రూ. 30 వేలు అడిగితే.. రూ. 50వేలు ఆఫర్‌ చేసిన బాస్‌ | Man asks for Rs 35k month salary IITian founders offer him Rs 50k instead | Sakshi
Sakshi News home page

రూ. 30 వేలు అడిగితే.. రూ. 50వేలు ఆఫర్‌ చేసిన బాస్‌

May 23 2026 3:38 PM | Updated on May 23 2026 4:19 PM

Man asks for Rs 35k month salary IITian founders offer him Rs 50k instead

ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న తరుణంలో జాబ్‌ మార్కెట్‌లో ఒక పరిణామం విశేషంగా నిలుస్తోంది.  కరియర్‌ ఆరంభంలో  కొత్తగా ఉద్యోగాలు చేరే వారికి ఊహించిన వేతనం లభించడమే కనా కష్టం. అలాంటిది  అనూహ్య స్థాయిలో  ఆఫర్‌ వస్తే.. మీరు చదవబోయే స్టోరీ అలాంటిదే.

ఐఐటి (IIT) వ్యవస్థాపకులు పంచుకున్న ఆసక్తికరమైన స్టోరీ ఒకటి నెట్టింట  పెద్ద చర్చకు దారితీసింది. వారు తమ "IIT Ke 4 Launde" అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ సంఘటనను పోస్ట్ చేశారు. అభ్యర్థి అడిగిన దానికంటే తాము ఎందుకు ఎక్కువ జీతం ఇవ్వాలని నిర్ణయించుకున్నామో అందులో వివరించారు.

"అభ్యర్థి నెలకు రూ. 35 వేలు అడిగారు, కానీ మేము నెలకు రూ. 50 వేలు ఆఫర్ చేసాము. ఎందుకంటే ఆ ఉద్యోగానికి రూ. 50 వేల బడ్జెట్‌ను ఆమోదించాము."  అని తన వీడియోలో వెల్లడించారు.

ఆ అభ్యర్థి అప్పటికే నెలకు సుమారు రూ. 30,000 సంపాదిస్తున్నాడని, ఇంటర్వ్యూ సమయంలో రూ. 35,000 - రూ. 36,000 డిమాండ్ చేశాడని చెప్పారు. అయితే, ఆ ఉద్యోగానికి కంపెనీ అప్పటికే రూ. 50వేల జీతం ఇవ్వాలని  నిర్ణయించుకుంది. 

ఉద్యోగంలో చేరిన తర్వాత, తాను అడిగిన దానికంటే  ఎక్కువ జీతం ఎందుకిస్తున్నారని అడిగాడు, ఎందుకు ఇవ్వడకూడదు అని సమాధానమిచ్చాడు బాస్‌.  ఆ తరువాత అసలు విషయం చెప్పాడు.  తాము ముందే 50 వేలుసాలరీ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఆ పనికి, ఆ వేతనం సరియైనది అనుకున్నామని వివరించారు.

మరొక ఫౌండర్‌ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం దీర్ఘకాలిక నియామకాలు, ఉద్యోగులను నిలుపుకోవడానికే (retention) తీసుకున్నట్లు తెలిపారు. ఖర్చులను తగ్గించుకోవడం కంటే నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు  ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సానుకూలంగా స్పందించారు. ఇలాంటి నియామకాలు  చాలా అరుదుగా కనిపిస్తాయనన్నారు. ఒక నెటిజన్ "నా హెచ్ఆర్ (HR) ఇదంతా ఏఐ (AI) అని అంటోంది" అని సరదాగా కామెంట్ చేయగా, మరొకరు ‘‘డ్రీమ్స్‌ రిక్రూటర్లు (Dream recruiters)" అంటూ కొనియాడారు.

ఇలాంటి వాళ్లు  కేవలం 2 శాతం ఉంటారబ్బా, ఇలాంటి బాస్‌లు దొరకాలి, "పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం, చాలా కంపెనీలు దీనిని అర్థం చేసుకోవు అని మరికొందరు వ్యాఖ్యానించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement