడుగేస్తే భూమి బద్దలవడం, కొట్టగానే రౌడీలు గాల్లో అంతెత్తున ఎగరడం లాంటి సీన్స్ యాక్షన్ ప్రియులకు నచ్చుతాయేమో గానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం నవ్వు తెప్పిస్తాయి.ఎవరెలా చేశారు?హీరోగా చేసిన సన్నీ డియోల్.. కొందరు తెలుగు ప్రేక్షకులకు తెలుసంతే. సినిమాలో ఆయన పాత్రని చూస్తున్నప్పుడు ఇది బాలకృష్ణ చేయాల్సిన రోల్ కదా అనిపిస్తుంది. విలన్‌గా రణదీప్ హుడా బాగానే చేశాడు. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కడు. మిగిలిన వాళ్లలో రెజీనా, సయామీ ఖేర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.సినిమాని చాలా రిచ్‌గా తీశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు బాగోలేవు. యాక్షన్ సీన్స్ హిందీ ప్రేక్షకులకు నచ్చొచ్చేమో గానీ తెలుగు ప్రేక్షకులు అయితే ఇదివరకే ఇలాంటి చాలా చూసేశాం కదా అని కచ్చితంగా అనుకుంటారు. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రొటీన్ రెగ్యులర్ మసాలా మూవీనే హిందీ హీరోతో తీసేశాడు. ఒకవేళ మీకు టైమ్ ఉండి, ఏదైనా రొటీన్ మాస్ మసాలా మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.-చందు డొంకాన(ఇదీ చదవండి: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ) -
‘బద్మాషులు’ మూవీ రివ్యూ
టైటిల్ : బద్మాషులునటీనటులు: మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్, అన్షుమన్ తదితరులుదర్శకత్వం-శంకర్ చేగూరినిర్మాతలు- B. బాలకృష్ణ, C.రామ శంకర్‌సంగీతం- తేజ కూనూరుసినిమాటోగ్రఫీ- వినీత్ పబ్బతిఎడిటింగ్: గజ్జల రక్షిత్ కుమార్‘బద్మాషులు’.. తెలంగాణ ప్రాంతంలో సరదాగా తిట్టుకునే పదం అది. అదే టైటిల్లో ఓ సినిమా తెరకెక్కింది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయగా..ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న చిత్రంపై అందరి దృష్టి పడింది. మంచి అంచనాలు నేడు(జూన్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. తెలంగాణలోని కోతులగూడెం గ్రామానికి చెందిన ట్రైలర్ తిరుపతి(మహేశ్ చింతల), బార్బర్ ముత్యాలు(విద్యాసాగర్ కారంపురి) స్నేహితులు. ఇద్దరు పని దొంగలు...మందు తాగనిదే ఉండలేరు. భార్య, పిల్లలను పట్టించుకోకుండా.. నిత్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. వీరిద్దరిని ఊరంతా ‘బద్మాషులు’ అని తిట్టినా పట్టించుకోరు. డబ్బుల కోసం తిరుపతి తన కస్టమర్ల డ్రెస్‌లను అమ్ముకుంటే.. ముత్యాలు ఇంటింటికెల్లి హెయిర్ కటింగ్ చేస్తూ వచ్చిన డబ్బులతో తాగుతుంటారు. ఓ సారి తాగేందుకు డబ్బుల్లేక స్కూల్లో పెన్షిన్ వైర్‌ని దొంగిలించి పోలీసులకు దొరికిపోతారు. స్టేషన్లో కూడా వీరి బుద్ది మారదు. పోలీసుల పేరు చెప్పి స్టేషన్‌కు వచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేసి తాగుతుంటారు. చిన్న దొంగతనమే కదా అని నాలుగు రోజుల తర్వాత వారిని వదిలేస్తారు. అదే సమయంలో స్కూల్లో కంప్యూటర్ మిస్ అవుతుంది. అందులో పూర్వ విద్యార్థుల డేటా అంతా ఉంటుంది. ఆ కేసు వీరిద్దరిపైకే వస్తుంది. అసలు ఆ కంప్యూటర్ దొంగిలించిదెవరు? అది ఎక్కడ ఉంది? దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ రామచందర్(మురళీధర్ గౌడ్)కు తిరుపతి, ముత్యాలు చేసిన సహాయం ఏంటి? అసలు తిరుపతి, ముత్యాలు తాగుబోతులుగా మారడానికి గల కారణం ఏంటి? చివరకు వీరిద్దరిలో మార్పు వచ్చిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. పల్లెటూరికి చెందిన ఇద్దరి తాగుబోతుల చుట్టూ కథనం సాగుతుంది. తిరుపతి, ముత్యాలుతో పాటు ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నిజజీవితంతో మన ఊరిలో వారిలాగే ఉంటూ నవ్విస్తుంటాయి. చివరితో ఓ మంచి సందేశం కూడా ఇచ్చారు. అయితే దర్శకుడు కథ కంటే కామెడీ సన్నివేశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కొన్ని చోట్ల ‘జాతి రత్నాలు’ ఛాయలు కనిపిస్తుంటాయి. అయితే ఒకే పాయింట్ చుట్టూ కథ తిరగుతుండడంతో నిడివి తక్కువ అయినా.. సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. డ్రెస్ కుట్టమని వస్త్రం ఇస్తే..దాన్నే అమ్ముకొని తాగే ట్రైలర్ ఒకవైపు.. సగం సగం షేవింగ్ చేస్తూ.. మధ్యలోనే బార్ కెళ్లే బార్బర్ మరోవైపు.. వీరిద్దరి పాత్రల పరిచయ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే అలాంటి పాత్రలతో మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా..దర్శకుడు రోటీన్ సన్నివేశాలనే రాసుకున్నాడు. అవి కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. దొంగతనం చేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లేవరకు కథనం సోసోగానే సాగుతుంది. స్టేషన్లో వీరిద్దరు చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ సీన్ రొటీన్‌గానే ఉంటుంది. ఇక సెకండాఫ్ కూడా మళ్లీ దొంగతనం చుట్టే తిరగడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. దొంగను పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోలేవు. క్లైమాక్స్ లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. అయితే కథను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. బలగం, భీమదేవరపల్లి, రామన్న యూత్ తదితర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విద్యా సాగర్ ఈ చిత్రంతో హీరోగా మారి.. తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. బార్బర్ ముత్యాలు పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వులు పూయించాడు. నటుడిగా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. ఇక ట్రైలర్ తిరుపతిగా మహేష్ చింతల కూడా నేచులర్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన వేసే సింపుల్ పంచులు బాగా పేలాయి. విద్యా సాగర్, మహేశ్ ఇద్దరు తెరపై నిజమైన తాగుబోతుల్లాగే కనిపించారు. ముత్యాలు భార్యగా దీక్ష కోటేశ్వర్, తిరుపతి భార్యగా కవిత పాత్రల పరిధి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించారు. మురళీ ధర్, బలగం సుధాకర్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తేజ కూనూరు నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ
38 ఏళ్ల క్రితం ‘నాయకుడు’తో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు దర్శకుడు మణిరత్నం, హీరో కమల్ హాసస్. ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే ‘థగ్ లైఫ్’(Thug Life Review). ఈ హై ఓల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 5) ఈ చిత్రం రిలీజైంది. దాదాపు 38 ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.‘థగ్ లైఫ్’ కథేంటంటే..?ఢిల్లీకి చెందిన రంగరాయ శక్తిరాజు(కమల్ హాసన్) ఒక గ్యాంగ్‌స్టర్. తన అన్న మాణిక్యం(నాజర్)తో కలిసి మరో గ్యాంగ్‌స్టర్ సదానందం(మహేశ్ మంజ్రేకర్)తో ఒక సెటిల్మెంట్కి వెళ్తాడు. అక్కడికి పోలీసులు రావడంతో కాల్పులు జరుగుతాయి. దీంతో రంగరాయ శక్తిరాజు అమర్(శింబు) అనే చిన్నారిని అడ్డుపెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తన ప్రాణాలను కాపాడినందుకు అమర్‌ని పెంచి పెద్ద చేస్తాడు. తన నేర సామ్రాజ్యానికి అమర్‌ని కీలక శక్తిగా మారుస్తాడు. కొన్నాళ్ల తర్వాత అమర్నే అనుమానిస్తాడు రంగరాయ శక్తిరాజు(Thug Life Review). అదే సమయంలో రంగరాయ శక్తిరాజే తన తండ్రిని చంపాడని అమర్‌కి తెలుస్తుంది. దీంతో రంగరాయ శక్తిరాజును చంపేందుకు ప్రయత్నిస్తాడు. మరి అమర్ ప్రయత్నం ఫలించిందా? సొంత అన్న మాణిక్యం కూడా రంగరాయ శక్తిరాజుని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు అమర్ తండ్రిని చంపిందెవరు? చిన్నప్పుడే తప్పిపోయిన చెల్లెలు చంద్ర(ఐశ్వర్య లక్ష్మీ) మళ్లీ అమర్‌ని కలిసిందా? సొంత తమ్ముడిలా పెంచిన అమరే తన ప్రాణాలను తీసేందుకు కుట్ర చేశాడనే విషయం తెలిసిన తర్వాత రంగరాయ శక్తిరాజు ఏం చేశాడు? భార్య లక్ష్మీ(అభిరామి), కూతురు మంగ(సంజన) కోసం శక్తిరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ కథలో త్రిష పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మణిరత్నం-కమల్ కాంబినేషన్లో ఓ సినిమా అంటే అంచనాలు పెరగడం సర్వ సాధారణం. అందుకే ‘థగ్ లైఫ్’పై కమల్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా మొదటి నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ప్రమోషన్స్‌లో కమల్ ‘ఈ చిత్రం ‘నాయకుడు’ కంటే పెద్ద హిట్ అవుతుంది’ అని చెప్పడంతో సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతోనే సినిమాకు వెళ్లారు. వారి అంచనాలను అందుకోవడంలో మణిరత్నం సఫలం కాలేదనే చెప్పాలి. ఓ రొటీన్ గ్యాంగ్‌స్టర్ కథనే కమల్‌తో చెప్పించాడు. కథనంలో కూడా కొత్తదనం లేదు. సినిమా చూస్తున్నంతసేపు మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్’ చిత్రమే గుర్తుకొస్తుంది. అందులో వచ్చే ట్విస్టులు కొంతమేర ఆకట్టుకుంటాయి. ఇందులో అదీ కూడా ఉండదు. ఓ సాధారణమైన గ్యాంగ్‌స్టర్ కథకి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని యాడ్ చేసి ‘థగ్ లైఫ్’ ని తీర్చిదిద్దాడు మణి. సాధారణ కథనైనా తెరపై ఎంతో అద్భుతంగా చూపించే సత్తా ఉన్న మణిరత్నం.. ఈ కథ, అందులో రాసుకున్న పాత్రలు, వాటిని తీర్చిదిద్దిన విధానం చూస్తే నిజంగానే ఇది మణి సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది. కమల్‌తో పాటు ఏ ఒక్కరి పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ట్విస్టులూ ఉండవు. ఊహకందేలా కథనం సాగుతుంది. అయితే ఎప్పటి మాదిరే నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ‘ఇది యముడికి నాకు జరిగే కథ’ అని కమల్ పాత్రలో చెప్పిస్తూ సినిమాను ప్రారంభించారు దర్శకుడు. కీలక పాత్రల పరిచయం వరకు కథనం ఆసక్తికరంగానే సాగుతుంది. తన అన్న మాణిక్యం కూతురు ఆత్మహత్య చేసుకోవడం.. దానికి కారణమైన వ్యక్తిని కాల్చి చంపి శక్తిరాజు జైలుకు వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అమర్ మారిపోవడం.. ఆధిపత్య పోరుతో శక్తిరాజుని చంపేందుకు చేసే కుట్ర ఇవ్వన్నీ రొటీన్‌గా ఉన్నా.. మధ్యలో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కమల్-అభిరామి మధ్య వచ్చే సన్నివేశాలను రొటీన్ కథనంతో విగిసిపోతున్న ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత రొటీన్‌గా సాగుతుంది. రివేంజ్ డ్రామా అంత ఆస్తికరంగా అనిపించదు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కమల్ నటన గురించి ఎం చెప్పగలం. ఎలాంటి పాత్రల్లోనైనా జీవించగలడు. రంగరాయ శక్తిరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. అయితే కమల్ గతంలో అలాంటి పాత్రలు చాలా చేడయంతో తెరపై చూసినప్పుడు కొత్తగా అనిపించదు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా కమల్ పాత చిత్రాలను గుర్తుకు చేస్తాయి. అమర్ పాత్రకు శింబు న్యాయం చేశాడు. అయితే ఆ పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. మాణిక్యంగా నాజర్ రొటీన్ పాత్రే చేశాడు. ఇక శక్తిరాజు భార్య లక్ష్మీగా అభిరామి ఉన్నంతలో బాగానే నటించింది. త్రిష పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. మణిరత్నం- కమల్ సినిమా కాబట్టే ఆ పాత్ర చేయడానికి త్రిష ఒప్పుకుందేమో. పోలీస్ ఆఫీసర్‌గా అశోక్ సెల్వరాజ్, శక్తిరాజు టీంలో కీలక వ్యక్తి పత్రాస్గా జోజు జార్జ్ తో పాటు తనికెళ్ల భరణి, ఐశ్వర్య లక్ష్మీ, మహేశ్ మంజ్రేకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు ప్రధాన బలం ఏఆర్ రెహమాన్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు పర్వాలేదు. రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా.. తెలుగు రివ్యూ
ఎప్పుడూ అదే థ్రిల్లర్, యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిందా? కాసేపు మనసారా నవ్వుకుని, కాస్త ఫీల్ అవుదామని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఓటీటీలోకి ఓ అద్భుతమైన సినిమా వచ్చేసింది. అదే 'టూరిస్ట్ ఫ్యామిలీ'. గత నెలలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. ఇప్పుడు హాట్స్టార్లోకి వచ్చేసింది. మరి అంతగా ఈ సినిమాలో ఏముంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శ్రీలంకకు చెందిన ధర్మదాస్ (శశికుమార్).. సొంత దేశంలో బతుకు కష్టమైపోవడంతో భార్య వాసంతి(సిమ్రన్), ఇద్దరు కొడుకులతో కలిసి మన దేశానికి అక్రమంగా వలస వస్తాడు. చెన్నైలోని ఓ కాలనీలో అద్దెకు దిగుతాడు. ఇతడికో బావమరిది (యోగిబాబు) సాయం చేస్తాడు. ఎవరితోనూ పెద్దగా మాడ్లడొద్దు, మీ గతం గురించి చెప్పొద్దని ధర్మదాస్కి సలహా ఇస్తాడు. కానీ ధర్మదాస్ కుటుంబం.. సదరు కాలనీ వాసులతో కలిసి పోతారు. తమ గురించి నిజం చెప్పేస్తారు. మరోవైపు రామేశ్వరం పోలీసులు.. ధర్మదాస్ కుటుంబం కోసం ఎందుకు వెతుకుతున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మనుషులు మంచోళ్లు.. అసలు మనుషులు అంటేనే మంచోళ్లు అని 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో డైలాగ్ ఉంటుంది. అలా మనుషుల్లో ఉండే మానవతా విలువలని తట్టి లేపే ప్రయత్నమే ఈ మూవీ. శ్రీలంక నుంచి అక్రమంగా మన దేశానికి వలస వచ్చిన ఓ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడింది? నిజం చెప్పినా సరే మనవాళ్లు వారికి ఎలా సహాయపడ్డారు. ఒకరికి ఒకరు ఎందుకు సాయం చేసుకోవాలి అనే అంశాల్ని మనసుకు హత్తుకునేలా ఈ చిత్రంలో చూపించడం విశేషం.శ్రీలంక నుంచి ధర్మదాస్ కుటుంబం.. ఓ పడవలో అక్రమంగా రామేశ్వరం వస్తారు. అక్కడ పోలీసులకు దొరికిపోతారు. కానీ ఎలాగోలా మేనేజ్ చేసి చెన్నైకి వచ్చేస్తారు. ఓ కాలనీలో అద్దెకు దిగాతారు. నిజానికి ఆ కాలనీలో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనంతంగా ఫాస్ట్ లైఫ్‌కి జనాలు అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి కాలనీలో ఉండేవాళ్లతో.. ధర్మదాస్ కుటుంబం ఎలా మార్పులు తీసుకొచ్చింది. అనేదే మిగతా స్టోరీ. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతాం.ఓవైపు సరదాగా సున్నితమైన హస్యంతో నవ్విస్తూనే, మరోవైపు గుండెని పిండేసే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. చెప్పాలంటే హ్యుమర్ విత్ హ్యుమానిటీ అనే సరికొత్త జానర్ సినిమాలా అనిపిస్తుంది. ఈ రెండు అంశాల్ని మూవీలో బ్యాలెన్స్ చేసిన విధానం చూస్తే తెగ ముచ్చటేస్తుంది. సినిమాలో కొన్ని సీన్లు అయితే భలే కనెక్ట్ అవుతాయి. ఓ ముసలావిడ చనిపోతే కాలనీ అంతా ఒక్కటైన తీరు మనల్ని కంటతడి పెట్టేలా చేస్తుంది.తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయిందని ధర్మదాస్ పెద్ద కొడుకు బాధపడుతుంటాడు. ఈ సీన్ చూస్తున్న మనకు కూడా అయ్యో అనిపిస్తుంది. వెంటనే చిన్న కొడుకు చేసే హంగామా వల్ల మొత్తం సీనే మారిపోయి ఫుల్ నవ్వొచ్చేస్తుంది. చర్చిలో అదే కాలనీకి చెందిన ఓ తాగుబోతు కుర్రాడు తన జీవితం గురించి చెప్పే సీన్ హైలెట్. ధర్మదాస్ పెద్ద కొడుకు, వాళ్ల ఇంటి యజమాని కూతురు మధ్య క్యూట్ ప్రపోజల్ సీన్‌కి యూత్ కచ్చితంగా కనెక్ట్ అవుతారు. రెండు గంటల సినిమానే కానీ చూస్తున్నంతసేపు అసలు సమయమే తెలియనంత వేగంగా అయిపోతుంది. ఇంకాసేపు ఉండుంటే బాగుండు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?ధర్మదాస్గా శశి కుమార్ సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇతడి భార్యగా సిమ్రన్.. వాసంతి అనే పాత్రలో ఒదిగిపోయింది. వీళ్ల పెద్ద కొడుకు పాత్ర ఓకే. కానీ చిన్న కొడుకు మురళిగా చేసిన పిల్లాడైతే ఇరగదీశాడు. ఓ రకంగా సినిమాలో కామెడీ సీన్లన్నీ ఇతడి మీదే ఉంటాయి. కచ్చితంగా ఈ పాత్ర మీకు నచ్చేస్తుంది. మిగిలిన వారిలో తాగుబోతు కుర్రాడు, ఓ కుక్కపిల్ల.. ఇలా ప్రతి పాత్ర సినిమాలో కీలకమే. ఎవరూ తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు అనేలా జీవించేశారు.టెక్నికల్ విషయాలకొస్తే సినిమా అంతే ఓ కాలనీలో తీశారు. చూస్తున్నంతసేపు మనం కూడా అక్కడే ఉన్నామా అనేలా సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. మిగతా అన్నీ విభాగాలు తమ తమ పనిని పక్కాగా చేశాయి. చివరగా డైరెక్టర్ అభిషణ్ జీవింత్ గురించి చెప్పుకోవాలి. స్వతహాగా ఇతడో యూట్యూబర్. వయసులోనే చిన్నోడు. కానీ ఇలాంటి సినిమా తీసి అందరి మనసులు గెలుచుకున్నాడు. రాజమౌళి, నాని కూడా ఈ మూవీ చూసి మెచ్చకున్నారంటే మనోడి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఓటీటీలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మీ కుటుంబం అంతా కలిసి కచ్చితంగా సినిమా చూడండి. అస్సలు మిస్ కావొద్దు.-చందు డొంకాన -
'షష్టిపూర్తి' సినిమా రివ్యూ
టైటిల్ : షష్టి పూర్తినటీనటులు: రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ తదితరులునిర్మాత: రూపేష్ చౌదరిఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్కథ, దర్శకత్వం: పవన్ ప్రభసంగీతం: ఇళయరాజాసినిమాటోగ్రఫీ: రామ్విడుదల: మే30, 2025'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన.. సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటించిన చిత్రం 'షష్టి పూర్తి'. మే 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించారు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్ పబ్లిక్కు బాగా రీచ్ అయింది. ఈ సినిమాతో నిర్మాతగా, హీరోగా రూపేష్ చౌదరి ఎంట్రీ ఇచ్చారు. తనకు మొదటి సినిమానే అయినప్పటికీ మంచి పాయింట్‌తోనే షష్టి పూర్తి కథను ఎంచుకున్నారు. ప్రతి కుటుంబంలో కనిపించే చిన్నచిన్న అలకలు, సంతోషాలు ఎలాంటి అనుభూతిని ఇస్తాయో ఈ సినిమా చూసినవారికి గుర్తుచేస్తాయి. బిడ్డల కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, కన్నవారి పట్ల పిల్లలు చూపించాల్సిన బాధ్యతలు ఎలా ఉండాలో ఈ చిత్రం చూపుతుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం కడుతూ.. మంచి కుటుంబ విలువలున్న కథతో ఈ మూవీని రూపొందించారు.(ఇదీ చదవండి: భైరవం మూవీ రివ్యూ)షష్టి పూర్తి కథేంటంటే?తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం వారి బిడ్డలకి ఉండదు. కానీ, పిల్లలు అనుకుంటే వారు చూడగలిగే పెళ్లి షష్టిపూర్తి ఒక్కటే. కానీ, తల్లిదండ్రులు గొడవలు పడి విడాకులు తీసుకునే స్థాయికి చేరితే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ నేపథ్యంలోనే షష్టి పూర్తి కథ సాగుతుంది. ఈ కథ హీరో రూపేష్ (శ్రీరామ్)తో మొదలౌతుంది. తన కాలనీలో అత్యంత నీతి, నిజాయితీ ఉన్న ప్రభుత్వ న్యాయవాదిగా ఉంటాడు. తన నిజాయితీ చూసి కాలనీ వాసులకు కూడా చిరాకు వస్తుంది. అందుకు కారణం తన అమ్మకు ఇచ్చిన మాట కోసమే అంటూ ముందుకెళ్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల శ్రీరామ్ తన తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్ (దివాకర్), అర్చన (భువన)లకు దూరంగా ఒంటరిగానే ఉంటాడు. ఒకరోజు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అనుకోకుండా హీరోయిన్ ఆకాంక్ష సింగ్ (జానకి).. శ్రీరామ్ ఇంట్లోకి వెళ్లి దాక్కుంటుంది. అలా వారిద్దరి మధ్య మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండీషన్స్ ఉన్నాయని శ్రీరామ్‌కు చెబుతుంది. ఇంత నిజాయితీగా ఉంటే తనకు ఇష్టం ఉండదని సూచిస్తుంది. ప్రియురాలి కోసం తనమీద తల్లి పెట్టుకున్న నమ్మకాన్ని పక్కన పెట్టేసి.. అవినీతి లాయర్‌గా కోర్టులో కేసులు వాదిస్తూ ఉంటాడు. అలా జానకి చెప్పిన ప్రతిపనిని శ్రీరామ్ చేస్తూ ఉంటాడు. అయితే, తను తప్పుడు దారిలో వెళ్తున్నట్లు తన తల్లికి ఎక్కడ తెలుస్తోందోననే భయంతో జానకి చెప్పిన పనులన్నీ చేస్తూంటాడు. ఒకరోజు భువన స్నేహితురాలి కొడుకును ఒక విలన్ గ్యాంగ్ చంపేస్తుంది. ఆ కేసులో తన స్నేహితురాలికి న్యాయం చేయాలని కుమారుడు శ్రీరామ్‌ను భువన కోరుతుంది. అయితే, అప్పటికే జానకి ప్రేమలో ఉన్న శ్రీరామ్.. విలన్ గ్యాంగ్ ఇచ్చిన డబ్బు తీసుకుని తల్లి స్నేహితురాలికి అన్యాయం చేస్తాడు. నిజాయితీగా ఉన్న శ్రీరామ్‌ను జానకి ఎందుకు టార్గెట్ చేస్తుంది..? విలన్ గ్యాంగ్‌తో జానకీకి ఉన్న లింకేంటి.? జానకి కుటుంబానికి శ్రీరామ్ తండ్రి దివాకర్ (రాజేంద్ర ప్రసాద్) చేసిన అన్యాయం ఏంటి..? 30 ఏళ్ల తర్వాత పథకం ప్రకారం రివేంజ్ తీర్చుకునేందుకు జానకీ వేసిన ఎత్తులు ఎలాంటివి..? రాజేంద్ర ప్రసాద్ (దివాకర్), అర్చన (భువన) ఒకే ఇంట్లో 30ఏళ్లుగా వేరువేరుగా ఎందుకు ఉంటున్నారు..? వారి విడాకుల కేసునే శ్రీరామ్ వాదించాల్సిన పరిస్థితికి కారణాలు ఎంటి..? తెలియాలంటే షష్టి పూర్తి సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?కొత్త వారిని ఎంకరేజ్ చేస్తేనే వారు మరిన్ని సినిమాలు తీసేందుకు ముందుకు వస్తారు. షష్టి పూర్తి సినిమా కోసం రూపేష్ నిర్మాతగా, హీరోగా ప్రేక్షకులను మెప్పించాడు. సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న లొకేషన్లు అన్నీ చాలా అందంగా తెరపై కనిపిస్తాయి. రూపేష్‌కు మొదటి సినిమా అయినప్పటికీ కథలో పెద్దగా బలం లేనప్పటికీ సింగిల్ హ్యాండ్‌తో నడిపించాడు. ఆకాంక్ష సింగ్ (జానకి)తో రూపేష్ కాంబినేషన్స్ సీన్లు చాలా బాగుంటాయి. సినిమా ప్రారంభం పెద్దగా ఆకట్టుకోకపోయినా తర్వాత మెల్లగా ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. షష్టిపూర్తి సినిమా టైటిల్ పెట్టడం వల్ల సినిమా అంతా కుటుంబం చుట్టే తిరుగుతుంది అనుకుంటారు. కానీ, దర్శకుడు ఆ ట్రాక్‌ను తప్పించి ఫస్ట్ పార్ట్ అంతా లవ్ స్టోరీతో నడిపించాడు. రెండో పార్ట్‌లో రాజేంద్రప్రసాద్, అర్చనల ప్రేమ కథతో పాటు స్నేహం గురించి చూపాడు. అయితే, టైటిల్‌కు తగ్గట్లు సినిమా లేదనిపిస్తుంది. ఇదే పెద్ద మైనస్ కావచ్చు కూడా.. మొదటి భాగంలోనే రాజేంద్రప్రసాద్, అర్చనలకు కాస్త ప్రాధాన్యత ఇచ్చింటే బాగుండు అనిపిస్తుంది. దీంతో ప్రేక్షకుడు కూడా వారి ఎంట్రీ కోసం ఎదురుచూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఎదురౌతుంది. ఆపై విలన్ గ్యాంగ్‌తో జానకీకి ఉన్న కనెక్షన్‌ను తెరపై చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కథలో ప్రతి పాత్ర వెంటనే తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం వారిలో మార్పు వచ్చినట్లు తెరపై చూపించడం పెద్దగా కనెక్ట్ కాలేదు. రూపేష్, ఆకాంక్ష సింగ్‌ల మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేయడంతో వారిద్దరి మధ్య ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఆపై రాజేంద్రప్రసాద్, అర్చనల నుంచి వచ్చే సీన్లు ఎమోషనల్‌గా ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో 15 నిమిషాల పాటు రన్ అయ్యే కోర్టు డ్రామా సీన్‌కు ఫిదా అవుతారు.ఎవరెలా చేశారంటే?ఈ సినిమాలో ప్రధాన బలం రాజేంద్రప్రసాద్, అర్చనల నటనే.. కొత్తవారితో వారు నటిస్తున్నప్పటికీ తమదైన స్టైల్లో మెప్పించారు. ఆపై హీరో రూపేష్, ఆకాంక్ష సింగ్‌ల జోడీ అభినందనీయంగా ఉంటుంది. సీనియర్స్ నటులకు పోటీగా తమ సత్తా చూపారు. ఎక్కడా కూడా ఇదే మొదటి సినిమా అనే సందేహం రాకుండా మెప్పించారు. దర్శకుడు ఇంకాస్త కథలో మార్పులు చేసి ఉంటే బాగుండు. సినిమాలో అచ్యూత్ కుమార్, మురళీధర్ గౌడ్, చలాకీ చంటి వంటి మంచి నటులు ఉన్నప్పటికీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఇళయరాజా సంగీతానికి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఆయన కేవలం పాటలకు మాత్రమే మ్యూజిక్ ఇచ్చినట్లు ఉన్నారు. బీజీఎం స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు. డైలాగ్స్‌కు ఇంకాస్త పదును పెట్టింటే బాగుండు. బడ్జెట్ మేరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక హీరోగా, నిర్మాతగా రూపేష్ పూర్తిగా విజయం సాధించాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు) -
భైరవం మూవీ రివ్యూ
టైటిల్: భైరవంనటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అతిధి శంకర్, ఆనంది , దివ్య తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్నిర్మాత: కేకే రాధామోహన్దర్శకత్వం: విజయ్ కనకమేడలసంగీతం: శ్రీచరణ్ పాకాలసినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతంఎడిటర్: చోటా కె ప్రసాద్విడుదల తేది: మే 30, 2025బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోల ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఈ మధ్యకాలంలో వీరి నుంచి సినిమాలే రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్ బస్టర్ 'గరుడన్’ తెలుగు రీమేకే ఈ భైరవం. టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కించామని మేకర్స్ చెప్పారు. మరి ఆ మార్పులలో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించారా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. (Bhairavam Review)భైరవం కథేంటంటే..?తూర్పు గోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి(మనోజ్), వరద(నారా రోహిత్),శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ(జయసుధ) మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. (Bhairavam Review)మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ(ఆనంది) ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శీను ఎలా రక్షించాడు. గజపతి గురించి శీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి. అమ్మవారి పూనకం వచ్చే శీను.. న్యాయం కోసం చివరకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిన తర్వాత రీమేక్ చిత్రాలు రావడం తగ్గిపోయాయి. ఓ మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే ఓటీటీల పుణ్యమా అని అన్ని ప్రాంతాల ప్రేక్షకులు చూసేస్తున్నారు. అలాంటి సమయంలో తమిళ బ్లాక్ బస్టర్ గరుడన్‌ని తెలుగులో రీమేక్ చేశాడు దర్శకుడు విజయ్ కనకమేడల. ఇది ఓ రకంగా పెద్ద సాహసమే. కానీ దానికి తగిన న్యాయం చేయలేకపోయాడు దర్శకుడు. ఒరిజినల్ సినిమాలోని ఎమోషన్ని ఇందులో క్యారీ చేయలేకపోయాడు. కథలో ఆయన చేసిన చిన్న చిన్న మార్పులే దీనికి కారణం. ముగ్గురు హీరోలను మేనేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు కానీ సెంటిమెంట్స్‌ని పండించే విషయంలో తడబడ్డాడు.ఒరిజినల్లో బెల్లంకొండ పాత్రను సూరి పోషించాడు. ఆయనకున్న ఇమేజ్‌కి ఆ పాత్ర కొత్తగా అనిపించింది. కానీ బెల్లంకొండకు ఇక్కడ ఉన్న ఇమేజ్ వేరు. దీంతో ఆ పాత్రలో ఆయన ఒదిగినట్లుగా కాకుండా నటించినట్లుగానే అనిపిస్తుంది. అలాగే మనోజ్ పాత్ర కూడా. ముగ్గురు హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. అమ్మవారి ట్రాక్‌ని కూడా సరిగా వాడుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. గుడి నేపథ్యంతో పాటు ముగ్గురు హీరోల పరిచయం తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. శీను-వెన్నెల(అతిధి శంకర్) లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సాగదీసినట్లుగా ఉంటుంది. గరుడన్ చూసిన వారికి ట్విస్టులు కూడా తెలుస్తాయి కనుక.. అవి కూడా ఆకట్టుకోలేవు. ఇక గరుడన్ చూడని ప్రేక్షకులకు మాత్రం కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్..ముగ్గురూ టాలెంటెడ్ నటులే. మంచి పాత్రలు పడాలేకానీ రెచ్చిపోయి నటిస్తారు. భైరవంలోనూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఈ సినిమా ప్లస్ అవుతుందని చెప్పాలి. శీను పాత్రలో ఆయన జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే పూనకాల సీన్లో అదరగొట్టేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న గజపతి వర్మగా మనోజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో బాగా నటించాడు. ఇక నారా రోహిత్ తన పాత్రకి న్యాయం చేశాడు. హీరోయిన్లు అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. వెన్నెల కిశోర్ , జయసుధతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
శ్రీరామ్ 'నిశ్శబ్ద ప్రేమ' మూవీ రివ్యూ
టైటిల్ : నిశ్శబ్ద ప్రేమనటీనటులు: శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్, హరీశ్ పెరడి, వియాన్, నిహారిక పాత్రో తదితరులునిర్మాణ సంస్థ: సెలెబ్రైట్ ప్రొడక్షన్స్నిర్మాత: కార్తికేయన్. ఎస్‌ఎడిటింగ్: మదన్.జిదర్శకత్వం, కథ: రాజ్ దేవ్సంగీతం: జుబిన్సినిమాటోగ్రఫీ: యువరాజ్.ఎంవిడుదల: మే 23, 2025హీరో శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించారు. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన శ్రీరామ్ హీరోగానే కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. తాజాగా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో 'నిశ్శబ్ద ప్రేమ' అంటూ తన కొత్త సినిమాను విడుదల చేశారు. ఇందులో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్గా నటిస్తోంది. కార్తికేయన్ ఎస్ నిర్మించిన ఈ మూవీకి రాజ్ దేవ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మే 23న విడుదలైంది. కెరీర్లో ఇప్పటివరకు చేయనటువంటి ఓ విభిన్నమైన క్యారెక్టర్లో శ్రీరామ్ కనిపించాడు. భార్య మరణానికి కారణమైన వారిపై ఓ యువకుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు..? అనే అంశాన్ని చాలా థ్రిల్లింగ్‌గా దర్శకుడు చూపారు.కథేంటంటే..సంధ్య (ప్రియాంక తిమ్మేష్)ను వాళ్లింట్లోనే గుర్తుతెలియని వ్యక్తి చంపే ప్రయత్నం చేస్తాడు. దీంతో భయంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. రోడ్డు వెంట పరుగెడుతుండగా యాక్సిండెంట్ కావడంతో తలకు తీవ్రమైన గాయం అవుతుంది. దీంతో ఆమె తన గతాన్ని మరిచిపోతుంది.తనని హాస్పిటల్లో చేర్చిన రఘు ఎవరో కాదు తన భర్తే అనేలా పరిచయం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి యోగ క్షేమాలు చూస్తుంటాడు. ఆ సమయంలో కనిపించిన పాత డైరీని చూసిన సంధ్య.. అతను రఘు కాదని, విఘ్నేష్ (శ్రీరామ్) అని తెలుసుకుంటుంది. ఈలోపు తన భార్య సంధ్య కనిపించడం లేదంటూ రఘు (వియాన్) పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. విచారణ మొదలెట్టిన కమీషనర్ అడ్వర్డ్ (హరీశ్ పెరడి)కు యునానిమస్ కిల్లర్ దగ్గర సంధ్య ఉందని తెలుస్తోంది. అసలు సంధ్యను విఘ్నేష్ ఎందుకు తన ఇంటికి తీసుకెళ్లాడు? సంధ్య ఎలా అతని నుంచి తప్పించుకుంది? అసలు విఘ్నేష్ ఎవరు? రఘు ఎవరు? వీరిద్దరికి, సంధ్యకి ఉన్న సంబంధం ఏమిటి? మధ్యలో రఘు పర్సనల్ సెక్రటరీ అయిన షీలా (నిహారిక పాత్రో) పాత్రేమిటి? అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘నిశ్శబ్ద ప్రేమ’ మూవీ.ఎలా ఉందంటే..సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం కోసం టైమ్ తీసుకోకుండా దర్శకుడు చాలామంచి పనిచేశాడు. ప్రేక్షకులను డైరెక్ట్‌గా కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సగం సినిమా అయ్యే సమయానికి, అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు..? అనేది ఓ క్లారిటీ వస్తుంది కానీ, అతను ఎలా బయటకు వస్తాడు..? అతన్ని ఎవరు కనిపెడతారు..? అనేది ఉత్కంఠగా సాగుతుంది. చివరకు ఇచ్చిన ముగింపు కూడా కన్వెన్సింగ్గానే ఉంది. శ్రీరామ్ డైలాగ్స్‌తో టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వడంలో కూడా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా, ట్విస్ట్‌లతో పాటు వాటికి వివరణ ఇచ్చిన విధానం ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూశామనే ఫీల్‌ని ఇస్తుంది.ఎవరెలా చేశారంటే..యునానిమస్ కిల్లర్ విఘ్నేష్ పాత్రలో శ్రీరామ్ నటన ఈ సినిమాకు హైలెట్. సీరియస్ ఫేస్‌తో కనిపించడమే కాకుండా, క్రూరంగా హత్యలు చేసే పాత్రని ఆయన ఇందులో పోషించారు. ఇందులో మరో కోణం ఆయన పాత్రకి ఉంది. ఇలాంటి పాత్రలు ఆయనకి కొత్తేం కాదు. తన పాత్రలోని వైవిధ్యం, ఆ వైవిధ్యానికి తగినట్లుగా శ్రీరామ్ అమరిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. సంధ్యగా నటించిన ప్రియాంక తిమ్మేష్ పాత్రపైనే ఈ సినిమా అంతా నడుస్తుంది. గృహిణిగా చక్కని అభినయం ఆమె ప్రదర్శించింది. మరో కీలక పాత్రలో షీలాగా నటించిన నిహారిక పాత్ర కనిపించేది కాసేపే అయినా కుర్రకారుకు హీటెక్కిస్తుంది. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. రఘు పాత్రలో నటించిన వియాన్, కండలు తిరిగిన శరీరంతో కనిపించారు. అమాయకుడిగానూ, అలాగే కథలో కీలకమైన పాత్రలోనూ వియాన్ మెప్పించారు.సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన జుబిన్.. ఓ స్టార్ హీరో సినిమా చూస్తున్న ఫీల్‌ని తెప్పించారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చక్కగా ఉంది. ఎడిటింగ్ పరంగా కూడా ఎటువంటి వంకలు లేవు. మధ్యలో ఒకటి రెండు సీన్లు కాస్త స్లో అనిపించినా, కథలోని థ్రిల్లింగ్ అంశాలు దానిని డామినేట్ చేస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్ట్రైయిట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీల్‌ని దర్శకుడు కలిగించారు. -
విజయ్ సేతుపతి 'ఏస్' సినిమా రివ్యూ
విజయ్ సేతుపతి నటించిన కొత్త సినిమా 'ఏస్' (Ace) థియేటర్స్‌లోకి వచ్చేసింది. రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రాన్ని ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, కీలక పాత్రలలో నటించారు. మే 23న బి. శివ ప్రసాద్ భారీ ఎత్తున తెలుగులో రిలీజ్ చేశారు. రీసెంట్గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు ఏస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలుసుకుందాం.కథబోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్ కన్నన్.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్ ప్రేమలో పడతాడు.అయితే, కల్పన తన హోటల్ కోసం తీసుకున్న లోన్ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందలు పడుతూ ఉంటారు. దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు.ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్ పెళ్లి చేసుకుంటాడా..? తనపై నమోదైన నేరాల నుంచి ఎలా బయటపడుతాడు..? అసలు బోల్ట్ కన్నన్ గతం ఏమిటి? చివరికి అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?దర్శకుడు అరుముగకుమార్ కథ చెప్పడంలో ఒక ప్రత్యేకమైన శైలి తీసుకున్నాడు. సినిమాలోని పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోతారు. ప్రేక్షకుల ఊహకు అందేలానే కథనం సాగుతూ ఉన్నా కూడా ఎక్కడా అయితే బోర్ కొట్టదు. విజయ్ సేతుపతి డార్క్ కామెడీ, యోగిబాబు టైమింగ్, రుక్మిణి వసంత్ అందాలు ఆ లోపాల్ని కప్పి పుచ్చేస్తుంటాయి. అలా సినిమాను ఎంగేజింగ్‌గా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ముఖ్యంగా నెమ్మదిగా సాగే మొదటి అర్ధభాగం కాస్త నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత కథ స్పీడ్ అందుకుంటుంది. ప్రథమార్దం అంతా కథలోని పాత్రలను పరిచయం చేసేందుకే సరిపోతుంది. అసలు కథ మొదలు అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే హీరో తన వారి కోసం విలన్ డెన్‌కు ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి జోరు అందుకుంటుంది. బ్యాంక్‌లో దొంగిలించిన సొమ్ముతో హీరో ఎలా బయటపడతాడు..? ఆ నేరాల్లోంచి ఎలా తప్పించుకుంటాడు..? అనే పాయింట్లతో సెకండాఫ్ మరింత గ్రిప్పింగ్ తీసుకెళ్తాడు. క్లైమాక్స్‌లో హీరో చేత డైరెక్టర్ ఆడించే ఆట, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారంటే..?ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. బోల్ట్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. కేవలం ఆయన మాత్రమే చేయగలడు అనేలా పాత్ర ఉంటుంది. మొదటి సారి డార్క్ కామెడీని ఆయన పండించాడు. ఇక యోగి బాబు అయితే ఫుల్ లెన్త్గా నవ్విస్తాడు. రుక్మిణి వసంత్ ఇందులో తన గ్లామర్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. దివ్యా పిళ్లైకి ఓ మంచి పాత్ర దక్కింది. అవినాష్ విలనిజం మెప్పిస్తుంది. సాంకేతిక పరంగా కూడా సినిమా బాగుంటుంది. కెమెరామెన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. పాటలకు పెద్దగా కనెక్ట్ కాకున్నప్పటికీ మ్యూజిక్ బాగుంది. శామ్ సీఎస్ ఆర్ఆర్ మెప్పిస్తుంది. కాస్త ఎడిటింగ్‌లో మార్పులు చేసింటే ఇంకా బాగుండేది. విజయ్ సేతుపతి కోసం సినిమా చూడొచ్చు. ఎక్కడా కూడా ఎవరినీ నిరుత్సాహపరచడు. -
‘కేసరి: చాఫ్టర్ 2(తెలుగు వెర్షన్)’ మూవీ రివ్యూ
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా దేశభక్తి చిత్రం ‘కేసరి: చాప్టర్ 2’. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నేడు(మే 23) ఇది తెలుగులో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ షో వేశారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు. డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే?శతాబ్దం క్రితం భారత్‌లో చోటుచేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయులపై నాటి బ్రిటిష్ పాలకులు జరిపిన మారణకాండ గురించి పుస్తకాలల్లో చదివాం. భారతీయ న్యాయవాది శంకరన్ చేసిన న్యాయ పోరాటం గురించి కూడా విన్నాం. ఈ రెండిటికి దృశ్యరూపం ఇస్తే.. అది ‘కేసరి: ఛాప్టర్ 2’ చిత్రం అవుతుంది. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే..శంకరన్ చేసిన న్యాయ పోరుని హైలెట్ చేశారు. నిజంగా అప్పట్లో బ్రిటీష్ ఉన్నతాధికారిపై కేసు వేయడం అనేది ఆషామాషీ వ్యవహరం కాదు. కానీ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న శంకరన్ ఆ సాహసం చేశాడు. దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో దర్శకుడు కరణ్ సింగ్ మరోసారి తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామాని అత్యంత సహజంగా తీర్చిదిద్దాడు. కోర్ట్ సన్నివేశాలే ఈ సినిమాకు కీలకం. శంకరన్, మెక్కిన్లే మధ్య జరిగే వాదనలు ఉత్కంఠను రేకిస్తూనే.. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. జలియన్‌వాలాబాగ్ ఘటన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత శంకరన్ నేపథ్యం, కమీషన్ ఏర్పాటు వరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. శంకరన్ డయ్యర్‌కు వ్యతిరేకంగా వాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. తొలి ట్రయల్‌లో శంకరన్ వాదనలు ఆకట్టుకుంటాయి. శంకరన్‌కి పోటీగా డయ్యర్ తరపున మెక్కిన్లే రంగంలోకి దిగడంతో కథనం మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ మొత్తం కోర్ట్‌లో జరిగే వాదనల చుట్టూనే కథనం సాగుతుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. మొత్తంగా మనల్ని రెండున్నర గంటల పాటు ఆ కాలం నాటి పరిస్థితులను తీసుకెళ్లి.. బ్రిటీష్ పాలకులు చేసిన అరచకాలను చూపిస్తూనే స్వాతంత్రం కోసం మనవాళ్లు చేసిన పోరాటాలను గుర్తు చేసే చిత్రమిది. డోంట్ మిస్ ఇట్. ఎవరెలా చేశారంటే.. సర్ శంకరన్ నాయర్‌గా అక్షయ్ కుమార్ ఒదిగిపోయాడు. నిజమైన న్యాయవాదిలా ఆయన వాదనలు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆయన చేప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న మెక్ కిన్లేగా ఆర్ మాధవన్ ఒదిగిపోయాడు. యువ న్యాయవాది దిల్రీత్ గిల్‌గా అనన్య పాండే తనదైన నటనతో ఆకట్టుకుంది. శంకరన్ భార్యగా రేజీనా ఉన్నంతలో చక్కగానే నటించింది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సాష్వత్ సచ్దేవ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు భావోద్వేగాన్ని రగిలించేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితీరు అద్భుతం. 1919 నాటి పరిస్థితుల్ని.. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ )
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలానే తాజాగా సోనీ లివ్ లోకి వచ్చిన డార్క్ కామెడీ మూవీ 'మరణమాస్'. మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శవంతో కామెడీ చేయడం క్రేజీ అనే చెప్పొచ్చు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? దీని సంగతేంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) కథేంటి?ముసలివాళ్లని మాత్రమే టార్గెట్ చేసే సీరియల్ కిల్లర్.. వారిని చంపేసి, నోటిలో అరటిపండు పెట్టి వెళ్లిపోతుంటాడు. అదే ఊరిలో ఉంటున్న ల్యూక్ (బాసిల్ జోసెఫ్).. బనానా కిల్లర్ అనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. జెస్సీ(అనీష్మా) అనే అమ్మాయిని ల్యూక్ ప్రేమిస్తుంటాడు. ఓ రోజు జెస్సీ బస్సులో ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ఓ ముసలివాడు ఈమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. కోపమొచ్చి అతడి ముఖంపై పెప్పర్ స్ప్రే కొడుతుంది. దీంతో చనిపోతాడు. అదే టైంకి ల్యూక్.. జెస్సీ కోసం బస్సు ఎక్కుతాడు. వీళ్లతో పాటే సదరు సీరియల్ కిల్లర్ కూడా బస్సులోనే ఉంటాడు. మరి సీరియల్ కిల్లర్ గురించి జెస్సీ, ల్యూక్ కి తెలిసిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?మన దగ్గర కొందరు దర్శకులు.. తీసిన కథలతోనే సినిమాలు తీసి తీసి ప్రేక్షకులకు చిరాకొచ్చేలా చేస్తుంటారు. ఏమంటే స్టోరీల్లేవు అని అంటుంటారు. అదే మలయాళంలో మాత్రం చాలా చిన్న పాయింట్ తీసుకుని వాటితో ఏకంగా మూవీస్ తీసేస్తుంటారు. అలా తీసిన చిత్రమే ఇది.మసలివాళ్లని మాత్రమే చంపి, వాళ్ల నోటిలో అరటిపండు పెట్టే సీరియల్ కిల్లర్. సినిమా మొదట్లోనే ఇతడెవరో చూపించేస్తారు. మరోవైపు హీరోహీరోయిన్ ప్రేమకథ, ఇంకోవైపు బస్సు డ్రైవర్, కండక్టర్ స్టోరీలు. దీనికి తోడు ఓ శవం. అసలు ఓ మనిషి చనిపోయాడని బయటకు తెలియకుండా ఉండేందుకు ఈ ఐదుగురు ఎలాంటి పాట్లు పడ్డారు. ఎలా నవ్వించారనేదే స్టోరీ.ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేని పాత్రల్ని తీసుకొచ్చి ఓ వృద్ధుడి మరణంతో లింక్ చేయడం థ్రిల్లింగ్ గా ఉంటుంది. మరీ పగలబడి నవ్వేంత సీన్లు అయితే ఉండవు కానీ టైమ్ పాస్ అయిపోతుంది. చూస్తున్నంతసేపు సినిమా అలా నడిచేస్తూ ఉంటుంది. బనానా కిల్లర్ ఎందుకు ముసలి వాళ్లని మాత్రమే చంపుతున్నాడనే విషయాన్ని చివర్లో రివీల్ చేస్తారు గానీ అదేమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు.శవంతో కామెడీ చేయడం ఏంటా అనిపిస్తుంది గానీ సినిమా చూస్తున్నప్పుడు అదేమంత ఇబ్బందిగా అనిపించదు. చివరలో ఓ ట్విస్ట్‌తో నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. కథను కామెడీగా చెప్పినప్పటికీ.. అంతర్లీనంగా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమ్మాయిల ఆత్మరక్షణ లాంటి అంశాలు కూడా ఆలోచించేలా చేస్తాయి. ఎవరెలా చేశారు?డబ్బింగ్ చిత్రాలతో మనకు బాగా పరిచయమైన బాసిల్ జోసెఫ్.. ఎప్పటిలానే మరో డిఫరెంట్ పాత్రలో ఆకట్టుకున్నాడు. జట్టుకి కలర్ తో భలే వెరైటీగా కనిపిస్తాడు. హీరోయిన్ గా చేసిన అనీష్మా, సీరియల్ కిల్లర్ గా చేసిన శ్రీకుమార్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ గానూ సినిమా బాగుంది. పాటలేం లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సింపుల్ పాయింట్ ని వీలైనంత ఫన్నీగా తీయడానికి దర్శకుడు కష్టపడ్డాడు. ఈ ప్రయత్నంలో కొంతమేర సక్సెస్ అయ్యాడు. ఈ వీకెండ్ ఏదైనా కాస్త ఫన్, కాస్త థ్రిల్ ఉండే మూవీ చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సోనీ లివ్ లో ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులో ఉంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్) -
‘లెవన్’ మూవీ రివ్యూ
నవీన్ చంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెవన్’. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. AR ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్,రేయా హరి నిర్మించిన ఈ చిత్రం నేడు(మే 16) తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘లెవన్’ కథేంటంటే.. అరవింద్(నవీన్ చంద్ర) ) ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. ఏసీపీ హోదాలో వైజాగ్‌కి ట్రాన్స్ఫర్ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్ కుమార్ (శశాంక్) డీల్ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్‌లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. విలన్ క్రైమ్ చేయడం... పోలీసు అయిన హీరో ఆ కిల్లర్‌ని పట్టుకోవడం..అతనికో ప్లాష్ బ్యాక్ స్టోరీ..ఇలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల ఫార్మాట్ దాదాపు ఒకేలా ఉంటుంది. దీంట్లో క్రైమ్ జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో ఎంత తెలివిగా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిసడలని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘లెవన్’ ఈ విషయంలో ఇది కొంతవరకు సఫలం అయింది. విలన్ ప్లాట్ రొటీన్‌గా ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులను ముందుగా డీకోడ్ చేయడం కొంతవరకు కష్టమే. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను రెగ్యులర్‌గా చూసేవాళ్లు విలన్ ఎవరనేది కనిపెట్టినా.. వాళ్ల మైండ్‌తో కూడా గేమ్ ఆడేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. సినిమా ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. సీరియల్ కిల్లింగ్ కేసు హీరో చేతికి వచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రీఇంటర్వెల్ నుంచి కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మధ్యలో వచ్చే ప్లాష్‌బ్యాక్ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఇక చివరిలో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. ఈ కథకి లెవన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేదానితో పాటు ప్రతి సీన్‌కి లాజిక్ ఉంటుంది. మొత్తంగా ‘లెవన్’ సినిమా రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కథే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. నవీన్ చంద్రకు పోలీసు పాత్రలు చేయడం కొత్త కాదు. ఈ మధ్య ఆయన ఎక్కువ ఇలాంటి పాత్రలే చేశాడు. ఇందులో ఏసీపీ అరవింద్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన బాడీలాంగ్వేజ్, లుక్ నిజమైన పోలీసుల అధికారిని గుర్తు చేసేలా ఉంటుంది. హీరోయిన్ రియా హరి పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఎస్సై మనోహర్‌గా దిలీపన్, పోలీసు ఉన్నతాధికారిగా ఆడుకాలం నరేన్, ఏసీపీ రంజిత్ కుమార్‌గా శశాంక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కిరీటీ, రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. డి ఇమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతా ఉన్నాయి. -
‘#సింగిల్’ మూవీ రివ్యూ
శ్రీవిష్ణు.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది ఓం భీమ్ బుష్, శ్వాగ్ చిత్రాలతో రెండు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు.. ఇప్పుడు ‘#సింగిల్’ అంటూ ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘సింగిల్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 9) ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(#Single Movie Review).కథేంటంటే..?ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. విజయ్ ఓ బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్‌గానే ఉంటాడు. తన జీవితంలోకి కూడా ఒక అమ్మాయి రావాలని ప్రతి రోజు ఆ దేవుడిని కోరుకుంటాడు. ఓ సారి మెట్రో ట్రైన్లో పూర్వ(కేతికా శర్మ)ను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి స్నేహితుడు అరవింద్(వెన్నెల కిశోర్)తో కలిసి రకరకాల ప్లాన్ వేస్తాడు. ఇదే సమయంలో విజయ్ లైఫ్‌లోకి హరిణి(ఇవానా) వస్తుంది. పూర్వని ప్రేమలో పడేయడానికి విజయ్ ఏంఏం పనులో చేస్తాడో.. హరిణి కూడా కూడా అలానే చేస్తుంది. అసలు హరిణి ఎవరు? విజయ్ ఛీ కొట్టినా అతని వెనకాలే ఎందుకు తిరిగింది? చివరకు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదా హరిణి ప్రేమలో విజయ్ పడిపోయాడా? లేదంటే మళ్లీ విజయ్ సింగిల్‌గానే మిలిగిపోయాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే(#Single Movie Review ).ఎలా ఉందంటే.. హీరో ఒక హీరోయిన్ని ప్రేమించడం, మరో హీరోయిన్ అతన్ని ప్రేమించడం.. చివరకు ఈ విషయం ముగ్గురికి తెలిసి.. ఒకరు త్యాగం చేసి మరొకరు హీరోని పెళ్లి చేసుకోవడం.. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు అన్ని ఇలానే ఉంటాయి. దర్శకుడు కార్తీక్ రాజు రాసుకున్న స్టోరీ కూడా ఇలానే ఉంటుంది కానీ క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన ట్వీస్ట్ కొత్తగా ఉంటుంది. ‘క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటే నా కల్ట్ ప్యాన్స్ ఒప్పుకోరు’ అంటూ హీరోతోనే ఓ డైలాగ్ చెప్పించడమే కాకుండా..దానికి తగ్గట్లుగానే ముగింపు డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. కథ పరంగా చూస్తే ఇదొక్కటే కొత్త పాయింట్. మిగతాదంతా రొటీన్, రెగ్యులర్ స్టోరీ. కానీ దర్శకుడు దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ , రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాను కాపాడాయి. తెలిసిన కథే అయినా తెరపై శ్రీవిష్ణు వేసే పంచ్ డైలాగులకు, వెన్నెల కిశోర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందిస్తాయి. ఎలాంటి సాగదీతలు లేకుండా సినిమా ప్రారంభంలోనే ట్రైయాంగిల్ ప్రేమకథను మొదలు పెట్టాడు దర్శకుడు. పూర్వని పడేసేందుకు విజయ్ చేసే పనులన్నీ రొటీన్‌గానే ఉన్నా.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వెజ్, వన్‌లైన్ పంచ్‌లు బాగా పెలడంతో బోర్ కొట్టదు. కథ ఏమిలేకున్నా ఫస్టాఫ్ కథనం ఫాస్ట్‌గానే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. అయితే మూర్తి(రాజేంద్ర ప్రసాద్) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కొంతమేర ఎమోషనల్‌గా సాగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు దర్శకుడు. ఓ యంగ్ హీరో తో పాటు ఇద్దరు హీరోయిన్లు గెస్ట్ అప్పీయరెన్స్ ముగింపు మరింత కొత్తగా అనిపిస్తుంది. ముందుగా చెప్పినట్లు చెప్పుకోవడానికి పెద్ద కథ లేకపోయినా.. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటాం. ఎలాంటి అంచనాలు లేకుండా.. కొత్తదనం ఆశించకుండా సినిమాకు వెళితే మాత్రం కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. శ్రీవిష్ణు ఓ సినిమా ఒప్పుకున్నాడంటే..అందులో కొత్త పాయింట్ అయినా ఉండాలి లేదంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా అందించాలి. ఇది రెండో రకం సినిమా. దానికి తగ్గట్లుగానే శ్రివిష్ణు తనదైన బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదే సినిమాకు ప్లస్ అయింది. రొటీన్ సీన్లను కూడా తనదైన నటనతో హీలేరియస్‌గా మార్చేశాడు. ఇందులో బూతు డైలాగులు ఉన్నప్పటికీ.. అవి బూతులు అనే విషయం తెలియకుండా శ్రీవిష్ణు తనదైన డైలాగ్ డెలివరీతో మ్యానేజ్ చేశాడు. శ్రీవిష్ణుకి తోడుగా వెన్నెల కిశోర్ ఉండడం మరో ప్లస్ పాయింట్. కామెడీ విషయంలో వీరిద్దరు పోటీపడి నటించారు. కేతికా శర్మ, ఇవానా కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక రాజేంద్రప్రసాద్ తెరపై కనిపించేంది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన పాటలు గుర్తుంచుకునే విధంగా ఉండవు కానీ కథలో భాగంగా వస్తూ.. వినసొంపుగానే ఉంటాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్, ఆర్ట్స్ డిపార్ట్‌మెట్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉనాయి. -
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌లో సమంత పాల్గొనడం..వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పడంతో ‘శుభం’పై బజ్ క్రియేట్ అయింది. ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(మే 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్‌రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది. ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్‌కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సందేశం ఇవ్వాలంటే కథను సీరియస్‌గానే చెప్పాలా? లేదంటే ఇదిగో మేం ఈ మంచి మేసేజ్ ఇస్తున్నాం అని తెలిసేలా సన్నివేశాలను తీర్చిదిద్దాలా? అలా చేయకుండా, నవ్విస్తూ కూడా ఓ మంచి విషయం చెప్పొచ్చు అనేది ‘శుభం’ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. సీరియల్ పిచ్చి అనే కాన్సెప్ట్‌ని తీసుకొని.. అందులోనే పురుషాధిక్యత ఎత్తిచూపుతూ మహిళల అణచివేత, ఆత్మాభిమానం లాంటి సున్నితమైన అంశాలను జోడించి, కథను నడిపించిన తీరు చాలా బాగుంది. చిన్న చిన్న సన్నివేశాలతోనే మంచి సందేశం ఇచ్చాడు. ఓ హారర్-కామెడీ చిత్రంలో ఇలాంటి మంచి విషయం చెప్పడం ‘శుభ’ పరిణామం. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే కామెడీ-హారర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో హారర్ నేపథ్యం అంతగా ఆకట్టుకోలేదు. కామెడీ కొన్ని చోట్ల మాత్రమే నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ హారర్ కానీ, కామెడీ కానీ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఇంతకు మంచి కామెడీ-హారర్ కథలను మనం చూశాం. ఉన్నంతలో కొత్తదనం ఏదైన ఉందంటే.. సీరియల్‌కి ముడిపెడుతూ నిజ జీవిత వ్యక్తులను హారర్ యాంగిల్లో చూపించడమే. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. పెళ్లి చూపులు, పెళ్లి, ఫస్ట్‌నైట్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ ఇచ్చే ట్విస్ట్‌తో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి మాత్రం కథనం కాస్త గాడి తప్పుతుంది. సమస్యను పరిష్కరించుకునేందుకు శ్రీనుబృందం చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. ఇక లాజిక్ గురించి ప్రస్తావించకపోవడమే మంచింది. దర్శఖుడు తన ‘సినిమా బండి ’టీమ్‌ని ఈ కథకు వాడుకున్న విధానం బాగుంది. అయితే సీరియల్ సమస్యను క్లోజ్ చేసే సన్నివేశాలు కూడా సీరియల్‌గా సా..గడంతో కథ అక్కడడక్కడే తిరిగినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా కథను తీర్చిదిద్దారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం కొత్త నటీనటులతోనే తెరకెక్కించారు. అయినా కూడా ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేబుల్ ఆపరేటర్‌గా హర్షిత్ రెడ్డి, అతని స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ బాగా నటించారు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి తమదైన నటనతో కొన్ని చోట్ల భయపెడుతూనే నవ్వించారు. ముఖ్యంగా శ్రీవల్లీగా శ్రీయ కొంతం తనదైన నటనతో ఆకట్టుకుంది..సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని కథకు తగ్గట్లుగా ఉంది. సమంత నిర్మించిన తొలి చిత్రం కాబట్టి నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయని చెప్పలేం కానీ.. సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
భార్య, సవతి కలిసి భర్తని మాయం చేస్తే.. ఓటీటీ రివ్యూ
ఓటీటీలు అనగానే చాలామందికి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఈ తరహా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. తాజాగా అలానే ఓటీటీలోకి వచ్చిన చిత్రం 'జెంటిల్ ఉమన్'. ట్రెండింగ్ టాపిక్ బేస్ చేసుకుని ఈ మూవీ తీయడం విశేషం. ఇంతకీ దీని సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) కథేంటి?పల్లెటూరిలో పుట్టి పెరిగిన పూర్ణిమ అలియాస్ పూర్ణి (లిజోమోల్ జోస్) అరవింద్(హరికృష్ణన్)ని పెళ్లి చేసుకుని నగరానికి వస్తుంది. మూడు నెలలుగా ఉదయం లేవడం, పూజ చేయడం, భర్తకు వంట చేసి పెట్టడం, అతడి శారీరక అవసరాలని తీర్చడం. ఇదే ఈమె రొటీన్. అలాంటిది ఓ సందర్భంలో భర్తకు ఆని(లోస్లియా) అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుస్తోంది. దీంతో భర్తని నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంది. తర్వాత ఏమైంది? పోలీసులకు దొరికిందా లేదా? ఆని.. పూర్ణిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?పొద్దున్న లేస్తే చాలు.. ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్య, ప్రియురాలి కోసం భార్యని అడ్డు తొలిగించిన భర్త.. ఇలాంటి వార్తలే చూస్తున్నాం. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'జెంటిల్ ఉమన్'. సినిమా మొదలవడమే చాలా కూల్ గా మొదలవుతుంది. పూర్ణిమ అనే గృహిణి. ఆమెకు రోజూ ఒకేలాంటి దినచర్య. మరోవైపు రోజూ దేవుడికి పూజ చేస్తూ ఫిలాసఫీ పుస్తకాలు చదివే భర్త. కట్ చేస్తే సరిగ్గా సినిమా అరగంట గడిచేసరికి మొదటి ట్విస్ట్. భర్త అక్రమ సంబంధం గురించి తెలిసి అప్పటివరకు శాంతంగా కనిపించిన పూర్ణిమ ఒక్కసారి వయలెంట్ అవుతుంది. భర్తని నరికి చంపి ఫ్రిజ్ లో పెడుతుంది.మరోవైపు సదరు భర్త.. మరో మహిళతో ఎఫైర్ నడిపిస్తుంటాడు కదా. తన ప్రియుడు కనిపించట్లేదని ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. అక్కడ నుంచి పోలీసుల దర్యాప్తు. పూర్ణిమని పిలిచి విచారించడం. చివరకు ఏమైందనేదే స్టోరీ.చాలా సాదాసీదాగా మొదలయ్యే సినిమా ఆద్యంతం నిదానంగానే వెళ్తుంది. కాకపోతే ప్రస్తుతం సమాజంలో పోకడల్ని కొంతవరకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకప్పటిలా భర్తలు అక్రమ సంబంధాలు అంటూ నడిపితే అరిచి గీ పెట్టడాలు, గొడవ పడటం లాంటివి కాకుండా భార్యలు ఎంతకు తెగిస్తున్నారు అనే చెప్పే స్టోరీ ఇది.సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉంటే ఈ సినిమా చూడొచ్చు. మరీ అంచనాలు పెట్టుకుంటే నిరాశపరచొచ్చు. రెండు గంటల్లోపే నిడివి కాబట్టి ఇలా మొదలుపెడితే అలా ముగించేయొచ్చు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరెలా చేశారు?'జై భీమ్' సినిమాలో చినతల్లిగా అలరించిన లిజోమోల్.. ఇందులో పూర్ణిమగా అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ఈమె భర్తగా చేసిన హరికృష్ణన్ ది చిన్న రోల్. ఉన్నంతలో ఓకే. ప్రియురాలిగా చేసిన లోస్లియా కూడా పాత్రకు తగ్గట్లు చేసింది. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే ఇందులో పాటలేం లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీ మూడ్ కి తగ్గట్లు ఉంది. కెమెరా వర్క్ బాగుంది. దర్శకత్వం మాత్రం మీద కంప్లైంట్ ఉంది. చిన్న పాయింట్ నే చాలా సేపు సాగదీసినట్లు అనిపించింది. ఓవరాల్ గా చెప్పుకొంటే మాత్రం ఓసారి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
'రెట్రో' మూవీ రివ్యూ.. సూర్య హిట్ కొట్టాడా..?
టైటిల్ : రెట్రో’పైనేనటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జోజూ జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాశ్‌రాజ్ తదితరులునిర్మాణ సంస్థలు: స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: జ్యోతిక, కార్తేకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ఎడిటింగ్: షఫీక్ మొహమ్మద్ అలీదర్శకత్వం, కథ: కార్తీక్ సుబ్బరాజ్సంగీతం: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణవిడుదల: మే1, 2025గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత ఏలాగైన తన అభిమానులను సంతోషపెట్టాలని ‘రెట్రో’పైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. దీంతో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి సూర్య తీసుకొచ్చాడు. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించగా.. జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 2 గంటలా 40 నిమిషాల రన్‌టైమ్ ఉంది. గతంలో దర్శకుడు సుబ్బరాజ్ తెరకెక్కించిన పేట, మహాన్, జిగర్తాండ, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాల నిడివి కూడా ఇంతే ఉండటం గమనార్హం. యాక్షన్‌తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్‌స్టర్ రెట్రోతో మెప్పించాడా అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.కథేంటంటే..గ్యాంగ్‌స్టర్ తిలకన్ (జోజు జార్జ్) కొడుకులా పెంచుకున్న పారివేల్ కన్నన్ (సూర్య)తో గ్యాంగ్‌స్టర్స్‌గా ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుని చలామణి సాగిస్తుంటారు. అయితే, ఒకరోజు వారు ఫారిన్ గ్యాంగ్‌తో కుదుర్చుకున్న ఢీల్ (గోల్డ్ ఫిష్) వల్ల సమస్యలు వస్తాయి. అప్పటి వరకు తిలకన్ చెప్పిన ప్రతి విషయాన్ని పూర్తి చేసిన పారివేల్.. గోల్డ్‌ఫిష్ ఢీల్‌ను వదులుకోవాలని పెంచిన తండ్రికి ఎదరుతిరుగుతాడు. ఇదే సమయంలో తన ప్రియురాలు రుక్మిణి (పూజా హెగ్డే)ని వివాహం చేసుకోవడానికి పారివేల్ రెడీ అవుతుంటాడు. తనతో పెళ్లి తర్వాత గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని వదులుకుని ఆమెతో సాధారణ జీవితాన్ని గడుపుతానని వాగ్దానం చేస్తాడు. అలాంటి సమయంలోనే గోల్డ్ ఫిష్ వివరాలు చెప్పాలని ఆ పెళ్లికి అడ్డుగా తిలకన్ నిలబడుతాడు. తన గ్యాంగ్‌తో ఆ వేడుకలో అల్లకల్లోలం సృష్టిస్తాడు. దీంతో పారివేల్ కన్నన్ మళ్లీ ఆయుధాలు పట్టాల్సి వస్తుంది. ఈ గొడవ కారణంగా ఐదేళ్లు జైలుకు వెళ్తాడు పారివేల్. గొడవలు అంటే నచ్చని రుక్మిణి అతని జీవితం నుంచి వెళ్లిపోతుంది. ఆమె ఆచూకి వివరాలు తెలుసుకోవాలని తన గ్యాంగ్‌ను కోరతాడు. చివరికి ఆమె అండమాన్లకు దూరంగా ఒక ఐల్యాండ్‌లో ఉన్నట్లు వివరాలు తెలుసుకుంటారు. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలని జైలు నుంచి తప్పించుకున్న పారివేల్ ఆమె ఉన్న చోటుకు వెళ్తాడు. దీంతో తనను పెంచిన తండ్రి తిలకన్ కూడా గోల్డ్‌ఫిష్ వివరాలు కోసం అదే ఐలాండ్‌కు చేరుకుంటారు. అయితే, అప్పటికే అక్కడ ఒక పెద్ద గ్యాంగ్‌తో రాజ్‌వేల్ దొర (నాజర్) అతని కుమారుడు మైఖేల్ ఉంటారు. అక్కడి ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకుని అనేక దారుణాలు చేస్తుంటారు. వారితో ఒక ఢీల్ సెట్ చేసుకుని తిలకన్ అక్కడికి చేరుకుంటాడు. తన ప్రియురాలు రుక్మిణి కోసం పారివేల్ ఆ ప్రాంతంలో అడుగుపెట్టగానే మళ్లీ గ్యాంగ్ వార్ మొదలౌతుంది. అక్కడి నుంచి గోల్డ్‌ఫిష్ వేట కొనసాగుతుంది. ఇంతకీ గోల్డ్‌ఫిష్ సీక్రెట్ ఏంటి..? దాని కోసం పెంచిన కొడుకునే తండ్రి చంపాలని ఎందుకు అనుకుంటాడు..? అనాధగా ఉన్న పారివేల్‌కు ఆ ఐల్యాండ్‌తో ఉన్న గత సంబంధం ఏంటి..? అక్కడి గుడితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి..? పారివేల్ పుట్టక ముందే రాజ్‌వేల్ దొర (నాజర్)తో ఉన్న లింక్ ఏంటి..? ఫైనల్‌గా రుక్మిణిని పారివేల్ పెళ్లి చేసుకుంటాడా..? అనేది తెలియాలంటే రెట్రో చూడాల్సిందే.ఎలా ఉందంటే..?ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, సూర్య తొలిసారి కలిసి పనిచేయడమే అని చెప్పవచ్చు. అందుకే, రెట్రో సినిమా ప్రేక్షకులలో చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఊహించినట్లుగానే.. కార్తీక్ సుబ్బరాజ్, సూర్య బలాలను వెండితెరపై చూపించారు. యాక్షన్, రొమాన్స్ అంశాలను సమానంగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నం చేశాడు. చాలా సినిమాల్లో మాదిరే.. రెట్రో కథలో కూడా ప్రేమ కోసం అన్నీ వదులుకోవడానికి ప్రయత్నించే ఒక గ్యాంగ్‌స్టర్ గురించి చెప్పారు. ఇందులో అతను ఎలా విజయం సాధిస్తాడు అనేది కాస్త ప్రత్యేకంగా చూపారు. సినిమా మొదటి భాగంలో తిలకన్, పారివేల్, రుక్మిణిల చుట్టూ తిరుగుతుంది. భారీ యాక్షన్ సీన్స్‌లకు కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చి కథను చూపారు. అదంతా మనకు రొటిన్‌గానే అనిపించవచ్చు. సెకండ్ పార్ట్ అంతా ఒక ఐలాండ్‌లో జరుగుతుంది. అక్కడి నుంచి స్క్రీన్‌ప్లే గజిబిజిగా మారడం ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న గ్యాంగ్స్టర్స్ రాజ్‌వేల్ దొర (నాజర్) అతని కుమారుడు మైఖేల్‌తో పారివేల్ పోరాటం చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి పూర్తిగా భిన్నమైన ట్రాక్‌లోకి స్టోరీ వెళుతుంది. ఇక్కడే సినిమా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అక్కడ ఐలాండ్‌లో జరిగే రబ్బర్ కల్ట్ పోటీలు కొత్తగా ఉంటాయి. ఆ పోటీల పేరుతో అక్కడున్న గిరిజన జాతి జీవితాలతో ఆడుకుంటున్న ఆ ప్రాంత రాజును పారివేల్ ఎదుర్కొన్న తీరు ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచుతాయి. ఐలాండ్‌లోని జడ ముని గుడి నేపథ్యంతో పాటు దానితో పారికి ఉన్న సంబంధం తెలిపిన పాయింట్ కాస్త భావోద్వేగభరితంగా కథను మారుస్తాయి.కథలో గ్రిప్పింగ్ లేకున్నా.. భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సూర్య, పూజాల మధ్య సరైన లవ్ ట్రాక్ కనిపించదు. కానీ, వారిద్దరి మధ్య చాలా ఎమోషన్స్‌తో కూడిన ప్రేమ ఉన్నట్లుగా మనకు దర్శకుడు చూపే ప్రయత్నం చేశాడు. ఐల్యాండ్‌కు పారివేల్‌కు ఉన్న రిలేషన్ ఏంటి అనేది వివరంగా చెప్పడంలో విఫలం అయ్యాడనిపిస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే రెట్రో సినిమాకు కాస్త మైనస్ అని చెప్పవచ్చు. కానీ, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సూర్య, పూజా హెగ్డేలను చాలా కొత్తగా దర్శకుడు చూపించారు.ఎవరెలా చేశారంటే..సూర్య తన అన్ని చిత్రాల మాదిరిగానే ఈ మూవీలో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. యాక్షన్ అయినా, కామెడీ అయినా సూర్య చాలా అద్భుతంగా నటించాడు. పూజ హెగ్డేతో అతను కనిపించే సన్నివేశాలు పెద్దగా క్లిక్ కాకపోయిన కెమెరామెన్ పనితనంతో కాస్త గట్టెక్కించాడని చెప్పవచ్చు. రెట్రో డ్రెస్‌లో పూజా చాలా చక్కగా సెట్ అయిపోయింది. ఆపై గ్లామర్‌కు ఎలాంటి స్కోప్‌లేకుండా కేవలం యాక్టింగ్‌కు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడంతో తన కెరీర్లో ఇదొక బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ తిలకన్ పాత్రలో మరోసారి తన ప్రతిభను ప్రదర్శించగా, మైఖేల్ పాత్రను పోషించిన నటుడు కూడా అద్భుతంగా నటించాడు. ప్రకాష్ రాజ్ అతిధి పాత్రలో కనిపిస్తాడు, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కూడా అతిధి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.సంతోష్ నారాయణ్ ఇచ్చిన సంగీతం రెట్రోకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేసే అద్భుతమైన BGMను ఆయన అందించాడు. కన్నిమ పాట ఇప్పటికే థియేటర్లలో పెద్ద సంచలనంగా మారింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చేసిన రెట్రో మంచి ప్రయత్నమే కానీ చాలా ట్రాక్‌లతో కూడిన గజిబిజి స్క్రీన్‌ప్లే వల్ల కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. సూర్య, పూజా హెగ్డే తమ అభిమానులను రెట్రోతో తప్పకుండా అలరిస్తారు. -
‘హిట్ 3’ మూవీ రివ్యూ
హాలీవుడ్, బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు చాలా తక్కువ. ఎఫ్ 2తోనే ఆ సినిమాలు పరిచయం అయ్యాయి. ఆ తర్వాత ‘హిట్’ కూడా ఫ్రాంచైజీగా వస్తోంది. నాని(Nani) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రాంచైజీ తొలి చిత్రం ‘హిట్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. రెండో కేసుతో అడివి శేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మూడో కేసుకి ఏకంగా నానినే రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హిట్ 3’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ (HIT 3: The Third Case Movie Review )లో చూద్దాం.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ హత్య జరగడం.. దానిని ఛేదించేందుకు హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్) రంగంలోకి దిగడం.. చిక్కుముడులన్నీ విప్పి చివరకు హంతకులను పట్టుకోవడం.. ‘హిట్’, హిట్ 2.. ఈ రెండు చిత్రాల నేపథ్యం ఇలాగే ఉంటుంది. అదే ప్రాంఛైజీలో వచ్చిన హిట్ 3 మాత్రం ఒక హత్య చుట్టు కాకుండా కొన్ని హత్యలు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఈ కేసును ఎలా పరిష్కరించాడన్నదే ఈ సినిమా కథ. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల కథలన్నీ దాదాపు ఇదే లైన్లో ఉంటాయి. తెరపై ఎంత ఆసక్తికరంగా, భయంకరంగా చూపించారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం దర్శకుడు శైలేష్ కొలనుకు బాగా తెలుసు. అందుకే హిట్ ఫ్రాంచైజీలలో క్రైమ్ సీన్లు అన్ని భయంకరంగా తీర్చిదిద్దాడు. హిట్ 3లో అయితే ఆ భయాన్ని మూడింతలు చేశాడు. సైకో గ్యాంగ్ చేసే అరాచకాలను తెరపై చూస్తున్నప్పుడు రక్తం మరిగిపోతుంది. అసలు వీళ్లు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది. వాళ్ల ప్రవర్తన, హత్యలు చేసే తీరు చూస్తే.. బయట అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు గుర్తుకొస్తాయి. చిత్రబృందం ముందు నుంచి చెబుతున్నట్లుగా ఇందులో యాక్షన్ సీన్లు లిమిట్ దాటి ఉన్నాయి. యానిమల్, మార్కో, కిల్ సినిమాల ప్రభావం దర్శకుడిపై బాగానే పడిందన్న విషయం ఆ యాక్షన్ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. (చదవండి: హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ)కథ ప్రారంభమే భయంకరమైన సీన్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీతో యాక్షన్ థ్రిల్లర్.. కాస్త లవ్ ఎంటర్టైనర్లోకి వెళ్తుంది. పెళ్లి కోసం మాట్రిమొనీలో అమ్మాయిలను చూడడం.. అర్జున్ వేసే ప్రశ్నలకు ఆ అమ్మాయిలు పారిపోవడం అంతా హిలేరియస్‌గా సాగుతుంది. సీటీకే డార్క్ వెబ్సైట్ గురించి తెలిసిన తర్వాత కథనం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుంది. ఫస్టాఫ్ అంతా సైకో గ్యాంగ్ చేసే హత్యలు.. ఇన్వెస్టిగేషన్తో ముందుకు వెళ్లిపోతుంది. జమ్ములో జరిగిన హత్య వెనుక సీటీకే గ్యాంగ్ ఉందన్న విషయాన్ని అర్జున్ కనుక్కునే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం సీటీకే గ్యాంగ్‌తో అర్జున్ సర్కార్ చేసే యుద్ధమే ఉంటుంది. ద్వితీయార్థంలో అక్కడక్కడా ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్ల ఎపిసోడ్‌ని చాలా ఎమోషనల్‌గా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది. అయితే ఈ తరహా పోరాట ఘట్టాలను చాలా హాలీవుడ్ చిత్రాల్లో చూసే ఉంటాం. అలాగే ఈ మధ్య వచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయి. సైకో గ్యాంగ్ అంతు చూసేందుకు హీరో కూడా సైకోగా మారడం ఇబ్బందికరంగా అనిపించినా.. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే.. ఇందులో హీరో చేసే పనికి ఓ బలమైన కారణం ఉండడంతో ఆ ప్లేస్‌లో ఏ వ్యక్తి ఉన్నా అలాంటి పనే చేస్తాడనే భావన ఆడియన్స్‌లో కలుగుతుంది. పైగా హీరో చేసే అరాచక పనులకు చాగంటి ప్రవచనాలను ముడిపెట్టి దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. చివరగా చెప్పేది ఏంటంటే.. చిన్న పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను చూపించొద్దు. క్రైం యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు హిట్ 3 తెగ నచ్చేస్తుంది. మిగతా వారికి మాత్రం ఇంత హింసాత్మక చిత్రాలు అవసరమా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. అర్జున్ సర్కార్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన పోలీసు ఆఫీసర్‌లాగే తెరపై కనిపించాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. శ్రీనిధి శెట్టి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ప్రతీక్ బబ్బర్ విలనిజం అంతగా పండించలేకపోయినా..ఉన్నంతలో బాగానే నటించాడు. అర్జున్ సర్కార్ టీమ్ సభ్యురాలు వర్షగా కోమలి ప్రసాద్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


