చాలా కాస్ట్లీ గురూ.. 2 తర్బూజాలు కేవలం రూ. 30 లక్షలు | do you know Most expensive fruit in the world and price | Sakshi
Sakshi News home page

చాలా కాస్ట్లీ గురూ.. 2 తర్బూజాలు కేవలం రూ. 30 లక్షలు

May 23 2026 12:19 PM | Updated on May 23 2026 2:22 PM

do you know Most expensive fruit in the world and price

 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రూట్‌గా జపాన్‌ తర్పూజా రికార్డ్‌ కొట్టేసింది. దీంతో జపాన్‌ రైతు  ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపతున్నారు. మే 22న సపోరో సంతలో ఇతను పండించిన రెండు ‘యుబారి మెలన్‌లు’ (తర్బూజాలు) 30 లక్షలకు అమ్ముడు పోయాయి. అదీ అతని ఆనందం. 

అంత రేటా? ఎస్‌. రేటే. ఎందుకంటే ఈ యుబారి మెలన్‌లు హొక్కైడోలోని యుబారి అనే చిన్న పట్టణంలో మాత్రమే పండిస్తారు. అక్కడి నేల, వాతావరణం వేరు. అందుకే ఆ రుచి ఇంకెక్కడా రాదు. పండించేటప్పుడు ఒక్కో మొక్కకు ఒక్క పండు మాత్రమే ఉంచుతారు. మిగతావి తీసేస్తారు. ఆ ఒక్క పండుకే మొక్క శక్తి అంతా పోతుంది. రోజూ రైతులు పండుని పొత్తిళ్లలో పాపాయిలా చూసుకుంటారు. టోపీ కూడా పెడతారు ఎండ తగలకుండా. జపాన్‌లో వీటి మొదటి పంట వేలం చాలా ప్రెస్టీజ్‌. పెద్ద కంపెనీలు ‘మా పేరు పేపర్లో రావాలి‘ అని  పోటీపడి కొంటాయి పబ్లిసిటీ కోసం. ఆ పండ్లని తినరు, గిఫ్ట్‌గా ఇస్తారు లేదా డిస్ప్లే పెడతారు. 

ఇదీ చదవండి: BP టెన్షన్‌ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువు

రికార్డు: ఇంతకుముందు 2019లో 50 లక్షల యెన్లు రేటు పలికింది. ఇప్పుడు 2026లో 58 లక్షల ఎన్‌లతో కొత్త రికార్డ్‌. ప్రతి ఏడాది ధర పెరుగుతూనే ఉంది.

ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస‍్టల్స్‌, కాన్స్‌ క్వీన్‌ ఐశ్వర్య లుక్‌ స్పెషాల్టీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement