ఇంటి బంగారం ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందా? | India household gold stock should bring into financial, Check deets | Sakshi
Sakshi News home page

ఇంటి బంగారం ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందా?

May 23 2026 5:30 PM | Updated on May 23 2026 5:36 PM

India household gold stock  should bring into financial, Check deets

ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం ఒకటి. ప్రతీ సంవత్సరం మనం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసు కుంటున్నాం. క్రూడ్‌ ఆయిల్‌ తరువాత భారతదేశం బంగారం పైనే పెద్ద మొత్తంలో దిగుమతి వ్యయం భరిస్తున్నదంటే ఆర్థిక వ్యవస్థపై బంగారం ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా బంగారం దిగుమతులపై 55 నుంచి 72 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది జాతీయ జీడీపీలో 1.6%కి సమానం. 

డబ్లు్యజీసీ (వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌) నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం (దేవాలయా లలోని నిల్వలను కలుపుకొని) నిల్వ ఉంది. దీని విలువ సుమారు 2.4 ట్రిలియన్‌ డాలర్లు. దాయాది దేశమైన పాకిస్తాన్‌ జీడీపీ కంటే మన బంగారం నిల్వలు 6 రెట్లు అధికం. 

అయితే బంగారం దిగుమతి వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడు తున్న భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ (జీఎమ్‌ఎస్‌)ను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ పథకం ద్వారా, వ్యక్తులు బ్యాంకు లాకర్లలో, ఇండ్లలో నిరుపయోగంగా నిల్వ ఉన్న బంగారాన్ని వడ్డీ సంపాదించే ఆస్తిగా మార్చుకోవచ్చు. ఆభర ణాల రూపంలో ఉన్న బంగారాన్ని కరిగించి స్వచ్ఛతను పరీక్షించిన పిదప కడ్డీ రూపంలో బ్యాంక్‌లో నిర్ణీత కాలానికి డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ బంగారాన్ని గోల్డ్‌ మెటల్‌ లోన్స్‌ (జీఎమ్‌ ఎల్‌) ద్వారా నగల వ్యాపారులకు లీజుకు ఇచ్చి, వడ్డీ వసూలు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతాయి. కేంద్రబ్యాంకులు కూడా కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, ఆర్థిక నష్టాలను నిర్వహించడానికి బంగారు నిల్వలను నిర్ణీత పరిమాణంలో కలిగి ఉంటాయి. 2015లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా అంతగా విజయవంతం కాలేదనే చెప్పాలి. ఒక దశాబ్ద కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 39 టన్నుల బంగారాన్ని మాత్రమే వాడుక లోకి తేవడం జరిగింది.

వడ్డీ కంటే అభిరుచి మిన్న
బంగారు నగదీకరణ పథకం అంతగా విజయవంతం కాకపోవ డానికి కారణం, బంగారం 75% ఆభరణాల రూపంలో ఉండటం. స్త్రీలు తమ అభిరుచులకనుగుణంగా చేయించు కున్న నగల అసలు రూపాన్ని  బ్యాంకులు ఇచ్చే 2 నుంచి 3 శాతం వడ్డీ కోసం కోల్పోవ డానికి ఇష్టపడటం లేదు. శుభ కార్యాలలో స్టేటస్‌ చిహ్నంగా ఆభర ణాలను స్త్రీలు ధరించడం, కొన్ని కుటుంబాలలో ఆభరణాలు వారస త్వంగా రావడం లాంటి కారణాల వల్ల చాలా కుటుంబాలు ఆభర ణాలను తమ వద్ద భద్రపరుచుకోవడానికే మొగ్గు చూపుతున్నాయి. చాలా మధ్య తరగతి కుటుంబాలు వ్యక్తిగత అవసరాల కోసం ఆభర ణాలను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం కూడా ఈ పథకానికి ఒక పరిమితి. గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం గురించి అవగాహన లేకపోవడం, డిపాజిట్‌పై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు ఆకర్షించే విధంగా లేకపోవడం, భవిష్యత్తులో బంగారం ధరల గురించి అనిశ్చితి లాంటివి ఈ స్కీమ్‌ విజయానికి ప్రతిబంధకాలు.

దేశ ఆర్థిక స్థితిపై బంగారం దిగుమతుల భారం తగ్గించాలంటే బంగారంపై ఉన్న సెంటిమెంట్‌ను దేశ ఆర్థిక భద్రత వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. ప్రజలనుగోల్డ్‌ ఈటీ ఎఫ్, సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్స హించాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ బలపడ టానికి, దిగు మతులను తగ్గించి విదేశీ మారక ద్రవ్య నిలువలను పటిష్టం చేయ డానికి ప్రతి భారతీయుడు తనవంతుగా సహక రించాల్సి ఉంది.
– డా.ఎం. డి. ఖ్వాజా మొయినుద్దీన్‌ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు 

దేశ ఆర్థిక స్థితిపై బంగారం దిగుమతుల భారం తగ్గించాలంటే బంగారంపై ఉన్న సెంటిమెంట్‌ను దేశ ఆర్థిక భద్రత వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. 

Advertisement
 
Advertisement
Advertisement