లేఆఫ్స్ బాధితులకు కొత్త దారి చూపిన చాట్‌జీపీటీ! | Tech Layoff Fear Here Are Top Career Paths Recommended by ChatGPT | Sakshi
Sakshi News home page

లేఆఫ్స్ బాధితులకు కొత్త దారి చూపిన చాట్‌జీపీటీ!

May 23 2026 11:30 AM | Updated on May 23 2026 11:49 AM

Tech Layoff Fear Here Are Top Career Paths Recommended by ChatGPT

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా  ఐటీ రంగంలో తలెత్తిన లేఆఫ్స్ భయం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను పట్టి పీడిస్తోంది. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్న 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒకరు, తన భవిష్యత్తు కెరీర్ మార్గాల గురించి చాట్‌జీపీటీని సంప్రదించారు. ఆ ఏఐ ఇచ్చిన సమాధానం, కేవలం సలహాగానే కాకుండా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌లా ఉండి, ఆ ఉద్యోగిలో ఉన్న ఒత్తిడిని ఒక్కసారిగా తొలగించేసింది. మనిషి ఆలోచనా శక్తి, డొమైన్ నైపుణ్యం, కమ్యూనికేషన్ మొదలైనవే కీలకం అని ఏఐ స్పష్టంగా చెప్పింది.

హై-డిమాండ్ రంగాల వైపు అడుగులు
కేవలం కోడింగ్ మాత్రమే చేసే రోల్స్ కాకుండా, భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే ఏఐ/ ఎంఎల్‌ ఇంజనీర్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్ అండ్‌ ప్లాట్‌ఫారమ్ ఇంజనీరింగ్, డేటా ఇంజనీరింగ్ వంటి విభాగాల్లోకి మారడం ఉత్తమమని చాట్‌జీపీటీ సూచించింది. ముఖ్యంగా జనరేటివ్‌ ఏఐ, ఎల్‌ఎల్‌ఎం ఇంటిగ్రేషన్ ,  క్లౌడ్ సెక్యూరిటీపై దృష్టి పెట్టడం ద్వారా ఉద్యోగ భద్రతను పెంచుకోవచ్చు. పాత పద్ధతిలో పనిచేసే కోడింగ్ కంటే, ఏఐని ఉపయోగించుకుంటూ పనితీరును పెంచుకునే వారికి రాబోయే ఐదుపదేళ్లలో భారీ డిమాండ్ ఉంటుంది.

మేనేజిమెంట్‌,  ప్రభుత్వ రంగంలో అవకాశాలు
వ్యాపార వ్యూహాలను అర్థం చేసుకునే సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఇంజనీర్లకు 'ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్' ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్. ఏఐ కోడ్‌ని వేగంగా రాయగలదు కానీ, వ్యాపార నిర్ణయాలను తీసుకోలేదు కాబట్టి ఈ పాత్రలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అలాగే ఆర్‌బీఐ, సెబీ, ఐఎస్‌ఆర్‌డీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోని డిజిటల్ విభాగాల్లో కూడా క్లౌడ్, సెక్యూరిటీ నిపుణులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవి స్థిరమైన కెరీర్‌ను కోరుకునే వారికి గొప్ప వేదికలు.

12 నెలల సేఫ్టీ ప్లాన్: మీ వృత్తికి కొత్త బాట
వచ్చే 12 నెలల కాలంలో మీరు ఎంచుకున్న రంగంలో సర్టిఫికేషన్లు పొందడం, పోర్ట్‌ఫోలియో ప్రాజెక్టులు నిర్మించడం, నెట్‌వర్కింగ్‌ను పెంచుకోవడం ద్వారా లేఆఫ్స్ భయం నుండి బయటపడవచ్చు. ప్రాథమిక కోడింగ్ పనులకు దూరంగా ఉంటూ, సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చర్ వైపు దృష్టి సారించాలి. లేఆఫ్స్ అంటే కెరీర్ ముగింపు కాదు, అది కేవలం కంపెనీల వ్యూహాత్మక మార్పు మాత్రమేనని గుర్తించి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా రాణించవచ్చని చాట్‌జీపీటీ తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement