నందు-అవికా 'అగ్లీ స్టోరీ' సినిమా రివ్యూ | Ugly Story Movie Review And Rating In Telugu, Emotional Drama Highlights The Dark Side Of Forced Marriage | Sakshi
Sakshi News home page

Ugly Story Review: 'అగ్లీ స్టోరీ' రివ్యూ .. ఎలా ఉందంటే?

May 22 2026 9:18 PM | Updated on May 23 2026 9:44 AM

Ugly Story Movie Review And Rating

నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా చేసిన సినిమా 'అగ్లీ స్టోరీ'. ప్రణవ స్వరూప్ దర్శకుడు. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది. సైకో భర్త పాత్రలో నందు కనిపించగా, అమాయకమైన భార్య పాత్రలో అవికా గోర్ నటించింది. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

కథేంటి? 
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన నేహా(అవికా గోర్)ని ఆమె మావయ్య(శివాజీ రాజా)తన ఇంటికి తీసుకొస్తాడు. మామయ్య కొడుకు కార్తీక్ (నందు).. ఆమెపై మోజు పెంచుకుంటాడు. నేహా మాత్రం గౌతమ్ (రవితేజ మహాదాస్యం)ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ ఆవేశంతో సైకోలా మారిపోతాడు. తనకు ఇష్టం లేకపోయినా నేహా కార్తీక్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంది? పెళ్లి తర్వాత ఆమె జీవితం ఎలా మారింది? కార్తీక్ టార్చర్ ఎంత వరకు వెళ్లింది? చివరకు జరిగిన రక్తపాతం ఏంటనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే? 
టాక్సిక్ రిలేషన్‌షిప్స్, సైకో మెంటాలిటీ గురించి ఇందులో చూపించారు. భార్యాభర్తల మధ్య సమ్మతి ఎంత ముఖ్యమో చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఫస్టాప్‌లో హీరో సైకోయిజం గురించి ఎక్కువ సన్నివేశాలు ఉండటంతో స్టోరీ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. క్లైమాక్స్ ప్రేక్షకుడికి కొంత సంతృప్తిని ఇస్తుంది. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని బాధపడుతున్న అమ్మాయిలకు ఎలాంటి కష్టాలు పడుతున్నారనేది ఇందులో చూపించారు. ఈ తరహా మహిళలకు కొన్ని సన్నివేశాలు బాగా కనెక్ట్ అవుతాయి.

ఎవరెలా చేశారు?
సైకో భర్తగా నందు ఆకట్టుకున్నాడు. పాత్రలో పూర్తిగా లీనమైపోయాడు. అవికా గోర్ ఎమోషనల్ పాత్రలో నటన కనబరిచింది. శివాజీ రాజా తనకు అలవాటైన తండ్రి పాత్రలో కనిపించారు. రవితేజ మహాదాస్యం ప్రేమికుడి పాత్రలో పర్లేదనిపించారు. ప్రజ్ఞ నయన్ పోలీస్ పాత్రలో ఓకే. దర్శకుడు ప్రణవ స్వరూప్ కథను సీరియస్ టోన్‌లో చెప్పాడు. ముఖ్యంగా సమ్మతి అనే సున్నితమైన అంశాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం బాగుంది. మిగతా టెక్నికల్ అంశాలు కూడా తమవంతు న్యాయం చేశారు.

(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement